Sermons

[3-6] <నిర్గమ 12:43-49 > అసలైన ఆధ్యాత్మిక సున్నతి



<నిర్గమ 12:43-49 >

మరియు యెహోవా మోషే ఆహారోనులతో ఇట్లనెను - ఇది పస్కా పండుగను గూర్చిన కట్టడ; అన్యుడెవడును దాని తినకూడదు గాని వెండితో కొనబడిన దాసుడు సున్నతి పొందినవాడైతే దాని తినవచ్చును. పరదేశియు కూలికి వచ్చిన దాసుడును దాని తినకూడదు. మీరు ఒక్క ఇంటిలోనే దాని తినవలెను. దాని మాంసములో కొంచెమైనను ఇంటిలో నుండి బయటకి తీసికొని పోకూడదు, దానిలో ఒక్క యెముకనైనను మీరు విరవకూడదు. ఇశ్రాయేలీయులు సర్వ సమాజము ఈ పండుగను ఆచరింపవలెను. నీ యొద్ద నివసించు పరదేశి యెహోవా పస్కాను ఆచరింప గోరిన యెడల అతనికి కలిగిన ప్రతి మగవాడు సున్నతి పొందవలెను. తరువాత అతడు సమాజములో చేరి దానిని ఆచరింపవచ్చును. అట్టి వాడు మీ దేశములో పుట్టినవానితో సముడగును సున్నతి పొందనివాడు దానిని తినకూడదు. దేశస్థునికిని మీలో నివసించు పరదేశికిని దీని గూర్చి ఒక్కటే విధి యుండవలెననెను.


  • పాత నిబంధనలో ఇశ్రాయేలీయులు
  • దేవుని బిడ్డలుగా పరిగణించబడుటకు ఇవ్వబడిన
  • తిరుగులేని షరతు ఏమి ?
  • వారు సున్నతి ఆచరింపవలయును


దేవునియందు విశ్వాసముంచిన మనకు పాత మరియు క్రొత్త నిబంధనలలోని దేవవాక్యములు ఎంతో ముఖ్యమైనవి మరియు విలువైనవి. అందులో ఉదాహరింపబడిన దేవుని వాక్యములు సజీవమైనవి. కనుక మనము ఏ వచనమును నిర్లక్ష్య పరచరాదు. 

పైన ఉదాహరింపబడిన వాక్య భాగముల ప్రకారము పస్కా ఆచరించుటకు ప్రతి ఒక్కరు సున్నతి చేసుకొనవలయును. దేవుడు ఈ విధముగా తెలియపరచుటకు కారణము లేమిటో పరిశీలించవలయును. సున్నతి చేయించుకొనకుండ ఎవరైనను పస్కా ఆచరింపకూడదు. 

మనకు యేసును గురించిన అవగాహన కలగవలయునన్న దేవుడు ఈ ఆజ్ఞను ఇచ్చిన కారణము తెలుసుకొన్న చాలు. సున్నతి అనగా మగవారి గోప్యాంగ చర్మమును తీసివేయుట. దేవుడు అబ్రహామునకు మరియు అతని వారసులకు ఎందువలన ఈ సున్నతి అని కట్టడను ఇచ్చెను. దేని వలన ఒక వ్యక్తి తన పాపములను తీసివేసుకున్నచో దేవుని బిడ్డకాగలడు. 

అందువలననే దేవుడు పాత నిబంధనలో ఇశ్రాయేలీయులను సున్నతి ఆచరింప వలసినదిగా తెలియజేసెను. దేవుని ప్రజలు కావలెనన్న ఇశ్రాయేలీయులు ఈ సున్నతిని తప్పనిసరిగా ఆచరింపవలెను. ఇది దేవుని యొక్క ఆజ్ఞ అయియున్నది. ఈ సున్నతి నందలి విశ్వాసమును బట్టి తమ పాపములను విడిచిపెట్టిన ప్రజలకు ఆయన దేవుడాయెను. అయితే నూతన నిభంధనలో ప్రభువైన యేసుక్రీస్తు నందలి విశ్వాసము ద్వారా తమ పాపములు నుండి విమోచన పొందిన జనాంగమునకు రక్షణ అనుగ్రహించెను.



పస్కా పండుగ


  • పస్కా అనగా నేమి?
  • ఐగుప్తు నుండి ఇశ్రాయేలీయుల నిర్గమము,
  • అనగా విమోచనను జ్ఞాపకము చేసుకొనుటకై
  • దేవునికి కృతజ్ఞతలు అరిపించు దినము.


ఇశ్రాయేలీయులకు పస్కా పండుగ చాల ముఖ్యమైన సెలవు రోజైయున్నది. ఇశ్రాయేలీయులు దాదాపు 400 సంవత్సరములు ఐగుప్తులో నివసించి, అక్కడి నుండి విమోచింపబడి స్వతంత్రులుగా బయటకు వచ్చిన దినమును జ్ఞాపకము చేసుకొని దేవునికి కృతజ్ఞతలు అరిపించుటయే ఈ పండుగ ప్రాముఖ్యత. దేవుడు ఫరో కఠిన హృదయమును కదిలించుటకు ఐగుప్తు పైకి 10 తెగుళ్లును రప్పించెను. ఈ తెగుళ్ల ద్వారా ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుండి విమోచించి కనానులోకి ప్రవేశ పెట్టెను. 

పస్కా బలి పశువు రక్తము వలనను మరియు సున్నతి వలనను తొలిచూలును హతము చేయు ఆఖరి తెగులు నుండి ఇశ్రాయేలు జనాంగము రక్షింపబడిరి. అందువలన వారి తరతరములు దేవుని కనికరమును జ్ఞాపకము చేసుకొనుటకై ఈ పస్కాను ఆచరించవలెనని దేవుడు సెలవిచ్చెను.



పస్కా ఆచరించుటకు ఇశ్రాయేలీయులేమి చేయవలెను?


  • పస్కా ఆచరించుటకు ముందుగా
  • ఇశ్రాయేలీయులేమి చేయవలెను?
  • వారు సున్నతి ఆచరింపవలెను.


మనము ఆధ్యాత్మికముగా ఈ పస్కాను ఆచరింపవలయున్నచో మన హృదయములో సున్నతి ఆచరింపవలయును. ఈ పస్కా ఆచరించుటకు ముందుగా ఇశ్రాయేలు జనాంగము శారీరక సున్నతి ఆచరించవలయును.

నిర్గమ 12:43-49లో ఈ విధముగా తెలిపరచబడెను. "మరియు యెహోవా మోషే అహరోనులతో ఇట్లనెను. - ఇది పస్కా పండుగను గురించిన కట్టడ. అన్యుడెవడును దాని తినకూడదు గాని వెండితో కొనబడిన దాసుడు సున్నతి పొందినవాడైతే దాని తినవచ్చును. పరదేశియు కూలికివచ్చిన దాసుడును దాని తినకూడదు. మీరు ఒక్క ఇంటిలోనే దాని తినవలెను దాని మాంసములో కొంచెమైనను ఇంటిలో నుండి బయటకి తీసుకొని పోకూడదు. దానిలో ఒక్క యెముకనైనను మీరు విరువకూడదు. ఇశ్రాయేలీయులు సర్వ సమాజము ఈ పండుగను ఆచరింపవలెను. నీ యొద్ద నివసించు పరదేశి యెహోవా పస్కాను ఆచరింప గోరిన యెడల అతనికి కలిగిన ప్రతి మగవాడు సున్నతి పొందవలెను. తరువాత అతడు సమాజములో చేరి దానిని ఆచరింపవచ్చును. అట్టి వాడు మీ దేశములో పుట్టినవానితో సముడగును. సున్నతి పొందని వాడు దానిని తినకూడదు. దేశస్థునికి మీలో నివసించు పరదేశికిని దీని గూర్చి ఒకటే విధి యుండవలెననెను." కనుక సున్నతి ఆచరించిన తరువాతనే ఇశ్రాయేలీయులను పస్కా ఆచరించవలసిందిగా ఆజ్ఞ ఇచ్చెను. 

ఈ పస్కా ఆచరించి, పస్కా బలి పశువు మాంసమును తినుటకు ఎవరికి ఆజ్ఞ ఇవ్వబడెను? కేవలం సున్నతి ఆచరించిన ప్రజలు మాత్రమే పస్కా ఆచరింపవలయును. 

ఈ లోక పాపములన్నియు మోసికొని పోవు దేవుని గొర్రెపిల్ల మన ప్రభువైన యేసుక్రీస్తే . 

అలాగైనా పాత నిబంధనలోని సున్నతికి, నూతన నిబంధనలోని సున్నతికి అర్థమేమైయున్నది? సున్నతి అనగా మగవారి గోప్యాంగ చర్మమును తొలిగించుట. యేసుక్రీస్తు కూడా ఈ లోకములో జన్మించిన 8 దినముల తరువాత సున్నతి చేయబడెను. పస్కా ఆచరించువారందరు సున్నతి చేసుకొనవలయునని, అటుల ఎవరైనా సున్నతి చేసుకొనని యెడల పస్కా ఆచరింపకూడదని దేవుడు ఆజ్ఞ ఇచ్చెను. 

కనుక దేవుని నియమానుసారం ప్రతివారు సున్నతి ఆచరింపవలయును. యేసుక్రీస్తు నందు విశ్వాసముంచినట్లైతే మనమును నూతన నిబంధనలోని సున్నతిని అర్థము చేసుకొనవలెను.



ఆచరించమని అబ్రాహామునకు దేవుడు తెలిపిన ఆ సున్నతి ఆచారమేమై యున్నది.


  • ఏ విధముగా అబ్రహాము మరియు
  • అయన వారసులు దేవుని ప్రజలైరి ?
  • సున్నతి ఆచరించుటవలననే.


ఆదికాండములో దేవుడు అబ్రాహామునకు కనిపించి, అబ్రాహాముతోను, అయన సంతానముతోను ఒక నిబంధన చేసెను. 15వ అధ్యాయము, దేవుడు అబ్రహాము వారసులను ఆకాశములో నక్షత్రములవలె అభివృద్ధి చేసెదనని వాగ్దానము చేసెను. అయన సంతానానికి నిత్య నివాసముగా కనాను భూభాగము నిచ్చెదనని తెలిపాను.

17వ అధ్యాయము, అబ్రాహాముతో మాట్లాడుతూ. అబ్రాహాము మరియు ఆయన సంతతి సున్నతి ఆచరించి, నిబంధన చేసుకున్నట్లైతే, అయన వారికీ దేవుడుగా నుండుననియు, వారాయన ప్రజలు కాగలరని వాగ్దానము చేసెను. అబ్రాహాముతోను, అయన సంతతితోను దేవుడు చేసిన నిబంధన ఇదియే. అబ్రాహాము మరియు అయన సంతతి దేవుని నిబంధన యందు విశ్వాసముంచి సున్నతి ఆచరించినియెడల వారు దేవుని ప్రజలు కాగలరనియు, మరియు తానే వారికి దేవుడు కాగలననియు వాగ్దానము చేసెను. 

ఆది 17:7-8 వచనాలలో ఈ విధముగా తెలుపబడినది. "నేను నీకును నీ తరువాత నీ సంతానమునకును దేవుడనై యుండునట్లు, నాకును నీకును, నీ తరువాత వారి తరములలో నీ సంతతికి మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరిచెదను. నీకును నీ తరువాత నీ సంతతికిని నీవు పరదేశివైయున్న దేశమును, అనగా కనాను దేశమంతటిని నిత్య స్వాస్థ్యముగా ఇచ్చి వారికి దేవుడనై యుండునని అతనితో చెప్పెను."

అబ్రాహాముతోను, అతని సంతతితోను దేవుడు చేసిన నిత్య నిబంధనకు గురుతే ఈ సున్నతి.



ఆధ్యాత్మిక సున్నతి అనగా నేమి?


  • ఆధ్యాత్మిక సున్నతి అనగా నేమి?
  • మన హృదయమునందలి పాపములన్నియు
  • తొలిగించుకొనుటకు, ప్రభువైన యేసు పొందిన
  • బాప్తిస్మము నందలి విశ్వాసమే.


అబ్రాహాము దేవుని మాటను నమ్మెను. దాన్ని బట్టి దేవుడు అతనిని నీతిమంతునిగా తీర్చి తన ప్రజగా చేసికొనెను. దేవునికి, అబ్రాహాముకు మధ్య ఏర్పడిన నిబంధనకు గురుతే ఈ సున్నతి. 

"నాకును నీకును నీ తరువాత నీ సంతతికి మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా - మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలెను." (ఆది 17:10)

శరీర సున్నతి అనగా పురుషుల గోప్యాంగ చర్మము కత్తిరించబడుట. ఆధ్యాత్మిక సున్నతి లేని హృదయ సున్నతి అనగా సకల మానవుల పాపములను తొలగించిన ప్రభువైన యేసు పొందిన బాప్తిస్మము నందు విశ్వాసముంచగానే మనము ఆత్మలో సున్నతి పొంది మన పాపములన్నిటినుండి పరిహరింపబడు రక్షణను స్వకరించెదము. నూతన నిబంధనలో సున్నతికి అర్థము. ప్రభువైన యేసు పొందిన బాప్తిస్మము ద్వారా మన పాపముల నుండి విడిపింపవబడుటయే.

పాత నిబంధనలోని సున్నతి, నూతన నిబంధనలోని యేసు పొందిన బాప్తిస్మమునకు సూచకమై యున్నది. ఈ రెండూ దేవుని నిబంధనలే, వాటి ద్వారా మనము దేవుని ప్రజలు కాగలము. కనుక పాత నిబంధనలోని సున్నతి, నూతన నిబంధనలోని యేసు పొందిన బాప్తిస్మమునకు సమానము. 

ఏ విధముగానైతే సున్నతి ఆచరించి అబ్రహాము మరియు ఆయన సంతానము దేవుని ప్రజలుగా మార్చబడితిరో, అదే విధముగా మన హృదయములలో నుండి పాపములు తొలగించుకొని దేవుని ప్రజలము కాగలము. యోహాను ద్వారా బాప్తిస్మము పొంది ప్రభువైన యేసు ఈ లోక పాపమంతయు తనఫై మోపుకొని తన ప్రజలను పాపము నుండి విమోచించెను. 

యేసు పొందిన బాప్తిస్మము వలన సకల మానవుల పాపములు వారి నుండి పరిహరింపబడి, ఆయన యందు విశ్వాస ముంచిన వారు నీతిమంతులుగా తీర్పు పొందుదురు. సున్నతి ఆచరించినప్పుడు చర్మపు భాగము మానవుల నుండి వేరు చేయబడెను. అటులనే యేసు యొర్దానులో స్థానికుడైన యోహాను ద్వారా పొందిన నీటి బాప్తిస్మము నందు అనగా దీనికి సాదృశ్యమైన నీటి యందు విశ్వాసముంచి ప్రతివారు ఆత్మలో సున్నతి చేయబడి నీతిమంతులుగా తీర్పు పొంది దేవుని ప్రజలు కాగలరు.



ప్రజలను దేవుని నుండి దూరపరచు అబద్ధ విశ్వాసము.


  • ప్రజలు దేని వలన దేవుని నుండి తమను
  • తాము దూరపరచుకొంటిరి ?
  • సున్నతి ఆచరించకపోవుట వలన.

సున్నతి ఆచరించని మనుష్యుడు తన ప్రజల నుండి తొలిగింపబడునని దేవుడు అబ్రాహాముతో పలికెను. సున్నతి అనగానేమి? ఆత్మలో సున్నతి అనగానేమి? శారీరక సున్నతి అనగా మానవుని శరీరము నుండి గోప్యాంగచర్మము తొలిగించుటై యున్నది. ఆత్మలో సున్నతి అనగా, మన హృదయముల నుండి పాపములను తొలగించుకొని, అవన్నియు ప్రభువైన యేసుక్రీస్తు తాను పొందిన బాప్తిస్మము ద్వారా స్వీకరించెనని విశ్వసించుటయే.

యేసు పొందిన బాప్తిస్మము సమస్త మానవాళికి ఆధ్యాత్మిక సున్నతిగా పరిగణింప బడుతుంది. తద్వారా మన పాపములన్నియు మన నుండి తొలిగింపబడి యేసుపై మోపబడినవి. స్థానికుడైన యోహాను ప్రభువైన యేసుక్రీస్తుకు బాప్తిస్మమిచ్చుటకు కారణమిదియే. అయన పొందిన బాప్తిస్మమే మనము ఆత్మలో పొందు సున్నతి. దాని ద్వారా ఆయన మన పాపములను తొలగించెను. 

లోకపాపమంతా దేవుని గొర్రెపిల్ల అయిన యేసుఫై మోపబడెను. దేవుడు తానే అబ్రాహామునకు, ఇస్సాకునకు, యాకోబునకు వారి సంతతికి దేవునిగా మారి అబ్రాహాముతో చేసిన నిబంధన స్థిరపరచుటకు వారి సంతతికి శారీరక సున్నతి ఆచరింపజేసెను. కనుక ఈ విధముగా శారీరక సున్నతి పొందిన వారికీ ఆయనే మరియు దేవుడాయెను. 

ఈ చర్మమును తొలగించు సున్నతి అనగానేమి? ఇది దేవుడు అబ్రాహాముతో చేసిన నిబంధన. అటులనే యేసు పొందిన బాప్తిస్మము మరియు సిలువ మరణముల యందు విశ్వాసముంచిన వారికీ రక్షణ కలుగజేసెను. ఆ విధముగా మనము దేవుని ప్రజలగుటకు హక్కు అనుగ్రహింపబడెను. కనుక శారీరక లేక ఆధ్యాత్మిక సున్నతిని ఆచరించినవారి దేవుడాయెను. 

దేవుడు అబ్రాహాముతో ఇట్లనెను. "ఎనిమిది దినములు వయస్సుగలవాడు, అనగా నీ ఇంట పుట్టినవాడైనను, నీ సంతానము కాని అన్యుని యొద్ద వెండితో కొనబడినవాడైనను, మీ తరములలో ప్రతి మగవాడు మీలో సున్నతి పొందవలెను. నీ ఇంట పుట్టినవాడును నీ వెండితో కొనబడినవాడును, తప్పక సున్నతి పొందవలెను. అప్పుడు నా నిబంధన మీ శరీరమందు నిత్య నిబంధనగా ఉండును. సున్నతి పొందని వాడు మగవాడు, అనగా ఎవని గోప్యాంగచర్మమున సున్నతి చేయబడదో అట్టివాడు తన జనులలో నుండి కొట్టివేయబడును. వాడు నా నిబంధనను మీరియున్నాడని అబ్రాహాముతో చెప్పెను." (ఆది 17:12-14).

ఎవరైనను సరే ఆ ఆత్మ సంబంధమైన సున్నతిని విశ్వసించకుండా యేసు యొద్దకు వచ్చుటకు ప్రయత్నించిన యెడల వారాయన ప్రజల నుండి తొలగింపబడుదురు. నూతన నిబంధనలోని యేసు బాప్తిస్మము ఆత్మ సంబందమైన సున్నతికి సాదృశ్యము. దీని ద్వారా లోక పాపమంతయు యేసు పైమోపబడెను. 

