Sermons

[11-13] < నిర్గమ 26:31-33 > అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించగలవారు ఎవరు< నిర్గమ 26:31-33 >

“మరియు నీవు నీల ధూమ్ర రక్తవర్ణములుగల ఒక అడ్డతెరను పేనిన సన్ననారతో చేయవలెను. అది చిత్రకారుని పనియైన కెరూబులగలదిగా చేయవలెను. తుమ్మకర్రతో చేయబడి బంగారు రేకు పొదిగిన నాలుగు స్తంభముల మీద దాని వేయవలెను. దాని వంకులు బంగారువి. వాటి దిమ్మలు వెండివి. ఆ అడ్డతెరను కొలుకుల క్రింద తగిలించి సాక్ష్యపు మందసము అడ్డతెర లోపలికి తేవలెను. ఆ అడ్డ తెర పరిశుద్ధ స్థలమును అతిపరిశుద్ధస్థలమును వేరు చేయును.’’ప్రత్యక్ష గుడారము యొక్క వస్తువులు :


ప్రత్యక్ష గుడారము తెరతో చేయబడినదై నాలుగు రకముల కప్పులను కలిగినది. అది భిన్నమైన పదార్థములతో చేయబడినది ఉదాహరణకు దాని గోడలు 48 తుమ్మకర్ర బల్లతో చేయబడినది. ప్రతి బల్ల పొడవు 4.5మీ (10క్యూ) వెడల్పు 67.5 సెం.మీ (1.5బిట్స్‌) అన్ని బల్లలు బంగారు రేకు పొదిగినవి.

ప్రత్యక్ష గుడారపు పై కప్పు క్రింది పదార్థాలతో చేయబడినది. మొదటి కప్పు, నీల, ధూమ్ర రక్తవర్ణము గల పేనిన సన్ననారతో చేయబడినది. రెండవ కప్పు మేక వెంట్రుకలు కలది. మూడవది ఎర్రరంగు వేసిన పొట్టేళ్ళ తోళ్ళతోను నాల్గవ కప్పు సముద్రవత్సల తోళ్ళతోను చేయబడినవి.

మునుపు మనం పరీక్షించిన విధముగానే ప్రత్యక్ష గుడారపు అడ్డతెరలన్నీ నీల ధూమ్ర రక్తవర్ణముగల పేనినసన్నపు నారవి. అతి పరిశుద్ధ స్థలమును కప్పే అడ్డతెరలోని నాలుగు రంగులు ప్రజలను వారి పాపముల నుండి విడిపించుటకై యేసుక్రీస్తు చేసిన క్రియలను తెలుపుచున్నవి. యేసుక్రీస్తు మనకివ్వబోవు పాపక్షమాపణ అను బహుమానము యొక్క సత్యమను కాంతిని ఈ నాలుగు రంగులు చూపించుచున్నట్లుగా అవి విశ్వాసు తప్పక కృతజ్ఞత మహిమ చెల్లించవలసిన విధానమును కనపరచును.

పరిశుద్ధ అతి పరిశుద్ధ స్థలము అడ్డతెర పదార్థము :` పరిశుద్ధ అతి పరిశుద్ధ స్థల అడ్డతెరలు నీల, ధూమ్ర, రక్తవర్ణము గల పేనిన సన్నపు నారతో నేయబడిన వస్త్రము, ప్రత్యక్ష గుడారంలోని అన్ని తెరలు ఈ వస్త్రముతో చేయబడినవే. ప్రత్యక్ష గుడారపు ద్వారములో ప్రవేశించిన తరువాత గల పరిశుద్ధ స్థలము నుండి ఒకడు అతి పరిశుద్ధ స్థల ద్వారము నొద్దకు వచ్చును. నీలి, ధూమ్ర, రక్తవర్ణము గల పేనిన సన్నపునారలో చూపబడిన తన నాలుగు పరిచర్యల ద్వారా ప్రభువు మన పాపము పరిహరించెనని అతి పరిశుద్ధ స్థల అడ్డతెర మనకు చూపించెను.

పరిశుద్ధ, అతి పరిశుద్ధ స్థలము కొరకు ఉపయోగించబడిన నీలి, ధూమ్ర, రక్తవర్ణ మరియు పేనిన సన్నపు నార యేసయ్య ఈ లోకమునకు వచ్చి బాప్తిస్మము పొంది తన రక్తమును చిందించి తద్వారా రక్షణ కార్యమును నెరవేర్చెను. ఇవి నీడను చూపుచున్నవి. వీటిలో యేసు పొందబోవు బాప్తిస్మమును నీలి రంగు నీడలో చూపబడెను. ఆయన తనపై మోపుకొన్న లోక పాపము కొరకు చేసిన త్యాగము రక్తవర్ణములో చూపబడెను. మన పాపముకు తగిన శిక్ష రాకమునుపే మన పాపమును పరిహరించుటకై ప్రభువు బాప్తిస్మమును పొందెను. దీనినే అతి పరిశుద్ధ స్థలపు ప్రధాన ద్వారము తెలియపరచుచున్నది.పత్యక్ష గుడారము


ప్రత్యక్ష గుడారము నేల మీద ఇసుకపై నిర్మించబడెను. భూమి ఇక్కడ ప్రజల హృదయములను సూచించుచున్నది. ప్రత్యక్ష గుడారపు అడుగు భాగము ఇసుక నేలతో నిర్మించబడెననునది. మన హృదయ పాపములను తుడిచి వేయుటకై మానవ శరీరాకారిగా ఈ లోకమునకు వచ్చెనని సూచించుచున్నది. మానవుల ప్రతి బలహీనతలను యేసు అనుభవించినవాడైనందున ఈ పాపములన్నిటిని ఆయనే తాను పొందిన బాప్తిస్మము మరియు సిలువలో కార్చిన రక్తము ద్వారా కడిగివేసెను. సత్యము యొక్క తీక్షణ కాంతిని ఈ లోకంలో ప్రసరింపచేయుటకు మానవాళి మూల సమస్య అయిన పాపములను తొలగించుటకు మన ప్రభువు ఈ లోకమునకు వచ్చెను. మానవాళి మూల సమస్య అయిన పాపమును తొలగించుటకు మన ప్రభువు ఈ లోకమునకు వచ్చెను. యేసు సృష్టికర్త అయిన దేవుడు ఆయనే ఈ విశ్వమును దానిలోని ప్రతిదానిని సృజించెను. మానవాళిని వారి శాపమును పాపము నుండి విమోచించుటకై ఈ లోకమునకు వచ్చిన రక్షణ వెలుగు ఆయనే.అతి పరిశుద్ధ స్థలపు స్తంభము : 


