Sermons

[11-1] < నిర్గమ కాండం 27:9-21 > ప్రత్యక్షపు గుడారంలో బయల్పరచిన పాపాత్ముల రక్షణ< నిర్గమ కాండం 27:9-21 >

‘‘మరియు నీవు మందిరమునకు ఆవరణము ఏర్పరచవలెను. కుడివైపు, అనగా దక్షిణ దిక్కున ఆవరణముగా నూరు మూరల పొడుగు గలదై పేనిన సన్న నార యవనికలు ఒక ప్రక్కకు వుండవలెను. దాని యిరువది స్తంభములును, వాటి యిరువది దిమ్మలును ఇత్తడివి. ఆ స్తంభముల వంకులును వాటి పెండెబద్దలును వెండివి. అట్లే పొడుగులో ఉత్తరదిక్కున నూరు మూర పొడుగు గల యవనికలుండవలెను. దాని యిరువది స్తంభములును వాటి యిరువది దిమ్మలును ఇత్తడివి. ఆ స్తంభముల వంకులను వాటి పెండె బద్దలును వెండివి. పడమటి దిక్కున ఆవరణపు వెడల్పుకొరకు ఏబది మూరల యవనికలుండవలెను. వాటి స్తంభములు పది, వాటి దిమ్మలు పది. తూర్పు వైపున, అనగా ఉదయ దిక్కున ఆవరపు వెడల్పు ఏబది మూరల. ఒక ప్రక్కను పదునైదు మూరల యవనికులుండవలెను. వాటి స్తంభములు మూడు, వాటి దిమ్మెలు మూడు, రెండవ ప్రక్కను పదునైదు మూరల యవనికలుండవలెను. వాటి స్తంభము మూడు, వాటి దిమ్మలును మూడు, ఆవరణపు ద్వారమునకు నీల ధూమ్ర రక్తవర్ణములుగల యిరువది మూరల తెరయుండవలెను. అవి పేనిన సన్ననారతో చిత్రకారుని పనిగా వుండవలెను. వాటి స్తంభములు నాలుగు. వాటి దిమ్మలు నాలుగు. ఆవరణము చుట్టున్న స్తంభము లన్నియు వెండి పెండె బద్దలు కలవి. వాటి వంకులు, వెండివి, వాటి దిమ్మెలు ఇత్తడివి. ఆవరణపు పొడుగు నూరు మూరలు. దాని వెడల్పు ఏబది మూరలు. దాని యెత్తు అయిదు మూరలు అవి పేనిన సన్నని నారవి. వాటి దిమ్మెలు ఇత్తడివి మందిర సంబంధమైన సేవోపకరణములన్నియు మేకులన్నియు ఆవరణపు మేకులన్నియు ఇత్తడివై యుండవలెను.

‘‘మరియు దీపము నిత్యము వెలిగించునట్లు ప్రదీపమునకు దంచితీసిన అచ్చము ఒలీవల నూనె తేవలెనని ఇశ్రాయేలీయుల కాజ్ఞాపించుము. సాక్ష్యపు మందసము ఎదుటనున్న తెరకు వెలుపల ప్రత్యక్షపు గుడారములో అహరోనును, అతని కుమారులును సాయంకాలము మొదలుకొని ఉదయము వరకు యెహోవా సన్నిధిని దాని సవరింపవలెను. అది ఇశ్రాయేలీయులకు వారి తరతరముల వరకు నిత్యమైన కట్టడ’’.ప్రత్యక్షపు గుడారపు ఆవరణ కంచె 100 మూరల పొడవు వుంది. బైబిల్లో మూర అంటే ఒక వ్యక్తి మోచేతి నుండి అతని వేలిచివరి వరకు. అది నేటి కొలమానంలో సుమారు 45సెం.విూ. అలా ప్రత్యక్ష గుడారపు కంచె 100 మూరల పొడవు అంటే సుమారు 45 విూ. వెడల్పు 50 మూరులు అంటే సుమారు 22.5విూ. విశాలం గలది. పాత నిబంధన కాలంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజల మధ్య నివసించిన యింటి పరిమాణం ఉంది.ప్రత్యక్ష గుడారపు బాహ్యవరణం చుట్టూ కంచె వుంది


ప్రత్యక్ష గుడారపు మాదిరి తైలవర్ణ చిత్రంగాని, బొమ్మగాని విూరెప్పుడైనా చూశారా? ప్రత్యక్షపు గుడారం అనగా దేవుని యిల్లు అన్ని భాగాలుగా విభజించారు. ఈ దేవుని యింటిలో అనగా ప్రత్యక్షపు గుడారంలో చిన్న గర్భాలయం అన్న చిన్న నిర్మాణం వున్నది. ఈ గర్భాలయం నాలుగు వివిధ మూతలతో మూయబడి వుంటుంది. నీలధూమ్రరక్తవర్ణాల దారాలతో పేనిన సన్నని నారబట్టతో ఒకవైపు మూసి వుంటుంది. మరో ప్రక్క మేక వెంట్రుకలతో పేనిన సన్నని నారబట్ట మరొ ఎరుపురంగు అద్ధకం చేసిన గొర్రె చర్మం; మరొ ప్రక్క నీటి కుక్క చర్మంతో మూయబడి వుంటుంది. 

ప్రత్యక్షపు గుడారానికి తూర్పువైపున నీలధూమ్ర రక్తవర్ణాల దారాలలో పేనిన సన్నని నారబట్టగల ఆవరణ ద్వారం వుంది. ఈ ద్వారంలో ప్రవేశించగానే దహనబలిపీఠం, పెద్దతొట్టెను దాటితే మనం ప్రత్యక్షపు గుడారాన్ని చూస్తాం. ప్రత్యక్షపు గుడారాన్ని పరిశుద్ధ స్థలం, దేవుని నిబంధనా మందసం వున్న అతి పరిశుద్ధ స్థలంగా విభాగించారు. ప్రత్యక్ష గుడారపు ఆవరణను 60 స్తంభాలతో తెల్లని సన్నని నారబట్ట తెరతో నిర్మించారు. దేవుడు దాని బాహ్య ఆకారపరిమాణం ద్వారా మనకేమి చెబుతున్నాడో కనీస సామాన్య జ్ఞానం కలిగి వుండాలి. 48 పలకలతో నిర్మించిన ప్రత్యక్షగుడారం లోపల దేవుడు నివసిస్తాడు. దేవుడు ప్రత్యక్షపు గుడారంపైన పగలు మేఘస్తంభంగాను, రాత్రి అగ్ని మేఘ స్తంభంగాను తన సన్నిధిని ఇశ్రాయేలీయులకు ప్రత్యక్షపరచుకొన్నాడు. దేవుడు నివసించే గర్భాలయంలో దేవుని మహిమ నాడి వుంటుంది. పరిశుద్ధ స్థలంలో సముఖపు రొట్టె బల్ల, దీపస్తంభం, ధూప వేదిక వున్నాయి. అతి పరిశుద్ధ స్థలం లోపల నిబంధనా మందసం, కరుణా పీఠం వున్నాయి. ఇవి ఇశ్రాయేలీయులలో సామాన్య ప్రజలు వెళ్ళరాని స్థలాలు : ప్రత్యక్ష గుడారపు విధానం ప్రకారం యాజకులు, ప్రధాన యాజకుడు మాత్రమే ఈ స్థలాలలో ప్రవేశించాలి.

‘‘ఇవి ఈలాగు ఏర్పరచబడినప్పుడు యాజకులు సేవచేయుచు, నిత్యమును ఈ మొదటి గుడారములోనికి వెళ్ళుదురు గాని, సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడొక్కడే రక్తము చేత పట్టుకొని రెండవ గుడారములోనికి ప్రవేశించును. ఆ రక్తము తన కొరకును, ప్రజల అజ్ఞాన కృతముల కొరకును అతడర్పించును’’ (హెబ్రి 9:6-7). దీనిని బట్టి నేటి యుగంలో ఎవరైతే విశ్వాసం కలిగి, నీరు ఆత్మ సువార్తను నమ్ముతూ దేవుని సేవిస్తూ జీవిస్తారో వారు మాత్రమే జీవిస్తారు అని తెలియ జేస్తోంది.

సుముఖపు రొట్టె బల్ల విూద వుంచిన రొట్టె అర్థం ఏమిటి? అది దేవుని వాక్యానికి సాదృశ్యం. మరి ధూపవేదిక అర్ధం ప్రార్థనలను తెలియజేస్తుంది. అతిపరిశుద్ధ స్థలంలో స్వచ్ఛమైన బంగారంతో చేసిన కరుణాపీఠం, నిబంధనా మందసం పైన పెట్టి వుంటుంది. దానిపైన కెరూబులు తమ రెక్కలను చాపి దానికెదురుగా మరొకటి కరుణా పీఠం వైపు చూస్తు వుంటాయి. ఇది దేవుడు కృపను యిచ్చే కరుణా పీఠం ` నిబంధనా మందసంలో పది ఆజ్ఞలను చెక్కిన రెండు పలకలు, చిగురించిన అహరోను చేతి కర్ర, మన్నాతో నిండివున్న గిన్నె వుంటాయి. మందసం (కరుణాపీఠం) బంగారపు పూతపూసి చేయబడింది. దానిపై నుండి క్రిందికి కరుణా పీఠాన్ని చూస్తున్న కెరూబులున్నాయి.పాపక్షమాపణ పొందినవారు ఎక్కడ ఉంటారు?


పాపక్షమాపణ పొందిన వారు గర్భాలయంలో నివసిస్తారు. పరిశుద్ధ స్థలంలో బంగారు పూతతో చేయబడిన 48 తాళ్ళతో నిర్మించబడ్డాయి. అదెంతో తేజస్సుతో ప్రకాశిస్తూ వుంటుంది. గర్భాలయం లోపల, దాని ఉపకరణాన్ని స్వచ్ఛమైన సువర్ణంతో చేయబడ్డాయి. తేజస్సుతో ప్రకాశిస్తూ వుంటాయి.

ప్రత్యక్ష గుడారపు బాహ్యావరణంలోని దహన బలిపీఠం, నీళ్ళ తొట్టె ఇత్తడితో చేయబడ్డాయి. ఆవరణపు కంచె స్తంభాలు వెండి తెల్లని నారబట్టతో పేనిన వాటితో కప్పబడి వుంటాయి. దీనికి భిన్నంగా గర్భాలయంలోని ఉపకరణాలన్నీ బంగారంతో చేసినవి. దీపస్తంభం బంగారంతో చేసినది. అలాగే సముఖపు రొట్టె బల్ల కూడా బంగారంతో చేసినదే. గర్భాలయంలోని అన్ని వస్తువులు, దాని మూడు వైపుల వున్న గోడలు మేలిమి బంగారంతో చేయబడి, ఆ లోపల బంగారు కాంతితో మెరుస్తూ వుంటుంది.

అలా బంగారు కాంతితో ప్రకాశించే గర్భాలయం లోపల రక్షణ పొందిన పరిశుద్ధులు వారి విశ్వాసంతో దేవుని మందిరంలో నివసిస్తూ వుంటారు. నీరు ఆత్మ సువార్తలో విశ్వాసంతో నివసించే పరిశుద్ధలు గర్భాలయంలో కనిపించే మేలిమి బంగారం వంటివారు. గర్భాలయంలో నివసించే పరిశుద్ధుల జీవితం దేవుని వాక్యంతో పోషించబడుతూ, దేవుని ప్రార్థిస్తూ, ఆయన్ను స్తుతిస్తూ, ప్రతిరోజూ దేవుని సింహాసనం ముందుకు వెళ్తూ, ఆయన కృపా వస్త్రాన్ని ధరించి సంఘంలో నివసించే ధన్యమైన జీవితం గల వారు. ఇది గర్భాలయంలోని జీవితం, నీరు ఆత్మ సువార్త ద్వారా రక్షణ పొందిన నీతిమంతులు మాత్రమే గర్భాలయంలోని ఈ విలు వైన విశ్వాస జీవితాన్ని జీవిస్తారని మీరు తెలుసుకోవాలి.గర్భాలయ లోపల బాహ్య భాగాలను దేవుడు స్పష్టంగా వేరు పరచాడు


చాలా యిళ్లకు చుట్టూ కంచె వున్నట్టే, ప్రత్యక్షపు గుడారపు ఆవరణకు కూడా 60 స్తంభాలు, వాటినావరించి తెల్లని నారబట్ట తెరలతో కూడి కంచె వుంది. ఆవరణ తూర్పు భాగంలో నీలధూమ్ర రక్తవర్ణదారాలతో సన్నని నారతో పేనిన 9 మీ. వెడల్పు గల ద్వారం వుంది.

ప్రత్యక్షపు గుడారాన్ని గూర్చి అధ్యయనం చేసేటప్పుడు మన నుండి దేవుడు కోరే గొప్ప విశ్వాసమేమిటో, రక్షణ పొందిన వారి విశ్వాసం ఎలాంటిదో, ప్రత్యక్షపు గుడారానికి వాడిన వస్తువుల ద్వారా దేవుడు మనలను ఎలా రక్షించాడో మనం స్పష్టంగా తెలుసుకోవాలి. గర్భాలయాన్ని ఆవరించి వున్న బంగారు కాంతితో వున్న విశ్వాసమేమిటో తెలుసుకోడానికి మొదటగా మనం నీళ్ళ తొట్టెను, దహన బలిపీఠాన్ని, ప్రత్యక్ష గుడారాపు బాహ్య ఆవరణకేర్పాటు చేసిన కంచె, వాటికి వుపయోగించిన వస్తువులన్నిటిని గూర్చి జాగ్రత్తగా పరిశీలించి తెలుసుకోవాలి. అలా తెలుసుకొన్నప్పుడు బంగారపు మెరుపుతో ప్రకాశించే గర్భాలయంలో ప్రవేశించడానికి ఎలాంటి విశ్వాసం అవసరమో తెలుస్తుంది.

ప్రత్యక్షపు గుడారం బాహ్య ఆవరణలో నీళ్ళ తొట్టె, దహన బలిపీఠం వున్నాయి. దాని చుట్టూ 60 కొయ్య స్తంభాలున్నాయి. ఈ స్తంభాల మీద ఆవరణ కంచెగా సన్నని నారబట్ట తెరలు వున్నాయి. ఈ ఆవరణ స్తంభాలు గట్టిగా వున్నా తేలికగా వుండే తుమ్మకర్రతో చేసినవి. ఈ తుమ్మకర్ర స్తంభాలు సాధారణ ఎత్తులో వుంటే ఎక్కువ మంది బయటి నుండి లోపలికి తొంగిచూడకుండా వుండేట్టు వాటి నిడివి సుమారు 2.25 మీ. ఎత్తు వుండాలి. వీటికి బదులు వేరు వాటినుపయోగిస్తే ఎవరైనా బయటి నుండి తొంగి చూడ్డానికి అవకాశం వుంది. కనుక ఆ అవకాశం లేకుండా వుండేందుకు వీటినే వాడాలి. దీనిని బట్టి సొంత ప్రయత్నాలతో దేవుని రాజ్యంలో ఎన్నటికి ప్రవేశించలేమని తెలుస్తుంది.

ఈ కొయ్య స్తంభాలు అడుగున ఇత్తడి అమరికలు వుంచి, వాటిపై భాగాలకు వెండి ఉంగరాలకు అమర్చాలి. స్తంభాలు వాటంతట అవి నిలువవు గనుక వాటిని ఒకదానితో ఒకదానిని వెండి కట్టు కొక్కెలతో జతచేయాలి. ఆ స్తంభాలు స్థిరంగా నిలిచి వుండడానికి స్తంభాలకు పొదిగిన వెండికొక్కాలను ఇత్తడి మేకులను తాళ్ళతో కట్టాలి. (నిర్గమ 35:18)ప్రత్యక్షపు గుడార ద్వారానికి ఉపయోగించిన వస్తు సముదాయం?


