Sermons

[6-1] <యోహాను 3:1-6> అబద్ధ క్రైస్తవులు మరియు క్రైస్తవ్యములో నిలచి భిన్న మతావలంబననుసరించేవారు.<యోహాను 3:1-6>

"నత్తివారి పెదవుల చేతను అన్యభాషతోను ఈ జనులతో మాటలాడుచున్నాడు. అయినను వారు విననొల్లరైరి. కావున వారు వెళ్లి వెనుకకు మొగ్గి విరుగబడి చిక్కుబడి పట్టబడునట్లు ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రము వెంబడి సూత్రము సూత్రము వెంబడి సూత్రము, కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యము మీకు వచ్చును. కాబట్టి యెరూషలేములోనున్న ఈ జనులను ఏలు అపహాసకులారా, యెహోవా వాక్యము వినుడి.’’బైబిలులో ఉదహరించిన భిన్నమతావలంబనము


 • ‘‘భిన్నమతావలంబన’’ అన్న
 • పదమునకు బైబిలు వ్యాఖ్యానమేమి?
 • యేసుక్రీస్తునందు నమ్మికయుంచినను హృదయములో
 • పాపము కలిగి యుండుటను ‘‘భిన్నమతావలంబన’’
 • అని బైబిలు వ్యాఖ్యానిస్తుంది.


ఈ దినాలలో అభివృద్ధి పొందుతున్న దేశాలలో అనేక అబద్ధ వార్తాలేఖకులున్నారు. వారు వార్తా విలేఖరులాగా నటించి తమ చేతులలో చిక్కినవారి నుండి డబ్బు కాజేస్తారు. వారి చేతులలో చిక్కిన వారి బలహీనతనుబట్టి వారిని బెదిరించి డబ్బు గుంజుతారు. అబద్ధ నటన అనగా ఏదైనా ఒక సత్యము కాని విషయమును నిజమైనదని నమ్మించుట. ఇంకొక విధముగా చెప్పాలంటే ఒకరి బాహ్యప్రవర్తన లేక ఆకారము వారి అంతరంగమును గురించి తెలియపరచదు.

‘‘అబద్ధ’’ లేక ‘‘భిన్నాభిప్రాయము’’ అనే మాటను క్రైస్తవ సంఘాలలో ఎక్కువగా వాడుతుంటారు.

‘‘అబద్ధ’’ లేక ‘‘భిన్నాభిప్రాయము’’ అనే మాటకు కొద్ది అర్ధాలు మాత్రమే ఉన్నాయి. అటులనే బైబిలులోని సత్యమును గురించి ఖచ్చితంగా బోధించేవారు కూడా అతి కొద్దిమంది మాత్రమే ఉన్నారు. కనుక ఈ పరిస్థితులలో బైబిలులో ఉదాహరించిన ఈ ‘‘భిన్నాభిప్రాయము’’ గురించి తెలియపరచుటకు నేను పురికొల్పబడియున్నాను. ఈ విషయమై మీకు కొంత అవగాహన కలిగించవలెనని ఆశించుచున్నాను. మన అనుదిన క్రైస్తవ జీవనంలో ఈ భిన్నాభిప్రాయము గురించి కొన్ని ఉదాహరణలను తెలియపర్చాలని కోరుకుంటున్నాను. కనుక ఈ విషయాలను బట్టి మనము, మన ఆలోచనలకు పదును పెట్టవలెను. దేవుని యందు విశ్వాసముంచిన ప్రతివారు ఒక్కసారైనా ఈ భిన్నాభిప్రాయము గురించి తెలుసుకొనవలయును.

తీతు 3:10-11లో మత బేధము కలిగించు మనుష్యుడు మార్గము తప్పి, తనకు తానే శిక్షవిధించుకొనిన వాడై పాపము చేయును. కనుక ఒకవేళ యేసునందు నమ్మిక యుంచినను, ఇంకను హృదయములలో పాపము కలిగి యుండు వారు దేవుని యెదుట మత బేధము కలిగించు వారైయున్నారు.

యేసు తాను పొందిన బాప్తిస్మము ద్వారా మన సమస్త పాపములను స్వీకరించెను. అయితే ఈ మత బేధము కలిగించువారు ఈ సత్యసువార్త వలననైన రక్షణయందు విశ్వాసముంచరు. అదియును గాక పాపము చేయుచు తమకు తామే శిక్ష విధించుకొనుచున్నారు.

ఒకవేళ మీరు అటువంటి భిన్నాభిప్రాయము కలిగియున్నారా? మనము నిజముగా విశ్వాస జీవితం గడపాలని, నిర్మలమైన జీవితం జీవించాలని యోచిస్తే, ఈ విషయం గురించి కొంచెం ఆలోచించాలి సరిచేసుకోవాలి.

ఈ నీరు మరియు ఆత్మగురించిన సువార్తను ఇంకను విననట్లయితే, మీరు యేసునందు నమ్మిక యుంచినను, మీకు మీరే పాపులుగా తీర్పు తీర్చుకుంటున్నారు? ఈ నీరు మరియు ఆత్మ గురించిన సువార్తయందు, దాని ద్వారా లభించు సంపూర్ణ రక్షణ యందు తప్పిపోయిన యెడల మీరు క్రీస్తు సేవకు విరోధముగా నిలచి, మిమ్మును మీరే పాపులుగా తీర్పుతీర్చుకొనువారై యుందురు.

దేవుని యెదుట పాపిగా తీర్పు తీర్చుకొనువారు దేవుని బిడ్డలు కానేరరు. ‘‘ప్రభువా నేను పాపిని’’ అని ఎల్లప్పుడు వాపోవువారు వారి విశ్వాసము గురించి పునరాలోచన చేసుకొనవలసినవారై యున్నారు.

మీరు యేసునందు విశ్వాసముంచి, ఈలోక పాపములన్నియు ప్రభువైన క్రీస్తుపై మోపబడినవనియు, వాటి ద్వారా మనకు లభించవలసిన శిక్ష నుండి రక్షింపబడి నామనియు విశ్వసించిన తదుపరి కూడా ఏ విధముగా పాపులుగా మనలను, మనము పరిగణించు కొనగలము? యోర్దానులో యేసుపొందిన బాప్తిస్మము ద్వారా మన సకల 

పాపములను తొలగించి, వాటి నిమిత్తమై సిలువలో మనకు ప్రత్యామ్నాయంగా మరణించి, మనకు ఉచితముగా అందించిన ఈ రక్షణను ఏ విధముగా విస్మరించగలము?

ఈ విధముగా జీవించువారు నిజముగా మత బేధములు కలిగించువారే! ఎందుకనగా వారు దేవుని వాక్యమును తృణీకరించి, పాపులుగా తమకు తామే తీర్పు విధించుకొనుచున్నారు. కనుక దేవుని యెదుట ఈ మతబేధములు కలిగియుండకుండా, ఈ నీరు మరియు ఆత్మ గురించిన సువార్తయందు విశ్వాసముంచవలెను.

ఒకవేళ ఎవరైనను యేసునందు విశ్వాసముంచి తిరిగి జన్మించు అనుభవమును పొందనియెడల, వారింకను హృదయమునందు పాపము కలిగి మతబేధము కలిగించువారై యున్నారు.

క్రీస్తు ఈలోక పాపమంతయు అనగా మన పాపములను కూడా తనపై మోపుకొనియున్నాడు. ఈ సత్యమును విస్మరించి, ఈ రక్షణాశీర్వాదమును నిర్లక్ష్యపరచినయెడల మనము దేవుని యెదుట ‘‘మత బేధము’’ కలిగించువారై యుందుము. దేవుడు పరిశుద్ధుడు. మనమింకను పాపము హృదయములో కలిగియున్నవారమైన యెడల మనము. మతవిబేధము కలిగించువారమే. మనము నిజముగా నీతిమంతులుగా తీర్చబడ వలెనంటే, యేసు పొందిన బాప్తిస్మము మరియు సిలువలో క్రీస్తు కార్చిన రక్తము నందు విశ్వాసముంచవలసిన వారమైయున్నాము.బైబిలులో ఈ భిన్నాభిప్రాయము గురించిన వివరణ


 • ఒక యాజకునికి కావలసిన
 • ముఖ్య అర్హత ఏమైయున్నది?
 • ఆ యాజకుడు తిరిగి జన్మించిన
 • అనుభవము కలిగినవాడై
 • యుండవలయును.


మనం 1రాజు 12:25-26 వరకు ధ్యానం చేద్దాము. ‘‘తరువాత యరోబాము ఎఫ్రాయిము మన్యమందు షెకెమను పట్టణము కట్టించి అచ్చట కాపురముండి అచ్చట నుండి బయలుదేరి పెనూయేలును కట్టించెను. ఈ జనులు యెరూషలేమునందున్న యెహోవా మందిరమందు బలులు అర్పించుటకు ఎక్కిపోవుచుండిన యెడల ఈ జనుల హృదయము యూదారాజైన రెహబాము అను తమ యజమానుని తట్టు తిరుగును; అప్పుడు వారు నన్ను చంపి యూదారాజైన రెహబామునొద్ద మరల చేరుదురు; రాజ్యము మరల దావీదు సంతతివారిదగును అని యరోబాము తన హృదయమందు తలంచి’’, యరోబాము సొలొమోను సామంతుడై యున్నాడు. సొలొమోను యొక్క అఖరు దినములలో తిరుగుబాటు చేసెను. తరువాత సొలొమోను కుమారుడైన రెహబాము కాలములో ఇశ్రాయేలు పదిగోత్రములకు రాజాయెను.

యరోబాము రాజైన తరువాత తన ప్రజలు దేవాలయమును బట్టి యూదా రాజువైపునకు తిరుగుదురేమోనని మొదటిగా ఆలోచించెను.

ఈ విధంగా జరగకుండా చేయటానికి అతడు ఒక పథకం వేశాడు. బేతేలులోని మరియు దాను లోను రెండు బంగారు దూడలను చేసి, తన ప్రజలను వీటిని ఆరాధించవలసినదిగా ఆజ్ఞ ఇచ్చాడు. 1రాజు 12:28లో ఈ విధంగా తెలియపరచబడినది ‘‘ఆలోచన చేసి రెండు బంగారు దూడలు చేయించి’’ ఒక దానిని బేతేలు నందును, మరియొక దానిని దాను నందును ఉంచెను. వాటిని పూజించమని ప్రజలను శాసించెను. రాజుచేసిన ఈ కార్యము పాపమునకు కారణమైనను ఈ విధముగా జరిగించెను. అంతే కాకుండా వాటిని పూజించుటకు యాజకులను కూడా నియమించెను.

‘‘ఈ సంగతియైన తరువాత యరోబాము తన దుర్మార్గమును విడిచిపెట్టక, సామాన్యజనులలో కొందరిని ఉన్నత స్థలములకు యాజకులుగా నియమించెను.’’ (1రాజు 13:33) ఇదే భిన్నమతావలంబనకు ఆద్యము.

ఈ దినములలో కూడా ఎవరైనా పిలుపు లేకుండా సేవచేయుదమని కేవలము ముందుకు వచ్చినవారిని ఈ భిన్నమతావలంబనకు యాజకులుగా ప్రతిష్టించుచున్నారు. తిరిగి జన్మించిన అనుభవము లేనివారిని, నీటిద్వారాను, ఆత్మద్వారాను జన్మించని వారు కూడా కేవలము ఒక సామాన్య బైబిలు కళాశాల నుండి ఉత్తీర్ణులై బయటకు రాగానే వారు ఒక సేవకునిగానో, కాపరిగానో, సువార్తకునిగానో వెంటనే నియమింపబడుచున్నారు.

తిరిగి జన్మించిన అనుభవము లేని వ్యక్తి ఏవిధముగా సంఘకాపరికాగలడు? ఒకవేళ అటువంటి వ్యక్తి బోధకునిగా నియమింపబడినట్లయితే, ఆ సంఘము ఒక భిన్నమతావలంబనను తయారుచేసే కర్మాగారముగా మారగలదు.

ఈ భిన్నమతావలంబనకు ఆది కారణమును పరిశీలిద్దాము. మొదట యరోబాము దేవుని స్థానములో బంగారు దూడలను ప్రతిష్టించెను. కేవలము రాజకీయ పలుకుబడి పోకుండా ఉండుటకే ఈవిధముగా చేసెను. రెండవదిగా ఎవరైనా సరే యాజకులుగా ఉండుటకు ముందుకు వచ్చినయెడల వారిని యాజకస్థానములో ప్రతిష్టించెను. ఒక విధంగా చెప్పాంటే ఏ అర్హతలేని సామాన్య ప్రజలను యాజకులుగా ఉన్నతస్థానములో ప్రతిష్టించెను. ఈ రోజులలో కూడా ఇదే విధమైన క్రమము అనేక సంఘాలలో ఆచరింపబడుచున్నది.

యరోబాము తరువాత దినములలో కూడా ఈ క్రమము కొనసాగుచూ వచ్చియున్నది. నీటిద్వారాను, ఆత్మద్వారాను తిరిగి జన్మించిన అనుభవములేని వారిని బోధకులుగా ప్రతిష్టింపకూడదు.

ఎవరైనా సరే కేవలం ఒక సామాన్య బైబిలు కళాశాల నుండి వేదాంత విద్య అభ్యసించి ఉత్తీర్ణులవగానే బోధకునిగానో, కాపరిగానో, సువార్తీకునిగానో ఉండవచ్చా? ఒకవేళ దేవునిచేత అంగీకరింపబడకున్ననూ, కేవలము వేదాంత విద్య అభ్యసించినంత మాత్రమున దైవసేవలో ప్రవేశించుట సమ్మతమైన విషయమా? కానేకాదు. దేవునిచేత ఎన్నుకొనబడిన, పిలువబడిన వ్యక్తులు మాత్రమే దైవసేవ చేయుటకు అర్హులు. నీటిద్వారాను, ఆత్మద్వారాను తిరిగి జన్మించిన అనుభవము కలిగిన వ్యక్తులే దైవసేవ చేయుటకు ప్రతిష్టింపబడవలయును వారే అర్హులు.

1రాజు 12:25-26 మరియు 1రాజు 13వ అధ్యాయములోను తెలియపరచబడిన విధముగా యరోబాము పాపము చేయుటను బట్టి దేవుని కోపాగ్నికి కారణమాయెను మరియు యరోబాము సంతతి వారిని నిర్మూలము చేసి భూమిమీద ఉండకుండ నశింపజేయునట్లుగా ఇది వారికి పాపకారణమాయెను. ఈ వృత్తాంతము మనకందరికీ విదితమే. ఒకవేళ ఎవరికైనా ఈ విషయ పరిజ్ఞానము లేని యెడల బైబిలును పఠించి కనుగొనగలరు.

ఒకవేళ మీ సేవలో కూడా దేవుని స్థానంలో బంగారు దూడను ప్రతిష్టిస్తున్నారేమో ఆలోచించండి. మీ సహచరులు నీటిచేతను, ఆత్మచేతను తిరిగి జన్మించు అనుభవములోనికి రాకుండా, సేవాజీవితంలో ఈ లోక సంబంధమైన ఆశీస్సులను మీరు ఆశిస్తున్నారా? ఆలోచించండి.

మీ అనుచరులు లేక విశ్వాసలు కేవలము యేసునందు విశ్వాసముంచినట్లయితే స్వస్థత పొందగలరని బోధిస్తున్నారా? ఈ లోకసంపదతో ఆశీర్వదింపబడతారని బోధిస్తున్నారా? తిరిగి జన్మించు అనుభవము లేకుండా ఇవన్నీ సాధ్యమా? ఈ విధమైన అనుభవము లేనివారిని మీ సంఘములో కాపరులుగానో లేక మీ సేవాకార్యక్రమములలో ఉద్యోగులగానో నియమిస్తున్నారా? ఈ విధంగా చేసి మీ సిద్దాంతము ఉన్నతమైనదని శాఖాబేధములేదని తెలియజేస్తున్నారా? ఆలాగు చేస్తున్నట్లయితే మీరును యరోబాము చేసిన తప్పే చేస్తున్నారని తెలుసుకొవలసినదిగా విజ్ఞప్తి. ఆ విధముగా చేసి దేవునికోపాగ్నిని రగుల చేయవద్దని మనవి.ఈ భిన్నమతావలంబకులు బంగారు దూడనే దేవునిగా ఆరాధిస్తున్నారు.


ఈ రోజులలో కూడా బంగారు దూడను పూజిస్తున్నవారు అనేకులున్నారు. సొలోమోను వేయి దహన బలులను దేవునికి అర్పించి ఆశీర్వదింపబడ్డాడని వారి వాదన అయి వున్నది. ‘‘తన తండ్రియైన దావీదు నియమించిన కట్టడను అనుసరించుచు సొలోమోను యెహోవాయందు ప్రేమయుంచెను గాని ఉన్నత స్థలములయందు అతడు బలులను మాత్రము అర్పించుచు ధూపము వేయుచునుండెను. గిబియోను ముఖ్యమైన ఉన్నత స్థలమై యుండెను గనుక బలులు నర్పించుటకై రాజు అక్కడికి పోయి ఆ బలిపీఠము మీద వెయ్యి దహనబలులను అర్పించెను. గిబియోనులో యెహోవా రాత్రివేళ స్వప్నమందు సొలోమోనునకు ప్రత్యక్షమై “నేను నీకు దేని నిచ్చుట నీకిష్టమో దాని నడుగుమని దేవుడు అతనితో సెలవియ్యగా’’ (1రాజు 3:3-5)

అనేకులు ‘‘సొలోమోను వంటి వేయి దహనబలులు’’ అని చెప్పి తమ విశ్వాసులనుండి ధనమును ఆపేక్షించి, ఆశీర్వదింపబడగలరని చెప్పుచున్నారు. ఈ విధముగా వెర్రివారైన తమ విశ్వాసుల నుండి అధిక ధనమును ఈ నాయకులు పొందుచున్నారు. మరి బంగారు దూడవంటి, గొప్పగొప్ప భవన సముదాయములు నిర్మించుకొను నిమిత్తము అమాయకులైన విశ్వాసుల నుండి విరాళము సేకరించుచున్నారు. వారి ఆరాధనకు వారికున్న సంఘభవనములు చాలవని కాదుగానీ, ఈలోకములో ఉన్నతముగా కనపడవలెనని వారా విధముగా చేసి, తమ విశ్వాసుల నుండి అధికధనమును పొందుచున్నారు.

