Sermons

[11-2] < యెషయా 52:13 - 53:9 > మన కొరకు శ్రమపడిన మన ప్రభువు< యెషయా 52:13 - 53:9 >

“ఆలకించుడి, నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును. అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాఘనుడుగా ఎంచబడును. నిన్ను చూచియే మనిషి రూపము కంటే అతని ముఖమును, నరరూపము కంటె అతని రూపమును చాల వికారమని చాలామంది యేలాగు విస్మయమొందిరో, ఆలాగే అతడు అనేక జనములను చిలకరించును. రాజులు అతని చూచి నోరు మూసికొనెదరు. తమకు తెలియజేయబడని సంగతులు వారు చూచెదరు తాము వినని దానిని గ్రహింతురు.

మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను? లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన యెదుట పెరిగెను. అతనికి సురూపమైనను, సొగసైనను లేదు. మన మతనిచూచి, అపేక్షించునట్లుగా అతని యందు సురూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడును, మనుషులవలన విసర్జింపబడినవాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిననుభవించిన వాడుగాను మనుష్యులు చూడనొల్లని వాడుగాను వుండెను. అతడు తృణీకరింపబడినవాడు గనుక మనము అతనిని ఎన్నికచేయకపోతిమి. నిశ్చయముగా అతడు మనరోగములను భరించెను. మన వ్యసనములను వహించెను. అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వాని గాను, శ్రమనొందిన వానిగాను మనమతనిని ఎంచితిమి. మన యతిక్రమక్రియలను బట్టి అతడు గాయపరచబడెను. మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని విూద పడెను. అతడు పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. మనలో ప్రతివాడును తనికిష్టమైన త్రోవకు తొలిగెను. యెహోవా మన అందరి దోషమును అతని విూద మోపెను. అతడు దౌర్జన్యమును నొందెను. బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వధకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చుకత్తిరించువాని యెదుట గొర్రెయు మౌనముగా నుండునట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పునొందినవాడై అతడు కొనిపోబడెను. అతడు నా జనుల యతిక్రమములను బట్టి మొత్తబడెను గదా. సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను. అయినను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించినవారెవరు? అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమించబడెను. ధనవంతుని యొద్ద అతడు వుంచబడెను. నిశ్చయముగా అతడు అన్యాయమేమియు చేయలేదు. అతని నోట ఏకపటమును లేదు.’’ఇప్పుడు సువార్త ప్రపంచమంతా విస్తరిస్తున్నది


ఈ యుగం దాదాపు అంతం వైపుకు పయనిస్తోంది. రాజకీయాల నుండి కుటుంబం వరకు, ప్రతిదీ అంతం వైపుకు పరుగెత్తుతూ వుంది. మరి ముఖ్యంగా బలవంతమైన దేశాలు మిగతా ప్రపంచం విూద తమ ప్రభావాన్ని వ్యాప్తి చేస్తూ వుండగా యుద్ధపు గాలి భయంకరంగా ముసురుకొంటూ వుంది. మా స్వంత దేశమైన ఉత్తర కొరియా అంతర్జాతీయ సమాజంలో పైకిలేవాలని అది రసాయనిక ఆయుధాలను (న్యూక్లియర్‌) అభివృద్ధి చేస్తున్నదని ఈ మధ్యనే ప్రకటించింది. ఇలాంటి క్లిష్టపరిస్థితి నుండి బయటపడాలనే ప్రపంచాన్ని గూర్చి నా నిరీక్షణ ఆశ ఒక్కటే. ఈ వివాదాలలోవున్న వారందరూ తమ వివాదాంశాలన్నింటిని అవివేకంతో గాక, వివేకంతో పరిష్కరించుకొని అందరూ కలసి అభివృద్ధి చెందునట్లు ఒప్పందానికి రావాలి.

మనమింకా ఎక్కువగా సువార్తను వ్యాపింపజేసేందుకు మరింత సమయాన్ని దేవుడు మనకు ఇవ్వాలని మనం రోజూ ప్రార్థించాలి. నేను చనిపోతానేమోనన్న భయం నాకు లేదు. కాని ఇంకా నిజమైన సువార్త ప్రకటించబడని దేశాలు ఎన్నో వున్నాయి. ఇప్పుడే నిజమైన సువార్త వికసించబోతోంది. నిజమైన సువార్త యింకా ఎక్కువగా వ్యాపింప చేయాలన్నదే నా కొర్కె. అది అంకురించి, వికసించబోతున్నప్పుడు సువార్తను యింకా బోధించాల్సిన అవసరం ఉంది.

మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగునట్లు దేవుడు చేస్తాడు. కాని మానవులు ఎంతో అవివేకంతో వున్నారే అని నేను బాధపడుతున్నాను. తామెప్పుడు, ఎలా తమ చావును ఎదుర్కొంటారో ప్రజలకింకా ఆలోచనే లేనప్పుడు కొందరు వారి జీవితాలను గూర్చి భయపడుతున్నారు. ఇంకా కొందరు వారిని హత్య చేయడానికి వెనుకాడడం లేదు.

దేవుడు ప్రపంచ నాయకుల హృదయాలను తన ఆధీనంలోనికి తెచ్చుకుంటాడని, ఆయన మనకు శాంతి సమాధానాలను అనుగ్రహిస్తాడని నేను నమ్ముతున్నాను.

ఈ యుగంలో ఇశ్రాయేలీయులు తమ వాగ్దాన మెస్సీయ కొరకు యింకా ఎదురుచూస్తున్నారు. వారెదురు చూసే మెస్సీయ యేసేనని వారు గ్రహించాలి తెలుసుకోవాలి. వారిచే ఎదురుచూస్తున్న మెస్సీయే యేసు అని వారు గుర్తించాలి. ఆయనేనని నమ్మాలి. త్వరలోనే మన ప్రభువును సంతృప్తి పరిచే సువార్త ఇశ్రాయేలు దేశంలోను, యింకా సువార్తకు ద్వారం తెరవని దేశాలలోను సువార్త ప్రవేశిస్తుంది. ఈ యుగాంతపు సమయంలో ప్రపంచమంతా సువార్త వ్యాపించి, అది పూర్తిగా వికసిస్తుంది.

బంగ్లాదేశ్‌లోని వేదాంత విద్యా కళాశాలల్లోని విద్యార్థులు తమ డిగ్రీ పొందాలంటే మేము ఇంగ్లీషులో ప్రచురించిన గ్రంథాలను తప్పక అధ్యయనం చేయాలట అని నాతో ఎవరో చెప్పారు. ఆ వేదాంత కళాశాల విద్యార్థులు నీరు, ఆత్మ సువార్తను గురించి మొదటిసారి తెలుసుకొన్నారు గనుక వారు ఆశ్చర్యపోయే సమయానికి ముందే వారందరూ వారి పాప క్షమాపణను పొందుతారు.

అలాగే ప్రపంచంలోని వేదాంత పండితులందరూ నీరు, ఆత్మ సువార్తను తెలుసుకొని, దానిని నమ్మి పాపవిమోచన పొందాలని నేను ఆశిస్తున్నాను. వారి కంటే ముందుగా, ఈ పాప క్షమాపణను పొందిన మనం యిది జరగాలని ఎడతెగక ప్రార్థన చేయాలి. మనం ప్రార్థించడమే గాక, విశ్వాసంతో జీవించాలి.యెషయా ప్రవచనం తర్వాత 700 సంవత్సరాలకు మెస్సీయ ఈ లోకానికి వచ్చాడు.


యెషయా ప్రవక్త యేసుక్రీస్తు జననానికి 700 సం.కు ముందున్న వాడు. యెషయా ముందుగా జరుగబోయే యేసుక్రీస్తు రాకడను మార్చి చెప్పినా, మెస్సీయను గూర్చి ఆయనకు అనేక సంగతులు తెలుసు. మెస్సీయ ఎలా ఈ లోకానికి వస్తాడో, ఆయన రక్షణ కార్యాన్ని ఎలా చేస్తాడో తన స్వంత కళ్ళతో చూసినట్టుగా ప్రవచించాడు. మానవజాతిని వారి పాపం నుండి మెస్సీయ ఎలా రక్షిస్తాడో యెషయా 52:13లోను, 53, 54 అధ్యాయాల్లో వివరంగా ప్రవచించాడు. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి తనబాప్తిస్మంతో లోకపాపాన్ని తనవిూదకు తీసుకొంటాడని సిలువ విూద రక్తాన్ని చిందిస్తాడని, దాని వలన మానవులందరికి రక్షణ తెస్తాడని ప్రవచించడం అద్భుతం. యెషయా ప్రవచించిన 700 సం.కు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ప్రవచనంలో చెప్పిన సంగతులనన్నింటిని అక్షరాలుగా నెరవేర్చాడు.

