Sermons

[11-6] < నిర్గమకాండం 25:1-9 > విశ్వాసానికి పునాది వేసిన ప్రత్యక్షపు గుడార నిర్మాణపు వస్తు సముదాయం< నిర్గమకాండం 25:1-9 >

“యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను. నాకు ప్రతిష్టార్పణ తీసికొని రండని ఇశ్రాయేలీయులతో చెప్పుము. మనఃపూర్వకముగా అర్పించు ప్రతి మనుష్యుని యొద్ద దాని తీసికొనవలెను. విూరు వారి యొద్ద తీసికొనవలసిన అర్పణ లేవనగా బంగారు, వెండి, ఇత్తడి, నీలధూమ్ర రక్తవర్ణములు, సన్నపు నార, మేక వెంట్రుకలు, ఎరుపురంగు వేసిన పొట్టేళ్ళ తోళ్ళు, సముద్రవత్సల తోళ్ళు, తుమ్ము కర్రలు, ప్రదీపమునకు తైలము, అభిషేక తైలమునకును, పరిమళ ద్రవ్యముల ధూపమునకు సుగంధ సంభారములు, లేతపచ్చలు, ఏఫోదుకును, పతకమునకును చెక్కు రత్నములు అనునవే. నేను వారిలో నివసించునట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నేను నీకు కనపరచు విధముగా మందిరము యొక్క ఆ రూపమును దాని ఉపకరణములన్నిటి రూపమును నిర్మింపవలెను.’’పేద జీవితాలు : 


“జీవిత గీతం” అన్న పద్యంలో హెన్రివర్డ్స్‌ వర్త్‌ లాంగ్‌ ఫెలో ఇలా రాశాడు ‘‘దుఃఖకరమైన అనే సంగతులు నాకు చెప్పకు, ‘జీవితం’ అంటే శూన్యమైన కలవంటిది.’’

అయినా, జీవితాన్ని గూర్చి నీవు నిజంగా ఆలోచిస్తే మానవ జీవితాలు నిజంగా చాలా పేదగా వున్నాయి. ప్రతి ఒక్కరి జీవితం ఎడారి వంటి ఈ లోకంలో ఒంటరిగా వ్యర్ధంగా, వెళ్ళి పోవలసినది మట్టికి చేరవలసినదే అయినా, ఈ భూమి చివరి గమ్యం కాదు. ప్రతి ఒక్కరి జీవితం అంతం పాపం వలన భయంకరమైన శ్రమతో నిండి వుంటే అది నిత్య నరకం. అయినప్పటికి, ప్రజలు సహజంగా వారి మరణానికి సమాధికి, తర్వాత లోకానికి భిన్నంగా వున్నారు. మానవులు ఈ లోకంలో జీవిస్తూ వున్నప్పుడు తమను రక్షించిన దేవుని కలుసుకొనే ఎలాంటి ఉద్దేశం లేక, నరకం వైపుకు వెళ్తున్నారు. ఇప్పుడు మనం జీవిస్తున్నదే జీవితం అనుకొంటే మనమెంత దైన్యస్థితిలో, జాలిపడాల్సిన విధంగా జీవిస్తున్నామో?

అలాంటి జీవితాల కోసం మెస్సీయ ఎదురుచూస్తున్నాడు. గమ్యంలేని జీవితం జీవించడానికి, అంధకారంలో కలసిపోవడానికి మానవుణ్ణి ఈ బహిరంగ లోకంలోనికి అజాగ్రత్తగా దేవుడు నెట్టి వుంటే వారు జాలిపడే విధంగా, దౌర్భాగ్యమైన ఉనికి కలిగి జీవితాన్ని గడుపుతూ వుండవచ్చు. మన చుట్టూ వున్న వారిని చూసి మనం ఈ పరిస్థితిని గుర్తించవచ్చు.

ఒకరోజు నేను కారులో వుండి, సుమారు 60 ఏళ్ళ వ్యక్తి రోడ్డు విూద నడచి వెళ్ళడం చూశాను. అతడు తలను వంచుకొని, భుజాలు వంగి శూన్యంగా చుట్టూ చూస్తూ ఒంటరిగా నడుస్తున్నాడు. నేను హారన్‌ కొట్టగానే అతడు వెనుదిరిగి చూశాడు. అతని ముఖం దుఃఖంతో నిండి వుంది. ఆ వృద్ధుని, ముఖంలోని విచారాన్ని చూసిన తర్వాత కొంచెం సేపు అతని గురించి ఆలోచన చేశాను. ఆ వృద్ధుడు తన జీవితం ఎంతో శూన్యమైనదిగా భావిస్తున్నట్లుగా అనిపించింది. అతని స్థితి దిక్కుమాలిన తన శూన్యాన్ని పెంచింది. అది అతని జీవిత నిరర్థకతను మరింత పెంచింది. ఈ వ్యక్తి జీవితమే గాదు, ప్రతి ఒక్కరి జీవితం, వాస్తవంగా నిజంగా జాలిపడే విధంగా ఉన్నాయి.

వేగంగా గడుపుతున్న కాలంలో వారి శరీరంలో ముడతలు వచ్చేంత వరకు తాము వృద్ధులమవుతున్నామని వారు గ్రహించలేక పోతున్నారు. వారిలో చాలామంది తామెక్కడ జీవిస్తున్నామో తెలుసుకోలేనన్ని అనేక కష్టాలు ఎదుర్కొంటున్నారు. కొంచెంసేపు విశ్రాంతి తీసుకొని, తిరిగి తామెక్కడున్నామో చూడలేనంతగా జీవిస్తున్నారు. తల్లిదండ్రులందరూ తమ పిల్లల కోసం, కుటుంబాల కోసం శ్రమిస్తున్నా, వారు పొందుతున్న విచారాన్ని, వారెదుర్కొంటున్న అంతాన్ని, వారి జీవితంలో మిగలని వాటిని ఏ అక్షరాలు వివరించి చెప్పలేవు.

వారి ఉద్రేకానికి లొంగిపోయి అంతలోనే కన్నీళ్ళలో మునిగి పోతారు. ఈ పరిస్థితిలోనే ఎంతో సమయాన్ని, ఎన్నో సంవత్సరాలను గడిపివేస్తారు. అప్పుడు వారికి వెను తిరిగి చూసే ఒక అవకాశం వస్తుంది. అలా వారు వెనుదిరిగి చూసినప్పుడు వారి గతం ఎంతో వికారంగా, లేక విచిత్రంగా వారికే అనిపిస్తుంది. ఆకురాలు కాలంలో చెట్ల ఆకులన్నీ రాలిపోయి బాధకరమైన చలికాలాన్ని ఎదుర్కొన్నట్టుగానే వారి జీవితాలు మాయమైపోతాయని తెలుసుకోగలుగుతారు. అప్పుడు ఆ జీవితం కోసం విచారిస్తారు. కాని అప్పటికే ఎంతో కాలం గడిచిపోయింది. ప్రభువును కలుసుకోకుండానే వారు గతించిపోతున్న ఆ సమయంలో వారికింకే నిరీక్షణ వుంటుంది? మెస్సీయను కలువకుండానే తమ అంతానికి చేరిన అలాంటివారు శాశ్వత దుఃఖాన్ని పొందుతారు.

నా వరకూ నేనూ ఎంతో దయనీయమైన జీవితాన్ని గడిపాను. అయినా నేను ప్రభువును కలుసుకోలేదా! మరి విూ సంగేతిమిటి? ఇప్పటి వరకు విూరు ప్రభువును కలుసుకొనకపోతే మీరెటు వెళ్తున్నారు? ఈ లోకంలో అనేకులు ప్రభువును కలుసుకోలేకపోయినందున వారే తమ అసంతోషాన్ని కోరి తెచ్చుకొని అనుభవిస్తున్నారు.

ఈ లోకంలో అనేకులు తామే కోరి అసంతోషాన్ని కలిగించుకొంటున్న వారిని గూర్చి ఆలోచించినప్పుడు నా హృదయం బద్దలవుతుంది. పందులు చనిపోయే వరకు తింటూ వుంటాయి. అయితే మన జీవితాలు పందుల కంటే భిన్నమైనవి. మనమైతే ఈ వర్తమానంలో నుండి శాశ్వతమైన పరలోక రాజ్యం వున్నదని వారికి తెలిసినా వారు తమ చివరి దినాన్ని దుఃఖాలతో ఎదుర్కొంటారు. శాశ్వతమైన పరలోక రాజ్యం వున్నదని వారికి తెలిసినా వారు పాపాత్ములుగానే వుండి పోయారు. గనుక తాము దానిలో ప్రవేశించడానికి అనర్హులమని గుర్తిస్తారు. అలాంటి దుఃఖమయ జీవితాలనేకం వున్నాయి. వారి కొరకు విలపించడం, దుఃఖపడ్డం తప్ప నేనేమి చేయలేకపోతున్నాను.

ఇలాంటి జీవితాలు గలవారు దేవుడు సిద్ధపరచిన మంచి చోటుకు వెళ్లలేక పోతున్నారని, వారి జీవితాలకున్న నిజమైన ఉద్దేశాలను నెరవేర్చలేక ఈ లోకం నుండి వెళ్ళిపోతారని వీరిని గూర్చి ఆలోచించినప్పుడు ఆ ఆత్మను గూర్చి జాలిపడి, వారి దురదృష్టానికి విలపించడం తప్ప మనమింకేవిూ చేయలేము. ఇందుకనే జీవితం తుఫాను తరంగాలతో చెలరేగుతూ ప్రయాణానికి వీలుకాని మహా సముద్రం విూద ప్రయాణంతో తరచూ పోలుస్తూ వుంటారు. జీవితాన్ని గూర్చి చెప్పేటప్పుడు యిది పైన చెప్పుకొన్న మహా సముద్రంలో జీవించడం వంటిదని, ఈ లోకంలో పుట్టినరోజు నుండి చనిపోయేవరకు జీవించాలన్న కోర్కెతో శ్రమపడుతూ, తన్నుకులాడుతూ, దుఃఖపడుతూ వుంటారని అంటూ వుంటారు.

జీవితమంతా యింతే అని మనం జ్ఞాపకం చేసుకొన్నప్పుడు, ప్రత్యక్ష గుడారం ఈ సత్యాన్ని వివరించి, దాని పనులన్నీ ముఖ్యమైనవని, అవి మానవులందరూ ప్రభువును కలుసుకోడానికి సహాయం చేస్తాయని వివరిస్తోంది. ఈ పాపాత్ములు దేవుని మందిరంలో అర్పించే బలియర్పణ ద్వారా దేవుడు వారిని కలుసుకొని వారికి పాపక్షమాపణను అనుగ్రహిస్తాడు. ఇశ్రాయేలీయులు అరణ్య ప్రయాణాల్లో దేవుని మందిరంగా స్థాపించినదే ప్రత్యక్షపు గుడారం. ప్రత్యక్షపు గుడారమనే దేవుని యింటిలో అర్పించిన బలియర్పణ నెరవేర్పు వలన దేవుడు ఈ పాపాత్ములను కలుసుకొని తన కృపావిమోచనను అనుగ్రహిస్తాడు. నేను నివసించు నా యింటిని తన కృపా విమోచనను అనుగ్రహిస్తాడు. ‘‘నేను నివసించు నా యింటిని విూరు కట్టునట్లు చేస్తాను. ఈ ప్రత్యక్ష గుడారపు కరుణాపీఠం విూద నేను మిమ్మును కలుసుకొంటాను” అని దేవుడు మనతో చెబుతున్నాడు. దేవుని యిల్లు అయిన ఆ ప్రత్యక్షపు గుడారంలోనే ఎవరికైనా దేవుని కలుసుకొనే అవకాశం వుంది.

ప్రత్యక్షపు గుడారంలోని సత్యాన్ని గూర్చిన ఈ విశ్వాసం ఈ లోకంలో దేనితోనూ మారకం లేనిది. ఎంత మూల్యంతో నైనాకొనలేని అమూల్యమైనది. యేసుక్రీస్తు మన రక్షకుడు అన్న క్రైస్తవ విశ్వాసం గల మనం ఈ ప్రత్యక్ష గుడారాన్ని గూర్చిన సరైన అవగాహన కలిగి, దానిని విశ్వసించినప్పుడే మరింత దీవెనకరమైన మార్గంలో అడుగు వేయగలం.దీవెనకరమైన జీవితాన్ని జీవించగలం.


మనలాంటి దీవెనకరమైన జీవితాన్ని జీవించేవారెవరైనా ఉంటే వారిని గూర్చి నా హృదయం ఆనందంతో నిండిపోతుంది. జీవితానికి యిలాంటి దయామయమైన ఉనికి వున్నప్పుడు వారు దురదృష్టంలోనే పూర్తిగా జీవిస్తున్నారు. అయితే తన ముందు వారి జీవితాలెంత మూర్ఖంగా వున్నాయో వారి గుర్తించేట్టు చేసి వారిలో హృదయ పరివర్తన కలిగించాలని దేవుడు ఆశిస్తున్నాడు. అయితే వారు దేవుడు తమకు ఉచితంగా అనుగ్రహించిన సువార్తను వినకుండానే, వారి హృదయాలలో దానికి ఇసుమంతైనా చోటును యివ్వకుండానే వారిష్ట ప్రకారం జీవించడానికి ప్రయత్నిస్తున్నారు.

దేవుడు ఫరోకు కలిగించిన పది తెగుళ్ళను నిర్గమకాండం వివరిస్తుంది. మొత్తం పది తెగుళ్ళు ఐగుప్తు (ఈజిప్టు) విూదికి వచ్చాయి. ఈజిప్టులో వున్న తన ప్రజలందరిని పంపించి వేయమని దేవుడు ఫరోకు ఆజ్ఞాపించాడు. తన ఆజ్ఞకు విధేయుడు కానట్లయితే తాను పది తెగుళ్ళను దేశం విూదకి పంపిస్తానని దేవుడు ఫరోను హెచ్చరించాడు. కాని ఫరో దేవుడు చెప్పిన దానికి విధేయుడు కాక మూర్ఖంతో ఎదిరించినందుకు దేవుడు చెప్పిన పది తెగుళ్లు ఆ దేశం విూదికి వచ్చి వినాశనాన్ని కలిగించాయి. ఫరో మొండితనం తప్పటడుగు వేసింది. దేవుడు పంపిన అన్ని శిక్షలు అనుభవించిన తర్వాత ఫరో దేవుని ప్రజలను విడిచిపెట్టడానికి కారణం, అప్పటి వరకు అతడు సాతాను అదుపులో వున్నాడు. ఇది మనలోనూ ప్రతి ఒక్కరిలోనూ వుండే తిరుగుబాటుతనాన్ని తెలియజేస్తుంది. 

అలాంటి వారుకూడా, దేవుడు ప్రత్యక్ష గుడారంలో ఏర్పరచిన నియమాలనాచరించి పాప విమోచన పొందవచ్చు. విశ్వాసంతో ఆయనలో జీవించవచ్చు. అయినా, వీరు ఎంతో మొండితనంతో దేవుని సత్యాన్ని విశ్వసించక, దానిని తిరస్కరించి గాడిదవలె మూర్ఖంతో జీవిస్తూ వున్నారు. ఇందుకనే అనేకమంది సత్యవంతుడైన దేవుని కలుసుకోలేకపోతున్నారు. పాపాత్ములుగానే జీవిస్తున్నారు. ఫలితంగా వారి నాశనాన్ని ఎదుర్కొంటున్నారు. ఇది నాకెంతో వేదనను కలిగిస్తోంది. అనేకమంది దేవుని ముందు మూర్ఖపు మార్గంలో జీవిస్తున్నారు.

అలాంటి వారు కష్టాలనెదుర్కొన్నప్పుడు తాత్కాలికంగా దేవునికి లొంగినా, మళ్ళీ వారంతకు ముందున్న దేవునిపై తిరుగుబాటు తత్వంలోనికే వెళ్ళి, దేవుణ్ణి తిరస్కరించి రెండో తెగులును ఎదుర్కొంటున్నారు. ఈ రెండో తెగులుతో వారు మళ్ళీ కొంచెం దేవునికి లొంగుతారు. కాని ఈ లొంగుబాటు ఎంతోకాలం వుండదు. మళ్ళీ దేవునికి అవిధేయులుగా వుండి, ఆయన్నే సవాలు చేస్తారు. కనుక వారు మూడో తెగులుకు లోనవుతారు. అలాగే నాలుగు, అయిదు, ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిది తెగుళ్ళకు లోనవుతారు. చివరికి పదో తెగులుకు లొంగి నాశనమవుతారు.

చివరి తెగులు వచ్చినప్పుడు మెస్సీయ తమ కొరకు చేసిన దానిని నమ్మక నరకయాతనను అనుభవించే వారు చాలామంది వుంటారు. అలాంటి వారి జీవితాలెంత అవివేకమైనవి? అందుకనే ప్రతి ఒక్కరి జీవితం ఎంతో దయనీయమైనది.

దేవుని ముందు ప్రజల జీవితాలెంతో దయనీయమైనవైనా ప్రత్యక్షపు గుడారంలో దేవుని కలుసుకోవడం మీకెంతో దీవెనకరమని గ్రహించండి. ఈ గ్రహింపుతో ప్రత్యక్ష గుడారపు వాక్యంతో జీవించండి.మన నుండి దేవుడు కోరే అర్పణం


దేవుడు మోషేను సీనాయి కొండవిూదికి రమ్మని చెప్పాడు. అక్కడాయన తన ధర్మశాస్త్రాన్నంతటిని మోషేకు యిచ్చాడు. ఆయన మొదటిగా మోషేకు పది ఆజ్ఞలను యిచ్చాడు. అది ‘‘నేను తప్ప వేరొక దేవుడు విూకు వుండకూడదు. విూరు విగ్రహాలను చేసుకొనకూడదు. వాటికి మ్రొక్కకూడదు. నా నామమును వ్యర్థముగా వుచ్చరించకూడదు. విశ్రాంతి దినమును జ్ఞాపకము చేసికొని పరిశుద్ధముగా ఆచరించాలి. నీ తల్లిదండ్రులను గౌరవించవలెను. నరహత్య చేయకూడదు, వ్యభిచారము చేయకూడదు, దొంగిలింపకూడదు, నీ పొరుగు వారికి వ్యతిరేకముగా అబద్ధ సాక్ష్యము చెప్పకూడదు, నీ పొరుగు వానిదైన దేనిని ఆశించకూడదు. ఇది గాక అనుదిన జీవితంలో ఇశ్రాయేలీయులు అనుసరించాల్సిన యితర నియమాలను కూడా దేవుడు వారితో చెప్పాడు. అవి 613 ఆజ్ఞలు, నియమాలు.

ఈ 613 ఆజ్ఞలెందుకంటే ఇశ్రాయేలీయులు తమ పశువులు పోయినప్పుడు ఏం చేయాలి. మరొకరి పశువు గుంటలోపడినప్పుడేం చేయాలి. వావి వరసలు లేని వారితో వ్యభించరించకూడదు. వారికి దాసులు వుంటే ఏడవ సంవత్సరము వారిని స్వతంత్రులనుగా చేయాలి. వాని పనివారిలో స్త్రీని, ఒంటరిగా వున్న పురుషుని వివాహం చేసుకొన్న వారికి బిడ్డలు కలిగితే, ఏడవ సంవత్సరం ఆ పురుషుని స్వతంత్రునిగా విడిచి పెట్టాలి. ఇలాంటి నియమాలు ఆ 613 ఆజ్ఞలు. ఇశ్రాయేలీయులు తమ దైనందిన జీవితంలో యిలాంటి నైతిక నియమాలన్నింటిని దేవునిలో విశ్వాసంతో ఆచరించాలని దేవుడు మోషేతో చెప్పాడు.

తర్వాత దేవుడు మోషేను పర్వతం దిగివెళ్ళి, పెద్దలందరిని సమకూర్చి తన ఆజ్ఞలను వారికి ప్రకటించమని చెప్పాడు. దేవుని మాట విన్న ఇశ్రాయేలీయులందరూ వాటిని ఒప్పుకొని ఆ ఆజ్ఞకు విధేయులమవుతామని తమ రక్తంతో ప్రమాణం చేశారు. (నిర్గమ 24:1-4)

తర్వాత మళ్ళీ దేవుడు మోషేను పర్వతం విూదికి రమ్మని పిలిచాడు. ఈసారి ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించమని ఆజ్ఞాపించాడు.

దేవుడు మోషేతో యిలా చెప్పాడు, ‘‘నాకు ప్రతిష్ఠార్పణ తీసికొని రండని ఇశ్రాయేలీయులతో చెప్పుము. మనఃపూర్వకముగా అర్పించు ప్రతి మనుష్యుని యొద్ద దాని తీసికొనవలెను’’ (నిర్గమ 25:2). ఆ తర్వాత ఆ అర్పణ జాబితాను వివరించాడు. ‘‘విూరు వారి యొద్ద తీసుకొనవలసిన అర్పణలేవనగా ` బంగారు, వెండి, ఇత్తడి, నీల ధూమ్ర రక్త వర్ణములు, సన్నపునార, మేక వెంట్రుకలు, ఎరుపురంగు వేసిన పొట్టేళ్ళ తోళ్ళు, సముద్రవత్సల తోళ్ళు, తుమ్మ కఱ్ఱ, ప్రదీపమునకు తైలము, అభిషేక తైలమునకును, పరిమళ ద్రవ్యముల ధూపమునకు సుగంధ సంభారము, లేతపచ్చలు, ఏఫోదుకును, పతకమునకు చెక్కు రత్నములు అనునవే.’’ (నిర్గమ 25:3-7)

దేవుడు ఈ అర్పణలను తీసుకురమ్మనడంలో స్థిరమైన ఉద్దేశం వుంది. ఈ భూమి విూద దేవునికి ప్రకాశమానమైన ఇల్లును నిర్మించడమే ఆ వుద్దేశం. అక్కడ ఏ పాపం వుండదు. అక్కడే దేవుడు నివసిస్తాడు. అక్కడ ఆయన ఇశ్రాయేలీయులను కలుసుకొని, వారి పాపాలను క్షమిస్తాడు. అట్లని నేటి దేవాలయాల్లా స్మారక నివాసాలను నిర్మించడానికి డబ్బు తీసుకొని రమ్మని చెప్పలేదు దేవుడు. నేటి క్రైస్తవ్యంలోని అబద్ధ ప్రవక్తలు తమ స్వంత సుఖాలను తీర్చుకోడానికి మందిరాలు నిర్మించుకోడానికి ఈ భాగాన్ని తప్పుగా అన్వయిస్తారు.

దీనికి భిన్నంగా, ఇశ్రాయేలీయులు తనకు ఈ అర్పణలను తీసుకొని వస్తే తన యింటిని నిర్మించడానికి వీటిని వుపయోగించి అక్కడ వారిని సమృద్ధిగా ఆశీర్వదిస్తానని చెప్పాడు. దేవుడు ఈ అర్పణలను తీసుకోవడంలోని సత్యమేమిటంటే, ఆయన మన పాపాల నుండి మనలను విమోచించి, మనపైకి రానున్న తీర్పు నుండి మనలను రక్షించాలన్నదే ఆయన ఉద్దేశం. దయనీయమైన జీవితాలు గడుపుతున్న మనలను దేవుడు తానే కలుసుకొని మన పాపాలను కడిగివేసి, మనలను తన స్వంత ప్రజలుగా చేసుకోవాలన్న దేవుని ఉద్దేశం దేవుడు తన కొరకు తీసుకొని రమ్మని ఆజ్ఞాపించిన అర్పణలో దాగివున్న ఆధ్యాత్మిక అర్థాలు.


మనం ఈ అంశంపై ముందుకు సాగేముందు దేవుడు మనలనీ అర్పణలను తీసుకురమ్మన్న దానిలోని ఆధ్యాత్మిక అర్థాలను గూర్చి కొంచెం సేపు ధ్యానం చేద్ధాం. ఆ తర్వాత దాని నాధారంగా మన విశ్వాసాన్ని పరీక్షించుకొందాం.బంగారు, వెండి, ఇత్తడి


బంగారు, వెండి, ఇత్తడిని ఎక్కడ ఉపయోగిస్తారో మొదట తెలుసుకొందాం. బంగారాన్ని ప్రత్యక్ష గుడారపు పరిశుద్ధ స్థలంలోను, అతి పరిశుద్ధ స్థలంలోను, అక్కడ వుండే వస్తువుల్లోను, దీపస్తంభానికి, సముఖపు రొట్టె బల్లకు, ధూపవేదికకు, కరుణా పీఠానికి, నిబంధనా మందసానికి ఉపయోగిస్తారు. దేవుని వాక్యంలో బంగారం విశ్వాసానికి సూచన, వెండి కృపా రక్షణను సూచిస్తుంది. మెస్సీయ మాత్రమే అనుగ్రహించగలిగిన రక్షణ వరంలో మనం విశ్వాసం కలిగి వుండాలని, మన ప్రభువైన యేసు మన పాపాలనన్నింటిని తనపైకి తీసుకొని మన కొరకు తీర్పు పొందాడన్న విశ్వాసాన్ని కలిగి వుండాలని అది మనకు తెలియజేస్తుంది.

ఇత్తడి, ప్రత్యక్ష గుడారపు స్తంభాలు నిలుచు అడుగు పళ్లాల వంటి వాటికి, వాటి గూటాలకు, గంగాళాలకు, దహన బలిపీఠాలకు ఉపయోగిస్తారు. ఇత్తడి పరికరాలనన్నింటిని కొంత పాతిపెట్టాలి. ఇది మానవుల పాపాలకు తీర్పు వున్నదని సూచిస్తుంది. ఇంకా మన పాపాల వలన మనం ధర్మశాస్త్రాన్ని అనుసరించక తప్పిపోతే మనం దేవుని శిక్షను అనుభవించాల్సి వుంటుందని ఈ ఇత్తడి తెలియజేస్తుంది.

మరి బంగారు, వెండి, ఇత్తడిలోను ఆధ్యాత్మిక అర్థాలేమిటి? అవి దేవుడనుగ్రహించు రక్షణ వరాన్ని విశ్వాసం ద్వారా పొందగలమన్న పునాదిని స్థిరపరుస్తున్నాయి. ధర్మశాస్త్రమును పూర్తిగా అనుసరించని మనమంతా పాపాత్ములమని బైబిలు చెబుతోంది. మనం చనిపోవలసి వుండగా మనకు బదులు యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చి మన పాపాల నిమిత్తం, మన స్థానంలో మనకు బదులుగా ఆయన బలిపశువై ప్రత్యక్ష గుడారంలో పాప పరిహార బలిని అర్పించాడు.

వారి పాపాల సమస్యను పరిష్కరించుకోడానికి పాపాత్ములు నిందారహితమైన పశువును ప్రత్యక్షపు గుడారానికి తీసుకొని వచ్చి, బలియర్పణా విధానం ప్రకారం, దాని తలపై చేతులుంచి తమ పాపాలను దాని విూద మోపి, వారి పాపాలను అంగీకరించిన ఆ బలియర్పణా పశువు రక్తాన్ని చిందించి, దానిని బలియిస్తారు. ఇశ్రాయేలీయులు అలా చేయడం ద్వారా నరకపాత్రులైన వారు (ఇత్తడి), వారి పాపాలకు విమోచన పొంది (వెండి), విశ్వాసం వలన పాపశిక్షను తప్పించుకొంటారు (బంగారు).నీలధూమ్ర రక్త వర్ణాల దారం, పేనిన సన్నని నార:


పలుమారులు వుపయోగించిన యితర వస్తువులు : నీలధూమ్ర రక్త వర్ణాల దారం, పేనిన సన్నని నార. ఈ దారాలు ప్రత్యక్షపు గుడార ద్వారానికి, పరిశుద్ధస్థల ద్వారానికి, పరిశుద్ధ స్థలాన్ని, అతి పరిశుద్ధ స్థలాన్ని వేరు చేస్తూ వాటి మధ్యను తెరకు ఉపయోగించారు. ఈ నాలుగు దారాలు ఆది 3:15లో ప్రవచించిన సత్యాన్ని అంటే ప్రభువు స్త్రీ కుమారునిగా వస్తాడని మన ప్రభువు ఈ లోకానికి వచ్చి బాప్తిస్మాన్ని పొంది, సిలువ వేయబడి, పాపాత్ములను వారి పాపాల నుండి రక్షిస్తాడు. దేవుడు తానే మనలను రక్షిస్తాడు అని వివరిస్తున్నాయి.

ఈ నాలుగు దారాలు ప్రత్యక్షపు గుడార ద్వారాలకే గాక, ప్రధాన యాజకుని దుస్తులకు, ప్రత్యక్ష గుడారపు మొదటి కప్పుకు కూడా వుపయోగిస్తారు. దేవుడు నీలధూమ్ర రక్త వర్ణాల దారాలలో చేసిన నిబంధనను యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మన పాపాల నుండి మనలను రక్షించి దేవుని నిబంధనను నెరవేర్చాడు. మన ప్రభువు ఈ వాగ్ధానాన్ని నెరవేర్చి ఈ లోక పాపాల నుండి మనలను రక్షించాడు.

ప్రత్యక్ష గుడారపు ద్వారాలలో అతిక్లిష్టమైన అంశం నీలం దారం. యేసుక్రీస్తు మెస్సీయగా సిలువ విూద చావడానికే ఈ లోకానికి వస్తున్నాడా? దానికి కారణం ఆయన బాప్తిస్మాన్ని పొందాడు. నీలపు దారం యేసు బాప్తిస్మాన్ని సూచిస్తుంది. ధూమ్ర వర్ణపు దారం ఆయన రాజని తెలియజేస్తోంది. రక్తవర్ణపు దారం ఆయన రాజని తెలియజేస్తోంది. రక్తవర్ణపు దారం ఆయన సిలువ శిక్షను, రక్తాన్ని చిందించడాన్ని తెలియజేస్తోంది. నీలధూమ్ర రక్తవర్ణాల దారాలు, పేనిన సన్నని నార తప్పని సరిగా కట్టడానికి అవసరమైన వస్తువు. అని యేసుక్రీస్తు ఈ లోకానికి మెస్సీయగా వచ్చి మన పాపాలన్నింటిని ఆయన విూదికి తీసుకొంటాడన్న రక్షణ వరాన్ని స్థిరపరుస్తున్నాయి.

ఈ లోకంలో చాలామంది యేసుక్రీస్తు దేవుని కుమారుడు మాత్రమేనని, అంటే మూలాధారమైన దేవుడు ఆయనే అని నొక్కి చెబుతారు. అయితే ఆ బోధలు పూర్తి సత్యంకాదని దేవుడు ప్రత్యక్షగుడారం ద్వారా స్పష్టంగా చెబుతున్నాడు.

అయితే అపోస్తలుడైన పేతురు యిలా చెబుతున్నాడు. ‘‘దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. అదేమనగా శరీర మాలిన్యము తీసివేయుట కాదు గాని యేసుక్రీస్తు పునరుత్థాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే.’’ (1 పేతురు 3:21)

దీనిని బట్టి యేసుక్రీస్తు తాను వాగ్ధానం చేసిన రక్షణను నెరవేర్చి, మనలను రక్షించు సాదృశ్యమైన తాను పొందిన బాప్తిస్మం వలన విశ్వాస పునాదులను వేశాడు. మన మెస్సీయ ఎవరు? మెస్సీయ అంటే రక్షకుడు. యేసు ఈ లోకానికి వచ్చి, మన పాపాలను, ఈ లోక పాపాలనన్నింటిని తనపైకి తీసుకోడానికి బాప్తిస్మాన్ని తీసుకొన్నాడు.

నీలధూమ్ర రక్తవర్ణాల దారం, పేనిన సన్నని నారతో ప్రత్యక్ష గుడారపు ఆవరణ ద్వారాన్ని నిర్మించమని దేవుడు ఇశ్రాయేలీయులకు చెప్పాడు. రాజుల రాజు, పరలోక ప్రభువు అయిన మన ప్రభువైన యేసు ఈ లోకానికి మానవునిగా వచ్చిన ఉద్దేశం ఏమిటంటే నీలధూమ్ర రక్త వర్ణాల దారం, పేనిన సన్నని నారలోని సత్యాన్ని నెరవేర్చడానికి ఆయన వచ్చాడు. మన ప్రభువు మానవునిగా వచ్చి, దేవుని సమస్త నీతిని నెరవేర్చుటకు మానవుల ప్రతినిధిగా బాప్తిస్మమిచ్చు యోహాను వలన బాప్తిస్మాన్ని పొందాడు.

ఇది పాత నిబంధన లోని ఇశ్రాయేలీయుల బలియర్పణా విధానంలో వారు బలిపశువు తలపై ప్రధాన యాజకుని చేతులుంచుట ద్వారా వారి పాపాలన్నీ దానిపైకి పోగా వారి స్థానంలో ఆ పశువును బలియిచ్చే విధానాన్ని పోలి వున్నది యేసుక్రీస్తు బలిదానం. మరో మాటల్లో చెప్పుకుంటే, పాత నిబంధన లోని బలి యర్పణలా క్రొత్త నిబంధన లో యేసుక్రీస్తు పాపాత్ములందరి పక్షంగా బలియర్పణగా వచ్చి బాప్తిస్మాన్ని తీసుకొని, సిలువ వేయబడుట ద్వారా ఈ లోక పాపాలన్నిటిని మోసి శిక్షను అనుభవించాడు. యోహాను వలన బాప్తిస్మాన్ని పొందిన యేసు దేవుని గొర్రె పిల్లగా నీలివర్ణపు దారంలోని సత్యాన్ని నెరవేర్చాడు. ఈ బాప్తిస్మంలో యేసు ఒకేసారి మానవజాతి పాపాలనన్నింటిని తనపైకి తీసుకొన్నాడు.

క్రైస్తవుల్లో ఎక్కువమంది యితర మతాల వారి కంటే చెడుగా ఎందుకు మారిపోయారంటే యేసు బాప్తిస్మమనే ఈ నీలవర్ణపు దారంలోని సత్యాన్ని వారు తెలుసుకొనలేక, నమ్మలేక పోయినందు వల్లనే. కనుక వారి పాపాలకు విమోచనను వెంటనే పొందలేకపోతున్నారు. యేసు బాప్తిస్మం ద్వారా మన పాపాలను ఆయనే తన విూదికి తీసుకొన్నాడన్న సరైన వివరణ క్రైస్తవులకు లేదు గనుక ఆది నుండి వారి విశ్వాస పునాదులు సరిగా వేయబడలేదు.

ఈ నీలవర్ణపు దారం విధానాన్ని, సత్యాన్ని సరిగ్గా చెప్పుకొంటే దాని ద్వారా మెస్సీయ ఈ లోకానికి వచ్చి మన పాపాలను తానే తనపైకి తీసుకొన్నాడు. ఎర్ర రంగు దారం యేసు రక్తాన్ని సూచిస్తుంది. యేసుక్రీస్తు తాను పొందిన బాప్తిస్మం ద్వారా మన పాపాలన్ని ఆయన విూదికి వెళ్ళినవి గనుక యేసుక్రీస్తు సిలువ వేయబడి, తన రక్తాన్ని కార్చి, సిలువ విూద చనిపోవలసి వచ్చింది. యోహాను వలన యేసుపొందిన బాప్తిస్మం ద్వారా తానే మన పాపాలను తనపైకి తీసుకొన్నందు వలన సిలువ విూద చనిపోవలసి వచ్చింది. ఈ కారణంగా ఆయన చేసిన బలియాగం వ్యర్ధం కాలేదు. మెస్సీయ అయిన యేసుక్రీస్తు తన బాప్తిస్మం, సిలువ మరణం ద్వారా మన పాపశిక్షను భరించి మన రక్షణను పూర్తి చేశాడు.

ధూమ్ర వర్ణ దారం అర్థమేమిటంటే, యేసుక్రీస్తు మన దేవుడు రాజుల రాజు అని అర్థం. యేసుక్రీస్తు రాజుల రాజు అయిన (ధూమ్ర వర్ణదారం) మానవజాతి ప్రతినిధిగా బాప్తిస్మమిచ్చి యోహాను ద్వారా బాప్తిస్మం పొందలేదా, తానుగా తనపైకి మన పాపాలను తీసుకోలేదా, (నీలవర్ణపు దారం) ఎంత బాధ, శ్రమలైనా భరించి సిలువ విూద చనిపోయాడు (ఎర్ర రంగు దారం). ఆయన మరణం మాత్రమే వ్యర్ధమయిందా. పా॥నిలో దేవుడు చెప్పిన ప్రవచన వాక్యం కొ॥నిలో నెరవేరిందని పేనిన సన్నని నార తెలియజేస్తోంది.నేటి క్రైస్తవ్యం నీలం రంగు దారం అర్థాన్ని కోల్పోయింది.


అయినప్పటికి నేటి క్రైస్తవ్యంలో కొట్టవచ్చినట్లు కనిపించే ఉద్దేశమేమిటంటే నాలుగు దారాలలో నీలంరంగు దారాన్ని విస్మరించి దేవుని వాక్యాన్ని తమ స్వంతంగా వివరిస్తున్నారు. ఈ మహా పాపం, తప్పక శిక్ష పొందుతుంది. 

మన పాపాల నుండి మనలను రక్షించడానికి మన మెస్సీయ అయిన యేసుక్రీస్తు మానవునిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన బాప్తిస్మాన్ని పొందాడు. సిలువ వేయబడ్డాడన్న రక్షణ సత్యాన్ని ప్రత్యక్ష గుడారపు ఆవరణ ద్వారానికి ఉపయోగించిన నీలధూమ్ర రక్త వర్ణాల, పేనిన సన్నని నార మనకు వివరిస్తుంది. మన పాపాలనన్నింటిని యేసు తానే తనపైకి తీసుకొన్నాడు.

మన పాపాలను యేసు తన విూదికి తానే ఎలా తీసుకోగలుగుతాడా? ఆయన యోహాను నుండి పొందిన బాప్తిస్మం ద్వారా ఆయన తీసుకొన్నాడు. ఆయన తానుగా మన పాపాలను తనపైకి తీసు కోవడం వల్లనే ఆయన మన రక్షకుడైనాడు. ఇందువల్లనే ప్రత్యక్ష గుడారపు ద్వారాలకు నాలుగు రంగు దారాలతో నేయబడ్డాయి. అవి యేసు ఈ లోకానికి వచ్చాడని, బాప్తిస్మం పొందాడని, సిలువ విూద తన రక్తాన్ని కార్చాడని, మృతులలోనుండి మళ్లీ లేచాడని, ఆయనే దేవుడని చెబుతున్నాయి.

అందుకనే ప్రత్యక్షపు గుడారపు ఆవరణ ద్వారం నీలధూమ్ర రక్త వర్ణదారాలు, పేనిన సన్నని నారతో చేశారు. మనలను పరలోక రాజ్యంలోనికి నడిపించే రక్షణ ద్వారం యేసే. ఈ ద్వారం ఈ నాలుగు రంగుల దారాలతో పేనినది. పాపుల రక్షకుడు యేసు. పాపాత్ములను వారి పాపాల నుండి రక్షించిన గొప్ప రక్షణ బహుమానం యేసు బాప్తిస్మం, ఆయన సిలువ శిక్ష.

ఇందువల్లనే నేటి క్రైస్తవ్యం, యేసు బాప్తిస్మాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయింది. అంతేగాక నిజమైన దేవుని కలుసుకోలేకపోయింది. అందువల్లనే అది ప్రపంచ మతాలలో యిది ఒక మతంగా మారిపోయింది. మన విశ్వాసానికి వచ్చినప్పుడు మనం నీలధూమ్ర రక్తవర్ణాల ధారమనే సత్యం విూద మన విశ్వాస పునాదిని స్థిరంగా కట్టుకోవాలి. ఈ మన విశ్వాసపునాది యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. ఈ నాలుగు దారాల ద్వారా నిన్ను నన్ను మన పాపాల నుండి రక్షించాడు.

యేసు ఈ లోకానికి వచ్చాడు. ఆయన బాప్తిస్మంతోను, సిలువ రక్తంతో మన పాపాల నుండి మనలను రక్షించాడు. రక్షణ వరాన్ని పూర్తి చేశాడు. దీనిని యింకా వివరంగా చెప్పుకొంటే, యేసు మానవశరీరంగా ఈ లోకానికి వచ్చాడు. తన బాప్తిస్మం ద్వారా లోక పాపాలను తానే తన విూదికి తీసుకొన్నాడు. తన సిలువ రక్తంతో మన పాపపరిహారం చేశాడు. అలా మన పాపశిక్షను భరించి సిలువ విూద చనిపోయాడు. ఈ యేసే నీరు, రక్తం ద్వారా (1 యోహాను 5:4-8) మనలను రక్షించాడు. ఆయన మనలను సృజించిన దేవుడు. మనలను రక్షించి రక్షణ వరాన్ని యిచ్చినవాడు ఆయనే. మన పాపాలన్నిటి నుండి పాపశిక్ష నుండి మనలను రక్షించిన ఈ యేసే మనకు నిజమైన రక్షకుడైనాడు. ఈ సత్యాన్నే ప్రత్యక్ష గుడారపు నిర్మాణ వస్తువు లు మనకు తెలియజేస్తున్నాయి.

కనుక ఈ వస్తువులలో మనం నమ్మకముంచి మన విశ్వాసాన్ని స్థిరమైనదిగా చేసుకోవాలి. మన స్వంత రక్షకునిగా, మన మెస్సీయగా వచ్చిన ఈ యేసును, ఆయన పొందిన బాప్తిస్మాన్ని, సిలువ విూద మన కొరకు ఆయన భరించిన శిక్షను మృతులలో నుండి ఆయన పునరుత్థానాన్ని మన హృదయ పూర్వకంగా, స్థిరంగా నమ్మాలి. తన బాప్తిస్మం ద్వారా, సిలువ విూద చిందించిన రక్తం ద్వారా మన పాపాల నుండి రక్షణ వరాన్నియిచ్చిన ఈ రక్షకుడు కేవలం మానవుడు కాదు. ఆయన మానవ జాతిని, సకల జగత్తును సృష్టించిన సృష్టి కర్త. నీలధూమ్ర రక్తవర్ణాల దారంలో మన విశ్వాసాన్ని ఒప్పుకోవాలి. అలాంటి విశ్వాస ఒప్పుకోలు లేకపోతే యేసే రక్షకుడని నిరూపించలేము.

మౌనంగా వాక్యాన్ని మరొకరికి, అతడు యింకొకరికి యిలా అందించే ఆట విూరెప్పుడైనా ఆడారా? ఈ ఆటలో మొదటి వ్యక్తి ఒక కార్డు విూద ఒక వాక్యం రాసి మరో వ్యక్తికి యిస్తాడు. అతడు ఆ వాక్యాన్ని తనలో చదువుకొని దానిని శబ్ధం లేకుండా ఆ పదాలను పెదాలు కదిపి మరో వ్యక్తితో పలుకుతాడు. అది విన్న మూడోవ్యక్తి నాలుగో వ్యక్తికి తానర్థం చేసుకొన్న దానిని పెదాలు కదుపుతూ చెబుతాడు. అలా నలుగురో అయిదుగురో లేక యింకా ఎక్కువమందో వున్న జట్టులో చివరి వాని వరకు అలా పెదాలు కదుపుతూ వినిపించాలి. ఆ చివరి వ్యక్తి మొదటికార్డు విూద రాసిన వాక్యాన్ని సరిగ్గా చెప్పగలగాలి. దీనిలోని తమాషా ఏమిటంటే మొదట రాసిన వాక్యం చివరి వాని దగ్గరకు వచ్చేటప్పటికి అది పూర్తిగా మారిపోతుంది. 

ఈ మౌన పద వాక్య ప్రకారం ఆటలాగే నేటి క్రైస్తవ్యం పూర్తిగా అపార్థమైన విశ్వాసంగా మారింది. అలా ఎందుకైంది? అది నీల ధూమ్ర రక్త వర్ణాల దారం అనే విశ్వాసం విూద దాని పునాదిని వేసుకోలేకపోయింది. గనుకనే, మన విశ్వాస పునాది తప్పుగా వున్నప్పుడు మనం యేసును ఎంత మనఃపూర్వకంగా నమ్మినా, ఆయన బోధనలు మన జీవితాలకు ఎంతగా అన్వయించాలని ప్రయత్నించినా మనం అనుకొన్నది చేయలేము. 

ప్రత్యక్షపు గుడార నిర్మాణానికి తమ కానుకలను తీసుకొనిరమ్మని దేవుడు ఇశ్రాయేలీయులను అడిగినప్పుడు మొదటిగా బంగారు, వెండి, ఇత్తడిని, ఆ తర్వాత నీలధూమ్ర రక్త వర్ణాల దారం, పేనిన సన్నని నారను తీసుకొని రమ్మని అడిగాడు. ఈ నిర్మాణ వుస్తువులు మనకేం తెలియజేస్తున్నాయంటే, యేసు యోహాను నుండి తీసుకొన్న బాప్తిస్మం వలన, సిలువ విూద చనిపోయే వరకు కార్చిన తన రక్తం వలన, తన పునరుత్థానం వలన మనలను రక్షంచాడని వివరిస్తున్నాయి.

ప్రత్యక్షపు గుడారపు అన్ని ద్వారాలకే గాక, ప్రధాన యాజకుని వస్త్రానికి, ప్రత్యక్ష గుడారపు కప్పులకు నీలం వర్ణ దారాన్ని వాడారు. ఈ సువార్తే యేసు ప్రభువు ఈ లోకానికి ఎలా వచ్చాడో సరిగ్గా నిన్నూ, నన్ను ఎలా రక్షంచాడో వివరిస్తోంది. కాబట్టి యిది నీల ధూమ్ర రక్తవర్ణాల దారం, పేనిన సన్నని నార మన విశ్వాసానికెంత ముఖ్యమో తెలియజేస్తోంది. ఈ వాక్యాధారంగా మన మందరం మన విశ్వాస పునాదిని స్థిరంగా వేసుకోవాలి. అప్పుడే మనం దేవుని నమ్మగలం. మనం పాపక్షమాపణ పొందగలం. ఆయన వాక్యాన్ని వ్యాప్తిచేయగల సేవకులం కాగలం. ప్రభువు తిరిగి వచ్చినప్పుడు ఈ విశ్వాసంతో ప్రభువు ముందు నమ్మకంగా నిలబడగలిగే విశ్వాసులుగా వుండగలం. 

కొరియాలో యితర మతాలకంటే తోయా మతం గొప్పదని నమ్ముతారు. మా దేశంలో కూడా పాశ్చాత్యలు చెప్పిన క్రీస్తు వేదాంతంలో గొప్ప నమ్మక ముంచిన వేదాంతులు కూడా దేవుని వాక్యం విూద కంటే వారు చెప్పిన దాని విూదే ఆధారపడి వున్నారు. వారీ అజ్ఞానం నుండి విడుదల పొందాలి. వారు నిజంగా దేవుని వాక్యాన్ని నమ్మాలి. ఆయనను నమ్మి, ప్రభువు బాప్తిస్మం, ఆయన రక్తం విూద, ఆయనే దేవుడని, ఆయనే రక్షణ ద్వారం అయినాడన్న సత్యాన్ని నమ్మి దాని విూద ఆధారపడాలి.

అపోస్తలుడైన పేతురు ‘‘నీవు సజీవు డగు దేవుని కుమారుడవైన క్రీస్తువు’’ అని ఒప్పుకొన్నట్టు (మత్తయి 16:16). నీవు దేవుని నమ్మితే, మన పాపాల నుండి మనలను రక్షించడానికి ప్రభువు ఈ లోకానికి వచ్చాడని నమ్మితే, ఆయన మన రక్షణకు నిజమైన దేవుడని నమ్ముతాం. మన ప్రభువు బాప్తిస్మం, సిలువ రక్తం రక్షణ వరాన్ని పొందగల నిజమైన విశ్వాసానికి పునాది. దేవుని వాక్యం ప్రకారం మనం నీల ధూమ్ర రక్త వర్ణ దారంలోని విశ్వాసాన్ని నమ్మకపోతే మనది నిజమైన విశ్వాసం అని ఎలా పిలువగలం?రానున్న మంచి వాటి నీడే ధర్మశాస్త్రం


మన ప్రభువు మానవునిగా ఈ లోకానికి వచ్చాడని, తన బాప్తిస్మం ద్వారా మన పాపాలను తన విూదికి తీసుకొని, మన పాపాశిక్షను సిలువలో భరించి, మరణం నుండి లేచుట ద్వారా మన రక్షకుడైనాడని ప్రత్యక్ష గుడారపు వస్తువులు తెలియజేస్తున్నాయి. నీల ధూమ్ర రక్తవర్ణాల దారంతో మనకు రక్షణ వరాన్నియిస్తానని పా॥నిలో వాగ్ధానం చేశాడు మన ప్రభువు. ఈ నిబంధన చేసిన వాడు పాపుల కోసం బాప్తిస్మం తీసుకొని, సిలువ వేయబడిన రాజుల రాజైన యేసుక్రీస్తే. దేవుడు మన మెస్సీయగా మన కొరకు వచ్చాడు. కనుక ఈ సత్యంలో సత్యాన్ని తెలుసుకొని, దానిని నమ్మి దానిలో మన విశ్వాస పునాదిని వేసుకోవాలి. నీరు, ఆత్మ సువార్తను నమ్ముట ద్వారా మన రక్షణ వరాన్ని పొందాలి.

ప్రత్యక్ష గుడార నిర్మాణానికి బంగారు, వెండి, ఇత్తడిని కూడా వాడారు. ఈ వస్తువులు మన విశ్వాస పునాదిని సూచిస్తున్నాయి. దేవుని ముందు మన పాపాలకు నరకంలో పడవేయబడడం తప్ప మరో గత్యంతరం లేదు. మనలాంటి వారికి అనగా ఆయనను నమ్మిన వారికి మన ప్రభువు రక్షణ వరాన్ని యిచ్చాడు. మానవజాతి అందరికోసం బలిపశువుగా యేసుక్రీస్తు యోహాను వలన బాప్తిస్మాన్ని పొంది, సిలువ వేయబడుట ద్వారా మన పాపాలనన్నింటి నుండి మనలను రక్షించాడు. మన పాపాల కోసం శిక్షించబడడం తప్ప నరకశిక్షను తప్పించుకోలేమని మనకు తెలుసు. కాని తెలియనిదల్లా మన పాపాలనన్నింటిని పోయేట్టు చేయగల మార్గం మనకు తెలియదు. అయితే దేవునిలో రక్షణ వరం వుంది. అదేమిటంటే యేసు ఈ లోకానికి వచ్చాడు. తన బాప్తిస్మం ద్వారా మన పాపాలనన్నింటిని ఆయన తనవిగా అంగీకరించాడు. సిలువ విూద చనిపోయాడు. దాని వలన మన సమస్త పాపాలను, దాని శిక్ష అనే సమస్యను పరిష్కరించాడు. ఇదే రక్షణ వరం.

మన రక్షణ కార్యాన్ని దేవుడు పూర్తిచేశాడు. దానిని నమ్మినందు వలన మన విశ్వాసం చొప్పున మనకు రక్షణ వరాన్ని అనుగ్రహించి మన పాపాల నుండి మనలను రక్షించాడు. ఇందుకనే ఆయన తనతో విశ్వాసమనే బంగారు, వెండి, ఇత్తడిని తీసుకొని వస్తానని దేవుడు వాగ్ధానం చేశాడు. తమను తాము రక్షించుకొనలేక నరకశిక్షకు పాత్రులైన వారికి రక్షణ వరాన్ని యిచ్చుట ద్వారా రక్షించాడు.

యేసుక్రీస్తు ఇప్పుడు మనకు పరిపూర్ణ రక్షకుడైనాడు. కనుక విశ్వాస వరాలైన నీలధూమ్ర రక్త వర్ణాల దారం, పేనిన సన్నని నార అనే వాటిలో విశ్వాసముంచి దానిలో స్థిరంగా వుండాలి. ఈ విషయాలేమీ తెలియకుండా గ్రుడ్డిగా మనం నమ్మాలని దేవుడు కోరడం లేదు.మేక వెంట్రుకలు, ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల చర్మాలు, నీటికుక్కల చర్మాలు.


ఈ చర్మాలను, ప్రత్యక్షగుడారం కప్పులకు వాడారు. మొదటి కప్పు నీలధూమ్ర రక్త వర్ణాల దారం, పేనిన సన్నని నారతో నేసినది. దానిపైన మేక వెంట్రుకలతో చేసిన దానిని వేశారు. దానిపై ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల చర్మంతో చేసిన కప్పు వేశారు. చివరిగా పైన నీటి కుక్కల చర్మంతో కప్పారు. ఇలా నాలుగు వివిధ రకాల పొరలతో ప్రత్యక్ష గుడారం కప్పును వేశారు.

ప్రత్యక్షపు గుడారం కప్పు ఊపిరిభాగాన నల్లని నీటి కుక్కల చర్మం కనిపిస్తుంది. నీటికుక్కలంటే చేపలను ఆహారంగా తినే ఒక నీటి జంతువు దాని చర్మం పరిమాణం ఒక మనిషి అంత, లేక కొంచెం తక్కువగా వుంటుంది. ఆ చర్మాలు నీటిని పీల్చావు. అందుకని ప్రత్యక్షగుడారం పై కప్పుకు వీటిని ఉపయోగించారు. దీని వలన ప్రత్యక్షపు గుడారం పైకి ఆకర్షణీయంగా కనిపించదు. అది చూడ్డానికి అందంగా కనిపించడంలో సందేహం లేదు. యేసు మన కొరకు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయనలో కోరదగినదేవిూ లేనంత దీనునిగా వచ్చాడని ఈ ప్రత్యక్షగుడారపు ఆకారం మనకు తెలియజేస్తుంది.

ఎర్రరంగు వేసిన పొట్టేళ్ల చర్మాలు యేసుక్రీస్తు మన కొరకు బలియాగం చేయడానికి ఈ లోకానికి వచ్చాడని తెలియజేస్తున్నాయి. మన బలిఅర్పణగా ఆయన బాప్తిస్మం ద్వారా మన పాపాలను తాను అంగీకరించాడని, దాని ద్వారా సిలువ విూద చనిపోయి మనలను రక్షిస్తాడని మేక వెంట్రుకలు తెలియజేస్తున్నాయి.

మరో విధంగా చెప్పుకొంటే ప్రత్యక్ష గుడారపు పైకప్పు వస్తువులు మన విశ్వాసానికి మూలాధారమైనవి. ఈ నిర్మాణపు వస్తువుల సత్యాలు ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పిపోకూడనివి. మనకు రక్షణ వరాన్ని యివ్వడానికి యేసుక్రీస్తు మనకు బదులు బలియర్పణగా ఈ లోకానికి వచ్చాడు. పా॥నిలో ఇశ్రాయేలీయులు పాపక్షమాపణ నిమిత్తం దేవుడు బలియర్పణా విధానాన్ని ఏర్పాటు చేశాడు. నిష్కళంకమైన బలిపశువు (మేక, గొర్రె, ఎద్దు) తలపై చేతులుంచగా వారి పాపాలు వాటిపైకి పోగా వారికి బదులుగా వాటిని చంపి, వాటి రక్తాన్ని చిందించి వాటిని దహించగా ఆకార్యం వారి పాపాల నుండి వారిని రక్షిస్తుంది.

యేసుక్రీస్తు దేవుని గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చాడు. తన బాప్తిస్మం ద్వారా ఆయనే మన పాపాలను తనవిగా అంగీకరించాడు. ఆ బలిపశువు తలపై చేతులుంచగా, ఆ పాపాలు దాని విూదికి వెళ్ళినవని వాటిని వధిస్తారు. వారి పాపక్షమాపణ నిమిత్తం వాటి రక్తాన్ని చిందించి, దహనబలి చేస్తారు. అలాగే మన పాపాలను తాను అంగీకరించిన యేసు సిలువ విూద మనకు బదులుగా తన రక్తాన్ని చిందించి మన పాపాల నుండి మనలను రక్షించాడు.

దహన బలిపీఠం కొమ్ముల విూద బలియర్పణ రక్తాన్ని ప్రోక్షించగానే న్యాయతీర్పు గ్రంథంలో నుండి ఆ పేర్లను తుడిచివేసినట్లుగా యేసు తన బాప్తిస్మం వలన, తన రక్తాన్ని చిందించి నిత్య పాపపరిహారాన్ని చేసి లోకపాపాలను తుడిచి వేశాడు. ఇలాగే ప్రత్యక్ష గుడారపు వస్తువులన్నీ యేసుక్రీస్తును గూర్చి, ఆయన పరిచర్యను గూర్చి ఆయన మనలను రక్షించిన విధానాన్ని గూర్చి వివరిస్తున్నాయి. పాత నిబంధన నుండి కొత్త నిబంధన వరకు యేసుక్రీస్తు మన పాపాల నుండి మనలను రక్షించాడన్న వాక్యం సంపూర్ణంగా సత్యమైనది.

నేటి క్రైస్తవులలో చాలామంది యేసుక్రీస్తు మనకోసం, బలియర్పణగా లోకానికి వచ్చాడని, తన బాప్తిస్మం ద్వారా తానే మన పాపాలను తనపైకి తీసుకొన్నాడని నమ్మరు. దీనికి బదులు వారు ఆయన సిలువ విూద మరణించాడన్న దానినే నమ్ముతారు. అలాంటి క్రైస్తవ విశ్వాసం ప్రత్యక్షపు గుడారపు ఆవరణ ద్వారం నీలవర్ణ దారాన్ని విడిచి రక్త ధూమ్ర వర్ణాల దారాలతోనే పేనినదని నమ్మినట్టు, వారు నీలధూమ్ర రక్తవర్ణాల దారం, సన్ననినార అనేక రకాలుగా దారాలతో పేనినట్టుగాక, రెండు వర్ణాలతోను, ఎరుపు రంగు వేసిన పొట్టేళ్ల చర్మం, నీటి కుక్కల చర్మంతో కప్పిన పై కప్పునే చూడగల పొరబాటైన విశ్వాసాన్ని కలిగివున్నారు.

ప్రత్యక్షపు గుడారాన్ని చిత్రించిన చిత్రాలను ప్రపంచంలో అనేకం చూడగలం. వాటిలోని ఎక్కువ చిత్రాల్లో నీలం రంగు దారం పొడవుగా కూడా కనిపించదు. అందుకు కారణం ఆ చిత్రకారులకు నీరు, ఆత్మ సువార్తను గూర్చి అసలు తెలియనే తెలియదు. వారి చిత్రాల్లో ప్రత్యక్షగుడారపు ఆవరణ ద్వారం రక్త వర్ణం,తెలుపు రంగులతో మూసి వుంటుంది. అలాంటి విశ్వాసం దేవుని ముందెన్నటికి సరైన విశ్వాసం కాదు.

ప్రత్యక్ష గుడారపు ఆవరణ ద్వారానికి ఎక్కువగా నీలం రంగు దారం, దానిననుసరించి ధూమ్రవర్ణం, తర్వాత రక్త వర్ణ దారాన్ని, ఆ తర్వాత తెలుపు రంగు దారాన్ని ఉపయోగించారు. కనుక ఆవరణ ద్వారాన్ని చూడగానే ఈ నాలుగు దారాలు ఒకేసారి కనిపించాలి. ఈ ప్రపంచంలో అనేకమందిలో యేసు బాప్తిస్మాన్ని గూర్చిన పూర్తి అవగాహన లేక వారి విశ్వాసం వేరువేరుగా వున్నందున వారు ప్రత్యక్ష గుడారానికి వాడిన నాలుగు వర్ణాల దారాలను విస్మరించి వారి ప్రత్యక్ష గుడార ద్వారాలను రెండు రంగు దారాలతో కట్టుకొంటున్నారు.

అలా చేయడం వలన వారు యిప్పటికీ దేవుని గూర్చిన పరిమిత జ్ఞానం గలిగి, ఆయన వాక్యం అసలే తెలియని అనేకమందిని మోసగిస్తున్నారు. వీరంతా అబద్ధ ప్రవక్తలు. వీరిని గురించి యేసు చెబుతూ గోధుమచేలలో సాతాను నాటిన గురుగుల వంటి వారు వీరు అని అన్నాడు. (మత్తయి 13:25) వారు ప్రత్యక్ష గుడారపు ఆవరణ ద్వారానికి నీలం రంగు విడిచిపెట్టి అసత్యాలను ప్రజలలో వ్యాప్తిచేసే వారైనారు. ఇందువల్లనే అనేకులు యేసును నమ్మినా పాపాత్ములుగానే వున్నారు. ఆ పాపం వల్లనే వారు పాపంతో కట్టబడివున్నారు.

మన విశ్వాస పునాది స్థిరంగా నిలిచేదై వుండాలి. విూ ఆత్మలు సుదీర్ఘకాలం మత జీవితాన్ని గడపాల్సి వుండగా అవి నిజమైన విశ్వాస పునాది విూద నిలువకపోతే ఆ ఆత్మలకేమి మేలు కలుగుతుంది? తప్పు విశ్వాసం క్షణకాలంలో కూలిపోతుంది. మన యిల్లు ఎంత అందమైనదైనా అసత్యమనే విశ్వాసం విూద కడితే అదెంత అందమైనదైనా దాని వలన కలిగే మేలేమి వుంటుంది? విూరు దేవునికెంత సేవచేసినా విూ విశ్వాసపునాది అసత్యమైనదైతే విూ యిల్లు ఇసుక విూద కట్టినదే అవుతుంది. తుఫాను వచ్చి, గాలివీచి వరదలు వచ్చినప్పుడు అది కుప్ప కూలిపోతుంది.

