Sermons

[11-9] < నిర్గమకాండం 27:1-8 > దహన బలిపీఠంలో ప్రత్యక్ష పరచిన విశ్వాసం

< నిర్గమకాండం 27:1-8 >

“మరియు అయిదు మూరల పొడుగు, అయిదు మూరల వెడల్పుగల బలిపీఠమును తుమ్మకర్రతో నీవు చేయవలెను. ఆ బలిపీఠము చచ్చౌకముగా నుండవలెను. దాని యెత్తు మూడు మూరలు, దాని నాలుగు మూలలను దానికి కొమ్ములను చేయవలెను. దాని కొమ్ములు దానితో ఏకాండముగా వుండవలెను. దానికి ఇత్తడి రేకు పొదిగింపవలెను. దాని బూడిదె ఎత్తుటకు కుండను, గరిటెను, గిన్నెలను, ముండ్లను అగ్ని పాత్రలను చేయవలెను. ఈ ఉపకరణములన్నియు ఇత్తడితో చేయవలెను. మరియు వలవంటి ఇత్తడి జల్లెడ దానికి చేయవలెను. ఈ వలమీద దాని నాలుగు మూలలను నాలుగు ఇత్తడి ఉంగరములను చేసి ఆ బలిపీఠము నడిమి వరకు చేరునట్లు దిగువను బలిపీఠము గట్టు క్రింద దాని నుంచవలెను. మరియు బలిపీఠము కొరకు మోతకర్రలను చేయవలెను. ఆ మోతకర్రలను తుమ్మకఱ్ఱతో చేసి వాటికి ఇత్తడి రేకులు పొదిగింపవలెను. ఆ మోత కర్రలను ఆ ఉంగరములలో చొనపవలెను. బలిపీఠమును మోయుటకు ఆమోత కర్రలు దాని రెండు ప్రక్కల నుండవలెను. పలకలతో గుల్లగా దాని చేయవలెను. కొండ మీద నీకు చూపబడిన పోలికగానే వారు దానిచేయవలెను.’’దహన బలిపీఠంలో ప్రత్యక్షపరచబడిన విశ్వాసాన్ని గూర్చి చర్చించాలను కొంటున్నాం. ఇశ్రాయేలీయులు తమ అనుదిన జీవితంలో అనుసరించాల్సిన దేవుని ధర్మశాస్త్రంలోని 613 సిద్ధాంతాలను, ఆజ్ఞలను భంగపరచి, వారి పాపాలను తెలుసుకొన్నప్పుడు దేవుడు నిర్ణయించిన బలివిధానం ప్రకారం వారు నిష్కళంకమైన అర్పణలను దేవునికి అర్పించారు. ఆ అర్పణలను వారు దహనబలిపీఠం మీద అర్పించేవారు. ఇశ్రాయేలీయులు తాము అర్పణగా తెచ్చిన నిష్కళంకమైన బలిపశువుపై తమ చేతులుంచి, దాని గొంతుకోసి, రక్తాన్నికార్చి, ఆ రక్తాన్ని దహన బలిపీఠం కొమ్ముల మీద పెట్టి, మిగిలిన దానిని నేలమీద పోయాలి. మాంసాన్ని బలిపీఠం మీద దహించాలి.దహన బలిపీఠంలోని ఆధ్యాత్మిక అర్థం ఏమిటి?


దహన బలిపీఠం పొడవు, వెడల్పు 2.25మీ॥, ఎత్తు 1.35మీ॥ కొలతలతో తుమ్మ కర్రతో చేసి దానికి ఇత్తడి రేకు పొదగాలి. ఇశ్రాయేలీయులు ఈ దహన బలిపీఠాన్ని చూసినప్పుడల్లా తాము తమ తీర్పు శిక్షలో బంధించబడి వున్నామని, తమ శిక్షను తప్పించుకొనలేకుండా వున్నామని వారు గుర్తించేవారు. బలిపశువు ఎలా చంపబోవుతుందో అలాగే తమ పాపాల నిమిత్తం తాము కూడా చావవలసిన వారమే అని కూడా దాన్ని చూసేవారు తెలుసుకొనేవారు. వారింకా, వారి పాపాల నిమిత్తం మెస్సీయ ఈ లోకానికి రావాలని, తమ పాపాలను తుడిచి వేయడానికి శిక్ష విధించబడి, బలిపశువు చంపబడాలని కూడా నమ్మారు.

దహన బలిపీఠం మన రక్షకుడైన యేసుక్రీస్తు కులఛాయ, నిష్కళంకమైన జంతువుపై ఇశ్రాయేలీయులు తమ చేతులుంచి దాని రక్తాన్ని కార్చినట్టే, యేసుక్రీస్తు కూడా దేవుని కుమారునిగా (దేవుని గొర్రెపిల్లగా) మన దగ్గరకు వచ్చాడు. మన పాపశిక్షను ఆయన భరించాడు. పాత నిబంధనలో బలిపశువు తలపై వారి చేతులుంచి వారి పాపాలను ఒప్పుకొని వాటి రక్తాన్ని చిందించినట్టే, యేసు యోహాను వలన పొందిన బాప్తిస్మంతో లోక పాపాలనన్నింటిని తాను అంగీకరించాడు, ఆ పాప శిక్షను భరించి సిలువ మీద తన రక్తాన్ని చిందించాడు.

ఈ విధంగా యేసుక్రీస్తు తన బాప్తిస్మంతో మనందరి పాపాలను తన మీదికి తీసుకొన్నాడు. సిలువ మీద చనిపోయాడు. మళ్ళీ మృతులలో నుండి లేచాడు. దాని వలన మనలను రక్షించాడు.

ఇశ్రాయేలీయులు తమ పాపక్షమాపణ పొందడానికి వారు దహన బలిపీఠం మీద తమ బలియర్పణను అర్పించాలి.

అభిషేకం పొందిన యాజకులు, ఇశ్రాయేలీయుల సమజం, వారి రాజు, లేక సామాన్య ప్రజల్లో పాపం చేసిన ఎవరైనా వారి పాపక్షమాపణ నిమిత్తం బలియర్పణగా ఒక జంతువును తీసుకొని వచ్చి దాని తలపై వారి చేతులుంచి దానిని చంపి, దాని రక్తాన్ని సేకరించి దహన బలిపీఠం దగ్గరకు తీసుకొని వెళ్ళి దానిని దేవునికి అర్పించాలి.

వాస్తవానికి, ఏ దహన బలిపీఠం మీద ఇశ్రాయేలీయులు ప్రతిరోజు తమ పాపపరిహార బలియర్పణను అర్పిస్తారో అది ఏ రోజూ ఒత్తిడి లేకుండా వుండదు. తమ పాపక్షమాపణను కోరే ఇశ్రాయేలీయులు నిష్కళంకమైన ఒక జంతువును సిద్ధపరచి దానిని దహన బలిపీఠం మీద తమ బలియర్పణగా దేవునికి సమర్పించేవారు. తమ పాపాలన్నీ దాని మీదికి వెళ్ళేట్లు పాపాత్ములు ఆ బలిపశువు తలపై చేతులుంచే వారు.

ఈ పాపాలకు తీర్పుగా, దాని గొంతుకోసి దాని రక్తాన్ని సేకరించే వారు. యాజకులా రక్తాన్ని దహన బలిపీఠం కొమ్ముల మీద వుంచి దాని మాంసాన్ని, కొవ్వును బలిపీఠం మీద దహిస్తారు. ఇలా చేసినప్పుడు ఇశ్రాయేలీయులు పాపక్షమాపణను పొందేవారు.

పాపం చేసింది ఇశ్రాయేలీయుల నాయకుడా, ప్రధాన యాజకుడా, సామన్య యాజకులా, సమాజమంతానా, లేక సామాన్య, ప్రజల్లో ఎవరైనా అన్నదానిలో సంబంధం లేకుండా, వారెవరైనా సరే, పాపం చేసిన వారు, ఒక ఎద్దునో, లేక ఒక పొట్టేలునో, లేక ఒక మేకనో బలి పశువుగా తీసుకొని వచ్చి దానిని దేవునికి బలిగా అర్పించాలి.

ఆ బలిపశువు తీసుకొని వచ్చిన పాపాత్ములు, లేక వారి ప్రతినిధులు తమ చేతులను ఆ బలిపశువు తలపై వుంచాలి. దానిని చంపి దాని రక్తాన్ని దహన బలిపీఠం కొమ్ములపై వుంచాలి. మిగిలిన రక్తాన్ని నేలపై కుమ్మరించాలి. తర్వాత వారికి పాపక్షమాపణ కలుగునట్లు దాని కొవ్వును ఆ బలిపీఠంపై దహించాలి. కనుక చాలా మంచి వారి బలియర్పణ పశువును తీసుకొని వచ్చేవారు. వాటి రక్తాన్ని సేకరించి యాజకులకు యిచ్చేవారు.

దహన బలియర్పణగా తెచ్చే జంతువు నిష్కళంకమైనవై వుండాలి. పాపాత్ములు దేవునికి తమ అర్పణలు యిచ్చేటప్పుడు తాము నిష్కళంకమైన జంతువును తెచ్చామో లేదో వారు శ్రద్ధ వహించాలి. అలాంటి వాటి తలపై తమ చేతులుంచినప్పుడే వారి పాపాలు వాటి మీదికి వెళ్తాయి. అలా అర్పించినప్పుడే వారిలో పాపం మిగిలి వుండదు.

సహజంగా పాపంచేసిన వ్యక్తే తాను తెచ్చిన బలిపశువు తలపై తన చేతులుంచాలి. అయితే ఇశ్రాయేలీయుల సమాజమంతటి పక్షంగా పాపపరిహార బలియిస్తున్నప్పుడు వారి ప్రతినిధులైన నాయకులు ఆ బలిపశువు తలపై తమ చేతులుంచాలి (లేవీ 4:15). ఏ బలిపశువు తలపై వారు చేతులుంచారో ఆ పశువు గొంతుకోసి, దాని రక్తాన్ని సేకరించి, చివరిగా ఆ పశువును బలిపీఠం మీద దహించాలి.

దహనమవుతున్న మాంసం, కొవ్వు, చెక్క పొగ దహన బలిపీఠం చుట్టూ వున్న స్థలాన్ని నింపుతుంది. దాని కొమ్ములు, దాని క్రింది నేల బలిపశువు రక్తంతో తడిచి వుంటుంది. ఇశ్రాయేలీయులు తమ పాపాలు కడిగి వేయబడాలని ఎక్కడ తమ బలియర్పణనిస్తారో అదేవారి పాపవిమోచన స్థలం.

నిరంతరం బలి పొగలేచే ఈ దహన బలిపీఠం 2.25మీ॥ పొడవు వెడల్పు, 1.3మీ.లు ఎత్తుగల చచ్చౌక కొలతలు గలది. దాని మధ్య ఇత్తడి పనితో చేసిన పెద్ద పాత్రను అమర్చేవారు. ఆ మధ్య మండుతున్న కట్టె నుండి లేచే పొగ ఎడతెరిపిలేకుండా వుంటుంది దహన బలిపీఠం.

దహన బలిపీఠం ఉపకరణాలు అన్ని ఇత్తడితో చేసినవే దహన బలిపీఠం బూడిదను తీసివేయడానికి, దానిని తొలగించడానికి ఉపయోగించే ఉపకరణాలన్నీ ఇత్తడితో చేసినవే. దహన బలిపీఠం కూడా తుమ్మకర్రతో చేసిన దానికి ఇత్తడి తొడుగు వేసినదే. కనుక బలిపీఠం, దాని ఉపకరణాలన్నీ ఇత్తడితో చేసినవే.

దహన బలిపీఠపు ఇత్తడి కొక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక అర్ధం వుంది. దేవుని ముందు పాపపు తీర్పును ఇత్తడి సూచిస్తుంది. దానిని బట్టి పాపాత్ములు తమ పాపాల నిమిత్తం తప్పక తీర్పు పొందే చోటు దహన బలిపీఠమని మనకు తెలియజేస్తుంది. తమ పాపాల నిమిత్తం వారికి బదులుగా తీర్పుపొందే బలియర్పణలు, దహించుస్థలమై ఈ దహన బలిపీఠం. కనుక బలిపీఠం, దానికి సంబంధించిన ఉపకరణాలన్నీ ఇత్తడితో చేసినవే. కనుక ప్రతి పాపం తప్పని సరిగా దాని తీర్పును పొందాలని ఈ ఉపకరణాలు వివరిస్తున్నాయి.

ప్రజలు తమ పాపాల నిమిత్తం శిక్షార్హులై మరణ దండనకు పాత్రులని బలిపీఠం తెలియజేస్తుంది. కాని దహన బలిపీఠం దగ్గరకు తమ బలియర్పణా పశువును తీసుకొని వచ్చి, దానిని దేవునికి అర్పించి, వారి పాపక్షమాపణపొంది, వారి పాపాలు కడిగి వేయబడుట ద్వారా వారు మళ్లీ జీవిస్తారు. ఇక్కడ దహన బలిపీఠం మీద అర్పించిన బలియర్పణలన్నీ, యేసుక్రీస్తు, ఆయన కార్చిన రక్తం విశ్వాసులను వారి పాపాల నుండి క్షమించిందని తెలియజేస్తున్నాయి. కనుక దహన బలిపీఠం మీద బలియర్పణలను అర్పించిన ఈ విశ్వాసం కొత్త నిబంధన కాలంలోని యేసుక్రీస్తు బాప్తిస్మం, ఆయన రక్తంలో విశ్వాసంగా కొనసాగింది. 