అతి పరిశుద్ధ స్థలపు స్తంభము తుమ్మకర్రతో చేయబడిన నాలుగు స్తంభములచే నిర్మించబడినవి. బైబిలులో 4అను సంఖ్య బాధకు గుర్తు. నీల ధూమ్ర రక్తవర్ణము గల పేనిన సన్నపునారలో చూపబడిన కాంతివంతమైన రక్షణ వెలుగును విశ్వసించకుండా ప్రజలు రక్షింపబడరను సత్యము ఈ 4 స్తంభములలో చూపబడినది. అనగా దేవుడు తానే తన బాధ వలన నెరవేర్చినట్టి నీరు మరియు ఆత్మ మూలమైన సువార్తను విశ్వసించుట ద్వారానే తప్ప రక్షణ యొక్క కాంతివంతమైన రక్షణ వెలుగును చూడలేమని కూడా చూపించుచున్నది.

అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించగోరినవారు దేవుని సముఖమందు నిలువగోరినవారు వెలుగుచున్న నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను దేవుడు సిద్ధపరచిన రక్షణ సువార్తను తప్పకుండా విశ్వసించాలి. కానీ ఈ సువార్తను విశ్వసించక దేవుని యొద్దకు వచ్చువారు ఆయన భయంకర కోపమును ఎదుర్కొనెదరు. నీలి ధూమ్ర రక్తవర్ణముగల పేనిన సన్ననారలో చూపబడిన తీరుగానున్న సత్యమునందు నమ్మిక ఉంచినట్టి విశ్వాసము కలవారు మాత్రమే దేవుని యెదుట నిలువగలరు. ఈ తీక్షణమైన వెలుగు యొక్క సత్యము ద్వారానే మనమందరము దేవుని నివాసమైన అతి పరిశుద్ధ స్థలములోనికి రాగలము.

పాప క్షమాపణ సువార్త యొక్క సత్యము పాత నిబంధనలో చూపబడిన రక్షణ సత్యము నీల ధూమ్ర రక్తవర్ణపు దారములో కనబడుచున్నది. అదే పాప క్షమాపణ సువార్త నూతన నిబంధనలో యేసు పొందిన బాప్తిస్మము ఆయన సిలువ రక్తము మరియు పునరుత్థానములో నెరవేర్చబడినది. అతి పరిశుద్ధ సువార్త నమ్మునట్టి విశ్వాసము కలిగియున్నప్పుడు మాత్రమే మనం ఆ అతిపరిశుద్ధ స్థలములో ప్రవేశించగలము.నీలి ధూమ్ర రక్తవర్ణపు దారములో చూపబడిన మనరక్షణను మనం తప్పక విశ్వసించాలి.


హెబ్రీ 11:6 ఇట్లు చెప్పుచున్నది. ‘‘విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడైయుండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా.’’ దేవుడు సదా కాలము జీవించును. మనకు శాశ్వత జీవమునిచ్చుటకై ఆయన మన విశ్వాసము ద్వారా మనము పాపపరిహారము పొందుట అను దీవెనలను, ఈ భూమికి నరరూపిగా వచ్చిబాప్తిస్మమును పొంది, సిలువ వేయబడి, మృతి నుండి లేచి తద్వారా మన రక్షకుడాయెను. మన ప్రాచీన స్వభావమైన పాపమును మన పాపము కొరకైన ఘోర తీర్పును కడుగుట ద్వారా నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను నమ్ము విశ్వాసమును మన ఆత్మకిచ్చి ఖచ్చితమైన సంపూర్ణమైన పరిశుద్ధతతో మనప్రభువు మనలను కప్పెను.

మనలను నూతన జీవముతో కప్పుట ద్వారా మనము దేవుని యొద్దకు వెళ్ళి ఆయనను ప్రార్థించగలవానిగా మన ప్రభువు మనలను చేసెను. అంతేగాక దేవుని యెదుట ఆయన సన్నిధిలో మనము నిలువబడి ఆయనను తండ్రీ అని పిలువగల కృపను మనకనుగ్రహించెను. ఇవన్నియూ ఆయన మనకు ఇచ్చిన రక్షణ వలన కలుగబోవు దేవుని దీవెనలైయున్నవి. నీలి ధూమ్ర రక్తవర్ణపు పేనిన సన్నపునార అనుసత్యము ద్వారా మన కొరకు రక్షణను తెచ్చి దేవుడు మనలను విశ్వాసముతో రక్షింపబడి ఆయన ఎదుట నిలువగలిగినట్లు చేసెను.

రేపు, నీవు, నేను చావవలసియుండగా మనము పరలోకము చేరగలమను ధైర్యము గలిగి ఉన్నామా? ఇక్కడ మన భవిష్యత్తును గూర్చి కొద్దిగా ఆలోచిద్దాం. మనుష్యులు చనిపోయినప్పుడు వారందరూ దేవుని తీర్పు సింహాసనము ముందు నిలువబడతారు. దీని అర్థమేమనగా కేవలము మనము ఈ భూమిపై జరిగించిన పాపమను సమస్యను తొలగించుకోవాలి. దీని నెలా మనం పరిష్కరిస్తాం? మనం కేవలం యేసు మన రక్షకుడని గుడ్డిగా నమ్మితే అర్థము మనము ఏదో మతమును నమ్మినట్లు కాదా?