స్థిరమైన పునాది గల వారి విశ్వాసం ఎలా వుంటుంది? దాన్నెంత కుదిపినా అది కూలనే కూలదు. నీలధూమ్ర రక్తవర్ణాల దారాలతో సన్నని నారతో చేసిన దాని సత్యాన్ని నమ్మినవిశ్వాసం అది, అలాంటి విశ్వాసంతో కట్టుకొన్న వారి యిల్లు ఎన్నటికి కూలిపోదు. అందుకని మన విశ్వాసానికి స్థిరమైన, గట్టి పునాదిని వేసుకోవాలి. ప్రభువు మన కొరకు ఏమి చేశాడో దానిని పూర్తిగా తెలుసుకొనకుండా మనం నమ్మితే, అలాంటి విశ్వాసం దేవుడు కోరని అబద్ధమత విశ్వాసం అవుతుంది.తుమ్మకర్ర, నూనె, సుగంధ ద్రవ్యాలు


ప్రత్యక్ష గుడారపు స్తంభాలు , దహన బలిపీఠం, పలకలు, పరిశుద్ధ స్థలంలోని వస్తువులన్నీ తుమ్మకర్రతో చేసినవి. బైబిల్లో చెక్క సామన్యంగా మనుషులను సూచిస్తుంది. (న్యాయా 9:8-15; మార్కు 8:24). ఇక్కడ చెక్క మన మానవ స్వభావమును కూడా వివరిస్తుంది. ప్రత్యక్ష గుడారపు స్తంభాలకు, దహన బలిపీఠానికి తుమ్మ చెక్కను ఉపయోగించారు. తుమ్మచెట్ల వేర్లు భూమిలో ఎలా పెనవేసుకొని వుంటాయన్న దానికి సూచనగా ప్రత్యక్ష గుడారానికి ఉపయోగించిన వాటిని కూడా భూమిలో పాతిపెడతారు. మనకు మూలాధారమైనవి మనం పాపం చేయకుండా వుండడానికి సహాయపడ్డ, ఎల్లప్పుడూ అనీతిమంతులుగానే కొనసాగుతూ, ఎప్పుడూ పాపం చేస్తూనే వుండే వారమని ఒప్పుకోవాలి.

వీటితో బాటు తుమ్మ చెక్క యేసుక్రీస్తు మానవత్వాన్ని కూడా తెలియజేస్తుంది. మానవునిగా వచ్చిన మెస్సీయ లోకపాపాలనన్నిటిని భరించి మానవులందరి నిమిత్తం తీర్పు తీర్చబడ్డాడు. ఆయన దేవుడే కనుక మందసం, సముఖపు రొట్టె బల్ల, ధూపవేదిక, ప్రత్యక్ష గుడారపు పలకలు అన్నీ కూడా తుమ్మ చెక్కతో చేయబడి బంగారపు తొడుగు వేయబడినది.

దీపానికి ఉపయోగించే నూనె, తైలాభిషేకానికుపయోగించే సుగంధద్రవ్యాలు, సుగంద ధూపం యివన్నీ మనం యేసుక్రీస్తుకు అర్పించే విశ్వాసాన్ని తెలియజేస్తున్నాయి. నిన్ను నన్ను రక్షించిన మెస్సీయ యేసుక్రీస్తు. ‘‘యేసు” అన్న పేరుకు అర్థం ‘‘తన ప్రజలను వారి పాపము నుండి రక్షించువాడు” అని. ‘‘క్రీస్తు” అన్న పేరుకు ‘‘అభిషిక్తుడు” అని అర్థం. దీనిని బట్టి యేసుక్రీస్తు దేవుడు. మనలను రక్షించిన పరలోకపు ప్రధాన యాజకుడు. దేవుని సంకల్పానికి విధేయుడై మన ప్రభువు మానవునిగా ఈ లోకానికి వచ్చాడు. బాప్తిస్మాన్ని పొందాడు. మన కోసం సిలువ విూద బలియై మనకు రక్షణ వరాన్ని అనుగ్రహించాడు. యేసు తీసుకొన్న ప్రధాన యాజకుని పాత్ర ద్వారా మనకిచ్చిన రక్షణ కార్యం బహుగొప్పది.ప్రధాన యాజకుని ఎఫోదులోను, పతకంలోను మేధికము, ఇతరమణులను పొదగాలి


ప్రధాన యాజకుడు ధరించే ఎఫోదులోను, రొమ్ముపతకంలోను వివిధరకాలైన పన్నెండు విలువైన మణులను పొదగాలని యిక్కడ చెప్పారు. ప్రధాన యాజకుడు మొదట లోపలి దుస్తులను తొడుక్కోవాలి. దానిపై నీలంరంగు అంగీని వేసుకోవాలి. ఆ ఆంగీపై ఎఫోదును ధరించాలి. బలియర్పించేప్పుడు ఎఫోదు విూద రొమ్ము పతకాన్ని ధరించాలి. ఈ పతకం విూద పన్నెండు విలువైన మణులను పొదగాలి. ఇది మన ప్రధాన యాజకుడు ఇశ్రాయేలీయులను, ప్రపంచంలోని యితరులను తన కౌగిలిలోనికి తీసుకొని వారి బలియర్పణను దేవునికి అర్పించాడని మనకు తెలియజేస్తోంది.

పరలోకపు ప్రధాన యాజకుడైన యేసు ఈ లోకంలోని అన్ని జాతుల వారిని తన కౌగిలిలోనికి తీసుకొన్నాడు. ఆయన బాప్తిస్మంలో మన పాపాలను తనపైకి తీసుకోడానికి తన శరీరాన్ని యిచ్చాడు. మనకు బదులుగా బలియై తన ప్రజలను తండ్రియైన దేవునికి సమర్పించాడు. రొమ్ము పతకంలో పొదిగిన విలువైన పన్నెండు మణులు ఈ లోకంలోని అన్ని జాతులకు ప్రతీకలు. దానిని ధరించిన ప్రధాన యాజకుడు ప్రపంచ జాతులన్నింటిని తన కౌగిలిలోనికి తీసుకొని రక్షించిన యేసుక్రీస్తుకు ప్రతినిధి.

తనకు ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించడానికి ఇశ్రాయేలీయులను ఈ అర్పణలను తీసుకొని రమ్మని దేవుడు చెప్పాడు. తన నివాసమైన ఈ అర్పణలతో తనకు నివాసమైన ప్రత్యక్షపు గుడారాన్ని నిర్మించమని దేవుడు వారికి చెప్పడంలో ఒక ఆధ్యాత్మిక అర్థం వున్నది. దేవుడు ఇశ్రాయేలీయులకిచ్చిన ధర్మశాస్త్రాన్ని అనుసరించక వారిప్పుడు పాపంలోనే వున్నారు. అందుకని వారు ప్రత్యక్ష గుడారంలో తనకు అర్పించే బలియర్పణ ద్వారా వారికి పాప విమోచన కలుగునట్లు వారిని ప్రత్యక్షపు గుడారాన్ని నిర్మించమని, బలియర్పణా విధానాన్ని మోషే ద్వారా దేవుడు వారికి అనుగ్రహించాడు. ఇశ్రాయేలీయులు బలియర్పణా విధానం ద్వారా అర్పించిన అర్పణలను దేవుడు అంగీకరించి వారి పాపమును తుడిచి వేస్తానని చెప్పాడు. ఇలా దేవుడు ఇశ్రాయేలీయులతో బాటు ప్రత్యక్ష గుడారంలో నివసిస్తాడు.

ఈ ప్రపంచంలోని చాలామంది క్రైస్తవులు నీలధూమ్ర రక్త వర్ణదారాలు, సన్నని దారంతో పేనిన నారలో నమ్మకముంచరు. బంగారాన్ని, వెండిని, ఇత్తడిని తనకు ఇమ్మని అడిగిన దేవుడు అడిగిన దానిని నమ్మే వీరు ఈ అర్పణలో దాగివున్న సత్యాన్ని వారెందుకు నమ్మరు?

మన పాపాల వల్ల మనం నరక పాత్రులైనా సత్య సువార్తను నమ్మండి. మన ప్రభువు మెస్సీయగా ఈ లోకానికి వచ్చి, తన బాప్తిస్మంతో విూ పాపాలను తనపైకి తీసుకోడానికి ఒప్పుకున్నాడు. ఈ పాపాలను సిలువకు మోసికొని వెళ్ళాడు. దాని విూద తన రక్తాన్ని చిందించి తనను తాను బలిగా అర్పించుకొన్నాడు. దాని ద్వారా నిన్ను నన్ను మన పాపాల నుండి, శిక్ష నుండి రక్షించాడు. నీలధూమ్ర రక్త వర్ణాల దారంలో ప్రత్యక్ష పరచబడిన నీరు ఆత్మ సువార్తను నమ్మకుండా మన విశ్వాస పునాదిని పూర్తిగా కట్టుకోలేము.మన విశ్వాస పునాదిని గూర్చి మనం ఆలోచించాలి.


నీల ధూమ్ర రక్త వర్ణాల దారంలో మన విశ్వాసాన్ని కలిగి వుండాలని దేవుడు చెబుతున్నాడు. మనకీ నీలధూమ్ర రక్తవర్ణాల దారంలో విశ్వాసం వుందా, లేక నీలాన్ని ధూమ్ర రక్తవర్ణాల దారాన్ని నమ్ముతున్నామో మనలను మనం ప్రశ్నించుకోవాలి.

మన స్వంత అభిరుచికి తగిన తప్పు విశ్వాసంతో దేవుని సన్నిధికి వెళ్తున్నామేమో మనలను మనం పరీక్షించుకోవాలి. నీలధూమ్ర రక్త వర్ణాల దారాన్ని తన కొరకు తీసుకొని రమ్మని దేవుడు మనకు చెప్పినప్పుడు మనం నల్లని నైలాను దారాన్ని ఒకవేళ యిచ్చామేమో? ‘‘దేవుడు మిమ్ములను యిమ్మని అడిగిన దారం ప్రత్యక్ష గుడారానికి ఉపయోగకరమైనది కాదేమో. అది వర్షానికి తడిసి చివికిపోయినదేమో. దాని కొరకు వెదకడం ప్రయాసతో కూడి ఇంత దూరం యిక్కడికి తీసుకొని రావడం ప్రయాసతో కూడినదేమో. దానికి బదులు ఈ నైలాను తాడును ప్రయత్నించి చూడు. దానిని విూరు జాగ్రత్తగా వాడితే అది 50సం.లు లేక 100సం.లు పనిచేస్తుందన్న హావిూ నేనిస్తున్నాను. దానినొకవేళ విూరు భూమిలో పాతినా అది 200సం.లు వరకు చివికిపోదు అనడం ఆశ్చర్యంగా అనిపించడం లేదా?’’

ఒకవేళ మనం దేవునితో యిలా అంటున్నామేమో? ఒకవేళ మనలను మనం పొగుడుకొంటూ, మూఢనమ్మకంతో దేవుని దగ్గరకు వెళ్తున్నామేమో మనలను మనం పరీక్షించుకోవడం మంచిది. ఒకవేళ మనలో అలాంటి విశ్వాసం వుంటే యిప్పుడే మనం పశ్చాత్తాపాన్ని పొందాలి. దేవుని వైపు తిరగాలి.

మేము చాలామంచి క్రైస్తవులం అని అనుకొనేవారు మనలో చాలామంది వున్నారు. కాని నిశితంగా పరిశీలించి చూస్తే అది వారి పొరబాటని, అలాగే వారి విశ్వాసం కూడా అపార్థంతో కూడినదని తెలుస్తుంది.నేటి క్రైస్తవ్యంలో విస్తారంగా వ్యాపించి వున్న నిగూఢ మతతత్వం


క్రైస్తవులు సాధారణంగా నిగూఢ మతతత్వాన్ని ఎక్కువగా నమ్ముతారు. వీరిలో దేవుని వాక్యం నిజంగా ఏం చెబుతుందో అనే ఆలోచనే వుండదు. మెస్సీయ మనకిచ్చిన సత్య వాక్యం వారికి తెలియదు. కనుక తమ స్వంత భావాలు, భావోద్రేకాలను నమ్మి, వాటిని అనుసరిస్తూ వుంటారు. ఆ భావాలే సత్యమైనవని వారు నమ్ముతారు. వారు తమంత తామే దేవునికి తీవ్రంగా ప్రార్థన చేస్తుంటారు. ఆ ప్రార్థనలో వారు ఎంచిన స్వంత భావాలను నమ్మకంగా అనుసరిస్తూ వుంటారు. కాని దేవునిలో నిజమైన విశ్వాసాన్ని తెలుసుకోవాలని వారెప్పుడూ ప్రయత్నించరు.

ఇలా, తమ స్వంత భావాలతోను, భావోద్రేకాలే సత్య మనే వారిలో విరివిగా మెదులుతూ వుండే దానిని నిగూఢమతతత్వం (మిస్టిసిసమ్‌) అని అంటారు. తాము ఉపవాసమున్నప్పుడు, స్తుతిస్తున్నప్పుడు, వారిలో కలిగే భావాల ద్వారా నడిపింపు పొందామని నమ్మేవారు, ప్రొద్దుటే ప్రార్థించేటప్పుడు కొండంత ఎత్తైన కొర్కెలను మార్చి ప్రార్థిస్తున్నప్పుడు వారు పాపం చేస్తున్నప్పుడు, పశ్చాత్తాప ప్రార్థనలు చేస్తున్నప్పుడు, యిలాంటి ప్రార్థన చేస్తున్నప్పుడు వారు పొందే భావాలే సరైనవని నమ్మే వారందరూ నిగూఢమతతత్వం గలవారు. తమ స్వంత ఆలోచనలనే నమ్మి విశ్వాస జీవితాన్ని జీవించడం మెస్సీయ చెప్పిన నీలధూమ్ర రక్త వర్ణాల దారానికి సంబంధించిన విశ్వాసం కాదు.

నేటి క్రైస్తవుల్లో 99.9 శాతంమంది చారిత్రకంగా నిగూఢ మతతత్వం గలవారే అని అంటే అతిశయోక్తి కాదు. ఇంకా చెప్పుకొంటే ఆది సంఘం తప్ప, క్రైస్తవలోకమంతా ఈ నిగూఢ మతతత్వాన్నే అనుసరిస్తోంది. నీలధూమ్ర రక్త వర్ణాల దారాలలో విశ్వాసంలేని వారు విశ్వాసమంటే తమ స్వంత భావాలేనన్న భ్రమలో వున్నారు.

“మనమాస్తుతి కూడికలో కూడుకొని వున్నాం. మన చేతులు పైకి ఎత్తి మనమంతా ఒకటిగా మన పాపాలకు పశ్చాత్తాపం చెందుతున్నాం. మనం సిలువను పట్టుకొని, దాని పాదాల దగ్గర కొన్ని ఆచారకర్మలను నిర్వహించాం. అప్పుడుమన హృదయాలు మండుతూ వున్నాయి. క్రీస్తు మనకు ఎంతో ప్రేమపాత్రుడైనాడు. క్రీస్తు మన కొరకు చిందించిన రక్తం నిమిత్తం మన హృదయాలలో మనమంతా ఎన్నో కృతజ్ఞతలను చెల్లించాం. ప్రభువు మన పాపాలన్నీ కడిగివేశాడని అందుకే ఆయన తన రక్తాన్ని కార్చాడని ఎంతగానో నమ్ముతున్నాం. ఈ అనుభవాన్నంతటిని మనం ప్రేమిస్తున్నాం’’ అని వారు చెబుతారు. అయితే ఒకనాటికి వారి ఈ భావోద్రేకాలన్నీ తగ్గిపోయినప్పుడు వారు ‘‘ఆ భావాలన్నీ తరిగిపోయాయి, మన హృదయాలలో యింకా పాపం వుంది” అని చెబుతారు. ఇలాంటి విశ్వాసమే నిగూఢ మత విశ్వాసమంటే.

ఒకరి శాఖ, లేక తెగ బేధం లేకుండా ప్రతి క్రైస్తవునికి నీల ధూమ్ర రక్త వర్ణాల దారంలోని సత్యాన్ని నమ్మే విశ్వాసం కావాలి. దేవుడు చెప్పిన ఈ మాటలో విశ్వాసం లేని వారి విశ్వాసం నిగూఢ మతతత్వం గలది. మూఢ నమ్మకం గలది. వీరు దేవునిలో నీలధూమ్ర రక్త వర్ణాల దారపు విశ్వాసం గాక నైలాను దారం విశ్వాసాన్ని చూపుతున్నారు. వారు తమ నిగూఢ మతతత్వంతో దేవుని దగ్గరకు వస్తున్నారు. అంటే దేవుడు కోరిన దానికి వారు చాలా దూరంగా వున్నారు. లేక దేవుడు అసలు చూడని దానిని కలిగి వుంటున్నారు.

వారధి దగ్గర పడవను కట్టివేసే లావు త్రాళ్ళను చూశారా? నిగూఢ మతతత్వం గలవారు దేవునికి యిటువంటి వాటిని సంతోషంగా అర్పిస్తారు. దేవుడు మనలను నీలధూమ్ర రక్త వర్ణం దారాన్ని, సన్నని పేనిన నారను తనకోసం తెమ్మని అడిగితే కొందరీ లావు తాడును దేవునికిచ్చి ‘‘ప్రభువా, ఈ మా విశ్వాసాన్ని అంగీకరించు!’’ అని చెబుతున్నారు. మరికొందరేమో పెద్ద ఓడను ఒకదానితో మరోకదాన్ని, లేక ఓడరేవులోని స్తంభాలకు ఓడను కట్టే ఇనుప గొలుసును, మరికొందరు ఆ ఇనుపగొలుసు చుట్టను దేవుని దగ్గరకు తీసుకొని వెళ్ళి వాటిని అంగీకరించమని అడుగుతున్నారు.

కానీ నీలధూమ్ర రక్తవర్ణాల దారం విశ్వాసాన్ని తనకొరకు తీసుకురమ్మని దేవుడు అడుగుతున్నాడు. కాని ఇనుప గొలుసును తెమ్మని ఆయన మనలను అడుగలేదు. అయినా చాలామంది వారి దృష్టిలో మంచిది ఏదో, లేక వారికి సులభంగా దొరికేదాన్ని తీసుకొని వెళ్తున్నారు. ఇనుప గొలుసును, లావు తాళ్ళను, నైలాను తాడును, లేక పాలగుండ ద్రాక్షరసాలను దేవునికి తీసుకొని వెళ్ళేవారున్నా దేవుడు నీలధూమ్ర రక్త వర్ణాల దారాన్ని మాత్రమే అంగీకరిస్తాడు. నీలధూమ్ర రక్తవర్ణాల దారం విశ్వాసమొక్కదానినే దేవుడు అంగీకరిస్తానని నిర్ణయించాడు. కనుక ఆ విశ్వాసంతోనే మనమాయన ముందుకు వెళ్ళాలి.ఏదో ఒక అర్పణను మెస్సీయ అంగీకరించడు


ఎఫోదులోను, రొమ్ము పతకంలో పొదగడానికి ఇశ్రాయేలీయులు బంగారు, వెండి, ఇత్తడిని, పన్నెండు విలువైన మణులను దేవుని దగ్గరకు తీసుకొని వెళ్ళాలి. అయినా రాగిని, ఇనుమును దేవునికిచ్చే వారున్నారు. యేసు అన్నిరకాలైన వాటిని అంగీకరించి వాటిని పోగు వేయడం లేదు.

ఏ చెత్తనైనా అంగీకరించేలాంటి వాడు కాదు యేసు. ఆయన బండి విూద చెత్త తీసుకొని వెళ్ళి బయట పారవేసి వచ్చే పని చేయడం లేదు. విూరు ఏది యిస్తే దాన్ని తీసుకు వెళ్ళడానికి. మన విూద తన నీలధూమ్ర రక్త వర్ణాల కృపను కుమ్మరించాలని, మన పాపాలకు క్షమాపణ దయచేయాలని, తన నిజమైన ప్రేమను మనకివ్వాలని ఎదురు చూస్తున్న మెస్సీయయే యేసు. ఇందుకనే యేసును ప్రేమరాజు అని పిలుస్తారు. మన కాపరి నిజంగా ప్రేమలో రాజువంటివాడు. యేసు నిజంగా మన మెస్సీయ. మన నుండి ఆయన ఎలాంటి విశ్వాసాన్ని కోరుతున్నాడో దానిని ఆయనే నిశ్చయించాడు. దానికి ఎలాంటి గుణ లక్షణాలుండాలో ఆయనే వివరించాడు. ఈ విశ్వాసంతో మన మాయన ముందుకు వెళ్ళినప్పుడు ఆయన వాగ్ధానం చేసిన దానిని మనకు అనుగ్రహిస్తాడు.

అయినా కూడా కొందరు మెస్సీయను గురించిన తమ స్వంత పొరబాటు అవగాహనా విశ్వాసాన్ని ఆధారం చేసుకొన్న వారి మూర్ఖత్వం వివరించలేనంత పెద్దదని చూస్తున్నాం. వారు దేవుని ముందు తన మొండి విధానాలను ప్రదర్శించిన ఫరో అంత దుష్టులు, చెడ్డవారు. ‘‘తన ప్రజలను పంపించమని యెహోవా చెప్పాడు” అని మోషే ఫరోతో చెప్పినప్పుడు ఫరో, ‘‘యెహోవా ఎవడు?’’ అని ఎదురు ప్రశ్న వేశాడు.

మోషే ఫరోతో దేవుని ఉనికి గూర్చి వివరించనప్పుడు అతడు తన తిరుగుబాటు వలన ఎంత మూల్యాన్ని చెల్లించాల్సి వుంటుందో, ఆయనకు లొంగితే ఎన్ని మేళ్ళు పొందవచ్చో వూహించి తెలుసుకొని వెంటనే ఆయనకు లొంగి తనను తాను ఆయనకు స్వాధీనం చేసుకొని వుండవలసింది. అప్పటికీ తన మూర్ఖంతో నమ్మకపోయి నా రెండు తెగుళ్లను చూసిన తర్వాతనైనా తన మూర్ఖత్వాన్ని విడిచి పెట్టాల్సింది. అలా చేయక కప్పలు దేశమంతా కప్పివేసిన తెగులు వచ్చిన ఫరో యింకా మొండిగా వుండి దేవుని వాక్యానికి అవిధేయుడైనాడు.

కప్పలేగాదు, పేలు కూడా (తెగులు) ఫరో రాజమందిరాన్ని కప్పివేశాయి. కుడికి గాని, ఎడమకు గాని ఐగప్తులో ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఈగలు లేక పేలు నిండి వున్నాయి. అయినా ఫరో లొంగలేదు. ఎక్కడ చూసినా పేలు నిండి వుంటే ఇక ఎవరైనా ఎలా బ్రదకగలరు? ఈ పరిస్థితిలోనైనా ఫరో విషమ పరిస్థితిని ఇలా ఆలోచించుకొని వుండాల్సింది. ‘‘నేను దేవునికి అవిధేయుడనయ్యాను గనుక అసలు నిజమైన రాజు ఎవరో ఆయన నాకు చూపిస్తున్నాడు. ఈ లోకంలో నా సామ్రాజ్యాన్నికి నేను చక్రవర్తిని కావచ్చు. కాని నేనాయనతో దేనిలోను పోల్చదగిన వాడనుకాను. ఈలోకంలో గొప్పదేశానికి రాజును కావచ్చు. ఈ రాజు ఎంతో గొప్ప అధికారం గలవాడు. నా అవిధేయత వల్లనే ఆయనీ తెగుళ్ళు రప్పిస్తున్నాడు అని ఆలోచించి దేవునికి లొంగిపోయి వుండాల్సింది.

దేవుని ఎదిరించడం వలన ఎంత మూల్యం చెల్లించాల్సి వచ్చిందో చూసిన వెంటనే ఫరోదేవునికి లొంగి వుండాల్సిందే. ఫరో ఎంత అధికారం గలవాడైనప్పటికీ దేవుని ఎదిరించి నిలిచే మార్గమే తనకు లేనప్పుడు ‘‘దేవా, నీవే మొదటిస్థానం తీసుకో నేను రెండోవానిగానే వుంటాను’’ అని దేవుని ముందు ఒప్పుకుని ఆయనకు లొంగిపోవలసింది. ఫరో అలా చేయలేదు గనుక అతని దేశ ప్రజలంతా పేలు తెగులుతో బాధపడ్డారు.

దీని వలన ఏ ఐగుప్తీయుడు ఏవిూ చేయలేకపోయాడు. దేశంలో ప్రతి ఒక్కరూ ఈ పేలుతో తీరని హింసపొందుతూ వుంటే దాని నుండి తప్పించుకోడానికి ప్రయత్నించడం తప్ప ఎవరైనా ఏం చేయగలరు? పాపం ఈ ఐగుప్తీయులు పేల బాధనుండి తప్పించుకోడానికి కాగడాలతో వాటిని కాల్చే ప్రయత్నంలో తమ యిళ్ళు తగుల బెట్టుకొని వుంటారు. ఇక కాలిన ఆ పేలు కంపుతో గ్రామాలన్నీ నిండిపోయి వుంటాయి.

మనిషి చేసేవి, చేయలేని పనులు కొన్ని వుంటాయి. దేవుడు సైన్యములకు ప్రభువు గనుక చావు బతుకుల సుఖదుఃఖాలు, దీవెనలు శాపాలు యిచ్చేవాడు దేవుడే ఇదే నిజం. కనుక మన బాధ మనం నమ్మకం పెట్టుకొని, దేవునికి ఎదురు నిలవడానికి ప్రయత్నించడం కంటే వివేకంగా ఆలోచించి, మన మూర్ఖత్వాన్ని విడిచి సరైన నిర్ణయానికి రావాలి. మన స్వంత విధానాలను యితరులు కూడా దానిననుసరించాలని మనం ప్రయత్నం చేస్తుంటాం. అయితే మెస్సీయతో కలసి వ్యవహరించినప్పుడు ఈ పద్ధతి కొనసాగదు.

దేవుని ముందు మనం నిజంగా ఎలాంటి వ్యక్తిగా వుండాలో మనం ఆలోచించాలి. మనం దేవునికి వ్యతిరేకంగా వున్నామా, లేక మన హృదయాలు మంచిగా, సాత్వికంగా వున్నాయో మనం తీవ్రంగా యోచన చేయాలి. మన మందరం దేవుని ముందు సాత్వికులుగా వుండాలన్న నిర్ణయానికి రావాలి. మనుష్యుల ముందు మన మూర్ఖత్వం చూపవచ్చు. కాని కొన్నిసార్లు దాని ఫలితాలను ఎదుర్కొవాల్సి వస్తుంది. కాని దేవుని ముందు, మన హృదయాలు పూర్తిగా సాత్వికంగా వుండాలి.

“దేవా, నేను తప్పు చేశాను” అని ఎవరు అంగీకరిస్తారో వారు సరైన మార్గాన్ని ఎంచుకొంటారో. వీరు తమ నేర జీవితాల నుండి రక్షణ పొందుతారు. ఎవరైతే తమ పాపాల వలన దేవుని విడిచిపెట్టారో వారు దేవుని మార్గాన్ని ఆలింగనం చేసుకొంటే నీరు, ఆత్మల ద్వారా మరలా పుట్టి ఆయనిచ్చు జీవజలంతో పోషించబడతారు. ఈ లోకమనే ఎడారిలో ఫలితంలేని జీవితాలు జీవిస్తూ దాని శూన్యమైన జీవ భూములలో ఏ ఉద్దేశం లేకుండా అటు ఇటూ తిరుగుతూ గుప్పెడు మట్టిగా మారే మన జీవితాల నుండి మనమేం కోరుతున్నాం?

ఈ ఉద్దేశం లేకుండా మట్టిగా మారే వారికి నరకం తప్ప మరో మార్గం లేదు. కాని నీరు, ఆత్మల సువార్తను నమ్మి రక్షణ పొందిన వారు తమ పాపాల నుండి విమోచన పొందుతారు. వారు అద్భుతరీతిగా మన దేవునిముందు పునరుద్ధరించబడి ఆయన కృపా ప్రేమను, ప్రేమ అనే రక్షణ పొందుతారు. కనుక మనమందరం ఈ రక్షణ వస్త్రాన్ని ధరించాలి.

కేవలం మృతప్రాయుడైన వాడు శాశ్వతమైన దేవుని సవాలు చేయగలడు? దేవుడు ఫలానా, ఫలానా అర్పణలు నా కోసం తీసుకురమ్మని చెప్పినప్పుడు మన మందరం ఆయన మాటకు విధేయులం కావాలి. ఈ అధ్యాయం మొదట్లోని బైబిలు భాగాన్ని చదివి మన మాయన కోసం తీసుకొని వెళ్ళవలసిన అర్పణలేవో తెలుసుకొన్న మనం, ఏ విధమైన విశ్వాసంతో ఆయన దగ్గరకు రమ్మని అంటున్నాడో గ్రహించాలి.

ప్రధాన యాజకుని రొమ్ము పతకం విూద పన్నెండు విలువైన మణులను పొదగాలి. న్యాయతీర్పు అన్నరొమ్ము పతకం మధ్య ఉరీము, తువ్మిూము అంటే ‘‘వెలుగు, పరిపూర్ణతలను” పెట్టడం ద్వారా ప్రధాన యాజకుడు ఇశ్రాయేలీయులపై సరైన న్యాయ తీర్పును చేయగలరు.

ఇది దేవుని సేవకులైనవారు, తమలో వున్న పరిశుద్ధాత్మ వెలుగును, దేవుని వాక్యాన్ని ఆధ్యాత్మికంగా విశ్వాసులైన తమ పిల్లవిూద ప్రకాశింపజేసి నీతివంతమైన తీర్పును చెప్పగలరు. అన్న సత్యాన్ని తెలియజేస్తుంది.

కనుక ఇప్పుడు దేవుని ముందు నీలధూమ్ర రక్త వర్ణాల దారమనే సత్యమే నిజమైన సత్యమని, నిజమైన రక్షణ అని మనం గ్రహించాలి. ఈ నీలధూమ్ర రక్తదారాల సత్యమే మనలను జీవింపజేసే రక్షణ. ఇదిగాక మరేదీ మనకు రక్షణ ఇవ్వలేదు. ఇది దేవుని వాక్యాధారమైనదని, స్పష్టంగా, నిజంగా తెలుస్తున్నది.ప్రత్యక్ష గుడారానికి సంబంధించిన వస్తువులన్ని మానవుని పాప రక్షణకు సంబంధించినవే.


అయినా కూడా, ప్రజలు తమ అవివేకంతోను, ఇంకా వారిలోని మూర్కత్వంతోను దేవుడు చెప్పినది నమ్మడానికి తిరస్కరిస్తున్నారు. అలా తిరస్కరించిన వారికేం జరుగుతుంది? వారు ఎన్నటికీ ఎప్పటికీ రక్షణ పొందరు. దేవుని ముందు మనం మన అవివేకాన్ని విడిచిపెట్టాలి. మన హృదయాలను ఖాళీ చేసుకోవాలి. దేవుని ముందు మన స్వంత ఆలోచనలను మన మూర్ఖపు పట్టుదలను ప్రక్కకునెట్టి వేయాలి. దానికి బదులు ఆయన వాక్యానికి విధేయులమై, ఆయనకు మన హృదయాలను సమర్పించుకోవాలి. మనం దేవునికి ఎల్లప్పుడూ వ్యతిరేకంగా వుండకూడదు. మన తిరుగుబాటు విధానాలను గూర్చి నొక్కి అడుగకూడదు. ఇతరుల ముందు అలా చేస్తుంటాం. కాని క్రైస్తవునిగా ఇది మనం చేయలేం. కనీసం దేవుని ముందు అయినా బుద్దిహీనులు దేవునికి వ్యతిరేకంగా నిలుస్తున్నారు, ఇతర మానవుల ముందు సాత్వికముగా వుంటున్నారు. వారిలో వున్న తప్పుయిదే. మనం దేవుని ముందు సాష్టంగపడి దేవుడు మనతో చెప్పినదంతా సరైనదని ఒప్పుకోవాలి.

ఇంకా నీలధూమ్ర రక్తవర్ణాల దారమనే వాక్యాన్ని నమ్మాలి. దానిపై విశ్వాసముంచాలి. మనం దేవుని పాదాల ముందు సాష్టాంగపడినప్పుడు మన కష్టాలనన్నింటిని ఆయన ముందు ఒప్పుకొని, ఆయన సహాయం కొరకు ఆయన విూదనే ఆధారపడాలి. అప్పుడాయన తప్పక మన ప్రార్థనకు జవాబు ఇస్తాడు. అప్పుడు ఆయన మనకు చేసిన దానిని ఒప్పుకొని ఆయనకు కృతజ్ఞతలు తెలియజేయాలి. విశ్వాసమంటే యిదే. నీలధూమ్ర రక్త వర్ణాల దారాన్ని తీసుకొనిరాక హాస్యాస్పదంగా చేప పట్టేగాలం తాళ్ళు లేక ఇనుపగొలుసు దేవునికి తేవడం పిచ్చితనాన్ని సూచిస్తుంది. నిష్ప్రయోజనమైన దారాన్ని దేవుని దగ్గరకు తీసుకువచ్చి ‘‘ఇది నా సొంత నమ్మకం ఇలా నేనెంతో బలంగా నమ్ముతున్నాను. ప్రత్యేకంగా నేను అనుసరిస్తున్న స్థిరమైన విశ్వాసం యిది’’ అని ఆయనతో చెప్పడం ఇది విశ్వాసం కాకపోగా, దేవుని ముందు తనను తాను అవివేకినిగా నిరూపించుకోవడమే అవుతుంది.

మెస్సీయ ముందు ప్రతి ఒక్కరూ తమ మూర్ఖపు పట్టుదలను వదలిపెట్టి దేవునికి లొంగిపోవాలి. దేవుని ముందు మనం (స్త్రీ/పురుషుడు) మన యిష్టాన్ని విడిచిపెట్టి ఆయన యిష్టాలన్నీ అంగీకరించాలి. దేవుడు మనకేం చెబుతాడో మనకేం నిర్ణయిస్తాడో దానిని మనం గుర్తించాలి. క్రైస్తవులు సరైన విశ్వాసం. దేవుని వాక్యం ప్రకారం విధేయులై, దానిని నమ్మడమే విశ్వాసులకు సరైన పద్ధతి. వారు అలాంటి మనస్సు కలిగి వుండాలి. దేవుని ముందు మనవిూ మనసు కలిగి వుండాలి. 

కొన్నిసార్లు మనం సాధించిన వాటిని గూర్చి అతిశయోక్తులు చెప్పుకొంటాం. ఒకరినొకరం ఎవరు గొప్పో అని పోల్చుకుంటాం. ఒకరికొకరం పోటీపడతాం. ఒకరి నొకరం సవాలు చేసుకొంటాం. దేవుని ముందు ఏది అవసరమో దానిని కొలుచుకోవాలి. కాని ఒకరితో ఒకరు పోటీపడడం నిరుపయోగమైనది. దేవుని ముందు యిలాటి ప్రవర్తనకు అవకాశం లేదు. కాని యిలాగే చేస్తూ వుంటాం.

చివరికి తమ యాజమానులేవరో కుక్క పిల్లలు కూడా గుర్తిస్తాయి. వారికి లొంగి, విధేయత కలిగి వుంటాయి. కుక్కలు కూడా తమ యజమానుల స్వరాలను గుర్తించి, వాటి యజమానులనే అనుసరిస్తాయి. వాటి యజమానులు వాటిని గద్దించినప్పుడు అవి తమ తప్పు తెలుసుకొంటాయి. విధేయతతో తమ తలలు వొంచుకుంటాయి. మళ్ళీ తమ యజమాని దయను పొందడానికి ఏవేవో పనులు చేస్తుంటాయి. జంతువులు కూడా ఇలా చేస్తూ వుంటే మనుష్యులు తమ ఆలోచనననుసరించిన విశ్వాసంతో దేవున్నే సవాలు చేస్తున్నారు.

తన నీలధూమ్ర రక్త వర్ణాల దారంతో దేవుడు మానవుల పాపాలనన్నింటిని తుడిచివేశాడు. మన ప్రభువు చేసిన కార్యాలన్నింటిని నమ్మమని ఆయన మనకు చెప్పాడు. అయినా మానవులు తమ తిరుగుబాటు తత్వంతో దేవుని సవాలు చేస్తూనే వున్నారు.

మన పాపాలనన్నింటిని తన దగ్గరకు తీసుకొని రండి “నేను నీలధూమ్ర రక్త వర్ణాల దారంతో వాటిని విూ నుండి తుడిచివేస్తాను” అని చెప్పాడు. ఎవరు ఆయన మాటవిని అలా చేశారో వారికి పాప క్షమాపణను అనుగ్రహించాడు. దేవుడు తమ నీలధూమ్ర రక్తవర్ణాల విశ్వాసంతో తన దగ్గరకు రమ్మని మనతో చెప్పినా మానవులు దానిని నమ్మకపోగా తమ యజమానిని తిరస్కరిస్తున్నారు. ఆయనను తిరస్కరించిన వారు శాపగ్రస్తులవుతారు.

మెస్సీయ విశ్వాసంతో తన దగ్గరకు రమ్మని చెప్పాడు, దానిని గాక, ఏ విశ్వాసాన్ని తాను కోరలేదో అవిశ్వాసంతో వచ్చిన వారిపై ఆయన ఆగ్రహిస్తాడు. అయినా ప్రజలు తమ మూర్ఖంతో తమ సొంత విశ్వాసంతో ఆయన దగ్గరకువచ్చి ‘‘నేనిప్పటి వరకు నా ఈ పనిని నేను బాగా చేసినందుకు నన్ను దయతో ఆదరించు’’ అని అడుగుతున్నారు. ఇన్నాళ్ళు వారు నిరుపయోగమైన విశ్వాసంతో వున్నందుకు దేవుడు వారిని దయతో ఆదరిస్తాడా?

మన జీవితంలో మూర్ఖపు పట్టుదల అవసరమైన సందర్భాలు కొన్ని వుంటాయి. కాని మూర్ఖపు పట్టుదల గల విశ్వాసం దేవుని ముందు నిరుపయోగమైనది. మన పాపాలను తుడిచివేయడానికి దేవుడు నీలధూమ్ర రక్తవర్ణ దారాన్ని, లేక తక్కువైన లోహపు గొలుసును, లేక నైలాను దారాన్ని ఉపయోగించినట్టు బైబిల్లో ఎక్కడా వివరించలేదు. దేవుని యింటిలో, ఆయన మనకిచ్చిన రక్షణ అనే నియమంలో మనం నీలధూమ్ర రక్త వర్ణ దారమనే విశ్వాసంతో తన దగ్గరకు రావాలని ఆయన ఆజ్ఞాపించాడు.

యేసుక్రీస్తును నమ్మి, ఆయనను అనుసరించే వారే క్రైస్తవులు. మనం అలా చేస్తున్నాం కనుక మనం కూడా క్రైస్తవులమే. తిరిగి పుట్టనివారు, యేసును తమ రక్షకునిగా అంగీకరించనివారు, తమ పాపాలకు విమోచన పొందని వారు, నీలధూమ్ర రక్త వర్ణాల దారంలో విశ్వాసం లేని వారు చాలామంది వున్నారు. వీరు నామ మాత్రపు క్రైస్తవులు. వారు తమ సొంత విధానాలను నమ్ముతారు గనుక వారికి నరకం నిర్ణయించబడి వుంది. వారు కేవలం మతస్థులు మాత్రమే, నిజమైన క్రైస్తవులు కారు. దేవుడు వారిని విడిచి పెడతాడు.

కనీసం దేవుని ముందైనా మనం నమ్మకంగా వుండాలి. మనం నిజంగా ఎలాంటి వారమో గుర్తించాలి. మన పాపాల నిమిత్తం మనం నరక పాత్రులమని ప్రతిక్షణం, ప్రతి నిమిషం ఒప్పుకొంటూ వుండాలి. మెస్సీయ ముందు మన మందరం నీలధూమ్ర రక్త వర్ణాల దారపు విశ్వాసాన్ని కలిగి వుండాలి. మనం చేయాల్సిన సరైన పని అలా నమ్మడం. మనం ఎప్పుడు ఒప్పుకొంటున్నా మెస్సీయ మన కొరకు ఏం చేశాడో అంటే మన పాపాల నుండి మనలను విడిపించడానికి ఆయన బాప్తిస్మాన్ని తీసుకొన్నాడు. మన పాపాల నిమిత్తం తన సిలువ శిక్షతో తీర్పును పొందాడు అని మన రక్షణను జ్ఞాపకం చేసుకోవాలి. దానిని నమ్మాలి ఇలాంటి విశ్వాసాన్నే దేవుడు మన నుండి కోరుతున్నాడు.

మనం ఏమి చేయాలని మెస్సీయ మనలను కోరుతున్నాడో అక్షరా అలా చేయకపోతే మనమెన్నటికి దేవుని సంతృప్తి పరచలేము. ఆయన తన నీలధూమ్ర రక్తవర్ణాల దారం ద్వారా మన నిత్య రక్షకుడైనాడు గనుక దేవుడు మన కొరకు చేసిన దానిని ప్రతిక్షణం మనం నమ్మాలి. నీలధూమ్ర రక్త వర్ణాల దారపు విశ్వాసం సత్యమైనది గనుక మనం ప్రతిరోజూ పాపం చేస్తూ వుంటాం. కనుక మన పాప విమోచన కొరకు ఆ విశ్వాసం మనకు మరింత అవసరం.మన స్వంత ప్రయత్నాలతో మనం చేసిన ఉత్పత్తులను ఆయనకు యిస్తే ఆయన తృప్తి చెందుతాడా?


ఈ లోక వస్తువులను మనం దేవునికి యిస్తే ఆయన ఉగ్రతను కూడబెట్టుకోవడమే గాక దేవునికి వ్యతిరేకంగా ఆయన్ను సవాలు చేస్తూ కొండంత పాపాన్ని కూడగట్టుకొంటున్నాం. అలాంటిది ఆయనకు వ్యతిరేకంగా నిలుస్తుంది. గనుక అలాంటి విశ్వాసం రాజద్రోహమవుతుంది. ఈ లోకంలో ఎదైనా, అదెంత విలువైనదైనా దేవుని ఎన్నటికి సంతోషపరచలేదు. అలాంటి ఈలోక సంబంధమైన వాటిని దేవునికి యివ్వడం దేవుడు దయతో అంగీకరించే విశ్వాసం కానేకాదు. ఈ లోకపరిభాషలో అవి ఎంత మంచివైనా కాని, దేవుడలాంటి వస్తువులను అంగీకరించడు. దేవుడు మన నుండి కోరే నిజమైన విశ్వాసాన్నే మనం ఆయన యెడల చూపాలి.

మన విశ్వాసం దేవుని వాక్యాన్ని వున్నది వున్నట్టుగా నమ్మే విశ్వాసులమై వుండాలి. దేవుడు మన నుండి కోరే అర్పణలే మనం యిచ్చే విశ్వాసమై వుండాలి. ఎల్లప్పుడు దేవుడు మనకోసం ఏంచేశాడో మనం గుర్తిస్తూ వుండాలి. అలాగే మన స్వంత లోపాలను, మనం అసంతృప్తులమని ఒప్పుకొంటూ వుండాలి. దేవుడు మన విూద కుమ్మరించిన సమృద్ధియైన దీవెనలను మనం జ్ఞాపకం చేసుకొంటూ వుండాలి. ఆయన యిష్టపూర్వకంగా మన కొరకు ఏం చేశాడో తెలుసుకొని, దానిని నమ్మాలి.

మన స్వంత ఆలోచన విశ్వాసాలనన్నింటిని విడిచిపెట్టాలి. దేవుడు తన వాక్యంలో చెప్పిన వాక్యంలో మాత్రమే నమ్మకం గల విశ్వాసాన్ని మనం కలిగి వుండాలి. ఈ విశ్వాససహితమైన అర్పణలనే మనం దేవునికి అర్పించాలి. సరైన విశ్వాస పూరితమైన అర్పణలను మనం దేవునికి అర్పించినప్పుడు ఆయన సంతృప్తి చెందుతాడు. మనలను కలుసుకోడానికి వస్తాడు. మన విశ్వాసాన్ని అంగీకరిస్తాడు. మనం అలా చేసినప్పుడే ఆయన నిర్ణయించిన, మన కొరకు సిద్ధపరచిన దీవెనలను మనకు అనుగ్రహిస్తాడు.

మనం వాక్య ప్రకారం జీవిస్తున్నప్పుడు ‘‘మన నుండి దేవుడు నిజంగా కోరే విశ్వాసమేది? ఆయన ఎలాంటి ప్రార్ధన మన నుండి కోరుతున్నాడు’’ అని మనం ధ్యానం చేస్తూ వుండాలి. అప్పుడు విశ్వాసానికి తగిన ప్రార్థననే దేవుడు మన నుండి కోరుతున్నాడని మనం తెలుసుకోగలుగుతాం. దేవుడు మన నుండి నీలధూమ్ర రక్త వర్ణాల దారపు విశ్వాసం ద్వారా యిస్తానన్న రక్షణకు తగిన ప్రార్థనను కోరుతున్నాడు. దేవుడు కోరేదంతా ఈ విశ్వాసంతో కూడిన కృతజ్ఞతా ప్రార్థనలనే. మనం స్వంతంగా చేసిన వాటిని యివ్వడానికి ప్రయత్నించినా, ఆయన పాదాల దగ్గర పెట్టినా వాటిని అంగీకరించడు. అలాంటి వాటిని మనమెప్పుడూ చేయకూడదు అని తెలుసుకోవడం ముఖ్యం.

దేవుడు మనతో యిలా అంటున్నాడు. ‘‘విూ నుండి నేను కోరే విశ్వాసం విూరు సొంతంగా ఏర్పాటు చేసుకొన్నది కాదు. నేను విూ కోసం బాప్తిస్మాన్ని తీసుకొన్నాను, సిలువ శిక్షణను అనుభవించాను. విూ పాపాలన్నీ పొగొట్టాలని నేను బాప్తిస్మం తీసుకొన్నాను. నేను విూ పాపాల నిమిత్తం తీర్పు పొంది సిలువ విూద మరణించక ముందు విూ పాపాలను నా యంతట నేను నా విూదికి తీసుకొన్నాను. నేను విూ రక్షకుడను, నేను విూకు దేవుడను. నేను రాజులకు రాజును. నేను విూకు దేవుడను కూడా కనుక నేనీ లోకానికి వచ్చి సమస్తాన్నీ నెరవేర్చాను. విూరు నన్ను నిజంగా నమ్మాలని కోరుకొంటున్నాను. నా అధికారాన్ని విూరు హృదయపూర్వకంగా గుర్తించాలని, నేనే విూకు నిజమైన దేవుడనని విూరు హృదయపూర్వకంగా ఒప్పుకోవాలని కోరుకొంటున్నాను”. ఈ వుద్దేశంతోనే దేవుడు మనకు నీలధూమ్ర రక్త వర్ణాల దారాన్ని, పేనిన సన్నని నారను యిచ్చాడు. దానిలోనే విశ్వాస ముంచమని దేవుడు మనలను కోరుతున్నాడు.

మనం నిజంగా ఈ నీల ధూమ్ర రక్త వర్ణాల దారంలో విశ్వాసముంచాలి. విూకు మీరుగా యిలా అలోచించాలి. ‘‘ఇలాగే మనం జీవించాలి. ఇప్పటికి నేను అన్ని విధాలుగా బాగున్నాను. అన్నీ సక్రమంగా జరుగుతూనే వున్నాయి. వాటిని భంగపరచనప్పుడు వాటి నెందుకు స్థిరపరచినట్టు? సరిగ్గా యిలాగే నేనెందుకు నమ్మాలి? నేను యిలా నమ్మినా, మరో విధంగా నమ్మినా అన్నీ ఒకటికాదా? అవి ఒకటి కానే కాదు! ఈ విశ్వాసం తప్ప మరో విధమైన విశ్వాసం విూ హృదయాల్లో వుంటే అలాంటి హృదయాల్లో పాపం ఇంకా వుంటుంది. అప్పుడు విూరు రక్షణ పొందరన్నది స్పష్టం. కనుక అలాంటి విశ్వాసం నుండి విూ హృదయాలను తిప్పుకొని నీరు, ఆత్మ సువార్తను నమ్మి ఆ విశ్వాసానికి తిరిగి రండి.

సత్య సువార్తను నమ్మి, ఒకరికొకరు భిన్నంగా వుండే హృదయాలు దేవునికి తెలుసు. తిరిగి పుట్టిన మనం కూడా అలాగే వుండాలి. మిమ్మును విూరు తెలుసుకొన్నప్పుడు విూరు తిరిగి దేవుని దగ్గరకు రావాలి. ‘‘దేవా, నేను పాపాత్ముడను, దయ వుంచి నన్ను రక్షించు’’ అని అడగాలి. విూరలా విూ హృదయమును ఆయన వైపు తిప్పుకొని రక్షణను వెదకినప్పుడు దేవుడు తన సత్యంతో మిమ్మును కలుసుకొంటాడు.మన ప్రభువు మన పాపాలనన్నింటి నుండి మనలను రక్షించాడు.


మన ప్రభువు మన నిమిత్తం బాప్తిస్మం తీసుకొని, సిలువ శిక్షను పొందాడు. మత్తయి 3 అధ్యాయంలో వివరించినదంతా దేవుడు మన కొరకు చేశాడు. మనం దానిని నమ్ముతాం. అందుకు ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తాం. యేసు బాప్తిస్మం తీసుకొన్నప్పుడు మన పాపాలన్ని ఆయన విూదకు వెళ్లాయి. ఆయన మన పాపాలనన్నింటిని ఆయన విూదికి తీసుకొన్నాడు గనుక, వాటిని సిలువ వరకు మోసికొని వెళ్ళి, సిలువ శిక్షను పొందాడు. మన స్వంత పాపాలకే గాక లోకంలో అందరి పాపాల నిమిత్తం ఆయన తీర్పు పొందాడు.

ప్రత్యక్ష గుడార నిర్మాణానికి ఆయన అర్పణలను తీసుకొని రమ్మని మనకు చెప్పినప్పుడు గాని, లేక ఎప్పుడైనా ఏదైనా తీసుకొని రమ్మని చెప్పినప్పుడు గాని ఆయన ఒక వరుసలో వివరించి చెబుతాడు. ఆయన ఎల్లప్పుడూ ‘‘నీలం, ధూమ్రం, రక్తవర్ణాల దారాన్ని” తీసుకొని రమ్మని చెబుతాడు. నీలం రంగు ఎల్లప్పుడు ముందు వుంటుంది. దీనిననుసరించి పేనిన సన్నని నారను గూర్చి చెబుతాడు. ఇది దేవుని వాక్యాన్ని నమ్మమని చెబుతున్నాయి. మొదట సిలువ రక్తాన్ని నమ్మి తర్వాత యేసు బాప్తిస్మాన్ని నమ్మకాన్ని మొదటిసారి ఆలోచించినప్పుడు బాగానే వున్నట్టు అనిపిస్తుంది. కాని వాస్తవానికి యిది పొరబాటు. ఎందుకంటే యేసు సిలువవిూద రక్తాన్ని చిందించడానికి మొదట బాప్తిస్మాన్ని తీసుకొన్నాడు. అందుకని నేను మళ్ళీ విూకు చెబుతున్నాను. మొదట సిలువ రక్తాన్ని, ఆ తర్వాత బాప్తిస్మాన్ని నమ్మడం పొరబాటు, అలాంటి విశ్వాసాన్ని దేవుడెన్నటికి అంగీకరించడు.

మన ప్రభువు నారావతారునిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయనకు 30సం.లు వచ్చినప్పుడు తనపైకి మన పాపాలను తీసుకోడానికి మొదట బాప్తిస్మాన్ని తీసికొన్నాడు. తర్వాత ఈ లోకపాపాలను సిలువకు మోసుకొని వెళ్ళాడు. అలా ఆయన తన కార్యాలను క్రమంలో నెరవేర్చాడో ఆ క్రమంలోనే మనం విశ్వసించాలి. అప్పుడే మన విశ్వాసం ఎలాంటి కలవరం లేకుండా, లేక చలించక సంపూర్ణంగా నిలుస్తుంది. మనం ఇతరులకు సువార్తను ప్రకటించేటప్పుడు ఈ క్రమంలోనే చెప్పాలి. దేవునికిది సంతృప్తిని కలిగిస్తుందో, ఆయన మనకొరకెలా ఏర్పాటు చేశాడో ఆ క్రమాన్నే మనం నమ్మాలి.

ఏ విశ్వాస అర్పణలను తన కోసం తీసుకొని రమ్మని దేవుడు నిన్ను అడుగుతున్నాడు? నీలధూమ్ర రక్త వర్ణాల దారం, సన్నని నార అనే విశ్వాసాన్ని తన కోసం తీసుకొని రమ్మని నిన్ను అడగడం లేదా? నీలో ఈ విశ్వాసం వుందా? ఎప్పుడైనా నీవీ క్రమాన్ని తలక్రిందులుగా నమ్ముతున్నావా? ‘‘నేను ఈ విధంగా గాని, మరో విధంగానో నమ్మినా అది విశేషం కాదు కాని నేను నమ్ముతున్నాను అన్నదే ఇక్కడ కావలసినది. నేను మొదట రక్తవర్ణపు దారాన్ని నమ్ముతాను. తర్వాత నీలందారాన్ని, ఆ తర్వాత ధూమ్రవర్ణం దారాన్ని నమ్ముతాను.” నీ నమ్మకం యిలా వుంటే ఇలా గాక నీ నమ్మకం క్రమంలో వుండాలి. లేకుంటే దేవుడు తలక్రిందులుగా వున్న నీ విశ్వాసాన్ని ఎన్నటికీ ఆమోదించడు.

మన ప్రభువు న్యాయమైన దేవుడు. సత్యమైన దేవుడు, కనుక ఆయన తప్పు విశ్వాసాన్ని ఆమోదించడు. విశ్వాస క్రమం కలగాపులగం అయినప్పుడు అది నిఠారుగా వుండదు. దేవుడిలాంటి విశ్వాసాన్ని ఆమోదించడు. మనం ఇల్లు కట్టిన తర్వాత పునాది వేద్దామని ఎలా ప్రయత్నించమో అలాగే యేసు సిలువ వేయబడడానికి ముందు మన పాపాలను తన బాప్తిస్మంతో తన విూదికి తీసుకోవాలి.

కనుక ప్రభువు మనతో చెప్పిన ప్రకారంగా మనం నమ్మాలి. అలా నమ్మడం మూలకుపునాది రాయి వేయడం వంటిది. దేవుడు మనలను సరైన విధంగా, న్యాయంగా, నీతిగా రక్షించాడు గనుక మనంగా ఆయన క్రమాన్ని మార్చలేం. ఒకవేళ మనం సిలువ రక్తాన్ని మొదటిగా, ఆ తర్వాత యేసు బాప్తిస్మాన్ని నమ్మితే అది పొరబాటైన విశ్వాసం. ఒకవేళ అలా నమ్మితేవారి హృదయాల్లో పాపం వుంటుంది. వారిది తల క్రిందుల క్రమమైన విశ్వాసం గనుక వారి పాపాలు కడిగివేయబడవు. దీనికంటే ఆశ్చార్యాన్ని కలిగించే సత్యం మరొకటి వుండదు.

మెస్సీయ సమక్షంలో, మనలో చాలామంది క్రీస్తు సిలువ రక్తాన్నే నమ్మేవారున్నారు. మనమైతే ‘‘యేసు నా పాపాలనన్నింటిని తనపైకి తీసుకొన్నాడు. సిలువ విూద తన రక్తాన్ని చిందించి నా పాపశిక్షను భరించాడు. కనుక నేను పూర్తిగా రక్షించబడ్డాను. మన కొరకు సిలువపైన చనిపోయిన క్రీస్తు నుండి మనకు రక్షణ వచ్చింది’’ అని నమ్ముతున్నాం. దీనిని ఎవరు నమ్ముతారో వారు రక్షణ పొందుతారు. అప్పుడు మనం యేసు బాప్తిస్మంలోని అసలైన అర్థాన్ని గ్రహించాం. కనుక మన మొదటి పొరబాటైన విశ్వాసం పైన సత్యమైన విశ్వాసాన్ని పెట్టాం. అప్పుడు వాస్తవానికి మన పాపాలు తొలగిపోలేదు. ఇలాంటి విశ్వాసం కేవలం తెలివితేటలతో కూడినది. సిద్ధాంతపరమైనది గనుక మన పాపాలు తొలగిపోలేదు. అది మన హృదయాలకు సంబంధించిన నిజమైన, సత్యమైన విశ్వాసం కాదు.

విూ విశ్వాసం యిలాంటిదైతే విూరు దాని నుండి తిరిగి, వెంటనే విూ విశ్వాసాన్ని మార్చుకోవాలి. విూ విశ్వాసం నిజంగా సరైనది కాదని మొదట విూరు అంగీకరించాలి. తర్వాత విూ విశ్వాస పునాదిని వెంటనే నూతన పరచుకోవాలి. ఇందుకు విూరు చేయవలసినదల్లా అంతకు ముందున్న విూ విశ్వాస క్రమాన్ని మార్చుకోవడమే. ‘‘యేసు ఈ లోకానికి వచ్చి, బాప్తిస్మమిచ్చు యోహాను వలన యొర్దాను నదిలో బాప్తిస్మం పొందినప్పుడు ఆయన నా పాపాలనన్నింటిని తన విూదికి తీసుకొన్నాడు. యేసు బాప్తిస్మాన్ని తీసుకొన్నాడు గనుక లోకపాపాలన్నీ ఆయన విూదకు వెళ్ళాయి. కనుక నా పాపాలు కూడా ఆయన విూదికి వెళ్ళాయి. అప్పుడు ఆయన నా పాపాలన్నింటికీ మూల్యం చెల్లించడానికి సిలువ విూద తన రక్తాన్ని చిందించాడు’’ అని ఈ క్రమంలో నీవు నమ్మాలి.

“ఈ విధంగా నేను నమ్మినా, మరో విధంగా నమ్మినా ఎవరికి కావాలి? నేను ప్రభువు చేసిన నాలుగు పరిచర్యలను నమ్ముతున్నానా లేదా అన్నదే ముఖ్యం. అంతేగాని దీనివిూద యింత పట్టుదలతో యిలాగే చేయాలనడం ఎందుకు?’’ ఒకవేళ నీలో యిలాంటి ఆలోచనే వుండి దానినే నమ్ముతూ వుంటే నీవు నీ నమ్మకాన్ని మార్చుకొని, యేసు బాప్తిస్మం తీసుకొన్న తర్వాతనే సిలువవిూద చనిపోయాడు అన్న సత్యాన్ని నీవు నమ్మాలి.

పరిశుద్ధాత్మ అన్యాయాన్ని అసలు ఆమోదించడు. ఈ లోకంలో మెస్సీయ ఏ క్రమంలో మన కొరకు చేశాడో ఆ క్రమంలోనే విశ్వాసాన్నే పరిశుద్ధాత్మయైన దేవుడు ఆమోదిస్తాడు. ‘‘కాగా నీవు యేసు చేసిన నాలుగు కార్యాలను నమ్ముతున్నావు. నీవు సరైన క్రమంలో నమ్మినా మరో విధంగా నమ్మినా మంచిదే. మొత్తం విూద నీవు నమ్ముతున్నావు. ఆమెన్‌. నీవు నా బిడ్డవే” అని పరిశుద్ధాత్మ ఎన్నటికీ చెప్పడు.

మెస్సీయైన యేసు తండ్రియైన దేవుని చిత్త ప్రకారం ఈ లోకానికి వచ్చాడు. తండ్రి ఆజ్ఞ ప్రకారం పని చేశాడు. ఇలా ఆయన 33సం.లు ఈ లోకంలో జీవించాడు. ఈ లోకానికి వచ్చిన ఆయన బాప్తిస్మం తీసుకొన్నాడు. సిలువ వేయబడ్డాడు, పునరుత్థానుడైనాడు. మన రక్షణ కార్యాన్ని పూర్తిచేసి పరలోకానికి అరోహణుడై వెళ్ళాడు. మన కొరకు పరిశుద్ధాత్మను పంపించాడు.

ఎవరైతే తమ పాపం నుండి విడుదల పొందారో వారి హృదయాలలో పరిశుద్ధాత్మ నివసిస్తున్నాడు. ఎవరైతే మన కొరకు ప్రభువు చేసినవి వాటి క్రమంలో నమ్ముతారో వారి విశ్వాసాన్ని ఆమోదిస్తాడు. ఇందుకనే మనం మన స్వంత ఆలోచనల ప్రకారం నమ్మము. నేను, విూరు నిజంగా యేసు ప్రభువును నమ్మినా, ఏ పరిస్థితుల్లోనైనా ఆయన చేసిన కార్యాలను తలక్రిందులుగా, వెనుకది ముందు, ముందుది వెనుకగా నమ్మితే మళ్ళీ మనం ఆయన చేసిన వరుసలో నమ్మాలి.

విూరు అలా నమ్మినప్పుడే పరిశుద్ధాత్మ విూ హృదయాలలో పనిచేస్తాడు. మనలో అపరాధాలు ఎన్నివున్నా పరిశుద్ధాత్మ మనలో వున్నాడు. గనుక ఆయన ముందు మనం అపరాధులమైనప్పుడు ఆయన కృపను అనుగ్రహించి మనలను సరిచేస్తాడు. పరిశుద్ధాత్మ మనకు అధికారాన్ని యిస్తాడు, శక్తినిస్తాడు. ఆయన మనలను ఓదారుస్తాడు. మనలను ఆయన దీవిస్తాడు. ఆయన మనకు మంచి భవిష్యత్తును వాగ్ధానం చేస్తాడు. నమ్మిన మనలను ఆయన తన నిత్యరాజ్యంలో ప్రవేశించే యోగ్యతకు కోల్పోకుండా విశ్వాసం నుండి మరింత విశ్వాసానికి మనలను నడుపుతాడు.

ప్రభువు మనకోసం ఏమిచేశాడో దాన్ని నమ్మినప్పుడు, లేక తన కోసం మన అర్పణలు తీసుకొని రమ్మని చెప్పినప్పుడు ఆయన మనలను నీరు, ఆత్మ ద్వారా రక్షించాడని మనం నమ్మాలి. ప్రత్యక్షపు గుడారంలోని వస్తువులన్నీ కూడా ఒకదానికొకటి పొందికగా నీరు, ఆత్మల ద్వారా తిరిగి పుట్టామన్న రహస్యాన్ని తెలియజేస్తున్నాయి. గనుక అవన్నీ ముఖ్యమైనవే. ప్రత్యక్షపు గుడారానికి సంబంధించిన అనేక వస్తువుల ద్వారా దేవుడు నీరు, ఆత్మ సువార్త అనే ఒకే ఒక్క విషయాన్ని గూర్చి మనతో చెప్పాలనుకొంటున్నాడు.

మన విశ్వాసం కోసం దాని పునాది చాలా ఖచ్చితమైనది.

మనం మొదట మన విశ్వాస పునాదిని స్థిరంగా వేసుకొనక మన విశ్వాస గృహాన్ని నిర్మించుకొంటే మనం ఎంత కాలం యేసునినమ్మితే అన్ని ఎక్కువ పాపాలను పోగుచేసుకొంటాం. ఆ స్థితిలో మనం పశ్చాత్తాప ప్రార్థనలు ఎన్ని ఎక్కువగా చేస్తే అంత వేషదారులైన పాపాత్ములమవుతాం. అయితే ప్రభువు తన నీలధూమ్ర రక్త వర్ణాల దారం, పేనిన సన్నని నారతో మనలను రక్షించాడన్న రక్షణ వరాన్ని మనం నమ్మినప్పుడు మనమంతా దేవునికి పరిపూర్ణులైన బిడ్డలమవుతాం. కనుక మనమా సత్యాన్ని నమ్మి దేవుని బిడ్డలమవుదాం. ఎవరి విశ్వాస పునాది సంపూర్ణమైనదో వారుకొన్ని అపరాధాలు చేసినా తమ పరిచర్యను ప్రకాశవంతంగా కొనసాగించగలుగుతారు. వారు తమ కాపరి బాధ్యతలో ఈ లోకంలోని వారిని తమ ఆలింగనంలోనికి తీసుకొని, వారి పాప విమోచన కొరకు దేవుని ప్రార్థిస్తూ దేవుని ముందు ఈ సువార్త బాధ్యతను విజయవంతంగా నెరవేర్చగలుగుతారు.

దీనికి భిన్నంగా ఎవరి విశ్వాస పునాది అస్పష్టంగా వుంటుందో వారి సమయం ఎంత గుడుస్తుందో, వారంత వేషధారులు అవుతారు. వారు చెడ్డ వారవుతారు. వారు మరింత వేషధారులైన మతస్థులవుతారు. తన ఫలాలను బట్టి చెట్టు ఎలాంటిదో తెలుస్తుందని మన ప్రభువు చెప్పినట్టుగా, విశ్వాస పునాది సరైనది కాని వారి ఫలాలు అసహ్యకరమైనవిగా, రోతగా, వేషధారణతో కూడి వుంటాయి.

నిజమైన నమ్మకంతో వుండేవారు వారిలో కొన్ని లోపాలు వున్న వారు నిజంగా నమ్మకంగానే వుంటారు. తమ బలహీనతను, తప్పును వారు గుర్తిస్తారు. వారెల్లప్పుడు ప్రకాశమానమైన వెలుగులో జీవిస్తారు.

మన ప్రభువు మన పాపాలను తుడిచివేయడం కోసం బాప్తిస్మాన్ని తీసుకొన్నాడు. సిలువ శిక్షను అనుభవించాడు అన్న ఈ సత్యాన్ని నమ్మి మన పాప విమోచనను మనం పొందాం. మనం అసంపూర్ణలమైనా మన విశ్వాస పునాది స్థిరంగా వుంది గనుక, మనం పాపాలు చేసినా, మనం బలహీనులమైనా, మన హృదయాలు నిష్కళంకంగా వున్నాయి. గనుక మన జీవితాలు యింకా ప్రకాశవంతంగా వున్నాయి. మన అపరాధాల వలన కొన్నిసార్లు మనం దారి తొలగవచ్చు. అయితే మనం వాస్తవంగా పాపం లేని వారం గనుక మనలను, యితరులను నాశనానికి నడిపేంతగా దారి తొలగిపోము. మనం అసంపూర్ణలమైనా దేవునిలో ఒక్కొక్క అడుగుముందుకు వేస్తూ, సువార్త సేవను మరెక్కువగా చేస్తూ దేవుని సంతృప్తి పరిచే మార్గంలోనే నడుస్తూ వుంటాం. యేసు మనలను పరిపూర్ణులనుగా రక్షించాడు గనుక యిదంతా చేయగలిగే వీలు కలిగింది.

మెస్సీయ, మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు అలా నాలుగుదారాలతో మనలను పూర్తిగా రక్షించి వుండకపోతే మన మెన్నటికి రక్షణ పొందగలిగి వుండే వారం కాదు. ఆయన మనలను రక్షించాడు గనుక మనం రక్షణ పొందాం. దాని వలన మనం నమ్మగలుగుతున్నాం. సువార్తను వ్యాప్తిని చేస్తున్నాం. మన విశ్వాసంతో దేవుని స్తుతిస్తున్నాం. మన విశ్వాసం వలన మనం ఆయనను అనుసరించగలుగుతున్నాం. అందుకనే యిప్పుడు మనం యిలా వున్నాం. మన విశ్వాసంతో మనం దేవుణ్ణి తృప్తిపరచగలుగుతున్నాం. మన స్థిరమైన పునాది గలవారమైనాము.

ఎవరు తమ పునాదిని సరిగా వేసుకోలేదో వారు దానిని మరల సరిగ్గా వేసుకోవాలి. ఇందుకనే హెబ్రీ 6:1-2 యిలా వివరిస్తోంది, ‘‘కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి, మారుమనస్సు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మములను గూర్చిన బోధయు, హస్తనిక్షేపణమును, మృతుల పునరుత్థానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరలవేయక, క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని, సంపూర్ణులమగుటకు సాగిపోదము.”

ఈ భాగం మనకేమి వివరిస్తోంది? దానిని తెలుసుకొని, స్పష్టంగా తేల్చుకొని, ఈ క్రింది ప్రశ్నలకు స్థిరమైన పునాదిని వేసుకోవాలని, ‘‘యేసు ఎందుకు బాప్తిస్మాన్ని పొందాడు?’’ ‘‘ఈ బాప్తిస్మం పా॥నిలో తలవిూద చేతులుంచడానికి దృష్టాంతమా?’’ ‘‘నిత్య తీర్పు అంటే ఏమిటి?’’. ఇది మనకేం చెబుతోందంటే ` సంపూర్ణ విశ్వాసం కలిగి వుండాలని, మొదటి నుంటి విశ్వాస పునాదిని స్థిరంగా వేసుకోవాలి. అప్పుడు మనం ఏ విధంగాను కదలించబడమని, మన పునాదిని ఈ అంశాల ద్వారా మళ్ళీ వేసుకోవలసిన అవసరం రాదని చెబుతోంది. మన ప్రభువు మన రక్షణ కార్యాన్ని సంపూర్ణంగా పూర్తి చేశాడు అని నమ్మే విశ్వాసులమే నీలధూమ్ర రక్తవర్ణాల దారం, పేనిన సన్నని నార అనే విశ్వాసం. ఈ విశ్వాసపునాది విూద మనం స్థిరంగా నిలిచి, అక్కడి నుండి మన విశ్వాస పరుగును కొనసాగించాలి.

పై చెప్పుకొన్న హెబ్రీ భాగాన్ని కొందరు, యేసు బాప్తిస్మం ద్వారా మన పాపాలన్ని ఆయన విూదికి వెళ్ళాయని మళ్ళీ చెప్పనవసరం లేదు. కనుక మన విశ్వాస పునాదిని మళ్ళీ కట్టుకోనవసరం లేదు అని వివరిస్తారు. కాని ఒకవేళ మన పునాది మొదట సరిగా లేకపోతే మళ్ళీ దానిని సరిగా కట్టుకోవద్దని దేవుడు మనతో చెప్పాడా? లేదు. కనుక ఎవరి విశ్వాస పునాది సరిగ్గా వుందో, వారు దానిని మరింతగా స్థిరపరచుకొని దాని నుండి ముందుకు పరుగెత్తాలని ఈ భాగం మనకు వివరిస్తోంది.

దేవుడు మనలను రక్షించడానికి ప్రత్యక్షపు గుడారాన్ని నిర్మించమని, అందుకు కానుకలను తన ప్రజల నుండి తీసుకొనమని ఆయన మోషేకు ఆజ్ఞాపించాడు. తన కోసం బంగారు, వెండి, ఇత్తడి నీల ధూమ్ర రక్త వర్ణాల దారాన్ని, సన్నని నార, మేక వెంట్రుకలు, ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ళ చర్మాలను, నీటికుక్కల చర్మాలను, తుమ్మచెక్కను తీసుకొని రమ్మని దేవుడు ఇశ్రాయేలీయులతో చెప్పాడు. ఈ వస్తువులలో సూచించినట్టు, మన ప్రభువు మనలనీ లోకపాపాల నుండి విడిపించడానికి మనకు రక్షణ వరాన్ని అనుగ్రహించాడు. ఈ విధంగా, ఈ అర్పణను తనకోసం తీసుకొనిరమ్మని, ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించి దాని బలియర్పణా విధానాలను ఏర్పరచాడు. ఈ బలియర్పణా విధానం ప్రకారం తమ బలియర్పణనర్పించిన ఇశ్రాయేలీయుల పాపాలను ఆయన క్షమించాడు.

యేసుక్రీస్తు ద్వారా మనకు సంపూర్ణ రక్షణ నెరవేర్చబడినదని, నీలధూమ్ర రక్త వర్ణాల దారం, పేనిన సన్నని నారను నమ్ముట వలన మన విశ్వాసం పరిపూర్ణం చేయబడినదని ముందుగా చెప్పబడినది.

యేసుక్రీస్తు నెరవేర్చిన పరిపూర్ణ సత్యాన్ని మనం నమ్మలేకపోతే, వెంటనే మన విశ్వాసాన్ని స్థిరంగా చేసుకోలేకపోతే మన విశ్వాసం ఎలప్పుడూ కదిలిపోతూ వుంటుంది. మన ప్రభువు మనలను పూర్తిగా రక్షించాడు అన్న అవగాహన, గుర్తింపు లేకుంటే మనస్వంత ప్రయత్నాలతో మన రక్షణ చేరుకోవాలనుకొంటే ఆ ప్రయత్నాల్లోనే చివరి వరకు వుండిపోతాం. అలాంటి విశ్వాసం సంపూర్ణమైనది కాకపోగా అది పొరబాటైన విశ్వాసం.

హె బ్రీ 10:26`31 చూద్ధాం; ‘‘మనము సత్యమును గూర్చి అనుభవజ్ఞానము పొందిన తర్వాత బుద్ధి పూర్వకముగా పాపము చేసినయెడల పాపముకు బలియికను వుండదు గాని న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు, విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియునికను వుండును. ఎవడైనను మోషే ధర్మశాస్త్రమును నిరాకరించిన యెడల ఇద్దరు ముగ్గురు సాక్షుల మాట విూద, కనికరింపకుండ వాని చంపించుదురు. ఇట్లుండగా దేవుని కుమారుని, పాదములతో త్రొక్కి, తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి, కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని విూకు తోచును? పగతీర్చుట నాపని, నేనే ప్రతిఫలమిత్తుననియు మరియు ప్రభువు తన ప్రజలకు తీర్పు తీర్చును అనియు చెప్పిన వానిని ఎరుగుదుము గదా, జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము.’’

మనం సత్యాన్ని తెలుసుకొన్న తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే అప్పుడు పాపక్షమాపణకు చేయవలసిన బలియర్పణ లేనేలేదు. కాని భయంకరమైన న్యాయతీర్పే మిగిలి వుంది అని ఈ భాగం వివరిస్తోంది. ఇక్కడ సత్యాన్ని తెలుసుకొని బుద్ధిపూర్వకంగా పాపంచేస్తున్న వారు, నీరు ఆత్మ సువార్త తెలిసికూడా దానిని నమ్మనివారని ఈ భాగం వివరిస్తోంది. దేవుడు తన నీలధూమ్ర రక్త వర్ణాల దారం, పేనిన సన్నని నారతోను, బంగారు, వెండి, ఇత్తడితో మనలను రక్షించాడు అని మనం నమ్మాలి. ఇంకా ఆయన ప్రత్యక్ష గుడారపు కప్పును నీలం, ధూమ్రం, రక్తవర్ణాల దారం, పేనిన సన్నని నారతోను, మేక వెంట్రుకలో తను, ఎరుపు రంగువేసిన పొట్టేలు చర్మాలతోను, నీటి కుక్క చర్మాలతోను వేశాడు. మన మందరం ఈ సంగతులను స్పష్టంగా తెలుసుకొని మన విశ్వాసపునాదిని స్థిరంగా వేసుకోవాలి.

మనకు సంపూర్ణ రక్షణనిస్తానని మన ప్రభువు వాగ్ధానం చేశాడు. ఆ సమయం వచ్చినప్పుడు మన పాపాలను తన విూదికి తీసుకోవడానికి ఆయన బాప్తిస్మాన్ని తీసుకొన్నాడు. సిలువ విూద మరణించాడు. మృతులలో నుండి లేచాడు. దాని వలన సంపూర్ణంగా మనలను రక్షించాడు. ఈ విధంగా మన రక్షణకు పునాది వేసిన యేసుక్రీస్తును నమ్ముట వలన మనకు సంపూర్ణ రక్షణ కలిగింది.

ఈ సత్యం తెలిసి, దీనిని నమ్మడానికి తిరస్కరించిన వారు చివరి తీర్పు వచ్చినప్పుడు దేవుని భయంకరమైన తీర్పును ఎదుర్కొంటారు. వారి శరీరాలు చనిపోవుగాని వారు నిత్యశ్రమలను అనుభవిస్తూ వుంటారు. అక్కడ వారికి భయంకరమైన ఉగ్రత వుంటుంది. వారు విస్తార శ్రమలనుభవిస్తారు. ఆ చోటు అగ్నితో మండుతూ వుంటుందని బైబిలు వివరిస్తోంది. (మార్కు 9:49) అక్కడ వారికి భయంకరమైన తీర్పు వుంటుంది. ఆ అగ్నిగుండంలో వారు నిత్యనరకాగ్నిలో వేదనలు పొందుతూ వుంటారు.

ఈ నియమాన్ని అనుసరించినందుకు యింతటి భయంకరమైన తీర్పుకు గురవుతారు. ఇక దేవుని కుమారుడు అనుగ్రహించిన రక్షణను నమ్మిన వారికి యింకెంత గొప్ప తీర్పు వుంటుందో గదా! ఇందుకోసం మనం యేసుక్రీస్తును మన రక్షకునిగా నమ్మాలి. ఆయన మానవునిగా ఈ లోకానికి వచ్చాడు. తన బాప్తిస్మం ద్వారా మన పాపాలనన్నింటిని తన విూదకి తీసుకొన్నాడు. ఈ లోకపాపాలను సిలువ వరకు మోసికొని వెళ్ళాడు. తన సిలువశిక్షలో సమస్త శిక్షను భరించాడు. మృతులలో నుండి ఆయన మరల లేచాడు. ఇప్పుడు సజీవుడైవున్నాడు. ఆయనను మనం నమ్మాలి.కనుక మన విశ్వాస పునాదిని స్థిరంగా వేసుకోవాలి


మోషేను ప్రత్యక్షపు గుడారాన్ని నిర్మించమని దేవుడు ఎందుకు చెప్పాడు? ప్రత్యక్షపు గుడారానికి ఉపయోగించిన ప్రతి ఒక్క వస్తువును పరిశీలించి చూస్తే అవన్నీ యేసుక్రీస్తు మానవునిగా ఈ లోకానికి వచ్చాడని, యోహాను ద్వారా తాను పొందిన బాప్తిస్మం వలన మన పాపాలనన్నింటిని ఆయన తన విూదికి తీసుకొన్నాడని, ఈ లోక పాపాలనన్నింటిని సిలువకు మోసుకొని వెళ్ళాడని, అక్కడ తండ్రియైన దేవుని సింహాసనానికి కుడివైపున కూర్చొని వున్నాడని యిప్పుడాయన మనకు నిత్యమైన దేవుడుగా వున్నాడని వివరిస్తున్నాయి. దాని ద్వారం దగ్గర నుండి, స్తంభం వరకు, ఆ స్తంభాలను నిలబెట్టే ఇత్తడి ఆధారాలు, ప్రత్యక్షపు గుడారానికి సంబంధించిన ప్రతి వస్తువు సువార్త సత్యాన్ని మనకు తెలియజేస్తున్నాయి. పాతనిబంధన అంతా యేసుక్రీస్తు బాప్తిస్మాన్ని గూర్చి ఆయన బలియాగాన్ని గూర్చి, ఆయన గుర్తింపును గూర్చి ఆయన చేసిన రక్షణ కార్యాలను గూర్చి వివరిస్తుంది.

పాతనిబంధన నుండి కొత్తనిబంధన యేసుక్రీస్తు నీలధూమ్ర రక్త వర్ణాల దారం, పేనిన సన్నని నార అనే నీరు, ఆత్మ రక్షణ సువార్తను గూర్చి వివరిస్తున్నాడు. కనుక ఈ సత్యాన్ని నమ్మినవారు అవకాశం వచ్చినప్పుడల్లా నీలధూమ్ర రక్తవర్ణాల దారం, పేనిన సన్నని నారను గూర్చిన సువార్తను యితరులకు చెబుతూ వుండాలి. ఈ సువార్తను బోధిస్తూ, వింటూ వుండడం వలన యిదెంత విలువైనదో కొన్నిసార్లు మనం మరచిపోతూ వుండవచ్చు దీనినెంతగా మరచిపోతూ వుంటామంటే, సొలోమోను రాజు కాలంలో బంగారు, వెండి సమృద్ధిగా లభించడం వలన అప్పటి ప్రజలు వాటిని రాళ్ళను చూసినట్టు చూసే వారట. అలాగే ఈ సత్యవాక్యాన్ని ప్రతిరోజూ మనం దేవుని మందిరంలో వింటూ వుంటాం గనుక కొన్నిసార్లు ఈ రక్షణ మనకు యివ్వబడిందని అనుకొంటూ వుంటాం. కాని మనం జ్ఞాపకం వుంచుకోవాలసిన విషయమేమిటంటే, ఈ సత్యం దేవుని మందిరం బయట వినిపించదు. రక్షణ లేక ఎవరూ రక్షించబడరు లేక స్థిరమైన విశ్వాస పునాదిలేకపోతే ఎవరూ రక్షణ పొందలేరు.

నీవు, నేను రక్షణ పొందిన విశ్వాసం ఏమిటంటే, మన ప్రభువు మనలను సంపూర్ణంగా రక్షించి, నీలధూమ్ర రక్త వర్ణాల దారం, పేనిన సన్నని నార అన్న నాలుగు దారాల ద్వారా మన విశ్వాస పునాదిని స్థిరంగా వేశాడు. కనుక మనమందరం ఈ సత్యాన్ని మన హృదయపూర్వకంగా తప్పక విశ్వసించాలని మరొకసారి నేను చెబుతున్నాను. దేవుడు వాగ్ధానం చేసినట్టుగానే, ఆయన స్త్రీ సంతానంగా ఈ లోకానికి వచ్చాడు (ఆది 3:15). తన బాప్తిస్మం ద్వారా మన పాపాలన్నింటిని మన విూదికి తీసుకొన్నాడు. మన పాపశిక్షలన్నింటిని ఆయన సిలువ విూద భరించాడు, చనిపోయాడు, మళ్ళీ మృతులలో నుండి లేచాడు. దాని వలన మనలను సంపూర్తిగా రక్షించాడు. ఇది వివరించడానికి, అర్థం చేసుకోడానికి సులభమైన సత్యం. ప్రతిరోజు ఈ సత్యాన్ని మనం ప్రపంచమంతా ప్రకటించాలి. ఎందుకంటే ఈ సత్యం తెలియని వారు, మనం జాలిపడాల్సిన వారు లోకంలో చాలా మంది వున్నారు. ఈ సత్యం తెలియని వారిని చూసి జాలి పడడంకంటే దేవుని మందిరంలో వుంటూ కూడా ఈ సత్యాన్ని నమ్మని వారిని గూర్చి మరింతగా జాలిపడాలి.

విూ పాపాలను విమోచనను నిజంగా పొందినా విూలో యింకా పాపపు ఆలోచనలు వుండి వుంటాయి. అయినా విూ హృదయాలు సాత్వికతను కలిగి వుండాలి. కాని అలా లేక బయటికి తమను తాము సాత్వికులుగా కనబరచుకోడానికి ప్రయత్నించే వేషధారులు వారి అంతరంగాలలో చాలా పాపం కలిగి వారు దేవుని, లెక్కించలేనంత మందిని ప్రతిరోజూ మోసం చేస్తూ వుంటారు. మనమైతే మన విశ్వాస పునాదిని స్థిరంగా వేసుకోవాలి. ఈ రక్షణ విూద మన ప్రభువు మనలను స్థిరులనుగా చేసి, నమ్మకంతో దేవుని ముందు నిలిచే యోగ్యతను కలిగిస్తాడు.

ప్రత్యక్షపు గుడారానికి చెందిన వాటంతటిని స్థిరంగా నిలిచే విశ్వాసం.

అలాంటి స్థిరమైన కానుకను తీసుకొని వచ్చి తనకు ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించమని దేవుడు మనతో చెప్పాడు. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మనలను ఆధ్యాత్మికంగా రక్షించాడని నమ్మే విశ్వాసులం కావాలి మనం. ప్రత్యక్షపు గుడార నిర్మాణానికి వాడిన వస్తువుల వంటి స్థిరమైన విశ్వాసంతో మనం దేవుని ముందు నిలవాలి. విూరు నమ్ముతున్నారా? విూలో నిజంగా యిలాంటి విశ్వాసం వుందా? దేవుని సంఘం యింకా నీరు, ఆత్మలనే సువార్తను బోధిస్తూనే వుంది. నిజమైన విశ్వాసానికి ఈ నమ్మకమే పునాది గనుక నేను దానిని తగినంతగా నొక్కి చెప్పలేను.

యేసు తన బాప్తిస్మంతో సమస్త పాపాలను తన విూదికి తీసుకొన్నాడన్న సత్యాన్ని తెలియని సంఘాలు, సంఘశాఖలు అనేకం వున్నాయి. కాని వారు దీనికి బదులు సిలువ రక్తాన్నే నమ్ముతున్నారు. ఈ పరిస్థితుల్లో కూడా మనం సత్యం తెలుసుకొనేట్టు మన ప్రభువు మనలను అనుమతిస్తున్నాడు. యేసు యొర్దాను నదిలో బాప్తిస్మమిచ్చు యోహాను వలన బాప్తిస్మం తీసుకొన్నాడు గనుక ఆయన సిలువకు మేకులతో కొట్టబడ్డాడు, బళ్లెంతో పొడవబడ్డాడు. ఆయన బాప్తిస్మం వలన లోకపాపాలన్నీ ఆయన విూదికి వెళ్ళినై గనుక ఆయన సిలువ వేయబడ్డాడు, పొడవబడ్డాడు.

అలాంటప్పుడు, సిలువ రక్తాన్ని నమ్మడం వల్లనే పాపక్షమాపణ పొందామని చెప్పే వారు ఎంత భక్తిపరులైనా వారిది అసత్యమైన విశ్వాసమే. చివరికి వారి విశ్వాసం కూలిపోతుంది. వారెంత పెద్దగా అరచి, అలసట లేక యేసును నమ్మమని నిజ సమూహాలకు బోధించినా, వారు కేవలం సిలువ రక్తంలోనే విశ్వాసముంచారు గనుక వారు పశ్చాత్తాప ప్రార్థనలు మాత్రమే చేయగలరు. వారి స్వంత పాప సమస్యను కూడా పరిష్కరించుకోలేరు. వారి విశ్వాసం తప్పు పునాది విూద కట్టబడినది గనుక వర్షం వచ్చి, గాలివీచి, వరదలు వచ్చినప్పుడు అది కుప్పగా కూలిపోతుంది.

నేను యేసును నమ్మిన తర్వాత 10సం.ల వరకు యేసు బాప్తిస్మాన్ని గూర్చిన వివరాన్ని వినలేదు. అయినప్పటికి, యేసు తన సత్యవాక్యంతో నన్ను సంధించాడు. అప్పుడు నేను నీరు, ఆత్మలో తిరిగి పుట్టాను. ఈ లోకమంతటిలో యిప్పుడు సత్యాన్ని వెదకే వారు చాలామంది వున్నారు. కాని దానినింత వరకు పొందలేదని నాకు తెలుసు. వారు నీరు, ఆత్మ సత్యాన్ని విని దానిని వారి హృదయాలలో నమ్మి, తమ పాపక్షమాపణ పొందేట్టు నేను వారితో మాట్లాడాలనుకొంటున్నాను.

విూరు కూడా తిరిగి పుట్టకమునుపు విూ మత జీవితాలను గడిపి వుంటారు. అప్పుడు విూరు నీలధూమ్ర రక్త, పేనిన సన్ననారదారాలను గూర్చి బహుశా విని వుండరు. అంతేకాదు నీరు, ఆత్మను గూర్చిన సువార్తను గూర్చి యేసు బాప్తిస్మం వలన మన పాపాలన్నీ ఆయన విూదికి వెళ్ళాయన్న సువార్తను కూడా విని వుండరు.

క్రైస్తవులందరూ కూడా నీలధూమ్ర రక్త వర్ణాలు, పేనిన సన్నని నారను గూర్చిన సత్యాన్ని ఖచ్చితంగా తెలుసుకొని, దానిని నమ్మడం ఎంతోముఖ్యం. మన విశ్వాసపునాది నీలధూమ్ర రక్తవర్ణాలు, పేనిన సన్నని నార అనే సత్యం విూద వేసుకొన్నప్పుడే మన విశ్వాసం స్థిరంగా, గట్టిగా వుంటుంది. ఇప్పటి వరకు ఈ సత్యాన్ని నమ్మకపోతే, యిప్పటికిది చాలా ఆలస్యం కాదు యిప్పుడేనమ్ము. అందుకు నీవు చేయవలసిందల్లా ` ఆ సత్యాన్ని వున్నదున్నట్టుగా నమ్ము, అలా నమ్మినప్పుడే నీవు పూర్తిగా రక్షణ పొందుతావు. నీ విశ్వాసపునాదిని స్థిరంగా వేసుకోగలవు. కాగా ఈ పునాది విూద నీ విశ్వాసాన్ని స్థిరపరచుకో.దేవుని సంఘంలో ఉన్నవారు కూడా వారి విశ్వాస పునాదిని స్థిరంగా వేసుకోవాలి.


మత్తయి 24:40 యిలా వివరిస్తోంది, ‘‘ఆ కాలమున ఇద్దరు పొలములో వుందురు, ఒకడు తీసికొని పోబడును, ఒకడు విడిచిపెట్టబడును’’. మన మందరం దేవుని సంఘంలో ఒకే సత్యాన్ని నమ్మాలని బోధిస్తూ, ఒకే సువార్తను కలిసి సేవిస్తూ వుండగా తర్వాత కాలంలో మనలో కొందరు విడువబడటం కంటే విచారకమైనది మరొకటి వుందా?

దేవుని వాక్యం జ్ఞానం గలది. సౌశ్యీలమైనది. విశ్వాసం ఎవరి విూద బలవంతంగా రుద్దేది కాదు. నీవు దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు నిష్కల్మషమైన మనస్సుతో దానిని నమ్మాలి. నీవు దేవుని వాక్యాన్ని వింటున్నానని నీ మనస్సు దాని విూద కేంద్రీకరించాలి. ఇశ్రాయేలీయులుమోషే చెప్పిన మాట విన్నప్పుడు ఆ మాటలు ఆయనవని గాక అవి దేవుని మాటలని నమ్మారు. కనుక దేవుని వాక్యం ఏమి చెబుతుందో నీకు చెప్పినప్పుడు ఆ దేవుని వాక్య ప్రకారం నీవు నమ్ముతున్నావో లేదో నిన్ను నీవు పరీక్షించుకోవాలి. దేవుని వాక్యం ఏమి చెబుతుందో ప్రశాంతమైన మనస్సుతో నీవు ఆలోచించాలి. తర్వాత అది నీకేం చెబుతుందో దానిని నమ్మాలి.

దేవుని వాక్యాన్ని విశ్వసించిన బెరియా ప్రజలు నిష్కపట స్వభావాన్ని బైబిలు పొగుడుతుంది. బెరియాలోని విశ్వాసులు ‘‘థెస్సలోనీకలో వున్నవారి కంటే ఘనులై యుండిరి. గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి, పౌలును, సీలయును చెప్పిన సంగతులు ఆలాగున్నవో లేవోనని ప్రతిదినమును లేఖనములు పరిశోధించుచు వచ్చిరి” (అపో 17:11) అంటే వారికి బోధించబడిన విధంగా వారు వాక్యాన్ని నమ్మారు అని అర్థం.

నిజమైన విశ్వాసం వాక్యాన్ని పరిశోధించే వివేకం, నిష్పక్షపాతంగ మనస్సు నుండి కలుగుతుంది. దానిలో నీ ఇష్టానికి వ్యతిరేకంగా చేయమని బలవంతం చేస్తున్నట్టుగా వుందా? ఒకవేళ ఎవరైనా నమ్మమని బలవంతం చేస్తే అది పూర్తిగా నిష్పలమవుతుంది. అలా బలవంతం చేయబడిన వ్యక్తి తనకు చెప్పిన అంశాన్ని తప్పక నమ్ముతాడన్న హామీ లేదు. దేవుని ముందు ఒక వ్యక్తి తన యిష్టప్రకారం నమ్మిన దానిపై ఆధారపడి వుంటుంది. ఒక కథను, లేక అంశాన్ని ఒక వ్యక్తికి పదే పదే చెప్పినా నమ్మనప్పుడు ఆ వ్యక్తికి నరకం తప్ప మరో గత్యంతరం లేదు.

కనుక లోకంలో ప్రతి పాపాత్ముని గూర్చి మనం జాలిపడాలి. ఒకే దేవుని మందిరంలో వుండి కూడా మనలో ఎవరైనా ఒకరు దేవుని వాక్యాన్ని వున్నదున్నట్టు నమ్మకపోతే వారిని గూర్చి మరింత జాలిపడాలి. భౌతికంగా మనతో దేవుని సంఘంలో వున్న ఒకరు నరక పాత్రుడవుతున్నాడంటే అతని గూర్చి కాక మనం జాలిపడాల్సిన వారింకెవరుంటారు?

యేసుకు పన్నెండుమంది శిష్యులున్నారు. వారిలో యూదాయిస్కరియోతు యేసే మెస్సీయ అని, రక్షకుడని నమ్మలేదు. అందుకనే ఆ యూదా యేసును ఎప్పుడూ బోధకుడా అనే సంబోధించాడు. పేతురు కూడా యేసును కొన్నిసార్లు బోధకుడా అని సంబోధించాడు. అయినా అతడు యేసును ‘‘ప్రభువా, నీవు దేవుని కుమారుడవైన క్రీస్తువు. నీవు నా పాపాలను తుడిచివేయడానికి వచ్చిన రక్షకుడవైన దేవుని కుమారుడవు. నీవు రక్షణకు దేవుడవు’’ అని నమ్మి, ఆ మాటనే ఒప్పుకున్నాడు.

పేతురు విశ్వాసం యూదా విశ్వాసం కంటే భిన్నమైంది. యూదా ద్రోహంతో యేసును అమ్మివేసిన తరువాత అతడు ఉరి వేసుకొని చనిపోయాడు. యూదా మిగిలిన పదకొండు మంది శిష్యులలో వున్నా చివరికి యేసుక్రీస్తు నిజంగా ఎవరో గుర్తించలేకపోయాడు. నరకంలో నశించిపోయాడు. దీనికి భిన్నంగా పేతరు సహనం లేని వాడైనా, ఎన్నో పొరబాట్లు చేసినా యేసుక్రీస్తు ఎవరో గుర్తించి, తన రక్షకునిగా నమ్మాడు.

అలాగే, ఒక వ్యక్తి సత్యాన్ని, తెలుసుకొని దానిని హృదయ పూర్వకంగా నమ్మడంపై విశ్వాసం ఆధారపడి వుంటుంది. ఏమైనప్పటికి ప్రజలు సత్యాన్ని తెలుసుకొని కూడా దానిని నమ్మపోతే వారు మరింత తీవ్రశిక్షను ఎదుర్కొనవలసి వుంటుంది. (లూకా 12:48) ఇందుకనే మన విశ్వాసపు పునాది స్థిరంగాను, నిజమైనదిగా వుండాలని దేవుడు మనతో చెబుతున్నాడు.మన విశ్వాసం ఎలావుంది?


ఇప్పుడు మన విశ్వాస పునాది బలపడిందా? అది స్థిరంగా వుందా? ప్రభువు నిన్ను తప్పక రక్షించాడని నీవు నమ్ముతున్నావా? నీరు, ఆత్మల ద్వారా మన ప్రభువు మనలను ఖచ్చితంగా రక్షించాడు. మన మతశాఖ దీనిని బోధించడమే గాక, పా॥నిలో దేవుడు దీనిని మనకు వాగ్ధానం చేశాడు. కొ॥నిలో యేసు దీనిని నెరవేర్చాడు. అలా క్రీస్తు మనలను రక్షించాడు.

యేసు రాజుల రాజు (ధూమ్ర వర్ణపు దారం), ఆయన మానవునిగా ఈ లోకానికి వచ్చాడు. తన బాప్తిస్మంతో ప్రపంచ పాపాలను తనవిూదికి తీసుకొన్నాడు (నీల వర్ణపు దారం), ఈ పాపాలను సిలువకు మోసికొని వెళ్ళాడు. దానిపై సిలువ వేయబడ్డాడు (రక్తవర్ణపుదారం). మరలా మృతులలో నుండి లేచుట ద్వారా మనలను రక్షించాడు. అలా చేస్తానని ఆయన పా॥నిలో వాగ్ధానం చేశాడు. కొ॥నిలో ఆ వాగ్ధానాన్ని నెరవేర్చి మనలను రక్షించాడు. ఈసత్యాన్ని నీవు నమ్ముతున్నావా? విశ్వాసపునాదిని స్థిరంగా వేసుకోడానికి దీనిని నమ్మడం కంటే మరో విధానం లేదు.

ఈ లోకంలో కోట్లాదిమంది క్రైస్తవుల్లో ఎక్కువమంది విశ్వాసపునాది బలహీనంగానే వుంది. ఇప్పుడు లోకంలో అందుబాటులో వున్న క్రైస్తవ సాహిత్యం ద్వారా సరైన విశ్వాసంలో క్రైస్తవులు తమ పునాది వేసుకొంటున్నారో లేదో తెలుసుకోవచ్చు. ఈ గ్రంథ రచయితలు క్రైస్తవ సమాజ నాయకులుగా వున్నారు. వారి గ్రంథాలు చదువుట ద్వారా వారు సరైన సత్యాన్ని గూర్చి తెలిసిన వారో కాదో మనం తెలుసుకోవచ్చు. ఈ నాయకులలో ఎవరైనా ఒకరికి ఈ సత్యం తెలియనివారై, లేక ఈ సత్యం తెలిసీ దీనిని నమ్మని వారైతే, అలాంటి వారిని అనుసరించే ప్రతి ఒక్కరూ నరకపాత్రులవుతారు. దీనిలో విషాదకరమైన వాస్తవమేమిటంటే పది లక్షల్లో ఒక్కరు ఈ సత్యాన్ని తెలుసుకోగలుగుతున్నారా? లేదు. కనుకనే ఈ సత్యం తెలిసిన కొద్దిమందిమైన మనం నమ్మకంగా లోకమంతా ఈ సత్యసువార్తను వ్యాప్తి చేయాలి.

దేవుడు మన ద్వారా పనిచేస్తున్నాడు. విూరు నేను ఈ సువార్తను ప్రకటించకుండా వుండలేం. నీరు, ఆత్మ సువార్తను ప్రపంచమంతా ప్రకటించకపోవడం దేవుని ముందు మహా పాపంతో సమానమైనది. వాస్తవంగా మనం దీనిని నిజంగా అనుసరించి, విశ్వాసంతో దీనికి సేవ చేయకపోతే దేవుని ముందు మహా పాపం చేసినవారమవుతాం. దీనిని ప్రకటించకుండా మానివేస్తే ప్రజలను నరకానికి పంపుతున్న పాపం చేసిన వారమవుతాం. ఈ సత్యం తెలిసిన మనం ఈ సత్యాన్ని ప్రకటించక నోరు మూసుకొని వుంటే నరక పాత్రులమైన పాపం చేసిన వారమే అవుతాం.

మనకివ్వబడిన పనిని మనం నెరవేర్చకపోతే మన కాజ్ఞాపించిన పనిని చేయలేదని ప్రజలు మన విూద నేరం మోపుతారు. బైబిలు యిలా హెచ్చరిస్తోంది. ‘‘అయితే కావలివాడు ఖడ్గము వచ్చుట చూచియు, బాకా వూదనందుచేత జనులు అజాగ్రత్తగా వుండుటయు, ఖడ్గము వచ్చి వారిలో ఒకని ప్రాణము తీయుటయు తటస్థించిన యెడల వాడు తన దోషమును బట్టి పట్టబడినను, నేను కావాలి వాని యొద్ద వాని ప్రాణమును గూర్చి విచారణ చేయుదును” (యెహేజ్కేలు 33:6). ముందుగా ఆ సత్యాన్ని తెలుసుకొని, మొదటిగా నమ్మిన మనం ఈ కావలివాని పనిని చేయాలి.

ఈ సువార్త మనకిచ్చి, ఈ సత్యాన్ని మనం తెలుసుకొనేట్టు చేసిన దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ సత్యాన్ని తెలుసుకొని, ఆ సువార్తను నమ్మిన కొద్ది మంది దేవుడు మనలను ఎంచుకొననందుకు నేను దేవునికి మరింతగా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఈ లోకంలో మనం చాలామంది సంఘకాపరులకు విశ్వాసులకు, నీరు, ఆత్మల సువార్తను మనం బోధించాం. ఇంతకుముందు ఈ సువార్తను తెలుసుకొని, దీనిని నమ్మినవారు లేనేలేరని మనం స్థిరపరచుకోవచ్చు. మన ద్వారా నీరు, ఆత్మల సత్యసువార్తను బోధించే బోధకులు లోకమంతా వ్యాపిస్తున్నారు. అలా వారు స్థిరమైన విశ్వాసపునాదిని కలిగి, ఈ స్థిరమైన విశ్వాసాన్ని వ్యాప్తి చేస్తున్నారు.

అలా ఈ సువార్తను ప్రకటించే వారెవరైనా వుంటే మన సువార్త బోధలో కొంచెం విశ్రాంతి తీసుకొని, ఊపిరి పీల్చుకోవచ్చు. కాని అలా ఈ సత్య సువార్తను తెలుసుకొని, నమ్మినవారు ఈ లోకంలో ఎక్కువమంది లేకపోవడం విచారకరం. ప్రపంచ చరిత్రలో సంస్కరణా ఉద్యమం సాధించిన వాటిని గొప్పగా అంచనావేశారు. కాని దానిని వివరంగా పరిశీలించి చూస్తే ఈ సంస్కర్తలు బైబిలు విశ్వాసమనే మొదటి అంశాన్ని గురించి దాని నియమిత స్థానాన్ని తప్పుగా అనుసరించారని తెలుస్తుంది. ఇక నియమం తప్పిన దానిని అనుసరించిన వారంతా పొరబాటు చేసినట్టే. ఆ తర్వాత జరిగిన పొరబాట్లను సరిచేసుకొన్నా, మొదటి (గుండీ) బోధ యింకా తప్పుగానే వుంది. కనుక క్రైస్తవ చరిత్ర మళ్ళీ తిరుగరాయాల్సిన అవసరత వుంది. 

విూరంతా దేవుని ముందు విూ స్థిరమైన విశ్వాస పునాది విూద నిలిచి వుంటారన్న నమ్మకంతో దేవుని ప్రార్థిస్తున్నాను. ఈ విశ్వాసపునాదితో ఈ సత్య సువార్తను సేవించడానికి విూరు జీవితాలను గడపాలి. విూరు సువార్త కొరకు జీవించినప్పుడు విూ హృదయాలు సహజంగా ఆనందంతో నిండి వుంటాయి. ఒక వ్యక్తి సువార్త కోసం జీవించినప్పుడు ఆ వ్యక్తి హృదయం ఆధ్యాత్మికమైనదిగా రూపాంతరం చెందుతుంది. పరిశుద్ధాత్మ విూ హృదయాలలో, విూ పనుల్లో నిండి వున్నప్పుడు అవి ఆనందంతో పొంగిపొర్లుతూ వుంటాయి.

విూరు పాపక్షమాపణ పొంది ఈ నీరు, ఆత్మల సువార్త తెలిసి విూ శారీరక వాంఛను తీర్చుకోవడానికి వెదకుతూ ఈ సువార్త కొరకు జీవించకపోతే విూరు అర్ధరహితమైన జీవితం జీవిస్తూ శూన్యంగా మిగిలిపోతారు.

ఈ విలువైన సువార్తను, మనకు రక్షణకు ఉచితంగా యిచ్చినందుకు నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. విూరు మరోసారి విూ విశ్వాసాన్ని పరీక్షించుకోవాలని నీలధూమ్ర రక్తవర్ణం, పేనిన సన్నని నార ద్వారా పరిపూర్ణ రక్షణ వరాన్ని పొందాలని కోరుతూ, ప్రార్థిస్తున్నాను.