Sermons

[11-8] < నిర్గమకాండం 27:9-19 > ప్రత్యక్షపు గుడార ఆవరణ ద్వారం రంగు< నిర్గమకాండం 27:9-19 >

“మరియు నీవు మందిరమునకు ఆవరణము ఏర్పరచవలెను. కుడివైపున, అనగా దక్షిణదిక్కున ఆవరణముగా నూరుమూరల పొడవుగలదై పేనిన సన్ననార యవనికలు ఒక ప్రక్కకు వుండవలెను. దానియిరువది స్తంభములును వాటి యిరువది దిమ్మలును ఇత్తడివి. ఆ స్తంభముల వంకులునువాటి పెండెబద్దలును వెండివి.అట్లే పొడుగులో ఉత్తరదిక్కున నూరు మూరల పొడుగు గల యవనికలుండవలెను. దానియిరువది స్తంభములను వాటి యిరువది దిమ్మలును ఇత్తడివి. ఆ స్తంభముల వంకులును వాటి పెండెబద్దలును వెండివి. పడమటిదిక్కున ఆవరణపు వెడల్పు కొరకు ఏబది మూరల యవనికలుండవలెను. వాటి స్తంభములు పది, వాటి దిమ్మలు పది. తూర్పువైపున, అనగా ఉదయ దిక్కున ఆవరణపు వెడల్పు ఏబది మూరలు. ఒక ప్రక్కను పదునైదు మూరల యవనికలుండవలెను. వాటి స్తంభములు మూడు, వాటి దిమ్మలు మూడు. రెండవ ప్రక్కను పదునైదుమూరలు యవినకులుండవలెను. వాటిస్తంభములు మూడు వాటి దిమ్మలు మూడు. ఆవరణపు ద్వారమునకు నీల ధూమ్ర రక్త వర్ణములుగల యిరువది మూర తెర యుండవలెను. అది పేనిన సన్ననారతో చిత్రకారుని పనిగా వుండవలెను. వాటిస్తంభములు నాలుగు దానిదిమ్మలు నాలుగు. ఆవరణము చుట్టున్న స్తంభములన్నియు వెండి పెండెబద్దలు కలవి. వాటి వంకులు వెండివి. వాటి దిమ్మలు ఇత్తడివి. ఆవరణపు పొడుగు నూరు మూరలు. దాని వెడల్పు ఏబదిమూరలు. దానిఎత్తు అయిదు మూరలు, అవి పేనిన సన్ననారవి. వాటి దిమ్మలు ఇత్తడివి. మందిర సంబంధమైన సేవోపకరణములన్నియు మేకులన్నియు ఆవరణపు మేకులన్నియు ఇత్తడివై యుండవలెను.’’తిరిగి పుట్టిన క్రైస్తవులకు, పేరుకు క్రైస్తవులైన వారికి మధ్య విశ్వాసంలో స్పష్టమైన బేధాలున్నాయి. మొదటివారికి, దేవుడు మన పాపాలనన్నింటిని తుడిచివేశాడని తెలుసు, దానిని వారు నమ్ముతారు. రెండోరకం వారు వారి స్వంత ఆలోచనల ఆధారంగా, కేవలం వారి భారాల కొరకు యేసును నమ్ముతారు. అయినప్పటికి, కేవలం మత విషయకంగా దేవుని నమ్మిన వారు ఎంతగానో అభివృద్ధి చెందుతున్నారు. కాని నిజమైన సత్యాన్ని బోధిస్తున్నవారు తప్పు విశ్వాసం గలవారు తమ అసత్య బోధనలను వ్యాప్తి చేస్తూ అభివృద్ధి పొందడం చూసి నిరుత్సాహాన్ని పొందుతున్నారు. చాలామంది క్రైస్తవులు మోసకరమైన, అసత్యమతాల్లోకి లాగబడుతున్నారని వారికి తేటగా తెలిసివారు నిరుత్సాహాన్ని పొందుతున్నారు.

దీన్నిగురించి నేనుకూడా కొంతకాలం నిరుత్సాహాన్ని పొందాను. నేను సత్యాన్ని ఎదుర్కొన్నప్పుడు నిజంగా తిరిగి పుట్టాను గనుక తన కార్యాలకు నన్ను నిజమైన సాధనంగా ఆయన వాడుకొంటున్నాడు. గనుక నేను నిజంగా దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా హృదయం దేవుని సత్యాన్ని ప్రపంచమంతా వ్యాప్తి చేయాలని ఆశిస్తోంది. గనుక చాలామంది అసత్యాల వలన మోసపోయి తమ మత జీవితాలను గడుపుతూ వుండడం చూసినప్పుడు ఎంతగానో దుఃఖించడం తప్పమరేం చేయలేకపోతున్నాను.

ఏమైనప్పటికి, పరిశుద్ధాత్మ నా హృదయంలో ఉన్నాడు. అన్నది స్పష్టంగా నాకు తెలుసు. కనుక నాలో లోపాలువున్నా నా హృదయంలో పాపం లేదు. కాగా, నా హృదయం కృతజ్ఞత కలిగి వుంది. నేను నమ్మే సువార్తను గూర్చి నేను సిగ్గుపడను. నేను ప్రపంచమంతా ఈ సువార్తను బోధిస్తున్నప్పుడు ప్రజలు ఈ సత్యవాక్యాన్ని విని, దానిని నమ్మితే వారు నిజంగా దేవుని పిల్లలవుతారు గనుక వారు దేవుని ఎదుట, ప్రజల ముందు సిగ్గుపడాల్సిన అవసరత వుండదు.

విూరు కూడా విశ్వాసం వలన ఆ దీవెనలను పొందగలరు. విూరు వేదాంత విద్యను అభ్యసించకపోయినా, నీరు, ఆత్మలనే సత్యసువార్తలో నమ్మకముంచితే పాప క్షమాపణ పొందుతారు. దేవుని పిల్లలవుతారు. విూ హృదయాలలో పరిశుద్ధాత్మను పొందుతారు. పరిశుద్ధాత్మతో విూరు కూడా దేవుని సేవకులతో నడువగలరు. ఇది తేటయైనసత్యం. అలా నమ్మడం నిజమైన విశ్వాసం.

అసత్యాలతో నిండి వున్న లోకంలో నేను జీవిస్తున్నాను. నా హృదయంలో ఈ నిజమైన విశ్వాసం వుంది. గనుక ఈ క్షణం వరకు నేను ఈ సత్యసువార్తను బోధించగలుగుతూ వున్నాను. నేను ప్రత్యక్షపు గుడారమనే అంశాన్ని గూర్చిన వాక్యాన్ని బోధించడం మొదలుపెట్టాను గనుక అబద్ధికుల యోచనను గూర్చి చాలా స్పష్టంగా తెలుసుకోగలిగాను. అలా అసత్యం నుండి సత్యమేమిటో తెలుసుకో గలిగాను. అందుకనే నేనీ ప్రత్యక్షపు గుడారాన్ని గూర్చిన సత్యానికి సాక్ష్యం చెబుతున్నాను. ప్రత్యక్షపు గుడారం ద్వారా నిజమైన సత్యాన్ని వ్యాప్తి చేస్తున్నందు వలన సత్యానికి, అసత్యానికి మధ్యనున్న తారతమ్యాన్ని తెలుసుకోగలుగుతున్నారు. గనుక నాకెంతో సంతోషంగా వుంది.

ప్రత్యక్ష గుడారాన్ని గూర్చిన పుస్తకం రాయడంలో దానికి సంబంధించిన పరిభాషను గూర్చి వివరించే ప్రయత్నం నాకు చాలా కష్టం అనిపించింది. ఈ అంశాన్ని గూర్చి మూల గ్రంథాలను పరిశీలించడం, ప్రత్యక్ష గుడారానికి సంబంధించిన అనుబంధాలు ఎలాంటి తప్పు సమాచారం పాఠకులకు అందించకుండా వుండాలని ఎంతో శ్రమించాను. దాని గూర్చిన నా స్వంత అవగాహన, జ్ఞానాన్ని ప్రక్కనపెట్టి ప్రత్యక్ష గుడారపు విధానాలు, మరుగైవున్న దాని ఆధ్యాత్మిక అర్ధాలు పరిమిత జ్ఞానం గల వారికి వివరించడానికి దీనిని గూర్చిన కొంత సంబంధం నాకున్నది గనుక నేనింత నిజంగా దాని విధానాన్ని క్లుప్తంగా, స్పష్టంగా వివరించగలనా అన్న సందేహం నాలో వుంది.

దీనిని పాఠకులు చదివిన తర్వాత, లేక శ్రోతలు విన్న తర్వాత వీలైనంత త్వరగా అర్ధం చేసుకోగలిగితే మంచిది. కాని రోమా పట్టణం ఒక్కరోజులో కట్టబడలేదు. అలాగే, అన్ని విషయాల్లోనూ, సత్యాన్ని వ్యాప్తి చేయడం, నిజమైన విశ్వాసాన్ని సాధించడం కూడా ఒక రోజులో కుదరదు. దానిని లోతుగా త్రవ్వే కొలదీ కొద్ది కొద్దిగా క్రమంగా సాధించాలి. కనుక, దీనిని ప్రతి ఒక్కరూ అర్ధం చేసుకోగలరని కాదు గాని మొదటి నుండి నేను దీనిని లోతుగా తవ్వుతున్నాను. ఈ పుస్తకం రాయడంలో నేను ఎదుర్కొన్న బలీయమైన సవాళ్ళలో యిదొకటి.

అయినప్పటికి దేవుని సహాయంతో ఎక్కువ కష్టపడకుండానే చివరికి ఈ పుస్తకం ప్రచురించబడింది. నాకు చాలా సంతోషంగా వుందని వేరుగా చెప్పనసవరం లేదు కదా! ఇందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఈ పుస్తకం ద్వారా అసత్యం నుండి సత్యాన్ని తెలుసుకొని నేటి విశ్వాసులు నీరు, ఆత్మలనే సత్యసువార్తను ఎంతో పవిత్రంగా, స్పష్టంగా, నిస్సందేహంగా తెలుసుకొని రక్షణ పొందారు. దీనికి భిన్నంగా నీరు, ఆత్మలనే సత్యం యితర మతాల సత్యం కంటే, ఇతర సువార్తలోని విశ్వాసం ఎంత వ్యర్ధమైనదో విశ్వాసులు తెలుసుకొంటారు. కనుక అన్నిటికంటే నా పాపాల నుండి నన్ను రక్షించినందుకు దేవునికి నేనెంతో కృతజ్ఞుడను.

తాము యేసును నమ్ముతున్నాము గనుక తాము పాపంలేని వారమని చెప్పుకొనే సువార్తికులు నేడు చాలామంది వున్నారు. వారి హృదయాలు పునాదులు లేని, భ్రమవంటి విశ్వాసంతో నిండి వున్నాయి. ప్రత్యక్ష గుడారాన్ని గూర్చి నేను అధ్యయనం చేస్తూ వుండగా వారి విశ్వాసం నిజంగా ఎంత వ్యర్థమైనదో, అసత్యమైనదో మరింత స్పష్టంగా తెలుసుకోగలిగాను. ఈ గ్రహింపు వలన నా రక్షణ నిమిత్తం నా హృదయ పూర్వకంగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను.ప్రత్యక్ష గుడారపు ఆవరణ ద్వారం, కంచె


సమాన కొలతలు చతురస్రాకారపు ప్రత్యక్ష గుడారపు ఆవరణం 45 విూ.లు అని, వెడల్పు 22.5 మీటర్లని వాస్తవం తెలుస్తుంది. మూర అంటే 0.45 విూ.లు. ప్రత్యక్ష గుడారపు ఆవరణ చుట్టూ అన్ని ప్రక్క 60 స్తంభాలు ఆవరించివున్నాయి. ఒక్కొక్క స్తంభం ఎత్తు 2.25విూ.లు దానికి తూర్పున 9విూ.లు వెడల్పు గల ద్వారం వుంది. మిగిలిన కంచె అంతా (మొత్తం 135 విూ.లు సుమారు 126 విూ.లు) తెల్లని సన్న నార తెరలో ఆవరించి వుంటుంది.

ప్రత్యక్ష గుడారపు ఆవరణ ద్వారం నీల ధూమ్ర రక్త వర్ణాల దారం, సన్ననిదారంతో పేని వుంటుంది. దాని వెడల్పు 9విూ.లు. 2.25 విూ.లు ఎత్తు వుంటుంది. నాలుగు వివిధ రకాల దారాలు 9విూ॥ వెడల్పు 2.25 విూ॥ ఎత్తు కొలతతో తెరగా నేయబడి వుంటుంది. మొదట పూర్తి పొడవులో వెడల్పులో నీలం దారం తెల్లని సన్నని నారతో నేయబడి వుంటుంది. తర్వాత ధూమ్రవర్ణపు దారాన్ని 2.25విూ॥లు నేస్తారు. ఆ తర్వాత రక్త వర్ణాదారం 2.25విూ॥ ఎత్తున నేస్తారు. దానిననుసరించి తెల్లని దారాన్ని మందంగా, దృఢంగా వుండే తెరలా తివాచిలా లేక కంబళిలా 2.25విూ॥లు వెడల్పున వుండే నేసిన తెరను ప్రత్యక్షగుడారపు తూర్పున ఉండే నాలుగు స్తంభాలపై అమరుస్తారు.

ప్రత్యక్ష గుడారపు ఆవరణలో ప్రవేశించాలంటే కంబళిలాంటి తెరనుపైకి ఎత్తాలి. మిగిలిన ద్వారాల్లా గాక ప్రత్యక్ష గుడారపు ద్వారం చెక్కతో చేసింది కాదు. దానిస్తంభాలు కొయ్యతో చేసినవే అయినా ఈ స్తంభాలపై వ్రేలాడుతున్న దారం నీల ధూమ్రరక్తవర్ణాల దారం, పేనినసన్నని నారతో నేసిన తెర. 

విూరింతకు ముందు సర్కస్‌ చూసివుంటారు. దాని డేరా ఎలా చేశారో చూసి వుంటారు. దాని ద్వారం మందపాటి గుడ్డతో చేస్తారు. ప్రత్యక్ష గుడారపు ద్వారం కూడా కొంత దీనిలాగే వుంటుంది. అది మందంగా చేసింది గనుక దాన్ని నెట్టినా, లాగినా అది తెరచుకోదు. దానిలోనికి వెళ్లాలంటే దాన్ని పైకి ఎత్తాలి. ప్రత్యక్ష గుడారపు ఆవరణ ద్వారానికే గాక గుడారంలోపలి పరిశుద్ధ స్థలం ద్వారం, అతిపరిశుద్ధ స్థలం ద్వారం కూడా అలాగే పైకెత్తాలి.

ప్రత్యక్ష గుడారపు ఆవరణ ద్వారం, పరిశుద్ధ స్థలం ద్వారం, అతిపరిశుద్ధ స్థలం ద్వారాను నీల ధూమ్ర రక్తవర్ణాల దారం పేనినసన్నని నారతో చేయమని దేవుడు ఇశ్రాయేలీయుల కెందుకు చెప్పాడు? ఈ ఆజ్ఞల వెనుక దేవుని ఉద్దేశమేమిటో మనం స్పష్టంగా కనుగొనాలి. పాత నిబంధనలోని మంచివన్నీ రాబోవు యేసుక్రీస్తును సూచించే నిజమైన ఛాయ అని హెబ్రీపత్రిక వివరిస్తోంది. (హెబ్రి 10:11)

అలాగే ప్రత్యక్ష గుడారపు ఆవరణ ద్వారం యేసుక్రీస్తు బాప్తిస్మం, సిలువ విూద ఆయన మరణం, ఆయన స్వంత గుర్తింపుతో కలిసి వున్నాయి. పాతనిబంధనలోని అంశాలను వాటంతట వాటిగా అర్థం చేసుకోడానికి మనం కష్టపడతాం. కాని కొత్తనిబంధనలో వీటి అర్ధాన్ని చూసినప్పుడు దానిని అవగాహన చేసుకురాగలం. అసలైన వస్తువులను చూడకుండా దాని నీడను (ఛాయను) గుర్తించడం చాలా కష్టం. కాని ఆ నీడ దేనిదో, ఎవరిదో చూసినప్పుడు అదేమిటో చెప్పగలం. పాతనిబంధనలోని ప్రత్యక్ష గుడారపు మూర్తిమత్వంగా దేవుడు పాపుల రక్షకునిగా సిద్ధపరచినదెవరినో స్పష్టంగా తెలుసుకొని, ఆయన కార్యాలే మన పాపాలన్నిటి నుండి మనలను రక్షించాయని నమ్మగలుగుతాం.

ప్రత్యక్షగుడారపు మూర్తిమత్వంగా పాపులరక్షకునిగా వచ్చిన వారెవరు? ఆయన యేసుక్రీస్తే. మన రక్షకుడైన యేసుక్రీస్తు ఈ లోకానికి ఎలా వచ్చాడు. మన పాపాల నుండి ఆయన మనకెలా రక్షించాడో పరీక్షించి చూస్తే ఆయన నీల ధూమ్ర రక్తవర్ణాల ద్వార ఆయన పాపాలను రక్షించాడన్న సత్యాన్ని తెలుసుకోగలుగుతాం.

యేసు చేసిన పాపుల రక్షణను అర్ధం చేసుకొని, ప్రత్యక్ష గుడారపు ఆవరణ ద్వారపు రంగులో ప్రత్యక్షపరచిన సత్యాన్ని తెలుసుకొని, దానిని నమ్మడం చాలా ముఖ్యం.

ప్రత్యక్ష గుడారపు అర్ధాన్ని లోతుగా పరిశీలిస్తున్నప్పుడు ఆవరణ ద్వారం నాలుగు దారాలతో నేయబడినదని మొదటిగా తెలుసుకోవాలి. ఈ ద్వారంలోని మర్మాన్ని మనం పరిష్కరించగలిగనప్పుడు యేసుక్రీస్తు చేసిన కార్యాలన్నింటిని క్షుణ్ణంగా అర్ధం చేసుకోగలుగుతాం. ఈ నాలుగుదారాలతో ద్వారం తెర నేయబడినదని మనం తెలుసుకున్నప్పుడు యేసును మనం ఎలా తెలుసుకోగలమో, ఆయన్ను ఎలా నమ్మగలమో, ఎలాంటి విశ్వాసం తప్పు విశ్వాసమో మనం స్పష్టంగా అర్థంచేసుకోగలం.

ప్రత్యక్ష గుడారపు బాహ్యద్వారం గొర్రెల ద్వారమని అది మనకు జ్ఞాపకం చేస్తుంది. మన మెస్సీయ అయిన యేసు దేవుని నిజమైన గొర్రె ద్వారమని, ఆయన మంచికాపరి. (యెహాను 10:1-15) ఆవరణ చుట్టూ వున్న స్తంభాలను గూర్చి మనం ఆలోచించినప్పుడు మెస్సీయ తన గొర్రెలకు తిరిగి పుట్టిన పరిశుద్ధలకు మంచికాపరి అని, ఆయనే వాటికి ద్వారమని అది మనకు జ్ఞాపకం చేస్తుంది.

కాపరి తన గొర్రెల దొడ్డి చుట్టూ స్తంభాలు (గుంజలు) పాతి, దాని కొక ద్వారాన్ని ఏర్పాటు చేసి వాటికి కాపుదలను కలిగిస్తాడు. ఆ ద్వారం ద్వారా తన గొర్రెలకు కాపుకాస్తాడు. ఈ ద్వారం ద్వారా కాపరి తన గొర్రెలతో సహవాసం కలిగి, వాటిని కాపాడుతూ వుంటాడు. తన గొర్రెలు కానివాటిని ఆ ద్వారంలోనుండి లోపలికి పోనివ్వడు. ఇందుకోసం గొర్రెలకు, తోడేళ్లకు మధ్యబేధాన్ని కాపరి గుర్తిస్తాడు. ఇందుకోసం గొర్రెలకు కాపరి అవసరం. 

ఆ మందలో కొన్ని గొర్రెలు కాపరి యిష్ట ప్రకారం నడవడానికి యిష్టపడినవి వుండే అవకాశం వుంది. అవి కాపరి స్వరం వినక, ఆయన చెప్పినట్టు నడవనందు వలన మరణ మార్గంలో ప్రవేశించి, అది మోసకరమైనది. ప్రమాదకరమైనదని తెలియక అదే అందమైనదని, మంచిదని భావిస్తాయి. గొర్రెలు వాటిప్రాణం కాపాడబడి, బాగా మేపబడి ఆ కాపరివలన బాగా బ్రతుకుతాయి. మన కాపరి మనకు నిజమైన మెస్సీయ అయిన యేసుక్రీస్తు.ప్రత్యక్ష గుడారపు ఆవరణ ద్వారం, కంచెయేసుక్రీస్తు ప్రత్యక్ష గుడారం ద్వారపు నాలుగు రంగులను మనకు చూపించాడు.


నీలిధూమ్ర రక్తవర్ణాలదారం, పేనిన సన్నని నారతో నేసిన తెరను తయారుచేశారు. నాలుగు వివిధ రంగుల దారాన్ని ప్రత్యక్ష గుడారపు ద్వారాన్ని చేయడానికి వుపయోగించారు. అవి నాలుగు మెస్సీయ నాలుగు పరిచర్యలైన ఈ లోకానికి మానవునిగా రావడం తప్పిపోయిన గొఱ్ఱెలను రక్షించే పని నెరవేర్చడం అంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇశ్రాయేలీయులను రక్షించడం, వారి పాపాల నుండి రక్షించడం, వారిని దేవుని పాపం లేని ప్రజలుగా మార్చడం.

తన నాలుగు పరిచర్యలతో మన దగ్గరకు వచ్చిన మెస్సీయను మనం నిజంగా తెలుసుకొనే సాటిలేని సత్యం ఏమిటంటే మన పాపాలనన్నింటిని ఆయన కడిగి వేశాడని తెలుసుకొంటారు. మిగిలిన మన జీవితాలను నీరు, ఆత్మల సువార్తను బోధించడానికి, ఈ విశ్వాసం ద్వారా పరలోకానికి ప్రవేశించడానికి ప్రతిష్టించాడు. కనుక మెస్సీయ నీల ధూమ్ర రక్తవర్ణాల దారం వలన మన దగ్గరకు వచ్చి మన పాపాలన్నిటినుండి మనలను రక్షించాడన్న సత్యవాక్యాన్ని ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాలి.

మెస్సీయ నాలుగు పరిచర్యలను నమ్ముట వలన నీ పాపాలకు పరిహారాన్ని పొందానులకొంటున్నావా? అయితే ప్రత్యక్షగుడారాన్ని గూర్చి తెలుసుకొందాం. ఆ నాలుగు పరిచర్యలను తెలుసుకొన్నవారు నీలధూమ్ర రక్తవర్ణాల దారం సన్నని నారతో పేనిన పాపాల నుండి విడుదల పొంది నీతిమంతులవుతారు. వివిధ వర్ణాల దారంతో నేసిన ప్రత్యక్ష గుడారపు ద్వారాన్ని చూస్తున్న ఇశ్రాయేలీయులు, భావికాలంలో మెస్సీయ వచ్చి నాలుగు పరిచర్యలను నెరవేరుస్తాడని నమ్మాలి.ప్రతి పాపాత్ముడు తప్పక నమ్మవలసిన సత్యం


ప్రత్యక్ష గుడారపు తెల్లనినార తెరను చూసినప్పుడు దేవుడు నిజంగా పవిత్రుడో తెలుసుకొని మనకు రక్షకుని అవసరత ఎంత వుందో గ్రహిస్తాం. దేవుని పరిశుద్ధతను తెలుసుకొన్న ప్రతి ఒక్కడూ ‘‘దేవా, పాపాల పుట్టను, నా పాపాల వలన నేను నరక పాత్రుడను” అని ఒప్పుకోకుండా వుండలేడు. ఆవరణ స్తంభాలపై వ్రేలాడుతున్న తెల్లని నార తెరను చూసినప్పుడు వాటి గొప్ప పరిశుభ్రత, ప్రభావాలు (ఘనత) వలన వారి హృదయాలలోని పాపాన్ని తెలుసుకొని దేవునితో జీవించడానికి తాము అనర్హులమని గుర్తిస్తారు. ఎప్పుడైతే తమ హృదయాలు సరళమైనవికావో వారు దేవుని ముందకు వెళ్లడానికి ప్రయత్నిస్తే వారి పాపాలు వారికి బయల్పరచబడతాయి. కనుక అలాంటివారు దేవుని సన్నిధికి వెళ్తే తమ పాపాలు తెలుస్తాయని ఆయన దగ్గరకు వెళ్ళడానికి యిష్టపడరు.

అయితే అలాంటి పాపాత్ములు తమ పాపసమస్యను తమ రక్షకుడు తన నీల రక్త వర్ణాల దారం పరిష్కరించడానికి తెలుసుకొంటారో అప్పుడు రక్షణ పొందామన్న గొప్పనమ్మకంతో వారు దేవుని సన్నిధికి వెళ్తారు.

మెస్సీయ మానవునిగా ఈ లోకానికి వచ్చాడని, యెహాను ద్వారా పొందిన బాప్తిస్మం వలన లోకపాపాలను తన విూదికి తీసుకొన్నాడని, సిలువ విూద తన రక్తాన్ని చిందించడాన్నినాలుగు విధాలైన సత్యాన్ని ప్రత్యక్షగుడారపు ద్వారం మనకు తెలియజేస్తుంది. ఎవరైతే నీరు, ఆత్మ సువార్త ద్వారా ప్రత్యక్ష గుడారపు ఆవరణ ద్వారంలోని నాలుగు రంగుల్లోని సత్యాన్ని తెలుసుకొని, నమ్ముతారో వారిపాపాలను క్షమాపణను పొందుతారు. యేసుబాప్తిస్మం, ఆయన సిలువ విూద కార్చిన రక్తంతో మన పాపాలనన్నింటి నుండి మనలను రక్షించాడన్న రక్షణగుడారపు ఆవరణ ద్వారపు నాలుగు రంగులు వున్నాయి.