నేను నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను నిర్లక్ష్యపెట్టి కేవలము సిలువ రక్తమును విశ్వసించి నా సమస్యను పరిష్కరించుకొనుటకు ప్రయత్నించిన సమయం నా జీవితంలో కలదు. ఆ సమయంలో నేను యేసు నావంటి వారి కొరకే సిలువ వేయబడి మరణించెనని పాపమను సమస్యను ఆయనే సాధించెను. ఏ అనుమానం లేకుండా నమ్మాను కానీ ఈ విశ్వాసంతో నేను చేసిన ప్రతిదిన పాపమును సమస్యను పరిష్కరించుకొనలేక పోయాను. దానికి దూరంగా నీలి, ధూమ్ర, రక్తవర్ణముగల దారముయందు చూపబడిన రక్షణను విశ్వసించుట వలన నా ఆత్మ పూర్తిగా తిరిగి జన్మించెను.

గ్రుడ్డిగా యేసును రక్షకుడని మనం నమ్మినప్పుడు మన పాపములు తుడుపుపెట్టిబడినవి? పరిశుద్ధ దేవుని యెదుట మనం నిలవాలంటే ఆయనను గ్రుడ్డిగా నమ్ముట వలన కాదు. కానీ అది కేవలము సత్యమును తెలిసికొని దానిని విశ్వసించుట ద్వారానే సాధ్యము. ఆయనను మనం ఎంత గాఢంగా విశ్వసించిననూ నీలి, ధూమ్ర, రక్తవర్ణపు దారము ద్వారా పాపులను రక్షించిన సత్యసువార్తను మనం తెలిసికొనకపోతే ఆ పరిశుద్ధదేవుని మనం చూడలేము. మనము ఆ పరిశుద్ధ దేవునిని కేవలము నీరు మరియు ఆత్మ మూలమైన సువార్తను నమ్మినట్టి విశ్వాసం ద్వారానే చూడగలము. రక్షింపబడినవారముగా దేవుని యెదుట నిలబడునట్లు చేయగల ఆ సువార్త ఏది? ఆ సువార్త వెలుగిచ్చుచున్న నీరు మరియు ఆత్మ మూలమైన సువార్తయే.

మన ప్రభువు ఈ లోకమునకు వచ్చి, లోకపాపమును యోహాను ద్వారా పొందిన బాప్తిస్మం వలన తనపై మోపుకొని సిలువ వేయబడి తన రక్తమును కార్చెను. మూడు దినములలో మృతి నుండి తిరిగి లేచెను. ఆ విధముగా విశ్వసించు మన కొరకై ఆయన సంపూర్ణ రక్షణను నెరవేర్చెను. పాపము నుండి కడుగబడాలని మన ఆత్మలో కోరుకొనిన యెడల అది యేసు యోహాను నుండి పొందిన బాప్తిస్మం (మత్తయి 3:15) మరియు సిలువ రక్తము (యోహాను 19:30)ను మనము విశ్వసించినప్పుడే మనము వెలిగిచ్చు సత్యపాలనలో ప్రవేశించగలము. ప్రకాశించుచున్న నీరు మరియు ఆత్మమూలమైన సువార్త ద్వారా మన రక్షకుడైన యేసుక్రీస్తును మనం విశ్వసించని యెడల మన హృదయము హిమము వలె తెల్లగా మారనే మారవు.

అప్పుడప్పుడు మన శరీర బలహీనతలను చూస్తూ వాటిని గూర్చి మనం చింతిస్తాం.అయినప్పటికి నీరు మరియు ఆత్మమూలమైన సువార్త వలన తన బాప్తిస్మమనియు రక్తము ద్వారా మన పాపములను తుడిచివేసిన ప్రభువునకు కృతజ్ఞతలర్పించుటకై మనం ఆయన వద్దకు వస్తున్నాం. ఏ మార్గము వలన కూడా నీవు నేను పరిశుద్ధులము కాలేము. అయిననూ నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను విశ్వసించుట ద్వారానే మనం పరిశుద్ధులము కాగలము. మన దేవుడు మనలను పాపము నుండి పూర్ణముగా రక్షించెను. నీతి మరియు రక్తవర్ణ దారపు సువార్తను విశ్వసించుట ద్వారా మన పాపములన్నిటి నుండి మనలను రక్షించినట్టి వెలుగొందుచున్న సత్యమును మనం ఆవిష్కరించగలము. మనప్రభువు నీరు మరియు ఆత్మమూలమైన సువార్త ద్వారా మనలను శక్తిమంతులుగానూ, పరిశుద్ధులుగానూ చేసెను.

మత్తయి 19:24లో ప్రభువు ఇలాగు చెప్పెను. ‘‘ఇదిగాక ధనవంతుడు పరలోకరాజ్యములో ప్రవేశించుటకంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభమని మీతో చెప్పుచున్నాననెను” ధనవంతులైన వారు రక్షింపబడరు. ఎందుకనగా నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను నమ్ముట ద్వారానే పాపపరిహారము పొందగలమని వారు విశ్వాసము ఉంచలేరు. ఎవరైతే ఆత్మ విషయం బీదలై ఉంటారో, వారు పరలోకంలో ప్రవేశించాలని ఆశ కలిగి దేవుని సహాయం కొరకు అడుగుతారు. తమ స్వనీతిని త్రోసివేసి దానికి బదులుగా దేవుని నీతిని 100శాతం నమ్మువారు నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను విశ్వసించుట ద్వారా నిత్యజీవమును పొందుతారు. అతి పరిశుద్ధుడైన దేవుని మనం కలుసుకొనగలుగునట్లుగా నీరు మరియు ఆత్మమూలమైన సువార్త రక్షణ యొక్క వెలుగును ప్రకాశింపచేసెను. మనంతట మనము పరిశుద్ధులముగా ఎప్పటికీ మారలేం. ప్రభువు వలన అనుగ్రహించబడిన నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను మనం విశ్వసించినప్పుడు వాస్తవంగా మనం పరిశుద్ధులమై వెలుగు క్రిందకు మనం రాగలము.మనము మతపరమైన మరియు బోధనాపరమైన విశ్వాసమును తప్పక విడనాడాలి.