ప్రత్యక్ష గుడారపు ఆవరణ ద్వారానికి నీలధూమ్ర రక్త వర్ణదారాలతో పేనిన సన్నని నారబట్టను ఉపయోగించారు. ద్వారం ఎత్తు 2.25 మీ. వెడల్పు సుమారు 9 మీ. దాని తెర నీలధూమ్ర రక్త వర్ణాల దారం పేనిన సన్నని నారబట్ట నాలుగు స్తంభాలకు వ్రేలాడుతూ వుంటుంది. అది అలా వున్నందు వలన ఎవరైనా స్త్రీగాని, పురుషుడు గాని గుడారపు ఆవరణలో ప్రవేశించగానే దాని ద్వారాన్ని సులభంగా కనుగొంటారు.

దేవుని కుమారుడైన యేసు నాలుగు కార్యాల ద్వారా మన పాపాలన్నిటి నుండి మనలను రక్షిస్తాడని ప్రత్యక్ష గుడారపు ద్వారానికి ఉపయోగించిన నీల ధూమ్ర రక్తవర్ణాల దారం పేనిన సన్నని నారబట్ట ద్వారా ప్రత్యక్ష పరుస్తున్నాడు దేవుడు. ప్రత్యక్ష గుడారపు ఆవరణ కంచెకున్న 60 కొయ్యస్తంభాలు, తెల్లని సన్నని నారబట్టద్వారా దేవుడు తన కుమారుడైన యేసు ద్వారా ఏ విధంగా మన పాపాల నుండి రక్షిస్తాడో అని స్పష్టంగా తెలియజేస్తున్నాయి.

ప్రత్యక్షగుడారపు బాహ్య ఆవరణ ద్వారా రక్షణ మర్మాన్ని దేవుడు మనకు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. అందుకని ప్రత్యక్షగుడారపు ఆవరణ ద్వారానికి ఉపయోగించిన వస్తు సముదాయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. యేసును నమ్ముట ద్వారా మనం రక్షణ పొందడానికి ఈ నాలుగు దారాలు ఎంతో ముఖ్యమైనవి. ఈ వస్తుసముదాయానికి ప్రాముఖ్యమైనవి కాకపోతే యింత వివరంగా బైబిలు వాటిని నమోదు చేసి వుండేది కాదు.

నన్ను, నిన్ను రక్షించడానికి ప్రత్యక్ష గుడారపు ఆవరణకు ఉపయోగించిన వస్తు సముదాయమంతా తప్పనిసరిగా దేవునికి అవసరం. ద్వారానికి ఉపయోగించిన ఈ నాలుగు దారాలు పాపాత్ములను రక్షించడానికి దేవుని పరిపూర్ణ రక్షణను తెలియజేస్తున్నాయి. గనుక వాటికి ఎంతో ప్రాముఖ్యత వున్నది. అందుకనే దేవుడు వాటిని నిర్ణయించాడు. ఇందుకొరకే దేవుడు సీనాయి కొండ మీద మోషేకు ప్రత్యక్ష గుడారపు మాదిరిని చూపించి దాని ప్రకారం ప్రత్యక్షపు గుడారపు ద్వారాన్ని తయారు చేయమని చెప్పాడు.నీలధూమ్ర రక్త వర్ణాల దారం, పేనిన సన్నని నారల అర్థం ?


పరిశుద్ధ స్థలపు ద్వారపు తెర పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి మధ్య నున్న తెర నీల ధూమ్ర రక్తవర్ణాల, పేనిన సన్నని నార అనే ఈ నాలుగు దారాలతో నేసినవి. ఇవే గాక ప్రధాన యాజకుడు ధరించే ఎఫోదు, రొమ్మున వుండే పతకం కూడా వీటితోనే నేశారు. ఈ నాలుగు మనలను రక్షించడానికి దేవునికి అవసరమని అవి తెలియజేస్తున్నాయి. కనుక వాటిని క్షుణ్ణంగా పరిశీలించాలి.

మొదటిగా, నీలవర్ణపు దారం, యేసుక్రీస్తు బాప్తిస్మాన్ని తెలియజేస్తుంది. బాప్తిస్మపు ప్రాముఖ్యత తెలియని వారికి నీలం దారం యేసుక్రీస్తు బాప్తిస్మాన్ని వివరిస్తున్నదని తెలియదు. కనుక తిరిగి పుట్టని వారు ‘‘దేవుడైన యేసుక్రీస్తు మానవ శరీరధారియై ఈ లోకానికి వచ్చాడు’’ అవి ఆ నీలం దారం అర్ధమని సాధారణంగా చెబుతారు. ఇతరులు నీలం దారం అంటే ‘‘వాక్యం’’ అని చెబుతారు. కాని‘‘యేసు ఈ లోకానికి వచ్చిన తర్వాత తన బాప్తిస్మం ద్వారా లోకపాపాలను తన విూదికి తీసుకొని వాటిని తనవిగా అంగీకరించాడని’’ నీలం దారం తెలియజేస్తున్నదని బైబిలు మనకు తెలియజేస్తున్నది. బాప్తిస్మమిచ్చు యోహాను ద్వారా యేసు తీసుకొన్న బాప్తిస్మాన్ని నీలం దారం తెలియజేస్తున్నదని లేఖనాలు వివరిస్తున్నాయి. ప్రత్యక్షపు గుడారానికి సంబంధించిన వాక్యాన్ని నేను చదివినప్పుడు దీని ద్వారా ‘‘బాప్తిస్మంలో మన విశ్వాస ప్రాముఖ్యతను మనకు దేవుడు తెలియజేస్తున్నాడు’’ అని నాకు అర్థమైంది. 

ప్రధాన యాజకుడు బలియర్పణలు అర్పించేటప్పుడు నీలం దారంతోనేసిన అంగీనే ధరిస్తాడు. ప్రధాన యాజకుని తలపాగాకు వేలాడే బంగారు పతాకానికి కట్టె తాడు కూడా నీలం వర్ణందే. ఆ బంగారు పతకం విూద ‘‘దేవునికే పరిశుద్ధత కలుగును గాక’’ అని చెక్కి వుంటుంది. కాగా ప్రధాన యాజకుని తలపాగా మీది బంగారు పతకం యేసు బాప్తిస్మం దేవునికే పరిశుద్ధత కలుగును గాక’’ అని అది స్పష్టంగా ప్రత్యక్షపరుస్తోంది.

ఈ విధంగా పాగాకు కుట్టిన బంగారు పతకం ద్వారా నిజమైన రక్షణను గూర్చి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరో మాటల్లో చెప్పుకుంటే మనకు పరిశుద్ధతనిచ్చే ఇరుసు చీల నీలందే. ఇది యేసు బాప్తిస్మం. నీలం రంగు నీలాకాశాన్ని మనకు జ్ఞాపకం చేసినా, నీలం దేవుని ఒక్కణ్ణే గాక నీల ధూమ్ర రక్త వర్ణాల దారంతో పేనిన సన్నని నారబట్ట అంటే యేసుక్రీస్తు బాప్తిస్మం అనడంలో సందేహం లేదు. మరోవిధంగా చెప్పుకొంటే ` ఈ లోకంలోని అందరి పాపాలను తన బాప్తిస్మం ద్వారా యేసుక్రీస్తు తనపైకి తీసుకొన్నాడు అని (మత్తయి 3:15) బాప్తిస్మం ద్వారా యేసు ప్రతి ఒక్కరి పాపాలను తన మీదికి తీసుకొనకుంటే విశ్వాసులమైన మనం ‘‘దేవునికి పరిశుద్ధతను కలిగించలేము.’’ యేసుక్రీస్తు బాప్తిస్మాన్ని తీసుకొనకపోతే దేవుని ముందు మనమెన్నటికి పరిశుద్ధ వస్త్రాన్ని ధరించలేము.

మోషేకు చూపిన ఆకారం ప్రకారం ప్రత్యక్ష గుడారపు ఆవరణ ద్వారాన్ని నీలం దారంతో నేయమని దేవుడిచ్చిన ఆజ్ఞలోని అర్థం మీకు తెలుసా? దేవుడు నివసించే ప్రత్యక్షపు గుడారానికి నడిపే ఆవరణ ద్వారం యేసుక్రీస్తును వివరిస్తున్నది. యేసుక్రీస్తు ద్వారా గాక ఎవరు పరలోకరాజ్యంలో ప్రవేశింపలేరు. యేసుక్రీస్తుకు ప్రతీక అయిన ఆవరణ ద్వారం మనలను రక్షణకు నడుపుతుందని దేవుడు మనకు తెలియజేయడానికి ఆ ద్వారాన్ని నీల ధూమ్ర రక్తవర్ణాల దారం, పేనిన సన్నని నారబట్టతో నేయబడిందని స్పష్టమవుతోంది. ధూమ్ర వర్ణదారం పరిశుద్ధాత్మకు సూచన, ‘‘యేసు రాజు రాజు” అని ఆ పరిశుద్ధాత్మ మనకు తెలియ జేస్తున్నాడు. సిలువ విూద యేసు కార్చిన రక్తాన్ని సింధూర వర్ణపు దారం (రక్త వర్ణ దారం) వివరిస్తోంది. ఇంతకు ముందే చెప్పుకొన్నట్లు నీల వర్ణదారం బాప్తిస్మమిచ్చు యోహాను ద్వారా యేసుపొందిన బాప్తిస్మాన్ని వివరిస్తూ వుంది.

కాగా నీలధూమ్ర రక్తవర్ణాల దారాలు యేసు బాప్తిస్మాన్ని దేవుని నరావతారాన్ని, సిలువ విూద ఆయన మరణాన్ని తెలియజేస్తున్నాయి. ఈ మూడు దారాలలో ప్రత్యక్షపరబడిన యేసు కార్యాలు మనం పరిశుద్ధతతో (పవిత్రతతో) యెహోవా దేవుని సన్నిధికి వెళ్ళగలిగే యోగ్యతను కలిగిస్తున్నాయి. యేసు తానే దేవుడు, మానవ శరీరధారియై ఈ లోకానికి వచ్చాడు. బాప్తిస్మం ద్వారా పాపాత్ముల అపరాధాలనన్నింటిని తన విూదికి తీసుకొన్నాడు, దానికి ప్రత్యామ్నాయంగా (బదులుగా) తన రక్తాన్ని కార్చి పాపశిక్షను, శాపాలను భరించాడన్నదే నీలధూమ్ర రక్తవర్ణాల దారాల ఆధ్యాత్మిక మర్మమని తెలుస్తున్నది.

నీలపు దారం కేవలం దేవుని, లేక ఆయన వాక్య ప్రత్యక్షతని ఇంతవరకు విూరనుకొనివుండవచ్చు. కాని ఆ నీలపు దారం యేసుక్రీస్తు బాప్తిస్మాన్ని సూచిస్తున్నదని యిప్పుడు స్పష్టంగా తెలుసుకొన్నారు. బాప్తిస్మం ద్వారా యేసు అంగీకరించిన మన పాపాలన్నీ ఆయన మీదికి వెళ్ళాయి. ఆయన తన కార్యాలను విడిచి పెట్టలేదన్నది ప్రాముఖ్యమైన విషయం. అలా, పాత నిబంధనలోని ప్రత్యక్షపు గుడార ప్రాధాన్యతలను దేవుడు మనకు చెబుతున్నాడు.బాప్తిస్మం ద్వారా యేసు మన పాపాలను భరించాడు


ప్రత్యక్షపు గుడారపు కంచె స్తంభాలు తుమ్మకర్రతో చేశారు. ఈ స్తంభాల అడుగున ఇత్తడి కొక్కాలను, వాటిపై భాగాన వెండి తొడుగును అమర్చారు. దీని వలన పాపాత్ములు తమ పాపాలకు తీర్పు తీర్చబడతాదని మొదటిగా తెలుస్తున్నది. తమ పాపాల నిమిత్తం ఒకసారి తీర్పు పొందిన వారు రక్షణ పొందుతారు. ఇంకా తీర్పు పొందక రక్షణ పొందని వారు దేవుని ముందుకు వెళ్ళినప్పుడు నిత్యశిక్షను అనుభవిస్తారు.

“పాపమునకు జీతం మరణం” (రోమా 6:23) అని రాయబడినట్లు పాపాత్ములు తమ పాపాల నిమిత్తం దేవుని భయంకరమైన తీర్పుకు లోనవుతారు. కాగా పాపాత్ములు వారి పాపాలకు ఒకసారి దేవుని తీర్పును పొందిన, ఆయన కృపా వస్త్రాన్ని ధరించి మరల జీవిస్తారు. దీనినే తిరిగి పట్టడం అని అంటారు. బాప్తిస్మం ద్వారా యేసు మన పాపాలనన్నింటిని ఆయన విూదకు తీసుకొన్నాడన్న నీలం దారంలోని విశ్వాసం, యేసు సిలువ విూద తీర్పు పొంది పాపాత్ములనందరిని తెలియజేస్తోంది. తమ అపనమ్మకం వలన, విశ్వాసంతో తీర్పు పొందలేదు గనుక వారి కొరకు నిత్యశిక్ష ఎదురుచూస్తున్నదని తెలుసుకోవాలి.

బాప్తిస్మమిచ్చు యెహాను బాప్తిస్మం ద్వారా యేసు మన పాపాలనన్నింటిని భరించి మన పాపాల నుండి మనలను రక్షించాడు. యేసే దేవుడు అయినా మనలను రక్షించడానికి మానవునిగా ఆయనీలోకానికి వచ్చాడు. మానవుల ప్రతినిధిగా యోహాను బాప్తిస్మం ద్వారా పాపాత్ముల అపరాధాలనన్నింటిని తన విూదికి తీసుకొని పాపాత్ములకు బదులుగా తన శరీరాన్ని సిలువకు అప్పగించి, నీరును, రక్తాన్ని కార్చాడు. రక్షకునిగా యేసు నెరవేర్చిన కార్యాలను ప్రత్యక్షగుడారపు ఆవరణ ద్వారం విశదంగా వివరిస్తోంది. దీని ద్వారా యేసు పాపాత్ముల రక్షకుడైనాడని దేవుడు మనకు స్పష్టంగా చెబుతున్నాడు.

పేనిన సన్నని నార పాత కొత్త నిబంధనలోని వాక్యాన్ని ఒకదానితో మరొక దానిని కలుపుతూ, ఇంత వివరంగా తెలియజేస్తోంది. ఈ సన్నని నారను పేనడానికి ప్రతి ఒక్క పోగు మిశ్రంగా పురిపెట్టబడింది. పురిపెట్టబడిన ఈ సన్నని నార ద్వారా మనలను ఎలా రక్షించాడో వివరంగా చెబుతున్నాడు దేవుడు.

తివాచీను వివిధ దారాలతో నేసినట్టు మనం చూస్తాం. ఇలాగే నీల ధూమ్ర రక్త వర్ణాల దారాలను సన్నని నారతో పేనిన ప్రత్యక్షపు గుడార ఆవరణ ద్వారాన్ని చేసినట్టు దేవుడు ఇశ్రాయేలీయులతో చెప్పాడు. నీటి ద్వారా (బాప్తిస్మం ద్వారా), రక్తం (సిలువ), పరిశుద్ధాత్మ (యేసే దేవుడు) ద్వారా మన దగ్గరకు వచ్చిన యేసే మన రక్షణ ద్వారమని దేవుని వాక్యంలో దాగివున్న సత్యం. దేవుని వాక్యం బయల్పరుస్తున్న దాని ద్వారా యేసుక్రీస్తులో సరైన విశ్వాసం కలిగి ఆయన ప్రేమను పొంది, యిప్పుడు మనం పూర్తిగా రక్షణ పొందాం. 

యేసుక్రీస్తు ఆకస్మాత్తుగా మనలను రక్షించలేదని ప్రత్యక్ష గుడారాన్ని చూసినప్పుడు మనం తెలుసుకోగలం. యేసు ఎంతో శ్రమపడి పాపాత్ములను రక్షించాడు. ప్రత్యక్ష గుడారాన్ని కంచె స్తంభాలను గూర్చి తెలుసుకొన్నప్పుడు యేసు ఎంత శ్రమపడి మనలను రక్షించాడో మనం అర్ధం చేసుకోగలం. కంచెకు 60 స్తంభాలెందుకు? ఎందుకంటే 6 అంకె మానవుని సూచిస్తుంది. 3 అంటే దేవుని సూచిస్తుంది. ప్రకటన 13 అధ్యాయంలో 666 సంఖ్య కనిపిస్తుంది. ఈ సంఖ్య మృగానిదని, జ్ఞానం గల వారు ఈ సంఖ్య మర్మాన్ని తెలుసుకొంటారని దేవుడు చెప్పాడు. కనుక 666 సంఖ్య సూచనగా గల వ్యక్తి దేవునిలా వ్యవహరిస్తాడు. మానవుల కోర్కెలు ఏమిటి? పరిపూర్ణ దైవ వ్యక్తిగా అవ్వాలని కాదా? మనం దైవిక జీవులుగా కావాలంటే మనం యేసులో నమ్మకముంచి, తిరిగి జన్మించి దేవుని పిల్లలమవ్వాలి. 60 స్తంభాలు ఈ ఆంతర్యాన్ని వివరిస్తున్నాయి.

అయితే విశ్వాసాన్ని కలిగి వుండడానికి బదులు మానవులు తమని గూర్చి డంబాలు చెప్పుకొంటూ, తమ స్వంతప్రయత్నాల ద్వారా పాపపు కార్యాల ద్వారా దైవ స్వభావంలో పాలిభాగస్తులు కావాలని ప్రయత్నిస్తున్నారు. కేవలం యిందు వల్లనే అనగా విశ్వాసం లేక దేవునికి వ్యతిరేకమైన తమలోని అత్యాశ కనుగుణంగా దేవుని వాక్యానికి వివరణ చెబుతూ, మానవ ఆలోచనలతో అపనమ్మకంతో ప్రవర్తిస్తున్నారు. ఈ శరీరేచ్ఛల వలన తమకు తామే పరిశుద్ధులం కావాలని ప్రయత్నిస్తూ వారి శరీరేచ్ఛలను తీర్చుకొంటే, దేవుని వాక్యం నుండి తొలగిపోయి నశించిపోతున్నారు.ప్రత్యక్షపు గుడారపు అన్ని వస్తువులలో తెలియ జేయబడిన రక్షణ వాక్యం


పాపాత్ములను రక్షించడానికి, వారిని గుడిలోనికి ఆకర్షించడానికి ప్రత్యక్ష గుడారంలో అన్ని ఉపకరణాలు, వస్తువులు అవసరం. దహనబలి పీఠం అవసరం. స్తంభాలు, ఇత్తడి గుండీలు, వెండి దిమ్మెలు కొక్కాలు, వెండి పట్టీలు, లేక బందులు అన్నీ అవసరమే. ఇవన్నీ గర్భాలయానికి బయట కనిపించే ఉపకరణాలు. ఒక పాపాత్ముని నీతిమంతునిగా మార్చడానికి ఇవన్నీ, వాటి సామాగ్రి అవసరం.

పాపాత్ములు దేవుని రాజ్యంలో ప్రవేశించి, దానిలో నివసించేట్టు చేయడానికి యివన్నీ అవసరమే. వాటన్నిటిలో అతి ముఖ్యమైనది. నీలం దారం (యేసుక్రీస్తు యొక్క బాప్తిస్మం) ప్రత్యక్షపు గుడార ద్వారాన్ని చేయడానికి నీలం ధూమ్రరక్త వర్ణాల దారాలు వాడారు. మనం దేవుని నమ్మినప్పుడు యేసు మనకు చేయాల్సిన మూడు కార్యాలను ఈ దారాలు సూచిస్తున్నాయి. మొదటిది : యేసు ఈ లోకానికి వచ్చి తన బాప్తిస్మం ద్వారా మన పాపాలనన్నింటిని తానే తన విూదికి తీసుకొన్నాడు. రెండవది : యేసు దేవుడు. మూడోది : యొర్దాను నదిలో యోహాను యిచ్చిన బాప్తిస్మం ద్వారా సమస్త పాపశిక్షను యేసు తీసుకొని, సిలువ విూద చనిపోవడానికి అంగీకరించాడు. పాపాత్ములు రక్షణ పొంది, నీతిమంతులుగా కావడానికి యిది అవసరమైన సరైన విశ్వాస క్రమం.

మనం బైబిలు చదివినప్పుడు మన ప్రభువు ఎన్ని చిక్కులు అనుభవించాడో తెలుసుకోగలుగుతాం. సన్నని నారలోని ప్రతి పురిలా ఎంతో శ్రమపడి మనలను రక్షించిన వ్యక్తి దేవుడు తప్ప మరొకరు కాదని మనం స్పష్టంగా తెలుసుకోగలుగుతాం. ఇంకా, 9విూ. పొడవు గల నీలం ధూమ్ర రక్తవర్ణా సన్నని నారను ప్రత్యక్షపు గుడారపు ఆవరణ ద్వారానికి నేయమని దేవుడు ఇశ్రాయేలీయులకు చెప్పాడు. అలా ఎవరైనా సరే దూరం నుండైనా ప్రత్యక్షపు గుడారాన్ని చూస్తే దాని ద్వారాన్ని తెలుసుకోగలుగుతారు.

ప్రత్యక్షపు గుడారపు ఆవరణ స్తంభాలపై వ్రేలాడే తెల్లని సన్నని నారబట్ట దేవుని పరిశుద్ధతను తెలియజేస్తాయి. అలా నీలధూమ్ర రక్త వర్ణాల దారాలతో ప్రత్యక్ష గుడారపు ఆవరణ ద్వారానికి పేనిన సన్నని నార ప్రత్యక్షపరిచే యేసు పరిచర్యను నమ్మి రక్షణ పొందిన వారు మాత్రమే ఆ ఆవరణలో ప్రవేశించగలరని, పాపాత్ములు ప్రత్యక్ష గుడారాన్ని సవిూపించడానికి కూడా సాహసించలేరని మనం స్పష్టంగా తెలుసుకోగలుగుతాం. ఈ విధంగా యేసుక్రీస్తు నీటి ద్వారా, రక్తం ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా పాపాత్ముల పాపాలన్నింటిని కడిగివేశాడని పాపాత్ములు తెలుసుకొనేట్టు చేశాడు దేవుడు.

పాపాత్ములను నీతిమంతులుగా మార్చడానికి ఇదే కాదు. ప్రత్యక్షగుడారం ఏర్పడటానికి అవసరమైన ప్రతి వస్తువు, దాని ద్వారంతో సహా దేవుని కెంత అవసరమో వాక్యం మనకు తెలియజేస్తుంది. ప్రత్యక్షపు గుడార ఆవరణ ద్వారం ప్రతి ఒక్కరు తెలుసుకోగలిగేట్టు దానిని పెద్దదిగా తయారు చేయమని దేవుడు ఇశ్రాయేలీయులకు చెప్పాడు గనుక ఈ ద్వారం నీల ధూమ్ర రక్తవర్ణాల దారాలతో సన్నని నారతో ఎంతో కష్టపడి పేనమన్నాడు గనుక పాపాత్ములను నీతిమంతులుగా మార్చగల వాక్యం ఎంత ముఖ్యమైనదో అందరూ స్పష్టంగా అర్థం చేసుకోగలిగేట్టు చేశాడు దేవుడు.

తుమ్మకర్ర లాంటి పాపం నుండి మనలను నీలం దారం ద్వారా (యేసు బాప్తిస్మం ద్వారా), రక్తవర్ణ దారం ద్వారా (సిలువలో కార్చిన రక్తం ద్వారా), ధూమ్ర వర్ణ దారం ద్వారా (యేసే దేవునిగా) దేవుడే పూర్తిగా రక్షించాడని ప్రత్యక్షపు గుడార ఆవరణ ద్వారా తెలియజేస్తోంది. ఈ విషయాన్ని ఎవరైతే పూర్తిగా నమ్ముతారో వారే దేవుని ఇల్లయిన మందిరంలో ప్రవేశించగలరని దేవుడు నిర్ణయించాడు.యేసుక్రీస్తు మనకు చెబుతున్నాడు


సువర్ణంలా ప్రకాశించే విశ్వాస జీవితాన్ని జీవించాలంటే యేసు బాప్తిస్మం ద్వారా మన పాపాల నుండి కడుగబడి ప్రభువు ముందుకు రావాలని దేవుడు చెబుతున్నాడు. ఇందుకనే దేవుడే ప్రత్యక్ష గుడారపు మాదిరిని మోషేకు చూపించాడు. మోషే ద్వారా దానిని నిర్మించాడు. ఈ ప్రత్యక్ష గుడారపు నియమాల ద్వారా ఇశ్రాయేలీయులు పాప విమోచన పొందేటట్టు చేశాడు. ప్రత్యక్షపు గుడార ఆవరణ ద్వారా మనలను ఆలయం లోనికి తీసుకొని వెళ్ళిన విశ్వాసాన్ని గూర్చి పునశ్చరణ చేసుకొందాం. యేసు నీరు, రక్తం, పరిశుద్ధాత్మ అన్న సత్యాన్ని యేసులో మన విశ్వాసాన్ని గూర్చి ప్రత్యక్షగుడారం ద్వారా దేవుడు యింకా మనతో మాట్లాడుతూనే వున్నాడు. ఆవరణ ద్వారం నీల ధూమ్ర రక్తవర్ణ దారాలతో పేనబడినదని, బలిపశువుపై ప్రధాన యాజకుడు చేతులుంచుట, బలిపశువు రక్తాన్ని చిందించడంలో విశ్వాసం, ప్రధాన యాజకుడు ఏ విశ్వాసంతో గంగాళం దగ్గర తన కాళ్ళను, చేతులను కడుగుకొనడం ఇవన్నీ కూడా నీరు, ఆత్మ సువార్తలో మన విశ్వాసమే మనం ఆలయంలో ప్రవేశించేట్టు, అక్కడ మహిమలో జీవించు బంగారు అవకాశాన్ని కలిగిస్తుంది.

ప్రత్యక్షపు గుడారం ద్వారా మనమందరం దేవుని కృపారక్షణను, ఆయన దీవెనలను పొందే అవకాశాన్నిచ్చాడు. ఈ ప్రత్యక్షపు గుడారం ద్వారానే దేవుడు మన విూద కుమ్మరించిన దీవెనలను తెలుసుకోగలం. దేవుని కృపా సింహాసనం ముందుకు వెళ్ళి ఆ క్షణంలో రక్షణను పొందగలిగే కృప ఉన్నదని తెలుసుకుని ఆ కృపారక్షణను నమ్మాలి. ప్రత్యక్షపు గుడారం ద్వారా ఎంతో శ్రమపడి దేవుడు మిమ్ములను నన్ను రక్షించాడని, మన రక్షణ ప్రణాళికను సిద్ధపరచడానికి ఆయనెంత కష్టపడ్డాడో, ఆ ప్రణాళిక ప్రకారం పాపాత్ములమైన మనలను నీతిమంతులుగా తీర్చడానికి ఆయనెంతగా నెరవేర్చాడో విూరు గ్రహించారా?

ఇప్పటి వరకు యేసును సందిగ్ధంగా నమ్ముతున్నారా? నీలం రంగు కేవలం ఆకాశమే అని నమ్ముతున్నారా? ధూమ్ర రక్తవర్ణాలు రాజుల రాజైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి, సిలువలో చనిపోయి మనలను రక్షించాడన్న విశ్వాసానికి చిహ్నాన్ని విూరు నమ్ముతున్నారా? నమ్మితే, నిజమైన విశ్వాసాన్ని తెలుసుకోవలసిన సమయం యిదే. విూరందరూ నీల వర్ణం యేసు బాప్తిస్మానికి చిహ్నమని దాని వలన దేవుడు మనం లెక్కించలేనంత కృపా రక్షణను అనుగ్రహించాడని విూకు తెలుసునని నేను నమ్ముతున్నాను.

రక్తం, పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే దేవుడు మనలను రక్షించలేదు. నీల ధూమ్ర రక్త వర్ణాలను గూర్చి దేవుడు స్పష్టంగా వివరిస్తున్నాడు. ఈ మూడు దారాల ద్వారా యేసు మనలను ఎలా రక్షించాడో దేవుడు ఖచ్చితంగా చెబుతున్నాడు. ప్రత్యక్షపు గుడారం ద్వారా యేసు రక్షణ కార్యాలను దేవుడు వివరంగా చూపిస్తున్నాడు. ప్రత్యక్ష గుడార నిర్మాణం తర్వాత, దేవుడు మనలను ఎలా రక్షించబోతున్నాడో మోషేతో చెప్పాడు. యేసుక్రీస్తు మానవునిగా వచ్చి, యొర్దాను నది నీటిలో (నీలం రంగు) బాప్తిస్మం పొందుట ద్వారా మన పాపాలన్నింటిని తనపైకి తీసుకొన్నాడు. తన బాప్తిస్మం ద్వారా యేసు పాపాత్ముల నందరినీ వారి పాపాల నుండి రక్షించాడు. కాగా మన రక్షణ ఎంత కష్టతరమైంది, ఎంత సరైనది. ఎంత నిశ్చయమైనదో తెలుస్తుంది.

ప్రత్యక్ష గుడారంలోని పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించినప్పుడు మనం దీపస్తంభాన్ని, సుముఖపు రొట్టె బల్లను, ధూపవేదికను చూస్తాం. అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించక ముందు వాక్యమనే రొట్టె ద్వారా మన హృదయం సంతృప్తి చెందిన తర్వాత బంగారు ఛాయలో ప్రకాశించే పరిశుద్ధ స్థలంలో కొంచెం సేపు వుందాం. దేవుని రాజ్యంలో ప్రవేశించక ముందు వాక్యమనే రొట్టె ద్వారా మన హృదయం సంతృప్తి చెందిన తర్వాత బంగారు ఛాయలో ప్రకాశించే పరిశుద్ధ స్థలంలో కొంచెం సేపు వుందాం. దేవుని రాజ్యంలో ప్రవేశించక ముందు నీరు, ఆత్మలనే సువార్త ద్వారా తిరిగి పుట్టి పూర్తిగా రక్షణ పొందిన వారిగా ఆయన మందిరంలో (సంఘంలో) మనం నివసిద్దాం. అదెంత ధన్యకరమైంది? మనకు జీవాహారాన్నిచ్చే దేవుని మందిరమే పరిశుద్ధ స్థలం.

పరిశుద్ధ స్థలమైన దేవుని మందిరంలో దీపస్తంభం, సముఖపు రొట్టెబల్ల, ధూప వేదిక వున్నాయి. దీపస్తంభం, దాని తిన్నని పొడుగాటి భాగం, దాని శాఖలు, గిన్నెలు, ఆభరణ గుబ్బలు, పుష్పాలు అన్నీ ఒకే బంగారు ముక్క ద్వారా చేయబడినవి. ఒకే బంగారు కనిక ద్వారా సుత్తితో ఈ విధంగా చేయబడిన ఆ దీపస్తంభం ` నీతిమంతులమైన మనం దేవుని సంఘంతో ఐక్యంగా వుండాలని చెబుతోంది.

సముఖపు రొట్టె బల్ల విూద, పులియని రొట్టెలను వుంచుతారు. అది ఈ లోక అసహ్య బోధలు, చెడునుండి మనలను స్వతంత్రులనుగా చేసే దేవుని పరిశుద్ధ వాక్యాన్ని సూచిస్తుంది. దేవుని మందిరం లేక సంఘం దేవుని గర్భాలయం, పులవని లేక పులియజేయని పదార్థం లేని పిండి వంటి దేవుని వాక్యాన్ని బోధిస్తూ, దేవుని దృష్టిలో చెడు చేయకుండా నిర్మలమైన విశ్వాసంతో జీవించడాన్ని సూచిస్తుంది.

అతి పరిశుద్ధ స్థలం తెర ముందు ధూపవేదిక వుంది. ధూప వేదిక అంటే దేవుని ప్రార్థించే చోటు మనం ఐక్యత కలిగి వుండాలి. ఆయన వాక్యంలో విశ్వాసం కలిగి వుండాలి. అప్పుడు ప్రార్థన చేస్తూ ఆయన ముందుకు వెళ్లాలని మందిరంలోని ఉపకరణాలన్నిటి ద్వారా దేవుడు మనకు చెబుతున్నాడు. దేవుడు నీతిమంతుల ప్రార్థననే వింటాడు. (యెషయా 59:1-2, యాకోబు 5:16) కనుక నీతిమంతులు మాత్రమే ప్రార్థించగలరు. దేవుని ముందు అలా ఎవరు ప్రార్థిస్తారో వారే దేవుని కలుసుకోగలరు.

ఈ విధంగా దేవుని మందిరంలో రక్షణ పొందడం ఎంత మహిమ గలదో పరిశుద్ధ స్థలం మనకు చెబుతోంది. ప్రత్యక్షపు గుడారానికి ఉపయోగించిన ముఖ్య వస్తువులు - నీల వర్ణపుదారం (యేసు బాప్తిస్మం పొందాడని), రక్తవర్ణదారం (తన బాప్తిస్మం ద్వారా మన పాపాలన్నింటిని తన విూదికి తీసుకొని, మన పాపశిక్షను యేసు భరించి, సిలువ విూద మరణించాడు). ధూమ్ర వర్ణపు దారం (యేసు దేవుడని) మనం విశ్వాసాన్ని పొందడంలో తప్పిపోమని తెలియజేస్తున్నాయి. ఈ మూడు మన విశ్వాసాన్ని కడుతున్నాయి. యేసు దేవుని కుమారుడని, దేవుడే ఈ రూపంలో వున్నాడని, ఆయన మనలను రక్షించాడని నమ్మినప్పుడు బంగారు ఛాయలో ప్రకాశించే దేవుని నివాసమైన పరిశుద్ధ స్థలంలో మనం ప్రవేశిస్తాం. ఈ మూడు వర్ణాలలో ప్రత్యక్షపరచిన యేసు కార్యాలను మనం నమ్మకపోతే, మనం యేసును ఎంతగా నమ్మినా, పరిశుద్ధ స్థలంలో ప్రవేశించలేము. క్రైస్తవులైన వారందరూ అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించరు.అపార్థపు విశ్వాసంతో ప్రత్యక్ష గుడారపు ఆవరణంలో వుండేవారు


నేడు చాలామంది క్రైస్తవులు తమ విశ్వాసాన్ని బహిరంగంగా ప్రకటిస్తున్నా పరిశుద్ధ స్థలంలో ప్రవేశించలేకపోతున్నారు. మరోమాటల్లో చెప్పుకుంటే చాలా మంది తమకున్న గుడ్డి నమ్మకంతో రక్షణ పొందాలని ప్రయత్నిస్తున్నారు. అలాంటి వారెవరంటే ` యేసుక్రీస్తు రక్తంలో నమ్మకముంచి, ఆయనే దేవుడని, రాజుల రాజని నమ్మితే మేము రక్షణ పొందుతామని నమ్మేవారు. వారు యేసును గుడ్డిగా నమ్ముతారు. యేసు రక్తంలో మాత్రమే నమ్మకముంచి, దహనబలిపీఠముందు నిలిచి, గుడ్డిగా యిలా ప్రార్థిస్తారు, ‘‘ప్రభువా, నేనింకా పాపాత్మునిగానే వున్నాను. నన్ను క్షమించు ప్రభూ, నా స్థానంలో సిలువ వేయబడి, చనిపోయినందుకు నీకు వందనాలు, ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను’’ అని.

ఇలా ఉదయం ప్రార్థన చేసి తమ మామూలు జీవితానికి వెళ్లారు. సాయంత్రం మళ్లీ దహనబలిపీఠం దగ్గరకు తిరిగివచ్చి యిదే ప్రార్థనచేస్తారు. ప్రతి ఉదయం, సాయంత్రం, నెలల తరబడిగా యిలా చేసేవారు తిరిగి పుట్టినవారు కారు. వారి తలంపు ప్రకారం మిధ్యానమ్మకంలో (భ్రమలో) వుంటారు.

వారు తమ బలియర్పణను దహన బలిపీఠం విూద ఎర్రగా వుండేట్టు దహిస్తారు. ఆ మంటలో కాలిన మాంసం వాసన ఆ ప్రదేశమంతా వ్యాపిస్తుంది. నల్లని, తెల్లని పొగ వ్యాపిస్తుంది. దహన బలిపీఠం మన పాపాలు మాయమైపోయేట్టు చేయమని దేవునికి మొర్రపెట్టే చోటు కాదు. కాని అది వాస్తవానికి నరకాగ్నిని మనకు జ్ఞాపకం చేసే భయంకరమైన అగ్ని అది. 

అయినా, ప్రజలు ప్రతి ఉదయం, సాయంకాలం ఈ స్థలానికి వెళ్ళి, ‘‘ప్రభువా, నేను పాపం చేశాను. దయ చేసి నా పాపాలు క్షమించు’’ అని అడుగుతూ వుంటారు. ఆ ప్రార్థన చేసి తమ పాపాలు క్షమించబడ్డాయని వారంతట వారే అనుకొని యింటికి తిరిగి వెళ్తారు. ‘‘నేను క్షమించబడ్డాను, నీవు క్షమించబడ్డావు. మనమందరం క్షమించబడ్డామని’ఆనందంగా పాటలు పాడుకొంటారు. అంతలోనే మళ్ళీ పాపం చేస్తారు. దహనబలిపీఠం ముందుకు వస్తారు. ‘‘ప్రభువా, నేను పాపిని అని ప్రార్థన చేస్తారు”. అలా దహణ బలిపీఠం ముందు యేసులో వారు ప్రకటించిన విశ్వాసంతో సంబంధం లేకుండా తమ పాపాన్ని తగ్గించుకోవాలనుకొనేవారు యింకా పాపాత్ములుగానే వుంటారు. అలాంటి వారు పరిశుద్ధమైన దేవుని రాజ్యంలోనికి ఎన్నడూ ప్రవేశించరు.

మరి తమ పాపాలకు పూర్తి క్షమాపణ పొంది దేవుని పరిశుద్ధ స్థలంలో ఎవరు ప్రవేశిస్తారు. దేవుడేర్పరచిన నీలధూమ్ర రక్తవర్ణాల దారాల మర్మాన్ని తెలుసుకొని, దానిని నమ్మిన వారే దేవుని పరిశుద్ధ స్థలంలో ప్రవేశించగలరు. దీనిని నమ్మినవారు, తమ పాపాలను యేసు అంగీకరించాడని, అవి ఆయన మీదికి వెళ్ళాయని తమ విశ్వాసం ద్వారా నమ్మి, గంగాళం దగ్గర తమ కాళ్లు చేతులు కడుగుకొని, యేసు బాప్తిస్మం ద్వారా తమ పాపాలన్ని ఆయన మీదికి వెళ్లాయని ఎవరు జ్ఞాపకం చేసుకొంటారో వారు దేవుని పరిశుద్ధ స్థలంలో ప్రవేశిస్తారు. ఎవరైతే నీరు, ఆత్మ సువార్తను నమ్మి, తమ పాప క్షమాపణ పొందుతారో వారి విశ్వాసం దేవుడు ఆమోదిస్తాడు. వారు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు.

నీలవర్ణపుదారం అంటే యేసు బాప్తిస్మమన్నది బైబిలు అర్ధమని మీరు గ్రహించి, నమ్ముతున్నారని నేను నమ్ముతున్నాను. నేడు చాలామంది యేసును నమ్ముతున్నామని బహిరంగముగా ఒప్పుకొంటున్నామంటారు కాని కొద్దిమందే నీటిని (నీలపుదారాన్ని) యేసు బాప్తిస్మాన్ని నమ్మేంత వరకు వెళ్తారు. గొప్ప దుఃఖాన్ని కలిగించే విషయమేమిటంటే తమ క్రైస్తవ నమ్మకంలో ముఖ్యాంశమైన బాప్తిస్మాన్ని విడిచి పెడతారు. చివరికి యేసు దేవునిగా ఈ లోకానికి వచ్చి సిలువమీద చనిపోలేదన్న విషయాన్ని కూడా విస్మరిస్తారు. అందుకని, యిప్పటికైనా మీరు నీల ధూమ్ర రక్తవర్ణాల దారాలను తెలుసుకొని, వాటి విశ్వాసాన్ని నమ్మి దేవుని రాజ్యంలో ప్రవేశించేవారు కావాలని ఆశిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను.ప్రత్యక్షపు గుడారపు నీలధూమ్ర రక్త వర్ణాల దారంలో ప్రత్యక్ష పరచిన ప్రభువును మనం నమ్మాలి. దాని అసలైన భావమే మనలను రక్షిస్తుంది.


మన ప్రభువు మిమ్మును, నన్ను రక్షిస్తాడు. మనం ప్రత్యక్ష గుడారాన్ని చూసినప్పుడు ఎంత క్లిష్టమైన పద్ధతితో మనలను దేవుడు రక్షించాడో మనం తెలుసుకోగలుగుతాం. దీనికి తగినంతగా మనం ఆయనకు కృతజ్ఞతలు తెలియజేయలేము. నీలధూమ్ర రక్త వర్ణాల దారాల ద్వారా మనలను రక్షించి, వాటిలో విశ్వాసం కలిగే నమ్మకాన్నియిచ్చేందుకు మనమాయన కెంతో కృతజ్ఞతగల వారమై వుండాలి.

పాపాత్ములు దేవుని కృపావస్త్రాన్ని ధరించకుండా, వారి పాపాలకు భయంకరమైన ఆయన తీర్పు పొందకుండా పరిశుద్ధ స్థలంలో ప్రవేశించలేరు. ఒక వ్యక్తి (ఆమె/అతడు) తన పాపాలకు తీర్పు పొందకుండా ప్రత్యక్ష గుడారపు ద్వారం తెరచి పరిశుద్ధ స్థలంలో ఎలా ప్రవేశించగలడు? ప్రవేశించలేరు. ఒకవేళ అలాంటివారులోన ప్రవేశిస్తే మొదటి మెరుపుతోనే వారు గ్రుడ్డివారవుతారు. ‘‘అక్కడ ఎంతో కాంతివంతంగా వుంటుంది. అక్కడ వెలుగులో నేనేమి చూడలేకపోతున్నాను. నేను లోపల ప్రవేశించకముందనుకొన్నాను, నేను లోపలికి ప్రవేశిస్తే ఆ పరిశుద్ధ స్థలంలోని సమస్తాన్ని చూడగలనని. నేనెక్కడేవిూ ఎందుకు చూడలేకపోతున్నాను? అక్కడింత చీకటిగా ఎందుకుంది? ఈ పరిశుద్ధ స్థలానికి బయట వున్నప్పుడు నేనన్నీచూడ గలిగాను గదా? పరిశుద్ధ స్థలం ఎంతో ప్రకాశమానంగా వుంటుందని చెప్పారు. కాని యిక్కడింత చీకటిగా ఎందుకయింది?’’ ధూమ్ర రక్తవర్ణాల దారంలో విశ్వాసం లేదు గనుక, వారు ఆధ్యాత్మికంగా గుడ్డివారు. కనుక వారు దానిని చూడలేరు. ఇలా పాపాత్ములు పరిశుద్ధ స్థలం లోనికి ఎన్నటికీ ప్రవేశించలేరు.

పరిశుద్ధ స్థలంలో మనం గ్రుడ్డి వారం కాకుండా ఎల్లప్పుడు పరిశుద్ధ స్థలంలో నివసించే శక్తిని మన ప్రభువు మనకిచ్చాడు. ప్రత్యక్షపు గుడారంలోని ప్రతి నాల్గవ నీల ధూమ్ర రక్తవర్ణాల దారంతో పేనిన సన్నని నార కనిపించేట్టు చేసి సరైన రక్షణ పద్ధతిని మనకు తెలియజేసి, తన వాక్య ప్రవచనం ద్వారా మన పాపాలన్నింటిని నుండి మనలను విమోచించాడు.

మనం గ్రుడ్డి వారం కాకుండా, ప్రకాశించే ఆయన కృపలో సదాకాలం నివసించునట్లు మన ప్రభువు నీరు, రక్తం, పరిశుద్ధాత్మ ద్వారా మనలను రక్షించాడు (1 యోహాను 5:4-8) ఆయన నీల ధూమ్ర రక్త వర్ణాల దారాలతో పేనిన సన్నని నార ద్వారా ఆయన మనలను రక్షించాడు. చక్కని దేవుని వాక్యంతో మన ప్రభువు వాగ్ధానం చేసి, ఆ వాగ్ధానాన్ని నెరవేర్చుట ద్వారా మనలను రక్షించానని ఆయన చెప్పాడు.

నీలి ధూమ్ర రక్త వర్ణదారాలతో, పేనిన సన్నని నారలో యేసు ప్రత్యక్షపరచిన చిక్కైన కార్యాల ద్వారా మీరు, నేను రక్షణ పొందామని మీరు నమ్ముతున్నారా? ఆకస్మాత్తుగా మనం రక్షణ పొందామా? లేదు. నీల ధూమ్ర రక్త వర్ణాలలో నమ్మకం లేకపోతే మనం రక్షణ పొందలేము.

నీలం దారం దేవుని గూర్చి చెప్పదు. అది బాప్తిస్మం తీసుకొనుట ద్వారా ఈ ప్రపంచంలోని ప్రతి ఒక్క పాపాత్ముని పాపాలను తన మీదికి తీసుకొనడాన్ని వివరిస్తుంది. దహన బలిపీఠం తర్వాత వున్న నీటి గంగాళం దగ్గరకు ప్రజలు చేరవచ్చు. కాని దేవుడు నివసించే పరిశుద్ధ స్థలంలోనికి వారు ప్రవేశించలేరు. నీరు, ఆత్మ సువార్తను పూర్తిగా నమ్మి తమ పాపాలకు క్షమాపణ పొందారో ఆ దేవుని పిల్లలు మాత్రమే ద్వారం తెరచి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించగలరు. కాని పాపాత్ములు, వారెవరైనప్పటికి ఎన్నటికి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించలేరు. అలాంటప్పుడు, మనం రక్షణ పొందడానికి, లోపలికి ప్రవేశించడానికి ఎంత దూరంలో వున్నాం? మనం ప్రత్యక్ష గుడారంలో ప్రవేశించినంత మాత్రాన గాక, దేవుడు వుండే పరిశుద్ధ స్థలంలో ప్రవేశించినప్పుడే మనం రక్షణ పొందగలం.

ప్రత్యక్ష గుడారం బాహ్య ఆవరణలోని దహన బలిపీఠం, నీటి గంగాళం ఇత్తడితో చేసినవి. దాని ఆవరణపు కంచె చెక్క, వెండి, ఇత్తడితో చేసినవి. అయితే మనం ప్రత్యక్షపు గుడారంలో ప్రవేశిస్తే అక్కడి వస్తువులన్ని పూర్తిగా బయటి వాటికి భిన్నమైనవి. ప్రత్యక్షపు గుడారానికి కీలకమైన క్షణం ` అది ‘‘బంగారంతో చేసిన యిల్లు’’. మూడు ప్రక్కల వున్న గోడలు 48 తుమ్మచెక్క పలకలచే నిర్మించబడ్డాయి. వాటన్నిటికి బంగారు మాలామా (పూత) చేశారు. సముఖపు రొట్టె బల్ల, దూపవేదిక కూడా తుమ్మచెక్కతో చేసి బంగారు పూత పూసినవే.దీప స్తంభం బంగారాన్ని కరిగించి నిపుణుడైన పనివాడు చేసింది. అలా పరిశుద్ధ స్థలంలోని ఉపకరణాలన్నీ మేలిమి బంగారంతో చేసినవో లేక మేలిమి బంగారు పూతపూసినవో.

మరో ప్రక్క ఈ చేసిన పలకలను నింపడానికి క్రింద వుండే దిమ్మెలు వెండితో చేసినవి. ప్రత్యక్ష గుడారపు ఆవరణ కంచె స్తంభాల దిమ్మెలు ఇత్తడితో చేసినవి. ఆవరణ కంచె స్తంభాలు తుమ్మకర్రతో చేసి బంగారు మాలామా చేసినవి. ప్రత్యక్ష గుడారపు ద్వారపు అయిదు స్తంభాలు దిమ్మెలు ఇత్తడితో చేసినవి.

ప్రత్యక్ష గుడారపు పలక దిమ్మెలు వెండితో చేసినవైనా ప్రత్యక్ష గుడారపు ద్వారపు దిమ్మెలు ఇత్తడితో పోతపోసినవి. అంటే దీని అర్ధం దేవుని సన్నిధికి ఎవరు వచ్చినా అతడు, లేక ఆమె పాపాల నిమిత్తం తీర్పు తీర్చబడాలి. మనం తీర్పు పొంది మరణ దండన పొందితే యిక దేవుని ముందుకు ఎలా వెళ్లగలం? మనంతట మనం చనిపోతే దేవుని ముందుకు వెళ్లలేము.

మన పాపాల కోసం మనం తీర్పు పొందినా, తన బాప్తిస్మం ద్వారా యేసు మన పాపాలను తనపైకి తీసుకొని వాటి నిమిత్తం మన స్థానంలో ఆయన శిక్ష అనుభవించాడని ప్రత్యక్ష గుడార ద్వారానికి ఉపయోగించిన అయిదు ద్వారాలకుపయోగించిన యిత్తడి దిమ్మెల ద్వారా దేవుడు మనకు చెబుతున్నాడు. మన పాపాలకు శిక్ష అనుభవించివలసింది మనమే. కాని మన స్థానంలో మన పాపశిక్షనంతటిని మరొకరు భరించారు. మనకు బదులుగా మరొకరు చనిపోయారు. మన స్థానంలో శిక్షించబడి, చనిపోయిన వారు యేసు క్రీస్తే.

నీలం దారం ప్రత్యక్షపరిచే విశ్వాసం ఏమిటంటే, యేసుక్రీస్తు మన పాపాలనన్నింటిని అంగీకరించి, తన బాప్తిస్మం ద్వారా వాటిని తనపైకి తీసుకొని మన పాపాల నుండి మనలను క్షమించాడని మన పాపాల నిమిత్తం దేవుడు యేసుక్రీస్తును శిక్షించి ఆయన ప్రాణాన్ని తీసుకొనుట ద్వారా మన పాపాల నుండి మనలను క్షమించాడు. ఇక మన పాపాల నిమిత్తం మనమెలాంటి శిక్షను ఎదుర్కొనం. యేసుక్రీస్తు మన స్థానంలో మనం ఎదుర్కొనవలసిన శిక్షననుభవించి సిలువలో తన రక్తాన్ని కార్చాడన్న విశ్వాసాన్ని రక్తవర్ణపు దారం ప్రత్యక్షపరుస్తోంది.

యేసు బాప్తిస్మంలో నమ్మకంతో తమ పాపాలన్ని ఆయన మీద వేసినవారు, ఈ పాపాల కోసం యేసు తీర్పు పొంది సిలువమీద శారీరకంగా చనిపోయి తన రక్తాన్ని కార్చాడని నమ్మినవారు మాత్రమే పరిశుద్ధ స్థలంలో ప్రవేశిస్తారు. ఈ కారణంగానే ప్రత్యక్ష గుడారపు ద్వారం దిమ్మెలు యిత్తడితో చేయబడ్డాయి. ఈ విధంగా తన బాప్తిస్మం ద్వారా మన పాపాలనన్నింటిని తనమీదికి తీసుకొని మన స్థానంలో శిక్షపొంది సిలువమీద క్రీస్తు రక్తం కార్చాడని మనం నమ్మాలి.

తమను రక్షించిన యేసుక్రీస్తు దేవుడని (ధూమ్ర వర్ణదారం) యేసు బాప్తిస్మం (నీలం దారం) తమ స్థానంలో తమకు బదులు తమ పాపాల నిమిత్తం యేసు శిక్షించబడ్డాడన్న సత్యాన్ని నమ్మినవారే పరిశుద్ధ స్థలంలో ప్రవేశించగలరని దేవుడు నిర్ణయించాడు. యేసును నమ్మి తమ పాపాల కోసం తీర్పు పొందినవారు, యేసు తమ పాపాల నుండి తమను రక్షించాడని ఎవరు నమ్ముతారో వారు పరిశుద్ధ స్థలంలో ప్రవేశించడానికి దేవుడు అనుమతించాడు.

ప్రత్యక్ష గుడారపు ద్వారం స్తంభాలు దిమ్మెలు యిత్తడితో పోతపోసినవి. ఇత్తడి దిమ్మెలో వున్న ఆధ్యాత్మిక భావం ఏమిటంటే, ఆదాము నుండి వంశ పారంపర్యంగా పాపాత్ములుగా పుట్టిన వారందరూ, వారెవరైనా సరే, నీల వర్ణం దారంలో (యేసు బాప్తిస్మంలో), రక్తవర్ణదారంలో (పాపాత్ముల స్థానంలో యేసు పొందిన తీర్పు), ధూమ్రవర్ణదారం (యేసుదేవుడు)లో విశ్వాసముంచేవారిని పరిశుద్ధ స్థలంలో ప్రవేశించేందుకు దేవుడు అనుమతిస్తాడు. ఇత్తడితో చేసిన ప్రత్యక్ష గుడారపు ద్వారం దిమ్మలు రోమా 6:23లోని దేవుని సువార్తను చెబుతున్నాయి. ‘‘ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తుయేసునందు నిత్యజీవము.’’ మన పాపాలనన్నింటిని యేసు నీరు, రక్తం, ఆత్మ ద్వారా క్షమించి వేశాడు.మనం వాక్యాన్ని, దేవుని అలక్ష్యం చేయక నమ్మాలి.


యేసును నమ్మినంత మాత్రాన మీరు ఏ షరతు లేకుండా రక్షణ పొందుతారని అర్ధం కాదు. లేక మీరు క్రమంగా సంఘారాధనకు హాజరవుతున్నందు వలన మీరు తిరిగి పుట్టారని అర్ధం కాదు. కాని ఎవరైతే నీరు, ఆత్మల ద్వారా తిరిగి పుడతారో వారు మాత్రమే దేవుని రాజ్యాన్ని చూడగలరు. దానిలో ప్రవేశించగలరని యోహాను 3వ అధ్యాయంలో మన ప్రభువు చెప్పాడు. యూదుల నాయకుడు, దేవునిలో నమ్మకమున్న విశ్వాసియైన నికోదేముతో ‘‘నీవు యూదుల బోధకుడవు. అయినా ఎలా తిరిగి పుట్టావో తెలియదా? స్త్రీ గాని, పురుషుడు గాని, నీరు, ఆత్మ ద్వారా తిరిగి పుడితేనే గాని దేవుని రాజ్యాన్ని చూడలేరు, దానిలో ప్రవేశించలేరు’’ అని నిశ్చయంగా చెప్పాడు. నీల వర్ణం దారంలో (యేసు బాప్తిస్మం పొందినప్పుడు యేసు మన పాపాలనన్నింటిని తన విూదికి తీసుకొన్నాడని), రక్తవర్ణదారంలో (యేసు మన పాపాల కోసం చనిపోయాడని), ధూమ్ర వర్ణదారంలో (యేసే రక్షకుడు, దేవుడు, దేవుని కుమారుడని) ఎవరు విశ్వసిస్తారో వారు తిరిగి పుడతారు. అలా ప్రత్యక్షపు గుడారంలోని ప్రతి పాతిక భాగంలోనూ చూసే నీల ధూమ్ర రక్త వర్ణాల దారాల ద్వారా యేసు పాపుల రక్షకుడు అని ప్రతి పాపాత్ముడు నమ్మాలి.

ఈ సత్యాన్ని నమ్మక యేసును నమ్మే అనేకమంది తిరిగి పుట్టరు, లేక తిరిగి పుట్టాలన్న వాక్యాన్ని ఎరుగరు. మనం యేసుక్రీస్తును నమ్ముతున్నామని బహిరంగముగా ప్రకటించినా, మనం తిరిగి పుట్టకపోతే, మనం తండ్రి రాజ్యం అయిన పరిశుద్ధ స్థలంలోకి ఎన్నటికి ప్రవేశించలేము, లేక విశ్వాస జీవితాన్ని గడపలేము.

యేసును ఎవరు, ఎలా నమ్మినా క్రైస్తవులందరిలో తిరిగి పుట్టిన వారిగా అంగీకరిస్తే ఎంత బాగుండునని మన మానవ ఆలోచనలో మనం ఆలోచిస్తాం. ఆయన మానవజాతిని రక్షించడానికి ఏమి చేశాడో తెలియకుండానే కేవలం ఆయన నామమున మొరపెట్టి, మాటల్లో ఆయన విూద మన నమ్మకాన్ని ఒప్పుకొన్నందు వలన రక్షణ పొందితే అది ఎంతో సులభమైన విషయంగా ప్రజలు భావిస్తారు. మనమొక కొత్త క్రైస్తవుని కలుసుకొన్నప్పుడల్లా ‘‘నేను క్షమాపణ పొందాను, నీవు క్షమాపణ పొందావు, మన మందరం మన పాపాల నుండి క్షమాపణ పొందాం’’ అని పాడుతూ, అతనికి కృతజ్ఞతలు తెలియజేస్తాం. విశ్వాసులు చాలా మంది వుంటారు గనుక ఇందులో సాక్ష్యానికి సంబంధించిన దేముంది? ఇలాంటి పరిస్థితులు బాగానే వుంటాయి. ఇదే పరిస్థితి అయితే ప్రభు నామమున ఎవరు మొరపెడితే వారు రక్షణ పొందుతారు. వారు తమ యిష్ట ప్రకారం జీవిస్తున్నా రక్షణ పొందగలరు అనుకుంటే రక్షణ పొందడం చాలా సులభం. కాని అలాంటి గుడ్డి విశ్వాసంతో మన మెన్నటికి తిరిగి పుట్టలేమని దేవుడు చెబుతున్నాడు. దీనికి భిన్నంగా నీరు, ఆత్మ సువార్తను తెలుసుకోకుండా తాము రక్షణ పొందామని ఎవరు అనుకొంటారో వారు విధి విరుద్ధమైన దానిని అనుసరించే వారేనని కూడా ఆయన చెప్పాడు.తిరిగి పుట్టింది విూ శరీరం కాదా, విూ ఆత్మ


యేసు మానవునిగా ఈ లోకానికి వచ్చాడు. నీరు, ఆత్మ అనే సువార్త ద్వారా మనలను రక్షించాడు. ఈ లోకంలో యేసు తండ్రియైన యోసేపు వడ్రంగిగా పనిచేసేవాడు (మత్తయి 13:55) యేసు ఈ తండ్రి దగ్గర 29 సం.లు ప్రాయం వచ్చే వరకు వడ్రంగిగా కుటుంబం కొరకు పనిచేశాడు. ఆయనకు 30సం.లు ప్రాయం వచ్చినప్పుడు ఆయన వడ్రంగి పని మాని, దైవిక కార్యాలు, అంటే తన బహిరంగ పరిచర్యలు ప్రారంభించాడు.

యేసులో దైవ, మానవ స్వభావం వున్నట్టే, తిరిగి పుట్టిన మనకూ శరీరం, ఆత్మ వున్నాయి గనుక మనలోనూ ఆ రెండు విభిన్నమైన స్వభావాలుండాలి. ఒక వ్యక్తి (ఆమె/అతడు) ఆత్మ తిరిగి పుట్టకపోయినా ఆ వ్యక్తి యేసును నమ్ముతున్నానని బహిరంగంగా ఒప్పుకుంటే వారిలో తిరిగిపుట్టిన ఆత్మలేనట్టే. ఒక వ్యక్తి తన ఆత్మలో తిరిగి పుట్టకుండా యేసును నమ్మడానికి ప్రయత్నిస్తే ఆ వ్యక్తి నికొదేములా శారీరకంగా తిరిగి పుట్టడానికి ప్రయత్నిస్తున్న వంటివారే. అతడెన్నటికి తిరిగి పుట్టిన వ్యక్తిలా వుండడు. యేసు తాను దేవుడైయుండి మానవ బలహీనతలున్న శరీరంతో కూడా వున్నాడు. అలా వున్నప్పుడు మనం తిరిగి పుట్టామని అంటే మన శరీరం గాక మన ఆత్మ తిరిగి పుట్టినదని అర్ధం.

యేసును నమ్ముతున్నామని ప్రకటించే వారంతా ఎలాగో తిరిగి పుట్టినవారు. నేనొక దయగల పాస్టరుగా పేరు పొందాలని ప్రయత్నించాను. సత్యాన్ని నమ్మని వారు సత్యాన్ని తెలుసుకోవాలన్న ఉద్దేశ్యంతో వారికి కోపం కలిగించేంత కఠినమైన ప్రసంగాలు చేసేవాణ్ణి కాదు. నేను మంచి మన్ననగల, ఔదార్యం గల, దయగలవాడనని, సున్నిత మనస్కుడనని, హాస్య ప్రియుడనని, ప్రజలు శారీరకంగా ఎలా పరిశుద్ధులుగా వుండగలరో బోధించే పాస్టరుగా పేరు పొందాలనుకొన్నాను. అలాంటి భావం ప్రజల్లో కలిగించే సమర్థత నాలో లేక కాదు. కాని నేనెప్పుడూ అలా చేయలేదు. ‘‘ఈ పాస్టరు గారు నిజంగా పరిశుద్దుడైన, దయగల యేసు స్వరూపాన్ని పొందాడు’’ అన్న భావం ప్రజల్లో కలిగించే సమర్థత నాకు లేదు. ఎందుకంటే మానవుని శరీరం మారదు. శారీరకంగా కొంచెం దయగా, ప్రేమగా జాలి చూపించినంత మాత్రాన అతడు తిరిగి పుట్టిన నీతిమంతుడు కాడు. శారీరకంగా ఎవరూ తిరిగి పుట్టలేరు. కాని మనిషిలోవున్న మరో స్వభావమైన ఆత్మ దేవుని వాక్యాన్ని నమ్ముట ద్వారా తిరిగి పుడుతుంది. 

నీవు యేసును నమ్మినప్పుడు నీవు సత్యాన్ని తెలుసుకొంటావు. ‘‘విూరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులైయుండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయును (యోహాను 8:31-32) దేవుని సత్యం మాత్రమే మనం తిరిగి పుట్టేట్టు చేయగలదు. పాపదాస్యం నుండి మన ఆత్మను విడిపించి, నీతిమంతులుగా తిరిగి పుట్టేట్టు చేయగలదు. మనం బైబిలును సరిగా తెలుసుకొని, దానిని నమ్మి, దానిని బోధించినప్పుడు మనం పరిశుద్ధ స్థలంలో ప్రవేశించి, నిజమైన విశ్వాస జీవితాన్ని జీవించగలం. అతిపరిశుద్ధ స్థలంలోని కరుణాపీఠం దగ్గరకు వెళ్ళగలం. నీరు, ఆత్మ సువార్త మన ఆత్మలు తిరిగి పుట్టేట్టు చేస్తుందనడం సత్యం. దీనిలోని మన విశ్వాసం మన పాపాలనన్నింటిని క్షమించేట్టు చేసి, విశ్వాసంతో దేవుని రాజ్యంలో నివసించేటట్టు చేస్తుంది. మన హృదయాలలో వున్న నీరు, ఆత్మ సువార్త తిరిగి పుట్టిన దేవుని బిడ్డలుగా ఆధ్యాత్మికంగా ప్రభువు రాజ్యంలో ఆయనతో ఆనందంగా జీవించే అవకాశాన్ని కలిగిస్తుంది.

గుడ్డిగా యేసును నమ్మడం సరైన విశ్వాసం కాదు. మానవ దృక్పధంతో చూసినప్పుడు నాలో చాలా అపరాధాలు లేక లోపాలు కనిపిస్తున్నాయి. నేనేదో వట్టి మాటలు చెప్పడం లేదు. కాని నేను ఒక పనిని చేసినప్పుడు నిజంగా నాలో చాలా లోపాలున్నాయని నాకు నేను తెలుసుకోగలుగుతున్నాను. ఉదాహరణకు నేనొక బైబిలు శిబిరం నిర్వహించడానికి సిద్ధపడేటప్పుడు, దానికి హాజరయ్యే పరిశుద్ధులు, కొత్తగా వచ్చిన వారు ఓర్పుగా వాక్యం వినగలుగునట్లు, దేవుని కృపలో వారి హృదయాలు ప్రేరిపించబడి, తిరిగి పుట్టిన దీవెనలు పొంది, శారీరకమైన, హృదయపూర్వకమైన సమాధానంతో తిరిగి వెళ్ళగలుగునట్లు చేయడానికి నేను చేయవలసిన అనేకమైన సంగతులను ముందుగా ఆలోచించలేకపోతున్నాను. సిద్ధపడే సమయం అయిపోయి, శిబిరం మొదలవ్వబోయే ముందు మరికొంచెం శ్రద్ధ జాగ్రత్త చూపించి వుంటే కొన్నింటిలో మరింత శ్రద్ధ తీసుకోగలం అనిపిస్తుంది. అలాంటివి ముందుగానే ఆలోచించి, వాటిని సిద్ధపరచలేకపోయానే, అలా చేసి వుంటే శిబిరానికి వచ్చిన పరిశుద్ధులు, కొత్త ఆత్మలు మరింత బాగా వాక్యం విని, రక్షణ పొంది, మంచి సమయం గడిపేవారు గదా అనిపిస్తుంది నాకు. నేను రోజుంతా పని చేసినా, అసమర్థత వల్ల నా ప్రయత్నానికి తగినంత ఫలితాలు లేని సమయాలెక్కువ వున్నాయి. కనుక నాలో చాలా లోపాలు వున్నాయన్న సత్యం నాకు బాగా తెలుసు.

‘‘నేనిదెందుకు చేయలేదు? దీన్ని నేనెందుకు ఆలోచించలేదు? దీనికి నేను కొంచెం శ్రద్ధ చూపించి వుంటే సరిపోతుంది. కాని అలా ఎందుకు చేయలేక పోయాను?’’ నేను సువార్త సేవ చేస్తున్నప్పుడు తరచుగా నాలోపాలను నేను గ్రహించగలుగుతున్నాను. కనుక నన్ను నేను గుర్తించి ఇక ‘‘నేనింతే, నేను అందుకు చాలును’’ అని ఒప్పుకుంటున్నాను. అందుకు సిగ్గుపడనివానిలా నటించను. వాస్తవానికి చిన్న పనులను కూడా సరిగా చక్కపెట్టలేని వారి దైవాదీనం అనుకొని వెళ్ళిపోతుంటారు. నా వరకైతే నాలోని చాలా లోపాలకు నేను నిజంగా బాధపడుతూ వుంటాను.నీలవర్ణం దారంలో విశ్వాసం ద్వారా మనం పరిశుద్ధతను పొందుతాం


మనుష్యులను తాము ఏ పొరబాట్లు చేయకుండా ఏ పనినైనా చక్కగా చేయగలమని తమను గూర్చి తాము అనుకొంటారు. కాని ఒక పనిని చేసినప్పుడు వారిలోని నిజమైన సమర్థత, లోపాలు స్పష్టంగా బయటపడతాయి. అప్పుడు తాము యిందుకు తగిన వారం కాదని పాపం చేయడానికి, పొరబాట్లు చేయడానికి తగిన వారమని నిజంగా తెలుసుకుంటారు. ఇంకా తాము ప్రతిదీ సక్రమంగా చేస్తున్నామని అనుకొన్నప్పుడు, తమ తమ విశ్వాసం ఎంతో బాగుంది గనుక తాము దేవుని రాజ్యానికి వెళ్తామని తమను తాము మోసగించుకొంటారు.

కాని శరీరం ఎన్నటికీ మారదు. ఎప్పుడూ తప్పు చేస్తూ, లోపాలు లేక వాటిని బయటపెట్టని శరీరం వుండదు. నీ శరీరం ఎన్నుకొన్న మంచిపనులు చేసింది గనుక నీవు ప్రభువు రాజ్యంలోనికి వెళ్తానని ఒక వేళ నీవునుకుంటే, నీ శరీరం చేసిన మంచిపని ఎలాంటిదైనా అది దేవుని ముందు పూర్తిగా నిరుపయోగమైనదని నీవు తెలుసుకోవాలి. మనకు పరలోక ప్రాప్తి కలిగించే ఏకైక మార్గం సత్యవాక్యంలో మన విశ్వాసమే అంటే ప్రభువు మనలను రక్షించాడని తెలిపే నీల ధూమ్ర వర్ణాలలో విశ్వాసం కలిగి వుండడమే. అప్పుడే మనం పరిశుద్ధ స్థలంలో ప్రవేశించగలం.

దేవుడు నీలధూమ్ర రక్త వర్ణాల ద్వారా మనలను రక్షించకపోయినట్లయితే మనమెన్నటికి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించలేము. మన విశ్వాసమెంత బలమైనదైనా మనం దానిలో ఎందుకు ప్రవేశించలేం? ఎందుకంటే మన శరీరం పరిశుద్ధ స్థలంలో ప్రవేశించేంత మంచిదిగా ప్రతిరోజు వుండాలి. మనం దేవుని రాజ్యంలో ప్రవేశించగలిగినంత మంచిదిగా ప్రతిరోజు మన విశ్వాసం వుంటే, ఇక బలహీనమైన శరీరం గల మనలను ప్రతి రోజు మంచివారిగా వుండేట్టు, పరిశుద్ధస్థలంలో ప్రవేశింపజేసేదిగా ఎలా వుండగలదు? మనంతట మనం మన పాపక్షమాణ పొందే మార్గమే లేనప్పుడు, మనం ప్రతిరోజు పాపం చేస్తూ దాని నుండి తిరిగి పోగలమన్న విశ్వాసం లేనప్పుడు దేవుని రాజ్యంలో ప్రవేశించ గలిగినంత మంచిదానిగా మన విశ్వాసాన్ని ఎలా చేయగలం? అంటే ఏనాటికా నాడు జీవితాన్ని ప్రారంభించడానికి మన శరీరాలు ఎన్నటికి పాపం చేయనివై వుండాలి. లేక మనం ప్రతిరోజూ పశ్చాత్తాప ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు చేస్తూ వుండాలి. కాని ఎవరి శరీరాలు ఎప్పుడూ పవిత్రంగా వుండగలవు? ఎవరు దీనిని చేయగలరు?

దేవుడు గాని నీలధూమ్ర రక్త వర్ణాల దారం ద్వారా మనలను రక్షించి వుండకపోతే పరలోకరాజ్యంలో ప్రవేశించగలవారు మనలో ఒక్కరూ వుండేవారు కాదు. మన విశ్వాసం ఒక క్షణం మంచిగా వుండి మరో క్షణంలో మాయమైపోయేంత విశ్వాసం గలవారిగా వున్నాం. మనది మళ్ళీ మళ్ళీ మాయమై పోయేంత మంచి విశ్వాసం అయితే మనకసలు విశ్వాసం వుందా, మొదట మనకున్న విశ్వాసాన్ని కోల్పోతున్నామా అన్న కలవరం గలుగుతుంది. దాని వలన మొదట మనం యేసును నమ్మినప్పుడు ఎలా వున్నామో అంతకంటే మరింత పాపాత్ములమవుతాం. కాని యేసు మనలను తాను నీల ధూమ్ర రక్త వర్ణాల దారం, పేనిన సన్నని నారలో ప్రత్యక్ష పరచిన తన రక్షణ ప్రణాళిక ప్రకారం మనలను పరిపూర్ణంగా రక్షించాడు. మన పాపాల నుండి ఆయన మనలను క్షమించాడు.

ఈ రుజువు మనకున్నప్పుడు ‘‘పరిశుద్ధత దేవునిదే’’ అన్న బంగారు పతకం తలపాగాకు పెట్టుకోవచ్చు. (నిర్గమ 28:36-38) అప్పుడు మన యాజకత్వాన్ని కొనసాగించవచ్చు. ఆత్మ ద్వారా తమ పాపక్షమాపణ పొందిన అనుభవం గలవారు మాత్రమే దేవుని యాజకులుగా దేవుని సేవచేస్తే తమ హృదయాలు పరిశుద్ధమైనవని ప్రజలకు సాక్ష్యం చెప్పగలరు.

ప్రధాన యాజకుని తలపాగాకు ఒక బంగారు పతకాన్ని జతపరచి వుంటుంది. దీనిని ఆ తలా పాగాకు నీలం దారంతోనే కడతారు. దానిని నీలందారంతోనే కట్టాలని దేవుడు ఎందుకు చెప్పాడు. మనలను రక్షించడానికి దేవునికి నీలం దారం ఎందుకవసరమైంది? అంటే యిది మన పాపాలనన్నింటిని యేసు బాప్తిస్మం ద్వారా తనపైకి తీసుకొన్నాడన్న విషయాన్ని తెలియజేస్తుంది. కొత్త నిబంధనలో తన బాప్తిస్మం ద్వారా ప్రభువు మన పాపాలను తనపైకి తీసుకొని వాటిని తుడిచి వేయలేదా! అదే పాత నిబంధనలో బలిపశువు పై చేతులుంచడం. మనం యేసుక్రీస్తులో ఎంత నమ్మకముంచినా యెహోవా దేవుని నుండి మనం పరిశుద్ధతను పొందలేము. ఇందుకనే బంగారు పతకాన్ని నీలం దారంలో తలపాగాకు కట్టారు. ‘‘దేవునికే పరిశుద్ధత’’అని చెక్కబడిన పతకాన్ని ధరించిన ప్రధాన యాజకుని చూసిన ప్రతిఒక్కరూ (అతడుగాని, ఆమెగాని) తమ పాపాలకు క్షమాపణ పొంది దేవుని ముందు పరిశుద్ధులుగా వుండాలని జ్ఞాపకం చేసుకోవాలి. వారు దేవుని ముందు పవిత్రులుగా ఎలా వుండగలరో ఇది ఆలోచించేట్టు చేస్తుంది.

మనం కూడా నీతిమంతులమెలా కాగలమో జ్ఞాపకం చేసుకోవాలి. ఎలా కాగలం? మత్తయి 3:15 చదువుదాం, ‘‘యేసు ఇప్పటికి కానిమ్ము, నీతియావత్తు ఈలాగు నెరవేర్చుట మనకు తగియున్నదని అతనికి వుత్తరమిచ్చెను. కనుక అతడాలాగు కానిచ్చెను.’’ తన బాప్తిస్మంతో యేసు మన పాపాలను ఆయన విూదికి తీసుకొని మన పాపాల నుండి మనలను రక్షించాడు. దీనిని నమ్మినవారు పాపం లేనివారు. యేసు బాప్తిస్మాన్ని తీసుకొనకపోతే మనం పాపంలేని వారమని చెప్పడానికెలా సాహసించగలం? నీవు నిజంగా కన్నీళ్ళు కారుస్తూ యేసు సిలువ విూద చనిపోయాడన్న విశ్వాసంతో ఒప్పుకొనుట ద్వారా నీవు నీ పాపక్షమాపణను పొందావా? కాని కొందరు తమకెలాంటి సంబంధ బాంధవ్యం లేకపోయినా తమ తాతలు చనిపోయిన సంగతిని జ్ఞాపకం చేసుకొని, లేక వారు జబ్బుపడినప్పుడు పడిన కష్టాలు, బాధలు జ్ఞాపకం చేసుకొని, లేక గతంలో వారనుభవించిన కష్టాలు, శ్రమలు జ్ఞాపకం చేసుకొని బలవంతంగా కన్నీళ్లు పెట్టుకొంటారు. కాని యేసు చనిపోయాడని తెలిసీ దుఃఖపడ్డానికి చాలా కష్టపడేవారు చాలా మంది వున్నారు. ఒకవేళ దుఃఖపడ్డానికి నీవు నటించినా లేక యేసు సిలువ వేయబడ్డాడని విూరు నిజంగా దుఃఖపడినా యిలాంటి దుఃఖానికి విూ పాపాలెన్నటికీ తుడిచి వేయబడవు.

‘‘దేవునికి పరిశుద్ధత కలుగును గాక’’ అని చెక్కబడిన బంగారు పతకం నీలం దారంతో ప్రధాన యాజకుని తలపాగాకు కుట్టబడినా మన పాపాలను తుడిచివేసి, మనలను పవిత్రులను చేసేది యేసు బాప్తిస్మమే. తన బాప్తిస్మం ద్వారా యేసు మన పాపాలనన్నింటిని తనపైకి తీసుకొన్నాడు గనుక, మన పాపాలనన్నింటిని యెహోవా దేవుడు ఆయన విూద మోపాడు గనుక, యేసు బాప్తిస్మం వలన లోక పాపాలన్నీ ఆయన విూదికి వెళ్ళాయి గనుక మన హృదయాలు పాప క్షమాపణను పొందాయి. మన హృదయాలలో ప్రేమభావం లేకపోయినా, మన కార్యకలాపాలలో, క్రియలలో ఎంత తక్కువగా వున్నా, బైబిలులో నీలం దారాన్ని గూర్చి, రాసివున్న మాటద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడతాం, సంపూర్ణంగా రక్షించబడతాం. మన శరీరాలను చూసుకొని మనం గౌరవాన్ని పొందలేం. కాని నీలం, ధూమ్ర రక్తవర్ణ దారాలను గూర్చిన విశ్వాసం మన హృదయాలలో వుంది. అంటే తన బాప్తిస్మం ద్వారా యేసు మన పాపాలనన్నింటిని తనపైకి తీసుకొన్నాడని మన శిక్షను సిలువ విూద ఆయన భరించాడని నీరు, ఆత్మ సువార్త మనలో పరిపూర్ణంగా వున్నది గనుక మనం ధైర్యంగా, నిర్భయంగా సువార్తను గురించి మాట్లాడవచ్చు. మనలో నీరు, ఆత్మ సువార్త వున్నది గనుక మన విశ్వాసం ద్వారా నీతిమంతులుగా జీవించగలం, ఈ నైతిక విశ్వాసాన్ని ప్రజలకు బోధించవచ్చు.

మన రక్షణ ఆకస్మికంగా కలిగింది కాక దేవుని కృపచేతనే కలిగింది గనుక మన మాయనకెంతో కృతజ్ఞలమై వుండాలి. ఒక వ్యక్తి (అతడు/ఆమె) సరిగా నమ్మకపోయినా పొందగలిగిన రక్షణ లాంటిది గాక మనం పొందిన రక్షణ స్వల్పమైనది కాదు. తమ యిష్టానుసారం దేవునికి ‘‘ప్రభువా, ప్రభువా’’ అని మొర్రపెట్టిన వారంతా రక్షణ పొందరు. మనకైతే నీరు, ఆత్మ సువార్త వలన మనం పాపక్షమాపణ పొందామని నీలధూమ్ర రక్తవర్ణాల దారం, పేనిన సన్నని నార వలన ప్రభువు కష్టపడి మనలను రక్షించాడు అన్న రుజువు మన హృదయాలలో వుంది కనుక యింత గొప్ప రక్షణ కొరకు మనమాయనకు కృతజ్ఞులమై వున్నాం.

దేవుని కుమారుడైన యేసుక్రీస్తులో విశ్వాసముంచిన (అతడు/ఆమె) హృదయంలో సాక్ష్యం కలిగి వున్నాడని బైబిలు చెబుతోంది (1 యోహాను 5:10). మనకా సాక్ష్యం లేకపోతే మనం దేవుని గూర్చిన నిస్సంశయమైన రుజువు వుండాలి. అలా వున్నప్పుడు ‘‘నీవు రక్షణ పొందినట్టు నిదర్శనం చూపించు, ప్రజలు పాపక్షమాపణ పొందినప్పుడు, దానికి పరిశుద్ధాత్మను వరంగా పొందుతారని, రక్షణకు స్పష్టమైన రుజువు వుంటుందని విూరంటారు. ఆ రుజువు నాకు చూపించండి’’ అని కొందరు మిమ్మును సవాలు చేసినా విూరు భయపడాల్సిన అవసరం లేదు. అప్పుడు విూరు ‘‘యేసు నన్ను పూర్తిగా రక్షించిన నీరు, ఆత్మ సువార్తలో వుంది. ఆయన నన్ను పరిపూర్ణంగా రక్షించాడు గనుక నాలో పాపం లేదు’’ అని విూరు ధైర్యంగా చెప్పడమే దానికి నిదర్శనం.

విూరు రక్షణ పొందారన్న నిదర్శనం విూ హృదయాలలో లేకపోతే విూరు రక్షణ పొందలేదన్నమాటే. ప్రజలు యేసును ఎంత మనఃపూర్వకంగా నమ్మినా, ఆ నమ్మకం వారికి రక్షణను కలిగించలేదు. ఇది కేవలం ప్రతిఫలం లేని ప్రేమే. ఇది మరోవ్యక్తి ఎలాభావిస్తున్నాడో గుర్తింపు లేని ప్రేమే. ఇది మరో వ్యక్తి ఎలా భావిస్తున్నాడో గుర్తింపులేని ప్రేమే. మనం ఒకరిని ప్రేమించలేనప్పుడు అతని హృదయం అల్లాడుతూ వుంటుంది. మన నుండి అతడు ఏదో ఒకదానిని ఎదురు చూస్తాడు. ప్రేమించబడాలని చూస్తాడు. మన ప్రేమకొరకు చచ్చిపోతున్నట్టుగా మనవైపు చూస్తాడు. అంతమాత్రాన మనమతన్ని ప్రేమించాలని లేదు. అలాగే దేవుని కొరకు కొందరి హృదయాలు బాధపడుతున్నాయని తమ పాపక్షమాపణ పొందని వారిని ఆయన ఆలింగనం చేసుకోడు. ఇది పాపులకు దేవునియెడల ప్రతిఫలం లేని ప్రేమ తప్ప మరొకటి కాదు.

మనం దేవుని ప్రేమించినప్పుడు ఆయన వాక్యాన్ని నిజంగా నమ్మాలి. ఆయన పట్ల మన ప్రేమ ఏకపక్షమైనదిగా వుండకూడదు. ఆయనపట్ల మనకెంత ప్రేమ వున్నదో మనమాయనకు చెప్పాలి. మనం ఆయన్ను ప్రేమించక ముందు ఆయన నిజంగా మనలను ప్రేమిస్తున్నాడో లేదో మొదట మనం తెలుసుకోవాలి. మనలను నిజంగా ప్రేమించిన వ్యక్తికి మన ప్రేమంతటిని యిస్తే అప్పుడు మనం భగ్న హృదయులమవుతాం.

మన పాపాలకు మనం శిక్ష పొందకుండా మన ప్రభువు మన పాపాలను రక్షణ అనే మహిమతో కప్పివేశాడు. మనం దేవునితో నివసించడానికి ఆయన రాజ్యంలో ప్రవేశించే అనుమతినిచ్చాడు. దేవుని కృప ద్వారా పాప విమోచన పొందే వరాన్ని మనకనుగ్రహించాడు. దేవుడిచ్చిన రక్షణ లెక్కించలేనన్ని పరలోక దీవెనలు మనకు కలిగించింది. ఈ రక్షణనే దేవుడు మనకిచ్చాడు. అంటే ఆయన నుండి కలిగే దీవెనలనన్నింటిని పొందేట్టు చేశాడు.యేసు మనకు కలిగించిన రక్షణ 


నీలధూమ్ర రక్తవర్ణాల దారం ద్వారా మన ప్రభువు మనలను రక్షించాడు. మూడు వివిధ దారాలతో చేసిన రక్షణను ఆయన మనకనుగ్రహించాడు. నీల ధూమ్ర రక్త వర్ణాల దారం వలన కలిగే రక్షణ దేవుడనుగ్రహించే రక్షణ తప్ప మరొకటి కాదు. ఈ రక్షణ వరమే మనం పరిశుద్ధ స్థలంలో ప్రవేశించి, అక్కడ నివసించేటట్టు చేస్తుంది.

నీరు, ఆత్మ సువార్త నిన్ను, నన్ను నీతిమంతులుగా మార్చింది. అది మనలను దేవుని సంఘంలోనికి వచ్చేట్టు పవిత్రమైన జీవితాన్ని జీవించేట్టు చేసింది. నిజమైన సువార్త కూడా దేవుని ఆధ్యాత్మిక వాక్యాన్ని మనకిచ్చి ఆయన కృపను పొందేట్టు చేసింది. అదింకా మనం దేవుని కృపా సింహాసనం ముందుకు వెళ్ళి, ప్రార్థన చేస్తూ, దాని వలన దేవుడు మనకు సొంతంగా అనుగ్రహించే సమృద్ధియైన కృపను పొందే విశ్వాసాన్ని ఆయన మనకనుగ్రహించాడు. మన రక్షణ వల్లనే అలాంటి గొప్ప దీవెనలను దేవుడు మనవిగా చేశాడు. అందుకనే రక్షణ ఎంతో విలువైంది.

మన విశ్వాస గృహాలను రాతి విూద కట్టుకోమని యేసు చెప్పాడు (మత్తయి 7:24). ఈ రాయి లేక బండ నీరు, ఆత్మ సువార్త వలన కలిగే రక్షణ తప్ప మరొకటి కాదు. అలా మనం రక్షణ పొంది, ఆ రక్షణ వలన నీతిమంతులమై, రక్షణ పొందుట వలన నిత్యజీవితాన్ని అనుభవిస్తూ విశ్వాస జీవితాన్ని జీవిస్తూ పరలోకంలో ప్రవేశించాలి.

ఈ లోకాంతపు సమయం ఆసన్నమైంది. కనుక నిజమైన వాక్యం ద్వారా ప్రజలు రక్షణ పొందాల్సిన అవసరత వుంది. నీలధూమ్ర రక్త వర్ణా విశ్వాసం ఏమిటో తెలియకుండానే యేసును గ్రుడ్డిగా నమ్మి రక్షణ పొందవచ్చు అని విశ్వాస జీవితాన్ని గూర్చి మాట్లాడనవసరం లేదని, యేసును నమ్మితే చాలు రక్షణ పొందుతామని కొందరు చెబుతారు.

అందుకనే ఎవరైతే తమ హృదయాలలో పాపక్షమాపణ పొందుతారో వారు మాత్రమే దేవుడు అంగీకరించే విశ్వాస జీవితాన్ని జీవించగలరని నేను పదే పదే చెబుతున్నాను. తన పాపానికి క్షమాపణ పొందిన పరిశుద్ధుని హృదయం పరిశుద్ధాత్మ నివసించే పవిత్ర దేవాలయం. అపవిత్రతను మాలిన్యం చేయకుండా ప్రతి ఒక్కరూ జీవించాలి.

నీతిమంతుల జీవిత విధానం పాపాత్ముల జీవిత విధానానికి పూర్తి భిన్నంగా వుంటుంది. పాపాత్ముల జీవిత విధానం దేవుని ప్రమాణానికెంతో దిగువన వుంటుంది. వారి జీవితాలలన్నీ వేషధారణతో నిండి వుంటాయి. దేవుని నియమాల ప్రకారం జీవించడానికి వారేంతో కష్టపడి ప్రయత్నిస్తారు. వారెలా జీవించాలో, వారెలా నడవాలో, ఎలా మాట్లాడాలో, ఎలా నవ్వాలో వారు మత సొంత ప్రమాణాల ప్రకారం జీవిస్తూ వుంటారు.

ఇది విశ్వాసుల నైతిక జీవితానికెంతో దూరంగా వుంటుంది లేక పోలికే వుండదు. నీతిమంతులతో ‘‘నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను’’ అని దేవుడు వివరంగా చెప్పాడు. (మత్తయి 22:37) నీతిమంతులకు దేవుడిచ్చిన జీవిత విధానం యిది. విశ్వాసులమైన మనం మన పూర్ణ హృదయాలతో ప్రేమిస్తూ, మన పూర్ణశక్తితో క్రియ చిత్తాన్ని అనుసరిస్తూ జీవించాలి. మన పొరుగు వారిని రక్షించడానికి చేసే ఆయన కార్యాలలో మనమెంతో పెట్టుబడి పెట్టాలి. అదే క్రైస్తవుల జీవితం.

మనంగా పాపం చేయకుండా వుంటేచాలు అని అనుకుంటే తిరిగి పుట్టిన క్రైస్తవ విశ్వాస జీవితాన్ని మనం జీవించలేం. నేను తిరిగి పుట్టక మునుపు ప్రెస్బిటేరియన్‌ సంఘంలో నేను శాస్త్రోక్తమైన విశ్వాస జీవితాన్ని గడిపాను. ధర్మశాస్త్రానుసారమైన జీవితాన్ని గడపడానికి ప్రయత్నించాను. ఇప్పుడు ప్రజలలా చేయాలనుకోవడం లేదు. నేను చాలా కాలం నుండి నా మతజీవితాన్ని గడుపుతున్నాను. గనుక నా అనుదిన జీవితంలో ధర్మశాస్త్రానుసారమైన జీవితాన్ని తప్పకుండా జీవించాను. ధర్మశాస్త్ర నియమాలకు బద్ధుడనై జీవించాను. ప్రభువు దీన్ని పరిశుద్ధంగా ఆచరించాలన్న ఆజ్ఞ కొరకు నేనెప్పుడు పని చేయలేదు’’ అందుకని ఆదివారాలలో నేను కారులో కూడా ఎక్కేవాణ్ణి కాదు. నేను జీవించినట్టే విూరు జీవించాలని నేనంటే అలాంటి శాస్త్రోక్తమైన జీవితాన్ని గడిపేవారు ఒక్కరంటే ఒక్కరు వుండరు. నేను మతపరంగా జీవించిన రోజులెంతో భక్తితో గడిపినా, అది దేవుని చిత్తానికి సంబంధం లేనిది, పూర్తిగా నిరుపయోగమైనవి.

ప్రియమైన పాఠకులారా, నీలధూమ్ర రక్తవర్ణాల దారంలో విూకు విశ్వాసముందా? యేసు రక్షణ ఈ మూడు దారాల సారాంశంలోనే వుంది. దానిని నమ్ముట ద్వారా మనం పరిశుద్ధ స్థలంలో ప్రవేశిస్తాం. మన రక్షణ కార్యం 2000సం.ల క్రితం నెరవేర్చబడినది. మనం యేసుక్రీస్తును ఎరుగకముందే ఆయన తన బాప్తిస్మం ద్వారా మన పాపాలనన్నింటిని తనపైకి తీసుకొని, సిలువ విూద మరణించడం ద్వారా మన శిక్షను ఆయన భరించాడు.పాపం నుండి రక్షణ యేసుక్రీస్తులో ఏర్పరచబడింది .


తిరిగి పుట్టనివారు ప్రత్యక్షపు గుడారంలో ప్రవేశించిన వారు దాని ఆవరణ ద్వారం నుండి గాక ఆవరణ కంచెను అక్రమంగా దాటివెళ్ళిన వారైవుంటారు. వారు ‘‘సన్నని నారతోనేసిన ఆ కంచె అంత తెల్లగా ఎందుకు? అది చాలా భారంగా వుంది. దానికి ఎరుపు, నీలం రంగు వేయాలి. ఈ రోజుల్లో ఆ రంగు అందరూ వాడుతున్నారు. కాని ఈ కంచె మరీ తెల్లగా వుంది! అది బాగా మురికి అవుతోంది. ఇది అంత ఎత్తు ఎందుకు? 2.25విూ.లు వుంది. నా ఎత్తు 2విూ.లు కూడా లేదు. ఇది ఇంతెత్తు వుంటే నేను లోపలికి వెళ్లేదేలా? ఇక నిచ్చెన వేసుకొని ఎక్కాలి’’ అని అంటారు.

అలాంటివారు తమ మంచి క్రియలతో లోపల ప్రవేశించాలని ప్రయత్నిస్తారు. వారు ప్రత్యక్ష గుడారపు ఆవరణ కంచెను వారి కానుకలతో, దాతృత్వపు కార్యాలతో, తమ ఓర్పుతో ఎక్కాలనుకొని వారా కంచెను అక్రమంగా దూకి వెళ్తారు. వెళ్తూ ‘‘2.25 విూ.ను దూకి వెళ్ళగలను’’ అంటారు. ప్రత్యక్ష గుడారపు ఆవరణలోనికి ఎక్కి వెనక వున్న దహనబలిపీఠాన్ని చూస్తారు. ఆ తర్వాత చూపులను పరిశుద్ధ స్థలం విూదికి మళ్ళిస్తారు. వారు మొదటిగా దాని ముందున్న నీటి ఇత్తడి గంగాళాన్ని చూస్తారు.

ప్రత్యక్ష గుడారపు ఆవరణ కంచె స్తంభాలు 2.25విూ.లు ఎత్తు వుంటాయి. కాని దేవుడు నివసించే పరిశుద్ధ స్థలానికున్న స్తంభాలు, ద్వారపు తెరెత్తు 4.5విూ.లు వుంటుంది. ప్రజలకు తగినంత నిశ్చయత వుంటే తమ యిష్ట ప్రకారం ప్రత్యక్ష గుడారపు ఆవరణలో ప్రవేశించవచ్చు. వారు 2.25విూ. కంచె అక్రమంగా దూకి ప్రత్యక్ష గుడారపు ఆవరణలో ప్రవేశించినా, దేవుడు నివసించే స్థలంలో ప్రవేశించడానికి వారు ప్రయత్నించినప్పుడు వారు 4.5విూ.లు ఎత్తున్న పరిశుద్ధస్థల స్తంభాలు, తెరకు ఎదురుపడతారు. 2.5విూ.లు తమ ప్రయత్నంతో దూకగలరు. కాని దేవుడేర్పరచిన 4.5విూ.లు దూకలేరు. అదే వారి హద్దు.

దీని అర్థమేమిటంటే, మనం యేసును మొదటిగా కేవలం మతాన్నిబట్టి నమ్మగలం. మరి కొందరు యేసును తమ యిష్ట ప్రకారం రక్షకునిగా కూడా నమ్ముతారు. ఇంకా రక్షకుడు నలుగురు మహాజ్ఞానులలో ఒకనిగా నమ్ముతారు. ప్రజలు ఎలా నమ్ముతారు అన్నదానితో సంబంధం లేకుండా వారు తాముగా ఎంచుకొన్న విధానం ఏదైనా దానిలో వారి స్వంత విశ్వాసాన్ని వుంచుతారు. అలాంటి విశ్వాసంతో వారు నిజంగా తిరిగి పుట్టలేరు.

నిజంగా వారు తిరిగి పుట్టాలంటే నీలధూమ్ర రక్తవర్ణాల దారం అనే ద్వారం గుండా దాటాలి. మనం యేసు మన రక్షకుడని, సత్యానికి ఆయనే ద్వారమని, ఆయన నీరు, రక్తం, ఆత్మ ద్వారా మనలను రక్షించాడని నమ్మి దేవుని ముందు తిరిగి పుట్టాం. యేసు చేసిన కార్యాలే మూడు దారాలలో ప్రత్యక్షపరచిన విశ్వాసం నీరు, రక్తం, ఆత్మలు ఇది కాక మరిదేనినైన నమ్మే స్వేచ్ఛ ప్రజలకుంది. కాని అలా నమ్మడం వలన వారురక్షణ పొందుతారని, గొప్పగా దీవించబడతారన్న సరైన రుజువులేనే లేదు. నీరు, ఆత్మ సువార్తలో మన విశ్వాసం ద్వారా మాత్రమే మనం దేవుని అంగీకారాన్ని, దేవుని కృపను, ఆయన రక్షణ ఆశీర్వాదాలను పొందగలం. నీరు, ఆత్మ సువార్తలోని బాహ్య విశ్వాసం దేవునికృపతో మనలను కప్పాలి అన్నదే.

ప్రత్యక్షపుగుడారం కేవలం సమకోణ చతురస్త్రాకారపు ఆవరణం దానిలో ఒక యిల్లు వున్నదే అని విూరనుకొంటున్నారా? ఈ ఆలోచన విూ విశ్వాసానికెలాంటి లాభాన్ని చేకూర్చదు. ప్రత్యక్షపు గుడారం సంపూర్ణ విశ్వాసాన్ని చెబుతోంది. ఆ విశ్వాసం ఏమిటో మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి.

ప్రత్యక్షపు గుడారాన్ని గూర్చి బాగా తెలియకపోతే ప్రత్యక్షపుగుడారం 2.5విూ.లు ఎత్తుగలది అనే అనుకుంటారు. మనం ఆవరణలో ప్రవేశించక కంచె బయటి నుండి ప్రత్యక్షపు గుడారాన్ని చూస్తే ప్రత్యక్షపు గుడారం కంచె కంటే రెండంతలు ఎత్తున్నట్టు చూడగలం. ప్రత్యక్షపు గుడారపు అడుగు మనం చూడలేకపోయినా అది దాని ఆవరణ కంటే ఎత్తుగా వున్నట్టు దాని ద్వారాన్ని బట్టి స్పష్టంగా చూడగలం.

యేసును నమ్ముట ద్వారా ఎవరైతే తమ పాపక్షమాపణ పొంది ప్రత్యక్షపు గుడారపు ఆవరణ ద్వారం ద్వారా లోపల ప్రవేశిస్తారో వారు దహనబలిపీఠం దగ్గర, గంగాళం దగ్గర వారి విశ్వాసాన్ని స్థిరపరచుకొన్న తర్వాతనే పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాలి. పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాలంటే తప్పకుండా తమ స్వయాన్ని ఉపేక్షించుకోవాలి. పరిశుద్ధ స్థలంలోని ఉపకరణాలు పరిశుద్ధ స్థలం బయట వున్న ఉపకరణాలన్నింటికి భిన్నమైనవని గుర్తించాలి.

సాతాను దేనినెక్కువగా ద్వేషిస్తాడో విూకు తెలుసా? పరిశుద్ధ స్థలానికి లోపల బయట అని వాటిమధ్య చేసిన హద్దులను సాతాను అసహ్యించుకొంటాడు. పరిశుద్ధ స్థలానికి లోపల బయట అని వేరుచేసిన వారి మధ్య దేవుడు పని చేస్తాడు. సాతానైతే అలాంటి గీతను గీసిన వారిని ద్వేషించి, ప్రజలు అలాంటి సరిహద్దు పెట్టకుండేట్టు ప్రయత్నిస్తాడు. అయితే ఎవరైతే విశ్వాసమనే ఈ హద్దు గీస్తారో వారి ద్వారా దేవుడు స్పష్టంగా పని చేస్తాడు. ఈ విభజన రేఖను ఎవరైతే గిస్తారో వారంటే దేవుడు సంతృప్తి చెందుతాడు. వారి విశ్వాసంతో వారు పరిశుద్ధ స్థలం లోపల జీవించునట్లు దేవుడు తన దీవెనలను వారికిస్తాడు.

ప్రజలు తమ పాపాల నుండి విమోచన పొందాలని ప్రత్యక్ష గుడారపు బాహ్యావరణంలోని ఉపకరణాలన్నింటిని, వాటికి ఉపయోగించిన పదార్థాలన న్నింటిని దేవుడు సిద్ధపరచి, ముందుగానే ఏర్పాటు చేశాడని నమ్మాలి. దీనిని నమ్మి పరిశుద్ద స్థలంలో విూరు ప్రవేశించినప్పుడు యింకా గొప్ప కృపను, దీవెనలను దేవుడు విూకను గ్రహిస్తాడు.కరుణా పీఠం దగ్గరే రక్షణ కృపను పొందగలం


అతిపరిశుద్ధ స్థలంలో సాక్ష్యపు మందసాన్ని కప్పి వుంచిన మూతపైన రెక్కలు చాచిన రెండు కెరూబులు కిందికి చూస్తు వుంటాయి. ఈ రెండు కెరూబులకు మధ్య వున్న స్థలాన్ని కరుణా పీఠం అని పిలుస్తారు. దేవుడు మనకు తన కృపను యిచ్చేది ఈ కరుణా పీఠం దగ్గరే. ఇశ్రాయేలీయుల పక్షంగా అర్పించిన బలియర్పణా రక్తాన్ని ప్రధాన యాజకుడు ఈ కరుణా పీఠం విూద ఏడుసార్లు ప్రోక్షిస్తాడు. కనుక సాక్ష్యపు మందసం విూది మూత రక్తపు మరకలతో వుంటుంది. ఆ విధంగా రక్తాన్ని ప్రోక్షించినప్పుడు దేవుడు కరుణాపీఠం విూదికి దిగివచ్చి ఇశ్రాయేలు ప్రజలపై తన కృపను యిస్తాడు. దీనిని ఎవరు నమ్ముతారో వారికి దేవుని దీవెనలు, కాపుదల, నడిపింపు మొదలవుతుంది. అప్పటి నుండి వారు దేవునికి నిజమైన ప్రజలవుతారు. పరిశుద్ధ స్థలంలో ప్రవేశించే అర్హతను పొందుతారు.

ఈ లోకంలో చాలామంది క్రైస్తవులలో పరిశుద్ధ స్థలంలో ప్రవేశించగల విశ్వాసం గలవారు కొద్దిమంది మాత్రమే. ఇతరులలో అలాంటి విశ్వాసం లేకుండానే వారు పరిశుద్ధ స్థలంలో ప్రవేశిస్తారు. నీకెలాంటి విశ్వాసం వుంది? రక్షణను స్పష్టంగా గీయగల విశ్వాసం మనకు వుండి దేవుని పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాలి. అలా ప్రవేశించినప్పుడే దేవుని వలన బహుగా ఆశీర్వదించబడతాం.

అయితే ప్రజలు రక్షణను గూర్చిన స్పష్టమైన రేఖను గీసినప్పుడు దానిని ద్వేషించే సాతాను ఆ రేఖను చెరిపి వేయడానికి ప్రయత్నిస్తాడు. గనుక యిలాంటి విశ్వాసాన్ని పొందడం అంత సులభం కాదు. పైగా సాతానంటాడు. ‘‘ఆ మార్గాన్ని నీవు నమ్మాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరూ అలా నమ్మరు. కనుక దానికి నీ వంతు ప్రాధాన్యతను యిచ్చి నీవే దాని నెందుకు మళ్ళీ చేయాలనుకుంటావు? అంత కష్టపడక ఎక్కువమంది ఏం చేస్తున్నారో ఆఒరవడిలో నడువు’’ అని చెబుతాడు. ఇలాంటి మాటలతో స్పష్టంగా కనిపించే రక్షణ రేఖను మరుగు చేయడానికి సాతాను ప్రయత్నిస్తాడు. ఇంకా మన శారీరక బలహీనతను బయటపెట్టి వాటిని కష్టాలుగా మార్చడానికి ప్రయత్నిస్తాడు. సాతాను మనలను దేవుని నుండి వేరుచేయడానికి ప్రయత్నించే సాతాను మోసపు మాటను వినే వారిలో నీవూ ఒకడిగా వుంటావా? లేక విూ రక్షణను ప్రతిరోజూ జ్ఞాపకం చేసుకొంటూ, సంఘంతో కూడి, దేవుని వాక్యాన్ని అనుసరిస్తూ ప్రార్థనాజీవితాన్ని గడుపుతూ, దేవుడు విూకిచ్చే కృపను పొందుతూ జీవిస్తారా?

వాస్తవానికి, తమ పాప విమోచన పొందిన వారు తమ రక్షణను జ్ఞాపకం చేసుకోడానికి యిష్టపడతారు. వారు నీరు, ఆత్మ సువార్త విూద ఆధారపడి జీవించాలనుకొంటారు. సువార్తను ధ్యానం చేసుకోవడం విూకు మంచిది, అవసరం కూడా.విూరలా లేరా? మన రక్షణను గురించి మనం ప్రతిరోజు నెమరవేసుకోవాలని బైబిలు చేబుతోంది. నీరు, ఆత్మ సువార్తను గురించి పాత, కొత్త నిబంధనలు మనకు వివరిస్తూ వుండగా, దీనిని గాక మరొక దానిని బోధిస్తే అంతకంటే దేవుని ముందు చెడు యింకేముంటుంది? బైబిలు వాక్యమంతా నీరు, ఆత్మ సువార్తను గూర్చి వివరిస్తోంది. ‘‘రక్షణ, విశ్వాస జీవితం, విశ్వాసం, ఆధ్యాత్మిక జీవితం, సాతానుతో పోరాటం, పరలోకం, మహిమ, కృప, దీవెనపునరుత్థానం, నిత్యజీవం, నిరీక్షణ, పరిశుద్ధాత్మ” యివన్నీ నిజమైన ఈ సువార్తకు సంబంధించిన పరిశుద్ధుల మూలభావాలు. వీటిని గాక యితరమైన వాటిని గూర్చి మాట్లాడ్డం సిద్ధాంత వ్యతిరేకత, అసత్యబోధ అవుతుంది. ఒకేదానిలా కనిపించినా దానిలోని సత్యం లేక మూలం వేరైనదైతే అది అసత్యబోధే. బయటికి సువార్తల్లా కనిపిస్తూ లోపల నీరు, ఆత్మ సువార్తకు భిన్నమైనదైతే అసత్య మతా అబద్ధ సువార్తలే.

దేవుని సంఘం అసత్య మతా మోసకరమైన మాటలు గాక దేవుని వాక్యాన్ని ప్రతిరోజు వ్యాపింపచేయడం ఎంత అద్భుతం? మనం దేవుని స్వచ్ఛమైన వాక్యం విని, నమ్మడానికి దేవుని సంఘంతో కలసి వుండడం వలన మనమెంతో ధన్యులం. దేవుని సంఘం ఎల్లప్పుడూ నీరు, ఆత్మ సువార్తను బోధిస్తూ పరిశుద్ధులు ప్రతిరోజుదేవుని కృపను గూర్చి ఆలోచిస్తూ, దేవునికి ప్రార్థన చేస్తూ, ఆయన యందు భయభక్తులు కలిగి వుండి, చెడును వెదకని జీవితాన్ని జీవించేట్టు సహాయం చేస్తుంది. సత్యవాక్యాన్ని మరొకసారి విని, దానిని నమ్మి పాపక్షమాపణను పొందుతున్నందుకు విూకు ఆనందంగా లేదా? నేను కూడా అందుకు చాలా సంతోషంగా వున్నాను. 

నీరు, ఆత్మ సువార్త గాక మరొక దానిని బోధించడానికి ఒకవేళ నేను నిర్బంధం చేయబడితే నేనెంతో వ్యాకులపడతాను. ఒకవేళ రక్షణ వాక్యాన్ని గాక మరొకరు సిద్ధపరచిన బోధలు చెప్పమని నన్ను నిర్బంధిస్తే దానిని తప్పించుకోవాలని కోరుకుంటాను. సత్యవాక్యం తప్ప మాట్లాడ్డానికి నాకు మరొకటి లేదు. మానవసంబంధమైన అనేకాంశాలున్నాయి మాట్లాడ్డానికి, కాని అవన్నీ కూడా తిరిగి పుట్టిన మన విశ్వాసాన్ని తోడులా విరిచి వేస్తాయి.

నీరు, ఆత్మలనే ఈ సువార్త ఒక్కదాని వల్లనే యేసు, దేవుడు తానే మనలను రక్షించాడు. విలువైన దేవుని వాక్యాన్ని మనం పదేపదే నెమరు వేసుకొంటూ వుంటే దాని తియ్యదనాన్ని మనకిస్తుంది. నేను విూకు చెప్పగల కథలు యింకా అనేకం వున్నాయి. కాని మనలను రక్షించే నీరు, ఆత్మ సువార్తను మార్చి చెప్పడం అన్నిటికంటే నాకెంతో యిష్టం. ఈ రక్షణను గూర్చి మాట్లాడుతున్నప్పుడు దానికంటే ఆనందాన్ని కలిగించేది నాకు మరొకటి లేదు. అప్పుడు నా పాత స్మృతులను అంటే దేవుడు నన్నెలా రక్షించాడో, మళ్ళీ మరోసారి ఆయనకు కృతజ్ఞతలు చెబుతూ, మళ్ళీ రక్షణాహారాన్ని పొందుతూ ఎంతో వుప్పొంగిపోతూ వుంటాను.

విూరు కూడా రక్షణ వాక్యాన్ని బాగా యిష్టపడతారని నాకు బాగా తెలుసు. ప్రతిరోజు యిదే కథ అని బహుశా విూరనవచ్చు. కాని దాని ఆంతర్యాన్ని లోతుగా ఆలోచించండి. అప్పుడు ‘‘ఇది నేను మళ్ళీ వింటున్నాను. అయినా యిదివరకటి కంటే యిది యింకా బాగా వుంది. మొదట యిది అంత గొప్పగా లేదు. కాని దీనిని మళ్ళీ మళ్ళీ వినడం కొనసాగించినప్పుడు దీనికంటే వినదగిన కథ మరొకటి లేదు. ఈనాటి కథలో ఏదో ప్రత్యేకత వుంది. కాని యిది నేను విన్న పాత కథే. అయినా నాకెంతో ఆనందంగా వుంది’’ అని విూరు అనుకుంటారని నాకు తెలుసు. సోదరీ సోదరులారా, నేనిక్కడ యేసు వాక్యాన్ని బోధిస్తున్నాను. బోధను యేసు వాక్యాన్ని బోధించాలి. యేసు మన కోసం ఏం చేశాడో రాయబడిన వాక్యం ద్వారా నీరు, ఆత్మ సత్యాన్ని వ్యాప్తి చేయడం తప్ప దేవుని సంఘానికి మరొక అంశం లేదు. ఇప్పుడు సంఘంలో మనం మన విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తున్నాం. పరిశుద్ధ స్థలంలో ప్రవేశించి బంగారంతో చేయబడిన దీపస్తంభం క్రింద వెలిగించబడి స్వచ్ఛమైన బంగారు గృహంలో ఆహారాన్ని భుజించడం, ధూప వేదిక దగ్గర ప్రార్థించడం, దేవుని మందిరానికి వెళ్ళడం, అక్కడ దేవుని ఆరాధించడం, ఆ సువర్ణ గృహంలో జీవించడం, తప్ప మన విశ్వాస జీవితానికి మరేమి లేవు.

ఇప్పుడు విూరు, నేను దేవుడు మన కనుగ్రహించిన విశ్వాస జీవితాలను గడుపుతూ వున్నాం. దేవుని యింటిలోని జీవితమంతా పాపక్షమాపణ పొంది, విశ్వాస జీవితాన్ని జీవిస్తూ వుండడమే. ‘‘కావున మేము అధైర్యపడము. మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దిన దినము నూతన పరచబడుచున్నాడు’’ (2 కొరింథి 4:16) ప్రత్యక్షపు గుడారంలో ప్రత్యక్ష పరచబడిన నీల ధూమ్ర రక్త వర్ణాలు, పేనిన సన్నని నారలో మన విశ్వాసంతో మన ఆత్మలు దేవుని గృహంలో జీవిస్తూ సువర్ణంలా మెరుస్తూ వున్నాయి.

మన పాపాల నుండి, శిక్ష నుండి మనలను రక్షించిన దేవునికి నేనెల్లప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. హల్లెలూయ!