తమ విశ్వాసులు ఆరాధించుటకు బంగారు దూడవంటి విశాల భవన ప్రాంగణము కావలెనని చెప్పి, ఈ భిన్నమతావలంబీకులు ధనసముపార్జన చేయుచున్నారు. దేవునియందు నమ్మిక ఉంచిన మనమాలాగున మోసగింపబడకూడదు. మరి మీ ధనమును ఆ విధముగా బంగారు దూడవంటి భవన ప్రాంగణము కొరకై అర్పించినట్లయితే, మీరు దేవుని కొరకు కాదు ఆధనమునిచ్చినది, అది అబద్దబోధకుల జేబును నింపడానికని గ్రహించండి. కనుక ఈవిధముగా ఈ భిన్నమతావలంబీకుల మాయాజాలము నందు చిక్కుకొనవద్దు.

మరి అలాగయితే సొలోమోను అర్పించిన ఆ వేయి దహనబలులు కొరకై ఎందుకు దేవుడు సంతోషించెను? సొలోమోనుకు తాను చేసిన పాపము విషయమైన గ్రహింపుఉన్నది. వాటి నిమిత్తమై తాను మరణించవలయునని తెలియును. కనుక విశ్వాసముతో పాపమన్నింపు నిమిత్తమై ఆ దహన బలులను సమర్పించెను. దేవుడనుగ్రహించిన పాపపు మన్నింపు నిమిత్తమై కృతజ్ఞతతో వేయిదహన బలులను సొలోమోను అర్పించెను. ఈ నీరు మరియు ఆత్మ సంబంధమైన విమోచన హృదయమునందు కలిగిన వాడై సొలొమోను అనుదినము బలులను అర్పించెను.

కనుక ఇప్పుడు భిన్నమతావలంబన అను పదమునకు సరైన అర్థము గ్రహించి నడుచుకొన్నట్లయితే మనమీ అబద్ధ బోధకుల వలన మోసగింపబడము.తిరిగి జన్మించిన అనుభవము లేకుండా ఎవరైనా దైవసేవ చేయుచున్నయెడల వారు భిన్నమతావలంబీకులే!


 • తిరిగి జన్మించు విషయము గూర్చి ఈ
 • భిన్నమతావలంబీకుల భావమేమై యున్నది?
 • మేము కలల ద్వారాను, దర్శనముల ద్వారాను, మరియు
 • అనేక ఆధ్యాత్మిక అనుభవాల ద్వారాను తిరిగి
 • జన్మించియున్నామని వారు తెలియజేతురు.


విశ్వాసవిషయములో తిరిగి జన్మించిన అనుభవములేని వారు కూడా బోధకులుగా మారి, ఈ విషయమై అనేకులను దారి మరల్చుచున్నారు. వారే భిన్న మతావలంబన చేయుచున్నవారని చెప్పక తప్పదు. తిరిగి జన్మించు అనుభవము వారికి కడుదూరమని గ్రహించి కూడా ఇతరులును తిరిగి జన్మించు అనుభవములోనికి నడిపించగలమని వారి బోధయైయున్నది. అసలు వారికి నీటి ద్వారాను మరియు ఆత్మ ద్వారాను తిరిగి జన్మించు సువార్త గురించిన జ్ఞానమే లేదు. ఇది ఎంతో హాస్యాస్పదము.

అబద్ధబోధకులు, తప్పుడు సువార్త బోధించుచున్నారు. నీటిద్వారా మరియు ఆత్మ ద్వారా తిరిగి జన్మించు సువార్తను దారి మళ్లించున్నవారైయున్నారు. అనుదినము మీ పాపమును శుద్దీకరించు కొనవలసినదిగా తమ విశ్వాసులకు బోధించుచున్నారు.

‘‘కొండపైకి వెళ్ళి ప్రార్థిస్తేచాలు, ఉపవాసముండి ప్రార్థిస్తే చాలు, మీరు దేవుని సేవలో ఏదో ఒక విధంగా పాల్గొంటేచాలు, ఉదయము లేచిన వెంటనే ప్రార్థిస్తేచాలు, విధేయతతో ఉంటే చాలు, సంఘ నిర్మాణ నిమిత్తమై మీకానుకను విరివిగా ఇస్తేచాలు, మీ పాపాన్ని తుడిచిపెట్టుకు పోతాయని వీరు బోధిస్తుంటారు.’’

ఒకసారి, ఒక వ్యక్తి తాను ఏవిధంగా తిరిగి జన్మించిన అనుభవాన్ని పొందాడో సాక్ష్యమివ్వటం నేను విన్నాను. ‘అతడొక స్వప్నం కన్నాడు. అందులో ఒక పెద్ద వరుసలో అతడు నిలుచుండియున్నాడు. ఆ వరుస ముందుకు కదులుతూ ఉండగా, ప్రభువైన యేసు సమక్షంలోనికి అతడు వచ్చాడట, అప్పుడు యేసుప్రభువు అతని పేరు పిలువడం విన్నాడట; ఇదే అనగా ఈ స్వప్నమే అతను రక్షింపబడ్డాడని చెప్పటానికి, తిరిగి జన్మించాడని చెప్పటానికి నిదర్శనమని అతని సాక్ష్యము. ఈ విధమైన వింత విషయాల వలన రక్షింపబడగలమా?

యోహాను సువార్త 3వ అధ్యాయంలో ప్రభువు ఈలాగు సెలవిచ్చెను. ‘‘ఒకడు నీటిమూలముగాను, ఆత్మమూలముగాను తిరిగి జన్మించితేనే గానీ దేవునిరాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను’’ అనెను. నీటిద్వారాను, ఆత్మద్వారాను జన్మించినవారే దేవునిసేవకులు అర్హులని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ఒకవేళ ఎవరైనా వీటిద్వారా కాక, కేవలము స్వప్నము ద్వారాను, కలలద్వారాను, ఆధ్యాత్మిక ఉప్పొంగులద్వారాను, పాప పశ్చాత్తాప ప్రార్థనలద్వారాను తిరిగి జన్మించానని తెలియజేస్తే అది అబద్దబోధయే. అది భిన్నమతావలంబనే.

ఈ రోజులలో లిఖించబడిన దేవుని వాక్యమును అనేకులు విశ్వసించరు. వారి శాఖ సంబంధమైన బోధనే విశ్వసిస్తారు. తిరిగి జన్మింపచేసే ఈ అనుభవమును పరిగణలోనికి తీసుకొనరు. నీటిద్వారాను, ఆత్మద్వారాను తిరిగి జన్మించరు. నీటిమూలముగాను, ఆత్మమూలముగాను తిరిగి జన్మింపజేయగల ఈ సత్యసువార్తను విడిచిపెట్టినవారు, అబద్ధ క్రైస్తవులు మరియు భిన్నమతావలంబీకులై యున్నారు.సంస్కరణలు మరియు ఆధునిక క్రైస్తవ్యము


 • ఇతర మతములతో కలసి నిజమైన
 • సువార్త ఎప్పుడు సంకరమాయెను?
 • క్రీ.శ. 313లో రోమా చక్రవర్తి అయిన కాన్‌స్టాంటైన్‌,
 • మిలాను ఒప్పుకోలును స్థిరపరచినప్పుడు.


క్రైస్తవ్యములోని శాఖోపశాఖలు ఎప్పటి నుండి ఉద్భవించినవి? మరి క్రైస్తవ్యములోని అనేక శాఖలు అనగా ప్రెస్‌బిటేరియన్లు, మెతడిస్టులు, బాప్టిస్టులు, లూథరన్లు, పరిశుద్ధులు, సంపూర్ణ సువార్తీకులు మొదలగు శాఖలు మొదలైనవి? ఈ సంస్కరణ కేవలం 500 సంవత్సరముల క్రితం ఉద్భవించినది.

ఆదిమ క్రైస్తవులు, ప్రభువైన యేసు ఈ లోకంలో ఉండగానే ఆయననుసరించిన శిష్యులైయున్నారు. ‘‘క్రైస్తవులు’’ అనగా ‘‘యేసును వెంబడించిన శిష్యులు’’ అని అర్థము.

ప్రథమ క్రైస్తవులు అపోస్తులులు మరియు వారి శిష్యులైయున్నారు. మరి ఈ అపోస్తులులు, సంఘపితరులు క్రీ.శ. 313వరకు సత్యసువార్తను వెంబడించిరి. అయితే ఈ ‘మిలాను ఒప్పుకోలు’ తర్వాత దినములలో అనగా ఘనత వహించిన కాన్‌స్టాంటైను చక్రవర్తి ఏర్పరచిన ఈ ‘ఒప్పుకోలు’ తర్వాత క్రైస్తవులు, అన్యులు కలిసి జీవించసాగిరి. దాని ఫలితమే దాదాపు వెయ్యి సంవత్సరాలు క్రైస్తవ్యాన్ని పట్టిన చీకటిదినాలు.

అయితే 16వ శతాబ్ధపు ప్రారంభదినాలలో మార్టిను లూథరు మత సంస్కరణలను ప్రారంభించెను. ‘‘నీతిమంతులు విశ్వాసము వలన జీవించెదరు’’ అని ప్రకటించెను. ఆ తరువాత కాలంలో అనగా 1500-1600 సంవత్సరముల మధ్య కాలంలో జాన్‌ కాల్విన్‌, జాన్‌ నెక్స్ అను సంస్కరణ కర్తలు ఉద్భవించిరి. వారు కథోలిక్‌ సంస్కృతి నుండి క్రైస్తవ్యమును సంస్కరించిరి. క్రైస్తవ్యములోని సంస్కరణ వలన ఇది సాధ్యమాయెను.

ఈ సంస్కరణోద్యమము వలన కథోలిక్‌ సంస్కృతి నుంచి బయటపడగలిగిన క్రైస్తవ్యము. రోమన్‌ క్యాథలిక్‌ సంఘమునకు భిన్నమైన సంఘస్థాపనకు దారి తీసినది. అయితే ఈ సంస్కరణ వాదులు క్యాథలిక్‌ సంఘములోఉన్న మూల సిద్ధాంతములకు వ్యతిరేకమైన మార్పు చేయనొల్లకపోయిరి. 

క్రైస్తవులను అణచివేసి, భిన్నబోధలు చేయు క్యాథలిక్‌ సంస్కృతి నుండి స్వతంత్రులనుగా చేయుటయందే వారి దృష్టి అంతయు కేంద్రీకరించితిరిగాని, ఈ నీరు మరియు ఆత్మ ద్వారా తిరిగి జన్మించు అనుభవానికి అనుబంధమైన విశ్వాసమును స్థాపించలేకపోయిరి. ఈ సంస్కరణకు రోమన్‌ క్యాథలిక్‌ సంఘము ‘‘ప్రొటెస్టెంటిజం’’ అని పేరు పెట్టిరి. అనగా వారిని వ్యతిరేకించిన వారని అర్థము.

ఈ పరిస్థితులలో రోమన్‌ క్యాథలిక్‌ సంఘము ఆశీర్వాదమును అమ్ముటకు ప్రారంభించిరి. ఎవరి పూర్వీకులైనా చనిపోయిన యెడల వారి ఆత్మను పరలోకమునకు పంపించు ప్రక్రియ విశేషధనము సమర్పించిన యెడల, సాధ్యమేనని మత మౌఢ్యములో వున్న ప్రజలను నమ్మించిరి. అసలీ క్యాథలిక్‌ మూల సిద్ధాంతములో వున్న తప్పును లూథరు మహాశయుడు వ్యతిరేకించలేదు. సెయింటు పీటరు కెథడ్రిల్‌ నిర్మాణ నిమిత్తమై ఈ విధమైన ఆశీర్వాదమును అమ్ముచున్న రోమన్‌ క్యాథలిక్‌ సంఘమును, ఈ ప్రయత్నము నుండి వారించుటయే ఆయన ముఖ్య ఉద్దేశ్యమైయున్నది.

కనుక దీని ఫలితముగా క్రైస్తవ్యములో ఇంకను ఈ రోమన్‌ క్యాథలిక్‌ సంఘశిధిలాలు నిలిచియున్నవి. ఆ సిద్ధాంత శిధిలము క్రమేణా నేటి ప్రొటెస్టెంటు సంఘములలో కూడా ప్రవేశించియున్నది. చిన్న పిల్లలకిచ్చు బాప్తిస్మము, రోమను క్యాథలిక్‌ సంఘములో వున్న పాపపు ఒప్పుకోలుకు సమానమైన పశ్చాత్తాప ప్రార్థనలు, పరిశుద్ధ ఆచారాలు, వేదాంత కళాశాలలో వేదవిధ్యనభ్యసించిన వారిని, కేవలం వారి విద్యార్హతను బట్టి సేవకులుగా నియోగించుట, సంఘ ఆరాధన నిమిత్తమై గొప్ప కట్టడము నిర్మాణము మొదలగునవన్నియు ఆ క్యాథలిక్‌ సంఘ శిధిలములలో నుండి ప్రొటెస్టెంటు సంఘములోనికి అడుగుపెట్టిన కొన్ని రుగ్మతలైయున్నవి.

క్రీ.శ. 1500 సంవత్సరాల కాలములో సంభవించిన సంస్కరణల నుండి బయటకు వచ్చిన ప్రొటెస్టెంటు సంఘకాలం దాదాపు 500 సంవత్సరాలు. ఈ సంవత్సరము ఈ సంస్కరణకు 481వ సంవత్సరమై యున్నది. మార్టిన్‌ లూథర్‌ తన మాతృసంఘమైన క్యాథలిక్‌ సంఘమును వ్యతిరేకించి కేవం 481 సంవత్సరములాయెను. కనుక ఒక విధంగా చెప్పాలంటే ఆ ప్రొటెస్టెంటు ఉద్యమం యవ్వనదశలో ఉన్నదని చెప్పవచ్చును. క్రైస్తవ్యములో సంస్కరణలింకను కొనసాగుతూనే యున్నవి. ఇంకనూ సంపూర్ణ ప్రక్షాళన అగు పర్యంతం కొనసాగుతూ ఉండవలెను.

అయితే మనమందరము గుర్తించుకోవలసిన విషయమొకటున్నది. కేవలం నీటి వలనను, ఆత్మ వలనను మాత్రమే తిరిగి జన్మించినవారే పరలోక రాజ్యములోనికి ప్రవేశించగలరన్న ప్రభువైన యేసుక్రీస్తు మాటను మరచిపోరాదు. మనమదే బోదిద్ధాము. నీరు మరియు ఆత్మ ద్వారా తిరిగి జన్మించు క్రీస్తు సువార్తను మీరు బోధిస్తున్నారా? ఒకవేళ ఈ విషయాలను మనము బోధించుట విస్మరిస్తే మనము నిజమైన దైవసేవకులముకాదు. ‘‘ఈ తిరిగి జన్మింప జేయు నీరు మరియు ఆత్మ వలననైన సువార్తను’’ మనము విశ్వసించాలి, బోధించాలి. ఇదే దేవుడు మనయందు ఆశించేది. యోహాను సువార్త 3వ అధ్యాయంలో నికోదేమునకు ప్రభువైన యేసుబోధించినదీ సత్యసువార్తయే.

బైబిల్ గ్రంథములో మనకు నీటిద్వారాను మరియు ఆత్మద్వారాను తిరిగి జన్మించు సువార్త తెలియపరచబడియున్నదా లేక కేవలము పవిత్రమైన జీవితం జీవిస్తూ, సమాజ శ్రేయస్సుకై కృషి చేస్తే చాలు అని తెలియపరచబడినదా? ఈ రెండవ కార్యము కూడా ముఖ్యమైనదే. కానీ, మీరు నీరు మరియు ఆత్మ ద్వారా తిరిగి జన్మించిన తదుపరి ఈ పవత్రజీవితం, సమాజశ్రేయస్సు ఆకాంక్షించాలి, కృషిచేయాలి.ఈ భిన్నమతావలంబన చేసేవారి బోధలు.


 • భిన్నమతావలంబన చేసే వారెవరు?
 • యేసుక్రీస్తు నందు నమ్మిక ఉంచినా ఇంకను
 • పాపములో జీవించువారు


ఈ అబద్ధ క్రైస్తవ జీవితం లేక భిన్నమతావలంబన ఈ లోకంలో ఎప్పుడు ప్రారంభమైనది?

1రాజులు 12 మరియు 13వ అధ్యాయములలో తెలియపరచబడిన విధముగా యెరోబాము కాలము వరకు, అనగా ఇశ్రాయేలు రెండు రాజ్యములుగా విడిపోవు కాలమునకు ముందువరకు, ఏక దేవ ఆరాధన మాత్రమే జరిగేది. అప్పటి నుండి ప్రభువైన యేసుక్రీస్తు ఈలోక పటముపై అడుగిడువరకు ఈ భిన్నమతావలంబన అభివృద్ధి చెందుతూ వచ్చినది. అయితే ఈ రోజులలో కూడా అనేకులీ పద్ధతి పాటిస్తూ ఉన్నారు.