యోహాను 3:3లో యేసు తానే ఈలాగు చెప్పెను. ‘‘ఒకడు క్రొత్తగా జన్మించితేనేగాని దేవుని రాజ్యమును చూడలేడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాననెను.’’ అందుకు నికోదేము ‘‘ముసలివాడైన మనుష్యుడేలాగు జన్మించగలడు? రెండవ మారు తల్లిగర్భమందు ప్రవేశించి జన్మించగలడా?’’ (యోహాను 3:4) 

తిరిగి జన్మించనివారికి, విశ్వాసము ద్వారా క్రొత్తగా జన్మించుట అసాధ్యముగా తోచును. కొన్ని సమయాలలో ఆయన శిష్యులు కూడా ఆయన వాక్యమును అర్ధము చేసుకొనక దానిని గూర్చి అనుమానము కలిగియుండిరి. అందుకు ఆ ప్రభువు తన శిష్యులతో చెప్పెను. ‘‘ఇది మనుష్యులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తము సాధ్యమని చెప్పెను”. (మత్తయి 19:26) మానవమాత్రులు తమ మత సంబంధమైన విశ్వాసంతో దేవుని రాజ్యములో ప్రవేశించుట అసాధ్యమే కానీ నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను విశ్వసించువారికి ఆ రాజ్యములో ప్రవేశించుట సాధ్యమే. మనంతట మనం పరిశుద్ధులము కాకపోయినప్పటికి ఈ లోకమునకు ప్రభువు వచ్చి తన బాప్తిస్మం ద్వారా ఈ లోకపాపమును తనపై మోపుకొని సిలువవేయబడి మృతి నుండి తిరిగిలేచి మరి ఎన్నటికి లేనంతగా పాపమును ఒక్కసారే తుడిచిన రక్షణ యొక్క ప్రకాశమానమైన వెలుగు కనుపరచెను. దేవుడు వారిని తన రాజ్యములో ప్రవేశించగలిగినట్లు చేసెను.

ఆ గుడారమునకై వాడిన వస్తువులైన నీల, ధూమ్ర, రక్తవర్ణ దారములో చూపబడిన సత్యము నూతన నిబంధనలో యేసును కలిగిన నీరు మరియు ఆత్మ సంబంధమైన సువార్తకు ఎంతో అనుబంధము కలిగి వుంది. మరో విధంగా నీరు మరియు ఆత్మ సంబంధమైన సువార్తను నీలి మరియు ధూమ్ర రక్తవర్ణములో చూపబడిన సత్యమును ఒక్కటైయున్నవి. ఆ నీలి ధూమ్ర రక్తవర్ణ దారము ఆయన నిజరక్షణ యొక్క నీడగా కనబడుచున్నది. నీరు మరియు ఆత్మ సంబంధమైన సువార్త ఆ నీడ యొక్క నిజ స్వరూపమై యున్నది.

కాబట్టి మనము తేటైన రక్షణ యొక్క సత్యమును నీరు మరియు ఆత్మ సంబంధమైన సువార్త ద్వారా చూడవచ్చు. దానిపై ఆనుకొనవచ్చు వెలుగొందుచున్న నీరు మరియు ఆత్మ సంబంధమైన సువార్తలో శాంతి ఉన్నది. పసిబాలుడు ఆడుచూ విశ్రాంతి తీసుకొనుచూ తల్లి ఒడిలో ప్రశాంతముగా నిద్రించుచున్నడు దానిలో ప్రశాంతత ఉన్నది. అది అతి పరిశుద్ధుడైన దేవుని మనము కలుసుకొనగలిగిన సువార్త యొక్క అతి పరిశుద్ధ వెలుగును కనుగొనుచున్నది. వెలుగునిచ్చు నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను విశ్వసించుట ద్వారా మనము దేవుడనుగ్రహించిన రక్షణను పొందగలము. దేవుడిచ్చిన రక్షణను విశ్వసించువారు మాత్రమే నిత్య విశ్రాంతిని పొందగలరు.

క్లుప్తంగా అతి పరిశుద్ధమైన సువార్తయైన నీరు మరియు ఆత్మ సంబంధమైన సువార్తను విశ్వసించుట మాత్రమే మనలను ఆ అతిపరిశుద్ధతలోనికి అనుమతించును. నీరు మరియు ఆత్మ సంబంధమైన సువార్తను నమ్ము విశ్వాసమే పాపపరిహారము మన స్వంతమగునట్లు చేయును. మన ప్రభువు ఈ లోకమునకు వచ్చెను. తన బాప్తిస్మము మరియు సిలువ ద్వారాను సత్యసువార్తతో మన పాపమును ఒకేసారిగా తుడిచివేసెను. నీల, ధూమ్ర రక్తవర్ణము దారము మరియు పేనిన సన్నపునారతో ఆయన మనకిచ్చిన వాగ్ధానమును నెరవేర్చెను. యేసును తమ రక్షకునిగాను, నీరు మరియు ఆత్మ సంబంధమైన సువార్తలోనూ విశ్వాసముంచు వారు నిత్యజీవమును పొంది పరమునకు చేరెదరు.

ఈ నీరు మరియు ఆత్మ సంబంధమైన సువార్త 30 సంవత్సరముల నుండే బోధించబడుతుంటే వాస్తవంగా అది ప్రపంచమంతటా తుడిచిపెట్టబడాలి. కానీ అంత్య కాలములోనే ఆ సత్యము వ్యాపించాలని దేవుని సంకల్పము మన ప్రభువు ప్రకటనలో అనేకులైన అన్యజనులు తమ పాపము నుండి రక్షింపబడునని సెలవిచ్చెను. మరియు అనేక హతక్ష్యులుండునని అంత్యకాలములో చాలినంత మంది ప్రభువును నమ్ముకొనుట ద్వారా తమ విశ్వాసమును కనుపరచి తమ హతసాక్ష్యమును అంగీకరించెనని కూడా సెలవిచ్చెను. మరో విధంగా మన ప్రభువు అంత్యకాలము అనేక ఆత్మలు కోతకాలమని చూపెను. సత్యసువార్తను నిజముగా విశ్వసించువారు మాత్రమే తమ పాపములన్నిటి నుండి రక్షణ అను అనుమానమును పొందాలని దేవుడు నిర్ణయించెను.

ఇప్పుడు ఈ కాలమందు నీరు మరియు ఆత్మ సంబంధమైన సువార్త వినుటకు చాలినంత ధన్యుడవు కనుక నీవు నీ పాపాలన్నిటి నుండి రక్షింపబడగలుగు చున్నావు. ఈ నీరు మరియు ఆత్మ సంబంధమైన సువార్తను మనకిచ్చినందుకు దేవునికి నిజముగా నేను కృతజ్ఞుడను. మనందరికీ ఏమి జరిగింది. మనమందరమూ నీరు మరియు ఆత్మ సంబంధమైన సువార్తను వినలేదా? కానీ ఇప్పుడు నీరు మరియు ఆత్మ సంబంధమైన సువార్తను వినువారందరూ స్వీకరించుటలేదు. అనగా ఆ సత్యము ప్రతివాని హృదయములో ప్రవేశించుట లేదు.

నిజానికి ప్రపంచ వ్యాప్తంగా ఎందరో క్రైస్తవులున్ననూ వారిలో అనేకులకు నీరు మరియు ఆత్మ సంబంధమైన సువార్త తెలియదు వారిలో విశ్వాసము లేదు. అయితే సత్యసువార్తను ఎరుగని ఈ ప్రజలు పాపమునుండి ఎట్లు విమోచింపబడతారు? అందువలననే క్రైస్తవ లిటరేచరు ద్వారా సత్యసువార్తను వ్యాప్తి చేయుటకు మనకు అనుమతిచ్చెను.

మేము ప్రచురించుచున్న నీరు మరియు ఆత్మ సంబంధమైన సువార్త లిటరేచరు ద్వారా చదివిన తరువాతే సత్యసువార్తను తెలిసికోగలిగామని సాక్ష్యము యిచ్చువారు ప్రపంచవ్యాప్తంగా అనేకులున్నారు. ఈ నీరు మరియు ఆత్మ సంబంధమైన సువార్తను ఎరుగక మునుపు వారికి కేవలము సిలువ రక్తము మాత్రమే తెలిసియున్నది. కానీ ఇప్పుడు వారు నీరు మరియు ఆత్మ సంబంధమైన సువార్తను స్పష్టముగా అర్థము చేసికొనునట్లు విశ్వసించునట్లు చేసిన ప్రభువునకు కృతజ్ఞతలను తెలుపుచున్నారు. మరియు యోహానుచే యేసు పొందిన బాప్తిస్మమునకు అంత గొప్ప ప్రాముఖ్యత ఉన్నట్లు తెలియదని కూడా సాక్ష్యమిచ్చుచున్నారు. వారు ఇప్పుడు ఈ సువార్తను విశ్వసించినందుకు దేవునికి ఎట్లు కృతజ్ఞతలు తెలపాలో ఎరుగకున్నారు.

నీల, ధూమ్ర, రక్తవర్ణము గల పేనిన సన్నపు నారతో చేయబడిన ప్రత్యక్ష గుడారపు ద్వారము కూడా నీరు మరియు ఆత్మ సంబంధమైన సువార్త వంటిదేనని మనకు తెలియుచున్నది. ఈ నాలుగు రంగులు నీరు మరియు ఆత్మ సంబంధమైన సువార్త వంటిదే. అదే రీతిగా అతి పరిశుద్ధ స్థలము యొక్క ముసుగు. పరిశుద్ధ స్థలము ద్వారముయొక్క తెరలలో కూడా తేటగానున్న నీరు మరియు ఆత్మ సంబంధమైన సువార్త కనబడుచున్నది. అదే గాక గుడారపు మొదటి తెర అవే నాలుగు రంగులతో వేయబడెను. నీలి,ధూమ్ర, రక్తవర్ణము గల పేనిన సన్నపునార దారము. ఈ సత్యము యేసు బాప్తిస్మమును సూచించుచున్నవి. కాబట్టి యేసు నేనే పరలోకమునకు మార్గమునని తనను గూర్చి చెప్పుకొనెను. ఈ లోకమునకు వచ్చి పాపులను నీరు మరియు ఆత్మ సంబంధమైన సువార్త సత్యముతో రక్షించి, విశ్వసించు వారిని ఆయన పాపరహితులనుగా చేసెను.

యేసు బాప్తిస్మమును సిలువ రక్తమును విశ్వసించు విశ్వాసములోనే పరలోక రాజ్యమునకు మార్గము కనబడుచున్నది. నీల, ధూమ్ర, రక్తవర్ణము పేనిన సన్ననారతోనే యేసు మనలను పాపము నుండి పూర్ణముగా రక్షించెను. ఈ సత్యమును నీవు ఎక్కడ కనుగొనగలవని నీవు యోచిస్తున్నావా? యేసుక్రీస్తు పొందిన బాప్తిస్మమును ఆయన సిలువ రక్తమును నీవు నమ్మిన యెడల పాపములన్నిటి నుండి నీవు రక్షింపబడతావు. ఒకేసారి నీవు నిత్యజీవమును పొందుతావు.

యేసుక్రీస్తును ఏదో రీతిని నమ్ము విశ్వాసమునకు ఖచ్చితంగా నీరు మరియు ఆత్మ మూలమైన సువార్తను విశ్వసించు వారికి విశ్వాసానికి మధ్య తేడా ఏమిటి? ప్రభువు పాపులను వారి బలహీనతలన్నిటి నుండి రక్షించిన సువార్త నీరు మరియు ఆత్మ మూలమైన సువార్త కనుకనే. ఈ సువార్తను విశ్వసించుటే ప్రభువును సరిగా నమ్ముట. ప్రభువు తన బాప్తిస్మంతోనూ, సిలువ రక్తముతోనూ పాపులను రక్షించెను కనుక ఆయన నెరవేర్చిన నీతియైన నీరు మరియు ఆత్మ మూలమైన సువార్తను విశ్వసించుట కూడా ప్రభువును తమ స్వరక్షకునిగా నమ్ముటతో సమానమే. ఏదో ఒకరీతిని ఆయన నామమును మాత్రమే నమ్ముట అనగా మన పాపము క్షమించబడి మనం పరలోకం చేరుతామని అర్థం.

కానట్లయిన యేసుక్రీస్తు యోహానుచే బాప్తిస్మం పొందెను. సిలువపై తన రక్తమును కార్చెను. పాపశిక్షను భరించెను. మృతి నుండి తిరిగిలేచెనని ఖచ్చితంగా నమ్ముట ద్వారా మన పాపముకు ప్రాయశ్చిత్తం పొంది దేవుని స్వజనులము కాగలము. అతి పరిశుద్ధ సువార్త అయిన నీరు మరియు ఆత్మ మూలమైన సువార్తను విశ్వసించువారిని మాత్రమే దేవుడు పరలోక రాజ్యములో ప్రవేశించుటకు అనుమతినిచ్చును. కానీ నీరు మరియు ఆత్మ మూలమైన సువార్తను విశ్వసించని వారు తిరిగి జన్మించలేదు కనుక పరలోకరాజ్యము చేరలేదు.

ప్రత్యక్ష గుడారములో చూపబడిన నీరు మరియు ఆత్మ మూలమైన సువార్త యొక్క తీక్షణ వెలుగును విశ్వసించుటతో ఈ భూమి మీద నుండగానే అతి శుద్ధమైన విశ్వాసాన్ని మనం పొందగలుగుతున్నాము. మన క్రియలు అయోగ్యమైనప్పటికి, మనకు అట్టి విశ్వాసమున్నప్పుడు మనం పరిశుద్ధులము కాలేదని ఎవరైనా ఎలాగు చెప్పగలరు? నీరు మరియు ఆత్మ మూలమైన సువార్తను విశ్వసించిన మనం పరిశుద్ధులమైనప్పుడు మనలో పాపము ఇంకనూ ఎట్లుండును? పాపమును కొనసాగించు శరీరములో కొనసాగుచుండగా మనం పాపరహితులమని ఎట్లు చెప్పగలమనికొందురు ఆశ్చర్యపోవచ్చు.

కానీ అది వారి ఆలోచనే. నీరు మరియు ఆత్మ మూలమైన సువార్తను తెలిసికొని విశ్వసించిన వారు మనుష్యులు అపరిపూర్ణ శరీరము కలవారై చనిపోవు వరకు పాపం చేస్తారనే భావనతో ఏకీభవిస్తారు. అయిననూ యేసుక్రీస్తు యొక్క బాప్తిస్మం మరియు ఆయన సిలువలోని పరిపూర్ణ రక్షణలో, మనం భవిష్యత్తులో చేయబోవు పాపముతో సహా మన పూర్వపాపములన్నియు ఒకేసారి క్షమించబడెనని మనం నమ్ముచున్నాం.

మన ప్రభువును నీలి, ధూమ్ర, రక్తవర్ణపు పేనిన సన్నపునారలో చూపబడిన రక్షణ అను సత్యమును మనకిచ్చెను గనుక అట్టి ఆత్మీయ విశ్వాసముతో కూడిన వాక్యమును అతి పరిశుద్ధ విశ్వాసమును ఈ భూమిపై నుండగానే నీవు నేను పంచుకొనగలుగుచున్నాము. అది ఎందుకనగా దేవుడు మనకు తన కానుకగా ఇచ్చిన సత్యవాక్యమైన నీరు మరియు ఆత్మ మూలమైన సువార్తను విశ్వసించగల విశ్వాసమును ప్రభువు మనకిచ్చెను. ప్రభువునందున్న మన విశ్వాసముతో, ప్రేమించవలెను. మనలో ఒకరితో నొకరము బంధమును కలిగి నివసించుచూ దేవుని సేవించుచూ ఒకరినొకరము ప్రేమించవలెను. అనగా దానిలోనే మన నిజ ఆనందమున్నది.

మనం ఆయన సువార్తను బట్టి ఆయనకు కృతజ్ఞతలు, నేను నీరు మరియు ఆత్మ మూలమైన సువార్తను తెలిసికొని దానిలో విశ్వసించగలుగుట ఎంత ఆశ్చర్యము! నాకు యేసు బాప్తిస్మమునందు పట్టులేనప్పుడు సత్యవాక్యము ద్వారా ఈ నీరు మరియు ఆత్మ మూలమైన సువార్తను విశ్వసించు హృదయమును దేవుడు నాకిచ్చెను. నీరు మరియు ఆత్మ మూలమైన సువార్తను విశ్వసించుటతో మనమందరమూ పరలోక దీవెనలను పొందగలిగాము.నా హృదయములోనున్నది సత్యవాక్యము కావున దానిని నేను నిజమైన కృతజ్ఞతతో బోధిస్తాను.


బైబిలును చదువుచున్నప్పుడు నా మనస్సులో ఒక ప్రశ్న ఉదయించింది. యేసు ఎందుకు బాప్తిస్మం పొందెను? ఈ ప్రశ్న నాలో జనియించుచున్నందున బైబిలు ద్వారానే దాని సమాధానమును వెదకుట ప్రారంభించాను. కానీ ఎవరూ దానిని నాకు బోధించలేకపోయిరి. నీరు మరియు ఆత్మ మూలమైన సువార్తను తెలిసికొను పర్యంతము ఈ భాగమునందు నేను అతి ఆసక్తి కలిగియుంటిని.

ఎక్కువగా నేను మత్తయి 3:13-17లో భాగమును చదువుతాము. ప్రత్యేకంగా బాప్తిస్మం పొందుటకు ముందు యేసు యోహానుతో మాట్లాడినది ‘‘ఇప్పటికి కానిమ్ము; నీతియావత్తు ఈలాగు నెరవేర్చుట మనకు తగియున్నది.’’ కాని దాని అర్ధమును నేను గ్రహించలేకపోయేవాడిని. కనుక నేను ప్రతివారిని యొర్దాను నదిలో యేసు బాప్తిస్మమిచ్చుయోహాను ద్వారా బాప్తిస్మము ఎందుకు పొందెనని అడిగెడి వాడను. కానీ నేను ఎల్లప్పుడూ కూడా పూర్తిగా నన్ను తృప్తిపరచు సమాధానాన్ని వినలేదు. యోహాను నుండి యేసు పొందిన బాప్తిస్మము యొక్క ఆవశ్యకతను దేవుడే నాకు తెలియచేసెను గానీ మరి ఎవరి వలన తెలిసికొనలేకపోయాను. ఒకగ్రుడ్డివాడు తన కను దృష్టిని పొందిన రీతిగానే ఇది నాకొక ఆత్మీయ విప్లవంగా మారింది. కనుక నేను మత్తయి 3:13-17 యొక్క అర్థమును గ్రహించిన తరువాత, నన్ను నా పాపము నుండి రక్షించిన నీలి, ధూమ్ర, రక్తవర్ణ పేనిన సన్నపునారలో చూపబడిన సత్యమును కూడా గుర్తించగలిగాను.

ఈ సత్యమును నేను గ్రహించక మునుపు కేవలము సిలువ రక్తమును నా రక్షణ అని నమ్మాను. కానీ నేను పాపమును కలిగియున్నాను. కనుక నేను పాపినే. ఆ సమయంలో నేను నా మూలపాపములను మాత్రమే యేసు రక్తము ద్వారా కడుగుకొనగలను. కానీ నా హృదయ పాపము నాలోనే మిగిలి యుండును అని నేను నమ్మాను. ఒకనిని పూర్తిగా పాపములేకుండా చేయు విశ్వాసమున్నదని నాకు తెలియదు. అనగా నేను యోహాను నుండి యేసు పొందిన బాప్తిస్మమును గూర్చి పూర్తిగా విస్మరించాను. అయిననూ ఒక చీకటి గదిలో ఒక దీపము వెలిగినట్లుగా దేవుడు పాపపరిహారము యొక్క తీక్షణ వెలుగుతో నాహృదయమును వెలిగించాడు. ఆహా! యేసు యోహాను నుండి పొందిన బాప్తిస్మం పాత నిబంధనలోని బలివ్యవస్థ యందు బలిపశువుపై చేతులుంచుటకు సంబంధించినది! ఇదే నీరు మరియు ఆత్మ మూలమైన సువార్త.

తరువాత జరిగినది ఏమిటి? నా గుర్తింపు వలన, ఈ సత్యమును గ్రహించిన తరువాత నా హృదయములో ఒక గొప్ప సంఘర్షణ జనించడం మొదలైంది. ఏ సువార్త కాక నీరు మరియు ఆత్మ మూలమైన సువార్తయే నిజ సువార్త. అయితే ఈ లోకమునకు సంభవింపబోవునది ఏమిటి? ఇవాంజలికల్‌ విశ్వాసము బైబిల్‌ పరంగా బలమైనదని నేను అనుకున్నాను. కానీ ఇప్పుడు నీరు మరియు ఆత్మ మూలమైన సువార్త కాక మిగిలిన సువార్త సాతాను నుండి వచ్చు తప్పుడు బోధలని గ్రహించుకొన్నాను.

అప్పటి నుండి నేను చేసినది ఏమనగా నీరు మరియు ఆత్మ మూలమైన సువార్త తప్ప వేరొక సువార్త సత్యముకాదని నమ్మి, బోధించసాగాను ఇందును బట్టి కొద్దిమంది నన్ను విమర్శించారు. అనేక బలహీనతలు వున్న మనుష్యుడనైన నాకు దేవుడు నీలి, ధూమ్ర, రక్తవర్ణ దారములో నున్న రక్షణ సత్యమును కూడా నాకు తెలియపర్చాడు. ఇదే సత్యము. నిజమైన సువార్త అని విశ్వసించి ప్రచురించునట్లు నన్ను ఆయన చేశాడు. ఈ సువార్తను పోలిన సువార్తలు ఈ లోకంలో ఎన్నో ఉన్నాయి. కాని నిజమైన సువార్త ఒకే ఒక్కటి ఇందుమూలముననే నేను నీరు మరియు ఆత్మ మూలమైన సువార్తను ప్రపంచం అంతటా వ్యాప్తి చేయాలని నిర్ణయించాను.

పాపపరిహారమును గూర్చిన సత్యమును బోధించుటకు నేను ఎట్లు వచ్చితినని అతి పరిశుద్ధ సువార్త అయిన నీరు మరియు ఆత్మ మూలమైన సువార్తను నేను తెలుసుకొని విశ్వసించి వ్యాప్తి చేయుచున్నానని నేను తలంచినప్పుడు నేను దేవునిచే ఎంత ఘనంగా దీవించబడినానన్నది గ్రహించగలిగాను. నేను చేసినదంతా కేవలము యేసు, యోహానుచే బాప్తిస్మము పొందుట ద్వార లోక పాపమును తనపై మోపుకొని సిలువపై తన రక్తమును చిందించెను. ఇప్పటికి నేను చేయు పాపము పొగొట్టబడెనని నమ్మాను. నీరు మరియు ఆత్మ మూలమైన సువార్తయే నిజమైన సత్యము. ఈ సువార్తను నాకిచ్చినందుకై నేను ప్రభువుకు కృతజ్ఞుడను వాస్తవంగా దేవునిచే ఘనముగా దీవించబడిన మనుష్యుడను నేను, నీరు మరియు ఆత్మ మూలమైన సువార్తను విశ్వసించు మీరు కూడా అట్టి దీవెనలను పొందిన ప్రజలే.

ఇవన్నియూ దేవుడు నాపై కుమ్మరించిన ఆయన దీవెనలేనని నేను నమ్ముచున్నాను. అపోస్తలుడైన పౌలు ఒప్పుకున్నట్లు ‘‘అయిననూ నేనేమైయున్నానో అది దేవుని కృప వలనే అయియున్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు” (1కొరింధి 15:10). నాపై కుమ్మరింపబడిన ఆయన కృపకై నేను ఆయనకు స్తుతిని తప్ప మరేమియూ అర్పించలేను. నీలి, ధూమ్ర, రక్తవర్ణములో చూపబడిన సత్యసువార్తను దేవుని సంఘంలో కాక మరెక్కడా నీవు వినలేవనునదే అన్నింటికంటే నమ్మదగినది కాదా? నీలి, ధూమ్ర, రక్తవర్ణపు పేనిన సన్నపునారయొక్క వాక్యమును విని, విశ్వసించువారు ఎవరైనా హృదయ శుద్ధి కలవారే అగుదురు. అయితే నీరు మరియు ఆత్మ మూలమైన సువార్తను నమ్మనివారు ఆ సువార్తను గురించి ఏమని ఆలోచిస్తారు? వారి కొరకు నీరు మరియు ఆత్మ మూలమైన సువార్త సత్యము వ్యర్థమైనదిగా వున్నది.

అతి పరిశుద్ధ స్థల ప్రధాన ముసుగునందున్న నీల, ధూమ్ర, రక్తవర్ణపు దారంను నీవు నమ్ముచున్నావా? నీవు ఈ వాక్యమును వినినప్పుడు, అది నీకు ఇప్పటికే తెలియునని తలంచవద్దు. కానీ ఈ సత్యము నీ హృదయంలో వున్నదో లేదో నిన్ను నీవే పరిక్షించుకోవాలి. అనగా ఇప్పుడు, నీవు మరియు ఆత్మమూలమైన సువార్తను లేఖన వాక్యము ప్రకారము విశ్వసించువాడవు. దేవుని మందిరములోని వచ్చుటకు దేవుని వాక్యమును వినుటకు నీవు అదృష్టవంతునివై దీవెన పొందువాడవగుదువు మరియు పరలోకములో ప్రవేశించు అర్హతగలవాడవు.

అట్లు కాక నిజవిశ్వాసము పొందుటకు పరలోక రాజ్యములో ప్రవేశించుటకు, నీవు నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను తెలిసికొనలేక కల్పితమైన పారంపర్య కల్పితకథను నీవు వినుచుంటే అది నీకు ఏ ప్రయోజనము చేకూర్చును? నీవు విశ్వసించు సువార్త నీరు మరియు ఆత్మమూలమైనది. కానట్లయిన ప్రభువు ఎదుట నీ ఆత్మ ఏ సంబంధమగును? నీ విశ్వాసము. దేవుని వాక్యము ఖచ్చితంగా ఒక్కటే కావాలి. ఏలాగనగా అపోస్తలుడైన పౌలు విశ్వాసము, మన విశ్వాసము ఒక్కటైనట్లు పేతురు ఏ నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను విశ్వసించెను. అదే సువార్తను మనం కూడా విశ్వసిస్తున్నాం. (1 పేతురు 3:21)

ఈ అంత్యకాలములో నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను విశ్వసించుటకు మనలను అనుమతించిన దేవునికి నా కృతజ్ఞతలు మన పుస్తకముతో పాటు నీరు మరియు ఆత్మమూలమగు సువార్త సత్యమును పట్టుకొని దానిని ఇతరులకు బోధించుచున్న వారు కూడా తమ ఆనందము కొలది పాపక్షమాపణ పొంది దేవునికి కృతజ్ఞతలు తెలియపరుస్తారు. ప్రత్యక్ష గుడారము సమకూర్చిన వస్తువులు, విధానాలు అన్నీ మన పాపాలన్నింటిని తుడిచివేసిన ప్రభువు యొక్క రక్షణ స్వరూపమై వున్నవి. ఈ సత్యము కొరకు మనం దేవుని స్తుతించాలి.

అతి పరిశుద్ధ స్థల ద్వార ముసుగులో చూపబడిన సత్యమును మనము నమ్మినప్పుడు మనము రక్షింపబడుటకు, పరలోకములో ప్రవేశించుటకు మనము దీవింపబడిన వారము అంతేగాక నీల, ధూమ్ర రక్తవర్ణ పేనిన సన్నపునారతో చేయబడిన పాపపరిహారము యొక్క సత్యమును ప్రపంచవ్యాప్తంగా ప్రచురించుటకు దేవుడు మనలను అనుమతించెను. దేవుడు ఈ పనిని మనకప్పగించెను. మనకు చెందిన పనులలో నుండి మనకు అప్పగింపబడిన పనిలో నమ్మకంగా వుండాలి. ఈ నమ్మకత్వమును బట్టి దేవుడు మనలను దీవిస్తాడు.

నా కృతజ్ఞతలను దేవునికి అర్పిస్తాను. ప్రత్యక్ష గుడారపు ద్వారమును ఉపయోగించిన నీలి, ధూమ్ర రక్తవర్ణపు పేనిన సన్ననారలో చూపబడిన నీరు మరియు ఆత్మమూలమైన సువార్తయే అతి పరిశుద్ధ స్థల ముసుగులో నున్న నాలుగు రంగులని నమ్మిన నా విశ్వాసముతో నేనాయనను మహిమ పరుస్తాను. విశ్వాసము ద్వారా పాపములన్నిటి నుండి రక్షింపబడిన వారిలో మీరు వుంటారని దేవుడు నిత్యము నివశించు అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశింపగలరని నేను అతి నిజమైన నమ్మికను కల్గి వుంటిని. నీ విశ్వాసము నీ సత్యము మీద కూడా స్థిరముగా నున్నదా?