యేసు నందు విశ్వాసముంచిన వారు, పాత నిబంధనలోని ఈ శారీరక సున్నతిని, అటులనే నూతన నిభంధనలోని యేసు పొందిన నీటి బాప్తిస్మమును విశ్వసింపవలెను. కనుక వారి ఆత్మను పొంది, తమ పాపముల నుండి రక్షింపబడుదురు. పాత నిబంధనలోని సున్నతి నూతన నిబంధనలోని యేసు పొందిన బాప్తీస్మమునకు సమానము. 

మనకు ఈ సున్నతి యొక్క పరిపూర్ణ అవగహన లేని యెడల లేక మనకు తిరిగి జన్మించు అనుభవమును అటులనే దాని ద్వారా లభించు రక్షణను మన హృదయములలో అంగీకరింపనియెడల, మన విశ్వసము వృధాయే. మనమెంతో దేవునికి విశ్వాసులమని భావించినను ఇసుక మీద కట్టిన ఇల్లువంటి జీవితమగును.

దేవుని యందు విశ్వాసముంచిన వారందరు సున్నతి పొందవలెనని పాత నిబంధనలో దేవుడు ఆదేశించెను. అటులనే యేసు పొందిన బాప్తిస్మమును విశ్వసించి విమోచన పొందుటకు ఈ ఆత్మ సంభందమైన సున్నతి కూడా నూతన నిబంధన కాలములో అవసరమే. ఈ సున్నతి లేని యెడల మనమాయన ప్రజల నుండి వేరు పరచబడుదుము. అందువలననే డబ్బు ఇచ్చి కొనబడిన వ్యక్తి అయినను, పరదేశి అయినను పస్కా పండుగలో పాలుపొందుటకు ముందుగానే సున్నతి ఆచరింపవలయునని శాసించెను. 

ఇశ్రాయేలు కుటుంబములలో పుట్టిననూ సరే, సున్నతి ఆచరింపని యెడల వారి పేరులు కొట్టివేయబడును. ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు చేసికొన్న నిబంధన, ప్రభువైన యేసు నందు విశ్వాసముంచిన వారి కందరకు వర్తించును. 

నిర్గమ 12వ అధ్యాయములో, సున్నతి ఆచరించిన వారే పస్కా బలి పశువు యొక్క మాంసమును ఆరగించిరి. కేవలము సున్నతి ఆచరించినవారికే పస్కా మాంసము తిను హక్కు ఇవ్వబడినది. 

ఇశ్రాయేలు ప్రజలు సున్నతి ఆచరించిన తరువాత పస్కా మాంసము తిని, ఆ రక్తమును తమ ద్వార బంధముల మీద రెండు అడ్డకమ్మీలకు, ఒక నిలువ కమ్మికి పూసిరి. 

దేవుని కట్టడ ప్రకారం సున్నతి ఆచరింపనివాడు తన ప్రజలలో నుండి తొలగింపబడును. మరియు దేవుని ప్రజగా మారుటకు వీలులేదు. కనుక ఈ ఆత్మ సంబంధమైన సున్నతి విషయంలో కూడా అవిశ్వాస పాపము వలన ప్రజలు నశించుచున్నారు. ఎవరైతే యేసు బాప్తిస్మము నందు విశ్వాసముంచి ఆత్మ సంబంధమైన సున్నతి ఆచరిస్తారో వారే ప్రభువైన యేసు అందించిన రక్షణకు పాత్రులు.

"దీనికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్ము రక్షించుచున్నది." అని చెప్పబడినది. (1 పేతురు 3:21). యొర్దానులో ప్రభువైన యేసు పొందిన బాప్తిస్మము ద్వారా నీ పాపములన్నియు ఆయనపై మోపబడినవని నీవు సంపూర్ణముగా విశ్వసిస్తున్నావా? నీవు యేసు పొందిన బాప్తిస్మము మరియు సిలువ మరణముల యొక్క సంపూర్ణ అవగహన కలిగి అంగీకరించిన యెడల, ఆ సత్యము వలన నీవు ఆత్మ సంబంధమైన సున్నతి పొంది, నీతిమంతునిగా తీర్పు పొందెదవు. యేసు బాప్తిస్మము లేకుండా సిలువ రక్తమునకు విలువలేదని గ్రహించవలెను. 

నీవు ఈ ఆధ్యాత్మిక సున్నతియను, యేసు పొందిన నీటి బాప్తిస్మము నందు విశ్వాసముంచక పోయిన యెడల, దేవుని కనికరము నుండి కొట్టివేయబడుదురు. అప్పుడూ ఇంకనూ నీ హృదయము పాపముతో నిండియుండుట నీవే గమనించగలవు. 

దేవుని యొక్క సంపూర్ణ విమోచన యేసుక్రీస్తు బాప్తిస్మముతో ప్రారంభమై, ఆయన సిలువ బలియాగముతో సాధింపబడినదన్న సత్యము నందు విశ్వసించవలెను. దానిని మన జీవితాలలో నెరవేర్చుకొనాలంటే, యేసు పొందిన బాప్తిస్మము మరియు ఆయన కార్చిన రక్తమునకు సంబదించిన సత్యాన్ని మన రక్షణకు ఆధారంగా విశ్వసించాలి. 

ఈ విశ్వాసము వలన మనము అంధకార శక్తుల నుండి విడిపింపబడి వెలుగు బిడ్డలుగా మారగలము. ఈ విశ్వాసము హేతువుగా చేసుకొని సామాన్య విశ్వాసులు నుండి. తిరిగి జన్మించిన అనుభవము గలవారముగా వేరుపరచబడుదుము. 

మీరు నాలో నిలచియుండుడని మన ప్రభువైన యేసు సెలవిచ్చెను. ఆయన పొందిన బాప్తిస్మము ద్వారా మరియు సిలువపై చిందించిన రక్తము ద్వారా యేసు మన పాపములను శుద్ధీకరించెను. కనుక దేవుని పిల్లలముగా మనము గుర్తించచబడు నిమిత్తము, యేసుక్రీస్తు పొందిన బాప్తిస్మము నందు విశ్వాసముంచాలి. ఈ ప్రధాన విషయములో మనము తప్పి పోయిన యెడల దేవుని నుండి మనము వేరుపర్చబడుదుము.

నూతన నిబంధనలో యేసు పొందిన బాప్తిస్మము, పాత నిబంధనలోని సున్నతియే విమోచనాత్మకమైన రక్షణకు ఆధారమై యున్నది. మనము యేసుక్రీస్తు పొందిన బాప్తిస్మము నందు (ఆత్మ సంబంధమైన సున్నతి) మరియు సిలువపై ఆయన కార్చిన రక్తము (పస్కా బలి పశువు యొక్క రక్తము) నందు వుంచే విశ్వాసమే "రక్షణ" అను ప్రక్రియను సంపూర్ణపరచును. 

పాత నిబంధనలోని శరీర సంబంధమైన సున్నతియే నూతన నిబంధనలో యేసు పొందిన బాప్తిస్మము. యెషయా 34:16 ప్రకారం బైబిల్లోని ప్రతి మాటకు జత యుండును. "యోహోవా గ్రంధమును పరిశీలించి చదువుకొనుడి. ఈ జంతువులలో ఏదియు లేక యుండదు దేని జత పక్షి దాని యొద్ద ఉండక మానదు. నా నోట నుండి వచ్చిన ఆజ్ఞ ఇదే అయన నోటి ఊపిరి వాటిని పోగుచేయును."

పాట నిబంధనలోని ప్రతిమాటకు నూతన నిబంధనతో సంబంధము కలిగియుండును. దేవుని ఏ ఒక్క మాటకు జత ఉండకమానదు.



తప్పుడు విధానములలో, మూర్ఖతతో విశ్వసించు వారి సంగతేమగును?


  • ఈ ప్రపంచములోని విశ్వాసులలో 
  • ఎవరు నరకమునకు వెడలెదరు?
  • ఈ ఆధ్యాత్మిక సున్నతిని ఆచరింపనివారే.


ఈ రోజులలో అనేకులు పస్కా గొర్రెపిల్ల రక్తము నందు మాత్రమే విశ్వాసముంచు చున్నారు. అసలు సున్నతి అనగానేమి? అని వారడుగుతారు. ఇది పాత నిబంధన కాలములో యూదులకు సంబందించిన విషయమైయున్నది. అయితే ఈ నూతన నిబంధన కాలములో మనకు శారీరక సున్నతి అవసము లేదు.

అవును ఇది నిజమే. మనము శారీరక సున్నతి చేయించుకోవాలని నేను అనడం లేదు అపొస్తలుడైన పౌలు ఈ ఆధ్యాత్మిక సున్నతి గురించి విపులంగా వివరించాడు. హృదయ సున్నతి గురుంచి నేనిప్పుడు మాట్లాడుతున్నాను. 

నేను శారీరక సున్నతి గురుంచి మాట్లాడుటలేదు. నూతన నిబంధనలో శారీరక సున్నతికి అసలు అర్థము లేదు. మన పాపముల నుండి రక్షణ పొందుటకు మనము యేసు పొందిన బాప్తిస్మము నందు విశ్వాసముంచి, ఈ ఆత్మ సంబంధమైన సున్నతి ద్వారా ప్రభువు నొద్దకు రాగలము. 

ఎవరైననూ సరే తిరిగి జన్మించు అనుభవము పొందవలెనన్నచో ఈ ఆత్మ సంబంధమైన సున్నతి పొందవలెను. యేసు నందు విశ్వాసముంచిన ప్రతి యొక్కరికి ఈ ఆత్మ సంబంధమైన సున్నతి అవసరము. ఇదే మన పాపములు తొలిగించబడుటకు మరియు నీతిమంతులుగా తీర్పు పొందుటకు ఏకైక మార్గము. ఈ ఆత్మ సంబంధమైన సున్నతి పొందిన పిదప మనము సంపూర్ణముగా పాపమునుండి విడిపించబడుదుము. కనుక యేసు పొందిన బాప్తిస్మము నందు విశ్వాసముంచి, హృదయ సంబంధమైన సున్నతి మనము అంగీకరించవలెను. 

అపొస్తలుడైన పౌలు భక్తుడు కూడా ఈ ఆత్మ సంబంధమైన సున్నతిని ముఖ్యమైనదిగా యెంచి ఉన్నాడు. "మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మ నందు జరుగునదే." (రోమా 2:29) అని తెలియజేసెను. పాపము నుండి విడిపించుటకు ప్రతియొక్కరు హృదయ సంబంధమైన సున్నతిని ఆచరింపవలయును.

నీ నుండి తొలిగింపబడిన పాపములు నిజముగా యేసునకు ఆరోపింపబడినవా? నూతన నిబంధనలో కూడా యేసు పొందిన బాప్తిస్మము నందు విశ్వాసముంచి, హృదయములో సున్నతి ఆచరించిన వారే యేసు నందు సరి అయిన విశ్వాసముంచగలరు. 

తన పత్రికలలో అపొస్తలుడైన పౌలు దీనిని గురుంచి స్పష్టముగా వివరించెను. దేవుడు మానవాళి నంతయు తమ పాపముల నుండి విడిపించెను. వారిని తన ప్రజలుగా చేసికొనెను. ఇశ్రాయేలు ప్రజలు శారీరక సున్నతి ఆచరించిరి. ఆ విధముగా దేవుని ప్రజలైరి. మనమును యేసు పొందిన బాప్తిస్మము నందు విశ్వాసముంచి మన పాపములను యేసు నందు ఆరోపించవలయును. అప్పుడే దేవుని ప్రజలము కాగలము. 

యేసు పొందిన బాప్తిస్మము మరియు సిలువలో కార్చిన రక్తము నందు విశ్వాసముంచి నప్పుడే మనలను అయన ప్రజలుగా అంగీకరించెను. ఈ విశ్వాసము మనలను హృదయ సంబంధమైన సున్నతికి లోనగునట్లు రక్షణకు నడుపును.



యేసు పొందిన బాప్తిస్మము మరియు కార్చిన రక్తము ద్వారా పాపులకు రక్షణ లభించును.


  • యేసు ఈ రక్షణ కార్యమును 
  • ఎటుల ముగించెను ?
  • అయన పొందిన బాప్తిస్మము మరియు
  • సిలువ మరణము ద్వారా


యేసుక్రీస్తు వారు ఆయన పొందిన బాప్తిస్మపు నీరు మరియు సిలువపై కార్చిన రక్తము ద్వారా పాపులకు రక్షణను సిద్దపరిచెను. గొర్రెపిల్ల రక్తము తీర్పుగాను, యేసు పొందిన బాప్తిస్మము హృదయ సంబంధమైన సున్నతిగాను మన పాపములను యేసుఫై ఆరోపించుటకు వీలాయెను. 

ఈ హృదయ సంబంధమైన సున్నతిని క్రైస్తవ సంఘాలు తేలికగా తీసుకోరాదు. పాత నిబంధనలో శారీరక సున్నతి కాదు గాని, యేసు పొందిన నీటి బాప్తిసమ్మును మనము నిర్లక్ష్యము చేయరాదు. 

యేసు పొందిన ఈ బాప్తిస్మము మన సకల పాపములను తొలగించెను. అంతేకాక మన పాపముల నుండి రక్షించెను. దీనిని విశ్వసిస్తారా? ఈ బాప్తిస్మమును నిర్లక్ష్య పరచినచో తిరిగి జనియింపచేయు సువార్తను కనుగొనలేరు. యేసు పొందిన బాప్తిస్మము ద్వారా మానవాళికి సంపూర్ణ విమోచన కలుగును.

దేవునిచేత తెలుపబడిన ఈ హృదయ సంబంధమైన సున్నతి అనగా యేసు పొందిన బాప్తిస్మమును మనమేలాగు నిర్లక్ష్య పరచగలము? మనము జీవ గ్రంధమును సరిగా ధ్యానించిన యెడల సున్నతి మరియు మన పస్కా గొఱ్ఱె పిల్ల అయిన యేసుక్రీస్తు చిందించిన రక్తము అవినాభావ సంబంధము గలవైయున్నవి. ఇదే యేసుక్రీస్తు యొక్క బాప్తిస్మమునకు సరైన ఆత్మ సంబంధమైన సున్నతిలోని మర్మము. 

అపోస్తులుడైన యోహాను బోధించిన ఈ సువార్త యేసుక్రీస్తు పొందిన బాప్తిస్మము మరియు సిలువపై చిందించిన రక్తమే. అందులకే మొదటిగా 1యోహాను పత్రిక 5:6లో ఈ విధముగా తెలుపబడినది. "నీళ్ల ద్వారాను, రక్తము ద్వారాను వచ్చినవాడు ఈయనే. అనగా యేసుక్రీస్తే. ఈయన నీళ్లతో మాత్రమే కాక నీళ్లతోను రక్తముతోను వచ్చెను. ఆత్మ సత్యము గనుక సాక్ష్యమిచ్చువాడు ఆత్మయే."

దీని ప్రకారము యేసు నీళ్లతోను, రక్తముతోను మరియు ఆత్మ ద్వారాను వచ్చెను. ఈయన నీళ్లతో మాత్రమే కాక మరియు రక్తముతో మాత్రమే కాక నీళ్లు, రక్తము మరియు ఆత్మతో వచ్చెను. ఈ మూడూ అనగా యేసుక్రీస్తు యొక్క నీటి బాప్తిస్మము, సిలువఫై యేసు చిందించిన రక్తము మరియు మృతులలో నుండి ఆయన పునరుధ్ధానము, ఇవన్నియు ఒక్కటే. అదే మన రక్షణకు రుజువైయున్నది.



యేసు యొక్క బాప్తిస్మము మరియు ఆయన చిందించిన రక్తము గురుంచి బైబెల్ లో ఎందువలన తెలియపరచబడెను?


  • ఇశ్రాయేలీయులు పస్కా గొర్రెపిల్ల యొక్క
  • రక్తము వలననే విమోచింపింపబడితిరా?
  • కానేకాదు. వారు పస్కా ఆచరించుటకు
  • ముందుగా సున్నతి చేయించుకొనిరి.


యేసు పొందిన బాప్తిస్మము మరియు ఆయన చిందించిన రక్తము మనలను నీరు మరియు ఆత్మల ద్వారా తిరిగి జన్మిoపచేయును. నిర్గమ 12వ అధ్యాయములో ఈ విధముగా తెలియపరచబడినది. "మీరు దాని చంపి, దాని రక్తము కొంచెము తీసి, తాము, ఇండ్ల ద్వారా బంధపు రెండు నిలువ కమ్ములమీదను మరియు పై కమ్మి మీదను చల్లవలయును. నేను ఈ రక్తమును చూచినప్పుడు మిమ్ములను దాటిపోవుదును. 

ఇవన్నియు తెలిసికొనిన తరువాత కూడా కేవలం పస్కా గొర్రెపిల్ల రక్తము నందు విశ్వసించినంత మాత్రముననే మన పాపములన్నిటి నుండి రక్షింపబడుదుమా? అసలు నూతన నిబంధనలో యేసుక్రీస్తు యొక్క బాప్తిస్మము గురుంచి ఎందుకు అనేక సార్లు ప్రస్తావించబడినది? ''మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడినవారై '' (కొలస్సి 2:12). "క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరు క్రీస్తును ధరించుకొనియున్నారు." (గలతి 3:27). "..... దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్ములను రక్షించుచున్నది ". (పేతురు 3:21).

అపొస్తలులైన పేతురు, పౌలు మరియు యేసుక్రీస్తు వారు మిగిలిన శిష్యులందరు ఆయన పొందిన బాప్తిస్మము గురించి వివరించిరి. ఇప్పుడు మనము మాట్లాడుకొనుచున్నది యొర్దాను నదిలో యేసుపొందిన బాప్తిస్మము గురుంచియే.

యేసుక్రీస్తు పొందిన బాప్తిస్మములోను మరియు సిలువపై చిందించిన రక్తములోను మనముంచు విశ్వాసమే నీరు మరియు ఆత్మ ద్వారా తిరిగి జన్మింపచేయు సత్యమైయున్నది. 

మీతో ఒక సత్యాన్ని పంచుకుంటాను, నేను యేసుక్రీస్తు నందు విశ్వాసముంచిన వ్యక్తిని. అయితే దాదాపు పది సంవత్సరాలు ఆయన సిలువ రక్తము నందే నా నమ్మిక ఉంచియుంటిని. యేసుక్రీస్తు పొందిన బాప్తిస్మమును అప్పుడు నేను పరిగణలోకి తీసుకొననేలేదు. యేసు సిలువయందు నేనుంచిన విశ్వాసము మరియు దానిని గురించిన జ్ఞానము 

నా హృదయములోని పాపములను శుద్దీకరించలేకపోయినవి. నేను హృదయ పూర్వకముగా యేసు నందు విశ్వాసముంచినప్పటికీ ఇంకనూ నా హృదయము పాపముతో నిండియున్నది. 

