Sermons

[11-3] < నిర్గమ కాండం 34:1-8 > యెహోవా సజీవుడైన దేవుడు< నిర్గమ కాండం 34:1-8 >

“మరియు యెహోవా మోషేతో ` మొదటి పలకల వంటి మరి రెండు రాతి పలకలను చెక్కుము. నీవు పగుల గొట్టిన మొదటి పలకల విూదనున్న వాక్యములను నేను ఈ పలకల విూద వ్రాసెదను. ఉదయమునకు నీవు సిద్ధపడి ఉదయమున సీనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరము విూద నా సన్నిధిని నిలిచి యుండవలెను. ఏ నరుడును నీతో ఈ కొండకు రాకూడదు. ఏ నరుడును ఈ కొండ విూద ఎక్కడనైనను కనబడకూడదు. ఈ కొండ ఎదుట గొర్రెలైనను, ఎద్దులైనను మేయకూడదని సెలవిచ్చెను. కాబట్టి అతను మొదటి పలకల వంటి రెండు రాతిపలకలను చెక్కెను. మోషే తనకు యెహోవా ఆజ్ఞాపించినట్లు ఉదయమందు పెందకడలేచి ఆ రెండు రాతి పలకలను చేతపట్టుకొని సీనాయి కొండ ఎక్కగా మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవా అను నామమును ప్రకటించెను. అతని యెదుట యెహోవా అతని దాటి వెళ్లుచు `యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములుగల దేవుడైన యెహోవా. ఆయన వేయివేల మందికి కృపను చూపుచు, దోషమును, అపరాధమును, పాపమును క్షమించును గాని ఆయన ఏ మాత్రమును దోషులను నిర్దోషులగా ఎంచక మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల విూదికిని, కుమారుల కుమారుల విూదికిని రప్పించునని ప్రకటించెను. అందుకు మోషే త్వరపడినేల వరకు తలవంచుకొని నమస్కారము చేసెను.’’మనం నమ్ముతున్న ఈ దేవుడు నిజంగా ఎవరు అని మనం తెలుసుకోవాలి


మనం నిర్గమ 3:13-16ను చూడ్డంతో ప్రారంభిద్ధాం ‘‘మోషే చిత్తగించుము నేను ఇశ్రాయేలీయుల యొద్దకు వెళ్ళి వారిని చూచి విూ పితరుల దేవుడు విూ యొద్దకు నన్ను పంపెనని వారితో చెప్పగా వారు ` ఆయన పేరేమని అడిగిన యెడల వారితో నేనేమి చెప్పవలెనని దేవుడు నడిగెను. అందుకు దేవుడు ` నేను ఉన్న వాడనూ అనువాడనై యున్నానని మోషేతో చెప్పెను. మరియు ఆయన ఉండునను వాడు మీయొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పవలెననెను మరియు దేవుడు మోషేతో నిట్లనెను విూ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రాహాము దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడైన యెహోవా నీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పవలెను. నిరంతరము నా నామము ఇదే. తరతరములకు ఇది నా జ్ఞాపకార్థక నామము. నీవు వెళ్ళి ఇశ్రాయేలీయుల పెద్దలను పొగుచేసి ` విూ పితరుల దేవుడైన యెహోవా, అనగా అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు, నాకు ప్రత్యక్షమై యిట్లనెను ` నేను మిమ్మును, ఐగుప్తులో విూకు సంభవించిన దానిని నిశ్చయముగా చూచితిని.’’యెహోవా (యావే) దేవుడు ఎవరు?


హీబ్రూ భాషలో దేవుని పేరు ‘‘యావే”, (Yahweh) లేక YHWH సంప్రదాయంలో యెహోవా. యావే అంటే తనకు తానే ఉనికి గలవాడని అర్థం. దేవుడు అంటే సృజించబడిన వాడు కాడు. కాని తనకు తానే ఉనికి కలిగి, ఈ జగత్తును, దానిలోని సమస్తాన్ని సృజించిన వాడు అని అర్థం.