మెస్సీయ ఈ లోకానికి వచ్చి జ్ఞానంతో వ్యవహరిస్తాడని యెషయా ప్రవచించాడు. యెషయా 52:13లో యిలా ప్రవచించాడు. ‘‘ఆలకించుడి, నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును. అతడు హెచ్చించబడి ప్రసిద్ధుడై మహాఘనుడుగా ఎంచబడును.’’ యేసుక్రీస్తు మానవునిగా ఈ లోకానికి వచ్చాడు. తన బాప్తిస్మంతో ఈ లోక పాపాలన్నింటిని తానుగా తనపైకి తీసుకొన్నాడు. సిలువ విూద తన ప్రాణాన్ని అర్పించాడు. దాని ద్వారా మానవజాతి అంతటి పాపం నిమిత్తం తీర్పు తీర్చబడ్డాడు. యెషయా ప్రవచించినట్టే ప్రతిదానిలోను వివేకంతో వ్యవహరించాడు. యేసుక్రీస్తు వల్ల నే మానవజాతి పాపమంతా మాయమైపోయింది. ప్రతి విషయాన్ని వివేకంతో చేశాడు. ఆయన పేరు హెచ్చించబడింది, స్తుతించబడింది. అన్నీ కూడా ముందు ప్రవచించిన విధంగానే నెరవేరి క్రీస్తును గూర్చి యెషయా ఏమి ప్రవచించాడో అలాగే నెరవేరింది.

అయినా కూడా మన ప్రభువు ఈ లోకానికి వచ్చినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఆయనను సరిగా గుర్తించలేదు. అయినప్పటికి మన ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. ఇశ్రాయేలీయులతో సహా లోకపాపాలన్నింటిని తాను తీసుకొన్నాడు. సిలువ విూద మరణించాడు. మృతులలో నుండి లేచాడు. అయినా కూడా ఇశ్రాయేలీయులు మెస్సీయ బాప్తిస్మాన్ని నమ్మలేదు. ఆయన రక్తంలోనూ నమ్మక ముంచలేదు. వాస్తవానికి మెస్సీయ వారి జాతిలో యిప్పటికే పుట్టాడని, తన బాప్తిస్మంతోను, సిలువతోను ఇశ్రాయేలీయులు పాపాలనేగాక సర్వమానవజాతి పాపాల విషయం శ్రద్ధ తీసుకొన్నాడని వారు గుర్తించలేదు. ఈ యేసుక్రీస్తు దేవుని కుమారుడు నిజంగా ఇశ్రాయేలీయులు మెస్సీయ అని వారు గుర్తించలేదు. ఇన్ని సంవత్సరాలుగా తాము ఎదురు చూస్తున్న మెస్సీయ యేసేనని ఇశ్రాయేలీయులు యిప్పుడు సరిగా గుర్తించాలి.లోక పాపాలను అదృశ్యం చేయాలనే యేసు శ్రమలు అనుభవించాడు.


యేసు ఈ లోకానికి వచ్చినప్పుడు వివరించలేనంత అవమానంతో శ్రమననుభవించాడు. యెషయా 53లో చెప్పినట్టు మెస్సీయ దుఃఖపడే వ్యక్తిగా కనిపిస్తాడు. మన అనేక పాపాలనుఆయన విూదికి తీసుకొని ఎన్నో బాధించబడ్డాడు. ఆయన అలా బాధపడుతుంటే మనం మన ముఖాలను చాటు చేసుకొన్నాం.

అయితే ఆయన వయస్సు వారితో ఆయన నిజమైన బాధ బాధించబడ్డాడు గనుక కొద్ది మంది యేసును మెస్సీయగా గుర్తించారు. చాలామంది మెస్సీయ అయిన యేసుక్రీస్తును రక్షకునిగా గుర్తించలేదు, నమ్మలేదు. మన ప్రభువు తండ్రి చిత్తానికి విధేయుడై లోకపాపము నుండి మానవజాతిని రక్షించు ఆయన పనిని నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చాడు. ఈ పనిచేయడానికి ఆయన ఎంతో హింసించబడ్డాడు. ఆయన స్వంత సృష్టియైన ఈ సృష్టిలోని ఆయనే తన స్వరూపంలో సృజించిన మానవ రూపంలో వచ్చాడు. అయినప్పటికి ఆయన తృణీకరించబడ్డాడు, పరిహసించబడ్డాడు, దెబ్బలు తిన్నాడు, హింసలు పొందాడు, అవి భరించలేనివి గనుక మనం ఆయనను చూడనొల్లకపోతిమి. మెస్సీయగా ఆయనపట్ల ఈ భూమివిూద భక్తి చూపడానికి మొదలు పెట్టలేదు. వెర్రివానిలా చూసి, హింసించారు. అయినా ఆయన అణకువ మాటలలో వివరించడానికి మొదలు పెట్టలేదు. ఒకరిని అతిగా అవమానించి, హింసించడం చూడలేక మనం ముఖాలు తిప్పుకొంటాం. మెస్సీయ అయితే తాను సృష్టించిన వారి ముందే హింసించబడ్డాడు. అందుకని అప్పటి ఇశ్రాయేలీయులు ఆయన నుండి తమ ముఖాలు తిప్పుకొన్నారు.

మెస్సీయ ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన నిజంగా ఒక లేత మొక్కవలె వున్నాడు. ఎండిన భూమి నుండి వేళ్ళతో బయటికి పీకిన మొక్కవలె వున్నాడు. ఆయనను గురించి బయటికి కనిపించేట్టు చెప్పడానికి ఎక్కువేమీ లేదు. వాస్తవానికి మన ప్రభువును మనతో పోలిస్తే ఆ మెస్సీయలో అందమైనది, ఆకర్షణీయమైనది లేనే లేదు. మన మెస్సీయ బాహ్య రూపంలో చెప్పుకోదగినదేవిూ లేదు.

మెస్సీయా ఈ లోకానికి వచ్చినప్పుడు మనం కోరదగిన, గౌరవించదగిన అందమైనదేదీ ఆయన రూపంలో లేదు. కాని ఈ రూపలావణ్యాలతో సంబంధం లేకుండా వివేకంతో వ్యవహరించాడు. బలియర్పణా విధానం ప్రకారం మన పాపాలనన్నింటిని తన విూదికి తీసుకొనడానికి యెహాను చేతులను తన తలపై వుంచుకొన్నాడు. సిలువ వేయబడ్డాడు. తన రక్తాన్ని కార్చాడు మళ్ళీ మృతులలో నుండి లేచాడు. దాని ద్వారా మనందరి పాపాల నుండి మనలను రక్షించాడు. ఈ మెస్సీయ యెహాను ద్వారా నిజమైన బాప్తిస్మాన్ని పొందుట ద్వారా మన పాపాలనన్నింటిని ఆయన విూదికి తీసుకొని, సిలువ వేయబడి మన కొరకు తన రక్తాన్ని కార్చాడు.

యెషయా 53:3 యిలా వివరిస్తోంది. ‘‘అతడు తృణీకరింపబడినవాడును ఆయెను, మనుష్యుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిననుభవించిన వాడుగాను, మనుష్యులు చూడ నొల్లని వాడుగాను వుండెను. అతడు తృణీకరింపబడినవాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతిమి.’’ మన మెస్సీయ ఈ లోకానికి వచ్చి, తనపై చేతులుంచుట ద్వారా, తన రక్తాన్ని చిందించుట ద్వారా లోక పాపాలను అదృశ్యం చేయాలి గనుక ఆయన నిజముగా ఇశ్రాయేలు ప్రజలు, రోమా సైనికులవలన ఆయనావిధంగా అణచివేయబడ్డాడు.మెస్సీయ నలుగ గొట్టబడడాన్ని 700 సంవత్సరాలకు ముందు ప్రవచించారు.