బైబిలు గ్రంథములో యెషయా 28వ అధ్యాయం మరియు తీతు 3:10-11 వచనాలలో ఈ అబద్ధ క్రైస్తవ బోధల గురించి తెలియపరచబడినది. బైబిలు ప్రకారం, క్రీస్తును విశ్వసిస్తూ ఇంకనూ పాప హృదయమును కలిగియున్నవారే వీరు. ఆ విధమైన ప్రవృత్తిగలవారిగా మతబేధములు కలిగించు వారైయున్నారు.

యెషయా 28:9-10 ప్రకారం ‘‘వాడు ఎవరికి విద్య నేర్పును? ఎవరికి వర్తమానము తెలియజేయును? తల్లిపాలు విడిచినవారికా? చన్ను విడిచినవారికా ? ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ సూత్రము వెంబడి సూత్రము సూత్రము వెంబడి సూత్రము కొంత ఇచ్చట కొంత అచ్చట చెప్పుచున్నాడని వారనుకొందురు.’’

ఈ మత బేధము కలుగజేయువారు ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రము వెంబడి సూత్రము బోధించుదురు. దాని అర్థమేమి? అనగా ‘‘కేవలము క్రీస్తునందలి నమ్మిక ద్వారా తిరిగి జన్మించియున్నామని చెప్పువారిని గురించి జాగ్రత్తపడుడి. జాగ్రత్తపడుడి... జాగ్రత్తపడుడి.’’ ప్రతివిషయములోను జాగ్రత్తపడుడి. ఈ మత బేధములు కలిగించు అబద్ద బోధను వినవద్దు, ఆ చోటికి పోవద్దు.

మరి మీరు ‘మా బోధలు పారంపర్య క్రైస్తవ్యము గురించినవని చెప్పుచున్నారు కదా. అటువంటప్పుడు దేవుని వాక్యమునకు విరుద్ధమైన నమ్మిక కలిగిన వారి అనుచరులను ఎందుకు వెలివేయరు? ఇది వారి యెడల చాలా జాలి చూపవలసిన పరిస్థితి. వారు పారంపర్య క్రైస్తవులమని చెప్పుదురు. కానీ ఈ భిన్న మతావలంబన లేక మతబేధము కలిగించు పరిస్థితి నుండి విడిపించు వాక్యమును విసర్జించియున్నారు. కేవలం దేవుని వాక్యము ద్వారా నిజక్రైస్తవుడు ఈ పరిస్థితిని అధిగమించగలడు.

అయితే ఈ రోజులలో ఈ పారంపర్య క్రైస్తవులమని చెప్పుకునేవారు. వారి వారి భిన్నాభిప్రాయాలను బట్టి తిరిగి జన్మించిన అనుభవము కలిగినవారిని అబద్ధ క్రైస్తవునిగా లేక మత బేధము కలిగినవారిగా వర్ణించుచున్నారు. దేవుని వాక్యానుసారమైన ఈ నీరు మరియు ఆత్మ ద్వారా జన్మించు సువార్తయందు విశ్వాసము కలిగిన మనమేలాగు అబద్ధ క్రైస్తవులము కాగలము?

ఒకవేళ వారాలాగు పిలచినను, ఈ నీరు మరియు ఆత్మ ద్వారా తిరిగి జన్మింపజేయు సువార్తను ప్రకటించు మనమే నిజమైన క్రైస్తవ ఆచారము కలిగినవారము. ఒకవేళ పారంపర్య క్రైస్తవులయినా ఈ తిరిగి జన్మింపజేయు సువార్తను ప్రకటించకపోయినచో వారు అబద్ధ క్రైస్తవులగుదురు.

అయితే ఈ ‘‘పారంపర్య క్రైస్తవ్యమునకు’’ మరియు ‘‘మతవిబేధము కలిగించు విధానమునకు’’ తేడా తెలుసు కొనవలయునన్న వారు ఈ నీరు మరియు ఆత్మ ద్వారా తిరిగి జన్మించు సువార్తను ప్రకటిస్తున్నారా, లేదా అన్న విషయంపై ఆధారపడి ఉంటుంది. అంతేకాక యేసునందు విశ్వాసం వుంచినను, ఇంకను హృదయములో పాపము కలిగియున్నారా, లేదా అన్న విషయంపై ఆధారపడి యుంటుంది. దేవుని వాక్యమందు విశ్వాసము ఉంచి, నీరు మరియు ఆత్మ ద్వారా తిరిగి జన్మించిన అనుభవము కలవారు ఏ విధముగా అబద్ధ క్రైస్తవులు కాగలరు? కాలేరు.

క్రీస్తుయేసు పొందిన బాప్తిస్మము మరియు సిలువ మరణము యందు సంపూర్ణమైన విశ్వాసముంచి, మన పాపములన్నియు శుద్ధీకరింపబడినవని నమ్ముట మత బేధము కలిగించుటయా? లేక ఈ తిరిగి జన్మింపజేయు నీరు మరియు ఆత్మ గురించిన సత్యసువార్తను విశ్వసింపక పోవుట నిజక్రైస్తవ్యమా? 

అనేకమంది బైబిలు బోధ నుండి తొలగిపోయి, క్రైస్తవ శాఖలుగా ఏర్పడిన వారు, తమను తాము ‘‘నిజ క్రైస్తవులు’’ లేక ‘‘పారంపర్య క్రైస్తవులు’’గా అభివర్ణించుకుంటున్నారు. వారు బైబిలులో చెప్పబడిన నీరు మరియు ఆత్మద్వారా తిరిగి జన్మించుటను గురించి కాక, కేవలము యేసు సిలువ రక్తము గురించి బోధిస్తూ, ప్రభువు పొందిన బాప్తిస్మము (నీరు) గురించి విస్మరిస్తున్నారు.

ఈ రోజులలో ‘ప్రొటెస్టెంటు సంఘమునకు, రోమన్‌ క్యాథలిక్‌ సంఘమునకు గల తేడా ఏమైయున్నది? ఏ విధంగానైతే సంస్కరణల పితరులు తాము సభ్యులైన రోమన్‌ క్యాథలిక్‌ సంఘమును వ్యతిరేకించారో, దాని నుండి వైదొలగి ప్రొటెస్టంట్‌ సంఘమును స్థాపించారో మనము గ్రహించవలెను. మనమును అదే విధముగా గుడ్డిగా బోధించేవారిని, అబద్ధబోధకులను వ్యతిరేకించాలి. అప్పుడే సత్యసువార్తను మనము కొనుగొనగలము. మన కన్ను తెరువబడును. రక్షింపబడి సంపూర్ణముగా విమోచింపబడగలము.


 • ఈ మతబేధము నుండి వైదొగలవలెనన్న
 • మనమేమి చేయవలెను?
 • నీరు మరియు ఆత్మ ద్వారా తిరిగి జన్మించవలయును.

యేసుక్రీస్తు పొందిన బాప్తిస్మము మరియు సిలువపై ఆయన కార్చిన రక్తముతో మిళితమైన సువార్తయందు విశ్వాసముంచిన వారు, నిజమైన విశ్వాసమును అనుసరించుచున్నారని బైబిలు తెలియపరచుచున్నది. యోహాను 3:1-12 వరకు నికోదేముతో ప్రభువైన యేసు జరిపిన సంభాషణను, అందులోని సత్యమును మనము గ్రహించవలయును.

ఈ మత బేధము కలిగించువారు తమను అనుసరించువారికి విశ్వాసమును గురించి అత్యధికముగా బోధించెదరు. ప్రతి ఉదయం ప్రార్థించవలెనని, ఎంతో కష్టపడి దేవునికొరకు పనిచేయవలెనని మాత్రమే బోధించెదరు. గుడ్డివారిని పరుగెత్తమని చెప్పుట ఎటువంటిదో, ఇదియు అలాంటిదే.

మీరు నీరు మరియు ఆత్మ ద్వారా తిరిగి జన్మించు అనుభవమును పొందని యెడల మీరెంత పట్టుదలతో ప్రార్థించినను, ఆ ప్రార్థన ఏ మాత్రము ఫలించదు. నీటి ద్వారా మరియు ఆత్మ వలన తిరిగి జన్మించుట ద్వారా నీతిమంతులముగా నిలువగలమని మనము ప్రకటించుచున్నాము. అయితే వారు రోమా 3:10ని ఉదాహరించెదరు ‘‘నీతిమంతుడు ఒక్కడును లేడు. ‘‘ఈ వాక్యమును మాత్రమే ఉదాహరించి వారు విశ్వాసులను అబద్ధ క్రైస్తవులుగా పేర్కొందురు.

నిజముగా చెప్పాలంటే ఈ విధముగా మాటలాడేవారే మత బేధములు కలిగించువారు. ఈ వాక్యము యొక్క అంతరార్థము గ్రహింపవలెను. ఇట్టివారు పరిశుద్ధ గ్రంథమును సంపూర్ణముగా ధ్యానించరు. ఈ లోకములో నీతిమంతుడొక్కడు లేడని అపోస్తుడైన పౌలు తెలియపరిచాడు. అయితే పాతనిబంధన గ్రంథములోని వాక్యాన్ని ఇక్కడ ఉదహరించడం గమనించాలి. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి సకలమానవాళిని, తమ పాపముల నుండి విమోచించనంత వరకు నిజముగా ఈ లోకములో నీతిమంతడొక్కడునూ లేడు. దేవుని విమోచనాత్మకమైన రక్షణను ప్రభువైన యేసు ఈ లోకానికి ప్రసాదించాడు. అయితే యేసు చేత రక్షింపబడిన వారందరూ నీతిమంతులుగా తీర్చబడ్డారు.

ఈ అధ్యాయమంతయు సమగ్రంగా ధ్యానిస్తే మనము సత్యమును గ్రహించగలము. అయితే ఈ అబద్ధ బోధలకు, తమ బోధకు భిన్నముగా సత్యము తెలియపరచువారి గురించి జాగ్రత్తగా ఉండమని తమను అనుసరించువారికి తెలియపరుస్తారు. తమ సంఘాలలో తప్ప తమ అనుచరులను మరెక్కడా ఆరాధనలో పాల్గొనడానికి వీరు అంగీకరించరు. అందువలననే వారి సంఘస్థులు ఈ నీరు మరియు ఆత్మ ద్వారా లభించు విమోచనాత్మక సువార్త బోధించు సంఘములోనికి వెళ్లి ఆరాధించరు.

వీరు సత్యసువార్తకు చెవిటివారై యుండి, తిరిగి జన్మించిన అనుభవమును పొందనేరరు. ఈ అబద్ధ బోధకుల బోధ వలన అనేకమంది ప్రియ బిడ్డలు నరక పాత్రులగుచున్నారు. ఈ బోధకుల కొరకై దేవుని న్యాయతీర్పు ఎదురుచూచుచున్నది. ఈ మత బేధములు కలిగించువారు ఇకనైనను దేవుని వైపుకు తిరుగుట మంచిది.

అసలీ అబద్ధబోధకులెవరు? వీరు నీరు మరియు ఆత్మ ద్వారా లభించు విమోచనాత్మక సువార్తయందు సంపూర్ణముగా విశ్వసించినవారా, లేక కేవలం యేసునందు నమ్మిక మాత్రంకల్గిఉంది. నీరు మరియు ఆత్మవలన తిరిగి జన్మించిన అనుభవము లేనివారా?

తీతు 3:11 ప్రకారము, వీరు యేసునందు విశ్వసించినను ‘‘తమకు తామే శిక్ష విధించుకొనువారై’’ యున్నారు.

నీరు మరియు ఆత్మ వలన తిరిగి జన్మించవలెనని బోధించే, ఉజ్జీవ సభకు వెళ్ళవద్దని, అది చాలా ప్రమాదమని తమ సంఘసభ్యులకు వీరు ప్రకటించెదరు. ఈ ‘‘పారంపర్య క్రైస్తవులు’’ వారికి భిన్నముగా వున్న బోధ విషయమై ఎందుకు భయపడవలయును? వారి పక్షమున సత్యములేదు కనుక వారు భయపడుచున్నారు. ‘‘వారు ఆజ్ఞ వెంబడి ఆజ్ఞను, సూత్రము వెంబడి సూత్రమును’’ ఉదాహరించెదరు. ఈ భిన్న ఉపదేశకుల బోధలు అటులుండును.

ఈ ఉపదేశకులు అనేక గ్రంథముల నుండి కొంచెము కొంచెము బోధించెదరు. వేదాంత బోధలు, వాక్యములోని విషయాలు తమ సొంత అభిప్రాయముతో కలగలిపి వారి బోధను ఎంతో ఆకర్షణీయముగా చేసెదరు.

తమ సంఘస్థులను, దైవజ్ఞాన విషయములో శూన్యులుగా చేసి ఆ లోకసంబంధమైన బోధ ద్వారా వారికి ఉపదేశించుదురు. నిజమైన దేవుని సంఘము కేవలం దేవుని వాక్యాన్నే ఉపదేశిస్తుంది. తమ విశ్వాసులకు దేవుని వాక్య ధ్యానమే ఉపదేశిస్తుంది. ఈ లోక సంబంధ విషయములో జ్ఞానము కలిగి యుండు నిమిత్తము, ప్రజలు సంఘముకు, ఆలయముకు రావలసిన అవసరతే లేదు. ఈ లోకములో మచ్చుకైనను వినిపించని దేవుని వాక్యాలను వినడానికి ధ్యానించడానికే విశ్వాసులు చర్చికి వస్తారు. ప్రభువైన యేసు పలికిన దివ్య వాక్కును వినడానికి క్రైస్తవులు ఆలయాలకు వస్తారు.

ప్రజలు పాపులుగా చర్చిలోనికి వచ్చి, పాపరహితులుగా తీర్పుపొంది నీతిమంతులుగా బయటకు రావాలనేదే వారి ఆకాంక్ష. అయితే ఈ అబద్ధబోధకులు వారికి సంఘాలలో ఏమి బోధించగలరు? దైవ సేవకు ఉజ్జీవ సభలో చేసే సత్యసువార్త ప్రసంగాలను వినరాదని తమ సంఘస్థులకు ఆజ్ఞాపిస్తారు. నీరు మరియు ఆత్మ వలన తిరిగి జన్మించు ఈ అనుభవములోనికి తమ సంఘస్థులను రానీయరు.

ఇది ఎంతో మూర్ఖత అయివున్నది. వారు తమ సంఘస్థులను మోసపరచగలరేమో గాని, దేవుని మోసపరచలేరు కదా!


 • ఈ అబద్ధ బోధకులు, తమను
 • అనుసరించువారికి ఈ నీరు మరియు
 • ఆత్మవలనైన నూతన జన్మను అందించగలరా?
 • లేనేలేదు. తిరిగి జన్మించిన అనుభవము
 • గలవారే ఇతరులను ఆ అనుభవములోనికి
 • నడిపించగలరు.


ఓ అబద్ధ బోధకులారా, మత బేధము కలిగించువారలారా, ఆత్మ మిమ్మును గద్దించుచుండగా గ్రహించలేరా? మీరు దేవుని వైపుకు మళ్ళవలసినదిగా విజ్ఞప్తి. నిజమైన దైవసేవకులు ఉపదేశించుచున్న ఈ నీరు మరియు ఆత్మ ద్వారా తిరిగి జన్మించు అనుభవమును మీ అనుచరులు స్వతింత్రించుకొనకుండా చేయుచున్న మీ ఆచార వ్యవహారములను ఆపలేరా?

ఇట్టి బోధకులు తమ అనుచరులను కేవలము వేదాంత విషయాలలోనే నడిపిస్తారు. అట్టివారు సత్య విషయాలను విన్నప్పుడు ఎంతో ఇబ్బందికి గురికాగలరు. ఇది చాలా విచారించదగిన విషయం కదా. ఈ అబద్ధ ప్రచారకులు తమ బోధలో దేవుని వాక్యాన్ని ఖచ్చితంగా ఉదాహరించకుండా బోధచేయుటలో సిద్ధహస్తులు. వారు తాము తప్పిపోయి అనుసరించుచున్న నమ్మకమునే, విశ్వాస విషయమును బోధించుచు, ఉపన్యసించుచూ వ్యాప్తి చేయుచుందురు. దేవుని వాక్యము లేకుండా బోధ చేయువారు అబద్ధ బోధకుడు మరియు కేవలము జీతగాడై యున్నాడు. (యోహాను 10:13)

ఈ అబద్ధబోధకులు భిన్నమతావలంబీకులైయున్నారు. వారి బాహ్య ప్రవర్తనకు మరియు అంతరంగమునకు ఏ మాత్రము సంబంధము ఉండదు. ఏ శాఖతో సంబంధములేని కొన్ని సంఘాలను కూడా భిన్నమత సంఘాలుగా ఉదాహరించవచ్చు. వాటిలో అనేక సంఘాలు ఏ శాఖలతో సంబంధం లేకుండా సత్యసువార్తకు కడుదూరంగా ఉంటాయి.

తమ పాపముల విషయమైన నిశ్చయతే లేని ఈ అబద్ధబోధకులు తమ అనుచరుల విమోచన గురించి బోధిస్తారు. వీరు యరోబాము చేసిన పాపమునే తిరిగి చేస్తున్నారు. ఇంకనూ తమ హృదయములలో పాపము కలిగియుండి దేవుని కార్యాలు చేయాలని ఆశించేవారు ఒక ముఖ్య విషయం గమనించాలి. వారి పాపముకు, దేవుని పరిశుద్ధతకు పొత్తులేదన్న విషయం గ్రహించాలి. తాను ఒక భిన్నమతావలంబీకుడనన్న విషయం గుర్తెరగాలి.