పాపాత్ములను వారి పాపాల నుండి రక్షించిన మెస్సీయ పరిచర్యలను నీలధూమ్ర రక్తవర్ణాల దారం, సన్నని పేనిన నార మనకు తెలియజేస్తున్నాయి. దేవుడు మానవజాతికి అనుగ్రహించిన రక్షణ సత్యం నీలధూమ్ర రక్తవర్ణాల దారం, సన్నని నారలో బయల్పరచబడినది. నీరు ఆత్మల సువార్తలో తెలియజేయడానికి రక్షణ సత్యాన్ని ఎవరు నమ్ముతారో వారి హృదయాలలోని పాపమంతా క్షమించబడుతుంది.

ఈ లోకంలో లెక్కలేనన్ని మతాలు పుట్టుకొచ్చాయి. ఈ లోకమతాలన్నీ తమ స్వంత ఆలోచనతో చేసిన స్వంత సిద్ధాంతాలతో వచ్చినవే. అవన్నీకూడా ప్రజలను పరిశుద్ధతలోనికి నడపడానికి ప్రయత్నిస్తున్నాయి. అయితే ఈ లోకమతాల ద్వారా ఒక్క వ్యక్తి కూడా తన పాపాల నుండి కడుగబడలేదు.

అందుకు కారణం, వారి స్వంత ఆలోచనల ఆధారంగా వారు సృజించిన వారి స్వంతరక్షణ సిద్ధాంతాలను సృష్టించుకొని వాటితో పాపం నిండివున్నదని తెలియక వాటినే నమ్మడం వలన ఏ ఒక్కరూ ఎప్పుడూ రక్షణ పొందలేదు. ప్రతి ఒక్కరూ ఎవరికి వారు ఒక పాపాల పుట్ట గనుక, తమ సహజ పాప స్వభావాన్ని వదిలించుకోవాలని ఎంత కష్టపడి ప్రయత్నించినా తమంతట తాముగా పవిత్రతను సాధించలేరు. ఇందుకనే తమను తమ పాపం నుండి రక్షించే విమోచకుడు ప్రతి ఒక్కరికి అవసరం. అంటే అందుకు ప్రతి ఒక్కరికి యేసు అవసరత వుంది. యేసుక్రీస్తు తప్ప మానవులకు మరో రక్షకుడు లేనేలేడని మనం తెలుసుకోవాలి.

నీరు ఆత్మల సువార్త తప్ప మానవజాతి పాపాలను శాశ్వతంగా క్షమించిన సువార్త మరొకటి లేదు. పరిశుద్ధడైన మన దేవుడు ప్రతి పాపాత్ముని అక్రమాన్ని తప్పక శిక్షిస్తాడు. గనుక ఈ లోక మత సిద్ధాంతాలపై విశ్వాసముంచిన వారిని అవి మహా కష్టాల్లోకి నడిపిస్తాయి.

నీల ధూమ్ర రక్తవర్ణాల దారం, పేనిన సన్నని నారలో బయలుపరచబడిన సత్యం నీరు, ఆత్మలనే సువార్త వలన కొత్తనిబంధన కాలంలో నెరవేరింది. ప్రత్యక్ష గుడారపు ఆవరణ ద్వారం ఒక్క రక్త వర్ణదారం, లేక ధూమ్ర, రక్తవర్ణాల దారంతో చేసినదని ఎవరైన చెప్పడం విూరు విన్నారా? విని వుంటే, ఆ ద్వారం నిజంగా నీల ధూమ్ర రక్తవర్ణాల దారం, పేనిన సన్నని నారతో చేయబడినదని ఈ క్షణంలో తెలుసుకోండి. ప్రత్యక్ష గుడారపు ఆవరణ ద్వారం తెర నీలధూమ్ర రక్తవర్ణాలు పేనిన సన్నని నారతో ఒకనేతగానితో నేయించమని దేవుడు ఇశ్రాయేలీయులకు స్పష్టంగా ఆజ్ఞాపించాడు.

అయినా, ఆ ద్వారం ఒక రక్తవర్ణల దారంతో నేసినదని చాలామంది పొరబాటు ఆలోచనలు చేస్తున్నారు. వారు మనప్రభువు నాలుగు పరిచర్యల్లోని నిజమైన మర్మాన్ని పరిష్కరించలేరు. ఇందు వల్లనే వారు యేసును నమ్ముతూ వున్నా వారి హృదయాలలో యింకా పాపం వుంది. యేసు తన నీలధూమ్ర రక్తవర్ణాల దారం, పేనిన సన్నని నార అనే తన పరిచర్యల ద్వారా విూ పాపాలను క్రీస్తు తీసివేశాడని తెలుసుకొని, ఈ సత్యాన్ని నమ్మండి. ఈ నాలుగు దారాల వలన నెరవేర్చిన రక్షణ కార్యమే మిమ్మును విూ పాపాల నుండి పూర్తిగా నమ్మాలి. ఈ సత్యాన్ని తెలుసుకొనక పాపక్షమాపణను గూర్చిన విూ స్వంత ప్రమాణాన్ని ఎర్పరచుకోవడం తప్పు.

ప్రత్యక్ష గుడారానికి వుపయోగించిన నీల ధూమ్ర రక్తవర్ణాల దారాలు అర్ధాన్ని మరచిపోయి యేసును రక్షకునిగా నమ్మితే చాలు వారు ఏ షరతు లేకుండా రక్షణ పొందుతారని కొందరు పొరబాటున చెబుతున్నారు. క్రైస్తవ సమాజాల నాయకులను యేసు నాలుగు పరిచర్యలను గూర్చి అడిగినప్పుడు వారిలో చాలామందికి అవి ఏమిటో తెలియదు. వారు రక్తవర్ణాల దారం పరిచర్యలను మాత్రమే నమ్ముతామని చెబుతారు. వారు మరో విషయాన్ని కూడా నమ్మితే ధూమ్రవర్ణం దారం పరిచర్యను కూడా వారు నమ్ముతారు. ఏమైనప్పటికి మన ప్రభువు మానవజాతి రక్షణార్ధం నీలధూమ్ర రక్త వర్ణాలదారం, పేనిన నారలోని అన్ని పనులను పూర్తి చేశాడు. అలా మన ప్రభువు మన కొరకు తన నాలుగు పరిచర్య రక్షణ కార్యాన్ని పూర్తి చేశాడు. ప్రత్యక్ష గుడారపు నీలధూమ్ర రక్తవర్ణాల దారం, పేనిన సన్నని నారలో తెలియజేసిన సత్యాన్ని పాపాలైన తెలుసుకొనగోరినవే వారు తెలుసుకోగలుగుతారు, నమ్ముతారు.

‘‘నీల ధూమ్ర రక్తవర్ణాల దారం, పేనిన సన్నని నార అర్ధాన్ని నేనెలా అర్ధం చేసుకోగలను?’’ ఈ దారాలు, సన్నని నారలోని సత్యాన్ని తెలుసుకోవాలని ఎవరినైనా నీవు ప్రశ్నిస్తే వారు నీతో ‘‘బైబిలును గూర్చి అంతలోతుగా, వివరంగా తెలుసుకోవాలని ప్రయత్నించకు. ఆ ప్రయత్నం నీకు హాని కలిగించవచ్చు” అని తెలుసుకోవాలనే విూ ఆసక్తిని అసలు పట్టించుకోరు. అప్పుడు నిస్పృహ చెందిన చాలామంది నీల ధూమ్ర రక్తవర్ణాల దారం, పేనిన సన్నని నారను గూర్చి తెలుసుకోవాలన్న ఆసక్తి కోల్పోతారు. ఈ ద్వారం ద్వార తెలియజేసిన మెస్సీయను విూరు ఎన్నటికి కలుసుకోలేరు.

నీల ధూమ్ర రక్తవర్ణాల దారం, పేనిన సన్నని నార పాత్రేమిటో తెలుసుకోకుండా మెస్సీయను కలుసుకోవాలను కొనేవారు క్రైస్తవం ప్రపంచమతాల్లో ఒకటి అని నమ్మే మతస్తులుగానే వుండిపోతారు. దేవుని గృహంలో ప్రవేశించాలంటే ఈ నాలుగు దారాలలో తెలియజేసిన దేవుని నాలుగు పరిచర్యల్లోని సత్యాన్ని సరిగ్గా తెలుసుకోవాలి. ఈ సత్యాన్ని తెలుసుకొన్నవారు నీరు, ఆత్మల సువార్త ద్వారా ప్రభువు కొత్తనిబంధన కాలంలో నేరవేర్చాడని తెలుసుకోవాలి.

నీల ధూమ్ర రక్తవర్ణాల దారం, పేనిన సన్నని నారతో ప్రత్యక్ష గుడారపు ఆవరణ ద్వారాన్ని నేయమని దేవుడు మోషేకు ఆజ్ఞాపించాడు. కాగా దాని ఆధ్యాత్మిక అర్థం ఏమిటి? ప్రత్యక్ష గుడారపు ఆవరణ ద్వారానికి వుపయోగించిన దారాల్లోని ప్రతి దాని రంగులు మన పాపాలు పోవడానికి యేసు చేసిన పనిని తెలియజేస్తున్నాయి. కనుక ఈ దారాలు, సన్నని నార ఒక దానితో ఒకటి పెనవేసుకొని వున్న సంబంధం గలవి. ఎవరైతే నీరు, ఆత్మల సువార్త విషయంలో ధ్యానముంచి, నమ్ముతారో వారు యేసు నాలుగు పరిచర్యలు తమ పాపవిమోచనకు పరలోకం నుండి కలిగిన పాపవిమెచనగా నమ్ముతారు.

దీనిని లక్ష్యపెట్టక, నీలిధూమ్ర రక్తవర్ణాలలో ప్రత్యక్ష పరచిన రక్షణ సత్యాలు తెలుసుకోవాలని ప్రయత్నించక, అలక్ష్యం చేస్తే మెస్సీయను గురించిన పూర్తి భిన్నాభిప్రాయం వారిని ఆయనకు వ్యతిరేకంగా నిలిచిన విరోధులనుగా చేస్తుంది. వాస్తవానికి అనేకమంది ఈ నాలుగు దారాలలో ప్రత్యక్ష పరచిన సత్యానికి భిన్నంగా వుంటూ క్రైస్తవ్యాన్ని ప్రపంచంలోని అనేక మతాల్లో ఒకదానిగా మారుస్తున్నారు. వీరుగాని యేసు నాలుగు పరిచర్యలను అలక్ష్యం చేస్తే అది వారు క్రీస్తుకు వ్యతిరేకంగా నిలిచిన ప్రపంచమతాలకు ఫలాలు అన్నదానికి రుజువవుతారు. అదృష్టవశాత్తు ఈ లోకంలో చాలామంది నీరు, ఆత్మల సువార్త కొరకు ఎదురుచూస్తున్నారు. గనుక మనకింకా ఆశవుంది.

ప్రత్యక్ష గుడారపు ఆవరణ ద్వారం వలన తెలియజేసిన పాపవిమోచనను గూర్చిన ఆత్మసత్యాన్ని గూర్చి అవగాహన ప్రజలకు వున్నప్పుడు వారు పరలోక ఆత్మ దీవెనలన్నింటిని పొందుతారు. ఒక వ్యక్తి మెస్సీయను కలుసుకోవాలంటే కావలసిన విశ్వాసం యిదే గనుక ఈ సత్యాన్ని తెలుసుకొని, దానిని నమ్మితే అతడు దానిలో ఒక్కసారిగాక, సదాకాలం నివసిస్తాడు. నీవు నిజంగా క్రైస్తవుడవైతే ఈ సత్యాన్ని గూర్చి శ్రద్ధ వహించాలి.

దేవుని యింటిలో ప్రవేశించాలని కోరుకునే వారు నీల ధూమ్ర రక్తవర్ణాల దారం, పేనిన సన్నని నారలో ప్రత్యక్షపరచిన సత్యాన్ని కనుగొని, దాని ప్రకారం దేవుని స్తుతించాలి.ప్రవచనాలను నెరవేర్చడానికి వచ్చిన మెస్సీయ


మెస్సీయ ఒక కన్యకకు జన్మిస్తాడని దేవుడు తన వాక్యం ద్వారా ప్రవచించాడు. యోషయా 7:14 ‘‘కాబట్టి ప్రభువు తానే యొక సూచన విూకు చూపును. ఆలకించుడి, కన్యక గర్భవతియై కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును” అని వివరిస్తోంది. మరో ప్రక్క విూకా 5:2 మెస్సీయ బెత్లేహేములో జన్మిస్తాడని వివరిస్తోంది. ‘బెత్లేహాము ఎఫ్రాతా, యూదావారి కుటుంబములో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవు వాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను.’’ ఈ పాత నిబంధన వాక్య ప్రకారమే మెస్సీయ ఈ లోకానికి వచ్చాడు. దేవుని వాక్య ప్రకారమే ప్రవచనా నెరవేర్పుగా ఆయన మానవునిగా ఈ లోకానికి వచ్చాడు.

అయితే మానవ చరిత్రలో ఏ సందర్భంలో మెస్సీయ వచ్చాడు? యేసుక్రీస్తు ఈ లోకానికి ఎప్పుడు వచ్చాడు? రోమా చక్రవర్తియైన ఔగుస్తు పరిపాలన కాలంలో యేసు ఈ లోకానికి వచ్చాడు. (క్రీ.పూ.27 - క్రి.శ.14) యేసుక్రీస్తు యోహాను ద్వారా బాప్తిస్మం తీసుకొని, సిలువవేయబడి, దానిపై తన రక్తాన్ని చిందించి నీ, నా పాపాల నుండి, ఆ పాప శిక్ష నుండి మనలను రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు.

ఔగుస్తు రోమా చక్రవర్తిగా పరిపాలిస్తున్న కాలంలో ఇశ్రాయేలు వారి సామంత రాజ్యమైన కాలంలో యేసు మానవ రక్షకునిగా ఈ లోకానికి వచ్చాడు. ఇశ్రాయేలు రోమా సామంత రాజ్యం గనుక అది రోమా ఆజ్ఞలను అనుసరించాలి. ఈ కాలంలోనే రోమా సామ్రాజ్యంలో వున్న ప్రతి ఒక్కరూ తమ తమ స్వగ్రామాలకు వెళ్లి జనాభా లెక్కలో తమ పేరును నమోదు చేసుకోవాలని ఔగుస్తు చక్రవర్తి ఆజ్ఞాపించాడు. ఆ ఆజ్ఞానుసారం జనాభా లెక్కల నమోదు వెంటనే ప్రారంభమైంది. సామ్రాజ్యంలోని ప్రతి ఒక్కరిని జనాభాలో లెక్కించడం మొదలైంది గనుక ఇశ్రాయేలు దేశంలోని వారుకూడా తమ తమ స్వగ్రామలకు వెళ్ళవలసి వచ్చింది. ఆ క్షణం నుండి యేసుక్రీస్తు మానవ చరిత్రలో పనిచేస్తూ వున్నాడు.పాతనిబంధన వాక్య నెరవేర్పును చూడండి


ఆ సమయానికే యూదయ ప్రాంతంలో, మెస్సీయను కన్యయైన మరియ గర్భం ధరించి వుంది. ఈ మరియ యోసేపు అనే వ్యక్తికి ప్రధానం చేయబడి వుంది. మరియ, యోసేపు లిద్దరూ యూదాగోత్రికులు. కనుక ఇశ్రాయేలు పన్నెండు గోత్రాలలో యూదా గోత్రం నుండే రాజు వస్తారని దేవుడు వాగ్ధానం చేశాడు.

రోమా చక్రవర్తియైన ఔగుస్తు తన సామ్రాజ్యంలో జనాభా లెక్కలను నమోదు చేయమని ఆజ్ఞాపించాడు. గనుక అప్పటికే గర్భవతియైన మరియయు యోసేపును యూదాగోత్రికులు గనుక యోసేపు స్వగ్రామానికి వెళ్ళి తమ పేర్లు నమోదు చేసుకోవాల్సి వచ్చింది. అప్పటికి మరియకు ప్రసవదినాలు సవిూపించాయి. ప్రసవమయ్యే సమయమైనా ఆమె యోసేపుతో బెత్లేహేము నుండి బయలుదేరింది. అక్కడ ఆమెకు పురిటి నొప్పులు వచ్చాయి. కనుక వారు బస కొరకు ప్రయత్నించినా ఆ గ్రామంలో వారికి స్థలము దొరకలేదు. ఆ స్థితిలో దొరికిన ఏదో ఒకచోటను ఉపయోగించాలి గనుక వారొక పశువు శాలలో దిగారు. ఆపశువు శాలలోనే మరియ యేసుకు జన్మనిచ్చింది.

క్రి.శ. 1సం.లో యేసు జన్మించాడు. ఆ బాలుని పశుల తొట్టెలో పరుండబెట్టారు. సర్వశక్తిమంతుడైన దేవుడు మానవునిగా ఈ లోకంలోకి వచ్చాడు. మానవజాతి రక్షకుడు పశువులుండే స్థలంలో వున్నాడు. అంటే యేసు మన మెస్సీయ కావడానికి, ప్రాధాన్యతలేని ఈ స్థలంలో జన్మించాడు. ఈ విషయాన్నీ సృష్టికి ముందే దేవుడు యెహోవా మానవజాతి చరిత్రను నడుపుతున్నాడని మానవులకు తెలిసినా, మానవులను రక్షించడానికి దేవుడే ఈ లోకానికి మానవునిగా వచ్చాడని ఎవరూ గ్రహించలేదు. మానవులందరినీ వారి పాపాల నుండి విమోచించడానికి దేవుడు తనను తాను తగ్గించుకొని మానవునిగా ఈ లోకానికి వచ్చాడని గ్రహించిన వారిని ఆయన రక్షిస్తాడు.

యేసు బెత్లేహేములోని పశుల శాలలో ఎందుకు పుట్టాడు? ఇశ్రాయేులు రోమాకు సామంత రాజ్యంగా వున్నప్పుడే ఎందుకు పుట్టాడని మనం కూడా ఆశ్చర్యపోతాం. అయినా ఈ పరిస్థితులన్నీ ఆయన జాగ్రత్తగా పరిశీలించి తన ప్రజలను వారి పాపాల నుండి విమోచించడానికి ఆయన ముందుగానే నిర్ణయించాడని వెంటనే తెలుసుకోగలుగుతాం.

యోసేపు, మరియ వారి గ్రామవాసులని నిరూపించడానికి వారి స్వగ్రామంలో జనాభా లెక్కల్లో తమ పేర్లను నమోదు చేసుకొన్నారు. వారి గుర్తింపును లిఖితపూర్వకంగా నమెదుచేశారు. తమ పేర్లు నమోదు చేయడానికి తమ పూర్వీకులు తరతరాలుగా ఆ బెత్లేహేము గ్రామంలో నివసించారన్న రుజువును వారు చూపాలి. కనుక వారు తమ పూర్వీకులెవరో, వారి యింటి పేరటకు చెందినవారో ఆ వంశవృక్ష వివరాలన్నీ జనాభా లెక్కల్లో నమోదు చేయాలి. ఈ వివరాలు లేని వారి పేర్లు నమోదు చేయరు. యోసేపు, మరియమ్మ గుర్తింపును చారిత్రాత్మకంగా నమోదు చేయడం వలన మానవ చరిత్ర యేసు జననానికి సాక్ష్యమివ్వడానికి దేవుడు మార్గాన్ని వేశాడు. (మత్తయి 1:1-16, లుకా 3:23-38). పాతనిబంధన వాక్యంలోని ప్రవచనాలనన్నింటిని నెరవేర్చడానికి దేవుడు చేసిన కార్యాలివి.

విూకా 5:2లో యిలా వివరిస్తోంది ` ‘‘బెత్లేహేము ఎఫ్రాతా, యూదా వారి కుటుంబములలో నీవు స్వల్పగ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను.’’ ఆ జనన దినం వచ్చింది. ప్రవక్త ప్రవచనం నెరవేరునట్లు దేవుడు యోసేపు, మరియమ్మ ఆ ప్రవచన గ్రామానికి వచ్చునట్లు చేశాడు. రక్షకుడు ఆ ప్రవచన గ్రామమైన బెత్లేహేములో జన్మించాడు. మానవజాతి పాపాలను కడిగివేయడానికి యిది దేవుని ప్రణాళిక నెరవేర్పు. చిన్న గ్రామమైన బేత్లెహేములో యేసు పుట్టు పాత నిబంధన వాక్యప్రవచన నెరవేర్పు.

చిన్న గ్రామమైన బేత్లెహేములో యేసుక్రీస్తు జననానికి కొన్ని వందల సంవత్సరాలకు ముందు పైన చెప్పుకొన్నట్టు దేవుడు తన ప్రవక్తయైన విూకా ద్వారా ప్రవచించాడు. (విూకా 5:2). పాపాత్ముల రక్షకునిగా ప్రభువు రాకను గురించి ఆయన జననానికి 700సం.లు ముందు యెషయా ప్రవక్త ప్రవచించాడు. (యెషయా 53) విూకా ప్రవక్త ద్వారా దేవుడు ప్రవచించినట్టే యేసుక్రీస్తు బేత్లెహేములో జన్మించాడు. దేవుడు తన ప్రవచన వాక్యాన్ని ఎప్పుడూ నెరవేరుస్తాడు.

మరియ, యోసేపు జనాభాలెక్కల్లో నమోదు చేసుకోడానికి తమ పూర్వీకుల స్వగ్రామానికి వెళ్లినప్పుడే ప్రవచనం చారిత్రాత్మక సత్యంగా నెరవేరింది. మరియ బిడ్డకు జన్మనివ్వడానికి బేత్లెహేముకు రాక తప్పని పరిస్థితులను కల్పించుట ద్వారా దేవుడు తన వాక్యాన్ని నెరవేర్చాడు.

దీనిని బట్టి మన దేవుడు మనతో ప్రవచనం ద్వారా మాట్లాడతాడు. ఆ ప్రవచన వాక్యాన్ని నెరవేరుస్తాడు అని తెలుస్తోంది. దీనినుండి మనం మరో విషయాన్ని తెలుసుకోగలం. ప్రత్యక్షగుడారపు ఆవరణ ద్వారానికి వుపయోగించిన ‘‘పేనిన సన్ననార’’లో దేవుని వాక్య పరిశుద్ధత, సంపూర్ణత అంతర్లీనంగా వున్నాయి. సృష్టికి పూర్వమే మానవజాతి రక్షణ ప్రణాళిక దేవుడు సిద్దపరిచాడు. తన ప్రవచన వాక్యం ప్రకారం తప్పక దానిని నెరవేర్చాడు.

కనుక పాతనిబంధన వాక్యం నిజంగా దేవుని వాక్యమని, అలాగే కొత్తనిబంధన వాక్యం కూడా దేవుని వాక్యమేనని మనం తెలుసుకోగలుగుతున్నాం. అంతేగాక ఈ జగత్‌చరిత్రనంతటినీ ఈ భూమిని దేవుడే నడిపిస్తున్నాడని నమ్ముతున్నాం. ఇంకా,దేవుడీ సమస్త జగతిని సృజించినట్లే, ఆయన సమస్త మానవాళిని, చరిత్రనన్నింటిని, ప్రతి ఒక్కరి పరిస్థితులను తన అదుపులో వుంచుకొని పాలిస్తున్నాడనీ మనం తెలుసుకోగలుగుతాం. కనుక దేవుని అనుమతి లేక ఎవరూ తమ ఉద్దేశ ప్రకారం దేనినీ సాధించలేరని ఆయన మనకు తెలియజేస్తున్నాడు.

యేసు శిశువుగా ఈ లోకంలో జన్మించినప్పుడు సత్రంలో చోటులేనందు వలన ఆయన పశుల శాలలో పుట్టక తప్పలేదు. ఆయన తానుగా బెత్లెహేములో జన్మించాడు. ఇవన్నీ దేవుడు ముందుగా ప్రవచించిన ప్రవచనంలోని నమ్మకత్వంతో అద్భుత సంకల్ప సఫలతని మనం గ్రహించాలి.

కనుక ఈ జగత్‌ చరిత్రను నడిపించేవాడు మన దేవుడేనని, మన పాపాల నుండి మనలను విమోచించిన రక్షకుడని మనం నమ్మాలి. దేవుడు సమస్తానికి ప్రభువు గనుక అందరినీ, అన్నింటిని పరిపాలిస్తున్నా దేవుని వాక్యం సత్యమని మనకు తెలియజేస్తోంది.

అలా చిన్నగ్రామమైన బేత్లెహేములో యేసు జననం ఏదో అలా జరిగిన సందర్భం కాదని, లేక బైబిలు వాక్యంలో నుండి స్వచ్చంధంగా కనుగొన్నదీ కాదని యిప్పుడు నిరూపణ అయింది.

ఈ సత్యాన్ని మనం తెలుసుకొని, దానిని నమ్మాలి. మన మెస్సీయ మనకిచ్చిన రక్షణ నీలధూమ్ర రక్తవర్ణాలదారం, పేనిన సన్ననినారలో నెరవేర్చబడిన సత్యమని మన హృదయపూర్వకంగా నమ్మాలి. మన పాప విమోచన కూడా ఏదో ఆకస్మాత్తుగా సాధించినది కాదని, దేవుని ముందు ప్రణాళికలో సిద్ధపరచిన నాలుగు పరిచర్యల ద్వారా యేసు సాధించినవని దేవుడు మనకు తెలియజేశాడు.