మెస్సీయ ఈ లోకానికి రావాలని, యోహాను చేత బాప్తిస్మం పొందాలని, సిలువ విూద రక్తం చిందించాలని, మళ్ళీ మృతులలో నుండి లేవాలని క్రీస్తు పుట్టుటకు 700 సంవత్సరాలకు ముందే యెషయా ప్రవక్త ప్రవచించాడు. యెషయా ప్రవక్త మెస్సీయ రాకను గురించి ప్రవచించినట్లే యేసుక్రీస్తు ఈ లోకానిక వచ్చాడు. అంటే, మెస్సీయ అయిన యేసు కన్యకకు జన్మించి, దీనునిగా పశులతొట్టిలో పరుండబెట్టాడు. బాప్తిస్మమిచ్చు యోహాను వలన పొందిన బాప్తిస్మం ద్వారా ఈ లోక పాపాలను తనపైకి తీసుకొన్నాడు. సిలువకు వెళ్ళాడు. అక్కడ తన రక్తాన్ని చిందించి, మన రక్షణ కొరకు చనిపోయాడు. మళ్ళీ మూడవ రోజున మృతులలోనుండి లేచాడు.

పాపపరిహార దినాన బలిపశువుపై చేతులుంచి, దాని రక్తాన్ని చిందించాలి (లేవీ 16). అలా ప్రజల సంవత్సరకాలపు పాపాలు పరిహరించాలి. అలాగే ముందుగా ప్రవచించిన విధంగా యేసు యోహాను వలన పొందిన బాప్తిస్మం ద్వారా మన పాపాలనన్నింటిని తనపైకి తీసుకొన్నాడు. తన రక్తాన్ని చిందించాడు. సిలువ విూద మరణించాడు. తన బాప్తిస్మం ద్వారా లోక పాపాలను తనపైకి తీసుకొన్న యేసు తన బహిరంగ జీవితంలో మూడు సంవత్సరాలు శ్రమను ఎదుర్కొన్నాడు. మెస్సీయ అయిన యేసు యోహాను వలన పొందిన బాప్తిస్మం ద్వారా లోకపాపాలన్నీ ఆయన విూదికి వెళ్ళాయి గనుక ఆయన ప్రతి ఒక్కరి వలన తృణీకరించబడ్డాడు, హింసనుభవించాడు, అణచివేయబడ్డాడు.

వాస్తవానికి యేసును మెస్సీయ అని తిరస్కరించడమే గాక, కొందరు యూదులు, రోవిూయులు ఎంతగానో ఆయనను ద్వేషించి తృణీకరించి వివరించలేనంతగా పరిహసించారు.

యేసు తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి యొర్దాను నదిలో బాప్తిస్మమిచ్చు యోహాను వలన పొంది బాప్తిస్మం ద్వారా మానవజాతి పాపాలనన్నింటిని తనపైకి తీసుకొన్న తర్వాత సిలువ విూద తన రక్తాన్ని చిందించాడు. దిగంబరిగా సిలువ విూద కొరడాదెబ్బలు తిన్నాడు. ఉమ్మి వేయించుకొన్నాడు. ఆ సమయంలో వారందరూ ఆయనను ఎగతాళి చేస్తూ, ‘‘నీవు నిజంగా దేవుని కుమారుడవైతే సిలువ విూది నుండి దిగివచ్చి నిన్ను నీవు రక్షించుకో’’ అని అపహాస్యంతో ఎత్తిపొడిచారు.

తన బాప్తిస్మంతో యేసు తన బహిరంగ జీవితాన్ని ప్రారంభించినప్పుడు మానవుల వలన కల్పించబడిన అనేక శ్రమలను అనుభవించాల్సి వచ్చింది. తన బాప్తిస్మం ద్వారా యేసుక్రీస్తు మానవజాతి పాపాలనన్నింటిని తనపైకి ఎత్తుకొన్నా, ఆనాటి ప్రజలు ఆయనీ పని ఎందుకు చేశాడో గుర్తించలేకపోగా తమ స్వంత మెస్సీయగా వచ్చిన యేసును ద్వేషించారు. ఎడతెగక హింసించారు, నిందించారు, ఎగతాళి చేశారు. యేసు లోకంలో వున్నప్పుడు ఆయనను పురుగులా చూశారని లేఖనాలు వివరిస్తున్నాయి.

పరిసయ్యులు ఆయననెంతగా ద్వేషించారో విూర వూహించలేరు. తమ నాయకత్వాన్ని, ప్రసిద్ధిని విమర్శించిన మెస్సీయను ఈ పరిసయ్యులు వూరకే వదిలి పెట్టలేదు. మెస్సీయను వారు ద్వేషించారు. ఆయనలో తప్పు పట్టాలని ఎప్పుడూ ప్రయత్నించారు. ఆయన విూద వ్యక్తిగతంగా విమర్శతో దాడి చేయడానికి అన్నివేళలా ప్రయత్నించారు. కాని వారి ప్రయత్నాలేవి సఫలం కాలేదు. వారి కుట్రలు ఫలించలేదు. ద్వేషం, చెడుతో నిండిన సకల విధాలైన వారి అవమానాలకు, ఆక్షేపణకు గురైనాడు. మెస్సీయ ఈ లోకంలో ఎలా తృణీకరించబడతాడో, ఎలాంటి ఆదరణ పొందుతాడో ఆయన రాకకు 700సం.కు ముందు యెషయా ప్రవక్త ప్రవచన నెరవేర్పును చూస్తున్నాం.నీరు, ఆత్మల ద్వారా వచ్చిన మెస్సీయ అయిన యేసు క్రీస్తును ప్రజలు నమ్మారా?


ఈ అణచివేతకు సంబంధం లేకుండా మెస్సీయయైన యేసు మౌనంగా తన పనులను పూర్తి చేశాడు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు, ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ కూడా మెస్సీయ యేసుక్రీస్తే అని గ్రహించాలి, నమ్మాలి. ఇశ్రాయేలీయులు, ప్రపంచంలోని ప్రజలందరి పాపాలను ప్రక్షాళనం చేయడానికి మెస్సీయ తనపై చేతులుంచడమనే బాప్తిస్మాన్ని పొందాడు. సిలువ శిక్షను పొందాడు. అలా తన అణచివేతనే శ్రమలన్నింటిని అనుభవించాడు. అలా తన పరిచర్యలో విశ్వాసులందరిని వారి పాపాల నుండి రక్షించాడు. ఆ విశ్వాసుల విశ్వాసాన్ని పూర్తిగా ఆమోదించాడు. మెస్సీయ దీనునిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన బాప్తిస్మాన్ని పొందాడు, సిలువ విూద చనిపోయాడు, అందరి పాపాలను తుడిచివేయడానికి మృత్యుంజయుడై లేచాడు. అయినా ఆయనను నమ్మిన వారు చాలా తక్కువమందే. మనం జీవించాలంటే యేసు మనకు నిజమైన రక్షకుడు, మెస్సీయ అని నమ్మాలి. ఆయన ఇశ్రాయేలీయులకే గాక మానవజాతి అందిరికి మెస్సీయ.

యేసు తన బాప్తిస్మంతో మన పాపాలను ఆయన విూదికి తీసుకొన్నాడు. మన దుఃఖాలను, మన రోగాలను, మన శాపాలను భరించినా కొందరు ‘‘అంత అణచివేతకు గురి అవడానికి ఆయనేం పాపం చేశాడు?’’ అని అనుకొంటున్నారు. వాస్తవంగా యేసు పాపం లేని దేవుని కుమారుడు. మన పాపాలను, శాపాలను, దుఃఖాలను, అణచివేతను భరించి మనస్థానంలో, మన ప్రతినిధిగా శ్రమపడ్డాడు. యేసు తను ఈ లోకంలో 33సం.ల జీవితంలో ఎన్నో తృణీకారాలను ఎదుర్కొన్నాడు. మన పాపాలనన్నింటి నుండి ఆయన మనలను రక్షించాడు.

మళ్ళీ వెనుకకు వెళ్తే యెషయా ప్రవక్త ద్వారా ప్రవచించిన మాట విన్నా, నీరు, ఆత్మ ద్వారా మెస్సీయగా వచ్చిన యేసుక్రీస్తును ఆనాటి ప్రజలు నమ్మారా? మేమిప్పుడు ప్రకటిస్తున్న నీరు, ఆత్మ సువార్తను ఎవరు నమ్మారు? ఇప్పుడు కూడా, తాము యేసుని నమ్ముతున్నామని చెబుతున్నా, వారికి నీరు, ఆత్మ సువార్తలో ఆసక్తి లేని వారే ఎక్కువమంది వున్నారు.