ఒకవేళ సంఘ సంబంధమైన పరిచర్యచేయువారు గానీ లేక బోధకుడు గానీ తామింకను పాపములో నిలచియున్నామని గ్రహించినప్పుడు తానొక అబద్ధబోధకుడినన్న విషయం గమనంలోకి తెచ్చుకోవాలి. ఈ నీరు మరియు ఆత్మసంబంధమైన, విమోచనాత్మకమైన, సత్యగ్రంథములో ఉదహరించబడిన, అసలైన సువార్త తెలియనియెడల రక్షణమార్గమే యెరుగలేదన్న విషయం ఈ బోధకుడు గ్రహించాలని మనవి. ఒకవేళ ఎవరైనా ఇట్టి బోధకులు నుండి వేద విద్య నేర్చుకొనినట్లయితే ఈ శిష్యుడు కూడా ఒక అబద్ధ బోధకుడన్న విషయం గ్రహించగలగాలి.

ఫలమును బట్టి చెట్టును గుర్తెరగాలి. ఎవరైతే ఈ విమోచనాత్మకమైన నీరు మరియు ఆత్మతో కూడిన సువార్తద్వారా క్రీస్తు బాప్తిస్మము మరియు సిలువ మరణమును గుర్తెరిగి తిరిగి జన్మిస్తారో వారే నీతి ఫలమును ఫలించెదరు. ఇంకను పాపులుగానే యున్నవారు, పాపులుగానే తీర్పు పొందెదరు. ‘‘అలాగుననే ప్రతి మంచిచెట్టు మంచి ఫలము ఫలించును, పనికిమాలిన చెట్టు కాని ఫలము ఫలించును.’’ మత్తయి 7:17ఈ భిన్నమతావలంబన చేయు బోధకులు తమ ప్రసంగముల ద్వారా ఏ విషయమును బోధించెదరు ?


 • ఈ భిన్నమతావలంబన చేయు బోధకులు
 • తమ ప్రసంగముల ద్వారా ఏ విషయమును
 • బోధించెదరు?
 • మానవ సంబంధమైన ఆలోచనులు మరియు ఈ ప్రపంచ
 • సంబంధమైన వేదాంతమును బోధించెదరు


అబద్ధ ప్రవక్తలు అనేక విషయములను వెదుకుదురు. వారు ఎందువలన చాలా విషయాలలో జాగ్రత్తగా ఉందురు? ఈ నీరు మరియు ఆత్మ ద్వారా తిరిగి జన్మించిన అనుభవములేని వారు ధృడమైన విశ్వాసము లేక ప్రతివిషయమును గమనించుచుందురు. జాగరూకత లేని యెడల వారి బండారము బయటపడును.

ఈ బోధకు ఇక్కడ కొంత, అక్కడ కొంత అతుకుల బొంత చేసెదరు. వారు ప్రజలను మభ్యపెట్టి సువార్తను గురించిన అసలైన అర్థము యెరుగకయే బోధించెదరు.

‘‘ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రము వెంబడి సూత్రము, కొంత ఇచ్చట, కొంత అచ్చట చెప్పుచున్నాడు’’ (యెషయా 28:13).

వారు సూత్రము వెంబడి సూత్రము తెలిపెదరు. ‘‘పలానా మాటకు గ్రీకు పర్యాయ పదమిది, హీబ్రూ పర్యాయ పదమిది అని సెలవిచ్చెదరు, పలానా సిద్దాంతమునకు ఈ వాక్యము కలవదని తెలియజేసెదరు’’. నలుపు తెలుపులను నిక్కచ్చిగా తెలియపరచే రక్షణార్థమైన మూలసిద్దాంత విషయములలో జాగ్రత్తగా ఉండేందుకు ప్రజలను హెచ్చరించెదరు. వారు ‘‘మార్టిన్‌ లూథరు, జాన్‌ కాల్విన్‌, జాన్‌ నాక్సు ఈ విధంగా చెప్పారని తెలియజేస్తారు. మరి అట్టి బోధలు విన్న మనమునూ మన హృదయాలోచనలు, మార్గమును బట్టి మానవజ్ఞానము కలిగియున్నాము’’.

వారు మాట్లాడుతున్నదే దో, విశ్వసిస్తున్నదేదో గుర్తెరగాలి. నిజమైన విశ్వాసి తానెరిగిన సత్యాన్ని ఖచ్చితంగా తెలియజేస్తున్నాడు. ఈ తిరిగి జన్మించిన మరియు తిరిగి జన్మించని విషయాలను వాటి తేడాను తేటతెల్ల గా వివరించగలడు. మనమైతే ఈ నీటి ద్వారా మరియు ఆత్మ ద్వారా తిరిగి జన్మించు విషయాన్ని గురించి వివరముగా బోధించగలము.

ఈ అబద్ధబోధకులు ఎంతో అక్రమమైన లోక మార్గములో సంచరిస్తున్నారు. వారి విశ్వాసము గబ్బిలపు విశ్వాసమైయున్నది. అది పగటివేళలో చీకటిగల గుహలలో, బిలాలలో దాగియుంటుంది. కేవలం రాత్రిపూట మాత్రమే బయటి ప్రపంచాన్ని చూస్తుంది. ఈ బోధకులు కూడా ఈ ఇటువంటివారే. సత్యము గురించి వారెన్నడూ యెరుగురు. ఇట్టి బోధకుడు నరకానికి వెళ్లి తన అనుచరులకు కూడా అట్టి గతియే కల్పించును. ఈ అబద్ధ ప్రవచనాలను విశ్వసించి అనేకులు నరక పాత్రులగుచున్నారు.

మీ సంఘకాపరి నీటి ద్వారా మరియు ఆత్మ ద్వారా రక్షింపబడిన వ్యక్తియా? బైబిలులో తెలియపరచబడినట్లు మీ బోధకుడు విమోచనాత్మకమైన, తిరిగి జన్మింపచేయు, ఈ నీరు మరియు ఆత్మ సంబంధమైన సువార్తను బోధించుచున్నాడా? ఒకవేళ మీ సంఘములోని బోధకుడు ఈ విధమైన సత్యబోధచేస్తున్న యెడల మీరెంతో ఆశీర్వదింపబడిన వారన్నమాట. ఒకవేళ ఆ వ్యక్తి సత్యసువార్తను తెలియపరచనియెడల, మీరును తీర్పునకు లోనగుదురు. మీరింకనూ తిరిగి జన్మించిన అనుభవం లేనియెడల ఈ నీరు మరియు ఆత్మ సంబంధమైన సువార్త గురించిన సత్యమును వినియుండలేదన్నమాట. కనుక సత్యసువార్తను వినండి. దానిని గురించిన పుస్తకము కొనండి. దానిని గురించి తెలుసుకొనండి. మీరునూ రక్షింపబడి ఆశీర్వదింపబడండి.

ఇట్టి బోధకులు, నీరు మరియు ఆత్మ వలన తిరిగి జన్మించు సువార్తను బోధించుటకు ఇష్టపడరు. ‘‘యేసుక్రీస్తు మన పాపములు తొలగించుటకు అవతరించెననియు, ఆ కార్యమును చేసెననియు, గ్రహించవలెను’’. ఆయన ప్రతిదినము తమ పాపమును శుద్ధీకరింపవలెనని చెప్పుచున్నారు. ఈ విషయము సత్యమా? వారు మేము విమోచింపబడినామని చెప్పుచూ, నీతిమంతులమని ప్రకటిస్తూ అనుదినము పాపము చేయుచునేయున్నారు. వారు ఒక ఘడియలో పరిశుద్ధులు మరియు ఇంకొక ఘడియలో పాపులైయున్నారు.

వారిది అబద్ధ సిద్ధాంతము. ఇది అసత్యము. ఎవరును ఇప్పుడు నీతిమంతుడైయుండి, తరువాత పాపులుగా మార్చబడరు. వారు మతబేధము కలిగించువారు. మరియు అబద్ధ ప్రవక్తలైయున్నారు. ఎవరైతే తమను తాము శిక్షకు గురిచేసుకొనుచున్నారో లేక తమను తాము చెరుపుకొనుచున్నారో వారును అట్టివారే.ఈ మతబేధములు కలిగించు వారి అనుచరులును దేవుని శాపమునకు గురియగుదురు.


 • ఈ మత బేధములు కలిగించు వారి
 • బోధలు దేనిపై ఆధారపడియుండును?
 • వారి క్రియల పైననే


వీరు స్వార్ధము గలవారు. కనుక వారు తమ అనుచరులను ఈ నీరు మరియు ఆత్మ ద్వారా తిరిగి జన్మించు అనుభవములోనికి రానీయరు. తమ అనుచరులు వారివద్దకు వెళ్ళి, బోధకుడా తిరిగి జన్మించుటకు మేమేమి చేయవలెనని అడిగినప్పుడు, వారిని తికమకపెట్టి అభూతకల్పన ద్వారా మభ్యపెట్టెదరు. మరియు ఒకరు తిరిగి జన్మించుట అనునది వారు యెరుగకయే వారిలో జరుగునని చెప్పెదరు. ఇది చాలా సత్యదూరముకాదా?

యోహాను సువార్త 3వ అధ్యాయంలో 5వ వచనంలో ప్రభువైన యేసు ఈలాగు సెలవిచ్చెను. ‘‘ఒకడు నీటిమూలముగాను ఆత్మమూలముగాను జన్మించితేనేగాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను’’ అయితే ఈ దినాలలో తిరిగి జన్మించిన అనుభవము కల నీతిమంతులను ఇట్టివారు భిన్నమతావలంబీకులని వ్యాఖ్యానించుచున్నారు.

ఈ మత బేధము కలిగించు బోధకులు ఎంతో వినయము కలవారమని చెప్పుచూ, తమ వినయమును బట్టి ఈ వార్త బోధించు మేము నీతిమంతులముకామని తెలియజేయుచున్నారు. ఎక్కడైనా సభలు జరుగుతుంటే, అక్కడ దైవసేవకుడు తిరిగి జన్మించు విధానము గురించి ప్రసంగించగలడని తెలిసినప్పుడు తన అనుచరులను, సంఘ సభ్యులను ఆ ప్రసంగము వినకుండా ఆ ప్రదేశమునకు వెళ్లవద్దని శాసించెదరు. అట్టి ఆశీర్వాదము నుండి వారిని దూరపరచెదరు. ‘‘ఒకవేళ నీవట్టి అనుభవాన్ని పొందుకుంటే అది భిన్నమతావలంబనే. దాని ద్వారా నీవు సంఘము నుండి వెలివేయబడగలవని భయపెట్టుదురు. నీవు మాతో, మాలో ఉండాలంటే ఇంకనూ పాపిగానే జీవించమని చెప్పెదరు. తగిన సమయము వచ్చినప్పుడు దేవుడే నిన్ను పరిశుద్ధునిగా చేయునని తెలియజేసెదరు.’’ ఇదే వారిచ్చే హెచ్చరిక. వారి బోధలోని సారాంశమేమిటంటే నీవు తిరిగి జన్మించడమూ లేక జన్మించబడకుండా జీవించుటయూ, ఈవిషయం నీ వ్యక్తిగతమే ననునదియే.

ఈ బోధకులు తమను అనుసరించు వారితో ఇట్లనెదరు ‘‘మీరు మాతోనే వుండాలి. అయితే తిరిగి జన్మించే బాధ్యత మీదే. కనుక మీ ప్రయత్నం మీరు చేయండి. మీరు వున్నచోటే వుండండి. తగిన సమయము వచ్చినప్పుడు మీకు సత్యము తెలియబడును. ఆ తరువాత మీ జీవితము ఏలాగు మారునో మాకు తెలియదు. అయితే ఇది పారంపర్యసంఘము కనుకనే మీరు దీనిని వదిలి వెళ్ళవద్దు’’. ఇది సత్యమా? ఆలోచించండి.

ఈమత విబేధములు కలిగించు బోధకులు ఇక్కడ కొంచెము, అక్కడ కొంచెము తీసుకొని వాటిని తమ సిద్ధాంతములతో చేర్చి బోధించెదరు. అదే వారికి సత్యము ఈ నీరు మరియు ఆత్మను గురించిన దేవుని వాక్యములు వారికి అపరిచితములు.

ఇట్టి బోధకులు సత్యగ్రంథ విషయములో తాము అనుకున్న తాత్పర్యమే కలిగియుందురు. మనమయితే లిఖించబడిన లోగోస్‌ను విశ్వసించి సరైన తాత్పర్యము కలిగి యుందము. వీరైతే తమ స్వచిత్తమును బట్టి అర్థము చేసుకొందురు. అందువలననే క్రైస్తవ్యములో వివిధ వేదాంతము లు మరియు శాఖోపశాఖలు కలవు.

అనేక మతబేధములు కలిగించు శాఖాసంబంధమైన వేదాంతులు కలరు. కనుకనే వారిచే రచింపబడిన గ్రంథములు కోకొల్లలు. ఈ అబద్ద కాపరులు తాము బోధించుచున్నప్పుడు అనేక పుస్తకములోని విషయములు జోడించెదరు. నిజమైన యాజకులు బైబిలునే సంగ్రహముగా బోధించెదరు.

ఈ భిన్న సిద్ధాంత బోధకులు తమను అనుసరించు వారి నుండి అనేక రూపములలో మోసగించి ధనార్జన చేయుదురు. ఈ లోకములో విలాసవంతమైన జీవితము మరియు భోజన పానాదులు చేయుదురు. మరియు తిరిగి జన్మించు అనుభవము లేక చివరకు నరకమునకే చేరుదురు. ఇది దేవుడు వారికొరకై ఏర్పాటు చేసిన అంతము.

దేవుడు మొదటి దినములలో వారిని సహించును. అయితే వారు దైవవాక్యానుసారమైన ఈ నీరు మరియు ఆత్మ వలన తిరిగి జన్మింపజేయు సువార్తను చివరి వరకూ వ్యతిరేకించుచూ వచ్చుదురు. గనుక వారిని నరకమునకు పంపక తప్పని పరిస్థితి తెచ్చుకొందురు.

ఈ విభిన్నసిద్ధాంత వేత్తలకు దేవుడు తీర్పు తీర్చును. వీరు దేవునియందు తీవ్రత కలిగినవారై ప్రారంభదినాలలో పుంఖాను పుంఖములుగా వెలువడిన బైబిలు కామెంటరీలను, వేదాంత గ్రంథమును ధ్యానించెదరు. అయితే మెల్లమెల్లగా దివ్యపధమును వీడి మానవ విరచితజ్ఞానమును ఆధారము చేసుకొని బోధించెదరు. దాని ద్వారా తమను అనుసరించు భక్తులను కూడా తిరిగి జన్మించు అనుభవములోనికి రాకుండా అడ్డగించెదరు.

ఇట్టివారు తాము భూమిపైన చేసిన గొప్పకార్యాములయందు మనసుంచెదరు. ఈ నీరు మరియు ఆత్మ ద్వారా తిరిగి జన్మించు సువార్తను బోధించని, సేవకుడెవరైననూ సరే దేవుని దృష్టిలో అబద్ధ బోధకుడైయున్నాడు.

వారి అనుచరులపై ఈ బోధకులు విపరీతమైన ఒత్తిడి తెచ్చెదరు. 40 రోజుల సంపూర్ణ రాత్రి ప్రార్థన, 100 రోజుల ఉదయకాల ప్రార్థనలు, తరచుగా ఉపవాసము చేయుట, సంఘ భవనమునకు అధికమైన విరాళములిచ్చుట, వేయి అర్పణలు, సువార్త సభల నిమిత్తమై ప్రత్యేక కానుకలను సమర్పించుట వంటి కొలమానికతో విశ్వాసులను ఎంతో ఒత్తిడికి గురిచేయుదురు. అంతే కాకుండా ప్రతివిశ్వాసి చేసిన పనులు, సమర్పించిన కానుక పట్టీని తయారు చేయుదురు. కనుక వీరి క్రియా ఫలమును బట్టి వారి భిన్నమతావలంబనను గురించి తెలుసుకొనగలము.

వారిని అనుసరించు వారిపై కూడా దేవుని శాపమువచ్చును. ఈ తిరిగి జన్మించిన అనుభవము లేని సేవకులు మరియు వారి అనుచరులు కూడా దేవుని శాపమునకు గురికావలసినదే గదా.ఈ మతబేధములు కలుగజేయు నాయకులు తమ అనుచరుల మనస్సులను అధ్యాయనము చేసెదరు.


 • ఈ మత బేధములు కలుగజేయు
 • నాయకులు తమ అనుచరుల మనస్సులను
 • ఎందుకొరకై అధ్యయనము చేయుదురు?
 • వారు తిరిగి జన్మించిన అనుభవము లేక, హృదయములో
 • దైవదూషణ కలిగి, ఆత్మవలన 
 • నడిపించబడరు గనుక.


ఈ అబద్ధ బోధకులు ప్రతిదినము ఏడ్చుచునే యుందురు. తమ సంఘములో వున్న పెద్దను, పరిచర్య విభాగాధిపతులను, సామాన్యులను, విశ్వాసులను మొదలగు వారిని ఎల్లపుడూ ఒప్పించుచూ ఉండాలి. అన్ని విషయములలో వారిని మెప్పించగలగాలి. ఇది వారి ప్రతిదిన చర్యలో భాగము.

