Sermons

[11-11] < యోహాను 13:1-11 > మన పాపములను బట్టి లోనికి లాగబడువారము మనము కాదు< యోహాను 13:1-11 >

“తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియవచ్చెనని యేసు పస్కా పండుగకు ముందే యెరిగిన వాడై, లోకములోనున్న తనవారిని ప్రేమించి, వారిని అంతము వరకు ప్రేమించెను. వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలెనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించియుండెను. గనుక తండ్రి తన చేతికి సమస్తము అప్పగించెననియు, తాను దేవుని యొద్దనుండి బయలుదేరి వచ్చెననియు దేవుని యొద్దకు వెళ్ళవలసియున్నదనియు యేసు ఎరిగి భోజన పంక్తిలో నుండి లేచి తనపై వస్త్రము అవతల పెట్టివేసి, యొక తువాలు తీసుకొని నడుమునకు కట్టుకొనెను. అంతట పళ్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును, తాను కట్టుకొనియున్న తువాలుతో తుడుచుటకును మొదలుపెట్టెను. ఇట్లు చేయుచు ఆయన సీమోను పేతురు నొద్దకు వచ్చినప్పుడు అతడు ప్రభువా, నీవు నా పాదములు కడుగుదువా? అని ఆయనతో అనెను. అందుకు యేసు నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు గాని యిక మీదట తెలిసికొందువని అతనితో చెప్పగా పేతురు నీవెన్నడును నా పాదములు కడుగరాదని ఆయనతో అనెను. అందకు యేసు నేను నిన్ను కడుగనియెడల నాతో నీకు పాలు లేదనెను. సీమోను పేతురు ప్రభువా, నా పాదములు మాత్రమే గాక నా చేతులు, నా తల కూడా కడుగమని ఆయనతో చెప్పెను. యేసు అతని చూచి స్నానము చేసినవాడు పాదములు తప్ప మరేమియు కడుగుకొననక్కరలేదు. అతడు కేవలము పవిత్రుడయ్యెను. మీరును పవిత్రులు కాని మీలో అందరు పవిత్రులు కారనెను. తన్ను అప్పగించువానిని ఎరిగెను గనుక మీలో అందరు పవిత్రులు కారని ఆయన చెప్పెను.’’తిరిగి జన్మించినట్టి అబద్ధ బోధకులకు బైబిలు వాక్యమంతయూ ఒక మర్మముగానే యుండును. కనుక వారు తమ స్వంతమైన మనుష్యుల ఆలోచనలను బట్టి దేవుని వాక్యమును అన్వయించ ప్రయత్నించెదరు. అయిననూ, వారు బోధించు విషయముతో తమను తామే సమాధాన పరచుకొనలేరు. ఫలితంగా యేసును విశ్వసించు వారిలో నుండి కూడా తమ రక్షణను గూర్చిన ఒప్పుదల లేనివారుగా ఉంటారు.

ఇలాగు ఎందుకు జరుగుచున్నది? వారు నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను స్పష్టముగా తెలిసికొనకనే వారు యేసును విశ్వసించామని చెప్తారు. అట్టి ప్రజలు తాము యేసును విశ్వసించాము కనుక నాశనము తమకు కలుగుదని అనుకుంటారు. బైబిలు పరంగా చూస్తేనే వారు నీరు మరియు ఆత్మమూలమైన సువార్త ద్వారా తిరిగి జన్మించకపోతే తాము నిశ్చయంగా నాశనమగుదమనే సత్యాన్ని తెలుసుకొంటారు.

తమకు సత్యము తెలియక పోయినను వారు గ్రుడ్డిగా యేసును విశ్వసించిన కారణాన కనీసము నాశనము కామనే సాధారణ విశ్వాసంతో ప్రజలు ఉంటూ ఉంటారు. అయిననూ వేదవాక్యమును వారు సరిగ్గా అర్ధం చేసుకొననట్లే. వారు సరిగ్గా రక్షింపబడలేదని గాని తాము తప్పుడు విశ్వాసాన్ని కలిగియున్నామని గాని గుర్తించలేరు.

కనుక బైబిలు వాక్యాన్ని నిజంగా అన్వయించి తమ స్వంత యోచనలపై ఆధారపడి స్వంత బోధతో తయారైన ప్రజలు వారు యేసును విశ్వసించినప్పటికి పాపపరిహారమును పొందలేరు. మరియు తమ పాపాల కారణంగా నరకంలో పడతారు. అలాగే బైబిల్‌ను మన స్వంత విధానంలో చూచినట్టిది కాదు. కానీ తన సత్యవాక్యమును తిరిగి జన్మించిన వారైన తన పరిశుద్ధుల ద్వారా మనకు బోధపడునట్లుగా దేవుడు చేయును. దేవుని వాక్యమంతయూ నీరు మరియు ఆత్మమూలమైన సువార్తలోనే వివరించబడెనని కూడా మనము గుర్తించాలి.

యేసు చెప్పెను ‘‘ఒకడు నీటిమూలముగాను, ఆత్మమూలముగాను తిరిగి జన్మించితేనేగాని దేవుని పరలోకరాజ్యములో చేరడని” (యోహాను 3:5) ఈ భాగమును సరిగా తెలుసుకొని నమ్మినవారు వాస్తవంగా పాపములన్నిటినుండి విడిపించబడి పరలోకరాజ్యంలో ప్రవేశించును. నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను విశ్వసించి తమ హృదయ పాపమును కడుగుకొనిన వారు పరలోకములో ప్రవేశించెదరని యేసు చెప్పెను. కాని ప్రభువు అనుగ్రహించిన నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను అర్ధం చేసుకోకుండా ప్రజలు విశ్వాసముంచితే అనగా ప్రత్యక్ష గుడారములో చూపబడిన నీలి, ధూమ్ర, రక్తవర్ణపు పేనిన సన్నపు నారలోనున్న సత్యమును గ్రహించకపోతే వారు తమ పాపములను బట్టి నాశనము చేయబడుదురు.

మనం యేసులో విశ్వాసముంచుచున్నప్పటికి కూడా మన పాపములను బట్టి మనం నాశనము చేయబడితే అది ఎంత విచారించదగిన విషయం? ఇప్పటికే ఈ లోకంలోని అనేకులు యేసును తమ స్వరక్షకునిగా విశ్వసించినను వారిలో చాలామంది తమ పాపాలన్నిటి నుండి విమోచించబడ్డావా అని అడిగినప్పుడు విశ్వాసంగా సమాధానమివ్వలేని పరిస్థితిని యోచిస్తే నాకు ఎంతో బాధ కలుగుతుంది. పాపులందరు యేసును విశ్వసించారని ప్రవచించిననూ లేకపోయిననూ వారు తమ పాపము కొరకు నశించెదరని చెప్పుటలో పొరపాటు ఎంత మాత్రమూ లేదు. వారు యేసును విశ్వసించిననూ వాస్తవంగా ఎంతమంది ప్రజలు నాశనం కాలేదు? 

మత్తయి 7లో చెప్పబడినట్లుగా ప్రభువు నందు విశ్వసించిన అనేకులు యేసుతో తాము ప్రవచించామని, దయ్యములను వెళ్ళగొట్టామని, ఆయన నామములో అద్భుతాలు చేశామని చెప్పినను వారు ఆయన వలన విడువబడినవారే. యేసు అట్టి ప్రజలను గూర్చి ఇట్లు చెప్తానన్నాడు. ‘‘నేను మిమ్మును ఎన్నడును ఎరుగను; అక్రమము చేయువారలారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పెదననెను.’’ (మత్తయి 7:23) మన ప్రభువు తన నామమును పిలుచు ప్రతివాడు పరలోకరాజ్యములో చేరడని చెప్పెను. అలాగే నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను అపార్ధము చేయువారిని మన ప్రభువు గద్దిస్తాడు.

ఇప్పటికీ అనేకులు తాము యేసును అపార్ధము చేసుకొన్నామని గానీ అపనమ్మకములో ఉన్నామని గారి గుర్తించనైనా గుర్తించలేరు. ఈ పరిస్థితి మన ప్రభువును అతిగా బాధించును. తమ తప్పుడు విశ్వాసం కొరకై ప్రభువు వాస్తవంగా తమను గద్దిస్తున్నాడు అను సత్యాన్ని వ్యతిరేకించువారు తమ స్వనాశనమునకు దారి తీయుచున్నారు.

ఇందు మూలమున మన హృదయాలు నామకార్థపు క్రైస్తవులను గూర్చి దుఃఖిస్తున్నాము. వారు యేసును కేవలము అస్పష్టముగా నమ్ముకొంటారు. సత్యసువార్తయైన నీరు మరియు ఆత్మమూలమైన సువార్త అనగా బైబిలు పరమైన స్పష్టమైన నిర్వచనంను ఇంకనూ ఎరుగనివారైయున్నారు. ఇందువలన అట్టివారందరికీ నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను బోధించుట అనునది అంత ప్రాముఖ్యమైన మరియు త్వరపడవలసిన విభాగమైయున్నది.

నీరు మరియు ఆత్మమూలమైన సువార్త సత్యమును తెలిసికొనుట మరియు విశ్వసించుటనునది మనకు కూడా అంతే ప్రాముఖ్యమైనది. అయిన నీరు మరియు ఆత్మ మూలమైన సువార్త సత్యమును మనము ఎట్లు తెలిసికొనగలము. మనము వినుట ద్వారానే దేవుని వాక్యములో నీరు మరియు ఆత్మమూలమైన బోధలు వున్నవి. మనము నిజముగా నీరు మరియు ఆత్మ మూలమైన సువార్తను తెలిసికొని, విశ్వసించి దేవుని వలన తన పరిశుద్ధులమని పిలువబడాలి. అట్లు చేయుట వలన విశ్వాసము ద్వారా మనము దేవుని రాజ్యములో ప్రవేశించగలము. విశ్వాసము ద్వారానే ఆయన పిల్లలమవుతాము.

ఇందువలననే క్రైస్తవ్యము విశ్వాసము వలన కలుగు పరిహారము వైపు దృష్టించును. ఈ లోకంలోని మతము ఒకని పనిని కొనియాడును. కానీ వాస్తవ సత్యము దేవుని బహుమానమైన రక్షణను గూర్చి చెప్పును. కానీ మానవ క్రియలను గూర్చి కానీ ప్రతివాని గొప్పను గూర్చి కానీకాదు. (ఎఫెస్సీ 2:8-9) నిజ క్రైస్తవ్యము పాపము నుండి రక్షింపబడుటకున్న మార్గమును చూపును. నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను తెలిసికొని విశ్వసించుట ద్వారానే పరలోకరాజ్యములో ప్రవేశిస్తామని చెప్తుంది. 

