Sermons

[11-12] < నిర్గమ 26:31-37 > పరిశుద్ధ స్థలము యొక్క తెర స్థంభములు< నిర్గమ 26:31-37 >

“మరియు నీవు నీల ధూమ్ర రక్త వర్ణములు గల ఒక అడ్డ తెరను పేనిన సన్ననారతో చేయవలెను. అది చిత్రకారుని పనియైన కెరూబులు గలదిగా చేయవలెను. తుమ్మకఱ్ఱతో చేయబడి బంగారు రేకు పొదిగిన నాలుగు స్తంభముల మీద దాని వేయవలెను. దాని వంకులు బంగారువి వాటి దిమ్మలు వెండివి. ఆ అడ్డతెరను ఆ కొలుకుల క్రింద తగిలించి సాక్ష్యపు మందసము అడ్డ తెరలోపలికి తేవలెను. ఆ అడ్డతెర పరిశుద్ధ స్థలమును అతి పరిశుద్ధస్థలమును వేరు చేయును. అతి పరిశుద్ధ స్థలములో సాక్ష్యపు మందసము మీద కరుణాపీఠము నుంచవలెను. అడ్డతెర వెలుపల బల్లను ఆ బల్ల యెదుట దక్షిణపు వైపుననున్న మందిరముయొక్క ఉత్తరదిక్కున దీపవృక్షమును ఉంచవలెను మరియు నీల దూమ్ర రక్త వర్ణములు గల పేనిన సన్ననారతో చిత్రకారునిపనియైన తెరను గుడారపు ద్వారమునకు చేయవలెను. ఆ తెరకు అయిదు స్తంభములను తుమ్మకఱ్ఱతో చేసి వాటికి బంగారు రేకు పొదిగింపవలెను. వాటి వంపులు బంగారువి వాటికి అయిదు ఇత్తడి దిమ్మలు పోతపోయవలెను.’’అ పరిశుద్ధ స్థలము :


పరిశుద్ధ స్థలము యొక్క స్తంభములు మరియు దాని తెరలోని రంగులోనున్న ఆత్మీయ అర్థమును గూర్చి ధ్యానించుటకు నేను ఇష్టపడుతున్నాను. మనమిక్కడ పరిగణిస్తున్న ప్రత్యక్ష గుడారము 13.5మీ పొడవు మరియు 4.5మీ వెడల్పు కలిగియుండి అది అతిపరిశుద్ధ స్థలములో దీప వృక్షము సన్నిధాన రొట్టె బల్ల, ధూప వేదిక ఉండగా అతి పరిశుద్ధ స్థలములో సాక్ష్యపు మందసము మరియు కరుణాపీఠము ఉంచబడియున్నవి.

పరిశుద్ధ, అతి పరిశుద్ధ స్థలమును కలిగియున్న ప్రత్యక్ష గుడారము అన్నివైపులా 70సెం.మీ వెడల్పు. 4.5మీ ఎత్తుగల తుమ్మకర్రతో చేయబడిన పలకతో ఆవరించబడియుండెను. మరియు ప్రత్యక్ష గుడారపు ద్వారము నొద్ద తుమ్మకర్రతో చేయబడిన బంగారు రేకు పొదిగిన ఐదు దిమ్మెలు ఉంచబడ్డాయి. బాహ్య ఆవరణము నుండి ప్రత్యక్ష గుడారములోనికి దారితీయు ఆ ద్వారము నీలి, ధూమ్ర, రక్తవర్ణ పేనిన నారతో చేయబడిన తెరను కలిగి యుంటుంది.

ప్రత్యక్ష గుడారపు ఆవరణలో ఒక్కొక్కటి 2.25మీ పొడవు గల అరవై స్తంభములు నిలువబడినవి. తూర్పుననున్న ఆవరణ ద్వారము నీలి ధూమ్ర రక్త వర్ణపు పేనిన సన్నపు నారతో చేయబడెను మరియు ఈ ఆవరణ బాహ్యద్వారములో నుండి ప్రవేశిస్తేనే ప్రత్యక్ష గుడారపు ఆవరణలో ప్రవేశించగలము.ఈ ప్రత్యక్ష గుడారపు ఆవరణలో దహనబలిపీఠము మరియు గంగాళము ఉన్నవి.

ఈ రెండింటిని దాటినప్పుడే ఒకడు ప్రత్యక్ష గుడారపు ద్వారము నొద్దకు వచ్చును. ఆ ద్వారము 4.5మీ ఎత్తు గలది. ప్రత్యక్ష గుడారపు ద్వారము ఐదు స్తంభములను కలిగి దాని దిమ్మలు ఇత్తడితో చేయబడి యుండెను. ప్రత్యక్ష గుడారపు ఆవరణ ద్వారము వలెనే ప్రత్యక్ష గుడారపు ద్వారము కూడా నీలి ధూమ్ర రక్తవర్ణ పేనిన సన్నపునారతో చేయబడి ఐదు స్తంభములపై నుంచబడిన బంగారు కొలుకుల నుండి వ్రేలాడదీయబడినవి. ఈ తెర ప్రత్యక్షగుడారపు బాహ్య మరియు అంతర స్థలమును వేరుపరచుచున్నది.

మొదటిగా మనము ప్రత్యక్ష గుడారపు ద్వారము యొక్క స్థంభములను తప్పక పరిగణించాలి.

ప్రత్యక్ష గుడారపు ద్వారము యొక్క ఐదు స్తంభములు ఒక్కొటి 4.5మీ ఎత్తు వుంటుంది. ఈ స్థంభముపై నీలి, ధూమ్ర, రక్తవర్ణముల ఫై గల దారములతో పేనిన సన్నపునార తెర ఉంచబడెను.

మొదటిగా 4.5మీ ఎత్తున్న ప్రత్యక్ష గుడారపు ద్వారము యొక్క స్తంభములపై దృష్టి సారించాలి. దీని అర్థమేమిటి? మన పాపములను తుడిచి వేసి మనలను తన పిల్లలుగా చేసికొనుటకు దేవుడు తానే అధిక మూల్యము గల బలిని చెల్లించెనని దీని భావము. నీ నా మూలాలు బలహీనమైనవి మరియు చాలినవి కావు. కనుక అనేక అపరాధములను చేయుచున్న ఈ లోకములో మనం జీవిస్తున్నాము. ఎందుకనగా నీవు నేను ఈ లోకములో ప్రతి క్షణం పాపం చేయుచు న్నటివంటి అసహ్యకరమైన పాపులము కనుక మనం అనేకమైన తప్పిదమును, అతిక్రమములను కలిగియున్నాము. అట్టి తప్పిదము నుండి అతిక్రమము నుండి మనలను తప్పించు క్రమములోను లోక పాపము నుండి మనలను విడిపించుటకు దేవుడు తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తును మన పాపమును జీతముగా బలిగా సమర్పించెను. దాని ద్వారా ఆయన మనలను లోక పాపము నుండి విడిపించెనని ప్రత్యక్ష గుడారపు ద్వారము యొక్క స్తంభములు మనకు చూపుచున్నవి.

ఈ లోకములో మనం చేసిన పాపములకు తప్పిదముల కొరకు దేవుని యెదుట యేసుక్రీస్తు తన స్వంత శరీరమును బలిగా అర్పించి అవసరమైన వాని కంటే అధికముగా మన పాపమునకు జీతమును చెల్లించెను. ఫలితంగా మనలను రక్షించెను. ఒక వ్యక్తి ప్రభుని పరిశుద్ధ వస్తువుల విషయమై ద్రోహము చేసి తెలియకయే పాపము చేసిన యెడల అప్పుడతడు అపరాధ పరిహారార్థ బలిగా ఒక పొట్టేలును తేవలెను. అతడు దానికి ఐదవ వంతు కలిపి దానిని యాజకునికి సమర్పించవలెను. (లేవీకాండము 5:15-16). దీని అర్థమేమనగా నిన్ను నన్ను మన పాపముల నుండి రక్షించి తరువాత చెల్లించవలసిన దాని కంటే అధికముగా మన పాప రుణమును యేసుక్రీస్తు తానే చెల్లించెను. మన పాపములను తుడిచిపెట్టి మన కొరకైన అపరాధ పరిహారార్థ బలిగా మన పాపము కొరకు తన్ను అప్పగించుకొనుటకే మన ప్రభువు భూమికి వచ్చెను.

దహన బలులు, పాప పరిహారార్థ బలులు, సమాధానార్థ బలులు, అను బైబిలు నందున్న బలులు. పాపము చేసినవారు తమ బలిపశువుపై చేతులుంచుట ద్వారా తమ పాపమును ఆ బలిపశువుపై మోపి పాపపుశుద్ధి చేసుకొనుటకై అర్పింపబడినవి. అట్టి అర్పణలో ఒకని అపరాధమును తుడిచివేయుటకై అర్పించు బలే అపరాధ బలి. ఒకడు నిర్లక్ష్యము వలన ఎవరికైనను హాని చేసిన యెడల బాధింపబడిన వానికి తిరిగి చెల్లించుటకు మరియు ఆ సంబంధమును కొనసాగించుకొనుటకు అపరాధ పరిహారార్థ బలి చెల్లించబడును. మరియు అపరాధ పాపపరిహారార్థ బలిలో మొత్తము మూలధనమును దానితో పాటు రుసుము చెల్లించవలసిన దానితో కలిపి 20శాతము కలిపి యుండును. అపరాధ పరిహారార్థ బలికి ఇదే మూలము. ఒకడు మరియొకనికి హాని చేసినప్పుడు అతని అపరాధమునకైన పరిహారమునకు ఈ అర్పణ నియమించబడెను. (లేవీ 5:14-6:7)

నీవు నేను ఇప్పటి వరకూ పాపరహితులమేనా? మన జీవిత కాలమంతా పాపము చేయుచూనే మనము జీవించుట లేదా? మనం ఆదాము సంతతి కనుక దాని నుండి తొలగిపోక దానినే చేయుచున్నాము. మనకు ఎన్ని బలహీనతలు ఉన్నాయో మనలో మనకే తెలియును. ఎన్నో పాపాలను చేస్తూ మన జీవితమును జీవించగలం. మనలో ఒకరికొకరము మరియు దేవునియెదుట ఎన్ని దుష్కార్యములు మనం చేశాము? మనం మన జీవితాలను గడుపుచూ దుష్కార్యమును గుర్తించుటకు ఎంతో ఆలస్యము చేసి తరచుగా వాటిని మనం మరచిపోవుచున్నాము. కానీ నీవు నేను తప్పించుకొనక ఒకరి యెడల ఒకరము మరియు దేవునికి వ్యతిరేకముగా మనం చేసిన అపరాధములను దేవుని యెదుట మనం కేవలము పాపులమని గుర్తించాలి.

ఇట్టి పాపము వారి పాపము నుండి విడిపించుటకు తమ అపరాధ పరిహారార్థ బలిగా దేవుడు యేసుక్రీస్తును పంపగోరెను. తన త్యాగ వెలను చెల్లించుట ద్వారా మన పాపభారమును కలిగినవాడై యేసుక్రీస్తు వలన దేవుడు మనక రక్షణ అనుగ్రహించెను. తండ్రియైన దేవుడు తన కుమారుని ఈ లోకమునకు పంపినప్పుడు ఆయన బాప్తిస్మము పొందినవాడై సిలువ వేయబడెను. ఇదంతయూ మనలను మన పాపము నుండి రక్షించి మనలను మన స్వంత ప్రజలనుగా చేసుకొనుటకే చేసినప్పుడు ఈ బలి యొక్క ప్రశస్థతతో మనలను ఎట్లు సరిపోల్చుకొంటాము? పాపులమైన మనలను మన పాపాలన్నిటి నుండి రక్షించుటకు, పాపపు మూల్యమును చెల్లించుటకు మన ప్రభువు బలియై మనలను ఈ లోకము నుండి రక్షించెను. ఇది అద్భుతమైన దేవుని కృప కాక మరేదైనా అవుతుందా? దేవుని ప్రేమ లోతు వెడల్పు, ఎత్తు ఎంత ? ప్రత్యక్ష గుడార ద్వారపు స్తంభముల ఎత్తు 4.5మీ అను సత్యము యేసుక్రీస్తు ద్వారా మనకనుగ్రహించబడిన దేవుని ప్రేమను గూర్చి తెలుపుచున్నది.

మనవంటి యోగ్యతలేని ప్రజలను పాపశిక్ష నుండి విడిపించుటకు మన ప్రభువు తన స్వంత బలిద్వారా మనలను రక్షించెను. ఈ సత్యమునకై ఆయనకు నా కృతజ్ఞతలు. మన పాపశిక్షగా నరకమునకు పాత్రులమై తప్పించుకొనలేని సమయంలో ప్రభువు తన స్వంత శరీరమును మన పాపము నుండి మనలను రక్షించుటకై ఇచ్చినప్పుడు ఆయనను స్తుతించకుండా ఉండుట మనకు సాధ్యమేనా? ఆయనకు మన కృతజ్ఞతలు. యోహాను ద్వారా బాప్తిస్మము పొంది మన పాపమును యేసు తన పరిశుద్ధ శరీరముపై మోపుకొని, సిలువ రక్తముతో మన పాప క్రయధనమును చెల్లించెను. దాని వలన మన పాపము నుండి శిక్ష నుండి మనలను రక్షించెను. కనుక ఈ సువార్తను నమ్మి మనమాయనకు కృతజ్ఞతగా ఉండాలి. ప్రత్యక్ష గుడార ద్వారపు స్తంభములోనున్న రక్షణ యొక్క దాగియున్న సత్యమిదే.