ప్రతిదినము వారి జీవితములో నటన కలిగి యుంటారు. ‘‘వారు పరిశుద్ధులు, దయాహృదయులుగా నటించెదరు.’’ వారు పాపముతో నిండియున్నను, పరిశుద్ధతను నటించెదరు. కనుక దినములు గడుచుచుండగా వారు మరింత నటన చేయవలసివచ్చును.

‘‘అంతరంగములో ఆత్మతో నింపబడకుండా సేవచేయుట ఒక శాపం’’ అని ఒక దైవసేవకుడన్నారు. అనగా విమోచింపబడకుండా సేవ చేస్తున్నామని చెబితే అది ఒక నటనే; ఇది ఒక శాపగ్రస్తమైన జీవితం. ఒకవేళ మీలో ఎవరైనా అటువంటి బోధకులుంటే నీరు మరియు ఆత్మ వలన తిరిగి జన్మింపవలసినదిగా హెచ్చరిస్తున్నాను.

ఎవరైనా సరే యేసు నందు విశ్వాసముంచి, తిరిగి జన్మించిన అనుభవము లేనివారైతే మతబేధములు కలిగించువారే. అంతేకాక అట్టివారు విమోచనాత్మకమైన తిరిగి జన్మించు అనుభవము దయచేయగలిగిన, ఈ నీరు మరియు ఆత్మ సంబంధమైన సువార్తను అంగీకరింపవలసి యుండును. ఈ విధంగా నీరు మరియు ఆత్మ ద్వారా తిరిగి జన్మించిన నీతిమంతులే సువార్త ప్రకటనకు అర్హులు.ఈ మతబేధములు కలుగజేయువారు సమాధానము కొరకై మరియు శాంతి కొరకై అంగలార్చెదరు.


 • ఈ మత బేధములు కలుగజేయు యాజకులు
 • తమను అనుసరించి నడచువారిని ఏవిధముగా
 • తృప్తి పరచగలరు?
 • వారు ఎల్లప్పుడు సమాధానముకై మరియు శాంతికొరకై
 • అంగలార్చెదరు. ఇంకను పాపులై యున్నను తమ అనుచరులు
 • పరలోక రాజ్యములో ప్రవేశింపగలరని బోధించెదరు.


యెషయా 28:14-15 వచనములో ఈ విధముగా చెప్పబడినది. ‘‘కాబట్టి యెరూషలేములోనున్న ఈ జనులను ఏలు అపహాసకులారా, యెహోవా వాక్యము వినుడి మేము మరణముతో నిబంధన చేసికొంటిమి మాయక్రింద దాగియున్నాము అని మీరు చెప్పుకొనుచున్నారే.’’

ఇక్కడ ఉదాహరింపబడిన ఈ తిరస్కరింపబడిన జనాంగము ఎవరు? తమ సొంత, తప్పుడు అభిప్రాయములతో దేవుని వాక్యమును కలిపి బోధించువారే. ఒకని సొంత జ్ఞానము ఎటువంటిదైనను, తాను చదివిన వేదాంతము తెలియజేసెడి దేమైనను, బోధకుడైన వాడు దైవ గ్రంథమునకు సరైన తాత్పర్యమునే బోధింపవలయును. అయితే ఈ అబద్ధబోధకులు, దైవ వాక్యమును తమ స్వచిత్తమునకు సరిపడిన విధానములో బోధించెదరు. వారు తిరస్కరింపబడిన వారు, శాపగ్రస్తులు అగుదురు.

‘‘మేము మరణముతో నిబంధన చేసుకొంటిమి, పాతళముతో ఏకమైతిమి. ఉపద్రవము ప్రవాహమువలె వడిగా దాటునప్పుడు అది మా యొద్దకు రాదు.’’

ఈ బోధకులు ఉపద్రవము వారి యొద్దకు రాదని చెప్పుదురు. భయపడవద్దని ప్రజలకు చెప్పుదురు. నాశనము మరియు నరకము వారి కొరకై ఎదురు చూచుచున్నది. అయినను వారు భయపడవద్దని చెప్పుకొనుచుందురు. నాశనము మరియు నరకము మన కొరకు కాదని ఓదార్చుకొనుచుందురు. అయితే మనము జీవము కలిగి నివశించవలయునన్న అటువంటి వారికి దూరముగా తొలగిపోవలెను.

మనము నీరు మరియు ఆత్మ ద్వారా తిరిగి జీవింపనవసరము లేదని వారు చెప్పుదురు. ఇది సత్యమా? కానేకాదు. మీరు నీటి ద్వారాను మరియు ఆత్మద్వారాను తిరిగి జన్మించని యెడల పరలోకరాజ్యములో ప్రవేశింపనేరరు.

పరలోక రాజ్యప్రవేశము ముఖ్యము కాదా? ముఖ్యమే నరకములో నిత్యాగ్నిలో కాలుట సమ్మతమా? ఈ ప్రశ్నకు సరియైన సమాధానము ‘‘కాదు’’ అనునదియే. మనమందరము ఈ నీరు మరియు ఆత్మ ద్వారా తిరిగి జన్మించి పరలోకములో చేరవలయును.

ఈ అబద్ధ బోధకులు ప్రజలను చెరుపుదురు. యేసునందు విశ్వాసముంచితే చాలు, ఏ పాపము చేసినా పరవాలేదు, పరలోక రాజ్యములో చేరగలమని అబద్దబోధ చేయుదురు.

ఒకవేళ నీవు ఇంకనూ పాపిగా జీవించిననూ యేసు నిన్ను చేరదీయునా? పాపి పరలోకములో చేరగలడా? నీవు పాపిగా జీవించిననూ నరకమునకు చేరవా? ఒకవేళ యేసునందు విశ్వాసముంచి పాపిగా జీవించిననూ నరకమునకు చేరవని బైబిలు ప్రవచించుచున్నదా?

ఇట్టి బోధకులు మేము మరణముతో నిబంధన చేసికొనియున్నాము గనుక మరణము మావద్దకు రాదందురు. కేవలం క్రీస్తును విశ్వసిస్తే చాలు, వీరు ఎంత పాపములో జీవించిననూ నరకములోనికి వెళ్లరు అన్న వింత బోధ చేయుదురు. ఇది నిజమా? ఈలాగు సంభవించునని నీవు విశ్వసిస్తున్నావా?

ఈ అబద్ధబోధకులు తమ విశ్వాసులతో ఎంతో ధృడముగా నొక్కివక్కాణించెదరు. నరకము, మరణము వారి యొద్దకు రాదని చెప్పెదరు. ఈ బోధకులు రక్షింపబడనివారిని సంఘపెద్దలుగా, నాయకులుగా, బోధకులుగా నియమించెదరు. నీరు మరియు ఆత్మ సంబంధమైన సువార్తయందు విశ్వాసముంచని వారందరూ నరకపాత్రులనునది వారు గుర్తెరుగవలసిన కనీస అవసరతయైఉన్నది. ముఖ్యముగా నీరు మరియు ఆత్మ ద్వారా తిరిగి జన్మించి, రక్షింపబడు సత్యసువార్త యందు విశ్వాసముంచవలెనని తమ అనుచరులకు వారు తెలియపరచిన ఎంతమేలు.

ఈ విశ్వాసులు, ఇంకనూ పాపము చేయుచున్ననూ నిత్యరాజ్యములోనికి ప్రవేశింపగలరా? ఒక పాపి పరమ సీయోను చేరగలడా? పాపులు పరలోక ప్రవేశము చేయుదురని బైబిలులో ఉన్నదా? లేనేలేదు. నీతిమంతుడు పాపము కలిగియుండునా? ఉండడు. ఇవే అబద్ధ వేదాంత బోధలు.

‘‘పాపమునకు జీతం మరణం’’ (రోమా6:23) అని బైబిలు తెలియపరచుచున్నది. ఇది దేవుని ఆజ్ఞయై యున్నది. పాపులను దేవుడు నరకములోనికి నెట్టివేయును. అయితే దేవుని నీతి ప్రకారం, ప్రభువైన యేసు పొందిన బాప్తిస్మము ద్వారా మన పాపములన్నియు ఆయనే వహించి, మనకు ప్రత్యామ్నాయముగా సిలువలో మన శిక్షను భరించి, మరణించి ఈ సువార్త యందు సంపూర్ణముగా విశ్వాసముంచి ఆత్మద్వారా తిరిగి జన్మించిన అనుభవముగలవారిని పరలోకరాజ్యములో చేర్చుకొనును.

‘‘ఉపద్రవము ప్రవాహమువలె వడిగా దాటునప్పుడు అది మాయొద్దకు రాదు. అబద్దమును మాకు ఆశ్రయముగా చేసికొంటిమి మాయక్రింద దాగియున్నాము’’. (యెషయా 28:15) ఈ అబద్దబోధకులు తాము పాపులమైనను హృదయములో పాపము కలిగి జీవించిననూ నరకమునకు పోమని తమను తాము వంచించుకొనుచున్నారు. వారు అబద్ధ వేదాంతమును అడ్డుపెట్టుకొని జీవించుచున్నారు. దేవుడు వారికెంత మాత్రము సహాయకునిగా ఉండలేడు. వారి సిద్ధాంతము నందు విశ్వాసము కలిగియే యుందురు. దేవుని వాక్యమును విశ్వసించరు. వీరు మత విబేధములు కలిగించుచూ పాపులై నరకపాత్రులగుదురు. వారి సంఖ్య అధికముగా యుండుట ఎంతో విచారకరము.వారు కేవలము ధనాపేక్ష కలిగియుందురు.


 • ఇట్టి విమతములు కలిగించు వారి
 • ముఖ్య ఉద్దేశ్యమేమై యున్నది?
 • తమ అనుచరుల నుండి సాధ్యమైనంత ధనము
 • రాబట్టవలెననునదియే వారి ముఖ్య ఉద్దేశ్యము.


ఈ అబద్ధబోధకులు, విమతములు కలిగించు వారు అధిక ధనాపేక్ష కలిగియుందురు. వారు పేరాశ కలిగినవారు. ‘‘ఈ వ్యక్తి నా సంఘమునకు వచ్చినట్లయితే నాకెంత రాబడి ఉంటుంది?’’అని ఆలోచిస్తారు. ఆ విశ్వాసి ఇచ్చు దశమ భాగముపైనే వారి కన్ను. ఇది ఒక బంగారు దూడను ఆరాధించుటతో సమానము. ‘‘దేవా నాకు అన్నిటిలో విజయం దయచేయి. నన్ను ఆర్థికంగా ఆశీర్వదించు’’ అని ప్రార్థించవలసినదిగా వారు విశ్వాసులకు నేర్పించెదరు.

‘‘వారు యేసునందు విశ్వాసముంచినట్లయితే మీకు ఆర్థికంగా అధిక ఆశీర్వాదాలు లభిస్తాయి. మీరు గొఱ్ఱెలయితే పిల్లలు కలుగుతారు. మీ వ్యాపారంలో అధికలాభాలు వస్తాయి’’ అని బోధిస్తారు.

ఈ అబద్ధ యాజకులు వలన అనేకులు మోసగింపబడ్డారు. వీరి ధనం కొల్లగొట్టబడినది. అంతే కాకుండా వారి తప్పిదాలను బట్టి నరకమునకు పాత్రులే. ఇది ఎంత విచారకరమైన విషయం! ఒక వేళ ఇటువంటి బోధకుల వలలో నుండి ఎవరైనా బయటపడి ఆలోచిస్తే, వారెంత ధనం ఈ మోసగాళ్ళవల్ల నష్టపోయినది వెల్లడగుతుంది. తాను ఏ విధముగా మోసగింపబడినది. వారి కొరకై ఎంత కష్టనష్టమును భరించినది వెల్లడగుతుంది. దానికి చింతిస్తారు కూడా!

ఈ విధముగా బోధించేవారు తాము నమ్మిన మత సిద్దాంతాల కొరకై ఎంతో తీవ్రంగా కష్టిస్తారు. వారి అనుచరులు, వారు చెప్పినట్లుగా వారికి అంకితమగుతారు. ఉదయకాల ప్రార్థనలు, ప్రార్థనా పర్వత సందర్శనలు, ప్రత్యేక కానుకలు, దశమభాగాలు, వారాంతపు కానుకలు, మొదలగు వాటి ద్వారా వారి సభ్యుల నుండి విపరీతమైన ధనం కొల్లగొట్టబడుతుంది. 

వారి అనుచర బృందం విశేషంగా వారికొరకై కష్టపడతారు. అయినప్పటికీ వారి హృదయాలలో ఇంకను పాపం నిలచియుంటుంది. వారికి ఈ నీరు మరియు ఆత్మ ద్వారా సిద్దించు నూతన జన్మను గురించిన సత్యం ఎవ్వరూ బోధించరు. ఒకవేళ ఏ విశ్వాసి అయినా తమ బోధకులను ఈ సంపూర్ణ విమోచన గురించి ప్రశ్నిస్తే వారికి సరైన సమాధానం ఇవ్వరు. ఈ నీరు మరియు ఆత్మ ద్వారా తిరిగి జన్మించని ప్రతివారు భిన్నమతావలంబీకులే.ఈ మత బేధము కలిగించువారు మరియు వారిని అనుసరించువారు కూడా మనము జాలిపడదగినవారే.


 • ఈ లోకములో మనము జాలి
 • చూపదగిన వారిలో అధికులెవ్వరు?
 • నీరు మరియు ఆత్మ ద్వారా తిరిగి జన్మించిన
 • అనుభవము లేకున్నా సేవ చేయువారే.


‘‘అయ్యో! జాలిపడదగిన మతబేధము కలిగించువారలారా? మీ విమోచన నిమిత్తమై మీరు పాటుపడండి.’’ యరోబాము సృష్టించిన బంగారు దూడ ఆరాధన లాంటి ఆరాధనయందు విశ్వాసముంచుటయే ఈ అబద్ధమతావలంబనకు మూలమైయున్నది. పాత నిబంధనకాలములో ఈ మతబేధము కలిగించు వారు చేసిన మొదటి పని ఒక దేవాలయము నిర్మించి, అందులో బంగారు దూడను ప్రతిష్టించి, ఆరాధించుటయే! (1రాజు 12:25-33)

ఈ రోజులలో కూడా పెద్ద పెద్ద సంఘభవనాలు నిర్మించి తమను అనుసరించు వారి నుండి అధిక మొత్తములో వారు ధనమును రాబట్టుచున్నారు. బ్యాంకు నుండి సొంతపూచికత్తు మీద అప్పు తీసికొని కూడా ఆ ధనమును ఆలయ నిమిత్తం దానము చేయవలసినదిగా తమ సభ్యులకు ఆదేశించుచున్నారు. తమ సంఘ సభ్యులు మానసిక ఉద్రేకాలను రెచ్చగొట్టి అప్పుడు కానుక సంచులను వారి యొద్దకు పంపుట వారికి ఆనవాయితి. డబ్బు, బంగారు ఉంగరాలు, బంగారు గడియారాలతో ఆ కానుక సంచులు నిండిపోతాయి. ఈ బోధకుల పద్ధతి ఇదియే. ఈ విధమైన బోధకుల సంఘాలన్నిటిలో జరిగే తంతు ఇట్టిదే.

వారి బాహ్య ప్రవర్తన పరిశీలిస్తే ఆధ్యాత్మికంగా ఎంతో ఉన్నత భావాలు గలవారి వలె ప్రవర్తిస్తారు. అయితే నిజనిజాలను మనము పరిశీలిస్తే వారి గమ్యం కేవలం ధనార్జనే. కేవలం డబ్బు, డబ్బు అని నిరంతరం మారు మ్రోగే సంఘాలకు దూరంగా ఉండవలసినదని అభ్యర్ధన. కేవలం ధనికులు మాత్రమే మర్యాదగా చూడబడే సంఘాలకు వెళ్లకండి. ప్రతి ఆరాధనలోను ఎంతవసూలయ్యిందో బాహ్యంగా తెలియపరచడం మంచి ఆనవాయితీ కాదు. ఈ విధంగా చేయడం ద్వారా మరుసటి ఆరాధనలో ఇంకా చాలా ఇవ్వబడాలనే ధనాకాంక్ష వెల్లడవుతుంది.

తమ అనుచరులకు ఆకర్షణీయమైన విషయాలు చెబుతారీ బోధకులు. ‘‘మీరు యేసునందు కేవలం విశ్వాసం ఉంచగనే ఆశీర్వదింపబడతారు.’’ ‘‘దేవుని పనుల నిమిత్తమై అంకితం కండి, సంఘ నిమిత్తం మీరెంత కృషి చేస్తే అంతగా మీరు ఆశీర్వదింపబడతారు.’’

మీరు సంఘ పెద్దగా పనిచేస్తే ఆర్థికంగా కూడా ఆశీర్వదింపబడతారు. దీని ఫలితంగా సంఘంలో అనేకులు పెద్దలుగా ఎన్నిక అగుటకు పోటీపడతారు. ఆ విధమైన ఆశీర్వాదం అనే ఆకర్షణ లేకపోతే ఈ ఉన్నత పదవులకై ఎందుకు అధికులు పోటీపడతారు? పెద్దగా ఎన్నుకోబడిన వ్యక్తి ఆర్థికంగా కూడా సంఘానికి చేయూతనివ్వాలి.

వారు ఆ మత శాఖ కొరకై ఎంతగా కృషిచేశారన్న విషయంపైనో. లేక సమాజంలో వారికున్న గొప్పస్థానంపైనో లేక సంఘానికి వారు చేసిన ఆర్థిక సహాయంపైనో ఈ ఎన్నిక ఆధారపడి ఉంటుంది అన్నది ఎంతో నిజం.