ఈ దినపు ప్రధాన భాగమైన యోహాను 13 కూడా నీరు మరియు ఆత్మ మూలమైన సువార్తను గూర్చినదియే. సిలువలో చనిపోవుటకు తనకు సమయం ఆసన్నమైనదని ఎరిగి కూడా, యేసు తన శిష్యుల పాదములు కడుగుటకు తనకు సమయం ఆసన్నమైనదని ఎరిగి కూడా యేసు తన శిష్యుల పాదములు కడుగుటకు కోరెను. ఇదే పస్కా పండుగకు ముందు చేయుటకు సరియైనది. పస్కా పండుగ యూదులకు అతి ప్రాముఖ్యమైన ఇశ్రాయేలు ప్రజలు ఐగప్తు నుండి తప్పింపబడిన దినము అయినందున వారి దాస్యము నుండి విడిపింపబడిరి కనుక అది వారికి ఎంతో పవిత్రమైన దినము. కనుక ఇశ్రాయేలీయుల పస్కా పండుగను గుర్తు చేసికొని దానికి గుర్తుగా అందరూ కలిసి పస్కా పండుగను ఆచరించుటకు కూడిరి.

విందులో యేసు తన శిష్యులను సమావేశపరచి అత్యంత ప్రాధాన్యమైన విషయమును వారికి చెప్పగోరెను. ఆయన తానే సిలువలో మరణించక పూర్వమే తన శిష్యుల పాదములను కడుగుట ద్వారా వారి పాపములను ఆయన కడిగివేసెను సత్యమును వారికి బోధించ తలచెను. పస్కా పండుగ వచ్చినప్పుడు తానే పస్కాబలి గొర్రె పిల్లగా పట్టబడెదనని సిలువ వేయబడి చనిపోయి మృతి నుండి తిరిగి లేచేదనని యేసు ఎరిగెను. కనుక యేసు గొర్రె పిల్లగా తానే వారి వాస్తవ పాపమును కడిగివేస్తానని తన శిష్యులతో చెప్పగోరెను. కానీ దానికి భిన్నంగా ఆయన తన శిష్యుల పాదాలను కడిగెను. దాని ద్వారా తాను సిలువలో మరణించక మునుపు తన ప్రాముఖ్యమైన బోధ చేయాలని అట్లు చేసెను.యేసు పేతురు పాదాలను కడుగుటకు గల కారణము


యేసు తన శిష్యుల పాదాలను కడుగుటకు ఆరంభించినప్పుడు పేతురు ఆ చర్యను తిరస్కరించగా ఆయన ఏమి చెప్పినో మనం చూద్దాం. ‘‘నేను నిన్ను కడుగని యెడల నాతో నీకు పాలు లేదనెను”. (యోహాను 13:8) ఈ మాట ఎంత కఠినము. ఎంత భయంకరము. అయిననూ తన శిష్యులకు వారి పాపమును కడిగివేయుటకు ఎట్టి విశ్వాసము అవసరమో ఆయన సిలువ మరణము పొందకమునుపే ఆయన వారి పాదాలను కడుగుట తన శిష్యులకు తనకు ఎంత ప్రాముఖ్యమో దానిని యేసు బోధించాలనుకొన్నాడు.

కాబట్టి యేసు భోజనము నుండి లేచెను. తన పై వస్త్రము అవతలపెట్టి ఒక తువాలు తీసుకొని నడుమునకు కట్టుకొనెను. అంతట పళ్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకు మొదలు పెట్టెను. ఇప్పుడు పేతురువంతు వచ్చెను కానీ పేతురు వెనుకకు జరిగెను. అతడు ప్రభువా, నీవు నా పాదములు కడుగుదువా? అని యేసుతో అనెను. యేసు తన పాదములు కడగాలనుకొంటున్నాడని పేతురు తెలిసికొన్నాడు. ఎందుకనగా అతడు యేసుని విశ్వసించి దేవుని కుమారుడని ఆయనను ఆరాధించాడు. అట్టి ముందు జరుగబోవు పరిస్థితిని అంగీకరించుట అతనికి కష్టముగా నున్నది. ఇందువలన ప్రభువు తన పాదములను ఎట్లు కడుగగలడని అడిగెను. ఎవరైనా పాదాలు కడుగవలసినచో, పేతురుతోనే ప్రభుని పాదాలు కడగాలి. ప్రభుని పాదాలను తాను కడుగుట చులకనైనను, ప్రభువా నీవు నా పాదములు కడుగుదువా అని చెప్పి పేతురు కడుగబడుటకు వ్యతిరేకించెను.

అప్పుడు యేసు 7వ వచనములో ‘‘నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదుగానీ ఇకమీదట తెలిసికొందువని” అతనితో చెప్పెను. అనగా ఇప్పుడు నేనెందుకు ఇలాగు చేయుచున్నానో నీకు తెలియదని అర్ధము. కానీ నేను సిలువలో మరణించి, మృతినుండి లేచి, పరలోకమునకు ఆరోహణమైన తరువాత నేను నీ పాదములు కడిగిన కారణమున నీవు తెలిసికొందువు. అప్పుడు యేసు పేతురుతో ‘‘నేను నిన్ను కడుగని యెడల నాతో నీకు పాలు లేదని” బలవంతపెట్టను. యేసు పేతురు పాదములు కడుగకపోతే పేతురు యేసు ఒకరికొకరు ఏమియూ చేసుకొనలేరు. యేసుతోపాటు లేకుండా ఆయనతో ఏ బంధము లేదు అని అర్ధం. కాబట్టి పేతురునకు తన పాదములను యేసు ముందు ఉంచుట కంటే మరొక మార్గము లేదు. అప్పుడు యేసు పేతురు పాదాలను పళ్ళెములో ఉంచి వాటిని కడిగెను. తరువాత అతని పాదములను తువాలుతో తుడిచెను. 

“నేను నీ పాదములను కడుగని యెడల నాతో నీకు పాలు లేదని” ప్రభువు చెప్పగా దాని వలన పేతురు ఖంగుతిని, నాకు నీతో పాలు ఉండునట్లు నను మరి అధికముగా కడుగుమని పేతురు చెప్పెను. నా చేతులు, నా తల, నా శరీరమంతా కడుగుమనెను. దీనిని విన్నవాడై యేసు ఇట్లు చెప్పెను. ‘‘స్నానము చేసినవాడు పాదములు తప్ప మరేమియూ కడుగనక్కరలేదు. అతడు కేవలము పవిత్రుడయ్యెను. మీరును పవిత్రులు కానీ మీలా అందరూ పవిత్రులు కారనెను.’’

ప్రజలను వారి పరిస్థితులను బట్టి ప్రలోభపెట్టి తికమక పెట్టునదేదో ప్రభువు చెప్పెను. యేసు చెప్పిన మాటలను ప్రజలు అపార్థము చేసుకుని సరిగా అన్వయించుకొనలేకుండా వున్నారు. వారి సొంత జ్ఞ్యానమును ఆధారం చేసుకుని సత్యాన్ని గ్రహింపకుందురు. నీరు మరియు ఆత్మ మూలమైన సువార్తను విశ్వసించక తమ పాప పరిహారమును పొందనివారు యేసు పేతురుతో చెప్పిన విషయాన్ని సరిగా అర్ధం చేసికొనలేరు. ఎందువలన? పరిశుద్ధాత్మ లేని వారు దేవుని వాక్యమునకు సరిగా అర్ధం చేసికొనలేరు.

గర్వించదగినట్టి లోక సంబంధమైన తెలివితేటలతో అతి జ్ఞానవంతుడైన అతడు/ఆమె బైబిలు నందు చూపబడిన సత్యమును గుర్తించలేరు. కానీ అట్టి ప్రజలు వేద వాక్యమును దాని వాస్తవ రూపంలో స్పష్టముగా అర్థం చేసుకోగలరు. వారు నీరు మరియు ఆత్మమూలమైన సువార్త సత్యమును తెలిసికొనకపోతే సమస్యలన్నిటిని కలిపి ఎట్టి విశ్వాసముతో తమ వాస్తవ పాపమును కడుగుకోవాలో తెలియక ఇబ్బంది పడతారు.

ప్రభువు చెప్పెను ‘‘స్నానము చేసిన వాడు పాదములు తప్ప మరేమియు కడుగుకొననక్కరలేదు. అతడు కేవలము పవిత్రుడయ్యెను. మీరును పవిత్రులు కానీ మీలో అందరూ పవిత్రులు కారు.’’ (యోహాను 13:10) ఈ రోజులలో చాలామంది క్రైస్తవులకు ఈ భాగమును అర్ధం చేసికొనుట చాలా కష్టము. ఎందుకనిన, తమ నిజపాపము నుండి విమెచింపబడినారో లేదో తమను తామే ఈ భాగములో ఒప్పించుకొనలేరు. వాస్తవంగా క్రైస్తవ్యంలో నిజమైన బోధలుగా పిలువబడే వాటిలో ఒకటైన పశ్చాత్తాప ప్రార్థనల బోధనలకు ఈ భాగమును ఒక ఆధారంగా తీసికొంటారు.

ఈ విధంగా వారు ఈ భాగాన్ని అన్వయిస్తారు. ‘‘యేసును మన రక్షకునిగా నమ్మితే, మన నిజపాపముతో పాటుగా మన పాపాలన్నిటి నుండి మనం క్షమించబడతాం. కానీ మనం ప్రతిదినం పాపం చేయకుండా ఉండలేని కారణాన మరలా పాపులమవుచున్నాము. ఈ నిజపాపము నుండి విడిపించుటకు మనము దేవుని క్షమాపణ కోరాలి. ఇట్లు చేయుట ద్వారా మనం మన పాపాల నుండి కడుగబడి ఆయనతో మన సంబంధాన్ని తిరిగి పొందగలం.

అర్ధరహితం! పశ్చాత్తాప ప్రార్థనల ద్వారా నీవు నీ నిజ పాపము నుండి కడుగబడగలవా? నీ నిర్లక్ష్యము వలన కలుగు పాపముకు ప్రాయశ్చిత్తమును అడుగుటకు నీవు మరచిన ఏమవుతుంది? అప్పుడు ఈ పాపాలు ఎట్లు క్షమించబడతాయి.

దేవుని శరీరమైన సంఘము వాస్తవంగా ప్రభువు అనుగ్రహించిన నీరు మరియు ఆత్మ మూలమైన సువార్తను విశ్వసించువారి కూడిక. కనుక శరీరము పూర్తిగా కడుగబడవలెనని యేసు చెప్పినప్పుడు మీలో అందరూ పవిత్రులు కారని చెప్పెను. ఆయనను నమ్మని యూదాను గురించి ఆయన దీనిని చెప్పెను. ఎందుకనగా యూదా తనను నమ్మలేదని ఆయనకు తెలుసు కనుక ‘‘మీలో అందరూ కాదనెను.’’