యేసుక్రీస్తును మన రక్షకునిగా మనం నమ్మినప్పుడు యేసు బాప్తిస్మం, ఆయన రక్తం మనకు పాపవిమోచన కలిగిస్తున్న నమ్మకం గల విశ్వాసాన్ని దేవునితో ఒప్పుకోవాలి. పాత నిబంధనలో ఈ విశ్వాసాన్ని నీలధూమ్రవర్ణ రక్త వర్ణాల దారం, పేనిన సన్నని నారతో నేసిన ప్రత్యక్షగుడారపు ఆవరణ ద్వారాన్ని తెరచి దానిలో ప్రవేశింపజేసే యోగ్యతను కలిగించే విశ్వాసంగా గుర్తించారు.దహన బలిపీఠం మీద అర్పించే బలియర్పణలన్నీ యేసుక్రీస్తును సూచిస్తున్నాయి.


యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయనేం చేశాడు? మనం పాపాత్ములం, మనం దేవునికి వ్యతిరేకంగా పాపం చేశాం. ఆయన ధర్మశాస్త్రాన్ని, ఆజ్ఞలను భంగపరిచాం. అందుకని మన పాపాలను తుడిచి వేయడానికి యేసుక్రీస్తు యోహాను వలన బాప్తిస్మం వలన లోకపాపాలను తన మీదికి తీసుకొన్నాడు. వాటిని తుడిచివేయడానికి సిలువమీద తన రక్తాన్ని కార్చాడు. ఇశ్రాయేలీయులు తమ బలిపశువుపై తమ చేతులుంచడం ద్వారా వారి పాపాలన్నీ దానిమీదికి పోగా దానిని వారు బలియిచ్చి దహన బలిపీఠంపై దానిని దహించినట్టే, యేసుక్రీస్తు నిష్కళంకమైన బలిపశువుగా ఈ లోకానికి వచ్చాడు. బాప్తిస్మం తీసుకొన్నాడు. సిలువ మీద తన బలియాగంగా తన రక్తాన్ని చిందించి మన స్థానంలో దాని మీద చనిపోయాడు. మన పాపాల నిమిత్తం ఆయన శిక్షను భరించి ఆయన రెండు చేతుల్లోను, కాళ్లలోను మేకులతో కొట్టబడి రక్తాన్ని చిందించాడు. అలా ఆయన మన పాపాల నుండి, శిక్ష నుండి మనలను రక్షించాడు.

ఈ దహన బలిపీఠానికి తగిన నిజమైన సారాంశంగా వచ్చిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు ఏమి చేసాడు? యేసుక్రీస్తు తన బాప్తిస్మం ద్వారా మన పాపాలనన్నింటిని ఆయన మీదికి తీసుకొన్నాడు. సిలువ వేయబడ్డాడు. సిలువ మీద చనిపోయాడు. మళ్ళీ మృతులలో నుండి సజీవునిగా లేచాడు. మన ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. మన రక్షణ కార్యాన్ని పూర్తి చేశాడు. తర్వాత పరలోక రాజ్యానికి ఆరోహణమై వెళ్లాడు.మనం ప్రతిరోజు పాపం చేయకుండా వుండలేం


దహన బలిపీఠానికి ‘‘ఆరోహణ క్రమం” అన్న మరో అర్ధం కూడా వుంది. వాస్తవానికి మీరు, నేను ప్రతిరోజు పాపం చేస్తూనే వుంటాం. కనుక మనం ఎల్లప్పుడూ బలియర్పణను యిస్తూనే వుండాలి. దీని వలన మన పాపశిక్షను అర్పించే దహన బలిధూపం ఎల్లప్పుడూ దేవుని వైపుకు ఆరోహణ మవుతూ వుంటుంది. నీవు పాపం చేయకుండా పాపరహితంగా జీవించే రోజు ఏదైనా ఒకటి వుంటుందా? ఇశ్రాయేలీయులు లెక్కించలేనన్ని పాపాల క్షమాపణ నిమిత్తం యాజకులు అనుదినం దహన బలి అర్పించలేక అలసిపోయే రోజేదైదైనా వుంటుందా? కాని వుండదు. ఇశ్రాయేలీయులు దేవుని ధర్మశాస్త్రాన్ని భంగపరచి, దేవునికి వ్యతిరేకంగా ప్రతిరోజు పాపం చేస్తూనే వుంటారు. కనుక వారు ప్రతిరోజూ తమ బలియర్పణను అర్పిస్తూనే వుండాలి.

ఇశ్రాయేలీయులు ప్రతివిధమైన మోషే దేవుని ధర్మశాస్త్రానికి సంబంధించిన 613 సిద్ధాంతాలను, ఆజ్ఞలను ఇశ్రాయేలీయులకిచ్చాడు. ‘‘కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన ననుసరించి నడిచిన యెడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాధ్యమగుదురు. సమస్త భూమియు నాదే కదా. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను వుందురు.’’ (నిర్గమ 19:5-6)

అప్పుడు ఇశ్రాయేలీయులందరూ ‘‘యెహోవా చెప్పినదంతయు చేసేదమని ఏకముగా ఉత్తరమిచ్చిరి” (నిర్గమ 19:8), కాగా మోషేకు ప్రత్యక్షమై వారి నిజమైన దేవునిగా అతని ద్వారా వారితో మాట్లాడిన ఈ దేవుడే వారిని కాపాడాలని వారు కోరుకొన్నారు. దేవుడు తమతో చెప్పిన దాన్నంతటిని నెరవేరుస్తామని, ఆయనకు ప్రత్యేక విధిగా, ఆయనకు యాజక రాజ్యముగా, దేవునికి చెందిన పరిశుద్ధ జాతిగా వుంటామని కూడా వాగ్ధానం చేశారు. కనుక ఆయన వారి కిచ్చిన ఆజ్ఞలన్నింటిని తప్పక అనుసరిస్తామని చెప్పారు.

ఇశ్రాయేలీయులు పాపం చేస్తారని దేవునికి యిప్పటికే తెలుసా? ఆయనకు తెలుసు. ఇందుకనే దేవుడు మోషేను సీనాయి కొండమీదికి రమ్మని పిలిచాడు. దర్శనంలో మోషేకు ప్రత్యక్షపు గుడారాన్ని చూపించాడు. దాని నమూనాలను విశధంగా వివరించాడు. దాని ప్రకారం నిర్మించమని మోషేతో చెప్పాడు. ఆ ప్రత్యక్షపు గుడారంలో ఏయే బలియర్పణలు, ఎలా అర్పించాలో ఆ బలివిధానాన్ని ఏర్పాటు చేశాడు.

ఇశ్రాయేలీయులు తమ పాపపరిహారబలిని దేవునికి అర్పించాలను కొన్నప్పుడు వారు నిష్కళంకమైన ఎద్దును గాని, గొర్రెను గాని, మేకను గాని, గువ్వనుగాని, ఒక పావురాన్ని గాని తీసుకొని రావాలి. కొన్ని మినహాయింపు తర్వాత ఆ బలి అర్పణ తలపై తమ చేతులుంచి తమ పాపాలన్నీ దాని మీదికి వెళ్లాయని నిర్దారించుకోవాలి. (లేవీ 1:1-3). తర్వాత ఆ బలిఅర్పణగా తెచ్చిన దాన్ని గొంతుకోసి రక్తాన్ని సేకరించి ఆ రక్తాన్ని యాజకులకు యివ్వాలి. తర్వాత యాజకులా రక్తాన్ని తీసుకొని దహన బలిపీఠపు కొమ్ముల మీద కొంత వుంచి, మిగిలిన రక్తాన్ని నేలమీద కుమ్మరిస్తారు. బలియిచ్చిన జీవిని ముక్కలుగా కోసి ఆ ముక్కలను బలిపీఠం మీద వుంచి, వాటిని దహించి దేవునికి అర్పిస్తారు.

ఇలా చేసి ఇశ్రాయేలీయులు తమ పాపక్షమాపణను పొందుతారు. ఆ అర్పణను దహించేటప్పుడు దాని మాంసాన్నేగాక, దాని ప్రేగుల నుండి కొవ్వును తీసి దానిని, దాని కాలేయాన్ని దహించాలి. అలా చేసినప్పుడు దేవుడు వారి పాపాలను క్షమిస్తాడు.

అన్ని పాపాలకు విమోచన పొందే ఏకైక మార్గం.

మనలను మనం పరిశీలించుకొన్నప్పుడు మనం పాపం చేయకుండా వుండలేమన్న వాస్తవాన్ని తెలుసుకొంటాం. మనమెప్పుడూ పాపం చేస్తూనే బతుకుతూ వుంటాం. మనం బలహీనులమయ్యో, లేక అనేక నిందల వల్లనో, పేరాశ వల్లనో, అధిక అధికారం వున్నందు వల్లనో ఎందుకైనా గాని లెక్కలేనన్ని పాపాలు చేస్తూ వుంటాం. యేసును తమ రక్షకునిగా నమ్మినవారు కూడా పాపం చేయని వారొక్కరు కూడా వుండరు.

దేవుని నమ్ముతూ కూడా ఈవిధంగా ఎప్పుడూ పాపం చేస్తూ వుండి మన పాపాలన్నింటిని కడిగి వేసుకోవాలంటే యేసుక్రీస్తు బాప్తిస్మంలో నమ్మకముంచడ మొక్కటే ఏకైక మార్గం. ఆయన నీరు, రక్తం ద్వారా వచ్చిన దేవుడు (1యోహాను 5:6). ఆయన నీలధూమ్ర రక్తవర్ణాల దారం, పేనిన సన్నని నార ద్వారా బలిపీఠపు బలియర్పణగా ఈ లోకానికి వచ్చాడు. బాప్తిస్మం ద్వారా యేసు మన పాపాలను తన మీదికి తీసుకొని, సిలువ మీద రక్తాన్ని చిందించుట ద్వారా మన పాపాలకు మూల్యాన్ని చెల్లించి, దాని మీద చనిపోయినప్పుడు దానిని విశ్వసించిన మనం మన పాపవిమోచన పొందకుండా ఎలా వుంటాం ? మెస్సీయ అయిన యేసుక్రీస్తు యిచ్చిన రక్షణలో విశ్వాసముంచుట వలన మీరు, మన పాపాలకు ఒకేసారి విమోచనం పొందగలం. 

మనం ఎల్లప్పుడూ పాపం చేస్తున్నా, యేసు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన నెరవేర్చిన బాప్తిస్మం, కార్చిన రక్తం వలన మన పాపాలన్నిటి నుండి మనం విడిపించబడతాం. మన ప్రభువు తన బాప్తిస్మం వలన మన పాపాలన్నింటిని తనపైకి తీసుకొన్నాడు. ఈ లోకపాపాలను సిలువకు మోసుకొని వెళ్లాడు. సిలువ వేయబడ్డాడు. దాని వలన మన పాపాలన్నిటి నుండి మనలను పూర్తిగా విడిపించాడు. మన పాపాల కోసం బాప్తిస్మాన్ని పొంది, తన సిలువశిక్షతో మన పాపశిక్షను భరించి, మృతులలో నుండి సజీవునిగా లేచాడు. ఎవరైతే ఈ సత్యాన్ని నమ్ముతారో వారి పాపాల నుండి వారిని రక్షించాడు. మన పాపాలకు శిక్షను అనుభవించక తప్పించుకోలేక పోయినా, యేసు నీలధూమ్ర రక్తవర్ణాల దారం వలన యిచ్చిన రక్షణ ప్రేమ, కనికరాన్ని నమ్ముట ద్వారా మీరు, నేను రక్షించబడ్డాం. దేవుడే మన పాపాల నుండి మనలను రక్షించాడు. మనం ఆయనను నమ్ముట వలన మన పాపాల నుండి విమోచన పొందాం. దహన బలిపీఠం మనకు చెప్పే సత్యం యిదే.

ప్రత్యక్ష గుడారం లోపల ప్రతిదీ అందంగా వుంటుందని మీరనుకోవచ్చు. కాని మీరు నిజంగా దాని ఆవరణలో ప్రవేశించినప్పుడు మీరు ఊహించని అస్సాహ్యాన్ని కలిగించే సన్నివేశాన్ని ఎదుర్కొంటారు. ఇరుకోణాలు గల ఇత్తడి దహన బలిపీఠంలో నుండి ఏ సమయంలోనైనా పొగ, అగ్నిజ్వాలా వెళ్ళగ్రక్క వచ్చు, ఇత్తడి బలిపీఠం పాపాత్ముల కోసం ఎదురు చూస్తు వుంటుంది. దాని నే రక్తంతో తడిచి వుంటుంది. ప్రతిరోజూ బలియర్పణలు నిచ్చే ఈ స్థలంలో కాలుతూ వుండే మాంసం, కట్టె దుర్గంధం మిమ్ములను ముంచివేస్తుంది.

దహనబలిపీఠం మధ్యనుండి కాలువలా రక్తం ప్రవహిస్తు వుంటుంది. ఇశ్రాయేలీయులు పాపం చేసినప్పుడు వారు తమ బలిపశువును ప్రత్యక్షగుడారానికి తీసుకొని వస్తారు. దాని తలపై వారి చేతులుంచి వారి పాపాలన్నీ దాని మీదకి పోయేట్టు చేసి, దాని గొంతుకోసి, రక్తాన్ని సేకరించి, యాజకులకా రక్తాన్ని యిస్తారు. ఆ యాజకులు ఆ రక్తాన్ని దహన బలిపీఠం కొమ్ముల మీద వుంచి, మిగిలిన దానిని నేలపై కుమ్మరిస్తారు.

తర్వాత ఆ బలిపశువును ఖండాలు ఖండించి, దాని మూత్ర పిండాలు, కొవ్వుతో దాని మాంసాన్ని దాని తడికెల మీద వుంచి వాటిని దహిస్తారు. మొదట రక్తాన్ని సేకరించినప్పుడు అది ద్రవంగా ఎర్రగా కారుతూ వుంటుంది. కొంత సమయం అయిన తర్వాత అది గడ్డకట్టి జిగటగా అవుతుంది. మీరు ప్రత్యక్షపు గుడారంలో ప్రవేశించినప్పుడు భయం గొలిపే ఈ రక్తాన్ని చూస్తారు.

ఇశ్రాయేలీయులు దేవుని ఆజ్ఞను అతిక్రమించినప్పుడు తమ దహన బలియర్పణలాగే తాము ఆ బలిపీఠం మీద చనిపోవలసి వుంటుందని దహన బలిపీఠం ద్వారా గుర్తిస్తారు. దేవుడు రక్తంతో వారికి తన నిబంధన చేశాడు. గనుక వారూ అలా చేయాలి. ‘‘మీరు నా ధర్మశాస్త్రాన్ని అనుసరించిన యెడల మీరు నీ ప్రజలును, నాకు యాజక రాజ్యముగాను అవుతారు. మీరొకవేళ దానిని అనుసరించని యెడల ఈ బలిపశువును చంపినట్టే మీరూ చావవలసి వుంటుంది” అని దేవుడు రక్తంతో తన నిబంధన చేశాడు. కనుక దేవుడనుగ్రహించిన ఆ వాస్తవాన్ని అంగీకరించి, వారు పాపం చేసి, ధర్మశాస్త్రాన్ని భంగపరిస్తే వారు తమ రక్తాన్ని చిందించాలి.

ఇశ్రాయేలీయులే గాక, దేవుని నమ్ము వారందరూ తమ పాపాల నిమిత్తం రక్తాన్ని బలియర్పణగా అర్పించాలి. దీన్ని బట్టి, దేవుని ముందు పాపం చేసిన వారెవరైనా, వారి హృదయంలో పాపం వుంటుంది గనుక, అది పెద్దదైనా, చిన్నదైనా దాని పాప ఫలితమైన శిక్షను ఎదుర్కొనాలి. పాపమునకు జీతం మరణం అన్న తీర్పు నియమము, అందరికీ అన్వయిస్తుంది గనుక దేవుని తీర్పుకు నిజంగా భయపడి అలా దేవుని బలియర్పణా విధానంలో ప్రత్యక్షపరచిన దేవుని రక్షణ నియమాన్ని అనుసరించే వారు ఎక్కువమంది వుండరు అని తెలుస్తోంది.

పాపమునకు జీతం మరణం అన్న ధర్మశాస్త్రం ప్రకారం ప్రత్యక్ష గుడారపు ఆవరణ ద్వారం ద్వారా నీలధూమ్ర రక్తవర్ణాలదారం, పేనిన సన్నని నార వలన ప్రత్యక్షపరచబడిన మన పాపాలు నుండి, ఆ పాపశిక్ష నుండి యేసుక్రీస్తు మనలను రక్షించాడని దహన బలిపీఠం మనకు తెలియజేస్తోంది, ఎప్పుడు పాపం చేస్తూ, మన పాపశిక్షను అనుభవించాల్సిన మనకోసం యేసుక్రీస్తు మానవునిగా ఈ లోకానికి వచ్చాడు. యెహాను వలన బాప్తిస్మంతో మన మానవజాతి పాపాలనన్నింటిని తన మీదికి తీసుకొన్నాడు. ఈ లోకపాపాలను సిలువ మీదికి మోసుకొని వెళ్ళాడు. సిలువ వేయబడ్డాడు. ఆ సిలువ మీద తన రక్తాన్ని చిందించాడు. మహాశ్రమలను, బాధలను భరించాడు. తనకు తాను బలియర్పణగా అర్పించుకొన్నాడు. దాని ద్వారా మిమ్ములను, నన్ను మన పాపాలన్నిటినుండి రక్షించాడు.

క్రీస్తు తన స్వంత శరీరాన్ని బలియర్పించి మీరు, నేను మన పాపాల నుండి విడిపించబడునట్లు మన విశ్వాసం ద్వారా మనలను రక్షించాడు. తమ పాపాల నుండి తప్పించుకొనలేక వాటి వలన చనిపోయే వారికోసం. యేసుక్రీస్తు తన బాప్తిస్మం ద్వారా వారి పాపాలన్నిటిని తనపైకి తీసుకొన్నాడు. సిలువశిక్షతో చనిపోయాడు. మృతులలో నుండి సజీవునిగా లేచుట ద్వారా వారినందరినీ వారి పాపాల నుండి, పాపశిక్షనుండి రక్షించాడు.

మనమీ దహన బలిపీఠాన్ని చూసినప్పుడు మనమీ విశ్వాసాన్ని పొందుతూ, ఈ బలిపీఠం మీద ఎల్లప్పుడు ఈ బలియర్పణలను అర్పించడం చూసినప్పుడు మన అనుదిన పాపాల నిమిత్తం మనం చనిపోవలసివుండగా దేవుడు మనలను తన బలిపశువుగా మార్చక, మనకు బదుకుగా దేవుడే ఈ లోకానికి వచ్చి మన రక్షణ కార్యాన్ని నెరవేర్చాడని మనం తెలుసుకోగలుగుతాం. దానిని నమ్ముతాం. యేసు బాప్తిస్మాన్ని పొంది, సిలువ మీద తన రక్తాన్ని కార్చి, మృతులలో నుండి సజీవునిగా లేచి మనలను రక్షించాడు.

ఇందుకోసమే తండ్రియైన దేవుడు ఇశ్రాయేలీయులు బలియర్పణను అంగీకరించి, వారి పాపాల కోసం వారిని శిక్షంచక వాటినుండి వారిని క్షమించాడు. ఇశ్రాయేలీయులు తెచ్చిన బలిపశువు తలపై వారి చేతులుంచుట ద్వారా వారి పాపాలను వాటిపై మోపి, వారు వాటిని చంపి, దాని రక్తాన్ని మాంసాన్ని, దాని కొవ్వును అర్పించుట వలన దేవుడు వారి పాపాలను క్షమించాడు. ఇది కేవలం దేవుని కనికరము, ప్రేమ వలన గాక మరొకటి కాదు.దేవుడు ఒక్క ధర్మశాస్త్రంతోనే మనతో వ్యవహరించలేదు.


దేవుడు మిమ్ములను, నన్ను, ఇశ్రాయేలీయులనందరినీ తన ధర్మశాస్త్రం ప్రకారం తీర్పు తీరిస్తే ఎంతమంది ఈ భూమి మీద సజీవంగా వుండగలరు? దేవుడ తన ధర్మశాస్త్రంతో మనలను కొలిచి, తీర్పు తీరిస్తే మనలో ఒక్కరు కూడా ఒక్కరోజు కూడా బ్రతకరు. మనలో అనేకమంది 24 గంటలు కూడా బ్రతికి ఉండరు. కొద్ది నిమిషాల్లోనే చనిపోతారు. మనలో కొందరు 10 గంటల పాటు బ్రతికి వుంటే మనం కొన్ని నిమిషాలు కూడా బ్రతికి వుండం. ఈ బేధంలో గుర్తించాల్సిందేమీ లేదు. మన మందరం చనిపోవలసినవారమే. ప్రజలు యిప్పటిలా వారు 60,70,80 సం.లు ఇంకా ఎక్కువగా జీవించి వుండరు, ఒక్క క్షణంలో అందరూ శిక్షను పొందుతారు.

ఈ ఉదయం ఏం జరిగిందో ఆలోచించండి. మీ అబ్బాయి మంచంమీద నుండి లేవడానికి యింకా కష్టపడుతున్నాడు. నిద్రమత్తు వదలక. రాత్రంత పార్టీ జరుపుకొంటూ నిద్రలేకుండా వున్నాడా? ఆ అబ్బాయిని నిద్రలేపడానికి నీ భార్య ప్రయత్నిస్తోంది. తల్లి నిద్ర లేపినందుకు మీ అబ్బాయి ఆమె మీద అరుస్తున్నాడు. అతడలా విసుక్కొంటున్నందుకు నీ భార్య నీ కుమారుని మీద కేకలు వేస్తోంది. అలా ఉదయపు పోరాటం మొదలవుతుంది. చివరికి ఆ తల్లి కుమారులిద్దరూ దేవుని ముందు పాట పాడటంతో ఆ తతంగం ముగుస్తుంది. ఆ యిద్దరూ యిప్పటికీ ఆ అలవాటు మార్చుకోలేదు. ఆ పాపానికి వారిద్దరూ శిక్షార్హులవుతారు.

అయితే దేవుడు తన ధర్మశాస్త్రం ఒక్కదానితోనే మనతో వ్యవహరించడు, ‘‘మన పాపమును బట్టి ప్రతికారము చేయలేదు. మన దోషమును బట్టి మనకు ప్రతిఫలమియ్యలేదు’’ (కీర్తన 103:10)

నీతిమంతమైన తన ధర్మశాస్త్రంతో మనలను తీర్పు తీర్చడానికి బదులు ఈ నీతిమంతమైన ధర్మశాస్త్రాన్ని మనపట్ల నెరవేర్చడానికి, మన స్థానం తీసుకొనే విధంగా బలియర్పణా విధానాన్ని ఏర్పాటు చేశాడు. ఆ బలిపశువు తలపై మన చేతులుంచి మన పాపాలన్నీ దాని మీదికి పోయేట్టు మన ప్రాణానికి బదులు ఆ బలిపశువు రక్తాన్ని ఆయనకు అర్పించుట ద్వారా మన ప్రాణానికి బదులు ఆ బలిపశువు ప్రాణాన్ని దేవుడు అంగీకరించాడు. అలా మానవజాతి పాపాలన్నింటిని, మన పాపాలను ఇశ్రాయేలీయుల పాపాలను క్షమించి మనలను రక్షించాడు. మనం మళ్లీ జీవించునట్లు చేశాడు. ఇశ్రాయేలీయులను దేవుని రాజ్య యాజకులనుగా చేసుకొన్నాడు.

ఇక్కడ వివరించిన బలియర్పణ యేసుక్రీస్తును సూచిస్తుంది. పాపానికి శిక్ష అనుభవించాల్సిన మనకోసం, బాప్తిస్మం ద్వారా మన పాపాలనన్నింటిని తన మీదికి తీసుకొన్నాడు. తనరక్తాన్ని చిందించాడు. సిలువ మీద చనిపోయాడు. మన పాపాల నిమిత్తం యేసుక్రీస్తు ఈ బలియర్పణగా అయ్యాడు. మన పాపాల నుండి మనలను రక్షించడానికి దేవుని అద్వితీయ కుమారుడు తండ్రియైన దేవుని చిత్తానికి విధేయుడుగా మానవునిగా ఈ లోకానికి వచ్చాడు. తన బాప్తిస్మం ద్వారా బలిఅర్పణగా అయ్యాడు. ఆయన యోహాను వలన పొందిన తన బాప్తిస్మము వలన మానవజాతి పాపాలను తనపైకి తీసుకొన్నాడు. ఈ లోకపాపాలను సిలువకు మోసుకొని వెళ్లాడు. సిలువ వేయబడ్డాడు. తన రక్తాన్ని కార్చాడు. అలా తనను తాను బలిగా యేసుక్రీస్తు మిమ్ములను, నన్ను పూర్తిగా రక్షించాడు.

మన స్థానంలో యేసు బాప్తిస్మం తీసుకొని, సిలువ వేయబడి, మూడవనాడు మృతులలో నుండి సజీవుడుగా లేచాడన్న రక్షణ వాక్యాన్ని మనం విన్నప్పుడు మన హృదయాలు బహుగా ప్రేరణ పొందుతున్నాయి. నిష్కళంకుడైన యేసు మన కోసం తన బాప్తిస్మం ద్వారా మన పాపాలన్నీ ఆయన మీదికి తీసుకొని, ఈ మన పాపాలకు జీతంగా ఆయన అన్ని రకాల హింసలను, దెబ్బలను, బాధలను, శ్రమలను చివరికి మరణాన్ని మన స్థానంలో అనుభవించాడు. అలా యేసుక్రీస్తు మన పాపాల నుండి మనలను రక్షించగా ఈ సత్యాన్ని నమ్మని దాని కంటే మించిన అపకార బుద్ధి మరొకటి వుందా, వుంటుందా!నీల ధూమ్ర రక్తవర్ణాల దారం ద్వారా నెరవేర్చిన రక్షణను మనం నమ్మాలి.


మన పాపాలను, వాటి ఫలితమైన మన శిక్షను యేసుక్రీస్తు తన బాప్తిస్మం ద్వారా మనకోసం భరించి తనను తాను బలి అర్పించుకొని నిన్ను, నన్ను రక్షించగా ‘‘నీకు కృతజ్ఞతలు ప్రభువా!’’ అని చెప్పగల విశ్వాసం మనలో వుండాలి. చాలామంది ప్రేమకథలు, జీవితచరిత్రలు విని సులభంగా ప్రతిస్పందిస్తూ వుండగా, దేవుని షరతుల్లేని ప్రేమ కథను విన్నప్పుడు వారిలో ఏ మాత్రం స్పందనలేని హృదయాలతో వుంటున్నారు. ఎంతో గొప్పదైన మన ప్రభువు కృపలో ఆయన మన నిమిత్తం బాప్తిస్మం తీసుకొని, సిలువ మీద మనకోసం, మన నిమిత్తం చనిపోగా, అది తెలుసుకోలేక అందుకు కృతజ్ఞతలు కూడా చూపలేని వారు పశువుల వంటి మనస్తత్వం గలవారు గాక మరేమిటి?

దేవుని కుమారుడైన యేసుక్రీస్తు మనకోసం ఈ లోకానికి మానవునిగా వచ్చి, బలియర్పణ అయ్యాడు. తన బాప్తిస్మం ద్వారా మన పాపాలన్నింటిని తనవిగా అంగీకరించి, సిలువకు తన శరీరాన్ని అప్పగించి తనను తాను సిలువ మీద బలియాగం చేసుకొన్నాడు. ఆయన్ను చెంప మీద కొట్టారు. బట్టలు వూడదీసి కొరడాలతో కొట్టారు, హింసించారు, నలుగ గొట్టారు, ఇదంతా మనకోసమే. ఇవన్నీ అనుభవించి ఆయన మనలను రక్షించాడు. ఈ సత్యాన్ని నమ్ముట ద్వారా మనం ఆయన బిడ్డలమైనాము. బాషలోని మాటలన్నీ వ్యక్తం చేయలేని దేవుని మహాకృపవల్ల కలిగే ప్రతిస్పందన. ఇలా క్రీస్తు మనలను రక్షించగా, చాలామంది యింకా ఈ సత్యాన్ని విని నమ్మక, కనీసం కృతజ్ఞత కూడా తెలియజేయని వారిని చూస్తుంటే నాకెంతో దుఃఖము కలుగుతోంది.