ఈ బోధకులు కేవలం తమ భోజన విలాసాల నిమిత్తమే కృషిచేస్తారు. వారు అనుచరులకు విచిత్రమైన బిరుదులిచ్చి సన్మానిస్తారు. వారి అనుచరులకు అనేక బిరుదులు ప్రధానం చేస్తారు. (యెహెజ్కేలు 13:17-19) దాని ద్వారా వారిని సంఘములోకట్టి వేసి, సంఘవనరులను పెంచాలన్నదే ఈ బోధకుల ఆశయం. ఈ బోధకులు నీరు మరియు ఆత్మ వలననైన సత్యసువార్తను ప్రకటించరు. వారి ఆర్థిక వనరుల పంపే ఏకైక ఆశయం.

కేవలం కొద్దినెలలు మాత్రమే ఆ సంఘానికి వచ్చిన వారు కుడా ‘‘డీకన్లు’’గా ఎన్నిక చేయబడతారు. వారు కాలక్రమేణా సంఘ సిద్ధాంతముల యందు ప్రావీణ్యత కలిగి, ఆర్థికంగా ఉన్నతస్థాయిలో ఉంటే ‘‘సంఘపెద్దలు’’గా ఎన్నిక చేయబడతారు. ఇదంతా యరోబాము నెలకొల్పిన జుగుప్సాకరమైన విధానం. దేవుని స్థానాన్ని బంగారు దూడతో భర్తీ చేయడం లాంటిదే ఈ తతంగం కూడా.

ఈ అబద్ధ బోధకులు కేవలం బంగారుదూడను ఆరాధిస్తారు. తమ ప్రజలకు తిరిగి జన్మించే అవకాశాన్ని ఇవ్వరు. లౌకిక పరమైన ఆశీర్వాదాలను వాగ్ధానం చేసి తమ సభ్యులను ఆకర్షిస్తారు. తమను అనుసరించేవారు తమకు వ్యతిరేకంగా తామే తీర్పు తీర్చుకున్నను వారికి అది పట్టదు. వారి సంఘం ఉన్నతమైన ఆర్థిక స్థితికి చేరు ప్రయాసలో ఎంతమంది నరకాగ్నికి అహుతి అయినా వారికది పెద్ద విశేషం కానేకాదు.ఈ బోధకులు తమ ప్రసంగాలలో ధృడవిశ్వాసము కలిగియుండరు.


ఈ అబద్ధబోధకులు ‘‘అవ్వవచ్చును’’, ‘‘ఒకవేళ’’ అన్న పదప్రయోగం ఎక్కువగా చేస్తారు. వారు చెప్పే మాటలో వారికి విశ్వాసం లేదు గనుకనే వారీ విధంగా మాట్లడతారు. వారికి దేవుని వాక్యములో విశ్వాసం ఉండదు. వారు చెప్పే విషయాలలో వారికే నమ్మికయుండదు. వారి విశ్వాస విధానం దేవుని వాక్యానికి అనుగుణంగా ఉండనే వుండదు. ‘‘ఈ విధంగా చెప్పవచ్చు......’’ అని అంటుంటారు.

వారు దృఢమైన విశ్వాసముతో, స్పష్టంగా ఏ విషయం వక్కాణించారు. వారిని అనుసరించు సంఘస్తులకు వారు అబద్ధ విషయములకు బదులుగా అసలు ఏమి బోధించకపోయిననూ మంచిదే.

ఈ బోధకులు తమ విశ్వాసులను నీటి ద్వారా మరియు ఆత్మ ద్వారా తిరిగి జన్మింపచేయు సత్యసువార్త వైపునకు నడిపించనే నడిపించరు. వారు ప్రజలను నరకాగ్నివైపు నడిపిస్తారు.మత బేధములు కలిగించు ఈ బోధకులు అబద్ధ ప్రవక్తలైయున్నారు.


 • పరిశుద్ధాత్మకు వ్యతిరేకముగా
 • దైవనిందకు పాల్పడునదేమి?
 • యేసుపొందిన బాప్తిస్మము నందు అవగాహన,
 • విశ్వాసము లేక కేవలము యేసునందు విశ్వాసముంచి
 • ఇంకను పాపజీవితము గడుపుటయే.


యేసు నందు విశ్వాసముంచినను, నరకమునకు చేరువారి గురించి మత్తయి సువార్త 7వ అధ్యాయములో విపులముగా తెలియపరచబడినది. ఈ మతబేధము కలిగించు వారు తీర్పుదినమున దేవుని యెదుట ఈ విధముగా ప్రశ్నింతురు. ఇది బైబిలులో వ్రాయబడే యున్నది. ‘‘ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములు వెళ్ళగొట్టలేదా? నా నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా? అని చెప్పుదురు. అప్పుడు ` నేను మిమ్మును ఎన్నడును ఎరుగను, అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదు ను.” (మత్తయి 7:22-23)

యేసుక్రీస్తు సకల మానవుల పాపములను సంపూర్ణముగా తొలగించెనని వారు నమ్మరు; ఈ నీరు మరియు ఆత్మ సంబంధమైన సువార్తను అసలు విశ్వసించరు.

వారు అక్రమము చేయుదురు. అనగా ఏమి ? అనగా మీ హృదయములలో పాపచింతన కలిగియున్నను కేవలము యేసునందు విశ్వాసముంచుడి, అని చెప్పుదురు. ఇందులో తప్పేమని మీరు ఆశ్చర్యపడవచ్చు. కానీ దేవుని యెదుట ఇది పాపమై యున్నది.

ఒక పాపి ఇంకనూ పాపములోనే నిలచియుండి, ఇతరులకు యేసును విశ్వసించవలెనని చెప్పుట ఎంత హాస్యాస్పదము. వారిని తిరిగి జన్మించు అనుభవములోనికి నడిపింపలేడు కదా? ఎందుకంటే తానే తిరిగి జన్మించు అనుభవములోనికి నడిపించు, నీరు మరియు ఆత్మ సంబంధమైన సువార్త యందు విశ్వసించలేదు గనుక ఇట్టి బోధకులు కేవలము పాపులను ఉత్పత్తి చేయుదురు, వారికి యేసుపై విశ్వాసముంచుడని చెప్పెదరు. ఈవిధమైన ఆత్మనింద అక్రమము గదా.

ఈ విమతబోధకులు సువార్త యందు విశ్వాసముంచరు మరియు లిఖింపబడిన సువార్తను బోధించరు. తమ అనుచరులను వక్రమార్గమున నడిపించి ధనార్జన చేయుదురు. వారు ఒకవేళ యేసునందు విశ్వాసముంచిననూ ఇంకనూ పాపులే. వారు తిరిగి జన్మించిన అనుభవము లేకున్ననూ ఇతరులకు మార్గదర్శకులగుదురు. ఈ విధముగా వారు ఆక్రమము చేయుచున్నారు.ఈ బోధకులు నీతిమంతులను అనుకరణ చేయుదురు.


 • తిరిగి జన్మించిన అనుభవము కలిగిన
 • వారికిని తిరిగి జన్మించనివారికిని బేధము
 • మనమేలాగు కనిపెట్టగలము?
 • వారు పాపము కలిగి యున్నారో లేదో
 • అని పరీక్షించి తెలుసుకొనగలము.

మేము పాపులముకాదని చెప్పుకొను అబద్ధ బోధకుల వలన మోసగింపబడవద్దు వారికి మీ ధనమును ఇవ్వవద్దు. మీరు కష్టించిన సంపాదించినది ఆ పాపులకివ్వవద్దు.

మీ పాపములను మీ నుంచి తప్పించలేని ఆ బోధకులకు మీరు ఎందుకు ధనసహాయము చేయవలెను? మీరు ఒకవేళ సంఘమునకు కానుక సమర్పించవలెనన్న భావన కలిగియున్నట్లయితే, ఈ నీరు మరియు ఆత్మ యందు విశ్వసించి, మీ పాపములన్నియు తోలిగిపోయిన తదుపరి చెల్లించవచ్చును.

కళలలో (చిత్రపటములో, శిల్పములలో) అనుకరణలున్నట్లే, అనేకుల జీవిత విధానాలలో కూడా అనుకరణలుంటాయి. ఉదాహరణకు మీ హృదయములోనున్న పాపములను తొలగించలేని అనుకరణమతములే. ఒక అనుకరణ సంఘమునెట్లు గుర్తించగలరు? అనుకరణ అనగా బాహ్యముగా పోలిక కలిగియుండును. కానీ అంతర్గతముగా పరిశీలించిన అందు సత్యము కానరాదు.

నీకు నీవే ఈ నిర్ణయమునకు రావలసియున్నది. ఎవరు నిజమైన బోధకులు? ఎవరు మత బేధము కలిగించు అబద్ధబోధకులు? పారంపర్య విశ్వాసమనగా నేమి? సత్యక్రైస్తవులు యేసునందు, ఆయన విమోచనాత్మక శక్తి యందు నిజమైన విశ్వాసము కలిగియున్నవారు. వారి హృదయములలో పాపం కలిగి యుండరు. అయితే ఈ మత బేధములు కలిగించు బోధకులు హృదయములో పాపము లక్ష్యపెట్టువారై యున్నారు.

అయితే అందరూ ఈలాటివారేనా? అయి ఉండవచ్చు అనిపిస్తుంది. బైబిలులోకి ఒకసారి తొంగిచూద్దాం. ఎవరైనా సరే యేసుక్రీస్తునందు కేవలం విశ్వాసము కలిగి తిరిగి అనుభవము లేనివాడు మత బేధము కలిగించు అబద్ధ క్రైస్తవుడే. తిరిగి జన్మించిన అనుభవముకలిగిన వారే నిజ క్రైస్తవులు. కనుక తిరిగి జన్మించిన అనుభవములేని వారు మత బేధము కలిగించువారే. వారు యేసునందు విశ్వసించినను హృదయములో పాపము లక్ష్య పెట్టువారే.

ఈ అబద్ధ బోధకులు నీతిమంతులను అనుకరణచేయుదురు. పరిశుద్ధపరచ బడవలయునంటే ప్రభువైన యేసునందు విశ్వాసముంచవలయునని యెరుగుదురు. కానీ దురదృష్టమేమంటే వారింకనూ హృదయములో పాపముకలిగి యుందురు. వారింకను పాపులుగానే పరిగణించుకుంటారు. అయిననూ మేము పరలోకము చేరగ లమని విశ్వసించె దరు. మేము దేవుని ఆరాధించుచున్నామని చెప్పుదురు. వారు నీతిమంతులమని మాట్లాడెదరు. అయితే ఈ అనుకరణల వలన మనము మోసపోరాదు.దేవుని తీర్పు వీరికై ఎదురుచూచుచున్నది


 • ఎందువలన అసలైన సువార్త
 • మార్చబడినది?
 • ఈ అబద్ధబోధకులు, మతబేధము కలిగించువారు
 • ప్రజలకున్న అబద్ధ విశ్వాసమును సత్యసువార్తతో
 • కలిపి బోధించుటవలననే.


‘‘కావున ప్రభువును ఇశ్రాయేలు యొక్క బలిష్ఠుడును సైన్యములకధిపతియునగు యెహోవా ఈలాగున అనుకొనుచున్నాడు ఆహా, నా శత్రువునుగూర్చి నేనికను ఆయాసపడను నా విరోధులమీద నేను పగ తీర్చుకొందును. నా హస్తము నీమీద పెట్టి క్షారము వేసి నీ మష్ఠును నిర్మలము చేసి నీలో కలిపిన తగరమంతయు తీసివేసెదను. మొదటనుండినట్లు నీకు న్యాయాధిపతులను మరల ఇచ్చెదను, ఆదిలో నుండినట్లు నీకు ఆలోచనకర్త లను మరల నియమించెదను. అప్పుడు నీతి గల పట్టణమనియు నమ్మకమైన నగరమనియు నీకు పేరు పెట్టబడును. సీయోనుకు న్యాయము చేతను తిరిగి వచ్చిన దాని నివాసులకు నీతిచేతను విమోచనము కలుగును. అతిక్రమము చేయువారును పాపులను నిశ్శేషముగా నాశనమగుదురు. యెహోవాను విసర్జించువారు లయమగుదురు. మీరు ఇచ్ఛయించిన మస్తికివృక్షమునుగూర్చి వారు సిగ్గుపడుదురు. మీకు సంతోషకరములైన తోట లనుగూర్చి మీ ముఖములు ఎఱ్ఱబారును మీరు ఆకులు వాడు మస్తికవృక్షమువలెను, నీరులేని తోటవలెను అగుదురు. బలవంతులు నారపీచువలె నుందురు, వారి పని అగ్నికణమువలె నుండును. ఆర్పువాడెవడును లేక వారును వారి పనియు బొత్తిగా కాలిపోవును’’. (యెషయా 1:24-31)

మానవులయందు నమ్మికయుంచిన మనము వారి వలన సిగ్గుపడవలసివచ్చునని దేవుడు సెలవిచ్చుచున్నాడు. మనము ఏర్పరచుకొనిన సంఘమును బట్టి, సహవాసమును బట్టి కూడా సిగ్గుపడవలసిన పరిస్థితి దాపురించునని దేవుడు తెలుపుతున్నాడు. నీరు లేని తోటలో పెరుగు వృక్షము ఆకు రాలినటువంటి సిగ్గుకరమైన పరిస్థితి సంభవించును.

అబద్ధ బోధకులు, వారిని అనుసరించువారు దేవుని వాక్యముననుసరింపక మానవజ్ఞానంతో నడిపింపబడుతూ నారపీచువలె మరియు కణకణమండు అగ్నికణము వలె అగుదురు. ఇరువురును నరకాగ్నికి లోనగుదురు. అబద్ధబోధకులు, విమతములు కలిగించువారు, సంపూర్ణ విమోచన స్వీకరించని పాపులు మరియు నీతిమంతుల విరోధులు దేవుని యొక్క అగ్నివలన తీర్పు పొందుదురు.

కేవలం వేదాంత జ్ఞానపు పునాదులపైన నిర్మించబడిన గొప్ప భవన సముదాయములు కల సంఘము, అంతర్భాగములో శూన్యతతో నిండియుండును. దేవుని వాక్యపునాదిపైన నిర్మింపబడని సంఘము ఈ నీరు మరియు ఆత్మవలననైన తిరిగి జన్మించు అనుభవము ప్రకటించని సంఘములన్నియు నీరు లేని తోటవలె అగును.

ఫలభరితముగాని వృక్షము మృతమైన దానితో సమానము. ఒక బావిలో నీరు ఊరని యెడల అది బావి ఏలాగవును?

‘‘బలవంతులు నారపీచువలె నుందురు, వారి పని అగ్నికణమువలె నుండును. ఆర్పువాడెవడును లేక వారును వారి పనియు బొత్తిగా కాలిపోవును.’’ (యెషయా 1:31) ఆత్మలేని వారు ఇతరులకు బలవంతులవలె కనిపించెదరు. అయితే దేవుని దృష్టిలో వారు నరకాగ్నికి ఆహుతి అగువారివలె యుందురు.

‘‘కావలివాడా రాత్రి యెంత వేళైనది’’ (యెషయా 21:11) అని దేవుడడుగును. చీకటి రాత్రులలో, అంధకార దినములలో నీతిమంతులుగా తీర్పుపొందినవారీ ‘నీరు మరియు ఆత్మ సంబంధమైన సువార్తను’ బోధింపవలెను.

దేవుడు వెలుగైయున్నాడు. అపవాది చీకటైయున్నాడు. దేవుడు ప్రజలను నీతిమంతత్వము దిశగా నడిపించును. అపవాది మానవుని అబద్ధపు దేవాలయముకు, అసంపూర్ణ వేదాంతము దిశగా మరియు అస్తవ్యస్థ పరిస్థితులలోనికి నడిపించును.

ప్రవక్తయైన యెషయా జీవించిన రోజులలో కూడా ప్రజల మానసిక స్థితిగతులు, పరిస్థితులు ఈ రోజువలెనే యుండెను. దేవుని వాక్యమును అసంపూర్ణవేదాంతముతోను, మానవజ్ఞానముతోను కలిపి బోధించుచున్నారు. ఇశ్రాయేలు ప్రజలను మానవ సంబంధమైన అక్రమ విషయమువైపుకు నడిపించగా దేవుడు వారిని విసర్జించెను.

‘‘నా హస్తము నీ మీద పెట్టి క్షారము వేసి నీ మష్ఠును నిర్మలము చేసి నీలో కలిపిన తగరమంతయు తీసివేసెదను. మొదట నుండినట్లు నీకు న్యాయాధిపతులను మరల ఇచ్చెదను. ఆదిలో నుండినట్లు నీకు ఆలోచనకర్తలను మరల నియమించెదను. అప్పుడు నీతిగల పట్టణమనియు నమ్మకమైన నగరమనియు నీకు పేరు పెట్టబడును’’ (యెషయా 1:25-26). దేవుని వాక్య సత్యము మరియు మానవ జ్ఞానము మరియు వేదాంతముతో సమ్మిళితమైన వారి అర్పణలు తగరమువలె మరియు మష్టువలె ఉండి దేవునికి అంగీకారయోగ్యము కావు.

మిళితమైన అర్పణలు దేవుడంగీకరించడు. మానవ దృష్టికి అవి పరిశుద్ధముగా కనిపించినను, అవి మానవ జ్ఞానముతో కలగలిసి, అ పరిశుద్ధమైన తలంపుతో నిండియుండును గనుక అవి దేవునికి అంగీకారముకాదు.

దేవుడు ఇశ్రాయేలు ప్రజలను, అబద్ధబోధకులను, ప్రత్యేకముగా మతబేధము కలిగించువారిని, పాపులను గద్దించెను.

మనము నిర్గమకాండము మరియు సంఖ్యాకాండము పరిశీలించిన దేవుడు ఆదిలో వారిని ఏ మాత్రము మందలించలేదు. దేవుడు ఇశ్రాయేలీయులకు సహాయకుడైయుండి, వీరిపై దీవెన కురిపించాడు. అయితే యెహోషువా మరణానంతరం, న్యాయాధిపతుల గ్రంథమునుండి పరిశీలించినచో ఇశ్రాయేలు అన్యరాజుల వలన ఆక్రమించబడుట చూడగలము.

అయినప్పటికీ వారు తమ సొంత మార్గములలోనే ప్రయాణించిరి. ఆ సమయములో దేవుడు ప్రవక్త అయిన యిర్మియాను పంపి బాబిలోను వారికి లొంగిపొమ్మని ఇశ్రాయేలుకు తెలియపరచెను.

యిర్మియా ఇశ్రాయేలీయులను బాబిలోను వారికి లొంగిపోవలసినదిగా తెలిపెను. ఇందులో ఒక ఆధ్యాత్మిక భావమున్నది. దీని భావమేమనగా నీతిమంతులు ఈ విమతములు కలిగించు వారికి నీరు మరియు ఆత్మ వలనైన సువార్తకు లోబడవలసినదిగా హెచ్చరించుటకిది సమానము.దేవుడు ఈ విమతములు కలిగించు వారిని నిరాకరించును


 • దేవుడు ఎందునిమిత్తమై ఈ విమతములు
 • కలిగించువారిని నిరాకరించుచున్నాడు?
 • ఎందువలననగా వారు సేవించునది
 • విగ్రహములనే కానీ దేవుని కాదు గనుక.

దేవుని సేవకులు ఎందువలన ఇశ్రాయేలు ప్రజలను గద్దించవలసివచ్చెను? వారు బలి అర్పణా విధానమును మార్చిరి. సామాన్య మానవులను ఉన్నతమైన యాజకస్థానములో నియమించితిరి, బల్యర్పణ దినమును మార్చియున్నారు. కనుకనే దేవుడీ విధముగా గద్దించెను.

వారు 10వ నెల 7వ రోజున ఆచరించవలసిన పాపపరిహార దినమును 8వ నెల 5వ రోజునకు మార్చితిరి. లేవీయులు కాని వారిని యాజకులుగా నియమించిరి. తద్వారా తిరిగి జన్మించు మార్గమును ఆటంకపరచి యున్నారు. కనుకనే దేవుడీ అబద్ద బోధకులను గద్దించెను. దేవుని కాక వారు బంగారు దూడను సేవించుటను బట్టి వారు మత బేధములు కలిగించు యాజకులైతిరి.

సత్యమేమంటే కేవలము విగ్రహమును ఆరాధించుటను బట్టియే వారిని మందలించలేదు. నీవు నేను కూడా అనేకసార్లు దేవునికి చెందవలసిన ప్రథమ స్థానమును మనహృదయములో ప్రముఖస్థానము వహించు విగ్రహారాధనకు సమానమైన అనేక విషయాలకు ఇస్తాముకదా? మనము అనేకసార్లు పాపమునకు లోనవుతాము. అయితే ఈ మన దోషమును దేవుడు గొప్ప పాపముగా యెంచడు. ఎందుకనగా అది మనయెడల దేవుని కృప అయివున్నది. అయితే దేవుని సంపూర్ణముగా నిరాకరించి, ఆయన స్థానములో బంగారు దూడను ప్రతిష్టించుటకు దేవుడు సమ్మతించడు, క్షమించడు. అదే విధముగా బల్యర్పణ విధానమును మార్చుటకును, లేవీయులు కానీ సామాన్యుని యాజకస్థానములో నియమించు దోషమును దేవుడు క్షమించలేదు.

ఇవి ఎంతటి భయంకరమైన పాపము! ఇవి ఘోరమైన పాపములు. దేవుని స్థానములో బంగారుదూడను ప్రతిష్టించు పాపమేలాగు క్షమింపబడును! బైబిలులో లిఖించబడిన ప్రకారము యరోబాము చేసిన పాపము వలన దేవుని ఉగ్రతవారిపై వచ్చినది.

పాతనిబంధన కాలములో దేవుడు తన ఉగ్రతను చూపినట్లుగా ఇప్పుడు కూడా తనను వ్యతిరేకించిన పాపులను నాశనము చేయును. బంగారు దూడను ఆరాధించుట మానుకొనని యెడల, ఇశ్రాయేలీయులను శపించెదనని దేవుడు సెలవిచ్చెను.ధర్మశాస్త్రమునకు విరుద్ధముగా ఈ మత బేధములు కలిగించువారు బల్యర్పణలు చెల్లించెదరు.


 • దేవుని సేవకు ప్రతిష్టింపబడుటకు
 • ముందుగా మనమేమి చేయవలెను?
 • మన పాపములన్నియు పరిహరింపబడినవా
 • అని పరీక్షించుకొనవలెను.


ఇశ్రాయేలు రాజులు మరియు వారిచే నియమింపబడిన యాజకులు దేవునికి విరుద్ధముగా నిలిచిరి. దేవుడేర్పరచిన బల్యర్పణ విధానమును నిర్లక్ష్యము చేసిన వారిని యాజక ధర్మమునకు నియమించిరి. రాజైన యరోబాము లేవీయులు కానివారిని, యాజకస్థానమునకు నియమించెను.

లేవీ వంశస్థులు మాత్రమే యాజక స్థానముకు నియోగింపబడి ప్రత్యక్షగుడారములోకి ప్రవేశించవలయును. అహరోను వంశస్థులే ప్రధాన యాజకులుగా నియమింపబడవలెను. ఇది దేవుడు ఇశ్రాయేలీయులకిచ్చిన నిత్య కట్టడ. అయితే యరోబాము లేవీ వంశస్థులు కానివారిని యాజకులుగా నియమించి, బంగారు దూడకు బల్యర్పణ చేయ నియమించెను. దీని వలన దేవునిఉగ్రత వారిపై ఏలాగు వచ్చెనో మనమ గ్రహించవలెను.

అయితే ఈ దినాలలో కూడా అనేకులు తిరిగి జన్మించిన అనుభవము లేకుండగనే కాపరులుగాను, డీకన్లుగాను, పెద్దలుగాను నేటి సంఘములలో నియమింపబడుచున్నారు. ఇదియు దేవుని కట్టడకు విరుద్దమైనదే, ఇదియు దేవుని ఉగ్రతను తెచ్చును. ధర్మశాస్త్ర విరుద్ధమైన బల్యర్పణ వలన దేవుడు సంతోషించునా? ఈ మత బేధము కలిగించువారు బంగారు దూడలను నాశనముచేసి, దేవుని వైపునకు మరలి, తిరిగి జన్మించిన అనుభవము పొందవలెను.

‘‘సొదొమ న్యాయాధిపతులారా, యెహోవామాట ఆలకించుడి. గొమొఱ్ఱా జనులారా, మన దేవుని ఉపదేశమునకు చెవి యొగ్గుడి. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే ` విస్తారమైన మీ బలులు నాకేల? దహన బలులగు పొట్టేళ్లును బాగుగా మేపిన దూడల క్రొవ్వును నాకు వెక్కసమాయెను. కోడె రక్తమందైనను గొఱ్ఱెపిల్ల రక్తమందైనను మేకపోతుల రక్తమందైనను నాకిష్టము లేదు. నా సన్నిధిని కనబడవలెనని మీరు వచ్చుచున్నారే నా ఆవరణమును త్రొక్కుటకు మిమ్మును రమ్మన్నవాడెవడు? మీ నైవేద్యము వ్యర్థము అది నాకు అసహ్యము పుట్టించు ధూపార్పణము దానినికను తేకుడి అమావాస్యయు విశ్రాంతి దినమును సమాజకూట ప్రకటనమును జరుగుచున్నవి. పాపులగుంపుకూడిన ఉత్సవ సమాజమును నే నోర్చజాలను. మీ అమావాస్య ఉత్సవములను నియామక కాలమును నాకు హేయము. అవి నాకు బాధాకరము వాటిని సహింపలేక విసికియున్నాను. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మును చూడ నా కన్నులు కప్పుకొందును మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను మీ చేతులు రక్తముతో నిండియున్నవి. మిమ్మును కడుగుకొనుడి శుద్ధి చేసికొనుడి. మీ దుష్క్రియ నాకు కనబడకుండ వాటిని తొలగింపుడి. కీడుచేయుట మానుడి మేలు చేయుట నేర్చుకొనుడి. న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసించబడువానిని విడిపించుడి. తండ్రిలేనివానికి న్యాయము తీర్చుడి విధవరాలి పక్షముగా వాదించుడి’’ (యెషయా 1:10-17)

ఈ అధ్యాయమును మనము జాగ్రత్తగా పరిశీలించిన యెడల, ఇశ్రాయేలులో వున్న మతనాయకులు ఎంత తీవ్రత గలవారో అర్ధమగుచున్నది. అయితే వారు ఎంత అంకితభావము కలిగియున్నను, వారు దేవుని ధర్మశాస్త్రమునకు విరుద్ధమైన విధముగా అంగీకరింపబడని బల్యర్పణ సమర్పించి నాశనమునకు పాత్రులైతిరి.

మనము పరిశీలించిన యెడల ఇశ్రాయేలీయులు దేవుని ధర్మశాస్త్రమును అనుసరించలేకపోగా దేవుని వాక్యమును కూడా తిరస్కరించుట గమనించగలము. ఈ నాయకులు ఎంతో అంకితభావముతో విశేషమైన బలులర్పించిరి. ఆ బల్యర్పణ వలన రక్తము ఒకనదివలె ప్రత్యక్షగుడారములో ప్రవహించెనని మనము బైబిలు గ్రంథములో చూడగలము.

అయితే దేవుడు వారు చేసినదంతయు చూచినప్పుడు గొమొఱ్ఱా వారి పాపమువలె కనిపించెను. దేవునికి వారు బల్యర్పణలు చేయుచున్నను, వాటియందు వారి పాపమే కనిపించెను. మీరు అర్పణలు తేకుండుటే మేలని దేవుడు తెలియపరచెను. వాటిని స్వీకరించుటకాయన నిరాకరించెను.

బంగారు దూడల సముఖమున వీరు బల్యర్పణలు సమర్పించగా, దేవుడు వారి పాపమును క్షమించలేదు. వారి పాపములను ఆయన భరించలేకపోయెను. తాను విధించిన కట్టడలను అనుసరించి ధర్మశాస్త్రానుసారము బల్యర్పణలు చేయవలెనని దేవుడాదేశించెను. అటుల కాని పక్షమున వారసలు బలులర్పించకుండుటే మేలని దేవుడాదేశించెను.

దేవుని యొక్క సరైన విధానములో దేవుని యెదుట సమర్పించలేదు. దాని వలన యాజకులు దేవునికి వ్యతిరేకముగా పాపమొనరించిరి. దీనిని బట్టి మనము నేర్చుకొనవలసినదేమనగా, మన పాపములు శుద్ధీకరింపబడకుండా, దేవుని యొక్క సేవాకార్యక్రమములనాచరించుట సరియైన విధానము కాదు.మత బేధములు కలిగించువారు పాఠశాలలో అధ్యాపకుల వంటివారు.


 • ఈ విమతములు కలిగించువారేమని
 • బోధించెదరు?
 • వారు నీతిసూత్రములను వల్లెవేసెదరు కానీ,
 • తిరిగి జన్మించువిధానమును బోధించరు.


ఈ తమ బేధములు కలిగించు బోధకులు బాహ్యముగా పరిశుద్ధులుగా కనిపించెదరు. వారు ప్రసంగ పీఠముపైన నిలచి బోధించునప్పుడు ఎంతో చక్కగా ప్రసంగించి అనేకులను మోసగించెదరు. వారి బోధలు న్యాయమైనవిగా కన్పించును. వారి ప్రతి ప్రసంగమునకు ఆఖరిభాగములో ప్రజలను సమాజమునకు, సంఘమునకు మంచి చేయవలసినదిగా ఉద్భోదింతురు. వారి ప్రతి ప్రసంగమునకు అఖరి భాగములో ప్రజలను సమాజమునకు, సంఘమునకు మంచి చేయవలసినదిగా ఉద్భోదింతురు. వారి ప్రసంగ మేలాటిది? పాఠశాలలోని అధ్యాపకులకు, ఈ బోధకులకు ఏ మాత్రము బేధముండదు. వారి ప్రసంగము పాఠమువలె యుండును.

దేవుని సంఘములోనే, తిరిగి జన్మించిన అనుభవము కలిగినవారు కలిసి ఆరాధింతురు. ఈలాంటిదే నిజమైన దేవుని సంఘము దేవుని యెదుట ఏ విధమైన ప్రవర్తన మనము కలిగియుండవలెనో దేవుని సంఘములో బోధించనవసరములేదు. నిజమైన సంఘములోని బోధకు నీటిద్వారాను మరియు ఆత్మ ద్వారాను తిరిగి జన్మించు అనుభవములోనికి విశ్వాసులను నడిపించెదరు. మీరెంత బలహీనులైనను, దేవుడు మీ పాపము పరిహరించియున్నాడు.

ఈ మత బేధములు కలిగించు బోధకులు తమ ప్రజలపైన విశేషభారమును మోపి అనేక పనులను చేయించుదురు గానీ వీరు కనీసం చిటికెన వేలు కూడా కదిలింపరు.

ఈ బోధకులు తమ బిడ్డలకు అతి ఖరీదైన వయోలిన్‌ లాంటివి కొనిస్తారు. వారిని చదువు నిమిత్తమై ఇతర దేశాలకు పంపుతారు. అసలు బోధకులు ఇంతటి ఖర్చు ఏలాగు భరించగలరు? వారికీధనమేలాగు ప్రాప్తించినది? అంతధనము లభించిన యెడల, దానిని సువార్త వ్యాప్తికై వాడవచ్చును గదా! అసలు దేవుని సేవకులకు ఖరీదైన వాహనాలెందుకు? తమ గౌరవమును పెంపొందించుకొనుటకు ఖరీదైన కార్లలో ప్రయాణించవలెనా? ఖరీదైన కార్లలో విలాసవంతముగా ప్రయాణించు బోధకులు దొంగలుకారా? తమ సంఘస్థులు ఒక సామాన్యమైన వాహనము సంపాదించు కొనలేనప్పుడు, కాపరి అతివిలాసవంతమైన కార్లలో తిరుగుట సమ్మతమా? వారి వారి పనులను బట్టి మనమిట్టి బోధకులను గుర్తించగలము.

ఇట్టి బోధకులు సంఘస్థుల నుండి విశేషమైన ధనమును ఆశింతురు. కొన్ని సంఘములు తమ కాపరులకు నెకు రూ.7,50,000 (10,000 డాలర్లు)పైగా జీతము నిచ్చుట నాకు తెలియును. అంతేకాక వారి బిడ్డకు స్కూల్ ఫీజు నిమిత్తమై పుస్తకము నిమిత్తమై ఇంకొంత మొత్తము లభించును.

పిల్లల భవిష్యత్తు నిమిత్తమై మరియు గృహదర్శనము ఖర్చునిమిత్తమై ఇంకొంత చెల్లించబడును. నెలకు రూ.7,50,000 ఇచ్చినను ఇంకనూ చాలదని సణుగుతుంటారు. నెలకు రూ.7,50,000లు తక్కువ జీతమా? అయినను వారింకను ధనమును ఆశించుచునే యుందురు. ఈ నీరు మరియు ఆత్మ సంబంధమైన సువార్తను ప్రకటించు బోధకులు, అధిక ధనమును ఆశించక దేవుడనుగ్రహించిన ధనముతో తృప్తి చెందవలెను.

నిజమైన బోధకుడు దేవుని నుండి లభించు శాంతియందు సంతోషించును. అయితే ఈ అబద్దబోధకులు వారికి లభించిన వాటియందు శాంతి లేక అధిక ఆర్థిక వసతులకై అడుగుతూనే యుందురు. ఇటువంటి కేవలం ధనాశ కలిగిన వ్యక్తులు బంగారు దూడ సేవకులే!

దేవుని సంఘమును అనేకసార్లు సీయోను అని పిలిచెదరు. సీయోను కంటే అందమైన సంఘమెక్కడుండును. నీరు మరియు ఆత్మ సంబంధమైన సువార్తను బోధించునదే దేవుని సంఘము.

యెషయా 1:21లో ఈ విధంగా తెలియజేయుచున్నది. ‘‘అయ్యో, నమ్మకమైన నగరము వేశ్య ఆయెనే! అది న్యాయముతో నిండియుండెను నీతి దానిలో నివసించెను. ఇప్పుడైతే నరహంతకులు దానిలో కాపురమున్నారు.’’(యెషయా 1:21) యెషయా దేవుని సంఘమును గురించి వివరిస్తూ ‘అది న్యాయముతో నిండియుండెను’ అని తెలియపరచెను.

దేవుడు న్యాయవంతుడు. మనము అసంపూర్ణులము. ఎందుకనగా మనము ఆదామునకు వారసులమై పాపులుగా జన్మించితిమి. అయితే ప్రభువైన యేసు ఈ లోకమునకరుదెంచి నీటి ద్వారా ఆత్మ ద్వారా మరియు రక్తము ద్వారా మన పాపములను పరిహరించెను. న్యాయవంతుడైన దేవుని నీతియిది.