బైబిలు ప్రధాన సత్యమైన నీరు మరియు ఆత్మమూలమైన సువార్త ద్వారానే ప్రభువు మన పాపాలన్నిటిని కడిగివేసెనని మనము తప్పక నమ్మాలి. కనుక వాక్యము యొక్క మూలమును తెలుసుకొనుటలో మనం తప్పితే. మన స్వంత మార్గములో దేవుని వాక్యమును అర్ధం చేసుకొనుటకు ప్రయత్నిస్తే. మనం గొప్ప అపాయములో పడిపోతాము. ఇప్పటికైనా అనేకులు గొప్ప అపాయములో పడి తమకున్నవాటన్నిటిని ఇచ్చివేయుచు, యేసును సరిగా విశ్వసించకయే వారు హతసాక్షులైననూ అంతమున వారు తమ పాపము కొరకు నాశనమగుదురు.మన పాదములను యేసు కడుగుటకు గల కారణము :


యేసు తన పాదములను కడుగుచున్నప్పుడు పేతురు ఏమీ చేయలేకపోయెను. ఎందుకు? యేసు, పేతురు జీవిత కాల పాపములన్నీ తుడుపు పెట్టినప్పుడు మాత్రమే ఆయన అతని నిజరక్షకుడు కాలేడు. యేసు లోకమునకు వచ్చి అతడు యోహాను నుండి పొందిన బాప్తిస్మం ద్వారా మానవాళి పాపమును తనపై మోపుకొని, సిలువలో మరణించి, మృతి నుండి తిరిగిలేచి దాని వలన పేతురు పాపాలను అతని అనుచరుల పాపాలన్నిటిని ఒకేసారిగా కడిగెను. కానీ తమ పాదాలను ఆయన కడుగుటను వారు కేవలము ఆచార విధానముగానే భావించారు. యేసు వారి పాదాలను కడిగిన కారణము వారికి తెలియలేదు.

ఇప్పటి పాపములే కాక తరువాత వారు చేయబోవు పాపము కూడా వారిని ఆత్మీయంగా చంపి భయపెట్టునని వారు తెలిసికొనవలెను. విశ్వాసము ద్వారా భవిష్యత్తులో వారు చేయు పాపములన్నీ యేసుపై మెపబడెనని వారు గుర్తించాలి. ఇది చేయకపోతే పేతురునకు యేసుతో పాలులేదని కారణాన్ని బట్టి, యేసు పేతురు మరియు ఇతర శిష్యుల పాదములను కడుగుట ద్వారా గొప్ప పాఠమును నేర్చుకొనవలెను. బాప్తిస్మము పొందుట ద్వారా పేతురు తన బలహీనతలను బట్టి అయోగ్యతను బట్టి అతడు జరిగించిన ప్రతి ఒక్కొక్క పాపమును ఆయన కడిగెనని గుర్తించాలి. ఇందు మూలముగా యేసు పేతురు పాదములను కడుగవలెను. మరియు పేతురు తన పాదములను యేసుచే కడిగించుకోవాలి. పేతురు తన అయోగ్యతలను బట్టి బలహీనతలను బట్టి తన జీవితకాలములో జరిగించబోవు పాపములన్నియూ ఒకేసారి యేసు యోహాను ద్వారా బాప్తిస్మము పొందుట ద్వారా కడుగబడెనని పేతురు విశ్వాసముంచినప్పుడే యేసుతో పాలు పొందగలడు.

దేవుని వాక్యము వినుట ద్వారా మనము నీరు మరియు ఆత్మమూలమైన సత్యమును అర్ధము చేసికొనగలము. మన వాస్తవ పాపము నుండి మనలను శుద్ధిచేసి మన పాపముకు ప్రాయశ్చిత్తము చేసి దేవుని వాక్యమైన నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను తెలిసికొని, విశ్వసించాలి. యేసు చెప్పెను ‘‘స్నానము చేసిన వాడు పాదములు తప్ప మరేమియూ కడుగుకొనక్కర్లేదు.’’ యేసు మన పాపాలన్నిటిని కడిగివేసి మనలను శుద్ధిచేసిన కారణంగా, దీనిని నమ్మువారందరూ తమ పాపాలన్నిటిని కడుగుకొనగలరు.

యేసుక్రీస్తు మనపాపములన్నీ తనపై మోపుకొన్నవాడై యొర్ధాను నదిలో బాప్తిస్మము పొందుట ద్వారా పాపములను కడిగివేసెను. సిలువ వద్దకు పోయి సిలువ వేయబడి రక్తము కార్చి చనిపోయి మృతి నుండి తిరిగి లేచుట ద్వారా ఆ ప్రభువు మనకు ఖచ్చితమైన రక్షకుడాయెను. అలాగే నీరు మరియు ఆత్మ మూలమైన సువార్త ద్వారా, ఆయనను విశ్వసించు వారందరి పాపము ఒకేసారి శుద్ధీకరించబడుటకు విశ్వాసం ద్వారా అనుమతించెను.

ఈ సత్యమును తెలుసుకొని విశ్వసించువారు తమ నిజ పాపముకు కూడా ఖచ్చితంగా ప్రాయశ్చిత్తం పొందెదరు. దేవుని దృష్టితో చూస్తే యేసుని నీతి చర్యల ద్వారా మానవాళి అంతటికి తమ పాపములు కడుగబడినవి. నిజముగా మనం మన పాపము నుండి కడుగబడాలంటే నీరు మరియు ఆత్మ మూలమైన సువార్తను విశ్వసించుట ద్వారా ఈ కృపను మనము ఉచితంగా పొందవచ్చును. ఇది ఇటువంటిది కూడా? ఖచ్చితంగా అదే ఈ సత్యమును నమ్ము విశ్వాసముతో ఇప్పటికే మనం స్నానము చేసినవారమై వున్నాము.

స్నానము చేసినవాడు కేవలం తన పాదములను మాత్రమే కడుగుకొనాలని యేసుక్రీస్తు సెలవిచ్చాడు. కారణం మన పక్షములో ప్రతి దినం మనము పాపమును చేసినప్పటికి యేసు ఈ పాపములన్ని మోసుకొని పోయి మనలను పూర్తిగా రక్షించెను. బాప్తిస్మము పొందుట ద్వారా యేసుక్రీస్తు మన జీవిత కాల పాపములన్ని కడిగివేసెను. ప్రతి దినం మనం దీనిని గట్టిగా విశ్వసించిన యెడల మనం నిజపాపము నుండి విమోచింపబడతాము. 

ఈ భాగము మనకు చెప్పినది ఇదే. నిజానికి నీరు మరియు ఆత్మ మూలమైన సువార్తను విశ్వసించి తమ పాపముకు ప్రాయశ్చిత్తం పొందినవారు అనగా, యేసు పాపములన్నీ అంగీకరించి యోహాను నుండి బాప్తిస్మము పొందెను. ఈ లోకపాపమును భుజమునకు ఎత్తుకొని సిలువలో మరణించెను. తిరిగి మృతి నుండి లేచెను. ఇప్పటికి శరీరమందు పాపమును చేయుచున్నవారి కొరకు కూడా అయినను ఆయన శక్తిమంతుడు కనుక దేవుడు ప్రజలు చేయు దినదిన పాపములన్నింటిని తనపై మోసెను.

శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము వరకు వున్న సమయంలో మానవు పాపమంతటిని తుడిచిన ఈ చర్యను ముగించెను. అలాగే మన జీవిత కాల పాపాలన్నింటిని యేసు స్వీకరించి, యోహాను ద్వారా బాప్తిస్మమును పొంది వాటిన్నింటిని కడిగి వేసెను. అయినను వీటన్నింటికి మనం ఎట్లు విశ్వసించగలం? ఈ సత్యమును విశ్వసించి కూడా ప్రతి దినం మనం చేయు పాపము వలన మన బలహీనత నుండి మనం ఇబ్బంది పడుచున్నాం.

ఇందువలన మనం ప్రతి దినం మన విశ్వాసంతో ఈ భూమిపై మనం నడుచుచున్నంత కాలము మన జీవితములో మనం చేయు పాపములన్నింటిని యేసు తనపై మోపుకొనెను. సత్యము వైపునకు తిరుగవలసి వున్నది. బాప్తిస్మము పొందుట ద్వారా యేసుక్రీస్తు ఒక్కసారిగా లోకపాపమును కడిగివేసెను. కాని ఈ సత్యమునకు మనం దినదినము సమయ సమయము కట్టుబడి వుండాలి.

పేతురు యేసుతో కూడా విశ్వాసములో ఐక్యమవ్వాలని గుర్తించుటకు యేసు అతని పాదములను కడిగెను. అలాగే మనం కూడా ఆయన రక్షణలో నిలిచి వుండునట్లు ఆయన తన బాప్తిస్మముతో మన పాపములను కడిగి సిలువలో మరణించుట ద్వారా మన పాపము తుడిచెనని సత్యమును ప్రతి దినం స్థిరంగా నమ్మాలి. ఈ సత్యమును నమ్మలేని వారికి వారి పాపములో దేనిని కూడా ఎప్పటికి కడుగలేరు. నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను నమ్మక తమ పాప పరిహారము పొందని వారు యేసుతో పాలు లేనివారై అవిశ్రాంతంగా వారు తమ పాప పరిహారం కొరకు ప్రయత్నించినను వారి పాపములు కడుగబడవు. ఎందుకనగా ప్రతి దినం పశ్చాత్తాప ప్రార్థన వలన కడుగబడుటకు అవి తేలికైనవి కావు. ప్రతి పాపమునకు దేవుని భయంకరమైన తీర్పు వున్నది. 

అలాగే నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను నమ్ముట ద్వారా కాక స్వంత పశ్చాత్తాప ప్రార్థన ద్వారా పాప పరిహారము పొందుటకు ప్రయత్నించు వారు ఒక పైసా విలువ చేయు పాపమును కూడా వారు కడుగుకొనలేదని గుర్తించి విశ్వసిస్తారు. అట్టి పశ్చాత్తాప ప్రార్థనలను ప్రతిదినం చేయుట ద్వారా మన పాపమును కడుగుకొనగలమా? మన పశ్చాత్తాప ప్రార్థనతో మన పాపమును కడిగివేసుకొన్న మనంతట మనం నమ్మినను ఈ పాపము తమ స్థానముతోనే ఉండును.

నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను విశ్వసించుట ద్వారా తమ శరీరమంతయు స్నానంచేసినవారు మాత్రమే తమ జీవితమును జీవించుచూ పాదములను కడుగుకొనుటకు అర్హులు. మరియు వారు మాత్రమే ప్రతి దినము తమ విశ్వాసము ద్వారా పాపమును కడుగుకొనుటకు కృపను ధరించుకొని తమ పరిశుద్ధతను కాపాడుకొందురు.

బాప్తిస్మము పొందుట ద్వారా ఒకేసారి యేసు మన పాపములను తనపై మోపుకొనెను. కనుక మనం విశ్వసించినది ఎట్లనగా మనం మన జీవితాలను కొనసాగించుచుండగా చేయు ప్రతిపాపము యేసు తనపై మోపుకొనెను. మరియు ఆ విధంగా వాటి శిక్షను కూడా ఆయన భరించెను. మరోవిధంగా యేసు మనకు ఇట్లు చెప్పెను. మన స్వంత బలహీనతల వలన పడిపోయి చనిపోవుట కంటే భయపెట్టునది మరొకటి లేదు.

యేసు తన శిష్యుల పాపమును కడిగిన తర్వాత ఆయనకు మిగిలినదేమనగా సిలువపై మరణించి మృతి నుండి తిరిగి లేచుట మరియు పరలోకమునకు ఆరోహణమగుట ఇప్పుడిక యేసు తన శిష్యులతో వుండుట కాని వ్రాయబడిన వాక్య ప్రకారము ఆయన తండ్రియైన దేవుని కుడి పార్శ్వమందు కూర్చుండును తరువాత ఆయన మరలా వచ్చును.

దీని విషయం శిష్యులకు బోధింపకుండా యేసు సిలువపై మరణించినచో వారు ఈ భూమిపై ఎట్లు నివశించగలరు. ఎట్లు నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను వ్యాపింపచేస్తారు. యేసు శిష్యులు అయోగ్యులను బలహీనులను కనుక తమ స్వంత పాపములో నివశింపవచ్చును. మరియు అసూయ, ద్వేషము వంటి పాపము చేసినప్పుడు వారు ఏమి చేయాలో ఎరుగని యెడల వారు విశ్వాసముతో జీవించలేకపోయేవారు. అప్పుడు వారు ఇతరులకు సువార్తను ఎట్లు వ్యాప్తిచేయగలరు? వారు ఈ విధంగా చేయలేరు. ఇందువలన యేసు శిష్యుల పాపమును ఆయనే కడిగివేసినట్లు ఖచ్చితంగా వారికి బోధించాలి. మరియు ఇందువలననే ఆయన వారి పాదములను కడిగెను.ఆ ప్రత్యక్షపు గుడారములో చూపబడిన పాప పరిహారములే


మనము గుడారపు ఆవరణ ద్వారములోనికి ప్రవేశించినప్పుడు మొదటిగా ఇత్తడి గంగాళమును దహన బలిపీఠమును చూడగలము. మన విశ్వాస జీవితము కొరకు ప్రత్యక్ష గుడారము బోధించు మొదటి పాఠము మనము దేవుని యెదుట పాపము చేసినట్లయిన పాప శిక్ష మన కొరకు ఎదురు చూచును. ఇందు మూలముగా దహన బలిపీఠములో చూపబడిన మన విశ్వాస జీవితములో పాపము మరణము శిక్షించుటకు ఆరంభించెను. మన పాపము నిమిత్తము మనమందరము దేవుని యెదుట శిక్షింపబడాలి కాని మన పాపమును భరించుటకే ఆ ప్రభువు ఈ భూమిపైకి వచ్చెను.

పాతనిబంధనలోని పాప పరిహారార్థ బలిపశువు కూడా తలపై చేతులుంచుట ద్వారా పాపుల పాపమును అంగీకరించి దాని రక్తము చిందించి, చనిపోవును. దాని మాంసము దహన బలిపీఠముపై వుంచబడి అగ్నితో దహించబడును. ఆ విధముగా పాపుల శిక్ష అయిన అగ్ని తీర్పును ఘోరముగా బలిపశువు పొందినట్లే యోహాను చేతులుంచుట వలన యేసు లోకపాపమును గురించి తన రక్తమంతా కార్చి శిలువపై మరణించెను. దాని వలన తన స్వమరణముతో మన పాప పరిహారమును చెల్లించును. 

ప్రతి దినము మనము పాపం చేస్తాము. చనిపోవు ఘడియ వరకు పాపము చేస్తూనే వుంటాము. నీవు, నేను మన పాపముకై తప్పక మరణమొందాలి కాని మనవంటి ప్రజలను వారి పాపము నుండి శిక్ష నుండి రక్షించుటకు ప్రభువు పరలోకమహిమను విడిచెను. ఈ లోకమునకు వచ్చి యోహానుచే బాప్తిస్మము, రక్తమును చిందించెను. మృతిని గెలిచి లేచెను. దీనంతటి ద్వారా ఆయన మనకు నిజరక్షకుడాయెను. మరణము యొక్క శాసనమును గుర్తెరిగి గుర్తించుట వలన మనము మన పాపములను బట్టి మరణశిక్ష విధించవలసిన వారము. ఇదే విశ్వాసమునకు మొదటి మెట్టు.

తన పాపము నిమిత్తము తాము చావవలసిన వారమని తెలిసి నమ్మినవారు మాత్రమే పాపమును పోగొట్టు స్నానమాచరించి విశ్వాసము ద్వారా తమ పాపములన్నింటిని యేసుపైకి పంపి పాపపరిహారమును పొందగలరు. అట్టి విశ్వాసముతోనే నిజమైన విశ్వాసం ఆరంభమగును. ఇట్టి విశ్వాసముతో ప్రారంభించిన వారమైన మనము ప్రతిదిన పాపమును యేసుక్రీస్తు తుడిచి పెట్టినను మన విశ్వాసముతో నమ్ముట వలన పరిపూర్ణులమైనాము. మరియు భవిష్యత్తులో చేయబోవు పాపము నుండి కూడా మనము కడుగబడినాము.

ప్రత్యక్ష గుడారములో చూపబడిన విధముగా ప్రతిదినము ప్రధాన యాజకుడును, ఆయన కుమారుడును ప్రతి ఉదయ సాయంత్రములో దహనబలి అర్పించవలెను. వారు క్రమముగా తమ పాపపరిహారార్థ బలిపశువును తెచ్చి దాని తలపై వారి చేతులుంచెదరు. దాని రక్తము ఓడ్చెదరు. దానిని దేవునికి అర్పిస్తారు. ఇందువలననే ప్రత్యక్షగుడారములో కుర్చీ వేయబడలేదు మరో విధంగా వారు అక్కడ ఎల్లప్పుడు బలులనర్పిస్తూ ఉంటారు. కనుక కూర్చొని విశ్రాంతి తీసుకొనుటకు వారికి సమయం లేదు ఇట్లే నిరంతరము పాపము చేయు ప్రజలైన మనము ఆ పాపము కొరకు ఆయన తీర్పును తప్పించుకొనలేము. కానీ యేసు క్రీస్తు పొందిన బాప్తిస్మము వలన కార్చిన రక్తము వలన మనలను పరిపూర్ణముగా రక్షించెను. 

మనము ఎల్లప్పుడూ మన పాపము వలన మరణిస్తున్నామన్న విషయము వద్ద మన విశ్వాసమును ప్రారంభించవలెను. మనవంటి ప్రజల కొరకు, యేసు ఈ లోకమునకు వచ్చెను. బాప్తిస్మము పొందుట ద్వారా ఒకేసారి మన పాపములను తనపై భరించెను. తరువాత యేసు మన పాపములను సిలువకు మోసుకొనిపోయి, తన స్వరక్తమును కార్చి తిరిగి లేచి ఆయన మన శాశ్వత రక్షకుడాయెను.

రోమా 6:23 ఇట్లు చెప్పుచున్నది. ‘‘ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము. అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తు నందు నిత్యజీవము.’’ నిజానికి మన పాపము వలన మనము చావవలసిన వారము. యేసుక్రీస్తు మనలను పరిపూర్ణంగా రక్షించెను. మరో విధంగా బాప్తిస్మము పొందినవాడై సిలువలో మరణించి మృతి నుండి తిరిగి లేచుట వలన మన ప్రభువు మనకు పాపపరిహారమును, నిత్యజీవమును ఇచ్చెను. దీనిని నీవు నమ్ముతున్నావా? ఇక్కడి నుండే విశ్వాసము ప్రారంభించెను.

“నేను అయోగ్యుడను కనుక నేనిక యేసును వెంబడించను”. అని నీవు ఏదో విధముగా యోచించుట లేదా? నేను కేవలము నిమిత్త మాత్రుడను మరియు అశాశ్వతమైనవాడను అని నీవు నీరు మరియు అత్మమూలమైన సువార్తను విశ్వసించినప్పటికీ దీనిలో నాటబడుటకు నీకు అతికష్టముగా అనిపించుట లేదా? ఇదే విశ్వాసము నిన్ను అయోమయంలో పడవేయును.

హెబ్రీ 10:36-39 వైపు మనం చూద్ధాం. ‘‘మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై, వాగ్ధానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమైయున్నది. ఇక కాలము బహు కొంచెముగా వున్నది. వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. నా యెదుట నీతిమంతుడైనవాడు విశ్వాసమూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన యెడల అతని యందు నా ఆత్మకు సంతోషముండదు. అయితే మనము నశించుటకు వెనుక తీయువారము కాము గానీ అతను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగిన వారమైయున్నాము. మనము అవిశ్వాసము వలన వెనుక తీసిన వారము మనము కాకూడదని ఇక్కడ చెప్పబడినది. అనేక శ్రమలను ఎదుర్కొంటారు కానీ పరలోక వారసత్వము ఎప్పుడూ నీరసరింపక మన కొరకు ఎదురు చూచుచుండును. పరలోకములోని సమస్తమూ వాటి హక్కుదారులమైన మన కొరకు ఎదురు చూచుచున్నవి.

హెబ్రీ 10:34-35 ఇట్లు చెప్పినది. ‘‘ఏలయనగా మీరు ఖైదులో ఉన్నవారిని కరుణించి, మీకు మరి శ్రేష్ఠమైనదియు స్థిరమైనదియునైన స్వాస్థ్యమున్నదని ఎరిగి మీ ఆస్తి కొల్పోవుటకు సంతోషముగా ఒప్పుకొంటిరి. కాబట్టి మీ ధైర్యమును విడిచి పెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్పబహుమానము కలుగును.’’ ఇదే వాస్తవము. నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను విశ్వసించిన వారమైన నా కొరకు స్థిరమైన పరలోక స్వాస్థ్యము ఎదురు చూచుచున్నది. పాప పరిహారార్థము పొందినవారికి దేవుడు తన బహుమానముగా పరలోక స్వాస్థ్యము నిచ్చుచున్నాడు.

ఇందువలననే తన వాగ్ధానమందు మనకున్న నమ్మిక కోల్పోకూడదు ఆయన మనకు చెప్పుచున్నాడు. మన విశ్వాసమునకు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమును తెలిసికొన్నవారమైన మనము అవిశ్వాసమునకు తిరగకూడదు కానీ మన విశ్వాసమును మరింత స్థిరపరచుకొని మన నమ్మికను కోల్పోకూడదు. నిజ సత్యమైన నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను విశ్వసించు నమ్మిక మనము కలిగియుండి, అంతము వరకు ఆత్మీయ పోరాటం పోరాడి, ఆత్మలను రక్షించుచూ అధిగమించాలి.