అంతేగాక క్రైస్తవ్యం ఈ లోకమతాలలో ఒకటి కాదనికూడా యిదిమనకు తెలియజేస్తుంది. ప్రపంచ మత స్థాపకుడు కేవలం లౌకికనీతిగలవాడు మాత్రమే. కాని క్రైస్తవ్యాన్ని స్థాపించినవాడు మన రక్షకుడైన యేసు, క్రైస్తవ్యంలోని సత్యం ఈ మన రక్షకుడు దేవుడు అని ఆయన నుండే యిది మొదలైనదని దేవుడే మనకు తెలియజేస్తున్నాడు. మనం నమ్ముతున్న క్రైస్తవ్యం కేవలం ఈ లోకానికి సంబంధించిన మతం కాదనిదేవుడే సాక్ష్యమిస్తున్నాడు. ఈ లోక యితర మతాలవలె గాక దేవుడనుగ్రహించిన కృప విూద క్రైస్తవ్యం స్థాపించబడినది. రోమా 11:36లో వివరించినట్టుగా, ‘‘ఆయన మూలమునను, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును సమస్తము కలిగియున్నవి. యుగముల వరకు ఆయనకు మహిమ కలుగునుగాక’’. దేవుడు తన అద్వితీయ కుమారుని మనకు రక్షకునిగాను, మన పాపవిమోచనగా నీరు, ఆత్మల సువార్తను, మనలో నివసించడానికి పరిశుద్దాత్మను, పరలోకరాజ్యాన్ని మనకు అనుగ్రహించాడు. కనుక మనము దేవునికి భయపడి, ఆయనకు, ఆయన వాక్యానికి విధేయులమై వుండాలని మన హృదయ పూర్వకంగా నమ్మాలి.

ఈ సృష్టికి పూర్వమే తండ్రియైన దేవుని రక్షణప్రణాళికా నిర్ణయం ప్రకారం ఈ లోకంలో మెస్సీయ జననం నిర్ణయించబడినది. ఈ మన రక్షణ పరిపూర్ణంగా దేవుని ప్రణాళికలో స్పష్టంగా రూపించబడింది. ఈ సత్యం నీలధూమ్ర రక్తవర్ణాల దారం, పేనిన సన్నని నారలోని వాస్తవ సారాంశమని మనం తెలుసుకొనేట్టు దేవుడు అనుమతించాడు. కాబట్టి నీరు,ఆత్మల సువార్త ద్వారా మనకు పాపవిమోచనగా రక్షణ వచ్చినదని మనం గ్రహించి దానిని నమ్మాలి. ఈ విశ్వాసం ద్వారానే నీవు, నేను మన పాపాల నుండి రక్షణ పొందగలం. ఈ నాలుగురంగుల సత్యం కూడా, నీరు ఆత్మ సువార్త అనే వాక్యం ద్వారా పవిత్రపరచబడినదని మనం నమ్మాలి.రక్షకుడైన యేసుక్రీస్తు తన నీలధూమ్ర రక్తవర్ణాల దారం, పేనిన సన్నని నారతో మనలను రక్షించాడు.


యేసుక్రీస్తు పాపాత్ములను తమ పాపాలనుండి రక్షించడానికి చేసిన కార్యాలు నాలుగు విధాలు: నీలవర్ణపు దారం (యేసుపొందిన బాప్తిస్మం) ధూమ్రవర్ణ దారం (యేసు రాజుల రాజు ఆయనే దేవుడు), రక్తవర్ణపు దారం (యేసురక్తం) పేనినసన్నని నార (పాత, కొత్త నిబంధన వాక్యంద్వారా పాపాత్ములను వారి పాపాల నుండి రక్షించు కార్యం సంపూర్ణమైనది). యేసు నీలవర్ణపు దారం, ధూమ్రవర్ణపు దారం, రక్తవర్ణపు దారం, పేనిన సన్నని నార ద్వారా నిజమైన రక్షకుడైనాడు.

నీరు, ఆత్మల ద్వారా మన దగ్గరకు వచ్చిన యేసు నీలం దారంతోను (యేసు తీసుకొన్న బాప్తిస్మం ద్వారా), ధూమ్రవర్ణపు దారం (యేసు దేవుడు), రక్తవర్ణపు దారం (పాత కొత్త నిబంధన వాక్యం ద్వారా యేసు మన రక్షణను సాధించాడు) అని మనం నమ్మకపోతే, మన పాపాల నుండి, ఆ పాప శిక్ష నుండి మనమెన్నటికి విడుదల పొందలేమని మనం తెలుసుకొని, దానిని నమ్మాలి. మన పాపాల నుండి, ఆ పాపశిక్ష నుండి మనమెన్నటికి విడుదల పొందలేమని మనం తెలుసుకొని, దానిని నమ్మాలి. అలా మన పాపాల నుండి ఆ పాపశిక్ష నుండి మనలను రక్షించకపోతే మన ప్రభువు మనకు పరిపూర్ణ రక్షకుడు అయ్యేవాడు కాదు.

ప్రత్యక్ష గుడారపు ఆవరణ ద్వారం నీలధూమ్ర రక్తవర్ణాల దారం, పేనిన సన్ననినారతో వేసిన కారణాన్ని మనం ఆధ్యాత్మికంగా తీసుకోవాలి. ప్రతి ఒక్కరూ ఈ ఆవరణ ద్వారాన్ని స్పష్టంగా, సులభంగా గుర్తించాలని దీనిని ఈ నాలుగు దారాలతో నేశారు. ఈ ద్వారం ద్వారానే ప్రతి ఒక్కరిని దేవుడు ప్రకాశమానమైన తనయింటిలో ప్రవేశించేందుకు అనుమతనిస్తాడు.

ప్రత్యక్షపు గుడారమే ప్రకాశమానమైన దేవుని ఇల్లు దేవుని యింటిలో ప్రవేశించాలని కోరుకొన్నవారు ఆవరణ కంచెలోను, ప్రత్యక్ష గుడారపు ఆవరణ ద్వారంలో ప్రత్యక్షపరచబడిన రక్షణ సత్యాన్ని తెలుసుకొనకపోతే లోపలికి ప్రవేశింపలేరు. ప్రత్యక్షగుడారపు తెల్లని పవిత్రతను ఎవరు అలక్ష్యం చేస్తారో వారు ప్రత్యక్షగుడారపు ద్వారం ద్వారా లోపల ప్రవేశింపలేరని దేవుడు చెప్పాడు. కాని మరో విధంగా ఎక్కిలోపల ప్రవేశించే వారంతా దొంగలు, దోచుకొనేవారై వుంటారు. రక్షణ ద్వారం యేసుక్రీస్తును సూచిస్తున్నది. (యోహాను 10)

ఈ ద్వారం నీలధూమ్రరక్తవర్ణాల దారం, పేనిన సన్ననినారతో నేయబడినదని బైబిలు వివరిస్తున్నప్పుడు, దేవుడు పాతకొత్త నిబంధన వాక్యం ద్వారా యేసుక్రీస్తు దేవుని కుమారునిగా ఈ లోకంలోనికి వచ్చాడని, యోహాను వలన బాప్తిస్మం పొందాడని, సిలువ విూద మరణించి, మృతులలోనుండి మళ్ళీ లేచుట వలన మనకు మెస్సీయ అయినాడని స్పష్టంగా చూపిస్తున్నాడు. అలా మనం ఈ నాలుగు దారాలలోని మర్మాన్ని తెలుసుకొనగలం. ఈ లోక పాపాల తీర్పు, శిక్ష నుండి మనలను రక్షించడానికి యేసుక్రీస్తు దేవుని కుమారునిగా ఈలోకానిక వచ్చాడని, రక్షకునిగా పాత, క్రొత్త నిబంధన వాక్యం ద్వారా మానవ రక్షణను సాధించాడని మనం నమ్మాలన్నట్లు దేవుడు మనకు అవకాశాన్నిచ్చాడు.

ప్రత్యక్షగుడారపు ఆవరణ ద్వారం నీలధూమ్ర రక్తవర్ణాల, పేనిన సన్ననారతో ఎందుకు నేశారో మనం తప్పక తెలుసుకోవాలి. ఈ నీలందారం, ధూమ్రవర్ణదారం, రక్తవర్ణదారం, పేనినసన్ననార మనకేం తెలియజేస్తాయి? దేవుని ప్రణాళికను మనం తెలుసుకున్నప్పుడు ఈ నాలుగు దారాల పనులన్నీ మనరక్షణకొరకు, నిత్యజీవపు సత్యాన్ని, పాపక్షమాపణలో మన విశ్వాసం ద్వారా మనం ఆయన రాజ్యంలో ప్రవేశిస్తామన్న సమస్తం దేవుని రక్షణ ప్రణాళికలోని వేనని మనం తెలుసుకోగలుగుతాం.

నీలధూమ్ర రక్తవర్ణాల దారం మాకు తెలుసు. దానిని మేము నమ్ముతున్నాం అని మనం చెప్పినప్పుడు బాప్తిస్మమిచ్చు యోహాను వలన యేసు బాప్తిస్మం తీసుకొన్నాడు. సిలువ విూద తన రక్తాన్ని చిందించాడు, మెస్సీయ ఎవరో, పాతనిబంధనలోని బలివిధానాన్నీ, కొత్తనిబంధనలోని నీరు, ఆత్మల సువార్త మాకు బాగా తెలుసని దాని అర్థం. క్లుప్తంగా చెప్పుకొంటే శాశ్వత రక్షణను పొందాలని మనఃపూర్వకంగా వెదకే విశ్వాసులందరికీ ప్రత్యక్ష గుడారపు ఆవరణ ద్వారంలో అంతర్లీనంగా వున్నసత్యం తప్పనిసరిగా కావాలి.

ప్రత్యక్షగుడారాన్ని గూర్చిన జ్ఞానం చాలామందికి వున్నట్లు కనిపిస్తుంది. కాని వాస్తవానికి అది సత్యం కాదు. ప్రత్యక్ష గుడారపు ఆవరణ ద్వారానికి వేసిన నీల ధూమ్ర రక్తవర్ణాల దారం అర్థం ఏమిటో ప్రజలకు తెలియదు. ఈ నాలుగు దారాలలోని మర్మాన్ని అర్థం చేసుకోవడం కష్టం. అయినా వాటిని తెలుసుకొని, దానిని నమ్మాలన్న నిజమైన కోర్కె చాలా మందిలో వుంది.

అయినా వీటిలోని మర్మం అందరూ అర్థం చేసుకోలేరు. కనుక చాలామంది తమ స్వంత అభిప్రాయాలపై ఆధారపడి దానిని తప్పుగా వివరించారు. చాలామంది మత నాయకులు మతం వలన వారి స్వార్ధలాభాల నాశించి ఈ సత్యాన్ని అపార్థం చేసుకొని, వారిష్టమొచ్చిన విధంగా తప్పుగా వివరించారు. అయితే ఈ అబద్ధికుల వలన క్రైస్తవులు ఎంతోకాలం మోసపోడాన్ని దేవుడంగీకరించడు. కనుక ఆయనీ దారాల అర్ధాన్ని స్పష్టంగా వివరించి వారిని పాపాల నుండి రక్షిస్తాడు.

కొత్త నిబంధనలోని 1 యోహాను 5:6-8లో ‘‘నీళ్ళద్వారాను, రక్తము ద్వారాను వచ్చినవాడు ఈయనే. అనగా యేసుక్రీస్తే ఆయన నీళ్ళతో మాత్రమేగాక నీళ్లతోను, రక్తముతోను వచ్చెను. ఆత్మ సత్యము కనుక సాక్ష్యమిచ్చువాడు ఆత్మయే. సాక్ష్యమిచ్చువారు ముగ్గురు, అనగా ఆత్మయు, నీళ్లును, రక్తమును, ఈ ముగ్గురు ఏకీభవించియున్నారు’’ అని వివరించారు. ఈ భాగంలో మన ప్రభువు మానవునిగా ఈ లోకంలోనికి వచ్చాడని, తన బాప్తిస్మం ద్వారా మన పాపాలను తన విూదికి తీసుకొని, తన రక్తాన్ని చిందించుట ద్వారా మనలను రక్షించాడని స్పష్టంగా వివరిస్తోంది. ఇందుకోసమే ప్రత్యక్ష గుడారపు ఆవరణ ద్వారం నీల ధూమ్ర రక్తవర్ణాల దారం, పేనిన సన్నని నారతో నేశారు.

మొదటిగా, నీలిదారం యేసును గూర్చిన సత్యంలో ఒక భాగాన్ని అనగా, యేసు మానవునిగా ఈ లోకానికి వచ్చి, యోహాను వలన పొందిన బాప్తిస్మం ద్వారా లోకపాపాలను ఆయన విూదికి తీసుకొని పాపాత్ములకు మెస్సీయ అయినాడని తెలియజేస్తుంది. వాస్తవానికి, యొర్దానునదిలో యోహాను వలన పొందిన బాప్తిస్మం వలన యేసు లోకపాపాలను ఒకేసారి తన విూదికి తీసుకొన్నాడు. బాప్తిస్మమిచ్చు యోహాను వలన బాప్తిస్మాన్ని పొందుట వలన మానవజాతి అంతటికి ప్రతినిధిగా ఈ లోక పాపాలనన్నింటిని ఆయన భుజాల విూద భరించాడు. అలా మానవులందరి పాపాలన్నీ యేసు శిరస్సు విూదికి వెళ్లాయన్న సత్యాన్ని ఎవరు నమ్ముతారో వారి హృదయాలలో పాపం వుండదు.

రెండవది, ప్రత్యక్షగుడారపు ఆవరణ ద్వారానికి నేసిన ధూమ్ర వర్ణపు దారం మనకేం చెబుతోందంటే - యేసే నిజమైన రాజుల రాజు అని, యేసే ఈ జగత్‌ సృష్టికర్త. ఆయన సృజించబడిన వాడు కాడు. ఈ లోకానికి వచ్చిన మెస్సీయ ఆయనే. ఈ లోకానికి వచ్చిన మెస్సీయ మానవునిగా వచ్చాడు.

యోహాను వలన తాను పొందిన బాప్తిస్మం ద్వారా లోక పాపాలనన్నింటిని తనపై మోపి, తన బలియాగం ద్వారా చనిపోయి, పునరుత్థానుడై తనను గుర్తించి, తనయందు భయభక్తులను చూపి, తానే మెస్సీయని నమ్మిన వారందరినీ వారి పాపాల నుండి, ఆ పాప తీర్పు నుండి రక్షించాడు.

యేసు నిజమైన మన దేవుడు, మన మెస్సీయ, ఆయనే నిజమైన రక్షకుడు. యేసు తన బాప్తిస్మం ద్వారా మనలోక పాపాలనన్నింటిని తనపైకి తీసుకొని, మనస్థానంలో మనకు బదులు వివిధ తీర్పులను పొంది సిలువ విూద రక్తాన్ని కార్చి, చనిపోయి, మృతులలో నుండి పునరుత్థానుడగుట ద్వారా మన పాపానలన్నింటిని కడిగివేశాడు.

మూడవది, రక్తవర్ణదారం, యేసు సిలువ విూద చిందించిన రక్తాన్ని సూచిస్తుంది. అంటే ఈ సత్యాన్ని నమ్మిన మనకు క్రీస్తు నూతన జీవితాన్ని అనుగ్రహించాడని ఈ రక్తవర్ణ దారం తెలియజేస్తోంది. ఇంకా యేసు యోహాను వలన పొందిన బాప్తిస్మం ద్వార తన విూదికి తీసుకొన్న మన పాపాల నిమిత్తం ఆయన తీర్పును పొందాడు. దాని ద్వారా పాపం నిమిత్తం చనిపోయిన విశ్వాసులకు జీవమనుగ్రహించు విశ్వాసాన్నిచ్చి, వారికి నూతన జీవితాన్ని అనుగ్రహించాడు. 

ఇక పేనిన సన్నని నారను గురించి యేసు అనే కొత్త నిబంధనతో దేవుడు పాతనిబంధనలో చేసిన రక్షణ వాగ్ధానాన్ని నెరవేర్చాడు అని యిది మనకు ప్రత్యక్షపరుస్తుంది. అది యింకా యేసు కొత్తనిబంధనలే తన బాప్తిస్మం ద్వారా లోకపాపాలను తన విూదికి తీసుకొని, మన పాపాల నిమిత్తం సిలువ విూద తీర్పు పొంది, దేవుడు ఇశ్రాయేలీయులతోను, ఆయన నిబంధనా వాక్యంతో మనతో చేసిన వాగ్ధాన రక్షణను యేసు నెరవేర్చాడు అని తెలియజేస్తుంది.

యెషయా 1:18లో దేవుడైన యెహోవా యిలా చెప్పాడు. ‘‘రండి మన వివాదము తీర్చుకొందుము. విూ పాపములు రక్తమువలె ఎర్రనివైనను అవి గొఱ్ఱెబొచ్చువలె తెల్లనివగును.’’ ఇంకా ప్రత్యక్ష గుడారంలో బలులను అర్పించు విధానంలో ఇశ్రాయేలీయులు బలిపశువు తలపై చేతులుంచినప్పుడు వారి పాపాలు దాని విూదికి వెళ్తాయని దేవుడు ఇశ్రాయేలీయులతోను, మనతోను వాగ్ధానం చేశాడు. రాబోవు కాలంలో దేవుని గొర్రె పిల్ల ద్వారా ఈ లోక ప్రజలనువారి అనుదిన పాపాల నుండి, సంవత్సరమంతా చేసిన పాపాల నుండి తాను రక్షిస్తానని దేవుడు వాగ్ధానం చేశాడు.

ఈ వాగ్ధానం మెస్సీయ రాకకు కూడా సూచన. కనుక కొత్త నిబంధన కాలంలో యేసుక్రీస్తు పాతనిబంధన బలివిధానాన్ననుసరించి తన బాప్తిస్మం ద్వారా లోకపాపాలనన్నింటిని తన విూదకు తీసుకొన్నప్పుడు అది దేవుని నిబంధన నెరవేర్పు. దేవుడు తన వాగ్ధాన వాక్యాన్ని యిచ్చిన ప్రకారంగానే వాటినన్నిటిని నెరవేర్చానని మనకు తెలియజేస్తున్నాడు. నిబంధనా దేవుడు తన నిబంధనలనన్నింటిని నెరవేర్చాడన్న సత్యాన్ని యేసు తీసుకొన్న బాప్తిస్మం ప్రత్యక్షపరుస్తోంది.నీరు, రక్తము, ఆత్మ వలన యేసుక్రీస్తు వచ్చాడు.


యేసు యోహాను వలన బాప్తిస్మమెందుకు తీసుకొన్నాడు? ఎందుకంటే మానవజాతి పాపాలనన్నింటినీ తన విూదికి తీసుకోడానికి, మనకు బదులుగా పాపతీర్పును పొందడానికి ఆయన బాప్తిస్మం తీసుకొన్నాడు. మానవులందరి పాపాలను తీసివేయడానికి, మనకు నిజమైన రక్షకునిగా అవడానికి, యేసు బాప్తిస్మమిచ్చు యోహాను ద్వారా బాప్తిస్మాన్ని పొందాడు. సిలువకు వెళ్ళాడు, దాని మీద తన రక్తాన్నికార్చాడు. అలా చేసి ఆయన మన పాపాలనన్నింటిని కడిగి వేయడమే గాక, మనకు బదులుగా ఆ పాపతీర్పును పొందాడు. దాని వలన మనకు శాశ్వత రక్షకుడైనాడు. యేసు యోహాను వలన బాప్తిస్మం పొందినప్పుడు మన పాపాలన్నీ ఆయన విూదకు వెళ్ళాయి. ఆయన లోకపాపాలను సిలువకు మోసుకొని వెళ్ళాడు. క్రీస్తు తన బాప్తిస్మంతో మన పాపాలనన్నింటిని భరించాడు గనుక, ఆయనీ లోక పాపాలను సిలువకు మోసుకొని వెళ్ళాడు. గనుక ఆయన సిలువ వేయబడాడ్డు. తన రక్తాన్ని చిందించాడు మన స్థానంలో చనిపోయాడు.

యోషయా 53:5 యిలా వివరిస్తోంది, ‘‘మన అతిక్రమక్రియలను బట్టి అతడు గాయపరచబడెను. మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీదపడెను. అతడు పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత కలుగుచున్నది”. మన ప్రభువు బాప్తిస్మం ద్వారా మన పితరుడైన ఆదాము వలన మనం స్వాస్థ్యంగా పొందిన పాపాలు, మన జీవితకాలం మనం చేసిన పాపాలన్నీ ఆయన మీదికి వెళ్ళాయి. ఈపాపాలన్నిటి నిమిత్తం ఆయన తీర్పు పొందాడు. అలా ఆయన నీరు, రక్తం ద్వారా మన దగ్గరకు వచ్చిన మనప్రభువు మన పాపాలనన్నింటిని పోగోట్టాడు. (1 యోహాను 5:5-8).

మన పాపాలన్నిటి విషయం శ్రద్ధ తీసుకొని, వాటన్నిటిని పోగొట్టిన మన రక్షకుడు, మెస్సీయ అయిన ఈ యేసుక్రీస్తు ఎవరు? అది 1:11 యిలా వివరిస్తోంది. ‘‘ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను”. తన మాట ద్వారా ఈ జగత్తును సృజించిన శక్తివంతుడైన ఈ దేవుడెవరు? ఆయన పాపాత్ముల కొరకు వచ్చిన మెస్సీయ. ఈ లోక పాపాలన్నింటి నుండి నిన్ను, నన్ను రక్షించడానికి నీటి బాప్తిస్మం ద్వారా వచ్చిన యేసే ఈ లోకపాపాలన్నింటి కోసం సిలువ విూద తీర్పుపొంది, తన రక్తాన్ని కార్చి మన రక్షకునిగా వచ్చిన క్రీస్తే. యేసు నీరు, రక్తం, ఆత్మల ద్వారా పాపాల నుండి తీర్పు నుండి మనలను రక్షించాడు. మన ప్రభువు మన పాపాలను తన విూదికి తీసుకొని, మనస్థానంలో తాను తీర్పు పొందడానికి మన దగ్గరకు వచ్చిన రక్షకుడు.

యేసుక్రీస్తు నిజముగా దేవుని కుమారుడు. తానే దేవుడు ఆయనే మెస్సీయ ‘‘యేసు” అన్న పేరుకు ‘‘తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును” అని అర్థం (మత్తయి 1:21) ‘‘క్రీస్తు” గ్రీకుభాషలో ‘‘బసిలియస్‌” అంటే ‘‘రాజుల రాజు” అని అర్థం. ఈ జగత్తునంతటిని సృజించిన వాడు యేసు. ఆయనే అన్నిటిని పాలించు పరిపాకుడు. పాపాత్ముల రక్షకుడు. సాతానుకు తీర్పుతీర్చే రాజుల రాజు.

పరిపూర్ణుడైన దేవుడు మానవుని తన స్వరూపంలో సృజించాడు. ఆయన సృష్టి అయిన మనం మన బలహీనత వలన పాపంలో పడిపోయి నాశన పాత్రులమైనాము. మన పాపాల నుండి మనలను రక్షిస్తానని రాజుల రాజు వాగ్ధానం చేసాడు. ఈ వాగ్ధానాన్ని నెరవేర్చడానికి ఆయన మన దగ్గరకు ఈ లోకానికి వచ్చాడు. మనలను పవిత్రులైన దేవుని ప్రజలుగా, పాపంలేని వారిగా చేయడానికి మన ప్రభువు తానే నీరు రక్తం, ఆత్మల వలన మన దగ్గరకు వచ్చాడు.

సృష్టికర్తయైన మెస్సీయ మన పాపాలన్నింటిని పొగొట్టడానికి యొర్దాను నదిలో యోహాను వలన బాప్తిస్మం ద్వారా మన పాపాలన్నింటిని తన విూదికి తీసుకోడానికి మానవునిగా ఈ లోకానిక వచ్చాడు. సిలువ విూద మరణించడం వలన మన స్థానంలో మన పాపాల నిమిత్తం తీర్పు పొందాడు. మన కొరకు వచ్చిన మెస్సీయే యేసు గనుక, ఆయనే మన రక్షకుడు, మన జీవితాలకు ప్రభువు గనుక ఆయనను నమ్ముట ద్వారా మనం నూతనమైన, నిత్యజీవాన్ని సంపాదించుకోగలం. కనుక మెస్సీయ నిజంగా మన దేవుడైనాడు. ఇందుకనే ప్రత్యక్ష గుడారపు ఆవరణ ద్వారం నీలధూమ్ర రక్తవర్ణాల దారంతో నేయబడినది. మన పాపాలన్నిటినుండి, వాటి వలన కలిగే తీర్పు నుండి మనకు విమోచన కలిగించే నీరు, ఆత్మల మర్మం యిదే.