ఇక్కడ ముఖ్యమైన భాగంలో దేవుని కుమారుడు ఈ లోకానికి వస్తాడని, వివేకంతో ప్రవర్తిస్తాడని, మన పాపాలన్ని భరిస్తాడని, వాటి నిమిత్తం తీర్పు తీర్చబడి మనలను రక్షిస్తాడని యెషయా ప్రవక్త ప్రవచిస్తున్నాడు. అయినా ఆయన నెరవేర్చిన సత్యాన్ని ఎక్కువమంది అంగీకరించలేదు. అయినప్పటికి యిప్పటి నుండి అన్ని జాతుల ప్రజలు యేసుక్రీస్తు తమ మెస్సీయ అని గుర్తించి, ఆయనను హెచ్చిస్తారు. మెస్సీయ అయిన యేసు ఇశ్రాయేలు ప్రజల పాపాల నిమిత్తం, విూ, నా పాపాల నిమిత్తం, సమస్త మానవజాతి పాపాల నిమిత్తం హింసించబడ్డాడని విూరు నమ్ముతారని నేను నమ్ముతున్నాను. విూరీ సత్యాన్ని తెలుసుకొని నమ్మాలని ఆశించిన యెషయా ప్రవక్త, మెస్సీయ పరిచర్యను ఈ విధంగా ప్రవచించాడు.మెస్సీయ ఎండిన భూమిలో మొలచిన మొక్కవలె ఉన్నాడు.


మెస్సీయ అయిన యేసుక్రీస్తు రాకను యిలా దయనీయమైన స్థితిలో వుంటుందని యెషయా ప్రవక్త ముందే చెప్పాడు. ‘‘లేత మొక్కవలెను ఎండిన భూమిలో మొలచిన మొక్కవలెను” మెస్సీయ వుంటాడని యెషయా చెప్పాడు (యెషయా 53:2) యేసుక్రీస్తు మానవునిగా ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయనలో చూడాలనిపించేదేవిూ ఉండదు. ఆయన ఆర్నాల్డ్‌ స్వార్జ్‌ నెగ్గర్‌లా, లేక సిల్వెస్టర్‌ స్టాలోన్‌లా కండలు తిరిగి, పొడవుగా, శరీర సౌష్టవంతో వుండడు. ఆయన కురచగా, ఆయన్నచూస్తే ఆయనంటే విచారపడే విధంగా, జాలిపడి, సానుభూతి చూపాల్సిన విధంగా వుంటాడు. అయినా ఆయన మాట ఎంతో వాడిగా, రెండంచుల పదును గల ఖడ్గంలా వుంటుంది. మెస్సీయ అయిన యేసు చూడ్డానికే పేదవానిగా కనిపించడమేగాక, ఆయన నిజంగానే నిరుపేదవాడు. ఆయన ఈలోక తండ్రి అయిన యోసేపు వడ్రంగి, ఇప్పటిలాగే అప్పుడు కూడా వడ్రంగులకు సమృద్ధిగా ఆర్థిక పరిస్థితులు లేవు. వడ్రంగి వృత్తివిూద సంపాదనతోనే కుటుంబం జరగాలి. ఎంత కష్టించినా వారి ఆదాయం అంతంత మాత్రమే.

ఈ లోకానికి వచ్చిన మెస్సీయ బడికి వెళ్ళలేదు. అందుకని పరిసయ్యులు ఆయన్ను ఎగతాళి చేయడానికి ప్రయత్నించారు. కాని వారలా ఎగతాళి చేయ లేకపోయారు. దానిని బట్టి మెస్సీయ ఆయన యేసుక్రీస్తు దేవుని కుమారుడని తెలుస్తోంది. ఈ రోజులలో మహాపండితుడని ప్రసిద్ధిచెందిన ఇశ్రాయేలీయులు ఒక పాఠశాలను నిర్వహిస్తూ ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్నాడు. ఈ పాఠశాలలో ధర్మశాస్త్రంలో పండితులైన వారి నుండి విద్యార్థులు ఈ లోక సంబంధమైన విద్యనే గాక ధర్మశాస్త్రాన్ని కూడా అభ్యసించేవారు. యేసు ఆ పాఠశాలలో చదువుకోలేదు. ఆయన పాఠశాలకు వెళ్ళిన దాఖలాలు లేవు. అయినా మెస్సీయకు తెలియని పాతనిబంధన ధర్మశాస్త్రం లేనే లేదు. మెస్సీయను గురించి పాత నిబంధన బోధించిన దానికంటే ఆయనకింకా ఎంతో జ్ఞానం వుంది. అందరికంటే ఎక్కువ విశ్వాసం వుంది. ఆయన చెప్పిన వాటిలో ఏదీ చట్టవిరుద్ధమైనది లేదు, లేక దేవుని ధర్మశాస్త్రాన్ని దాటి లేదు.మెస్సీయ ఎందుకంతగా హింసించబడ్డాడు, అవమానించబడ్డాడు, తృణీకరించబడ్డాడు?


ఇశ్రాయేలీయులకు నిజమైన మెస్సీయగా అవడానికి, వారి పాపాలన్నింటి నుండి వారిని రక్షించడానికి, వారిని దేవుని ప్రజలుగా చేయడానికి మన మెస్సీయ ఈ లోకానికి వచ్చాడు. తన యిష్ట పూర్తిగా తన శ్రమలను, అవమానాలను పరిహాసాలను, తిరస్కారాలను ఆలింగనం చేసుకొన్నాడు. ఇశ్రాయేలీయుల కోసం మెస్సీయ అనుభవించిన శ్రమలు, తిరస్కారాలు త్యాగంతో కూడినవి, హింసాపూరితమైనవి. మన కొరకు మెస్సీయ పొందిన హింసలు మనం చూడ నొల్లనివి. మన పాపాల నుండి, తీర్పు నుండి మనలను రక్షించిన మెస్సీయ అయిన యేసు వివరించలేనంతగా అన్నిరకాల ప్రజల ముందు హింసననుభవించి, తిరస్కరించ బడ్డాడు.


ఆనాటి ప్రజలు చూసి భరించలేనంత ఘోరంగా హింసించబడి తిరస్కరించ బడ్డాడు. యేసు, విూ, నా మెస్సీయగా వచ్చినా మానవజాతి అంతటి మెస్సీయగా తన పాత్రను, పనులను నెరవేర్చి పూర్తిచేయడానికి ఆయన ఘోరంగా హింసననుభవించి మన పాపాల నుండి, శిక్ష నుండి మనలను విడిపించాడు.

మెస్సీయను సిలువ వేసినా ప్రజలాయనను పరిహసించడం మానుకోలేదు. ‘‘ఆ సిలువ మీద నుండి నీవెందుకు దిగిరావు? నీవు నిజంగా దేవుని కుమారుడవైతే యిప్పుడే సిలువ మీద నుండి దిగిరా! దిగి రాలేకపోతున్నావు గనుక నీవు దేవుని కుమారుడెలా అవుతావు? నీవు నిజంగా దేవుని కుమారుడవైతే, నీవు దిగిరా, నీ ప్రక్కన వ్రేలాడుతున్న దొంగలను రక్షించు, దానికంటే నీవు దిగివచ్చి నిన్ను నీవు రక్షించుకో!’’ అని ఎగతాళి చేశారు. యింకా ‘‘ఇదిగో నీవీరాయిని రొట్టెగా చేయి. మేము నమ్మునట్లు నిదర్శనం చూపించు. అది కూడా చేయలేకపోతే ఇంక నీవేం మెస్సీయవు? ఎంత విచారకరం” అని పరిహసించారు.’’