ప్రత్యక్ష గుడారపు ద్వారమునకున్న ఐదు స్తంభములలో ప్రతి స్తంభము 4.5మీ ఎత్తు ఉన్నది. 5 సంఖ్య బైబిలులో దేవుని కృపకు సాదృశ్యము. కనుక దేవుడు మనకిచ్చిన రక్షణ అను బహుమానమునకు సాదృశ్యముగా ఐదు స్తంభములు నిలుచున్నవి. మనలను ప్రేమించి తన రక్షణతో మనలను కప్పుట ద్వారా రక్షింపబడిన వారమైన మనము దేవునిలో వుంచు విశ్వాసము బైబిలులో బంగారమునకు సాదృశ్యము. మరో విధంగా దేవుడు తానే ఈ లోకమునకు వచ్చి బాప్తిస్మము పొందుట ద్వారా మన పాపమును తనపై మోపుకొని సిలువపై మరణించి మృతి నుండి తిరిగిలేచి మనలను నీతిమంతులుగా చేసెనని పూర్ణ హృదయముతో విశ్వసించు విశ్వాసమును బంగారమని బైబిలు చెప్పెను. ఇందువలననే పరిశుద్ధ స్థలములలో నున్న స్తంభములు పూర్తిగా బంగారముతో కప్పబడినవి.

ప్రత్యక్ష గుడారపు ద్వార స్తంభముల దిమ్మలు ఇత్తడితో చేయబడుట ఘోరముగా శిక్షనొందిన ప్రభువు తప్పించుకొనలేక నరకపాత్రులమైన మనలను తన బాప్తిస్మము మరియు సిలువపై మరణము ద్వారా మనలను రక్షించుటను చూపించుచున్నది. మనము అపరాధముతో నిండినవారము కనుక అయోగ్యులమైన మనము నిజానికి తప్పించుకొనక మరణపాత్రులమైననూ, మనలను తన స్వంత ప్రజలుగా చేయుటకు పూర్ణమైన పరిశుద్ధ దేవుడు తనను బలిగా చేసుకొనెను. ఫలితంగా అయోగ్యులమైన మనలను తండ్రియైన దేవుని పిల్లలనుగా చేసెను. ఇందుమూలమునే ఇట్టి సత్యమును నమ్ము విశ్వాసమునకు సాదృశ్యము బంగారమైయున్నది. ఈ విధంగా ప్రత్యక్ష గుడార ద్వారపు రంగులను మనం అర్థం చేసుకోవాలి దానిపై మనం ధ్యానించాలి. కృతజ్ఞత చెల్లించాలి. మన హృదయలోతులలో దానిని నమ్మాలి.ప్రత్యక్ష గుడారపు స్తంభముల యొక్క ఇత్తడి దిమ్మలు


ప్రత్యక్ష గుడారములో దాని ద్వారము యొక్క స్తంభముల దిమ్మలు మాత్రమే ఇత్తడితో చేయబడినవి. అనగా ఈ భూమిపైన ఒకరికి వ్యతిరేకంగా ఒకరము. మరియు దేవునికి వ్యతిరేకంగా మనము అనేక పాపములను చేశాం. కనుక మనం ఈ పాపములను బట్టి శిక్షింపబడకుండా తప్పించుకొనలేము. ఈ ఇత్తడి దిమ్మెలలో దాగియున్న సత్యము దహన బలిపీఠమును గూర్చి ఆలోచింపచేయుచున్నది. ప్రత్యక్ష గుడారపు ఆవరణలోనికి ప్రవేశ ద్వారములోనికి రాగానే పాపులకు ఎదురయ్యేది. మొదటిగా దహన బలిపీఠము.

ఇక్కడ ‘బలిపీఠము’అను మాటకు ‘దిగివచ్చుచున్న’అని అర్థము. దహన సిలువ త్యాగము చేసెను అనునదియు, దహన బలిపీఠము అను స్థలము చేతులుంచుట ద్వారా పాప ప్రతిక్షేపణ చేయబడిన బలి పశువు ఆ పాపిపక్షముగా చంపబడును. యాజకులు ఈ ఇసుక నేలలో పోస్తారు. దాని మాంసమును బలి పీఠముపై నుంచి కాల్చుతారు. పాప ప్రతిక్షేపణ చేయబడిన పశువు చంపబడు స్థలము.

దహనబలిపీఠము ప్రత్యక్ష గుడార ప్రాంగణమునకు ప్రత్యక్ష గుడారమునకు మధ్య నుంచబడెను. అలాగుననే ప్రత్యక్ష గుడారములో ప్రవేశింప గోరిన వారు మొదటిగా ఈ దహన బలిపీఠము గుండా వెళ్ళాలి. దాని ద్వారా పోకుండిన యేసుక్రీస్తు బాప్తిస్మము మరియు సిలువ అని చెప్పకయే చెప్పుచున్నది. మన ప్రభువు యొక్క బాప్తిస్మము మరియు సిలువ దేవుని యెదుటకు పాపులందరి దోషమును తుడుచును. 

అటువలే తమ పాపములను మోసుకొని వచ్చి దహనపీఠము వద్ద ఆగకుండా, బలిపశువు తమ చేతులను ఉంచుట ద్వారా తమ పాపములను మోసి ఆ స్థలంలో బలిరక్తమును చిందించుట ద్వారా తమ పాపములను గుర్తించకుండా దేవుని యెదుటకు ఏ పాపి రాలేడు. దేవుని యెదుటకు వెళ్ళుటకు మార్గమైన మనలను మన పాపపరిహారము అను దీవెన యొద్దకు నడిపించును. మన పాపశిక్ష భరియించును (అనగా పాపము కొరకు చనిపోవుట).

తమ పాప పరిహారంగా ఇశ్రాయేలీయులు బలిని తెచ్చునప్పుడు మొదటగా వారు బలిపశువు పై తమ చేతులను ఉంచి, దాని ద్వారా తమ పాపములను ఆ పశువుపై మోపుతారు. దానిని చంపి, బలి రక్తమును సేకరించి దహన బలిపీఠ కొమ్ములపై ఈ రక్తమును ప్రోక్షిస్తారు. మిగిలిన రక్తమునంతా ఆ దహన బలిపీఠం క్రింద పోస్తారు. దహన బలిపశువు తమ పాపములను మోసి తమ స్థానంలో అది చనిపోయెనని తమ హృదయంలో విశ్వసించుట ద్వారా పాప పరిహారము పొందుతారు. ఇదంతయూ రక్షణ నియమము ప్రకారమే దహన బలిపీఠ కొమ్మలు ఆత్మీయంగా తీర్పు గ్రంథమందు వ్రాయబడిన పాపమును గూర్చి మనకు బోధించుచున్నది. 

పాత నిబంధనా కాలంలో బలి పశువు తలపై తమ చేతులుంచుట ద్వారా తమ పాపమును దానిపై మోపబడిన తరువాత ఈ బలిపశువు తన రక్తమును చిందించి, దహన బలిపీఠమును అప్పగింపబడును. సత్యమును నమ్ముట ద్వారా పాపపరిహారం పొందేవారు. బలిపశువు తలపై చేతులుంచి, దానిని వధించి దహన బలిపీఠముపై సాధ్యపడని యెడల దేవుని యెదుటకు వెళ్ళుటకైన మార్గము పూర్తిగా మూసివేయబడి ఉండును. ఇక ఎప్పుడూ వారు పరిశుద్ధ దేవుని యొద్దకు వెళ్ళలేకపోయేవారు. క్లుప్తంగా దేవుని యెదుట మనలను నిలువ బెట్టగలిగిన సత్యము బలివ్యవస్థ కాక మరొకటి లేదు.

ఈ విధంగానే యేసుక్రీస్తు బాప్తిస్మము ఆయన మరణము మరియు ఆయన పాపనివృత్తికై త్యాగమును మనం విశ్వసించకుండా మన పాపపరిహారమునకు దేవుని ఎదుర్కొనుటకు ఏ మార్గము లేదు. ఇశ్రాయేలీయులు ఎంతో అందమైన పరిపూర్ణమైన ముద్దగా నున్నట్టి ఏ కళంకము లేని గొర్రె పిల్లను తమ యాజకుని యొద్దకు తెచ్చి తమ చేతులను దాని తలపై నుంచి వారి పాపములను ఆ గొర్రె పిల్లపై మోపబడకుండా దాని రక్తము చిందింపబడక ఉండిన యెడల అది ఏదైననూ ప్రయోజనము కలుగదు.

యోహాను ద్వారా యేసు పొందిన బాప్తిస్మమును సిలువపై ఆయన చిందించిన ప్రశస్త రక్తము మన పాపములన్నిటిని పరిహరించెనని నమ్మని విశ్వాసం ఉన్నప్పుడు పాప ప్రాయశ్చిత్తం పొందామని ఖచ్చితంగా చెప్పలేము. యేసు పొందిన బాప్తిస్మం, సిలువపై ఆయన మరణం అనునవి తండ్రియైన దేవునికి పాపులకు మధ్య స్పష్టముగా నిలుచును. కనుక పాపులను తమ దోషము నుండి రక్షించుటకై బతిమాలుకొను అంశములైనవి.

దహన బలిపీఠము పదమందున్న సర్వశక్తుడగు దేవుడు తానే ఏర్పాటు చేసి యేసుక్రీస్తు నందు నెరవేర్చిన రక్షణ ప్రణాళికను కలిగి వున్నది. మోషే రక్షణ విధానమును బట్టియు సీనాయి కొండపై దేవుడు అతనికి చూపించిన ప్రకారముగా ప్రత్యక్ష గుడారమును నిర్మించెను. బైబిలులో మనం చూచినట్లయితే ఈ సూచన తరచుగా చెప్పబడెను. నిర్గమ 25:40లో చెప్పిన ప్రకారము ‘‘కొండమీద నీకు కనుపరచబడిన వాటి రూపము చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్త పడుము.’’

ప్రజలు సిలువను చేసి, దానిపై యేసును వ్రేలాడ దీయవచ్చు కానీ దాని కంటే ఎక్కువగా వారేమీ చేయలేదు. వారు ఆయనను కట్టి, కల్వరి వరకూ తమ చేతులతో ఈడ్వగలరు. దేవుని సముఖంలో తాము చేయునది యెరుగని వారై ఆయనను సిలువ వేశారు. పాపులు దీనియందు ప్రవేశిస్తారు. ఎందుకనగా దేవుడు ముందే ఏర్పరచిన ప్రణాళిక చొప్పున ఇవన్నీ నెరవేర్చబడవలసి ఉన్నవి. అయిననూ, బాప్తిస్మమిచ్చు యోహాను ద్వారా బాప్తిస్మం పొంది లోక పాపములను తనపై మోపుకొని వాటన్నిటిని ఒకేసారిగా కడిగి వేసి ఆయన తన రక్తమును సిలువపై చిందించుట ద్వారానూ, తన బాప్తిస్మము మరియు సిలువపై రక్తము కార్చుట ద్వారాను యేసు పాపులను రక్షించెను.

అలాగే సిలువపై ప్రభువైన యేసు మరణించకు ముందు యోహాను నుండి ఆయన పొందిన బాప్తిస్మము అత్యంత ప్రాముఖ్యమైనది. మన రక్షణకు ఖచ్చితంగా అవశ్యకమైనది. ఆయన పాపమును భరించి వాటి శిక్షననుభవించుట సృష్టికి పూర్వమే దేవునిచే నిశ్చయించబడినది. యోహాను సువార్త 3లో ఇది నీరు మరియు ఆత్మమూలమైన సువార్త అని యేసు నికోదేముతో చెప్పెను. కాబట్టి యేసు బాప్తిస్మము సిలువ అనునది దైవ సంకల్పము చొప్పున దేవుని ప్రణాళికై ముందుగానే యేసుక్రీస్తు నందు నిశ్చయించబడెను.

యేసు తానే చెప్పెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. (యోహాను 3:16) మరియు యేసు బాప్తిస్మంను గూర్చి పేతురు ఇట్లు చెప్పెను. ‘‘దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది” (1పేతురు 3:21) అపోస్తులుల కార్యములో కూడా ఇట్లు వ్రాయబడెను. ‘‘దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యద్‌ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన యీయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి.’’ (అ.కా.2:23)

యేసు పొందిన బాప్తిస్మము మరియు ఆయన సిలువలో కార్చిన రక్తము సర్వాధికారియైన దేవుని ప్రణాళికను మరియు ఉద్దేశ్యములను అన్నిటిని నెరవేర్చెను. అలాగుననే ఈ సత్యమును తమ హృదయములలో అంగీకరించకుండా ఎవరునూ ఆయన రాజ్యములో ప్రవేశించలేరు. మరియు ఈ సత్యమును విశ్వసించుట ద్వారా, దేవుడు మన విశ్వాసాన్ని కోరుచున్నాడని మనం గుర్తించగలము. మరియు మనము దానిని కలిగి ఉండాలి. నీరు మరియు ఆత్మ మూలమైన సువార్తను నమ్మని విశ్వాసము లేకుండా, ఎవరునూ రక్షింపబడరు.మరియు యేసు నిర్ణయించకుండా తనకు తానుగా స్వేచ్ఛగానే యోహానుచే బాప్తిస్మం పొంది తానే పాపులకు అప్పగింపబడునట్లు సిలువలో రక్తము కార్చుటకు ఆయన నిర్ణయము లేకుండా పాపులెవ్వరూ ఆయనను సిలువ వేయలేరు. ఇతరులచే కలువరి వరకూ ఈడ్చబడుటకు యేసు బలవంతం చేయబడలేదు. కానీ అది పూర్తిగా ఆయన చిత్తములోనిదై బాప్తిస్మం వలన లోకపాపములు భరించెను. సిలువలో తన రక్తమును కార్చెను. తద్వారా పాపులను తమ పాపము నుండి రక్షించెను.