పాత నిబంధనలో ప్రజలు తాము అసంపూర్ణులమని గ్రహించినప్పుడు దేవుని సముఖమునకు వచ్చి బల్యర్పణ సమర్పించారు. ‘‘నేను ఈ విధమైన పాపములు చేశాను, నేను చేసినవన్నియు తప్పిదములు’’ అని పాపము ఒప్పుకొని, బల్యర్పణ చేసిన తదుపరి, వారి వారి అనుదిన పాపముల నిమిత్తమై క్షమింపబడుదురు. అంతేకాక వారు పాపపరిహార దినమున సంవత్సరమంతయు చేసిన పాపముల నుండి కూడా విమోచింపబడుదురు.

అదే విధముగా నూతన నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకమునకు మనుష్యునిగా అరుదెంచి, బాప్తిస్మము పొంది, దాని ద్వారా లోక పాపములన్నియు వహియించి, వాటి నిమిత్తమై సిలువలో తన రక్తమును కార్చి మనుష్యులందరిని వారి పాపములన్నిటి నుండి విడిపించెను.

‘‘ప్రియమైన దేవా, గత సంవత్సరమంతయు చేసిన నా పాపమును మన్నించండి. ఈ నూతన సంవత్సరములో నన్ను ఆశీర్వదించండి’’ అని అనేకులు నూతన సంవత్సర ఆరాధనలో ప్రార్థిస్తుంటారు. మరి వీరు మత బేధములు కలుగజేయు వారుకారా?

అయితే నీటివలన మరియు ఆత్మవలన తిరిగి జన్మించు అనుభవము గడించుటలోని సత్యమేమై యున్నది? ఈ లోకమునకు ప్రభువైన యేసు 2000 సంవత్సరాల క్రితం అరుదెంచాడు. మానవులందరి పాపమును ఎన్నటెన్నటికీ ఒక్కసారిగా పరిహరించాడు. నీరు మరియు రక్తము ద్వారా లోకపాపమును తొలగించాడు. అయితే మనము దానియందు విశ్వాసముంచక, అనుదినము క్షమించమని ప్రార్థన చేస్తుంటే దీనికి దేవుని స్పందన ఏమిటి?

‘‘అయ్యో, నమ్మకమైన నగరము వేశ్య ఆయెనే! అది న్యాయముతో నిండియుండెను నీతి దానిలో నివసించెను. ఇప్పుడైతే నరహంతకులు దానిలో కాపురమున్నారు.’’ (యోషయా 1:21) యేసు అందించిన ఈ నీరు మరియు ఆత్మ సంబంధమైన పాపపరిహారమట్లుండగా, దానియందు విశ్వాసముంచక, తమను తామింకను పాపులుగా పిలుచుకొనువారు మత బేధము కలిగించువారే అని చెప్పక తప్పదు.ఈ మత బేధములు కలిగించు బోధకులు, నీరు మరియు ఆత్మ ద్వారా తిరిగి జన్మించు సువార్తను బోధించలేరు.


 • పాపుల ప్రార్థన దేవుడాలకించునా?
 • ఆలకించడు, వారి పాపములు వారిని దేవుని నుండి
 • దూరపరచును గనుక దేవుడాలకించలేడు.


మన దేవుడు తన యందు విశ్వాసముంచి, పాపక్షమాపణ కోరువారిని పిలుచును. వీరు హంతకులైననూ సరే. వారు క్షమాపణ నిమిత్తమై అభ్యర్థిస్తూ, మేము పాపులమని పేర్కొంటారు. అంటే ప్రభువు మరొకసారి ఈ లోకానికి వచ్చి వారి పాపము నిమిత్తమై మరణించాలా? యేసు పొందిన బాప్తిస్మము మరియు సిలువ మరణము రక్షణకు కారణములైయున్నవి.

1పేతురు 3:21 ప్రకారం ‘దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్ము రక్షించుచున్నది’ అని చెప్పబడినది. యేసుక్రీస్తు ఒకసారి చనిపోయి మానవాళి యొక్క పాపములను పరిహరించెను. సకల మానవుల సమస్త పాపముల శుద్ధీకరణ నిమిత్తమై ఒక్కసారిగా మరణించి, తిరిగి 3వ నాడు పునరుత్థానుడైనాడు. ఇప్పుడాయన తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడైయున్నాడు.

యేసుక్రీస్తు ఒక్కసారే బాప్తిస్మముపొంది, ఒక్కసారే సిలువపై మరణించి, సమస్త మానవాళి పాపములను ఎన్నటెన్నటికి పరిహరించెను. ఆయన 30 సంవత్సరముల వాడైనప్పుడు స్థానికుడైన యోహాను వలన బాప్తిస్మము పొందెను. ఈ లోకపాపములన్నిటి నుండి మనలను రక్షించుటకు ఆయన ఒక్కసారిగా మరణించెను. దీని అర్థము తీర్పు ఎన్నటికీ ఇవ్వబడినదనేగదా?

ఈ బోధకులు మనమింకనూ పాపులమని చెప్తుంటారు. అలాగైతే ప్రభువైన యేసు మన నిమిత్తమై రెండవసారి వచ్చి, తిరిగి సిలువ వేయబడాలనా? అనగా వారు పాపక్షమాపణ కోరిన ప్రతిసారి యేసు ప్రభువీలాగు జరిగిస్తూ ఉండాలి కదా!

నీరు మరియు ఆత్మతో కూడిన ఈ సువార్తను హృదయమునందు విశ్వసించిన వారు పాపము నుండి శాశ్వతముగా రక్షింపబడి, నీతిమంతులుగా తీర్పు పొంది, నిత్యత్వంలో దేవుని దీవెనను స్వీకరించుటకై పరలోకమునందు చేర్చబడుదురు. ఈ నీతిమంతత్వమును పొందిన ప్రతివారూ, ఈ నీరు మరియు ఆత్మ ద్వారా రక్షింపబడి దేవుని ప్రజలుగా ఆశీస్సులు పొందగలరు. దేవుని యెదుట ఈ నీతిమంతత్వమునకు సంబంధించిన రక్షణను కోరుకున్న వారిని దేవుని దీవించును.

మనము యొషయా 1:18-20 వరకు చదువుదాం. రండి మన వివాదము తీర్చుకొందము. మీ పాపము రక్తమువలె ఎర్రనివైనను అవి హిమమువలె తెల్లబడును. కెంపువలె ఎఱ్ఱనివైనను అవి గొఱ్ఱెబొచ్చువలె తెల్లనివగును. మీరు సమ్మతించి నా మాట వినిన యెడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించుదురు. సమ్మతింపక తిరగబడిన యెడల నిశ్చయముగా మీరు ఖడ్గము పాలగుదురు. యెహోవా ఈలాగుననే సెలవిచ్చియున్నాడు.

మనము నీరు మరియు ఆత్మ ద్వారా సువార్తకు లోబడినయెడల, మనము భూమి యొక్క మంచి పదార్థములను భుజింపుము. అయితే సమ్మతించక తిరగబడిన యెడల మనము నిశ్చయముగా ఖడ్గము పాలగుదుము.

మన దేవుడు చెప్పెను, రండి మన వివాదము తీర్చుకొందము. మనము మాట్లాడుకొందాము. మీరు అసంపూర్ణలైయున్నారా? మీరు అనీతిమంతులా? మిమ్మును మీరు ఎక్కువగా ప్రేమించుకొనుచున్నారా? ఆజ్ఞను అనుసరించి మీరు నడుచుకొనలేరా? చట్టము ఆజ్ఞాపించుదానిని మీరు చేయలేరా? మీకు తెలియును అయితే అభ్యసించలేకపోవుచున్నారా? అప్పుడు, నా యొద్దకు రండి, మీ పాపము రక్తమువలె ఎర్రనివైనను హిమమువలె తెల్లనివగును. కెంపువలె ఎఱ్ఱనివైనను అవి గొఱ్ఱెబొచ్చువలె తెల్లనివగును దీని అర్థము ఏమంటే, దేవుడు పాపులను న్యాయముగా రక్షించినవారిని నీతిమంతులుగా చేసెను.

దేవుడు ఆదాము హవ్వను సృజించినప్పుడు పాపములేదు. మానవుడు పడిపోవుటకు సాతానుడు కారణము. ప్రారంభదినములలో ఆదాము, హవ్వ దేవుని యెదుట పాపులుకారు. వారు దేవునితో సహవాసంచేస్తూ ఏదేనులో గడిపారు. అయితే ఇప్పుడు వారు పాపులైనారు. అందుకే దేవుడు మనలను పిలుస్తున్నాడు. రండి మన వివాదము తీర్చుకుందాము, కలిసి వివాదము తీర్చుకుందాము.

‘‘ఈ లోకములో మీరెంత పాపము చేసియున్నా? నీవు చనిపోవు పర్యంతం ఇంకెంత పాపము చేసెదవు?’’

‘‘ఓ ప్రభువా పాపము చేయకుండుట ఎంత అసంభవము. మేమెంత శ్రమించినను పాపము చేయకుండా ఉండలేక పోతున్నాము.’’

‘‘అయితే ఇంతవరకు మీ జీవితములో ఎంత పాపము చేసియున్నారు?’’ 

‘‘దేవా నేను చేసిన పాపమంతయు నాకు గుర్తులేదు. కాని కొన్ని పాపాలు నా హృదయంలో నిలిచియున్నాయి. అవి మీకు గుర్తున్నవా? నేను వేటి గురించి తెలియజేస్తున్నానో తెలుసా.. అనేకసార్లు నేను చేసిన....’’

అప్పుడు దేవుడంటాడు. ‘‘ఇంకా చెప్పు అంతేనా? అవిగాక ఇంకాలేవా? అయితే ఒక విషయం గుర్తుంచుకో, నీవు గుర్తించుకున్న పాపమంతయు నీవు మరచిపోయిన పాపమంతయు, నీవు భవిష్యత్తులో చేయు పాపమంతయు కలగలిపి, నీ పాపములన్నియు నేను శుద్దీకరించాను. నీవే కాదు నీ పిల్లల పిల్లల పాపాలు కూడా పరిహరించాను. నీ వంశస్థుల పాపాన్ని పరిహరించాను. నేను నీతిమంతుడైన దేవుడను. మీ సకల పాపాలను తొలగించాను.’’

ఆదాము నుండి ఈ లోకములోని ఆఖరు మనుష్యుని వరకు చేసిన పాపాలను, సకల మానవాళి సమస్త పాపములను శుద్దీకరించిన దేవుడు అల్ఫయు, ఓమెగయు అయి ఉన్నాడు. ఆయనే ఆదియు, అంతమునైయున్నాడు.

‘‘నేను రక్షకుడను, అద్వితీయ శక్తిమంతుడైన దేవుడను’’

‘‘నేను యెహోవాను, కృపగకలిగిన దేవుడను.’’

‘‘ఎవరు కరుణకు పాత్రులో వారి యెడల కరుణామయుడను. ఎవరు కనికరమునకు పాత్రులో వారియెడల కనికరము చూపెదను.’’

మనమాయన కనికరము నాశించి, దేవునితో సరిగా వ్యవహరించిన యెడల, దేవుని కనికరము పొందగలము. మన పరమతండ్రి మననందరినీ ఆశీర్వదించవలెనని ఆశిస్తున్నాడు. మనమందరము నీతిమంతులము కాగోరుతున్నాడు. ఆయన అద్వితీయమైన ప్రేమ, కనికరము ద్వారా మనమందరము ఆయనకు నీతిమంతులైన పిల్లలముగా కావలెనని ఆశిస్తున్నాడు.


 • మనము తిరిగి జన్మించిన అనుభవము
 • పొందిన తరువాత మన నుండి
 • దేవుడేమాశించుచున్నాడు ?
 • ఈలోక మంతటికి సువార్తను బోధింపవలయునని
 • ఆశించుచున్నాడు.

మనము హిమమువలె తెల్లగా ఉండవలెనని దేవుడు ఆశించుచున్నాడు. ప్రభువు, తాను పొందిన బాప్తిస్మము వలన మరియు సిలువ మరణము వలన సకల మానవుల పాపములను పరిహరించియున్నాడు. ఏ సంఘమైనను సరే తన విశ్వాసుల పాపవిషయము మరియు జీవితమునకు సంబంధించిన సమస్యను పరిష్కరించలేకపోయిన యెడల, ఆ సంఘము దేవుని యొక్క నిజసంఘమని చెప్పజాలము.

అనేకసార్లు ప్రజలు బోధకుల వద్దకు వచ్చి ఈ విధంగా అడుగుతుంటారు. ‘‘అయ్యా, నేను పాపము కలిగియున్నాను. దీని నిమిత్తమై నేనేమి చేయవలెను? నేను అనేకసార్లు పశ్చాత్తాపము చెందియున్నాను, అయినను ఈ పాపము నన్ను విడిచిపెట్టుటలేదు. నాకు ఇంక ఏమిచేయవలెనో బోధపడుటలేదు. నేను ఈ మతసంబధమైన జీవితమును ఇంక జీవించలేను.’’ ఆ బోధకుడు ఈ వ్యక్తికి సరైన సమాధానము ఇవ్వలేని యెడల, ఆ వ్యక్తి సమస్యకు పరిష్కారము చూపనియెడల అతడు అబద్ధబోధకుడగును. ‘‘ఇది నీకు సంబంధించిన సమస్య వెళ్ళి పర్వతములో ప్రార్థించు లేదా 40 రోజులు ఉపవాసముండు’’ అని ఒకవేళ ఈ బోధకుడు చెపుతాడేమో.

ఇటువంటి బోధకులు లేదా మతనాయకులు అనేకమైన అపరిశుద్ధులతో నిండియుందురు. వారు ఈ నీరు మరియు ఆత్మ సంబంధమైన సువార్తను ఎరుగరు. తమ ఆత్మలు పరలోకములో సంతోషించునో లేక నరకాగ్నిలో నశించునో వారికే తెలియదు

ఆ నాయకులు దేవుని యెదుట సరిగా నిలచినవారు కాదు. వారు అబద్ధ క్రైస్తవులు మరియు మత బేధములు కలిగించువారై యుందురు. వారి బాహ్యప్రవర్తనను గమనించినయెడల యేసుక్రీస్తునందు విశ్వాసముంచినట్లు కనిపించెదరు. కాని వారి అంతరంగము పాపమునకు నెలవైయున్నవి. వారు ఇంకను పాపమునుండి శుద్ధిపొందలేదు. వారు ఈ నీరు మరియు ఆత్మ సంబంధమైన సువార్తను బోధింపలేరు. ఎందుకనగా ఈ సువార్తే వారి పాపములను శుద్దీకరించునదై యున్నది. కనుక ఇట్టి వారి వలన మనము మోసపోరాదు.

తీతు 3వ అధ్యాయము 10,11 వచనములో వీరి గురించి ఈ విధముగా తెలియపరచబడియున్నది. ‘‘మతబేధములు కలిగించు మనుష్యునికి ఒకటి రెండు మారులు బుద్ధిచెప్పిన తరువాత వానిని విసర్జించుము. అట్టివాడు మార్గముతప్పి తనకు తానే శిక్ష విధించుకొనినవాడై పాపము చేయుచున్నాడని నీవెరుగుదువు.’’ వారు యేసునందు విశ్వాసముంచితే గాని తిరిగి జన్మించిన అనుభవమును పొందినవారు కారు. వారు తమనుతాము పాపులుగా భావించుకుని తీర్పునకు లోనగుతున్నారు. మేము పాపులము, మరియు మా గమ్యము నరకమే అని చెప్పుకొనుచూ ఈ నీరు మరియు ఆత్మ సంబంధమైన సువార్తను నిర్లక్ష్యపరచి అణచివేయుచున్నారు.

వీరే క్రైస్తవ్యములో మతబేధములు కలిగించువారు. ఎవరైననూ యేసునందు విశ్వాసముంచిన పిదప తమ హృదయములలో ఇంకనూ పాపము కలిగియున్న ఎడల వారు ఈ కోవకే చెందుదురు. వీరు ఎల్లప్పుడు దేవుని వ్యతిరేకించెదరు. దేవుడు పరిశుద్ధుడైయున్నాడు. వీరు అపరిశుద్ధులు. ఈ నీరు మరియు ఆత్మ సంబంధమైన సువార్తయందు విశ్వసించిన వారు మాత్రమే తమ పాపముల నుండి శుద్ధీకరించబడుదురు. కనుక యేసు నందు విశ్వసించి ఇంకనూ పాపము కలిగి యున్న యెడల వారు మతబేధములు కలిగించువారైయున్నారు. కనుక అట్టివారి నుండి మనము దూరముగా ఉండవలయును.

మనము సువార్త వినని వారికి సువార్తను ప్రకటించవలెను. వారు విశ్వసించుటకు సిద్ధముగా యున్నను, వినని వార్తను ఏవిధంగా విశ్వసించగలరు. అట్టివారు తిరిగి జన్మించుటలో మనము సహాయపడవలెను. ఈ నీరు మరియు ఆత్మ సంబంధమైన సువార్తాపధములో అడ్డుబండలుగా ఎవరున్ననూ సరే వారిని దూరపరచవలయును.

మనము ఈ లోకమంతట మానవులను తిరిగి జన్మింపచేయు ఈ నీరు మరియు ఆత్మ సంబంధమైన సువార్తను విశేషముగా ప్రకటించవలయును. ఆమెన్‌.