నిర్గమ 6:2-7ను చూడండి : ‘‘మరియు దేవుడు మోషేతో ఇట్లనెను ` నేనే యెహోవాను; నేను సర్వశక్తిగల దేవుడను పేరున అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతిని. కాని యెహోవా అను నా నామమున నేను వారికి తెలియబడలేదు. మరియు వారు పరవాసము చేసిన దేశమగు కనాను దేశమును వారికిచ్చుటకు నా నిబంధనను వారితో స్థిరపరచితిని, ఐగుప్తీయుల దాస్యమునకు లోపరచియున్న ఇశ్రాయేలీయుల మూలుగును విని నా నిబంధనను జ్ఞాపకము చేసికొనియున్నాను. కాబట్టి నీవు ఇశ్రాయేలీయులతో ఈలాగు చెప్పుము` నేనే యెహోవాను నేను ఐగుప్తీయులు మోయించు బరువు క్రింద నుండి మిమ్మును వెలుపలికి రప్పించి వారి దాసత్వములో నుండి మిమ్మును విడిపించి, నా బాహువును చాపి గొప్ప తీర్పు తీర్చి మిమ్మును విడిపించి, మిమ్మును నాకు ప్రజలగా చేర్చుకొని విూకు దేవుడనై యుందును. అప్పుడు ఐగుప్తీయుల బరువు క్రింద నుండి మిమ్మును వెలుపలికి రప్పించిన విూ దేవుడనైన యెహోవాను నేను అని విూరు తెలిసికొందురు.’’

మూడవ వచనంలో ‘‘నేను సర్వశక్తిగల దేవుడను పేరున అబ్రహాము, ఇస్సాకు, యాకోబుకు ప్రత్యక్షమైతిని. కాని యెహోవా అను నా నామమున నేను వారికి తెలియబడలేదు” అని వుంది. ‘‘యెహోవా” అన్న హిబ్రూ పదానికి ‘‘ఉన్నవాడు” అని లేక ‘‘నిజమైన దేవునికి గల నామ వాచకము” అని అర్థం. అంతకుముందు దేవుడు యెహోవా అన్న పేరుతో మానవులకు తెలియదు. ఆనాటి ప్రజలు ఆయనను దేవుడు అనే పిలిచారు. కాని యిప్పుడు ఇశ్రాయేలు జనాంగాన్ని రక్షించడానికి ప్రపంచంలోని ప్రజలందరికీ తన నామము యెహోవా అని తెలియునట్లు చేశాడు. ‘‘నేను యెహోవాను. నేను యావేను. నేను ఉన్నవాడను అనువాడను”. అలా దేవుడు తనను తాను బయల్పరచుకొన్నాడు.

“అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు” స్వయం ఉనికి గలవాడు ఆయన అనాది కాలం నుండి, ఏదీ లేని దానికి మందు నుండి వున్నవాడు దేవుడు అంటే సజీవునిగా, శాశ్వతంగా వుండేవాడు. దేవుడు అబ్రహాము సంతానమైన ఇశ్రాయేలీయులను ఈజిప్టులో (ఐగుప్తులో) 430సం.లు బానిసలుగా చేసి, తర్వాత వారిని దాస్యం నుండి విడుదల చేసి కనాను దేశంలోనికి నడిపిస్తానని వాగ్ధానం చేశాడు. యెహోవా దేవుడు వాగ్ధానం చేసినట్టే 430సం.లు తర్వాత మోషేకు ప్రత్యక్షమై ‘‘నేను నీ దేవుడనైన యెహోవాను ఉన్నవాడను నా ప్రజలను వెళ్లనిమ్మని” ఫరోతో చెప్పి, వారిని విడిపించుమని అతన్ని ఆజ్ఞాపించాడు. తన ప్రజల కోసం, దేవుడు తనను మోషేకు ప్రత్యక్షపరచుకొని దేవుడైన యెహోవా ఇశ్రాయేులు ప్రజల శ్రమలు తెలుసు గనుక వారిని పంపించమని ఫరోను ఆజ్ఞాపించాడు. తన ప్రజలు శ్రమలతో మూలుగుతున్నారని దేవునికి తెలు సు గనుక ఆయన వారినా దాస్యం నుండి విడిపిస్తాడు.

దేవుడు అబ్రాహాముతో వాగ్ధానం చేసి 430 సం.లు క్రితం ఆయన అబ్రాహాముతో వాగ్ధానం చేశాడు. గనుక ఆయన ఇశ్రాయేలీయుల దగ్గరకు వచ్చి, ‘‘నేను దేవుడైన యెహోవాను. విూ తండ్రియైన అబ్రాహాము సంతాన్ని ఈజిప్టు నుండి కనానుకు నడిపిస్తానని చేసిన వాగ్ధానాన్ని నెరవేర్చడానికి వచ్చాను. విూ శ్రమలు నాకు తెలుసు. కనుక యిప్పుడు వారి దగ్గరకు వెళ్ళి నేను చెప్పినట్టు చెప్పి యెహోవా తనను తాను ప్రత్యక్షపరచుకొన్నాడు.

వాస్తవానికి దేవుడు అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడని ఆయనే మనకూ దేవుడని మనం తెలుసుకోవాలి. అయితే ఆయన పేరేమిటి? ఆయన పేరు యావే. అంటే తనకు తానే ఉనికి గలవాడు (స్వయం ఉనికి గలవాడు) అని అర్థం. ఈ జగత్‌ సృష్టికి ముందు నుండి స్వయం వునికి కలిగి వున్నవాడు.

మనం దేవుని నామము అర్ధాన్ని అర్థం చేసుకోవాలి.

దేవుడు స్వయం ఉనికి గలవాడని, మనలను సృజించినవాడని, మనలను పరిపాలించువాడని, మన పాపాల నుండి మనలను విడిపించినవాడని మనం గ్రహించి, నమ్మడం చాలా కష్టం. ఈ యెహోవా దేవుడే ఈ జగత్‌ను సృజించినవాడని, ఇప్పటిలాగే ఉనికి కలిగి వుంటాడని, ఆయన మన దేవుడని మనం నమ్మాలి.

ఇశ్రాయేలీయులలాగే విూరు, నేను కూడా దేవుని నమ్ముతున్నాం. ఆయన సన్నిధిలోనే ఆయన ఆజ్ఞలను పొందామని నమ్ముతున్నాం. ఇశ్రాయేలీయులు ధర్మశాస్త్రాన్ని అనుసరించలేకపోయినట్టే మనం కూడా అలాగే ఆ నియమాల ప్రకారం జీవించలేకపోతున్నాం. అందు వల్ల, మన పాపాల వలన ఆయన యిచ్చే శిక్షను తప్పించుకోలేము. 

ఇందుకనే మనలో ప్రతి ఒక్కరూ, పురుషుడుగాని, స్త్రీగాని తమ పాపపరిహారం నిమిత్తం దేవునికి విమోచనా క్రయధనాన్ని చెల్లించాలి. మన పాపాల నుండి రక్షణ పొందడానికి మన ప్రాణంతో సమానమైన పాపపరిహారమైన మూల్యాన్ని మన విశ్వాసంతో తండ్రియైన దేవునికి యివ్వాలి. దేవుని న్యాయమైన తీర్పును తృప్తిపరచి దేవుని దయగల ప్రేమను ఆయన బయల్పరచడానికి మన ప్రాణంతో సమానమైన బలియర్పణను అర్పించాలి. అలా మన పాప పరిహారానికి నిజమైన పరిహారాన్ని చెల్లించినప్పుడే దేవునికి మానవులకు మధ్య సమాధానం వుంటుంది. కేవలం ఆయనను విశ్వసించడం వలనే మనం మన పాపాల నుండి, పాప శిక్ష నుండి విడుదల పొందగలం.

మన పాపాల వలన తీర్పు నుండి, శిక్ష నుండి తప్పించుకోలేము గనుక దేవుని సన్నిధికి మనం వెళ్ళినప్పుడల్లా మనం చేసిన పాపాలను ఆయన ముందు ఒప్పుకోవాలి. దేవుడే మన రక్షకుడు అని మనం నమ్మినప్పుడు మన పాపాల వలన మనం నరకపాత్రులమని గ్రహించి ఒప్పుకోవాలి. మన పాపాలకు మెస్సీయ మూల్యం చెల్లించి పాప తీర్పు నుండి మనలను విమోచించిన మన స్వంత రక్షకుడని నమ్మాలి. మనం దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు మనం బాప్తిస్మాన్ని, యేసురక్తం మన పాపాలకు బలియర్పణగా అర్పించబడినదని మనం నమ్మాలి. ఆయనే మెస్సీయ అని గుర్తించి నమ్మాలి. దేవుని ఆజ్ఞను పాటించక ఆయన దృష్టిలో మనమందరం, పాపాత్ములమని ఒప్పుకొని, మన పాపాల నుండి మెస్సీయ అయిన యేసుక్రీస్తు మనకు విమోచన కలిగించాడని మనం నమ్మాలి

మనం దేవుడిచ్చే పాపపు శిక్షను తప్పించుకోలేమని, దానికి మనం పాత్రులమని మనం గ్రహించాలి. అలా పాపాత్ములమని ఒప్పుకొన్నప్పుడు దేవుడిచ్చే దీవెనలకు యోగ్యులమవుతాం. దేవుని దయకు పాత్రులమై ఆయన పాపక్షమాపణను పొందగల విశ్వాసాన్ని కట్టుకోగలుగుతాం.

తన స్వంత బిడ్డలుగా మనలను చేసుకోడానికి ఆయన తన స్వరూపంలో మనలను చేశాడు. అయినా బలహీనులుగా పుట్టేటు చేశాడు. ఆదాము సంతానంగా మనం పాపాత్ములుగానే పుట్టాం. అయితే అది మనలను ఆయన బిడ్డలుగా చేసుకోడానికి ఆయన ముందుగా చేసిన ఏర్పాటు.

మన పాపాలకు తీర్పు నుండి తప్పించుకోలేని వారం మనం. అయితే ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి దేవుడు తన కుమారుని మన దగ్గరకు పంపించి, మన పాపాలన్నింటిని క్షమించాడు. దేవుని ప్రణాళిక ప్రకారం దేవుని కుమారుడైన యేసు విధేయుడై బాప్తిస్మాన్ని పొంది సిలువ విూద చనిపోయాడు. యెహాను ద్వారా ఆయన కుమారుడు పొందిన బాప్తిస్మం వలన లోకపాపాన్ని ఆయన విూద మోపబడినవి, సిలువ విూద ఆయన కార్చిన రక్తంతో మన పాపాలనన్నింటి నుండి మనలను రక్షించాడని, ఎవరు నమ్ముతారో వారికి యెహోవా దేవుడు నూతన జీవితాన్ని అనుగ్రహిస్తాడు.

మనం ఆయనను నమ్మి మన పాపాల నుండి రక్షించబడి నూతన జీవాన్నిపొంది, ఆయన పిల్లలగుటకు యేసు బాప్తిస్మం, ఆయన రక్తమే బలియర్పణగా చాలు. ఆయనను నమ్ముట ద్వారా మన పాపాల నుండి రక్షణ పొందుతాం. నీల ధూమ్ర రక్తవర్ణా దారంతో పేనిన సన్నని నారలో మన విశ్వాసం ద్వారా ఆయన పిల్లలుగా మనం అంగీకరించబడతాం. అలాంటి విశ్వాసం నిజంగా ఎవరిలో వుంటుంది వారు దేవుని సొంత ప్రజలవుతారు.ఈ లోక మతాల దేవతలందరూ కేవలం మానవులు చేసినవే


దేవుడైన యెహోవా, యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ తప్ప మిగతా దేవతలందరూ మానవులు చేసిన ఈ లోకదేవతలు మాత్రమే. దేవుడు తప్ప ఈ లోకంలో ఏదీ, ఎవరూ కూడా స్వయంఉనికి గలవారు లేరు. అందుకనే ‘‘నేను ఉన్నవాడను అనువాడను” అని యెహోవా దేవుడు చెప్పాడు.

వాస్తవానికి స్వయంభవులైన వారెవరైనా వున్నారా? లేరు. బుద్ధుడు తన తల్లి గర్భం నుండి ఉద్భవించాడు. కనుక అతడు దేవుడు సృజించిన జీవియే. అలాగే కన్ఫ్యూసియసు, మహ్మదు మొదలైన వారంతా వారి తల్లిదండ్రులకు పుట్టిన వారే గనుక వారు దేవుని సృష్టి. బుద్ధుని విగ్రహాలు - దేవుడు సృజించిన లోహాలతో, చెక్కతో ఆయన శిష్యులు చెక్కినవే. కేవలం మానవ సృష్టిమాత్రమే. సూర్యచంద్ర నక్షత్రాలు, నీరు, గాలి, జగత్‌మండలాలు సమస్తం దేవుడు చేసినవే. దేవునితో చేయబడినదేదీ ఈ లోకంలో లేదు. చివరికి ఆత్మజీవులైన దేవదూతలు కూడా దేవుడు చేసినవారే.

మనం నమ్మే అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు దేవుడైన యెహోవా దేవుడు మాత్రమే స్వయంభవుడు. ఆయన్నెవరూ సృష్టించలేదు. ఆయన సకలాన్ని చేసిన సృష్టికర్త. మిమ్మును, నన్ను సృష్టించినది ఆయనే. ఈ యెహోవా దేవుడే తన సంకల్పం చొప్పున మన పాపాల నుండి మనలను రక్షించి, తన స్వంత ప్రజలనుగా చేశాడు.

మనం ఏడుస్తూ ఈ లోకంలో పుట్టాలని, శూన్యహస్తాలతో తిరిగి వెళ్ళాలని దేవుడే తన సంకల్పం తో మనలను సృజించాడు. ఈ సంకల్పంతోనే మనం ఈలోకంలో శ్రమపడి, ఆయన్ను వెదకి, కనుగొనాలని మనలను చేశాడు.

దేవుడు మనం నమ్ముతున్నామని చెప్పినప్పుడు మన పాపాల వలన, దేవుని ఆజ్ఞను అనుసరించనందు వలన శిక్షను, నరకాన్ని, భయంకరమైన శ్రమలను దేవుని నుండి తప్పించుకోలేని జీవులమని ఒప్పుకోవాలి. మెస్సీయ అయిన యేసుక్రీస్తును మనం నమ్మడానికి ముందు మనం పాపాత్ములమని, భయంకరమైన తీర్పును తప్పించుకోలేమని, నరకపాత్రులమని గ్రహించాలి.యెహోవా దేవుడు సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు


మనలను నిజంగా సృజించి, ఈ లోకాన్ని ఏలుతున్న దేవుడే సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు. ఇది గుర్తించి ఆయన ముందు మనమెలాంటి పాపాత్ములమో ఒప్పుకోవాలి. అంటే మన పాపాల వలన దేవుని మహాభయంకరమైన ఉగ్రత నుండి మనం తప్పించుకోలేని వారమని అంగీకరించాలి. మన పాపాల నుండి మనలను విడిపించడానికి వచ్చిన దేవుని గొర్రె పిల్లను నమ్ముట వలన, ఈ బలిపశువు తలపై మన చేతులుంచి మన పాపాలను ఆయన విూదకి తీసుకొన్నాడు. ఈ సత్యాన్ని మనం నమ్మాలి. మన పాపాల వలన మనం నరకాన్ని తప్పించుకోలేని వారమైన ఈ బలియర్పణ ద్వారా, సర్వశక్తిమంతుడైన దేవుడు మన పాపాల నుండి మనలను రక్షించాడని మనం గుర్తించాలి. ఈ సత్యాన్ని నమ్మినవారే మెస్సీయ అయిన క్రీస్తు యేసులో నిజమైన విశ్వాసులు.

ఏ కారణం లేకుండా అకారణంగా మెస్సీయను నమ్మడం తప్పు. మనం దేవుని నమ్ముతున్నామంటే మన విశ్వాసం బైబిలు పునాది గలదని స్థిరపరచబడాలి. ‘‘నేను యెహోవాకు ఉన్నవాడను, అనువాడను” అని చెప్పిన శక్తివంతమైన నిజమైన ఆయన వాక్యమనే పునాది విూద మనలను కట్టుకోవాలి.

ఇశ్రాయేలీయులు అనుసరించాలని దేవుడు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రాన్ని వారు అనుసరించలేకపోయారు. దేవుడు ఇశ్రాయేలీయులకిచ్చిన ఆజ్ఞనే యిప్పుడు జీవిస్తున్న మనకూ యిచ్చాడు. విూరు నిజంగా దేవుని నమ్మి విూ విశ్వాసం ద్వారా అబ్రహాము సంతానం కావాలని కోరుకుంటే దేవుడు ఇశ్రాయేలీయులకే గాక, మనకు, ఈ లోకంలోని ప్రతి ఒక్కరికి 613 ఆజ్ఞలిచ్చాడని నమ్మాలి. ఆ ఇశ్రాయేలీయుల లాగే మనం కూడా ఆ ఆజ్ఞలను అనుసరించక, పాపానికి జీతం మరణం గనుక ఆ మరణానికి పాత్రులమని కూడా నిజంగా తెలుసుకోవాలి. (రోమా 6:23)

నీలధూమ్ర రక్తవర్ణాల దారమనే సత్యం ద్వారా దేవుడు మన పాపాలను క్షమించాడని కూడా మనం వెదకాలి. అలా నమ్మాలంటే పాపాల నుండి దాని శిక్ష నుండి దేవుడు మనలను విమోచించాడో ఆ రక్షణ సత్యాన్ని మనం వెదకాలి.

అలాగాక, దేవుని ఆజ్ఞను అనుసరించక, మన మహాభయంకరమైన పాపాత్ములమని గ్రహించక, మన పాపాలకు తీర్పు శిక్షకు పాత్రులమని ఒప్పుకొనకపోతే మెస్సీయను మన మెన్నటికి నమ్మలేము. తాము పాపాత్ములగా వున్నా తాము పరలోకంలో ప్రవేశిస్తామని ఒకవేళ ఎవరైనా నమ్మితే, దేవుడు యిప్పటికే వారి పేర్లు తీర్పు పుస్తకంలో రాసి వుంచాడు. యిలాంటి వారు యింకా, తమ యిష్ట ప్రకారం దేవుని ధర్మశాస్త్రాన్ని (నియమాన్ని) మార్చివేసి, దేవుని నామమును వ్యర్ధంగా ఉచ్ఛరిస్తూ పాపం చేస్తున్నారు. అలాంటి వారు పాపాల నుండి ఎన్నటికీ రక్షణ పొందలేరు. దేవుని నమ్మినా, నమ్మకపోయినా వారు దేవుని గుర్తించలేరు. గనుక వారి పాపానికి శాశ్వత తీర్పును పొందుతారు. నరకశిక్షకు పాత్రులవుతారు. వీరు వెంటనే మారు మనస్సు పొంది వారి అపనమ్మకం నుండి దేవుని నమ్మకం వైపు తిరగాలి.

ఈ క్షణంలో కూడా దేవుడు మన హృదయాలలో వున్నాడు. ఆయనకు మన సమస్తం తెలుసు. మన పాపాలకు మన మందరం బలియర్పణను అర్పించాల్సిన అవసరం వుంది. అందుకనే దేవుడేర్పరచని విధంగా రక్షణ పొందడానికి ప్రత్యక్ష గుడారపు దహన బలిపీఠం విూద పాప పరిహారార్థం పరిహార బలియర్పణను అర్పించాలని దేవుడు ఇశ్రాయేలీయులకు పాపపరిహార బలివిధానాన్నిచ్చాడు.

దేవుడు తనంతట తానే ఉనికి కలిగినవాడు. ఆయన అంతకు ముందున్నవాడు, ఇప్పుడున్నవాడు. ఆయన జీవించి వున్న దేవుడు. విశ్వాసులైన మన పితరులకు ప్రత్యక్షమైనాడు. వారితో మాట్లాడిన దేవుడు. ఆయనిప్పుడు మనకు సజీవుడు, ప్రత్యక్షమై మనతో మాట్లాడే దేవుడు. మన మధ్య పనిచేస్తున్న దేవుడు. మనలను నడిపించే దేవుడు, మన జీవితాలను ఏలే దేవుడు.మనం మరచిపోకూడని సత్యం


మనం రక్షణ పొందినా, మన మెన్నటికీ మరచిపోకూడని సత్యం ఒకటుంది. మన నిత్య తీర్పును మనం తప్పించుకోలేని వారమైనా తన బాప్తిస్మం, సిలువలో తన రక్తాన్ని కార్చడం వలన అలాంటి పాప తీర్పు నుండి మన ప్రభువు మనలను విడిపించాడు. మన ప్రభువు ముందు మనం నిలిచే రోజు వరకు మన విూ సత్యాన్ని ఎప్పుడూ మరచిపోకుండా ఎప్పుడూ మన హృదయాలలో నమ్మాలి. పరలోకంలో దేవుని స్తుతిస్తున్నప్పుడు కూడా ఈ సత్యాన్ని మనం నమ్మాలి. శాశ్వతంగా శపించబడి, తీర్పు తీర్చబడాల్సిన మనలను ప్రభువును రక్షకునిగా నమ్మేట్టు చేసినందుకు, నిత్యజీవాన్ని మనకిచ్చినందుకు మనం దేవునికి స్తుతిస్తోత్రాలు చెప్పాలి.

నీరు ఆత్మల సువార్తను ఎప్పటికి గుర్తించాలి. మన పాపాలకు మనం నిత్య తీర్పుకు బద్ధులమని ఒప్పుకొనకపోతే ఏమవుతుంది? తమ పాపాలకు తీర్పును తప్పించుకోలేని మరణ పాత్రులమైన మనలను ఆయన బాప్తిస్మాన్ని పొంది, రక్తాన్ని చిందించి మనలను దేవుడు నిజంగా రక్షించాడు. ఇందుకు మనం ప్రభువును నమ్మాలి, ఆయనను స్తుతించాలి. ఇందుకని నీవు కూడా ప్రభువుని నమ్మి, నీరు ఆత్మ సువార్తను ప్రకటించాలి. తమ పాపాల కోసం యేసు పొందిన బాప్తిస్మాన్ని ఆయన చిందించిన రక్తాన్ని ఎవరు నమ్ముతారో దేవుని స్తుతించే ఆత్మ కలిగి వుంటారు. తమ పాపాల నుండి మరణం నుండి ప్రభువు వారిని రక్షించాడు గనుక తమ విశ్వాసంతో వారు ప్రతిరోజు దేవుని స్తుతిస్తారు.

సమస్యేమిటంటే కొందరు యేసును అపార్థం చేసుకొన్నారు. ఆయనను గూర్చిన అవగాహన ఏకపక్షమైంది. సగం శూన్యమైంది. ఇలాంటి వారిది చెడిపోయిన మనస్సాక్షి. వారు అన్ని విధాలైన పాపంలో మునిగి వున్నా తాము పాపం చేస్తున్నామని గ్రహించలేని వారు. పాపం చేస్తూ కూడా అది పాపమని తెలుసుకోలేని వారు పాపాత్ములు.

మనం పాపం చేయకుండా వుండలేని బలహీనులమైనా మనం పాపం చేసినప్పుడల్లా మన పాపాన్ని ఒప్పుకోవాలి. మన ప్రభువు బాప్తిస్మములని, సిలువ విూది ఆయన రక్తాన్ని నీరు ఆత్మ బాప్తిస్మముని మనం స్థిరపరచాలి. కనుక దేవుని ముందు మనం పాపాత్ములమన్న సత్యాన్ని ఒప్పుకోవాలి. నీరు ఆత్మల సువార్తను నిజంగా నమ్ముట వలన మనం విశ్రాంతిగా ఊపిరి పీల్చుకోగలం. నీరు ఆత్మల సువార్తను నమ్ముట ద్వారానే మనం మనశ్శాంతిని పొందగలిగాం.

పాప రహితులం అని నేననడంలో వాటిని చేస్తున్నప్పుడు అవి పాపాలని మనం గుర్తించలేదని అర్థం కాదు. అట్లని నీరు ఆత్మ సువార్తను నమ్మేవారు పాపాన్ని పాపంగా గుర్తించనవసరం లేదనీ కాదు. మనం వాస్తవంగా మన పాపాల నుండి విడుదల పొందినా, మనం చేసే పాపాలు మన పాపాలేనని గుర్తించంగలం. మన మెప్పటికీ మరచిపోకూడని విషయం ఏమిటంటే మన పాపాల కొరకు శాశ్వత తీర్పును తప్పించుకోలేని వారమైనా మన ప్రభువు తన బాప్తిస్మం, సిలువ విూది తన రక్తం, పునరుత్థానం వలన మన పాపాల నుండి మనలను రక్షించాడు. మన ప్రభువు మనలను నీల ధూమ్ర రక్త వర్ణాల దారం వలన మనలను రక్షించాడని, దానిని నమ్మి ఆయనను స్తుతించాలని ఎన్నటికీ మరచిపోకూడదు. ఇది నమ్మక ముందు మనమెలా వున్నామో జ్ఞాపకం చేసుకోవాలి. ఒకప్పుడు మన పాపాల నిమిత్తం తప్పించుకోలేని తీర్చబడే వారమని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడిచ్చిన రక్షణ కోసం మన మాయనను స్తుతించాలి. ప్రతిరోజు ఆయన కృపారక్షణ కోసం కృతజ్ఞతలు చెల్లిస్తూ వుండాలి. నీరు ఆత్మ సువార్తలో యిది తప్ప మరేది విశ్వాసుల విశ్వాసం అనిపించుకోదు.యెహోవా దేవుడు ఇప్పుడూ సజీవుడే


అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు దేవుడై వున్నట్టే యిప్పుడు ఆయన విూకు నాకు కూడా దేవుడే. ‘‘దేవుడు సమధానమునకే కర్తగాని అల్లరికి కర్తకాడు” (1కొరింథి 14:33) నటన, ఆడంబరపు క్రైస్తవులకు ఆయన దేవుడు కాదు. కాని నీరు ఆత్మలో నమ్మకం గలవారికే ఆయన దేవుడు. దేవుని వాక్యాన్ని నమ్మి దానికి విధేయులమయ్యే విశ్వాసం మనకుంది. ‘‘నీవు నరకపాత్రుడవు’’ అని మన దేవుడు మనతో చెప్పినప్పుడు అవును ప్రభువా అని మనం చెబుతాం. ‘‘నీ మరణ దినం వరకు నీవు పాపం చేస్తూ వుండు” అని దేవుడు మనతో చెబితే ‘‘అలాగే ప్రభువా” అని మనం చెబుతాం. ఆయన ‘‘నేను నా నీల ధూమ్ర రక్త వర్ణాల దారంతో పేనిన సన్నని నారతో నిన్ను రక్షించాను” అని చెబితే అప్పుడు కూడా ‘‘అవును ప్రభువా” అని మాత్రమే చెప్పగలం. మనం అలా ఎప్పుడూ ఆయనకు ‘‘అవును” అన్నమాటతో విధేయులమయ్యాం. నీరు ఆత్మల సువార్తతో మనలను రక్షించిన దేవుని కృపకోసం దేవునికి నేను స్తుతులు చెల్లిస్తున్నాను.

దేవుడు మన పాపాల నుండి నీరు, రక్తం, ఆత్మల ద్వారా రక్షించి మనలను దేవుని రాజ్య ప్రజలుగా చేశాడు. నీరు ఆత్మల సువార్త దేవుడు మనకిచ్చిన రక్షణ వరమని నమ్మి దేవునికి స్తుతులు చెల్లించండి.

నా పాపాల వలన నరకం నుండి తప్పించుకోలేని నన్ను నీరు ఆత్మల సువార్త ద్వారా నన్ను శాశ్వతంగా రక్షించిన దేవుని నేను సదా స్తుతిస్తాను. తీర్పు నుండి తప్పించుకొనలేని మనలను తన నీల ధూమ్ర రక్త వర్ణాల దారంతో నేసిన సన్నని నారతో పాపం నుండి విడిపించి, రక్షించిన దేవుని జ్ఞాపకం చేసుకొని ఆయనను స్తుతించకుండా వుండలేము. ఈ నీలధూమ్ర రక్త వర్ణాల దారంతో నేసిన సన్నని నారలో దాగివున్న సువార్తలోని సత్యాన్ని నమ్మి మనమాయనకు కృతజ్ఞతలు చెప్పాలి.

మానవులందరికీ దేవుడు యెహోవా దేవుడే. ఆయన మానవులందరికీ దేవుడైనాడు. యెహోవాయే మన దేవుడని మన మందరం నమ్మాలి.