యెషయా 53:7లో ఇట్లు చెప్పబడుతుంది. అతడు దౌర్జన్యము నొందెను. బాధింపబడిన అతడు నోరు తెరవలేదు. వధకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు వాని యెదుట గొఱ్ఱెయు మౌనముగా నుండునట్లు అతడు నోరు తెరువలేదు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు బాప్తిస్మమును సిలువపై అతని మరణమును పూర్తిగా అతని స్వాధీనమందు లేదు. వాటి ద్వారా ఆయన ఒకేసారి తన బాప్తిస్మమును సిలువ రక్తమును విశ్వసించువారిని తమ పాపములన్నిటి నుండి రక్షించును. ప్రభువు యొక్క ఈ క్రియలను గూర్చి హెబ్రీ గ్రంథకర్త కూడా ఈలాగున వ్రాయుచున్నాడు. అయితే ఆయన యుగముల సమాప్తియందు తన్ను తానే బలిగా అర్పించుకొనుట వలన పాపనివారణ చేయుటకై యొక్కసారే ప్రత్యక్షపరచబడెను. (హెబ్రీ 9:26)

యేసుక్రీస్తు బాప్తిస్మమును సిలువపై ఆయన మరణము యొక్క నీడను చూపించు దహన బలిపీఠములో పరలోకరక్షణ యొక్క ఆత్మీయ బహుమానమునకు మనము సాక్షులము. దహనబలి పీఠముపై బలిపశువు మరణము ప్రతి పాపము కొరకై అవసరమైన యేసుక్రీస్తు బాప్తిస్మమును ఆయన మరణమునకు మాత్రమే సారూప్యము కలిగియున్నది. పాతనిబంధనలో పాపులు తమ పాప ప్రాయశ్చిత్తము కొరకు బలిపశువుపై తమ చేతులను ఉంచుట ద్వారా పాపములను దానిపై మోపి తమ స్థానంలో దానిని వధించేవారు. అదే విధముగా నూతన నిబంధనలో కఠినుల చేతిలో కలువరిలో దేవుని కుమారుడు చంపబడక మునుపు ఆయన యోహానుచే బాప్తిస్మము పొంది లోకపాపములను తనపై మోపుకొనెను. ఆ కారణముగానే యేసు సిలువ వేయబడి, తన రక్తమునంతా కార్చి చనిపోయెను. 

అటువలె దేవుడు తన సంకల్పము చొప్పున యేసు చేతులుంచబడి సిలువ మరణము పొందుటను వాటిని ప్రణాళిక పరచి తన కుమారునే చంపిన హంతకులకు శాంతి నిచ్చుటకు చేసెను. చేతులుంచబడి చంపబడుట ద్వారా రక్షణ సూత్రమును వ్యూహపరచి ఆ సూత్రమును బట్టి ఆయనను బలినిచ్చుట ద్వారా ఇశ్రాయేలీయులకు పాప పరిహారము పొందననుగ్రహించెను. 

అనగా పాపులను రక్షించుటకు దేవుడు తానే సంపూర్తిగా సమాధానార్థ బలియాయెను. దేవునిదైన ఈ రక్షణ ఎంత అనిర్వచనీయము. ఎంత జ్ఞానవంతమైనది. ఎంత నీతిగలది! ఆయన జ్ఞానము మరియు సత్యము ఎంత అద్భుతము కేవలము మనము కనుగొనలేనంత లోతైనది దహన బలి పేరున పైన చూపబడిన విధంగాను చేతులుంచుట, రక్తము కార్చుట ద్వారా కలుగు రక్షణ యొక్క ఆయన అనుగ్రహమును ఎవరు ధైర్యము చేయగలరు? పౌలు చెప్పినట్లు మనము చేయగలిగినదంతయు అద్భుతము ఆహా దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము. ఆయన తీర్పు శోధింప ఎంతో ఆవశ్యము ఆయన మార్గము ఎంతో ఆగమ్యము (రోమా 11:33) నీరు మరియు ఆత్మ మూలమైన సువార్త ఒక్కటి నీతియుక్తమైన సువార్త దీనితోనే దేవుడు పౌలును పరిపూర్ణముగా రక్షించినది.దహన బలిపీఠము యొక్క కొమ్ములు


ప్రత్యక్షపు గుడారములో ఉంచబడిన దహన బలిపీఠము యొక్క నాలుగు మూలల ఇత్తడి కొమ్మలు అతుకబడినవి ఈ బైబిల్‌ నందు ఈ కొమ్మలు పాపమునకు తీర్పు తీర్చునవిగా చూపబడినవి. యిర్మియా 17:1 ప్రకటన 20:11-15 ఇది ఏమి చూపుచున్నదంటే సిలువ సువార్త యేసుపొందిన బాప్తిస్మముపై ఆధారపడినది. కాబట్టి అపోస్తలుడు అయిన పౌలు సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తియైయున్నది. (రోమా 1:16) మరియు 1 కొరింథి 1:18 సిలువను గూర్చిన వార్త నశించుచున్నవారికి వెర్రితనముగాను రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి దహన బలిపీఠము యొక్క ఆ కొమ్ములు స్పష్టముగా ప్రకటించునది ఏమనగా ఆయన బాప్తిస్మము, ఆయన సిలువ మరణము మరియు ఆయన పునరుత్ధానం ద్వారా దేవుని న్యాయ తీర్ప మరియు రక్షణ నెరవేర్చబడెను.దహన బలిపీఠము యొక్క ఉంగరములో నుంచబడిన ఆ రెండు కర్రలు


అరణ్యములో నిర్మించబడిన ప్రత్యక్ష గుడారపు ఉపకరణములన్నియూ మోసుకొని పోబడుటకు అనువైనవి. సంచార జీవనము చేయు ప్రజలైన ఇశ్రాయేలీయులకు ఈ విధానము సరియైనది. కనాను దేశమందు వారు స్థిరపడు వరకూ అరణ్యమందు వారు సంచారము చేయవలసినదే. వారు అరణ్యము గుండా పోవుచూ తమ యాత్రా జీవితమును కొనసాగించుచుండగా దహన బలిపీఠపు ఉంగరములో దూర్చుటకై రెండు మోత కర్రలను చేయునట్లుగా దేవుడు చేసెను. కనుక సాగిపోవుడని దేవుడు ఇశ్రాయేలీయులకు చెప్పినప్పుడు యాజకులు ఆ బలిపీఠమును మోసికొనిపోవుదురు.

నిర్గమ 27:6-7 చెప్పినట్లు మరియు బలిపీఠము కొరకు మోతకర్రలను చేయవలెను. ఆ మోత కర్రలను తుమ్మకర్రతో చేసి వాటికి ఇత్తడి రేకు పొదిగింపవలెను. ఆ మోత కర్రలను ఉంగరములో చొనపవలెను. బలిపీఠమును మోయుటకు ఆ మోత కర్రలు రెండు ప్రక్కలు ఉంచవలెను. దహన బలిపీఠమునకు రెండు ప్రక్కలనున్న నాలుగు ఇత్తడి ఉంగరముల గుండా చొప్పించిన మోతకర్రుండగా, లేవీయులు తమ భుజముపై వాటిని మోయుచూ ఇశ్రాయేలీయులు ప్రయాణము చేయుచుండగా వారు దానిని మోసికొనిపోవుదురు. దహన బలిపీఠము, యేసుక్రీస్తుని బాప్తిస్మమును ఆయన సిలువను చూపుచున్నది. అలాగే లేవీయులు దహనబలిపీఠమును, దాని రెండు మోతకర్రల సహాయముతో అరణ్యములో మోసినట్లుగానే ఆయన బాప్తిస్మము మరియు సిలువను గూర్చిన సువార్త ఈ లోకమను అరణ్యమంతటిలోనూ ఆయన సేవకుల ద్వారా ప్రకటింపబడెను.

మనము మొదటిగా పరిశీలించవలసిన మరొక అంశమేదనగా ఆ రెండు మోత కర్రలు బలిపీఠమును మోయునట్లు ఇశ్రాయేలీయులకు ఉపయోగపడెనను సత్యము ఈ విధంగానే నీరు మరియు ఆత్మమూలమైన సువార్త కూడా రెండు భాగములు కలదిగా నున్నది. ఒకటి యేసు యోహాను నుండి పొందిన బాప్తిస్మం కాగా, రెండవది యేసుక్రీస్తు సిలువ వేయబడక ముందు పొందిన శిక్ష ఈ రెండు కలిసినప్పుడు పాప క్షమాపణ యొక్క రక్షణ పూర్తగును. బలిపీఠము రెండు మోతకర్రలు కలది. వేరుగా యోచిస్తే దానికి కాడలున్నవి ఒక మోత కర్ర సరిపోదు. మోయుచున్నప్పుడు బలిపీఠము ఒక కర్రతో సరితూగదు.

ఈ విధముగానే నీరు మరియు ఆత్మమూలమైన సువార్తకు కూడా రెండు భాగములు కలవు. అవి : యోహాను నుండి యేసు పొందినబాప్తిస్మము సిలువలో ఆయన రెండు రకములైన నీతియైన సత్యములై యున్నవి. యేసు యొక్క బాప్తిస్మము మరియు రక్తము పాపులకు పాపపరిహారమును చెల్లించెను. ఈ రెండింటిలో (యేసుని బాప్తిస్మము మరియు ఆయన సిలువ మరణము) ఏ ఒక్కటి నిర్లక్ష్య పరచినా, మరొక దానిని కూడా నిర్లక్ష్యపరచినట్లే యేసుని బాప్తిస్మము మరియు సిలువ మరణము లేకుండా రక్షణ కలుగదు.

ఆయన పునరుత్థానము కూడా సమాన ప్రాముఖ్యము కలిగినది. క్రీస్తుని పునరుత్థానము లేకుండా ఏ ఫలితము లేనిదై ఆయన మరణము నిష్పలమగును. ఒకవేళ మనం చనిపోయిన క్రీస్తునే నమ్మినట్లయిన ఆయన ఏ ఒక్కరినీ తనను తాను కూడా రక్షించలేరు. కానీ యేసు బాప్తిస్మమును పొందినవారై సిలువపై రక్తము చిందించి మరణమాయెను. మరలా జీవించుటకు మృతి నుండి తిరిగిలేచి నీరు మరియు ఆత్మ మూలమైన సువార్తను విశ్వసించి దేవుని యెదుటకు వచ్చువారికి నిజరక్షకుడాయెను. మరియు ఆయన వారికి శాశ్వతమైన రక్షణ ఇచ్చే సంరక్షకుడాయెను.

క్రీస్తుని పునరుత్థానము లేకుండా కేవలం ఆయన మరణమును మాత్రమే వ్యాప్తి చేయట విరుద్ధమైనది, మోసపూరితమైనది. క్రీస్తుని పునరుత్థానము లేకుండా ఆయన సిలువ కేవలం దేవుని ఓటమి అవుతుంది. అది యేసుని గుర్తింపలేని నేరస్థునిగా చేయును. అది మాత్రమే కాదు గానీ అది దేవుని ఒక అబద్ధికునిగా చేసి బైబిలును అపహాస్యము చేసియుండును. యోహానుచే యేసు బాప్తిస్మము పొందినట్లే. ఆయన సిలువలో మరణించి మృతి నుండి తిరిగి లేచెను మరియు తద్వారా ఆయనకు విశ్వసించు వారికి ఆయన నిజరక్షకుడాయెను.

ఈ దినాలలోని క్రైస్తవులు అనేకులు అనుసరించునట్లు సువార్త నుండి యేసుని బాప్తిస్మమును వదలినట్లు ఆ సువార్త దేవుని తృణీకరించి ప్రజలను మోసగించి వారి ఆత్మలను నరకమునకు నడుపుదురు. అట్టి సువార్తను విశ్వసించుట నిత్య సత్య దేవుని వాక్యమును నిర్లక్ష్యపరచి తృణీకరించుటయే క్రీస్తుని సిలువను మాత్రమే బోధించు అబద్ధ బోధకులు క్రైస్తవ్యమును కేవలము ప్రపంచంలోనున్న ఇతర మతములవలే మార్చుచున్నారు. ఇందువలననే వారు అనుసరించుచున్న ఆ సువార్త సత్యసువార్తయైన నీరు మరియు ఆత్మ మూలమైన సువార్తకు భిన్నమైనది.

క్రైస్తవ్యము ఒక్కటి మాత్రమే ఒకే దేవుడైన జీవించు క్రీస్తును విశ్వసించును. ఏదేమైనా ఈ లోక మిగిలిన మతములకన్నా క్రైస్తవ్యము ఘనమైనట్టు కనబడిననూ, తనకు తానుగానే నిజ సత్యమని చెప్పుకొనిననూ నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను విడిచి ఒక విషయమును నమ్ముటను మాత్రమే విశదపరచిన అది సత్యము మరియు ప్రేమ యొక్క విశ్వాసము కాక దురహంకారముగల మతమగును.దహన బలిపీఠము ఉన్న ప్రదేశము : 


ఇక్కడ మనము మరొకసారి ప్రత్యక్ష గుడారము ఆవరణలో దహన బలిపీఠము ఉంచబడిన స్థలమును ధ్యానించెదము. ప్రత్యక్ష గుడార ఉపకరణములన్నిటిలో దహన బలిపీఠమే పెద్దది. ప్రత్యక్ష గుడారపు ఉపకరణాలన్నిటిలో అది మొదటిది. పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళగోరిన యాజకుల వరుసలో దాని యొద్దకు వచ్చెదరు. దహన బలిపీఠము దేవుని యందు విశ్వాసముంచుటలో మొదటి మెట్టు. మరియు ఆయనను సమీపించుటకై ఉన్న ఆయన సూత్రము ప్రజలు అనుసరించవలసియున్నది. మరో మాటలో ప్రజలు తమ పాప సమస్యను పరిష్కరించుకొనుటకు అవిశ్వాసులు కాక, విశ్వాసులై యేసు యోహాను నుండి పొందిన బాప్తిస్మమును నమ్ముట. మరియు సిలువ ఎవరినీ సజీవుడైన దేవునియెదుట నిలువబెట్టదని అవిశ్వాసులుగా ఉండకూడదను సత్యమును బలిపీఠము బయలుపరచుచున్నది.

దేవుని కుమారుని బాప్తిస్మము మరియు మరణమును నమ్ముట ద్వారా మనము మన పాపముల నుండి రక్షింపబడితిమి కానీ అవిశ్వాసము వలన కాదు. దేవుని కుమారుని బాప్తిస్మమును ఆయన కార్చిన రక్తమును విశ్వసించి మాత్రమే మనము మన పాపము నుండి రక్షింపబడి నూతన జీవమును పొందితిమి. ఈ నీరు మరియు ఆత్మమూలమైన సువార్తయే ప్రాముఖ్యమైనది మూలమైనది. మరియు అత్యంత ఖచ్చితమైనది కనుక దానిని మన హృదయములో ఆరాధించుట మనం కొనసాగించవలెను. మనము ఈ సువార్తను గుర్తించి, దానిని నమ్మాలి. మనమందరమూ నరకమునకు పాత్రులమని మన హృదయంలో నమ్మాలి. ఈ విశ్వాసంతో పాటుగా, ప్రభువు మన పాపములను బాప్తిస్మము ద్వారా తనపై మోపుకొని, మనము శిక్షింపబడుట కంటే ముందుగానే సిలువపై తన రక్తమును చిందించెననియు నమ్మాలి.

దహన బలిపీఠముతో పాటుగా, ప్రత్యక్ష గుడారపు ద్వార కమ్మెల దిమ్మెలు కూడా ఇత్తడితో చేయబడుట ఇట్లు బోధించును. ఎట్లనగా మన బహీనతలను బట్టి మనము నరకములోనికి త్రోయబడుటకు తగినవారము. దేవుని తీర్పును ప్రకటించినట్లు ‘‘పాపమునకు జీతము మరణం’’ మనమందరమూ మన పాపమును బట్టి నరక పాత్రులము.

అయిననూ మనవంటి అధములను రక్షించుటకై మన పాపముకైన తీర్పును బట్టి నిజముగా నరకమునకు పాత్రులమైన మనకొరకు మన ప్రభువు నరవతారియై ఈ లోకమునకు వచ్చెను. బాప్తిస్మం పొందుట వలన మానవుల పాపమును తన స్వంత శరీరంపై మోపుకొని లోక పాపమును సిలువ వరకు మోసి తన రక్తమును కార్చుట ద్వారా శిక్షింపబడెను. మరియు నిన్ను నన్ను మన పాపము నుండి శిక్ష నుండి పరిపూర్ణముగా రక్షించెను. ఈ సత్యమును విశ్వసించువారు మాత్రమే దేవుని సంఘములో చేరి, ఆయన ప్రజలైయుండెదరు. ప్రత్యక్ష గుడారపు స్తంభము, తెరలు,మనకు చెప్పునదేమనగా ఈ విశ్వాసము కలిగిన వారు మాత్రమే దేవుని ప్రజలై ఆయన రాజ్యములో ప్రవేశిస్తారు.ప్రత్యక్ష గుడారపు ద్వారపు తెర యొక్క నాలుగు వర్ణములలో బయలుపరచబడిన సత్యమును మనమందరమూ విశ్వసించాలి.


నీలి, ధూమ్ర, రక్తవర్ణపు దారము మరియు తెలుపు వర్ణపు పేనిన సన్నని దారమును పరిచర్య ద్వారా ఆయన ఈ లోకమునకు వచ్చిన ప్రభువు మనలను రక్షించెనని నీవు నమ్ముచున్నావా? ధూమ్రవర్ణము (లేక) రక్తవర్ణము అనగా యేసుతానే దేవుడని నీలివర్ణముగా దేవుడైన యేసు తానే మానవుడై, ఈ లోకములో బాప్తిస్మం తీసుకొని మన పాపములను తానే వహించుకొనెననియు, రక్తవర్ణమనగా మన పాపమును వహించిన యేసుక్రీస్తు. తన పరిశుద్ధ శరీరమును సిలువ యాగముగా అర్పించెను. మనకు సూక్ష్మమైన ప్రాముఖ్యతగదానిగా బాప్తిస్మం పొంది సిలువ వేయబడిన యేసు మృతి నుండి తిరిగి లేచి నిన్ను నన్ను సంపూర్ణముగా రక్షించెను.

ఈ సత్యమును నిజముగా నమ్మువారే దేవుని సంఘ పరిచారకులు అగుదురు. ప్రత్యక్ష గుడారపు ద్వారము యొక్క స్తంభము పరిచారకులను సూచించుచున్నది. అవి మనకు బయలుపరచునదేమనగా ఈ విధముగా విశ్వసించు వారే దేవుని ప్రజలు అట్టి ప్రజలే ఆయనకు స్తంభముగాను పరిచారకులుగాను దేవునిచే వాడబడెదరు.

తెల్లని పేనిన సన్నపు నార అనగా తమ హృదయములో ఏ పాపమును లేనివారే నీలి ధూమ్ర రక్తవర్ణదారము యొక్క సత్యమును నమ్మి తమ పాపముకు పరిహారము పొందినవారే నీతిమంతులు మన ప్రభువు ఈ లోకమునకు వచ్చి ఆయన యోహాను నుండి పొందిన బాప్తిస్మము మరియు సిలువలో కార్చిన రక్తము ద్వారా పాపులందరినీ రక్షించెను. ఆ ప్రభువు తన స్వంత ప్రశస్త జీవమును అర్పించి మనలను రక్షించినందున నీరు మరియు ఆత్మ మూలముగా వచ్చిన వానియందు విశ్వాసముంచెదము. (1యోహాను 5:6)

ధూమ్ర వర్ణ ధారము ‘‘యేసు రాజులకు రాజు అను సత్యమును బయలుపరచుచున్నది. అనగా బలహీనులమై దౌర్బల్యముతో నిండిన మనలను తన ప్రశస్త ప్రాణమును అర్పించి మన ప్రభువు రక్షించెను. మరియు అందువలన ఆయన మనలను దేవుని ప్రజలుగా చేసెను. ఇప్పుడు మన హృదయంలో ఈ సత్యమును నమ్మిన తర్వాత ఆయన సంపూర్ణ రక్షణను విశ్వసించి పాపరహితులమై మనము పరిశుద్ధులముగా ఉంటాము. అట్టి విశ్వాసము మనము పొందునట్లు ఇట్టి బహుమానమును మనకిచ్చిన దేవునికి మనమంతా కృతజ్ఞులము.

వాస్తవముగా, మనము ఈ సత్యమును విశ్వసించుటయే దేవుడిచ్చిన బహుమానము. పాపము నుండి మనము రక్షింపబడుట కూడా దేవుని వరమే. యోగ్యులైన వారికంటే అధికముగా తన ప్రశస్త ప్రాణం పెట్టి దేవుడు మనలను రక్షించలేదా? యేసు బాప్తిస్మం పొంది, సిలువలో చనిపోయి మృతి నుండి లేచుట ద్వారా మనకు రక్షణ అను వరమును ఇచ్చిన కారణముగా ఈ సువార్తను నమ్మువారు ఇప్పుడు ఈ రక్షణ వరమును పొందుకొని దేవుని స్వంత ప్రజలౌతారు. నీవు రక్షింపబడినవానిగా అది నీవు స్వంతంగా సాధించినది ఎంత మాత్రము కాదు. నీలి ధూమ్ర రక్తవర్ణదారము సాదృశ్యముగా వచ్చిన యేసుక్రీస్తును విశ్వసించుట తప్ప నీవు ఏదియు చేయనవసరం లేదు. ఈ రక్షణ దేవుడు మనకిచ్చిన వరము.

“మనము నిజముగా నరక పాత్రులమా, కాదా?’’ అని ఆలోచించుటతో యేసునందు విశ్వాసం ఆరంభమగును. ఎందుకు? మన స్వగతము నిజముగా పాప పూరితమని గుర్తించి ఒప్పుకొననప్పుడు యేసు మన పాపం కొరకు సమాధానార్థమైన బలిగా వచ్చెనని తప్పక ఒప్పుకొంటాము. మనకు బదులుగా తనను తాను అర్పించు కొనిన మన ప్రభువు అనుగ్రహించిన రక్షణ అనువరముతో మనము పాపము చేయుచున్ననూ రక్షింపబడుదుము.

యేసు నందు విశ్వాసముంచుట అనునది మొదటిగా ‘‘మనం నిజముగా పాతాళమునకు లోనగుదుమా? లేదా? అను ఆలోచనలతో ఆరంభమగును’’ పాపముతో కూడిన మన నిజ జీవితమును మనం గుర్తు చేస్తాము. మనము తప్పక యేసు మన పాపములకు సమానార్థగా బలిగా మారెనను సత్యమును అంగీకరిస్తాము. మనము ఇంకనూ పాపులముగా ఉండగానే రక్షింపబడుట అనునది రక్షణ అను బాహుమానమును మన ప్రభువు మన స్థానములో తనకు తాను త్యాగము చేసెను. కనుక సాధ్యపడుచున్నది. కేవలము ఆయనను విశ్వసించుట ద్వారా రక్షింపబడతామా? దాని వలన విశ్వాసము ద్వారా మనము ఆయన పిల్లలముగా మారతామా? నిజముగా అట్టి విశ్వాసము మనకు ఉన్నదా? రక్షణ దేవుని వరమే కానీ మన స్వంత ప్రయత్నము కాదని ఒప్పుకొనగలమా? దేవుడిచ్చిన బహుమానమైయున్న రక్షణను మనము నమ్మక పూర్వము మనమందరమూ నరక పాత్రులమని అంగీకరించుచున్నామా? ఈ విషయములన్నింటిలో మరొకసారి మనలను మనము పరీక్షించుకొనవలసియున్నది.ఆ ప్రత్యక్ష గుడారము యేసుని యొక్క వివరణాత్మక స్వరూపము :


ప్రత్యక్ష గుడారములో చూపబడిన సత్యము అబద్ధ ప్రవక్త నోళ్లను మూసివేయుచున్నది. ప్రత్యక్ష గుడార వాక్యమును తెరచి మనము వాటిని వారి యెదుట మాట్లాడుచున్నప్పుడు వారి మోసమంతయూ స్పష్టమగును.

ప్రత్యక్ష గుడార ద్వార స్తంభము పూర్తిగా బంగారుతో కప్పబడియున్నది. ఇది మనకు చూపించునది ఏమనగా ప్రత్యక్ష గుడారములో మనుష్యులను గూర్చిన ప్రస్థావన కూడా కనిపించలేదు అని ప్రత్యక్ష గుడారములోని ప్రతిభాగము బంగారముతో కప్పబడినది. దాని ద్వారా స్తంభము బంగారు పొదగబడినవి. స్తంభముపై భాగము కూడా బంగారుతో కప్పబడినది. అయినను స్తంభములు దిమ్మలు ఇత్తడితో చేయబడినవి. మన పాపమును బట్టి శాపమును బట్టి నీవు నేను నరక పాత్రులమని దీని అర్థము. ఇది వాస్తవం కాదా? వాస్తవ స్థితి ఇదికాదా? ప్రతిదినము నీవు చేయు శాపకరమైన పాపములనుబట్టి నీవు కూడా నరక పాత్రుడవేనని దేవుడిచ్చిన తీర్పు న్యాయమైనది కాదా? అయినచో నీవు ఆ తీర్పును ఒప్పుకొనుచున్నావా? నీవు ఒప్పుకొని తీరాలి ఇది కేవలము నీకు ఉండవలసిన జ్ఞానము కాదు కానీ దానిని విశ్వసించి నీవు అంగీకరించాలి. 

బైబిలు ఇట్లు చెప్పుచున్నది ‘‘ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయంలో విశ్వసించును; రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును.’’ (రోమా 10:10) మన హృదయంలో మనము నరకపాత్రులమని గుర్తించినప్పుడు మరియు ప్రభువు నీలి ధూమ్ర రక్త వర్ణదారములో చూపబడిన తన క్రియలను సంపూర్తి చేయుట ద్వారా రక్షణ అను బహుమానమును మనకు అనుగ్రహించబడినది. మనం నమ్మినప్పుడు మన మందరము పరిశుద్ద స్థలములో ప్రవేశించి నివసించగలము. మనకంటే ఎంతో అధిక ప్రశస్తమైన ప్రభువు ఈ లోకములోనికి వచ్చి బాప్తిస్మం పొందుటను బట్టి మన పాపమును వహించుకొనెను. తన రక్తమును కార్చి సిలువపై మరణించెను. మరియు ఆ విధముగా చేసి మన పాపములన్నిటిని ఆయన కడిగివేసి మనలను శిక్ష నుండి రక్షించెనని మనము నమ్ముచున్నాము. నీలిధూమ్ర రక్తవర్ణపు పేనిన సన్నపునార ద్వారా మనలను రక్షించిన ప్రభువు మనలను నీతిమంతులనుగా చేసెను.

ఈ విషయమును మన హృదయంలో దృఢముగా విశ్వసించాలి. ఈ సత్యమును తమ హృదయంలో దృఢముగా విశ్వసించువారు దేవుని ప్రజలై, ఆయన పరిచారకులగుదురు. ఈ సత్యమును ఏదో మానవ కల్పిత ఆలోచనలు స్వీకరించుట నిజమైన విశ్వాసం కాదు. ‘‘ఆహా! ప్రత్యక్ష గుడారము ఈ అర్థమును కలిగియున్నది. ఆ నీలి ధూమ్ర రక్తవర్ణమును గూర్చి మా సంఘములో తరచుగా వింటూ ఉంటాను. కనుక వాటి అర్థము ఈ విధముగా అన్వయించబడినది.’’ ఇప్పటి వరకూ నీవు నీ హృదయంలో ఈ ఆలోచననే కలిగియుంటే నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను నమ్మకంగా నీ హృదయంలో విశ్వసించుటకు ఇదే మంచి తరుణము.

ప్రత్యక్ష గుడార ద్వార స్తంభముల దిమ్మలు ఇత్తడివి. ఇత్తడి దిమ్మలు కేవలము ఐదు స్తంభములకే ఉన్నవి. కానీ అతి పరిశుద్ధ స్థల అడ్డుతెర స్తంభము దిమ్మలు వెండివి. బైబిలులో వెండి దేవుని బహుమానమునకు కృపకు సాదృశ్యము కాగా హృదయంలో నున్న నిజ విశ్వాసమునకు బంగారము సాదృశ్యము. మరో ప్రక్క ఇత్తడి పాప తీర్పునకు సాదృశ్యము. మన పాపమును బట్టి మనమంతా దేవుని తీర్పునకు పాత్రులము కామా? మనలో ప్రతివారు తమ పాపమునుబట్టి అపరాధములను బట్టి దేవుని దూరమైనాము. నేను కూడా దేవునియెదుట అలాగే ఉన్నానని ఒప్పుకొనుచున్నాను. నేను ఈ విషయమును నా అపరాధమును బట్టి నిన్ను మాత్రము కాక, నన్ను కూడా ఇదే ప్రశ్నించుచున్నాను. నా మట్టుకు నేను, నా అపరాధమును బట్టి తీర్పు పొందవలసిన వాడినేనని, ఆయన ఆజ్ఞ ప్రకారము నా పాపములను బట్టి నరక పాత్రుడనని ఆయన యెదుట నేను గుర్తించుచున్నాను. నేను దీనిని స్పష్టముగా ఒప్పుకొనుచున్నాను.

అటువంటి వాడనైన నా కొరకు ప్రభువు ఈ లోకమునకు వచ్చెను. తాను బాప్తిస్మం పొంది నా పాపములన్నిటిని తన శరీరముపై వహించుకొని, నా పాపమునకు తగిన శిక్ష పొందకముందే సిలువలో మరణించెను. మృతి నుండి తిరిగి లేచి నాకు పూర్ణ రక్షకుడాయెను. నా విశ్వాసమంతా ఇదే. ఈ విధంగా నమ్మినప్పుడు సృష్టికి ముందే దేవుడు వ్యూహపరచని నా రక్షణ కార్యము సంపూర్ణమాయెను. నేను నా హృదయ మందు దీనిని విశ్వసించనప్పుడు ఇది పూర్తి చేయబడెను.

నీ హృదయం కూడా ఇలాగే ఉండవచ్చు. ఈ సత్యమును నమ్ముకొనుట వలన ఈ లోక పునాది కంటే ముందే దేవుడు యేసుక్రీస్తులో ప్రణాళిక పరచిన నీ రక్షణ నీ హృదయంలో సంపూర్ణమగును. నిన్ను తన ప్రజగా చేసికొనుటకై దేవుని ఏర్పాటు నీ హృదయంలోకి వచ్చును. నీ శరీర సంబంధ ఆలోచన వలన రక్షణ కలుగదు. ఏ థియాలజీ బోధ వలన రక్షణ కలుగును. కానీ సత్యమును విశ్వసించుట వలననే అది కలుగునది.సృష్టి కంటే ముందే ఈ రక్షణ యేసుక్రీస్తు నందు వ్యూహపరచబడెను.


యేసుక్రీస్తు నందు ఆయన బాప్తిస్మము మరియు సిలువ మరణము ద్వారా ఈ రక్షణ మనకు బహుమతిగా అనుగ్రహింపబడెను. ఈ లోకములో 2 వేల సంవత్సరాల క్రితమే ఆ రక్షణ వాస్తవముగా నెరవేర్చబడెను. ఈ రక్షణ బహుమతి నుండి ఎవరూ తీసివేయబడలేదు. ప్రతివారి పాపమును తుడిచిపెట్టుటకే దేవుని రక్షణ యొక్క ప్రణాళికను యేసు నెరవేర్చెను. అలాగుననే తమ హృదయాలలో దృఢముగా ఈ సత్యము అనునది సాధ్యమాయెను. కేవలము మనమాయనను నమ్మి రక్షింపబడితిమా? అందువలన విశ్వాసము ద్వారా మనము దేవుని ప్రజలైనామా? నిజముగా మనకు అట్టి విశ్వాసం ఉన్నదా? మనం పొందిన రక్షణ మన క్రియల వలన కాదు కానీ దేవుని వరమేనని మనం ఒప్పుకొనగలమా? దేవుని వలన అనుగ్రహించబడిన రక్షణ అనువరమును మనము నమ్మక పూర్వము మనమందరమూ నరకపాత్రులమని నిజముగా ఒప్పుకొనగలమా? ఈ విషయాలలో మనము మనలను మరొకసారి పరిశీలించుకోవాలి.ప్రత్యక్ష గుడారము యేసు యొక్క వివరణాత్మక స్వరూపమై యున్నది.


ప్రత్యక్ష గుడారములో బయలుపరచబడిన సత్యము అబద్ధ ప్రవక్తల నోళ్ళను మూసివేసెను. వారి ముందు మనము ప్రత్యక్ష గుడారమును గూర్చిన వాక్యమును తెరచి మాట్లాడుచున్నప్పుడు వారి మోసమంతయూ కనుగొనబడును.

ప్రత్యక్ష గుడార ద్వారపు స్తంభము పూర్తిగా బంగారముతో తాపడము చేయబడెను. అనగా మానవ సంబంధమైన ఏది ప్రత్యక్ష గుడారములో ఎక్కడా కనబడదని అర్థం. ప్రత్యక్ష గుడారములోని సమస్తము బంగారముతో పొదిగింపబడినది. ద్వారము యొక్క స్తంభము బంగారముతో కప్పబడెను. స్తంభములను కప్పునవి కూడా బంగారువే. అయిననూ స్తంభముల దిమ్మలు ఇత్తడితో చేయబడినవి మన పాపము, బలహీనతలను బట్టి మనము నరకపాత్రులమని తెలియచేయుచున్నది. అది నిజము కాదా? వాస్తవము ఇదే కదా? నీవు కూడా నీ ప్రతిదిన పాపము బలహీనతలను బట్టి నరక పాత్రుడవేనని వాస్తవముగా నమ్ముచున్నావా? నీవు నీ పాపమును బట్టి నరక పాత్రుడవనునది దేవుడిచ్చిన న్యాయ తీర్పు. అయితే నీవు ఈ తీర్పును అంగీకరించుచున్నావా? తప్పక నీవు ఒప్పుకోవాలి! ఇది నీవు తెలిసికొనుట కాదు కానీ దానిని విశ్వసించి నీవు అంగీకరించవలెను. నమ్మిన వారు అంతా దేవుని పిల్లలగుదురు. వారి పాపములన్ని తుడవబడును. హిమమవలె తెల్లబడును. ఉచితముగా వారు తమ పాప పరిహారమును పొందెదరు.

ఇంకనూ పాప పరిహారము పొందని వారు ఈ లోకములో అనేకముగా ఉన్నారు. ఈ ప్రజలు ఎవరు? తమకు తెలిసిన ఈ సత్యమును నమ్మని ప్రజలే. తాము నరక పాత్రులమని తమ హృదయాలలో ఒప్పుకొనని వారు నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను గుర్తించనివారు అట్టి ప్రజలు ప్రభువును కలుసుకోలేరు.

తమ స్వంత పాప స్వభావమును తెలిసికొని తమ పాపములను బట్టి శిక్షార్హులై నరకంలో త్రోయబడవలసిన వారమని గుర్తెరిగిన వారికే దేవుని రక్షణ దొరుకును. నీలి, ధూమ్ర, రక్తవర్ణపు పేనిన సన్నపు నారతో చేయబడిన తెరతో నిర్మించబడిన ఆ ప్రత్యక్ష గుడారపు ఐదు స్తంభములు ఎక్కడ నిలపబడినవి? అవి ఇత్తడి దిమ్మలపై నిలుపబడెను. మన పాపములను బట్టి మనము నరక పాత్రులము. మనము ఈ సత్యమును తెలిసికొన్నప్పుడే అట్టి గుర్తింపుపై మనకు రక్షణ దొరకును. ఎందుకనగా ‘‘దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను”. నీ కొరకు, నా కొరకు ఆ ప్రభువు ఈ లోకమునకు వచ్చెను. బాప్తిస్మమిచ్చు యోహాను ద్వారా బాప్తిస్మం పొందెను. తన రక్తమును సిలువలో కార్చెను. త్యాగమును చేసెను దాని ద్వారా మన పాపము నుండి మనకు రక్షణనిచ్చెను.

అలాగుననే నీవు నేను మన హృదయాలలో దృఢముగా నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను విశ్వసించాలి. ఒక్కసారైనా మన హృదయాలు ఈ విధంగా గుర్తించాలి. ‘‘నేను నిజముగా నరక పాత్రుడను. అయిననూ ప్రభువు నీరు మరియు ఆత్మమూలముగా నన్ను రక్షించెను”. రక్షించబడుటకై మన హృదయాలలో విశ్వసించాలి. రోమా 10:10లోనున్నట్లు ‘‘ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును; రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును.’’

మన రక్షణను మన హృదయంలో నిజముగా నమ్మి దానిని మన నోటితోమనము తప్పక ఒప్పుకోవాలి. నా ప్రభువు నీలి ధూమ్రరక్త వర్ణ దారముతో నన్ను రక్షించెను. నేను నరకంలో త్రోయబడి శిక్షింపబడవలెను. కానీ ఆ ప్రభువు నా పాపములన్నిటిని కడిగివేసెను. నాకు బదులుగా నా పాపములను మోసెను, నా బదులు నా శిక్షంతయూ భరించెను. దాని ద్వారా పూర్తిగా నన్ను రక్షించెను. ఆయన నన్ను పూర్తిగా దేవుని కుమారునిగా చేసెను. ఈ విధంగా మన హృదయంలో మనము నమ్మాలి. మన నోటితో ఒప్పుకోవాలి. నీవు నమ్ముచున్నావా?

నీవు నీలి ధూమ్ర రక్తవర్ణపు సన్నని నార దారములోని సత్యమును నీవు నమ్మిననూ మన ప్రభువు మనలను ఈ విధంగానే రక్షించెనని నమ్మిననూ ఏ కారణముగానైనా నీవు నరకపాత్రుడవని ఒప్పుకొనలేక పోవుచున్నావా? బైబిల్‌ ఇట్లు చెప్పుచున్నది. అందరూ పాపము చేసి దేవుడనుగ్రహించు రక్షణ పొందలేక పోవుచున్నారు. (రోమా 3:23) నిజ విశ్వాసము. అందరూ పాపము చేసిరి. కనుక నరకములోనికి పోయెదరు అని విశ్వసించుచున్నది. కనుక ప్రభువు ఈ లోకములోనికి వచ్చెను. బాప్తిస్మం పొందెను. సిలువపై చనిపోయెను. మృతి నుండి తిరిగిలేచెను. దాని వలన మనలను పూర్తిగా నీతిమంతులనుగా చేసెను. 

ఈ రక్షణ ఎంత ఆశ్చర్యకరము? అది కేవలము అద్భుతము కాదా? ప్రత్యక్ష గుడారము ఏదో ఒక విధముగా నిర్మించబడలేదు. కానీ స్పష్టముగా వివరించబడిన దేవుని వాక్యము ద్వారా నిర్మించబడెను. ప్రత్యక్ష గుడారము ద్వారా తన ప్రశస్త ప్రాణము పెట్టుట ద్వారా తానే మనలను రక్షించెదనని దేవుడు ముందుగానే స్పష్టముగా మనతో చెప్పెను. ప్రత్యక్ష గుడారము ద్వారా ఆయన మనకు చెప్పునదేమనగా బాప్తిస్మం పొందుట ద్వారా సిలువలో మరణించుట ద్వారాను యేసు మనకు తన ప్రశస్తమైన రక్షణను అనుగ్రహించెను. మరియు మనము చేయవలసినది కేవలము మన హృదయంలో ధృఢంగా విశ్వసించాలి. నిన్ను బట్టి నీకు రక్షణ ఇవ్వగలవారు ఎవరు? మనుష్య కుమారుని వలె శరీరాకారముగా నీవలెనే వచ్చిన యేసుక్రీస్తుని నమ్ముకొనుట ద్వారా నీవు రక్షింపబడగలవు.

నీ స్థానములో ఎవరో ఒకరు నీ పాపములను వహించుకొని ఘోరంగా శిక్షింపబడినట్లయితే కృతజ్ఞతగా నుండుటకు కావలసిన దానికంటే అధిక కారణాన్ని కలిగియుందువు. కానీ మిలియన్‌ రెట్లు మనకంటే న్యాయవంతుడు, ధనవంతుడైన యేసయ్య నీ కొరకే ప్రశస్తమైన త్యాగమును చేసెను. ఇది ఎంత కృతజ్ఞతతో కూడినది? ఘనమైన ప్రభువు నీలి ధూమ్ర రక్తవర్ణదారముతో మనలను రక్షించుట అనునది ఎంత ప్రశస్తమైన బహుమానము? ఈ బహుమానమునకు వెలకట్టగలమా? దీనిని మన హృదయాలలో నమ్మకుండా మనము ఎట్లు ఉండగలము?

ఇందువలననే, తమ పాపములను ఒప్పుకొను ప్రతివాడు ఈ సత్యమును నమ్మి తీరవలెను. ఈ సత్యమును నమ్ముటకు అర్హులైన వారెవరనగా తాను తప్పించుకొన లేక నరకములో వేయబడుటకు తగిన వారెవరని నమ్మినవారు మాత్రమే. తాము నిజముగా పాపులమని గుర్తించువారు నిశ్చయముగా పాతాళమునకు అర్హులైన వారు మాత్రమే దేవుని ప్రశస్త రక్షణకు అర్హులైన వారు. అటువలెనే వారు దానిని విశ్వాసముతో పొందుకొనెదరు. ఈ సత్యమును తమ హృదయములో నమ్మువారు దేవుని సంఘములోని పరిచారకులగుదురు.

తమకున్న కొద్దిపాటి సామర్థ్యముతో ఈ లోకములో ప్రఖ్యాతి గాంచిన వారితో పోల్చుకున్ననూ గొప్ప చేసుకొనుటకు మనకు ఏమీ లేని దరిద్రులము మనము. విషయము ఇట్లుండగా పరిశుద్ధుడును, పరిపూర్ణుడును, సర్వవ్యాప్తి అయిన దేవుని ముందు మన గొప్పలను చెప్పుకొనుటకు మనము ఎట్లు సాహసించగలము? ఆయన యెదుట మనము చేయగలిగినదేమనగా మన దోషములను బట్టి మరణము తప్ప మరొకటి లేని వారమని కేవలము ఒప్పుకొనటయే.

బైబిలు మనకు చెప్పుచున్నదేమనగా ‘‘ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము” అయితే దేవుని కృపావరము ప్రభువైన క్రీస్తు యేసు నందు నిత్యజీవము” (రోమా 6:23). వాస్తవానికి మన పాపము జీతముగా మరణము పొందవలసినదే. అయితే మన దేవుడు మనలను రక్షించెను. నరక పాత్రులమైన మనము ఇప్పుడు విశ్వాసమును బట్టి పరలోకరాజ్యములో ప్రవేశించగలము. మనం ఈ విశ్వాసాన్ని కోల్పోయినచో వందసార్లు నరకములో త్రోయబడ వలసినవారము మనము పరిస్థితి ఇది కాదా? అవును మనమందరమూ నరకములో వేయబడుటకు అర్హులమే.

కానీ ఘనుడైన ప్రభువు అసమానమైన ప్రేమతో ఈ లోకానికి వచ్చెను. బాప్తిస్మం పొందెను. తన రక్తమును కార్చెను. సిలువపై శిక్షింపబడెను. కనుక మనము నిశ్చయముగా చేరవలసిన నరకము అను గమ్యస్థానం నుండి తప్పించబడినాము ఆ ప్రభువు మన కొరకు ప్రశస్త జీవమును అర్పించెను. కనుక మనము పాప పరిహారము పొందినాము. పరిస్థితి ఇట్లుండగా ఆ ప్రభువు ఒకేసారిగా మన పాపమును శుద్ధీకరించెనని రక్షణ ఇచ్చెనని నమ్మకుండా ఎట్లు ఉండగలము. నీతిమంతులము కాకుండునట్లు ఎలా తిరస్కరించెదము? దీనిలో నమ్మకము లేకండా ఎలా ఉండగలము? ప్రత్యక్ష గుడారము ద్వారము తెర యొక్క దిమ్మలు బంగారముతో చేయబడిన రీతిగానే మనం కూడా మన హృదయాలను పూర్తిగా విశ్వాసంతో ఒప్పుకోవాలి. మన హృదయాలలో దృఢముగా నీరు మరియు ఆత్మ మూలమైన సువార్తను విశ్వసించాలి. మన హృదయాలలో ఈ సత్యసువార్తను దృఢముగా నమ్ముకొనకుండా మనము దేవుని యెదుటకు పోలేము. 

విశ్వాసము ద్వారానే మనము పాపులమై నరకములో త్రోయబడెదము. అదే విశ్వాసము ద్వారా మనము దేవుని యెదుట నీతిమంతులము కాగలము. విశ్వాసము ద్వారా అనగా ఆ పాపులు తమ పాపపరిహారం పొందుతారు. ఆ ప్రభువు తన నీరు మరియు రక్తము ద్వారా మనలను రక్షించెనను నమ్మకంతోనే ఈ విధముగా దేవుని వాక్యము ‘‘మనుష్యులొక్కసారే మృతిపొందవలెనని నియమించబడెను; ఆ తరువాత తీర్పు జరుగును.’’ (హెబ్రీ 9:27) నెరవేర్చబడెను.

ఒకసారి మనం ఈ లోకంలో జన్మించిన తరువాత అప్పటికే మనం మన పాప శిక్ష పొందవలెను. అయిననూ, యేసుక్రీస్తు అను మన ప్రభువు ద్వారా మన ప్రభువు మనకు రక్షణ అను బహుమతిని ఇచ్చెను. మన హృదయంలో దృఢముగా నీరు మరియు ఆత్మ మూలమైన సువార్తను నమ్మిన కారణంగా మనము దేవుని పిల్లలమైనాము. విశ్వసించు వారందరికీ దేవుడు తన అపారమైన ప్రేమ యొక్క రక్షణను అనుగ్రహించెను. కానీ విశ్వసించని వారికి ఆయన తీర్పు తీర్చి శిక్షించును. ఎందుకనగా వారు నీరు మరియు ఆత్మ మూలమైన సువార్తను నమ్మక పాపులైరి. (యోహాను 3:16-18)రక్షణ యొక్క ఈ రెండు సత్యములను మనము తప్పక నమ్మాలి.


మనము శిక్షనొందదగిన పాపులమైయుండి, మన పాపములను బట్టి మరణమునకు పాత్రులము, కానీ దేవుడు వ్యూహపరచి మనకిచ్చిన నీలి ధూమ్ర రక్తవర్ణ పేనిన సన్నపు నార యొక్క రక్షణను నమ్ముట వలన మన పాపము పరిహారమును మనం పొందాము. వాస్తవంగా దేవుని యెదుట పశ్చాత్తాప పడాలి. నేను నిజముగా నరకపాత్రుడను. ‘‘ఈ విధంగా కూడా ఒప్పుకోవాలి. కానీ దేవుడు తన రక్తము మరియు నీటి ద్వారా రక్షించెనని నేను నమ్ముచున్నాను.’’ మనము తప్పక నీరు మరియు ఆత్మ మూలమైన సువార్తను విశ్వసించాలి. అనగా నీలి, ధూమ్ర రక్తవర్ణపు పేనిన సన్నపునారలోని సత్యమును, అట్టి నమ్మకానికి మన హృదయంలో దృఢముగా నమ్ముకొనుట ద్వారా మనము రక్షింపబడితిమి. అనగా సువార్తను నమ్ముట వలన మనము రక్షింపబడితిమి.

నీరు మరియు ఆత్మ మూలమైన సువార్తను నమ్ముట వలన మనము రక్షింపబడినాము. ప్రజలు దేవుని స్వంత ప్రజలగుటకు కేవలము నరకపాత్రులైన మానవులందరిని ప్రభువు నీలి, ధూమ్ర, రక్తవర్ణపు సన్నని పేనిన నార ద్వారా కలిగిన రక్షణను నమ్ముట ద్వారానే, నీవు నమ్ముచున్నావా? నీలి, ధూమ్ర రక్తవర్ణపు పేనిన సన్నపునారను నమ్ముకొనుట వలన నిజ విశ్వాసము కలుగును.

ప్రత్యక్ష గుడారపు ద్వార తెరలో చూపబడిన ఆత్మీయ అర్థం ఇదియే నీవు నమ్ముచున్నావా? ప్రజలు తమ హృదయంలో దీనిని విశ్వసించినప్పుడు అట్టి నిజ విశ్వాసమును గూర్చి సరిగా మాట్లాడగలరు. నిజ విశ్వాసం అనునది కేవలము నోటితో ఒప్పుకొని హృదయంలో నమ్మికలేకుండుట కాదు. కానీ 

ఒకని విశ్వాసము అతని/ఆమె హృదయంలో ఈ సత్యమును నమ్ముకొని ఒప్పుకోవాలి. మీరందరూ నీలి, ధూమ్ర రక్తవర్ణపు పేనిన సన్నపునార ద్వారా నిత్యత్వంలోనికి నిన్ను రక్షించిన రక్షణను తప్పక నమ్మాలి.

మనము ఎంతగా ఆయనను సేవించిననూ మనము ఆయనకు కృతజ్ఞతలు చెల్లించలేము. అట్టి విధముగా ఈ రక్షణను మనము ఎట్లు మరువగలము? నరక పాత్రులమైన నిన్ను, నన్ను ప్రభువు మన పాపము నుండి ఇచ్చిన రక్షణను మనము ఎట్లు మరువగలము? మన బలహీనతలన్నియూ ప్రతిదినము మనకు కనబడుచుండగా, నీరు మరియు ఆత్మ మూలమైన సువార్తను మనము ఎలాగు మరచిపోతాం? ఈ సువార్త ద్వారానే తప్ప మరే విధముగాను రక్షింపబడుటకై మనకు మార్గము లేకపోగా ఈ సువార్తను ఎట్లు మనము నిర్లక్ష్యపరచెదము? మనము ఎల్లప్పుడు కృతజ్ఞులమే. మనం ఎల్లప్పుడూ సంతోష భరితులమే. ఆయనను ఎల్లప్పుడు స్తుతించుట తప్ప మరేది మనము చేయలేము.

ఈ సత్యమును ఎరుగని వారు దేవుడు మానవులను బొమ్మలుగా చేసి వారినిబట్టి ఆయన ఆనందించుచున్నాడని చెప్పుదురు. దేవునికి వ్యతిరేకముగా నిలిచి వారు ఈలాగు చెప్పెదరు. ‘‘దేవునికి బోర్‌ కొట్టినట్టుంది ఆయన మనలను బొమ్మలుగా తయారు చేసి మనతో ఆటలాడుకొనుచున్నాడు. మనం పాపం చేస్తాం అని ఆయనకు తెలిసినప్పటికీ మనం చేస్తున్న పాపాలను ఆయన చూస్తున్నాడు. ఇప్పుడు ఆయన పాపులను రక్షించానని చెప్పుచున్నాడు. మనతో ఆయన బొమ్మలాట ఆడుట లేదా? ఆయన మనలను నిర్మించి తనకిష్టమైన విధముగా మనతో ఆడుకొనుచున్నాడు. ఇట్లయిన దేవుడు మనలను బొమ్మలుగా చేయలేదా?’’ అనేకులు ఈవిధంగానే ఆలోచిస్తారు. దేవునిపై వారికి ఎంతో ద్వేషం ఉంటుంది. వారు ఇట్లు చెప్పెదరు. ‘‘ఆయన నిజంగా మమ్మును ప్రేమిస్తే ఆయన మమ్మును అసంపూర్ణ పాపులుగా చేయక సంపూర్ణమైన వారిగా చేయవలసినది. దేవుని మనస్సును ఎరుగక ఆయనను నిందించుచూ తమ వ్రేలు చూపువారు అనేకులు అజ్ఞానులుగానే ఉంటున్నారు.’’మనము దేవుడు నిర్మించిన ప్రాణులము


జంతు వృక్షము వలే మానవులు కూడా దేవుడు నిర్మించిన ప్రాణులు. కానీ దేవుడు జంతు వృక్షమును నిర్మించినట్లుగా మనలను నిర్మించలేదు. మనలను సృజించక మునపే తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనలను తన ప్రజలనుగా చేసి తన మహిమలో మనలను ప్రవేశ పెట్టవలెనని ఈ పనికొరకు దేవుడు మనలను సృజించుటకు నిర్ణయించుకొనెను. మానవుని నిర్మించిన ప్రణాళిక ఇతర ప్రాణుల నిర్మాణమునకు భిన్నమైనది అయినట్లైన దేవుడు ఏ ఉద్దేశ్యముతో మనుష్యులను నిర్మించెను? దేవుని మహిమను గూర్చి తెలియజేయుటకే సృజింపబడిన మొక్క మరియు జంతువు వలే కాక ఆయనతో కూడా ఆయన మహిమ గల అద్భుతరాజ్యములో ఎల్లప్పుడూ జీవించుచుండుటకు వారు సృజింపబడిరి. దేవుడు మానవులను సృజించుటలో ఆయన ఉద్దేశ్యమనగా తమ స్వపాపమును తెలుసుకొని సృష్టికర్తగా ఆయన తమను రక్షించెనని గుర్తించి విశ్వసించునట్లుగా చేసి తద్వారా సంపూర్ణులై భవిష్యత్తులో ప్రభుని రాజ్యంలో ప్రవేశించునట్లు చేయును.

దేవుడు మనలను ఏదో రోబోట్లుగానో, బొమ్మలనుగానో చేయలేదు. కానీ సృష్టికర్తను గుర్తించి ఆయన పిల్లలమగునట్లుగాను, రక్షకుని నమ్మువారిగాను, నీరు మరియు ఆత్మ మూలముగా తిరిగి జన్మించునట్లుగాను మనలను సృజించెను. అలాగే మనలను సృజించుటకు కారణమును అనుసరించుచూ మనము ఆయన మహిమను పొంది దానియందు ఆనందించగలము. ఈ భూమిపై మనము ఇతరులకు సువార్తనందించుటకు మనలను మనము త్యాగము చేసినప్పటికీ దేవునిరాజ్యములో మనకు సేవ చేయబడును. మానవుల కొరకైన దేవుని మూల ప్రణాళికను గూర్చి నీవేమి యోచించుచున్నావు? అదేదనగా నిత్యము దేవుని మహాత్మ్యమును మహిమను పొందుచూ ఆనందించుట కొరకే మానవుని సృజించుటలో దేవుని ఉద్దేశ్యమేమనగా వారిని తన ప్రజలుగా చేసుకొని, ఆయన మహిమలోని, మహాత్మ్యములోను వారిని భాగస్వాములనుగా చేయుటయే.

మనము ఎందుకు జన్మించాము? మన జీవితము యొక్క ఉద్దేశ్యమేమి? మనము ఎక్కడ నుండి వచ్చాము. మనము ఎక్కడికి పోవుచున్నాము? ఇట్టి తత్వ ప్రశ్నకు ఇప్పటి వరకు సమాధానము లేదు. కనుక ప్రజలు ఇంకను ఈ సమస్యను సాధించుటకు ప్రయత్నించుచున్నారు. వారి భవితను ఎరుగుకయే కొంతమంది జ్యోతిష్యులును సిద్ధాంతులును అగుచున్నారు. ఇవన్నియూ మనలను సృజించిన ఆ దేవుని తెలిసికొనుటలోనూ ఆయన వారికిచ్చిన రక్షణను విశ్వసించుటలోనూ మానవుల వైఫల్య ఫలితమే.

అయిననూ, మనలను తన స్వంత పిల్లలుగా చేయుటకు, దేవుడు మనలను మిగిలిన ప్రాణులకంటే భిన్నముగా చేసెను. నీలిధూమ్ర రక్తవర్ణపు పేనిన సన్నపు నార ద్వారా సృష్టికి పూర్వమే మన రక్షణను వ్యూహపరచిన నీరు మరియు ఆత్మ మూలమైన సువార్త ద్వారా మనలను రక్షించెను. నీలి, ధూమ్ర రక్తవర్ణ దారములో బయలు పరచబడిన రక్షణ యొక్క ఆజ్ఞతో మనలను రక్షించుట ద్వారా వాస్తవంగా దేవుడు మనకొరకైన తన ఉద్దేశ్యమును నెరవేర్చెను.

కాబట్టి ఇప్పుడు మనము యేసుక్రీస్తు నందు నిత్యజీవమును మనకు ఇవ్వగోరుచున్న దేవుని ఉద్దేశ్యమును తప్ప తెలిసికొని విశ్వసించాలి. దీనిని మనం తెలిసికొననట్లయిన జీవిత మర్మము బయలుపరచబడకయే మిగిలిపోవును. ఈ లోకంలో మనము ఎందుకు జన్మించాము? మనం ఎందుకు జీవించాలి? మనం ఎందుకు ఆహారం తినాలి? కర్మకొద్ది మనం ఎందుకు జీవించాలి? జీవిత మరణ సమస్యను వయస్సు మీదటను గూర్చి అస్వస్థతను గూర్చిన సమస్యను మనము ఎట్లు సాధించగలము? మన పాపమును బట్టి మనము నరకములోనికి ఎందుకు పోవాలి? జీవితంలో ఎందుకు చింత? మన జీవితం ఎందుకు బాధాకరము? ఇట్టి ప్రశ్నలన్నింటికి సమాధానమును మనము యేసుక్రీస్తు నందు మనలను రక్షించిన నీరు మరియు రక్తము గూర్చిన సువర్త ద్వారా దేవుని నుండి పొందగలము.

ఈ భూమిపై జన్మించుటకు దేవుడు అనుమతినిచ్చెను మరియు కష్టతరమైన చింత మధ్య నుండి ఆయన రాజ్యము కొరకైన నిరీక్షణ మనకిచ్చెను. ఎందుకనగా నరకపాత్రులమైన నిన్ను, నన్ను రక్షించును. కనుక మనము నిత్య జీవమును పొందెదము. నీరు మరియు ఆత్మ మూలమైన సువార్తను మనమే నమ్మినప్పుడు మన జీవిత మర్మములన్నియూ తెలిసికొనగలము.నీ కొరకు నా కొరకు దేవునికి ఉన్న అందమైన ఆ ప్రణాళిక :

 

దేవుని ప్రణాళిక చొప్పున ఆయన తన కుమారుడైన యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చెను. అతను బాప్తిస్మము పొందునట్లు చేయుట ద్వారా ఆయన పరిశుద్ధ శరీరంపై మన పాపములన్ని మోపెను. మన కొరకు ఆయనను శిక్షించెను. మరణమునకు అప్పగించెను. మన పాపములను బట్టి నిత్య నాశనమును ఎదుర్కొనుచు శిక్షింపబడుచు, శపింపబడుచున్న మనము ఆయన వలన రక్షింపబడితిమి. ఇప్పుడు ఈ సత్యమును మనము తప్పక నమ్మాలి. తప్పించలేని నాశనకరమైన స్థితి నుండి మనలను దేవుని కుమారుని రాజ్యమునకు మనలను నడిపించిన దేవునికి కృతజ్ఞతలను మనము తప్పక చెల్లించవలెను. మరియు మనము నిత్యరాజ్యమును స్వతంత్రించుకొనునట్లు చేసిన దేవునికి కృతజ్ఞతలు. మరో విధంగా నీరు మరియు ఆత్మ మూలమైన సువార్తయే. ప్రత్యక్ష గుడారపు ద్వారము మీద వ్రేలాడ దీయబడిన నీలి ధూమ్ర రక్తవర్ణదారముతో నేయబడిన తెరల ద్వారా బయలు పరచబడినది ఆ సువార్త మాత్రమే.

ప్రత్యక్ష గుడార ద్వారము స్తంభము ఇత్తడి దిమ్మలు మన మూల పాపతత్వమును చూపుచున్నది. మరియు యేసు యొక్కనీరు మరియు రక్తమూలమైన సువార్తను మనము విశ్వసించునట్లుగా చేయుచున్నది. ప్రత్యక్ష గుడారపు స్తంభము మరియు నీలి ధూమ్ర రక్త వర్ణపు పేనిన సన్నని దారముతో నేయబడిన ఆ తెర మనలను రక్షించిన దేవుని కరుణను చూపుచున్నవి. యేసుని ప్రశస్త త్యాగము ద్వారా నరకపాత్రులమై శిక్షార్హులమైన మన పాపము నుండి రక్షించిన దేవుని కరుణను చూపుచున్నది. కనుక నీరు మరియు ఆత్మ మూలమైన సువార్తను నమ్మినందు వలన నా పాపములన్నిటి నుండి నేను రక్షింపబడితిని. నీవు కూడా ఆలాగున నమ్ముకొందువా?

ప్రత్యక్ష గుడారము బయలు పరచుచున్న సత్యమును నీవు విశ్వసించుచున్నావా? నీవును నేనును మనమందరమూ ధన్యులము. అనేకులు తిన్నగా నరకమునకు దారితీయుచుండగా మనము సత్యమును కనుగొన్నాము. ఇప్పుడు యేసుక్రీస్తునందు జీవించుచున్నాము. ఇది నిజముగా గొప్ప దీవెనగా ఉన్నది. వాస్తవంగా మనము ఈ లోకంలో ఏ యోగ్యతలేని వారమును, పనికిరాని వారమునైయుండి ఈ లోకములో జన్మించాము. మనము తిరస్కరించలేక పాపమునే చేసి నరక పాత్రులమైతిమి. పిరికి జీవితమును జీవించుచూ నరకములో త్రోయబడవలసిన వారమైతిమి. అలాగైననూ మన ప్రభువు ఈ లోకమునకు వచ్చెను, బాప్తిస్మం పొందెను, సిలువపై చనిపోయెను, మృతి నుండి తిరిగి లేచెను. మరియు తద్వారా మనలను మన పాపము నుండి రక్షించెను. మరేమియూ చేయలేము గానీ ఇక ఎప్పటికినీ నరకమును తప్పించుకొనలేని సత్యమును బట్టి ఆశ్చర్యపోవలసినవారము కానీ మనము విలువగలవారము గాని ఉపయోగకరముగాను నీతిమంతులముగాను మార్చబడితిమి.

తమ పాప పరిహారము నొందిన వారే అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించగలవారు. మన ప్రభువు కేవలము మనం ఇంతకు మునుపు చేసిన పాపమును మాత్రమే పరిహరించలేదు కాని బాప్తిస్మం పొందుట ద్వారా మన జీవిత కాల పాపమును తనపై వహించుకొనెను. మరియు సిలువపై చనిపోవుట ద్వారా మన పాపాలన్నిటిని శాశ్వతముగా ఆయన శుద్ధీకరించెను. కాబట్టి రక్షణ యందు విశ్వాసముంచువారును అట్టి విధముగా ఒక్కసారిగా నెరవేర్చువారును బోధకుల విశ్వాసము కలిగియుండువారే మరియు అట్టి ప్రజలే అతిపరిశుద్ధ స్థలములో ప్రవేశించగలరు.

ఖచ్చితంగా మాట్లాడినప్పుడు ప్రత్యక్ష గుడారపు వ్యవస్థ ప్రకారము సాధారణ బోధకులు అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశింపలేరు. కానీ ప్రధాన యాజకులు మాత్రమే ప్రవేశించగలరు. అశాశ్వతమైన ప్రధాన యాజకుడు యేసుక్రీస్తే అట్టి విధానముగా యేసుక్రీస్తు మనలను రక్షించెనని విశ్వాస ముంచువారు మాత్రమే దేవుని ఇంటిలో ప్రవేశింపగలరు. యేసుక్రీస్తుతో పాటుగా అతి పరిశుద్ధ స్థలంలో కూడా ప్రవేశించెదరు.

‘‘వీటి క్షమాపణ ఎక్కడ కలుగునో అక్కడ పాపపరిహారార్థ బలి యికను ఎన్నడును ఉండదు. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్టించిన మార్గమున, అనగా నూతనమైనదియు, జీవము గలదియు, ఆయన శరీరము అను తెరద్వారా యేర్పరచబడినదియునైన మార్గమున, ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగియున్నది గనుకను దేవుని యింటిపైన మనకు గొప్ప యాజకుడున్నాడు గనుకను మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయము గలవారమును, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై యుండి, విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి, యధార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము.’’ (హెబ్రీ 10:18-22) దుష్టులుగా తమను తాము గుర్తించువారు నరకమునకు దారి తీయువారై యుంటారు. మరియు శుద్ధ జలముతో (యేసుని బాప్తిస్మం) యేసుని రక్తముతోను తమ పాపములన్నింటిని కడుగుకొని క్షమాపణ పొందినవారు దేవుని రాజ్యములో ప్రవేశించగలరు. ఆయనతో పాటు నిత్యము నివశించగలరు.

మనము మన అనుదిన పాపముల కొరకు పశ్చాత్తాప ప్రార్థనలు చేయుచున్నందుకే మన పాపము కడుగబడుట లేదు కాని ప్రభువు ఈ లోకమునకు వచ్చి ఒకేసారిగా లోక పాపములన్నిటిని తనపై మోపుకొనుటకై బాప్తిస్మం పొందెను. సిలువపై శిక్షింపబడెను. కనుక శాశ్వతముగా మన పాపములను తుడపు పెట్టెను. ‘‘నీతియావత్తు ఈలాగు నెరవేర్చుట మనకు తగియున్నది” అని యేసు బాప్తిస్మం పొందెను. ఒక్కసారిగానే మానవాళి పాపములను తనపై మోపుకొనెను. లోకపాపమును సిలువ వరకు మోసుకొనిపోయెను. దానిపై మరణించెను. మృతి నుండి తిరిగి లేచెను. శాశ్వతముగా మనలను ఆ విధముగా నెరవేర్చెను. తమ హృదయములో స్థిరముగా ఈ సత్యమును విశ్వసించువారు తమ పాపముకు పరిహారము పొందిన జీవితకాల పాపములన్నింటిని మరియు విశ్వములోని పాపములన్నిటిని ఆయన తొలగించెను.

బాప్తిస్మమును పొందుట ద్వారా ప్రభువు మన పాపములను ఒకేసారిగా మోసెనని నీవు నమ్ముచున్నావా? ఆయన లోకపాపమును మోసెనని సిలువపై చనిపోయెనని మృతి నుండి తిరిగి లేచెనని తద్వారా మన సంపూర్ణ రక్షకుడాయెనని నీవు విశ్వసించుచున్నావా? ఆయన తన 33సంవత్సరముల జీవితం ద్వారా శాశ్వతంగామనప్రభువు లోకపాపములను తుడుపు పెట్టెను. ఆయన వాటన్నిటిని పొగొట్టెను. ఒక్కటి కూడా మిగల్చలేదు.నేను ఈ విషయమును నా హృదయంలో స్థిరముగా నమ్ముచున్నాను. ఆయన బాప్తిస్మం పొందినప్పుడు ఆయన లోకపాపములన్నిటిని ఒకేసారిగా తనపై మోపుకొనెనని సిలువపై తన రక్తము కార్చుట ద్వారా నా పాపములన్నిటి శిక్షను ఒకేసారిగా భరించెను. మరియు మృతి నుండి తిరిగి లేచుట ద్వారాను ఒకేసారిగా నా సంపూర్ణ రక్షకుడాయెనని నేను విశ్వసించాను.

దీనియందు విశ్వాసముంచుట ద్వారా మనమందరమూ పరలోక రాజ్యములో ప్రవేశించగలము. ఆ లోకంలో మనము నివశించుచూ ఈ విశ్వాసమును మనము అనుదినము ధ్యానించవలెను. ఎందుకు? ప్రభువు మనము ఇంకనూ చేయబోవు పాపములను కూడా తొలగించెను కనుక మనము పాపము చేయు ప్రతిసారి మనము ఒప్పుకోవాలి. మన హృదయంలో ప్రభువు ఆ పాపములను కూడా తన బాప్తిస్మం ద్వారా తొలగించెనని తప్పక విశ్వసించాలి. ఆ ప్రభువు లోకపాపమును భరించెనని విశ్వాసముతో మరొకసారి గుర్తించాలి. ఎందుకు? మరలా మరలా మనము నీరు మరియు ఆత్మ మూలమైన సువార్తలో జనియించినట్లయిన మన హృదయము కృంగిపోవును. ప్రభువు మనము చేయని పాపములను కూడా భరించెను. కనుక మన బలహీనతలు పనిచేసినప్పుడు నీలి ధూమ్ర రక్త వర్ణదారముతో కూడిన ఆయన సేవనందు మనకు గల విశ్వాసముతో ప్రభువుకు తప్పక కృతజ్ఞతలను చెల్లించవలెను.

ఆ ప్రభువు ఈ లోకమునకు వచ్చి మన పాపములను భరించెనని మనము తప్పక విశ్వసించాలి. ఒకేసారిగా మన పాపములన్నియూ యేసుక్రీస్తుపై మోపబడెను. ఎందుకనగా ఆయన తన బాప్తిస్మం ద్వారా లోకపాపములను అంగీకరించెను. యేసుక్రీస్తు బాప్తిస్మం పొంది సిలువలో మరణించుట వలన నిత్య రక్షణను మనకు అనుగ్రహించినట్లుగానే ఈ సత్యము నందు స్థిరమైన ధైర్యమైన విశ్వాసమును కూడా మనము కలిగియుండవలెను. ఆయన యోహానుచే పొందిన బాప్తిస్మంను స్థిరముగా విశ్వసించుట వలన దేవుని రాజ్యమును మనము పొందవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు చెప్పెను. బాప్తిస్మమిచ్చుయోహాను మొదలుకొని ఇప్పటి వరకు పరలోకరాజ్యము బలత్కారముగా పట్టబడుచున్నది; బలాత్కారుల మనసులు మరియు శరీరము యొక్క పాపములన్నిటిని తొలగించుకొనగలము. మన ప్రభువు ఈ పాపములన్నిటిని తనపై మోపుకొనుటకు బాప్తిస్మం పొంది పాపము శిక్షను భరించెనని విశ్వసించి మనము తప్పక దేవుని రాజ్యమును పొందుటకు మన పాపము నుండి రక్షింపబడవలెను.

నీవు ఎంత పనికిమాలిన వాడవైననూ, నీవు ఈ విశ్వాసమును కలిగియున్నచో మీరు విశ్వాసం గల ప్రజలే. నీవు అయోగ్యుడవైననూ ప్రభువు నిన్ను పూర్ణముగా రక్షించెను. కనుక నీవు ఈ సత్యమును విశ్వసించవలెను. మన ప్రభువు సదాకాలము జీవించునట్లు మన రక్షణ కూడా అంతే పరిపూర్ణము. మనము చేయవలసినదంతయూ కేవలము యేసుక్రీస్తు అనుగ్రహించిన రక్షణను విశ్వసించుటయే అదే సరియైనది! ఆయనను మన మనస్సులో విశ్వసించుటతో రక్షింపబడితిమి.

మన ప్రభువు మనకు పూర్ణ రక్షకుడు కనుక మన పాపము యొక్క సమస్యలన్నిటిని ఆయనే పరిష్కరించెను. మన ప్రభువు బాప్తిస్మం పొందెననియు సిలువపై తన రక్తమును చిందించెననియు ఒకసారి చనిపోయి మృతి నుండి తిరిగి లేచెననియు దాని వలన మనకు నిత్య రక్షణనిచ్చెనని నీవు నమ్ముచున్నావా? ఈ రక్షణ ఎంత అద్భుతమైనది. మన క్రియలలో మనము ఎంత అయోగ్యులమైననూ ఈ సత్యమును విశ్వసించుట వలన మనము దేవుని రాజ్యములో ప్రవేశించగలము. అనగా మన విశ్వాసముతోనే మనము దేవుని రాజ్యములో ప్రవేశించగలము. మరియు మహోన్నతమైన అద్భుతమైన రమ్యమైన ఆయన మహిమను ఆనందించగలము. నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను విశ్వసించువారు వాటిని అనుభవించుటకు అర్హత కలిగియున్నారు. కానీ ఈ విశ్వాసం లేకుండా ఎవరూ దేవుని రాజ్యములో ప్రవేశించలేరు.

సృష్టికి ముందే నీలి ధూమ్ర వర్ణ పేనిన సన్నపునార ద్వారా యేసుక్రీస్తు నందు వ్యూహపరచిన సత్యము మనలను రక్షించెను. దేవుడు మనలను రక్షించవలెనని నిర్ణయించిన రీతిగా ఈ లోకమునకు వచ్చెను. బాప్తిస్మం పొందెను. మన పాపములన్నిటిని ఏకముగా తొలగించెను. లోకపాపములను సిలువ వరకు మోసుకొనిపోయెను. మరియు ఏకముగా ఒకేసారి శిక్షింపబడెను. ఒకసారి మృతిపొందెను. మృతి నుండి ఒకసారి తిరిగి లేచెను. దాని ద్వారా మనకు నిత్య రక్షణ అనుగ్రహించెను. నీలి, ధూమ్ర, రక్తవర్ణము పేనిన సన్నపు నార ద్వారా తేబడిన ఆయన రక్షణ యొక్క సేవ వలన కలిగిన రక్షణను మనం తప్పక విశ్వసించాలి. అప్పుడే మనము విశ్వాసము వలన మనము పరిపూర్ణముగా ఆయన బిడ్డలము కాగలము. అప్పుడే మనము విశ్వాసము ద్వారా ఆయన పనివారముగా మారెదము. దేవుని పరిపూర్ణ రాజ్యములో ప్రవేశించగలము మరియు శాశ్వత కాలము జీవించగలము.

పరిపూర్ణ దేవుడు మనలను పరిపూర్ణముగా రక్షించెను. కానీ మనము ఈ దినమునకు కూడా బలహీనులమే. ఎందుకనగా మన శరీరము బలహీనమైనది. కానీ అది ఎట్లు జరిగెను? ఆ ప్రభువు పూర్తిగా బాప్తిస్మం పొందినప్పుడు వాస్తవముగా ఆయన మన పాపములను వహించెనా? లేదా? ఆయన వహించెను. మన ప్రభువు తనబాప్తిస్మము ద్వారా మన పాపములను తొలగించెను గనుక ఆయన బాప్తిస్మంతో మన పాపము వాస్తవముగా ఆయనపై మోపబడెనని మనము గుర్తించగలము నీ పాపము నిజముగానే యేసుక్రీస్తుపై మోపబడెనని నీవు గుర్తించియున్నావా? అట్లు చేయుట ద్వారా యేసు మన పాపములను లోక పాపమును మోసెను. సిలువ వేయబడెను. తద్వారా దేవుని రక్షణ యొక్క ప్రణాళికను నెరవేర్చెను. మనము బలహీనులమైననూ మనము విశ్వసించుట ద్వారా దేవుని రాజ్యములో ప్రవేశించగలము. దేనియందు విశ్వాసమును ఉంచాలి? నీలి ధూమ్ర, రక్త వర్ణపు పేనిన సన్నపునారతో కూడిన ఆయన సేవలను విశ్వసించుటతో దేవుని రాజ్యములో ప్రవేశింపగలము.

మన పాపములకు పరిహారమును పొందిన తరువాత సంఘములో ఎంత బాగా చేసిననూ మంచి విశ్వాసము కలిగియున్ననూ బలహీనులమే. బలవంతులు లేదా బలహీనులను రాజ్యము చేయు స్థలము వంటిది సంఘము కాదా. ఎందుకు? ఎందుకనగా దేవుని సంఘములో మనము బలహీనులమని మనము తెలిసికొనినప్పుడు మాత్రమే విశ్వాసముతో మనము ప్రభువును అనుసరించగలం. అది గాయము కట్టి స్వస్థపరచు స్థలము పరలోకము ఒక పసిబాలుడు విషనాగుపుట్టలో తనచేతిని వుంచు స్థలము (యెష 11:8) కానీ అది వానిని కరువదు. ఈ లోకములో దేవుని సంఘము పరలోకము.

విశ్వాసముతోనే మనము దేవుని రాజ్యములో ప్రవేశించగలము. అదే దేవుని రాజ్యమును బలాత్కారులు ఆక్రమించుకొనుట. ఈ సత్యమును నీ హృదయములో విశ్వసించుచున్నావా? దీనినే నేను విశ్వసించుచున్నాను మరియు దీని వలననే దేవునికి నేను కృతజ్ఞతలు తెలుపుచున్నాను.

నేను ఈ సువార్త సేవ చేయుచున్నాను కనుక నేను ఆయనకు కృతజ్ఞుడను. నేను ఈ సత్యముకొరకు జీవించుచున్నాను. మరియు ఆ సువార్త సేవ చేయుచున్నాను. ఎందుకనగా ఈనాటికి అనేకులకు నీలి ధూమ్ర రక్తవర్ణము యొక్క పేనిన సన్నని నార యొక్క సత్యమును ఎరుగనివారు ఇంకనూ ఉన్నారు. కానీ ఇప్పుడు ఇతరులు ఈ సువార్త సేవ చేయుచున్నారా, లేదా అను ప్రశ్నను ప్రక్కకు పెట్టి నీకు అవసరమైనదేమనగా నీకుగా నీవు మొదట విశ్వసించవలెను.

యేసు నిన్ను నీ పాపము నుండి ఒక్కసారిగానే రక్షించెనను సత్యమును నీవు విశ్వసించాలని నేను నిరీక్షించుచూ ప్రార్థించుచున్నాను. మరియు దాని ద్వారా మన పాపము నుండి మనం రక్షింపబడవలెను.