పరిశుద్ధులమైన మనము నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను నమ్మునట్టి విశ్వాసమును తప్పక కలిగివుండాలి. ఈ లోకంలో మనం జీవించనంత కాలము పాపము చేయుచూ మనము అయోగ్యులుగా ఉన్ననూ, యోహాను ద్వారా బాప్తిస్మము పొందుట ద్వారాను మన కొరకు తన రక్తమును సిలువలో కార్చి మనలను సంపూర్ణముగా రక్షించెనను విశ్వాసమును తప్పక కలిగి వుండాలి. ఈ లోక అంతము వరకు ఇట్టి విశ్వాసము కలవారమై మనం గొప్ప నమ్మకము కలిగి మన జీవితమును సరిగా జీవించాలి. మనము దేవుని సముఖమునకు విశ్వాసంతో రావాలి. ‘‘ఈ సత్య సువార్తతో విశ్వాస పరుగును కొనసాగించాలి. సువార్తను ప్రచురించాలి. సువార్త సేవ చేయుచూ మన జీవితాలను గడపాలి. ఇందువలన బైబిలు మనకు చెప్పుచున్నది.’’ (హెబ్రీ 10:36)

మీరు దేవుని చిత్తము నెరవేర్చిన వారై వాగ్ధానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమైయున్నది. (హెబ్రీ10:38-39) దేవుని యెదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమూలముగా జీవించును గానీ అతడు వెనుక తీసిన యెడల అతనియందు నా ఆత్మకు సంతోషముండదు. అయితే మనము నశించుటకు వెనుక తీయువారము కాము గాని ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగిన వారమైయున్నాము. నీరు మరియు ఆత్మ మూలమైన సువార్త యందు విశ్వాసముంచుచున్న మనము ప్రతి పాపము నుండి ఇతరులను రక్షించగలవారము. పరిస్థితి ఇట్లుండగా అన్ని పాపముల నుండి ఇతరులను రక్షించుటకు బదులుగా మనము అవివేకములో ఎట్లు పడతాము? మనము నీరు మరియు ఆత్మమూలమైన సువార్త వైపు మన దృష్టినుంచనట్లయితే మన విశ్వాసం క్షీణించును. పూర్తిగా చనిపోవునట్లు మరణ గుంటలో పడి తప్పక మునిగిపోతాము. పాపక్షమాపణ పొందిన మన గురి ఇప్పుడు దేవుని చిత్తానుసారముగా విశ్వాసపరచు కొనసాగించాలి. మన బలహీనతలో పడి, ఎక్కడున్నామో అక్కడే ఉండి మరణముతో అంతమగుట కాదు.

నీరు మరియు ఆత్మ మూలమైన సువార్తను నమ్మి మనము అవివేకములో పడువారము కాము. మనము ఇతరుల ఆత్మను కూడా రక్షించగలిగిన విశ్వాసమును కలవారము మనము అట్టి ప్రజలమైనప్పుడు, మన బలహీనతలో చుట్టబడి మనమెలాగు మరణించగలము? మనమలాగు చేయరాదు, నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను నమ్మువారు అవివేకములోనికి లాగబడువారు కారు. నీవు, నేను ఎంత అయోగ్యులమైననూ మనము నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను గొప్ప నిరీక్షణతో నమ్ముచూ జీవించు పరిశుద్ధులమే.

నీవు, నేను మన విశ్వాసం ఎక్కడ మొదలైందో యోచించాలి. అవిశ్వాసము నుండి బయటపడి విశ్వాసంతో జీవించాలి. వాస్తవంగా మనము నిస్సహాయులమై చావవలసిన వారమైయున్నాము. కానీ నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను విశ్వసించుటలో ఈ సువార్త ద్వారానే మన ప్రభువు నిన్ను, నన్ను పాపాలన్నిటి నుండి విడిపించి నిత్య రాజ్యమిచ్చెను. 

మరో విధముగా, చేతకాని తనము మరియు దుష్టత్వమును 100 శాతము తెలిసికొనే మన విశ్వాసాన్ని ప్రారంభించాము. వీటన్నిటిని ఆయన పొందిన బాప్తిస్మమందు నమ్మిక కలిగి నీరు మరియు ఆత్మ మూలమైన సువార్తను నమ్మి యేసుక్రీస్తుపై మోపుట వలననే ఉంచగలము. ఇందువలననే మనము వెనుకకు తిరుగువారము కామని స్థిరముగా గుర్తించి మన జీవితాలను విశ్వాసంతో జీవించాలి. 

కొన్నిసార్లు మన పరిస్థితులలోను, పరిధులలోనికి మనము అనేక శ్రమలలో, ఇబ్బందుల్లో పడవచ్చు. మరియు మనము బలహీనులము. కనుక మన విశ్వాస జీవితం కూడా కూలిపోవచ్చు. ఇక ముందుకు సాగలేకపోతాం. కానీ మనము మరణించము. దీనిని పేతురుకు బోధించుటకు ఆయన ఇట్లు చెప్పెను. ‘‘నేను నిన్ను కడుగని యెడల నాతో నీకు పాలు లేదనెను” పేతురు పాపాలన్నిటిని యేసు తుడిచివేసాడు. పేతురు జీవిత కాలంలో చేసిన పాపములన్నిటిని బాప్తిస్మం పొందుట ద్వారా యేసు ప్రభువుగా తనపై మోపుకొని సిలువలో చనిపోయి, మృతి నుండి తిరిగిలేచి, దాని వలన అతనిని రక్షించినట్లే ప్రభువు మన శాపము మరియు పాపాల నుండి నిన్ను నన్ను రక్షించెను.

ఆయన ఆలాగున చేయకపోయిన నీవు, నేను యేసుతో ఏమి చేయగలను? అది నీరు మరియు ఆత్మ మూలమైన సువార్త కాకపోయిన మన పాపాలన్నిటి నుండి మనం ఎట్లు రక్షింపబడగలము. ఇతరులను ఎలాగు రక్షించేవారము? ఇదంతయూ నీరు మరియు ఆత్మ మూలమైన సువార్త ద్వారానే సాధ్యమయ్యెను. ఈ సత్యాన్ని యేసు పేతురునకు బోధించాలని కోరెను.

ఈ బోధనను నీవు నేను విన్నాము అర్ధం చేసుకొన్నాము. కానీ మనం వాస్తవంగా ఎట్లున్నాము? మన అయోగ్యతలను బట్టి తరచుగా మన ఆత్మలో కృంగిపోవుట లేదా? అప్పుడు మనం మన స్వబలహీనతలో పడతామా లేదా? ఎందుకనగా మనం ఎంతో అయోగ్యులమును; బలహీనులముగా ఉన్నాం. మనం స్వంత తొట్రుపాటులో పడుటకు సిద్ధంగా ఉంటాము. నీలో నీవు ఇట్లు మాట్లాడుకొనవచ్చు. ‘‘అంతము వరకు నేను యేసును ఎలా వెంబడించాలి? నేను ఆయనను వెంబడించుట ఇక చాలిస్తే మంచిది! ఆయన నన్ను తన సంఘము నుండి త్రోసివేస్తే మంచిదని ప్రభువు ఆలోచిస్తున్నాడని ఖచ్చితంగా చెప్పగలను” యేసు పొందిన బాప్తిస్మము సువార్త లేనట్లయితే మనము నిత్య మోసంలో పడిపోదుమేమో.

నీవు నేను మన పాపము నిమిత్తం చావడం తప్ప వేరొక దారి లేనివారమైననూ ప్రభువు మనలను మన పాపము నుండి శాపము నుండి విమోచించెనను సత్యమును నమ్మాలి. మన శరీరం ఎంతో బలహీనమై పాపపరిహారం పొందిన తరువాత కూడా పాపము చేయకుండా ఉండలేని స్థితిలో కూడా యేసు పొందిన బాప్తిస్మము మరియు ఆయన కార్చిన రక్తం ద్వారా మనకు దొరికిన నిత్యరక్షణకు స్థిరంగా పట్టుకోవాలి.

నీవు నేను మన విశ్వాసాన్ని ఒప్పుకోవాలి. ‘‘ప్రధానంగా మాట్లాడితే, నేను నా పాపములకొరకు చావవలసిందే. అది నిజము. కానీ ప్రభువు ఈ లోకమునకు నా కొరకు వచ్చి బాప్తిస్మం పొందుట ద్వారా నా పాపమును ఆయన గ్రహించెను. ఆయన తన బాప్తిస్మం ద్వారా నా పాపాలను తనపై మోపుకొనలేదా? ఆయన సిలువపై మరణించలేదా? ఆయన మృతి నుండి తిరిగి లేవలేదా? మరియు ఆయన ఇప్పుడు సజీవుడు కాదా? నా పాపమును యేసుపై మోపినప్పటి నుండి నేను ఎంత అయోగ్యుడనైననూ, నా అయోగ్యతలు ఎంతగా చూపబడిననూ, నేను ఇంకనూ పాపరహితుడనే కనుక నేను అవిశ్వాసంలో పడువాడును కాను.’’ ఈ విధంగా విశ్వసించుట ద్వారా మన బలహీనతలను వదలి పెట్టువలసిన వారము.

రేపటికి కూడా మనలో అయోగ్యతలున్ననూ నీరు మరియు ఆత్మ మూలమైన సువార్తలోనున్నట్లు యేసు పొందిన బాప్తిస్మమును నమ్ముట ద్వారా, మనము ఎల్లప్పుడూ మన బలహీనతలను ఒక ప్రక్కకు పెట్టవలెను. మన విశ్వాసంతో మన బలహీనతల ద్వారా మనకు కలుగు ఆత్మీయ బలహీనతలను, మన విశ్వాసంతో మన బలహీనతల ద్వారా మనకు కలుగు ఆత్మీయ బలహీనతలను, శాపమును వదిలివేయాలి.

ఈ సత్యములో మనము ఎంత తరచుగానైతే అంత తరచుగా మనను ‘‘ప్రభువు నన్ను రక్షించెను. నా పాపాలన్నీ ప్రభువు పై మోపబడిన దినము నుండి నాలో పాపం ఉందా? అని చెప్పుకొనుచూ చూడాలి. నేను అలాగు లేను! కనుక అట్టి విశ్వాసం కలిగి మన బలహీనతలను పాపమును ఒక ప్రక్కకు త్రోసి, నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను మరొకసారి స్థిరంగా నమ్మి, విశ్వాసం ద్వారా మనఃపూర్వకంగా రక్షించబడ్డామనే సత్యమును సజీవంగా ఉంచాలి. ఈ విధంగానే మనం ప్రతిదినం దేవుని వైపుకు చూడాలి.యేసు బాప్తిస్మం పొందినప్పుడు పాపాలన్నీ మాయమాయెను.


సహోదర, సహోదరీలారా యేసు తన శిష్యులతోను, పేతురుతోనూ మాట్లాడిన ఈ మాటలు ఎంత ప్రాముఖ్యమైనవి? ఆయన తన మరణం తరువాత కూడా శిష్యులు నీరు మరియు ఆత్మమూలమైన సువార్తలో స్థిరముగా నిలిచియుండుటకై, ప్రాముఖ్యముగా వారు తమ బలహీనతలో పడకుండునట్లుగా ఆయన వారి పాదములను కడిగెను. యేసు పేతురు పాదములు మిగిలిన శిష్యుల పాదములను కడగని యెడల, యేసు సిలువలో మరణించి, మూడు దినాలలో మృతి నుండి తిరిగిలేచి దేవుని రాజ్యమునకు ఆరోహణమైనప్పుడు ఏమి జరిగి ఉండేది? శిష్యుల బలహీనతలో పడునప్పుడు ఎట్లు నిలబడగలిగేవారు వారు యేసు పొందిన బాప్తిస్మమును విశ్వసించు విశ్వాసముతో వాటిని పరిష్కరించాలి. వారు ఆ విధంగా నమ్మనట్లయిన తమ బలహీనతలను పొగొట్టుకొనుట వారికి అతి కష్టతరము.