ప్రభువు మన పాపాల నుండి నిజంగా మనలను రక్షించాడన్న సత్యం అనుమానించాల్సింది కాదు. మన ప్రభువు తన రక్షణను గూర్చి మనకు అస్పష్టమైన వాగ్ధానం చేయలేదు. దానిని ఇంచుమించుగా గాక పూర్తిగా నెరవేర్చాడు. ఆయనను వూరకనే నమ్మిన వారి విశ్వాసాన్ని ఆమోదించలేదు. స్థిరమైన ఆయన సత్యానికి వేరుగా తన నీరు, రక్తం ద్వారా నిజంగా ఆయన మనలను రక్షించాడు. అందుకని ఏదో నామకార్థంగా తనను నమ్మేవారితో ఆయన ‘‘ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోకరాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును” అని చెప్పాడు (మత్తయి 7:21)

అబద్ధ బోధకులు తాము యేసునామమున ప్రజలు పరిశుద్ధాత్మను పొందునట్లు చేస్తున్నామని, ఆయన నామమున దయ్యాలను వెళ్ళగొడుతున్నామని, ఆయన నామమున కార్యాలను చేస్తున్నామని చెబుతారు. అలాంటి వారితో ‘‘నేను మిమ్మును ఎన్నడును ఎరుగను, అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి పొండి” అని దేవుడు చెబుతున్నాడు (మత్తయి 7:23) దీనిని బట్టి క్రైస్తవుల్లో యింకా చాలమంది పాపంలోనే వున్నారని తెలుస్తుంది. తీర్పు దినాన వారు వారి పాపాలకు తీర్పుపొందుతారు. తర్వాత నరకంలో పడవేయబడతారు.

‘‘యేసే మా రక్షకుడు. యేసు సాటిలేని విధంగా మా పాపాలన్నింటి నుండి మమ్మును రక్షించాడు’’ అని ఒప్పుకొనే క్రైస్తవులు చాలా మంది వున్నారు. అలా చెబుతూ కూడా మెస్సీయ తమ పాపాలను తన విూదికి తీసుకొన్నాడని, వాటిని వారి పక్షంగా ఆయన భరించి, వాటి నిమిత్తం తీర్పు పొంది సిలువ విూద తన రక్తాన్ని చిందించాడని తెలుసుకోడానికి కూడా వారు ప్రయత్నించరు. వీరు నమ్మక నమ్ముతున్నారు. గనుక పాపంలోనే వుండి ఒక దానిని అనుసరించే వారిగా దేవుని ముందు నిలుస్తారు.

మన ప్రభువు చెప్పిన ‘‘విూరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులైయుండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయును’’ అని చెప్పిన సత్యమును వారు నమ్మలేదు గనుక వారిని దేవుడు చేర్చుకొనడు. ప్రజలు యేసును నమ్మినా నమ్మకపోయినా, తమ హృదయాలలో పాపం వున్నవారు పాపం వుండని దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి యోగ్యులుకారు గనుక వారు దానిలో ప్రవేశించలేరు. కాబట్టి వారు పరలోకంలో ప్రవేశించాలంటే వారు నీలధూమ్రరక్త వర్ణాల దారం తెలియజేసే సత్యాన్ని నమ్మినప్పుడు మాత్రమే పరలోక రాజ్య ప్రవేశానికి యోగ్యులవుతారు. ప్రత్యక్షగుడారపు ఆవరణ ద్వారం నీలధూమ్రరక్త వర్ణాల దారం, పేనిన సన్నని నారతో నేయడం మెస్సీయ ముందు జాగ్రత్త వల్లనే జరిగింది. తమ పాపం వలన నరకం దారిలో వున్న వారు దీనిని నమ్మాలి.

వీరికి సత్యం తెలియదు గనుక వారు తమ స్వంతంగా పొందిన పొరబాటైన జ్ఞానంతో యేసును నమ్ముతున్నారు. గనుక వారింకా పాపంలోనే వున్నారు. ప్రత్యక్ష గుడారపు వస్తువులలో దాగివున్న సత్యాన్ని నమ్మడానికి బదులు వారి రక్షకుని గూర్చి తమ స్వంతంగా ఆలోచించి, తమ స్వంత రక్షణ సిద్ధాంతాలపై ఆధారపడిన ఆలోచనతో, దేవుని పశ్చాత్తాప ప్రార్థనలు చేయడం వలన కలిగే క్రమ పరిశుద్దత వలన రక్షణ వస్తుందని నమ్మడం వలన వారు యింకా పాపంలోనే వున్నారు.

యేసే తమ రక్షకుడు అని నమ్ముతున్నాం అని చెప్పే వారి లోకంలో చాలామంది వున్నారు. కానివారు యేసు బాప్తిస్మాన్ని ఆయన రక్తాన్ని నిజంగా నమ్మలేదు. నీలధూమ్ర రక్తవర్ణాల దారమే తమ రక్షణ అని నిజంగా నమ్మడానికి బదులు, వారుపాపాత్ములుగానే వుండి యేసురక్తంలో విశ్వాసముంచితే చాలు, మేము దేవుని పరిశుద్ద రాజ్యంలో ప్రవేశిస్తామని నమ్మేవారు ఈ లోకంలో చాలామంది వున్నారు.పాత, కొత్త నిబంధనలను కలుపుట


దేవుని ప్రతి వాక్యానికి దానిని కలిపే మరో వాక్యముందని యెషయా 34:16 వివరిస్తోంది. దేవుని వాక్యం అన్నింటిని కలిపే పనిచేస్తుంది. పాతనిబంధనలోని తన వాక్యం, కొత్తనిబంధనలోని తన వాక్యంతో జతపడుతుందో లేదో విూ యంతట విూరే చూసి తెలుసుకొండని దేవుడు చెబుతున్నాడు. పాత నిబంధనలో రాసివున్న దానితో సరిపడు వాక్యం కొత్తనిబంధనలో వుంది. ఉదాహరణకు పాత నిబంధనలో ఇశ్రాయేలీయులు తమ చేతులను బలిపశువుపై వుంచుట వలన వారి పాపాలన్నీ దాని విూదికి వెళ్ళినట్లే కొత్తనిబంధనలో యేసుక్రీస్తు బాప్తిస్మం తీసుకొనగానే లోక పాపాలన్నీ ఆయన విూదికి వెళ్ళాయన్నది పాతనిబంధనతో సమానమవుతుంది.

తన నీరు, రక్తం ద్వారా యేసు ఈ లోకానికి బలియర్పణగాను, పాపుల రక్షకునిగా వచ్చాడు. తన బాప్తిస్మంద్వారా ఆయన లోకపాపాలను తన విూదికి తీసుకొనకపోతే ఆయన సిలువ విూద చనిపోవలసిన అవసరం లేనేలేదు. మన ప్రభువు నీలధూమ్ర రక్తవర్ణాల దారంతో మన పాపాలన్నీ పోయేట్టు చేశాడు. ఇది కూడా దేవుడు తన వాక్యంతో మన దగ్గరకు వచ్చి, ఎర్రగా వున్న మన పాపాలను హిమమంత తెల్లగా చేస్తానని వాగ్ధానం చేశాడు.

ఈ సత్యాన్ని తెలుసుకొనక ముందు, మనం అంతంలేని మన పాపాలతో పొంగిపొర్లుతూ వున్నాం. కనుక దేవుని ముందు మనం గొప్పగా చెప్పుకోదగినదేదీ లేదు. ఆయన ముందు ఆడంబరం చెప్పుకోడానికి మనకేం లేకపోవడమే గాదు. మనం నమ్మకంగా ఆయన ముందు నటించడానికి కూడా మనకేదీ లేదు. దేవుని ముందు మనం చెప్పగలిగినదల్లా ‘‘అవును, నీదే నిజమైన మాట నీవే సరైన వాడవు” అని మాత్రమే ఒకవేళ దేవుడు ‘‘నీవు నరకపాత్రుడవైన అక్రమాల పుట్టవు” అని అంటే ‘‘అవును ప్రభువా, నీవు చెప్పింది నిజమే. దయచేసి నన్ను రక్షించు” అని అనాల్సిందే.

“నేను నిన్ను నీరు, రక్తం, ఆత్మల ద్వారా రక్షించాను” అని ఆయన అంటే ‘‘అవును ప్రభువా, దానిని నేను నమ్ముతాను” ఆయన ఎన్ని అడిగినా ఎప్పుడూ ‘‘అవును ప్రభువా” అదే చెప్పగలం. దేవుని ముందు నిలిచి ‘‘నేనిది చేశాను, అది చేశాను, నేనింత బాగా నా సంఘానికి సేవ చేశాను, నేను యేసును నిజంగా నా హృదయపూర్వకంగా నమ్ముతున్నాను; ఎవరూ ఊహించలేనంతగా నేను నా విశ్వాసాన్ని మెండుగా కాపాడుకొన్నాను!’’ అని ఆయనతో చెప్పలేం.

మన పాపాలన్నీ పోయేట్టు ప్రభువు ఎలా చెయగలడు? నీలధూమ్ర రక్తవర్ణాల దారం ద్వారా, పాత, కొత్త నిబంధన వాక్యం ద్వారా మన పాపాలు పోయేట్టు చేస్తానని ఆయన మనకు చూపించాడు. పాత నిబంధనలో నీలధూమ్ర రక్తవర్ణాల దారంలోను, కొత్తనిబంధనలోను యేసు మానవునిగా ఈలోకానికి వచ్చి, మన రక్షకుడై యోహాను వలన తాను పొందని బాప్తిస్మంతో మన పాపాలనన్నింటని ఆయన విూదికి తీసుకొని, సిలువ విూద తన రక్తాన్ని చిందించుట ద్వారా మన పాపాలు, దాని తీర్పు నుండి మన విషయమై శ్రద్ధ తీసుకొన్నాడు.

బాప్తిస్మాన్ని పొందుట ద్వారా మన ప్రభువు లోకపాపాలన్నింటిని ఒకేసారి తన విూదికి తీసుకొన్నాడు. (మత్తయి 3:15). అప్పుడు మనలోక పాపాలన్నీ ఆయన విూదికి వెళ్లాయి. ఆయన నీ పాపాలను సిలువకు మోసికొని వెళ్ళాడు, సిలువ వేయబడ్డాడు. తన రక్తాన్ని చిందించాడు. సిలువ విూద చనిపోయాడు. మృతులలో నుండి మళ్లీ సజీవంగా లేచాడు. దాని వలన మన పాపాలన్నీ పోయేట్టు చేశాడు. అలా యేసు క్రీస్తు మనకు నిజమైన రక్షకుడైనాడు.

నీరు, రక్తం, ఆత్మ ద్వారా ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తును నమ్ముట వలన మనం దేవుని నీతిని పొందాం. ఈ రక్షణను మన స్వంతంగా సాధించినది గాక దేవుని నుండి ఉచితంగా పొందాం. దేవుని ముందు మనం గొప్పగా చెప్పుకోడానికి ఏమీ లేదు.

వాస్తవానికి మనకు నిజమైన రక్షకునిగా వచ్చిన యేసు క్రీస్తును నమ్ముట వలన మన పాపాల నుండి మనం రక్షణపొందాం. పాపాత్ములమైన మనం యేసు బాప్తిస్మాన్ని, ఆయన మన కొరకు చిందించిన రక్తాన్ని నమ్ముట వలన మన పాపాల నుండి విమోచన పొందాం. యేసు చేసిన రక్షణ కార్యమెంత అని లెక్కవేస్తే అది 70 శాతం. మిగతా 30 శాతం మన స్వంత ప్రయత్నంతో పాపం చేయకుండా వుండడం. మనం క్రమంగా శుద్దులమై మనరక్షణ కొద్ది కొద్దిగా పూర్తి చేయబడుతుంది. కనుక మనం రాత్రంతా తీవ్రంగా ప్రార్థనలు చేస్తూ, ప్రతిరోజూ పశ్చాత్తాప ప్రార్థనలు చేస్తూ, సమాజసేవ చేస్తూ, లేక మనకు వీలైన ప్రతిమంచి పనిని చేయడానికి ప్రయత్నిస్తూ వుండాలి.

పౌలు యిలా అంటున్నాడు, ‘‘అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను? ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును? మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కాగా మనస్సు విషయములో నేను దైవ నియమమునకును, శరీర విషయములో పాప నియమమునకు దాసుడనైయున్నాను. కాబట్టి యిప్పుడు క్రీస్తుయేసు నందున్న వారికి ఏ శిక్షావిధియు లేదు.’’ (రోమా 7:24 - 8:1). పౌలు ఒప్పుకొన్నట్టే మనం కూడా అలాగే యేసుక్రీస్తును నమ్మాలి. నూరు శాతం మరణ పాత్రమైన ఈ శరీరం నుండి మనలను యేసుక్రీస్తు సంపూర్తిగా రక్షించాడని లేఖనం చెబుతోంది. ఇక మనలను శిక్షించగల వాడెవడు? మన అక్రమాలను లెక్కించక క్రీస్తు మననిప్పటికి నూరుశాతం రక్షించాడు గనుక యిక ఎవరూ, ఎన్నటికి మనలను శిక్షించలేరు.నీవు, నేనూ కూడా ఆధ్యాత్మిక పరిసయ్యులం.


మీలో కొందరు చాలా కాలంగా యేసును ఎరిగి కూడా కొంచెమే నమ్ముతూ వుండవచ్చు. విూరు నీరు, ఆత్మల సువార్త తెలియక ముందు యేసును విూ రక్షకునిగా నమ్మివుండవచ్చు. నా వరకు నేను కూడా తిరిగి పుట్టని క్రైస్తవునిగా పది సంవత్సరాలున్నాను.

మనం యేసును మన రక్షకునిగా నమ్మినప్పుడు అదెంతో సేద తీరే అనుభవం. ఈ ప్రారంభం మనకు నీలధూమ్రరక్తవర్ణాల దారం తెలియకపోయినా, యేసును మన రక్షకునిగా నమ్మాం. గనుక ఏ షరతూ లేక మనం రక్షణ పొందామన్న ఆలోచన మనలనెంతో సేద దీరుస్తుంది.

నేను మొదట యేసును నమ్మినప్పుడు నా హృదయం ఎంతో ఆనందంతో నిండిపోయింది. కాని అయిదు సంవత్సరాల తర్వాత నన్ను నేను పరిశీలించి చూసుకొన్నప్పుడు నేను చేసిన పాపాలతో నేను కట్టబడి కొనసాగుతున్నానని, నేనింకా స్వేచ్ఛను పొందలేదని తెలుసుకొన్నాను. నా తొలి క్రైస్తవ జీవితంలోని ఆ అయిదు సంవత్సరాల్లో నేను పాపాలు చేశానని, లేక చేయలేదని విూరనుకొంటున్నారా? నేను మీకు తెలిసినా, తెలియకపోయినా పాపాలు చేశాను అన్నది స్పష్టం. సత్యాన్ని మార్చి నాకు తెలియని ఈ కాలంలో నేను పాపం చేసినప్పుడల్లా బాధపడేవాణ్ణి. ఈ వేదన పొగొట్టుకోడానికి పశ్చాత్తాపంతో ప్రార్థనలు చేసేవాణ్ణి. కొన్నిసార్లయితే మూడు రోజుల వరకు ఉపవాసం చేసేవాణ్ణి. అప్పుడు నా హృదయ భారం కొంచెం తగ్గి, ‘‘ఆశ్చర్యకరమైన ప్రేమ”, ‘‘నా యేసు నామ శబ్ధము” అన్న పాటలు పాడుతూ దేవుని స్తుతించేవాణ్ణి, అదైనా తర్వాత నేను మళ్ళీ పాపం చేసేవాణ్ణి. నాలో ఎన్నోలోపాలు, కళంకాల వల్ల వాటిగూర్చి నన్ను నేను ద్వేషించు కొంటూ కూడా ప్రతిరోజు పాపంచేస్తూ వుండేవాణ్ణి. ఒకేసారి నా పాపాలన్నింటిని మాని మంచివాణ్ణి కాలేదు.

ఈ పరిస్థితుల్లో మరో అయిదు సంవత్సరాలు గడిచిపోయినై. ఒకరోజు నన్ను నేను పరిశీలించుకొన్నాను. పది సంవత్సరాలు నా క్రైస్తవ జీవితంలో నేనెన్ని పాపాలు చేశానో అని వాటిని లెక్కించుకొని నిశ్చేష్టుడనయ్యాను. ప్రతిరోజు అంత గొప్ప పాపాలు చేస్తున్న నేను ఎంతగానో దుఃఖించాను. ఎంతో నిరుత్సాహాన్ని పొందాను. ధర్మశాస్త్రం ముందు నిలిచినప్పుడు నేనెంత పాపాత్ముణ్ణో నిజంగా నన్ను నేను చూసుకొన్నాను. దేవుని ముందు నిలవడం క్షణక్షణానికి కష్టమైపోయింది. నేనిక మనఃపూర్వకంగా యేసును తెలుసుకొని, ఆయన్ను నమ్మక పాపాత్మునిగానే వుండిపోతానేమో అనిపించింది. అప్పుడు అంటే పది సంవత్సరాలు నా క్రైస్తవ జీవితసమయంలో నా పాపాలను గూర్చి మొదట నాకు నేను ఒప్పుకొన్నాను.

నేను మొదటిగా యేసును నమ్మనిప్పుడు నేను నిజంగా ఒక మంచి క్రైస్తవుణ్ణి అనుకొన్నాను. కాని కాలం గడుస్తుండగా దేవునిముందు నన్ను గూర్చి గొప్పగా చెప్పుకోడానికేమీ లేదని తెలుసుకోగలిగాను. ‘‘నేను నిజంగా ఒక పరిసయ్యుని వంటి వాణ్ణి. పరిసయ్యుడు నీతిమంతుడని బైబిల్లో కూడా చెప్పలేదు. కనుక నేను ఈనాటి పరిసయ్యుడను అని తెలుసుకొన్నాను.

పరిసయ్యులు అంటే పరిశుద్ధుడుగా నటించేవారు. ప్రతి ఆదివారం గుడికి వెళ్తూ బైబిలును బయటకు కనిపించకుండా చంకలో దాచుకొంటాడు. సాటి క్రైస్తవులు కనిపించినప్పుడు ‘‘గుడ్‌ మార్నింగ్‌, హల్లెలూయ’’ అని పెద్దగా చెబుతూ వుంటారు. ఆరాధనా సమయంలో సిలువ అని ఎవరైనా చెప్పగానే, కేకలు వేస్తారు. యేసు రక్తాన్ని గూర్చి ఆలోచిస్తూ నేను కూడా చాలాసార్లు కన్నీళ్లు కార్చాను. ఇదే నిజమైన ఆరాధన అనుకొనేవాణ్ణి. అయితే ఈ లోకంలో జీవిస్తూ వుండగా ప్రతి ఒక్కరూ ఒకదాని తర్వాత మరోపాపం చేస్తూ వుంటారని వారికి వారే తెలుసుకోగలుగుతారు. అందుకని వారు మళ్ళీ మళ్ళీ పశ్చాత్తాప ప్రార్థనలు చేస్తూ వుంటారని వారికి వారే తెలుసుకోగలుగుతారు. అందుకని వారు మళ్ళీ మళ్ళీ పశ్చాత్తాప ప్రార్థనలు చేస్తూ వుంటారు. 

వారు కొద్దిసేపు బాగానేవున్నాం అనుకొంటారు. కాని వెంటనే లేక కొంత సేపైన తర్వాతో ఈ పశ్చాత్తాప ప్రార్థనలన్నీ మరచిపోయి వారు చాలా పాపాలు చేస్తుంటారు. కొందరైతే బాషల్లో మాట్లాడతారు, దర్శనాలు చూస్తారు. కాని అవన్నీ నిరుపయోగమైపోయి వారే విధమైన ప్రయత్నం చేసినా వారి హృదయాల్లోని పాప సమస్యను పరిష్కరించలేవు.

చివరికి దేవునిముందు తాము యోగ్యులం కామని తమ పాపాల వలన తాము నరకపాత్రులమని ఆలస్యంగా గ్రహించినా అది అదృష్టకరమైన విషయమే. వాస్తవానికి మనం యేసును ఎంతో కాలంగా ప్రేమిస్తూ వుంటే నిజంగా మనమెంత భయంకరమైన పాపాత్ములమో తెలుసుకోగలుగుతాం. కాని తమ పాపాలు దాచిపెట్టడంలో పరిసయ్యులు బహునేర్పరులు. తమ హృదయాల్లోని పాపాలను దాచి, వేషధారణతో జీవిస్తూ చుట్టుప్రక్కల వారితో సాత్వికులుగా మెప్పుపొందడంలో నేర్పరులు.

ఈ లోకమతస్థులు ఒకరినొకరు గొప్పగా గౌరవించుకొంటారు. వారు ఇతరుల నుండి ఎంత మర్యాద మన్ననలు పొందినా దేవుని ముందు నిలిచినప్పుడు వారు కేవలం పాపపు కుప్పవంటివారు మాత్రమే.

మనం కూడా సత్యం తెలియనంతకాలం మన పశ్చాత్తాప ప్రార్థనలెంతో తీవ్రంగా చేస్తూ వుంటాం. కొంతసేపుపటికి అలసిపోతాం. అప్పుడు ‘‘ప్రభువా, నేనేన్నో పాపాలు చేశాను. మళ్ళీ మళ్ళీ చేస్తున్నాను. ఆ సంగతి నీ ముందు చెప్పడానికి కూడా నాకెంతో యిబ్బందిగా వుంది. కనుక నీ యిష్టంవచ్చిట్లేచెయ్యి” అని చివరికి ప్రార్థిస్తారు. కాని మన పాపాలను గూర్చి దేవునికి చెప్పుకోవడం యిబ్బందిగా వున్నా, మన పాపాలను మనం దేవుని ముందు ఒప్పుకొని ‘‘ప్రభువా, నేను పాపం చేశాను, నన్ను క్షమించు” అని ప్రార్థిస్తూ వుంటే, ఆయన సంతోషిస్తాడని మనం విన్నాం గనుక, ఆయన తన నీతితో మన పాపాలను క్షమిస్తాడు. మన అవినీతి నుండి మనలను శుద్ధులనుగా చేస్తాడు. అయినా మన పాపాలు యింకా మన హృదయాల్లో వుంటాయి.

దేవుని ప్రార్థించడానికి తమ తలలు వంచినప్పుడు, వారి మనస్సాక్షి వారి పాపాలను వారికి జ్ఞాపకం చేస్తుంది. వారి హృదయాలను దహించి వేస్తుంది. మన మనస్సాక్షి ‘‘ఇన్ని పాపాలు చేసిన నీకు దేవునికి ప్రార్థించడానికెంత ధైర్యం” అని చెబుతూ మన హృదయాలను ఖండిస్తూ వుంటుంది.

అలా కొంతసేపు బాధపడిన తర్వాత, మనకు చెప్పడానికి కేమీ లేక ఏడుస్తూ ‘‘ప్రభువా, ప్రభువా” అనడం తప్ప యింకేవిూ చేయలేం. చాలాసార్లుగా, మనమొక కొండవిూదికి వెళ్ళి, ఏదైనా ఒక గుహలోకి పోయి, దేవుని నామంతో మొర్రపెడతాం. ఈ విధానం కూడా మన వరకు సరిపోతుంది. ఇంత చేసినా యింకా మన పాపాలు మన హృదయంలోనే వుంటాయి.

మన మిక పాపాత్ములం కాదని, దేవుడు కనికరం గలవాడు కనుక ఆయన నా పాపాలను క్షమించాడని, నేను మూడురోజులు ఉపవాసముండి ప్రార్థించాను. ఇక అంతకంటే నేనేం చేయగలను. ఇక కనికరంగల దేవుడు నన్ను క్షమించడా?’’ అని మనలను మనం సమాధానపరచుకోవడానికి ప్రయత్నిస్తాం.

మనం దేవుని కృపకోసం ఆయన్ను స్తుతిస్తూ కూడా మనలను మనం నిజంగా మోసగించుకోగలమా? దేవుని ముందు మనం పాపాత్ములమై వుండి కూడా పాపంలేని వారమని మన హృదయాలను మనం మోసగించుకోగలమా? ఎప్పటికి మోసగించుకోలేం! మనం సంఘాల్లో ఎంత ఉన్నతమైన నాయకత్వ పదవులను మనం అధిరోహించినా, ఇతరుల మెప్పులెన్ని పొందినా, మనం పాపం చేస్తూవున్నంతకాలం, ఈ పాపాల నుండి మనం స్వతంత్రులం కాలేం. చివరికి వేషధారులుగానే మిగిలిపోతాం.

మన హృదయాల్లో పాపపు తలంపు తలెత్తుతూనే వుంటాయి. సిలువలో యేసు కార్చిన రక్తాన్ని గూర్చి మనం లెక్కించలేనన్నిసార్లు మాట్లాడినా, ఆ సిలువ రక్తాన్ని గూర్చి ధ్యానం చేస్తూ ఎన్ని కన్నీళ్లు కార్చినా, మనం ఎంతమంచి క్రైస్తవులమైనా, నీరు, ఆత్మలనే పరిపూర్ణ సువార్తను తెలుసుకోగలిగేంత వరకు మనం పాపాత్ములుగానే వుంటాం. క్రైస్తవ ఆచార కర్మలన్నింటిని అనుసరిస్తూ జీవిస్తున్నా మనలో యింకా పాపం వుంటుంది. ఇది పరిసయ్యుల మతం. ఈ విశ్వాసం గల వారు యింకా ఈ లోకంలో చాలామంది వున్నారు. వారు మన క్రైస్తవ సమాజాల్లోనూ వున్నారు.నీరు, ఆత్మల సువార్తను నమ్ముట వలన మన పాపాలన్నీ మటుమాయమైపోయినై.


నీరు, ఆత్మల సువార్తను తెలుసుకొని, దానిని నమ్మకముందు మనందరి హృదయాల్లో పాపం వుంది. నీలధూమ్ర రక్తవర్ణాల దారం, పేనిన సన్నని నార సత్యాన్ని నమ్మకముందు మన అంతరంగం పాపంతో నిండివుంది. మన యోగ్యతలను బట్టి మనం దేవుని ముందు పాపాత్ములం. ‘‘పాపమునకు జీతం మరణం” కనుక మన పాపాల వలన మనమందరం నరక పాత్రులం అని బైబిలు వివరిస్తోంది. అలా మన పాపాల వలన మనమెన్నో బాధలను భరించాం. మన పాపాల కారణంగా దేవుని తీర్పు వలన మనం శారీరకంగాను, ఆధ్యాత్మికంగాను నరకపాత్రులం.

మనం అనేకులకు క్రైస్తవ్యాన్ని బోధించాం. అనేకులను క్రైస్తవులనుగా చూశాం. మన హృదయాంతరంగాన్ని మనం శుద్ధిచేసుకోలేని వారమైవుండీ ఆ పనిచేశాం. ఇది దేవుని ముందుకాదని చెప్పలేం. మన హృదయాలు పాపభూయిష్టమైనవని, మనం నరకపాత్రులమని దేవునిముందు మనం తెలుసుకోగలిగాం.

“మన ప్రభువు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన బాప్తిస్మమెందుకు తీసుకొన్నాడు?’’ అన్న ప్రశ్న నాలో వుండేది. యేసు బాప్తిస్మమెందుకు తీసుకొన్నాడో తెలుసుకోవాలనే వాణ్ణి ఎందుకు. ఏ వుద్దేశాలతో యేసు బాప్తిస్మం తీసుకొన్నాడు? యేసులో విశ్వాసానికి గుర్తుగా మనం బాప్తిస్మం తీసుకొంటామని నేను అర్థం చేసుకోగలను. కాని బాప్తిస్మమిచ్చు యోహాను వలన యేసు ఎందుకు బాప్తిస్మం తీసుకొన్నాడో నా కసలు అర్థం అయ్యేది కాదు. ఆయనెందుకు బాప్తిస్మం తీసుకొన్నాడు? ఎందుకు?

అది తెలుసుకోవాలని ‘‘పాస్టరు గారూ, నాదో ప్రశ్న, అడిగితే ఏవిూ అనుకోకండి” అని అడిగాను చాలామంది క్రైస్తవుల నాయకులను అందుకు వారు అడగమన్నారు. అప్పుడు నేను ‘‘కొత్త నిబంధనలో యోహాను వలన యేసు బాప్తిస్మం తీసుకొన్నట్టు బైబిలు వివరంగా చెబుతోంది. కాని ఆయనెందుకు బాప్తిస్మం తీసుకున్నాడో నాకు అర్థం కాలేదు. విూరు చెప్పగలరా? మన సండేస్కూల్లో చిన్నపిల్లలు కూడా ఆ సంగతి తెలుసు? అది లేఖనాల్లోనూ, బైబిలు నిఘంటువులోనూ వివరించి వుంది. మనకు మాదిరిగా, మనకు ఆదర్శంగా, ఆయన వినయాన్ని తెలియజేసి అలా మనలను నడపడానికి ఆయన బాప్తిస్మం తీసుకొన్నాడు’’ అని చెప్పారు. అందుకు నేను ‘‘అయితే పాస్టరు గారూ, మన సండే స్కూల్లో చిన్న పిల్లలకు ఆ విషయం తెలిసినా, నేను లేఖన మూలప్రతులను, చారిత్రాత్మకంగానూ పరిశీలించినా, ఆయన బాప్తిస్మ ఉద్దేశం అదికాదనిపించింది. యేసు యోహాను వలన బాప్తిస్మమెందుకు తీసుకొన్నాడో మరో కారణమేమైనా వుందా?’’ అని అడిగాను.

నేను క్రైస్తవుడైన తర్వాత ఈ ప్రశ్న అడుగుతూనే వున్నాను. దీని కారణాన్ని అన్వేషిస్తూనే వున్నాను. ఆ జవాబు కోసం అన్వేషిస్తూ సంవత్సరాలు గడుపవలసి వచ్చింది. ఈ ప్రశ్నకు సంబంధించిన పండితుల రాతలనెన్నింటినో పరిశీలించాను. ఎందరినో అడిగినా, ఎన్నోగ్రంథాలు పరిశోధించినా, యేసు బాప్తిస్మాన్ని గూర్చి వివరంగా, నిర్దిష్టంగా ఏదీ, ఎవరూ చెప్పలేదు. చివరికి దేవుడు నీలధూమ్ర రక్తవర్ణాల దారం, పేనిన సన్నని నారలో ప్రత్యక్ష పరచిన నీరు, ఆత్మల సువార్త ద్వారా దేవుడు నాకు బోధించే వరకూ ఆ జవాబు కోసం నేను శ్రమపడుతూనే వున్నాను.

యేసు బాప్తిస్మమనే పరిష్కారం లేని చిక్కు ప్రశ్నతో నేను బాధపడుతున్నప్పుడు మత్తయి 3:13-17 బాగాన్ని పారాయణం చేసే అవకాశం వచ్చింది. ‘‘ఆ సమయమున యోహాను చేత బాప్తిస్మము పొందుటకు యేసు గలిలయ నుండి యొర్దాను దగ్గర నున్న అతనియొద్దకు వచ్చెను. అందుకు యోహాను నేను నీ చేత బాప్తిస్మము పొందవలసిన వాడనై వుండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా? అని ఆయనను నివారింపజూచెను గాని యేసు - ఇప్పటికి కానిమ్ము, నీతియావత్తు ఈలాగు నెరవేర్చుట మనకు తగియున్నదని అతనికి వుత్తరమిచ్చెను గనుక అతడాలాగు కానిచ్చెను. యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మపావురము వలె దిగి తన విూదికి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేనానందించుచున్నానని యొక శబ్ధము ఆకాశము నుండి వచ్చెను.’’

ఈ వాక్యాన్ని చదివి ‘‘ఆయనే పాత నిబంధనలోని బలియర్పణ గనుక ఆయన బాప్తిస్మాన్ని పొందడానికి కారణం అదే, నీలధూమ్ర రక్తవర్ణాల దారం, పేనిన సన్నని నారలో దాగివున్న ఆయన రక్షణ సత్యం యిదే!’’ అని చివరికి నేను తెలుసుకోగలిగాను.

పాతనిబంధనలో తన రాకకు ముందు పంపిస్తానని దేవుడు వాగ్ధానం చేసిన ఏలీయాయే బాప్తిస్మమిచ్చు యోహాను. న్యాయ తీర్పు దినానికి ముందు నేను ఏలీయాను పంపిస్తానని మలాకీ 4:5లో దేవుడు చెప్పాడు. తాను వాగ్ధానం చేసిన ఏలీయా బాప్తిస్మమిచ్చు యోహానే అని మత్తయి 11:14లో వివరించాడు. కనుక నేను ఏలీయాను గూర్చి తెలుసుకోగలిగాను. అయినా బాప్తిస్మమిచ్చు యోహాను వలన యేసు ఎందుకు బాప్తిస్మం తీసుకొన్నాడో నాకింకా ఖచ్చితంగా తెలియదు. మళ్ళీ నేను మత్తయి 3:13-17 భాగాన్ని మళ్ళీ మళ్లీ పారాయణం చేశాను, ‘‘ఇప్పటికి కానిమ్ము, నీతియావత్తు ఈలాగు నెరవేర్చుట మనకు తగియున్నదని అతనికి వుత్తరమిచ్చెను. యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు. ఈయన యందు నేనానందించుచున్నాను.’’ ఈ భాగాన్ని నేను పారాయణం చేయగా నా సందేహాలన్నీ తీరిపోయాయి. ‘‘నీతి యావత్తును నెరవేర్చుటకు’’ ఆయన బాప్తిస్మాన్ని పొందాడు. యేసు తన బాప్తిస్మం ద్వారా మానవులందరినీ రక్షించుట అన్న నీతి కార్యాన్ని నెరవేర్చాడు.

బాప్తిస్మం అంటే ప్రత్యక్ష గుడార నియమం చొప్పున బలిపశువు తల విూద చేతులుంచడం వంటిదే. పాపాత్ములు తమ బలియర్పణలను దహనబలిపీఠం ముందుకు తీసుకురావాలి. దానిపై వారి చేతులుంచి వారి పాపాలను ఒప్పుకోవాలి. అలా వారి పాపాలు ఆ బలిపశువుపైకి వెళ్తాయి. అలాగే ప్రధాన యాజకుడు ఇశ్రాయేలీయుల పాపాలనన్నింటిని తమ పాపాలను ఒప్పుకొని ఆ పాపాలను బలియర్పణ విూదికి పంపాలి. అలాగే కొత్త నిబంధన కాలంలో బాప్తిస్మమిచ్చు యోహాను ద్వారా బాప్తిస్మం పొందిన యేసుకు ఆ పాతనిబంధన పద్దతులన్నీ అన్వయిస్తాయి. అలాయేసు (చేతులుంచుట ద్వారా) తన బాప్తిస్మాన్ని పొందుట ద్వారా మానవులందరి పాపాలను పొగొట్టడానికి ఆయన అందరి పాపాలను తన విూదికి తీసుకొన్నాడు అని చివరికి నేను ఈ సత్యాన్ని తెలుసుకున్నాను.

మళ్ళీ నేను మూల గ్రంథాలను పరిశీలించాను. ‘‘నీతియావత్తు ఈలాగు నెరవేర్చుట మనకు తగియున్నది” అన్న వాక్యం మూలమైన గ్రీకు బాషలో ‘‘ఈలాగు”, ‘‘నీతి యావత్తు” అన్న మాటలు గ్రీకులో ‘‘హ్యుటోస్‌”, ‘‘డికాయి యేసునే”. మొదటిదాని అర్థం ‘‘ఈలాగు”, ‘‘తగినది”, ‘‘ఈ విధానం వల్లనే”, ‘‘సరియైనది” లేక ‘‘ఈ పద్దతే” తగినది అని అర్థం. ఇక రెండోది, ‘‘డికాయి యేసునే” అంటే ‘‘నీతి, లేక న్యాయం, లేక దేవునికి అంగీకారమైన నీతి” అని అర్థం.

యేసు పాపాత్ములను వారి పాపాల నుండి రక్షించాడు అని ఆ వాక్యం వివరిస్తోంది. యేసు బాప్తిస్మాన్ని పొంది, తన రక్తాన్ని చిందించుట ద్వారా దేవుని నీతిని నెరవేర్చాడు అని చెబుతుంది. అంటే తన బాప్తిస్మం ద్వారా మన పాపాలన్నింటిని తనపైకి తీసుకొన్నాడు అని అర్థం. అలా మన చిక్కు సమస్యలన్నీ తీరిపోయాయి. తన బాప్తిస్మంతో యేసు మన పాపాలన్నింటినీ తన మీదికి తీసుకొన్నాడు. గనుక ఆయన సిలువకు వెళ్లాడు. ఈ పాపాలకు తీర్పుగా సిలువ మీద చనిపోయాడు. నీరు, ఆత్మల సువార్తలో తెలిసే సత్యం యిదే.

తిరిగి పుట్టిన మనం తెలుసుకొన్న సత్యమేమిటంటే యోహాను వలన యేసు తీసుకొన్న బాప్తిస్మం మన రక్షణలో భాగమని తేటపడుతోంది. ఈ బాప్తిస్మం ద్వారా యేసు నీరు, ఆత్మల సువార్తను పరిశీలించి చూస్తే మీరు కూడా ఈ సత్యాన్ని తెలుసుకొంటారు. అప్పుడు మీ ఆత్మలు వెలిగించబడతాయి.

యోహాను నుండి యేసు బాప్తిస్మం తీసుకొన్న రోజును మనం ఎన్నటికి మరచిపోకూడదు. మన పాపాలన్నీ యేసు మీదికి వెళ్లాయని తెలుసుకొన్న ఆ రోజును మన మెన్నటికి మరచిపోకూడదు. ఈ సత్యాన్ని మనం తెలుసుకొన్నప్పుడు మన హృదయంలో కలిగిన మార్పును మనం చూశాం. సరస్సులలో అలలు సరస్సునంతా వ్యాపించినట్టు ఆ భావాలు మన హృదయమంతా వ్యాపించాయి. అప్పుడు చీకటిని చీల్చుకొని ప్రకాశమానమైనా వెలుగు మనలో ప్రవేశించి, రక్షణ సత్యాన్ని తెలుసుకోగలిగేట్టు మనలను వెలిగిస్తుంది.యేసుపొందిన బాప్తిస్మం లోక పాపాలన్ని ఆయన మీదికి వెళ్లేట్టు చేసింది.


మత్తయి 3:13-17 చదివిన తర్వాత చాలా సేపటి వరకు నేనొక్క మాట కూడా మాట్లాడలేకపోయాను. వాస్తవానికి నేనింకా పాపంలో వుండగా యేసు బాప్తిస్మాన్ని పొంది ‘‘ఇప్పటికి కానిమ్ము”. నీతియావత్తు ఈలాగు నెరవేర్చుట మనకు తగియున్నది” అని అన్నాడు. కనుక ఆయన సిలువ మీద తన రక్తాన్ని కార్చడానికి (రక్తవర్ణదారం) యేసు బాప్తిస్మాన్ని పొందాడు (నీలం దారం). ఈ యేసు తానే దేవుడు (ధూమ్రవర్ణదారం). పాత కొత్త నిబంధన వాక్యంతో (పేనిన సన్నని నారతో) ఆయన నిజమైన రక్షణ సత్యాన్ని మనకు బోధించాడు. అంటే యేసు మన పాపాలనన్నింటిని తన మీదికి తీసుకొన్నాడు.

“అయితే మనలో యింకా పాపం వుందా? లేక లేదా? బాప్తిస్మమిచ్చు యోహాను వలన యేసు బాప్తిస్మాన్ని పొందినప్పుడు ప్రతి ఒక్కరి పాపాలు ఆయన మీదికి వెళ్లాయి. ఇప్పటి మన పాపాలు కూడా ఆయన మీదికి వెళ్లాయా? ఆయన బాప్తిస్మం తీసుకొన్నప్పుడు లోకపాపాలు నిజంగా ఆయన మీదికి వెళ్లాయా? మనం మన తల్లిగర్భంలో వుండగా అప్పటికే మనలో వున్న పాపాలు, లోక పాపాలా? మనం ఒక సంవత్సరం బిడ్డగా వున్నపుపడు మనం చేసిన పాపాల సంగతేమిటి? అవి లోక పాపాలు కావా? మనం బాల్యంలో చేసిన పాపాల సంగతేమిటి? అవి లోక పాపాలు కావా?’’

మనం సరైన ఆధారం మీద వున్నామో లేదో తెలుసుకోడానికి ఆ ప్రశ్నను మనకు మనం వేసుకొని జవాబు అన్వేషించాలి. అప్పుడు మనం దేవుని వాక్యంతో స్థిరమైన నేల మీద వున్నామో లేదో మన విశ్వాసం మనకుస్థిరపరస్తుంది. బాల్యంలో మనం చేసిన పాపాలు నిజంగా లోకపాపాలే. మన తొలి యౌవ్వన దశలో చేసిన పాపాలు కూడా లోక పాపాలే. ఆ పాపాలనన్నింటిని యేసు తన మీదికి తీసుకొన్నాడని రాయబడివుంది. కాగా, ‘‘మన పాపాలన్నీ యేసుమీదికి వెళ్లాయి మరి మనలో యింకా పాపం వుందా? లేదు. మనలో యింకా పాపం మిగిలి లేదు!’’

యేసు యోహాను వలన బాప్తిస్మం పొందాడు గనుక ‘‘ఇదిగో లోక పాపమును మోసికొనిపోవు దేవుని గొర్రె పిల్ల” అని బాప్తిస్మమిచ్చు యోహాను సాక్ష్యం చెప్పాడు (యోహాను 1:29)

ప్రతి ఒక్కరు, మానవజాతి ప్రారంభం నుండి అంతం వరకు ఎవరు జీవించారో, ఇకముందు జీవించబోతున్నారో వారందరి పాపాలను యేసు తన మీదికి తీసుకొన్నాడు. ఎవరైనా ఎప్పుడైనా తన జీవితకాలమంతటిలో చేసిన, చేయబోవు పాపాలను, ప్రతి ఒక్కరి పిల్లల పాపాలను కూడా ఆయన తన మీదికి తీసుకొన్నాడు. ఈ లోకం ఎన్ని వేల లేక లక్షల సంవత్సరాలు కొనసాగినా అంత కాలంలోని ప్రజలందరిపాపాలను మన ప్రభువు తన బాప్తిస్మంతో తన మీదికి తీసుకొన్నాడు. వాటిని తన భుజస్కందాల మీద సిలువ వరకు మోసుకొని వెళ్లాడు. దానిపై సిలువ వేయబడ్డాడు. దాని వలన మన కోసం, మనకు బదులుగా ఆ పాపతీర్పు శిక్షను తాను పొందాడు. ఇది మనం తెలుసుకొన్న సత్యం.

తిరిగి పుట్టిన వారిగా మనం యేసు మృతులలో నుండి సజీవునిగా లేచాడు, మనకు రక్షకుడైనాడు అని మనం నమ్ముతున్నాం. గనుక మన ప్రశ్నలన్నిటికి జవాబు దొరికినట్టే అని తెలుసుకొంటున్నాం.

అలా ఆయన పొందని బాప్తిస్మం, సిలువలో కార్చిన రక్తం వలన మన ప్రభువు మన పాపాల విషయంలో శ్రద్ధ తీసుకొన్నాడు. ఇందుకే ప్రత్యక్ష గుడారపు ఆవరణ ద్వారానికి వేసిన నీల ధూమ్ర రక్తవర్ణాల దారం, పేనిన సన్నని నారను గూర్చి బైబిలు వివరిస్తోంది. అందుకనే యేసు నీటి ద్వారానే గాక నీరు, రక్తం ద్వారా మన దగ్గరకు వచ్చాడని యోహాను 5:4-6 చెబుతోంది. ‘‘కాగా, మన రక్షకుడైన యేసు బాప్తిస్మాన్ని పొందుట వలన దేవుని నీతి యావత్తును నెరవేర్చాడు. ఇది సత్యం అని బైబిలు చెబుతోంది. క్రైస్తవ నాయకులకు ఈ సత్యం తెలియదు గనుక దీనిని వారు మనకు బోధించారు.’’

నీలధూమ్ర రక్త వర్ణాల దారం, పేనిన సన్నని నార అనే దేవుని సత్యం మనం పాపం లేని వారమని చెప్పినప్పుడే నిజంగా మనం పాపంలేని వారమవుతాం. మరో ఆత్మ రక్షణను ఎవరూ ఆమోదించరు. మనం చాలా మంచి క్రైస్తవులమని యితరులు మనలను గూర్చి చెప్పినా, మన పాపం నుండి రక్షణ కలుగుతుందా? ప్రజలు మనలను అంగీకరించినప్పుడు గాక, నీలధూమ్ర రక్తవర్ణాల దారం, పేనిన సన్నని నారతో క్రీస్తు మన పాపాలన్నీ పోయేట్టు చేశాడని దేవుని వాక్యం మనతో చెప్పినప్పుడు మనం పాపంలేని వారిగా వుంటాం.

యేసు నా పాపాలనే కాదు, మీ పాపాలను కూడా పోయేట్టు చేశాడని దేవుని వాక్యం మనకు తెలియజేస్తోంది. మెస్సీయ అయిన యేసుక్రీస్తు మానవులందరి పాపాలను పొగొట్టాడు అని మనం నమ్మితేనే మనం పాపాల క్షమాపణను పొందుతాం. నీరు, ఆత్మల ద్వారా పాప విడుదల పొందినప్పుడే మనం ప్రత్యక్షగుడారపు ద్వారంలో ప్రవేశించగలం.పరిపూర్ణ విశ్వాసం మంటే ఏది?


ప్రత్యక్షగుడారపు ఆవరణ ద్వారం నీలధూమ్ర రక్తవర్ణాల దారం, పేనిన సన్ననినారతో నేశారు. మన ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. మన పాపాల నుండి మనలను రక్షించాడు అన్న నమ్మకం గల పరిపూర్ణ విశ్వాసం ప్రతి ఒక్కరికీ వుండాలి. ప్రభువు మానవునిగా ఈ లోకానికి వచ్చాడు, యోహాను వలన బాప్తిస్మం పొందాడు, సిలువ మీద మరణించాడు. మృతులల్లో నుండి సజీవునిగా లేచాడు, మనకు రక్షకుడైనాడు అని మనం నమ్మినప్పుడే మనం దేవుని పిల్లలమవుతాం. మన క్రియలు కొంచెమైనా, మన శరీరం అయోగ్యమైనదైనా, నీలధూమ్ర రక్తవర్ణాల దారం, పేనిన సన్నని నారను హృదయపూర్వకంగా నమ్ముట వలన మనం పాపం లేనివారమవుతాం. కనుక విశ్వాసం వల్లనే మనం నీతిమంతులమవ్వడం సాధ్యం. నీలధూమ్ర రక్తవర్ణాల దారం, పేనిన సన్నని నారలో ప్రత్యక్షపరచబడిన రక్షణను నమ్మినప్పుడే మనం దేవుని నీతిని ధరించుకోగలం. సూక్ష్మంగా చెప్పుకొంటే, నీరు, ఆత్మల సువార్తను నమ్ముట వలన మనం దేవుని పిల్లలమవుతాం.

మీలో కొందరు యిప్పటికి పూర్తిగా అర్థం చేసుకోలేకపోయి వుంటారు. అలాంటి వారు ఈ పుస్తకాన్ని బాగా చదువుతూ, దేవుని సంఘారాధనలో పాల్గొనండి. ఇప్పటి వరకు మనం ప్రత్యక్షపు గుడారాన్ని గూర్చిన సాధారణ విషయాలను గూర్చే చర్చించాం. కాని దీని గూర్చిన పూర్తి వివరణను చదవడం మీరు మొదలుపెడితే ప్రత్యక్షగుడారాన్ని గూర్చి పూర్తిగా అర్ధం చేసుకోగలుగుతారు. ఒక చిన్న పిల్లవాడు కూడా అర్థం చేసుకోగలిగనంత సులభంగా వుంటుంది.

యేసును గూర్చిన మీ అసంపూర్ణ అవగాహనపై మీ విశ్వాసం ఆధారపడినదైతే మీరు ఎంతకాలం యేసును నమ్మినా ఎన్నటికి మీ పాపాల నుండి రక్షణ పొందలేరు. వారిలో పాపం ప్రతిరోజు యింకా వుంటుంది. ‘‘ధర్మశాస్త్రము ఉగ్రతను పుట్టించును” గనుక (రోమా4:15)

ప్రతిరోజు మొర్రపెట్టు కొంటున్నా వారి పాపాల శాపం నుండి వారు తప్పించుకోలేరు. పరిస్థితులు వారికి అనుకూలంగా వున్నప్పుడు దేవుడు తమకు సహాయం చేస్తున్నాడని వారనుకొంటారు. పరిస్థితులు కొంచెం అనుకూలించక పోయినా, ‘‘నేను దశమభాగం యివ్వనందుకు యిలా జరిగిందా? లేకపోయిన ఆదివారం నేను ఆరాధనకు హాజరుకానందుకు యిలా జరిగిందా? నేను పాపం చేసి, దేవునికి సరిగా సేవ చేయనందు వలన జరిగినదా? నా పాపాల కోసం దేవుడు నన్ను శిక్షిస్తున్నాడు” అని వారు ఆశ్చర్యపోతారు. అలా వారు ధర్మశాస్త్ర నియమంలోనే అంతరించిపోతారు. పరిపూర్ణమైన విశ్వాసాన్ని కలిగి వుండాలంటే, నీలధూమ్ర రక్తవర్ణాల దారం, పేనిన సన్నని నార ద్వారా మన దగ్గరకు వచ్చిన యేసుక్రీస్తు చేసిన నాలుగు పరిచర్యలను తెలుసుకొని, దానిని నమ్మాలి. యేసుక్రీస్తు యిచ్చిన సత్యాన్ని మనం తెలుసుకోవాలి. నాలుగు విధాలైన ఈ సత్యాన్ని గూర్చి స్పష్టమైన అవగాహన కలిగి, దానిని నమ్మినప్పుడు అది దేవుని ముందు పరిపూర్ణమైన విశ్వాసం అనిపించుకొంటుంది. అప్పుడు మనం నిజంగా పరిపూర్ణులైన దేవుని పిల్లలమవుతాం. యేసుచేసిన ఈ నాలుగు పరిచర్యలను నమ్మి మనం పాపరహితులం అయ్యాం గనుక పాపదాస్యం నుండి మనలను మనం స్వతంత్రులనుగా చేసుకోవడానికి శ్రమపడకుండానే పాపం లేని నీతిమంతులంగా వుండగలం. మనం పాపంలేని విశ్వాసులం. మన స్వంత విగ్రహాన్ని వినియోగించకుండానే మన మంచి పనులు లేకుండానే, లేక ప్రయత్నించకుండానే మన పాపాలనన్ని కడిగి వేయబడిన దేవుని పరిపూర్ణ పిల్లలం.

ఈ సత్యాన్ని నమ్ముట వలన తన తల్లిదండ్రుల కాపుదలతో ప్రశాంతంగా ఆడుకొంటున్న పసిపాపలా, తండ్రియైన దేవుని కరుణా దృష్టిలో జనహృదయాలు శాంతి సమాధానలతో వుంటాయి. విూ క్రియలు అసంపూర్ణమైనవైనా, ప్రభువు కార్యాలను నమ్మినప్పుడు, మీరెంత అసంపూర్ణులైనా మన ప్రభువు ప్రేమను అంతగా అనుభవిస్తారు.

ఇంకా నీలధూమ్ర రక్తవర్ణాల దారం, పేనిన సన్ననినారను నమ్మలేని విశ్వాసంతో విూ పాపాల నుండి విమోచన పొందాలని మొరపెడతున్నారా? ఈ సత్యం తెలిసిన వారు తమ పాపక్షమాపణ కొరకు మొరపెట్టనవసరం లేదు. దీనిని నమ్మితే చాలు. నీరు, రక్తం, ఆత్మల ద్వారా మన దగ్గరకు వచ్చిన యేసుక్రీస్తును నిజంగా తెలుసుకొని, నమ్మినవారు వారి విశ్వాసంతో దేవుని పిల్లలమైనారు. వారి బాహ్య క్రియలతో గాక మొదటిగా వారి విశ్వాసంతో దేవుని ప్రేమించుట ద్వారా ఆయన సేవచేస్తారు. దేవుని మనం నమ్ముతున్నాం గనుక ఆయన తన మనకనుగ్రహించి, మనతో ఆయన నడుస్తాడు. మనం ఆయనను నమ్ముతున్నాం గనుక ఆయన మనకు సహాయం చేస్తాడు. తన బాప్తిస్మాన్ని రక్తం ద్వారా యేసు మనలను రక్షించాడని మనం విశ్వసిస్తున్నాం గనుక ఆయన నీతిమంతమైన కార్యాలు చేసే ఆయన సేవకులమైనాం.

దేవుడు నీలధూమ్ర రక్తవర్ణాలదారం, పేనిన సన్నని నారతో నేసి తన ప్రత్యక్షగుడారపు బాహ్య ద్వారాన్ని రక్షణ ద్వారంగా చేశాడన్న సత్యాన్ని మనం తెలుసుకొన్నాం గనుక మనకు పాపక్షమాపణ కలిగించి, రక్షణను అనుగ్రహించాడు. యేసు నీరు, రక్తం, ఆత్మల ద్వారా మన దగ్గరకు వచ్చి పాత నిబంధన ప్రత్యక్ష గుడారపు ఆవరణ ద్వారాన్ని నీలధూమ్ర రక్తవర్ణాల దారం, పేనిన సన్నని నారతో నేసి మన పాపాల నుండి మనలను రక్షించాడు. మన పాపరక్షణకు మన ప్రభువు ద్వారం అయినాడు. కనుక మన పాపాల నుండి నిజంగా, వాస్తవంగా మనలను రక్షించిన మెస్సీయ నాలుగు పరిచర్యలను మనం నమ్మాలి, మళ్ళీ మళ్ళీ నమ్ముతూనే వుండాలి.ప్రత్యక్ష గుడారపు ఆవరణ ద్వారపు నీలిదారం ప్రత్యక్ష పరుస్తున్న నిజమైన అంశం యెహాను నుండి యేసుపొందిన బాప్తిస్మమే.


మత్తయి 3:13-17ను మరోసారి చదువుదాం. ‘‘ఆ సమయమున యోహాను చేత బాప్తిస్మము పొందుటకు యేసు గలిలయ నుండి యొర్దాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చెను. అందుకు యోహాను - నేను నీ చేత బాప్తిస్మము పొందవలసిన వాడనై వుండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా? అని ఆయనను నివారింపజూచెను గాని యేసు "ఇప్పటికి కానిమ్ము, నీతియావత్తు ఈలాగు నెరవేర్చుట మనకు తగియున్నదని అతనికి వుత్తరమిచ్చెను. గనుక అతడాలాగు కానిచ్చెను. యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లలలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురమువలె దిగి తన విూదికి వచ్చుట చూచెను. మరియు "ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు ఈయన యందు నేనానందించుచున్నానని యొక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. ‘‘ఇది జరిగిన సమయానికి, యేసు కన్యయైన మరియకు పుట్టి ముప్పయి సంవత్సరాలైంది.’’ ‘‘ఆ సమయమున” అన్నపదం యిక్కడ బాప్తిస్మమిచ్చు యోహాను, యేసు యిద్దరూ ముప్పయి సంవత్సరాల వారని తెలియజేస్తోంది.

బాప్తిస్మమిచ్చు యోహాను యేసు కంటే ఆరు నెలలు ముందు పుట్టాడు. ఆయన ఈ భూలోక మానవాళి ప్రతినిధిగా వారికి పశ్చాత్తాప బాప్తిస్మాన్ని యిస్తున్నాడు. (మత్తయి 3:11, 11:11). యేసు ముప్పయి సంవత్సరాల వాడైనప్పుడు యొర్దాను నది దగ్గర ప్రజలకు బాప్తిస్మమిస్తున్న యోహాను దగ్గరకు వచ్చాడు తాను బాప్తిస్మాన్ని పొందడానికి. కాని ‘‘నేను నీ చేత బాప్తిస్మము పొందవలసిన వాడనై వుండగా నీవు నాయొద్దకు వచ్చుచున్నావా?’’ అని అంటూ ఆయన్ను నివారింపజూశాడు. అందుకు యేసు ‘‘ఇప్పటికి కానిమ్ము నీతి యావత్తు ఈలాగు నెరవేర్చుట మనకు తగియున్నది’’అని అన్నాడు. సరేనని యోహాను యేసుకు బాప్తిస్మమిచ్చాడు. యేసుకు బాప్తిస్మమివ్వగానే, ఆకాశం తెరవబడి ‘‘ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను” అని స్వరం వినిపించినందున లేఖనం కూడా వివరిస్తోంది.

తానెందుకు బాప్తిస్మం తీసుకొన్నాడో మత్తయి 3:15లో యేసు కారణం చెప్పాడు. యోహాను వలన ఈ సత్యం ప్రత్యక్షగుడారపు నీలం దారాన్ని గూర్చి వివరిస్తోంది. ‘‘ఇప్పటికి కానిమ్ము నీతి యావత్తు ఈలాగు నెరవేర్చుట మనకు తగియున్నది”. యోహాను వలన యేసు బాప్తిస్మం తీసుకొన్నవుద్దేశం ఏమిటంటే ప్రత్యక్ష గుడారపు నీలిధూమ్ర రక్తవర్ణాల దారంలో ప్రత్యక్షపరచబడిన ఆయనకార్యాల ద్వారా పాపాత్ముల అక్రమాలను క్షమించడమే అంటే ‘‘నీతియావత్తు ఈలాగు నెరవేర్చుట మనకు (వారిద్దరికి) తగియున్నది” అని భావం.

దేవుని నీతిమంతమైన ప్రేమ, పాపాత్ముల రక్షణ అనే తన పనిని నెరవేర్చటకే బాప్తిస్మమిచ్చు యోహాను వలన యేసుక్రీస్తు ప్రతి ఒక్కరి పాపాలను తన విూదికి తీసుకొన్నాడు. యోహాను 3:16లో వివరించినట్టు : ‘‘దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.’’ మన పాపాల కోసం శిక్ష అనుభవించకుండునట్లు లోక పాపాల నుండి మనలను రక్షించడానికి యేసు బాప్తిస్మాన్ని తీసుకొన్నాడు. ఇందుకోసమే యేసు దేవుని నీతి అంతటినీ, మానవాళి పాపాలనన్నింటిని యోహాను వలన పొందిన బాప్తిస్మం ద్వారా తన విూదికి తీసుకొన్నాడు. అలా ‘‘నీతియావత్తును ఈలాగు నెరవేర్చుట వారికి తగియున్నది.’’

“దేవుని నీతియావత్తు” అంటే ఏమిటి? యేసుతండ్రి యావత్తును నెరవేర్చడానికేనని యోహాను వలన బాప్తిస్మం తీసుకొన్నాడని పైన చెప్పుకొన్న లేఖన భాగం వివరిస్తోంది.

దేవుని ‘‘నీతియావత్తు” అంటే అసలు ఏమిటో యిక్కడ మనం తెలుసుకోవలసిన అవసరం వుంది. ‘‘నీతి యావత్తు’’ అంటే యేసు యోహాను వలన బాప్తిస్మం తీసుకోవడం వలన మానవాళి అందరి పాపాన్ని తనవిూదికి తీసుకొన్నాడు అన్న సత్యాన్ని వివరిస్తోంది. మానవాళి పాపాలనన్నింటిని ఒకేసారి తుడిచివేయడమే ఆయన పుట్టుక వుద్దేశం గనుక ఆయన తన బాప్తిస్మంతో మానవుల పాపాలనన్నింటిని ఒకేసారి తన విూదికి తీసుకొనడం నీతిమంతమైన దని స్పష్టమవుతుంది. దేవుని నీతియావత్తు నెరవేర్చుట అంటే లోకపాపాలన న్నింటిని పోగొట్టడానికి అనగా రక్షణకార్యాన్ని నెరవేర్చుట అని అర్థం.

దేవుడు మన పాపాల నుండి మనలను విడిపించడానికి అవశ్యమైన పద్ధతి. మన పాపాలను తుడిచివేయాలని దేవుడు పాత నిబంధనలో ఏర్పాటుచేశాడు. మానవజాతి ప్రతినిధిగా యోహానును లేపాడు. తన కుమారుడైన యేసుక్రీస్తుకు బాప్తిస్మమిచ్చేట్టు చేసి దాని ద్వార మన పాపాలన్నింటిని తన కుమారుని విూదికి పోయేట్టు చేశాడు. ఇది దేవుని కృపాకార్యం తప్ప మరొకటి కాదు. దేవుడు మనలను ఎంతో ప్రేమించాడు. కనుక మన పాపాలను తుడిచి వేయాలని మనలను తన పిల్లలుగా చేయాలనే నీతికార్యాన్ని నెరవేర్చడానికి మన పాపాలన్నీపొంది ఒడ్డు విూదికి రాగానే ‘‘ఈయనే నా ప్రియా కుమారుడు ఈయనందు నేనాందించుచున్నాను” అని చెప్పాడు. మరోవిధంగా చెప్పుకొంటే ‘‘నా కుమారుడు తన బాప్తిస్మం ద్వారా విూ పాపాల నన్నింటిని తన విూదికి తీసుకొన్నాడు” అని తండ్రియైన దేవుడు చెప్పాడు.

మరో మాటల్లో చెప్పుకొంటే, యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. యెహాను వలన బాప్తిస్మమనే తగిన విధానంలో మన పాపాలనన్నింటిని ఒకేసారి భరించి, మన పాపాలను పొగొట్టడానికి బలిపశువు (దేవుని గొఱ్ఱె పిల్ల) అయినాడు.

మనకోసం దేవుని కుమారుడు బాప్తిస్మం పొంది మన పాపాలనన్నింటిని తన విూదికి తీసుకోడానికి అంగీకరించాడు గనుక ఈ పాపాలను ఆయన సిలువను మోసికొని పోయాడు. సిలువ వేయబడ్డాడు. విలువైన తన రక్తాన్ని చిందించాడు. దాని వలన మనందరికి రక్షకుడైనాడు. యేసు మనలని రక్షించాడని మనం నమ్మాలి. అంటే మన పాపాలను తన విూదికి తీసుకోడానికి బాప్తిస్మాన్ని పొందాడు. తనను తాను సిలువలో బలిగా అర్పించుకొని తన రక్తాన్ని కార్చాడు. మృతులలో నుండి సజీవునిగా లేచాడు. మృతులలోనుండి లేచిన తర్వాత, తన రక్షణకార్యాలను పూర్తిచేసి, ఇప్పుడు దేవుని సింహాసనానికి కుడి పార్శ్వమున కూర్చొనివున్నాడు. ఆయన సమయం వచ్చినప్పుడు ఆయన తప్పక తిరిగి వస్తాడు. ఇదే నీరు, ఆత్మల సువార్త సత్యం, రక్షణలోని ముఖ్యాంశం.

ప్రత్యక్షగుడారపు ఆవరణ ద్వారాన్ని గూర్చి నిర్గమ 27:16 యిలా వివరిస్తోంది. ‘‘ఆవరణపు ద్వారమునకు నీలధూమ్ర రక్తవర్ణములు గల యిరువది మూరల తెరయుండవలెను. అది పేనిన సన్ననారతో చిత్రకారుని పనిగా వుండవలెను.’’ కనుక ప్రత్యక్షగుడారపు ఆవరణ ద్వారం నీలధూమ్రరక్తవర్ణాల దారం, పేనిన సన్ననినారతో నేసినది. ఇది మనం రక్షణ వరాన్ని నమ్ముట వలన పరలోక రాజ్యంలో ప్రవేశిస్తామని తెలియజేస్తోంది.

నీలందారం ప్రత్యక్షగుడారపు ఆవరణ ద్వారానికి నేసిన ఈ నీలం దారం, యేసు ఈ లోకానికి వచ్చి బాప్తిస్మం తీసుకొన్నప్పుడు మన పాపాలన్నీ ఆయన విూదికి వెళ్ళాయన్న సత్యాన్ని వివరిస్తోంది.

ధూమ్రవర్ణ దారం - మనపాపాల కోసం బాప్తిస్మం తీసుకొన్న యేసుక్రీస్తే, ఈ సకల సృష్టిని, దానిలోని సమస్తాన్ని సృజించిన సృష్టికర్త. నీకు, నాకు దేవుడు అని ఈ ధూమ్ర వర్ణదారం తెలియజేస్తుంది. ధూమ్ర వర్ణం రాజుల రంగు (యోహాను 19:2-3).కనుక యేసుక్రీస్తు రాజుల రాజు, అందరికి ప్రభువు అని యిది వివరిస్తోంది. ‘‘క్రీస్తు” అన్న పదానికి ‘‘అభిషిక్తుడు” అని అర్థం. రాజులు, యాజకులు, ప్రవక్తలనే అభిషేకిస్తారు. యేసుక్రీస్తు మానవునిగా ఈ లోకానికి వచ్చినా, ఆయన నిజమైన గుర్తింపు రాజుల రాజు యేసు ప్రభువు. ఈ విశ్వాన్ని సృజించిన సృష్టికర్త. యేసు సర్వశక్తిమంతుడైన దేవుడు, తండ్రియైన దేవుని అద్వితీయ కుమారుడు. రక్తవర్ణదారం - ప్రత్యక్షగుడార ద్వారానికి నేసిన దారం ఇది.

ఇది రాజుల రాజైన యేసు మానవునిగా ఈ లోకానికి వచ్చి, తన బాప్తిస్మంతో మన పాపాలను తన విూదికి తీసుకొని, సిలువవేయబడి ఆ సిలువలో తన రక్తాన్ని కార్చాడని వివరిస్తోంది. యేసుక్రీస్తు తన బాప్తిస్మంతో మన పాపాలను ఆయన విూదకు తీసుకుని, విలువైన తన రక్తాన్ని కార్చి, మనకు బదులుగా తాను బలియై మన పాపాలకు మూల్యాన్ని చెల్లించాడు. రక్తవర్ణదారం యేసుక్రీస్తు బలియర్పణలో కార్చిన రక్తాన్ని ప్రత్యక్షపరుస్తోంది.

చివరిగా, పేనిన సన్నని నార - పాతనిబంధనలోని దేవుని వాక్యాన్ని వివరిస్తోంది. బైబిలు పాత, కొత్త నిబంధనలోని వాక్యం ద్వారా మన రక్షణను గూర్చి తెలియజేస్తుంది. పాతనిబంధనలో పాపుల రక్షకునిగా మన దగ్గరకు వస్తానని దేవుడు వాగ్ధానం చేశాడు. ఆయన వాగ్ధానం చేసినట్టే కొత్త నిబంధనలో దేవుడు యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చి, బాప్తిస్మాన్ని పొంది, సిలువలో తనరక్తాన్ని కార్చాడు. అంటే మన పాపాల నిమిత్తం తనను తాను బలియర్పణగా అర్పించుకొన్నాడు.

నీలిదారంతో - మన పాపాల నుండి మనలను రక్షించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. తన బాప్తిస్మంతో మన పాపాలను ఆయన విూదికి తీసుకొన్నాడు అని దేవుడు ప్రత్యక్షపరిచాడు. బాప్తిస్మం పొందిన ఈయన నిజంగా దేవుడు అని ధూమ్రవర్ణ దారంతో ప్రత్యక్షపరిచాడు. ఇక రక్తవర్ణల దారంలో ఆయన రక్షకునిగా ఈ లోకానికి వచ్చి, బాప్తిస్మాన్ని పొంది, లోక పాపాలను సిలువకు మోసుకొనిపోయి తన విలువైన రక్తాన్ని చిందించి మన పాపాల నుండి మనలను రక్షించాడని ప్రత్యక్షపరిచాడు.

ఈ రక్షణ పాతనిబంధనలోని బైబిలు వాగ్ధానం నుండి వచ్చింది. అంటే యిది పేనినసన్నని నార వలన ప్రత్యక్షపరచబడినది. ఇందుకనే ప్రత్యక్ష గుడారపు ఆవరణ ద్వారం నీలధూమ్ర రక్తవర్ణాల దారం, పేనిన సన్నని నారతో నేయబడినది. మన విూ ప్రత్యక్ష గుడారపు ఆవరణ ద్వారాన్ని చూడగానే మనపాపాలనుండి దేవుడు మననెలా రక్షించి, తన ప్రజలుగా చేసుకొన్నాడో అది మనకు ప్రత్యక్షపరుస్తుంది. కనుక ప్రత్యక్షగుడారపు ఆవరణ ద్వారానికి వాడిన నాలుగురంగులు ప్రత్యక్షపరిచే ఆధ్యాత్మిక అర్ధాన్ని మనం నమ్మాలి.

ప్రత్యక్ష గుడారపు ఆవరణ ద్వారం రంగులో బైబిలు మొదట నీలం దారాన్నిగూర్చి చెబుతోంది. మనం మామూలుగా ధూమ్ర నీలి రక్తవర్ణాల క్రమంలో ఆలోచిస్తాం. కాని బైబిలు నీల ధూమ్ర రక్తవర్ణాల క్రమంలో వివరిస్తుంది. యేసుక్రీస్తు మన రక్షకునిగా ఈ లోకానికి వచ్చినా, ఆయన యోహాను వలన బాప్తిస్మం పొందక పోయినట్లయితే మన పాపాల నుండి మనం శుద్ధులమయ్యే వారం కాదు. ఇందుకనే యేసు ఈ లోకపాపాల నుండి మనలను రక్షించడానికి తండ్రి చిత్తానికి విధేయుడై యోహాను వలన బాప్తిస్మాన్ని పొంది సిలువ వేయబడ్డాడు.

యేసు విశ్వాసాన్ని దానిలోని సమస్తాన్ని సృజించిన ప్రభువు. ఆయన మన దేవుడు. మనవిూ లోకంలో పుట్టేట్టుగా చేసి మనకు నూతన జీవితమిచ్చి, మన జీవితాలను పాలిస్తున్న దేవుడు ఆయనే. మన పాపాల నుండి మనలను ఆయనే రక్షించాలి. అందుకని మానవాళి అంతటికి ప్రతినిధియైన యోహానుచేత బాప్తిస్మాన్ని పొంది, మన పాపాలనన్నింటిని తన విూదికి తీసుకొన్నాడు. మనకు నిజమైన రక్షకుడైనాడు.

మన పాపాల నుండి మనలను విడిపించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. మన పాపాలనన్నింటిని తనపైకి తీసుకోడానికి ఆయన బాప్తిస్మాన్ని తీసుకొన్నాడు. ఆయన మొదటిగా బాప్తిస్మం తీసుకొనకపోతే క్రీస్తు ఎన్నటికి సిలువ శిక్షను పొందే అవకాశం లేదు. యేసుక్రీస్తు సరిగ్గా మనలను ఎలా రక్షించాడో ఆ విషయాన్ని ప్రత్యక్ష గుడారపు ఆవరణ ద్వారం మనకు స్పష్టంగా తెలియజేస్తోంది. అదే స్థిరమైన రక్షణ విధానం. యేసుక్రీస్తు ఈ లోకానికి రావాలని, యోహాను వలన తాను పొందే బాప్తిస్మం ద్వారా మానవుల పాపాలనన్నింటిని ఆయన విూదికి తీసుకోవాలి. సిలువ వేయబడాలి అని ప్రత్యక్ష గుడారపు ఆవరణ ద్వారపు రంగు మనకు తెలియజేస్తున్నాయి. అంటే మన పాపాల విషయంలో ఆయనే శ్రద్ధ వహించాలని ఆ రంగులు తెలియజేస్తున్నాయి. యేసు బాప్తిస్మాన్ని పొందినప్పుడు పరలోకద్వారం తెరచుకొన్నది. ‘‘ఈయనే నా ప్రియకుమారుడు ఈయన యందు నేను ఆనందించుచున్నాను” అని తండ్రియైన దేవుడు చెప్పాడు. యేసుక్రీస్తు మన మెస్సీయ, మన రక్షకుడు అంతే కాదు తన మాట ద్వారా ఈ సమస్త సృష్టిని చేసిన సృష్టికర్తయైన దేవుని కుమారుడు కూడా. యేసుక్రీస్తు పరిశుద్ధుడైన దేవునిగా మనకు నిజమైన రక్షకునిగా అవడానికి ఆయన బాప్తిస్మాన్ని పొందాలి.

సమస్త సృష్టి చేసి, దానిని పాలిస్తున్న యేసుక్రీస్తు మనపాపాలకు స్పష్టమైన రక్షణను చూపించాడు. యేసుక్రీస్తు మన పాపాలను కడిగివేయడానికి మానవునిగా ఈ లోకానికి వచ్చాడు. తన బాప్తిస్మంతో లోక పాపాలనన్నింటిని తన విూదికి తీసుకొన్నాడు. మన జీవన్మరణాలను పాలించే సృష్టికర్తయైన యేసుక్రీస్తే మన పితరులను మానవజాతినంతటిని ఈ లోకానికి తీసుకొని వచ్చాడు. ఆయనే నీలధూమ్ర రక్తవర్ణాల దారం, పేనిన సన్ననినారకు తాత్పర్యం.

పాపాత్ముల పాపపరిహార బలియర్పణగా దేవుడు తానే ఈ లోకానికి వచ్చాడు. మనలను రక్షించడానికి యేసే సర్వశక్తుడు, కృపాభరితుడైన దేవుడ. తన బాప్తిస్మంతో సమస్త పాపాలను తన మీదికి తీసుకొన్నాడు. దేవుని నీతియావత్తును నెరవేర్చాడు. అందుకనే ఆ పాపాలనన్నింటిని సిలువకు మోసుకొని వెళ్ళాడు. సిలువ వేయబడ్డాడు. విలువైన తనరక్తాన్ని కార్చాడు. మన పాపాలనన్నింటిని కడిగివేయడానికి యేసుక్రీస్తు మన బలియర్పణగా అయ్యాడని ప్రత్యక్షగుడారపు ఆవరణ ద్వారం ప్రత్యక్షపరుస్తోంది.

ఇందు నిమిత్తమే ప్రత్యక్ష గుడారపు ఆవరణ ద్వారమే గాక పరిశుద్ధస్థలం, అతిపరిశుద్ధ స్థలం ద్వారాలు, దేవుని గృహకప్పు అన్నీ నీల ధూమ్ర రక్తవర్ణాల దారం, పేనిన సన్నని నారతో నేయబడ్డాయి. విూ కొరకు, నా కొరకు యేసుక్రీస్తు బాప్తిస్మం తీసుకొన్నా దానిని నమ్మిన మన పాపాలన్నీ కడిగివేయబడ్డాయి. నీతియావత్తును నెరవేర్చడానికి యేసుక్రీస్తు బాప్తిస్మాన్ని తీసుకొన్నాడు. మానవుల పాపాలనన్నింటిని తానుగా తన పైకి తీసుకొన్నాడు గనుక ఈ నీతిని నెరవేర్చాడు. కనుక ఆయన బాప్తిస్మం తీసుకొన్నప్పుడు మన పాపాలు కూడా ఆయన విూదికి వెళ్ళాయని మనం నమ్మాలి.

అయినప్పటికి యేసుక్రీస్తు నామమాత్రంగా, లక్ష్యం లేకుండా నమ్మిన క్రైస్తవులనేకమంది వున్నారు. నియమంలేని వారి మత నమ్మకాన్ని వారు విడిచిపెట్టకుండా ఆది నుండి మూర్ఖంగా దేవుని సవాలు చేస్తూనే వున్నారు. ఆయన మనకనుగ్రహించిన రక్షణననుసరించి మనం ఆయనను నమ్మాలి. ‘‘నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును” అని యేసుక్రీస్తు చెప్పాడు (యోహాను 14:6). ‘‘మిమ్మును పరలోకానికి నడిపే మార్గాన్ని నేను అని ఆయన చెబుతున్నాడు. నేనే కాపరిని, మార్గాన్ని సత్యాన్ని, మిమ్మును రక్షించే జీవము నేనే” అని ఆయన చెబుతున్నాడు. మనలను రక్షించుట వలన యేసుక్రీస్తు మన నూతన జీవితానికి ప్రభువైనాడు.

యేసును మనం నమ్మినప్పుడు ఆయన్ను మనం ఎలా అర్థం చేసుకోవాలి, నమ్మాలి?

ఆయన ఈ లోకానికి సరైన మార్గానవచ్చి మనలను రక్షించాడని నమ్ముట వల్లనే పాపాల నుండి మనం రక్షణ పొందగలం. ‘‘విశ్వాసం” లో ‘‘ఆధారపడివుండుట”, ‘‘దానినే పట్టుకొనిట వుండుట”, ‘‘అప్పగించుట” అన్న అర్ధాలు వున్నాయి. పెద్దవారు బాగా వృద్ధులై తాము జీవించలేనప్పుడు తమ పిల్లలపై ఆధారపడి వుంటారు. అలాగే మనంతట మనం మన పాపాలను పోగొట్టుకోలేం గనుక మనలను మనం దేవునికి అప్పగించుకొంటాం. మనం పాపాలు చేయకుండా వుండాలని ప్రయత్నించినా పాపం చేస్తూనే జీవిస్తూ వుంటాం. మన పాపాల నుండి రక్షించడానికి యేసు ఈ లోకానికి వచ్చాడు. ఆయన 30సం.ల వాడైనప్పుడు బాప్తిస్మమిచ్చు యెహాను వలన తీసుకున్నాడు. ఈ సత్యాన్ని మనమందరం నమ్మాలి. యేసు నీ, నా పాపాలనే గాక లోకపాపాలనన్నింటిని తన బాప్తిస్మంతో తన విూదికి తీసుకొన్నప్పుడు గతంలోను, వర్తమానంలోను, భావి కాలపు ప్రతిపాపాన్ని యేసుక్రీస్తు తన విూదికి తీసుకొన్నాడని మనం నమ్మాలి.

అయినా, లోకపాపాలేగాక, తమ స్వంత పాపాలను కూడా యేసు బాప్తిస్మం తీసుకొన్నప్పడు ఆయన విూదికి వెళ్ళాయన్న సత్యాన్ని చాలామంది నమ్మక, ఒక్క సిలువ రక్తంలోని నమ్మకంతోనే కొనసాగుతున్నారు. అందుకనే ప్రత్యక్ష గుడారపు ద్వారాలన్నీ నీలధూమ్ర రక్తవర్ణాల దారం, పేనిన సన్ననినారతో నేసినపని వారు చూస్తూ కూడా ఏది సరైన విశ్వాసమో వారు తెలుసుకొన లేకుండా వున్నారు.

మనలను రక్షించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయనొకేసారి కడిగివేసినట్టు ఆయన మనలను రక్షించలేదు. తన బాప్తిస్మంతో ఆయన మన పాపాలనన్నింటిని తనపైకి తీసుకొన్నాడు. విూరు నేను పూర్తిగా రక్షణ పొందునట్లు ఆయన సిలువశిక్షతో మన పాపాశిక్షను భరించాడు. ఇలా యేసుక్రీస్తు సమస్త మానవాళిని రక్షించాడు. అందుకనే ‘‘నాయొద్దకు వచ్చు వానిని నేనెంత మాత్రమును త్రోసివేయను” అని అన్నాడు యేసుక్రీస్తు (యోహాను 6:37).

కనుక మనం యేసును నమ్ముతున్నాం అని చెప్పినప్పుడు మనం ఆయన ప్రవర్తనను, లేక ఆయన సర్వజ్ఞతనే కాదు, యేసు వాస్తవంగా దేవుడని ఆయనే మానవునిగా ఈ లోకానికి వచ్చాడని, మన కోసం సిలువ విూద బలియాగం చేశాడని నమ్ముట వలన మనం రక్షణ పొందామని నమ్ముతున్నాం. మేము యేసును నమ్ముతున్నాం అని చెప్పినప్పుడు ప్రత్యక్షగుడారంలో ప్రత్యక్షపరచిన రక్షణను చూసినప్పుడు మనం ఎలాంటి విశ్వాసాన్ని ప్రకటించాలో అది స్పష్టంగా మనకు తేటపడుతుంది.

నేడు చాలామంది పాటలను పాడుకొంటూ క్రీస్తురక్తంలో మాత్రమే నమ్ముతూ, వారి స్వంత ఆసక్తితో ‘‘ప్రభువా, నేను నిన్ను నమ్ముతున్నాను” అని గుడ్డిగా చెబుతున్నారు. వారెంత గాఢంగా యేసును ప్రేమిస్తున్నా, కేవలం సిలువరక్తంలో నమ్మకముంచినంత కాలం వారు తమ పాపాల నుండి విడుదల పొందరు.

మనంతట మనం మన జీవితకాలంలో మన పాపాల నుండి విడుదల పొందలేం. గనుక మనకొక రక్షకుడు తప్పక అవసరం. ఆ రక్షకుడు యేసు తప్పమరెవరూ లేరు. నిన్ను నన్ను విడిపించడానికి వచ్చిన యేసుక్రీస్తు రక్షకుడు. రాజుల రాజు ఈ సకల ప్రపంచాన్ని, దానిలోని సమస్తాన్ని సృజించినవాడు. మన జీవితాలకు ప్రభువు. ఆయనీ లోకానికి వచ్చాడు. తన బాప్తిస్మంతో మన పాపాలన్నీ తన విూదికి తీసుకొన్నాడు. సిలువ విూద చనిపోయి మన పాపాలనన్నింటిని కడిగివేశాడు. తన బాప్తిస్మం సిలువలో మన పాపశిక్షను భరించిన ఈ యేసుక్రీస్తును నమ్ముట వలనే, ఆయన మనలను రక్షించాడు. మన రక్షకుడైనాడు. ఈ సత్యాన్నే ప్రత్యక్షగుడారం మనకు స్పష్టంగా తెలియజేస్తుంది.యేసుక్రీస్తునే నమ్మేవారు మతస్తులు మాత్రమే


ఈ రోజుల్లో చాలామంది తాము యేసుక్రీస్తు రక్తాన్ని నమ్ముట వల్లనే రక్షణ పొందుతామని చెబుతున్నారు. అలా చెప్పడంతో వారి శూన్యమైన మత విశ్వాసాన్ని ప్రదర్శించడం తప్ప అందులో నిజమైన విశ్వాసం లేదు. ‘‘నేను నా పశ్చాత్తాప ప్రార్థనలను చేసినప్పుడు” నా బిడ్డా, నేను నీ పాపాలను క్షమించాను” అని పరిశుద్ధాత్మ నా హృదయంలో చెబుతాడు నేనా మాటలు విన్నప్పుడు నేనెంతో కృతజ్ఞత కలిగి వుంటాను అని వారు చెబుతారు అలాంటి నమ్మకాలు వారి విశ్వాస సాక్ష్యాని వారు చెబుతారు.

కాని మన భావోద్రేకాల వలన మనకు రక్షణ కలుగదు. దానికంటే మన పూర్తి వ్యక్తిత్వ వికాసం ద్వారా, అంటే జ్ఞానం, భావోద్రేకం, ఉద్దేశం వలన రక్షణ పొందుతాం. మన దేవుడైన రక్షకుడు మనలను ఎలా రక్షించాడో మొదట తెలుసుకొని, తర్వాత దానిని నమ్ముట వలన మనం రక్షణ పొందుతాం. అయితే మతాల సంగతేమిటి? అవి ఏమటంటే మానవుల స్వంత ఆలోచన విూద మానవులు నిర్మించిన సంస్థలు మాత్రమే.

చాలాకాలం క్రితం మా కుటుంబంలో మా అమ్మే ప్రధానం. నేనామె వెంట వంటగదిలో ఆమె చుట్టూ తిరుగుతూ బైబిల్లోని యాకోబు వాళ్ల అమ్మను అడిగనట్టు ఏం సహాయం చేయమంటావో అని అడుగుతూ వుండేవాణ్ణి. మా అమ్మ వంటగదిలో వంట చేస్తూ వుండగా, నేను భోజనపు గదిలో బల్లను సిద్ధపరుస్తూ వుండేవాణ్ణి, మా అమ్మ, నేను మంచి జతపనివారం. మేం ప్రొద్దుట లేచి పొయ్యివెలిగించి, భోజన బల్లను సిద్ధంచేసి, అల్పాహారం అనంతరం నేలంతా ఊడ్చి శుభ్రం చేసి వాళ్ళం. ప్రొద్దుటే లేచి యిళ్లు వాకిళ్లు ఊడ్వడం పూర్తి చేసే వాళ్ళం.

ఆ రోజుల్లో యిది కొరియాలో విచిత్రం, లేక ప్రత్యేకమైనదేవిూ కాదు. అయితే అత్యాసక్తి కలిగించే విషయమేమటంటే వంటగది తుడిచే చీపురు మేమేది అడిగితే అయి యిచ్చే దేవతగా ఆకస్మాత్తుగా మారిపోయింది. అంటే ఈ అరిగిపోయిన చీపురును ఎవరు దేనికోసం ప్రార్థించినా అది యిచ్చే దేవతగా మారిపోయింది. ఇలాంటి అసందర్బలు మన జీవితాల్లో తరుచుగా జరుగుతూ వుంటాయి. ఇదేకాదు మా కుటుంబంలోను, ఇరుగుపొరుగు కుటుంబాల్లోనో ఏదైనా దురదృష్టం ఏర్పడినప్పుడు ఏదో మంత్రం వేయమని మాంత్రికుణ్ని పిలిపించే వాళ్ళం. ఆనాటి ప్రజల్లో వారి పూర్వికుల పేర్లు రాసివుండే కొండవిూద ఒక రాతి పలక విూద రాసివుంచే వారు. వారి దృష్టి యిదిగో యిలా యిల్లు ఊడ్చే చీపురు, లేక మరో వస్తువుల విూద పడితే అదొక దేవతగా మారిపోతుందన్న మూఢనమ్మకం ప్రజల్లో వుండేది.

ఈ రోజుల్లో ప్రజలు యిలాంటి అజ్ఞానంలో నుండి క్రమంగా బయటికి వచ్చారు. కాని ఆ రోజుల్లో ఎప్పుడైనా, ఏదైనా ఒక దేవతగా మారిపోవడం తరచుగా జరిగే సంఘటనే కనుక ఆ రోజుల్లో బాగా ముమ్మరంగా జరిగే వ్యాపారాల్లో ఈ మంత్రతంత్రాలు ఒకటి వారా తంత్రాలు చేసేటప్పుడు ఒకదాని కొకటి సంబంధం లేని మంత్రాల్లాంటివి ‘‘అబ్రకదబ్ర, అబ్రకదబ్ర, వెలుగు రావాలి, వెలుగు రావాలి, వెలుగు వచ్చినప్పుడు అన్నీ నావే. భక్తిలేనందు వల్ల గుమ్మడికాయ గొట్టం పగిలిపోయింది. అబ్రకదబ్ర, అబ్రకదబ్ర, అని వల్లించడం విన్న సందర్భాలు నాకింకా జ్ఞాపకం వున్నాయి. దాని అర్థం ఏమిటో నాకు ఇప్పటికీ తెలియదు.

ఇలాంటి మంత్రం వేయడం ఎవరింట్లో జరుగుతున్నా గ్రామంలోని ప్రతి ఒక్కరూ అది చూడ్డానికి అక్కడికి చేరుకొనేవారు. ఈ సంఘటన ఒక చచ్చిన తలలో మేకులు కొట్టడంతో పతాక సన్నివేశానికి చేరుకొనేది. ఇవి అర్ధరాత్రి తర్వాత తెల్లవారి వెలుగు వచ్చేంత వరకు కొనసాగేది. ఎన్ని మేకులు కొట్టాప్రజలు న్నది ఆ మంత్రగత్తె లేక మంత్రగాడు నిర్ణయించేవారు.

నాకున్న ఆ పాతస్నేహితుల్లో ఒకడు తనకు కన్యక అయిన ఆత్మ పూనేదని చెప్పేవాడు. తనను కన్య అయిన దయ్యం ఆవహించింది గనుక అది మిగతావాటి కంటే శక్తివంతమైంది గనుక, మిగతా దయ్యాలనన్నింటిని వెళ్ళగొడతాడనని చెప్పేవాడు. ఒక్కొక్కసారి అతిశక్తివంతమైన దయ్యాన్ని ఎదుర్కొన్నప్పుడు, కొన్నిసార్లు తానుకూడా దాన్ని వెళ్ళగొట్టడానికి ఎంతో కష్టపడేవాడు. అయినా చివరికి దాన్నేవాడు యిలాంటి రకరకాల దయ్యాలను వెళ్లగొడతానని చెప్పేవాడు. అతడెవరో కాదు అతడూ ఓ మంత్రగాడే.

అతడు మామూలప్పుడు యితరుల్లాగే వుండేవాడు. కాని ఎవరైనా యిలాంటివి చేయమని అడిగినప్పుడు, తన ప్రత్యేక దుస్తులు ధరించి అట్టహాసంతో పెద్ద ప్రదర్శనలా చేసేవాడు. దీనంతటికి కారణం ప్రజల్లో వున్న మూఢనమ్మకాలే. అందుకే వారీ పురాతన మూఢనమ్మకాలను అనుసరించేవారు. దేవుని వాక్యంతో పనిలేదు. ఇలాంటి అర్థంలేని, అవమానకరమైన నమ్మకాలతోనే వారు అంతరించిపోతారు.

ప్రజలు వారి స్వంతంగా తమ స్వంత మతాలను తయారు చేసుకొన్నారు. పై కథలోలా వారు తమ స్వంత దేవతలను వారే తయారుచేసుకొన్నారు. ప్రజల్లో యిలాంటి మనస్తత్వాలున్నాయి. క్రైస్తవుల్లో కూడా యేసుక్రీస్తు వారి నిమిత్తం సిలువ వేయబడ్డాడని వారికి చెప్పినప్పుడు వారు కూడా వారి స్వంత అభిప్రాయాలు, ఉద్రేకాలతో దీని గూర్చి ఆలోచించి, ఆయన్ను గుడ్డిగా నమ్ముతారు. ఇంకా యేసు దేవుని కుమారుడు. ఈ లోకాన్నంతటిని చేసిన సృష్టికర్త అని చెబితే వారాయన్ను ప్రేమిస్తారు. మళ్ళీ ఏ షరతు లేకుండానే ఆయన్ను నమ్ముతారు. ‘‘నేనే మార్గమును, సత్యమును, జీవమును. నా వలన తప్ప ఎవరునూ తండ్రి యొద్దకు రాలేరు” అని వినడానికెంతో యిష్టపడతారు. అయినా, ఏ షరతులు లేకుండానే, నిజమైన అవగాహన లేకుండానే ఆ మాటను నమ్ముతారు. దేవుని ప్రతిమాట తప్పులేనిది కనుక వారు సువార్తను మొదటిసారి విన్నప్పుడు కూడా వారు మేము యేసును ప్రేమిస్తున్నాం అనే అంటారు.

ఇలాంటి వారు యేసులో తమకు విశ్వాసముందని చెబుతున్నా వారి హృదయాల్లో యింకా పాపం అలాగే వుంది గనుక వారికి తీర్పు తీర్చడానికి యేసుక్రీస్తు వస్తాడు. నీరు, ఆత్మల సువార్తను నమ్మేవారిని తనతో తీసుకువెళ్ళడానికి కూడా ఆయన వస్తాడు. చాలామంది నీరు, ఆత్మల సువార్తను ఎరుగక, తమ స్వంత ఆలోచనల ప్రకారం యేసును నమ్మినవారు, వారి మత జీవితం మొదలైన పది సంవత్సరాల్లో కూడా ఆ సువార్తను తెలుసుకొన లేకపోతే వారు నిజంగా దేవుని ధర్మశాస్త్రం ప్రకారం జీవించని పాపాత్ములే.

నేను కూడా యిలాగే యేసును ప్రేమించాను. ఎప్పుడూ స్తుతిగీతాలు పాడుతూ వుండేవాణ్ణి. క్రీస్తును కలుసుకొన్నానన్న అమితానందాన్ని పొందేవాణ్ణి. కాని యేసును తెలుసుకొన్న తర్వాత, ధర్మశాస్త్రాన్ని తెలుసుకొన్నాను. అది తెలుసుకొన్న తర్వాత నా పాపాలను గురించి తెలుసుకొన్నాను. అవి తెలుసుకొన్న తర్వాత ఆ పాపాలకు నిత్యశిక్ష వుంటుందని తెలుసుకొన్నాను. దాని ఫలితంగా పాపశ్రమలు అనుసరించి వచ్చాయి.

ఈ పాపశ్రమలను పరిష్కరించడానికి నేనెంతో పట్టుదలతో పశ్చాత్తాపంతో ప్రార్థన చేశాను. అయినా అలాంటి విశ్వాసం తాము కోరుకునేవన్నీ దేవుడ దీవించాలన్న మూఢనమ్మకంతో చేసే ప్రార్థన వంటివే. దేవుని వాక్యంలో రాసివున్న ధర్మశాస్త్రాన్ని నేను తెలుసుకొన్న తర్వాత నా పాపాలను తెలుసుకొన్నాను. అప్పుడు నేను పశ్చాత్తాప ప్రార్థనలు చేయాలనుకొన్నాను. అలాంటి పశ్చాత్తాప ప్రార్థనలు నా ఉద్రేకంలో కొంత ఉపశమనాన్ని కలిగించాయి. అయినా నా మనస్సాక్షిలో యింకా పాపం మిగిలివున్నది. నా ప్రాణం యింకా పాపదాస్యంలో వుందని తెలుసుకొన్నప్పుడు నేను శ్రమలనుభవిస్తూనే వున్నాను.

ఈ విధంగా నేను నా పాపాలతో కట్టబడి వున్నాను. గనుక యేసును నమ్మి, ఆయన్ను ప్రేమించలేదు గాని, నేను యేసును నమ్మాను గనుక నా పాపాలను గురించి తెలుసుకోగలిగాను. అలా నా పాపాలను గూర్చి తెలుసుకొన్న తర్వాత శ్రమలు నాకు వచ్చినై. నేను యేసుని గూర్చి తెలుసుకోవలసిన దానికంటే చాలాముందే తెలుసుకొన్నాను అందుకే ఈ శ్రమలు అనుకొన్నాను. నా యౌవ్వన కాలంలోనే యింత ముందుగా నేను యేసును తెలుసుకొన్నందుకు ఆయన్ను నమ్మినందుకు బాధపడ్డాను. అయినా యేసును నమ్మడం మానలేదు. కనుక ఈ పాపదాస్యాన్ని తెంచి వేయడానికి పశ్చాత్తాపంతో ప్రార్థించాను. కాని ఈ ప్రార్థనలు ప్రాథమిక సమస్యను పరిష్కరించలేకపోయినై.

సామాన్య ప్రజలు పాపంచేస్తూ వారెలాంటి పాపం చేస్తున్నారో తెలియకుండానే పాపం చేస్తున్నారు. కాని వారు సంఘారాధనకు వెళ్ళడం మొదలుపెట్టిన తర్వాత ధర్మశాస్త్రాన్ని గూర్చి విని తమ పాపాలను గూర్చి తెలుసుకోగలిగారు గనుక తమ పాపాల్లో బంధించబడ్డారు. అప్పుడు వారు వారి పాపాల సమస్యను ఉద్రేకంతో కూడిన పశ్చాత్తాప ప్రార్థనతో పరిష్కరించుకోవాలని మొదట ప్రయత్నించారు. చాలాకాలం గడుస్తుండగా యింకా తమ పాపాల్లోనే కట్టబడివున్నామని వారు గ్రహించారు. వాటి నుండి వారు క్షమాపణ పొందాలని కూడా తెలుసుకొన్నారు.

వారెంత పశ్చాత్తాపంతో ప్రార్థిస్తారో, తమ పాపాల గూర్చి అంతెక్కువగా తెలుసుకొంటారు. అవి తొలిగిపోకపోగా అవి ఎంత భయంకరమైనవో మరింత స్పష్టంగా తెలిసి వారినవి ఎంతగా చుట్టివున్నాయో తెలుస్తుంది. ఇక యిక్కడ నుండి, ఆ తర్వాత అలాంటి వారి మత జీవితాలు మరింత హింసాత్మకమైనవిగా మారి, వారిని బాధిస్తూవుంటాయి. అప్పుడు వారు ‘‘మొదట నేను నమ్మినప్పుడు నేనెంతో ఆనందించాను. కాని యిప్పుడు అయిదు, లేక పది సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత నేనెంతో చెడుగా వున్నానని ఎందుకనుకొంటున్నాను? నేనెందుకింతగా బాధపడుతున్నాను” అని వారనుకొంటారు. అయితే మొదట వారునమ్మినప్పుడు వారికున్న స్థిరమైన రక్షణ ఒప్పుదల ఇప్పుడంత స్థిరంగా లేదని తెలుసుకొంటారు. యేసును నమ్మిన తర్వాత వారు పాపాత్ములమైనామనుకొని వారి నమ్మకాలకు తగిన అన్నిరకాల సిద్ధాంతాలను అనుసరిస్తూ కేవలం మతస్థులుగా మిగిలిపోతారు.

యేసు వీరిని తన నీలధూమ్ర రక్తవర్ణాల దారం, పేనిన సన్నని నారతో వారి పాపాల నుండి వారిని రక్షించాడన్న సత్యం వారికి తెలియదు. కనుక వారు కేవలం మతస్తులుగానే వుండిపోతున్నారు. తాము యేసును నమ్ముతున్నామని వారు చెబుతున్నా వారి హృదయాల్లో శాంతి సమాధానాలు లేవు. గనుక వారింకా బాధపడుతూనే వున్నారు. అలాంటివారు మరో దేవునిలో తమ విశ్వాసాన్ని మార్చుకోవాలన్న ప్రయత్నం కూడా చేయలేరు. ఒకవేళ అలా ప్రయత్నించినా, దేవుని తప్ప మరి దేనిలో నమ్మకముంచినా అది విగ్రహారాధనవుతుందని వారికి తెలుసు యేసుమాత్రమే దేవుని కుమారుడని, ఆయనే దేవుడని ఆయనే రక్షకుడని ఇతర దేవుళ్లను నమ్మలేమని వారికి స్పష్టంగా తెలుసు. అయినా, వారికి సత్యమేదో తెలియదు గనుక తమ పాపాలతో ఎప్పుడూ బాధపడుతూ, శ్రమల్లో జీవిస్తూ వుంటారు.

ఇందుకనే యేసుక్రీస్తు నీలధూమ్రరక్తవర్ణాల దారం, పేనిన సన్నని నార ద్వారా వచ్చాడని వారు తెలుసుకొని, ఆ సత్యాన్ని నమ్మాలి. మతస్థులుగా మారిన ఈ క్రైస్తవులకు యేసే రాజు అని, ఆయన సిలువ విూద తన రక్తాన్ని చిందించాడని, బైబిలు వాక్యం దేవుని వాక్యమని కూడా వారికి తెలుసు.


అయితే యేసు వారి పాపాలనే గాక లోకపాపాలనన్నింటిని తన బాప్తిస్మంతో తన విూదికి తీసుకొన్నాడని వారికి తెలియదు. ఇది తెలియనందు వల్లనే వారు యేసులో తమ విశ్వాసాన్ని ప్రకటించినా, తాము పాపాత్ములుగానే వున్నామని, పాపాత్ములకు నియమించిన స్థలానికి వెళ్తున్నామని గ్రహించలేకుండా వున్నారు. అలాంటి క్రైస్తవులకు, యేసు తమ పాపాల విషయంలో ఎంతశ్రద్ధ తీసుకొన్నాడో వారికి తెలియదు గనుక వారు తమ భావోద్రేకాలనే నమ్ముతుంటారు. దాని ఫలితంగా, గుడ్డివారు ఏనుగు అవయవాలను తాకి ఏనుగు యిలా వుంటుందని చెప్పినట్లు వారేం నమ్ముతున్నారో దానికి, అసలు వాస్తవానికి పోలిక వుండడం లేదు. ఇందుకనే వారి విశ్వాసంలో తప్పేమిటో వారు పూర్తిగా మరచిపోయారు గనుక వారు మళ్ళీ గందరగోళంలోనే వున్నారు.నీలం దారం తెలియజేసే సత్యాన్ని మనం నమ్మకపోతే మనకేం జరుగుతుంది?


ప్రత్యక్ష గుడారపు ఆవరణ ద్వారానికున్న నీలం దారం వివరించే సత్యాన్ని విస్మరించి యేసును మన రక్షకునిగా నమ్మితే ఏం జరుగుతుంది? ప్రత్యక్షపు గుడారపు ఆవరణ ద్వారాన్ని నీలధూమ్ర రక్తవర్ణాల దారం, పేనిన సన్నని నారతో నేయమని దేవుడు మోషేకు ఆజ్ఞాపించినప్పుడు, ఇశ్రాయేలీయులు దానికి బదులు ధూమ్రరక్త వర్ణాల దారంతోను, పేనిన సన్నని నారతో నేస్తే ఏం జరుగుతుంది? దేవుడు దానిని తన ప్రత్యక్షపు గుడారపు ఆవరణ ద్వారంగా అంగీకరించి వుండేవాడేనా? ఆయన దానిని అసలు అంగీకరించి వుండేవాడుకాడు. ఈ నాలుగు దారాలతో గుడారపు ఆవరణ ద్వారాన్ని నేయమని చెప్పాడు గనుక అలా చేయకపోతే అది గుడారపు ఆవరణ ద్వారం అని పిలువబడేదేగాదు. ఆ నాలుగు దారాల్లో ఏ ఒక్కదారాన్ని విడిచిపెట్టకూడదు.

ప్రత్యక్ష గుడారపు ఆవరణ ద్వారాన్ని నీలధూమ్ర రక్తవర్ణాల దారం, పేనిన సన్నని నారతో వేయాలి. దేవుడైన యేసు మన రక్షకునిగా మానవునిగా ఈ లోకానికి వచ్చి, ఈ లోక పాపాలనన్నింటిని తన శరీరంపైకి తీసుకొని సిలువ విూద చనిపోయాడు. మృతులలో నుండి లేచి మన పాపాలను హిమమంత తెల్లగా చేశాడు. కనుక ఆ క్రీస్తును నమ్ముట వలన మన పాపాల నుండి మనం విడుదల పొందాం. మన పాపాల నుండి మనం రక్షణ పొందాలంటే యేసును ఎలా నమ్మాలో ప్రత్యక్ష గుడారపు ద్వారం రంగు మనకు తెలియజేస్తున్నాయి. ఈ గుడారపు ద్వారం ప్రత్యక్ష పరిచే సత్యాన్ని ఎవరు నమ్ముతారో వారంతా వారి పాపాల నుండి రక్షణ పొందుతారు. వారి పాపాలకు హిమమంత తెల్లని విడుదలను పొందుతారు. యేసుక్రీస్తు విూ, నా పాపాలను కడిగివేసి హిమమంత తెల్లగా మనలను మార్చివేశాడు. యేసుక్రీస్తు విూకు, నాకు నిజమైన రక్షకుడైనాడు.

ఈ సత్యాన్నే ప్రత్యక్ష గుడారపు ద్వారం ప్రత్యక్ష పరుస్తోంది. అయినా యిప్పుడు చాలామంది ధూమ్రరక్తవర్ణాల దారం, పేనిన సన్నని నారలో నమ్మక ముంచుతున్నామని చెబుతున్నా నీలం రంగులోని అర్ధాన్ని నమ్మడం లేదు.

ఈ పుస్తకాన్ని రాసే ప్రాథమిక పరిశోధనలో నేనొకసారి ఒక క్రైస్తవ బుక్‌స్టోర్స్‌కు వెళ్ళాను. అక్కడ బాగా ప్రసిద్ధిచెందిన క్రైస్తవ నాయకులు ప్రత్యక్ష గుడారం గురించి రాసిన పుస్తకాను చూశాను. కాని వాటిలో కొందరు అసలు ప్రత్యక్ష గుడారపు ఆవరణ ద్వారాన్ని గూర్చిన ప్రస్తావన కూడా చేయలేదు. కొందరైతే ‘‘ప్రత్యక్ష గుడారపు నీలధూమ్ర రక్తవర్ణాల దారం, పేనిన సన్నని నార ఏం తెలియజేస్తున్నాయి? నీలం ఆకాశం రంగు, కనుక యేసు దేవుడని అది తెలియజేస్తోంది. యేసు మానవునిగా ఈ లోకానికి వచ్చి సిలువ విూద తన రక్తాన్ని చిందించాడని రక్తవర్ణలదారం తెలియజేస్తోంది. ధూమ్రవర్ణం ఆయన రాజు అని తెలియజేస్తుంది’’ అన్న నిర్ధారణ కాని అంశాన్ని వారు వ్యక్తం చేశారు.

ఈ వివరణ యేసు దేవుడని, ధూమ్రవర్ణ దారం వివరిస్తోంది. ప్రత్యక్ష గుడారపు ఆవరణ ద్వారం చిత్రంలోని రంగులను చూస్తే ఈ ధూమ్రవర్ణాన్ని తెలుపు, ఎరుపు రంగు మించి వున్నాయి. ఈ ద్వారానికి వుపయోగించిన నీల ధూమ్ర రక్తవర్ణాల దారం, పేనిన సన్నని నార అనే నాలుగురంగుల చిత్రాన్ని చూస్తే దానిలో రక్తవర్ణం, తెలుపురంగులే కనబడతాయి. కొంచెం ధూమ్రవర్ణం కనిపిస్తుంది. నీలం అసలు కనిపించదు.

ఇప్పుడు ఈ లోకంలో చాలామంది నీలవర్ణం దారంలోని సత్యాన్ని గ్రహించకుండానే ఆ రంగులోని విశ్వాసాన్ని గూర్చిమాట్లాడుతున్నారు. యేసు మానవులందరి శిక్షలను భరించడానికి తన బాప్తిస్మంతో లోక పాపాలన్నింటిని ఒకేసారి తన విూదికి తీసుకొన్నాడన్న సత్యం తెలియకుండానే వారు కేవలం యేసు సిలువ రక్తాన్ని నమ్మితే చాలు మేము రక్షణ పొందుతామని చెబుతున్నారు. అలాంటి వారి హృదయాలెప్పుడూ పాపంతోనే వుంటాయి. వారు ఈ రోజు, రేపు, ఆ తర్వాత కూడా, వాస్తవానికి వారు చనిపోయేటంత వరకు వారి పాపాల నుండి విడుదల పొందక బాధను భరిస్తూనే వుంటారు. ‘‘నేను చనిపోయేంత వరకు దేవుని ముందు పాపాత్ముణ్ణే అని కొందరు ఒప్పుకొంటారు. వారు యేసును నమ్ముతున్న తాము చనిపోయేంత వరకు పాపాత్ములమే అనగా సరైన విశ్వాసమేనా?

యేసును నమ్మిన తర్వాత మనం సరిగ్గా ఎప్పుడు నీతిమంతులమవుతాం? యేసు బాప్తిస్మం, రక్తంలో నమ్మకముంచి పాపంలేని వారైన వారికి పరలోకంలో స్థలం ప్రత్యేకించి వుండదా? పరలోకంలో నీతిమంతులకే గాని, పాపాత్ములకు స్థానం వుండదు ఎవరైతే తమ పాపాల నుండి ఖచ్చితంగా రక్షణ పొంది పాపంలేని వారవుతారో వారే పరలోకంలో ప్రవేశిస్తారు.

యేసుక్రీస్తును నమ్ముతూ కూడా మేము చనిపోయేయంతవరకు పాపాత్ములమే అని చెప్పేవారికి, నీలధూమ్ర రక్తవర్ణాలు, పేనిన సన్నని నారలోని సత్యం తెలియదు గనుక వారెన్నిసార్లు యేసును నమ్ముతున్నామని చెప్పినా వారికి రక్షణ నిశ్చయత వుండదు. వారు యేసును నమ్ముతున్నా, ప్రార్థనలు చేస్తున్నా వారి ప్రార్థనలకు జవాబు వస్తుందన్న నిశ్చయత వారికి వుండదు. వారు యేసును నమ్ముతున్నా వారు ఆయన సహాయాన్ని ప్రేమను పొందలేరు. వారు తమ భక్తిని చూపుతున్నంత వరకు మమ్ములను యేసు ప్రేమిస్తున్నాడని అనుకొంటూ వుంటారు. ఆ భక్తివారిలో తగ్గినప్పుడు దేవుడు మమ్ములను ద్వేషిస్తున్నాడు. మమ్ములను విడిచిపెట్టాడు అని అనుకొంటారు. తాము భక్తిగా వుండి, కానుకలు యిచ్చినంతకాలం దేవుడు తమను దీవిస్తూ వుంటాడని వారు కానుకలు యివ్వలేకపోయినప్పుడు ఆయన తమను ప్రేమించడని అనుకొంటారు. వారు కొన్నిసార్లు కష్ట సమయాలను ఎదుర్కొన్నప్పుడు ఆ కష్టాలనెందుకు ఎదుర్కొంటున్నామో అర్థం చేసుకోలేక దేవుడు తమను ద్వేషిస్తున్నాడనుకొని, తమ దుస్థితికి దేవుని నిందిస్తూ, ఇక ఆయన్ను నమ్మరు.

చివరలో అలాంటి వారికి, దేవునికి మధ్య నమ్మకం తెగిపోతుంది. వారి విశ్వాసం వారి స్వంత ఆలోచనల నుండి భావోద్రేకాల నుండి పుట్టింది గనుక అది హేతుబద్ధం కానిది, సందిగ్ధమైనది, తప్పు విశ్వాసం. మనం దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు మన భావోద్రేకాలను వదలిపెట్టాలి. యేసు తన బాప్తిస్మంతో, రక్తంతో నరకపాత్రులమైన మనలను మన పాపాల నుండి రక్షించాడన్న స్పష్టమైన నమ్మకంతో ఆయన సన్నిధికి వెళ్ళాలి. దేవుని వాక్యం ముందు, ఆయన ధర్మశాస్త్రం ముందు, నీరు, ఆత్మల సువార్త ముందు మనం ఏ మినహాయింపు లేక నరకపాత్రులమన్న మనస్సాక్షితో నిలవాలి. మనం నిజంగా పాపాత్ములమని, దేవుడు మనలనెలా పాపాల నుండి రక్షించాడో తెలుసుకొని, నమ్మి, విశ్వసించినప్పుడే యేసుక్రీస్తు మనకు రక్షకుడవుతాడు.

నిజమైన విశ్వాసం వల్లనే మనం రక్షణ వరాన్ని పొందగలం. 

కాగా, మన యోగ్యమైన క్రియల ద్వారా గాక, నీలధూమ్ర రక్తవర్ణల దారాలు, పేనిన సన్నని నారను విూరు, నేను నమ్ముట వలన మన పాపాల నుండి రక్షణ పొందామని తెలుసుకొన్నాం. మన పాపాల నుండి మనలను రక్షించడానికి యేసుక్రీస్తు ఈ నాలుగు సత్యాల ద్వారా మన దగ్గరకు వచ్చాడని మనం తెలుసుకోవాలి. దానిని విశ్వసించాలి. ఆయన మెస్సీయగా వస్తానని పాతనిబంధనలో వాగ్ధానం చేశాడు. ఆ వాగ్ధానం ప్రకారం ఆయనీ లోకానికి వచ్చి, ఆయన బాప్తిస్మం ద్వారా మన పాపాలను, సమస్త మానవాళి పాపాలను ఒకేసారి తన విూదికి తీసుకొన్నాడు. తర్వాత ఈ పాపాలను ఆయన సిలువ వరకు మోసుకొని వెళ్ళాడు. సిలువశిక్షను పొందాడు. విలువైన తన రక్తాన్ని చిందించాడు. ‘‘సమాప్తమైనది” అని చెప్పి ఆయన చనిపోయాడు (యోహాను 19:30). మూడవనాడు మృతులలో నుండి లేచాడు. మరో 40 రోజులు సాక్ష్యంతో నిరూపించి మళ్ళీ తిరిగి వస్తానని వాగ్ధానం చేసి దేవుని సింహాసన కుడి పార్శ్వానికి ఆరోహణమై వెళ్ళాడు. ఈ సత్యాన్ని మనం నమ్మాలి.

“నీల ధూమ్ర రక్తవర్ణాల దారం, సన్నని పేనిన నార అనే నాలుగు పరిచర్యల ద్వారా మిమ్మును నేను రక్షించాను. ఈ రక్షణ సత్యాన్ని నమ్మిన వారిని నాతో తీసుకొని వెళ్ళాడానికి నేను మళ్ళీ వస్తాను. వారు దేవుని పిల్లలు అయ్యే హక్కును కూడా నేను వారికి అనుగ్రహిస్తాను. ఎవరైతే ఈ సత్యాన్ని తమ హృదయాల్లో నమ్ముతారో వారి పాపాలను కడిగి వాటిని హిమమంత తెల్లనివిగా చేస్తాను. నేను వారికి పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాను. వారిని నా స్వంత పిల్లలుగా చేసుకొంటాను’’ అని మన ప్రభువు మనకు చెప్పాడు.

ఈ వాక్యాన్ని మనం నమ్మాలి. మన ప్రభువు యిప్పటికే ఈ వాగ్ధానాలన్నీ నెరవేర్చాడు. ఈ లోకంలో వున్న వారి జీవితాలల్లో ఆయన పనిచేస్తున్నాడు. ఈ సత్యాన్ని ఎవరు నమ్ముతారో వారి నాయన కాపాడుతూ వున్నాడు. వారిని గూర్చి సాక్ష్యమిస్తున్నాడు. ఇలా ప్రభువు బాప్తిస్మం, రక్తమనే కార్యాల ద్వారా మనం రక్షణ పొందాం. ఆయన కృపలో, కాపుదలలో, ప్రేమలో నైతిక జీవితాన్ని జీవిస్తున్నాం. మన నమ్మకం వలన మన పాపాల నుండి విడుదల పొందినందువలన ఆయన మనలను రక్షించాడు.

ప్రత్యక్షపు గుడారం అన్న ఈ పుస్తకాన్ని అన్ని ప్రపంచ బాషల్లోకి అనువదించినప్పుడు ఈ సత్యంలో తమ విశ్వాసం వలన ప్రజలందరూ రక్షణ పొందుతారని నేను స్థిరంగా నమ్ముతున్నాను.

పాపక్షమాపణ కేవలం యేసు రక్తం వల్లనే కలుగుతుందని చెప్పేవారు ఇక చాలా చెప్పే అవకాశం లేదు. లేకపోగా వారు చెప్పేదెంత తప్పో తెలుసుకోవాలి. అసత్యమైన దానినే పట్టుకొని వుండి యిదే రక్షణ అని చెప్పలేరు. యేసురక్తంలో మాత్రమే నమ్మకముంచి మేము రక్షణ పొందుతామని ఎన్నటికి చెప్పలేదు.

ప్రత్యక్ష గుడారపు ఆవరణ ద్వారంలో నీలధూమ్రరక్త వర్ణాల దారం, పేనిన సన్నని నార అనే రక్షణ వాక్యంలో నీరు, ఆత్మల సత్యసువార్త కనుగొంటాం. పాతనిబంధన నుండి దేవుడు వాగ్ధానం చేసి, ప్రవచించిన దేవుని వాక్యం నమ్మక, కొత్త నిబంధనలో తన బాప్తిస్మం, సిలువ శిక్ష ద్వారా దేవుడు తన రక్షణ వాగ్ధానాన్ని నెరవేర్చాడు గనుక ఆ రక్షణ వరంలో ఆనందంతో, కృతజ్ఞతలతో మనం నమ్మకముంచితే మన పాపానికి శాశ్వత క్షమాపణను పొందుతాం.

ఈ వాక్యం ఎంతో సులభమైంది. పరిపూర్ణమైనది. అయినా ఈ సత్యం ఆ లోకజ్ఞానం సంపూర్ణంగా వున్న, ఆయన పరిపూర్ణ వాక్యంలో సంపూర్ణ నమ్మకం లేకపోతే ఆ సత్యాన్ని అర్థం చేసుకోలేరు. అందుకనే వున్నదున్నట్టుగా ఆయన వాక్యాన్ని నమ్మాలి. ఇదంత విలువైన, పవిత్రమైన సత్యం గనుక అవి తెలియని అజ్ఞానుల్లా మనం వుండకూడదు. కనుక మీరు, నేను తప్పక నీరు, ఆత్మల సువార్తను నమ్మాలి. నీలధూమ్రరక్త వర్ణాల దారం, పేనిన సన్నని నారలో ప్రత్యక్ష పరచని సత్యాన్ని స్వేచ్ఛగా, సులభంగా మనకు బోధించుట వలన మన విశ్వాసం ద్వారా మనమీ అమూల్యమైన రక్షణ వరాన్ని పొందే భాగాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు.

మీరు, నేను కూడా ఒకటిగానే ఈ సత్యాన్ని నమ్మాలి. మన మందరం సత్యాన్ని గూర్చిన దేవుని ప్రేమకు కృతజ్ఞతలు తెలియజేయాలి. నీలధూమ్ర రక్త వర్ణాల దారంలోని సత్యం తెలియని చాలామంది వున్నారు. వారు తమ అసత్యమార్గాలను ప్రజలకు బోధిస్తూ, ఆ మార్గంలోనికి నడుపుతున్నారు. వారికి కూడా మనమీ సత్యాన్ని తెలియజేయాలని వాంచిస్తున్నాం. సత్యం తెలియక వారి హృదయాలు హింసపబడుతున్నాయో వారు తమ పాపాల నుండి విడుదల పొంది రక్షణ ద్వారంలో ప్రవేశించాలన్న కోర్కెతో నీరు, ఆత్మలనే సత్యసువార్తను వారికి బోధించాలి. మనమీ సత్యాన్ని బోధించినప్పుడు, దానిని నమ్మిన వారు రక్షణ పొందుతారు. నమ్మని వారు వారి పాపాల నిమిత్తం శిక్షపొందుతారు. యేసును మనం నమ్మాలని నిర్ణయించుకొన్నప్పుడు నీలధూమ్ర రక్తవర్ణాల దారంలోని సత్యాన్ని తెలుసుకొని అప్పుడు ఆయనలో నమ్మకం వుంచాలి.

ఆది నుండి నీలధూమ్రరక్తవర్ణాల దారంలోని సత్యం ఎవరకీ తెలియదు, ‘‘మీరు సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయును” అని దేవుడు చెప్పాడు. (యోహాను 8:32), సత్యమంటే ఏమిటి? సత్యమంటే నిజమైన సువార్త (ఎఫెసీ 1:13) అంటే - నీలధూమ్ర రక్తవర్ణాల దారంలో నమ్మకముంచుట వలన మీ పాపాల నన్నింటి నుండి రక్షణ పొందడమే గాక, మీ హృదయాలలో పరిశుద్ధాత్మ నివసిస్తున్నాడు. ఇందువలన మీ హృదయాలలో నుండి, మీ మనస్సుల్లో నుండి మీ పాపాలు పూర్తిగా మాయమైపోయాయి. దేవుడు నిజంగా మీ తండ్రి అని మీ హృదయపూర్వకంగా నమ్ముతూ, నిజంగా ఒప్పుకొంటున్నారా? పాపంలేని వారినే దేవుడు తన పిల్లలుగా అంగీకరిస్తాడు. ప్రత్యక్షగుడారపు ఆవరణ ద్వారానికి వేసిన నీలధూమ్ర రక్తవర్ణాల దారం, పేనిన సన్నని నారలోని అర్ధాన్ని తెలుసుకొని, నమ్మిన వారినే దేవుడు ఆమోదిస్తాడు పాపాత్ములు దేవుని పిల్లలు కారు. దేవుడు మనకిచ్చిన ఏకైక సువార్త అయిన నీరు, ఆత్మల సత్యసువార్తలో నమ్మకముంచి, తిరిగి పుట్టిన వారు మాత్రమే తండ్రియైన దేవుని పిల్లలు.

ఈ లోకంలో మనం ఎన్నో కష్టాలను, శ్రమలను ఎదుర్కొంటూ జీవిస్తున్నా, దేవుడు పనిలో నివసిస్తున్నాడు గనుక మనం ఆనందంగా వున్నాం. మనకు లేమి వున్నా ధన్యకరమైన జీవితాలను జీవిస్తున్నాం. దేవుని నీతిని నమ్ముతూ, నీలిధూమ్ర రక్తవర్ణాల దారం, సువార్తను లోకమంతా బోధిస్తూ వుండగా ఆ సువార్త దేవుని నీతిని మనకు అనుగ్రహిస్తూ వుంది.

నేను, అన్నిటికంటే ముఖ్యంగా నీలిధూమ్రరక్తవర్ణాల దారాల్ని మనకను గ్రహించినందుకు దేవునికి కృతజ్ఞుడనై వున్నాను. నేను మొదట యేసును నమ్మినప్పుడు, ఎంత భక్తితో నమ్మినప్పటికి నా హృదయం యింకా పాపంతోనే వుంది. దాని వలన నేనెంతో హింస పొందాను. నేనెంత నిజాయితీగా యేసును నమ్ముతున్నానని చెప్పినా, నా మనస్సులో పాపం వుంది. ఒక వ్యక్తి, దేవుని ముందు తన మనస్సాక్షిలో పాపం వుందో లేదో తెలుసుకోగలరు. వారి మనస్సాక్షిపై యింకా పాపం రాసి వుంటే వారు యింకా తమ పాపక్షమాపణ పొందని వారన్నది స్పష్టం.

వారి మనస్సాక్షిలో అన్నిటికంటే చిన్నపాపం వున్నా వారు తమ పాపక్షమాపణ పొందలేదనడానికి అదే రుజువు. నేను సత్యాన్ని తెలుసుకొనక ముందు, అది నా పాపాల్లో అతి చిన్నదైన దాని సమస్యను కూడా పరిష్కరించింది. దాని ఫలితంగా నాలో తేలిన అన్నిరకాల ప్రశ్నలు, ఆశ్చర్యాలను నీలిధూమ్ర రక్తవర్ణాల దారంతో దేవుడు తీర్చివేశాడు.

ఆ వాక్యం యింతకు ముందు మనం చదువుకొన్నట్టు మత్తయి సువార్తలో వుంది. (మత్తయి 3:13`17) దానిని చదువుతూ, ‘‘నీతి యావత్తు ఈలాగు నెరవేర్చుట మనకు తగియున్నది”, అన్నభాగానికి వచ్చినప్పుడు యేసు బాప్తిస్మాన్ని పొంది, నీటి నుండి బయటికి వచ్చినప్పుడు, దేవుడు ఆయన నీతిని గూర్చి లక్ష్యముంచాడు. యేసు బాప్తిస్మం వలన సమస్త పాపాలు తుడిచివేయబడ్డాయని సమస్త నీతి నెరవేర్చబడినదని నేను తెలుసుకొని, దాని యేసుక్రీస్తు యోహాను వలన బాప్తిస్మం పొందినప్పుడు నా పాపాలన్నీ స్పష్టంగా ఆయన మీదికి వెళ్లాయి. వెంటనే అవి సిలువలో పరిష్కరించబడ్డాయి. యేసు ఎందుకు బాప్తిస్మం పొందాడో తెలుసుకొని, దాన్ని నమ్మానో ఆ క్షణంలోనే పరిష్కారం కాని నా పాపాలను గూర్చిన ప్రశ్నలు, సమస్యలన్నీ వెంటనే నా నుండి తొలగిపోయినై. దేవుని నిజమైన వాక్యమైన నీరు, ఆత్మల సువార్త సత్యాన్ని నేను తెలుసుకొని, నమ్మి పాపక్షమాపణ పొందానన్న సత్యానికి నేనెంతో కృతజ్ఞుడను.

లిఖిత పూర్వికమైన తన వాక్యం ద్వారా దేవుడు నా దగ్గరకు వచ్చాడు. ఈ నీరు, ఆత్మ వాక్యాన్ని నా హృదయపూర్వకంగా నమ్ముట వలన నా పాపక్షమాపణ పొందాను. ఆనాటి నుండి నీలిధూమ్రరక్తవర్ణాల దారమనే సత్యసువార్తను గూర్చి అనేకులకు సాక్ష్యమిస్తున్నాను. ఇప్పుడు కూడా ఈ సత్యాలనన్నింటిని, రక్షణ మర్మాలను ప్రకటిస్తూనే వున్నాను. సత్యసువార్త మానవుల స్వంత ఆలోచనలు, సిద్ధాంతాలు, లేక వారి భావోద్రేక అనుభవాల ద్వారా చేసింది కాదు.

నీలిధూమ్రరక్తవర్ణాల దారం, పేనిన సన్నని నారతో మన ప్రభువు మన పాపాలను తుడిచి వేశాడు. ప్రపంచవ్యాప్తంగా నీలిధూమ్రరక్తవర్ణాల దారం ద్వారా ప్రతి ఒక్కరూ రక్షణ సత్యాన్ని స్పష్టంగా తెలుసుకొని ఆ సత్యం నీరు, ఆత్మలనే సత్యసువార్త తప్ప మరొకటి కాదని తెలుసుకుంటారు. ఆ చివరి కాలంలో తప్పక అవసరమైన సత్యం యిదే. అసంఖ్యాకులైన జనులు ఈ సత్యాన్ని నమ్ముతారు.

ఇప్పుడు ప్రజల నీతి తొలగిపోయి, వారి చెడు విచ్చలవిడిగా నడుస్తున్న యుగం యిది. పరిసర పరిస్థితులు తగ్గిపోయి, వారిలో సహజంగా దాగి వున్న చెడును వారు బయటికి వెదజల్లుతున్నారు. అయినా మన ప్రభువు నీలిధూమ్రరక్తవర్ణాల దారమనే సువార్త ద్వారా మన పాపాల నుండి మనలను రక్షించాడు. ఈ దీవెన ఎంత నమ్మకమైంది, అమూల్యమైనది? ఇందుకు నా ఆనందం పొంగి పొర్లుతూవుంది. ఇంత స్పష్టమైన రక్షణ కొరకు నేను దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తున్నాను.

దేవుడు ముందుగానే తెలియజేసిన విధంగా ఈ లోకం అంతం వైపు పయనిస్తున్నదిప్పుడు, ఇప్పటికే ఆ యుగంలోకి ప్రవేశించింది. భక్తితో దేవుని సేవించేవారు అతి తక్కువగా వున్న ఈ సమయంలో, చివరికి విశ్వాసుల విశ్వాసం కూడా బలహీనమవతున్న తరుణంలో నీరు, ఆత్మల సువార్త గాక మరో సువార్తను నీభక్తినుంచడానికి ప్రయత్నిస్తే నీ హృదయగాయాలతోనే నీవు అంతరించి పోతావు. నీవు దేవుని నమ్ముతున్నప్పుడు నిజంగా నీలిధూమ్రరక్తవర్ణాల దారంలోని సువార్తను నీవు నమ్మకపోతే అది నీ హృదయంలో తగిన ఫలాలను ఫలించదు, మిగల్చదు గనుక నీకు నీరాశే కలుగుతుంది. 

ప్రత్యక్షగుడారపు నాలుగురంగులే, నీలిధూమ్రరక్తవర్ణాల దారం, పేనిన సన్నని నారే సువార్త సత్యం గనుక ఈ అంధకారంలోనికి అదే ఏకైక, అత్యున్నత సువార్త. ప్రత్యక్షగుడారంలో ప్రత్యక్షపరచిన సత్యాన్ని తెలుసుకొని, నమ్మి, మన పాపక్షమాపణ పొంది జీవించడం అమూల్యమైన దీవెన, పవిత్రమైన వరం, మనకు గొప్ప ఆనందం.

ప్రత్యక్షగుడారపు ఆవరణ ద్వారం వలన తెలియజేసిన సత్యాన్ని నీవు కూడా తెలుసుకొని, నమ్మాలనుకొంటున్నావా? అవును దానిని తప్పక తెలుసుకోవాలి. తప్పక దానిని నమ్మాలి.