దాదాపు పది సంవత్సరములు తరువాత ఆత్మ సంబంధమైన సున్నతి గురించి నేను తిరిగి నేను తెలిసికొనియుంటిని (యేసుక్రీస్తు బాప్తిస్మము). ఆ తరువాత నేను తిరిగి జన్మించిన అనుభవము పొందియుంటిని. అప్పుడే నాకీ మర్మము తెలిసినది. పాత నిబంధనలోని ఈ శారీరక సున్నతి, నూతన నిబంధనలో యేసు పొందిన బాప్తిస్మమునకు సాదృశ్యము. నేను ఈ సత్యమునందు విశ్వాసముంచితిని. మరియు ఎల్లపుడు విశ్వసిస్తాను. 

"నూతన నిబంధనలో యేసుక్రీస్తు రక్తము నందు మరియు బాప్తిస్మము నందు విశ్వాసముంచుట సరైన విధానమా? బైబిల్ ప్రకారము నా నమ్మకము సత్యమైనదేనా? నేను తిరిగి జన్మించిన తరువాత ఈ విషయములు గురుంచి ఆలోచన చేసియున్నాను.

నేను ఈ బాప్తిస్మము నందు మరియు రక్తము నందు విశ్వాసముంచిననూ అనేక ప్రశ్నలు నా మనసులో నిలిచియున్నవి. "యేసుక్రీస్తు వారు బాప్తిస్మము పొందినప్పుడు నా సకల పాపములు ఆయనపై ఆరోపించబడినవి అన్న సత్యమునందు విశ్వాసముంచుట సరైనదేనా? లేక యేసుక్రీస్తు వారి సిలువ మరణము ద్వారా నేను రక్షకుడని నమ్మిన యెడల సరిపోదా? " నిర్గమ కాండము 12వ అధ్యాయము ధ్యానించు వరకు ఈ ప్రశ్నలు నా హృదయమును ఇబ్బంది పరిచినవి. 

అనేకమంది ఈ దినములలో నిర్గమ కాండము 12వ అధ్యాయము ధ్యానించిననూ యేసుక్రీస్తు సిలువలో మన రక్షకునిగా ఉండు నిమిత్తమై మరణించెనన్న విషయము మరి మరి ఆలోచింపరు. వారు యేసు చిందించిన రక్తము నందు విశ్వాసముంచి కేవలము అదియే వారి పాపాపు ఒప్పుకోలులోని రహస్యమని సాక్ష్య మిచ్చుచున్నారు. వారు యేసును రక్షకునిగా అంగీకరించిన మాత్రాన వారు రక్షింపబడుదురని విశ్వసించెదరు. ఇంకనూ వారి హృదయములు పాపముతో నిండుకొనియె యున్నది. 

ఈ విధమైన విశ్వాసము సరైనది కాదు. కేవలము విశ్వాసము వలన ఎవరునూ తిరిగి జన్మించు అనుభవమును పొందుకొనిరి. యేసు పొందిన బాప్తిస్మము మరియు ఆయన చిందించిన రక్తమే మనలను నీతిమంతులుగా చేయును. 

మరి నిర్గమ 12వ అధ్యాయము యొక్క సరైన అర్థమేమి? "కేవలము యేసుక్రీస్తు రక్తము నందు మాత్రమే విశ్వాసముంచి అయన పొందిన బాప్తిస్మమును నిర్లక్ష్య పరచిన యెడల ఏమైనా సమస్య వచ్చునా?" అని బైబిలును ధ్యానించితిని. నేను ఈ పుస్తకము ముగించక మునుపే మన రక్షణ యొక్క రహస్యమును అనగా కేవలము యేసు యొక్క రక్తమే కాదు గాని అయన పొందిన బాప్తిస్మము నందు కూడా విశ్వాసముంచవలెనని కనుగొన్నాను. బైబిల్ ప్రకారము మనము యేసు పొందిన బాప్తిస్మము ద్వారా మన హృదయములలో సున్నతి ఆచరించిన వారమని బలపరచబడితిమి. ఈ యేసు పొందిన బాప్తిస్మము ద్వారా మరియు సిలువ రక్తము ద్వారా మా హృదయములు ఆధ్యాత్మిక సున్నతి ఆచరించినవని నాకు నిశ్చయముగా తెలియపరచబడినది.


  • క్రైస్తవులు అనేకులు ఇంకనూ పాపులుగా
  • ఎందువలన వుంటిరి ?
  • యేసు పొందిన బాప్తిస్మమును
  • వారు విశ్వసించరు గనుక.


నిర్గమ 12:47-79 ద్వారా ఒకరు కేవలము పస్కా గొర్రిపిల్ల మాంసమును భుజించుటకు సున్నతి ఆచరించకే తినవచ్చునా? అందులకే 49వ వచనము ఈ విధముగా తెలియపర్చింది. "దేశస్థునికి, మీలో నివసించు పరదేశికినీ దీని గూర్చి ఒక్కటే విధి యుండవలయుననెను. 

కనుక సున్నతి ఆచరించనివారు పస్కా గొర్రె పిల్ల యొక్క మాంసమును తినగూడదు. నేను కనుగొనిన సత్యమిదియే. అదే విధముగా యేసుక్రీస్తు మన రక్షకుడని విశ్వసించిన యెడల ముందుగా యొర్దానులో యేసు పొందిన బాప్తిస్మము ద్వారా సకల మానవుల పాపములు ఆయన ఆరోపింపబడినవని విశ్వసించవలయును. ఆ తరువాత మన నిమిత్తమై ప్రభువైన యేసు సిలువలో మరణించెనని గ్రహించవలయును.

సిలువలో మరణించిన యేసు పొందిన బాప్తిస్మము ద్వారా మన ఈ పాపములను వహించెనని మనము గ్రహించవలయును. మరియు ఈ ఆత్మ సంబంధమైన సున్నతి ద్వారా సకల మానవుల పాపములు మరియు అపరాధములు తొలగింపబడినవి అదే ఆత్మ సంబంధమైన సున్నతియని నేను గ్రహించితిని. 

ఆ క్షణముననే నా పాపములన్నియు తొలగింపబడినవి నేను తెలుసుకొంటిని. నా హృదయము మంచుకంటే తెల్లనిదాయెను. చివరకు ఈ నీరు, రక్తము మరియు ఆత్మ సంబధమైన సువార్తను నేను హృదయములో అంగీకరించియుంటిని.

పాత నిబంధనలోని శారీరక సున్నతి మరియు గొర్రిపిల్ల రక్తము అటులనే యేసుక్రీస్తు పొందిన బాప్తిస్మము ద్వారా ఈ లోక పాపమంతయు తొలిగింపబడిన మరియు ఆయన సిలువ రక్తము ద్వారా దృఢపరచబడెనన్న నూతన నిభంధనలోని సత్యమును గ్రహించితిని. పాత నిబంధనలోని శారీరక సున్నతి మరియు నూతన నిబంధనలోని యేసు పొందిన బాప్తిస్మము ఒక్కటే.

ఆయన చేసిన పాపములను బట్టి ప్రభువైన యేసు తీర్పునకు గురి కాలేదు. కేవలము ఆయన పొందిన బాప్తిస్మము ద్వారా సకల లోకపాపములను తానే వహించుటను బట్టి తీర్పు పొందెను. స్థానికుడైన యోహాను మానవాళికి ప్రతినిధిగా యేసునకు బాప్తిస్మమిచ్చి లోకపాపమంతయు యేసు పై మోపెనని విశ్వసించవలయును. యేసు పొందిన బాప్తిస్మము మరియు ఆయన సిలువ రక్తము నందు విశ్వసించవలయును. 

బైబిల్ లో అనేకసార్లు తెలియపరచబడినను ఎందువలన అనేకులు యేసుక్రీస్తు పొందిన బాప్తిస్మమును నిరాకరించుచున్నారు.? ప్రభువైన యేసు నందు విశ్వాసముంచినను, ఆయన బాప్తిస్మమును విశ్వసించని యెడల వారింకను పాపులుగానే పరిగణించబడుతున్నారు. వారు యేసు నందు నమ్మిక వుంచినను దేవునికి దూరంగానే ఉన్నారు. యేసు నందు విశ్వాసముంచి కూడా వీరు పాపులై నరకమునకు పాత్రులగుచున్నారు గదా. 

యేసు నందు విశ్వాసముంచినను, వారు ఎలాగూ పాపులుగా పరిగణించబడుతున్నారు. వారు ఎందులకు ఇంకనూ పాపులుగానే జీవిస్తున్నారు. వారు ఎందుకు ఇంకను నాశనమునకు పరుగు తీస్తున్నారు ? ఇది ఎంతో విచారించదగిన విషయము. యేసుక్రీస్తు తాను పొందిన ఆత్మ సంబంధమైన బాప్తిస్మము ద్వారా ప్రజలకు నిత్యజీవమును అనుగ్రహించెను. ఆ బాప్తిస్మము ద్వారా లోక పాపమంతయు ఆయన స్వీకరించియున్నాడు. ఈ విషయములను విశ్వసించక పోవుట వలననే వీరింకను పాపులుగా జీవిస్తున్నారు. 

అనేకులు కేవలము యేసుక్రీస్తు రక్తము నందు విశ్వాసముంచిన యెడల విమోచింపబడుతున్నామని నమ్ముతున్నారు. అయితే ఈ విశ్వాసము సంపూర్ణమైనది కాదు. ఎందువలన? వారింకను తమ పాపములను ప్రభువైన యేసునకు ఆపాదించలేదు కనుకనే. 

మనము ఈ నీటి యందు (యేసు పొందిన బాప్తిస్మము) మరియు ఆయన సిలువలో కార్చిన రక్తము నందు విశ్వాసముంచిన యెడల దేవుని చిత్తానుసారము రక్షింపబడుదుము. కేవలము అప్పుడే మనము దేవుని పిల్లలము కాగలము.

"మనము కేవలము ఆత్మ సంబంధమైన సున్నతికి సాదృశ్యమైన యేసు రక్తము నందు విశ్వసించినంత మాత్రమున మన పాపములు సంపూర్ణముగా శుద్ధీకరింపబడునా?" అని మనము ప్రశ్నించుకొనవలెను. ఈ ప్రశ్నకు సమాధానము నిమిత్తమై మన హృదయములో సరైన ఆలోచన చేయవలెను. 

పాత నిబంధనలోని ప్రజలు శారీరక సున్నతి వలనను మరియు పస్కా గొర్రె పిల్ల రక్తము వలనను రక్షింపబడిరి. అటులనే మనమును యేసుక్రీస్తు పొందిన బాప్తిస్మము ద్వారాను మరియు సిలువలో ఆయన కార్చిన రక్తము వలనను రక్షింపబడుదుము. ఈ విధముగా చేయుట వలన మనము ఈ పాప లోకము నుండి వేరుపడి దేవుని ఉగ్రత తప్పించు కొనవచ్చును. దీని యందు విశ్వసించుట ద్వారా మనము దేవుని పిల్లలగుదుము. మరియు దేవుడు మన పరమతండ్రియగును. 

ఒక వ్యక్తి ఈ రెండిటియందు విశ్వాసముంచుట ద్వారా రక్షింపబడి దేవుని స్వజనులలో చేరును. శారీరక సున్నతి మరియు పస్కా గొర్రె పిల్ల రక్తము, యేసు పొందిన బాప్తిస్మమునకు మరియు ఆయన రక్తమునకు సాదృశ్యముగా ఉన్నవి. ప్రభువైన యేసు తెలియపరిచిన సత్యమిదియే. నీరు, రక్తము మరియు ఆత్మ ద్వారా తిరిగి జన్మించుటలోని సత్యము ఇదే.



బైబిల్ లో తెలియపర్చిన ఈ నీరు మరియు ఆత్మ వలననైనా విమోచన అనగా నేమి?


  • కేవలము యేసు రక్తము నందు
  • విశ్వాసముంచిన యెడల పాపులు
  • నీతిమంతులుగా మారుదురా?
  • కానేకాదు.


యేసు పరలోక సింహాసనమును వదిలి ఈ భూమి పైకి దిగివచ్చాడు. తన 30వ సంవత్సరములో స్థానికుడైన యోహాను ద్వారా బాప్తిస్మము పొంది సకల లోక పాపములను తొలిగించెను.

ఈ లోకములోని సకల పాపులకు విధింపబడవలసిన శిక్ష తాను పొంది యేసు సిలువలో తన రక్తమును కార్చాడు. యేసుక్రీస్తు ఈ లోకమునకు రక్షకునిగా అవతరించి తాను పొందిన నీటి బాప్తిస్మము మరియు కార్చిన సిలువ రక్తము ద్వారా ఈ లోకములోని పాపులందరిని రక్షణ మార్గములోనికి నడిపించెను. 

మనము కేవలము రక్తము ద్వారా తిరిగి జన్మించగలమా? అటుల కాదు. మనము యేసు పొందిన బాప్తిస్మము మరియు ఆయన సిలువపై కార్చిన రక్తము వలన రక్షింపబడితిమి యేసుక్రీస్తు నందు మాత్రమే విశ్వాసముంచిన వారికి నేను ఒక ప్రశ్న వేయాలని ఆశిస్తున్నాను. "పాపులు కేవలము యేసు రక్తమును విశ్వసించినంతనే నీతిమంతులగుదురా లేక ఆయన పొందిన బాప్తిస్మము మరియు సిలువ రక్తము నందు విశ్వాసముంచి పరిశుద్ధులగుదురా?మన పాపములన్నియు అయన పొందిన బాప్తిస్మము మరియు సిలువ మరణము ద్వారా యేసు క్రీస్తుకు ఆపాదించబడినవా లేక కేవలము ఆయన రక్తమునకేనా? ఈ రెంటిలో సత్య మేమై మైయున్నది?"

మనము ఈ నీరు మరియు ఆత్మ ద్వారా తిరిగి జన్మించవలయునన్న ఈ క్రింద ఉదాహరించబడిన విషయములను పాటించవలయును. యేసు ఈ లోకమునకు సశరీరుడిగా అరుదెంచెననియు యొర్దాను లో ఆయన పొందిన బాప్తిస్మము ద్వారా లోక పాపములు స్వీకరించెననియు, అందు నిమిత్తమే మన పాపములకు ప్రత్యామ్నాయముగా మనకు విధింపబడ వలసిన శిక్ష సిలువలో ఆయన పొం దెననియు విశ్వసించవలయును. మన ఏకైక రక్షకుడైన యేసుక్రీస్తు నందు వుంచబడిన ఈ విశ్వాస మూలముగానే మనము నిజముగా తిరిగి జన్మించు అనుభవము పొందుకొనగలము. 

నేను మరియొకసారి మిమ్ములను ప్రశ్నిస్తున్నాను. బైబిల్లో తెలియపర్చబడిన సంపూర్ణమైన విశ్వాసము ఏమి యున్నది. ? అది కేవలము యేసు రక్తములోని విశ్వాసమా లేక ఆయన బాప్తిస్మము మరియు రక్తములో విశ్వాసమా?

యేసు రక్తము నందలి విశ్వాసమును ఈ విధముగా వివరించవచ్చును. ప్రభువైన యేసు లోక పాపముల నిమిత్తమే శిక్షకులోనై తీర్పు పొందెను. మన పాపముల కొరకై ఆయన గాయపరచబడెను. మరియు నలుగగొట్టబడెను. దానిద్వారా మనము భయంకరమైన తీర్పు నుండి బయటకు రాగలిగితిమి. ఇది మాత్రమే సంపూర్ణమైన సత్యము కాదు. ఈ సిద్ధాంతమును మనము అంగీకరించుటకు ముందుగా ఒక విషయము గ్రహించవలయును. అసలు ఎందువలన ప్రభువైన యేసు సిలువ వేయబడెను? 

బైబిల్ లో ఈ విషయము చాలా స్పష్టముగా విశదీకరించుచున్నది. పాపమునకు జీతము మరణము. అలాగైతే యేసు పాపమే చేయనివాడు. కన్య మరియ గర్భమును ఆస్పాదముగా చేసుకొని మానవ శరీరధారి అయి ఈ లోకమునకు వచ్చియుండెను. ఆయన పరిశుద్ధమైన దేవుని కుమారుడైన పాపుల రక్షకుడైన తన ప్రజల నిమిత్తము అరుదెంచెను. అందులకే తాము సిలువను అధిరోహించుటకు ముందుగానే స్థానికుడైన యోహాను వలన బాప్తిస్మము పొందెను. ఆయన పొందిన బాప్తిస్మము ద్వారా మన పాపములన్నియు యేసే స్వీకరించెను. ఈ బాప్తిస్మము ద్వారా మన పాపములు ఆయనకు ఆరోపింపబడవు కదా. అటుల జరగనిచో యేసు క్రీస్తు మన నిమిత్తమై శిక్షింపబడుటకు లేదా సిలువ మరణము చెందుటకు వీలు లేదు.



పాత నిబంధనలోని బలి విధానము.


  • బలిని అర్పించుటకు అవసరమైనవి ఏవి ?
  • 1) లోపము లేని సజీవమైన జంతువు కావలెను.
  • 2) హస్త నిక్షేపణ చేయవలెను.
  • 3) దాని రక్తము అర్పించవలయును.


ప్రత్యక్ష గుడారములో అర్పించబడిన ఈ బలులకు సంబందించిన సత్యమును పరిశీలించెదము. పాత నిబంధన గ్రంథములో పాపి అయిన ఒక మనుష్యుడు గాని లేక ప్రధాన యాజకుడుగాని బలి పశువు తల పై తన రెండు చేతులుంచి తన స్వకీయ పాపములను లేక ఇశ్రాయేలీయుల పాపములను దాని తలపై ఆరోపించవలయును. పాత నిబంధన కొత్త నిబంధనకు మార్గదర్శి. దేవుడు వాగ్దానము చేసిన బలి అర్పించబడవలసిన గొర్రె పిల్ల యేసుక్రీస్తే. 

మనమందరము మన పాపములన్నియు ఏ విధముగా యేసుక్రీస్తుకు ఆపాదించగలము? ఈ విషయములో మీరూ కొంచెం ఆలోచించి సమాధానమివ్వ వలసి నదిగా కోరుతున్నాను. పాత నిబంధనలో ఇశ్రాయేలీయులు బలి పశువు తల పై తమ రెండు చేతులుంచి బలి ఇచ్చెడివారు. (ఈ హస్త నిక్షేపణమునకు కారణము తమ పాపములను ఈ బలి పశువుపై ఆరోపించుటకు). ఈ బలి పశువులు బలిపీఠము వద్దకు ఈ బలి ఇయ్యబడు జంతువుపై ఆరోపించబడును.

"అతడు దహన బలిగా అర్పించు తల మీద తన చేయి నుంచవలెను, అతని నిమిత్తముగా ప్రాయశ్చితము కలుగు నిమిత్తము అది అతని పక్షముగా అంగీకరింపబడును." (లేవి 1:14) లేవి కాండములో తెలియపర్చబడిన ప్రకారము బలిగా అర్పింపబడు జంతువుల తలపై ఈ విధముగా హస్త నిక్షేపణ చేయవలెను. ఈ బలి పశువు తలపై తమ చేతులుంచుట ద్వారా ఇశ్రాయేలీయులు తమ పాపములను ఆ బలి పశువునకు ఆరోపించు దేవుని సన్నిధిలో విశ్వాసము ద్వారా దాని రక్తమును మాంసమును బల్యర్పణ చేయుట ద్వారా వారి పాపముల నుండి విడిపించబడుదురు. పాత నిబంధన కాలములో ఇశ్రాయేలీయులు ఈ విశ్వాసము ద్వారా రక్షింపబడితిరి. 

దేవుని సన్నిధిలో దహనబలిగా అర్పింపబడిన జంతువు తలపైన ఒక పాపి తన రెండు చేతులుంచి తన పాపములన్నియు దాని పై ఆరోపింపవలయును. అప్పుడు ఆ పాపి పక్షముగా ఆ బలిపశువు చంపబడును. దాని రక్తము బలిపీఠపు నాలుగు కొమ్ములపై కొంచెము చల్లవలెను. మిగిలినది బలిపీఠము వద్ద నెలపై పోయవలెను. ఈ విధముగా పాపుల పాపములు పరిహరింపబడి విమోచన పొందుదురు. 

నూతన నిబంధనలో యేసుక్రీస్తు పొందిన నీటి బాప్తిస్మము మరియు సిలువ రక్తము నందు విశ్వాసముంచుట ద్వారా పాపులు తమ పాపము నుండి విమోచన పొందుదురు. 1యోహాను 5:1-10 ప్రకారము యేసు పొందిన బాప్తిస్మము మరియు గొర్రెపిల్ల రక్తము నందు (సిలువపై) విశ్వాసముంచిన యెడల ఒక పాపి విమోచించబడును. 

యేసు క్రీస్తు బాప్తిస్మము మరియు సిలువ రక్తము నందు అనగా ఈ రెండిటి యందు విశ్వాసముంచిన ప్రతి పాపి విమోచింపబడును. ఈ బాప్తిస్మము, సిలువ రక్తము మరియు పరిశుద్దాత్మ దేవుడు ఈ నీరు మరియు ఆత్మ ద్వారా తిరిగి జన్మించు అనుభవము పొందుకొనుటలో అత్యంత ఆవశ్యకములు. 

నా ప్రియమైన వారలారా కేవలము యేసు రక్తము నందు విశ్వాసముంచిన యెడల రక్షింపబడుదుము? కేవలము ఆయన రక్తం నందు విశ్వాసముంచి తిరిగి జన్మించితిమని భావించు వారి హృదయములలో ఇంకను పాపమూ నిలచియే యున్నది. అయితే ఆత్మ సంబంధమైన సున్నతిగా నూతన నిబంధనలో వివరింపబడిన యేసు బాప్తిస్మమందు విశ్వాసముంచి మనము రక్షింపబడుదుము. పాత నిబంధనలో తెలుపబడిన శారీరక సున్నతికి ఇది సమానమైయున్నది.

క్రైస్తవ శేఖలన్నిటికి వివిధ సిద్ధాంతములున్నవి. వారికున్న ఈ తప్పుడు విశ్వాసములను తొలగించుకొననిచో ఎవరైనను పాత్రులే. ప్రెస్బిటేరియన్ సంఘము వారు "ముందుగా నియమింపబడుట" నందు విశ్వాసముంతురు. మెథడిస్టు సంఘము వారు ఆర్మేనియానిజం నందు అనగా మానవతా యందు విశ్వాసముంచుదురు. బాప్టిస్టు సంఘము వారు బాప్తిస్మము పొందు విధానమునకు ప్రాముక్యత ని నిచ్చెదరు. పరిశుద్ధ సంఘము వారు పరిశుద్ధ జీవితం గడుపుట యందు వి విశ్వసించెదరు. ఈ విధముగా అనేక శాఖల వారు అనేక సిద్ధాంతముల యందు విశ్వాసముంచిరి. ఒక విధముగా చెప్పాలంటే అనేక శాఖల వారు సత్య వాక్యము నుండి తొలగిపోయిరి. 

బైబిల్ నందు తెలియపరచబడిన తిరిగి జన్మించుట అను విషయములో సత్య వాక్యము ఏమి తెలుపుచున్నది ? జీవ గ్రంధములో చూచిన యెడల యేసు పొందిన బాప్తిస్మము మరియు ఆయన రక్తము నందు మాత్రమే మనము సత్యము కనుగొనగలము. కనుక దేవుని వాక్యము నందు విశ్వాసముంచి, తిరిగి జన్మింప చేయగల ఈ నీరు మరియు ఆత్మ సంబంధమైన సువార్తను పాటించిన యెడల మనము విమోచన పొందగలము.



యేసు పొందిన బాప్తిస్మములోని రహస్యమేమీ?


  • నూతన నిబంధనలో ఆత్మ సంబంధమైన
  • సున్నతి అనగా నేమి?
  • అదే యేసు పొందిన బాప్తిస్మము.


యేసుక్రీస్తు పొందిన బాప్తిస్మమే ఆత్మ సంబంధమైన సున్నతి. పాత నిబంధనలో సున్నతి ఆచరించని వారెవరు తన ప్రజలు కానేరరని దేవుడు సెలవిచ్చెను. 

మనము నూతన నిబంధనలో యేసు పొందినబాప్తిస్మమే హృదయ సంబంధమైన సున్నతి అని తెలుసుకొని విశ్వసించవలెను. యేసుక్రీస్తు తన భూలోక సేవ ప్రారంభములో స్థానికుడైన యోహాను చేత బాప్తిస్మము పొందెను. అందువలన మనమా బాప్తిస్మము నందు విశ్వాసముంచిన యెడల హృదయ సంబంధమైన సున్నతి ఆచరించిన వారగుదుము. స్థానికుడైన యోహాను వలన యేసుక్రీస్తు ఎందులకు బాప్తిస్మము పొందేనో మనము ఒకింత ఆలోచించవలసిన విషయము. 

"ఆ సమయమున యోహాను చేత బాప్తిస్మము పొందుటకు యేసు గలిలయ నుండి యొర్దాను దగ్గరున్న అతని యొద్దకు వచ్చెను. అందుకు యోహాను - నేను నీ చేత బాప్తిస్మము పొందవలసినవాడనై యుండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా? అని ఆయనను నివారింపజూచెను గాని యేసు - ఇప్పటికి కానిమ్ము. నీతి యావత్తు ఈలాగు నెరవేర్చుట మనకు తగియున్నది అని అతనికి ఉత్తరమిచ్చెను గనుక అతడాలాగు కానిచ్చెను." (మత్తయి 3:13-15)

"మృతుల నది" అని పేరుగాంచిన యొర్దాను నదిలో స్థానికుడైన యోహాను ద్వారా యేసు బాప్తిస్మము పొందెను. ఈ యోహాను యేసు తలపై చేతులుంచెను. మరియు యేసు శరీరము నీటిలో సంపూర్ణముగా ముంచబడెను. ఇదే బాప్తిస్మము పొందుటకు సరైన పద్దతి (బాప్తిస్మము = నీటిలో ముంచబడుట). ఈ లోక పాపమంతయు యేసుక్రీస్తు స్వీకరించుటకు ఈ విధముగానే అయన బాప్తిస్మము పొంది పాత నిబంధనలో తెలిజేయబడిన హస్త నిక్షేపణకు లోనాయెను. 

యేసు నందు విశ్వాసముంచి వారికీ ఈ బాప్తిస్మమే హృదయ సంబంధమైన సున్నతి కాగలదు. "యేసు - ఇప్పటికి కానిమ్ము. నీతి యావత్తు ఈలాగు నెరవేర్చుటకు మనకు తగియున్నదని అతనికి ఉత్తరమిచ్చెను. గనుక అతడాలాగు కానిచ్చెను." (మత్తయి 3:15). ఆ నీతి నెరవేరు నిమిత్తము యేసు లోకపాపమంతయు స్వీకరింపగా దేవుడే మన రక్షకుడాయెను. అందువలననే లిఖించబడిన ప్రకారము మన పాపములన్నియు ఆయన తలపై మోసికొని మన నిమిత్తము సిలువలో మరణించెను. 

యేసు పొందిన ఈ బాప్తిస్మము పాపులను తిరిగి జన్మింపచేయు శక్తి కలిగినది. ఇదే ఈ నీరు మరియు ఆత్మ సంబంధమైన సువార్తలోని రహస్యము. 

ప్రభువైన యేసు ఈ లోకములో తన పరిచర్య ప్రారంభములో చేసిన మొదటి కార్యము ఇదియే. స్థానికుడైన యోహాను ద్వారా బాప్తిస్మము పొంది మనుష్యులందరి పాపములను తాను స్వీకరించి, పాపులను రక్షించెను. బాప్తిస్మము అనగా "శుద్దీకరింపబడుట, పాతిపెట్టబడుట, ఆరోపింపబడుట. 

దేవుని చిత్తానుసారముగా బాప్తిస్మమును పొందిన యేసు ఈ లోక పాపమంతయు తానే స్వీకరించెను. "ఇదిగో ! లోక పాపములన్నియు మోసికొనిపోవు దేవుని గొర్రి పిల్ల" (యోహాను 1:29) యేసు పొందిన ఈ బాప్తిస్మమునకు అర్థమేమనగా అయన యందు విశ్వాసముంచిన ప్రజలందరు ఈ హృదయ సంబంధమైన సున్నతిని ఆచరించిరి, అని అర్థము. 

ఈ తరువాత, యేసు లోకపాపమంతయు మోసికొనిన దేవుని గొర్రెపిల్లగా సిలువను అధిరోహించి దేవుని తీర్పునకు లోనాయెను. దాని ద్వారా పాపులందరికీ విధింపబడవలసిన తీర్పు యేసే స్వీకరించెను. అందును బట్టి సమస్త మానవులను పాప భారము నుండి యేసు రక్షించి, విమోచించెను. 

పాత నిబంధనలోని సున్నతికి సాదృశ్యమైన యేసు పొందిన బాప్తిస్మము నందు విశ్వాసముంచుట ద్వారా మరియు ఆయన సిలువ పై చిందించిన రక్తమును బట్టి ప్రతివారు తమ పాపముల నుండి రక్షింపబడుదురు. ప్రభువైన యేసు తాను పొందిన బాప్తిస్మము ద్వారా మరియు సిలువ రక్తము ద్వారా పాపులందరిని రక్షించెను. ఇదే హృదయ సంబంధమైన సున్నతిలోని సత్యమైయున్నది.



రక్షణ కేవలము యేసు రక్తము ద్వారా లభించునా? కానేకాదు.


  • వేటి ద్వారా యేసు ఈ లోకమునకు వచ్చెను ?
  • నీటి ద్వారా మరియు రక్తము ద్వారా


1యోహాను 5:4-8 ప్రకారము "దేవుని మూలముగా పుట్టినవారందరును లోకమును జయించుదురు ; లోకమును జయించిన విజయము మన విశ్వాసమే యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవరు? నీళ్ల ద్వారా రక్తము ద్వారా వచ్చిన వాడు ఈయనే. అనగా యేసుక్రీస్తే. ఈయన నీళ్లతో మాత్రమే గాక నీళ్లతోను రక్తముతోను వచ్చెను. ఆత్మ సత్యము గనుక సాక్ష్యమిచ్చువాడు ఆత్మయే. సాక్ష్యమిచ్చువారు ముగ్గురు, అనగా ఆత్మయు, నీళ్లను, రక్తమును, ఈ ముగ్గురు ఏకీభవించియున్నారు."

ప్రియమైన క్రైస్తవులారా, రక్షకుడైన యేసుక్రీస్తు గురించి మన సాక్ష్యమైయున్నది. నీరు మరియు రక్తము ద్వారా వచ్చిన దేవుని కుమారునియందు మనము వుంచిన విశ్వాసమే మన సాక్ష్యమైయున్నది. 

లోకమును జయించిన సాధనమేమై యున్నది ? అదే నీరు మరియు రక్తము నందు ఉంచబడిన విశ్వాసములోని శక్తి. ప్రభువైన యేసే నీరు మరియు రక్తము ద్వారా వచ్చినవాడు. ఆత్మయే దానికి సాక్షి మరియు ఈ ఆత్మయే సత్యము. 

భూమిపైన సాక్ష్యము చెప్పువారు ముగ్గురు : నీళ్లు, రక్తము మరియు ఆత్మయే యున్నారు. ఈ ముగ్గురు ఏకీభవించుచున్నారు. యేసు ఈ లోకమునకు సశరీరుడుగా వచ్చి, బాప్తిస్మము పొంది మరియు సిలువపై మరణించి మనలను నిత్యవేదన నుండి రక్షించెను. మనలను రక్షించు ఈ నీరు మరియు ఆత్మ సంబంధమైన సువార్త ఏమనగా సకల పాపులను రక్షించు నిమిత్తమే సృష్టికర్తయిన దేవుడే రక్షకునిగా అవతరించెననుధియే దీనికి సాక్ష్యము. 

ఆత్మయైన యేసు ఈ లోకమునకు శరీరధారి అయి వచ్చుటయే దీనికి సాక్ష్యము. ఆయన యొర్దానులో బాప్తిస్మము పొంది మనందరి పాపములను తాను స్వీకరించి, సిలువపైన తన రక్తమును చిందించి మన పాపములనిమిత్తమైన తీర్పును ఆయనే పొందెను. దాని ద్వారా, ఆయన యందు విశ్వసించిన వారిని రక్షించెను. ఇదే ఈ నీరు మరియు ఆత్మ సంబంధమైన ప్రాధమిక సువార్త అయి ఉన్నది.



దేవుడనుగ్రహించిన రక్షణకు సాక్ష్యమైయున్నది ఈ నీరు మరియు రక్తము అనగా నేమి?


  • పాత నిబంధనలో ఉదాహరింపబడిన
  • శారీరక సున్నతికి సాదృశ్యమైయున్నది.?
  • యేసుక్రీస్తు పొందిన బాప్తిస్మము.


ఇందు తెలియపరచబడిన నీరు అనగా యేసు పొందిన బాప్తిస్మము. పాత నిబంధనలో బాప్తిస్మమనగ శారీరక సున్నతియే. పాత నిబంధనలోని ఈ శారీరక సున్నతికి సాదృశ్యమే నూతన నిబంధనలోని యేసు పొందిన బాప్తిస్మము. యేసు పొందిన బాప్తిస్మములోనే ఈ లోక పాపమంతయు యేసునకు ఆపాదించబడినది. 

ఈ సత్యము నందు నిలిచియున్న వారు దేవుని ఎదుట మంచి మనసాక్షి కలిగి యుందురు. "దేవా, నీవే నా రక్షకుడవు, నేను మీరు పొందిన బాప్తిస్మము మరియు రక్తము నందు విశ్వాసముంచితిని. ఈ నీరు నా యందు ఇక పాపమేమియు లేదు. నేనిప్పుడు దేవుని కుమారుడను మరియు మీరు నా రక్షకుడై ఉన్నారు." మేము ఈ విషయము మాకున్న నిజ విశ్వాసమును బట్టి ప్రకటించుచున్నాము. ఈ విధముగా మేము తెలియపర్చుటకు కారణము యేసు పొందిన బాప్తిస్మము మరియు ఆయన కార్చిన రక్తములో ఉన్న నిజమైన విశ్వాసమే. 

మనలను తిరిగి జన్మింపచేయు వాక్యమైయున్నది ? అదే యేసు పొందిన బాప్తిస్మము మరియు ఆయన సిలువ రక్తమును సూచించున్నది. అదియే మా హృద్యములలోని రక్షణ నిమిత్తమై యున్న సాక్ష్యము. ఇదే ఈ నీరు మరియు ఆత్మ ద్వారా తిరిగి జన్మింపచేయు సువార్త.

ప్రియమైన క్రైస్తవులారా మరియొకసారి మిమ్ములను ప్రశ్నించాలని నేను ఆశిస్తున్నాను. "ఒక పాపి కేవలము యేసుక్రీస్తు రక్తము నందుంచిన విశ్వాసమును బట్టి రక్షింపబడునా? కానేకాదు. రక్షణ అనగా కేవలము సిలువలో ఆయన మరణమునకు సంబంధిచినదే కాదు - ఇదే ఈ నీరు మరియు ఆత్మ సంబంధమైన సువార్త. - దీని ద్వారా పాపులు తిరిగి జన్మించగలరు. బైబిల్ లో ఈ నీరు గురించి సత్యము అనగా యేసు పొందిన బాప్తిస్మమును గురుంచి తెలుసుకొందుము. 

1 పేతురు 3:21-22 వచనములు ఈ విధముగా తెలియజేయుచున్నవి. "దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. అదేదనగా శరీర మాలిన్యము తీసివేయుట కాదు గాని యేసుక్రీసు పునరుత్తాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనసాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. ఆయన పరలోకమునకు వెళ్లి దూతలమీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారము పొందిన వాడై దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడు."

అపొస్తలుడైనా పేతురు యేసు పొందిన బాప్తిస్మము గురించి వివరణ ఇస్తూ దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది అని తెలియజేసెను. మరియు పాపముల నుండి మన రక్షణ నిమిత్తమైన ఋజువు అదే. పాత నిబంధనలో శారీరక సున్నతికి సమానమైనది. యేసు పొందిన ఈ బాప్తిస్మము. దేవుని యొక్క ఆజ్ఞ యందు విశ్వాసముంచి ఏ విధముగా ఇశ్రాయేలీయులు శరీర సున్నతిని ఆచరించి దేవుని పిల్లలైతిరో అదే విధముగా యేసుక్రీస్తు పొందిన బాప్తిస్మము నూతన నిబంధన కాలములో మన పాపముల నుండి మనలను రక్షించెను.

కనుక పాత నిబంధనలోని శారీరక సున్నతి నూతన నిబంధనలో యేసు పొందిన ఈ బాప్తిస్మమునకు సమానము. దీనిని బట్టి యేసు పొందిన బాప్తిస్మము శారీరక సున్నతికి సమానమైనదని మీరు విశ్వసించుచున్నారా? 1 పేతురు 3:21 ప్రకారము దానికి సాదృశ్యమైన బాప్తిస్మము మనలను రక్షించెను. వ్రాయబడిన దేవుని వాక్యమునకు విరోధముగా జీవింపవచ్చునా?

ఈ లోకములో నివసించుచున్న మనము ఎలాగున పాపమునుండి విడిపించబడగలము ? యేసుక్రీస్తు బాప్తిస్మము పొంది దేవుని నీతిని నెరవేర్చుట ద్వారా పాపములో నుండి రక్షణ మనకు అనుగ్రహింపబడియున్నది. మత్తయి 3:15 ఈ విధముగా తెలియపరచుచున్నది. "యేసు - ఇప్పటికి కానిమ్ము. నీతి యావత్తు ఇలాగు నెరవేర్చుట మనకు తగియున్నదని అతనికి ఉత్తరమిచ్చెను గనుక అతడాలాగు కానిచ్చెను. 

లోక పాపమంతయు ప్రభువైన యేసునకు ఆపాదింపబడినది కనుక, ఆయన యందు విశ్వాసముంచినవారు పాపములేనివారుగా తీర్పు పొందుదురు. యేసు పొందిన బాప్తిస్మము ద్వారా మన పాపములన్నియు ఆయనే స్వీకరించెనన్న సత్యము నందు విశ్వసించిన యెడల మనము నీతిమంతులుగా మార్చబడుదుము. ప్రభువైన యేసు మన పాపములన్నియు స్వీకరించి, సిలువపైన మరణించి మనలను తీర్పు నుండి తప్పించెను. 

ప్రియ స్నేహితులారా ఈ నీరు మరియు రక్తము అను ఈ రెండిటి ద్వారా పాపముల నుండి పాపులు విమోచింపబడుదురు. ఆయనే మన పాపములను స్వీకరించెను. మరియు మన నిమిత్తమై అయన సిలువలో చనిపోయెను. అయన ఈ లోకములో బహిరంగ సేవ చేసిన 3 సంవత్సరముల పైచిలుకు కాలములో ఒనరించిన గొప్ప కార్యములు ఇవేనని మనము గ్రహించవలయును. 

యోహాను 1:29 ప్రకారము, "ఇదిగో ! లోక పాపములను మోసికొనిపోవు దేవుని గొర్రెపిల్ల!" ఈ లోక పాపమంతయు మోసికొనిపోవు నిమిత్తమై ప్రభువైన యేసు బాప్తిస్మము స్వీకరించెను. మరియు మన అపరాధముల నుండి విమోచించు నిమిత్తము అయన సిలువలో మరణించెను. ప్రభువైన యేసు దేవుని యొక్క కుమారుడు మరియు సృష్టికర్త. తండ్రి అయిన దేవుడు పాత నిబంధన గ్రంధములో చేసిన నిబంధనైనా శారీరక సున్నతిని ఈ లోకపాపములను వహించుట ద్వారా యేసే నెరవేర్చెను.

ఎవరైనను సరే తమ హృదయములలో ఈ నీరు మరియు రక్తమునకు సంబందించిన మరియు యేసుక్రీస్తు [పొందిన బాప్తిస్మపు సువార్త యందు విశ్వాస ముంచుదురో వారు తిరిగి జన్మించు అనుభవమును పొందెదరు. మరియు ప్రభువే అట్టి వారికి రక్షకుడై యుండును. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా ! దేవుడు మనకు వాగ్దానము చేసిన రక్షణను యేసుక్రీస్తు మనకు అనుగ్రహించి ఈ లోక పాపము నుండి మనలను రక్షించెను. 



శరీర మాలిన్యము తీసివేయుట కాదు.


  • కాలానుగుణముగా శరీర మాలిన్యము
  • తీసివేయబడునా?
  • లేదు. శరీర మాలిన్యము మనము చనిపోవు
  • పర్యంతము ఎక్కువగుచునే వుండును


1 పేతురు 3:21 వచనము ఈ విధముగా తెలియజేయుచున్నవి. "దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది; అదేదనగా శరీర మాలిన్యము తీసివేయుట కాదు గాని యేసు క్రీస్తు పునరుధ్ధాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనసాక్షినిచ్చు ప్రత్యుత్తరమే."

రక్షకుడైన యేసు క్రీస్తును విశ్వసించినంత మాత్రమున అనేకులు శారీరక పాపములను విసర్జించినవారు కారు. యేసు క్రీస్తు పొందిన బాప్తిస్మము నందు విశ్వాసముంచిన యెడల మన ఈ లోక పాపమంతయు యేసునకు ఆరోపింపబడును. వాటి నిమిత్తమే ఆయన సిలువపై తన రక్తమును చిందించెను. ఈ విషయములను విశ్వసించుట ద్వారా మనము మన పాపముల నుండి రక్షింపబడి విమోచన పొందెదము.

తిరిగి జన్మించుట అనగా సకల మానవాళి రక్షకుడైన యేసును మన హృదయము లోనికి ఆహ్వానించుట దాని ద్వారా మనకు హృదయములలో సంబంధమైన పశ్చాత్తాపము కలుగును మనము యేసు పొందిన నీ బాప్తిస్మము నందును మరియు సిలువ రక్తం నందును విశ్వసించిన ఎడల మన హృదయములు తిరిగి జన్మించిన అనుభవమును పొందును అయినప్పటికీ మనము శరీర సంబంధమైన పాపములను మరియు అపరాధములను చేయుచునేయుందుము. కనుక శరీరముతో చేసినటువంటి ఈ పాపముల విషయమై ప్రాయశ్చిత్తము చెల్లింపబడియున్నది.

రక్షింపబడిన వారికి యేసు పొందిన బాప్తీస్మము సాక్ష్యమైయున్నది. యేసుక్రీస్తు వారి బాప్తిస్మము ద్వారా మన పాపములకు మన్నింపు దొరికినది విశ్వసించిన యెడల మనమును పాపము లేని వారిగా తీర్పు పొందెదము.

యేసు పొందిన బాప్తిస్మము ద్వారా మన హృదయాలలోనికి ఈ రక్షణాత్మకమైన సత్యమును విశ్వసించిన యెడల మనము తిరిగి జన్మించగలము. ఈ నీరు మరియు ఆత్మ సంబంధమైన సువార్త ద్వారా మనము నీతిమంతులుగా పరిగణింపబడుదుము. 

పాతనిబంధనలోని అబ్రహాము యొక్క విశ్వాసం కూడా ఇదియే. నీతిమంతునిగా మారు నిమిత్తము అపోస్తులుడైన పౌలు మరియు పేతురు సాక్ష్యం ఇచ్చిన విధముగా రక్షణకు సాదృశ్యం ఇదియే

అబ్రహాము దేవుని యొక్క మాట వినెను మరియు విశ్వసించెను. అది అతనికి నీతిగా మార్చబడినది మనము యేసుక్రీస్తు పొందిన బాప్తిస్మము మరియు ఆయన సిలువ మరణము నందు విశ్వాసముంచిన యెడల రక్షింపబడుదుము.

యోహాను 1:12 ఈవిధంగా సెలవిచ్చుచున్నది. "తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామము నందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారమును అనుగ్రహించెను." మీరు ప్రభువైన యేసును అంగీకరించుచున్నారా ? క్రీస్తు మన పాపముల నుండి ఆయన పొందిన బాప్తిస్మము మరియు రక్తముల ద్వారా మన రక్షకుడైన దేవుని కుమారుడైన యేసు సకల పాపముల నుండి విమోచించెను. దేవుని కుమారుడైన యేసు యొక్క ఈ బాప్తిస్మము మరియు రక్తం ద్వారా మనకు ఇవ్వబడిన రక్షణను మనము స్వీకరించవలెను. 

కేవలం యేసు క్రీస్తు రక్తము ద్వారా మనకు రక్షణ లభించునా? కానే కాదు. యేసు యొక్క ఈ నీటి బాప్తిస్మము మరియు కార్చిన రక్తము వలననే విమోచించబడుదుము. బైబిల్ లో ఇది చాలా స్పష్టంగా తెలియపరచబడియున్నది. అదేమనగా రక్షణ అనునది కేవలం యేసుక్రీస్తు చిందించిన రక్తములోనే లేదు. అది యేసు పొందిన బాప్తిస్మము మరియు రక్త ములో నున్నది.

యేసు పొందిన బాప్తిస్మము నూతన నిబంధనలోని హృదయ సంబంధమైన సున్నతికి సమానము. ఇదే రక్షణ గురించిన సత్యమై మనలను మన పాపముల నుండి వేరుపరచును. మన పాపముల నిమిత్తమై మరియు ఈ లోక పాపము నిమిత్తమే ప్రభువైన యేసు తీర్పునకు లోనాయెను. మన నిమిత్తము అనగా మీ నిమిత్తము నా నిమిత్తము ఆయన తీర్పునకు లోనాయెను. 

యేసు క్రీస్తు పొందిన బాప్తిస్మము మరియు రక్తము నందు విశ్వాసముంచిన ఎడల మన పాపములకు ప్రాయశ్చిత్తం లభించును మరియు మన సమస్త పాపముల నుండి విడిపించబడుదుము. యేసు పొందిన ఈ బాప్తిస్మము మరియు ఆయన చిందించిన రక్తమే మనకు రక్షణ అనుగ్రహించెను మరియు మన హృదయంలోని పాపములన్నియు తొలగిపోయెను. ఇది సత్యమని మీరు విశ్వసించుచున్నారా ? మీరు ఈ నీరు మరియు ఆత్మసంబంధమైన సువార్త నందు విశ్వాసము ఉంచవలెనని నేను ఆశించుచున్నాను. విశ్వసించండి దాని వలన మీరు నిత్యత్వములోనికి చేరగలరు. 

"సున్నతి హృదయ సంబంధమైనది. " (రోమా 2:29) అని అపోస్తులుడైన పౌలు తెలియజేసెను. మనము, మన హృదయములలో సున్నతి పొందియున్నాము. యేసుక్రీస్తు ఈ లోకమునకు శరీరధారిగా అరుదెంచెను. ఆయన తీసుకున్న బాప్తిస్మము ద్వారా సకల మానవుల పాపాలను తొలగించెనని, సిలువపై మన పాపముల నిమిత్తమై ఆయన మరణించెనని మరియు మృతుల నుండి సజీవుడై లేచెనని విశ్వసించిన యెడల మనము హృదయ సున్నతి ని ఆచరించిన వారగుదుము. 

సున్నతి హృదయ సంబంధమైనదిగా వుండవలయునని అపోస్తులుడైన పౌలు సెలవిచ్చెను. హృదయ సున్నతి అనగా యేసు పొందిన బాప్తిస్మము మరియు ఆయన చిందించిన రక్తమందు విశ్వాసముంచుటయే. నీవు హృదయంలో సున్నతి గలవాడవైనచో యేసు పొందిన బాప్తిస్మము , సిలువ రక్తము మరియు రక్షణను గూర్చిన సువార్తను హృదయపూర్వకముగా విశ్వసించవలయును. అప్పుడే మనము నిజమైన దేవుని పిల్లలము కాగలము.



స్థానికుడైన యోహాను దేవుని యొద్ద నుండి పంపబడెనా ?


  • స్థానికుడైన యోహాను ఎవరు ?
  • ఆయన మానవాళికి ప్రతినిధి మరియు అహరోను
  • క్రమములో ప్రధానయాజకుడు.


యేసునకు బాప్తిస్మమిచ్చిన ఈ యోహాను ఎవరు ? స్థానికుడైన యోహాను సకల మానవాళికి ప్రతినిధి మత్తయి 11: 11-14 ఈ విధముగా తెలియజేయుచున్నది. "స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మమిచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అయిననూ పరలోకరాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. బాప్తిస్మమిచ్చు యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోకరాజ్యము బలాత్కారముగా పట్టబడుచున్నది బలాత్కారులు దాని నాక్రమిచుచున్నారు. యోహాను కాలము వరకు ప్రవక్తలందరూ ప్రవంచించుచువఛ్చిరి. ధర్మశాస్త్రము సహా ప్రవచించుచుండెను. ఈ సంగతి అంగీకరించుటకు మీకు మనసు ఉంటే రాబోయే ఏలియా ఇతడే."

ప్రియమైన క్రైస్తవులారా స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మమిచ్చు యోహాను కంటే గొప్పవారు లేరని యేసు సెలవిచ్చెను. ఈ యోహాను జన్మించుట ద్వారా పాత నిబంధన కాలములోనే దేవుని నిబంధన సహితమైన కాలము నెరవేరెను. దేవుని నిబంధనలు నెరవేర్చు యేసుక్రీస్తు యోహాను తరువాత జన్మించవలెను కనుక పాత నిబంధన కాలము అప్పటితో సంపూర్ణమాయెను.

అటులనే దేవుని నిబంధన ఎవరు నెరవేర్చవలెను? యేసుక్రీస్తు మరియు బాప్తిస్మమిచ్చు యోహాను. బాప్తిస్మమిచ్చు యోహాను లోకపాపములన్నిటిని యేసు పై మోపాడు. పాత నిబంధనలు ఆఖరి ప్రధాన యాజకుడు ఎవరు ? అహరోను వంశ క్రమము లోని వారెవరు? స్థానికుడైన యోహానే అని ప్రభువైన యేసు క్రీస్తు తెలియజేసెను. ఈ యోహాను సకల మానవాళికి ప్రతినిధి మరియు స్త్రీలు కనినవారిలో గొప్పవాడు.

మన ముందు ఉంచబడిన సత్యములను పరిశీలించెదము. మోషే, అబ్రహాము, ఇస్సాకు మరియు యాకోబు వీరందరు స్త్రీ నుండియే జన్మించిరి. అయితే నూతన మరియు పాతనిబంధనలోని వ్యక్తులందరిలో ఎవరు స్త్రీ గర్భవాసమున జన్మించిన వారిలో గొప్ప వారై ఉన్నరో ఆయనే స్థానికుడైన యోహాను. 

ఈ స్థానికుడైన యోహాను అహరోను వంశస్తుడై పాత నిబంధనలో మనకును అనుగ్రహించబడిన చిట్టచివరి ప్రవక్తయి యున్నాడు. ఆయనే నూతన నిబంధన కాలంలో దేవుని యొక్క గొర్రె పిల్లకు బాప్తిస్మమిచ్చెను. పాతనిబంధనలోని విమోచన దినమున బలిపశువు తలపై రెండు చేతులు ఉంచి వారి పాపములను వాటిపై ఆరోపించుదురు. అదే విధముగా యేసుక్రీస్తు యొర్దానులో బాప్తిస్మమిచ్చు లోక పాపమంతయు ఆయనపై ఆరోపించెను. యోహాను దేవుని యొక్క సేవకుడు. యేసుక్రీస్తుకు బాప్తిస్మమిచ్చుట ద్వారా సకల మానవులకు ఆత్మ సంబంధమైన సున్నతి అనుగ్రహించెను.

మన రక్షణకు సాక్ష్యముగా మనము యేసు పొందిన బాప్తిస్మమును మరియు ఆయన చిందించిన రక్తమును అంగీకరించవలయును, యేసు క్రీస్తు తాను పొందిన బాప్తిస్మము ద్వారా లోకపాపమంతయు స్వీకరించి, దాని నిమిత్తమై తీర్పు పొందెను. మనము చేయవలసినది కేవలము ఈ సత్యము నందు విశ్వాసముంచుట. యేసు చేసిన ఈ పనుల యందు విశ్వాసం ఉంచుట దేవుని యొక్క చిత్తమై యున్నది. 

ఈ నీరు మరియు ఆత్మ ద్వారా తిరిగి జనింపచేయు సువార్తను నీ హృదయము నందు స్వీకరించిన యెడల నీవు అబ్రాహామునకు ఆధ్యాత్మిక వారసునివై దేవుని కుమారునిగా అంగీకరింపబడుదువు. ప్రభువైన యేసుక్రీస్తు నందు ఈ విధముగా కొందరే విశ్వాసముంచిరి. అనేకులు తమ హృదయముల యందు యేసును సంపూర్ణంగా విశ్వసించి అంగీకరించలేదు.

రాత్రి గడిచి పగలు సమీపించుచున్నది. యేసుక్రీస్తు పొందిన ఈ బాప్తిస్మమును అంగీకరించుట ద్వారా మీ హృదయములలో ఈ రక్షణను స్వీకరించగలరు. యేసు పొందిన బాప్తిస్మము మరియు ఆయన సిలువ రక్తము నందు విశ్వాసముంచుట ద్వారా మనమును ఈ ఆత్మ సంబంధమైన రక్షణను పొందుకొని ఆశీర్వదింపబడగలము.

ఒక విషయము ఎల్లప్పుడు మన గమనంలో ఉంచుకొనవలెను. మనము ఈ రక్షణార్ధమైన సువార్త యందు విశ్వాసం ఉంచుట ద్వారా ఆత్మ సంబంధమైన అభిషేకము పొందగలము. మీరు ఆత్మసంబంధమైన దీపమును (సంఘమును) మరియు నూనెను (ఆత్మ) జ్ఞానం కలిగిన కన్యకలై (మత్తయి 25 :4) యేసు క్రీస్తు యొక్క బాప్తిస్మము మరియు రక్తము ద్వారానైనా ఈ సువార్తను విశ్వసించవలయును. యేసు నందు విశ్వాసముంచినవారు వారి హృదయములు ఆత్మతో నింపబడగ సంఘ ఆరాధనలలో పాల్గొనెదరు.



ఎవరి నిమిత్తమై యేసు బాప్తిస్మం పొందెను ?


  • ఎవరి నిమిత్తమై యేసు
  • బాప్తిస్మం పొందెను ?
  • సకల మానవుల పాపములను
  • శుద్దీకరించుటకు.


"బాప్తిస్మము" అను పదమునకు అర్ధము "శుద్దీకరింపబడుట". స్థానికుడైన యోహాను యేసు బాప్తీస్మము పొందెను. పాత నిబంధనలో తెలియపరచబడిన హస్త నిక్షేపణ ద్వారా యోహాను బాప్తిస్మము ఇచ్చెను. 

ఈ లోక పాపమంతయు తనపై మోపుకొనిన తదనంతరము ఆయన యొర్దానులో మునిగెను. యొర్దాను నది అనగా మృత్యు నది అని మరియు పాపులకు తీర్పు అని అర్థము. యేసుక్రీస్తు ఆ నదిలోని నీళ్లలో మునుగుట సిలువపైన అయన మరణమును సూచించున్నది. ఆ నీటిలో నుంచి తిరిగి బయటకు వచ్చుట అయన పునరుత్ధానమును సూచించున్నది. సిలువపై యేసు మరణించి మూడవనాడు పునురుత్ధానుడాయెను.

యేసు మన దేవుడును మరియు రక్షకుడైయున్నాడు. ప్రభువైన యేసు ఈ లోకంలోకి వచ్చి బాప్తీస్మము పొంది సిలువపై మరణించునంతవరకు రక్తమును చిందించి, తిరిగి మూడవనాడు పునరుత్ధానుడై, ఆరోహనుడై ఇప్పుడు దేవుని కుడిపార్శ్వమున కూర్చొని ఉండుటను బట్టి యేసు మానవాళినంతయు మరణము నుండి రక్షించెననుటకు ఋజువుగా ఉన్నది. ఈ సత్యమునందు నేను విశ్వసించుచున్నాను. 

నూతన నిబంధన లో తెలియపరిచిన హృదయ సంబంధమైన సున్నతికి సాదృశ్య మే యేసుక్రీస్తు పొందిన బాప్తిస్మము. "సున్నతి హృదయ సంబంధమైనదై ఉండవలెను." యేసుక్రీస్తు పొందిన బాప్తిస్మము నందు మనమును విశ్వాసము ఉంచగానే ఈ హృదయ సంబంధమైన సున్నతి నెరవేరి మన పాపములన్నియు యేసుక్రీస్తు పైకి ఆరోపించబడినవి అనుటకు నిదర్శనమైనది. యేసు క్రీస్తు పొందిన ఈ బాప్తిస్మము ద్వారా మన పాపములన్నియు ఆయనపై ఆరోపింపబడినవి అనుటకు ఈ హృదయ సంబంధమైన సున్నతి ఒక నిదర్శనము.

నీవు హృదయములో సున్నతి పొందితివా? నీ హృదయంలో సున్నతి పొందిన యెడల దాని యందు విశ్వాసముంచిన యెడల ఒక్కసారిగా మీ పాపములన్నియు శుద్దీకరింపబడును. దీని నిమిత్తమే యేసు నీతి యావత్తు నెరవేర్చి పాపులకు రక్షణను సిద్ధపరచెను.

ప్రియమైన క్రైస్తవులారా, రక్షణ నిమిత్తమైన ఈ రుజువును మీ మనసులలోని కి మరియు మీ హృదయం లోనికి స్వీకరించండి. ఇదే సత్యము. ఒకసారి మీ హృదయముల యందు యేసు క్రీస్తు అనుగ్రహించిన రక్షణను స్వీకరించగానే మీరు సకల పాపములనుండి విమోచించబడుదురు. "తన్ను ఎందురు అంగీకరించారో వారికందరికీ, అనగా తన నామము నందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలు అగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను." (యోహాను 1:12).

యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చి ఎందు నిమిత్తమై బాప్తిస్మము పొందేనో ఇప్పుడు మీ అవగాహనలోనికి వచ్చియున్నది కదా ? మీరిప్పుడు దీనియందు విశ్వసిస్తున్నారా? యేసు క్రీస్తు బాప్తీస్మము పొంది లోకపాపమంతయు స్వీకరించెను. అదే సున్నతి సంబంధమైన బాప్తిస్మము. యేసుక్రీస్తు పొందిన ఈ బాప్తిస్మము ద్వారా మనము హృదయ సున్నతి పొందగలము. అందులకే అపొస్తలుడైన పౌలు మన హృదయంలో సున్నతి ఆచరింపవలెనని తెలియజేసెను. యేసుక్రీస్తు వారు పొందిన బాప్తిస్మము ద్వారా మరియు ఆయన చిందించిన రక్తము ద్వారా మనకు రక్షణ దొరికినది. 

"అందుకు యోహాను నేను నీ చేత బాప్తిస్మము పొందవలసినవాడనై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా? అని ఆయనను నివారింపజూచెను. గాని యేసు - ఇప్పటికి కానిమ్ము. నీతి యావత్తు ఈలాగు నెరవేర్చుట మనకు తగియున్నదని అతనికి ఉత్తరమిచ్చెను గనుక అతడాలాగు కానిచ్చెను." (మత్తయి 3:14-15).

మానవాళిక పాపములన్నిటిని శుద్దీకరించుటకై యేసు బాప్తిస్మము పొందెను. యేసుక్రీస్తు దేవుని యొక్క కుమారుడు మరియు మన రక్షకుడు. ఆయనే మన సృష్టి కర్త. దేవుని చిత్తానుసారము తండ్రి చేత పంపబడి మనలను ఆయన ప్రజలుగా చేసెను. 

పాత నిబంధనలో ఎవరి గురించి ప్రవక్తలందరు తెలిపిరి? వారు ప్రభువైన యేసుక్రీస్తు గురించి తెలియపరిచెను. పాత నిబంధనలోని ప్రవక్తలు యేసు ఈ లోకమునకు వచ్చి, లోక పాపములను తొలగించి మనలను పాపభారము నుండి విడిపించునని ప్రవచించిరి. 

పాత నిబంధనలో ప్రవచించిన ప్రకారము యేసు ఈ లోకమునకు దిగివచ్చి ఆదాము హవ్వల నుండి ఈ భూమిపై జీవించు చిట్టచివరి వ్యక్తి వరకు మానవాళి చేసిన పాపాలన్నిటిని పరిహరించెను. 

మరిపుడైతే ఆయన పొందిన బాప్తిస్మము మరియు ఆయన చిందించిన రక్తములో నున్న రక్షణను మీ హృద్యయములలోనికి స్వీకరించండి. ఈ విషయము సత్యమైనదా, కాదా ? అను ప్రశ్న ఇంకను మీ హృదయములలో వున్నదా? ఇంకను మీ హృదయములు పాపముతో నిండియున్నవి. "నీతి యావత్తు ఈలాగు నెరవేర్చుట మనకు తగియున్నది." నీతి యావత్తు ఈలాగు నెరవేర్చు నిమిత్తమై స్థానికుడైన యోహాను యేసునకు బాప్తిస్మమిచ్చెను.

"బాప్తిస్మము" అను పదమునకు అర్థము "శుద్దీకరించబడుట" స్థానికుడైన యోహాను చేత యేసు బాప్తిస్మము పొందెను. పాత నిబంధనలో తెలియపర్చబడిన హస్త నిక్షేపణ ద్వారా యోహాను బాప్తిస్మమిచ్చెను.

ఈ లోకమంతా తనపై మోపుకొనిన తదనంతరం ఆయన యొర్దానులో మునిగెను. యొర్దాను నది అనగా మృత్యు నది అని మరియు పాపులకు తీర్పు అని అర్థము. యేసుక్రీస్తు ఆ నదిలో నీళ్లలో మునుగుట సిలువ పైన ఆయన మరణమును సూచించుచున్నది. ఆ నీటిలో నుంచి తిరిగి బయటకు వచ్చుట ఆయన పునరుత్థానమును సూచించుచున్నది. సిలువపై యేసు మరణించి తిరిగి మూడవనాడు పునరుత్థానుడు యాయెను. 

యేసు మన దేవుడు మరియు రక్షకుడైయున్నాడు. ప్రభువైన యేసు ఈ లోకమునకు వచ్చి బాప్తిస్మము పొంది సిలువపై మరణించు నంతవరకు రక్తమును చిందించి తిరిగి మూడవ నాడు పునరుత్థానుడై, ఆరోహణుడై ఇప్పుడు దేవుని కుడి పార్శ్వమున కూర్చొని యుండుటను బట్టి యేసు మానవాళినంతయు మరణము నుండి రక్షించెననుటకు రుజువుగా ఉంది. ఈ సత్యమునందు నీవు విశ్వసించుచున్నవా?

నూతన నిబంధనలో తెలయపరచిన హృదయ సంబందమైన సున్నతికి సాదృశ్యమే యేసు క్రీస్తు పొందిన బాప్తిస్మము. "సున్నతి హృదయ సంబంధమైనదై ఉండవలెను." యేసుక్రీస్తు పొందిన బాప్తిస్మము నందు మనము విశ్వాసముంచగానే ఈ హృదయసంబంధమైన సున్నతి నెరవేరి మన పాపములన్నియు యేసుక్రీస్తు పైకి ఆరోపింపబడినవి అనుటకు నిదర్శనమైనది. యేసుక్రీస్తు పొందిన ఈ బాప్తిస్మము ద్వారా మన పాపములన్నియు ఆయన ఫై ఆరోపింపబడినవి అనుటకు ఈ హృదయ సంబందమైన సున్నతి ఒక నిదర్శనము.

నీవు హృదయంలో సున్నతి పొందితివా నీ హృదయంలో సున్నతి పొందని యెడల దాని యందు విశ్వాసం ఉంచిన ఎడల ఒక్కసారిగా మీ పాపములన్నియు శుద్దీకరింపబడును. దీని నిమిత్తమే యేసు నీతి యావత్తు నెరవేర్చి పాపులకు రక్షణను సిద్ధపరచెను. 

ప్రియమైన క్రైస్తవులారా రక్షణ నిమిత్తమైన ఈ ఋజువును మీ మనసులలోనికి మరియు మీ హృదయములలోనికి స్వీకరించండి. ఇదియే సత్యము ఒకసారి మీ హృదయముల యందు యేసుక్రీస్తు అనుగ్రహించిన రక్షణను స్వీకరించగానే మీరు సకల పాపముల నుండి విమోచించబడుదురు. "తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. (యోహాను 1:12)

యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చి ఎందు నిమిత్తమై బాప్తిస్మము పొందేనో ఇప్పుడు అవగాహనలోనికి వచ్చియున్నది గదా? మీరిప్పుడు దీని యందు విశ్వసిస్తున్నారా ? యేసుక్రీస్తు బాప్తిస్మము పొంది లోకపాపమంతయు స్వీకరించెను. అదే సున్నతి సంబంధమైన బాప్తిస్మము. యేసుక్రీస్తు పొందిన ఈ బాప్తిస్మము ద్వారా మనము హృదయ సున్నతి పొందగలము. అందులకే అపొస్తలుడైన పౌలు మన హృదయములలో సున్నతి ఆచరింపవలెనని తెలియజేసెను. యేసుక్రీస్తు వారు పొందిన బాప్తిస్మము ద్వారా మరియు ఆయన చిందించిన రక్తము ద్వారా మనకు రక్షణ దొరికినది. మనకు హృదయములలో ఈ సత్యమును అంగీకరించుట తప్ప వేరే ఏ మార్గము లేదు. "అవును, ఆమెన్" అని మనము తెలియపరచి దేవుని ఈ వాక్యములను హృదయమునందు భద్రము చేసుకొన వలయును. ఇది సత్యము కాదా ? ఇప్పటికైనను దీనియందు విశ్వసించుట లేదా ?.



ఈ సత్యమును నీ హృదయంలో అంగీకరించుట లేదా ?


  • యేసును ఆరాధించుటకు ముందుగా
  • మనము ఏమి చేయవలెను?
  • ఈ నీరు మరియు రక్తమునకు సంబంధించిన
  • సత్యమును మన హృదయములలో
  • స్వీకరించవలయును.

యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చి దాదాపు రెండు వేల సంవత్సరములు గడిచిపోయెను. ఈ కృపాకాలములో ఈ సత్యమును మన హృదయములయందు స్వీకరించి ఈ నీరు మరియు యేసు క్రీస్తు యొక్క రక్తమును గురించిన సత్యమును గ్రహింపవలయును. ఇంతకంటే మనము చేయవలసినది ఏదీ లేదు.

"సున్నతి ఆత్మ సంబంధమైనదై ఉండవలెను". మన హృదయంలో నిలిచి ఉన్న విశ్వాసము ద్వారా మనము సున్నతి పొందవలెను. విశ్వాసము ద్వారానే మనము రక్షింపబడుదుము. పాత నిబంధనలో ఇశ్రాయేలీయులు తమ ద్వారా బంధముల రెండు నిలువ కమ్మీలు మరియు ఒక అడ్డ కమ్మికి పస్కా గొర్రె పిల్ల రక్తమును పూయుట ద్వార మరియు శారీరక సున్నతి ద్వారా రక్షింపబడితిరి.

యేసుక్రీస్తు పొందిన బాప్తిస్మము మరియు ఆయన రక్తము నందు విశ్వసించి రక్షణ పొందిన వారు తీర్పు విషయమై భయపడవలసిన అవసరము లేదు. ఎందులకు అనగా అది వారిని దాటిపోవును. తమ హృదయములలోనికి ఈ సత్యమును స్వీకరించిన వారు దేవుని తీర్పునకు లోనగుదురు. అనేకులు యేసుక్రీస్తు నందు వ్యర్థముగా విశ్వాసముంచి వారి పాపము చేత ఇంకను బందీలుగా ఉన్నారు.

ఈ పరిస్థితి వారికి ఎందువలన సంభవించెను? ఎందులకు వారింకను పాపము వలన బాధింపబడుచున్నారు? వారికీ ఇంకను యేసుక్రీస్తు యొక్క బాప్తిస్మము మరియు రక్తము గురించిన సత్యము తెలియలేదు. గనుకనే వారు కేవలను యేసుక్రీస్తు సిలువలో చిందించిన రక్తము నందు మాత్రమే. విశ్వాసముంచి ఆయన యొర్దానులో పొందిన బాప్తిస్మమును నిర్లక్ష్యపరచుచుంటిరి. 

రక్షణ కేవలము యేసుక్రీస్తు రక్తము నందు విశ్వసించినంత మాత్రమున సిద్దించెనా? బైబిల్ లో మనకు ఈ ఒక్క సత్యమే తెలయపరచబడెనా? నూతన సత్య గ్రంథము ప్రకారము కేవలము దేవుని గొర్రెపిల్ల రక్తము వలననే కాక, యేసు పొందిన బాప్తిస్మము వలన రక్షణ సిద్దించునని తెలియపర్చబడినది. (1యోహాను 5:3-6)

నీవు ఇంకను యేసుక్రీస్తు రక్తము నందే విశ్వసించుచున్నావా? ఆ విధముగా చేసిన వారు ఇంకను వారి హృదయములలో పాపము కలిగివున్నారు. వారు ఈ అసంపూర్ణమైన విశ్వాసమును వదిలి నిజమైన సువార్త వైపుకు తిరిగవలెను. 

ఒకవేళ ఇంతవరకు ఈ సత్యము తెలియనివారు ఇప్పుడు తాము సరైన మార్గములో నడువలేదని ఒప్పుకొని, ఇంతవరకు యొర్దానులో క్రీస్తు పొందిన బాప్తిస్మము ద్వారా లోకపాపమంతయు పరిహరించెనను సత్యమును గ్రహించలేదని ఒప్పుకొనవలయును. వారు ఈ బాప్తిస్మము విషయమై ఇంతవరకు చేసిన నిర్లక్ష్యమును బట్టి వారి తప్పిదములను అంగీకరించవలయును. యేసుక్రీస్తు పొందిన బాప్తిస్మము ద్వారా లోకపాపమంతయు స్వీకరించెనన్న సత్యమును వారి హృదయములలో విశ్వసించవలయును. ఈ బాప్తిస్మము సిలువ నందు విశ్వాసముంచినప్పుడే వారికి రక్షణ కలుగును. మరొక విధముగా చెప్పవలెనంటే ఈ నీరు మరియు ఆత్మ సంబంధమైన సువార్త వలన మాత్రమే ప్రతి వ్యక్తి నిత్య జీవమును సంపాదించుకొనగలడని విశ్వసించవలెను.

ప్రియమైన క్రైస్తవులారా, ఇప్పటి వరకు యేసుక్రీస్తు రక్తము నందే మీరు విశ్వాసముంచి జీవించియున్నారా? ఇదే నిజమైనది అని ఇంకను మీ హృదయములు పాపముతో నిండియున్నవి. మీ హృదయములలో నిండియున్న పాపములను బట్టి మీరింకను పాపము చేయుచున్నారు. దేవుని ధర్మశాస్త్రము ప్రకారము జీవించుచు మీ హృదయములలో పాపము లేదని మీరు నమ్మిన యెడల అది కేవలము మీ మానసిక ఆలోచనల నుండి ఉద్భవించిన భావనే. ఈ మీ నిశ్చయత దేవుని వాక్య సంబంధమైనది కాదు.



ఇప్పటికే ఆలస్యమైనదా ?


  • దేని నుండి సత్యము మనలను
  • విమోచించున్నది ?
  • పాపము మరియు మరణమునకు
  • సంబంధించిన ధర్మశాస్త్రము నుండి


ఇప్పటికే జరిగిన ఆలస్యము గురించి చింతించ నవసరము లేదు. మీరిక మీదట యేసుక్రీస్తు పొందిన బాప్తిస్మము నందు మరియు ఆయన సిలువ పై చిందించిన రక్తము నందు తప్పనిసరిగా విశ్వాసముంచి మీ హృదయములలో సున్నతి ఆచరించి పాప బంధముకముల నుండి విడుదల కావచ్చును. సమస్త పాపముల నుండి విడుదల అనగా మీరు యేసు పొందిన బాప్తిస్మము మరియు ఆయన కార్చిన రక్తమును, సువార్తను విశ్వసించి రక్షింపబడితిరి.

యేసుక్రీస్తు పొందిన బాప్తిస్మము మరియు ఆయన చిందించిన రక్తము మీ పాపముల నుండి మిమ్ములను రక్షించినదని విశ్వసించుటకు సమ్మతించుచుంటిరా? ఒక సారి మీరు ఈ సత్యము నందు విశ్వసించిన యెడల రక్షణను గురించిన జ్ఞానము మీకు అవగతమవును. మీ హృదయముకు శాంతి దొరుకును అప్పుడే ఆ వెనువెంటనే మీరు నీతిమంతులుగా తీర్పు పొందుదురు. మీరు చేసిన మంచి క్రియల వలన కాదు గాని కేవలము దేవుని వాక్యము నందు మీరు ఉంచిన విశ్వాసమును బట్టి ఇది సంభవించును. మీలో ఎవరైననూ ఇంకనూ యేసుక్రీస్తు యొక్క రక్తము నందే విశ్వాసముంచిన యెడల వారిని యేసుక్రీస్తు పొందిన బాప్తిస్మము మరియు రక్తము నందు విశ్వాసముంచవసినదిగా నేను బ్రతిమాలు కొనుచున్నాను.

ప్రియమైన క్రైస్తవులారా, మానవాళి చేసిన సకల పాపముల నుండి సంపూర్ణమైన రక్షణ సిద్ధించవలెనన్నది అది కేవలము యేసు పొందిన బాప్తిస్మము మరియు ఆయన సిలువ రక్తమను సువార్త వలననే సాధ్యము. మరియు యేసుక్రీస్తు యొక్క ఆత్మవలననే అది సాధ్యము. దేవుడు ఈ లోకమునకు శరీరధారిగా దిగివచ్చెను.

మానవుని వారి పాపము నుండి రక్షించువాడు కనుక ఆయనను యేసు అని పిలిచెదరని దేవుడు తన ప్రవక్త ద్వారా తెలియపరచెను. ‘‘ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము.’’ (మత్తయి 1:22-23)

దేవుడు పాపులను రక్షించుటకై ఈ లోకమునకు వచ్చెను. ఆయన పొందిన బాప్తిస్మము ద్వారా లోకపాపమంతయు తొలగించి పాపులను రక్షించెను. ఇదియే ఈ నీరు మరియు రక్తమునకు సాదృశ్యమైన రక్షణకు సంబంధించిన సత్యమైయున్నది. ఈ విషయమును తెలియపరచుటకే నేను నియమింపబడియున్నాను. మనము కేవలము యేసుక్రీస్తు కార్చిన రక్తము వలన రక్షింపబడితిమా? కానే కాదు. మనము యేసుక్రీస్తు పొందిన బాప్తిస్మము మరియు సిలువపైన ఆయన కార్చిన రక్తమును బట్టి రక్షింపబడితిమి.

ఈ దినములలో అనేకులైన అబద్ధ ప్రవక్తలు మరియు మత బేధము కలిగించువారు ఉన్నారు. వారు యేసుక్రీస్తు ఈ విధముగా పలికెను. ‘‘మీరు సత్యమును పలికిన యెడల , సత్యము మిమ్మును స్వతంత్రులనుగ చేయును’’ (యోహాను 8:32)

మనమీ సత్యమును తెలుసుకొనవలయును. యేసు తన బాప్తిస్మమును గురించి యెందులకు తెలియజేసెను. మరియు మనము యెందువలన సత్యమును విశ్వసించవలయును తెలు సుకొనండి. పాతనిబంధనలో పస్కా బలిపశువు రక్తమును గురించి అదే విధముగా శారీరక సున్నతిని గురించి దేవుడు ఇశ్రాయేలీయులతో ఎందుకు మాటలాడెనో గ్రహింపవలయును. 

మనము విషయమును అసంపూర్ణముగా తెలిసికొనిన యెడల సత్యమును ఎన్నడూ గ్రహింపజాలము. యేసు ఈ విధముగా తెలియపరచెను. ‘‘ఒకడు నీటిమూముగాను మరియు ఆత్మమూలముగాను జన్మించని యెడల పరలోక రాజ్యములోని ప్రవేశింపలేడని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.’’ (యోహాను 3:5)



యేసుక్రీస్తులోనికి బాప్తిస్మము పొందుట


  • యేసుక్రీస్తు యొక్క సిలువ మరణముతో
  • మనమేలాగు సంయుక్తమైతిమి?
  • ఆయన పొందిన బాప్తిస్మము ద్వారా మన
  • పాపములన్నియు యేసుపైకి 
  • ఆరోపించుట ద్వారా.


రక్షణ యొక్క రహస్యమును గురించి బైబిలు సాక్ష్యమిచ్చుచున్నది. అది కేవలము యేసుక్రీస్తు యొక్క రక్తమునకు సంబంధించినదేనా? కాదు. అది ఆయన పొందిన బాప్తిస్మమునకు సంయుక్తముగా సంబంధించినది. రోమీయులకు వ్రాసిన పత్రిక 6వ అధ్యాయములోను మరియు మిగిలిన పత్రికల్లోను పౌలు భక్తుడు ఈ విషయమును గురించి ఎక్కువగా ప్రస్తావించెను.

రోమా 6:3-8 ‘‘క్రీస్తుయేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితిమని మీరెరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి యేలాగు లేపబడెనో, అలాగే మనమును నూతన జీవము పొందినవారమై నడుచుకొనునట్లు, మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి. మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన యెడల ఆయన పునరుత్థానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యముగవారమై యుందుము. ఏమనగా మనమింకను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్థకమగునట్లు, మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడెనని యెరుగుదుము. చనిపోయినవాడు పాపవిముక్తుడని తీర్పు పొందియున్నాడు. మనము క్రీస్తుతో కూడా మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదనియు ఎరిగి, ఆయనతో కూడా జీవించుదుమని నమ్ముచున్నాము.’’

5వ వచనము మరలా పరిశీద్దాము. ‘‘మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన యెడల, ఆయన పునరుత్థానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యముగలవారమై ఉందుము.’’

ఆయన పొందిన బాప్తిస్మము ద్వారా మన పాపములన్నియు ఆయనపై మోపబడినవి గనుక ఆయన పొందిన మరణము మనమును పొందినట్లే. కనుక యేసుక్రీస్తు యొక్క బాప్తిస్మము మరియు ఆయన సిలువపై కార్చిన రక్తము మన నిమిత్తమే. 

మనము ఆయన పొందిన బాప్తిస్మము మరియు సిలువ రక్తమునందు వుంచిన విశ్వాసము మనలను యేసుతో సంయుక్త పరచుచున్నది. ‘‘పాపమునకు జీతము మరణము’’ (రోమా 6:23) కనుక సిలువపై యేసుక్రీస్తు పొందిన మరణములో మనమును సంయుక్తమైతిమి. ఆయన మన పాపములనన్నిటిని వహియించుటకే బాప్తిస్మము స్వీకరించెను. ఈ విశ్వాసము వలన మన ప్రభువును మరియు రక్షకుడైన యేసుక్రీస్తుతో మనము సంయుక్తమైతిమి.



యేసునందు మన విశ్వాసము కేవలము మతాచారము వలే వుండకూడదు.


  • ‘‘ఆయన నమ్మదగినవాడు,
  • నీతిమంతుడు’’ అనగా నేమి?
  • అనగా యేసు మన పాపములను ఒక్కసారిగా, 
  • సంపూర్ణముగా శుద్ధీకరించి, ఆ సత్యమునందు
  • విశ్వాసముంచువారిని రక్షించును.


అనేకులు యేసునందు తమ మతాచారము ప్రకారము విశ్వసించెదరు. వారు సంఘములో కన్నీరు కార్చుచు, ప్రార్థించుచు, పశ్చాత్తాపపడుచూ ఉందురు. ప్రతిరోజు తమ పాపములను ఒప్పుకొని, క్షమాపణ కోరుకొందురు. ‘‘యేసూ, నా కొరకై మీరు సిలువలో మరణించారని తెలుసు, నేను సత్యాన్ని అంగీకరిస్తున్నాను’’ అని ప్రార్థిస్తారు.

ఈ క్రింద ఉదాహరింపబడిన వాక్యభాగాన్ని వారు అపార్థం చేసుకుంటున్నారు. ‘‘మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల, ఆయన నమ్మదగినవాడు నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల ను స్వతంత్రులుగా చేయును’’ (1 యోహాను 1:9) వారి విశ్వాసమైయున్నది. ఈ వాక్యభాగములో తెలియపరచబడిన పాపము మన దైనందిన జీవితంలో జరిగే అతిక్రమాలను గురించి కాదు. మనము రక్షింపబడుటకు పూర్వము, మనము చేసిన పాపములను బట్టి ప్రార్థించినట్లయితే మనము పాపక్షమాపణ పొందగలమని భావము.

‘‘కాగా వినుట వలన విశ్వాసము కులుగును; వినుట క్రీస్తును గురించిన మాటవలన కులుగును’’. (రోమా 10:17) ‘‘అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయునని చెప్పగా’’ (యోహాను 8:32).

ప్రియమైన క్రైస్తవ సంఘమా, ఈ విషయంలో సత్యము స్పష్టముగా తెలుపబడినది. యొర్ధానులో ఆయన పొందిన బాప్తిస్మము ద్వారా, యేసు మన పాపములన్నిటిని తొలగించి యున్నడన్న విషయాన్ని విశ్వసించకుండా, కేవలము సిలువలో మరణించియున్నాడని విశ్వసించిన యెడల మన విశ్వాసము ఉపయోగము లేనిదై యుండును. ఎవరైనా సరే తమ పాపముల నుండి మన్నింపుకోరిన యెడల, మొదటిగా యేసు పొందిన బాప్తిస్మము ద్వారా తమ పాపములన్నియు ఆయన స్వీకరించెననియు, ఆ పాపములన్నిటిని తీర్పు పొంది సిలువపై మరణించెననియు విశ్వసించవలెను. అనగా ఆయన పొందిన బాప్తిస్మము మరియు సిలువ రక్తమునందు విశ్వసించవలెను.

‘‘మరి ఎవరి వలనను రక్షణ కలుగదు; ఈ నామమునే మనము రక్షణ పొందవలెను గాని, ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను’’ (అపో. 4:12). యేసు తాను పొందిన బాప్తిస్మము ద్వారా మన పాపములన్నియు తానే వహించి మనకు రక్షకుడాయెను. మనలను నిత్యాగ్నినుండి తప్పించుటకై ప్రభువైన యేసు నీటిద్వారా మరియు రక్తము ద్వారా వచ్చెను. ‘‘ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కులుగునట్లు నోటితో ఒప్పుకొనును’’ (రోమా 10:10). మీరిప్పుడు పాపులా లేక నీతిమంతులా?

గలతీ.3:27 ‘‘క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొనియున్నారు.’’ ఈ వాక్యము ప్రకారము ‘‘యేసు బాప్తిస్మము ద్వారా మన పాపములన్నియు స్వీకరించి సిలువ వేయబడెను.’’ అన్న సత్యమును గ్రహింపవలయును. 3వ రోజు నాడు పునరుత్థానుడై ఇప్పుడు తండ్రి కుడి పార్శ్వమున కూర్చుండి యుండెను. ఆయన యందు సంపూర్ణముగా విశ్వాసముంచువారికి రక్షణను అనుగ్రహించు ప్రభువాయెనే.

యేసు బాప్తిస్మము పొందక పోయినయెడల, సిలువలో మన నిమిత్తమై రక్తము చిందింపని యెడల, మనకు రక్షకుడు కాలేడు గదా. ఈ నీరు మరియు ఆత్మ సంబంధమైన సువార్త యందు మ

నము విశ్వాసముంచవలెను.



మోషే కుమారుడైనను సరే.


  • మోషేను ఐగుప్తు మార్గములో చంపుటకు
  • ఎందుకు దేవుడు యత్నించెను?
  • తన కుమారులకు సున్నతి
  • చేయలేదు గనుక.


ప్రియమైన వారలారా, ఈ నీరు మరియు యేసు రక్తము ద్వారా విమోచన సిద్ధించు మర్మము గురించి మీరు తెలుసుకుంటున్నారు. దేవుని వాక్యాము తెలుసుకోవడం ఒక అద్భుతమైన ఆశీర్వాదము.

అది కేవలము యేసురక్తము గురించేనా? పాతనిబంధనకాలములో ప్రజలు మొదటిగా శారీరక సున్నతిని బట్టి ఆ తరువాత పస్కా బలిపశువు రక్తమును బట్టి అబ్రహాము సంతానముగా పరిగణించబడిరి. ఇప్పుడైతే మనము యేసు స్వీకరించిన బాప్తిస్మమును బట్టి, సిలువలో కార్చిన రక్తమును బట్టి దేవుని ప్రజలుగా మార్పు చెందితిమి. పాతనిబంధనలో మోషే వృత్తాంతము ద్వారా దేవుడే సత్యమునకు ఋజువు చూపెను.

ఇశ్రాయేలీయులను విమోచించుటకు, దేవుడు మోషేతో మాట్లాడి, వారిని ఐగుప్తు నుండి బయటకు రప్పించవల్సిందిగా తెలియపరచెను. అప్పుడు తన మామగారైన యిత్రోవద్ద అనుమతి తీసుకొని, మిద్యాను ప్రాంతము నుండి తన భార్య, బిడ్డను తీసుకొని ఐగుప్తునకు ప్రయాణమాయెను. తన భార్యను, కుమారును ఒక గాడిదపై ఎక్కించి తీసుకొనిరాగా, మోషే బసచేయు ప్రదేశములో దేవుడతనిని ఎదుర్కొని అతనిని సంహరించుటకు యత్నము చేసెను. 

అయితే మోషే భార్య సిప్పోరాకు ఈ విషయమైన కారణము తెలియవచ్చెను. అప్పుడు ఆమె ఒక వాడిగలరాయిని తీసుకొని తన కుమారునికి సున్నతి చేసి, అతని పాదము వద్ద అది పడవేసి ` ‘‘నిజముగా నీవు నాకు రక్తసంబంధమైన పెనిమిటివైతివనెను’’. అంతట యోహోవా మోషేను విడిచెను.

శారీరక సున్నతి చేసుకొనని యెడల, యెవరినైనసరే, మోషేకుమారునినైనను, చంపెదనని తెలియజేయుటకు దేవుడనుసరించిన మార్గమది. ఇశ్రాయేలు ప్రజలకు ఈ శారీరక సున్నతియే దేవునితో ఏర్పరచుకున్న నిబంధనకు గుర్తు. ఒకవేళ సున్నతి ఆచరించనట్లయితే దేవుడు, చివరకు వారి నాయకునైనను, నాయకుని కుమారునైనను తన ప్రజల నుండి తొలగించునని ఇశ్రాయేలీయులకు తెలియవచ్చెను. కనుక దారిలో యెహోవా మోషేకు కనిపించి, తన కుమారుని సంహరించుటకైనను వెరువనని, హెచ్చరించెను.

సిప్పోరా తన కుమారునికి సున్నతి చేసి, దానిని మోషే పాదము వద్ద పడవేసి. ‘‘ఇప్పుడు నీవు నాకు రక్తసంబంధమైన పెనిమిటివైతివి’’ అని చెప్పుటకు కారణమేమనగా ఆమె కూడా సున్నతి విషయములో దేవుని ఆజ్ఞను అంగీకరించెనని తెలియజేయుటకు అని మనము గ్రహించవలెను. (నిర్గమ 4:26).

సున్నతి ఆచరించనివారు ఇశ్రాయేలు ప్రజల నుండి తొలగించబడుదురు. సున్నతి ఆచరించిన వారే పస్కా మాంసమును తినుటకు అనుమతించబడెదరు. మరియు దేవుని ప్రజగా పరిగణించబడుదురు.

అపోస్తులుడైన పౌలు ఒక హెబ్రీయుడు. ఆయన జన్మించిన 8వ రోజు తరువాత సున్నతి పొందెను. గొప్పరబ్బీ అయిన గమలీయేులు వద్ద విధ్యనభ్యసించెను. రక్షింపబడిన తరువాత యేసుక్రీస్తు యొర్ధానులో బాప్తిస్మము పొందుటకు, తరువాత సిలువలో మరణించుటకు గల కారణమును గ్రహించెను. అందువలననే అపోస్తుడైన పౌలు తన పత్రికలో యేసు పొందిన బాప్తిస్మమును గురించి తెలియజేసెను.

అపోస్తులుడైన పౌలు అనేకసార్లు సిలువ రక్తమును గురించి, అదే మన రక్షణకు పరాకాష్టగా తెలియజేసెను. విమోచనా క్రమంలో రక్తము చిందించుట చిట్టచివరి కార్యము. అయితే నిజమైన హృదయసున్నతి యేసుపొందిన బాప్తిస్మమునకు అనుసంధించబడినది. యేసు పొందిన బాప్తిస్మమును గురించి ఉదాహరింపక కేవలము సిలువ రక్తము గురించి మాట్లాడినను ఉపయోగము లేదు.

అపోస్తుడైన పౌలు అనేకసార్లు యేసుక్రీస్తు సిలువను గురించి ప్రస్తావించెను. ఎందువలన? ఎందుకనగా రక్షణ మరియు విమోచనాపధములో సిలువరక్తము చివరి సంకేతమైయున్నది. యేసు లోక పాపమంతయు స్వీకరించి, దాని నిమిత్తమై తీర్పు పొంది, సిలువ రక్తము చిందింపని యెడల మనకు రక్షణ లభించియుండేది కాదు. అందుకే అపోస్తులుడైన పౌలు అనేకసార్లు సిలువ గురించి తెలియజేసెను. సిలువ మన రక్షణ ప్రణాళికలో చివరి అంశమైయున్నది.

రక్షణను గురించిన సంపూర్ణ సత్యము ఈ దినాలలో ప్రకటింపబడుతున్నట్లయితే, అనేకులు ఇప్పటికే రక్షింపబడి యుండేవారు. అయితే కాల ప్రవాహంలో ఈ సత్యము మరుగుపరచబడినది. అనేకులు ఇంకను యేసుపొందిన బాప్తిస్మములోని సత్యమును గ్రహించనేరక, సిలువనందే విశ్వసిస్తున్నారు.

వారి విశ్వాసము, సువార్తలోని శూన్యమైన పైపెంకునందే యున్నది. అందువలననే వారనేక సంవత్సరాలుగా యేసునందు నమ్మిక ఉంచిననూ ఇంకనూ వారు పాపులు గానే యున్నారు. ఇంకొక 10 సంవత్సరాల తర్వాత అయినా సరే లేక 50 సంవత్సరాల మతాచార జీవితం తర్వాతైనా సరే ఇంకనూ పాపులుగానే జీవింతురు.



నా సాక్ష్యము


  • దేవుడు, పాపులను నీతిమంతులుగా
  • పరిగణించునా?
  • లేదు. ఆయన నీతిమంతుడు నీతిమంతుల యందు
  • పాపము నిలచి యుండరాదు. యేసుపొందిన
  • బాప్తిస్మము నందు ఉంచిన విశ్వాసము ద్వారా వారి
  • పాపములన్నియు యేసునకు ఆరోపించబడెను.


నాకు 20 సంవత్సరముల వయస్సునప్పుడు యేసుని విశ్వసించడం ప్రారంభించాను. అంతకు పూర్వం అనగా దేవుని యెరుగక పూర్వం నేనెంత పాపం చేసియున్నానో నాకు గ్రహింపులేదు. అప్పటి వరకు దేవుని యెరుగక నేను నా స్వంత మార్గంలో ప్రయాణం చేశాను.

అప్పుడు నాకొక వ్యాధి సంక్రమించినది. నేను మరణించునంతగా నాకు జబ్బు చేసింది. నేను చనిపోయేలోగా నా పాపాల నుండి ప్రాయశ్చిత్తం పొందాలని ఆశించాను. యేసు నాలాంటి పాపుల కొరకై చనిపోయాడని విని, ఆయన యందు విశ్వాసముంచాలని నిర్ణయించుకున్నాను. నేను స్వస్థపడ్డాను. ప్రారంభ దినాలలో నా హృదయం ఎంతో సంతోషంతో నిండిపోయేది. అలాగే నా మనస్సులో ఎంతో కృతజ్ఞత చెల్లించేవాడిని.

అయితే కాలం గడుస్తున్న కొద్ది ఈ భావన తగ్గుతూ వచ్చింది. కొన్ని సంవత్సరాలు గడిచాక నేను మరలా ప్రతి దినం నూతనమైన పాపాలు చేయడం మొదలు పెట్టాను. మరలా మరలా పాపిగా మారాను. 10 సంవత్సరాలు గడిచాయి. ఇంతకు ముందు కంటే ఘోరపాపిగా మారాను. నేను దాదాపు 10 సంవత్సరాలుగా యేసునందు విశ్వాసముంచాను. అయితే నాలో వున్న ఈ పాప జీవితంలో ఏ మాత్రం పరివర్తన లేదు. నేను విశ్వాసిగాను మరియు పాపిగాను జీవిస్తున్నాను.

నేనొక పాట పాడుతుంటాను. ‘‘కన్నీరు నన్ను మార్చలేదిక! నా మోమునిండినది కన్నీటితో, అది మాన్పలేదు నాలోని భయాన్ని, సంవత్సరాల నా పాపాన్ని తొగించలేదది, కన్నీరు నన్ను మార్చలేదిక’’ నేను పాపం చేసిన ప్రతిసారి కన్నీరు కార్చేవాడిని.

‘‘దేవా నా ఈ తప్పిదాన్ని మన్నించుస్వామి, ఈ ఒక్కసారికి నన్ను క్షమించు, ఇకపై నేనెన్నడూ పాపం చేయను’’. నేను పాపం చేసిన తరువాత కనీసం 3 రోజులు ఆ విషయమై ప్రార్థించేవాడిని. 3 రోజులు మూలనున్న ఒక గదిలో కూర్చొని, ఉపవాస ప్రార్థన చేసేవాడిని. నా మనస్సాక్షి నన్ను చాలా బాధించేది. అందుకై నేను ఏడ్చి, దేవుని క్షమాపణకై ప్రార్థించేవాడిని. అయితే 3 రోజుల తర్వాత నా మనస్సు కొంచెం కుదుట పడేది. ఆయన సన్నిధిలో నేనుండతగిన వాడినన్న భావన నాలోకి తిరిగివచ్చేది.

‘‘ఇప్పుడు నా పాపములను కడిగి వేసుకున్నాను. హల్లెలూయా!’’ ఆ మానసిక అపరాధ భావన నుండి బయటపడి కొద్దిరోజులు చక్కగా జీవించేవాడిని. అయితే త్వరలో నేను తిరిగి పాపం చేసేవాడిని, మరలా నాలోని చింతన అధికమయ్యేది. ప్రారంభ దినాలలో యేసునందు నేనుంచిన విశ్వాసం ఒక గొప్ప మలుపుగా భావించేవాడిని. అయితే నా విశ్వాస జీవితంలో కాలం గడుస్తున్న కొద్దీ శుభప్రరచని గదిలో పేరుకునిపోయిన దుమ్ములాగా నా పాపాలు కూడా అధికమవసాగాయి. 

10 సంవత్సరాలలు గడిచాయి, నా ప్రారంభదినాల కంటే కూడా ఘోర పాపిగా మారాను. ‘‘ఇంత చిన్నవయసులో నేనెందుకు విశ్వాసిగా మారాను? కనీసం 80 సంవత్సరాలు వయసు వరకన్నా ఆగి, అప్పుడు యేసుని విశ్వసిస్తే సులభంగా ఉండేది కదా, నేను మరణించే కొద్ది రోజులు ముందు విశ్వసిస్తే బాగుండేది. అప్పుడైతే అసలీ పాపచింతన, అపరాధ భావన ఉండేది కాదు. కనుక ప్రతిరోజు ఇలా పశ్చాత్తాపపడే అవసరం ఉండేది కాదు.’’ దేవుని అభిమతం ప్రకారం జీవించాలని కోరుకునేవాడిని గాని, అలాగు జీవించుట అసాధ్యమని తేలిపోయింది. నా మనస్సులో ఎంతో భారంగా ఉండేది!

దేవునిని ప్రతిరోజూ వెదికేవాడిని. వేదాంత శాస్త్రం ఎంతో అభ్యసించాను. అయితే కొన్ని సంవత్సరాలు తరువాత నా హృదయంలో శూన్యం ఇంకా పెరిగి పోయింది. వేదాంత గ్రంథాలు చదువుతున్న కొద్దీ నేనొక, ‘పరిశుద్ధుడైన డమియెన్‌’ అను గురువు వలె జీవించెదనని అందరికీ చేప్పేవాడిని. అంతా సమాజసేవ చేయాలని, అవసరతలో ఉన్నవారిని ఆదుకోవాలని, తప్పు చేయకుండా ఉండాలని భావించేవాడిని.

ఆ పరిశుద్ధుని గురించి నేను చదువుతూ ఉండగా, ఆయనలాగే నేను జీవించాలని నిశ్చయించుకున్నాను. ఒక సర్వాంగ పరిత్యాగిలాగా జీవనం గడపాలని ఆశించాను. గరుకైన సిమెంటు నేలపై మోకాళ్ళుని చాలా సేపు ప్రార్థించేవాడిని. అలా చేసే ప్రార్థనలో ఎంతో విలువ ఉన్నదని భావించేవాడిని, ఆ తరువాత నా మనస్సుకు ఎంతో తేలికగా ఉండేది. 

అయితే 10 సంవత్సరాలు తర్వాత ఇక నేను మాత్రము భరించలేకపోయాను. అప్పుడు నేను దేవుని ప్రార్థించాను. ‘‘పరలోకములో ఉన్న నా దేవా, దయచేసి నన్ను రక్షించండి. నేను హృదయపూర్వకంగా మిమ్ము విశ్వసిస్తున్నాను. ఒకవేళ నా మెడపై కత్తిపెట్టి బెదిరించిననూ, నేను మీ ఆరాధనను మానను. నేను హృదయపూర్వకంగా మిమ్ము విశ్వసించిననూ ఎందుకు నా జీవితంలో అంతులేని శూన్యం నిలిచియున్నది? ఎందుకు నేనెంతో నిరాశతో, విసుగు చెందియున్నాను? దిన దినమూ నేను మరింత పాపిగా మారుతున్నాను? ఇంతకు క్రితం పాపం గురించి నేనింతగా ఆలోచించలేదు. నేను మిమ్ము విశ్వసించడం ప్రారంభించిన ఇన్ని సంవత్సరా తర్వాత నేనెందుకు ఇంకనూ దుర్మార్గంగా జీవిస్తున్నానో అసలు అర్థం కావడం లేదు. అసలు నాలో ఏమి జరుగుతుంది స్వామి?’’

అలా ప్రార్థిస్తూ ఉంటే నాకు మూల కారణం తెలియవచ్చింది. నేను నా పాపము నుండి రక్షింపబడుట లేదు. కానీ యేసు నందు విశ్వాసించాను. నాకప్పుడు గానీ సత్యం గ్రహింపునకు రాలేదు. నాలో ఎంతో ఆదుర్దా చోటు చేసుకున్నది.

నా హృదయములో పాపం నిలుపుకొని, ఇతరులకు ఎలాగు దేవుని కృపను గురించి, విమోచన గురించి తెలియజేయగలను? యేసునందు విశ్వాసముంచమని ఇతరుకేలాగు చెప్పగలను? నేను ఎంతగానో ప్రార్థించాను. ‘‘ప్రియమైన దేవా, నేను సెమినరీలో (బైబిల్‌ కళాశాలలో) త్వరలో పట్టభద్రుడిని అవుతున్నాను. త్వరలో సేవకునిగా మారబోతున్నాను. పాపినైన నేను సేవకునిగా మారితే, ఇతరులకు పాపము నుండి విమోచనను నేనేలాగు బోధించగలను? నేను పాపిని, అపోస్తులుడైన పౌలు వ్రాసిన పత్రికను ధ్యానించినట్లయితే, ఎవడైననూ క్రీస్తు ఆత్మలేనివాడనైతే, వాడు దేవుని కుమారుడు కాడని గ్రహించాను. నేనెంత ఆసక్తితో వెదకిననూ నాలో ఆత్మను కనుగొనలేకపోయాను. ప్రారంభదినాలలో ఆత్మతో నిండియున్నాను. ఇప్పుడు నాలో ఆత్మనింపుదల కానరావడం లేదు. నాకసలు ఏమైంది? దేవా నాకు తెలియపరచండి ప్రభువా’’ అని ప్రార్థించాను.

అయితే నేను కేవలం యేసునందు సామన్యమైన విశ్వాసం ఉంచి విమోచింపబడ్డానని నమ్మి మోసగింపబడ్డానని కారణం తెలుకున్నాను. దీని విషయమై అనేక రోజులు నా హృదయములో ఎంతో క్షోభించాను.

తనను వెదకువారికి దొరికెదనని దేవుడు వాగ్ధానం చేశాడు. ఆయన సర్వసత్యాన్ని నాకిప్పుడు బయలుపరిచాడు. యేసును విశ్వసించడం మొదలుపెట్టిన 10 సంవత్సరాలకు కూడా నేనొక పాపినేనని గ్రహించాను. అయితే నేనిప్పుడు నీరు మరియు ఆత్మసంబంధమైన సువార్తను తెలుసుకున్నాను. యేసుక్రీస్తు పొందిన బాప్తిస్మమును, ఆయన కార్చిన సిలువ రక్తమును గురించి సత్యం అవగతం చేసుకున్నాను. పాతనిబంధనలోని శారీరక సున్నతిలోని సత్యాన్ని, తెలుసుకొని నూతన నిబంధనలోని ఆత్మ సంబంధమైన సున్నతిలో విశ్వాసముంచాను. యేసుపొందిన బాప్తిస్మములో ఉన్న రక్షణార్థమైన రహస్యమును నేను గ్రహించాను. వెంటనే నా హృదయ క్షోభ మాయమైనది. నాలోని విచారకర పరిస్థితులు మారాయి. నా అంతరంగమిప్పుడు మంచుకంటే తెల్లగా మారింది.

మీ విషయంలో కూడా ఇదే సంభవిస్తుంది. యేసుపొందిన బాప్తిస్మము మరియు సిలువ మరణమునకు సంబంధించిన సువార్తను విశ్వసించినట్లయితే మీరునూ పాపరహితలు కాగలరు. మీరింకనూ అసంపూర్ణులైననూ, మీరు నీతిమంతులుగా మార్చబడుదురు. ఈ సత్యాన్ని మీ హృదయాలలో స్వీకరించి, ఇతరులకు దీనిని తెలియజేసినట్లయితే, వారు రక్షింపబడతారు. దేవునికే స్తోత్రము కులుగును గాక! ‘‘హల్లెలూయ’’ అని మనము గొప్ప శబ్దముతో స్తుతించగలము. 

విమోచింపబడిన సహోదర సహోదరీలను నేను అభినందిస్తున్నాను. మీ పాపములన్నిటి నుండి మిమ్మును కాపాడిన యేసుకు స్తుతులు. హల్లెలూయ! మేమిప్పుడు విమోచింపబడి సంతోషించుచున్నాము.

ఈ అద్భుతమైన ఆశీర్వాదమును మాటలలో వర్ణించలేము. మనందరం కలిసి ఈ పాట పాడుదాము. ‘‘మనమింకా, ప్రతివారికీ, దేవుని గూర్చి తెలియజేయలేదు. కనుకనే ఆయన నామము అందరిచే స్తుతియింపబడుటలేదు. భవన నిర్మాణకుడు త్యజించిన రాయి ఆయెనే, ఆయన నామము శ్రేష్టమైనది. నా హృదయములో అది ఒక రత్నమైయున్నది.’’



సమస్తమయిన పాపుల సకల పాపములు పరిహరించుటకు యేసుపొందిన బాప్తిస్మము మరియు సిలువరక్తము చాలినది.


  • మన హృదయములలో నుండి సమస్త
  • పాపములను తొలగించునదేది?
  • యేసుపొందిన బాప్తిస్మము


ప్రభువైన యేసు ఆయన పొందిన బాప్తిస్మము మరియు సిలువ మరణము ద్వారా లోకపాపమంతయు పరిహరించెను. మనలో హృదయసున్నతిని కలుగజేసి, మనలను ఆయన ప్రజలుగా చేసికొనెను. తిరిగి జన్మించిన అనుభవము కలవారికి ఆయన అద్వితీయ దేవుడై యున్నాడు.

పాపము ఎప్పుడైననూ తీర్పునకు లోబడవలెను. అయితే మనకు ప్రత్యామ్నాయముగా యేసుబాప్తిస్మము పొంది, మనలను రక్షించుటకు సిలువ మరణపు తీర్పుపొందెను. ఆయన కార్చిన రక్తము ద్వారా మనలను రక్షించి, తిరిగి 3వ రోజు నాడు మృతులలో నుండి పునరుత్థానుడాయెను. మృతులలో నుండి తండ్రి అయిన దేవుడాయనను జీవింపజేసెను.

యేసు యొక్క జీవితం, మనలను జీవింపజేసింది. మరియు మనలను దేవుని పిల్లలుగా మార్చింది. ఆయన పాందిన బాప్తిస్మము మనందరి పాపమును తొలగించింది. ఆయన విలువైన సిలువ రక్తము మన నిమిత్తమై పొందిన తీర్పును సూచించుచున్నది.

నా స్నేహితులారా, మీ హృదయములో యేసుపొందిన బాప్తిస్మము మరియు సిలువ మరణమునకు సంబంధించిన ఋజువు కలదా? మిమ్మును మరియొకసారి ప్రశ్నిస్తున్నాను. మన రక్షణ కేవలం యేసు రక్తం ద్వారానే సిద్ధిస్తుందా? లేదు. రక్షణ, యేసుక్రీస్తు వారి బాప్తిస్మములోని మరియు సిలువ మరణము నందు నిలచియున్నది.



మతబేధములు కలిగించువాడెవరు?


  • మతబేధము కలిగించువారెవరు?
  • యేసుక్రీస్తు పొందిన బాప్తిస్మమును విశ్వసించక
  • తనను తాను తీర్పునకు అప్పగించుకొనువాడు.


ప్రియ స్నేహితులారా, మీ జీవితంలో ప్రతిదినం యేసునందు విశ్వాసముంచినను ఇంకనూ పాపులుగానే ఉన్నారా? యేసునందు విశ్వాసముంచినను, ఇంకనూ పాపివైనచో నీవు తప్పక మతబేధము కలిగించువ్యక్తివే. మత బేధమనగా దేవుని సత్యాన్ని విస్మరించుటే (తీతు 3:10). ఈ విషయం గురించి తెలియజేయుచున్నది. ‘‘మత బేధము కలిగించు మనుష్యునికి ఒకటి రెండుమారులు బుద్ధి చెప్పిన తరువాత వానిని విసర్జించుము.’’

తనకు తాను నాశనమునకు అప్పగించువ్యక్తి ఈ విధంగా మాట్లాడుతాడు. ‘‘ప్రియమైన దేవా! నేను పాపిని, మిమ్మును విశ్వసిస్తున్నాను. అయినను ఇంకనూ పాపినే, ఇతరులేమి మాట్లాడిననూ పరవాలేదు. నేను పాపినన్న విషయం సత్యం.’’

‘‘నీవింకనూ పాపివేనా? ఇంకా నా బిడ్డగా మార్పుచెందలేదా? అయితే నీవు విమతము కలిగించు వ్యక్తివి, నీవు నరకాగ్నిలో త్రోయబడుదువు.’’

నా హృదయంలో, యేసుపొందిన బాప్తిస్మము నందు విశ్వసించక, కేవలము యేసును నమ్మిన యెడల నీవింకను పాపిగానే, నీకు నీవు తీర్పు తీర్చుకుంటూ, నీ హృదయం ఇంకనూ పాపంతోనే నిండియున్నదని అంగీకరిస్తూ, దేవుని యెదుట నీవు విమతములు కలిగించు వ్యక్తిగా నిలచెదవు.



నిజమైన విశ్వాసులెవరు?


  • రక్షణ గురించిన దేవుని
  • సాక్ష్యమేమైయున్నది?
  • నీరు, రక్తము మరియు ఆత్మయే.


యేసుపొందిన బాప్తిస్మము మరియు సిలువ మరణ సంబంధమైన సువార్తను విశ్వసించువారందరూ, దాని ద్వారా దేవుని ప్రజలుగా మార్చబడిన వారందరూ, తమ పాపములన్నియు శుద్దీకరింపబడిన వారందరూ, నీతిమంతులైయున్నారు. యేసునందు విశ్వాసముంచి ఇంకను నీవేలాగు పాపివైయున్నావు. ఒకపాపి పరలోకరాజ్యములోనికి ప్రవేశింపనేరడు.

యేసునందు విశ్వాసముంచి నీతిమంతులుగా పరిగణింపబడినవారు దేవుని విషయమై తమ హృదయములో సాక్ష్యము కలిగియుందురు. ఆ సాక్ష్యాలే, యేసు స్వీకరించిన బాప్తిస్మము మరియు చిందించిన రక్తమైయున్నవి. ఈ లోకములో యేసుక్రీస్తు వారు జరిగించిన రక్షణ కార్యక్రమ మిదియే.

కనుక మన పాపములన్నియు యేసునకు ఆరోపింపబడిన ఈ బాప్తిస్మపు సువార్తను విశ్వసించుటకు నిరాకరించినవారు దేవుని నుండి తొలగింపబడుదురు. 

ఓ నా ప్రియ సహోదరులారా మరియు సహోదరీలారా, రక్షణ సువార్త కేవలం యేసు చిందించిన రక్తములోనే ఇమిడి లేదని, ఆయన పొందిన నీటి బాప్తిస్మములో సంయుక్తమై ఉన్నదని మీరంగీకరించుచున్నారా?

ఈ లోకములో యేసు చేసిన కార్యమును విశ్వసించిన వారు మరియు ఈ నీరు, రక్తము మరియు ఆత్మ ద్వారా లభించినది అంగీకరించువాడే తమ పాపము నుండి రక్షింపబడుదురు. ఇదే ఈ నీరు, రక్తము మరియు ఆత్మ వలననైన సువార్తలోని సత్యము మరియు జ్ఞానమైయున్నది.

యేసు, తాను పొందిన బాప్తిస్మము ద్వారా మనలను పాపబంధకముల నుండి సంపూర్ణముగా విమోచించెను. కనుక సమస్త మానవాళి ఆయన ద్వారా రక్షింపబడెను. ఈ విధముగా ఇప్పుడు నీవు క్రీస్తును అంగీకరించిన యెడల నీవిక పాపిగా ఉండవు.

యేసు మనలను మృతులలో నుండి పునరుద్ధరించాడు. అపవాది కుతంత్రములు వలన, దేవునికి దూరముగా తొలగియున్న ఆత్మను రక్షించెను. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడవతరించెను. ఈ నీరు, రక్తము మరియు ఆత్మ సంబంధమైన సువార్త వలన, దేవుడు, యేసుక్రీస్తు ద్వారా తన ఉద్దేశ్యమును సఫలీకృతము చేసుకొనెను. ఆయన మనలను పిలిచాడు. మనమిప్పుడు రక్షింపబడ్డాము మరియు విమోచింపబడ్డాము.

ఈ అద్భుతమైన సత్యము నందు మీరు విశ్వాసము కలిగియున్నారా? రక్షణ కేవలము సిలువ రక్తము ద్వారానే లభించదు కానీ, యేసు పొందిన బాప్తిస్మము మరియు ఆయన సిలువలో కార్చిన రక్తము ద్వారా లభించును. కేవలము సిలువ రక్తము ద్వారానే రక్షింపబడి యున్నామని చెప్పువారింకను హృదయములో పాపము కలిగి యున్నారని గ్రహించవలయును.

మనము కూడా కేవలము యేసు రక్తములో విశ్వాసముంచిన రక్షింపబడగలమని ఒకప్పుడు విశ్వసించాము. మరిప్పుడైతే అది చాలదని గ్రహించాలి. మనము నీరు, మరియు రక్తము ఆత్మ ద్వారా వచ్చిన ప్రభువైన యేసుక్రీస్తు నందు విశ్వాసముంచి తిరిగి, జన్మించిన అనుభవము పొందియున్నాము.

ప్రతిపాపి, యేసుపొందిన బాప్తిస్మము మరియు ఆయన చిందించి సిలువ రక్తము నందు, విశ్వాసముంచిన యెడల తిరిగి జన్మించగలడు. (1 యోహాను 5:5`10) దేవునికే స్తోత్రము కులుగును గాక. హల్లెలూయ.