నీలధూమ్ర రక్తవర్ణముగల పేనిన సన్నపుదారంతో నేయబడిన తెరలో చూపబడిన సత్యమును; యేసు క్రియలను చూచుట అను సత్యమును తెలిసికొని విశ్వసించుట వలన మన బలహీనత నుండి విడిపింపబడాలి. యేసు తాను పొందిన బాప్తిస్మశక్తిని గూర్చి తన శిష్యులతో చెప్పనట్లయితే, శిష్యులు కూడా నిరాశ చెంది, ఆత్మీయంగా రక్షించునట్లు తమ జీవితమును సమర్పించుటకు, అంత్యకాలములో హతసాక్షులగుటకు కావలసిన విశ్వాసమును కలిగియుండు బలమును పొందలేకపోయారు. మరియు అందువలన వారు తమ విశ్వాసమును కాపాడుకొనుటలో తప్పిపోయి, నిరాశ చెందేవారు.

కానీ మనకు అందించబడిన ఆచారము ప్రకారము యేసుక్రీస్తు శిష్యులందరూ పన్నెండుగురు సువార్తను వ్యాప్తి చేసి అందరూ హతసాక్షులైనారు. యేసుక్రీస్తు 12మంది శిష్యులలో ఎక్కువ అనుమానం గల శిష్యుడు తోమా ఈ తోమా కూడా భారతదేశమునకు వెళ్ళి అక్కడ హతసాక్షుడాయెను.

యేసుక్రీస్తు శిష్యులకు హతసాక్షులగునట్టి విశ్వాసం ఎక్కడ నుండి వచ్చినది? ఈ విశ్వాసము స్థైర్యముతో నింపబడినది. వారి జీవిత కాల పాపములన్నీ వారి బాప్తిస్మముతో యేసుపై మోపబడినవి. అవి యేసుపై మోపబడుట వలన వారు పూర్ణముగా శుద్ధిచేయబడిరి. వారు దేవుని సొంత బిడ్డలైరి. వారు రాజ్యమును స్వతింత్రించుకొందురు క్లుప్తంగా వారు నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను భూమిపై ప్రకటించగలరు మరియు దేవుని పిలుపునందుకొని దేవుని యొద్దకు పోగల విశ్వాసం కలిగియున్నారు. ఆ విధంగా మనమందరమూ కూడా దేవుని చిత్త ప్రకారము అట్టి విశ్వాసముతో హతసాక్షుల మగుదుము.

పిలాతు న్యాయస్థానపు బయట పేతురు మూడుసార్లు యేసు ఎవరో నాకు తెలియదని మూడుసార్లు బొంకినప్పుడు, నేను నిన్ను కడుగని యెడల నాతో నీకు పాలు లేదని యేసు చెప్పినమాట ఆంతర్యమును అతి జాగ్రత్తగా గుర్తించాడు. యేసు పరలోకమునకు ఆరోహణమైన తరువాత పేతురు మరియు ఇతర శిష్యులు యేసు తమ పాదములను కడిగినది ఎందుకనే విషయాన్ని గ్రహించి ఆయనను విశ్వసించి, గొప్ప అంకిత భావంతో నీరు మరియు ఆత్మ మూలమైన సువార్తను బోధించగలిగారు.

ఈ దినాలలో క్రైస్తవులు, యేసు బాప్తిస్మములోనున్న సత్యమును తెలిసికొనకపోతే, ఆయనలో విశ్వాసజీవితం జీవించుటలో కష్టములనెదుర్కొని, విశ్వాసమును వదలెదరు. మనము బలహీనతలతో పట్టుబడినప్పుడు, ఈ సమస్యను సాధించగల జ్ఞానాన్ని మనం కల్తీచేసి కొంటాం. కల్తీ అయిన మనస్సాక్షితో మనం ఎంతో కాలం చర్చికి వెళ్లలేము. ఆయన సంఘములోని ప్రతివారికి మన పిల్లలకైననూ ఇది సత్యమే.

సోదర, సోదరీలారా, నీవు పాపముతో పట్టబడితే నీ దేవుని ఆరాధించగలవా? ఈ దినములో తిరిగి జన్మించని వారు కూడా సంఘమునకు వెళ్ళుచున్నారు. తమ పాపము కొరకు ప్రాయశ్చిత ప్రార్థనలను చేస్తూ దేవుని ఆరాధిస్తున్నారు. వారు యేసును మతపరంగా నమ్ముచున్నారు. కనుక వారు అలాగు చేస్తున్నారు.

కానీ నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను నమ్మువారికి; తమ బలహీనతలను బట్టి ఆత్మకు పాప పంకిలమైతే వారు దేవుని యెదుటకు వచ్చి ఆరాధించలేరు. అట్టి సమయాల్లో యేసు మన పాపములను తన బాప్తిస్మము ద్వారా ఆయనే భరించుటకు అంగీకరించెనని నమ్మి యేసు బాప్తిస్మ శక్తిని విశ్వసించుట ద్వారా మన ఆత్మను శుద్ధి చేసుకొనవలెను.

నీరు మరియు ఆత్మమూలమైన సువార్త సత్యమును ఎరుగని వారైన నామకార్థ క్రైస్తవులకు విశ్వాస మార్గమైననూ తెలియదు. కనుక వారు గుడ్డిగా, పశ్చాత్తాప ప్రార్థనల ద్వారా తమ పాపములను పరిహరించుకొనుటకు ప్రయత్నించెదరు. ఈ లోకంలోని మతమును అనుసరించువారు గుడ్డిగా తమ దేవతలను మ్రొక్కి దయచేసి నన్ను క్షమించి, నన్ను, నా కుటుంబమును దీవించమని నిన్ను అడుగుతున్నాను. నేను నీ కొరకు ఏదైనా చేస్తాను. మరి ఎక్కువ అర్పణను ఇస్తాను. నేను మంచి పనులను చేస్తాను. ‘‘దయచేసి నా పాపము క్షమించు” అని అడుగుతారు. నామకార్థ క్రైస్తవులు కూడా తమ సొంతదైన మతమును అనుసరిస్తున్నారు.

యేసు పేతురుతో ఇట్లు చెప్పెను. ‘‘నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు గానీ ఇక మీదట తెలిసికొందువని అతనితో చెప్పెను. నేను నిన్ను కడుగని యెడల నాతో నీకు పాలు లేదనెను.’’ ఈ మాటలోని సత్యమును తర్వాత అయిననూ వారు యెరిగినచో, యేసు అనుగ్రహించిన నీరు మరియు ఆత్మమూలమైన సువార్తలో వారు తిరిగి జన్మించక ఇతరులను కూడా వారి పాపము నుండి రక్షించలేకపోయారు. యేసు, పేతురు పాదములను కడుగుచూ, ఆయన పొందిన బాప్తిస్మ శక్తి యొక్క ఒప్పింపును నాటియుండినట్లయిన దేవుని సంఘ నాయకునిగా పేతురు హతసాక్ష్యము పొంది తన బాధ్యతను నెరవేర్చలేకపోయేవాడు.

నీరు మరియు ఆత్మమూలమైన సువార్త వలనైన సత్యము ద్వారా కాకపోయిన, మనము దేవుని యెదుటకు రాలేము. పాపమును బట్టి ఆయనను ఆరాధించనూ లేము. ఎందుకనగా మనం పాపమును చేయుచూనే ఉన్నాము. నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను నమ్మి సంపూర్తిగా తమ పాపమును కడుగుకొన్నవారు ఆయన సంఘమునకు రాగలరు. వారు పాపులైన ప్రతిసారి విశ్వాసము ద్వారా తమ పాపాలను కడుగుకొనగలరు. స్నానము చేసినవాడు పాదములను తప్పి మరేమియూ కడుగుకొనక్కరలేదు అని మన ప్రభువు చెప్పిన విధముగా మన బలహీనతలను బట్టి మనం పాపము చేసినప్పుడు మన పాపములన్నీ యేసు బాప్తిస్మము పొందినప్పుడు ఆయనపై మోపబడెనని గుర్తు తెచ్చుకొని, దానిని విశ్వసించాలి. 

యేసు బాప్తిస్మం పొందినప్పుడు మన పాపములు యేసుపై మోపబడియున్నవి. (మత్తయి 3:15) మన హృదయ పాపము యేసునిపై మోపబడినప్పుడు మనం పాపము కలవారమా లేక పాపము లేనివారమా? మనకు పాపము లేదు. ఆయన బాప్తిస్మము ద్వారా మనందరి పాపము ఆయనపై ఒక్కసారే మోపబడిన కారణముగా మన విశ్వాసం వలన మన పాపాలు తుడువబడే మనము పవిత్రులమైనాము. మనం పరిశుద్ధులము కనుక మనం ఎంత అయ్యోగత కలవారమైనా మనమంతా దేవుని యెదుట యాజకులమే. కనుకనే నీరు మరియు ఆత్మమూలమైన సువార్త సత్యమును నమ్ము వారందరూ. త్వరగానే తమ బలహీనతల నుండి బయటపడి, విశ్వాసముతో దేవుని యొద్దకు వెళ్ళెదరు. ఆయనిచ్చిన రక్షణ కొరకు ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తారు. ఆయనను మహిమపరచు స్తుతులను అర్పిస్తారు. ఇతరులకు కూడా నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను ప్రచురిస్తారు.

“నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు కానీ యిక మీదట తెలిసికొందువని అతనితో చెప్పెను”. మొదటిగా నీవు పాపక్షమాపణ పొందినప్పుడు నీకు ఈ సత్యము తెలియునా? నీకు తెలియదు. అయిననూ మనమందరమూ ఈ వాక్యమును విన్నాం, తెలిసికొన్నాం. నీవు నేను ప్రతిదినం పాపము చేయుచున్నప్పటికి మన బలహీనతలు మనకు చూపబడుచున్నప్పటికీ యేసు, పేతురు పాదములను కడిగినట్లే మన పాపములను కూడా ప్రతిదినము కడుగుచున్నాడు.

మొదటి నుండి ఎప్పటి నుంచో మన హృదయంలోనున్న పాపము నూతనంగా మనం చేసినవి. చేయబోవునని యేసుపై మోపబడెనని మొదటిసారి విశ్వసించినప్పుడు మనం ఎంతగానో సంతోషిస్తాం. కానీ పాప పరిహారం పొందిన తరువాత కూడా మన బలహీనతలు ఎట్లు చూపబడుచున్నవో మనం బలహీనతలచే ఎట్లు పట్టబడ్డామో తెలుస్తుంది. అట్టి సమయాలలో యేసు తన బాప్తిస్మము ద్వారా అట్టి పాపమును మోసెను. మనం జరగబోవు కాలంలో చేయబోవుచున్న పాపమును ఆయనపై మోపబడెనని తెలిసికొని విశ్వసించాలి.