అలా ప్రజలు ఆపకుండా ఆయనను అవమానించారు. తూలనాడారు, ఎగతాళి చేశారు. వారాయనను దిగంబరిగా చేసి కొరడాలతో కొట్టారు. ముఖం మీద అరచేతులతో కొట్టారు. ఆయనమీద ఊశారు. అంతకు ముందెవరూ చూడని, ఇకముందు కూడా ఎవరూ చూడని మహా వెక్కిరింపులను, అవమానాలను, హేళనలను, క్రీస్తు అనుభవించాడు. ఆ రోజులలో మహా భయంకరమైన, నీచమైన నేరస్థులను మాత్రమే శిక్షించే సిలువ శిక్షతో ఆయనను శిక్షించారు. మెస్సీయను సైనికులు కొరడాలతో కొట్టారు. కాళ్ళు, చేతులను మేకులతో సిలువ కొయ్యకు దిగగొట్టారు. ఆయన శరీరంలో ఉన్న చివరి రక్తపుబొట్టు పోయేటట్టు చేశారు.

యేసు మన కొరకు మెస్సీయగా తన పరిచర్యను నెరవేర్చడానికి ఆ అవమానాలనంతటిని, బాధను, హింసను భరించాడు. సిలువ వేయబడడం ద్వారా ఆయన మన పాపాలనన్నింటిని, పాపం వలన మనకు రావలసిన శిక్షనంతటిని తనపైకి తీసుకొన్నాడు. మీరు, నేను భరించాల్సిన హింసలన్నింటిని మనస్థానంలో మనకు బదులుగా ఆయనపైకి తీసుకొని, మనకొరకు ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. యేసు మన రక్షకుడు అని నమ్మే మనకు ఈ మెస్సీయ రక్షకుడైనాడు. ఆయన ఇష్టపూర్వకంగా మన మెస్సీయ అయినాడు. ఆయన తన తండ్రి చిత్త ప్రకారం ఈ లోకానికి వచ్చాడు. మన పాపాలు ఆయన మీదికి తీసుకొన్నాడు. మనకొరకు సిలువ శిక్షను తను భరించాడు. మనలను రక్షించడానికి మృత్యుంజయుడై లేచాడు.

ఇంతమంది పరదేశీల ముందు అన్ని శ్రమలను, ఆవమానాలను భరించడం యేసుకు సులభమేననుకుంటున్నారా? మనమాయన స్థానంలో వుండి, ఆ అవమానాన్ని దిగంబరిగా కొరడా దెబ్బలు తినడం, ఎగతాళిని, హింసను మన కుటుంబ సభ్యులముందు, మన భర్తలేక భార్య లేక మనలను ప్రేమించేవారి ముందేగాక మన శత్రువు ముందు ఈ బాధను ఎదుర్కొనాల్సి వస్తే చనిపోకముందే పిచ్చివాళ్లమయ్యేవారం. ప్రతి ఒక్కరూ ఆయన అవమానాన్ని చూస్తూ, వేలుతో ఆయనను చూపిస్తూ, ఆయన మీద ఉమ్మి ఎక్కడో మూలన, చాటునగాక అందరికీ కనిపించే ఎత్తైన స్థలంలో క్రీస్తును సిలువ వేశారు.

దీనికంటే యింకా గొప్పశ్రమ, దుఃఖం, కష్టం తన సిలువ శిక్షకంటే ముందే క్రీస్తుకు వచ్చింది. యేసును మేకులతో సిలువకు కొట్టక మునుపే ఆయన అన్ని శ్రమలు అనుభవించగలడని నిర్ధారించుకొన్నారు. ఆయనను జన సమూహాలు ముందుకు తీసుకొని వచ్చి, వారి సమక్షములో తీర్పు తీర్చారు. ఆయనను అరచేతులతో కొట్టారు. ఆయన నోటిమీద ప్రధాన యాజకుని సేవకుడు కొట్టాడు. కొరడాలతో, రాళ్ళతో కొట్టారు! ఈ హింసలన్నింటినీ మెస్సీయ అయిన యేసు మరెవరి కొరకోగాక మనకొరకే భరించాడు.

‘‘మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. మన దోషములనుబట్టి సిలువ గొట్టబడెను’’ అని మనకొరకే ఆయనీ హింసలను పొందాడని లేఖనం చెబుతోంది. (యెషయా 53:5) ఆయన ఇశ్రాయేలీయులతో సహా, సమస్త మానవులను వారి పాపాల నుండి, వాటి వలన వచ్చే శిక్ష నుండి విడిపించడానికి మెస్సీయ అలాంటి శ్రమనుభవించాడు. యోహాను వలన పొందిన బాప్తిస్మం ద్వారా లోక పాపాల విషయమై, దాని వలన వచ్చే శిక్ష విషయమై జాగ్రత్త తీసుకొని, తన స్వంత ప్రజలు, రోమా సైనికులు యింకా అనేక యితర దేశస్తుల వలన హింసనుభవించి మెస్సీయ తన పరిచర్యను సంపూర్తి చేశాడు.

తమ పాపాలతో తనకు వ్యతిరేకంగా నిలిచిన వీరందరిని వారి పాపాల నుండి రక్షించడానికి, అంటే ఆది నుండి మానవులందరూ చేసిన సమస్త పాపాల నుండి మెస్సీయ వారిని రక్షిస్తాడని చేసిన ప్రవచనం ప్రకారం యేసుక్రీస్తు ఈ మెస్సీయగా ఈ లోకానికి వచ్చి ఈ హింసలన్నీ భరించి, పవిత్రమైన తన రక్తాన్ని చిందించి మీ, నా పాపాలను, వాటి వలన మనకు రావలసిన శిక్ష నుండి మనలను రక్షించాడు.

మన పాపానికి, దానివలన మనకువచ్చే శిక్షకు బలి మూల్యాన్ని మనం చెల్లించకుండానే మెస్సీయను నమ్ముటద్వారా మనం రక్షించబడ్డాం. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఆ హింసనంతటిని భరించడం వలన యిప్పుడు మనం పాపంలేని వారమయ్యాం. మెస్సీయ మన పాపాల నిమిత్తం తీర్పు తీర్చబడ్డాడని మనం నమ్ముట ద్వారా రక్షణ వరాన్ని, పాప క్షమాపణను పొందిన మనం దేవుని పిల్లలమైనాము. మన మెస్సీయ వల్లనే మనం అలాంటి సంతోషాన్ని పొందగలవారమయ్యాం.

మనకీ ఆనందాన్ననుగ్రహించి, మనలను దీవించినందుకు మనం మెస్సీయకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మెస్సీయకు మనమెలాంటి కానుక యివ్వకపోయినా, కేవలం మనకు ఆయనను విశ్వసించడం వల్లనే ఆయన తండ్రియైన దేవుని ముందు తనను తాను కానుకగా అర్పించుకొని మనకీ అమూల్యమైన రక్షణను ఇచ్చాడు. దేవుడు తానే ఈ హింసను, శ్రమను భరించి మనలను రక్షించాడని మనం నమ్మాలి. అందుకాయనకు కృతజ్ఞతలు చెల్లించాలి.ఇశ్రాయేలూ, ఇది విని, వెనుదిరిగి యేసుక్రీస్తును నమ్మండి.


ఇశ్రాయేలీయులు యిప్పుడు పశ్చాత్తాపపడి మెస్సీయ అయిన యేసును రక్షకునిగా నమ్మాలి. ఈ క్షణం వరకు తమ మెస్సీయ యిప్పటికే వచ్చాడని ఇశ్రాయేలీయులు గుర్తించలేదు. దేవుని సేవకుడైన మెస్సీయ ప్రవచన వాక్యం ప్రకారం ఈ లోకానికి వచ్చి తన బాప్తిస్మం ద్వారా మానవులందరి పాపాలను తన మీదికి తీసుకొని, సిలువ వేయబడి అందరిని రక్షించాలి. యెషయా ప్రవచించిన విధంగానే యేసుక్రీస్తు తన రక్షణ కార్యాలనన్నింటిని నెరవేర్చాడు. కాగా ఇశ్రాయేలీయులు యిప్పుడాయన వైపు తిరిగి ఈ సత్యాన్ని తెలుసుకొని, దానిని నమ్మాలి. తమ స్వంత ప్రజలు యేసును సిలువవేసి చేసిన పాపాలన్ని యిప్పుడు వీరు ఒప్పుకోవాలి. పుట్టిన దగ్గరనుండి సామూహికంగా చేసిన పాపాలన్ని వారు తమ నిజస్థితిని గుర్తించి ఇప్పుడు ఈ మెస్సీయను నమ్మి తమ పాపాలన్నింటి నుండి, దాని వలన వచ్చే శిక్ష నుండి రక్షణ పొందాలి.

