Sermons

[3-7] < హెబ్రీ 7:1-28 > మార్పు చెందిన యాజకత్వము< హెబ్రీ 7:1-28 >

‘‘రాజును సంహారము చేసి, తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలిసికొని అతనిని ఆశీర్వదించెనో, యెవనికి అబ్రహాము అన్నిటిలో పదియవవంతు ఇచ్చెనో, ఆ షాలేమురాజును, మహోన్నతుడగు దేవుని యాజకుడునైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు, తరువాత సమాధానపు రాజనియు అర్థమిచ్చునట్టి షాలేము రాజని అర్థము. అతడు తండ్రిలేనివాడును తల్లిలేనివాడును వంశావళి లేనివాడును, జీవితకాలమునకు ఆదియైనను జీవనమునకు అంతమైనను లేనివాడునైయుండి దేవుని కుమారుని పోలియున్నాడు. ఇతడెంత ఘనుడో చూడుడి. మూలపురుషుడైన అబ్రహాము అతినికి కొల్లగొన్న శ్రేష్ఠమైన వస్తువులలో పదియవవంతు ఇచ్చెను. మరియు లేవి కుమాళ్లలో నుండి యాజకత్వము పొందువారు, తమ సహోదరులు అబ్రహాము గర్భవాసము నుండి పుట్టినను, ధర్మశాస్త్రము చొప్పున వారి యొద్ద, అనగా ప్రజల యొద్ద పదియవవంతును పుచ్చుకొనుటకు ఆజ్ఞను పొందియున్నారు గాని వారితో సంబంధించిన వంశావళి లేనివాడైన మెల్కీసెదెకు అబ్రహాము నొద్ద పదియవంతు పుచ్చుకొని వాగ్ధానమును పొందినవానిని ఆశీర్వదించెను. తక్కువవాడు ఎక్కువ వానిచేత ఆశీర్వదింపబడునను మాట కేవలము నిరాక్షేపమైయున్నది. మరియు లేవీక్రమము చూడగా చూపునకు లోనైననవారు పదియవవంతును పుచ్చుకొనుచున్నారు. అయితే ఈ క్రమము చూడగా, జీవించుచున్నాడని సాక్ష్యము పొందినవాడు పుచ్చుకొనుచున్నాడు. అంతేకాక ఒక విధమున చెప్పినయెడల పదియవవంతును పుచ్చుకొను లేవీయులు అబ్రహాము ద్వారా దశమభాగమును ఇచ్చెను. ఎలాగనగా మెల్కీసెదకు అతని పితరుని కలిసికొనినప్పుడు లేవీ తన పితరుని గర్భములో ఉండెను. ఆ లేవీయులు యాజకులై యుండగా ప్రజలకు ధర్మశాస్త్రమియ్యబడెను గనుక ఆ యాజకులు వలన సంపూర్ణసిద్ధి కలిగినయెడల అహరోను క్రమములో చేరినవాడని చెప్పబడక మెల్కీసెదెకు క్రమము చొప్పున వేరొక యాజకుడు రావలసిన అవసరమేమి? ఇదియుగాక యాజకులు మార్చబడినయెడల అవశ్యముగా యాజకధర్మము సహా మార్చబడును. ఎవనిగూర్చి ఈ సంగతులు చెప్పబడెనో ఆయన వేరొక గోత్రములో పుట్టెను. ఆ గోత్రములోనివాడెవడును బలిపీఠము నొద్ద పరిచర్య చేయలేదు. మన ప్రభువు యూదా సంతానమందు జన్మించెననుట స్పష్టమే; ఆ గోత్ర విషయములో యాజకులను గూర్చి మోషే యేమియు చెప్పలేదు. మరియు శరీరానుసారముగా నెరవేర్చబడు ఆజ్ఞగల ధర్మశాస్త్రమును బట్టి కాక, నాశనములేని జీవమునకున్న శక్తినిబట్టి నియమింపబడి, మెల్కీసెదకును పోలినవాడైన వేరొక యాజకుడు వచ్చియున్నాడు. కావున మేము చెప్పిన సంగతి మరింత విశదమైయున్నది. ఏలయనగా ` నీవు నిరంతరము మెల్కీసెదకు క్రమము చొప్పున యాజకుడవై యున్నావు. అని ఆయన విషయమై సాక్ష్యము చెప్పబడెను. ఆ ధర్మశాస్త్రము దేనికిని సంపూర్ణసిద్ధి కలుగజేయలేదు గనుక ముందియ్యబడిన ఆజ్ఞ బలహీనమైనందునను నిష్‌ప్రయోజనమైనందునను అది నివారణ చేయబడియున్నది; అంతకంటే శ్రేష్ఠమైన నిరీక్షణ దానివెంట ప్రవేశపెట్టబడెను. దీని ద్వారా దేవుని యొద్దకు మనము చేరుచున్నాము. మరియు ప్రమాణము లేకుండ యేసు యాజకుడు కాలేదు గనుక ఆయన మరి శ్రేష్టమైన నిబంధనకు పుట్టకపోయెను. వారైతే ప్రమాణము లేకుండ యాజకులగుదురు గాని యీయన నీవు నిరంతరము యాజకుడవై యున్నావని ప్రభువు ప్రమాణము చేసెను; ఆయన పశ్చాత్తాపపడడు. అని యీయనతో చెప్పినవానివలన ప్రమాణ పూర్వకముగా యాజకుడాయెను. మరియు ఆ యాజకులు మరణము పొందుట చేత ఎల్లప్పుడును ఉండ సాధ్యము కానందున, అనేకులైరి గాని ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పులేని యాజకత్వము కలిగిన వాడాయెను. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పక్షమున, విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడైయున్నాడు. పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చయినవాడునైన యిట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ధర్మశాస్త్రము బలహీనతగల మనుష్యులను యాజకులనుగా నియమించును గాని ధర్మశాస్త్రమునకు తరువాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరము సంపూర్ణ సిద్ధిపొందిన కుమారుని నియమించెను గనుక, ఈయన ఆ ప్రధాన యాజకుల వలె మొదట తన సొంత పాపము కొరకు తరువాత ప్రజల పాపము కొరకును దినదినము బలులను అర్పింపవలసిన అవసరము గలవాడు కాడు; తన్ను తాను అర్పించు కొన్నప్పుడు ఒక్కసారే ఈ పనిచేసి ముగించెను.’’యేసు మన పరలోకపు యాజకుడు


 • ప్రధాన యాజకుడైన మెల్కీసెదకా
 • లేక అహరోను యాజక క్రమములో భూమిపై
 • నియమించబడిన ప్రధాన యాజకుడా,
 • ఎవరు గొప్పవారు?
 • ప్రధాన యాజకుడైన మెల్కీసెదకు.


అబ్రహాము కాలములో కదొర్లాయోమెరు మరియు ఆయనతో కూడిన ఇతర రాజుల కాలములో మెల్కీసెదెకు అను ఒక ప్రధాన యాజకుడుండెను. వారు సొదొమ, గొమొఱ్ఱా లోని సమస్తమును తీసుకొని పోయిరి. ఇది తెలిసికొనిన అబ్రహాము, ఆయన ఇంట జన్మించి, సుశిక్షితులైన సేవకులు వెంటరాగా రాజైన కదొర్లాయోమెరు మరియు అతనితో కూడిన ఇతర రాజులపైనను యుద్దము చేసెను.

అప్పుడు అబ్రహాము ఎలోము రాజైన అతనిని మరియు తనినితో కూడిన రాజును జయించి, తన అన్నకుమారుడైన లోతును మరియు అతని ఆస్తిపాస్తులను తిరిగి స్వాధీన పరచుకొనెను. ఆ విజయము తర్వాత ఉన్నతమైన దేవుని యాజకుడైన, సేలము రాజైన మెల్కీసె దెకు, రొట్టె మరియు ద్రాక్షారసముతో అబ్రహామునకు ఎదురు వెళ్లి ఆశీర్వదించెను. అబ్రహాము తన వద్దనున్న సమస్తములో పదియవ భాగమాయనకిచ్చెను. (ఆదికాండం 14వ అధ్యాయము)

సత్యగ్రంధమందు ప్రధాన యాజకుడైన మెల్కీసెదెకును మరియు మెల్కీసెదెకు క్రమములోని యాజకులను గురించి విశిష్టముగా వివరింపబడినది. ప్రధాన యాజకుడైన మెల్కీసెదెకు ‘‘సమాధానమునకు ప్రభువు’’ మరియు ‘‘నీతిరాజు’’గా తెలియపరచబడెను. మెల్కీసెదకుకు పూర్వీకులు, తల్లిదండ్రులు లేరని చెప్పబడినది. ఆదియును, అంతమునులేక దేవుని కుమారునివలెయున్న మెల్కీసెదెకు యాజకక్రమము తో కొనసాగుతూ వచ్చెను.

మెల్కీసెదెకు యాజక క్రమములో మన ప్రధాన యాజకుడైన యేసును గూర్చి ఆయన గొప్పదనమును గూర్చి, జాగ్రత్తగా వివరింపబడెను. పాత నిబంధనలోని ప్రధాన యాజకుడైన యేసును గురించి ఘనముగా వివరించబడినది.

లేవీ వంశస్థులు యాజకులై, ప్రజల నుండి దశమభాగమును పొందిరి. వారందరూ అబ్రహాము వంశక్రమములో అన్నదమ్ముల సంతతివారే. అబ్రహాము మెల్కీసెదెకుకు దశమభాగము ఇచ్చినప్పుడు, లేవీ ఇంకనూ జన్మించలేదు.

పాతనిబంధనలోని యాజకులు, యేసుకంటే గొప్పవారా? దీనిని గురించి జీవగ్రంధములో వివరించబడినది. ఈ లోకములోని ప్రధాన యాజకుల కంటే యేసు గొప్పవాడా? ఎవరు ఎవరిచేత ఆశీర్వదింపబడవలెను. హెబ్రీ పత్రిక రచయిత ఆది నుండి ఈ విషయమును వివరించాడు. ఇప్పుడు ఎటువంటి ఖండింపు లేకుండా తక్కువవాడు, ఎక్కువ వానిచేత ఆశీర్వదింపబడెను. అబ్రహాము ప్రధానయాజకుడైన మెల్కీసెదెకు వలన ఆశీర్వదింపబడ్డాడు.

మనము విశ్వాసములో ఏవిధముగా జీవిస్తున్నాము? పాతనిబంధనలో ఆజ్ఞాపింపబడిన, ప్రత్యక్షగుడారానుసారమైన బల్యర్పణను సమర్పిస్తూ దేవుని ఆజ్ఞకు లోబడి జీవిస్తున్నామా? లేక నీరు మరియు ఆత్మద్వారా బల్యర్పణగానైన మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తుపై ఆధారపడి జీవిస్తున్నామా?

మనమేర్పరచుకున్న స్థితినిబట్టి, మనము ఆశీర్వదింపబడగలము లేక శపింపబడగలము. దేవుని ఆజ్ఞానుసారము అనుదినము చేయు అర్పణ వలన జీవించుచున్నామా లేక నీరు మరియు రక్తము ద్వారా తనను తాను ఏకైక బలియాగముగా సమర్పించుకున్న ప్రభువైన యేసుక్రీస్తు అందించిన రక్షణ యందు అంగీకరించి, విశ్వసించుచున్నామా? ఈ రెంటిలో ఒకదానినే మనము ఎన్నుకొనగలము. 

పాత నిబంధనా కాలములో ఇశ్రాయేలుయు లేవీగోత్రీకుడైన అహరోను యాజకక్రమములోని ప్రధాన యాజకులను అనుసరించిరి. అయితే నూతన నిబంధనా కాలములో వున్న మనకు ఎవరుగొప్ప వాడు, యేసా లేక అహరోను వంశక్రమములోని యాజకులా అన్న ప్రశ్న వస్తే తప్పక ‘యేసే గొప్ప యాజకుడు అని సమాధానమివ్వగలము అనేకులకీ విషయం స్పష్టంగా తెలిసినా, కొద్దిమంది మాత్రమే ఈ సత్యాన్ని అనుసరిస్తున్నారు.

ఈ ప్రశ్నకు బైబిలు గ్రంధములో సరైన సమాధానమున్నది. లేవీగోత్రమునకు కాక ఎన్నడూ యాజకత్వము చేయని మరియొక గోత్రమునకు సంబంధించి యేసు పరలోక ప్రధాన యాజకత్వము తీసుకొనెనని తప్పక చెప్పగలము. యాజకత్వము మార్పు చెందును గనుక ఇవ్వబడిన ఆజ్ఞలలో కూడా మార్పు అనివార్యము. 

మోషే ద్వారా దేవుడు 613 విధిరూపకమైన ఆజ్ఞలను మరియు ధర్మశాస్త్రపు కట్టడలను, మానవులకు నియమించెను. ఈ ధర్మశాస్త్రము మరియు దాని కట్టడల ప్రకారం జీవించవలెనని మోషే తన ప్రజలకు సెలవిచ్చెను. ప్రజలావిధముగా అంగీకరించిరి.


 • దేవుడా మొదటి నిబంధనను తొలగించి
 • ఎందుకు రెండవ నిబంధననిచ్చెను?
 • మొదటి నిబంధనను బట్టి జీవించుటకు
 • మానవుడు ఆశక్తుడాయెను గనుక.


బైబిలులోని పంచగ్రంథములైన ఆదికాండము, నిర్గమ కాండము, లేవీకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండములోని దేవుడిచ్చిన ఆజ్ఞ ప్రకారము జీవించుటకు మానవులు సమ్మతించిరి. దేవుడిచ్చిన ప్రతి ఆజ్ఞకు ప్రజలు ఏ మాత్రము ఎదురు చెప్పక తమ ‘‘అంగీకారము’’ తెల్పియున్నారు.

అయితే ద్వితీయోపదేశకాండము తరువాత, యెహోషువా గ్రంథ కాలమునుండి ప్రజలీ ధర్మశాస్త్ర ప్రకారము జీవించక పోవుట మనము బైబిలు గ్రంథములో గమనించగలము. న్యాయాధిపతులు, మొదటిరోజు, ఆ తరువాత రెండవ రాజుల గ్రంథములో ప్రజలు తమ నాయకులను నిరాకరించుట గమనించగలము. ఆ తరువాత దినములలో ప్రత్యక్షగుడారములోని బల్యర్పణా విధానమును కూడా మార్చునంతగా పతనమైరి. 

మలాకీ గ్రంథములో చూసినట్లయితే, దేవుడు ఏ లోపములేని జంతువును బలి అర్పించవలసినదిగా సెలవిచ్చినను, లోపము గల జంతువును కూడా బలిపశువుగా తెచ్చుట గమనించగలము. ‘‘అర్హతను విస్మరించి, తాము తెచ్చిన జంతువునే బలికి సమ్మతించవలసినదిగా యాజకులను కోరిరి. ‘‘దేవుని ధర్మశాస్త్రానుసారముకాక తమ స్వంత ఏర్పాట్లను బట్టి బలులు అర్పించసాగిరి. 

పాతనిబంధనా కాలములో ఏ సమయములోను, ఇశ్రాయేలీయులు దేవుని ఆజ్ఞానుసారము పాటించలేదు. బల్యర్పణా విధానములో వున్న రక్షణను నిర్లక్ష్యపరచిరి. అందుకనే యిర్మియా గ్రంథములో ‘‘నేను ఇశ్రాయేలు గృహమంతటిలోను మరియు యూదావారితోను ఒక నూతన నిబందన చేయుదును.’’ అని పలికెను.

యిర్మియా 31:31-34 వరకు ధ్యానిద్దాము. ‘‘ఇదిగో నేను ఇశ్రాయేులువారితోను యూదావారితోను క్రొత్తనిబంధన చేయు దినములు వచ్చుచున్నవి; ఇదే యెహోవా వాక్కు. అది ఐగుప్తులోనుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకొనిన దినమున, వారి పితరులతో నేను చేసిన నిబంధనవంటిది కాదు; నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసికొనిరి; యిదే యెహోవా వాక్కు. ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలువారితోను యూదావారితోను చేయబోవు నిబంధన యిదే, వారి మనస్సులో నా ధర్మవిధి ఉంచెదను, వారి హృదయము మీద దాని వ్రాసెదను; యెహోవా వాక్కు ఇదే’’

నేనొక నూతన నిబంధన చేయుదునని దేవుడు సెలవిచ్చెను. అప్పటికే దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులతో, ప్రభువు చేసిన నిబంధనను వారు పాటించలేకపోయిరి. కనుక రక్షణాత్మకమైన యొక నూతన నిబంధనను తన ప్రజలతో చేయుటకు దేవుడు నిర్ణయించుకొనెను.

‘‘దేవా, యేసూ నిన్నే ఆరాధించగలము. మీ మాటల చొప్పున జీవిస్తూ, మీ ఆజ్ఞను పాటించగలమని’’ ఆయనతో ప్రమాణము చేసి యుంటిరి. ‘‘నేను తప్ప వేరొక దేవతను మీరు పూజింపగూడదని వారితో నిబంధన చేసియుండెను. అప్పుడు ఇశ్రాయేలీయులు, నీవు తప్పమరే దేవుని ఆరాధించము, అని అంగీకరించిరి. మీరే మా దేవుడు, మీరు తప్పక ఇంకే దేవుడు లేడు అని నిబంధన చేసితిరి అయితే వారావాగ్ధానమును మీరితిరి.

‘‘ధర్మశాస్త్రమంతిటిలో పది ఆజ్ఞలు ముఖ్యమైనవి.’’

‘‘నేను తప్ప మీకు మరొక దేవుడుండకూడదు.’’

‘‘చెక్కినవాటిని, విగ్రహమును మీ కొరకు ఏర్పాటు చేసికొనవద్దు మరియు వాటిని పోలిన వాటికిని సాష్టాంగ పడరాదు, సేవించరాదు.’’

‘‘విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించవలెను.’’

‘‘మీ ప్రభువైన దేవునిపై ఒట్టుపెట్టుకొనరాదు.’’

‘‘నీ తల్లిదండ్రులను సన్మానించుము.’’

‘‘హత్య చేయకూడదు, వ్యభిచరించవద్దు, దొంగిలవద్దు.’’

‘‘నీ పొరుగువానికి విరోధముగా సాక్ష్యము పలుకవద్దు.’’

‘‘నీ పొరుగువాని ఆస్థిని ఆశింపకూడదు’’ (నిర్గమ 20వ అధ్యాయము).

ఈ ధర్మశాస్త్రమంతయు, 613 విధిరూపకమైన ఆజ్ఞలుగా వివరించబడినవి. అని ప్రతిమానవుడు ఆచరించవలెను. ‘‘కుమారుల యెడల ఏమి చేయగూడదు. కుమార్తెల యెడల ఏమి చేయగూడదు. సవతి తల్లుల యెడల ఏమీ చేయవలెను. మొదలగునవి ఈ ఆజ్ఞ ఇచ్చిన దేవుడు వారిని అన్ని మంచి విషయములను ఆచరించమని, చెడు జరిగించరాదని తెలియజేసెను. అవి 613 విధిరూపకమైన ఆజ్ఞలుగా అనుగ్రహించెను.

సకల మానవాళిలో దేవుడిచ్చిన ఆజ్ఞను సంపూర్ణముగా ఒక్కరుకూడా నిర్వహించలేకపోయెను. కనుక వారి పాపములనుండి విమోచించుటకు దేవుడు మరియొక నిబంధనను చేయవలసి వచ్చెను.

యాజకత్వములోని మార్పు ఎప్పుడు చేయసాగెను? యేసు ఈ లోకమునకు వచ్చిన తరువాత యాజకత్వ విధానము మార్పుచెందెను. అహరోను యాజక క్రమములో నున్న యాజకుల వద్ద నుండి యాజకత్వము స్వీకరించెను. ప్రత్యక్షగుడారములోని బలులను తొలగించెను. లేవీయుల కివ్వబడిన ఈ హక్కును తొలగించెను. ఆయనొక్కడే ఈ పరలోక ప్రధాన యాజకత్వము నిర్వహించెను.

ఆయన రాజులైన యూదాగోత్రము నుండి ఇశ్రాయేలీయుడై అహరోనుకు వారసునిగా ఈ లోకమున తనను తానే బలిగా సమర్పించుకొని, సకల మానవాళిని వారి పాపము నుండి పరిహరించెను.

తననుతానే బలిగా అర్పించుకొనుటద్వారా, మన పాపములను తొలగించుటకు వీలాయెను. ఆయన పొందిన బాప్తిస్మము నందు, చిందించిన రక్తము ద్వారా చేసిన త్యాగమే లోకపాపమంతయు తొలగించెను. సమస్త పాపములకు నిత్యమైన బలిగా తనను తాను అర్పించుకొని ఏకైక బలియాగమాయెను.ధర్మశాస్త్రములోనే కాదు, దేవుని ఆజ్ఞలలోను మార్పువచ్చెను.


 • మార్చబడి రక్షణార్థమైన ఆజ్ఞ
 • ఏమైయున్నది?
 • యేసుక్రీస్తు యొక్క ఏకైక నిత్యబలిదానము.


నా ప్రియస్నేహితులారా, పాతనిబంధనలోని యాజకత్వము నూతన నిబంధనలో మార్పు చేయబడినది. పాతనిబంధనాకాలములో లేవీగోత్రీకులైన అహరోను వంశస్థులు సంవత్సర పాపముకు ప్రాయశ్చిత్తముగా బలులర్పించెడివారు. ప్రధానయాజకుడు అతిపరిశుద్ధస్థలములో ప్రవేశించేవాడు. బలి అర్పింపబడ్డ జంతువు రక్తముతో కరుణాపీఠము వద్దకు వెళ్లేవాడు పరిశుద్ధ స్థలమైన తెరవెనుక భాగమునకు ప్రధానయాజకుడు ఒక్కడు మాత్రమే వెళ్ళగలిగేవాడు.

యేసుప్రభువు ఈ లోకపఠము మీద అరుదెంచిన తరువాత ఆయనే ప్రధాన యాజకుడయ్యాడు. ఆయన నిత్యమైన యాజకత్వము స్వీకరించేవాడు. సకల మానవాళి, సమస్త పాపములను పరిహరించుటకు ప్రధాన యాజకుడైన అహరోను తనను తాను పరిశుద్ధపరచుకొను నిమిత్తము ఎద్దు తలపై తన చేతులుంచి, తన పాపము దానిపై ఆరోపించి బలి సమర్పించేవాడు. ఆ తరువాత ఇతరుల నిమిత్తమై తన యాజకత్వ ధర్మము నెరవేర్చువాడు. ‘‘దేవా నేను పాపిని’’ అని తన పాపములు చేతులుంచుటద్వారా ఆ బలిపశువునకు ఆరోపించే వీలు కలిగేది. అప్పుడా జంతువును బలిగా సమర్పించి, దాని రక్తమును కరుణాపీఠము వద్ద 7 సార్లు ప్రోక్షించేవాడు.

ప్రధాన యాజకుడైన అహరోనే సంపూర్ణుడు, పరిశుద్ధుడు కానియెడల సామాన్య మానవుల నుండి మనమేమి ఆశించగలము? లేవీవంశస్థుడై, ప్రధాన యాజకుడైన అహరోనులోనే పాపమున్నదిగదా! అందువలన తన నిమిత్తము మరియు తన కుటుంబము నిమిత్తము పాపపరిహారార్థబలిగా ఒక యెద్దును సమర్పించేవాడు.

దేవుడు యిర్మియాగ్రంధం 31వ అధ్యాయంలో ‘‘నేనీ నిబంధనను మార్చగలను’’ అని పలికాడు. నేను మీతో ఒక నిబంధన చేసియున్నాను. కానీ మీరు దానిని నెరవేర్చలేదు. కనుక మిమ్మును శుద్దీకరించలేని ఆ నిబంధనను తొలగించి, విమోచనాత్మకమైన, రక్షణార్థమైన మరియొక నిబంధనను ఇస్తాను. నేనిచ్చిన ఆజ్ఞను బట్టి ఇక ఏ మాత్రము మిమ్ము రక్షించలేను గనుక ఈ నీరు మరియు ఆత్మ సంబంధమైన విమోచనాత్మకమైన రక్షణను నా బిడ్డ కొరకు సిద్ధపరచియుంచాను.

కాలము సంపూర్ణమైనప్పుడు, ఈ నూతన నిబంధనను దేవుడు మనకు అనుగ్రహించాడు. మనుష్యరూపధారిగా యేసు ఈ లోకమునకరుదెంచి, లోకపాపమంతయు మోసికొని, సిలువపై తన స్వరక్తమును చిందించి, ఆయనయందు విశ్వాసముంచిన మనలను రక్షణ పధమందు నడిపించాడు. ఆయన పొందిన బాప్తిస్మము ద్వారా లోకపాపమంతయు తానే వహియించెను.

దేవుని ధర్మశాస్త్రము నెరవేర్చబడి, తొలగింపబడినది. దేవుని ధర్మశాస్త్రమును బట్టి ఇశ్రాయేలీయులు ఆచరించి జీవించలేకపోయారు. ‘‘ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు; ధర్మశాస్త్రము వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది.’’ (రోమా 3:20)

తాము పాపులమనియు, ధర్మశాస్త్రము తమనేమాత్రము కాపాడలేదనియు, ఇశ్రాయేలీయులు గ్రహించవలెనని దేవుడాసించెను. వారి ధర్మక్రియల వలన కాదు గానీ, ఈ నీరు మరియు ఆత్మసంబంధమైన రక్షణార్థమైన ధర్మముననుసరించి దేవుడు తన ప్రజలను రక్షించెను. ఆయన అద్వితీయమైన ప్రేమను బట్టి దేవుడు మనకు నూతన నిబంధనను దయచేసెను. ఈ నూతన నిబంధనానుసారమైన యేసుపొందిన బాప్తిస్మము మరియు రక్తము ద్వారా యేసు మనలను రక్షించెను.

యేసు పొందిన బాప్తిస్మము మరియు చిందించిన రక్తములోని విమోచనా మర్మము గ్రహించకుండా నీవు సామాన్యముగా యేసునందు విశ్వాసముంచినచో ఏ మాత్రము ఉపయోగములేదు. ఆ విధముగా నీవు విశ్వసించినట్లయితే, అవిశ్వాసిగా నున్నప్పటి కంటే, ఇప్పుడే నీవు శ్రమకు అధికముగా గురికాగలవు.

మానవులను తమ పాపముల నుండి రక్షించుటకే ఈ నూతన నిబంధనయని దేవుడు సెలవిచ్చెను. కనుకనే మనమిప్పుడు ధర్మశాస్త్రానుసారమైన క్రియల వలన రక్షింపబడలేదు. గానీ ఈ నీరు మరియు రక్తము వలననైన రక్షణార్థమైన నీతిమంతత్వము ద్వారా రక్షింపబడితిమి.

ఇది ఆయన అనాది వాగ్ధానము. ఇది నిత్యము ఉండునట్లు దేవుడే దానిని నెరవేర్చెను. యేసునందు సంపూర్ణముగా విశ్వసించినవారి జీవితాలలో ఈ రక్షణను దేవుడు నెరవేర్చెను. తద్వారా మనము ప్రభువైన యేసులోని గొప్ప గుణమును కొనుగొనగలము. పాత నిబంధనలోని అహరోను వంశక్రమములోని ప్రధాన యాజకుల కంటే మన పరలోకపు ప్రధానయాజకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన యాజకత్వమును మనము గ్రహించగలము.

యేసుక్రీస్తు పొందిన బాప్తిస్మము మరియు సిలువ రక్తమునందు విశ్వాసముంచి మనము ప్రత్యేకమైన వారమైతిమి. దయచేసి ఈ విషయమును ముఖ్యముగా గమనించగలరని మనవి. ఎంత చదువరి అయినా, జ్ఞానసంపన్నుడైన, మంచి కాపరి అయినను మీ పాస్టరు గారు ప్రభువైన యేసుక్రీస్తు కంటే ఉన్నతుడగునా? మనమీ నీరు మరియు రక్తము వలననైన సువార్త ద్వారా తప్ప మరియే ఇతర విధానములోనూ రక్షింపబడము. కేవలము దేవుని ధర్మశాస్త్రమును మరియు ఆజ్ఞను పాటించుట వలనకాదు. ఈ నూతన నిబంధనలో యాజకత్వము మాత్రమే కాదు గానీ రక్షణార్థమైన నీతికూడా మార్పు చెందినదని గ్రహించవలెను.దేవుని అత్యున్నతమైన ప్రేమ


 • దేవుని ధర్మశాస్త్రమా లేక దేవుని
 • ఉన్నతమైన ప్రేమా? ఏది అధికమైనది.
 • దేవుని ప్రేమయే.


మనము యేసు ద్వారా విశ్వాసమును బట్టి రక్షింపబడితిమి. యేసు మనలను ఎటుల రక్షించెనో, మరియు దేవుని ప్రేమ మన యెడల ఎంత ఉన్నతమైనదో గ్రహించవలెను. అట్లయిన దేవుని ధర్మశాస్త్రమునకు మరియు దేవుని ఉన్నతమైన ప్రేమకు గల వ్యత్యాసము గమనించగలము.

ధర్మశాస్త్రానుసారులు తమ శాఖాపరమైన సిద్ధాంతము పైననూ అటులనే స్వకీయ అనుభముపైనను మనసుంచి దేవుని వాక్యమును చులకన చేయుచున్నారు. ఈ నీరు మరియు ఆత్మ ద్వారా నెరవేర్చబడిన ఆత్మసంబంధమైన రక్షణలోని వున్నతమైన ఏర్పాటును గ్రహించుట ద్వారా, యేసునందలి ఆత్మీయ విశ్వాసము అధికమగును.

వాక్యజ్ఞానము అధికముగా దయచేయబడిన ఈ దినాలలో కూడా అనేకులు, కేవలము మనలోనున్న మూల పాపమే క్షమింపబడినదనియు, మరియు ఇతర పాపముల నిమిత్తమై అనుదినము పశ్చాత్తాపము చెందవలెనని చెప్పుచున్నారు. అనేకులు ఈ విషయమునే విశ్వసించుచున్నారు. అటులనే పాతనిబంధనలోని ఆజ్ఞ ప్రకారం జీవించవలెనని ప్రయత్నిస్తుంటారు. ఈ నీరు మరియు ఆత్మ ద్వారా ప్రభువైన యేసు అనుగ్రహించిన ఈ ఘనమైన రక్షణలోని ఆధిక్యతను అనేకులు విస్మరించుచున్నారు.

పాతనిబంధన కాలములో, ధర్మశాస్త్రప్రకారము జీవించిన ఇశ్రాయేలీయులే తమ పాపము నుండి రక్షించబడుదురు. ఆ విధముగా జీవించినట్లయితే రక్షింపబడరు. దేవునికి మన సమస్త బలహీనతలు తెలుసును గనుక మనము అసంపూర్ణులమని యెరిగియున్నాడు గనుక, తాను దయచేసిన ఆజ్ఞలను తానే తొలగించెను. మన క్రియల వలన మనము రక్షింపబడనేరము. కనుకనే ఈ నీరు మరియు ఆత్మ సంబంధమైన సువార్తద్వారా రక్షింపబడగలమని యేసు సెలవిచ్చెను. ‘‘నేను మీ పాపము నుండి మిమ్ము రక్షించగలనని’’ సెలవిచ్చెను. దేవుడీ విషయమును అదికాండమునందే ప్రవచించెను.

‘‘మరియు నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసెదను. అది న్ను తలమీద కొట్టును; నీవు దానిని మడిమెమీద కొట్టుదువని చెప్పెను.’’ (ఆది 3:15) ఆదాము, హవ్వలు పాపము చేసి చెడిపోయిన తరువాత, వారి పాపఫలితముగా తెలియబడిన సిగ్గును కప్పిపుచ్చుకొనుటకై అంజూరపు ఆకుల కచ్చడములు చేసికొనిరి. అయితే దేవుడు వారిని పిలచి వారికి చర్మపు చొక్కాయిను చేయించి వారిచే ధరింపజేసెను. ఆ చర్మపు చొక్కాయిలే రక్షణాత్మకమైన దుస్తులు. మొదటిగా అంజూరపు చెట్టు ఆకుల కుచ్చడములు, ఆ తరువాత చర్మపు దుస్తులు ధరించిరి. ఆ రెండింటిలో ఏ దస్తులు ఉపయోగకరమైనవి? చర్మపు చొక్కాయిలే, మానవుల కొరకు జంతువు బలిచేయబడి, దాని చర్మముతో వారికి దుస్తులు ఇవ్వబడినవి.

అంజూరపు చెట్టు ఆకుల దుస్తులు అతి తొందరగా పాడగును. అంజూరపు చెట్టు ఆకు 5 వేళ్లు కలిగిన అరచేతిని పోలియుండును. అనగా ఒక వ్యక్తి తన మంచి క్రియలతో తన పాపములను కప్పిపుచ్చుకొనుట వంటిదే ఇది. అంజూరపు ఆకుల కచ్చడములను ధరించి, కూర్చొనినట్లయితే అతి త్వరగా ఆ దుస్తులు పిగిలిపోవును. నేను చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు ఆరోరూట్‌ అనుచెట్టు ఆకును గొట్టాలుగా చుట్టి ఆవే ఆయుధముగా ధరించి సైనికుడివలే ఆటలు ఆడేవాడిని. నేను ఎంత జాగ్రత్తగా ఉన్ననూ, ఆ సాయంత్రముకల్లా అవి పాడై పనికి రాకుండా పోయేవి. అటువలే మానవుడు ఈ బలహీన శరీరంతో, నిష్టాగరిష్టతతో, ఎంత పవిత్రంగా జీవించాలన్న అలా జీవించడం అసాధ్యం.

అయితే ఈ నీరు మరియు రక్తము ద్వారా మనకు ఇవ్వబడిన రక్షణ అనగా యేసుపొందిన బాప్తిస్మము మరియు సిలువమరణము, మానవులను రక్షించి తద్వారా దేవుని ఉన్నతమైన ప్రేమను బహిర్గతపరచినవి. దేవుని ధర్మశాస్త్రమునకంటే అతీతమైనదీ దేవుని ప్రేమ.అనేకులు ఇంకను ధర్మశాస్త్రమునందే విశ్వాసముంచుచున్నారు.


 • ఎందువలన ఈ నీతికోవిదులు తమ 
 • అనుదిన క్రియలనే కచ్చడములుగా
 • ధరించుచున్నారు?
 • వారి క్రియలు వారిని నీతిమంతులుగా
 • మార్చలేవని వారింకనూ యెరుగరు.


అంజూరపు చెట్టు ఆకులనే ఇంకనూ దుస్తులుగా ధరించువారు ఈ నీతికోవిదుల వలె జీవించ యత్నింతురు. ఈ విధముగా దారి తప్పిన విశ్వాసులు, క్రమముగా వారి దుస్తులను మార్చుకొంటూ ఉండాలి. ప్రతి ఆదివారము సంఘ ఆరాధనకు వెళ్ళినప్పుడు నూతనమైన నీతి దుస్తులు ధరించాల్సి వస్తుంది. ‘‘దేవా, నేను గత వారం ఎంతో పాపం చేశాను. కానీ ప్రభువా, నా కొరకే గదా మీరు సిలువ పైన చనిపోయారు, రక్షించారు. కనుక తండ్రీ, నీ సిలువ రక్తముచేత ఈ నా పాపమును కూడా శుద్ధీకరించండి!’’ అని మొర్రపెట్టు తుంటారు. ఆ క్షణముననే వారి ప్రార్థన ద్వారా ఇంకొక జత దుస్తులు తయారు చేసికొని ధరిస్తారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ అని స్తుతిస్తారు.

ఇంటికి వచ్చిన తదుపరి తొందరలోనే వారు తిరిగి మరియొక నూతనమైన దుస్తులు జత తయారు చేసుకోవాల్సి వస్తుంది. ఎందువలన? వారి పాత దుస్తులు పిగిలిపోతాయి గనుక. ‘‘ప్రియమైన దేవా, ఈ రెండు, మూడు రోజులుగా నేను తిరిగి పాపాలు చేశాను. కనుక నన్ను క్షమించండి.’’ అని ప్రార్థించి మరియొక జత దుస్తులు తయారు చేసుకుంటారు. వారి పశ్చాత్తాపాన్ని బట్టి మరలా, మరలా దుస్తులు చేసుకుంటూ ఉంటారు.

ఆరంభంలో, వారి దుస్తులు చాలాదినాలు మన్నుతాయి. కానీ ఆ తరువాత ప్రతిదినము నూతన వస్త్రాలు కావాల్సివస్తుంది. దేవుని ధర్మశాస్త్ర ప్రకారం జీవించలేక నూతన వస్త్రాలు కావాల్సి వస్తుంది. దేవుని ధర్మశాస్త్ర ప్రకారం జీవించలేక అనుదినం సిగ్గుచెందుతూ ఉంటారు. ‘‘అయ్యో, ఇది ఎంతో విచారకరం. దేవా, నా దేవా, నాకెంతో సిగ్గుగా ఉన్నది. మరలా పాపం చేశాను స్వామీ!’’ అన్నదే వారిరోదన. మరలా పశ్చాత్తాప దుస్తులు సిద్ధం. ‘‘అయ్యో దేవా, ఈ రోజు, ఈ రోజు, ఈ అంజూరపు ఆకులతో దుస్తులు తయారు చేసుకోవటం చాలా కష్టంగా ఉంది స్వామీ’’ అనుకుంటూ చాలా ప్రయాసతో మరొక జత దుస్తులు సిద్ధం చేసుకుంటూ ఉంటారు.

ఇటువంటి వ్యక్తులు తమ పాపపు ఒప్పుకోలు నిమిత్తమే దేవుని ప్రార్థిస్తారు. వారి పెదాలు కొరుక్కుంటూ దేవుని ప్రార్థిస్తారు. ‘‘దేవా!’’ అంటూ ప్రతిదినము నూతనమైన వస్త్రాలు చేసుకుంటూ ఉంటారు. అలా చేస్తూ పోతుంటే వారిలో విసుగు జనిస్తే ఏమవుతుంది?

సంవత్సరానికి ఒకసారో, లేక రెండుసార్లో ప్రార్థనా కొండకు వెళ్లి ఉపవాసంతో ప్రార్థిస్తారు. దాని ఫలితంగా ఎక్కువరోజు మన్నే దుస్తులు తయారు చేసుకుంటారు. ‘‘దేవా, నా పాపాలను శుద్దీకరించండి. దేవా నన్ను నూతన పరచండి. నిన్నే విశ్వసిస్తున్నాను. తండ్రీ అంటూ ప్రార్థిస్తారు. ప్రార్థనలను పగటి కంటే రాత్రేమేలు అని భావిస్తారు. పగలంతా విశ్రాంతి తీసుకుంటారు. చీకటి పడగానే చెట్లకి వ్రేలాడుతూనో, చీకటి బిలములోనికి వెళ్లే గబ్బిలాల్లా దేవునికి మొర్రపెడతారు. ‘‘పశ్చాత్తాపము చెందిన మనస్సుతో, నా హృదయం నిండింది స్వామీ’’ అంటూ ప్రార్థిస్తారు. పెద్దగా అరుస్తారు. బిగ్గరగా రోధిస్తారు. ‘‘నిన్ను నమ్ముతున్నాను దేవా’’ అంటూ ప్రార్థిస్తారు. ఈ విధంగా అనేకరోజులు మన్నే దుస్తులు తయారు చేసుకుంటారు. అయితే వారనుకొన్నన్ని రోజులా దుస్తులు మన్నవు. 

ఆ ప్రార్థన కొండ దిగివచ్చిన తరువాత కొన్నిరోజులు ఎంతో ఉత్సాహభరితమైన జీవితం గడుపుతారు! ఒక చల్లని పిల్ల గాలిలాంటి భావన కలుగుతుంది. వసంతకాలంలో చినుకు కురిసి పచ్చని ఆకులను, రంగురంగు పువ్వులను తడుపుతూ ఉండేలాంటి సుందరమైన అనుభూతి కలుగుతుంది. వారి హృదయాలు దేవుని ప్రశాంతతతోనూ, కృపతోనూ నిండి ఉన్న అనుభవం పొందుకుంటారు. చక్కని పర్వతాలకంటే ఎక్కువైన పరిశుద్ధతాభావంతో నిండి యుంటారు. నూతనమైన, ఆ అనుభూతులతోకూడిన దుస్తులు ధరించి ఈ లోకంలోకి వస్తారు.

తరువాత వారు తమ గృహాలకు, సంఘానికి వెళతారు. అనుదిన జీవితం గడపటం ప్రారంభిస్తారు. అలా జీవిస్తూ ఉంటే నూతన దుస్తులు పాతబడతాయి. పిగిలిపోవటం ప్రారంభమవుతుంది. 

‘‘ఎక్కడకు వెళ్లావని’’ వారి స్నేహితులు అడుగుతారు.

‘‘నేను కొన్నిరోజులు బయటకు వెళ్లాను’’

‘‘బరువు తగ్గిన్నట్లున్నావే’’

‘‘అవును, దానికి వేరే కారణం ఉన్నది.’’

వారు ఉపవాసం ఉన్నామని చెప్పరు. చర్చికి వెళ్లి ప్రార్థిస్తారు. నేను ఇకపై స్త్రీను చూచి వ్యామోహం చెందను. నా పొరుగువాని ఇంటిలోనుండి దేనిని ఆశించను. నేను ప్రజలందరినీ ప్రేమిస్తాను.

అయితే, ఆ తదుపరి వారు అందముగా ఉన్న స్త్రీని చూడగానే, వారి హృదయములో ఉన్న పవిత్రత మారిపోయి, అనేక అపవిత్ర భావాలు వారిలో చోటు చేసుకుంటాయి. ‘‘అటు చూడండి, ఆ గౌను ఎంతపైకి కట్టుకుంటారో ఈ ఆడవాళ్లు అసలు ఈ మధ్య దుస్తులు పొట్టిగా చేసుకుంటున్నారు! అంటూ మాట్లాడతారు. ఆ తరువాత ‘‘దేవా, వద్దు తండ్రీ నా మనసు పలు విధాలుగా పోతుంది. నేను మరలా పాపంచేస్తున్నాను.’’ అని ప్రార్థిస్తారు.

ఈ నీతి కోవిదులు పైకి పవిత్ర భావాలు కలవారిలా మాట్లాడతారు. అయితే వారు ప్రతిరోజూ నీతివస్త్రాలు తయారు చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. వారి విశ్వాసము సరైనది కాదు. వారి దుస్తులు అంజూరపుటాకులే. అనేకులు దేవుని ధర్మశాస్త్రము ప్రకారం నీతిగా, పరిశుద్దతతో నివసించటానికి చాలా ప్రయాసపడతారు. ఆ ప్రార్థనా పర్వతంపైన వారు గట్టిగా ఊపిరిపీల్చి, గుండెనిండా గాలిని నింపుకొని పైకి ఎంతో పవిత్రులుగా కనిపించటానికి ప్రయత్నిస్తారు.

ఈ నీతికోవిదులు, సంఘంలో ప్రార్థన జరిగించేటప్పుడు ఎంతో ఉన్నతంగా అగుపిస్తారు. ‘‘పరలోకములో వున్న మా తండ్రీ గతవారం మేమందరం పాపాలు చేశాము. మమ్ముని మన్నించు దేవా’’ అంటూ ప్రార్థిస్తారు. ప్రార్థనలో ఎంతో కన్నీరు కారుస్తారు. వేదనతో ప్రార్థిస్తారు. ఇతర సంఘస్థులు కూడా వారిని అనుసరించి, దుఃఖంతో ప్రార్థిస్తారు. ‘‘ఈ వ్యక్తి ప్రార్థనా పర్వతముపై, ఉపవాసంతో ఎంతో దీనంగా, ధృడంగా ప్రార్థించాడు. ఎంతో పరిశుద్ధత, ఎంత ఉన్నది’’ అని భావిస్తారు. ఈ నీతికోవిదుని విశ్వాసం, ఇంకా ప్రార్థన పూర్తి అవకుండానే, అతని హృదయం భక్తి గర్వంతో, పాపపు తలంపుతో కూడ ఉండి, మందగిస్తుంది.

అయితే కొందరు వ్యక్తులు అంజూరపు ఆకుల దుస్తులలోనే ప్రత్యేకమైనవి తయారు చేసుకుంటారు. బహుశ అవి 2 లేక 3 నెలలు మన్నుతాయి. కొద్ది రోజులు ముందో లేక తరువాతో ఆ దస్తులు పిగిలిపోయి, పారవేయబడి, మరలా వారు నీతివస్త్రాలు తయారుచేసుకుంటూ, వేషధారణను అనుకరిస్తూ జీవితం గడుపుతారు. దేవుని ధర్మశాస్త్రానుసారం తమ క్రియల చేత నీతిమంతులుగా జీవించాలని ప్రయత్నించే ఈ వ్యక్తుల జీవితం ఈ విధానంలోనే పరిభ్రమిస్తూ ఉంటుంది. వారు రక్షణార్థమైన అంజూరపు ఆకుల దుస్తులు ఎల్లప్పుడూ తయారుచేసుకుంటూ ధరిస్తూ జీవించాల్సిందే.

ఈ విధమైన భక్తి జీవితం అంజూరపు ఆకుల బట్టవంటిదే. ‘‘గతవారం నీవు చేసిన పాపాలకు పశ్చాత్తాపచెంది, ప్రార్థించు’’ అని వారు తెలియపరుస్తూ ఉంటారు.

‘‘పశ్చాత్తాపపడండి! ప్రార్థించండి’’ అని మిమ్ముల్ని హెచ్చరిస్తూ ఉంటారు. ఇట్టివారికి తమ కంఠధ్వనిని పరిశుద్ధతతో నింపటం బాగా అలవాటు. ‘‘దేవా, నన్ను క్షమించు, ధర్మశాస్త్రానుసారం జీవించలేక పోతున్నాను. నీ ఆజ్ఞలు అనుసరించలేక పోతున్నాను. నన్ను క్షమించండి, చాలా తప్పుచేశాను. ఇంకొకసారి నన్ను క్షమించండి.’’

ఎంత గట్టిగా ప్రయత్నించినా వారుదేవుని నియమం ప్రకారం జీవించలేదు. మరొక విధంగా చెప్పాలంటే వారు ఆ విధంగా ప్రయత్నించి దైవవాక్యాన్ని మరియు దేవుని సవాలు చేస్తున్నట్లే. దేవుని యెదుట వారు గర్విష్టులై యున్నారు.ఛుడాల్‌ బే లాంటి జీవితం


 • దేవుడు ధర్మశాస్త్రము నెందులకు
 • పక్కన పెట్టెను?
 • మానవులు తమ పాపముల నుండి రక్షింపబడుటకు
 • ధర్మశాస్త్రము ఆటంకముగా నున్నది గనుక.


కొరియా దేశంలో 1950వ దశకంలో ఛుడాల్‌ బే అను ఒక యవ్వనస్తుండుండెను. అప్పుడు కొరియాలో యుద్దము జరుగుతూ ఉన్నది. కమ్యూనిస్టులు దేశాన్ని ఆక్రమించుచున్నారు. అతడు మతనిష్టగలిగినవాడని యెరిగి, విశ్రాంతిదినమున అతని మతనిష్టను చెరపనెంచి, కమ్యూనిష్టుగా చేయాలనే ఉద్దేశ్యంతో, ఆ రోజు ఆ ప్రదేశాన్నంతా శుభ్రపరచాలని ఆదేశించారు. అయితే ఈ మతనిష్టగల యవ్వనస్తుడు వారి ఆజ్ఞను తిరస్కరించాడు. వారు గట్టిగా ఆదేశించారు. అయినా అతడు లోబడలేదు.

చివరకు సైనికులతనిని ఒక చెట్టుకు కట్టివేసి, తుపాకీలు ఎక్కుపెట్టారు. ‘‘నీకు ఏమి కావాలి? ఈ ప్రదేశాన్ని శుభ్రపరుస్తావా, లేక చంపమంటావా?’’ అని ప్రశ్నించారు.

‘‘ఈ పరిశుద్ధ విశ్రాంతి దినమున నేను వేరే పని చేయను. అలా చేయవలసివస్తే చావనైనా చస్తాను’’ అని సమాధానమిచ్చాడు.

‘‘సరే నీ నిర్ణయం నీవు చెప్పావు. దానిని మేము నెరవేరుస్తాము.’’

వెనువెంటనే కమ్యూనిస్టు సైనికులతనిని కాల్చివేశారు. ఆ తరువాత అతని మతనిష్టను గుర్తించి, అతని త్యాగాన్ని గౌరవించి, సంఘనాయకులతని మరణానంతరం ఆ సంఘంలో డీకన్‌గా ఏర్పరచి, ఆయనను గౌరవించిరి.

అతనిది ధృడచిత్తమైనా, ఆయన మత విశ్వాసం సరిగాలేదు. ఆ రోజు వారు చెప్పిన పనిచేస్తూ, అక్కడ కాపలా ఉన్న సైనికులకు సువార్త చెప్పియుండవచ్చును గదా? అతను ఆ విధముగా మొండితనము ప్రదర్శించి ఎందుకు చనిపోవాలి? ఆ విశ్రాంతిదినమున పనిచేయకుండా ఉన్నందుకు దేవుడతనిని మెచ్చునా ? లేదు. 

మనము ఆత్మ సంబంధమైన జీవితం జీవించాలి. దేవుని యెదుట మన క్రియలు కాదు గాని మన విశ్వాసం ముఖ్యం అలాగే ఆ సంఘనాయకులు కూడా తమ మత నిష్టాగరిష్టతను, పారంపర్య మతాచారాన్ని పాటిస్తున్నామని తెలియజేయటానికి మరణానంతరం అతనిని గౌరవించారు. యేసును సవాలు చేసిన పరిసయ్యల వంటివారే వారందరు.

ఈ నీతికోవిదుల వద్ద నుండి మనము నేర్చుకొనవలసినదేమీ లేదు. మనము ఆత్మసంబంధమైన విశ్వాసమును అభ్యసించవలెను. యేసు ఎందువలన బాప్తిస్మము పొంది, సిలువలో రక్తము చిందించవలసి వచ్చినదో తెలుసుకోవాలి. అలాగే ఈ నీరు మరియు ఆత్మ సంబంధ సువార్తను గురించి గ్రహించాలి.

ఈ ప్రశ్నకు మనము సమాధానమును పొందాలి. ఆ సమాధాన సువార్తను ప్రపంచంలోని ప్రజలందరికీ చాటాలి. దాని ద్వారా మనమును, అలాగే అనేకులు తిరిగి జన్మించే అనుభవాన్ని పొందగలగాలి. మన సమయాన్ని ఆత్మ సంబంధమైన క్రియలకై వెచ్చించాలి.

‘‘ఈ యవ్వనస్తుడైన ఛూడాల్‌ బే అను వ్యక్తి వలె నీవును వుండాలి’’ అని మీ బోధకుడెవరైనా బోధిస్తే, ‘‘విశ్రాంతి దినాన్ని ఆచరించమని’’ తెలియజేస్తే కేవలం ఆదివారం నీవు సంఘానికి రావడానికి ఆయన నీకు బోధిస్తున్నాడని గమనించండి.

ఇంకొక యధార్థ ఇతివృత్తాన్ని మీతో పంచుకుంటాను. దాని వలన మీరు మరింత వెలుగులోనికి నడవగలరు. ఆదివారం సంఘ ఆరాధనకు వెళ్ళటానికి అనేక ఇబ్బందులను ఎదుర్కొన్న ఒక స్త్రీ గాధ యిది. ఆమె అత్త`మామలు క్రైస్తవులు కారు. ఆమెను సంఘ ఆరాధనకు వెళ్ళకుండా ఆపటానికి వారెంతో తీవ్రంగా కృషి చేశారు. ఆదివారమే ఆమెకు పొలంలో ఎంతో పనికల్పించేవారు. అందువలన ఆమె శనివారం రాత్రే, ఒక్కొక్కసారి వెన్నెల రాత్రిపూట పొలానికి వెళ్ళి, తాను పనిదొంగ అన్న నింద రాకుండా, కుటుంబంలోని వారెవరూ అభ్యంతరపడకుండా పనిచేసుకొనేది. దాని వలన ఆమె ఆదివారం సంఘ ఆరాధనకు వెళ్ళగలిగేది.

ఆదివారం సంఘ ఆరాధనలలో పాల్గొనడం ఎంతో ముఖ్యమైన విషయం. అయితే నీవెంత విశ్వాసివో అందరూ తెలుసుకొనుటకే ఆదివారం ఆరాధనలో పాల్గొనాలా? నిజ విశ్వాసులు నీరు మరియు ఆత్మ ద్వారా తిరిగి జన్మించు అనుభవాన్ని పొందగలరు. తిరిగి జన్మించిన అనుభవం సంపాదించిన తర్వాతే నిజమైన విశ్వాసజీవితం ఆరంభమవుతుంది.

ధర్మశాస్త్రం పాటించి నీవు పాపము నుండి విడిపింపగలవా? అంటే ధర్మశాస్త్రాన్ని నిర్లక్ష్యపరచమని కాదు గానీ ధర్మశాస్త్రానుసారం ప్రతి ఆజ్ఞను పాటించుట మానవులకు సాధ్యముకాదు.

యాకోబు 2:10 ఈ విధంగా సెలవిస్తుంది. ‘‘ఎవడైనను ధర్మశాస్త్ర మంతయు గైకొనియు, ఒక ఆజ్ఞవిషయములో తప్పిపోయిన యెడల, ఆజ్ఞలన్నిటి విషయములో అపరాధియగును. ‘‘నీవు ముందుగా ఈ నీరు మరియు ఆత్మ సంబంధమైన సువార్త వలన తిరిగి జన్మించు అనుభవమును పొందుట గురించి తెలుసుకొనవలయును. ఆ తరువాత ఈ సువార్తను బోధించే సంఘానికి సహవాస నిమిత్తమై వెళ్ళాలి. నీవు తిరిగి జన్మించిన తరువాత విశ్వాస జీవితమును గడుపగలవు. ఆ తరువాత దేవుడు నీకెప్పుడు పిలుపు ఇచ్చినను, ఆయన సన్నిధికి ఆనందముతో నీవు వెళ్ళగలవు.

సరిగా బోధించని సంఘముకు వెళ్ళి నీ సమయాన్ని వృధాచేసుకొనవద్దు. నీ అర్పణను వ్యర్థము చేయవద్దు. ముందుగా నీవీ నీరు మరియు ఆత్మ సంబంధమైన సువార్తను విని తిరిగి జన్మించు.

యేసు ఈ లోకమునకు వచ్చిన విషయం గురించి ఆలోచించాలి. మనము ధర్మశాస్త్రమునంతయు అనుసరించి పరలోకమునకు వెళ్ళగలిగితే అసలు ప్రభువైన క్రీస్తు ఈ లోకానికి వచ్చే ఆవశ్యకత ఉండేది గాదు. ఆయన విచ్చేసిన తరువాత యాజకత్వమే మార్పు చెందింది. ఈ నీతి కోవిదులు గతానికి చెందినవారయ్యారు. మనము ధర్మశాస్త్రమును అనుసరించలేమని, తద్వారా మనము రక్షింపబడలేమని మనము ఈ విధంగా విమోచింపబడకుండా ఉన్నప్పుడే భావించాము. అయితే ఈ ఆజ్ఞ అనుసరణము నిజమైన భక్తికి సూచన.

యేసు తాను పొందిన బాప్తిస్మము, కార్చిన సిలువరక్తముతో కూడియున్న ప్రేమ వలన ఈ లోకపాపమంతయు తాను మోసి మనలను రక్షించెను. ఆయన తన రక్తముచేత మరియు యొర్ధానులో నీటి బాప్తిస్మము ద్వారా మనలను రక్షించెను. ఆయన పునరుత్థానము ద్వారా మనకు శక్తినొసగెను.

పాతకట్టుబాట్లు బలహీనమైనవనియు, నిష్‌ప్రయోజనమనియు దేవుడు వాటిని నివారించాడు. ‘‘ముందియ్యబడిన ఆజ్ఞ బలహీనమైనందునను నిష్‌ప్రయోజనమైనందునను అది నివారణ చేయబడియున్నది. అంతకంటే శ్రేష్ఠమైన నిరీక్షణ దానివెంట ప్రవేశపెట్టబడెను. దీని ద్వారా దేవుని యొద్దకు మనము చేరుచున్నాము. మరియు ప్రమాణము లేకుండా యేసు యాజకుడు కాలేదు.’’ (హెబ్రీ 7:19-21). యేసు ప్రమాణము చేసి, ఆయన పొందిన బాప్తిస్మము మరియు సిలువ మరణము ద్వారా మనలను పాపము నుండి విడిపించెను. ఒకవేళ శాస్త్రీయ విధానములో నుండి గనుక ఈ హతసాక్ష్య త్యాగము వచ్చినట్లయితే ఇది ఏ మాత్రము ఫలించనిది. నిజమైన విశ్వాసమేమనగా, ఈ నీరు మరియు ఆత్మ సంబంధమైన సువార్త యందలి విశ్వాసమే.

మన విశ్వాసము ఫలించెడిదయి ఉండవలెను. నీ ఆత్మకు ఏది ఉపయుక్తమని భావిస్తున్నావు? సంఘమునకు క్రమం తప్పకుండా వెళ్తూ ధర్మశాస్త్రాన్ని ఆచరించే ప్రయత్నమా? లేక నీరు మరియు ఆత్మ సువార్తను బోధించు దేవుని సంఘమేదో తొసుకొని అక్కడకు వెళ్లి ఆరాధించటమా? దేని వలన నీవు తిరిగి జన్మించగలవు? ఏ సంఘం మరియు ఏ బోధకుడు నీవు ఆత్మలో ఉజ్జీవింపబడటానికి ఆవశ్యకము? ఈ విషయంలో ఆలోచించండి. నీవు ఈ రెండింటిలో ఏది నీ ఆత్మకు ఉపయోగమో దానినే స్వీకరించు.

ఈ నీరు మరియు ఆత్మ సంబంధమైన సువార్త బోధించు కాపరి నీకు తటస్థించిన ఎంతో మేలు. ఎవరి ఆత్మరక్షణ వారిదే. దేవుని వాక్యానుసారం నీ ఆత్మను కాపాడకుంటే, నీవే జ్ఞానము కలిగిన విశ్వాసివి కాగలవు.యేసు ప్రమాణము చేసి యాజకుడాయెను.


 • లేవీ వంశీయులు ప్రమాణము
 • చేసి యాజకులాయిరా?
 • లేదు. కేవలము యేసు మాత్రమే
 • ప్రమాణము చేసి యాజకుడాయెను.


హెబ్రీ 7:20-21లో ఈ విధముగా తెలుపబడినది. ‘‘మరియు ప్రమాణము లేకుండా యేసు యాజకుడు కాలేదు. గనుక ఆయన మరి శ్రేష్ఠమైన నిబంధనకు పూటకాపాయెను. వారైతే ప్రమాణము లేకుండ యాజకులగుదురు గాని యీయన ` నీవు నిరంతరము యాజకుడవై యున్నావని ప్రభువు ప్రమాణము చేసెను; ఆయన పశ్చాత్తాపడడు అని యీయనతో చెప్పినవాని వలన ప్రమాణపూర్వకముగా యాజకుడాయెను.’’ (మెల్కీసెదెకు క్రమములో యాజకుడాయెను.)

కీర్తను 110:4లో ఈ విధముగా నున్నది ‘‘మెల్కీసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడవైయుందువని యెహోవా ప్రమాణము చేసియున్నాడు, ఆయన మాట తప్పనివాడు.’’ దేవుడు ప్రమాణము చేసియున్నాడు ఆయన మనతో ఒక నిబంధన చేసియున్నాడు. దానినే లేఖనములో తెలియపరచెను. నేను మెల్కీసెదెకు క్రమములో పరలోక ప్రధాన యాజకుడు బడగలను-. మెల్కీసెదెకు నీతిరాజు మరియు సమాధాన ప్రభువు. ఆయన నిత్యమైన ప్రధాన యాజకుడు నేను మీ రక్షణ కొరకై మెల్కీసెదెకు క్రమములో ప్రధానయాజకుడగుదును.’’

యేసు ఈ లోకమునకు వచ్చి మరి శ్రేష్టమైన నిబంధనకు పూటకాపాయెను. (హెబ్రీ 7:22) ఎద్దులు మరియు మేకల రక్తమునకు ప్రత్యామ్నాయముగా ఆయన తనను తాను బలిగా సమర్పించుకొనెను.

అతడు వృద్దుడుకాగా, కనీసము 30 సంవత్సరముల వయస్సు ఉన్న అతని కుమారుడు తదుపరి ప్రధాన యాజకత్వ బాధ్యతలు స్వీకరించును.

ప్రధాన యాజకునికి అనేకమంది వారసులుండవచ్చును. కనుక రాజైన దావీదు వారందరికీ వంతుల వారీ యాజకత్వ బాధ్యతలు ఏర్పాటు చేసెను. అహరోను వారసులందరికి యాజకత్వ బాధ్యతలు ఇవ్వబడెను. వారందరూ యాజకత్వ సేవకు అర్హులు. ఈ విషయం గురించి సువార్తీకుడైన లూకా ఈ విధముగా తెలియపరచెను. ‘‘ఆబియా తరగతిలోనున్న జెకర్యా అను ఒక యాజకుడుండెను.... జెకర్యా తన తరగతి క్రమము చొప్పున దేవుని యెదుట యాజకధర్మము జరిగించుచుండగా....’’

యేసు ఈ లోకమునకు అరుదెంచి నిత్యమైన యాజకత్వబాధ్యతను స్వీకరించెను. రాబోవు మేలులకు యాజకుడాయెను. నీరు మరియు ఆత్మ ద్వారా లభించు తిరిగి జన్మించు అనుభవము నియ్యగలిగిన రక్షణకు కర్తాయెను.

అహరోను వంశస్థులు వారి శరీరమును బట్టి బలహీనులు మరియు అసంపూర్ణులై యుంటిరి. ఒక ప్రధాన యాజకుడు మరణించినప్పుడు ఏమగును? అతని కుమారుడు ప్రధానయాజకుడగును. ఆ ప్రధాన యాజకులర్పించు బలులు మానవులకు సంపూర్ణ రక్షణను ప్రసాదించలేవు. మానవుల ద్వారా సంక్రమించు విశ్వాసము ఎన్నటికీ పరిపూర్ణ విశ్వాసము కానేరదు.

నూతన నిబంధనా కాలములో, యేసు ఈ లోకమున కరుదెంచెను. ఆయన నిత్యుడు గనుక, తడవ తడవకు బలులర్పించనవసరము లేదు. ఆయన మన పాపములను శాశ్వతముగా స్వీకరించుటకే యొర్దానులో బాప్తిస్మమును పొందెను. మనకు ప్రత్యామ్నాయముగా ఆయన, తనను తానే సమర్పించుకొని, సిలువ వేయబడి, ఆయన యందు విశ్వాసముంచినవారినందరిని సంపూర్ణముగా పాపరహితులుగా చేసెను.

ఆయన ఇప్పుడు సజీవుడు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి మన నిమిత్తమై నిరంతరము సాక్ష్యమిస్తూ, విజ్ఞాపన ప్రార్థన చేయుచున్నాడు. ‘‘నా తండ్రీ, వారు అసంపూర్ణులైన బలహీనులే, అయినను నా యందు సంపూర్ణ విశ్వాసముంచిన బిడ్డలైయున్నారు. నేనెన్నడో వారిని పాపవిముక్తులను చేశాను గదా?’’ యేసు మన పరలోక ప్రధాన యాజకునిగా రక్షణను అనుగ్రహించెను.

ఈలోకపు యాజకులు ఎన్నడూ సంపూర్ణులు కాలేరు. వారు చనిపోగా వారి కుమారులు యాజకులగుదురు. మనప్రభువు నిత్యుడు, సజీవుడు. ఈ లోకానికి వచ్చి మనకు నిత్యమైన రక్షణను అనుగ్రహించాడు. స్థానికుడైన యోహాను వలన బాప్తిస్మము పొంది; సిలువపై మన పాపముల నిమిత్తము రక్తము కార్చెను. 

‘‘వాటి క్షమాపణ ఎక్కడ కలుగునో అక్కడ పాపపరిహారార్థబలి ఇకయెన్నడును ఉండదు.’’ (హెబ్రీ 10:18) యుగసమాప్తి వరకు యేసు మనకు రక్షణను అనుగ్రహించి సాక్ష్యమిచ్చెను. నీవైతే ఈ నీరు మరియు ఆత్మ ద్వారా తిరిగి జన్మించితివా?

‘‘ధర్మశాస్త్రము బహీనతగల మనుష్యులను యాజకులనుగా నియమించును గాని ధర్మశాస్త్రమునకు తరువాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరమును సంపూర్ణ సిద్ధిపొందిన కుమారుని నియమించెను గనుక, ఈయన ఆ ప్రధాన యాజకులవలె మొదట తన సొంత పాపముల కొరకు తరువాత ప్రజల పాపముల కొరకును దినదినము బలులను అర్పింపవలసిన అవసరము గలవాడు కాడు; తన్ను తాను అర్పించు కొన్నప్పుడే ఒక్కసారే ఈ పనిచేసి ముగించెను.’’ (హెబ్రీ 7:26-28)

ఈయన పొందిన బాప్తిస్మము ద్వారా మరియు సిలువలో చిందించిన రక్తము ద్వారా యేసుక్రీస్తు ఏ లోపము లేనివాడై, మన పాపమును శాశ్వతముగా శుద్దీకరించెనని నేను అనేకసార్లు మీకు వినమ్రతతో తెలియజేసుకుంటున్నాను. కేవలము ధర్మశాస్త్ర క్రియవలన కాదు గానీ, మన పాపములన్నియు ఆయనే స్వీకరించి, వాటి నిమిత్తమై శాశ్వతమైన తీర్పుపొంది, మనలను రక్షించెను. 

నిత్యమైన రక్షణను అనుగ్రహించి మన పాపముల నుండి శాశ్వతముగా మనలను రక్షించినది యేసేనని నీవు విశ్వసించుచున్నావా? నీవు ఆ విధమైన విశ్వాసము కలిగియుంటే రక్షింపబడగలవు. ఒకవేళ నీవు ఈ విధముగా విశ్వాసము కలిగియుంటే రక్షింపబడగలవు. ఒకవేళ నీవు ఈవిధముగా ఇంకనూ రక్షింపబడకుండా ఉంటే, నీవింకనూ ఈ నిత్యమైన రక్షణ విషయమై అనేక విషయాలు నేర్చుకొనవలసిన వాడవైయున్నావు.

నిజమైన విశ్వాసము ఈ నీరు మరియు ఆత్మ సంబంధమైన సువార్త వలన లభించును. ఇది లేఖానుసారమైనది. మన పరలోక ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు, ఆయన పొందిన బాప్తిస్మము మరియు సిలువలో చిందించిన రక్తము ద్వారా మనకు నిత్యరక్షకుడాయెను.మనకు విశ్వాసనిమిత్తమైన సంపూర్ణ అవగాహన అవసరమై యున్నది.


 • యేసునందు విశ్వాసముంచుట
 • అనగా నేమి?
 • యేసుపొందిన బాప్తిస్మమునందు మరియు
 • సిలువ మరణమునందు సంపూర్ణ
 • విశ్వాసముంచవలయును.


యేసునందు సరైన విధానములో విశ్వాసముంచి, మన విశ్వాసమును క్రమపరచుకొను దిశలో మన ఆలోచనుండవలెను. మనము యేసు నందు సరైన, క్రమమైన నమ్మకము ఏలాగు కలిగియుండవలెను? యేసుపొందిన బాప్తిస్మము మరియు సిలువ రక్తము గురించి సువార్త నందు సంపూర్ణ విశ్వాసము కలిగి యుండవలెను.

యేసు చేసిన రక్షణ క్రియయందు నమ్మికయుంచుటే నిజమైన విశ్వాసము. ఆయన పొందిన బాప్తిస్మము మరియు చిందించిన రక్తమునందు విశ్వాసముంచవలెను. మన సొంత జ్ఞానానుసారమైన, తప్పుడు సిద్ధాంతములయందు విశ్వాసముంచగూడదు. ఇది నిజమని మీరు విశ్వసిస్తున్నారా? నీ ఆత్మీయ పరిస్థితి ఏలాగున్నది? నీ సొంత క్రియలు మరియు ప్రయత్నము యందు విశ్వాసముంచుచున్నావా?

నేను యేసును విశ్వసించుట ప్రారంభించి ఎంతోకాలము కాలేదు. కానీ 10 సంవత్సరముల విలువైన కాలము ఈ మత సంబంధమైన విశ్వాసము వలన పోగొట్టుకున్నాను. కాలం గడుస్తున్న కొద్దీ ఆ విధమైన జీవితమునందు నాకు విరక్తి కలిగింది. అసలు అప్పటి పరిస్థితులను తలచుకొనుట నాకయిష్టము. నా భార్య ఇప్పుడు ఈ వాక్యాలు వ్రాస్తుండగా నా వద్దకూర్చొనియున్నది. ఆ రోజులలో ఆ తలంపు, ఆ జీవితం ఎంత భయంకరమైన అనుభవాలో మాకు తెలుసు.

‘‘ఈరోజు మనం ఏదైనా ఆనందకరమైన జీవితం గుడుపుదామా?’’ అని నేను ఆదివారాలు అడుగుతుంటాను.

‘‘ఈ వేళ ఆదివారం కదా’’, అంటుందామె.

ఆదివారాలు కనీసం బట్టలు కూడా ఉతకదు. ఒక ఆదివారం చినిగిన నా ప్యాంటు కుట్టమంటే, సోమవారం కుడతానులెండీ అన్న వ్యక్తి నా భార్య. నిజంగా చెప్పాలంటే పరిశుద్ధ దినమును సక్రమముగా ఆచరించాలని నేను కూడా ఆ పట్టుపట్టేవాడిని. కానీ ఆచరించలేకపోయేవాడిని. ఆదివారం దైవ కార్యాలలో సరిగా నిమగ్నము కాలేక పోయేవాడిని. మరలా దానిగురించి బాధపడేవాడిని. ఆ రోజులు నాకింకా జ్ఞాపకమున్నాయి. 

నా ప్రియ స్నేహితులారా, యేసునందు నిజముగా విశ్వాసముంచాలంటే ఆయన పొందిన బాప్తిస్మము మరియు సిలువ మరణము ద్వారా లభించు పాప పరిహారార్థమైన సువార్తను నమ్మాలి. నిజమైన విశ్వాసమేమంటే ఆయన సంపూర్ణ, దైవత్వాన్ని, సంపూర్ణ మానవత్వాన్ని నమ్మాలి. ఈ లోకంలో మన నిమిత్తమై ఆయన చేసిన కార్యములన్నీ విశ్వసించాలి. నిజమైన విశ్వాసమనగా ఆయన పలికిన, తెలిపిన ప్రతిమాటను మనము హృదయపూర్వకముగా నమ్ముటే.

యేసునందలి విశ్వాసము అనగా నేమి? అనగా యేసు పొందిన బాప్తిస్మము మరియు సిలువలో కార్చిన రక్తమునందు సంపూర్ణముగా విశ్వాసముంచుటయే. ఇది ఎంతో సామాన్యముగా కనిపించే విషయం మనము కేవలము జీవగ్రంధములో తెలియపరచిన సువార్తనందు నమ్మిక యుంచిన చాలును. మన విశ్వాసము సరైన విధానములో ఉండాలి, అంతే.

‘‘దేవా నీకు వందనాలు నా స్వప్రయత్నాల వలన ఏమీ సమకూరలేదు. ధర్మశాస్త్రము వలన పాపమనగా నెట్టిదో తెలియబడుచున్నది. (రోమా3:20) ఇప్పుడు నాకు సమస్తము తేట తెల్లమాయెను. నేను ఒకప్పుడు ధర్మశాస్త్రము మంచిదని భావించాను. దేవుని ఆజ్ఞ అదేనని విశ్వసించాను. అయితే ఇప్పుడు అది తప్పని నేను తెలుసుకున్నాను. ధర్మశాస్త్రము ప్రకారం జీవించగలనని నేను అనుకున్నవిషయం తప్పని గ్రహించాను. దేవుని ఆజ్ఞలను పాటించలేని బలహీనుడనని తెలుసుకున్నాను. నా హృదయము చెడు తలంపుతోను, అపరాధముతోను నిండియున్నదని, ధర్మశాస్త్రమును బట్టి నేను గ్రహించాను. పాపమనగా నెట్టిదో తెలియజేయబడుటకు ధర్మశాస్త్రమివ్వబడినదని నేను తెలుసుకున్నాను. దేవా నీకు కృతజ్ఞతలు. నీ చిత్తాన్ని నేను సరిగా గ్రహించలేక పోయాను. ఆజ్ఞను నెరవేర్చటానికి ఎంతో కష్టించాను. ఆవిధముగా నెరవేర్చగలనని నేను చేసిన ప్రయత్నాలను బట్టి నేనెంత అవిధేయుడనో, గర్విష్టినో గ్రహించాను. నేను పశ్చాత్తాప పడుతున్నాను. యేసు బాప్తిస్మము పొంది, సిలువలో రక్తమును చిందించి నాకు రక్షణను అనుగ్రహించెనని తెలుసుకున్నాను. ఇప్పుడది విశ్వసిస్తున్నాను.

మనము తిన్నని విధానములో పరిశుద్ధమైన విధానములో విశ్వసించాలి. బైబిలులో లిఖించి వున్న వాక్యమును నమ్మాలి. తిరిగి జన్మించుటకు ఇదొక్కటే మార్గము.

అసలు యేసునందు ఏమని విశ్వసించాలి? ఇది కాల క్రమేణా జరుగవలసినదా? మన విశ్వాసము కష్టించవలసిన మత సంబంధమైన ఒక క్రియా? ప్రజలు దేవుళ్ళను తయారు చేసుకున్నారు. ఆ దేవుళ్ళను ఏర్పాటు చేసుకోవటానికి మతాలు నిర్మించారు. మానవునిలో మంచితనాన్ని రగిలించుటకు ఒక గురి కలిగి, ఆ గురిచేరుకొనుటకు మనుష్యులు ఏర్పరచుకున్న ప్రక్రియే మతము.

అప్పుడు విశ్వాసమనగా నేమి? అనగా దేవుని యందు విశ్వాసముంచి, ఆయన వైపు చూడవలెను. యేసుక్రీస్తు అనుగ్రహించిన రక్షణవైపు చూసి ఆయన అనుగ్రహించిన ఈ ఆశీర్వాదము నిమిత్తమై కృతజ్ఞత చెల్లించుటే. ఇదే నిజమైన విశ్వాసము. విశ్వాసమునకు, మతమునకు ఉన్న ముఖ్యమైన తేడా ఇదియే. ఈ రెండింటి మధ్యనున్న తేడాను గ్రహించినట్లయితే విశ్వాస నిమిత్తమై నీకు కలిగిన అవగాహనకు 100 శాతం మార్కులు ఇవ్వవచ్చు.

తిరిగి జన్మించే ఈ అనుభవమునందు విశ్వాసముంచని వేదాంతులు, మనము ప్రభువైన యేసును విశ్వసించి, పరిశుద్ధమైన జీవితమును గడిపితే చాలని చెపుతారు. పరిశుద్ధముగా జీవించుటే విశ్వాసమా? మనము మంచిగా జీవించుట మంచిదే. తిరిగి జన్మించిన మనకంటే పరిశుద్ధమైన జీవితము ఎవరు గడపగలరు?

అసలు విషయమేమంటే ఈ వేదాంతులు ఈ విషయాలను పాపులతోనే చెప్తూంటారు. ఒక సామాన్య పాపిలో 12 రకాల పాపాలు దాగియుంటాయి. అలాగయితే మనమేలాగు పరిశుద్ధతతో జీవించగలము? తప్పనిసరిగా అతని మనస్సులో ఏమి చేయాలో నిశ్చయించుకుంటాడు. కానీ, అతని హృదయం మాత్రం మనస్సు చెప్పేవాటిని శిరసావహించాడు. సంఘ ఆరాధన ముగించి, పాపి అయిన వారు బయటకు రాగానే పరిశుద్ధత అన్నది క్రియాపూర్వకము కాదని తెలుసుకుంటాడు. తన సహజస్వభావాన్ని బట్టి పాపం చేస్తాడు.

కనుక మన హృదయంలో ఒక నిశ్చయత కలిగియుండాలి. మనము ధర్మశాస్త్ర ప్రకారము జీవించగలమా? లేక నిత్యమైన పరలోక యాజకుడైన యేసుపొందిన బాప్తిస్మము మరియు సిలువ మరణము యందు విశ్వాసముంచి రక్షింపబడవలయునా? నిర్ణయం మనదే!

విశ్వసించిన వారికి ఆయన నిత్యుడైన పరలోక ప్రధాన యాజకుడు. కనుక మనమందరము యేసుపొందిన బాప్తిస్మము మరియు సిలువలో కార్చిన రక్తము నందు వున్న రక్షణను గ్రహించి, విశ్వసించి, రక్షింపబడవలయును.ఈలోకాంతము గురించి తిరిగి జన్మించిన వారు భయపడరు.


 • ఈ లోకాంతము గురించి, తిరిగి జన్మించిన
 • వారు ఎందువలన భయపడరు?
 • వారికి నీరు మరియు ఆత్మ సంబంధమైన సువార్త
 • యందుకలిగియున్న సంపూర్ణ విశ్వాసము పాప బంధకముల
 • నుండి విమోచించునని తెలియును గనుక భయపడరు.


నీవు నిజముగా తిరిగి జన్మించిన విశ్వాసివయితే ఈ లోకాంతము గురించి భయపడవలసిన అవసరమే లేదు. అనేకమంది కొరియాలోనున్న క్రైస్తవులు 28 అక్టోబరు 1992వ సంవత్సరము ఈలోకాంతమని విశ్వసించారు. ఆ రోజు ఎంతో భయంకరమైనది. ఎంతో మరణకరమైనదని దృఢముగా విశ్వసించారు. అయితే వారి విశ్వాసము వమ్మయినది. నిజముగా తిరిగి జన్మించిన అనుభవము కలవారు పరిశుద్ధమైన జీవితం గడుపుచూ యుగాంతము గురించిన సువార్తను ప్రకటిస్తారు. ఈ లోకాంతమెప్పుడైనా ఫర్వాలేదు. మనము అప్పటివరకు ఈ నీరు మరియు ఆత్మ సంబంధమైన సువార్తను ప్రకటించవలెను.

పెండ్లికుమారుడు అరుదెంచినప్పుడు, నిజముగా ఈ నీరు మరియు ఆత్మ సంబంధమైన సువార్త వలన తిరిగి జన్మించిన పెండ్లికుమార్తె అయిన సంఘం, అత్యంత ఆనందంతో ఆయనను ఎదుర్కొని ‘‘ఆహా! నీవు ఇప్పుడు వచ్చావు గదా! శారీరకంగా మేము అసంపూర్ణ మయినప్పటికి, నీవు మమ్మును ప్రేమించి, సకల పాపాల నుండి రక్షించియున్నావు. ఇప్పుడు నా హృదయం పాపరహితం. నా ప్రభూ, నీకే వందనాలు, నీవునా రక్షకునివి’’ అని ప్రస్తుతించగలదు.

నీతిమంతులందరికీ ఆయనే ఆత్మసంబంధమైన పెండ్లికుమారుడు, పెండ్లికుమార్తెను ప్రేమించుట వలన ఈ వివాహం జరుగును కానీ వేరు తాత్పర్యము కాదు. ఈ లోకములో ఈ వివాహంలో ఎలా జరగాలన్నది నిశ్చయించేది పరలోకములో నున్న మన పెండ్లి కుమారుడే! పెండ్లికుమారుడైన యేసు, కేవలము ఆయన ప్రేమను బట్టి ఈ రక్షణను అనుగ్రహించును. పెండ్లి కుమార్తెను బట్టి కాదు. ఈ విధముగా ఈ పరలోక వివాహం జరుగును.

పెండ్లికుమార్తెను గురించి సంపూర్ణముగా పెండ్లికుమారుడు యెరుగును. ఆయన ప్రేమించిన పెండ్లికుమార్తె ఎంత పాపియో ఆయనకు తెలుసు. వారిపై కరుణతో వారిని రక్షించెను. ఆయన బాప్తిస్మము పొంది, సిలువ మరణము చెంది పాపము తొలగించి వారిని రక్షించెను.

మన ప్రభువైన యేసుక్రీస్తు అహరోను వంశీకుడిగా ఈ లోకమునకు రాలేదు. ఈ లోకసంబంధమైన బలులర్పించుటకాయన రాలేదు. అలా చేయటానికి అనేకులైన లేవీయులున్నారు. వారు అహరోను వంశీకులై ఈ పనినిమిత్తమే నియోగింపబడ్డారు.

పాతనిబంధనలో అర్పింపబడిన చాయారూపమైన బలులకు నెరవేర్పు ప్రభువైన యేసుక్రీస్తే. కనుక ఎప్పుడైతే నిజమైనది ఈ లోకములో అరుదెంచెనో ఛాయారూపమేమగును? ఛాయ తొలగింపబడును.

ప్రభువైన యేసు ఈలోకమునకు వచ్చి అహరోను అర్పించిన బలుల వంటిది అర్పింపలేదు. సమస్త మానవాళికి ప్రత్యామ్నాయంగా తనను తానే సమర్పించుకున్నాడు. అందు నిమిత్తమే బాప్తిస్మము పొంది, సిలువలో రక్తము కార్చి పాపుల రక్షణ నిమిత్తము తనను తానే బలిగా అర్పించుకున్నాడు. ఆ విధముగా సిలువపై రక్షణను నెరవేర్చెను.

యేసుపొందిన బాప్తిస్మము మరియు సిలువ మరణము యందు విశ్వాసముంచిన వానికి ఏ షరతు లేకయే, రక్షణ అనుగ్రహించబడెను. అర్థము కాని విధానములో మన రక్షణ నిమిత్తమై పరిహారము చెల్లించలేదు. ఆయన స్పష్టమైన రీతిలో ఈ కార్యము నెరవేర్చాడు. ‘‘నేనే మార్గమును, సత్యమును, జీవమునైయున్నాను’’ (యోహాను14:6). యేసు ఈ లోకమునకు వచ్చి, తాను పొందిన బాప్తిస్మము, మరణము మరియు పునరుత్థానముల ద్వారా ఈ లోకమును రక్షించెను.పాతనిబంధన ప్రభువైన యేసునే సూచించును.


 • మరియొక నిబంధనను యేర్పాటు
 • చేయుటలోని అంతర్థారమేమి?
 • మొదటి నిబంధన అసంపూర్ణమై, ఉపయుక్తము
 • కానిదైనందు వలన.


నూతన నిబంధనకు ఛాయారూపమైనది పాతనిబంధన, పాతనిబంధనలోని ప్రధాన యాజకులవలె, యేసు బలులు అర్పింపలేదు. ఆయన ఉన్నతమైన యాజకత్వము జరిగించెను. ఆయనే నిత్యుడైన మన పరలోకపు ప్రధాన యాజకుడు. ఆ లోకములోని మనుష్యులందరూ జన్మపాపులు కనుకనే వారు పాపము చేయుచు ధర్మశాస్త్రము ద్వారా నీతిమంతులు కాలేకపోయిరి. కనుక నీ దేవుడు మరియొక నిబంధనను ఏర్పాటు చేసెను.

మన పరలోకపు తండ్రి, తన అద్వితీయ కుమారుని ఈ లోకమునకు పంపించెను. దానికి ప్రతిగా ఆయన పొందిన బాప్తిస్మము, సిలువ మరణము మరియు పునరుత్థానము నందు విశ్వాసముంచవలసినదిగా మనకు తెలిపెను. ఇదే దేవుని యొక్క రెండవ నిబంధన. ఈ రెండవ నిబంధన ప్రకారము మనము ప్రభువైన యేసుపొందిన బాప్తిస్మము మరియు ఆత్మ సంబంధమైన సువార్తయందు విశ్వాసముంచవలెను.

దేవుడు మన నుండి మంచిక్రియలను ఆశించుటలేదు. రక్షింపబడుటకు ఏ విధముగా జీవించాలో తెలియజేయలేదు. కేవలం మన రక్షణార్థమైన తన కుమారుడైన యేసునందు విశ్వసించిన చాలని తెలిపెను. అన్నిటికీ మించి యేసుపొందిన బాప్తిస్మము మరియు సిలువ మరణము యందు విశ్వసించవలసినదిగా తెలియజేసెను. మనము కేవలం సరే అని తెలియపరచవలెను. పాటించవలయును.

బైబిలులో యూదావంశములో రాజ్యపరిపాలన ఉండెను. సొలోమోను వరకు ఇశ్రాయేలు రాజులందరూ యూదావంశములోనే జన్మించిరి. రాజ్యము రెండుగా విభాగింపబడిన తరువాత క్రీ.పూ. 586లో పతనమగు వరకు దక్షిణరాజ్యమును యూదావంశస్థులే ఏలుచుండిరి. ఈ విధముగా యూదా వంశీకులు ఇశ్రాయేలు ప్రజలకు ప్రతినిధులని చెప్పవచ్చును. లేవీ వంశీకులు యాజకులు, ఇశ్రాయేలులో వున్న ప్రతివంశము వివిధ పనుల నిమిత్తమై ఏర్పరచబడెను. దేవుడు యూదా వంశమునుండి ప్రభువైన యేసు ఉద్భవించునని వాగ్ధానము చేసెను.

యూదా వంశస్థులతో ఈ నిబంధన ఎందువలన దేవుడు చేయవలసివచ్చెను. ఇశ్రాయేలు ప్రజలు ఈ లోకములో వున్న ప్రజలకు ప్రతినిధులు గనుక ఇశ్రాయేలీయులతో నిబంధన చేసినట్లయితే, ఈ లోకములోని ప్రతివారితో నిబంధన చేసినట్లగును. యూదా ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలకు ప్రతినిధులు గనుక వారితో నిబంధన చేసినచో సమస్త ఇశ్రాయేలీయులతో నిబంధన చేసినట్లగును. యేసు ఈ నూతన నిబంధనను నెరవేర్చెను. ఆయన పొందిన బాప్తిస్మము సిలువ మరణము, పునరుత్థానమే సకల మానవులకు దేవుడనుగ్రహించిన అద్వితీయమైన రక్షణ, అదే నూతన నిబంధన.కేవలము పశ్చాత్తాపము వలన మానవాళి పాపములు శుద్దీకరింపబడవు.


 • మానవుల పాపములు కేవలము
 • పశ్చాత్తాపపడినచో శుద్దీకరింపబడునా?
 • శుద్ధీకరింపబడవు.


యిర్మియ 17:1లో, ప్రతివారి పాపము రెండు ప్రదేశములలో లిఖించబడునని వ్రాయబడియున్నది. ‘‘వారి కుమారులు తాము కట్టిన బలిపీఠమును, ప్రతి పచ్చని చెట్టుక్రిందనున్న దేవతాస్తంభమును జ్ఞాపకము చేసికొనుచుండగా.’’

మన పాపాలు మన హృదయ ఫలకముపై లిఖించబడును. అందువలననే మనము పాపులమని మనకు తెలియవచ్చును. యేసును విశ్వసించినంత వరకు తాను పాపినని మానవుడు గ్రహించలేడు. ఎందువలన? మానవ హృదయములో దేవుని ధర్మశాస్త్రము నిలచి యుండలేదు గనుక. కాబట్టి ఎప్పుడైతే ఒక వ్యక్తి యేసునందు నిజముగా విశ్వాసముంచుతాడో, అప్పుడే దేవుని యెదుట తాను పాపిని అని అతనికి అవగాహన కలుగును.

కొందరు యేసుని విశ్వసించిన 10 సంవత్సరాలకు కూడా ఆయనను నిజముగా యెరుగరు, తాము పాపులమని గ్రహించరు. అయ్యో, దేవా! నేను పాపిని! నేను రక్షింపబడ్డానని భ్రమించాను. అయితే నేను ఇంకనూ పాపిని! మనమెవరమో మనము సరిగా గ్రహించినప్పుడే మన నిజస్థితి తెలియును. 10 సంవత్సరాలుగా వారిలో ఉన్న ఆనందం మటుమాయమవుతుంది. ఎందుకో తెలుసా? ఇప్పుడు దేవుని ఆజ్ఞానుసారం, వారి నిజస్థితి, పాపజీవితం, అపరాధాలన్నీ తెలియవస్తాయి. అటువంటి వ్యక్తులు యేసునందు విశ్వాసముంచి 10 సంవత్సరాలైనా, తిరిగి జన్మించిన అనుభవం పొందలేక పోయారు.

పాపి తన హృదయం నుండి ఈ పాపాలు చెరిపి వేసుకోలేడు గనుక దేవుని యెదుట పాపిగానే ఉంటాడు. కొందరికి 5 సంవత్సరాలు పట్టవచ్చు, మరికొందరికి 10 సంవత్సరాలు, ఇంకొందరికి 30 సంవత్సరాలు లేక 50 సంవత్సరాలు కూడా పట్టవచ్చు. అప్పుడే నిజస్థితిని గ్రహించగలడు. చివరికి సత్యమును గ్రహించగలడు. ‘‘ప్రియమైన దేవా, నా హృదయంలో నీ ఆజ్ఞలు లేక పూర్వం నాకంతా మంచిగానే కన్పించింది. నేను ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాఆయనని భ్రమించాను. అయితే నేను ప్రతిదినము పాపం చేస్తున్నానని ఈ రోజు తెలుసుకున్నాను. అపోస్తలుడైన పౌలు భక్తుడు ఈ విషయంగా ఇలా తెలియజేశాడు. ‘‘ఒకప్పుడు నేను ధర్మశాస్త్రము లేకుండ జీవించుచుంటిని గాని, ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరల జీవము వచ్చెను; నేనైతే చనిపోతిని.’’ (రోమా7:9) నేను యేసునందు విశ్వాసముంచిననూ ఇంకనూ పాపినే.

దేవుని వాక్యానుసారం జీవించకుండా నీ సొంత పాపాలే నిన్ను అడ్డగిస్తాయి. నీ పాపాలు నీ హృదయ ఫలకంపై లిఖించబడతాయి. దేవుడు నీ పాపాలను అక్కడే వ్రాస్తాడు. నీవు ప్రార్థించటానికి ఉపక్రమించగానే, అవన్నీ గుర్తుకువస్తాయి. ‘‘ఆశ్చర్యము నీవు చేసిన పాపాలన్ని ఇవే’’ అంటూ గుర్తు చేస్తాయి.

‘‘అరే, నేను నీ నిమిత్తము 2 సంవత్సరముల క్రితమే పశ్చాత్తాపము చెంది పరిహరించబడ్డాను గదా! నీవు ఆకస్మాత్తుగా ఊడిపడ్డావే? నీ వెందులకు తొలగిపోవు?’’ ఇది మన ప్రశ్న.

‘‘అన్యాయంగా మాట్లాడవద్దు నేను నీ హృదయంలో నిక్షిప్తమయ్యాను. నీవు ఎలా భావించినా సరే నీవింకా పాపివే.’’

లేదు, లేదు.

రెండు సంవత్సరాల క్రితం చేసిన పాపాలకు ఇప్పుడు మరలా ఈ పాపి పశ్చాత్తాపపడతాడు. ‘‘దేవా! నన్ను క్షమించు. నేనింకను పాపపు జ్ఞాపకాల చేత బాధింపబడుతున్నాను. అవి నేనెప్పుడో చేశాను. అయినా వాటి వలన బాధింపబడుతున్నాను. నా పాపాలకు ప్రాయశ్చిత్తం చెందాను. ఇంకనూ నన్నవి వదల లేదు. దేవా, దయచేసి నన్ను మన్నించు’’, అని అభ్యర్థిస్తాడు.

కేవలం పశ్చాత్తాపం వలన అవి మాయం అవుతాయా? తొలగిపోతాయా? మనుష్యుల పాపాలు వారి హృదయాలలో లిఖించబడతాయి. ఈ నీరు మరియు ఆత్మ సంబంధమైన సువార్త లేకుండా అవి చెరపబడవు. నీరు మరియు ఆత్మ సంబంధమైన సువార్త ద్వారానే ఈ పాపాలకు పరిహారం లభిస్తుంది. యేసుక్రీస్తు సత్యసువార్త యందు ఉంచబడు విశ్వాసం ద్వారానే మనము రక్షించబడగలము.నేనే నీ రక్షకుడను.


 • ఈ నూతన నిబంధనకు మనమేలాగు
 • స్పందించవలెను?
 • దీనిని మన హృదయములలో విశ్వసించి,
 • ఈ లోకమునకంతయు ప్రకటించవలెను.


మన పరలోకపు ప్రభువు మనతో ఒక నూతన నిబంధన చేశాడు. ‘‘నేను నీ రక్షకుడనైనాను. ఈ నీరు మరియు రక్తము ద్వారా ఈ లోకపాపములన్నియు సంపూర్ణముగా తొలగించి, నిన్నొక నూతన వ్యక్తిగా చేయగలను. నన్ను విశ్వసించినవారిని తప్పక ఆశీర్వదిస్తాను.’’

దేవునితో ఏర్పరచబడిన నూతన నిబంధన యందు మీరు విశ్వసిస్తున్నారా? మనము పాపాల నుండి రక్షింపబడి తిరిగి జన్మించగలము. ఈ నీరు మరియు రక్తము వలననైన రక్షణాత్మకమైన నిబంధన యందు నిజముగా విశ్వసించి రక్షింపబడగలము.

మన వ్యాధిని సరిగా నిర్ధారించలేని వైద్యుని యందు మనము నమ్మికయుంచలేము. ఒక వైద్యుడు తన వద్దకు వచ్చు రోగుల అసలైన వ్యాధిని గుర్తించగలగాలి. ఆ తరువాత సరైన మందు వాడగలగాలి. అనేకమందులు ఉండవచ్చు గానీ ఆ వ్యాధికి సరైన మందేదో, అదే ఆరోగిపై ప్రయోగించవలెను. ఒకసారి ఆ వైద్యుడు తన వద్దకువచ్చిన రోగియొక్క వ్యాధి ఏమిటో నిర్ధారించగానే, ఆ వ్యాధిని తగ్గించటానికి ఆ వైద్యునికి అనేక మందులు లభిస్తాయి. అయితే, వ్యాధి నిర్ధారణే సరిగాలేకపోతే ఆ వ్యాధిని తగ్గించగలిగే మందు, సరిగా వాడని కారణాన ఆ రోగికి ప్రాణాంతకముగా మారగలదు.

అదే లాగున, నీవు క్రీస్తునందు విశ్వసించగానే, నీ ఆత్మ ఏ స్థితిలో ఉన్నదో నీవు నిర్ధారించుకోవాలి. దానికి దేవుని యొక్క వాక్యం నీకు ఉపయోగపడుతుంది. దేవుని వాక్యం చేత నీ ఆత్మీయస్థితిని నిర్ధారించుకొనగానే, ఆత్మవైద్యుడైన దేవుడు ఏ మాత్రం జాగుచేయక తన వద్దకు వచ్చురోగిని స్వస్థపరచగలడు. అప్పుడు ఆ విధముగా స్వస్థపరచబడిన వారు తిరిగి జన్మించిన అనుభవమును పొందగలరు.

‘‘నేను విమోచింపబడ్డానో లేదో నాకు తెలియదు’’ అని నీవు చెప్పినట్లయితే నీవింకనూ రక్షింపబడలేదనే దాని భావం. ఒక పాస్టరు, నిజంగా యేసుప్రభువు శిష్యుడయితే తన అనుచరుల పాపసంబంధమైన సమస్యను సరిగా గ్రహించి వాటిని యేసునందు తక్షణమే పరిష్కరించగలడు. అప్పుడు విశ్వాస సంబంధమైన వారి సమస్యను గ్రహించి, పరిష్కరించి, వారిని ఆత్మీయంగా ఆధ్యాత్మికంగా ఉన్నత శిఖరాలకు నడుపగలడు. తన అనుచరుల ఆధ్యాత్మిక స్థితిని అంచనా వేయగలగాలి.

ఈ లోకపాపమునంతయు తొలగించుటకు యేసు ఈ లోకానికి వచ్చాడు. ఆయన వచ్చి, బాప్తిస్మము పొంది, సిలువపైన మరణించాడు. ఆయన సమస్త పాపాలను పరిహరించాడు. కేవలం నీ పాపాన్ని కొంతవదిలి వేశాడా? ఈ నీరు మరియు ఆత్మసంబంధమైన దైవ వాక్యం విశ్వాసులలోని సకల పాపమును తొలగించగలదు.

సువార్త ఒక డైనమైట్‌, అనగా మందుగుండులాంటిది. గొప్ప భవనాల నుండి ఎత్తైన పర్వతాల వరకూ దేనినైనా పేల్చివేయగలదు. యేసు చేసిన రక్షణాత్మకమైన క్రియ కూడా అటువంటిదే. ఈ నీరు మరియు ఆత్మ ద్వారా తనను విశ్వసించిన వారి పాపములన్నియు తుడిచివేయగలదు. కనుక మనమిప్పుడీ నీరు మరియు ఆత్మసంబంధమైన వాక్యానుసారమైన సువార్తవైపునకు మరలి, రక్షింపబడగలము.పాత నిబంధనలోని హస్తనిక్షేపణ యందున్న సువార్త


 • పాతనిబంధనలో ఈ చేతులుంచుట
 • అనువిధానములోని అంతరార్ధమేమై
 • యున్నది?
 • పాపుల పాపములను, పాపరిహార
 • బలిపశువుపై ఆరోపించుటయై యున్నది.


లేవీ కాండము 1:3-4లో తెలుపబడిన రక్షణాత్మకమైన మరియు విమోచనాత్మకమైన సువార్తలోని సత్యము తెలుసుకొనవలెను. ‘‘అతడు దహనబలిరూపముగా అర్పించునది గోవులలోనిదైనయెడల నిర్దోషమైన మగదానిని తీసికొని రావలెను. తాను యెహోవా సన్నిధిని అంగీకరింపబడునట్లు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునకు దానిని తీసికొని రావలెను. అతడు దహనబలిగా అర్పించు పశువు తలమీద తన చెయ్యి నుంచవలెను. అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగునట్లు అది అతని పక్షముగా అంగీకరింపబడును.

ఈ వాక్యములో తెలియపరచిన విధముగా దహనబలి జంతువును, ప్రత్యక్షగుడారము యొక్క ద్వారమునొద్దకు తీసికొనిరావలెను. ఆ సన్నిధిలో దాని తలపై చేతులుంచవలెను.

పాత నిబంధనా కాలములో, ఒక పాపి తన అనుదిన పాపముల నిమిత్తమై పాపపరిహారార్థ బలిపశువు తలపై తన రెండు చేతులుంచవలెను. దేవునియెదుట ఆ బలిపశువు సంహరించబడవలెను. అప్పుడు యాజకుడు కొంతరక్తమును తీసుకొని దహన బలిపీఠపు కొమ్ముపై పోయవలెను. ఆ మిగిలిన రక్తమును బలిపీఠము నొద్ద పోయవలెను. అప్పుడు ఆ పాపియొక్క ఆ దినపాపములు తొలగింపబడును.

అయితే సంవత్సర పాపాల నిమిత్తమై లేవీ కాండము 16:6-10 వరకు తెలుపబడినది. ‘‘అహరోను తనకొరకు పాపపరిహారార్ధబలిగా ఒక కోడెను అర్పించి తన నిమిత్తమును తన యింటివారి నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేసి ఆ రెండు మేక పిల్లలను తీసికొని వచ్చి, ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము నొద్ద యెహోవా సన్నిధిని వాటిని ఉంచవలెను. అప్పుడు అహరోను యెహోవాపేరట ఒక చీటిని, విడిచిపెట్టే మేక పేరట ఒక చీటిని ఆ రెండు మేకల మీద రెండు చీట్లను వేయవలెను. ఏ మేకమీద యెహోవా పేరట చీటి పడునో, ఆ మేకను అహరోను తీసికొని వచ్చి పాపపరిహార్ధాబలిగా అర్పింపవలెను. ఏ మేక మీద విడిచిపెట్టుట అనే చీటి పడునో దాని వలన ప్రాయశ్చిత్తము కలుగునట్లు, దానిని అరణ్యములో విడిచిపెట్టుటకై యెహోవా సన్నిధిని దానిని ప్రాణముతోనే ఉంచవలెను.’’ బైబిలులో తెలియపరచిన విధంగా ఆ బలిపశువు అనగా విడిచి పెట్టబడిన జంతువునకు అర్థము ‘‘తొలగింపబడుట’’. కనుక ఆ 7వ నెల 10వ దినమున ఇశ్రాయేలీయుల సంవత్సర పాపములు ఆవిధముగా తొలగింపబడును.

అలాగే లేవీకాండము 16:29-30 వరకు ఈ విధముగా లిఖించబడియున్నది. ‘‘ఇది మీకు నిత్యమైన కట్టడ స్వదేశులుగాని మీ మధ్యనుండు పరదేశులు గాని మీరందరు ఏడవనెల పదియవ నాడు ఏ పనియైనను చేయక మిమ్మును మీరు దుఃఖపరచుకొనవలెను. ఏలయనగా మీరు యెహోవా సన్నిధిని మీ సమస్త పాపముల నుండి పవిత్రులగునట్లు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయబడెను.’’

ఈ దినమున ఇశ్రాయేలీయుల సంవత్సర పాపములు పరిహరింపబడును. ఇది ఎలా సాధ్యము? మొదటిగా, ప్రధాన యాజకుడైన అహరోను ఆ బల్యర్పణ ప్రదేశమున ఉండవలెను. ఇశ్రాయేలు ప్రజలకు ప్రతినిధి ఎవరు? అహరోనే గదా! దేవుడు అహరోనును ఆయన వారసులను ప్రధాన యాజకులుగా నియమించెను.

అహరోను తన పాపము నిమిత్తము మరియు తన ఇంటి వారి పాపము నిమిత్తము పరిహారము చేయుటకు ఒక ఎద్దును బలిగా అర్పించవలయును. ఆ యెద్దును చంపి దాని రక్తమును కొంత తీసుకొని కరుణా పీఠము ముందు 7 మార్లు ప్రోక్షించవలెను. ముందుగా తన నిమిత్తము, తన ఇంటివారి నిమిత్తము బలి అర్పింపవలెను.

పాపపరిహారము అనగా ఒకరి పాపమును బలిపశువుపై ఆరోపించి, ఆ వ్యక్తికి ప్రత్యామ్నాయంగా బలిపశువు చంపబడుట. నిజముగా మరణించవలసిన వాడు పాపియే. కానీ తన పాపమును ఆ బలిపశువుపై ఆరోపించుట ద్వారా, దానిని బలిగా అర్పించి, తన స్థానములో దానిని చంపి, తన పాపము నుండి విమోచింపబడగలడు.

తన పాపాలు, తన ఇంటివారి పాపాలు తొలగింపబడిన తరువాత ఒక మేకను దేవుని యెదుట బలిగా అర్పించి, ఇంకొక మేకను ఎడారిలోనికి పంపి వేయబడవలెను. ఇశ్రాయేలు ప్రజల యెదుట అది విడిచి పెట్టబడవలెను.

ఒక మేక పాపపరిహారార్ధ బలిగా చంపబడును. అహరోను దాని తలపై తన చేతులుంచి, ‘‘ఓ దేవా! నీ ప్రజలైన ఇశ్రాయేలీయులు నీ ధర్మశాస్త్రమును, 10 ఆజ్ఞలను, 613 విధిరూపకములైన నీ కట్టడలను అతిక్రమించియున్నారు. ఇశ్రాయేలీయులు పాపము చేసియున్నారు. కనుక నేనీ మేకతలపై చేతులుంచుట ద్వారా వారి సమస్త పాపములను దీనిపైకి ఆరోపిస్తున్నాను’’ అని తెలియజేస్తాడు.

ఆ మేక గొంతు కోసి, దాని రక్తము కొంత తీసుకొని అతిపరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించును. అప్పుడు దాని రక్తమును కరుణాపీఠముపైన, ముందు 7 సార్లు ప్రోక్షించెను.

అతి పరిశుద్ధస్థలములో నిబంధనా మందసముండును. దానిపై భాగము కరుణాపీఠముగా పిలువబడును. మందసములోని పది ఆజ్ఞలు వ్రాయబడిన రెండు రాతి పలకలుండును. మన్నా ఉంచబడిన బంగారు పాత్రయుండును. చిగురించబడిన అహరోను కర్ర కూడా ఉండును.

చిగురించబడిన అహరోను కర్ర పునరుత్థానమునకు సాదృశ్యము; ఆ రెండు రాతిపలకలు దేవుని న్యాయమునకు సాదృశ్యము. బంగారు పాత్రలోని మన్నా జీవవాక్యమునకు సంకేతము.

నిబంధనా మందసముపైన కప్పి ఉండును. ఆ రక్తము కరుణా పీఠము ముందు 7 సార్లు చిలకరింపబడును. ప్రధాన యాజకుడి దుస్తులపై బంగారు గంటలుండును. రక్తమును ప్రోక్షించిన ప్రతిసారి ఆ గంటలు మ్రోగును.

లేవీ కాండము 16:14-15 నందు ఈ విధముగా తెలుపబడినది. ఇప్పుడతడు ఆ కోడెరక్తము కొంచెము తీసుకొని తూర్పుప్రక్కన కరుణాపీఠము మీద తన వ్రేలితో ప్రోక్షించి, కరుణాపీఠము ఎదుట తన వ్రేలితో ఆ రక్తములో కొంచెము ఏడుమారులు ప్రొక్షింపవలెను. అప్పుడతడు ప్రజలర్పించు పాపపరిహారార్ధ బలియగు మేకను వధించి అడ్డ తెరలోపలికి దాని రక్తము తెచ్చి ఆ కోడెరక్తముతో చేసినట్లు దీని రక్తములోను చేసి, కరుణాపీఠము మీదను కరుణాపీఠము ఎదుటను దాని ప్రోక్షింపవలెను.’’

ఆ మేక రక్తము ప్రోక్షించిన ప్రతిసారి ఆ గంటలు మ్రోగును. బయట వేచి వున్న ఇశ్రాయేలీయులందరూ ఆ గంట శబ్ధము వినగలరు. వారి పాపవిమోచనకై చిందింపబడిన రక్తము, ప్రధానయాజకునిచే ప్రోక్షింపబడను గనుక, వారి పాపక్షమాపణ సువార్త వారికి ఆ గంటల ధ్వని ద్వారా తెలియబడును. ఇశ్రాయేలు ప్రజలందరికీ ఆ శబ్ధమే రక్షణార్థమైన ఆశీర్వాదము.

ఆ గంటలు 7 సార్లు మ్రోగగానే ‘‘నేనిప్పుడు విడిపించబడితిని. ఈ సంవత్సరమంతయు ఈ పాపాల నిమిత్తమై చింతాక్రాంతుడనయ్యాను. నేనిప్పుడు విమోచింపబడ్డాను.’’ అని ఇశ్రాయేలీయులు ఆనందపడగలరు. తిరిగి ప్రజలు తమ అనుదిన జీవనమునకు వెళతారు. వారిప్పుడు ఆ సంవత్సర పాపాల నుండి విమోచింపబడిన జనాంగము. ఈ నీరు మరియు ఆత్మ ద్వారా వినిపింపబడిన సువార్తకు సంకేతమే ఇశ్రాయేలు ప్రజలకు ఆనాడు వినిపించబడిన విమోచనాత్మకమైన గంటల శబ్ధము.

మనము ఈ విమోచనాత్మకమైన నీరు మరియు రక్తముతో కూడిన సువార్తను వినగానే, మన హృదయములో దానిని విశ్వసించవలెను. మననోటితో ఒప్పుకొనవలెను. ఇదే ఈ నీరు మరియు ఆత్మసంబంధమైన సువార్తలోని సత్యము. ఆ గంటలు 7 సార్లు మ్రోగగానే, ఇశ్రాయేలీయుల సంవత్సర పాపాలు శుద్దీకరింపబడును. దేవుని యెదుట వారి పాపము తొలగింపబడెను.

ఇశ్రాయేలీయుల పక్షముగా ఆ మేక బలి అర్పించబడిన పిమ్మట, ప్రధాన యాజకుడు ఆ రెండవ మేకను తీసుకొని, ప్రత్యక్షగుడారము యెదుట వేచియున్న ఇశ్రాయేలీయల యెద్దకు వెళ్లి, వారందరూ చూచు చుండగా ప్రధాన యాజకుడు ఆ మేకతలపై తన రెండుచేతులుంచును.

ఈ విధానము లేవీ కాండము 16:21-22లో వివరింపబడినది. ‘‘అప్పుడు అహరోను సజీవమైన ఆ మేక తలమీద తన రెండుచేతులుంచి, ఇశ్రాయేలీయుల పాపములన్నియు, అనగా వారి దోషములన్నియు వారి అతిక్రమములన్నియు దానిమీద ఒప్పుకొని, ఆ మేక తలమీద వాటిని మోపి, తగిన మనుష్యుని చేత అరణ్యములోనికి దాని పంప వలెను. ఆ మేక వారి దోషములన్నిటిని ఎడారి దేశమునకు భరించి పోవును. అతడు అరణ్యములో ఆ మేకను విడిచిపెట్టవలెను.’’

అప్పుడు ప్రధాన యాజకుడైన అహరోను, దాని తలపై తన చేతులుంచి (విడిచిపెట్టబడు మేక) దేవుని యెదుట ఇశ్రాయేలీయల సంవత్సర పాపాములు ఒప్పుకొనును. ‘‘ఓ దేవా! ఇశ్రాయేలీయులు నీ యెదుట పాపము చేసియున్నారు. మేము 10 ఆజ్ఞలను, 613 విధిరూపకమైన కట్టడలను, ధర్మశాస్త్రమును అతిక్రమించియున్నాము. ఓ దేవా, ఇశ్రాయేలీయుల సంవత్సర పాపములన్నియు ఆ మేక తలపైకి ఆరోపిస్తున్నాను.’’ అని చెప్పెను.

యిర్మియా 17:1 ప్రకారం వారి పాపములన్నియు రెండు స్థలములలో లిఖించబడును. ఒకటి క్రియా గ్రంధము, రెండవది వారి హృదయఫలకములు. 

కనుక ప్రజలు వారి పాపము నిమిత్తమై ప్రాయశ్చిత్తము చేసుకొనిన యెడల, వారి పాపము తమ హృదయ ఫలకముపై నుండి మరియు క్రియల గ్రంధము నుండి తుడిచి వేయబడవలెను. ఈ పాపపరిహార దినమున అర్పించబడు ఒక మేక తీర్పు గ్రంధంలో వ్రాయబడిన పాపము తుడిచివేతకు మరియొకటి మన హృదయ ఫలకములపై లిఖించబడిన పాపము తుడిచివేత నిమిత్తము అర్పించబడును.


 • పాతనిబంధనలోని బల్యర్పణా విధానము
 • ద్వారా, దేవుడు ఇశ్రాయేలీయులకు 
 • ఏమి తెలియపరచనెంచెను?
 • రక్షకుడు అరుదెంచి, వారి పాపములనిమిత్తమై
 • నిర్ణయింపబడిన విధానములో శాశ్వతముగా 
 • శుద్ధీకరించునన్న సత్యము తెలియజేయవలెననియే 
 • దేవుని ఉద్దేశ్యమై యున్నది.


ఆ మేకతలపై చేతులుంచుట ద్వారా ఇశ్రాయేలీయుల సంవత్సర పాపములు ఆ పాప పరిహారార్ధ బలిపశువుపై ఆరోపించబడును. ఆ మేక తలపై ప్రజల పాపములు ఆరోపించగానే, ఈ పనినిమిత్తమై నియోగించబడిన ఒక నమ్మకమైన వ్యక్తికి ఆ మేక అప్పగించబడి ఎడారిలోకి నడిపింపబడును.

పాలస్తీనా ఎంతో ఎడారి ప్రాంతము. ప్రజల పాపములు ఆరోపింపబడిన ఆ మేక, అప్పగింపబడిన మనుష్యునిచేత నీరు, గడ్డి లేని ఎడారిలోనికి నడిపింపబడును. ఆ విడిచిపెట్టబడు మేక కనిపించు పర్యంతము, ఎడారిలోకి నడిపించబడుట కూడియున్న ప్రజలు చూచెదరు.

‘‘నేను చావవలసినదే, కానీ నాకు బదులు గా ఆ మేక చనిపోవుచున్నది.’’ అని ప్రజలు చెప్పుకొందురు. ‘‘మేకా నీకు కృతజ్ఞతలు. నీవు మరణించినావు గనుక నేను జీవించియున్నాను.’’ ఆ మేక ఎడారిలోనికి దూరముగా నడిపింపబడగా ప్రజల సంవత్సర పాపములు క్షమింపబడును.

నీ హృదయములోని పాపమంతయు, పాపపరిహారార్ధ బలిపశువుపైకి ఆరోపింపబడగా, నీవు శుద్దీకరణ పొందుదువు. ఇది చాలా సామాన్యమైనది. మనము అర్థం చేసుకున్నట్లయితే, సత్యము ఎంతో సాధారణమైనది.

ఆ మేక ఆ ఎడారిలో కనుచూపుమేర ప్రయాణించి కనుమరుగవును. దానిని ఎడారి లోపల వదిలి ఆ అప్పగింపబడిన మనుష్యుడు తిరిగివచ్చును. ఇశ్రాయేలీయుల సంవత్సర పాపమంతయు తొలగిపోయెను. ఆ విడిచిపెట్టబడిన మేక నీరు, పచ్చిక లేక ఆ ఎడారిలో సంచరించి, చివరకు చనిపోవును. ఇశ్రాయేలీయుల సంవత్సర పాపములన్ని ఆ విధముగా తొలగింపబడును.

పాపమునకు జీతము మరణము. దేవుని నీతి ఆ విధముగా నెరవేర్చబడెను. ఇశ్రాయేలీయులు జీవించునట్లు, దేవుడా మేకను సంహరింపజేసెను. ఆ సంవత్సరమంతయు ఇశ్రాయేలీయులు చేసిన అపరాధములన్నీ తొలగింపబడెను.

వారి దిన పాపములు మరియు సంవత్సర పాపములు క్షమింపబడెను. ఆ విధముగా పాతనిబంధనలో జరిగింపబడినది. దేవుని నూతన నిబంధనానుసారముగా మన సమస్త పాపములు శాశ్వతముగా, అదే విధముగా క్షమింపబడినవి. దేవుని నిబంధనానుసారముగా మెస్సయ్య ఈ లోకమునకు వచ్చి మన జీవితాంత పాపములు శుద్ధీకరించెను. యేసు పొందిన బాప్తిస్మము ద్వార ఈ నిబంధన నెరవేర్చబడెను.నూతన నిబంధనలోని నీరు మరియు ఆత్మ ద్వారా తిరిగి జన్మించుట


 • యేసు ఎందువలన స్థానికుడైన
 • యోహానుచే బాప్తిస్మము పొందెను?
 • లోకపాపమంతయు తొలగించి నీతియావత్తు
 • నెరవేర్చుట. పాత నిబంధనలో బలిపశువు తలపై
 • రెండుచేతులుంచుటకు సమానమైనదే నూతన
 • నిబంధనలోని యేసుక్రీస్తు బాప్తిస్మము.


మత్తయి సువార్త 3:13-15 వరకు ధ్యానించగలము. ‘‘ఆ సమయమున యోహాను చేత బాప్తిస్మము పొందుటకు యేసు గలిలయ నుండి యొర్దాను దగ్గరనున్న అతనియొద్దకు వచ్చెను. అందుకు యోహాను ` నేను నీ చేత బాప్తిస్మము పొందవలసినవాడనై యుండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా? అని ఆయనను నివారింపజూచెను గాని యేసు ` ఇప్పటికి కానిమ్ము; నీతి యావత్తు ఈలాగు నెరవేర్చుట మనకు తగియున్నదని అతనికి ఉత్తరమిచ్చెను గనుక అతడాలాగు కానిచ్చెను.’’

యేసు యొర్దాను నదికి వెళ్ళి స్థానికుడైన యోహాను ద్వారా బాప్తిస్మము పొందెను. ఆ విధముగా చేయుట ద్వారా నీతియావత్తు నెరవేర్చెను. యేసు యోహాను చేత బాప్తిస్మము పొందెను. స్థానికుడైన యోహాను స్త్రీలు కనినవారిలో గొప్పవాడు.

మత్తయి 11:11-12లో ఈ విధముగా తెలుపబడినది. ‘‘స్త్రీలు కనినవారిలో బాప్తిస్మమిచ్చు యోహానుకంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అయినను పరలోకరాజ్యములో అల్పుడైన వాడు అతనికంటే గొప్పవాడు. బాప్తిస్మమిచ్చు యోహాను దినము మొదలుకొని యిప్పటి వరకు పరలోకరాజ్యము బలత్కారముగా పట్టబడుచున్నది, బలాత్కారులు దాని నాక్రమించుకొనుచున్నారు.’’

స్థానికుడైన యోహాను మానవులకు ప్రతినిధిగా దేవుని చేత ఏర్పాటు చేయబడెను. యేసుకంటే 6 నెలలు ముందుగా జన్మించెను. అతడు అహరోను వంశుస్థుడై, చిట్టచివరి ప్రధాన యాజకుడై యున్నాడు.

యేసు తనవద్దకు రాగానే స్థానికుడైన యోహాను ‘‘నేను నీ వద్ద బాప్తిస్మము పొందవలసిన వాడనైయుండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా?’’ అనెను. ‘‘ఇప్పటికి కానిమ్ము; నీతియావత్తు ఈలాగున నెరవేర్చుట మనకు తగియున్నది.’’ అని యేసు పలికెను. మానవులు దేవునికి బిడ్డలగుటకై సకల మానవాళిని పాపమునుండి విడిపించుటే ఆయన ఉద్దేశ్యము, లక్ష్యమైయున్నది. మనము ఈ నీరు మరియు ఆత్మ వలననైన తిరిగి జన్మింపజేయు సువార్తను సంపూర్ణ పరచవలెనని యేసు యోహానుతో తెలిపెను. ‘‘కనుక నాకిప్పుడు బాప్తిస్మము యివ్వవలసినదిగా’’ తెలిపెను.

యోహాను యేసుకు బాప్తిస్మము ఇచ్చెను. లోక పాపమంతయు తొలగించునిమిత్తము బాప్తిస్మము స్వీకరించుట యేసునకు తగియున్నది. యేసు సరైన విధానములో బాప్తిస్మము పొందెను.

యేసు ఈ లోకమునకు వచ్చి తన 30వ సంవత్సరములో బాప్తిస్మము పొందెను. అది ఆయన మొదటి పరిచర్య. ఈ లోక పాపమంతయు పరిహరించుటకు యేసు నీతియావత్తు నెరవేర్చెను. అందువలన ప్రజలు శుద్ధీకరణ పొందుటకు వీలాయెను.

మనందరి పాపములు తగిన రీతిలో శుద్దీకరించుటకు యేసు బాప్తిస్మము పొందెను. ‘‘ఇప్పటి కానిమ్ము’’ నీతియావత్తు నెరవేరినది.

దేవుడు ఈ విధముగా సెవిచ్చెను. ఈయన నా ప్రియ కుమారుడు; ఈయన యందు నేనానందించుచున్నాను.’’ (మత్తయి 3:17) యేసు తానెరిగి ఆ ప్రకారము, ప్రజల పాపములు తొలగించుటకు సిలువపై మరణించెను. అయితే యేసు తండ్రి చిత్తమునకు విధేయుడాయెను. ‘‘నా చిత్తము కాదు, నీ చిత్తమే సిద్ధించనిమ్ము’’ (మత్తయి 26:39) సమస్త మానవుల పాపములు తొలగించుట దేవుని చిత్తము. తద్వారా ఈ లోకప్రజలందరికీ రక్షణ అనుగ్రహింపబడెను.

విధేయత కలిగిన కుమారుడైన యేసు విధేయత చూపెను. తన తండ్రి చిత్తము నెరవేర్చెను. స్థానికుడైన యోహాను ద్వారా బాప్తిస్మము పొందెను. యోహాను 1:29లో ఈ విధముగా తెలుపబడెను. ‘‘మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి ` ఇదిగో లోకపాపమును మోసికొనిపోవు దేవుని గొఱ్ఱెపిల్ల.’’ యేసు లోకపాపమంతయు తానే వహియించి గొల్గొతాకొండపై సిలువ వేయబడెను. ‘‘ఇదిగో ! లోక పాపము మోసుకొని పోవు దేవుని గొఱ్ఱెపిల్ల.’’ అని యోహాను సాక్ష్యమిచ్చెను.

నీవు పాపము చేసియున్నావా, లేదా? నీవు నీతిమంతుడవా లేక పాపివా? యేసు ఈ లోకపాపమంతయు తానే వహియించి, సిలువపైన మనందరి నిమిత్తమై సిలువపై మరణించెననునదే విశ్వాసము.


 • ఈ లోకములో ఉన్నపాపుల సమస్త పాపములు
 • ప్రభువైన యేసుపై ఎప్పుడు మోపబడినవి?
 • యొర్దానులో స్థానికుడైన యోహాను వలన
 • బాప్తిస్మము పొంది మన పాపములన్నియు
 • తొలగించెను.


మనము ఆ లోకములో జన్మించిన తరువాత మొదటి సంవత్సరము నుండి 10 సంవత్సరముల వయస్సులో కూడా పాపము చేస్తాము. యేసు ఆ పాపములన్నిటిని తొలగించెను. మనము 11వ సంవత్సరము నుంచి 20 సంవత్సరముల వరకు మన క్రియల ద్వారాను మరియు మన హృదయముల ద్వారాను జరిగించిన ప్రతిపాపములను, ఆయన విమోచించెను.

మనము 21వ సంవత్సరము నుండి 45వ సంవత్సరము వరకు మరియు ఆ తరువాత చేసిన పాపమునంతయు ఆయనే వహియించెను. ఈ లోక పాపమునంతయు యేసు తానే మోసికొని సిలువపై మరణించెను. మనము జన్మించినది మొదలుకొని చనిపోవు పర్యంతము పాపము చేయుచునే యుందుము. యేసు వాటినన్నిటినీ తొలగించెను.

‘‘ఇదిగో! లోకపాపమును మోసికొని పోవు దేవుని గొఱ్ఱెపిల్ల!’’ తొలి మానవుడైన ఆదాము నుండి ఈ లోకములో జన్మించు ఆఖరు వ్యక్తివరకూ అది ఎప్పుడు సంభవించినను ` ఆ పాపములనన్నిటిని ఆయనే స్వీకరించెను. ఆయన ఒకరి పాపములను స్వీకరించి మరియొకసారి పాపములను వదలివేయలేదు.

ఆయన మనలో కొందరినే ప్రేమించవలెనని నిర్ణయించుకొనలేదు. ఆయన శరీరధారియై ఈ లోకమునకు వచ్చి, ఈ లోకపాపమునంతయు మోసికొని సిలువపైన మరణించెను. మనందరి నిమిత్తమైన తీర్పును ఆయన స్వీకరించెను. దాని ఫలితముగా ఈ లోకపాపములన్నియు తొలగింపబడెను.

ఆయన రక్షణ ప్రణాళికకు ఎవరూ అతీతులు కారు. ‘‘ ఈ లోకపాపమంతయు’’ అనగా వాటిలో మన పాపము కూడా వుండియున్నది. యేసు ఈ పాపములనన్నిటిని స్వీకరించెను.

ఆయన పొందిన బాప్తిస్మము మరియు కార్చిన రక్తము వలన ఈ లోకపాపమంతయు శుద్దీకరించెను తాను పొందిన బాప్తిస్మము ద్వారా మన పాపములన్నియు ఆయనకు ఆరోపింపబడగా, మన పాపముల నిమిత్తమై తీర్పు తీర్చబడి సిలువపై రక్తము కార్చెను. యేసు సిలువపైన మరణించుటకు ముందుగా ‘‘సమాప్తమైనది’’ అని తెలియపరచెను. (యోహాను 19:30) అనగా సమస్త మానవాళికి రక్షణ చేకూర్చుట సమాప్తమైనది అని భావము.

ఎందువలన సిలువపై యేసు మరణించవలసి వచ్చెను? శరీరము యొక్క ప్రాణము రక్తములో ఉన్నది. మరియు ఒక వ్యక్తి జీవితములో పాపపరిహారము కావలయునన్న రక్తము ఆవశ్యకము (లేవీ 17:11). యేసు ఎందుకు బాప్తిస్మము తీసుకొనెను? ఈలోక పాపమునంతయు తనపై వహియింప చేసికొను నిమిత్తము బాప్తిస్మము స్వీకరించెను.

‘‘అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు యెరిగి, లేఖనము నెరవేరునట్లు ` నేను దప్పిగొనుచున్నాననెను,’’ (యోహాను 19:28) పాత నిబంధనలోని దేవుని వాగ్ధానము తాను యొర్దానులో పొందిన బాప్తిస్మము మరియు సిలువ మరణము ద్వారా నెరవేర్చబడినవని యెరిగి యేసు ప్రాణము విడిచెను.

తన ద్వారా విమోచన నెరవేర్చబడినదని యేసు యెరిగి ‘‘సమాప్తమయినది’’ అని తెలియజేసెను. ఆయన సిలువపై మరణించెను. మనలను శుద్ధీకరించి తిరిగి 3వ నాడు మరణమును గెలిచి పునరుత్థానుడై, ఆ తదుపరి పరలోకమునకు ఆరోహణుడై ఇప్పుడు తండ్రి కుడి పార్శ్వమున కూర్చుండియుండెను.

యేసు పొందిన బాప్తిస్మము మరియు సిలువ మరణము ఆశీర్వాదకరమైన సువార్తయై. నీరు మరియు ఆత్మ ద్వారా అనేకులను తిరిగి జన్మింపజేసెను. దీనిని నమ్మి మీరును మీ పాపముల నిమిత్తమై క్షమాపణ పొందగలరు.

మనము ప్రతిదినము పశ్చాత్తాపము చెందుటవలన మరియు ఆ రీతిగా ప్రార్థించుట ద్వారా మన పాపముల నుండి విమోచింపబడము. విమోచన అందరికీ శాశ్వతముగా ఉండుటకై యేసుపొందిన బాప్తిస్మము మరియు సిలువ మరణము ద్వారా అనుగ్రహించబడెను. ‘‘వీటి క్షమాపణ ఎక్కడ కలుగునో అక్కడ పాప పరిహారార్ధబలి యికను ఎన్నడును ఉండదు.’’ (హెబ్రీ 10:18).

ఇప్పుడు మనము చేయవలసనది కేవలము యేసుక్రీస్తు పొందిన బాప్తిస్మము మరియు సిలువ మరణము ద్వారా విమోచింపబడితిమని విశ్వసించవలయును. విశ్వసించిన యెడల నీవు రక్షించబడుదువు.

రోమా 5:1-2 ‘‘కాబట్టి విశ్వాసమూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగియుందుము మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై, అందులో నిలచియుండి, దేవుని మహిమ గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము.’’

ఈ ఆశీర్వాదకరమైన తిరిగి జన్మింపజేయు నీరు మరియు ఆత్మసంబంధమైన సువార్తనందు విశ్వాసముంచుట తప్ప మరియే మార్గము లేదు.ధర్మశాస్త్రము యొక్క ఉద్దేశ్యము


 • మనము ధర్మశాస్త్రము వలన
 • శుద్ధీకరణ పొందగలమా?
 • లేదు, మనము పొందలేము. ధర్మశాస్త్రము
 • పాపమును గురించిన అవగాహన
 • మనకు కలుగజేయును.


హెబ్రీ 10:9లో ఈ విధముగా తెలుపబడినది. ‘‘ఆయన ` నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చియున్నాని చెప్పుచున్నాడు. ఇవన్నియు ధర్మశాస్త్రము చొప్పున అర్పింపబడుచున్నది. ఆ రెండవదానిని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేయుచున్నాడు.’’ మనము ధర్మశాస్త్రము వలన పరిశుద్ధపరచబడము. ధర్మశాస్త్రము మనలను పాపులుగా చేయును. మనము ధర్మశాస్త్రమునకు విధేయత చూపవలెనని దేవుడు ఆశించలేదు.

రోమా 3:20 ‘‘ధర్మశాస్త్రము వలన పాపమనగా ఎట్టిదో తెలుపుచున్నది. ‘‘దేవుడు ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రమునిచ్చెను. అబ్రహాముతో నిబంధన చేసిన తరువాత 430 సంవత్సరములకు మోషే ద్వారా ప్రజలకు ధర్మశాస్త్రము అనుగ్రహింపబడెను. ప్రజలు దేవుని యెదుట చేయు పాపము గురించిన అవగాహన వచ్చునట్లుగా ధర్మశాస్త్రము ఇవ్వబడినది. దేవుని ధర్మశాస్త్రము లేని యెడల, మానవులకు పాపమనగా నెట్టిదో తెలియదు. దేవుడు పాపము అనగా ఏమిటో తెలిసికొను నిమిత్తమై మనకు ధర్మశాస్త్రమును అనుగ్రహించెను.

దేవుని యెదుట మనము పాపులమని గ్రహించుటే ధర్మశాస్త్రము యొక్క ఉద్దేశ్యమైయున్నది. ఈ అవగాహనను బట్టి మనము ఆశీర్వాదకరమైన, తిరిగి జన్మింపజేయు నీరు మరియు ఆత్మ వలనైన సువార్త నందు విశ్వసించి ప్రభువైన యేసు నొద్దకు తిరిగి రాగలరని దేవుని ఆకాంక్ష. దేవుడనుగ్రహించిన ధర్మశాస్త్రములోని ఉద్దేశ్యమిదియే.దేవుని చిత్తమును నెరవేర్చుటకు యేసు అరుదెంచెను.


 • మనము దేవునియెదుట ఏమి
 • చేయవలెను?
 • యేసు ద్వారా దేవుడనుగ్రహించిన విమోచనను
 • నమ్మవలయును.


‘‘ఆయన` నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చియున్నానని చెప్పుచున్నాడు. ఇవన్నియు ధర్మశాస్త్రము చొప్పున అర్పింపబడుచున్నవి. ఆ రెండవ దానిని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేయుచున్నాడు. (హెబ్రీ10:9). మనము ధర్మశాస్త్రము వలన శుద్ధీకరణ పొందము. దేవుడు మనలను ధర్మశాస్త్రము నుండి విడిపింపలేదు. కాని ఆయన సంపూర్ణమైన విమోచనను అనుగ్రహించెను. దేవుడు ఆయన ప్రేమ మరియు న్యాయముచేతనే మనలను రక్షించెను.

‘‘యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారే అర్పింపబడుట చేత ఆ చిత్తము బట్టి మనము పరిశుద్ధపరచబడియున్నాము. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవచేయుచు, పాపములను ఎన్నటికిని తీసివేయలేని ఆ బలులనే మాటిమాటికి అర్పించుచు ఉండును. ఈయనయైతే పాపములనిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి, అప్పటి నుండి తన శత్రువులు తన పాదముకు పాదపీఠముగా చేయబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శమున ఆసీనుడాయెను.’’ (హెబ్రీ 10:10-12)

యేసు తనకప్పగింపబడిన విమెచన కార్యము సంపూర్ణ పరచెను. అందువలననే ఆయన దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడాయెను. ఆయన మరియొకసారి మన నిమిత్తమై బాప్తిస్మము పొందుట లేక మరణించుట చేయడు కాని, ఆయన ద్వారా మనము శాశ్వితముగా రక్షింపబడితిమి.

ఇప్పుడు లోకపాపమంతయు శుద్ధీకరింపబడినది. కనుక ఆయన యందు విశ్వసించువారికి నిత్యజీవము దొరుకునని తెలియపరచడమైనది. ఇప్పుడు ఈ నీరు మరియు ఆత్మసంబంధమైన రక్షణయందు విశ్వసించువారిని యేసు తన రక్షణలో ముద్రించి యుంచెను.

యేసు ఈ లోకమునకు దిగివచ్చి, ఈ లోకపాపమంతయు స్వీకరించి సిలువపైన మరణించి, తానువచ్చిన కార్యమును నెరవేర్చెను. ఇప్పుడు ప్రభువుకు అప్పగింపబడిన కార్యము నెరవేర్చబడియున్నది గనుక ఆయన దేవుని కుడిపార్శ్వమున కూర్చొనియున్నాడు.

ప్రభువైన యేసు మనలను నిత్యత్వము వరకు పాపము నుండి విమోచించెను. ఆయన పొందిన బాప్తిస్మము మరియు చిందించిన రక్తము వలన దేవుడు మనలను సంపూర్ణపరచెను.దేవునికి విరోధులుగా ఎవ్వరగుదురు?


 • దేవునికి విరోధులెవరు?
 • యేసును విశ్వసించినామని తెలియజేయుచు
 • ఇంకను హృదయములో
 • పాపము చేయుచున్న వారే.


హెబ్రీ 10:12-13లో ప్రభువు ఈలాగు సెలవిచ్చెను. ‘‘ఈయనయైతే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదముకు పాదపీఠముగా చేయబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడాయెను.’’ అఖరి తీర్పువరకు వేచియుందునని ఆయన తెలిపెను.

‘‘దేవా, నా పాపములను క్షమించండి’’ అని ఆయన విరోధులు కూడా తెలియజేసెదరు. అపవాది మరియు వాడి అనుచరులు ఈ నీరు మరియు ఆత్మ సంబంధమైన సువార్తను అంగీకరించక ఇంకను ప్రతిదినము క్షమాపణ కొరకు ఎదురుచూచుచుందురు.

మన ప్రభువైన దేవుడు మనకు ఇప్పుడు తీర్పు ఇయ్యడు. యేసుక్రీస్తు వారి రెండవ రాకడయందు వీరందరికి తీర్పు తీర్చబడి వారిని నరకములోనికి కొనిపోవును. దేవుడు వారిని కొంతవరకు సహించును. వారు ఏ నాటికైనా పశ్చాత్తాపపడి విమోచన ద్వారా నీతిమంతులగుదురని దేవుడు ఆశించెను.

మన ప్రభువైన యేసు మన పాపములన్నియు స్వీకరించి చనిపోయి ఆయన యందు విశ్వాసముంచినవారికి ఆశీర్వాదము దయచేయుచున్నాడు. ప్రభువైన యేసు అతిత్వరలో ఒకానొక దినమున తన రెండవ రాకడలో రానైయున్నాడు. ఆయన యందు విశ్వసించినవారిని కొనిపోవును. ‘‘ఓ దేవా, మీరు త్వరగా రండి’’. ఆయన రెండవ సారి వచ్చి పాపములేని వారిని సదాకాలము పరలోకములో ఉండుటకు తీసికొని పోవలయును.

ప్రభువైన యేసు మరల తిరిగి వచ్చునప్పుడు, ఇంకను పాపులమేనని విశ్వసించువారు పరలోకములో స్థానము పొందలేరు. వీరందరు చివరి దినములలో తీర్పుపొంది నరకాగ్నిలోనికి తోసివేయబడుదురు. ఈ నీరు మరియు ఆత్మ ద్వారా తిరిగి జన్మించు సువార్తను విశ్వసించకపోయిన యెడల వారికి శిక్ష ఎదురుచూచున్నది.

సత్యముకాని దానియందు విశ్వాసముంచువారిని ప్రభువు తన విరోధిగా యెంచుకొనెను. కనుక మనము ఈ అసత్యమునకు వ్యతిరేకముగా పోరాడవలయును. అందుకే ఈ నీరు మరియు ఆత్మ ద్వారా తిరిగి జన్మించు ఆశీర్వాదకరమైన సువార్తయందు మనమందరము విశ్వసించవలయును.

మనము నీరు మరియు ఆత్మసంబంధమైన తిరిగి జన్మింపచేయు ఆశీర్వదింపబడిన సువార్తయందు విశ్వసించవలయును.మనము నీరు మరియు ఆత్మ సంబంధమైన సువార్తనందు విశ్వసించవలయును.


 • ఇప్పుడు మన బాకీ (పాపములు)
 • సంపూర్ణముగ తీర్చబడియున్నది కనుక
 • ఇంకనూ మన పాపముల నిమిత్తమై
 • పరిహారము చెల్లించవలయునా?
 • లేదు. చెల్లింపనవసరము లేదు.

హెబ్రీ 10:15-16లో ఈ విధముగ తెలియజేయబడెను. ‘‘ఈ విషయమై పరిశుద్ధాత్మ కూడా మనకు సాక్ష్యమిచ్చుచున్నాడు. ఏలాగనగా ` ఆ దినములైన తరువాత నేను వారితో చేయబోవు నిబంధన ఇదే ` నా ధర్మవిధులను వారి హృదయము నుందుంచి వారి మనస్సు మీద వాటిని వ్రాయుదును.’’

ఆయన మన పాపములన్నియు తొలగించిన తరువాత ‘‘ఇది నేను వారితో చేయు నిబంధన’’ అని తెలియజేసెను. ఈ నిబంధన అనగా ఏమి? ‘‘నా ధర్మవిధులను వారి హృదయము నందుంచి వారి మనస్సుమీద వాటిని వ్రాయుదును. ‘‘మనము ధర్మశాస్త్రము ప్రకారము జీవించటానికి ప్రయత్నిస్తాము. అయితే ధర్మశాస్త్రము వలన మనము నిజముగా రక్షింపబడలేము.

ఆ తరువాత యేసు మనలను రక్షించెనని తెలిసికొంటిమి. ఎవరైతే ఈ నీరు మరియు ఆత్మ ద్వారా తిరిగి జన్మించు తమ హృదయములో ఈ ఆశీర్వాదకరమైన సువార్తను విశ్వసిస్తారో వారు రక్షింపబడతారు.

యేసు రక్షణకు ప్రభువైయున్నాడు. అపో.4:12 ‘‘మరి ఎవనివలనను రక్షణ కలుగదు; ఈ నాముననే మనము రక్షణ పొందవలెను గాని, ఆకాశము క్రింద మనుష్యులో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను.’’ యేసు మనకు రక్షకునిగా ఈ లోకమునకు వచ్చెను. మనము మన యొక్క క్రియల వలన రక్షింపబడలేము గనుక ఆయన మనలను రక్షించి, మన హృదయ ఫలకముపైన దానిని లిఖించి ఆయన ప్రేమ మరియు రక్షణాత్మకమైన న్యాయము వలన మనలను రక్షించెను.

హెబ్రీ 10:17-18 ‘‘`వారి పాపములను వారి అతిక్రమములను ఇకను ఎన్నటికిని జ్ఞాపకము చేసికొనను అని ప్రభువు చెప్పుచున్నాడు. వీటి క్షమాపణ ఎక్కడ కలుగునో అక్కడ పాపపరిహారార్ధ బలి యికను ఎన్నడును ఉండదు.’’

ఆయన మన యొక్క అవినీతి క్రియలను ఇక ఎన్నటికిని గుర్తుకు తెచ్చుకొనడు. యేసు ఇప్పుడు మన పాపములను తొలగించెను గనుక విశ్వాసులమైన మనలో క్షమించబడుటకు ఇక ఏ పాపములేదు. మన బాకీలు సంపూర్ణముగా చెల్లించబడ్డాయి. మనము తిరిగి చెల్లించుటకు ఏమియు లేవు. యేసుక్రీస్తు వారి ఈ పరిచర్యలో విశ్వాసముంచినచో ప్రజలు రక్షింపబడుదురు. యేసు మనలను ఆయన తీసుకున్న బాప్తిస్మము మరియు సిలువలో చిందించిన రక్తము ద్వారా రక్షించెను.

ఇప్పుడు మనము కేవలము ఈ నీరు మరియు యేసు రక్తమునందు విశ్వాసముంచితే చాలు. ‘‘యోహాను 8:32. ‘‘అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయును’’ యేసు అందించిన ఈ రక్షణ యందు విశ్వాసముంచవలయును. ఇప్పుడు విమోచన శ్వాస పీల్చుట కంటే సులభమైనది. నీవు కేవలము వున్నది వున్నట్లుగా విశ్వాసముంచిన చాలు. రక్షణ అనగా దేవుని వాక్యమునందు హృదయపూర్వకముగా విశ్వాసముంచటయే.

యేసు మన రక్షకుడని విశ్వసించి. (ఆయన పొందిన బాప్తిస్మము మరియు సిలువ మరణము ద్వారా) ఆ రక్షణ నీకు లభించినదని విశ్వసించుటయే సరిపోవును. నీ స్వంత ఆలోచనను తొలగించి కేవలము యేసుక్రీస్తు అందించిన రక్షణయందు నమ్మిక యుంచవలయును. మీరు నిజముగా యేసునందు విశ్వసించగలరని, తర్వాత ఆయన యందు నిత్యత్వములో నివసించెదరని, మీ నిమిత్తమై నేను ప్రార్థన చేయుచున్నాను.