ఇందు మూలమున నీతిమంతులు స్వేచ్ఛగా పాపం చేస్తారా? వారు అలాగున చేయరు. (రోమా 1:17) చెప్పినట్లు నీతిమంతుడు విశ్వాస మూలమున బ్రదుకును. కొందరు నీరు మరియు ఆత్మమూలమైన సువార్తకు వ్యతిరేకముగా నిలిచి, ఖచ్చితంగా ఇట్లు చెప్తారు. మేలు కలుగుటకు కీడు చేయుదుము (రోమా 3:8) పాప పరిహారం పొందిన తరువాత నీతిమంతులు పాపం చేస్తారా? ఖచ్చితంగా చేయరు.

నీరు మరియు ఆత్మ మూలమైన సువార్తను విశ్వసించిన మనము ఆలోచిస్తే సహోదర, సహోదరీలారా మనం పాపులమా? కాదా? మనము పాప రహితులమే! అయిననూ ఇప్పటికీ మనలో బహీనతలు ఉంటే విశ్వాసం వలన మనం అపరిపూర్ణులమా లేక పరిపూర్ణులమా? మనం పరిపూర్ణులమే. మన శరీరమంతయూ పరిశుద్ధులమని యేసు చెప్పినప్పుడు ఆయన బాప్తిస్మం రక్తము మరియు పునరుత్థానము వలన మనలను పూర్తిగా శుద్ధి చేసెనని ఆయన భావన.

యేసును విశ్వసించిన తరువాతే మనము కూడా నీరు మరియు ఆత్మమూలమైన సువార్త యొక్క శక్తిని తెలుసుకొన్నాము. అలాగే నీరు మరియు ఆత్మ మూలమైన సువార్త యొక్క శక్తిని మన అనుదిన జీవితంలో అనుకరించాలి. ప్రతిదినం మనం ఈ శక్తిని ఉపయోగిస్తున్నప్పుడు, దాని వలన మన కొంత కాలానికి అలసిపోతాం. ఎంత కాలం దీనిని మనం చేయాలని వాపోతుంటాం. కానీ ఆ క్షణంలోనే మరొకసారి మనం ఎక్కడికి పోవాలి? నిజానికి మనం చావవలసిన వారమైయుండగా, ప్రభువు మన పాపములను వహించి వాటిని శుద్ధిచేసెను. మన పాపశిక్షను పొంది పాపశిక్షను అంతం చేసెను. ఈ విధముగా ప్రభువు యొక్క బాప్తిస్మము మరియు ఆయన రక్తముతో మన పాపము యొక్క శిక్షను పాపములను సంపూర్ణముగా తుడిచిపెట్టెను.

ప్రతిరోజూ, మనలను పూర్ణముగా చావవలసిన మనలను రక్షించిన ఈ ప్రేమను మన హృదయాంతరాలలో నింపుకోవాలి. దీనిలో విశ్వాసముంచు విశ్వాసంతో దేవుని యెదుటకు రావాలి. మరణం తప్ప వేరే దారి మనకు లేకపోగా, ప్రభువు వలన మనం పూర్తిగా రక్షింపబడి పూర్తిగా నీతిమంతులమైన దేవుని బిడ్డలమైనాము. ఇట్టి విశ్వాసమును దేవుడు మనకిచ్చియుండగా, ఈ విశ్వాసాన్ని మనం ఎల్లప్పుడూ కలిగియుండలేమా?

ఈ భూమిపై మనం యాత్రికులము కొద్దికాలము నుండి విడిచిపోబడవలసిన వారము. యాత్రికులు అనగా ప్రయాణికులని అర్ధము. ప్రయాణీకులనగా ఒక స్థలం నుండి మరొక స్థలానికి పోవువారు. ఒక స్థలములో కొంతకాలం ఉండి, ఆ పని పూర్తియిన తరువాత దానిని వదలిపెట్టు యాత్రికుల వంటివారము మనము ఈ లోకంలో జీవించిన కొద్ది కాలానికే పరలోకరాజ్యం చేరవలసిన యాత్రికులం మనము. ఈ భూమిపై మనం యాత్రికుల వలే మన జీవితాలను గడుపుచున్నప్పుడు అది ముగించి పరలోకరాజ్యం చేరవలసియున్నది. భూమిపైన ముగించమని కేక వినబడగానే నీవు నేను శారీరకముగాను, ఆత్మీయంగానూ భూమిపై ముగించవలసియున్నది. నీ అంతట నీవే పరిపూర్ణమైనప్పుడు ఇట్టి సమయం నీకును కలుగవచ్చు. నీ పరిస్థితులు అంత ఖచ్చితంగా లేకపోవచ్చు. లేదా నీ పరిస్థితులు బాగుండవచ్చు. నీ శరీర అపవిత్ర ఆలోచనలు పెరుగుతూ ఉండవచ్చు.

మనకు ఎంతో అవసరమైన వాక్కును ప్రభువు అనుగ్రహించారు. ‘‘నేను చేయునది నీకు యిప్పుడు తెలియదు కానీ ఇక మీదట నీవు తెలిసికొందువు” అవును ఇప్పుడు మనకు తెలియును. యాత్రికులుగా మనం నివశిస్తున్నప్పుడు అయోగ్యతలు చూపబడినప్పుడు మన బలహీనతలచే మనం కట్టబడినప్పుడు మన పరిస్థితులలో పట్టబడినప్పుడు యేసు బాప్తిస్మం ద్వారాను, సిలువ రక్తము వలననూ ఈ బలహీనతలతో సహా మన సమస్త పాపములను ఆయన తుడిచెను. కనుక మనకు పూర్ణరక్షణ కలిగెనని మనం గుర్తు చేసుకోవాలి. నీరు మరియు ఆత్మ మూలమైన సువార్తను విశ్వసించుట ద్వారా పాపపరిహారమును మనం పూర్తిగా పొందాము.

ప్రత్యక్ష గుడారమువైపు మనం చూసినప్పుడు అది ఎంత వ్యాప్తి చెందిందో మనం కనుగొనవచ్చు. దహన బలిపీఠములో చూపబడిన విధముగా, పాపమునకు జీతం మరణం. ప్రతి దినం మనం పాపం చేస్తాం కనుక, మన ఈ పాపమును బట్టి దినదినము మనకు శిక్షపొందాలి. యేసుక్రీస్తు పాపపరిహారార్థ బలి పశువుగా వచ్చెనని దహన బలిపీఠములో చూపబడినది, ఆయన తలపై చేతులు మోపబడి మన స్థానంలో చనిపోయెను. దహన బలిపీఠమును దాటిన తరువాత ఇత్తడి గంగాళము కనబడును. ఇక్కడే ప్రతిదినం మనం చేయు పాపమును కడుగుకొనుటకై మనము నీరు మరియు ఆత్మమూలమైన సువార్తలో పొందుకోవాలి. మన స్వంతమైన వాస్తవ పాపము నుండి మనలను రక్షించగల పూర్ణ సత్యము నీరు మరిము ఆత్మమూలమైన సువార్తలో నున్నవి.

మన ప్రభువైన యేసుక్రీస్తునందున్న బహుమానం ఏమిటి? అది నిత్యజీవమును పాపపరిహారమును కావా? ప్రభువు మనలను పూర్తిగా రక్షించెను. ఏ సమయంలోనైనా మన పాపములను బట్టి చావవలసినవారమైన మనలను ఆయన పూర్ణముగా రక్షించెను. మనం మన జీవితకాలంలో చేయబోవు పాపాలన్నిటిని నీరు మరియు రక్తమునందు మనకున్న విశ్వాసము ద్వారా కడుగబడెను. మన పాపములను కూడా మన ప్రభువు వాక్యము ద్వారా కడిగెను. ప్రభువు మన పాపాలన్నింటిని ఆయన బాప్తిస్మం పొందినప్పుడు ఆయనపై మోపుకొనెను. మరియు మన జీవితకాలంలో చేయబోవు పాపములన్నీ ఆయనపై మోపబడెను. మన పాపమును మోసికొనిపోవుచున్న యేసుక్రీస్తు వాటి నిమిత్తమై సిలువపై శిక్షింపబడెను, చనిపోయెను. మృతి నుండి తిరిగిలేచెను. అందువలన మనకు పరిపూర్ణ రక్షకుడయ్యెను. మనం పూర్తిగా యేసుక్రీస్తును విశ్వసించినప్పుడు మనం పరిపూర్ణలమౌతాము. మరియు మన శరీరము దుర్భల్యము కలదైననూ, మనకు పూర్ణ విశ్వాసమున్నచో మనము ఆత్మీయంగా దీవెనకరమైన జీవితాలను జీవిస్తాము మరియు దేవుని శాశ్వత రాజ్యములో ప్రవేశిస్తాము.ఇప్పుడు నీవు పేతురు వలె నున్నావా? 


యేసు పేతురు పాదములను కడిగిన రీతినే ఆయన నీ పాదములను కడుగలేదా? యేసు మన పాదములను ప్రతిదినం కడుగుచున్నారు. అనునది వాస్తవము దీని కొరకు బాప్తిస్మము పొందుట ద్వారా యేసు మన పాపములను తాను భరించెను. ఈ పాపము నిమిత్తము మన స్థానములో ఆయనే చనిపోయెను. మూడు దినముల్లోనే మృతి నుండి తిరిగిలేచెను. అలాగే ఆయన బాప్తిస్మం ఆయన కార్చిన రక్తము ఆయన పునరుత్థానము ద్వారా యేసు మన సంపూర్ణ రక్షకుడయ్యెను. ఈ యేసుక్రీస్తునే మనం సంపూర్ణముగా విశ్వసిస్తున్నాం.

విశ్వాసం వలన మనము పూర్ణముగా ఆయనను ఆరాధించుచున్నాము. కనుక ఆయన క్రియలను పూర్ణముగా విశ్వాసంతో చేస్తున్నాం. మన చర్యలు సంపూర్ణంగా ఉండలేవు. మన విశ్వాసమే మనలను సంపూర్ణులను చేయుచున్నది. ఇందుమూలమున మనము నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను విశ్వసించుట ద్వారా యేసుక్రీస్తు శిష్యులుగా జీవించాలి. మనం విశ్వాసంలో నిరాశకులోనయ్యేవారము కాకూడదు. మనం పరిపూర్ణులము కానప్పటికి మనం విశ్వాసంతో పురుగెత్తాలి. నిజానికి మరి ఎక్కువ విశ్వాసంతో పరుగెత్తగలము. ‘‘నీతిమంతుడు విశ్వాసమూలమున జీవించును.’’ మొదట దేవుని రాజ్యమును ఆయన నీతిని వెదకుడి. ఇవ్వబడిన సత్యమునుబట్టి విశ్వాసము వలన మనము సరిగానున్నాము. దాని వలన మనం ఇతరుల ఆత్మలను రక్షింపగలము ఇతరులను రక్షించుటను దేవుడిచ్చిన పరిచర్యకు మనంతట మనం సమర్పించుకొనకపోతే మనము నిరాశ అను గుంటలో పడతాము. నిస్పృహ ఆవరిస్తుంది. మన పాపములో మనం చనిపోతాం.

ఆయన నీతి క్రియలను చేయుచూ పాపరహితులు ఉల్లసిస్తారు. ఇతరుల ఆత్మలను రక్షించు దేవుని సువార్తను వ్యాప్తి చేయుటకు వారు ఉల్లసిస్తారు. వాస్తవమైన వాటిని చేయుటకు పాపులు ఉల్లసించరు పాపపరిహారమొందిన వారికి సత్యమైనది చేయుట ఆత్మీయ ఆహారం వంటిది. ఇతరుల ఆత్మలను రక్షించునట్టి సువార్తను ప్రపంచమంతటా వ్యాప్తి చేయుట సత్యమైన క్రియ, కానీ అదే సమయంలో అదే మన నిజమైన ఆత్మీయ ఆహారము. సత్యమైనది చేయుటవలన మన హృదయాలు ఆత్మతో నింపబడును. నూతన బలం మనం పొందుతాం. మన ఆత్మ వర్ధిల్లుచు పక్వమవ్వగా మనం ధైర్యవంతులమవుతాం. కనుక అబ్రహాము వలే జీవించుటకు దేవునిచే దీవించబడుటకు, ఇతరులతో ఈ దీవెనలను పంచుకొనుటకు, మనం తప్పక నీతిని ప్రేమించాలి. సత్యమును ప్రేమించాలి. సువార్తను ప్రచురించుటకు ప్రేమించాలి. మనం బలహీనులమైనప్పటికి ఈ నీతిక్రియలను జరిగించనట్లయితే మన ఆత్మలు మరణించును. ఆయన నీతిమత్వ సేవకొరకు పనిచేయుట మానినట్లయిన కేవలము మనకు ఆత్మీయ మరణం తప్పదు. ఇందువలన యేసు చెప్పెను. ‘‘నీతి కొరకు ఆకలి దప్పులు కలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు”. (మత్తయి 5:6)

యేసు ఈలాగు చెప్పెను. ‘‘హృదయ శుద్ధిగలవారు ధన్యులు వారు దేవుని చూచెదరు” (మత్తయి 5:8) తమ పాపముకు పరిహారము నొంది మన పాపములన్నీ ప్రభువు కడిగెనని నమ్మువారు దేవుని చూడగలరు. వారు దేవుని విశ్వసించగలరు. ఆయనను వెంబడిస్తారు. ప్రపంచవ్యాప్తంగా పరలోక దీవెనలను వ్యాపింపచేస్తారు.

మనం మన విశ్వాసము వలన పూర్ణులమవుతాం. మన పాపములను బట్టి మనము చావవలసినవారమైయుండగా ప్రభువు ఈ లోకమునకు వచ్చెను, బాప్తిస్మం పొందెను. మన స్థానములో ఆయనే చనిపోయెను. దాని ద్వారా మనలను పూర్ణముగా రక్షించెను. ఇదే సత్యము, పరలోక రాజ్యమునకు దారి ఇదే, ఇది విశ్వాసానికి సరియైన మార్గమని గుర్తెరగాలి. ఇక ఏ మార్గమును లేదు. మన మంచిక్రియలు ద్వారా పరలోకంలో ప్రవేశించలేము. ప్రభువు మన కొరకు చేసిన క్రియలను గుర్తించి విశ్వసించువారు మాత్రమే పరలోకములో ప్రవేశిస్తారు.

బలవంతంగా ఒకవేళ మనము ప్రజలను రెండు రకములుగా విభజించవలసిన సత్యమైన వాటి కొరకు ఉపయోగించబడువారు. అసత్యమైన వాటి కొరకు ఉపయోగించబడువారు. అసత్యము కొరకై ఉపయోగపడువారు పాప పరిహారమును సరిగా పొందనివారే. ప్రభువు మన కొరకు చేసిన దానిని విశ్వసించుట ద్వారా, నీతికొరకు మనం సాధనములమైనాము. కానీ ఇంకనూ పాపపరిహారమొందనివారు, కేవలము సాతాను సాధనముగా మిగులుతారు. కానీ వారి స్వంత అభిప్రాయము కొరకు కాదు.

ఈ సమయంలో దేవుడు మనకు తన పరిపూర్ణ రక్షణను, పరిపూర్ణ విశ్వాసమును, పరిపూర్ణ పాప క్షమాపణను ఇచ్చెను. సువార్తను విశ్వసించిననూ నీ క్రియలు అయోగ్యముగా నున్నవా లేక నీ హృదయము ఏ కారణమునైనా దీని నుండి వెనుకకు మరలుచున్నదా? అలాగుండవలసిన అవసరం లేదు. ఎందుకనగా నీతిమంతులు విశ్వాసమూలముగా జీవిస్తారు. మన బలహీనతలు, అయోగ్యతలు మన ప్రభువుకు మరుగై వుండవు కానీ వాటిని ఆయన తన బాప్తిస్మము ద్వారా తనపై మోపుకొనలేదా?

మన జీవితంలో మన అయోగ్యతలను తెలియజేయు అనుదిన చర్యలో నుండి ఒక ఉదాహరణ మీకు తెలియచేస్తాను. మనం ఐక్యతగా ఫుట్‌బాల్‌ ఆట అడతాము. నా జట్టు ఇబ్బందిలో ఉంటే మన గోల్‌పోస్ట్‌లోనికి పైనుండి ఎగిరి వస్తున్న బంతిని, ఒక్కొక్క సారి చేతులతో త్రోసివేయడం గాని లేదా పట్టుకోవడం గాని జరుగుతుంది. నేను గోల్‌ను గోల్‌కీపర్‌నా, కాదు కానీ గెలవాని కోరుకున్నాను. ఇట్టి పరిస్థితులలో మనమందరమూ, గెలుచుటకు తేలిక మార్గాన పోతున్నామని మరచిపోతాం. మనం జరిగించవలసిన తప్పు ఆటను ప్రదర్శిస్తాం. ఆట ఎంతో భయంకరమైన యుద్ధము వలే సాగుచూ గెలుచుటకు ప్రతివారు చేయదగిన ప్రయత్నాలన్నీ చేస్తారు. నగ్నరూపాన్ని చూడలేము. మన జట్టు కష్టంలో ఉంటే మనం తప్పుడు కదలికను చూపడానికి, జిత్తులను ప్రయోగించడానికి వెనుకాడము. మన విధానాలను ఒత్తిడి చేస్తాము.

మన జట్టు మనకు ఇవన్నీ ఆమోదయోగ్యమే కానీ ఒకవేళ ఎదుటి జట్టు మన యెడల తప్పిదం చేస్తే. తప్పు అని గట్టిగా అరచి పసుపు కార్డు చూపించవలసినదిగా రిఫరీ గారిని కోరుతాం. కానీ రిఫరీగా పెత్తనం ఏ తేడా చూడలేదు. అనగా నిజానికి మనం ఎవరము మనం ఎల్లప్పుడూ మనకు సంబంధించినది. మన జట్టుకు సంబంధించినది మన స్వంతది. అయిన వాటి బాగోగులు ఎల్లప్పుడూ కోరుకొనుచూ మనకు లాభకరమైన దానినే కోరుకుంటాం. కాని ఇటువంటి వారమైన మనలను దేవుడు రక్షించాడు. మనం సిగ్గునొందదగినవారమే నీతి తప్పిన వారమైనప్పటికి మన విశ్వాసమును బట్టి సిగ్గును పొగొట్టుకొని మనం తిరిగి జన్మించిన వారమైనాము. 

మన పాపములన్నిటి నుండి దేవుడు మనలను పూర్ణముగా రక్షించెను. ఇందువలన మనం ప్రభువును రక్షకుడైన దేవుడనియు,రక్షణ కర్తను ప్రభువనియు పిలుచుచున్నాము. ఆ ప్రభువే మన రక్షణ కర్త. పేతురు ఇట్లు ఒప్పుకున్నాడు. ‘‘నీవు క్రీస్తును, సజీవుడైన దేవుని కుమారుడవు” (మత్తయి 16:16) అతని దీవెనకరమైన విశ్వాసమును ప్రభువు దేవుని వలననైనదని నిర్ధారించెను. క్రీస్తు అనగా మన పాపమును తన స్వంత శరీరముపై మోపుకొనినవాడు. వాటన్నిటిలో తుడుపుపెట్టినవాడు. యేసుక్రీస్తు సజీవుడైన దేవుని కుమారుడు. దేవుని కుమారుడును. మన రక్షకుడనై మనలను ఆయన పరిపూర్ణముగా రక్షించెను. కనుక సువార్తను ప్రకటించుటకు నీవు ఎంత అయోగ్యుడవైననూ, బలహీనుడవైననూ ఏ అడ్డూ లేక నీ హృదయములో నుండుము.

నీ ఆత్మ హృదయము శరీరము ఆగిపోయి వెనుకబడుటకు బదులుగా విశ్వాసము ద్వారా వాటిని చక్కపరచి, ధైర్యపడాలి. దేవుని విశ్వాసమును ప్రచురించు నీతిమంతులైన గొప్పవారిగా నిలవాలి. నా వైపు చూడండి. నా శరీరమందు చూపుటకు నాకేదియూ లేదు. కానీ నేను ప్రపంచమంతయూ సువార్త ప్రచురించుట లేదా? నీవు కూడా నావంటి వాడవు కావా? ఏ అయోగ్యతలు లేనివారిగా కనబడువారు ఏ బలహీనత లేక నిజముగా స్వతంత్రుని నమ్ముచున్నారా? పాపులు నిజానికి అపహాసకులు. అపహాసకులు కూడా నీవంటి వారే. కనుక వారి శరీరము మంచిగా ఉండునా? ఎల్లప్పుడు అయోగ్యత కలిగినది మానవ శరీరమే తమ నిజాయితీని చూపించిన వారంతా ప్రధానంగా క్రైస్తవ సమాజంలో కేవలము అపహాస్యత్వం, అవినీతి చూపబడుచున్నది.

మన దేవుడు మనలను పూర్ణముగా రక్షించెను. కాబట్టి మనలను పూర్ణులనుగా చేసిన మన విశ్వాసమును బట్టి నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను మనం ప్రచురించుదాం. పరిపూర్ణమైన నీతిగల ఈ దేవుని వలన శక్తి పొందుదాం. లోక పునాదులు ఏర్పడక ముందే ఆయన ఏర్పాటు చేసిన ఈ రక్షణ సత్యము ద్వారా, విశ్వాసము వలన మనము రక్షింపబడుటకు అనుమతించిన దేవునికి మనం కృతజ్ఞులము. యేసు బాప్తిస్మం పొంది సిలువలో తన రక్తమును చిందించినప్పుడే నీ పాపములన్నీ కడగబడ్డాయి. ఈ సత్యమును మీరందరూ విశ్వసిస్తారని ఆశిస్తున్నాను.