యేసు ఈ లోకానికి వచ్చి, బాప్తిస్మాన్ని తీసుకొని, నీవు నేను రక్షణపొందునట్లు ఆయన తనను బలిగా అర్పించుకొన్నాడు. అందుకని యెషయా యిలా అంటున్నాడు, ‘‘మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత కలుగుచున్నది’’ (యెషయా 53:5).

మన జీవితకాలమంతా మన పాపం చేస్తూనే వుంటాం. మనలను రక్షించడానికి, మన పాపాలన్నింటికి శిక్ష, నాశనం, శాపాలను తప్పించు కోవాలనుకొనక మన ప్రభువు ఆ శిక్షను అనుభవించడానికి పరలోకరాజ్య సింహాసనాన్ని విడిచిపెట్టి ఆ పరలోకం నుండి ఈ లోకానికి దిగి వచ్చాడు. యోహాను ముందు ఆయన తన తలను వంచి బాప్తిస్మాన్ని తీసుకొన్నాడు. ఈ పాపాలను సిలువకు మోసుకొనిపోయి, మహాశ్రమలనుభవించి, ఆయన హృదయంలోని చివరి రక్తపుబొట్టు వరకు కార్చి చనిపోయి మృతులలో నుండి మళ్లీ సజీవునిగా లేచాడు. అలా మన కొరకు బలి అర్పణయై, మన రక్షణకు నిజమైన దేవుడయ్యాడు.

ఈ వాస్తవాన్ని గురించి విూరు ఆలోచిస్తున్నారా? దీనిని హృదయాంతరాల్లో దాచుకొన్నారా? విూరు వాక్యాన్ని విన్నప్పుడల్లా ఆ వాక్యాన్ని తప్పక నమ్మి, హృదయస్పందన కలిగి, యేసు క్రీస్తు తన ప్రజలను వారి పాపాల నుండి రక్షించడానికి మానవునిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన బాప్తిస్మాన్ని తీసుకొన్నాడు. సిలువ వేయబడి చనిపోయాడు. తన ప్రజలను రక్షించడానికి ఆయన పునరుత్థానుడైనాడు. మన మందరం నరకపాత్రులమని మనం గ్రహించినప్పుడు ఈ రక్షణ ఎంత గొప్ప ప్రేరణాత్మకమైనదో మన హృదయాలలో గ్రహించి, కృతజ్ఞత కలిగివుంటాం. మనం దేవుని నమ్మి, ఆయన ప్రజలుగా వుండాలని కోరుకున్నా, మనంతట మనంగా దానిని సాధించుకోగలిగిన మార్గం లేనేలేదు. అయితే మన పాపవిమోచన కోసం నిజంగా వెదకే మిమ్ములను, నన్ను ఆయన తన సత్యవాక్యంతో కలుసుకొని ఈ లోకానికి వచ్చి, బాప్తిస్మం తీసుకొని, సిలువ మీద చనిపోయి, మూడవనాడు మృతులలో నుండి సజీవునిగా లేచాడు.

ఒకవేళ యేసుగాని ఈ బలియాగం చేయకుండా వుండి వుంటే మనం రక్షణ ఎప్పుడైనా పొందగలిగి వుండేవారమా? ఎప్పటికి పొందలేక పోయేవారం! యేసు బాప్తిస్మం తీసుకొనకపోతే, సిలువలో రక్తం కార్చకపోతే, రక్షణ ప్రత్యక్షగుడారపు నీలధూమ్ర రక్తవర్ణాల దారం, పేనినసన్నని నారలో ప్రత్యక్ష పరచకపోయినట్లయితే రక్షణ మనకు కలవంటిదిగా వుండేది. ఆయన బలియాగం చేయకుండా వుంటే మన పాపాల నుండి, వాటి శిక్ష నుండి మనం ఎన్నటికి విడిపించబడి వుండే వారం కాదు. నిత్యనరకాగ్నిలో వేయబడి నిత్యం నరక బాధపడుతూ వుండేవారం. అయితే పాతనిబంధన బలియర్పణా విధానంలా క్రీస్తు మనకు తనను బలియర్పణగా అర్పించుకొని మనలను రక్షించాడు.నీలధూమ్ర రక్తవర్ణాల దారంలోని రక్షణ కొత్త నిబంధనలో నెరవేర్చబడింది.


ప్రియమైన పాఠకులారా, ప్రత్యక్షపు గుడారానికి వుపయోగించిన నీలధూమ్ర రక్తవర్ణాల దారం, పేనిన సన్నని నారలోని సత్యాన్ని మీరెన్నటికి మరచిపోకూడదు. పేనిన సన్నని నార అనే వాక్యం పాత, కొత్త నిబంధనకు సంబంధించిన వాక్యం. చాలా కాలం క్రితం నేను మీ స్వంత రక్షకునిగా మన దగ్గరకు వస్తానని దేవుడు వాగ్ధానం చేసిన వాక్యం అది. ఈ వాగ్ధానాన్ని అనుసరించి, యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. యేసు ఈ లోకానికి రావడం తన బాప్తిస్మం ద్వారా మన పాపాలన్నీ తనమీదికి తీసుకోడాన్ని నీలంరంగు దారం మనకు వివరిస్తోంది. మన పాపాల నుండి మనలను రక్షిస్తానని, మన శిక్ష నుండి విడిపిస్తానని ఆయన చేసిన వాగ్ధానాన్నిబట్టి ఆయన యోహాను వలన బాప్తిస్మాన్ని తీసుకొన్నాడు. దాని ద్వారా మన పాపాలను, ఈ లోకంలోని ప్రతి ఒక్కరి పాపాలను తన మీదికి తీసుకొన్నాడు. ఈ లోక పాపాలన్నింటిని భరించాడు. యేసు మన నిమిత్తం బలియర్పణగా వచ్చి తన బాప్తిస్మం ద్వారా మన పాపాలన్నీ ఆయన మీదికి తీసుకొన్నాడన్న సత్యాన్ని మనం ఎన్నటికి మరచి పోకూడదు. ఒకవేళ మరచిపోతే మనకు రక్షణ లేదు.

అసలు కాదనకుండా మనం ఈ జీవితంలో మనకు మనం తరచుగా గర్వంతో బతుకూతు వుంటాం. మరొకరు తనను గూర్చి తాను గొప్పు చెప్పుకోవడం విని సహించలేక పోయినా, తమను గూర్చి తాము ఆడంబరాలు చెప్పుకోడాన్ని ప్రజలు ప్రేమిస్తారు. కాని నేను నా గురించి కాక మరో వ్యక్తిని గూర్చి గొప్పగా చెప్పడం మొదలుపెట్టిన సమయం వచ్చింది. నన్ను నీల ధూమ్రరక్తవర్ణాల దారం, పేనిన సన్నని నార ద్వారా యేసు రక్షించినప్పుడు నేనాయనకు విధేయుడనైనప్పుడు ఈ సందర్భం వచ్చింది. అంటే నేను యేసును గూర్చి గొప్పగా చెప్పే సందర్భం వచ్చింది. మన పాపాలు తుడిచి వేయడానికి, యేసు తన బాప్తిస్మం ద్వారా మన పాపాలన్నింటిని తన మీదికి తీసుకొన్నాడు. ఆయన బాప్తిస్మం తీసుకొన్నాడు అని యిప్పుడు వీలైనప్పుడల్లా యేసును గూర్చి గొప్పగా చెబుతూ వుంటాను. ఈ సత్యాన్ని గూర్చి గొప్పగా చెప్పకుండా, దీనిని బోధించకుండా, దేవునికే సమస్త మహిమను యివ్వకుండా నేనెప్పుడూ తప్పిపోను.

అయినప్పటికి, తాము యేసును నమ్ముతున్నామని ప్రకటిస్తూ, ఆయన పొందిన బాప్తిస్మ సందర్భాన్ని విడిచిపెట్టి ఆయన్ను గూర్చిన వాక్యాన్ని బోధిస్తూ, లేక ఆయన పేరు చెప్పుకుంటూ తమను గూర్చి గొప్ప చెప్పుకొంటున్న వారు అనేకులున్నారు. ఒక అసత్య పరిచారకుడున్నాడు. తాను నెలకు రూ.300లు ఆదాయంతో మాత్రమే బ్రతుకుతున్నానని ఆడంబరాలు చెప్పుకొంటూ వుంటాడు. అది తాను మాత్రమే సాధించిన గొప్ప కార్యంగా చెప్పుకొంటూ వుంటాడు. తాను ప్రయాణాలు చేసేటప్పుడు ఎవరినుండి ఏ మాత్రం తీసుకోనని, తను అనుచరులే అ ప్రయాణ ఖర్చులన్నీ భరిస్తారని చెబుతూ వుంటాడు. అంటే ఆ విశ్వాసుల డబ్బు డబ్బు కాదా? అది ఆయన లెక్కలోకి రాదా? తను ఖర్చుచేసినదే ఆయన లెక్కలోనికి వస్తుందా? ఈ క్రైస్తవ సేవకుడేం చెబుతాడంటే, తనకు ఏదైనా అవసరం అయినప్పుడు తాను ప్రార్థన చేస్తాను అని చెబుతాడు. అప్పుడు ‘‘దేవా, నేను నిన్ను నమ్ముతున్నాను. నా ప్రయాణ ఖర్చులు దయచెయ్యి!’’ అని ప్రార్థిస్తాడట. ఇలా ప్రార్థన చేసినప్పుడు ఒక పరిశుద్ధుడు ముందుకువచ్చి తన ప్రయాణ ఖర్చులకు అవసరమైన ధనాన్ని తనకు యిస్తాడు అని ఆ నాయకుడు సాక్ష్యం చెబుతుంటాడు. ఇలాంటి వారిని చూసినప్పుడు మీలో ఎలాంటి ఆలోచనలు కలుగుతూ వుంటాయి?

మత్తయి 3:13-17 యిలా వివరిస్తోంది, ‘‘ఆ సమయమున యోహాను చేత బాప్తిస్మము పొందుటకు, యేసు గలిలయ నుండి యొర్దాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చెను. అందుకు యోహాను నేను నీచేత బాప్తిస్మము పొందవలసినవాడనై యుండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా? అని ఆయనను నివారింపజూచెను గాని, యేసు ఇప్పటికి కానిమ్ము, నీతి యావత్తు ఈలాగు నెరవేర్చుట మనకు తగియున్నదని అతనికి వుత్తరమిచ్చెను గనుక అతడాలాగు కానిచ్చెను. యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డుకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరువబడెను. దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు. ఈయనయందు నేనానందించుచున్నానని యొక శబ్ధము ఆకాశము నుండి వచ్చెను.’’ యేసు బాప్తిస్మమిచ్చు యోహానుచేత యొర్దాను నదిలో బాప్తిస్మం తీసుకొని, నీళ్లలో నుండి ఒడ్డుకు వచ్చినప్పుడు, పరలోక ద్వారం తెరచుకొన్నది, ‘‘ఈయన నాప్రియ కుమారుడు, ఆయన యందు నేను ఆనందించుచున్నాను. అన్న తండ్రియైన దేవునిస్వరం వినిపించింది. ఆ సమయంలో బాప్తిస్మమిచ్చు యోహాను ఆశ్చర్యంతో నిశ్చేష్ఠుడైనాడు.

యొర్దాను నది దగ్గర బాప్తిస్మమిచ్చు యోహాను ఆశ్చర్యపోయిన సందర్భాలు రెండున్నాయి. మొదటిసారి, యేసు తన దగ్గరకు రావడం, తన వలన బాప్తిస్మం పొందాలని అన్నప్పుడు. రెండోది, యేసుకు బాప్తిస్మం యిచ్చిన తరువాత పరలోక ద్వారం తెరువబడి ‘‘ఈయనే నా ప్రియకుమారుడు ఈయన యందు నేనాందించుచున్నాను’’ అని తండ్రియైన దేవుని స్వరం విన్నప్పుడు.

బాప్తిస్మమిచ్చు యోహాను వలన యేసు బాప్తిస్మం పొందాల్సిన కారణం (అవసరత) ఏమిటి? మత్తయి 3:15 దానికి జవాబు చెబుతోంది. 15, 16 వచనాలు చదువుదాం. ‘‘యేసు, ఇప్పటికి కానిమ్ము నీతియావత్తు ఈలాగు నెరవేర్చుట మనకు తగియున్నదని అతనికి వుత్తరమిచ్చెను గనుక అతడాలాగు కానిచ్చెను. యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరువబడెను. దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను.’’

యేసు బాప్తిస్మమిచ్చు యోహాను చేత ఎందుకు బాప్తిస్మం తీసుకొన్నాడో మత్తయి 3:15 వివరిస్తోంది. యేసు పరలోక రాజ్యప్రధాన యాజకుడు, దేవుని అద్వితీయ కుమారుడు అయినా,ఆయన తన ప్రజలైన మనలను మన పాపాల నుండి రక్షించడానికి ఈ లోకానికి మానవునిగా వచ్చాడు. మరో మాటల్లో చెప్పుకొంటే, మన పాపాలను తన మీదికి తీసుకొని, మన స్థానంలో చనిపోయి, మన పాపాలకు మూల్యం చెల్లించడానికి యేసు ఈ లోకానికి బలియర్పణగా వచ్చాడు. ఇందుకోసమే బాప్తిస్మమిచ్చు యోహానుతో బాప్తిస్మం తీసుకొడానికి యేసు ప్రయత్నించాడు.

అయితే బాప్తిస్మమిచ్చు యోహాను వలన తప్ప మరొకరి ద్వారా యేసు ఎందుకు బాప్తిస్మం తీసుకోలేదు? ఎందుకంటే స్త్రీకు పుట్టిన వారందరిలో యోహాను గొప్పవాడు. మానవజాతికి ప్రతినిధి. మత్తయి 11:11 యిలా వివరిస్తోంది., ‘‘స్త్రీలు కనినవారిలో బాప్తిస్మమిచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.’’ పాతనిబంధన కాలం నుండి బాప్తిస్మమిచ్చు యోహాను దేవుని సేవకుడని మలాకీ గ్రంధం ప్రవచించింది. యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినం రాక మునుపు నేను ప్రవక్తయగు ఏలీయాను మీ యొద్దకు పంపుదును (మలాకీ 4:5). దేవుడు పంపిస్తానని వాగ్ధానం చేసిన ఆ ఏలీయాయే ఈ యెహాను.

బాప్తిస్మమిచ్చు యెహానును దేవుడు ఏలీయా అని ఎందుకన్నాడు? ఇశ్రాయేలీయుల హృదయాలను దేవుని వైపు త్రిప్పిన ప్రవక్త ఏలీయా ఆ సమయంలో ఇశ్రాయేలీయులు బయలు దేవతను తమ దేవునిగా ఆరాధిస్తున్నారు. కాని నిజమైన దేవుడు బయలో, యెహోవాయో ఏలీయా వారికి ప్రత్యక్షంగా చూపించాడు. ప్రవక్త అయిన ఏలీయా తన విశ్వాసంతోను, బలియర్పణ ద్వారాను సజీవుడైన దేవుడెవరో ఇశ్రాయేలీయులకు చూపించాడు. దాని ద్వారా విగ్రహారాధన చేస్తున్న వారిని నిజమైన దేవుని వైపు తిప్పాడు. ఇందుకని పాతనిబంధన అంతంలో ‘‘నేను మీకు ఏలీయాను పంపిస్తానని” దేవుడు వారికి వాగ్ధానం చేశాడు. దేవుని స్వరూపంలో చేయబడిన మానవులందరూ విగ్రహారాధన, దయ్యాలను ఆరాధించడమనే తప్పు మార్గంలో వున్నారు. కనుక వారిని మళ్ళీ దేవుని దగ్గరకు నడిపించే తన సేవకుని వారి కోసం పంపిస్తానని దేవుడు చెప్పాడు. అలా వచ్చినవాడే బాప్తిస్మమిచ్చు యోహాను.

‘‘యెహాను కాలము వరకు ప్రవక్తలందరు ప్రవచించుచు వచ్చిరి. ధర్మశాస్త్రము సహా ప్రవచించుచుండెను. ఈ సంగతి నంగీకరించుటకు మీకు మనస్సుంటే మీకు మనస్సుంటే రాబోవు ఏలీయా యితడే.’’ అని మత్తయి 11:13-14 వివరిస్తోంది. రాబోవు ఏలీయా బాప్తిస్మమిచ్చు యోహానే. 11-12 వచనాలు యిలా వివరిస్తున్నాయి., ‘‘స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మమిచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అయినను పరలోక రాజ్యములో అల్పుడైనవాడు అతనికంటే గొప్పవాడు, బాప్తిస్మమిచ్చు యోహాను దినము మొదలుకొని యిప్పటి వరకు పరలోకరాజ్యము బలాత్కారముగా పట్టబడుచున్నది.’’

కాగా ‘‘స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మమిచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదు” అని యిక్కడ చెప్పడంలో ఉద్దేశం ఏమిటంటే బాప్తిస్మమిచ్చు యెహానును దేవుడు మానవజాతి ప్రతినిధిగా లేవనెత్తాడు. యేసు జననానికి ఆరు నెలలు ముందుగా బాప్తిస్మమిచ్చు యోహాను పుట్టేట్లు చేశాడు దేవుడు. అతణ్ణి పాతనిబంధనకు చివరి ప్రవక్త గాను, చివరి యాజకునిగాను దేవుడు సిద్ధపరిచాడు. కాగా ఈ లోక ప్రధాన యాజకునిగా బాప్తిస్మమిచ్చు యోహాను మానవుల పాపాలన్నీ ఆయన మీదకు పోయేట్టు యేసుకు బాప్తిస్మమిచ్చాడు. అలాగే లోక పాపాలన్నింటిని తనపైకి తీసుకోడానికి యేసు బాప్తిస్మమిచ్చు యోహాను చేత బాప్తిస్మాన్ని తీసుకొన్నాడు.

ఇందుకనే మత్తయి 3:15లో యేసు యిలా వివరించాడు, ‘‘ఇప్పటికి కానిమ్ము, నీతియావత్తు నెరవేర్చుట మనకు తగియున్నది. అంటే - యేసు బాప్తిస్మమిచ్చు యోహాను వలన బాప్తిస్మం తీసుకొని లోక పాపాలన్నీ అంగీకరించు వల్లనే నీతి యావత్తు నెరవేర్చబడాలి. కనుక అది తగియున్నది.’’ఈ పద్ధతిలో మన ప్రభువు పాపాత్ములను రక్షించాడు.


బాప్తిస్మమిచ్చు యోహాను వలన యేసు తీసుకొన్న బాప్తిస్మం, పాతనిబంధనతో బలిపశువు తలపై చేతులుంచి వారి పాపాలు దాని మీదికి పోయేట్టు చేయు విధానం ఒక్కటే. అంటే పాత నిబంధనలో దహన బలిపీఠం. ముందు బలిపశువు మీదికి తమ పాపాలు పోయేట్టు దాని తలపై చేతులుంచడం వంటిది. యేసు ఈ లోకానికి వచ్చి, బాప్తిస్మాన్ని పొందుట ద్వారా, పాపాత్ములు తమ అనుదిన పాపాలు వారి బలియర్పణపై పోవునట్లు దాని తలపై తమ చేతులుంచాలన్న వాగ్ధానాన్ని సంవత్సరాంతమున ఏడవ నెల ఏడో తారీఖున పాపపరిహార దినాన ప్రధాన యాజకుడు ఇశ్రాయేలీయుల పాపాలన్నీ బలిపశువుపైకి పోవునట్లు దాని మీద తన చేతులుంచే వాగ్ధానాన్ని యేసుక్రీస్తు తన బాప్తిస్మం ద్వారా నెరవేర్చాడు.

పాతనిబంధనలో బలిపశువు తలపై చేతులుంచినట్లే, యేసు లోక పాపాలన్నింటిని తన మీదికి తీసుకోడానికి అంగీకరించాడు గనుక ఈ పాపాలకు మనకు వచ్చే శిక్షను మన స్థానంలో ఆయన భరించి తనను తాను బలియాగంగా అర్పించుకొని మన పాపాలనన్నింటిని కడిగివేశాడు. ఇలా యేసుక్రీస్తు మన రక్షణకు నిజమైన దేవుడు అయినాడు అలా, మన పాపాల నిమిత్తం, శిక్షగా మరణాన్ని, శిక్షణ ఎదుర్కొనక తప్పదని మనం ఒప్పుకొని తీరాలి. ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. మన రక్షకుడైన యేసు మన కోసం ఈ లోకానికి వచ్చి, మన కోసం తనను తాను బలియర్పణగా అర్పించు కొన్నాడని మనం తెలుసుకోవాలి. అంటే ఆయన రక్షణ కార్యాలైన ఆయన బాప్తిస్మం, సిలువ శిక్ష, పునరుత్థానం ద్వారా యేసుక్రీస్తు మన పాపాలన్నింటిని కడిగివేసి, వాటి నుండి పూర్తిగా మనలను రక్షించాడు. ఇంకా ఆయన రక్షణ కార్యాన్ని నెరవేర్చి, ఆయన పూర్తిచేసిన రక్షణను మనకు వరంగా యిచ్చాడని మనం నమ్మాలి. ఒక వ్యక్తి నమ్మునట్లు ఆయనను రక్షకునిగా అంగీకరించునట్లు, అతను తప్పక రక్షణ పొందునట్లు యేసుక్రీస్తు సమస్త నీతిని నెరవేర్చాడు.

మనం దీనిని గ్రహించునట్లు ప్రత్యక్షగుడారపు ఆవరణ ద్వారం నీలధూమ్ర రక్తవర్ణాల దారంతోను, పేనిన సన్నని నారతోను వేయబడింది. మనం ప్రత్యక్షగుడారపు ఆవరణ ద్వారం తెరచి ఈ ద్వారంలో ప్రవేశించగానే యిందుకోసమే మొదటిగా దహన బలిపీఠాన్ని చూస్తాం. దహన బలిపీఠం దగ్గర అర్పించే అర్పణలు యేసుక్రీస్తు మనలను ఎలా రక్షిస్తాడో సూచించే ముంగుర్తులు. దహన బలిపీఠం మీద బలియిచ్చే అర్పణలు దానిని బలియిచ్చే పాపాత్ములు దాని తలపై చేతులుంచడం ద్వారా వారి పాపాలను అది అంగీకరించిన తర్వాత, ఆ పాపాత్ముని స్థానంలో చనిపోయేవరకు తన రక్తాన్ని కార్చాలి. అప్పుడా బలిపశువు రక్తాన్ని బలిపీఠం కొమ్ముల మీద వుంచి, మిగిలిన దానిని భూమిమీద చిలకరించాలి.

తర్వాత ఆ బలిపశువు మాంసాన్ని, కొవ్వును బలిపీఠం మీద దహన బలిగా అర్పించాలి. దేవునికి బలియర్పణను అర్పించే విధానాలివి. ఈ బలియర్పణా విధానంలోని అన్ని ఆకృతులన్నింటిని నెరవేర్చుట ద్వారా యేసుక్రీస్తు మనకు రక్షకుడైనాడు. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మనలనీ విధంగా రక్షిస్తాడని దేవుడు మనకీ బలియర్పణ విధానం ద్వారా చూపించాడు.

దహన బలిపీఠం దగ్గర బలి అర్పించే పశువు తలపై దాని నర్పించే పాపాత్ములు తప్పక వారి చేతులు వాటి మీద వుంచాలి. ఈ సత్యాన్నే ప్రత్యక్ష గుడారం నీరు, ఆత్మల సువార్తను మనకు తెలియజేస్తుంది. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మానవజాతి పాపాలను తనపై తీసుకొన్నాడు. తండ్రియైన దేవుని ముందు పాపాత్ములందరి పక్షంగా బలియర్పణ అవడానికి యేసు పొందిన రక్షణ విధానమే బాప్తిస్మం.

ఈ ప్రత్యక్ష గుడారం ద్వారా యిప్పుడు మనకు స్పష్టమైన విశ్వాసముంది. పాప పరిహార దినాన ప్రధాన యాజకుడు తన చేతులను బలిపశువు తలపై వుంచుట వలన ఆ బలిపశువు ఇశ్రాయేలీయులందరి పాపాలను అంగీకరించినందు వల్ల ఆ పాపాలన్నీ దాని మీదికి వెళ్లినట్లే (లేవీ 16 అధ్యాయం) మన పాపాలనన్నింటిని తన మీదికి తీసుకొని, ఆ పాపాల నిమిత్తం పాపాల నుండి, ఆ పాపశిక్ష నుండి మనలను రక్షించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఈ రక్షణ ప్రేమను మనమిప్పుడు పూర్తిగా నమ్మగలం. ఈ సత్యాన్ని నమ్ముట ద్వారా మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లించి, ఆయనిచ్చిన ఈ రక్షణ ప్రేమ బాకీని తీర్చాలి.

ప్రత్యక్ష గుడారాన్ని గూర్చిన అవగాహన జ్ఞానం ఒక వ్యక్తికి ఎంత వున్నా ఆ వ్యక్తి అది తేలియజేసే సత్యాన్ని నమ్మకపోతే అప్పుడా వ్యక్తి అవగాహన జ్ఞానమంతా నిరుపయోగమైనదే. అలా యేసుక్రీస్తు బాప్తిస్మం నిజంగా ఎంత ముఖ్యమైనదో మనం గ్రహించడమే గాక దానిని నమ్మాలి. ప్రత్యక్షపు గుడారానికి మూడు ద్వారాలున్నాయి. అన్నీ కూడా నీల ధూమ్ర రక్తవర్ణాల దారం, పేనిన సన్నని నారతో నేసినవే. ప్రజలు ప్రత్యక్షపు గుడారపు ఆలయ ద్వారాన్ని గూర్చి వారికున్న అమాయకత్వాన్ని బట్టి వాటిని వెవ్వేరుగా వ్యక్తం చేయవచ్చు.

ఆ దారాల వరుస క్రమంలో మొదట నీలం దారాన్ని వేయాలి. దానిననుసరించి ధూమ్ర, రక్తవర్ణ దారాలను, పేనిన సన్నని నారను వేయాలి. అలా క్రమంలో ద్వారానికి ఆ రంగును వాడాలని పాతనిబంధన కాలంలో దేవుడు ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించాడు దానిని ప్రత్యక్షపు గుడారపు సరైన ద్వారం అని వివరిస్తారు.

ఆ ద్వారాలను యిలా చేయడానికి కారణం వుంది. యేసుక్రీస్తు కన్య మరియ ద్వారా ఈ లోకంలో మనరక్షకునిగా పుట్టినా మొదటిగా మన పాపాలను తన మీదికి తీసుకొనడానికి బాప్తిస్మాన్ని పొందనట్లైతే ఆయన మనకు నిజమైన రక్షకుడైవుండే వాడు కాడు. ఆయన బాప్తిస్మాన్ని పొందక పోయినట్లయితే ఆయనని సిలువ వేసేవారు కాదు, దానిమీద ఆయన చనిపోయేవారు కాదు. అందుకని నీలం దారాన్ని మొదట నేయాలి. దానికి సంబంధించిన ప్రాముఖ్యత కూడా క్లిష్టమైనదే.దేనిలో మనం నమ్మకముంచాలి?


కనుక మన పాపాల నుండి మనలను రక్షించిన యేసుక్రీస్తును మనం నమ్మాలి. దేవుని కుమారుడు, మన రక్షకుడైన యేసుక్రీస్తు యిచ్చిన రక్షణలో మాత్రమే మనం నమ్మకముంచినప్పుడు నిజంగా తిరిగి పుడతాం. దేవుని కుమారుని మన రక్షణకు దేవునిగా నమ్మినప్పుడు, ఆయనీ లోకానికి వచ్చి, మన పాపాలనన్నింటిని తన మీదకు తీసుకోడానికి మన కోసం బాప్తిస్మం తీసుకొన్నాడని, మన శిక్షను సిలువ మీద ఆయన భరించాడని మనం నమ్మినప్పుడు మనం నిజంగా మన రక్షణను పొందుతాం.

యేసుక్రీస్తు ఏదో విధంగా మన పాపాలను తన మీదికి తీసుకొనకపోయినట్లయితే, ఆయన బాప్తిస్మం ద్వారా తగిన ఈ విధానంలో మన పాపాలను ఆయన భరించి, సిలువకు వెళ్లి, తన రక్తాన్ని చిందించి, దాని మీద చనిపోయినా, ఆయన దేవుని కుమారుడైనా, ఆయనీ లోకానికి మన రక్షకునిగా ఎలా వచ్చినా, తన బాప్తిస్మం ద్వారా మన పాపాలను తన మీదికి తీసుకొనకుండా వున్నట్లయితే ఈ లోకంలో మన రక్షణ ఎన్నటికి కనిపించేదే కాదు.

కాగా, మీ పాపాలు యిప్పటికి తుడిచి వేయబడ్డాయన్న లేఖనాదారాలతో పూర్తిగా స్థిరపరచుకోవడం చాలా ముఖ్యం.

మీరు చెప్పుకోదగినంత మొత్తం మరొకరికి బాకీ వున్నారనుకొందాం. ఎలా తీర్చాలా అని బాధపడుతున్నప్పుడు, ఒక వ్యక్తి, మీతో ‘‘బాధపడకు, నీ బదులు నేనా మొత్తాన్ని చెల్లిస్తాను నీవు బాధపడాల్సిన అవసరం లేదు. నీ సమస్యను నేను పరిష్కరిస్తాను” అని నీతో చెప్పిన వ్యక్తిని నీవెప్పుడు కలుసుకున్నా, నీవు దిగులుపడవద్దని నేను నీతో చెప్పలేదా? దాని విషయం నేను జాగ్రత్త తీసుకొంటానని చెప్పాను గదా?’’ అని చెబుతూనే వుంటాడు. ఇంకా కొంచెం దీన్ని గూర్చి యిలా వూహిద్ధాం. అతడు నీతో ‘‘నీవు చెల్లించాల్సిన మొత్నాన్ని నేను చెల్లించాను. నన్నునమ్ము. నన్ను నమ్మవెందుకు?’’ అని కోపగించుకొంటాడు కూడా. అతడా మొత్తాన్ని చెల్లించకపోతే, అతన్ని నమ్మినందు వలన ఆ బాకీ నుండి నీవు విడుదల పొందగలవా? పొందలేవు!

“నీవు నన్ను నమ్మితే, నీ బాకీ అంతా పరిష్కరించబడుతుంది’’ అని అతడింత నమ్మకంగా నీతో చెప్పినా, అతడా మొత్తం చెల్లించకుండా వుంటే, నీ బాకీ అలాగే వుంటుంది. ఆ వ్యక్తి నిన్ను మాటలతో మోసగిస్తున్నాడన్న మాట. అందుకని ‘‘నా బాకీ నీవు తీర్చివేశావా?’’ అని నీవతణ్ణి పదే పదే అడుగుతావు. అప్పుడతడు కూడా నీతో ‘‘నీకంత అనుమాన మెందుకు? నన్ను నమ్ము. నీ బాకీ అంతా చెల్లించానని నీతో చెప్పాను గదా! నన్ను నమ్ము అని చెప్పినా, నీకు అనుమానమెందుకు అనుమానం పెట్టుకోబోకు, నీ హృదయ పూర్వకంగా నీవా వ్యక్తిని నమ్మాలనుకో అతడు నీ బాకీ గాని చెల్లించకుండా వుండి వుంటే, అతను చెప్పే మాటలన్నీ అబద్ధాలే అవుతాయి.ఈనాటి క్రైస్తవుల విశ్వాసం ఇలా వుంది


“యేసు సిలువ మీద తన పవిత్రమైన రక్తాన్ని చిందించి నిన్ను రక్షించాడు. దాని మీద ఆయన పాప శిక్షనంతటినీ భరించాడు. నిన్ను రక్షించాడు” అని నేటి క్రైస్తవులు చెబుతూవుంటారు. ఇలాగే చాలామంది సంఘ కాపరులు వారి సంఘాలకు బోధిస్తూ వుంటారు. కాని ఆ సంఘాల్లో ఎవరో ఒక వ్యక్తి లేచి ‘‘అయ్యా నేనింకా పాపాత్మునిగానే వున్నాను” అని అడిగినప్పుడు, ఆ సంఘ కాపరులు ‘‘నీలో విశ్వాసం లేదు నీవు నమ్ము! నీ అపనమ్మకమే నీ పాపం!’’ అని చెబుతారు. అందుకతడు ‘‘నేను కూడా నిజంగా నమ్మాలనుకొంటున్నాను. కాని నేనెందుకు నమ్మలేకపోతున్నానో నాకు తెలియడం లేదు నేను నమ్మినా యింకా పాపాత్మునిగానే వున్నానో నాకు తెలియదు. నేను నిజంగా నమ్ముతున్నాను” అని అతడంటాడు. అందుకా కాపరులు ‘‘నీలో తగినంత విశ్వాసం లేదు. నీవు ఇంకా ఎక్కువగా నమ్మాలి. కొండమీదకు వెళ్ళు. ఉపవాసముండి విశ్వసించడానికి ప్రయత్నించు” అని చెబుతారు. 

ఈనాటి సంఘకాపరుల్లో చాలామంది మీరు నమ్మండి అని మీతో చెబుతారు. మీ పాప సమస్యను వారు పరిష్కరించలేరు. పైగా మీరు నమ్మలేదని మిమ్మును నిందిస్తారు. ఇక మీ విషయానికి వస్తే నమ్మడానికి మీరు ప్రయత్నిస్తారు. అయినా నమ్మడం చాలా కష్టం అనిపిస్తుంది. లేక మీరు నిజంగా గుడ్డిగా నమ్ముతారు. కానీ మీ పాపసమస్య అలాగే వుంటుంది. ఇక్కడ తప్పు ఏమిటి? ఏది దీన్నీ వివరిస్తుంది? యేసుక్రీస్తు బాప్తిస్మం తీసుకొని వారి పాపాలన్నీ తన మీదికి తీసుకున్నాడని ప్రజలకు తెలియదు కనుక వానికి నిజమైన, గట్టి విశ్వాసం వుండదు. వారెంతగా నమ్మిన వారు భ్రమను నమ్ముతారు గనుక వాటితో వారి సమస్యను పరిష్కరించుకోలేరు.

ఎలాంటి రుజువు లేకుండా, ఏ షరతు లేకుండా నమ్మినంత మాత్రాన విశ్వాసం కలుగుతుందా? కలుగదు! పాప సమస్య ఎలా పరిష్కరించబడుతుంది? నీవు తెలుసుకొని, దానిని నమ్మినప్పుడు విశ్వాసం పరిపూర్ణంగా కలుగుతుంది. ‘‘నేను నిన్ను సందేహించినా, నీవచ్చిన రక్షణ వాస్తవమైనది గనుక నీ రక్షణను నమ్మక తప్పదు. నా సమస్యను తీర్చినందుకు నీకు వందనాలు.’’ మొదట మనం సందేహించినా మన రక్షణను గూర్చిన రుజువు నిజమైనది గనుక మనమింకే మాత్రం సందేహించలేము, మన రక్షణకు గుర్తుగా, ఆత్మ అనే సువార్తను మనకు చూపించాడు. మన రుణమంతా చెల్లించిన ఆ రశీదును మనం చూసినప్పుడు మనలో నిజమైన విశ్వాసం కలుగుతుంది.

మనం దేవుని నమ్ముతున్నామని ప్రకటిస్తున్నాము, అంటే యేసుక్రీస్తు దేవుడని, ఆయనే మన రక్షకుడని, ఆ రక్షకుని నేను నమ్ముతున్నానని చెబుతున్నా, ఆయన మన నెలా రక్షించాడో మన పాపాలనన్నింటిని ఎలా కడిగివేశాడో అన్న దానికి రుజువు లేకుంటే మనం ఆయన్ను నమ్మలేం. మరో మాటల్లో చెప్పుకుంటే మన పాపాలకు పూర్తి మూల్యం చెల్లించిన రశీదును మనం చూడకపోతే మనలో స్థిరమైన సమర్పణ వుండదు. ఈ రశీదు చూడక నమ్మినవారిలో మొదట్లో బలమైన విశ్వాసం వున్న భావం కలిగి వుండవచ్చు. కాని వారి విశ్వాసం కేవలం గుడ్డిది. అది మూఢ విశ్వాసమే గాని మరొకటి కాదు.మూఢ విశ్వాసాన్ని మంచి విశ్వాసంగా నీవు భావిస్తావా?


మూఢ విశ్వాసం గల ఒక సంఘకాపరి ఇతరుల్లో కూడా అలాంటి మూఢ భక్తే వుండాలని చెబితే నీవెలా అనుకొంటావు? ‘‘నమ్మండీ! అగ్ని, అగ్ని, అగ్ని! అగ్నివంటి పరిశుద్ధాత్మ మనలను అగ్నితో నింపుతాడు దేవుడు మిమ్ములనందరిని దీవిస్తాడని నేను నమ్ముతున్నాను! ఆయన మిమ్ములనందరిని భాగ్యవంతులనుగా చేస్తాడని నేను నమ్ముతున్నాను. ఆయన మిమ్మును ఆశీర్వదిస్తాడని, మిమ్ములను స్వస్థపరుస్తాడని నేను నమ్ముతున్నాను!’’ ఇలా చెప్పే సంఘకాపరి మాటలు విన్న శ్రోతల చెవుల్లో ఆ మాటలు మారు మ్రోగుతూ వుంటాయి. వారి హృదయాలు ఆనందంతో గంతులు వేయడం మొదలుపెడతాయి. మంచి నాణ్యత గల మైకులో ఆ సంఘకాపరి ‘‘అగ్ని, అగ్ని, అగ్ని, అని పెద్దగా కేకలు వేయడం మొదలు పెట్టినప్పుడు ఆయన స్వరంలోని ఔన్నత్యంతో శ్రోత హృదయాలు గంతులు వేయడం మొదలవుతుంది. అప్పుడు గట్టి విశ్వాసం వారిలోకి వచ్చిన వారు వుద్రేకంలో మునిగిపోతారు. అప్పుడు ‘‘ప్రభువైన యేసూ రమ్ము! పరిశుద్ధాత్మ రమ్ము” అని ఏడుస్తూ కేకలు వేస్తారు.

ఈ సమయంలో సంఘకాపరి ‘‘మనం ప్రార్థన చేద్ధాం. పరిశుదాత్మ యిప్పుడు దిగి వచ్చి మనందరినీ ఆత్మతో నింపుతాడని నేను నమ్ముతున్నాను” అని అంటూ వారి వుద్రేకాలను ప్రేరేపిస్తాడు. ఇక దీనిననుసరించి బాండు వారు ప్రేరణ కలిగించే గీతాలను వాయిస్తారు. ప్రేక్షకులు వారి చేతులు పైకెత్తి వుద్రేకంతో కేకలు వేస్తూ పతాక సన్నివేశానికి చేరుకొంటారు. ఆ సమయంలోనే ‘‘మన కానుకలను దేవునికి సమర్పించు కొందాం” అని కాపరి ప్రకటిస్తాడు.

తమ వుద్రేకాల్లో మునిగి వున్న ప్రజలు తమ జేబులు ఖాళీ చేసుకొంటారు. ఈ అబద్ధబోధకుడు కానుకలను పట్టడానికి ముందుగానే అనేక కానుకల సంచులను సిద్ధం చేసి వుంచుతాడు. బాండు వారు గీతాలు వాయిస్తూ వుంటే ప్రజల హృదయాలు వుద్రేకంతో నిండి పోతాయి. అప్పుడా బోధకుడు చందాసంచులను జనంలోకి పంపిస్తాడు. స్వచ్ఛంద సేవకులు జనంలోనికి వెళ్లి కానుకలు పడతారు.

అలా ఎక్కువ కానుకలను అర్పించడమంటే మరెక్కువ దీవెనలు పొందడమని. ప్రజల వుద్రేకాలను ప్రేరిపించడం వలన ఆ అసత్యబోధకులు ప్రజలు కన్నీళ్లు కారుస్తూ, తమ పర్స్‌ను తెరిచేట్టు ప్రేరేపిస్తారు. ప్రజలు తమకేమీ మిగల్లేదే అన్న ఆలోచన వారిలో కలుగకుండా వారిని వుద్రేకంలో ముంచివేసి వారు తమ దగ్గరున్నదంతా యిచ్చేట్టు చేస్తారు. ఇది దేవుని వాక్య ధారమైనది గాని, లేక మరే ప్రసంగాధారమైనది కాదు. కాని మూఢ భక్తితో, గుడ్డిగా మోసమనే ఒడ్డున వుండడమే. ఈ విధంగా మూఢ భక్తిగల బోధకులు ప్రజల వుద్రేకాలను ప్రేరేపించి వారంతట వారే ఆవలి వుద్దేశాలకు వెళ్లేట్టు చేస్తారు.

మన ప్రభువు మన పాపాలను తన బాప్తిస్మం ద్వారా తన మీదికి తీసుకొన్నాడని, తెలుసుకొని ఈ యేసుక్రీస్తే మన రక్షకుడని మనం నమ్మితే మనం కదిలించబడక, సమధానంతో వుంటాం. యేసు మన పాపాలను తన బాప్తిస్మంతో భరించి సిలువ మీద చనిపోయాడు. మనం దీనిని ఆలోచిస్తున్నప్పుడు దేవుడైన యేసు తన బాప్తిస్మం ద్వారా మన పాపాలను తన మీదికి తీసుకొని, ఆ పాపాలకు మూల్యం చెల్లించడానికి చనిపోయాడు. దానితో మనం ఎంతో కృతజ్ఞులమవుతాం. మన హృదయాలు అపరిమితానందంతో నిండిపోతాయి. మన హృదయాలోని ప్రశాంతమైన ప్రేరణ ఈ లోకంలో వున్న వాటన్నిటికంటే ఎంతో గొప్పది. ఎంతో అద్భుతమైన ప్రేమ కంటే, ఈ లోకంలో అతి అమూల్యమైన రత్నాన్ని అర్పించినప్పుడు కలిగే ఆనందం కంటే గొప్ప ఆనందాన్ని సంతృప్తిని కలిగిస్తుంది.

దీనికి భిన్నంగా మూఢ భక్తిగల వారి వుద్రేకాలతో కలిగిన ప్రేరణ పైన కలిగిన ఆనందమున్నంతకాలం వుండదు. వారు ఈ ప్రేరణలో కొంతసేపు వున్నా, వారు ప్రతిరోజు పాపం చేస్తున్నప్పుడు, ఆ పాపాల వలన అవమానాలు, అపకీర్తి పొందినప్పుడు సిగ్గుతో వారి ముఖాలను దాపుకోవలసి వస్తుంది. ‘‘యేసు మన శిక్షను భరించి, మన కోసం సిలువ మీద మరణించినప్పుడు నేనింకా ప్రతిరోజు పాపం ఎందుకు చేయాలి?’’ కనుక, కాలం గడుస్తున్న కొద్దీ వారి ముఖాలను చాటు చేసుకొని, యింకే విధంగానూ ప్రేరణ పొందరు. ఇకేముంది, ఆ సిగ్గుతో వారు దేవుని దగ్గరక్కూడా వెళ్లలేరు.

ఇందుకోసమే దేవుడు మనకు దహన బలిపీఠాన్ని చూపించాడు. బలియర్పణ విధానం ప్రకారం దహన బలిపీఠం మీద అర్పించిన బలియర్పణ మన రక్షకుడైన యేసుక్రీస్తే. అలా యేసు ఈ లోకానికి వచ్చి, మనలను నీల ధూమ్రరక్తవర్ణాల దారం, పేనిన, సన్నని నారతో నేసిన దారం ద్వారా ఒకేసారి మనలనందరిని రక్షించాడని దహన బలిపీఠం ప్రత్యక్షపరుస్తోంది. మన మీద దహన బలిపీఠాన్ని చూసేట్టుగా చేసి, దాన్నినమ్మి రక్షణ పొందాలని దేవుడు కోరుతున్నాడు.ఈ యుగంలో మనం చేయాల్సినదేమిటి?


తిరిగిపుట్టిన మనం ఈ యుగంలో చేయాల్సినవి చాలా విషయాలున్నాయి. మొదటిగా, నీరు, ఆత్మల సువార్తను లోకమంతా ప్రకటించాలి. నీలధూమ్ర రక్తవర్ణాల దారం, పేనిన సన్నని నారతో నేసిన దానిలోని సత్యాన్ని ఎరుగని వారందరికీ ఈ సత్యాన్ని తెలియజేయాలి. అలా వారు నరకాగ్నినుండి రక్షణ పొందునట్లు మనం సహాయం చేయాలి. ఎందుకంటే, ప్రత్యక్ష గుడారం ప్రత్యక్ష పరిచే నీరు, ఆత్మల సువార్త తెలుసుకోకుండా, దానిని నమ్మక యేసును అనుసరించే వారు అనేకమంది వున్నారు.

వారికీ సత్యాన్ని తెలియజేయడానికి మనం చేయాల్సినవి యింకా ఎన్నో సంగతులున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా మనం పంపించిన అనేక పుస్తకాలు అనువదించబడి, వాటి తప్పులను దిద్ది, వాటిని సమీక్షించి ప్రచురించడానికి నిధులను సేకరించాలి. అందుకు చేయవలసిన పనులనేకం వున్నాయి.

కనుక మన తోటి పనివారిని, పరిచారకులను మనం చూసినప్పుడు వారంతా ఎంత నిర్విరామంగా కృషి చేస్తున్నారో చూడాలి. ఎందుకంటే, దేవుని సంఘంలో పరిశుద్ధులు, పనివారంతా ఈ విధంగా తీరికలేకుండా వున్నారు. శారీరకంగా వారు కొంత కష్ట సమయాలను అనుభవిస్తున్నారు. అధిక అలసట వారిని మానసికంగా శూన్యులుగా చేస్తుంది. ఇప్పుడు మన సువార్త పరుగులో మనం కూడా ఈ దశకు చేరుకున్నాం. సువార్త కోసం జీవించడమంటే సుదూరంలో వున్న మన లక్ష్యం వైపు ఆగకుండా పరుగెత్తడం వంటిది. మన సువార్త పరుగు మన ప్రభువు రాకడ దినం వరకు కొనసాగుతూ వుండాలి, అప్పటి వరకు మన మెన్నో కష్టాలను ఎదుర్కొవాలి.

మన ప్రభువు మనలో వున్నాడు గనుక, మనకు నీరు, ఆత్మల సువార్త వున్నది గనుక, మన ప్రభువు నీల ధూమ్ర రక్తవర్ణాల దారం, పేనిన సన్నని నారతో నేసిన దారంతో మనలను రక్షించాడని నమ్ముతాం గనుక, మనం సత్యాన్ని నమ్ముతున్నాం గనుక, మనమంతా నూతన శక్తిని పొందుతాం. దీనికి కారణం యేసు రక్షణ వరాన్ని మన కనుగ్రహించాడు గనుక మీరు, నేను ఈ వరాన్ని పొందాం. కనుక మన శారీరక కష్టాలు మనలను బాధించలేవు. దీనికి భిన్నంగా అవి ఎంత కష్టతరమైతే నీతిమంతులు అంత అధికశక్తిని పొందుతారు. ఇందుకు నేను నిజంగా దేవునికి కృజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను.

మన ప్రభువు మనతో వున్నాడు అన్న ఆలోచనతో ఆయన మనకిచ్చిన నూతన శక్తిని ఆధ్యాత్మికంగా, మన హృదయాల్లో, మన ఆలోచనల్లో, మన పరిసరాల్లో ఈ నూతన శక్తిని మనం అనుభవించాలి. ఆయన మనకు సహాయం చేస్తున్నాడని, మనలను పట్టుకొని వున్నాడని, ఆయన మనతో వున్నాడని, మనం ఆయనకు మరిన్ని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కనుక అపోస్తులుడైన పౌలు కూడా యిలా అన్నాడు, ‘‘నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలను” (ఫిలిప్పీ 4:13). కనుక దేవుడు మనకు అధికారం యివ్వకపోతే మనమేదీ, ఏమీ చేయలేమని ప్రతిరోజూ మనం ఒప్పుకోవాలి. యేసుక్రీస్తు మన కోసం బాప్తిస్మం తీసుకోవడమే కాదు, సిలువ వేయబడి, తన మరణాన్ని తానే ఎదుర్కొని మన కోసం బలియాగమైనాడు. మళ్ళీ మృతులలో నుండి పునరుత్థానుడై మనకు రక్షకుడైనాడు. దహన బలిపీఠాన్ని చూసినప్పుడల్లా, మన మీ సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి.

దహన బలిపీఠం తుమ్మ చెక్కతో చేసి, దానికి లోపల బయట మందపాటి ఇత్తడి తొడుగు వేశారు. దాని ఎత్తు 1.35మీ॥ దాని తడిక కూడి ఇత్తడితో చేసినదే, అది దాని మధ్య సుమారు 68 సెం.మీ ఎత్తులో అమర్చారు. బలిపశువు మాంసం ఈ తడిక మీద పెట్టి దహిస్తారు.

మనం దహన బలిపీఠాన్ని చూసినప్పుడు మనలను మనం వున్న పళంగా పరిశీలించుకోవాలి. ఇంకా యేసుక్రీస్తు శారీరకంగా వున్నప్పుడు తన బాప్తిస్మం ద్వారా మన పాపాలను ఆయన మీదికి తీసుకొని, మన పాపశిక్షనంతటినీ ఆయన భరించి సిలువ మీద తన రక్తాన్ని కార్చాడని కూడా చూడగలగాలి. మీరు, నేను కూడా మన పాపాల నిమిత్తం వచ్చే శిక్షకు దేవునిముందు చనిపోక తప్పించుకోలేం. మన పాపాలు వాటి వలన వచ్చే శిక్షను మీరు, నేను తప్పించుకోలేక శాశ్వతంగా శాపగ్రస్తులమై చనిపోక తప్పదు. అయితే పాప పరిహారం నిమిత్తం పరలోక అర్పణగా ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తు మనందరి కోసం బాప్తిస్మాన్ని పొంది, పాతనిబంధనలోని బలియర్పణగా చనిపోయాడు. మనం రక్షణ పొందాం.

బలిపశువు జీవించి వున్నప్పుడు అందంగా వుండి, నెమరు వేస్తూ వుంటుంది. కాని దాని తలమీద చేతులుంచి పాపాలను అంగీకరించినప్పుడు, దాని గొంతుతెగి, తెరచుకొని రక్తం ఓడుతూ ఎంతో అసహ్యంగా కనబడుతూ వుంటుంది. ఇంత అసహ్యంగా చనిపోవలసిన మనం యేసుక్రీస్తు ద్వారా మన శిక్షను తప్పించుకోవడం నిజంగా ఎంతో గొప్పదీవెన. మన ప్రభువు మనకు రక్షణ వరాన్ని అనుగ్రహించినందు వల్లనే మనకీ దీవెన కలిగింది. నీలధూమ్ర రక్తవర్ణాల దారం, పేనిన సన్నని నారతో నేసిన దానిలో ప్రత్యక్ష పరచిన విధంగా యేసుక్రీస్తు మానవునిగా ఈ లోకానికి వచ్చి, తన బాప్తిస్మం, సిలువ రక్తం ద్వారా మిమ్మును, నన్ను రక్షించి, మనకు నిజమైన రక్షణ వరాన్ని అనుగ్రహించాడు. మీరీ సత్యాన్ని హృదయ పూర్వకంగా నమ్ముతున్నారా? యేసు అనుగ్రహించిన ఈ రక్షణ వరాన్ని, ఆయన ప్రేమను నమ్ముతున్నారా? మనకందరికీ ఈ విశ్వాసం వుండాలి.

దహన బలిపీఠాన్ని మనం చూసినప్పుడు యేసుక్రీస్తు మనలను ఈ విధంగా రక్షించాడని మనం తెలుసుకోవాలి. మనకు రక్షణ వరాన్ని యివ్వడానికి ఆయనీ విధంగా బలియాగమైనాడు. బలిపశువు తలపై చేతులుంచి, ఆ బలిపశువు చనిపోయేంతవరకు తన రక్తాన్ని ఓడ్చినట్టు యేసు కూడా ఈ విధంగానే మన కోసం శ్రమపడి మనకు రక్షణను అనుగ్రహించాడు. ఇలా ఆయన మన పాపాల నుండి మనలను రక్షించాడు. దీనిని మనం తెలుసుకోవాలి. దేవుని ముందు మన హృదయపూర్వకంగా దీనిని నమ్మాలి. మన హృదయ పూర్వకంగా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి.

దేవుడు మనకనుగ్రహించిన రక్షణ, ప్రేమ వరాన్ని మన విశ్వాసం ద్వారా మనం పొందాలని దేవుడు ఆశిస్తున్నాడు. యేసు తన బాప్తిస్మం, సిలువ రక్తం ద్వారా నెరవేర్చుట ద్వారా వచ్చిన నీరు, ఆత్మల సువార్త వలన కలిగిన రక్షణను మనం హృదయపూర్వకంగా నమ్మాలని దేవుడు కోరుతున్నాడు. మీరందరూ మన ప్రభువు ప్రేమను హృదయపూర్వకంగా నమ్మి, ఆయన రక్షణ వరాన్ని కూడా నిజంగా అంగీకరిస్తారని నేను నమ్ముతున్నాను. మీరు నిజంగా, మీ హృదయ పూర్వకంగా దీనిని అంగీకరిస్తున్నారా?నీ కోసం ఈ విధంగా ఎవరు త్యాగం చేశారు?


నేనొకసారి ఒక సాక్ష్యాన్ని వివరించే కరపత్రాన్ని చూశాను. అందులో ‘‘నీకోసం ఎవరు చనిపోతారు? ఈ రోజు నిన్ను ఓదార్చిన ఏ వ్యక్తిని కలుసుకొన్నావు? యేసుక్రీస్తు నీకోసం త్యాగం చేశాడు. దీని వలన నీ హృదయం ఓదార్చబడలేదా?’’ నీ పాపాలను కడిగి వేయడానికి తాను బాప్తిస్మం తీసుకొని, నీ పాపాలను భరించి, నీ స్థానంలో సిలువ మీద రక్తాన్ని ఎవరు చిందిస్తారు? నీ మీద తమ ప్రేమను కురిపించడానికి తమ రక్తాన్నంతా కార్చి, ఎవరు చనిపోతారు? నీ కోసం ఈ త్యాగాన్ని చేయడానికి ఎవరిష్ట పడతారు? నీ బంధువులా? నీ పిల్లలా? నీ తల్లిదండ్రులా? 

వీరిలో ఎవరూ యిష్టపడరు! నిన్ను సృజించిన వాడు దేవుడు నిన్ను రక్షించడానికి ఈ దేవుడు మానవునిగా ఈ లోకానికి వచ్చాడు. నీ పాపాలను తన మీదికి తీసుకోడానికి బాప్తిస్మాన్ని పొందాడు. నీ పాపశిక్షను భరించడానికి సిలువ వేయబడ్డాడు. తన రక్తాన్ని కార్చాడు. నీ నిజమైన రక్షకుడైనాడు. మృతులలో నుండి సజీవునిగా లేచాడు. ఇప్పుడు సజీవునిగా వున్నాడు. తన ప్రేమను, నీ రక్షణను నీకు వరంగా యిచ్చాడు. నీవు నిజంగా నీ హృదయ పూర్వకంగా ఈ రక్షణ ప్రేమను అంగీకరిస్తున్నావా? నీ హృదయ పూర్వకంగా ఈ సత్యాన్ని నమ్ముతున్నావా?

ఎవరైతే ప్రభువును నమ్ముతారో వారాయనను పొందుతారు. ఆయనను ఎవరు చేర్చుకొంటారో వారు రక్షించబడతారు. ఆయన్ను స్వీకరించడం అంటే క్రీస్తు మనకు అనుగ్రహించిన రక్షణను, ప్రేమను అంగీకరించడమని అర్ధం. ఈ ప్రేమను మన హృదయపూర్వకంగా నమ్మడం వలన పాపక్షమాపణ, మన పాపాలను, ఆ పాపశిక్షను భరించడం వలన మనం రక్షించడ్డాం. ఈ విశ్వాసమే ఆ రక్షణ వరాన్ని పొందేది.

ప్రత్యక్ష గుడారపు సమస్తం యేసుక్రీస్తును ప్రత్యక్షపరుస్తాయి. మన నుండి దేవుడెలాంటి బలిని కోరడు. ఆయన కోరేదల్లా ఆయన మనకనుగ్రహించిన రక్షణ వరాన్ని హృదయపూర్వకంగా నమ్మమన్నాడు. ‘‘నీకు రక్షణ వరాన్ని యివ్వడానికి నేను ఈ లోకానికి వచ్చాను. పాతనిబంధనలోని బలియర్పణగా నా తలపై చేతులుంచుట ద్వారా నీ పాపాలనన్నీ నా మీదకు వచ్చుటకు నేను అంగీకరించాను. ఈ బలిపశువులా నీ కోసం దుఃఖకరమైన నీ పాపాల శిక్షను నేను భరించాను. ఇలా నేను నిన్ను రక్షించాను.’’ ఈ విషయాన్నే దేవుడు ప్రత్యక్షగుడారం ద్వారా మనకు చెబుతున్నాడు.

ఆయన అలా మనలను రక్షించడంలో ఆయనింతగా మనలను ప్రేమించాడు. ఈ విధంగా పరిపూర్ణమైన రక్షణ వరాన్ని మనకను గ్రహించాడు. దీన్ని మనం నమ్మకపోతే ఈ సమస్తం మనకు నిరుపయోగం. నీవు కాసిన చారు రుచిగా వుండాలంటే మీ వంటగది గిన్నెలోని పప్పును అందులో వేయాలి. అలా, మీరు, నేను ఆయన రక్షణను హృదయ పూర్వకంగా నమ్మకపోతే, ఆయనిచ్చిన పరిపూర్ణ రక్షణ కూడా నిరుపయోగమైపోతుంది. నీరు, ఆత్మల సువార్త కొరకు మన హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేయకపోతే, మన హృదయాలలో దానిని అంగీకరించకపోతే, యేసు చేసిన త్యాగం, లేక బలియాగం విలువ లేనిదవుతుంది.

రక్షకుడు దేవుడైన యేసు మనకనుగ్రహించిన త్యాగం, ప్రేమను మీరు తెలుసుకొన్నప్పుడే రక్షణ మీది అవుతుంది. వాటిని హృదయపూర్వకంగా అంగీకరించి, వాటి కోసం కృతజ్ఞతలు తెలియజేయండి. యేసుక్రీస్తు అనుగ్రహించిన పరిపూర్ణ రక్షణను మీ హృదయపూర్వకంగా అంగీకరించక, మీరు దానిని మనస్సులో అర్థం చేసుకొంటే అప్పుడది పూర్తిగా మీకు నిరుపయోగమవుతుంది.మీరు చేయవలిసనదల్లా ఆ సత్యాన్ని తెలుసుకొనండి.


పొయ్యిమీద మీ చారు ఎంత సేపు మరుగుతోందన్నది కాదు. దానిలో పప్పు వేయాలని అనుకొని దానిలో పప్పు వేయకపోతే ఎంతసేపు మరిగినా దానికి రుచి రాదు. మన ప్రభువు బాప్తిస్మాన్ని పొందుట ద్వారా మన కొరకు బలియాగమై దహన బలిపీఠం మీద బలిపశువును బలి అర్పించినట్లుగా బలియైనాడని మీ హృదయపూర్వకంగా అంగీకరించి, దానిని నమ్మినప్పుడే మీరు రక్షించబడతారు. దేవుడు మీకు రక్షణ వరాన్ని యిచ్చినప్పుడే మీరు దానిని కృతజ్ఞతా పూర్వకంగా అంగీకరించండి. మన ప్రభువు మనలను పూర్తిగా రక్షించానని చెబుతున్నప్పుడు దానిని మనం నమ్మడమే మనం చేయవలసిన సరైన పని.

దేవుడు మీకనుగ్రహించిన ప్రేమ అయిష్టంగా అనుగ్రహించినదా? కాదా. మన ప్రభువు ప్రేమ పరిపూర్ణమైనది. మన ప్రభువు మిమ్ములను, నన్ను పూర్తిగా, పరిపూర్ణంగా రక్షించాడు. ఆయన తన బాప్తిస్మం ద్వారా మన పాపాలను పూర్తిగా తన మీదికి తీసుకొని, సిలువ మీద నిజముగా చనిపోయాడు. ఈ ప్రేమను మన మే విధంగాను సందేహించలేం. ఆయన మనలనింత పరిపూర్ణంగా రక్షించి రక్షణ వరాన్ని మనకనుగ్రహించాడు. దేవుడు మన కనుగ్రహించిన ఈ రక్షణ వరాన్ని మనమందరం అంగీకరించాలి.

బహు విలువైన రత్నాలతో చేసిన ఆభరణాలను నా దగ్గరున్నాయనుకొందాం. ఒకవేళ నేను వాటిని బహుమానంగా నీకు యిచ్చాననుకో, నువ్వు చేయాల్సిందేమిటి? వెంటనే వాటిని తీసుకోవడమే. వాటిని మీ వాటిగా చేసుకోవడం ఎంత సులభం? ఆ నగలను మీవిగా చేసుకోడానికి నీవు చేయాల్సినదల్లా ముందుకు వచ్చి వాటిని తీసుకోవడమే.

మీ హృదయాలను తెరచి యేసు బాప్తిస్మం ద్వారా మీ పాపాలనన్నింటిని ఆయన మీదికి పంపిస్తే, మీ పాపాలన్నింటికి క్షమాపణ పొంది మీ శూన్య హృదయాలను ఆ సత్యంతో నింపండి. ఇలా ఆయన తన రక్షణను ఉచిత పరంగా యిస్తానని చెప్పాడు. మీరు ముందుకు వచ్చి దానిని తీసుకొనడం వలన రక్షణ మీదవుతుంది. 

మన మొక్క పైసా కూడా చెల్లించకుండానే మనం రక్షణన వరంగా పొందాలి. ఎవరైతే ఈ రక్షణను కోరతారో వారికి దేవుడు దానిని యివ్వడానికి సంతోషిస్తున్నాడు. గనుక ఎవరైతే కృతజ్ఞతా పూర్వకంగా దానిని స్వీకరిస్తారో వారు ధన్యులు. ఎవరైతే సంతోషంగా ఆయన ప్రేమను అంగీకరిస్తారో వారు ఆయన ప్రేమను ధరిస్తారు. అంగీకరించుట ద్వారా వారాయనను సంతోష పరుస్తారు. ఈ వరాన్ని అంగీకరించడం సరైన పని చేయడం వంటిది. దేవుడు నీకనుగ్రహించి ఈ పరిపూర్ణ రక్షణ వరాన్ని అంగీకరించినప్పుడు నిజమైన ఆ రక్షణ వరం నీదవుతుంది. మీరు దీనిని మీ హృదయపూర్వకంగా అంగీకరించకపోతే, ఆ తర్వాత మీరెంతగా ప్రయత్నించినా ఈ రక్షణ వరం మీది కాదు.

నేను కూడా ఈ రక్షణ వరాన్ని పొందాను. ‘‘ప్రభువు, నా కోసం ఈ విధంగా బాప్తిస్మాన్ని పొందాడు. ఆయన బాప్తిస్మాన్ని తీసుకొని, నా పాపభారన్నంతా ఆయనే భరించాడు. నా కోసమే ఆయన బాప్తిస్మం తీసుకొన్నాడు. అందుకు ప్రభువా నీకు వందనాలు!’’ నేను దీనిని నమ్ముతున్నాను అందుకని నేనెప్పుడు పాపం లేనివానిగా వున్నాను. నా పాపాలకు పరిపూర్ణ విమోచన పొందాను. మీరు కూడా ఆ పరిపూర్ణ పాపక్షమాపణను పొందాలనుకొంటే, రక్షణ పొందాలనుకుంటే యిప్పుడే ఈ సత్యాన్ని అంగీకరించండి.

అప్పటి నుండి ఈ రక్షణ వరాన్ని గూర్చి సదా ఆలోచిస్తున్నాను. ఇప్పుడు కూడా, దాన్ని గూర్చి నేను మళ్లీ ఆలోచించినప్పుడు నా రక్షణ నిమిత్తం దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి తప్ప నేను ఆలోచించగలిగింది మరోకటి లేదు. ఆ రక్షణ నారతో నేసినది ప్రత్యక్షపరచిన సత్యాన్ని నమ్మి నా పాపక్షమాపణను పొందినప్పుడు నేను దేవునికెంతో కృతజ్ఞత కలిగివున్నాను. ఇప్పటికీ, ఎన్నో సంవత్సరాలు గడిచిపోయినా అదే కృతజ్ఞతా హృదయంతో ప్రతిరోజు నన్ను నేను నూతన పరచుకొంటున్నాను.

నన్నురక్షించడానికి యేసు నిజంగా ఈ లోకానికి వచ్చాడు. తన మీదకు నా పాపాలను తీసుకోడానికి బాప్తిస్మాన్ని పొందాడు. నా పాపశిక్షను భరించడానికి సిలువ మీద చనిపోయాడు. ఇవన్నీ నా కోసమే ఆయన చేశాడని నేను తెలుసుకొన్నప్పుడు వెంటనే నేను వాటన్నింటిని అంగీకరించి వాటిని నావిగా చేసుకొన్నాను. నా జీవితంలో నేను చేసిన మంచి పని యిదేనని తెలుసుకొన్నాను. కనుక దేవుడు నిజంగా నన్ను ప్రేమిస్తున్నాడని, నా విషయమై శ్రద్ద తీసుకొంటున్నాడని నమ్ముతున్నాను, ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు గనుకే ఆయనే ఇవన్నీ చేశాడని నమ్ముతున్నాను. ‘‘ప్రభువా, నా హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నీవు నన్ను ప్రేమించినట్టే నేను నిన్ను ప్రేమిస్తున్నాను.’’ అలా ఒప్పుకోవడం తిరిగి పుట్టిన వారికెంతో ఆనందాన్ని కలిగిస్తుంది.

మన ప్రభువు ప్రేమ ఎన్నటికి మారనిది. మన పట్ల ఆయన ప్రేమ ఎన్నటికీ మారనట్లే ఆయన పట్ల మన ప్రేమ కూడా ఎన్నటికీ మారనిదిగా వుండాలి. కొన్నిసార్లు మనకు శ్రమలు వచ్చి కష్టాలను ఎదుర్కొన్నప్పుడు మన హృదయాలు దారి తొలిగి మనం కొన్నిసార్లు దీనిని మరచి పోవాలనుకొంటాం. ఈ ప్రేమకు ద్రోహం చేయాలనుకొంటాం. కొన్నిసార్లు మన బాధలు మనలను ముంచివేసినప్పుడు, మన మనస్సాక్షి మనలను ముందుకు సాగకుండా చేసినప్పుడు, మనం మన బాధనే ఎల్లప్పుడూ ఆలోచిస్తున్నప్పుడు మన హృదయాలు ఆయన ప్రేమను మరచిపోకుండా ఆయన నమ్మకంగా మనలను పట్టుకొని వుంటాడు.

దేవుడు మనలను ఎల్లప్పుడు ప్రేమిస్తూనే వుంటాడు. దేవుడు తాను మరణించినంతగా మనలను ప్రేమించాడు గనుక తానూ ఒక సృష్టిగా (మానవునిగా) ఈ లోకానికి వచ్చాడు. మీరిప్పుడు ఆ దేవుని ప్రేమను మీరుగా నమ్మమని కోరుతున్నాను. దానిని మీ హృదయపూర్వకంగా అంగీకరించండి. మీరిప్పుడు దీనిని నమ్ముతున్నారా? 

ఈ తన ప్రేమతో మన పాపాల నుండి మనలను పరిపూర్ణంగా రక్షించినందుకు ప్రభువుకు నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను.