Sermons

[11-10] < నిర్గమకాండం 30:17-21 > గంగాళం ద్వారా ప్రత్యక్ష పరచిన విశ్వాసం< నిర్గమకాండం 30:17-21 >

“మరియు యెహోవా మోషేతో ఇట్లనెను - కడుగు కొనుటకు నీవు ఇత్తడితో దానికొక గంగాళమును ఇత్తడి పీటను చేసి, ప్రత్యక్షపు గుడారమునకు బలిపీఠమునకు నడుమ దానిని వుంచి నీళ్లతో నింపవలెను. ఆ నీళ్లతో అహరోనును అతని కుమారులు తమ చేతులను, కాళ్లను కడుగుకొనవలెను. వారు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్లునప్పుడును సేవచేసి యెహోవాకు హోమధూపము నర్పించుటకు బలిపీఠము నొద్దకు వచ్చునప్పుడును తాము చావక యుండునట్లు నీళ్లతో కడుగుకొనవలెను. తాము చావకయుండునట్లు, తమ చేతులను కాళ్లను కడుగుకొనవలెను. అది వారికి, అనగా అతినికిని, అతని సంతతికిని వారి తరతరములకు నిత్యమైన కట్టడగా నుండును.’’ప్రత్యక్షపు గుడారపు ఆవరణలో గంగాళం


వస్తు సామాగ్రి : ఇత్తడితో చేసినది. దానినెప్పుడూ నీటితో నింపి వుంచాలి.

ఆధ్యాత్మిక అర్ధం: ఇత్తడి అంటే, మానవజాతి పాపాలన్నింటికి న్యాయ తీర్పు, మానవజాతి పాప ఫలితమైన శిక్షను భరించడానికి యేసు యోహాను వలన బాప్తిస్మం తీసుకొని లోకపాపాలనన్నింటిని తనపైకి తీసుకొన్నాడు. కనుక యేసు బాప్తిస్మంతో మన పాపాలన్నీ యేసుమీదికి వెళ్ళాయని నమ్ముట వలన మనం మన పాపాలన్నీ కడిగి వేసుకోవాలని గంగాళం అర్ధం.

ప్రత్యక్షపు గుడారంలో సేవచేసే యాజకులు కూడా ప్రత్యక్షపు గుడారంలో ప్రవేశించక ముందు మరణం నుండి తప్పించుకోడానికి తమ చేతులు, కాళ్లు కడుగుకోవాలి. ఇత్తడి పాపాలన్నిటికి తీర్పును తెలియజేస్తుండగా, గంగాళంలోని నీరు యేసు యోహాను నుండి పొందిన బాప్తిస్మాన్ని, దాని ద్వారా లోక పాపాలను తనమీదికి తీసుకోడాన్ని తెలియజేస్తోంది. మరోమాటల్లో చెప్పుకుంటే, తన మీదికి వచ్చిన పాపాలన్నింటిని యేసు అంగీకరించి ఆ పాపశిక్షను భరించాడని గంగాళం మనకు వివరిస్తోంది. గంగాళం నీరు అంటే, పాత నిబంధనలోని ప్రత్యక్షపు గుడారపు నీలం దారం, కొత్త నిబంధనలో యోహాను నుండి యేసు తీసుకొన్న బాప్తిస్మము అని అర్థం (మత్తయి 3:15, 1పేతురు 3:21)

కనుక గంగాళం యేసుబాప్తిస్మాన్ని మన విశ్వాసాన్ని స్థిరపరచాల్సిన స్థలాన్ని వివరిస్తుంది. వాస్తవానికి యేసు మన పాపాలన్నింటిని, మనం చేసిన నిజమైన పాపాలన్నింటిని భరించి, 200 సం.ల క్రితం ఆయన బాప్తిస్మమిచ్చు యోహాను వలన పొందిన బాప్తిస్మంతో అన్నింటిని కడిగి వేశాడని గంగాళం వివరిస్తోంది.

నీరు, ఆత్మల సువార్తను నమ్ముట వలన తిరిగి పుట్టిన నీతిమంతులు వున్నారీలోకంలో. వారు నీలధూమ్ర రక్తవర్ణాల దారం, పేనిన సన్నని నారతో నేసిన దానిలో ప్రత్యక్షపరచిన యేసు కార్యాల వలన తమ పాపాలన్నీ క్షమించబడినవని నమ్మి తమ పాపవిమోచన పొందినవారు. తమ పాపాలకు విమోచన పొందిన నీతిమంతులు కూడా వారి శరీరాల్లో అసంపూర్తిగా వున్నారు గనుక, వారు ప్రతిరోజు పాపం చేయక వుండలేరు. అలాంటి పాపులను అసలైన (నిజమైన) పాపులని అంటారు. ఎక్కడైతే నీతిమంతులు విమోచన పొందుతారో వారి అసలైన పాపులనే సమస్య పరిష్కారం జరిగే చోటు ఈ గంగాళం దగ్గరే. నీతిమంతులు ఎప్పుడైతే అసలైన పాపాలు చేస్తారో అప్పుడు వారు ప్రత్యక్షపు గుడారం ఆవరణంలోని గంగాళం దగ్గరకు వచ్చి వారి చేతులు, కాళ్లు కడుక్కోవాలి. దాని వలన లిఖిత పూర్వమైన దేవుని వాక్యాన్ని నమ్ముట యిప్పటికి యేసు వారి అసలు పాపాలు క్షమించాడన్న వాస్తవాన్ని స్థిరపరచుకొంటారు.

బైబిల్లో కొన్నిసార్లు దేవుని వాక్యాన్ని సూచించడానికి నీరును వుపయోగించారు. కాని అతి ప్రాముఖ్యమైన అర్ధం యేసు బాప్తిస్మం ఎఫెస్సీ 5:26 యిలా వివరిస్తోంది. ‘‘వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి, పరిశుద్ధ పరచుటకు” ఇంకా యోహాను 15:3 యిలా వివరిస్తోంది, ‘‘నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులైయున్నారు”. పరిశుద్ధుల శరీరాలు ఎంత అసంపూర్ణమైనవైనా ప్రభువు నీటితో వారి పాపాలను క్షమించాడన్న రుజువును గంగాళం కలిగిస్తుంది.

1పేతురు 3:21, 22 యిలా వివరిస్తోంది, ‘‘దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్ములను రక్షించుచున్నది. ఈదేదనగా శరీర మాలిన్యము తీసి వేయుట కాదు గాని యేసుక్రీస్తు పునరుత్థాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు అధికారుల మీదను శక్తుల మీదను అధికారము పొందినవాడై దేవుని కుడిపార్శ్వమున వున్నాడు.’’ దీనిని వివరించడానికి ముందు పేతురు నోవహు రోజుల్లోని నీటి ఆధ్యాత్మిక అర్ధాన్ని వివరించాడు. నోవహు పాపాత్ములను హెచ్చరించినప్పటికి వారి ఆత్మలు పాపమనే చెరలో బంధీలుగా వున్నాయి. మరో మాటలో అయితే మొదటి ప్రపంచంలోని మురికినంతటిని జలప్రళయం శుభ్రం చేసింది. ఆ నీటి ద్వారా ఎనిమిది మంది మాత్రమే రక్షించబడ్డారు. ఆ సమయంలో దేవుని వాక్యాన్ని నమ్మని వారినందరినీ నాశనం చేసి వేసింది జల ప్రళయం, ఆ జల ప్రళయాన్ని యిప్పుడు పేతురు యేసు బాప్తిస్మాన్ని సాదృశ్యంగా వివరిస్తున్నాడు. అలా మళ్లీ మనం ఎప్పుడు రక్షణ పొందామో, పొందిన తర్వాత కూడా దేవుని ముందు మన రక్షణను మరొకసారి స్థిరపరచుకోవలసిన స్థలం గంగాళం దగ్గరే.

తమ విశ్వాసం వలన తమ పాపాల నుండి రక్షణ పొందిన పరిశుద్ధులు గంగాళంలోని నీటిని (యేసు బాప్తిస్మాన్ని), ఇత్తడిని (పాపాలకు దేవుని తీర్పును), యేసు వారి పాపాల నుండి విడిపించాడని నమ్ముట ద్వారా దేవుని కృపను ధరించుకొంటారు. మనం పూర్తి బలహీనతల్లోవున్నా, అపరాధాలల్లో వున్నా మనం నీతిమంతులమని గుర్తిచడం కష్టమనిపించినా, మన విశ్వాసాన్ని యేసు బాప్తిస్మంలో (మన పాపాలను భరించడం, నీరు), సిలువలో ఆయన రక్తం కార్చాడని (పాప ఫలితమైన శిక్ష, ఇత్తడి)లో మళ్లీ సమర్పించుకొని మనం పూర్తిగా నీతిమంతులమని స్థిరపరచుకొనవచ్చును. మన పాపల నుండి, ఆ పాపశిక్ష నుండి దేవుని వాక్యం యిప్పటికే మనలను రక్షించిందని మనం నమ్ముతున్నాం గనుక మనం ఎల్లప్పుడు పాపంలేని నీతిమంతులుగా అవుతాం.

యేసు యోహాను నుండి పొందిన బాప్తిస్మంతో తానే మన పాపాలనన్నింటిని తన మీదికి తీసుకొన్నాడు. మన పాపశిక్షను మన స్థానంలో ఆయన సిలువ మీద భరించి రక్తం కార్చాడు. దాని ద్వారా మన పాపాల నుండి మనలను పూర్తిగా రక్షించాడని మనం నమ్మే దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. మన విశ్వాసంతో పరిస్థితులెలాంటివైనా మన పాపాలన్నిటి నుండి పూర్తిగా రక్షించబడ్డామని మనం స్థిర పరచుకోడానికి దేవుడు ప్రత్యక్షపు గుడారపు ఆవరణలో గంగాళాన్ని వుంచాడు.మీ అసలు పాపాల నుండి శాశ్వతంగా విడుదల పొందారా?


చివరి రాత్రి భోజన సమయంలో పస్కా రొట్టెను, పానీయాన్ని యేసు తన శిష్యులతో పంచుకొని సిలువ మీద చనిపోక ముందు పేతురు, యితర శిష్యుల పాదాలు నీటితో కడగాలనుకొన్నాడు. అప్పటికే యేసు యోహాను నుండి పొందిన బాప్తిస్మంతో తన శిష్యుల పాపాలు తన మీదికి తీసుకొన్నాడు. గనుక గంగాళంలోని సత్యాన్ని ఆయన వారికి బోధించాలనుకొన్నాడు. తాను బాప్తిస్మం తీసుకున్న తర్వాత, పస్కాగొర్రె పిల్లగా పాపానికి జీతాన్ని (మూలమైన మరణాన్ని) మ్రాను మీద వ్రేలాడి చెల్లించాలని యేసు వారితో చెప్పాడు. అలా పన్నెండుమంది శిష్యులు ఆయన్ను నమ్మిన తర్వాత కూడా అసంపూర్ణులుగా వున్నా, ఆ తర్వాత మళ్లీ ఎప్పుడూ పాపాత్ములు కాలేదు.

అలాగే, యేసు వారి పాదాలు కడిగాడు అన్న వాస్తవాన్ని సత్యవాక్యం సాక్ష్యమిస్తుంది. అంటే యేసు వారి పాపాలను యిప్పటికే కడిగివేశాడన్న సత్యాన్ని స్థిరపరుస్తోంది. ఇలా యేసు రక్షకుడని శిష్యులు ఈ లోక ప్రజలకు సదా బోధిస్తూ ఆయనప్పటికే నెరవేర్చిన నీరు, ఆత్మలను సువార్తను ప్రకటించారు. (హెబ్రి 10:1-20) అలా తమ పాపాల నుండి రక్షణ పొందిన నీతిమంతులు యేసు బాప్తిస్మాన్ని జ్ఞాపకం చేసుకోడానికి ఆ సత్యాన్ని నమ్మే అవకాశాన్ని కలిగిస్తుంది గంగాళం. ఇంకా దేవుడు తానే వారిని విడిపించాడన్న రక్షణ నమ్మకాన్ని వారిలో కలిగిస్తుంది.గంగాళం పరిమాణాన్ని బైబిలు వివరించడం లేదు.


ప్రత్యక్షపు గుడారంలోని గంగాళం కొలతలు తప్పమిగిలిన వాటన్నిటి కొలతలను, లేక పరిమాణాలను బైబిలు వివరిస్తోంది. దీనిని బట్టి, దేవుని కుమారుడైన యేసు తన బాప్తిస్మంతో తన మీదికి తీసుకొన్న మన పాపాలను అనంతమైనవని తెలుస్తోంది. అంతే గాక మన పాపాల నుండి, ఆ పాపశిక్ష నుండి మనలను రక్షించిన యేసు ప్రేమ అపారమైనదని కూడా అది మనకు తెలియజేస్తోంది. కొలవలేని దేవుని మహా ప్రేమను గంగాళం ప్రత్యక్ష పరుస్తోంది. మానవులు వారు జీవించునంతకాలం పాపం చేస్తూనే వుంటారు. యోహాను వలన పొందిన బాప్తిస్మం ద్వారా లోకపాపాలన్నింటిని తన మీదికి తీసుకొన్నయేసు సిలువ వేయబడి, దాని మీద తన రక్తాన్ని కార్చి మన పాపాలను శాశ్వతంగా కడిగివేశాడు.

ప్రత్యక్షపు గుడారంలో సేవింప వచ్చిన స్త్రీ అద్దాలతో ఇత్తడిని కరిగించి గంగాళాన్ని తయారుచేశారు. (నిర్గ 38:8) అంటే దేవుని వాక్యం పాపాత్ముల మీద తన రక్షణ వెలుగును ప్రకాశింపజేసి వారిలోని చీకటిని తీసివేస్తుందని అర్ధం. దేవుడు తానే మన పాపాలను కడిగి వేయడానికి గంగాళాన్ని తయారుచేశాడు. ఈ సత్యవాక్యం ప్రజల హృదయాంతరాల్లో దాగివున్న పాపాల మీద తన వెలుగును ప్రకాశింపజేసి, వారి పాపాలను శాశ్వతంగా కడిగివేసి, వారికి పాపక్షమాపణను అనుగ్రహించి, వారిని నీతిమంతులనుగా మార్చి వేసింది. అంటే, యేసుక్రీస్తు దేవుని వాక్యంతో పాపులమైన మనలను పూర్తిగా రక్షించాడన్న సత్యాన్ని గంగాళం స్పష్టంగా సాక్ష్యమిచ్చే పాత్రను పోషిస్తుంది.గంగాళం కూడా ఇత్తడితో చేసినదే


గంగాళాన్ని చేయడానికి ఉపయోగించిన ఇత్తడి యొక్క అర్థం ఏమిటో మీకు తెలుసా? మనం ఎదుర్కొనవలసిన పాపశిక్షను ఇత్తడి వివరిస్తోంది. ఇంకా వివరంగా చెప్పుకొంటే, తన బాప్తిస్మంతో యేసు మన పాపాలను సిలువకు మోసికొని పోయి మన స్థానంలో శిక్షను అనుభవించడాన్ని గంగాళం వివరిస్తోంది. మన పాపాలకు నిజంగా మనం శిక్షను అనుభవించాలి. కాని గంగాళంలోని నీటిద్వారా మన పాపాలన్నీ శుభ్రంగా కడిగి వేయబడ్డాయని మరొకసారి మనం స్థిరపరచుకోవచ్చు. ఈ సత్యాన్ని ఎవరైతే నమ్ముతారో వారు తమ విశ్వాసంతో తీర్పుపొంది, యింకెంత మాత్రం తీర్పును ఎదుర్కొనని వారిగా అవుతారు.


“నీల ధూమ్ర రక్తవర్ణాల దారం, పేనిన సన్నని నారతో నేసిన దాని ద్వారా యేసే మీ పాపాలనన్నింటిని యిప్పటికే కడిగివేసి, మీ పాపాల నుండి పూర్తిగా రక్షించాడు. మిమ్ములను శుద్ధులనుగా చేశాడు” అని నీటితో నింపబడి వున్న గంగాళం మనకు వివరిస్తోంది. తమ పాపక్షమాపణను పొంది, తమ పాపాలు కడుగబడి రక్షణ పొందారనడానికి నీతిమంతులకు ప్రత్యక్ష రుజువు గంగాళం.

దహన బలిపీఠం అంటే పాప తీర్పు అని అర్ధం. ప్రత్యక్షపు గుడారపు వస్తువులో గంగాళం నీలం దారంతో సంబంధం కలిగి కొత్తనిబంధన కాలంలో యేసు తన బాప్తిస్మంతో మన పాపాలను తన మీదికి తీసుకొన్నాడని తెలియజేస్తుంది.

మన ప్రత్యక్షపు గుడారపు ఆవరణ ద్వారం తెరచి, దానిలో ప్రవేశించి, ముందు దహన బలిపీఠాన్ని, ఆ తర్వాత గంగాళాన్ని దాటినప్పుడే పరిశుద్ధ స్థలంలో ప్రవేశిస్తాం. తమ విశ్వాసంతో ఎవరైతే దహన బలిపీఠాన్ని, గంగాళాన్ని స్పష్టంగా దాటి వెళ్లారో వారు దేవుడు నివసించే ప్రత్యక్షపు గుడారంలో ప్రవేశించగలుగుతారు. ప్రత్యక్షపు గుడారం బాహ్య ఆవరణలోని గంగాళంలోని సత్యాన్ని నమ్మి తమ పాపక్షమాపణను పొందుతారో వారు పరిశుద్ధ స్థలంలో ప్రవేశిస్తారు.

ఏ వ్యక్తి అయినా తమ స్వంతశక్తితో పరిశుద్ద స్థలంలో ప్రవేశించడానికి ప్రయత్నిస్తే పరిశుద్ద స్థలంలో నుండి అగ్నివచ్చి ఆ వ్యక్తిని ఆవరించి దహించి వేస్తుంది. చివరికి అహరోనుకుమారులకు కూడా దీని నుండి మినహాయింపు లేదు. ఆయన కుమారులలో కొందరు స్వతంత్రంగా లోపల ప్రవేశించి ఆ అగ్నికి ఆహుతై పోయారు (లేవీయ 10:1,2). దేవుడు తన నీతిలో మన పాపాలను, ఆ తీర్పును భరించాడన్న సత్యాన్ని తెలుసుకొనరు వారు తమ పాపాల నిమిత్తం చనిపోతారు. ఎవరైతే విస్తారమైన పాపాల నుండి దేవుడు రక్షించాడని నమ్మడానికి బదులు, తమ స్వంత ఆలోచనలను నమ్మి దేవుని వాక్యంలో ప్రవేశించాలని ప్రయత్నిస్తారో, వారు తమ పాపాల నిమిత్తం తప్పక తీర్పు అనే అగ్నిని ఎదుర్కొంటారు తప్పనిసరైన పాప తీర్పు వలన కలిగే ఫలితానికి వారి కోసం నరకం ఎదురుచూస్తు వుంటుంది.

మనం పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాలని యేసు నీలధూమ్ర రక్తవర్ణాల దారం, పేనినసన్నని నారతో దానితో మన పాపాల నుండి మన రక్షణను పూర్తి చేశాడు. ఈ సత్యాన్ని నమ్ముట ద్వారా మనం మన పాపాల నుండి పూర్తిగా రక్షణ పొందాం. మానవులను తమ పాపాల నుండి పూర్తిగా రక్షించాలని దేవుడు తన ఈ రక్షణ ప్రణాళికను సృష్టికి ముందే నిర్ణయించాడు. కనుక మనం బైబిలులో వివరించిన ఆయన చిత్తాన్ని నీలం దారం ద్వారా (యేసు బాప్తిస్మం), రక్తవర్ణ దారం (సిలువ మీద యేసు మరణం), ధూమ్ర వర్ణదారం (దేవుడు మానవునిగా ఈ లోకానికి వచ్చాడు) వివరంగా తెలుసుకొందాం. ఈ ప్రణాళిక ప్రకారం నీలధూమ్ర రక్తవర్ణాలలో ప్రత్యక్షపరచిన యేసు కార్యాల ద్వారా దేవుడు మానవులనందరినీ తమ పాపాల నుండి, అపరాధాల నుండి రక్షించాడు.

1యోహాను 5:4 యిలా వివరిస్తోంది, ‘‘లోకమును జయించిన విజయము మన విశ్వాసమే”; దీని తర్వాత 10వ వచనం యిలా వివరిస్తోంది, ‘‘దేవుడు కుమారుని యందు విశ్వాసముంచు వాడు తనలోనే ఈ సాక్ష్యము కలిగియున్నాడు”. ఈ రక్షణ సాక్ష్యం ఏమిటి? నీరు, రక్తము, ఆత్మల ద్వారా మన రక్షణను మనకు అనుగ్రహించిన సత్యసువార్త దేవుని కుమారునిలో మన విశ్వాసానికి సాక్ష్యం (1యోహాను 5:6-8). మరో విధంగా చెప్పుకొంటే దేవుడు మన పాపాలనన్నింటిని కడిగివేసి, మనలను తన స్వంత ప్రజలనుగా చేసుకొన్నాడన్న దానికి రుజువు మనం నమ్మే నీరు, ఆత్మలనే ఏకైక సువార్త. మన పాపాలనన్నిటి నుండి మనం రక్షణ పొంది, పరిశుద్ధ స్థలంలో ప్రవేశించడానికి, దేవుడనుగ్రహించిన జీవాహారాన్ని భుజిస్తూ, నీరు, ఆత్మల సువార్తనే నమ్ముతూ, ఆయన కృపలో జీవిస్తూ వుండడమే ఏకైక మార్గం. మన పాపాలను కడిగివేసే నీరు, ఆత్మల సువార్తను నమ్ముతూ యిప్పుడు రక్షణ పొంది, దేవుని సంఘంతో కలసి జీవిస్తూ వుండాలి.

నీరు, ఆత్మల సత్యసువార్త వలన ఆయన సంఘంలో దేవుని వాక్యంలో పోషించబడతాం. దానితో ఐక్యత కలిగివుండాలి. ఎవరి ప్రార్థనలనైతే దేవుడు వింటాడో వారు నీతిమంతులుగా జీవిస్తూ వుండాలి. మనమీ సత్యాన్ని నమ్మినప్పుడు నీలధూమ్ర రక్తవర్ణాల దారంలో విశ్వాసం గల నీతిమంతులమై, ఆయన సన్నిధిలో ఆయన కృపావస్త్రాన్ని ధరించి నివసించే వారమవుతాం. నీరు, రక్తం, ఆత్మలోనే నమ్మకముంచి తన జీవితాలను జీవించే వారి నుండే విశ్వాస జీవితం మనకూ వస్తుంది. యేసు బాప్తిస్మాన్ని ఆయన కార్చిన రక్తాన్ని, మరణాన్ని, యేసే దేవుడని మన హృదయ పూర్వకంగా నమ్ముట ద్వారా మన పాపాలన్నిటి నుండి మనం రక్షణ పొందుతాం. నీలధూమ్ర రక్తవర్ణాల దారం, పేనిన సన్నని నారతో నేసిన దాని యందు విశ్వాసమే దేవుని సంఘంలో నీవు నివసించేందుకు విశ్వాసాన్ని కలిగిస్తుంది. 

‘మనం చేయాల్సిందల్లా ఈ అనేకమైన చిక్కులతో సతమతమయ్యేకంటే యేసులో నమ్మకముంచడమే. మనమిక నిరుపయోగమైన మాటతో మన సమయాన్ని వ్యర్ధపరచక ఏది సరైన మార్గమో దానిని నమ్ముదాం” అని నేడు చాలా మంది చెబుతున్నారు. అలాంటి వారికి మనం క్రైస్తవ్యంలో చిక్కు పెట్టేవారముగా కనిపిస్తాం. కాని ఒక వ్యక్తి తన పాపక్షమాపణ పొందకుండా యేసును నమ్మితే ఆ వ్యక్తి నిత్యశిక్షను పొందుతాడన్నది స్పష్టం. నీరు, రక్తం, ఆత్మల సువార్తను పూర్తిగా నమ్మకపోవడం అబద్ధమైన, తప్పుతో కూడిన విశ్వాసమవుతుంది. అది వాస్తవానికి యేసును రక్షకుడు అని నమ్మక పోవడమే.

ఒక కొత్త వ్యక్తి అభిమానాన్ని పొందాలని, అతనితో ‘‘నేను నిన్ను నమ్ముతున్నాను” అని అంటే ఆ వ్యక్తి నమ్ముతాడా! అతడు ‘‘నిజంగా నన్ను నమ్ముతున్నాడా” ఆ మాటతో అతడు ఆనందంగా వుంటాడా? దీనికి భిన్నంగా అతడు ‘‘నేను నీకు తెలుసా? నీవు నాకు తెలియదనుకొంటాను” అని చెబితే అప్పుడతనితో నేను మళ్లీ ‘‘ అయినా ఎలాగో నేను నిన్ను నమ్ముతున్నాను” అని చెప్పి అతడు నన్ను గూర్చి మంచివాడనుకొనేట్టుగా కళ్లలో ఆప్యాయతను ఇచ్చకాలాడే వాడిలా వున్నాడని, తన మనస్సును తెలుసుకొని, అభిమానం పొందాలని ప్రయత్నిస్తున్నవాడిలా వున్నాడన్నట్టు నా వైపు చూసాడు.

ఇలాగే తనను గుడ్డిగా నమ్మేవారి పట్ల కూడా దేవుడు ఆనందించడు. ‘‘నేను దేవుని నమ్ముతున్నాను. యేసు పాపుల రక్షకుడు నేను నమ్ముతున్నాను’’ అని నేను అన్నప్పుడు యేసు ఎలా పాపుల అపరాధాల విషయంలో శ్రద్ధ తీసుకొన్నాడో తెలుసుకొని, దానిని నమ్మి అప్పుడు మనం విశ్వాసాన్ని ప్రకటించాలి. మనకొక ప్రవర్తన అసలు లేనట్లు, ఆలోచనా రహితంగా, లేక గుడ్డిగా మనం నమ్మితే మనమెన్నటికి మనం రక్షణ పొందలేం. యేసు మన పాపాలు పోయేట్టు ఎలా చేశాడో మొదట మనం స్పష్టంగా తెలుసుకొని నమ్మినప్పుడు మనం రక్షణ పొందుతాం. ఎవరో ఒకరని మనం నమ్ముతున్నాం అని చెప్పినప్పుడు, ఆ వ్యక్తి మనకు బాగా తెలుసు గనుక, ఆ వ్యక్తి నమ్మదగిన వాడే అని అనుకొన్నప్పుడే ఆ వ్యక్తిలో నిజంగా మన నమ్మకాన్ని వుంచుతాం. మనకు బాగా తెలియని వ్యక్తిలో మన నమ్మక ముంచడమంటే మనం అబద్ధమన్నా ఆడుతున్నాం, లేక మోసం చేసేందుకన్నా ప్రయత్నం చేస్తున్నామని. అలాగే యేసును మేము నమ్ముతున్నాం అని చెప్పినప్పుడు మన పాపాలన్నీ పోయేట్టు యేసు ఎలా చేశాడో దానిని మనం సరిగ్గా తెలుసుకోవాలి. అప్పుడే ఆ చివరి క్షణంలో మన ప్రభువు మనలను విడిచిపెట్టడు. అప్పుడే తిరిగి పుట్టిన దేవుని పిల్లలుగా పరలోకంలో ప్రవేశిస్తాం.

నీలధూమ్ర రక్తవర్ణాల దారంలో గల విశ్వాసమే మనలను పరలోకానికి నిజంగా నడిపే విశ్వాసం. మరో మాటల్లో చెప్పుకుంటే, మనలను నీటి ద్వారా రక్షించిన (యేసు బాప్తిస్మం), రక్తం (యేసు మరణం), పరిశుద్ధాత్మ (యేసు దేవుడు) అన్న నీరు, ఆత్మల సువార్తను నమ్ముటయే నిజమైన విశ్వాసం. మనలను రక్షించిన ప్రభువు కృప ఎంత గొప్పదో మనం తెలుసుకోవాలి, దానిని నమ్మాలి. ఈ సత్యాన్ని నమ్మినప్పుడు అది మనలను రక్షణకు నడుపుతుంది.

ఒకని విశ్వాసం ఎప్పుడు సంపూర్ణమైనది. లేక ఆ వ్యక్తికి సత్యం తెలుసా లేదా అన్న దాని మీద నిర్ణయించబడుతుంది. మీరు నీరు, ఆత్మల సువార్తను మీ హృదయపూర్వకంగా నమ్మినప్పుడు మాత్రమే యేసును మీ రక్షకునిగా నమ్మగలరు. నీరు, ఆత్మల సువార్త ద్వారా మనకు పాప విమోచన కలిగించిన యేసు మన రక్షకుడన్న ఈ విశ్వాసం మన పాపాల నుండి మనలను రక్షించిన నిజమైన విశ్వాసం.మన పాపాలను క్షమించినది రక్షణే అని గంగాళం స్థిరంగా చెబుతున్నది.


గంగాళాన్ని నీటితో నింపుతారు. దానిని పరిశుద్ధ స్థలానికి ఎదురుగా వుంచుతారు. మనం మన పాపక్షమాపణను పొందామని మనకు మనం జ్ఞాపకం చేసుకొనే స్థలం గంగాళం దగ్గరే. అక్కడే దానిని పొందామన్న విశ్వాసం స్థిరపడుతుంది. అది దేవుడు విశ్వాసులందరి పాపాలను కడిగివేశాడనన్న వాస్తవాన్ని స్థిరపరస్తుంది. పరిశుద్ధ స్థలంలో సేవచేసే యాజకుల చేతులు, కాళ్ళకు దుమ్ము అంటుకొన్నప్పుడు వారు గంగాళం దగ్గర తమ చేతులు, కాళ్ళు కడుగుకొన్నట్లే, పాపం చేసినవారు పాప విమోచన పొందినవారు మరోసారి జ్ఞాపకం చేసుకొని, మళ్ళీ స్థిరపరచుకొన్నట్టు దేవుని వాక్యం ద్వారా యేసుకూడా ఇప్పటికే వారిని మురికి చేసిన పాపాలకు వారికి ప్రత్యామ్నాయంగా (బదులుగా) శిక్షను అనుభవించి వారి పాపాలను కడిగివేశాడు.

మన మీ లోకంలో జీవిస్తున్నప్పుడు పాపం చేస్తూ మలినమైనాము. మనలను మలినపరచిన ఈ పాపాలను దేనితో మనం కడిగివేసుకోవాలి? దేనిలో నంటే రాజుల రాజు అయిన యేసుక్రీస్తు పాపులను రక్షంచడానికి 2000 సంవత్సరాల క్రితం మానవునిగా ఈ లోకానికి వచ్చి తన బాప్తిస్మం ద్వారా వారి పాపాలను తన మీదికి తీసుకొని సిలువ మీద తన రక్తాన్ని చిందించి, వారి పాపాలను క్షమించాడని నమ్ముట ద్వారా ఆ పాపాలను మనం కడిగివేసుకోగలం. యేసు బాప్తిస్మం పొందుట ద్వారా అందరి పాపాలను తన మీదికి తీసుకొన్నాడని మనం నమ్మినప్పుడు మాత్రమే మన పాప విమోచనను పొంది, మన అసలు పాపాలను కడిగివేసుకోగలం. మరోవిధంగా చెప్పుకొంటే, దేవుడు నీలధూమ్ర రక్తవర్ణాల దారం ద్వారా మన పాపాలను యిప్పటికే కడిగివేశాడన్న సత్యాన్ని నమ్ముట వలన మన అసలు పాపాలను మనం కడిగివేసుకోగలం.గంగాళంలోని సత్యాన్ని తెలుసుకొని, నమ్ముటలో మనం విశ్వాసముంచాలి.


గంగాళం బయల్పరిచే సత్యంలో విశ్వాసం లేకుండా దేవుడు నివసించే పరిశుద్ధ స్థలంలో మనమెన్నటికీ ప్రవేశించలేం. మన పనులు ఎల్లప్పుడూ పరిపూర్ణంగా వుండవు. మనకొచ్చే లోపాల వలన కొన్నిసార్లు మనం పాపం చేస్తుంటాం. అయితే దేవుని వాక్యం పరిపూర్ణమైనది గనుక ఆయన మనకిచ్చిన రక్షణ పరిపూర్ణమైనది. దేవుడు తన పరిపూర్ణ రక్షణ ద్వారా మన లోపాలను కడిగివేశాడు గనుక విశ్వాసంతో మనం ధైర్యంగా పరిశుద్ధ స్థలంలో ప్రవేశించవచ్చు. గంగాళం ద్వారా వెళ్ళనివారు ఎన్నటికీ పరిశుద్ధ స్థలంలో ప్రవేశింపలేరు. 2000సం.ల క్రితం యేసు మానవునిగా ఈ లోకానికి వచ్చి, నీలధూమ్ర రక్తవర్ణాల దారం ద్వారా ప్రవచించిన నీరు, రక్తం, ఆత్మ సువార్తతో లోకపాపాలను కడిగివేశాడన్న సత్యంలో మన విశ్వాసం వలన పరిశుద్ధస్థలంలో ప్రవేశించే యోగ్యత మనకు కలిగింది.

నీలధూమ్ర రక్తవర్ణాల దారాన్ని నమ్మకపోతే దేవుని మందిరంలోనికి ప్రవేశించలేక పోయినట్టే, మనం నీరు, ఆత్మల సువార్తను నమ్మకపోతే, దేవుని సంఘంలో ఆయన వాక్యాన్ని నమ్మకపోతే దేవుని కృపాసింహాసనం దగ్గరకు వెళ్లే దీవెనలను పొంది ఆనందించలేము. అలాగే ఆయనకు ప్రార్థనచేసి, ఆయన కృపను పొంది, ఆయన సేవకులు, పరిశుద్ధులలో జీవించలేం. దేవుడు నీలధూమ్ర రక్తవర్ణాల దారం దేవుడు మన పాపాల నుండి యిప్పటికే మనలను రక్షించాడని నమ్మినప్పుడే మన సహచర విశ్వాసులతో, ఆయన వాక్యాన్ని విని, నమ్మి, ఆయనకు ప్రార్ధించినప్పుడే దేవుని సంఘంలో మనం జీవించగలం.

మన పాపం నుండి రక్షణకు చివరి స్థిరత్వం గంగాళం వల్లనే కలుగుతుంది. పరిశుద్ధ స్థలానికి ముందు ఎదురుగా గంగాళం వుండేట్టు దేవుడేర్పాటు చేశాడు. పాపవిమోచనా సువార్త ఎవరు నమ్ముతారో వారి విశ్వాసాన్ని స్థిరపరచడానికి ఆ గంగాళాన్ని నీటితో నింపాడు. నమ్మినవారి మనస్సులోని మలినాన్ని ఈ గంగాళం శుభ్రపరుస్తుంది.

1యోహాను 2:1-2ను చదువుదాం, ‘‘నా చిన్నపిల్లలారా, విూరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను విూకు వ్రాయుచున్నాను. ఎవడైనను పాపము చేసిన యెడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రియొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమైయున్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకును శాంతికరమై యున్నాడు.’’ ఆమెన్‌.

మనం పాపం చేస్తే నీతిమంతుడైన యేసుక్రీస్తు ఉత్తరవాదిగా తండ్రి దగ్గర మనకున్నాడు. నీతిమంతుల హృదయ మలినాన్ని నీటితో శుభ్రంగా కడిగివేస్తాడు యేసు. ఆయన సిలువ వేయబడ్డానికి ముందు రోజు చివరి రాత్రి భోజన సమయంలో యేసు తన శిష్యులందరిని సమకూర్చి, ఒక పళ్లేంలో నీరు పోసి వారి పాదాలు కడగడం మొదలుపెట్టాడు. ‘‘నేను బాప్తిస్మాన్ని పొందినప్పుడు, మీరు ఇక ముందు చేయబోయే పాపాలతో సహా మీ పాపాలన్నింటిని భరించాను. మీ స్థానంలో సిలువ మీద శిక్షను అనుభవించబోతున్నాను. మీ భావి కాలపు పాపాలను కూడా నా మీదికి తీసుకొన్నాను. వాటిని నేను తుడిచివేశాను. విూ రక్షకుడైనాను.’’

ఈ సంగతిని మనకు చెప్పడానికే పస్కా రాత్రి భోజన సమయంలో యేసు శిష్యుల పాదాలు కడిగాడు. తన పాదాలు కడగవద్దని తిరస్కరించిన పేతురుతో ఆయన ‘‘నేను చేయుచున్నది యిప్పుడు నీకు తెలియదు గాని యిక విూదట తెలిసికొందువని అతనితో చెప్పాడు” (యోహాను 13:7). నీరు, ఆత్మల సువార్తను ఎవరు నమ్ముతారో వారికి పరిపూర్ణ రక్షకునిగా అవ్వాలన్నది యేసు కోర్కె. నీలధూమ్ర రక్తవర్ణాల దారంలో ఎవరు నమ్మక ముంచుతారో వారికి యేసు నిత్య రక్షకుడైనాడు.గంగాళం ఉపయోగం.


ప్రత్యక్షపు గుడారంలో యాజకులు దేవునికి బలియర్పణలు అర్పించే పనులలో వారికంటిన మలినాన్ని గంగాళంలోని నీళ్ళతో కడిగివేసుకోడానికి వుపయోగించేవారు. యాజకులు బలులు అర్పించడం వలన ఆ రక్తాన్ని సేకరించడం, వాటిని ఖండాలుగా ఖండించడం వలన అయ్యే రక్తం మరకలతో భయంకరంగా కనిపించకుండా వుండడానికి వాటిని కడిగివేసుకోవలసిన అవసరం వుంది. యాజకులా బలియర్పణల నర్పించేటప్పుడు అయ్యే మరకలను నీటితో కడుక్కోవాలి. ఆ మలినాన్ని కడుక్కోవలసిన స్థలం గంగాళం దగ్గరే.

మనం ఆధ్యాత్మికంగా, శారీరకంగా పాపం చేసినప్పుడు, దేవుని ఆజ్ఞలను విూరినప్పుడు మనం మలినమవుతాం. అప్పుడు మనం ఈ గంగాళంలోని నీళ్ళతో మనలోని మలినాన్ని కడిగివేసుకోవాలి. యాజకులు ఎప్పుడైనా అపవిత్రమైన వాటిని, మురికిని తాకినప్పుడు వారికిష్టమున్నా, లేకపోయినా వారా మురికైన భాగాలను నీటితో కడుక్కోవాలి.

ఇలా, దేవుని నమ్మే వారందరూ మురికిగా, లేక అపవిత్రమైన వాటిని తాకినప్పుడు గంగాళంలోని నీళ్ళనుపయోగించి ఆ మురికిని కడిగివేసుకోవాలి. తిరిగి పుట్టినవారు తమ మలినాన్ని గంగాళంలోని నీటినుపయోగించి శుభ్రం చేసుకోవాలి. అలా గంగాళంలో దేవుని కనికరం వుంటుంది. మనం నమ్మినా, నమ్మకపోయినా మన యిష్టంతో ఎంచుకోవలసింది కాదు. యేసులో నమ్మకమున్నవారు తప్పనిసరిగా తమ పాపాలన్నీ కడిగివేసుకోడానికి గంగాళాన్ని ఉపయోగించాలి.

ప్రత్యక్ష గుడారంలో వుండే వస్తువులన్నీ ఎంత ఎత్తు, వెడల్పు, పొడవు వుండాలో అన్నింటి కొలతను దేవుడే నిర్ణయించాడు. కాని గంగాళం కొలతను ఆయన నిర్ణయించలేదు. ఇది ప్రత్యేకించి గంగాళానికున్న లక్షణం. ప్రతిరోజు మనం చేసే అసలు పాపాల విషయంలో మెస్సీయకు గల అపారమైన ప్రేమను ఈ గంగాళం ప్రత్యక్షపరుస్తుంది. మెస్సీయ చూపే ఈ ప్రేమలో ఆయన బాప్తిస్మాన్ని చూస్తాం. మన పాపాలన్నింటిని కడిగివేయడానికి బలిపశువు తలపై చేతులుంచడమనే విధానాన్ని తెలియజేస్తుంది. యాజకులు వారి విధులను నిర్వర్తించేటప్పుడు, వారి మురికిని కడిగి వేసుకోడానికి ఎంతో నీటిని ఉపయోగించాల్సి వుంటుంది. కనుక గంగాళాన్ని ఎప్పుడూ నీళ్ళతో నింపుతూ వుండాలి. కనుక ఈ అవసరాన్ని బట్టి గంగాళం కొలతలు ఆధారపడి వుంటాయి. గంగాళాన్ని యిత్తడితో చేస్తారు గనుక యాజకులు దానిలోని నీళ్లతో కడుక్కొనేటప్పుడల్లా వారు పాప తీర్పును గూర్చి ఆలోచించాలి.

ప్రత్యక్ష గుడారంలో సేవచేసే యాజకులు తమ చేతులకు, కాళ్ళకు అయిన మలినాన్ని గంగాళంలోని నీటితో కడిగివేసుకోవాలి. ఇత్తడి దేవుని తీర్పును తెలియజేస్తూ వుండగా, నీరు పాపాలను కడిగివేయడాన్ని తెలియజేస్తుంది. హెబ్రి 10:22 యిలా వివరిస్తోంది. ‘‘నిర్మలమైన ఉదకముతో సాన్నము చేసిన శరీరములు గలవారమునై వుండాలి.’’ తీతు 3:5 కూడా యిలా వివరిస్తోంది. ‘‘పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను.’’ ఈ భాగాల్లాగానే, కొత్తనిబంధన వాక్యం బాప్తిస్మమనే నీటితో మురికిని కడిగివేసుకొనే విషయంలో ఎన్నో సంగతులను చెబుతోంది.

ఆనాటి యాజకులు వారి జీవితాల్లో కలిగిన మలినాన్ని గంగాళంలోని నీటిలో కడిగివేసుకోగా, నేటి తిరిగి పుట్టిన క్రైస్తవులు వారి జీవితాల్లో చేసిన అసలు పాపాలను యేసుక్రీస్తు బాప్తిస్మంలో నమ్మకముంచి తమ పాపాలను కడిగివేసుకోవాలి. మెస్సీయ మానవునిగా ఈ లోకానికి వచ్చి, యోహాను వలన తాను పొందిన బాప్తిస్మంతో లోకపాపాలనన్నింటిని కడిగివేశాడని పాతనిబంధనలోని గంగాళపు నీరు తెలియజేస్తుంది.

యేసు యోహాను వలన పొందిన బాప్తిస్మం ద్వారా ఇశ్రాయేలీయుల పాపాలేగాక, మానవ చరిత్ర అంతటిలో మానవులందరూ చేసిన అసలు పాపాలు కూడా యేసు మీదికి వెళ్ళాయని బైబిలు ద్వారా దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. యోహాను వలన యేసు బాప్తిస్మం పొందినప్పుడు యేసు ‘‘ఇప్పటికి కానిమ్ము, నీతియావత్తు ఈలాగు నెరవేర్చుట మనకు తగియున్నది’’ అని యోహానుతో చెప్పాడు (మత్తయి 3:15). బలిపశువు తలపై చేతులుంచి ఆ వ్యక్తి పాపాలన్నీ దానిపైకి పంపినట్టే, మానవులందరి ప్రతినిధి అయిన యోహాను వలన బాప్తిస్మం పొందినప్పుడు యేసు మానవులందరి పాపాలన్నీ తన విూదికి వచ్చునట్లు అంగీకరించాడు.

కాగా, మెస్సీయ అయిన యేసు తీసుకొన్న బాప్తిస్మం ద్వారా మన పాపాలన్నీ ఆయన మీదికి వెళ్ళాయని నమ్ముట వలన మన హృదయాల్లోని మలినమైన పాపాలనన్నింటిని కడిగివేసుకోవాలి. మన పాపాలన్నీ యిప్పటికే యేసు విూదికి వెళ్ళాయన్న సత్యాన్ని నమ్ముతున్నాం గనుక దేవుని కుమారుడు లోకపాపాలను సిలువకు మోసుకొని వెళ్ళాడని, సిలువ వేయబడి తన రక్తాన్ని చిందించి మానవులందరి పక్షంగా పరిపూర్ణమైన బలియర్పణయై మన పాపాల నుండి మనలను విడిపించాడని మనం నమ్మాలి. దీనిని విూ హృదయపూర్వకంగా విూరు నమ్ముతున్నారా? మెస్సీయ మన నిమిత్తం బలియర్పణ అయినాడని ఎవరు నమ్ముతారో వారు శాశ్వత రక్షణను పొందుతారు.యేసు బాప్తిస్మాన్ని నమ్ముట వలన అసలు పాపాల సమస్య కూడా పరిష్కరించాలి.


మన అసలు పాపాలను ఎలా కడిగివేసుకోవాలో బైబిలు మనకు వివరిస్తోందా? పాతనిబంధనలో యాజకులు గంగాళంలో నీటితో తమ మురికిని కడిగివేసుకున్నట్టే, కొత్తనిబంధనలో యేసు యోహాను వలన పొందిన బాప్తిస్మంతో లోక పాపాలను తన విూదికి తీసుకొని దేవుని నీతిని నెరవేర్చాడని నమ్ముట వలన మనం అసలు పాపాల నుండి విముక్తులమవుతాం. ఈ సత్యాన్ని నమ్ముట వలన చివరికి అన్ని పాపాలు కడిగివేయబడతాయి. 

ఇశ్రాయేలీయులు దేవునికి పాపపరిహార బలిని అర్పించేటప్పుడు వారు నిష్కళంకమైన ఒక గొర్రెను, లేక మేకను బలియర్పణగా ప్రత్యక్షపు గుడారానికి తీసుకొని రావాలి. దాని తలపై వారి చేతులుంచి వారి పాపాలు వాని విూదికి పోయేట్టు చేయాలి. వారి పాపాలను అంగీకరించిన ఆ బలిపశువును బలియివ్వాలి. తర్వాత దాని గొంతుకోసి ఆ రక్తాన్ని కార్చి సేకరించాలి. ఆ రక్తాన్ని దహనబలి పీఠం కొమ్ముల మీద వుంచాలి. మిగిలిన దానిని నేల మీద కుమ్మరించాలి. (లేవీ 4) పాపపరిహార దినాన వారర్పించిన పాపపరిహార బలిలోని విశ్వాసం ద్వారా వారి సంవత్సరపు పాపాలన్నీ ఒక్కసారే క్షమించబడతాయి (లేవీ 16). చివరిలో మనం కూడా పాతనిబంధన విధానంలోని పాపపరిహారం బలియర్పణలాగే మన పాపాలను కడిగివేయడానికి వచ్చిన మెస్సీయ తీసుకొనిన బాప్తిస్మాన్ని సిలువలో ఆయన కార్చిన రక్తాన్ని నమ్ముట వలన మన పాపవిముక్తిని పొందుతాం.

కొత్త నిబంధనలో యేసుపొందిన బాప్తిస్మం పాతనిబంధనలో బలిపశువు తలపై చేతులుంచడం రెండూ ఒక్కటే. మన మెస్సీయ యోహాను వలన బాప్తిస్మం పొంది, సిలువ వేయబడడంతో మన పాపక్షమాపణ విషయం శ్రద్ధ తీసుకొన్నాడు. మెస్సీయ బాప్తిస్మంలో సిలువలో ఆయనరక్తం ద్వారా చేసిన కార్యాల ద్వారా దేవుడు మన పాపాల నుండి మనలను రక్షించినప్పుడు మన పాపక్షమాపణ నిమిత్తం మనం చేయగలిగింది ఏముంది? మన బలహీనత వలన మనం అనుదినం చేస్తున్న పాపాలు కూడా నీరు, రక్తం ద్వారా వచ్చిన యేసుక్రీస్తు కడిగివేశాడని మనం జ్ఞాపకం చేసుకొని, దానిని నమ్మాలి. మనం దేవుని నమ్ముతూ వున్నా మన అపరాధాల వలన మనం బహీనతల్లో పడిపోతూ వుంటాం. హద్దు మీరుతూ వుంటాం. కనుక మన ఈ స్థితి తెలిసిన దేవుడు మెస్సీయనే లోకానికి పంపించి తన బాప్తిస్మం ద్వారా మానవజాతి పాపాలన్నీ తన మీదికి తీసుకొనేట్టు చేసి, ఆయనను బలిగా అర్పించి మన పాపాల నుండి మనలను రక్షించాడు.

ప్రత్యక్షపు గుడారం ఆవరణంలో దహన బలిపీఠాన్ని గంగాళాన్ని వుంచి మనం దేవుని నివాసమైన మందిరంలో ప్రవేశించడానికి ముందు మనం ప్రతిరోజు చేసే అసలైన పాపాలను కడిగివేసుకొనేట్టు అనుమతించాడు దేవుడు. అట్లని అనుదిన పశ్చాత్తాప ప్రార్థనలతో మన అసలైన పాపాలు కడిగి వేసుకొనవచ్చు అని దీని అర్ధం కాదు. దీనికి భిన్నంగా, మెస్సీయ బాప్తిస్మంలోను, ఆయన సిలువ మీద కార్చిన రక్తంలో వుంచిన విశ్వాసం మన పాపాలను శుద్ధి చేస్తుంది. నీతిమంతులు యేసును నమ్మికూడా పొరబాట్లు చేసి పాపం, చెడు పనులు చేస్తే గంగాళానికి ప్రభువైన మెస్సీయ పొందిన బాప్తిస్మాన్ని నమ్ముట వలన వారు అలాంటి పాపాలన్నీ కడిగివేసుకోవాలి.

యేసు లోక పాపాలను భరించడం, వాటన్నిటి నిమిత్తం ఆయన తీర్పు పొందడం రెంటిని గుడ్డిగా ఒకే అంశంగా కలిపి చూస్తారు చాలామంది. కానీ బలహీనత కారణంగా ప్రతిరోజు మనం చేసే అసలు పాపాలు, పాపాలన్ని కడిగివేసుకోవడం, ఆ పాపానికి తీర్పును రెండుగా వేరుపర్చాలి. యేసు యోహాను వలన పొందిన బాప్తిస్మం, సిలువ మీద మరణించడం అనేవి మన పాపాలన్నీ తాను భరించడానికి, వాటి నిమిత్తం శిక్షణ అనుభవించడానికి వాటి నుండి మనలను పరిపూర్ణంగా రక్షించడానికి జరిగింది. ఈ పాపాలకు ఈ విశ్వాసంతో మనం ఒకేసారి తీర్పు పొందడానికి జరిగింది. అలాగే అనుదినం చేసే అసలు పాపాల సమస్యలను మెస్సీయ బాప్తిస్మాన్ని నమ్ముట ద్వారా పరిష్కరించుకోవాలి. బాప్తిస్మం, సిలువనే రెండు అంశాలను కలుపుట వలన ఒకే అంశమైన పరిపూర్ణ రక్షణ అనే అంశం సంపూర్తి అవుతుంది. ఇది పరిపూర్ణ పాప విడుదల సత్యం. పాపాలకు సంబంధించినంత వరకు చిక్కు విడదీయాలంటే యేసు బాప్తిస్మాన్ని, సిలువను ఒకే దాని నుండి మరొక దానిని వేరుచేసి ఆలోచించి, దానిని నమ్మాలి.