యేసుక్రీస్తు యిప్పటికే వచ్చాడు కనుక ఇప్పుడిక మరో మెస్సీయ లేడు. మరో మెస్సీయ, మరో రక్షకుడు ఎలా వుండగలరు? భావికాలంలో ఇశ్రాయేలు ప్రజలు మరింత కష్టాలను భరించాల్సి వస్తే సూపర్‌మాన్‌ లాంటి హాలీవుడ్‌ కథానాయకుడు ఒకరు వచ్చి తమ మెస్సీయగా వస్తాడని వారు నిరీక్షిస్తారా?


ఇప్పటి నుండైనా ఇశ్రాయేలీయులు యేసుక్రీస్తును తమ రక్షకునిగా గుర్తించాలి. యేసుక్రీస్తే వారి నిజమైన మెస్సీయ అని వారు తప్పక నమ్మాలి. వారిని నిజమైన అబ్రాహాము సంతానంగా చేయడానికి వారి పాపాలను తన విూదికి తీసుకొని వారు సున్నతి పొందినట్లు ఆయన బాప్తిస్మాన్ని తీసుకొని, వారు ఆత్మ సున్నతి పొందినట్లు సిలువ వేయబడ్డానికి వారి మెస్సీయ యేసుక్రీస్తుగా 2000సం. క్రితం ఈ లోకానికి వచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలకు నిజమైన రక్షకునిగా అగుటకు యేసు యోహాను వలన బాప్తిస్మం ద్వారా ఇశ్రాయేలీయుల పాపాన్ని తన విూదికి తీసుకొని హింస ద్వారా తన రక్తాన్ని కార్చి, సిలువను మోసి మృతులలో నుండి లేచాడు.

ఈ మెస్సీయను నమ్మడానికి ఇశ్రాయేలీయులు తప్పక మారుమనస్సు పొందాలి. యేసుక్రీస్తే వారి మెస్సీయ అని వారిప్పుడు నమ్మాలి. నేరవేరబడక యింకా ఇప్పుడు మిగిలి వున్నదల్లా ఇశ్రాయేలీయులు యేసుక్రీస్తే తమ రక్షకుడని నమ్మడం ఒక్కటే. యెషయా ప్రవచించిన మెస్సీయ యేసుక్రీస్తే అని వారు తెలుసుకోవాలి. పాత నిబంధనలోని ప్రవచనాలలో ఒక పొల్లయినను, ఒక గీతనైన విడువక యేసుక్రీస్తు అన్నింటిని నెరవేర్చాడు. అనేక దేశాలలో రక్తప్రోక్షణ జరగాలని ప్రధాన భాగంలో చెప్పారు.

యెషయా 52:14-15 యిలా వివరిస్తోంది. ‘‘నిన్ను చూచి యేమనిషి రూపము కంటే అతని ముఖమును, నర రూపము కంటే అతని రూపమును చాలా వికారమని చాలామంది యేలాగు విస్మయమొందిరో ఆలాగే అతడు అనేక జనములను చిలకరించును. రాజులు అతని చూచి నోరు మూసికొనెదరు. తమకు తెలియజేయబడని సంగతులు వారు చూచెదరు తాను వినని దానిని గ్రహింతురు.’’

ఈ లోకంలో ఏ నేరస్థుడు మరణశిక్షను అనుభవించని దానికంటే ఎంతో గొప్ప శ్రమను యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఎదుర్కొన్నాడు. సమస్త మానవాళి తన ప్రజలు కావాలని ఈ లోకంలోని ఏ నేరస్థుడు భరించని బాధను, హింసను తన విూదికి తీసుకొని యేసు తనను తానే బలియర్పణగా అర్పించుకొన్నాడు. ఆయనను నమ్మి పాపక్షమాపణ పొందిన తన ప్రజలను ఆయన రక్షించాడు.

ఇంతకు ముందు ప్రజలు వినని, చూడని అద్భుతమైన రక్షణ సువార్తను ప్రజలు వింటారు. యేసుక్రీస్తే మెస్సీయ అని యింతవరకు వినని వారు కూడా దీనిని విని, నమ్ముతారు.ఒకప్పుడు వచ్చి, మళ్ళీ రాబోతున్న యేసే మెస్సీయ


ఈరోజు, ఇప్పుడు మనం అంత్య కాలాన్ని సమీపిస్తున్నాం. ఇది మరణం, శ్రమల యుగం. మెస్సీయను నమ్మిన వారికి నిజముగా మరణ భయం లేదు. దీనికి భిన్నంగా వీరి మరణం తర్వాత వారికి కలుగబోయే పరలోక ఆనందం, పునరుత్థానం కొరకు వారు ఎదురు చూస్తుంటారు. ప్రపంచం మీదికి అంధకారం దిగిరాబోతోంది. అట్లని ఆ అంధకారం నీతిమంతులమైన మన మీదికి కూడా వస్తుందని అర్థం కాదు. ఈ సువార్త అంతా వ్యాపించినప్పుడు మెస్సీయ నిజంగా తిరిగి వస్తాడు.

మన మెస్సీయ అయిన యేసుక్రీస్తు దేవుని గొర్రె పిల్లగా, బలిఅర్పణగా ఈ లోకానికి వచ్చాడు. యోహాను వలన ఆయన శరీరం బాప్తిస్మాన్ని పొంది, ఆ శరీరాన్ని సిలువకు అప్పగించాడు. బొచ్చు కత్తిరించు వాని యెదుట గొర్రె మౌనంగా నిలిచినట్టు మెస్సీయ అయిన యేసు మన పాపాలను తన మీదికి మౌనంగా స్వీకరించి, మన పాపాల తీర్పుకు వచ్చే మహాశ్రమలను సిలువ విూద భరించాడు. మూడవ రోజున మృతులలో నుండి లేచి దీనిని నమ్మిన వారందరికి పరిపూర్ణమైన రక్షకుడైనాడు.

ఆ సమయంలో యేసుక్రీస్తే మెస్సీయ అని తెలిసిన వారు చాలా తక్కువ మందే. యేసుక్రీస్తు 2000 సం.కు ముందు ఈ లోకంలో నిశబ్ధంగా పుట్టి తన బాప్తిస్మం దేవుని రాజ్యం తర్వాత సువార్తను సాక్ష్యమిచ్చి సిలువ విూద మరణించి, మరల మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తే మన మెస్సీయ అని తెలిసిన వారు కొద్దిమంది మాత్రమే. ఆ కొద్దిమందిలో ఎవరు దేవుని కొరకు కనిపెట్టి ఆయనలో నమ్మకముంచారో వారు తన కార్యాలనన్నింటిని మౌనంగా నెరవేర్చిన మన ప్రభువే. మెస్సీయ అని సాక్ష్యమిచ్చారు.

మెస్సీయ ఈ లోకానికి వచ్చి, హింసనుభవించి మనలను మన పాపాల నుండి రక్షించాడన్న వార్తను దేవుని సేవకులు లోకమంతా వ్యాప్తి చేశారు. అచ్చు పనుల ద్వారా, ప్రపంచ చరిత్రను నడిపిస్తూ దేవుడే నీరు, ఆత్మ సువార్తను ప్రపంచమంతా వ్యాప్తి చేస్తున్నాడు. ఇంకా ఈ సువార్తను అనేక దేశాలు మరింత బలంగా, భాగ్యవంతంగా వ్యాప్తి చేసేట్టు చేస్తున్నాడు.

“యేసు మెస్సీయ, యేసు మెస్సీయ, యేసు మెస్సీయ” యేసును విూ మెస్సీయగా విూరు నమ్మితే విూరు రక్షించబడతారు. యేసు దేవుని కుమారుడు. ఈ యావత్‌ సృజించిన సృష్టికర్త యేసే. ఆయనే దేవుడు, ఆయన మన రక్షకుడైన మెస్సీయ, యేసే మెస్సీయ అని, ఆయన బాప్తిస్మాన్ని గూర్చి, సిలువ విూద మరణాన్నిగూర్చి, ఆయన పునరుత్థానాన్ని గూర్చి దేవుని సేవకులు ఈ లోకానికి బోధిస్తూనే వున్నారు.

2000సం. క్రితం యేసు అనే బాలుడు ఈ లోకంలో పుట్టాడని, ఆయనకు 30 సం.ల వయస్సు వచ్చినప్పుడు యోహాను వలన బాప్తిస్మం పొందుట ద్వారా మానవుల పాపాలను తనపైకి తీసుకొన్నాడని కొద్దిమంది ఇశ్రాయేలీయుల్లోని యౌవనస్తులు గ్రహించారు. ఆ కాలంలో ఆయన మెస్సీయ అని ఆయన శిష్యులకు మాత్రమే తెలుసు. ఈ సంగతిని దేవుడంటే భయభక్తులు గల కొద్దిమందితో మాత్రమే వారుపంచుకొన్నారు. మిగిలిన వారందరికీ ఈ విషయం మరుగు చేయబడినది. అప్పుడు ఇశ్రాయేలీయులలో మొత్తం విూద సుమారు 500 మంది పరిశుద్ధులకు మాత్రమే మెస్సీయ లోక పాపమును సిలువకు మోసికొని వెళ్ళాడని, దాని మీద చనిపోయాడని, మృత్యుంజయునిగా లేచాడని తెలుసు (1కొరింథి 15:6), మిగతావారికసలు తెలియనే తెలియదు.

యేసు చనిపోయి పునరుత్థానుడైన తర్వాత 50వ రోజున యేసు శిష్యులు మేడగదిలో ప్రార్థిస్తూ వుండగను పరిశుద్ధాత్మ వారి విూదికి దిగివచ్చాడు. వారు అన్యభాషలలో మాట్లాడే శక్తినిచ్చి మన యేసుక్రీస్తు మెస్సీయ అని సాక్ష్యమిచ్చేటట్టు చేశాడు. అప్పుడు వారు ‘‘పునరుత్థానుడైన యేసే మెస్సీయ ఈ మెస్సీయ మన రక్షకుడు” అని చావుకు భయపడక, ధైర్యంగా సాక్ష్యమిచ్చారు. అప్పుడు అనేకమంది నమ్మడం మొదలుపెట్టారు.

మెస్సీయ అయిన యేసు ద్వారా దేవుడు మిమ్మును, నన్ను మన పాపాల నుండి, వాటి శిక్ష నుండి రక్షించాడు. ఆయనలా హింసించబడి, శ్రమననుభవించి మన పాపాల నుండి, వాటి తీర్పు నుండి మనలను రక్షించాడు. కనుక మన మాయనను పూర్తిగా నమ్మాలి. ఇప్పటికి ఆయనను నమ్మని వారు పశ్చాత్తాపంతో ఆయన వైపు తిరిగి ఆయనను నమ్మాలి. మనమందరం విశ్వాసంతో ఈ సత్యాన్ని వ్యాప్తి చేయాలి.

ఇశ్రాయేలు ప్రజలు యిప్పుడు భయంతో మిక్కిలి ఒత్తిడి పరిస్థితిలో వున్నారు. దేవుడు వాస్తవంగా వారితో చెప్పిన ప్రత్యక్ష గుడారపు వాక్యం వారిప్పుడు వినాలి. మనం కూడా అంత్యకాలంలో ప్రవేశిస్తున్నాం. బలియర్పణా విధానంలో ప్రత్యక్ష పరచబడిన నీరు, ఆత్మ సువార్త ఇశ్రాయేలీయులకు చేరడానికి మార్గాన్ని కల్పించుకొంటోంది. దేవుడు తమ వారితో చెప్పిన మెస్సీయ యేసుక్రీస్తే అని నమ్ముతారు.

దేవుడు బలియర్పణా విధానాన్ని గూర్చి ఇశ్రాయేలీయులతో ఎప్పుడో చెప్పాడు. వారు దానిని నమ్మారు. వారు యిప్పటికి ఈ బలియర్పణా విధానంలోనే దేవునికి అర్పిస్తున్నారు. ఇశ్రాయేలీయులలో బైబిలునే ప్రామాణికంగా నమ్మే కొందరు యింకా అర్పణను సమర్పిస్తున్నారు. అంటే ఒకప్పుడు ప్రత్యక్షపు గుడారం ముందు ఎలా అర్పణలు అర్పించారో అలాగే వారు యిప్పుడు తమ అర్పణను అర్పిస్తున్నారు. బహుశా వారు అహరోను సంతానం వారై వుండవచ్చు. వారి కుటుంబ సాంప్రదాయాలను అనుసరించడానికని పట్టణాలలో నివసించడానికి బదులు అరణ్య ప్రాంతాలలో నివసిస్తూ వున్నారు. వారు ఇశ్రాయేలీయులే అయినా సామాన్య ప్రజలకు దూరంగా ఏకాంతంగా ప్రత్యేకించుకొన్న గోత్రికులుగా జీవిస్తున్నారు. ఈ ప్రజలకు కూడా మనం మెస్సీయ యిప్పటికే వచ్చాడని, మన విశ్వాసం చొప్పున మనలను రక్షించాడు అన్న ప్రత్యక్ష గుడారపు వాక్యాన్ని ప్రకటించాలి.

యేసు ఈ లోకానికి వచ్చి మన రక్షకునిగా మనలను రక్షించడానికి ఎన్నో హింసలనుభవించి, మన స్థానంలో ఆయన తీర్పును పొంది, మన పాపశిక్షను అనుభవించినందుకు మనమాయనకు కృతజ్ఞతలు చెల్లించాలి.‘‘ప్రేమ మరణమంత బలవంతమైనది, ఈర్ష్య పాతాళమంత కఠోరమైనది’’


ఏదో పోస్టులో వచ్చిన ఒక ఉత్తరంలా గాక మనం మన పాపాల నుండి, ఆ పాప ఫలితపు తీర్పు నుండి రక్షించబడడం అనుకొనని విధంగా జరిగింది కాదు. విూరీ ఉత్తరానికి 20 ప్రతులు తీసి యిరవైమందికి పంపించాలి. లేకుంటే విూరు నష్టపోతారు అన్న గొలుసు ఉత్తరాల వంటిది కాదు మన రక్షణ, లేక మనం కొంతే డబ్బు చెల్లించి తిన్నంత తినవచ్చు అన్న ఆహారంలాంటిది కాదు.

మన రక్షణ దేవుడు తన కుమారుని మన దగ్గరకు పంపించి, మన పాపాలనన్నింటిని ఆయన విూద మోపి, మన ఈ పాపాల నిమిత్తం ఆయనను హింసించి, శ్రమపెట్టి మనకు యిచ్చినది. ఇందుకు మన హృదయపూర్వకంగా మన మాయనను నమ్మి ఆయనకు కృతజ్ఞతలు తెలియజేయాలి. మనకు రక్షణ ఎలా కలిగిందో తెలిసీ ఎవరైనా పాత గిలి చినిగిపోయిన జోళ్ళులా ఎలా పారవేయగలరు. లేక పగిలిపోయి, పనికి రాకుండా పోయిన వస్తువుల్లా అటకవిూద ఎలా పెట్టగలరు, లేక యిది మనది కాదు ఎవరిదో అన్నట్టు ఎలా అశ్రద్ధ చేయగలరు?

విూలో దేవుని సంఘారాధనకు వెళ్తూ యింకా పాప క్షమాపణ పొందని వారెవరైనా వున్నారా? ఇంకా విూలో నీరు, ఆత్మ సువార్తను నమ్మని వారున్నారా? ఒకవేళ వుంటే యింకా ఆలస్యం చేయక మారుమనస్సు పొంది, మెస్సీయను నమ్మండి. విూరు తప్పిపోయిన మార్గాన్ననుసరించాలో సరిగ్గా తెలియని స్థితిలో వుంటే విూ హృదయ పూర్వకంగా ఈ సత్యవాక్యాన్ని నమ్మండి. దేవుని కుమారుడైన యేసు మన యెడల ఆయనకున్న ప్రేమను బట్టి మనకోసం ఈ శ్రమలన్నింటిని అనుభవించి యిచ్చిన రక్షణను ఎవరు నమ్మరో, లేక తిరస్కరిస్తారో వారు నశించిపోతారు.

యేసు ప్రేమ విలువను చులకనగా చూసి దానిని తిరస్కరించిన వారికి చివరికది క్రూరమైన శిక్షను కలిగిస్తుంది. మరోమాటల్లో అదేమని వివరిస్తున్నదంటే, ఒక వ్యక్తి స్త్రీగాని, పురుషుడుగాని ఒకవేళ పాపంలోనే వుండి చనిపోతే సమాధి వంటి నిర్దయతో కూడిన నరక బాధను అనుభవించాల్సి వస్తుంది. ద్వేషం పాతాళమంతటి క్రూరమైనది. మెస్సీయ నిన్ను ప్రేమించి నిన్ను రక్షించడం కోసం ఆయన నీ పాపాలనన్నింటిని తనపైకి తీసుకొని, తన రక్తాన్ని చిందించి అన్నిరకాల హింసలను అనుభవిస్తే నీవా ప్రేమను నమ్మక, దానిని తిరస్కరిస్తే నీవు తప్పక ఆ క్రూరమైన బాధను అనుభవిస్తావు. ఇది నరకమే.

‘‘మనుష్యులొక్కసారే మృతి పొందవలెనని నియమింపబడెను. ఆ తరువాత తీర్పు జరుగును’’ అని దేవుడు చెప్పాడు. (హెబ్రి 9:27) మనం చనిపోయినప్పుడు మన శరీరం గతించిపోతుంది. కాని దేవుని ముందు అది మన అంతం కాదు. దేవుని ప్రేమను తిరస్కరించిన వారిని క్రూరంగా తొక్కివేయడానికి దేవుడు వారిని మరణించకుండా నిత్యం జీవించి వుండేట్టు చేస్తాడు. కనికరం లేకుండా వారిని ఎన్నటెన్నటికి అంతం లేని, ఎడతెగని బాధను, శ్రమను వారనుభవించేట్టు చేస్తాడు. ఈ క్రూరమైన బాధ దేవుని క్రూరమైన ద్వేషం తప్ప మరొకటి కాదు. దేవుడెన్నటికి అలాంటి శ్రమపెట్టడని నీవనుకొంటున్నావా? కాని దేవునికి అసాధ్యమైనదేదీ లేదని గుర్తుంచుకో!

మనపట్ల దేవునికున్న అత్యంత ప్రేమతో మనకోసం ఎన్నో శ్రమలనుభవించి మన శాపాలన్నింటి నుండి, మన పాపాలన్నింటి నుండి, మన సమస్త శిక్ష నుండి రక్షించాడు. మెస్సీయ ఈ ప్రేమ తప్ప విూ సమస్యలన్నింటిని తీర్చగలదేముంది? మెస్సీయ ప్రేమ కంటే రూఢియైన గొప్పది యింకేముంది. ఈ మెస్సీయలో విశ్వాసం లేకపోతే మనకు దేవుని ప్రేమ వుండదు. మెస్సీయను ఆయన తండ్రియైన దేవుడు పంపించి మనకీ ప్రేమను యిచ్చాడు. సర్వశక్తిమంతుడు, త్రిత్వమైన దేవుడు ఈ విధంగా మనలను ప్రేమించి, మన పాపాల నుండి, శిక్ష నుండి మనలను రక్షించాడు. ఇందుకని మనం మెస్సీయను నమ్మాలి, ఇందుకని మనమాయనకు కృతజ్ఞతలు చెప్పాలి, ఇందుకోసం మనమాయనను మహిమ పరచాలి. ఇందుకోసమని ఈ మెస్సీయలో మన విశ్వాసముంచి మనం తృప్తి పొందాలి.

మెస్సీయ మనకు నీరు, ఆత్మ సువార్తను యిచ్చినందుకు మనమెంత కృతజ్ఞులమై వుండాలి? ఈ ప్రపంచంలోని దేనితోనూ ఎన్నటికి దీనిని మార్చుకొనలేని ఈ ప్రేమ ఎంతో అమ్యూలమైనదని ఎవరైనా తెలుసుకొనలేకపోతే అలాంటి వారు నిజంగా ఆజ్ఞలను, మూర్ఖులు అన్నమాట. మన కోసం మన ప్రభువు ఎంతో భయంకరమైన శ్రమలను, బాధలు అనుభవించాడు. అందుకు మనమెంతో కృతజ్ఞులమై వుండాలి. మనమెంత చాలని వారమైనా, మనకున్న బలాన్నంతటిని సమకూర్చుకొని ఈ ప్రేమ తెలియని వారికి మనవిూ ప్రేమను పంచిపెట్టాలి.

ఈ దేవుని ఈ పనులు చేయడానికి మనం కూడా ఎన్నో కష్టాలను, శ్రమలను ఎదుర్కొనాలి. మనంతట మనమే ముందుకు కొనసాగలేం. మనం నిజంగా ఆయన త్యాగపూరితమైన ప్రేమను పొంది రక్షించబడితే మనలో ఆ రక్షణ వుంటే, ఈ ప్రేమను మనం యితరులతో పంచుకోవాలి. శారీరకమైన ప్రేమతో గాక ఆయన నిజమైన ప్రేమతో యేసుక్రీస్తులా మన పాపాలను తుడిచివేయడానికి మనం కూడా ఇతరులు పాపక్షమాపణ పొందాలని యిష్టపూర్వకంగా కష్టాలను, హింసలను, ద్వేషాన్ని, శ్రమలను, తృణీకారాలను ఆలింగనం చేసుకోవాలి. అలాంటి ద్వేషాన్ని ప్రేమ పేరుతో మనం అనుభవించాలి. విూరు నేను నిజంగా పాపక్షమాపణను పొంది వుంటే అలాంటి ప్రేమ నిజంగా మన హృదయాలలో కనబడుతుంది.

తిరిగి పుట్టినవారు, అంతకు ముందు వారెలాంటివారో జ్ఞాపకం చేసుకొని, యేసు ప్రేమ ఎంత గొప్పదో, బలమైనదో తెలుసుకొని దాని ఫలాలను ఫలిస్తారు. రక్షణ పొందిన వారు ఫలించు చెట్ల వంటివారు. ‘‘చెట్టు దాని పండు వలన తెలియును’’ (మత్తయి 12:33) నీవు రక్షణ పొందక మునుపు నీవు పాపాలలో పూర్తిగా మునిగి వున్నావు. కనుక నరకం నుండి బయట పడాలని అడగనే అడగవు. అయినా దేవుడు మానవునిగా ఈ లోకానికి వచ్చి, నీ కోసం హింసలనుభవించి, నీ బదులుగా శ్రమలనుభవించి నీ పాపాల నుండి, తీర్పు నుండి నిన్ను రక్షించాడని నీవు నమ్మావు. అలా నమ్ముట వలన నీవు రక్షించబడ్డావు. నీవు నిజంగా ఈ ప్రేమను పొందివుంటే మనం ఇతరుల కొరకు జీవించాలన్న మనసు కలిగి వుంటాం.

అలాంటి హృదయం (మనసు) ఎవరికి వుండదో ఆ వ్యక్తి, పాపక్షమాపణ పొందలేదన్నమాట. సరిగ్గా చెప్పుకొంటే అలాంటి వ్యక్తి పాపక్షమాపణ పొందినట్టు నటిస్తున్నాడన్నమాట.

క్రీస్తు మనలను ప్రేమించి తన శ్రమలను ఎదుర్కొని మన పాపాల నుండి, తీర్పు నుండి రక్షించినట్లే మనం నిజంగా ఆయన ప్రేమలో రక్షణ పొంది వుంటే క్రీస్తు మనలో నివసిస్తున్నాడు. గనుక ఆ ప్రేమ మన మనస్సులో కూడా కనబడుతుంది. ఆయన మనకోసం హింసలనుభవించి మనలను ప్రేమించినట్టే మనం కూడా ఇతరుల కోసం జీవించి కష్టాలను ఎదుర్కొనాలి. ఎవరైతే పాపక్షమాపణ పొందారో వారి హృదయాలలో యింకెంత మాత్రమూ పాపం మిగిలి వుండదు. మన హృదయాలు క్రీస్తు హృదయంలా రూపాంతరం చెందుతాయి.

మనకోసం యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి బాప్తిస్మాన్ని పొంది, సిలువ విూద తనరక్తాన్ని చిందించి శ్రమలన్నింటినీ ఆలింగనం చేసుకొన్నందుకు దాని వలన మనకు మెస్సీయయై మన పాపాలనన్నింటి నుండి మనలను విమోచించినందుకు నేనాయనకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను.