Sermons

[11-4] < నిర్గమకాండం 19:1-6 > దేవుడు మోషేను సీనాయి పర్వతానికి పిలిచిన కారణం



< నిర్గమకాండం 19:1-6 >

“ఇశ్రాయేలీయుల ఐగుప్తు దేశము నుండి బయలుదేరిన మూడవ నెలలో, వారు బయలుదేరిన నాడే మూడవ నెల ఆరంభ దినమందే, వారు సీనాయిర అరణ్యమునకు వచ్చిరి వారు రెఫీదీమునుండి బయలుదేరి సీనాయి అరణ్యమునకు వచ్చిరి ఆ అరణ్య మందు దిగిరి. అక్కడ ఆ పర్వతము ఎదుట ఇశ్రాయేలీయులు విడసిరి. మోషే దేవుని యొద్దకు ఎక్కిపోవగా యెహోవా ఆ పర్వతము నుండి అతని పిలిచి ` నీవు యాకోబు కుటుంబీకులతో ముచ్చటించి ఇశ్రాయేలీయులకు తెలుపవలసినదేమనగా ` నేను ఐగుప్తీయులకు ఏమి చేసితినో, మిమ్మును గద్దరెక్కల విూద మోసి నా యొద్దకు మిమ్మునెట్లు చేర్చుకొంటినో విూరు చూచితిరి. కాగా విూరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధననుసరించి నడిచిన యెడల విూరు సమస్త దేశజనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త భూమియునాదే గదా, విూరు నాకు యాజకరూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. నీవు ఇశ్రాయేలీయులతో పలుకవలసిన మాటలు ఇవే.’’



దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఎందుకు ఎంచుకొన్నాడు ?


ప్రధాన భాగం నిర్గమ 19:1-6 నుండి వచ్చింది. ఈ భాగం పెద్దదికాకపోయినా దాని గురించి నేను చెప్పవలసింది చాలా ఎక్కువే వుంది. ఈ భాగం నుండి నిర్గమ 19, 25 అధ్యాయాలలో బయల్పరచిన సత్యాన్ని గూర్చి నేను చెప్పాలనుకొంటున్నాను. ఇశ్రాయేలీయులు సీనాయి అరణ్య ప్రాంతానికి వచ్చేటప్పటికి వారు ఈజిప్టు (ఐగుప్తు) నుండి బయలుదేరి మూడు నెలలు అయింది. వారు సీనాయి పర్వతం ఎదుట శిబిరాన్ని చేసుకొనేట్టు చేసిన దేవుడు మోషేను పర్వతం విూదికి పిలిచాడు.

దేవుడు మోషేను పిలిచి ఇశ్రాయేలీయులకు తన మాటను చెప్పాడు. ‘‘కాగా విూరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధననుసరించి నడిచిన యెడల విూరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త భూమియునాదే కదా? విూరు నాకు యాజకరూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. నీవు ఇశ్రాయేలీయులతో పలుకవలసిన మాటలు ఇవే.

ఇశ్రాయేలీయులను తనకు ప్రత్యేకమైన నిధిగాను, తన రాజ్యమునకు యాజకులనుగా స్థిరపరచుటకు దేవుడు వారిని పిలిచి, వారిని హెచ్చించాడు.

ఈ ఉద్దేశంతోనే దేవుడు ఇశ్రాయేలీయులను ఈజిప్టు నుండి విడిపించాడు. దేవుడు వారికి వారి పాపాల నుండి రక్షించిన తన స్వంత ప్రజలుగా చేసుకొని, వారిని ఒక జాతి యాజకులనుగా చేయడానికి, ఒక ప్రత్యేక నిధిగా చేసుకోడానికి వారికి తన శాస్త్రమునిచ్చి, ప్రత్యక్ష గుడారపు బలియర్పణా విధానాన్ని యిచ్చాడు. వివరంగా తెలుసుకొని వారి నుండి దేవుడు కోరే విశ్వాసాన్ని వారు తిరిగి పొందాలి. వారి జాతిని దేవుని యాజకుల రాజ్యంగా చేయడానికి ఒక ప్రక్క 613 ఆజ్ఞలు గల తన ధర్మశాస్త్రాన్ని, మరో ప్రక్క వారూ ప్రత్యక్షపు గుడారాన్ని కట్టేట్టు చేశాడు.

కాగా మెస్సీయగా వచ్చిన యేసుక్రీస్తును ఇశ్రాయేలీయులు నమ్మకపోతే పాపపరిహారబలి విధానపు వస్తువుగా వచ్చి యోహాను నుండి పొందిన బాప్తిస్మం, సిలువ విూద కార్చిన రక్తంతో వారి పాపాలన్నింటిని కడిగివేసాడు. అలా దేవుడు అబ్రాహాము సంతానంగా వారిని ఈజిప్టు నుండి బయటకు తీసుకుని వచ్చి ప్రత్యక్షపు గుడారపు బలులు ద్వారా వారి పాపాలను కడిగివేసి తన ప్రజలుగా చేసికొన్నందుకు ఇశ్రాయేలీయులు నిస్సందేహంగా ఈ సత్యాన్ని అంగీకరించాలి. ఆ సమయంలో ఇశ్రాయేలీయులు దేవుని ధర్మశాస్త్రాల్ని అనుసరించలేకపోయినందు వలన దేవుడేర్పరచిన బలి విధానంలో దేవుని బలియర్పణ అర్పించుట వలన వారి పాపాల నుండి వారిని క్షమించాల్సి వచ్చింది. ఈ బలియర్పణలు ఇప్పుడు మానవజాతిని దాని పాపాల నుండి రక్షించిన రక్షకుడైన యేసుక్రీస్తుకు ముంగుర్తు.

ఇశ్రాయేలీయులు యిప్పటికి మోషేను అందరికంటే గొప్ప ప్రవక్తగా ఎంచుతారు. ఈ విషయంలో వారు చేసేది నిజమే. అయినా వారి పాపాల నుండి వారిని రక్షించిన యేసుక్రీస్తును మెస్సీయగా వారు నమ్మరు గనుక క్రొత్త నిబంధనను దేవుని వాక్యంగా వారు గుర్తించగలరు. దానికి బదులుగా పాత నిబంధన మాత్రమే దేవుని వాక్యమని గుర్తిస్తారు. అయితే మనం మాత్రం యేసు మోషే కేంటే గొప్ప ప్రవక్త అని. ఆయన పరలోక రాజ్యపు ప్రధాన యాజకుడని, ఇశ్రాయేలీయులు ఏ మెస్సీయ కొరకు ఎదురుచూస్తూ నిరీక్షస్తున్నారో ఆ మెస్సీయ యేసే క్రీస్తేనని మనం జ్ఞాపకం వుంచుకోవాలి. ఇశ్రాయేలీయుల ప్రత్యక్ష గుడారపు బలియర్పణా బలిపశువు మెస్సీయగాక మరొకరు కాదని యిప్పుడు తెలుసుకోవాలి.



మోషేను భక్తి గౌరవాలతో చూడాలని దేవుడు ఇశ్రాయేలీయులను చేశాడు. కాని...


ఇశ్రాయేలీయుల ముందు దేవుడు మోషేను అంతగా ఎందుకు హెచ్చించాడు? మోషే ద్వారా పలికిన దేవుని మాటను వారు అంగీకరించి, నమ్మేవారిగా చేయడానికి దేవుడు మోషేను అంతగా హెచ్చించాడు. మరో మాటల్లో చెప్పుకుంటే వారితో మోషే ఏమి చెప్పాడో అదంతా దేవుని వాక్కే అని ఇశ్రాయేలీయులు నమ్మునట్లు చేయడానికే మోషేను హెచ్చించాడు దేవుడు. ఇశ్రాయేలీయుల ముందు మోషేను గొప్పగా హెచ్చించడానికి దేవుడు మోషేను సీనాయి పర్వతం విూదికి పిలిచాడు. ఇది మోషే అన్నా దేవుడు అన్నా ఇశ్రాయేలీయులు భయపడేట్టుగా చేసింది. దేవుడు మోషేతో స్నేహితునితో మాట్లాడినట్లు మాట్లాడడం చూసిన ఇశ్రాయేలీయులు మోషేను నమ్మారు.

అలా ఇశ్రాయేలీయులకు మోషే ప్రకటించిన దేవుని మాటను దేవుడే తమతో మాట్లాడిన మాటగా వారు స్థిరంగా నమ్మారు. మోషేను ఎంతో ఉన్నతునిగా గుర్తించిన ఇశ్రాయేలీయులు యేసును తమ రక్షకుడైన మెస్సీయగా ఒప్పుకొనక పెద్ద పొరబాటు చేశారు. దాని వలన వారి మెస్సీయను వారు సరిగా గుర్తించలేకపోయారు. అలా ఆయన రక్షణ ప్రేమను తిరస్కరించారు. ఇప్పుడు మోషేకంటే ఎంతో గొప్ప ప్రవక్తయైన యేసుక్రీస్తును తమ స్వంత రక్షకునిగా అంగీకరించాల్సిన గొప్ప కార్యం వారిముందున్నది.



ఇశ్రాయేలీయులు దేవుని నుండి ధర్మశాస్త్రాన్ని, ఆజ్ఞలను పొందారు.


నిర్గమ 24:3-8 చూడండి. ‘మోషే వచ్చి యెహోవా మాటలన్నిటిని, విధులన్నిటిని ప్రజలతో వివరించి చెప్పెను. ప్రజలందరు `యెహోవా చెప్పిన మాటలన్నిటి ప్రకారము చేసెదమని యేక శబ్దముతో ఉత్తరమిచ్చిరి. మరియు మోషే యెహోవా మాటలన్నిటిని వ్రాసి ఉదయమందు లేచి ఆ కొండ దిగువను బలిపీఠమును ఇశ్రాయేలు పండ్రెండు గోత్రముల చొప్పున పండ్రెండు స్తంభములను కట్టి ఇశ్రాయేలీయులలో యౌవనస్థులను పంపగా వారు దహన బలులనర్పించి యెహోవాకు సమాధాన బలులుగా కోడెలను వధించిరి. అప్పుడు మోషే వాటి రక్తములో సగము తీసుకొని పళ్లెములలో పోసి ఆ రక్తములో సగము బలిపీఠము విూద ప్రోక్షించెను. అతడు నిబంధన గ్రంధమును తీసికొని ప్రజలకు వినిపింపగా వారు యెహోవా చెప్పినవన్నియు చేయుచు విధేయులమై యుందుమనిరి. అప్పడు మోషే రక్తమును తీసికొని ప్రజల విూద ప్రోక్షించి ఇదిగో ఈ సంగతులన్నిటి విషయమై యెహోవా విూతో చేసిన నిబంధన రక్తము ఇదే అని చెప్పెను.’’

దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రమును యిచ్చినప్పుడు ఆయన రక్తంతో నిబంధన చేశాడు. అంటే దేవుని ధర్మశాస్త్రం జీవిత విధి విధానం అని అర్థం. దేవుడు ఇశ్రాయేలీయులతో తన ధర్మశాస్త్ర జీవన విధానాన్ని చెప్పాడు. వారు ఆయన మాటను నమ్మాలి.

అలాగే దహన బలి రక్తాన్ని, సమాధాన బలియర్పణను తీసుకొని రావాలని దేవుడు ఇశ్రాయేలీయులతో చెప్పాడు. మోషే ప్రజలందరిని సమకూర్చేట్టు దేవుడు చేశాడు. మోషే ధర్మశాస్త్రాన్ని, ఆజ్ఞలను దేవుని నిబంధనను వారికి చదివి వినిపించాడు. తర్వాత మోషే వారిని ‘‘దేవుడాజ్ఞాపించిన దానికి విూరు విధేయులవుతారా? అని అడిగాడు. తాము దేవునికి విధేయులమవుతామని ఇశ్రాయేలీయులు ఏకస్వరంతో జవాబు చెప్పారు.

అప్పుడు దేవుడు ‘‘నేను మిమ్మును కాపాడతాను, మిమ్మును యాజక రాజ్యంగా చేస్తాను” అని మోషే ద్వారా వాగ్ధానం చేశాడు. అప్పుడు మోషే దహన బలిరక్తాన్ని, సమాధానార్ధ బలిరక్తాన్ని వారి విూద ప్రోక్షించాడు. ఒక వ్యక్తి స్త్రీగాని, పురుషుడు గాని పాపం చేసినప్పుడు బలియర్పణ ద్వారా క్షమాపణ పొందాలని యిది తెలియజేస్తుంది. జీవిత వాక్యంగా దేవుడు చెప్పిన దానిని మనం అంగీకరించాలి. మోషే బలియర్పణా రక్తాన్ని తీసుకొని దానిని ప్రజలపై ప్రోక్షించి ‘‘ఈ మాటలన్నిటి ద్వారా దేవుడు విూతో చేసిన నిబంధనా రక్తం యిదే’’ అని చెప్పాడు. దీనిని బట్టి దేవుని మాట జీవిత మాట అని తెలుస్తుంది గనుక, మనం దానిని ఆచరించకపోయినప్పుడు బలిపశువు తలపై మన చేతులుంచి మన పాపాలను దాని విూదికి పంపి, దానిని చంపి, మన పాపాలకు బదులుగా దాని రక్తాన్ని దేవునికి అర్పించాలి.

ఈ నియమంలో మనం తెలుసుకోవలసినదేమిటంటే మన పాపాలకు శిక్ష వుందని, కాని బలియర్పణా విధానం మన పాపాలను కడిగి వేస్తుందని తెలుసుకోవాలి. కాగా, దేవుని ధర్మశాస్త్రం, ఆజ్ఞలతో వ్యవహరిస్తున్నప్పుడు వీటిలో మన పాపక్షమాపణ వున్నదని తెలుసుకొని వాటిని హృదయపూర్వకంగా అంగీకరించాలి. ఈ విశ్వాసం తప్పకుండా అవసరం. మనం దేవుని ధర్మశాస్త్రాన్ని అనుసరించినప్పుడు ఆశీర్వదించబడడం, ఆచరించలేకపోయినప్పుడు శపించబడుతున్నాం. కనుక మన బలియర్పణ ద్వారా మనం ఎప్పుడూ మన పాపాలను కడిగి వేసుకోవాలని నమ్మాలి. అలా పాపం చేసిన వారు బలి పశువు తల విూద తమ చేతులుంచి తమ పాపాలను దాని విూద మోపి, దాని రక్తాన్ని దేవునికి అర్పణగా అర్పించి తమ పాపక్షమాపణ పొందాలి. ధర్మశాస్త్రం, బలివిధానాల జీవన ధర్మం అని తెలుసుకొని దానిని నమ్మి దేవుని నుండి నూతన జీవితాన్ని పొందాలి.

దేవుని ధర్మశాస్త్రం మన పాపాలను గురించి మనకు తెలియజేస్తుండగా, నీరు ఆత్మ సువార్త దానికి భిన్నంగా యోహాను నుండి యేసు తీసుకొన్న బాప్తిస్మం, ఆయన సిలువ విూద కార్చిన రక్తం ద్వారా క్షమించిన ఆ సత్యం ప్రపంచ పాపాలన్నిటి నుండి మనలను రక్షించింది.

పురాతన కాలంలో కొన్ని జాతుల వారు ఒకరికొకరు ఒప్పందాలు చేసుకొనేప్పుడు వారు ఏదో విధమైన బలి అర్పణను ఒకరికొకరు యిచ్చి పుచ్చుకొనేవారు. వాటిలో గొర్రెలు, మేకలు, ఎద్దుల రక్తాన్ని చిందించడం ద్వారా వారి ఒప్పందాలను చేసుకొనేవారు. అంటే వారిలో ఎవరైనా ‘‘చేసిన ఒప్పందాన్ని విూరితే ఈ బలిపశువులాగే నిన్ను చంపుతాను” అని దాని అర్థం. అంటే రక్తంతో వారి ఒప్పందాలను చేసుకొనే వారన్న మాట.

ఇలాగే దేవుడు కూడా తన ధర్మశాస్త్రాన్ని రక్తంతో స్థిరపరచాడు. మరో విధంగా చెప్పుకుంటే, ఆయనిచ్చిన 613 విధులు, ఆజ్ఞలను మనం పాటించక చేసిన పాపానికి చంపివేస్తానని దేవుడు మనకు చెబుతున్నాడు. ఇందుకు ఆ పాప పరిహారాన్ని కూడా ఇలా చెప్పాడు. ప్రత్యక్ష గుడారపు బలియర్పణ విధానం ద్వారా పాప పరిహారార్పణలను అర్పించి పాప క్షమాపణ పొందవచ్చని చెప్పాడు.

దేవుని ధర్మశాస్త్రాన్ని పాటించక దానిని ఉపేక్షిస్తే ఆ పాపం వలన వచ్చే దేవుని ఉగ్రతను ఎన్నటికి తప్పించుకోలేం. కాని ఆయన ఏర్పరచిన బలి అర్పిస్తే ఆయన వాటిని స్వీకరించి మన పాపాల నుండి మనలను రక్షిస్తాడు. దేవుడు ప్రత్యక్ష గుడారపు బలియర్పణా విధానం ద్వారా ఇశ్రాయేలీయుల పాపాలను క్షమించాడని, అలాగే మనం కూడా మన పాపక్షమాపణ పొందుతామన్న దేవుని ఈ జీవన సిద్ధాంతాన్ని మన మందరం తప్పక నమ్మాలి. దేవుని ధర్మశాస్త్రాన్ని ఎవరు అలక్ష్యం చేస్తారో వారు దేవుని కృప నుండి మినహాయించబడతారు. అలాగే మనం కూడా ధర్మశాస్త్రాన్ని, బలియర్పణా విధానాన్ని మన జీవితానికి కూడా రక్షణ సత్యంగా నమ్మాలి.

ఇందుకనే రక్తంతో చేసిన నిబంధనకు మోషే వారికి చదివి ఆ రక్తాన్ని వారి విూద ప్రోక్షించాడు. అప్పుడు వారా రక్తంతో దేవునికి వాగ్ధానం చేశారు. కాగా రక్తంతో స్థిరపరచిన ఈ విధిని అనుసరించకపోతే మనం చనిపోతామని తెలుసుకొని, ఈ ధర్మశాస్త్రంతో బాటు దేవుని దహన బలి, సమాధానార్థమైన బలి యేసుక్రీస్తే అని నమ్మి మన పాపాలకు క్షమాపణ పొందాలి.

తన నీల ధూమ్ర రక్తవర్ణాల దారంతో పేనిన సన్నని నారతో మానవ పాప పరిహార విధానాన్ని దేవుడు మనకు స్పష్టంగా బోధించాడు. ఇశ్రాయేలీయులు తమ చేతులను బలిపశువు తలపై వుంచి వారి పాపాలను దానిపై మోపి దాని రక్తాన్ని చిందించి దానిని దహన బలిపీఠం విూది కొమ్ములపై కొంత వుంచి, మిగిలిన దానిని నేలవిూద పోసి పాపక్షమాపణ పొందాలి.

పాపం, మరణ విధికి ఈ బలియర్పణ తప్పక అనుసరించాలి. కనుక బలియర్పణ ద్వారా చేసిన వాగ్ధానం మన పాపాలను కడిగివేస్తుంది. విశ్వాసంతో మనం ఒప్పుకోవాలి. మనం దేవుని వాక్యాన్ని నమ్మి పాపక్షమాపణ పొందునట్లు ప్రత్యక్షపు గుడారం ద్వారా దేవుడిచ్చిన రక్షణ విధిని నమ్మాలి. కనుక దేవుడిచ్చిన ధర్మశాస్త్రాన్ని, ప్రత్యక్ష గుడారపు బలియర్పణా విధానం అనే ఈ రెండు విధులను హృదయపూర్వకంగా అంగీకరించి పాపక్షమాపణాశీర్వాదాలను పొందాలి.

మన పాపాలన్నింటి నుండి మనమెలా రక్షణ పొందగలం!

దేవుడు మోషేకు యిచ్చిన బలియర్పణా విధానం ద్వారానే ఇశ్రాయేలీయులు నమ్ముట వల్లనే వారి పాపక్షమాపణ అని దేవుడు వారికి తెలియజేశాడు.

దేవుడేర్పరచిన బలియర్పణా విధానాన్ని విశ్వసించుట ద్వారా దేవుడా విశ్వాసాన్ని స్వీకరించి మన పాపాల నుండి మనలను రక్షిస్తాడు. దేవుడు యిప్పటికి మానవులందరిని వారి పాపం నుండి రక్షించాడు గనుక దానిని నమ్మిన వారిని వారి పాపాల నుండి శుద్ధీకరిస్తాడు. పరిపూర్ణుడైన దేవుడు నిర్ణయించిన బలియర్పణా విధానం ద్వారా రక్షణ విధిని మనం తెలుసుకొనేట్టు చేశాడు. యేసుక్రీస్తు తన బాప్తిస్మం, సిలువ రక్తం ద్వారా తమ పాపాలను శాశ్వతంగా కడిగివేశాడని ఎవరైతే తెలుసుకొనరో, నమ్మరో వారు తప్పక శిక్షను అనుభవిస్తారు. దేవుని కృపా ప్రేమను మనమందరం తప్పక నమ్మాలి.

మనం బలిపశువు తలపై చేతులుంచుట ద్వారా మన పాపాలు బలిపశువు విూదికి వెళ్తాయన్న ప్రత్యక్ష గుడారపు బలియర్పణా విధానం ద్వారా దేవుడు మనలను రక్షించాడు. కనుక కృపా సువార్త అను ఈ సత్యాన్ని నమ్మితే వారి పాపాలు కడుగబడతాయని నమ్మాలి. ధర్మశాస్త్రాన్ని, బలియర్పణా విధానాన్ని నమ్మని వారెన్నటికి పాపక్షమాపణ పొందరు. కాని దేవుని కృపాసువార్తను నమ్మినవారు శాశ్వత పాప క్షమాపణను పొందుతారు.

పాపం చేయవద్దు అని మాత్రమే చెప్పక, ప్రతిరోజు పాపాలు చేసే మనం పాపాత్ములమని కూడా చెప్పాడు. కనుక ఆ పాపక్షమాపణకు తనకు బలియర్పణ యిమ్మని కూడా చెప్పాడు. అందుకనే ఒక పాపాత్ముడు తన బలియర్పణను అర్పించినప్పుడు ‘‘మంటి బలిపీఠమును నా కొరకు చేసి, దాని విూద నీ దహన బలులను, సమాధాన బలులను నీ గొర్రెలను, నీ ఎద్దులను అర్పింపవలెను. నేను నా నామమును జ్ఞాపకార్థముగా నుంచు ప్రతి స్థలములోను నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను” అని చెప్పాడు దేవుడు (నిర్గమ 20:24)

ఇశ్రాయేలీయులు దేవునికి అర్పించిన పాప పరిహారార్థ బలి విధానంలో, ఆ బలిపశువు తలపై వారు తమ చేతులుంచి దానిపై వారి పాపాలను మోపి, దాని రక్తాన్ని చిందించి, ఆ రక్తాన్ని దహన బలిపీఠం కొమ్ములపై వుంచి, దాని మాంసాన్ని బలిపీఠంపై దహించే పద్ధతిని అనుసరించారు. వారా బలిని ఆచరించినప్పుడల్లా దేవుడిచ్చిన బలియర్పణా పశువు విూద మోపబడ్డాయని లేకుంటే తాము నరక పాత్రులమవుతామని, ఆయన కృపకు పాత్రులం కామని హృదయపూర్వకంగా నమ్మాలి.

మన పాపాలను తుడిచి వేయడానికి మన ప్రభువైన యేసు యోహాను ద్వారా బాప్తిస్మాన్ని పొంది, సిలువ విూద రక్తాన్ని చిందించాడు. పాప పరిహారార్థ బలి విధానంలోనే ఆయన మన పాపాలను తుడిచి వేయాలని నిశ్చయించుకొన్నాడు. ఈ బలియర్పణా విధానం నూతన నిబంధనలో యేసు నెరవేర్చిన రక్షణార్పణకు ముంగుర్తు క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. యోహాను ద్వారా తాను పొందిన బాప్తిస్మం ద్వారా లోక పాపాలను తనపైకి తీసుకొన్నాడు. సిలువ విూద చనిపోవడం ద్వారా సకల మానవాళిని వారి పాపాల నుండి రక్షించాడు. దీనిని మనం హృదయపూర్వకంగా నమ్ముట ద్వారా దేవుని పిల్లలం కాగలం.



సిద్ధాంతపరమైన విశ్వాసాన్ని మనం విడిచిపెట్టాలి


నిర్గమ 20:25-26లో, ‘‘నీవు నాకు రాళ్ళతో బలిపీఠమును చేయునప్పుడు మలిచిన రాళ్లతో దాని కట్టకూడదు. దానికి నీ పనిముట్టు తగలనిచ్చిన యెడల అది అవిత్రమగును. మరియు నా బలిపీఠము విూద నీ దిగంబరత్వము కనబడకయుండునట్లు మెట్ల విూదుగా దానిని ఎక్కకూడదు.’’ ఈ వచనంలో దేవుడు చెప్పినదానికి మనం ప్రత్యేక శ్రద్ధ చూపాలి. ఇశ్రాయేలీయులు దేవునికొక బలిపీఠం కట్టేటప్పుడు, మరి ముఖ్యంగా రాళ్ళతో దానిని కట్టేటప్పుడు ఉలితో చెక్కిన రాళ్ళతో కట్టకూడదని దేవుడు వారితో చెప్పాడు. ఆ రాళ్లు అసలున్న ఆకారంతోనే బలిపీఠాన్ని నిర్మించాలి. ఇలా చెప్పడంలో ఆయన ఉద్దేశ్యమేమిటంటే, దేవుని రక్షణలో మన విశ్వాసానికి మానవాలోచనను దానికి జతచేయడం గాని, దానిని మార్పు చేయడం గాని చేయనప్పుడే ఆ విశ్వాసం ఆయనను సంతృప్తి పరుస్తుంది.

“నా బలిపీఠము విూద నీ దిగంబరత్వము కనబడకయుండునట్లు మెట్ల విూదుగా దానిని ఎక్కకూడదు” అంటే మానవ నిర్మితమైన, మతపరమైన విశ్వాసంతో ఆయనను ఆరాధించకూడదని ఆయన హెచ్చరించాడు. ఈ లోకంలో ప్రతి మతం మానవులు చేసిన నమ్మక విధానంలోనే వున్నాయి. ఎవరైనా పరిశుద్ధులు కావాలంటే వారి విశ్వాస పూరితమైన జీవితాలలో క్రమంగా ప్రయత్నించాలని వారి మతాలలో సాధారణమైన, ప్రాథమిక సిద్ధాంతాలను ఏర్పాటు చేశారు. చివరికి క్రైస్తవ మతస్థులు కూడా, దేవుని ధర్మశాస్త్రం ప్రకారం నైతిక జీవితాన్ని జీవించే వారే క్రమంగా శుద్ధి పొందుతారని అంటారు.

ఇదెంత మాత్రం వాస్తవం కాదు. ఆదాము సంతానంగా జన్మించిన వారు వారి పాప స్వభావం వలన దేవుని ధర్మశాస్త్రాన్ని అనుసరించలేరు. వారి పాపాల వలన మరణాన్ని తప్పించుకోలేక మరణించాల్సిందే. కాగా, అలాంటి వారినీ లోకం పాపాల నుండి రక్షించడానికి దేవుడు ప్రత్యక్ష గుడారపు బలియర్పణా విధానాన్ని ఏర్పాటు చేసి వారినందరినీ రక్షించాడు.

కనుక మన పాప క్షమాపణ కోసం దేవుడు ప్రత్యక్ష గుడారపు ఆవరణ ద్వారం దగ్గర నీలధూమ్ర రక్త వర్ణాల దారంతో పేనిన సన్నని నారతో ఏర్పాటు చేసిన రక్షణను మన మందరం అంగీకరించాలి. బైబిలులో రాసి వున్న ప్రకారం దేవుని వాక్యంగా యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. నీలధూమ్ర రక్త వర్ణాలతో పేనిన సన్నని నార ప్రత్యక్షతతో ముందుగా చెప్పిన విధంగా ఆయన తన కార్యాలు చేశాడు. దాని ప్రకారమే మన పాపాల నుండి మనలను విడిపించాడు.

అయితే మతపరమైన, సిద్ధాంతపరమైన విశ్వాసం గల వారి సంగతేమిటి? వారి అనుదిన పాపాల నుండి క్షమాపణ పొందడానికి వారేం చేస్తున్నారు? అలాంటి వారు తమ పశ్చాత్తాప ప్రార్థనను ప్రయత్నించుట ద్వారా చివరికి పరిశుద్ధతతో పాపక్షమాపణ పొందుతారు. ఇది మానవులు సృజించిన భ్రాంతితో కూడిన, సిద్ధాంతపరమైన విశ్వాసం. ఒక వ్యక్తిస్వంత ప్రయత్నాల ద్వారా దేవుని కలుసుకోడానికి చేసే ప్రయత్నం గర్వంతో కూడినది. అంతేగాక ఒక వ్యక్తి తాను స్వంతగా చేసుకొన్న మతపరమైన చెడు తప్ప మరొకటి కాదు.

దేవుని ముందు తమ పాపాలు పోవడానికి ప్రజలు తాముగా చేయగలిగిందేమి లేదని మొదటిగా ఒప్పుకోవాలి. మనం ఈ లోకంలో పాపం చేయకుండా వుండలేని జీవులుగా పుట్టాం. అందుకే ఎప్పుడూ మనం ఎన్నో పాపాలు చేస్తున్నాం. విూరు పాపం చేయకండని తన ధర్మశాస్త్రం ద్వారా దేవుడెంత చెప్పినా పాపం చేయడం మనకు ఆయన ధర్మశాస్త్ర సరళినే భంగపరచి, ఎన్నో పాపాలు చేస్తున్నాం. కనుక మనం పాపాత్ములమని దేవుని ధర్మశాస్త్రం ముందు ఒప్పుకోవాలి. మన ప్రభువైన యేసుక్రీస్తు నీలధూమ్ర రక్తవర్ణాల దారంతో పేనిన సన్నని నార ద్వారా ప్రత్యక్ష పరచిన కార్యాల ద్వారా దేవుడు మనలను రక్షించాడన్న రక్షణ సత్యాన్ని హృదయపూర్వకంగా మనం నమ్మాలి.

ఈ లోక పాపాల నుండి మనలను విమోచించడానికి యేసుప్రభువు తన బాప్తిస్మం ద్వారా తానే మన బలియర్పణగా వచ్చి పాపాల నుండి మనలను రక్షించాడన్న దేవుని వాక్యాన్ని నమ్మక మరొక మార్గం లేదు. యెహోవా తప్ప మరొక దేవుడు లేడని, క్రీస్తు ద్వారా తప్ప ఎవరూ తండ్రి దగ్గరకు రాలేరని బైబిలు చెబుతోంది. (యోహాను 14:6). దేవుని వాక్యం ద్వారా మనం పాపాత్ములమని నమ్ముతున్నాం. నీరు ఆత్మ సువార్తను నమ్ముట ద్వారా మన పాపాల నుండి రక్షణ పొందాం. ఇదే నిజమైన సత్యం. దేవునిలో నిజమైన మన విశ్వాసం.

అలా మన పాపాల నుండి మనలను రక్షించడానికి మన ప్రభువు పాప విమోచనా నియమాన్ని ఏర్పాటుచేశాడు. ఈ ప్రపంచంలోని అనేక మతాలలో క్రైస్తవ్యం ఒకటిగాక, నీలధూమ్ర రక్తవర్ణాల దారంతో పేనిన సన్నని నారలో ప్రత్యక్షమైన యేసుక్రీస్తును నమ్మిన మన విశ్వాస పునాది విూద కట్టబడిన రక్షణ సత్యమే క్రైస్తవ్యం.

పైన చెప్పుకొన్న ప్రధాన భాగం ద్వారా దేవుడు మనలను ఎందుకు పిలిచాడో తెలుసుకోవాలి.

దేవుడు నిన్ను, నన్ను తన ప్రత్యేక నిధిగా చేసుకోడానికి ఆయన మనలను పిలిచాడు. మన స్వంత కార్యాలు, ప్రయత్నాల ద్వారా మనమెన్నటికి ఆయన ప్రజలు కాలేము. దానికి బదులు మనలను ధర్మశాస్త్ర శాపం నుండి, మరణ శిక్ష నుండి, నాశనం నుండి విడిపించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడన్న సత్యాన్ని నమ్మాం గనుక మనం దేవుని పిల్లలమైనాం. యోహాను ద్వారా బాప్తిస్మాన్ని పొంది, సిలువ విూద తనరక్తాన్ని చిందించాడని నమ్మిన మనలను ఆయన పూర్తిగా రక్షించాడు.

దేవుని కుమారుడైన మెస్సీయ మానవునిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన బాప్తిస్మ సమయంలో మానవులందరి పాపాలను తన విూదికి ఒకేసారి తీసుకొన్నాడు. సిలువ వరకు ఆ పాపాలను మోసుకొని వెళ్ళాడు. పాపానికి మూల్యం చెల్లించడానికి మనకు బదులుగా ఆయన తనను తాను త్యాగం చేసుకొని సిలువ శిక్షను అనుభవించాడు. మృతులలో నుండి లేచాడు. ఎవరైతే ఈ సత్యాన్ని హృదయపూర్వకంగా నమ్ముతారో వారికి రక్షకుడైనాడు.

తన నీలధూమ్ర రక్తవర్ణాల దారంతో నేసిన నార ద్వారా మానవజాతికి పరిపూర్ణ పాప విమోచనను అనుగ్రహించానని దేవుడు చెబుతున్నాడు. ‘‘విూ పాప విమోచన కొరకు నేనీ లోకానికి వచ్చానని యోహాను ద్వారా బాప్తిస్మం తీసుకొన్నానని, సిలువ విూద నా రక్తాన్ని చిందించాలన్న నా మాటలు నీవు నమ్ముతున్నావా?’’ అని ప్రభువు అడుగుతూ వున్నాడు. ప్రభువు ముందు మనం చెప్పగలిగిందంతా ‘‘అవును’’ అని మాత్రమే. మనం రక్షణ పొందాలంటే దేవుడను గ్రహించిన పాప విమోచన కార్యాన్ని నమ్మడం తప్ప మరొ మార్గం లేదు. పాతనిబంధన కాలంలోని ఇశ్రాయేలీయులే గాక, నేటి నీవు నేనే కాదు లోకంలోని అందరూ దేవుడు సీనాయి పర్వతం విూదికి మోషేను పిలిచి ఈ ప్రధాన వాక్యభాగాన్ని ఎందుకు చెప్పాడో తెలుసుకోవాలి.

దేవుడు ఇశ్రాయేలీయల పాప విమోచన పొందడానికి వారికి పది ఆజ్ఞలను యిచ్చిన తర్వాత విశ్వాసంతో మట్టితో బలిపీఠాన్ని కట్టమని చెప్పాడు (నిర్గమ 20:24). అలాగే మనం కూడా మన పాపాల నుండి విమోచన పొందాలంటే ఆయన మనకను గ్రహించిన నీల ధూమ్ర రక్త వర్ణాల దారంతో పేనిన సన్నని నారలో ప్రత్యక్షపరచిన నీరు ఆత్మ సువార్తలో విశ్వాసం కలిగి వుండాలి.

దేవుని స్వంత పేరు ‘‘యెహోవా’’ అంటే ‘‘నేను ఉన్నవాడను అనువాడను’’ అనగా నేను స్వయంభవుడని అర్థం. అలాంటి దేవుడు నీరు ఆత్మ ద్వారా మన దగ్గరకు వచ్చాడు (యోహాను 3:5) మన ప్రభువు మానవునిగా ఈ లోకానికి వచ్చాడు. యోహాను వలన పొందిన బాప్తిస్మం ద్వారా మన పాపాలనన్నింటిని ఆయన విూదకు తీసుకొన్నాడు. మనకు బదులు సిలువ మరణం పొందునట్లు త్యాగం చేశాడు. ఇది సత్యం గనుక, దానిని మనం నమ్మాలి గనుక ప్రత్యక్షగుడారపు ఆవరణ ద్వారానికి ఉపయోగించిన నీల ధూమ్ర రక్తవర్ణాల దారంతో నేసిన సన్నని నారతో ప్రత్యక్ష పరచిన దానిలో విశ్వాసముంచమని దేవుడు మనకు చెప్పాడు. మన స్వంత ఆలోచనలను మాని, దేవుడు అనుగ్రహించిన పాప విమోచనను తీసుకోగలిగినప్పుడే మనలో నిజమైన విశ్వాసం కలుగుతుంది. అలాంటి షరతులు లేని ప్రేమను మనకనుగ్రహించినందుకు దేవునియందు కృతజ్ఞతలు చెల్లించడం తప్ప ఆయనకు మనమింకేమియ్యగలం?

బైబిలు ఆధారమైన దేవుని గూర్చిన అవగాహననే విశ్వాసం విూద మన పునాది వుండాలి. ఈ విశ్వాసాన్ని గూర్చి దేవుడు ఇశ్రాయేలీయులతోను, మనతోనూ చెప్పాడు. ఇప్పటికైనా విూరు ప్రత్యక్ష గుడారపు ఆవరణ ద్వారం రంగులో ప్రత్యక్ష పరచిన సత్యాన్ని, ఈ విశ్వాస పునాదిని ఆ రంగులు వివరిస్తున్నాయని విూరు తెలుసుకొని, నమ్మాలి. నిజమైన దేవుని విూరు నమ్మాలి. నిన్ను నన్ను మన పాపాల నుండి రక్షించడానికి దేవుడు తన బాప్తిస్మం ద్వారా మన పాపాలను తన విూదికి తీసుకొని సిలువ విూద రక్తాన్ని కార్చాడు.

ఇశ్రాయేలులో ఆధ్యాత్మిక ప్రజలుగా కావాలని కోరుకునే విూరు విూ పాపాలన్నిటి నుండి రక్షణ పొందాలనుకుంటే, మతపరమైన క్రైస్తవులు నాశనం చేసిన బలియర్పణా విధానాన్ని పునరుద్ధరించి నీరు ఆత్మ సువార్తను నమ్మాలి. కనుక విూరు ఈ నీల ధూమ్ర రక్తవర్ణాల దారంలో ప్రత్యక్షపరచిన నీరు ఆత్మల సువార్తను తెలుసుకొని పాప విమోచనలో మన విశ్వాసం బలంగా, స్థిరంగా వుండునట్లు పునాది వేయాలి.

మన విశ్వాసంతో యేసుకు కృతజ్ఞతలు చెప్పాలి. మనం నరకపాత్రులమై తప్పించుకోలేని మనలను రక్షించడానికి తండ్రియైన దేవుడు తన సత్యవాక్యం ద్వారా నీల ధూమ్ర రక్తవర్ణాల దారం అయిన యేసుక్రీస్తును మన కొరకు పంపించాడు. మన ప్రభువు నీల ధూమ్ర రక్తవర్ణాల దారంతో పేనిన సన్నని నార అనే నాలుగు పరిచర్యలో ప్రత్యక్షపరచిన సత్యాన్ని హృదయపూర్వకంగా నమ్ముట వలన మన పాపాల నుండి దేవుడు మనలను రక్షించాడు. ఈ కృపా ప్రేమను నమ్ముట ద్వారా దేవునికి మనం కృతజ్ఞతలను తెలియజేయాలి. దేవుడు మోషేను సీనాయి పర్వతం మీదికి ఎందుకు పిలిచాడో దానిని నమ్ముట ద్వారా నిజమైన పాప విమోచన విూద మన పునాదిని వేసుకొన్నవారమని పిలువబడతాం. సీనాయి పర్వతం విూది నుండి దేవుడు నిన్ను, నన్ను పిలిచిన కారణమేమిటో తెలుసుకొని దానిని నమ్మాలి. అది బలియర్పణ ద్వారా మన పాపాలను క్షమించి, తన స్వంత పిల్లలుగా చేస్తాడు.

ప్రత్యక్ష గుడారపు ఆవరణ ద్వారంలో ప్రత్యక్ష పరచిన సత్యం నుండి దేవుని కృపాప్రేమను మరింతగా పొందుతారు. ఈ దేవుని కృపా ప్రేమను విూరందరూ హృదయపూర్వకంగా నమ్మి దానిని అంగీకరించాలని నా ఆశ, ప్రార్థన.