యాజకులు ప్రత్యక్షపు గుడారంలో బలిపశువును చంపినప్పుడు వారు చిందించిన రక్తం మరకలతో మురికిగా అవుతారు. అప్పుడే వారింత మలినంగా ఎలా అయ్యారో ఊహించను కూడ ఊహించలేం. యాజకులు ఈ మలిన మంతటిని కడిగి వేసుకోవాలి. కనుక ప్రత్యక్షపు గుడారం ఆవరణలోని గంగాళంలో నీరులేకపోతే వారు తమ మలినాన్ని కడిగి వేసుకొనే వీలుండదు. అతడు ప్రధాన యాజకుడు గాని, సామాన్య యాజకుడు గాని సంవత్సరానికి సరిపడిన పాపాలకు క్షమాపణ పొందిన తర్వాత వారు గంగాళంలోని నీటితో తమను అంటి వున్న మలినాన్ని కడిగి వేసుకొనకపోతే ఆ వ్యక్తి తన మీది మురికితో అలాగే జీవించవలసి వుంటుంది.

ప్రధాన యాజకుడైన అతని మీద అన్ని రకాల మురికి వుంటుంది గనుక, ఆయన ప్రత్యక్షపు గుడారం ఆవరణలో వుండే గంగాళంలోని నీటితో ఆయనెప్పుడూ కడిగి శుద్ధి చేసుకొంటూ వుండాలి. ఒక యాజకుడు సంవత్సరపు పాపాలన్నింటికి పూర్తి క్షమాపణ పొందినా, ఆయన అనుదిన అసలు పాపాలను ఈ గంగాళంలోని నీటితో తన మురికిని కడిగి వేసుకోవాలి. తనకు బలియర్పణలు అర్పించే యాజకులు తమ మలినమంతటిని గంగాళం దగ్గర కడిగి శుభ్రపరచుకోవాలని దేవుడు నిర్ణయించాడు. కాగా ప్రత్యక్షపు గుడారం ఆవరణలో దేవుడు గంగాళాన్ని ఎందుకు వుంచమన్నాడో మనం గుర్తించాలి. ఈ గంగాళం దహన బలిపీఠానికి దేవుని మందిరానికి మధ్య ఎందుకు వుంచారో కూడా మనం తెలుసుకోగలం.గంగాళం అవసరం ఏమిటి?


గంగాళంలో దాగివున్న సత్యం యోహాను 13లో బయల్పరచబడింది. పస్కా విందు సమయంలో తన శిష్యులతో కలసి చేసిన చివరి రాత్రి భోజనం అనంతరం, పేతురుతో మొదలుపెట్టి యేసు శిష్యులందరి పాదాలు కడగడం మొదలు పెట్టాడు. యేసు పేతురు పాదాలు కడిగి ప్రయత్నించినప్పుడే, తన పాదాలు కడగడానికి వీలుగా పాదాలను ముందుకు చాపమని పేతురును అడిగాడు ప్రభువు అందుకు పేతురు ‘‘నేను నీ పాదాలు కడగాలి గాని, ప్రభువా నీవు నా పాదలెలా కడుగుతావు?’’ అని అన్నాడు.

బోధకుడు తన స్వంత శిష్యుల పాదాలు కడగడం సమంజసంగా వుండదని, నా పాదాలు కడగమని నా భోధకుని ఎలా అడగడానికి సాహసించను అని భావించిన పేతురు యేసును తన పాదాలు కడగవద్దని తిరస్కరించాడు. అందుకు యేసు పేతురుతో చెప్పిన మాటల్లో చాలా లోతైన భావం వుంది.

“నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు గాని ఒక మీదట తెలిసికొందువు” అని పేతురుతో చెప్పారు (యోహాను 13:7). ఈ మాటలు చెప్పడంలో ‘‘నీ పాదాలు నేనెందుకు కడుగుతున్నానో యిప్పుడు నీవు అర్ధం చేసుకోలేవు. కాని నీ అసలు పాపాలను పరిష్కరించుకోడానికి అసలైన కీలకాంశం యిదే. ఇక యిప్పటి నుండి నీవు చాలా అసలైన పాపాలు చేస్తావు. నీ భావికాలపు అసలు పాపాలను కూడా నేను నా మీదికి తీసుకొన్నాను. ఈ పాపాలు నిమిత్తం యిప్పుడు నేను సిలువ మీద నా రక్తాన్ని చిందించాలి. కాగా నీ భావి కాలపు అసలు పాపాల విషయం కూడా శ్రద్ధ తీసుకోవలసిన మెస్సీయను నేనే అని నీవు తెలుసుకొని, నమ్ముతావు” అన్నది యేసు భావం.

అయితే, మెస్సీయ తన పాదాలు కడగడం పాపం అన్న దృష్టే పేతురు మనసులో వుంది గనుక ఆయన తన పాదాలు కడగడానికి తిరస్కరించాడు. అయితే ‘‘దీని భావాన్ని నీవు తర్వాత తెలుసుకొంటావు’’ అని యేసు అతనితో చెప్పి, అతని పాదాలు కడిగాడు.

”నేను నీ పాదాలు కడిగినప్పుడే నాతో నీకు సంబంధాలుంటాయి. నేను నీ పాదాలు ఎందుకు కడుగుతున్నానో యిప్పుడు నీవు అర్ధం చేసుకోలేవు. కాని నన్ను సిలువ వేసిన తర్వాత నేను పరలోక రాజ్యానికి ఆరోహణమై వెళ్లిపోయిన తర్వాత నేను నీ పాదాలు ఎందకు కడిగానో నీవు తెలుసుకొంటావు. నేను మీ మెస్సీయను గనుక, నీ భావికాలపు పాపాల నిమిత్తం కూడా నేను బలిపశువునే నా బాప్తిస్మం ద్వారా వాటిని నేను భరించాను. నేను నీ రక్షకుడైనాను.’’

మన ప్రభువు చెప్పినట్టే దీని గురించి ఏ మాత్రం కూడా పేతురు అప్పుడు తెలుసుకోలేదు. కాని యేసు పునరుత్థానం తర్వాత దాని నతడు గ్రహించగలిగాడు. నిజంగా అతని అసలు పాపాలు కడిగి వేయబడిన సంఘటన అదే.

నేను ఈ లోకంలో అసలు పాపాలు చేయకుండా వుండలేను గనుక మెస్సీయ అయిన యేసు బాప్తిస్మమిచ్చు యోహాను వలన పొందిన బాప్తిస్మంతో నా పాపాలు తన మీదికి తీసుకొన్నది! తన బాప్తిస్మంతో యేసు ఈ పాపాలనన్నింటినీ తన మీదికి తీసుకొన్నాడు. లోకపాపాలను సిలువకు మోసుకొని వెళ్లాడు. సిలువ శిక్షను అనుభవించుట ద్వారా పాపశిక్షను భరించాడు! ఆయన మరల మృతులలో నుండి లేచుట ద్వారా ఆయన నిజంగా, పూర్తిగా మన పాపాల నుండి మనలను రక్షించాడు.

ఆ తర్వాత కాలంలో ప్రభువు ఎవరో నేనెరుగనని మూడు సార్లు చెప్పిన తర్వాతే పేతురు దీనిని గ్రహించి, నమ్మాడు. అందుకనే ‘‘దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్ములను రక్షించుచున్నది. అదేదనగా శరీర మాలిన్యము తీసి వేయుట కాదు గాని యేసుక్రీస్తు పునరుత్థాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే” అని అన్నాడు పేతురు (1 పేతురు 3:21). ఇక్కడ సాదృశ్యము అంటే ‘‘ముంగుర్తుగా చెప్పబడినది, లేక ముందు చెప్పుకొన్న దానిని గుర్తించుట అని. అంటే పాత నిబంధనలోని దానికి కొత్త నిబంధనలోని ప్రతిరూపకంగా యేసు బాప్తిస్మం పాతనిబంధనలోని ‘‘నీరుకు” సాదృశ్యమని స్పష్టంగా వివరిస్తోంది.

పాతనిబంధనలో పాపపరిహార దినాన ఇశ్రాయేలీయులు పాపక్షమాపణ నిమిత్తం ప్రధాన యాజకుడు బలి అర్పించేటప్పుడు ఆ బలిపశువు తలపై చేతులుంచే విధానమే యేసు పొందిన బాప్తిస్మ విధానం. పాత నిబంధనలోని ఆ బలిపశువు ఇశ్రాయేలీయుల పాపలన్నింటిని అంగీకరించింది గనుక అది చనిపోయేంత వరకు తన రక్తాన్ని కార్చాలి. అందుకు దాని గొంతు కోస్తారు. కనుక దానిలోని రక్తమంతా కారుతుంది. తర్వాత యాజకులు దాని తోలువలుస్తారు. దానిని ముక్కలుగా ఖండిస్తారు. దాని మాంసాన్ని దహించడం ద్వారా దానిని దేవునికి అర్పిస్తారు.

పాతనిబంధన బలి అర్పణకు నిజమైన వస్తువైన మెస్సీయ ఈ లోకానికి వచ్చాడు. తన తలపై చేతులుంచుట ద్వారా మన పాపాలను అంగీకరించాడు. సిలువ మీద రక్తాన్ని కార్చాడు. మన స్థానంలో చనిపోయాడు. కనుకనే ఈ రోజు మీరు నేను కూడా యేసుక్రీస్తు బాప్తిస్మం. సిలువ మీద ఆయన మరణం ద్వారా మన పాపాలకు పూర్ణ విముక్తిని పొందాం. మన ప్రభువు పొందిన బాప్తిస్మం, సిలువ మీద ఆయన మరణం ద్వారా మనం చేసే పాపాలను కడిగివేశాడని నమ్ముట ద్వారా మనం అనుదినం చేసే అసలు పాపాలను కూడా కడిగివేసుకోవాలి. మన మీ సత్యాన్ని తెలుసుకొని, దానిని నమ్మాలి. యేసు తన బాప్తిస్మం ద్వారా మన పాపాలన్నీ ఆయన మీదికి తీసుకొని వాటన్నిటిని కడిగివేశాడని నమ్ముట ద్వారానే మన అసలు పాపాల నుండి మనం విడుదల పొందగలం . మనం అసలు పాపాలను చేసినప్పుడల్లా నీరు, ఆత్మ సువార్తలో మన విశ్వాసాన్ని స్థిరపరుస్తూ వుండాలి. యేసు తన బాప్తిస్మం, సిలువ వలన మన అసలు పాపాలు కూడా యేసు కడిగి వేశాడని నెమరు వేసుకోవడం వలన మన రక్షణను మనం కోల్పోకపోగా, ఒక నేర భావం మన హృదయాలలో కలిగినప్పుడు నెమరు వేసుకోవడం వలన మన రక్షణను కాపాడుకోగలం.

నీతిమంతులు తాము అనుదిన జీవితాలల్లో చేసిన పాపాలకు విమోచన పొందినా యేసు వారి పాపాలను ఇంతకు ముందే కడిగివేశాడు గనుక ఈ నీతిమంతుల విమోచన నీరు, రక్తం, ఆత్మల వలన కలిగినదని దేవుడు వారికి గంగాళాన్ని అనుమతించాడు. కనుక నీరు, ఆత్మల సువార్తలో విశ్వాసం ద్వారా వారి అసలు పాపాలు కడిగి వేయబడతాయి.

ఇందుకొరకే ప్రత్యక్షపు గుడారంలో కలుసుకొనే స్త్రీల చేతి అద్ధాలను సేకరించి, వాటిని కరిగించి గంగాళాన్ని దేవుడు చేయించాడు. ఈ అద్ధాలు తమను ప్రతిబింబిస్తాయి. గనుక వాటినుపయోగించారు. మన బలహీనత వలన మనమెప్పుడు అసలు పాపాలు చేసి, నిస్పృహాలో పడిపోతామో అప్పుడు మనం గంగాళం దగ్గరకు వెళ్ళి మన చేతులు, కాళ్లు కడుక్కోవాలి. యేసు యోహాను వలన బాప్తిస్మం తీసుకొన్నప్పుడు మానవజాతి అందరి పాపాలను ఒకేసారి తనమీదికి తీసుకొన్నాడు అని గంగాళం మనకు జ్ఞాపకం చేస్తోంది. తన పాపాలకు విమోచన పొందిన నీతిమంతులకు ఈ సత్యాన్ని బోధించడానికి ఇశ్రాయేలీయులు స్త్రీ చేతి అద్ధాలను సేకరించి ఈ గంగాళాన్ని చేసి దానిని నీటితో నింపి, యాజకుల చేతులకు, కాళ్లకు అంటిన మలినమంతటినీ ఈ నీటితో కడుగుకొనేందుకు దానిని తయారు చేయించాడు.

యేసు దేవుని కుమారుడు, సృష్టికర్త, మానవజాతి రక్షకుడు అని మనం నమ్ముతాం. ఇంకా మెస్సీయ మానవునిగా ఈ లోకానికి వచ్చి, యోహాను వలన తాను పొందిన బాప్తిస్మంతో మన పాపాలన్నీ ఆయన మీదికి వెళ్లునట్లు అంగీకరించాడు. అంటే మనం అసలు పాపాలు చేసినప్పుడెల్లా మనం బలహీనతల్లో పడిపోతాం. లేక మన బలహీనతలు బయల్పరచబడతాయని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా, మెస్సీయ మానవునిగా వచ్చి, బాప్తిస్మాన్ని పొంది, సిలువ వేయబడుట ద్వారా మన పాపాలను యిప్పటికే కడిగి వేశాడని మనం మరింతగా జ్ఞాపకం చేసుకోవాలి.

మన పాపవిమోచన పొంది కూడా, దీనిని మనం జ్ఞాపకం చేసుకొనక, దానిని నమ్మకపోతే, మనం మళ్లీ మన అసలు పాపాలతో కట్టబడి, మన పాత పాపపుస్థితికి వెళ్లిపోతాం. మన బహీనతల వలన ప్రతిరోజు మనం చేసే పాపాలు, అపరాధాలు యేసు బాప్తిస్మంతో ఆయన మీదికి యిప్పటికే వెళ్లాయని మనం ప్రతిరోజు నమ్మాలి. మెస్సీయ యోహాను వలన పొందిన బాప్తిస్మంతో మన పాపాలన్నీ ఆయన మీదికి తీసుకొని వాటిన్నిటిని కడిగి వేశాడని మనం ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోవాలి, మళ్లీ దానిని నమ్మాలి, దానిని స్థిరపరచుకోవాలి.

యేసు యోహాను వలన పొందిన బాప్తిస్మంతో లోక పాపాలను భరించి, తన రక్తాన్ని చిందించాడని నమ్మకపోతే ఈ భూమిమీద ఎవరూ కూడా తమ పాపక్షమాపణను పొందలేరు. మానవుల, పాపవిమోచన పొందినవారైనా అసలు పాపం చేయనివారు ఒక్కరైనా వుండరు. అలా యేసు బాప్తిస్మాన్ని నమ్మకపోతే అందరూ పాపాత్ములే. అప్పుడే దేవుని చిత్తం ప్రతి ఒక్కరి విషయంలో ఎన్నటికీ నెరవేరేది కాదు. అందుకనే దేవుడు తన కుమారుని మనకు యిచ్చాడు. యోహాను వలన బాప్తిస్మం పొందేట్టు చేశాడు. తన రక్తాన్ని చిందించడానికి ఆయన్ను సిలువకు అప్పగించాడు.

మనం గాని యేసు మన మెస్సీయ అని నమ్మితే, యోహాను వలన ఆయన పొందిన బాప్తిస్మంలో మన పాపాలన్నీ ఆయన మీదికి వెళ్లాయని, లోక పాపాలను మోసుకొని ఆయన సిలువకు వెళ్లాడని, సిలువ వేయబడ్డాడని, దానిపై తన రక్తాన్ని కార్చాడని మనం నమ్మాలి. యేసు బాప్తిస్మం, ఆయన చిందించిన రక్తాన్ని నమ్ముట వలన మనం మన పాపవిమోచన పొందుతాం. ఈ సత్యాన్ని నమ్ముట ద్వారా మన పాపాలన్నీ కడిగివేయబడతాయి. దేవుని ప్రేమను మన హృదయ పూర్వకంగా నమ్ముట వలన మనం నీతితత్వాన్ని చేరుకొంటాం. అప్పుడు మన హృదయాల్లో పాపం వుండదు. అది నిర్మలంగా, మచ్చలేనివిగా వుంటాయి. అయినా మన శారీరకంగా కొన్ని అపరాధాలుంటాయి. అందుకు యేసు బాప్తిస్మాన్ని మనం ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోవాలి. ఈ విశ్వాసాన్ని ఎప్పుడూ జ్ఞాపకముంచుకోవాలి. ఎప్పుడు మన అపరాధాలు, బహీనతలు తెలియజేయబడతాయో, పాపపు తలంపు చేరుతాయో అప్పుడు మనం మలినం గల వారమవుతాం. మన కార్యాలు దారి తప్పినప్పుడు మన ప్రభువు యోహాను వలన పొందిన బాప్తిస్మంతో మన పాపాలను తన మీదికి తీసుకొన్నాని, మన హృదయాలను శుద్ధిచేశాడని మళ్లీ నమ్మినప్పుడే మన ప్రభువు సంతోషిస్తాడు.

మనం పాపం చేసినప్పుడు దేవుని ముందు మొదటిగా ఆ పాపాలన్నీ ఒప్పుకోవాలి. యేసు బాప్తిస్మం వలన ఈ పాపాలన్నీ ఆయన మీదికి వెళ్లాయని మరొకసారి నమ్మాలి. యేసు బాప్తిస్మం కార్యం వలన శుద్ధి పొందిన వారు ఆ కార్యాన్ని నమ్ముట ద్వారా వారి అసలు పాపాలను ప్రతిరోజు కడుక్కోవాలి. ఇందుకనే యేసుక్రీస్తు బాప్తిస్మం వలన మన పాపాలన్నీ కడిగివేసుకోగలమని జ్ఞాపకం చేసుకొని, దాని నమ్మాలి.

దహన బలిపీఠానికి, ప్రత్యక్షపు గుడారానికి మధ్య గంగాళాన్ని దేవుడెందుకు ఏర్పాటు చేశాడో మనం పరిశీలించాం.మనం పరిశుభ్రమైన శరీరాలతో, శుద్ధమైన హృదయాలతో ఆయన ముందుకు వెళ్లాలని దేవుడా గంగాళాన్ని అక్కడ వుంచాడు. మనం నీతిమంతులమైన తర్వాత కూడా, యేసుబాప్తిస్మం, సిలువ వలన పరిపూర్ణ పాపవిమోచన పొందినా, మనం పూర్వకంగానో, అయిష్టంగానో పాపంచేస్తే మన హృదయాలు మలినమవుతాయి. అందుకని మనం దహన బలిపీఠాన్ని దాటి దేవుని ముందకు వెళ్లకముందు గంగాళం దగ్గర మన మలినాన్ని కడిగి శుభ్రపరచుకోవాలి. మనలో కించిత్‌ మలినమున్న దేవుని ముందుకు వెళ్లలేం. గనుక గంగాళం నీటితో మనలను శుభ్రపరచుకొని ఆయన సన్నిధికి ప్రవేశించాలని గంగాళాన్ని ప్రత్యక్ష గుడారానికి, దహన బలిపీఠానికి మధ్య ఏర్పాటు చేశాడు.దేవుని ముందు ఏది మంచి మనస్సాక్షి?


యేసు బాప్తిస్మం ‘‘దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరము” అని 1 పేతురు 3:21 నిర్వచిస్తోంది. ఇక్కడ ‘‘మంచి మనస్సాక్షి” అంటే యేసు మానవజాతి పాపాలన్నీ, ప్రతిరోజు చేసే అసలు పాపాలను కూడా యేసు యొర్దాను నదిలో యోహాను నుండి పొందిన బాప్తిస్మంతో కడిగి వేశాడని నమ్మే వ్యక్తి అని భావం. మన పాపాలను తన మీదికి తీసుకోడానికి మన ప్రభువు యోహాను వలన పొందిన బాప్తిస్మంతో అంగీకరించాడు. మన పాపాలన్నీ తన శరీరం మీద యేసు భరించాడు. గనుక ఆయన సిలువ మీద చనిపోవాలి. ఆయన చేసిన దానిని అలక్ష్యం చేసి, నమ్మకపోతే మన మనస్సాక్షి పాపభూయిష్టమైనదే. ఇందుకని మనం ఆయన బాప్తిస్మాన్ని నమ్మాలి. దేవుని ముందు మనం మంచి మనస్సాక్షి గలవారంగా వుండాలి. మనం శారీరకంగా మరీ పరిపూపూర్ణంగా జీవించకపోయినా కనీసం దేవుని దృష్టిలో మంచి మనస్సాక్షి గలవారంగా వుండాలి.

ఒక అర్ధశతాబ్ధం క్రితం కొరయా యుద్దంలో కొరియా శిధిలాలుగా మారిపోయినప్పుడు దాని దైన్య స్థితిని మార్చడానికి విదేశీ సహాయాలు వరదలా వచ్చి పడ్డాయి. ఆ సహాయాలను మొదట అనాధాశ్రమాలు పొందాల్సి వున్నా, ఆ ధర్మానికి జంకని కొందరు ఆ సహాయక నిధులను తమ జేబుల్లో వేసుకొని తమ ఆస్తులను పెంపొందించుకొన్నారు. వారిక మనస్సాక్షుల్లేవు. విదేశాల పాలపొడి, పిండి, దుప్పట్లు, చెప్పులు, బట్టలు యింకా అనేకమైన ఇతర వస్తువులను బట్టలు లేని వారికి, ఆకలితో బాధపడేవారికోసం పంపిస్తే కొందరు చెడ్డ అధికారులు, మోసగాళ్లు వాటిని వూహించని విధంగా వాటిని స్వంతానికి వుపయోగించుకొన్నారు.

మనస్సాక్షి గల వారు పేదలకు వాటిని సరిగానే అందించారు. ఆ విదేశీ సహాయాలను తమ ఆస్తి పెంచుకోడానికి మళ్లించు కొనక, ఆకలితో బాధపడుతున్న వారికి పంచిపెట్టినవారు మంచి మనస్సాక్షితో చేశారు గనుక వారు దేవుని ముందు సిగ్గుపడాల్సిన అవసరం లేదు. కాని అలా చేయని వారిని వారి మనస్సాక్షి దొంగలుగా, నేరస్థులుగా తీర్పు తీరుస్తుంది. ఈ దొంగలు యిప్పటికైనా దేవుని వైపు తిరిగి యేసు బాప్తిస్మాన్ని నమ్మితే తమ పాపాలన్ని కడిగివేసుకోవచ్చు.

మన పాపాలను తన మీదికి తీసుకొని వాటిని కడిగి వేయడానికి యేసు ఈ లోకానికి వచ్చి బాప్తిస్మాన్ని తీసుకొన్నాడు. అలా యోహాను బాప్తిస్మాన్ని పొంది మన పాపాలన్నీ ఒకేసారి కడిగివేశాడు. ఆయన బాప్తిస్మాన్ని అవిశ్వాసులతో ‘‘ఆయన బాప్తిస్మాన్ని నమ్మనంత గర్విష్టులుగా మిమ్ములను చేస్తున్నదేమిటి? ఆయన బాప్తిస్మాన్ని నమ్మక పరలోకరాజ్యంలో ప్రవేశించగల మంచి వారామీరు?’’ అని నేను వారిని గద్దిస్తున్నాను.

మనం నిజంగా మంచి మనస్సాక్షిగలవారిగా వుండాలనుకొంటే యేసు యోహాను వలన పొందిన బాప్తిస్మంతో మన ఆసలు పాపాలను కడిగి వేసుకోవాలి. అది చేయాలంటే మన జీవితకాలంలో మనం చేసిన పాపాలన్నింటిని యేసు తనమీదికి తీసుకొని వాటన్నిటిని కడిగి వేశాడని మన హృదయ పూర్వకంగా నమ్మాలి. ఇందుకోసమే మన మెస్సీయ అయిన యేసు సిలువ వేయబడక ముందు యోహాను వలన బాప్తిస్మాన్ని పొందాడు.

“నేను కూడా నిన్ను శిక్షించను, నీకు తీర్పుకూడా తీర్చను” అని వ్యభిచారంతో పట్టబడిన స్త్రీతో ఎందుకు అన్నాడు యేసు. ఈ స్త్రీ పాపాలను కూడా యేసు అప్పటికే తనమీదికి తీసుకొన్నాడు. ఆ పాపానికి కూడా ఆయన శిక్షను భరించాడు గనుక. ఆయనన్నాడు ‘‘మీ పాపాల నిమిత్తం శిక్ష పొందిన వాడను నేనే. అయితే నా బాప్తిస్మంలో నమ్మకముంచి మీ పాపాలన్నీ కడిగి వేసుకోండి. నన్ను నమ్మి మీ పాపాల నుండి రక్షణ పొందండి. ఇంకా విశ్వాసంతో పాప శిక్ష నుండి రక్షణ పొందండి. మీ మనస్సాక్షిలోని పాపలన్నింటిని కడిగి వేసుకొని మళ్ళీ ఎన్నటికీ మీకు దాహం కలుగని నేనిచ్చు జీవజలాన్ని తాగండి.’’

మన పాపాల నుండి మనలను రక్షించినవాడు యేసే అని ఆ రోజు మనం నమ్ముతున్నాం. యేసు తన బాప్తిస్మంతో మన పాపాలన్నీ తన మీదికి తీసుకొని, వాటన్నిటిని కడిగి వేశాడని మీరు నిజంగా నమ్ముతున్నారా? మన ప్రభువు బాప్తిస్మం తీసుకొనుట ద్వారా మన పాపాలను కడిగి వేశాడు. మనమిప్పుడు మంచి మనస్సాక్షితో దేవుని దగ్గరకు వెళ్లగలం. మన ప్రభువు బాప్తిస్మం ద్వారా మన పాపాలన్నీ తనపైకి తీసుకొని, వాటన్నిటిని సిలువకు మోసుకొని వెళ్ళి, సిలువ శిక్షను మన స్థానంలో అనుభవించాడు. మృతులలో నుండి మళ్లీ లేచి మన పాపాలను కడిగివేశాడు. చాలా కాలం క్రితం యేసు ఈ లోకానికి వచ్చాడు. 33 సం॥లు జీవించాడు. తన బాప్తిస్మంతో మన పాపాలన్నీ ఆయన మీదికి తీసుకొని వాటిని కడిగివేశాడు.

చివరికి మన అసలు పాపాలను కూడా ఆయన మీదికి తీసుకొని వాటిని కడిగివేసి, మనం దేవుని దగ్గరకు వెళ్లగలుగునట్లు. నీతిమంతులమయ్యే అవకాశాన్ని కలిగించాడు. యేసుక్రీస్తు చేసిన బలియాగం ద్వారా మన పాపాలకు తీర్పు తీర్చాడు. ఈ ప్రభువును నమ్ముట వలన మనం దేవుని మన తండ్రి అని పిలువ గలుగుతున్నాం. ఆయన సన్నిధికి వెళ్లగలం. కనుక యేసు నీటితోను, రక్తంతోను, ఆత్మతోను చేసిన కార్యాలను నమ్మేవారు మంచి మనస్సాక్షి కలిగి వుంటారు. దీనికి భిన్నంగా ప్రభువు నీతిమంతులమైన కార్యాలైన ఆయన బాప్తిస్మం, సిలువ శిక్షను నమ్మనివారు నిజంగా పాపపు మనస్సాక్షి గలవారే.ఈ రోజులలో చాలామందికి మూఢ నమ్మకాలలో వున్న నమ్మకం వలన దేవుని వాక్యాన్ని తీవ్రమైనదిగా భావించడం లేదు.


చాలామంది అబద్ధికులు దేవుని వాక్యాన్ని ఒక ఆభరణంగా గ్రహించి, మనం పరలోకరాజ్యంలో ప్రవేశించాలంటే దేవునిలో నమ్మకంతో మంచిని చేయాలని బోధిస్తున్నారు. రక్షణ విషయం వచ్చినప్పుడు వారు సిలువ రక్తాన్ని గూర్చే మాట్లాడతారు. వారి శారీరక అనుభంవంద్వారా దేవుని కలుసుకొని వచ్చునని ఒక కొండమీదికి వెళతారు ప్రార్థించడానికి, లేక ఉపవాసం వుంటారు. ఇది పొరబాటు ఆలోచన. ఈలాంటి విశ్వాసం కంటే పొరబాటు మరొకటి లేదు. అయినా వారిదే సరైనదని భావిస్తారు. ‘‘నేను నా పాపాలకు హింసలు పొందాను. కనుకనే దేవా, నేన పాపం చేశాను, నేను నిన్ను నమ్ముతున్నాను ప్రభువా అని నేను రాత్రంతా ప్రార్థన చేస్తునేవున్నాను. ఆ రోజు సాయంత్రం వరకు నన్ను నేను శిక్షించుకొంటూనే వున్నాను. కాని ఆ రాత్రంతా ప్రార్థనచేసిన తర్వాత ప్రాతః కాలానికి ఒక అగ్ని మూట హఠాత్తుగా నామీదికి దిగివచ్చింది. అదే సమయానికి నా హృదయంలోని పాపాలన్నీ మంచువలె తెల్లగా కడగబడిన అనుభవం నాకు కలిగింది. ఈ సమయంలో నేను తిరిగి పుట్టాను. హల్లెలూయ” అని వారు చెబుతూ వుంటారు.

అలాంటి ఆలోచనలు మానవులు తయారుచేసినవి, అజ్ఞానంతో కూడినవి. దేవుని వాక్యాన్ని నిరుపయోగం చేసే బుద్ధిహీనమైన ఆలోచనలివి. ఇలాంటి అర్థంలేని సంగతులు చెబుతూ, ప్రజలను మోసగిస్తూ, యితరలను నరకాగ్నికి నడిపే వారిని దేవుడు అనేకవిధాలుగా శిక్షిస్తాడని మీరు జ్ఞాపకం వుంచుకోవాలి.

నా చెవులెంతో నొప్పి పుట్టేవి, కాని ప్రభువు చెప్పే దానిని నేను నమ్మాను. మనం నమ్మితే మనం స్వస్థత పొందుతాం కనుక ఆ నొప్పిని భరంచి, ‘‘ప్రభువా, నేను నమ్ముతున్నాను” అని చెప్పుకొంటూ నేను నమ్మినప్పుడు నా నొప్పి అంతా పోయింది.

“నాకు అన్న వాహిక సంబంధమైన అల్సర్‌ వుంది. నేను ఏమైనా తిన్నప్పుడల్లా భయంకరమైన కడుపునొప్పితో బాధపడేవాణ్ణి. కనుక నేను ఏదైనా తినక ముందు ‘‘ప్రభువా, నాకిక్కడ బాధగా వుంది. మేము విశ్వాసంతో ఏదడిగినా వింటానని నీవు అన్నావు. నేనా మాటను యింకా నమ్ముతున్నాను. నిజంగా నాకు జీర్ణక్రియ సమస్యలేదు” అని ప్రార్థించేవాణ్ణి.

ఇవన్నీ ఏమిటి? ఇవన్నీ వాక్యం ద్వారా ప్రజలు దేవుని కలుసుకోలేని సందర్బాలు. ఈ సందర్భాలు వాక్యం ద్వారా దేవుని నమ్మని అసత్యమైన వారి విశ్వాసాన్ని తెలియజేసేవి. ఇవి వాక్యం ద్వారా వారి ప్రార్థనలకు జవాబులు కావు. కాని కేవలం వారి మూఢ విశ్వాసం. వారు దేవుని వాక్యం ద్వారా గాక, వారి భావోద్రేకాలు, అనుభవాలపై ఆధారపడిన పొరబాటు నమ్మకాలు, నేటి క్రైస్తవుల్లో యిలాంటి వారు అనేకమంది వుండడం బాధ పడాల్సిన, విచార పడాల్సిన విషయం.

ఇలా, దేవుని వాక్యాన్ని ప్రక్కకు నెట్టి, తమ భావోద్రేకాలు, అనుభవాల నాధారం చేసుకొని యేసును గుడ్డిగా నమ్మడం అనేది మూఢవిశ్వాసంగా లెక్కించబడుతుంది. వాక్యం వలన గాక యేసును నమ్ముతున్నామని చెప్పే వారు దయ్యాలు పట్టినవేమోనని పరీక్షించుకోవలసిన అవసరం వుంది. ‘‘నేను ప్రార్థిస్తూ వుండగా యేసును కలుసుకొన్నాను. యేసు నా కలలో ప్రత్యక్షమైనాడు. నేనెంతో మనఃపూర్వకంగా ప్రార్థించాను. కాని యిది దేవుడను గ్రహించిన విశ్వాసం కాదని, అది సాతాను యిచ్చిన అసత్యమైన విశ్వాసమని స్పష్టమవుతోంది.

మన ప్రభువు నీలధూమ్ర రక్తవర్ణాల దారం, పేనిన సన్నని నారతో తనను మనకు బయల్పరచుకొన్నాడు. ఈ రోజుల్లో దేవుడు మరో విధంగా నూతనంగా బయల్పరచుకొంటాడా? ఆయనొక మాయలా, కలలో మన ముందుంటాడా? ఆయన కాళ్లకు బరువైన గొలుసులతో, ఈడ్చుకొంటూ నడుస్తూ, శరీరమంతా రక్తం ఓడుతూ వుండగా, తల మీద ముళ్ల కిరీటంతో, ‘‘ఇలా నేను మీ కోసం శ్రమను భరించాను. ఇప్పుడు మీరు నా కోసం ఏం చేస్తారు?’’ అని అడుగుతూ మన కిలా కనిపిస్తాడా? ఇలాంటివి అర్థం లేనివి.

అయినా అలాంటి కలలు వచ్చాయని చెబుతూ, ‘‘ప్రభువా, నేను నీ సేవకుడనవుతాను. నా శేష జీవితమంతా హృదయ పూర్వకంగా నేను నీకే సేవ చేస్తాను.’’ నేనిక్కడ ఒక ప్రార్థనా మందిరాన్ని కడతాను. ఇక్కడ నేనొక సంఘాన్ని కడతాను. నా శేష జీవితమంతా సిలువను మోస్తూ ఈ దేశమంతా ప్రపంచమంతా నిన్ను గూర్చి సాక్ష్యమిస్తాను” అని ప్రమాణం చేశామని చెప్పేవారుంటారు.

వాస్తవానికి యిలాంటి భక్తిగల బోధకులను వీధుల్లోనూ, బహిరంగ ప్రదేశాలల్లో సులభంగా చూడగలం. వీరంతా తమ స్వప్నాలలో యేసును చూసిన తర్వాత, లేక ప్రార్థిస్తున్నప్పుడు ప్రభువు స్వరం విని యిలా జీవించాలని నిర్ణయించుకొన్నామని వీరు చెబుతుంటారు. కాని దేవుడు తన వాక్యం ద్వారా మాత్రమే తనను బయల్పరచుకొంటాడు. ఆయన మనకు కలలో ప్రత్యక్షం కాడు. లేక మనం ప్రార్థిస్తున్నప్పుడు ప్రత్యక్షం కాడు. మరి ముఖ్యంగా మానవులకు తన వాక్యాన్ని పూర్తిగా అనుగ్రహించిన ఈ యుగంలో అసలు యిలా ప్రత్యక్షం కాడు. మానవుడు మగతలో మానకంగా చిక్కుకున్నప్పుడు కలలు వస్తుంటాయి. వారికి యేసు పట్ల గల ప్రతిఫలము లేని ప్రేమతో, వారు అతిగా ఆలోచిస్తూ వుంటారు గనుక వారికి యిలాంటి కలలు వస్తుంటాయి. 

నిద్రకు ముందు మీ మనస్సు ఏదైన విషయాన్ని గూర్చి గాఢంగా ఆలోచిస్తున్నప్పుడు మీ నిద్రలో కూడా కలలో ఈ విషయమే పెనుగులాడుతూ వుంటుంది. ఇలా కలలు మీ మగతలో వస్తుంటాయి. కనుక మనం అతిగా ఆలోచిస్తే అన్నిరకాలైన భయంకరమైన, వికారమైన కలలు వస్తుంటాయి. వాటికి విశ్వాసంతో సంబంధం లేదు. కాని అవి భౌతిక మార్పుకు ప్రతిబింబాలు మాత్రమే.

ఇందుకు ఎవరైనా సిలువ మీద యేసు చిందించిన రక్తాన్ని గూర్చి ఎక్కువగా ఆలోచిస్తే వారి కలలో యేసు తలపై ముళ్లకిరీటంతో వారికి కనిపిస్తాడు. అంతవరకైతే ఆ కలలో తప్పేమీలేదు. కాని ఈ కలను తీవ్రంగా తీసుకొంటే అది గొప్ప పొరబాటు. ఒకవేళ శరీరమంతా రక్తం కారుతూ వున్న యేసు వారికి ప్రత్యక్షమై ‘‘నా కోసం మీరేం చేస్తారు? నీ శేషజీవిత మంతా నాకోసం సన్యాసిగా జీవిస్తావా? నా కోసం నీవెలాంటి ఆస్తి లేకుండా వుంటావా?’’ అని అంటే, తమకున్నదంతా విడిచిపెట్టి ఆయన చెప్పినట్టు సన్యాసిలా జీవించే బుద్ధి హీనులుంటారా? తన కల వలన భయపడి పోయిన వారెవరైనా వున్నారా? తన కలను తీవ్రంగా ఎవరు తీసుకొన్నారు, లేక ఆ కల వలన ఎవరి జీవితాలు మారిపోయినై? ఇది నిగూఢమైనదే గాని మరొకటికాదు.

దేవుడు వాక్యం ద్వారా మనలను కలుసుకొంటాడు. మనం ఆయన్ను కలలోనో, లేక మన ప్రార్థనలోనో కలుసుకోవడానికి ఆయన వేరెవరో కాదు. దేవుని వాక్యం పాత, కొత్త నిబంధనలతో రాసి వుంది. బోధించిన ఆ వాక్యం విన్నప్పుడు దానిని మనం హృదయపూర్వకంగా అంగీకరించినప్పుడు ఆ వాక్యం ద్వారా మన ఆత్మలు ఆయనను కలుసుకొంటాయి. అంటే వాక్యం ద్వారానే, కేవలం వాక్యం ద్వారా మాత్రమే మీ ఆత్మలు దేవుని కలుసుకొంటాయి.

యేసు తన బాప్తిస్మం ద్వారా మన పాపాలను తానే తన పైకి తీసుకొన్నాడని వాక్యం ద్వారానే మనం తెలుసుకోగలం. ఆ వాక్యం వినుట ద్వారానే దానిని మన హృదయాల్లో నమ్మాము. యేసు సిలువ మీద ఎందుకు చనిపోయాడు అన్న ప్రశ్నకు జవాబు కూడా వాక్యంలో చూస్తాం. యేసు తన బాప్తిస్మముతో మన పాపాలను తన మీదికి తీసుకొన్నాడు గనుక ఆయన సిలువ మీద చనిపోయి మనలను రక్షించాడు. వాక్యం వలన దేవుని మనం తెలుసుకోగలిగాం. ఆ వాక్యం ద్వారానే మనం ఆయన్ను నమ్మాం. యేసుక్రీస్తు దేవుడని ఆ వాక్యం ద్వారానే తెలుసుకొన్నాం. ఆ వాక్యం ద్వారానే దానిని నమ్మాం.దేవుని మనం ఎలా నమ్మగలిగాం? అది లిఖిత పూర్వకమైన దేవుని వాక్యం వల్లనే కాదా?


దేవుని వాక్యమేగాని లేకుంటే మన పాపాలన్నీ పోయేట్టు చేసిన యేసును మనం ఎలా కలుసుకోగలిగే వారం, ఆయన్ను ఎలా నమ్మగలిగే వారం? దేవుని వాక్యమేగాని లేకపోతే మన విశ్వాసం వట్టిదే. ‘‘నేననుకొనేది యిదే” మన ఆలోచనలను మనం బయటికి చెప్పాలి. కాని యిది సత్యం కాదు. సత్యం కాని దానితో మన హృదయాలు నిండి వున్నప్పుడు నిజమైన సత్యం మన హృదయాల్లో ప్రవేశించదు. కనుక ‘‘నేననుకొనేది యిది” అని అనడం సరైన మాట కాదు. ‘‘బైబిలు ఈ మాట చెబుతోంది అన్నది సరైన మాట. మనం బైబిలు చదివినప్పుడు దేవుడు మాట్లాడిన సత్యం మన హృదయాల్లోనికి వచ్చి అంతకుముందు మన ఆలోచనల్లో వున్న తప్పును సరిచేస్తుంది.

నీరు, ఆత్మలు చేసిన సువార్త విషయంలో మీ విశ్వాసమేంటి? అది మీ స్వంత ఆలోచనతో చేసిన సువార్తా? లేక వాక్యాన్ని విని, దానిని తెలుసుకొని, దానిని నమ్మి మీరు తిరిగి పుట్టినదా? వాక్యం ద్వారా మనం నమ్మి, మన హృదయాలల్లో దేవుని కలుసుకొన్నాం. ఇందుకోసమే ప్రత్యక్షపు గుడారం ఆవరణం ద్వారం నీలధూమ్ర రక్తవర్ణాల దారం, పేనిన సన్నని నారతో నేయబడింది. 

గంగాళంలో నీళ్లున్నాయంటే యేసుక్రీస్తు మన పాపాలన్నీ తన బాప్తిస్మంతో తన మీదికి తీసుకొన్నాడని అర్ధం. ‘‘ఇప్పటికి కానిమ్ము, నీతియావత్తు ఈలాగు నెరవేర్చుట మనకు తగియున్నది” (మత్తయి 3:15) యేసు తన బాప్తిస్మం వల్లనే లోక పాపాలను తన మీదికి తీసుకొన్నాడని దేవుని వాక్యం వల్లనే మనం తెలుసుకోగలిగాం. ఈ వాక్యం వల్లనే మనం మన జీవిత కాలమంతటిలో చేసిన పాపాలన్నీ యేసు తన మీదికి తీసుకొన్నాడని తెలుసుకొన్నాం గనుక బాప్తిస్మాన్ని గూర్చిన విశ్వాసం మన హృదయాల్లో కలిగేట్టు చేసిందా వాక్యం. ఆ వాక్యం వల్లనే గంగాళం ద్వారా ప్రత్యక్షపరచిన సత్యాన్ని మనం తెలుసుకోగలిగాం.

దేవుని వాక్యం వల్లనే గంగాళం యిత్తడితో చేసినదని తెలుసుకోగలిగాం. బైబిల్లో ఇత్తడి అంటే న్యాయతీర్పు అని అర్ధం. దాన్నిబట్టి ఇత్తడి గంగాళం అంటే అర్థం ధర్మశాస్త్రం ప్రతిబింబించేట్టు చేస్తుంది. దాన్ని బట్టి మన మందరం శిక్షార్హులమని అది ప్రతిబింబిస్తుంది. ఇందుకనే ప్రత్యక్షపు గుడారంలో సేవ చేసే స్త్రీ చేతి అద్దాలతో గంగాళాన్ని చేశారు. మన ప్రభువు మనలను రక్షించాడు. మన పాపాల నిమిత్తం ఆయనీ లోకానికి వచ్చి, బాప్తిస్మాన్ని పొంది, సిలువ మీద చనిపోక తప్పలేదు. యేసు బాప్తిస్మం వలన మన పాపాలన్నీ ఆయన మీదికి తీసుకొని, సిలువకు వెళ్లి, పాపశిక్షను భరించాడని లిఖిత పూర్వకమైన దేవుని వాక్యం ద్వారానే మనం తెలుసుకోగలిగాం. దీనిని మన హృదయపూర్వకంగా అంగీకరించి, ఈ సత్యాన్ని నమ్మాం గనుక మనం రక్షణ పొందాం. నీవు రక్షణ పొందావా? ఎలా పొందావు?

నిగూఢ మతాన్ని అనుసరించే ఒక శాఖలోని సభ్యులు వారు ఏ రోజు, ఏ వేళప్పుడు రక్షణ పొందారో వారు తెలుసుకొని వుండాలని చెబుతారు. ఈ శాఖలోని ఒక కాపరి తెలుసుకొని వుండాలని చెబుతారు. ఈ శాఖలోని ఒక కాపరి తాను ప్రార్థనకు ఒక కొండ ఎక్కి ప్రార్ధిస్తూ, తాను ఎందుకు కొరగానివాడనని తెలుసుకొన్నప్పుడు తాను యేసును నమ్మి, రక్షణ పొందానని అనేకమంది విశ్వాసులు ముందు సాక్ష్యం చెప్పాడు. తాను తిరిగి పుట్టిన ఆ తారీఖున, సమయాన్ని తానెన్నటికి మరచిపోనని ఎంతో గర్వంతో చెప్పాడు. దీనికి పేనిన సన్నని నారతో నేసిన దానికి ఎలాంటి సంబంధం లేదు. ఇది కేవలం ఉద్రేకం మాత్రమే. ఈ కాపరి విశ్వాసానికి నీలధ్రూమ రక్త వర్ణాల దారం, పేనిన సన్నని నారతో నేసిన దానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ శాఖ వారు బోధించే రక్షణకు దేవుని వాక్యంతో చేసిన రక్షణకు ఎలాంటి సంబంధం లేదు. ఇది వారు స్వంతంగా తయారుచేసుకొన్నదే.

ఇది తనను తాను యోగ నిద్ర కలిగించుకోడానికి వీలు కలిగిస్తుంది. తాము పాపం లేని వారమని తమకు తాము చెప్పుకొంటూవుంటే, అలా అని వారు తమను గూర్చి పదే పదే అనుకొంటూ వుంటే తముకు తాము నిద్ర కలిగించుకొని (హిప్నోటైజ్‌ చేసుకొని) వారికి మాత్రం వారు పాపంలేని వారిగా వుంటారు. వారే మంత్రాన్ని తమకు తాము చెప్పుకొంటూ వుంటే తాము నిజంగా పాపంలేని వారమని వారనుకొంటారు. కాని ఆ ఆలోచనలు శాశ్వతంగా వుండవు. ఇది ఎలాంటి స్వార్ధం, అసత్యం, అజ్ఞానం, మూఢవిశ్వాసమే గదా!

సన్నని నేసిన నార అంటే పాత కొత్త నిబంధనలోని దేవుని వాక్యమని అర్ధం. ప్రత్యక్షపు గుడారం ఆవరణ ద్వారాలు, పరిశుద్ధ స్థలం ద్వారా అతి పరిశుద్ధ స్థలం ద్వారం అన్నీ నీలధూమ్ర రక్తవర్ణాల దారం, పేనిన సన్నని నారతో నేసినవి ఏం చెబుతున్నాయంటే పాత కొత్త నిబంధనలో రాసిన విధంగా యేసు మన రక్షణకు ద్వారంగాను, రక్షకుడైనాడని, కనుక ఈ రక్షణను గూర్చి దేవుడెంతో నిశ్చయంగా చెప్పినందుకు ఆయనకు నేను నిజంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

ఇందుకనే నేను ప్రార్థించేటప్పుడు ఉద్రేకాలతో విన్నవించడంగాని, ఆడంబరంగా చెప్పడంగాని చేయను, నేను దేవుని నమ్మి, సమస్తం ఆయన చిత్తానికే విడిచి పెడతాను. ‘‘తండ్రీ, దయచేసి మాకు సహాయం చెయ్యి. ప్రపంచమంతా వాక్యాన్ని బోధించేట్లు మమ్మును వాడుకో. నా తోటి పరిచారకులను, పరిశుద్ధలను కాపాడి, రక్షించు సువార్త సేవ చేసే పనివారిని మాకు దయచెయ్యి. ఈ సువార్త వ్యాప్తి చెందునట్లు అనుమతించు. విశ్వాసులు నీ వాక్యాన్ని తెలుసుకొని, దానిని నమ్మేట్లు చెయ్యి” అనే ప్రార్థిస్తాను. నా భావోద్రేకాలను పురికొల్పి కేకలు వేసి ప్రార్థించను. అలాంటి వేవీ నా ప్రార్థనలో వుండవు.

కొందరు వారెంతగా ప్రయత్నించినా తమ ఉద్రేకాలను పెంపొందించలేకపోయినా, ఎంతోకాలం క్రితం చనిపోయిన వారి తల్లిదండ్రులు తల్లులను తలంచుకొన్నా యితరులు తమ ప్రార్థనలను తీవ్రంగా తీసుకోవాలని వారు కన్నీళ్లు కారుస్తూ, నటిస్తూ వుంటారు. అలాంటి ప్రార్థనలు దేవుడు వాంతి చేసుకొనేట్టుగా చేస్తారు. కొందరు యేసు సిలువ శిక్షను తలంచుకొంటూ ‘‘ప్రభువా, నేను నిన్ను నమ్ముతున్నాను”. అని ఉద్రేకంగా కేకలు వేస్తారు.

ఇలా చేసినందు వల్ల వారి విశ్వాసం బలమైనదని అర్ధమా? మీ పాపాలను గూర్చి మీరు ఆలోచిస్తూ ‘‘ప్రభువా, నేను పాపంచేశాను. నీతిమంతునిగా జీవించడానికి సహాయం చెయ్యి” అని మీ ఉద్రేకాలను పురికొల్పి. అప్పుడు మీరు ఉద్రేకంతో వుండడానికి వీలవుతుంది. అలాంటి వుద్రేకానుభవం, ఏడ్పు వలన మీలోని ఒత్తిడి ఎంతో బయటికి పోతుంది. విన్న అనేకమంది సేదదీరి, విశ్వాసమంటే యిది అని అనుకొంటారు. వారి జీవితాలు బాధలో నిండివున్నా అలాంటి ఉద్రేకాల అనుభవాలు కొంతసేపైనా వారు బాగా వుండడానికి తోడ్పడతాయి. వారీ విధంగా వారి మన జీవితాన్ని కొనసాగిస్తారు.నీల ధూమ్ర రక్తవర్ణాల దారం, పేనిన సన్నని నార ద్వారా ప్రభువు మన దగ్గరకు వచ్చాడని మీరు నమ్మాలి.


మన ప్రభువు వాక్యం ద్వారా మన దగ్గరకు వచ్చాడు. కనుక మీరు మీ ఇంద్రియానుభవం కొరకు ఎదురుచూడనవసరం లేదు. కాని దేవుని వాక్యం మీతో ఏం చెబుతుందో మీరు వినాలి. దేవుని వాక్యాన్ని మీరు హృదయ పూర్వకంగా నమ్మినా, నమ్మకపోయినా ఆ వాక్యం మీతో ఏం చెబుతున్నదో వినండి. మీరు ప్రార్థించేటప్పుడు మీ భావోద్రేకాల మీద ధ్యానముంచకండి. దానికంటే వాటిని తగిన స్థాయికి అదుపుచేయాలి. ఈ లోకంలో చాలా మంది అబద్ధికులున్నారు. కనుక ఉద్రేకాలతో రెచ్చిపోయి, వాటిని యిష్టపడే వారి భావోద్రేకపు రంధ్రాలను అవకాశంగా చేసుకొంటారు. ‘‘గొప్ప ఆధ్యాత్మిక ఉజ్జీవసభలు” అని సభలు జరిగేప్పుడు దానిలో పాల్గొన్నవారి ఉద్రేకాలను పెంచడమే తరచుగా ప్రధాన ఉద్దేశ్యమై వుంటుంది.

ఏమైనా, నేనిప్పుడు తిరిగి పుట్టాను. నేను అలాంటి ఉజ్జీవ సభలు నిర్వహించాలని ప్రయత్నించినా నేను వాటిని జరపలేను. సువార్త ప్రకటించమంటే ఈ లోకంలో జరుగుతున్న యిలాంటి గొప్ప ఉజ్జీవ సభలు ప్రజల ఉద్రేకాలను పెంపొందించడమే కాదు. నేను సత్యవాక్యం వలన తిరిగి పుట్టిన వాణ్ణి గనుక నా ఆధ్యాత్మిక జీవితంలో ప్రవేశించాలని ప్రయత్నించే నాలోని ఉద్రేకాల భావానికి ఎప్పుడో వీడ్కోలు చెప్పాను.

దేవుని వాక్యాన్ని వినే నీతిమంతులమైన మనం మన జ్ఞానాన్ని వుపయోగించి, మన హృదయాల్లో నమ్మి ఎప్పుడూ ఉద్రేకాలన్ని పురికొల్పకూడదు. మరో వ్యక్తి మనతో దేవుని వాక్యం వున్నదున్నట్లు మాట్లాడుతున్నారో లేదో త్వరగా, సత్యాన్ని నమ్మాలి. ఇంకా ఆ వ్యక్తి మనతో చెబుతున్న దానిని నిజంగా నమ్ముతున్నాడో లేదో అని కూడా గ్రహించాలి. నీలధూమ్ర రక్తవర్ణాల దారం, పేనిన సన్నని నారతో నేసిన దానిలో సత్యాన్ని మనం తెలుసుకొని, నమ్ముతున్నాం గనుక మన హృదయాల్లో పరిశుద్ధాత్మ వున్నాడు. గనుక ఆ ఉద్రేక భావం సత్యానికెంతో దూరమైనదని మనం గ్రహించాలి. నిజమైన సత్యమేదో దానినే హృదయాల్లో అంగీకరించాలి.

యేసు నీల ధూమ్ర రక్తవర్ణాల దారం, పేనిన సన్నని నారతో నేసిన దాని వలన మన దగ్గరకు వచ్చాడు. ఈ సత్యం ఎంత అద్భుతమైంది? నిన్ను రక్షించిన మన ప్రభువు ప్రేమ ఎంత అద్భుతమైంది? దేవుని వాక్యంలో రాసివున్న యేసు నాలుగు కార్యాల ద్వారా యేసు తన బాప్తిస్మంతో మన పాపాలన్నీ తన మీదికి తీసుకొన్నాడని, సిలువ మీద చనిపోయాడని, దాని వలన నీతి యావత్తును నెరవేర్చి మనలను రక్షించాడని మన మందరం నమ్ముతున్నాం.

మీ హృదయ పూర్వకంగా మీరీ సత్యాన్ని నమ్ముతున్నారా? సువార్తను బోధించే వారు పేనిన సన్నని నారతో దీనిని వ్యాప్తి చేయాలి. అంటే, పాత కొత్త నిబంధనలోని దేవుని వాక్యం. దాని అంశం నీల ధూమ్ర రక్తవర్ణాల దారం అయివుండాలి. దానిని వినే వారు తమ హృదయాల్లో దానిని అంగీకరించి, దానిని హృదయపూర్వకంగా నమ్మాలి.గంగాళంలోని నీరు మన పాపాలను కడిగివేస్తుంది.


తన బాప్తిస్మం ద్వారా యేసు మన పాపాలన్నింటిని తన మీదికి తీసుకొని వాటన్నిటిని కడిగి వేశాడు. యేసు బాప్తిస్మం గంగాళంలోని నీటిని సూచిస్తుంది. అది మన పాపాల వలన నరకపాత్రులమైన మనలను కడిగి, దేవుని ముందు నిలువగలిగే వారిగా చేసింది. యేసు తన బాప్తిస్మంతో మన పాపాలన్నీ తన మీదికి తీసుకొన్నాడు గనుక ఆ పాపాలను కడిగి వేయడానికి ఆయన సిలువకు వెళ్లి, చనిపోవునట్లు సిలువ వేయబడ్డాడు. యేసు మన పాపశిక్షను భరించాడని యేసు బాప్తిస్మం, సిలువ సాక్ష్యమిస్తున్నాయి. తన బాప్తిస్మం, సిలువ ద్వారా యేసు మన రక్షణ కార్యాన్ని నెరవేర్చాడు.

పశ్చాత్తాప ప్రార్థనలు మన పాపాల నుండి మననెన్నటికి రక్షించలేవు. యేసు ఇప్పటికే మన పాపాలను ఆయన మీదికి తీసుకొన్నాడు గనుక మన పాపాలన్నీ కడిగి వేయబడ్డాయి. ఈ వాక్యాన్ని వినుట వలన, మన కోసం యేసు చేసిన దానిని నమ్ముట వలన మన పాపశిక్ష అంతటి నుండి విడుదల పొందాం. యేసు భరించిన శిక్ష కోసం ఆయనకు కృతజ్ఞతావందనాలు. ఆయన బాప్తిస్మాన్ని విశ్వసించుట ద్వారా మనం మన పాపశిక్షను భరించాము. నిజంగా విశ్వాసం వలన మనం రక్షించబడ్డాం. ఒకే విధంగా రక్షణ చాలా సులభమైందని చెప్పవచ్చు. మనం గాని రక్షణ, ప్రేమ వరాన్ని నమ్మితే మనం రక్షణ పొందుతాం మనం నమ్మకపోతే మనం రక్షణ పొందలేం.దేవుడు నెరవేర్చిన రక్షణ లేకుండా మనలను రక్షించగలిగింది మరొకటి లేదు.


మనలను రక్షించే విషయంలో దేవుడు తప్ప మనలను రక్షించుకోడానికి మనం ఏమీ చేయలేము. సృష్టిచేయకముందే ఈ విధంగా మనలను రక్షించాలని నిర్ణయించిన దేవుడు మన రక్షణ కార్యాన్ని నెరవేర్చాడు. ప్రతీదీ కూడా దేవుడెలా నిర్ణయిస్తాడో దానిపై ఆధారపడి వుంటుంది. తన కుమారుడు, పరిశుద్ధాత్మ ద్వారా మనలను రక్షించాలని తండ్రియైన దేవుడు నిర్ణయించాడు. ఆ నిర్ణయకాలం వచ్చినప్పుడు తన ఏకైక కుమారుడైన యేసును ఆయనీలోకానికి పంపించాడు. యేసుకు 30 సం॥ల ప్రాయం వచ్చినప్పుడు ఈ రక్షణ కార్యాలను నెరవేర్చాల్సిన సమయం ఆసన్నమైంది. అప్పుడు తండ్రి యేసు బాప్తిస్మాన్ని పొంది, సిలువ మీద చనిపోయిన తరువాత, ఆయనను పునరుత్థానునిగా చేయుట ద్వారా మనలను రక్షించాడు. పాత కొత్త నిబంధనలోని వాక్యం వలన ప్రభువు మనకేం చేశాడో తెలుసుకొని, హృదయాల్లో నమ్మడం వలన మనం రక్షణ పొందాం. మన హృదయాల్లో నమ్మడం వలన మనం రక్షణ పొందాం. మన హృదయాల్లో నమ్ముట వలన రక్షణ పొందమంటే దానిని హృదయ పూర్వకంగా విశ్వసించడమనే అర్ధం.

బైబిలులోని వాక్యం దేవుని వాక్యమని నీవు నమ్ముతావా? ఈ బైబిలే దేవుడు. దీనికంటే మరొక దేవుడు లేడు. ఆది నుండి కూడా ఆయన వాక్యమే ఉనికి కలిగియున్నది. పాత కొత్త నిబంధనల ద్వారా దేవుని వాక్యాన్ని మనం తెలుసుకొని, దేవుని కలుసుకోగలం. ఆయన నీలిధూమ్ర రక్తవర్ణాల దారం, పేనిన సన్నని నార ద్వారా మనలను రక్షించాడని పాత కొత్త నిబంధనల వాక్యం వలన మనం తెలుసుకోగలం. ఈ సత్యాన్ని నమ్మినవారు రక్షణ పొందుతారు. ఈ వాక్యంలో శక్తివున్నదని సాక్ష్యమిస్తారు. మన సంకుచితమైన ఆలోచనతో దేవుని వాక్యాన్ని మనం తీర్పు తీర్చలేం, కేవలం. కాని దేవుడెంత ఖచ్చితంగా మనలను రక్షించాడో ఆ వాక్యం ద్వారా గ్రహించగలం. మీరు దేవుని వాక్యాన్ని పక్కనపెట్టి మీ స్వంత కొలబద్దతో దాన్ని కొలిస్తే మీ జీవితకాలంలో మీరు రక్షణ పొందలేరు.

దేవుని వాక్యాన్ని నీయంతట నీవు సరిగ్గా అర్ధం చేసుకోలేవని తెలుసుకొంటే నీకు ముందున్న విశ్వాస వీరులు చెబుతున్న దానిని జాగ్రత్తగా విను. దేవుని వాక్యాన్ని సంఘకాపరులు పనివారు, లేక అభిషిక్తులు కాని బోధిస్తున్నప్పుడు విని, వారు బోధించేది దేవుని దృష్టిలో సరైనదని, మీ హృదయాల్లో నమ్మాలి.

వాక్యాన్ని వ్యాప్తి చేసే వారు అది సులభం గనుక దానిని వ్యాప్తి చేయాలని చేయరు. కాని తాము ప్రకటిస్తున్నది దేవుని దృష్టిలో సరైనది గనుక దానిని వ్యాప్తిచేస్తున్నారు. ఇందుకనే దేవుని ముందువారు సరైన జ్ఞానాన్ని బోధిస్తున్నారు. అంటే నీరు, ఆత్మల సువార్తను, నీల ధూమ్ర రక్తవర్ణాల దారం, పేనిన సన్నని నారతో సత్యాన్ని వారు బోధిస్తున్నారు. మనం ఎవరి వలన వింటున్నామన్నది గాక, అది దేవుని నిజమైన వాక్యమైతే, దాన్ని అంగీకరించడం తప్ప మనం చేయగలిగిందేమీ లేదు. ఎందుకంటే దేవుని వాక్యంలో రవ్వంత కూడా తప్పులేదు. కనుక దానిని మనం అంగీకరించాలి.

దేవుని వాక్యాన్ని మనం నమ్మాలి, ‘‘నమ్మట’’మంటే ఏమిటి? అంటే అంగీకరించడం. దానిలో నమ్మకముంచడం, మరో మాటల్లో చెప్పుకొంటే, మన ప్రభువు మన కోసం బాప్తిస్మం తీసుకొన్నాడు గనుక మన అపరాధాలన్నీ ఆయనకు అప్పగించి ఆయన మీద ఆధారపడి వుండడం అని అర్ధం. ‘‘నిన్ను నేను నమ్ముతున్నాను, నీలో నాకు నమ్మకముంది. నేనిది చేసినందుకు దేవుడు నిజంగా నన్ను రక్షిస్తాడా?’’ ఇలా నమ్మడమే నిజమైన విశ్వాసం.

ఈ లోకంలోని వేదాంతుల్లో సరిగ్గా తెలుసుకొని, నమ్మినవారిలో ఒక్కరిని కనుక్కోడం చాలా కష్టం. వారు గంగాళం దగ్గరకు చేరడానికి ముందు ప్రత్యక్షపు గుడారం ఆవరణ ద్వారం దగ్గర ఆగిపోయి ఆవరణలో ప్రవేశించలేని అసహాయులు. వారు ప్రత్యక్షపు గుడారాన్ని గూర్చిన ప్రసంగాలు చేసేటప్పుడు వారు ఆ ఆవరణ ద్వారం సమీపానికి కూడా వెళ్లక, 9మీ.లు గలదాని ద్వారం, కంచెను వివరించక అనేక ఇతర వివరణను చెబుతారు.

చాలా అరుదుగా ప్రత్యక్ష గుడారపు ఆవరణ ద్వారాన్ని గూర్చి ధైర్యంగా బోధించేవారు కొందరుంటారు. అయితే వారికి నీలిదారాన్ని గూర్చిన ప్రధాన, లేక ప్రాథమిక అర్ధం తెలియదు గనుక వారు ‘‘నీలం ఆకాశ రంగు” అని మాత్రమే చెబుతారు. కనుక నీలం ఆకాశం రంగు కాబట్టి యేసు దేవుడని, రక్తవర్ణం దారం యేసు ఈ లోకంలోని మానవునిగా వున్నప్పుడు ఆయన సిలువ మీద కార్చిన రక్తాన్ని గూర్చి వివరిస్తున్నాయని యిదే ప్రత్యక్షపు గుడారపు ఆవరణ ద్వారంలోని సత్యమని గట్టిగా ప్రకటిస్తారు. మరి ధూమ్ర వర్ణం సంగతేమిటి? యేసు రాజుల రాజు అని, ఆయనే దేవుడని ఈ వర్ణం తెలియజేస్తుంది. యేసు దైవత్వాన్ని గూర్చి ధూమ్ర వర్ణ ద్వారం యిప్పటికే వివరించింది. కనుక మరో రంగు దారంతో దాని సత్యాన్ని గూర్చి మళ్లీ చెప్పాల్సిన అవసరం లేదు.

నీలం రంగు దారం సత్యం ఏమిటంటే యేసు మానవునిగా ఈ లోకానికి వచ్చి, యోహాను బాప్తిస్మంతో మానవజాతి పాపాలన్నీ ఒకేసారి తనమీదికి తీసుకొన్నాడని, కాని ఈ లోకంలోని వేదాంత పండితులు యేసు తీసుకొన్న ఈ బాప్తిస్మాన్ని గుర్తించరు. అది అసలు వారికి తెలియనే తెలియదు గనుక, దానిని బోధించరు. అర్ధంలేని బోధలనే నొక్కి చెబుతారు. నీలధూమ్ర రక్తవర్ణాల దారం, పేనిన సన్నని నార వలన వచ్చిన యేసును నమ్మి తిరిగి పుట్టలేదు గనుక బాప్తిస్మం ద్వారా యేసు మానవ పాపాలన్నీ తన మీదికి తీసుకొని, వారి శిక్షను అనుభవించాడని వారికి తెలియదు గనుక వారు దానిని నమ్మరు. కనుక వారు ఆధ్యాత్మికంగా అంధులై, వాక్యాన్ని పరిష్కరించలేని వారయ్యారు. కాగా వారు దేవుని వాక్యాన్ని మతపరమైనదిగా చేసి వారి స్వంత ఆలోచనాధారంగా వివరిస్తున్నారు. ‘‘యేసును నమ్మండి, మీరిప్పుడు రక్షణ పొందుతారు. ఇప్పటి నుండి సాత్వికులుగా, కనికరము గల వారిగా వుండండి’’ అని వారు బోధిస్తారు. యేసులో వారి విశ్వాసాన్ని వారి నీతికార్యాలను వివరించడానికి, మతాన్ని బోధించడానికి మళ్లించారు.

వారెంతగా ప్రయత్నించినా వారు మంచివారుగా వుండలేరని జనానికి తెలుసు గనుకే మంచి వారిగా వుండాలన్న వారి కోర్కెలను వారు మేలు కొల్పుతారు. గనుక వారి బోధకులు వారు సులభంగా మోసపోతారు. మతాలు కూడా ఈ పాత పద్ధతినే అంటే ‘‘నీవు ప్రయత్నిస్తే, నీవు చేయగలవు” లేక ‘‘పరిశుద్ధులుగా వుండడానికి మీ శక్తి కొలది, ప్రయత్నించండి” సామాన్య అంశం ఏమిటంటే మంచి ఆలోచనలు చేయడం మంచి ప్రయత్నాలు చేయడం, మానవజాతి ఉద్దేశం ఉత్తమమైనది అనడమే. ఉదాహరణకు బౌద్ధం సంగతేమిటి? మానవజాతి అనంతంగా ప్రయత్నించాలని, తమంతట తాము పరిశుద్ధులుగా వుండడానికి ప్రయత్నించాలని, ‘‘హత్య చేయకూడదు, సత్యాన్ని వెదకుతూ మంచిగా వుండాలని” దాని అనుచరులకు బోధిస్తుంది. కొన్నింటి విషయంలో బౌద్ధ బోధలు క్రైస్తవ సిద్ధాంతాలకు అనుగుణంగా వుంటాయి. క్రైస్తవ్యం, బౌద్ధం దగ్గరగా వున్నట్టుగా కనిపించడానికి కారణం అవి రెండూ రెండు మతాలు గనుక ఒక దానికి ఒకటి వెవ్వేరుగా వున్నాయి.

మతం, విశ్వాసం అనేవి పూర్తిగా ఒకదానికొకటి వేరైనవి. మనలను తన నీతిలో పూర్తిగా రక్షించిన మన ప్రభువు అనుగ్రహించిన రక్షణ వరాన్ని గ్రహించి, దాన్ని నమ్మడమే నిజమైన విశ్వాసం. మన ప్రభువు ఈ లోకానికి వచ్చి బాప్తిస్మం ద్వారా మన పాపాలను తన మీదికి తీసుకొని, సిలువలో మన శిక్షను భరించాడు అని హృదయపూర్వకంగా విశ్వసించడమే పాప విమోచన. మన పాపాలు, ఆ పాపశిక్ష నుండి ప్రభువు మనలను విడిపించి, నీరు, ఆత్మల సువార్త వలన రక్షించాడని నమ్మడమే విశ్వాసం అంటే, నీవు నమ్ముతున్నావా? మనం హృదయ పూర్వకంగా దీనిని నమ్మాలి.

దేవుడు మిమ్ములను, నన్ను మన పాపాల నుండి ఇప్పటికే రక్షించాడు దేవుడిలా మనలను రక్షించాడు గనుక మనం దానిని మనఃపూర్వకంగా నమ్మి, అంగీకరించడమే మనం చేయాల్సింది. దేవునికి నిజమైన బిడ్డలు ఆయన ముందు విధేయులుగా వుండడమే వారు చేయాల్సిన పని. ఇక మిగతా అంతా అంత ముఖ్యం కాదు. దేవుడు మిమ్ములను ప్రేమించాడు గనుక ఆయన ఏకైక కుమారుని ఈ లోకానికి పంపించాడు. ఆయన బాప్తిస్మం తీసుకొనేట్టు చేసి మీ పాపాలన్నీ ఆయన తనమీదికి తీసుకొనేట్టు చేశాడు. ఆయన్ను సిలువ వేసి, రక్తం చిందించేట్టు చేశాడు. ఆయన్ను శిక్షించి చావుకు అప్పగించాడు. మళ్ళీ పునరుత్థానునిగా చేశాడు. దాని ద్వారా మీ పాపాలన్నిటి నుండి మిమ్ములను రక్షించాడు.

అలాంటప్పుడు ఈ సత్యాన్ని మీరు నమ్మకపోతే దేవుడేమనుకొంటాడు? ఇప్పటికైనా, ఆయనకు సంతోషం కలిగించే విధేయులైన కుమారులు, కుమార్తెలుగా అవ్వాలనుకుంటే, దేవుడు తన కుమారుని ద్వారా, మీ పాపాలన్నీ తుడిచివేసి, వాటి నుండి మిమ్మును రక్షించాడని మీరు నమ్మాలి. మీ హృదయాల్లో మీరు నమ్మితే, కృజ్ఞతగా మీ నోటితో ఒప్పుకోవాలి. మీరు కూడా ఆయన్ను నమ్మాలనుకొంటే, నమ్మడం మీకు చాలా కష్టంగా అనిపించవచ్చు. అప్పుడు మీ విశ్వాసాన్ని మీ నోటితో ఒప్పుకోడానికి ప్రయత్నించండి. అలా మీరు నమ్ముతున్నామని ఒప్పుకుంటే విశ్వాసం మీలో పాదుకొని కొంచెంగా ఎదుగుతుంది. ఎవరైతే విశ్వాసాన్ని ధైర్యంగా తీసుకొంటారో అదివారిదవుతుంది.

నాకొక రత్నంతో చేసిన వుంగరం వుందనుకొందాం. అది మీకు ఇద్దామనుకొన్నప్పుడు, మీలో ఒకరు అది నిజమైన రత్నంతో చేసిందికాదని దాన్ని తీసుకోడానికి యిష్టపడలేదనుకొందాం. వాస్తవానికి అది నిజమైన రత్నమని నమ్మలేదు గనుక అదా వ్యక్తికి రత్నం కాదు గనుక ఆ వ్యక్తి నిజమైన రత్నపు ఉంగరాన్ని పొందే అవకాశాన్ని పొగొట్టుకున్నాడు.

విశ్వాసం కూడా యిలాంటిదే. ఒక భూగర్భ శాస్త్రజ్ఞుడు ఆ వుంగరంలో నున్నది నిజంగా రత్నమే అని నిరూపిస్తే వారప్పుడు నమ్ముతారు. దేవుడు మనకనుగ్రహించిన రక్షణ నిజమైనదని దేవుడు లిఖితపూర్వకమైన తన వాక్యం ద్వారా మనతో చెప్పాడు. ఆయన రక్షణకు ఆయన వాక్యం సాక్ష్యమిస్తుంది. గనుక దానిని నమ్మినవారు విశ్వాసం గలవారు. అది నిజంగా నిజమైనదని నమ్మడం నాకు కష్టమే, కాని సత్యవంతుడవైన నీవు చెబుతున్నావు గనుక నేను దానిని నమ్ముతున్నాను ? ప్రజలు అలా నమ్మినప్పుడు వారు విశ్వాసం గలవారవతారు. అప్పుడు దేవుడు వాగ్ధానం అతి అమూల్యమైన వరం వారిదవుతుంది.

మరో ప్రక్క మరో విధమైన విశ్వాసం ఉంది. ఒక మోసగాడు అనుకరణ రత్నలను వుంగరాన్ని చేశాడనుకొందాం. ధగధగ లాడుతున్న ఉంగరాలకు ఆకర్షితుడైన ఒక వ్యక్తి అది నిజమైనదనుకొని దాన్ని కొన్నాడనుకొందాం. తాను తెలివైన పనిచేశాడని ఆ వ్యక్తి అనుకొంటాడు. వాస్తవానికి అతడు మోసపోయాడు. అది రత్నం కాకపోయినా రత్నం అని నమ్మినప్పుడు ఆ నకిలీ రత్నమే వారికి నిజమైన రత్నం అని గుడ్డిగా నమ్ముతున్నారు గనుక అది నిజమైనదే అనిపిస్తుంది వారికి. కాని వారు పొందింది మాత్రం నకిలిదే. అలాగే అసత్యమైన విశ్వాసం గలవారు కొందరున్నారు. తమ విశ్వాసంతో వారు నమ్మినా అది తప్పు విశ్వాసమే. అది దేవుని నుండి కలిగినది కాదు గనుక అది ఆధారం లేనిది. భ్రమతో కూడినది.

“నన్ను తప్ప వేరొక దేవుని ఆరాధించవద్దు” అని దేవుడు చెప్పాడు. దేవుని వాక్యం అంటే దేవుడే. మనం నీరు, ఆత్మల వలన తిరిగి పుట్టకపోతే మనం పరలోక రాజ్యాన్ని చూడలేమని వాక్యం చెబుతోంది. (యోహాను 3:5). నీల ధూమ్ర రక్తవర్ణాల దారం, పేనిన సన్నని నారతో చేయబడిన ప్రత్యక్షపు గుడారం ఆవరణ ద్వారం గుండా మొదట ప్రవేశించి గంగాళం దగ్గర తమ కాళ్లు చేతులు కడుగుకొనకపోతే వారు ప్రత్యక్షపు గుడారంలో ప్రవేశించలేరు. అని దేవుడు చెబుతున్నాడు. ఈ వాక్యమే సత్యం గనుక దీనిని మించినదేదైనా అది అసత్యమైనదే.

సత్యంలోని విశ్వాసమే నిజమైన విశ్వాసం. ఇక మిగతా దేనిమీద వున్నా అది నకిలీ లేక తప్పు అయిన విశ్వాసం. దేవుని వాక్యం దానిని మనుష్యులెంత మనఃపూర్వకంగా నమ్మినా అది దేవుని వాక్యం కానేరదు. తన బాప్తిస్మం, సిలువ రక్తం ద్వారా మీ పాపాలన్నీ పోగొట్టానని యేసు చెబుతుండగా దానిని నమ్మడమే మీ పని. నేనీ పనిచేశాను అని చెబుతున్నది దేవుడే గనుక ఆయన మాటలో విశ్వాసమే నిజమైనది. మన ప్రభువు దీన్ని నిజంగా చేయకుంటే మీ విశ్వాసం కూడా తప్పుకాదు. మరో ప్రక్క దేవుడు ఖచ్చితంగా దానిని చేసినప్పుడు మీరు నమ్మలేదు గనుక మీరు రక్షణ పొందలేదు. అప్పుడది మీ బాధ్యతే అని స్పష్టమవుతోంది. గనుక మనం చేయాల్సినదల్లా ఆయన్ను నమ్మడమే. దేవుడు తన సంఘం ద్వారా చెప్పిన దానిని మనం తప్పక నమ్మాలి. మీరు నమ్ముతున్నారా?

సంఘం ద్వారా మాట్లాడిన వాక్యం ఏమిటి? అది నీల ధూమ్ర రక్తవర్ణాల దారం, పేనిన సన్నని నారతో యేసుక్రీస్తు మన దగ్గరకు వచ్చాడని చెప్పిన వాక్యం.యేసు తన బాప్తిస్మంతో మన పాపాలను తన మీదికి తీసుకొన్నాడు. యేసే దేవుడు, ఆయన మన పాపశిక్షనంతటిని సిలువమీద మోశాడు అన్న దేవుని వాక్యాన్ని సంఘం ప్రకటిస్తున్నది. యేసు అలా మనలను రక్షించాడు అన్న ఈ సత్యంలోగల విశ్వాసమే నిజమైన విశ్వాసమని దేవుడు హామీ నిస్తున్నాడు.

మనం మొదట దేవుని చిత్తాన్ని, ప్రత్యక్షపు గుడారంలో ప్రత్యక్షపరచిన ఆధ్యాత్మిక అర్ధాలను తెలుసుకొన్నప్పుడు దానిని గూర్చి చెప్పడం, చాలా సులభం. కాని మనం తెలుసుకోవాలని వెంటాడి, వాటిని తెలుసుకోలేకపోయి, ప్రత్యక్షపు గుడారాన్ని గూర్చిన విధానపు పై పై జ్ఞానాన్ని కలిగి, దానికి అసలైన హీబ్రూ భాషాపదాన్ని తెలుసుకొనక, లేక దాని చారిత్రాత్మకమైన నేపధ్యాన్ని తెలుసుకొనకపోతే మనమే మాత్రం మేలు పొందకపోగా, వీటన్నిటి ఆలోచనలతో తలనొప్పితో బాధపడతాం.

యేసు పొందిన బాప్తిస్మాన్ని నమ్మండి. మన హృదయాల్లో అంధకారంలో, మలినంతోవున్న పాపాలను కూడా కడిగివేసే బాప్తిస్మాన్ని యేసు పొందాడు. బాప్తిస్మం అంటే పాపాలన్నీ కడిగి వేయుట, దాటిపోవుట, పూడ్చి పెట్టుట, మరొకరి మీద బదలాయించుట, కప్పివేయుట అని అర్ధాలు యేసు అలాంటి బాప్తిస్మాన్ని పొందాడు గనుక ఆయన మీ పాపాలన్నీ ఆయన మీదికి తీసుకొన్నాడు. ఇప్పుడు దీనిని నమ్మని వారంతా చంపబడతారు. నరకంలో వేయబడతారు. ‘‘కడుగుకొనుటకు నీవు (మోషే) ఇత్తడితో దానికొక గంగాళమును, ఇత్తడిపీటను చేసి ప్రత్యక్షపు గుడారమునకు బలిపీఠమునకు నడుమ దానిని వుంచి నీళ్లతో నింపవలెను తాము చావక యుండునట్లు తమ చేతులను, కాళ్లను కడుగుకొనవలెను. అదివారికి, అనగా అతని సంతతికిని, వారి తరతరములకు నిత్యమైన కట్టడగా వుండును” (నిర్గమ 30:18, 21). నమ్మకపోతే శాపగ్రస్తులవుతారు. నమ్మకపోవడం అంటే నరకంలో వేయబడ్డమే. నీవు దీనిని నమ్మకపోతే యెహోవా శాపం, నాశనం నీ మీదికి దిగి వస్తుంది. నీవు నిత్యాగ్ని గుండంలోకి త్రోయడతావు.

‘‘కనుక వారు చావకుండునట్లు వారు తమ చేతులను, కాళ్ళు కడుగుకోవాలి’’. అతని సంతానం, వారితరతరాలు ఈ నిత్యనిబంధనకు కట్టుబడి వుండాలని దేవుడు ప్రధాన యాజకునితో చెప్పాడు. పురుషుడు గాని, స్త్రీగాని ఎవరైతే యేసును తమ రక్షకునిగా నమ్మాలనుకొంటారో వారు ఆయన బాప్తిస్మాన్ని, సిలువ రక్తాన్ని తప్పక నమ్మాలి. విశ్వాసాన్ని ధైర్యంగా ఎవరు తీసుకొంటారో వారిదవుతుంది. నమ్ముట వలన, మీ హృదయాల్లో దీన్ని అంగీకరించినప్పుడు రక్షణ మీది అవుతుంది. సత్యాన్ని మనం నమ్మినప్పుడే అది మనకు మేలుకరమైనదవుతుంది. దేవుడు మనకేం చెప్పాడో దానిని మనం నమ్మాలి. హృదయానికి అపనమ్మకం అనే దానికంటే మరో ఆటంకం లేదు.

యాజకులు తన ముందుకు వచ్చునప్పుడు వారు ఇత్తడి గంగాళం దగ్గర తమ చేతులను, కాళ్లను శుభ్రంగా కడుక్కోవాలని దేవుడు చెప్పాడు. అయినా గంగాళంలోని నీటితో తమ చేతులను, కాళ్లను కడుక్కోవడంలో విశ్వాసంలేని వారు చాలామంది వున్నారు. గంగాళంలో ప్రత్యక్షపరచిన ఈ విశ్వాసాన్ని నమ్మని ప్రతి ఒక్కరు దేవుని ముందు చంపబడతారు. నీరు, ఆత్మల సువార్తను మీ హృదయాల్లో నమ్మి, శుభ్రంగా కడుక్కొని అప్పుడు దేవుని ముందుకు వెళ్లండి. మీ చావును తప్పించుకోండి. ఆయన రాజ్యాన్ని బహుమతిగా పొందండి. దేవుని ముందు మీరెంత వాదించినా, మీకు అవకాశం యిచ్చినప్పుడు మీరు నమ్మనందుకు తప్పకశిక్షను పొందుతారు. మీలో ఏ ఒక్కరూ ఈ సత్యాన్ని నమ్మక మరణాన్ని ఎదుర్కొనరని నేను నమ్ముతున్నాను, ప్రార్థన చేస్తున్నాను. 

యేసు బాప్తిస్మంతో, ఆయన సిలువ రక్తంతో మీ పాపాలు కడిగివేయబడ్డాయన్న రక్షణ సత్యాన్ని మీరు నమ్మకపోతే మీకెంతో హాని కలుగుతుంది. నీవు నమ్ముతున్నావా? గంగాళం ద్వారా మన పాపాల నుండి, ఆ పాపశిక్షనుండి రక్షించినందుకు దేవునికి మనం కృతజ్ఞతలు చెల్లించాలి.

ప్రత్యక్షపు గుడారానికి ఈ సంబంధించిన మిగిలిన భాగాలను గూర్చి ఈ పుస్తకం తర్వాత వచ్చే పుస్తకాల్లో చర్చించుకొందాం. ఈ పుస్తకాల్లోని సందేశాల ద్వారా మీరందరూ దేవుని పిల్లలయ్యే ఆధిక్యత మీకున్నదని నమ్ముతున్నాను.