Sermons

[11-14] < మత్తయి 27:50-53 > చిరిగిన ఆ తెర< మత్తయి 27:50-53 >

“యేసు మరలా బిగ్గరగా కేకవేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పై నుండి క్రింది వరకు రెండుగా చినిగెను. భూమి వణకెను. బండలు బ్రద్ధలాయెను. సమాధులు తెరువబడెను. నిద్రించిన అనేకమంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధులలో నుండి బయటకువచ్చి ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణములో ప్రవేశించి అనేకులకు అగపడిరి.’’దేవుడు నివసించు స్థలము అతి పరిశుద్ధము. ఇశ్రాయేలీయులు పాపపరిహారము కొరకై మేక రక్తమును బలిగా, ఆ అభిషేకదినమున చేతబూనిన ప్రధాన యాజకుడు మాత్రమే సంవత్సరమునకు ఒకసారి మాత్రమే ఆ అతిపరిశుద్ధ స్థలములో ప్రవేశించును. అతడు అలాగున ఎందుకు చేయయవలెననగా దేవుని మందిరమైన ఆ అతిపరిశుద్ధ స్థలము పాపుల బలహీనతలను తుడిచివేయుటకై అతని చేతులుంచబడిన బలిపశువు రక్తము లేకుండా అతడు దానిలో ప్రవేశింపలేడు. మరొక విధంగా చూస్తే ప్రధాన యాజకుడు కూడా ఆయన సన్నిధిలో ప్రవేశించక మునుపు తన పాపము నిమిత్తమై బలి అర్పించనట్లైన దేవుని ఉగ్రతను తప్పించుకొనలేడు. 

ఆలయ తెర ఎప్పుడు చినిగెను? యేసు సిలువపై తన రక్తమును చిందించి చనిపోయినప్పుడు అది చినిగెను. సిలువపై చనిపోవుటకు ఆయన రక్తమును ఎందుకు చిందించాలి? ఎందుకనగా దేవుని కుమారుడైన యేసు మానవరీతిగా ఈ లోకమునకు వచ్చి యొర్దాను నదిలో యోహానుచే బాప్తిస్మమును పొంది పాపులందరి లోపమును తనపై మోసుకొనెను. తన బాప్తిస్మము ద్వారా యేసు లోకపాపమును తనపై మోసుకొనిన కారణాన ఆయన సిలువపై తన రక్తమును చిందించి చనిపోతేనే గాని పాపశిక్షను యేసు అంతమొందించలేరు. ఇందు మూలమున దేవుని ఆలయములో పరిశుద్ధ స్థలము నుండి అతిపరిశుద్ధ స్థలమును వేరు చేయుతెర పై నుండి క్రిందికి చినిగెను. అనగా దేవుని నుండి మనుష్యుని వేరుపరచిన పాపగోడ ఒక్కసారిగా కూలెను.

మరో విధంగా యేసు పొందిన బాప్తిస్మము మరియు ఆయన కార్చిన రక్తము ద్వారా, ఆయన పాపములన్నింటిని మాయమగునట్లు చేసెను. యేసు బాప్తిస్మము మరియు సిలువ రక్తముతో తండ్రి అయిన దేవుడు మన పాపములన్నింటిని ఒకేసారిగా తుడిచివేసి పరలోక ద్వారము తెరచెను. కనుక యేసు బాప్తిస్మమును ఆయన కార్చిన రక్తమును విశ్వసించినవారు ఎవరైనను ఇప్పుడు పరలోకములో ప్రవేశించెదరు.

యేసు సిలువపై మరణించినప్పుడు ఆయన మూడు గంటలు ఉన్న స్థలములో సాతాను కూలెను. యొర్ధాను నదిలోని బాప్తిస్మం ద్వారా లోకపాపములన్నీ మోసినవాడై యేసు సిలువ వేయబడి మరణమును సమీపించుచూ, ‘‘ఏలీ, ఏలీ, లామా, సబక్తానీ”? అనగా ‘‘నా దేవా, నా దేవా నా చేయి ఎందుకు విడిచితివి?’’ (మత్తయి 27:46) అని బిగ్గరగా కేక వేసెను. తరువాత ఆయన ఆఖరి మాట ‘‘సమాప్తమైనది!’’ అని పలికి ప్రాణము విడిచెను. మూడు దినములలో ఆయన మృతి నుండి తిరిగి లేచెను. 40 దినములు ప్రత్యక్షమగుచూ సాక్ష్యమిచ్చెను. తరువాత అనేకులైన అనుచరులు మరియు శిష్యులందరి యెదుట ఆరోహణమాయెను.తండ్రి యేసును విడిచెనా?


యేసు పొందిన బాధ తన తండ్రి తనను విడిచెనా అనునంతగా బాధించెను. పాప శిక్ష యొక్క బాధ అంత గొప్పది. యోహాను ద్వారా బాప్తిస్మం పొంది యేసు లోకపాపమును తనపై మోపుకొనెను. గనుక సిలువపై ఆయన శిక్షించబడినపుడు, తాత్కాలికంగా ఆయన తండ్రిచే తృణీకరింపబడినది వాస్తవము. పాపము చేసిన వారిని తండ్రియైన దేవుడు శిక్షించవలసియుండగా, ఆ పాపములన్నియు యేసు పై మోపబడిన కారణంగా ఆ పాపముకు శిక్షగా యేసు నలుగగొట్టబడిన సిలువపై తన రక్తమును కార్చెను.

యేసు స్వభావమందు దేవుడైన కారణాన బాప్తిస్మం పొందుట వలన మానవాళి పాపమును తనపై మోపుకొనెను. కనుక లోకపాపములన్నియూ ఆయన పరిశుద్ధ దేహము పైకి మార్చబడెను. కనుక లోక పాపమును తనపై మోపుకొనినవాడైన యేసు ఒక క్షణము తండ్రియైన దేవుని వలన తృణీకరింపబడవలసి వచ్చెను. మన పాపములన్నిటి జీతము చెల్లించుటకై సిలువపై బాధింపబడెను. తద్వారా మానవాళిని వారి పాపములన్నింటి నుండి రక్షించెను. ఇందువలన యేసు పాపశిక్ష యొక్క పాశవికమైన బాధను అనుభవించాలి. అందుకే క్లుప్తంగా తండ్రి దేవుడు కుమారుని నుండి తన ముఖమును త్రిప్పుకొనెను.

కానీ శాశ్వతముగా తండ్రియైన దేవుడు యేసుని వదలివేసెనని దీని అర్థము కాదు. కాని దీని భావమేమదనగా పాపము యొక్క ఘోర శిక్షను యేసు అనుభవించవలెను. కనుక క్షణకాలము మాత్రమే ఆయన తండ్రియే ఆయనను వదిలి పెట్టబడెను. యేసు బాధలో అరచినట్లుగానే ‘‘నాదేవా నా దేవా, నన్నేల విడచితివి”? మన పాపములను బట్టి మనము వెలి వేయబడవలసిన వారము కానీ యేసు మన పాపములను మోసి సిలువపై మన పాప భారమునకై బాధ అనుభవించెను. అదియే కాక మన నిమిత్తము తండ్రిచే విడిచి పెట్టబడెను.

నీకు ఇప్పటికే తెలిసియుండవచ్చును. రాజైన సొలోమోను కాలంలో ఆలయ నిర్మాణం పూర్తయిన తర్వాత ప్రత్యక్ష గుడారము స్థానంలో ఆలయము వచ్చింది. కానీ ప్రత్యక్ష గుడారపు మూల సూత్రాలన్నీ ఆలయమునకు కూడా దాని నిర్మాణమునకు ముందే వర్తించెను. కనుక అక్కడ కూడా ఆలయపు అతి పరిశుద్ధ స్థలమునుకు పరిశుద్ధ స్థలమును వేరు చేయుచూ ఒక తెర ఉండాలి. మన ప్రభువు సిలువపై ఏలీ ఏలీ లామా సబక్తానీ? అని అరచిన వెంటనే ఆ ఆలయపు తెర పై నుండి క్రింది వరకు చినిగెను. ఈ సంఘటన ద్వారా బయలుపడిది ఏదనగా మన ప్రభువు తాను పొందిన బాప్తిస్మము మరియు ఆయన పశురక్తమును సిలువలో కార్చుట వలన మన పాపమును కడిగి వేసెను. ఇప్పుడు పరలోక ద్వారము పూర్తిగా తెరవబడెను. కనుక విశ్వసించుట ద్వారా విశ్వాసంతో మన మందరమూ పరలోకంలో ప్రవేశించగలము.

ప్రత్యక్ష గుడారపు విప్లవం ద్వారా పాత నిబంధన కాల ప్రజలు కూడా యేసు మెస్సయ్యగా వస్తాడని నమ్మిక కలిగియుండిరి. కాబట్టి వారు తమ పాపములను ఒప్పుకొని దేవుని పిల్లలయ్యారు. క్రొత్త నిబంధనలో, పాప పరిహారము యొక్క దేవుని నీతి అంతయూ మనప్రభువు ఒకేసారిగా యొర్ధాను నదిలో బాప్తిస్మము పొంది సిలువలో చనిపోయినప్పుడు నెరవేరెను. దేవుడు మనకు అనుగ్రహించిన పాపపరిహార సువార్తను విని విశ్వసించి మన హృదయాలు కృతజ్ఞతతో ఉండుటకు మనము నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను కలిగియుండుటే కారణము.

మన స్వంతంగా, పాపము నుండి విమోచించుకోనలేము. కానీ నీరు మరియు ఆత్మమూలమైన సువార్త ద్వారా దేవుడు మనకు రక్షణ అనుగ్రహించెను కనుక, ఆ సత్యమును విశ్వసించిన మనము మన పాపము క్షమించబడునట్లుగా చేసెను. యేసు మనకనుగ్రహించిన నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను విశ్వసించుట వలన, మన పాపములు తుడుపు పెట్టబడినవి కనుక మనము ఉండగలమా? మనము కేవలము ఆయనకు కృతజ్ఞతలు చెల్లించగలము. ఎందుకనగా మన ప్రభువు చనిపోయిన క్షణాన పరలోక ద్వారము పై నుండి క్రిందకు పగిలెనని ఇప్పుడు మనకు తెలియుచున్నది. మన ప్రభువు మానవాళి పాపమును యొర్ధాను నదిలో ఆయన పొందిన బాప్తిస్మం ద్వారా తనపై మోపుకొనెననియు సిలువలో రక్తము కార్చుట ద్వారా పాప శిక్ష భరించెనని విశ్వసించు వారందరినీ తమ పాపము నుండి విడిపించెనును వార్త మనకు ఎంతో ఆనందమును కలిగించును.

యేసు సిలువపై చనిపోయినప్పుడు ఆలయపు తెర పై నుండి క్రింది వరకు చినిగెనను సత్యము, నీరు మరియు రక్తమును గూర్చిన సువార్తను విశ్వసించుట ద్వారా తమ పాపము శుద్దీకరింపబడినవారు పరలోకంను గూర్చిన సువార్త విశ్వసించుట ద్వారా తమ పాపము శుద్ధీకరింపబడినవారు పరలోకంలో ప్రవేశింశచగలరని మనకు బోధించుచున్నది. దేవుడు మనకు అనుమతించిన రక్షణ అను సత్యమునకు ఇదే ఒక ఖచ్చితమైన ఆధారమైయున్నవి. మనము పాపులము కనుక మనలను దేవుని యెదుటకు రానీయకుండా పాపమను గోడ మధ్య ఉన్నది. కానీ యేసు తన బాప్తిస్మము మరియు రక్తము ద్వారా ఒకేసారి మన పాపమును ఆయన శుద్ధీకరించెను. దేవుడు దేవాలయపు తెరను పై నుండి క్రింది వరకూ చింపుట అనునది. బాప్తిస్మము ద్వారా దేవుని కుమారుడు పాపులందరి తప్పిదమును తనపై మోపుకొనెననియు ఆయన సిలువ రక్తమును నమ్మిన వారందరూ తమ పాపము నుండి పూర్ణముగా కడుగబడి అడ్డగింపబడక పరలోకములో ప్రవేశించెదరను ప్రాముఖ్యతను చూపించును. ఈ విధముగానే దేవుడు మనలను పాపముల నుండి విడిపించెను.

యేసు తాను నెరవేర్చిన ఈ రక్షణ క్రియలకు ఆధారముగానే దేవాలయపు తెరపై నుండి క్రింది వరకు చినుగునట్లుగా చేసెను. కనుక హెబ్రి 10:19-22 ఇట్లు చెప్పుచున్నది. ‘‘సహోదరులారా యేసు మనకొరకు ప్రతిష్టించిన మార్గమున, అనగా నూతనమైనదియు, జీవము గలదియు ఆయన శరీరము అను తెరద్వారా యేర్పరచబడినదియునైన మార్గమున, ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగియున్నది. దేవుని యింటిపైన మనకు గొప్ప యాజకుడున్నాడు గనుక మనస్సాక్షికి కల్మషములో తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు కలవారమును, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు కలవారమునై యుండి, విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి. యధార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము.’’

యేసు సిలువపై మరణించినప్పుడు దేవాలయపు తెర చినిగెను కనుక అతి పరిశుద్ధ స్థలం ద్వారము పూర్తిగా తెరువబడెను. మరియు ఇక్కడున్న తెరవబడిన అతి పరిశుద్ధ స్థల ద్వారము సజీవమైన ఒక నూతన తెరువబడిన ద్వారముగా నున్న దేవుని సువార్త అను పరలోక మార్గమైయున్నది. ఇక్కడ మన హృదయము? శరీర పాపములన్నియూ ఆయన బాప్తిస్మము (నిర్మల జలము) మరియు ఆయన రక్తము అని బైబిలు ఇక్కడ మరలా చెప్పుచున్నది. కాబట్టి ఆయన పరిపూర్ణరక్షణలో కల పూర్తి ఆశ్రయమును బట్టి మనము పరిశుద్ధ పరచబడగలము.

దీని కొరకై నేను దేవునికి నా కృతజ్ఞత అంతయూ తెలియపరచుచున్నాను. మనము ఎంత ప్రయత్నించిననూ పరలోకములో మనము ప్రవేశించలేము కానీ మనవంటి ప్రజలకు ఆయన పొందిన బాప్తిస్మము మరియు సిలువపై కార్చిన రక్తము అను ఆయన నీతిక్రియల ద్వారా యేసు మనలను మన పాపము నుండి విడిపించెను. మరియు ఆయన పరలోక ద్వారమును విశాలముగా తెరవబడునట్లు చేసెను. నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను విశ్వసించువారు మాత్రమే పరలోకములో ప్రవేశించగలరు. నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను విశ్వసించువారు మాత్రమే పరలోకములో ప్రవేశించగలరు. నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను నమ్మునట్టి విశ్వాసముతో మనము ఇప్పుడు మన పాపము నుండి శుద్ధీకరింపబడి పరలోకములో ప్రవేశించగలము.

మన ప్రభువు బాప్తిస్మం పొందినవాడై సిలువ వేయబడి మన కొరకు పరలోక ద్వారమును తెరచెను. కనుక ఈ సత్యమును విశ్వసించుట ద్వారా మనము మన పాపమును శుద్ధీకరించుకొని పరలోకములో ప్రవేశించగలము. దేవుని స్తుతించకుండా మనమెలా ఉంటాము? ఆయన ప్రేమ పూరితమైన త్యాగమునకై ఆయనకు చాలినంతగా మనం కృతజ్ఞతలను చెల్లించలేము మన పాపమును భరించుటకై యేసు పొందిన బాప్తిస్మం వలన మన ఈ పాపము నిమిత్తమైన ఘోరశిక్ష నొందుటకు తనశరీరమునే ప్రాయశ్చిత్తబలిగా ఆయన అర్పించుట వలన దేవాలయ అతి పరిశుద్ధ స్థల తెర ఈ చివరి నుండి ఆ చివరి వరకు చినిగెను.పరలోకములో ప్రవేశించుటకు ఒకే ఒక మార్గము ఉన్నది :


యేసు బాప్తిస్మంను ఆయన సిలువ రక్తమును మనం విశ్వసిస్తున్నాం కనుక మనం పరలోకంలో ప్రవేశిస్తాం. సత్యసువార్తను విశ్వసించుట ద్వారా తప్ప పరలోకంలో ప్రవేశించుటకు మరి ఏ ఇతర మార్గము లేదు. మనం పరలోకములో ప్రవేశించగలుగునట్లుగా యేసు మన కొరకై జరిగించిన క్రియలను నమ్ముట ద్వారానే అది సాధ్యము. ఎందుకనగా నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను యేసురక్తమును విశ్వసించు వారి కొరకు దేవుడు అట్టి క్రియలను జరిగించెను.

ఇందు వలన తమ స్వంత ప్రయత్నములు భక్తి లేదా అట్టి ఇతర మోసపూరిత ప్రయత్నము వలన క్రైస్తవులు పరలోకంలో ప్రవేశించలేరు. యేసు పొందిన బాప్తిస్మమును ఆయన కార్చిన రక్తమును విశ్వసించుట వలన తమ పాపము కడుగుకొనిన వారు మాత్రమే పరలోకంలో ప్రవేశించునట్లు దేవుడు నిర్ణయించెను. ఈ సత్యమును విశ్వసించువారే యేసు దేవుని కుమారుడనియు తానే దేవుడనియు ఆయనే బాప్తిస్మం పొంది తన రక్తమును కార్చుట ద్వారా తమను పాపము నుండి విడిపించిన అద్వితీయ రక్షకుడని నమ్మువారే అట్టి ప్రజల పాపము శుద్ధీకరింపబడునట్లే దేవుడు అనుమతించెను. ఆయన పొందిన బాప్తిస్మమును మరియు సిలువపై భరించి బాధ ద్వారా, తండ్రియైన దేవుడు ఈ క్రియలను విశ్వసించువారమైన మనలను, విశ్వాసము ద్వారా పరలోకరాజ్యములో ప్రవేశించునట్లు అనుమతించెను.

పరలోకములో ప్రవేశించుటకు మనకు ధనము అవసరమా? అట్లయితే దానిని చెల్లించుట ద్వారా మనము రక్షణ పొందవచ్చును. కానీ అది దేవుడనుగ్రహించిన ఉచిత రక్షణ కాలేదు. పరలోకంలో ప్రవేశించునట్లు మనకు నీరు మరియు ఆత్మమూలమైన సువార్త నమ్ము విశ్వాసం ద్వారానే సాధ్యపడును. మరో విధంగా పరలోకంలో ప్రవేశించుటకు ఏ విధమైన చెల్లింపు, క్రియలు, స్వంత ప్రయత్నములు వాస్తవంగా ఎప్పటికి పనికి రావు. పరలోకంలో ప్రవేశించుటకు ఏ విధమైన మానవ వ్యక్తిత్వం పనికిరాదు. మనం పరలోకంలో ప్రవేశించుటకు అర్హత పెంచుకొనుటకు దేవుడు ఎటువంటి ప్రయత్నములు కానీ, క్రియలు కానీ, ఉద్దేశ్యములు గానీ, కనికరము లేదా మంచితనం వంటి వాటిని దేవుడు మన నుండి ఆశించుటలేదు.

పరలోకంలో ప్రవేశించుటకు మనం పొందవలసినది ఖచ్చితంగా కేవలము పాపమును శుద్ధీకరించునట్టి యేసు యొర్ధాను నదిలో పొందిన బాప్తిస్మము, మరియు మన పాపపరిహారమునకై ఆయన సిలువలో రక్తము కార్చిచేసిన త్యాగమును విశ్వసించునట్టి నమ్మిక కలిగియుండుట. యేసు బాప్తిస్మము మరియు రక్తము యొక్క సువార్తను విశ్వసించు నమ్మకము కలిగియుండుట తప్ప మరే దారి లేదు. ఇందువలననే మనము పాపపరిహారం పొంది పరలోకంలో ప్రవేశించాలంటే మనము యేసు నెరవేర్చిన నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను మనం తప్పక విశ్వసించాలి.

ప్రభువైన యేసు నీరు మరియు ఆత్మమూలమైన సువార్తద్వారా మన పరిపూర్ణరక్షణను నెరవేర్చెను. పాప పరిహారము యొక్క రక్షణను యేసు సంపూర్తి చేసెను. కనుక ఈ సువార్త సత్యమును పాపులు పూర్ణహృదయముతో నమ్మినట్లయిన వారు తమ పాపములన్నిటి నుండి విడిపింపగలరు. మనకు అనేకమైన లేదా చాలా కొద్దిపాపములే ఉన్ననూ ప్రభువు మన పాపములన్నింటిని శుద్ధీకరించెను. ఆయన ఎవరినైననూ పరలోకంలో ప్రవేశించునట్లు చేసెను, కానీ అది విశ్వాసం ద్వారానే.

ఆ యేసు పరలోక ద్వారము తెరచెను. కనుక నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను విశ్వసించుట ద్వారా పాపులు దానిలో ప్రవేశించెదరు ఇదే వాస్తవంగా ప్రత్యేకమైన రక్షణ యొక్క కృప. ‘‘ఆ ప్రభువు నా పాపములన్నీ భరించెను మరియు నా స్థానములో ఆయనే సిలువపై మరణించెను. ఆయన నా పాపములన్నీ శుద్ధీకరించి నా కొరకు పరలోక ద్వారము తెరచెను. ఆయన నన్నెంతగానో ప్రేమించెను. నా కొరకు బాప్తిస్మం పొందెను. ఆయన రక్తమును చిందించెను. ఈ విధముగా నా పాప పరిహారమును ఆయన సంపూర్తి చేసెను.’’ ఈ విధముగా నీవు రక్షణ సత్యమును నమ్మినప్పుడు ఆ విశ్వాసంతో నీవు పరలోకంలో ప్రవేశించెదవు.

యేసును తమ రక్షకునిగా స్వీకరించుట ప్రజలకు కష్టమేమీ కాదు. వాస్తవానికి అది ఎంతో సులువు ఎట్లనగా యేసు ఈ లోకమునకు వచ్చి జరిగించిన సత్యములన్నిటిని తమ హృదయమందు అంగీకరించి వాటిని విశ్వసించాలి. యేసు యొర్ధాను నదిలో యోహానుచే బాప్తిస్మంను పొందెను. మరియు ఆయన సిలువపై కార్చిన రక్తము ద్వారా మన పాపములను తుడిచివేసి వాటి నుండి మనలను విడిపించెను కనుక ఆత్మ ద్వారా మన హృదయాలలో విశ్వసించిన యెడల మనమందరమూ రక్షింపబడెదము.

“మీరు సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయును.’’ (యోహాను 8:32) నీ పాపములు గొప్పవైననూ, కొద్దివైననూ బాప్తిస్మమును పొంది ఆయన తన రక్తమును కార్చుట ద్వారా యేసు వాటన్నిటిని మాయమగునట్లు చేసెను. నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను విశ్వసించినప్పుడు ఆ సత్యము మనలను పాపము నుండి స్వతంత్రులనుగా చేయును కనుక మనం మన నిత్య రక్షణను పొందుకొని ఈ సత్య సువార్త యొక్క స్వాతంత్య్రమును అనుభవించెదము.

నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను నెరవేర్చుట ద్వారా ప్రభువు పరలోక ద్వారము విశాలముగా తెరచెను. మన ప్రభువు ఈ లోకమునకు వచ్చెను. బాప్తిస్మం పొందెను. సిలువపై మరణించెను. మరియు మృతి నుండి మూడవ దినమున తిరిగి లేచెను. ఈ సత్యము నీరు మరియు ఆత్మమూలమైన సువార్త మనలను దేవునికి సమీపము చేసెను. మరియు ఇదే మనలను భవిష్యత్తులో పరలోకమునుకు స్వంతం చేసికొనునట్లు చేసెను. ఇప్పుడు నీవు పరలోకంలో ప్రవేశించుటకు కోరినయెడల అలాగే పాపము నుండి విముక్తుడవై దేవుని పిల్లలుగా మారుటకు కోరినట్లయిన యేసు పొందిన బాప్తిస్మమును మరియు ఆయన కార్చిన రక్తమును విశ్వసించి నీ పాపపరిహారమును పొందాలి. ఈ విశ్వాసమే నిన్ను పాపపరిహారము పొంది పరలోక ద్వారమునకు నడిపించును.

మన గురించిన ప్రతి విషయం మన ప్రభువునకు తెలుసు. మనం ఎప్పుడు పుట్టామో ఆయనకు తెలియును. నీవు చేసిన పాపములను చేయబోవు పాపములు కూడా ఆయనకు తెలుసు. మనం మన స్వంతంగా ఎంత ప్రయత్నించిననూ మన పాపము పరిహారమును పొందలేమని కూడా ఆయనకు అంతా తెలియును. ప్రభువు మనలను బాగుగా ఎరిగియున్నందున ఆయనే తన బాప్తిస్మం మరియు సిలువ రక్తముతో మన పాపమును తుడిచివేసెను.యేసు ఈ లోకమునకు ఎందుకు వచ్చెను?


యేసు అను నామమునకు రక్షకుడని అర్థం. మన పాపముల నుండి మనలను రక్షించుట ఏ మనుష్యుని వలనను జరుగదు. కానీ అది కేవలము పరసంబంధమైన శక్తి పరిధిలోనిదే కనుక యేసు ఈ లోకములో జన్మించెను. అలాగే యేసు జననమునకు ఒక స్పష్టమైన ఉద్దేశ్యం వుంది. ఇందు మూలమున మానవాళిని వారి పాపములన్నిటి నుండి విడిపించుటకు యేసు ఒక కన్య శరీరమందు ఈ లోకములో జన్మించెను. మరో విధంగా ఆదాము హవ్వ తప్పిదము కారణాన పాపమునకు వారసులమైన పాపుల కొరకు యేసు స్త్రీ దేహము ద్వారా జన్మించెను. పాపులందరినీ వారి పాపము నుండి రక్షించిన వానిగా రక్షకుడగుటకై, ఆ ప్రభువు ఈ లోకములోనికి వచ్చెను. దేవుని శక్తి వలన కన్య గర్భమందు రూపింపబడెను.

మన ప్రభువు తనకు తానుగా నిరపరాధ బలిగా తన స్వంత సృష్టియైన శరీరము ద్వారా ఈ లోకములో జన్మించెను. సమయము వచ్చినప్పుడు మనకు రక్షణను తెచ్చుటకై ఆయన ఒకదాని వెంట ఒకటిగా తన ప్రణాళికను అమలు పరచెను. మన ప్రభువు 30 సంవత్సరాలు వచ్చిన తరువాత, ఆయన యొర్దాను నదిలో బాప్తిస్మం పొందెను. ఈ లోకములో తాను జన్మించవలసిన అవసరమును నెరవేర్చుటకు, యేసు బాప్తిస్మం పొందుట ద్వారా లోక పాపమును భరించాలి. కనుక దానిని నెరవేర్చుటకు ఆయన యోహానుచే బాప్తిస్మం పొందెను. (మత్తయి 3:13-17)

ఆ విధముగానే యేసు మన బాప్తిస్మము ద్వారా లోకపాపములను స్వీకరించిన తరువాత మూడు సంవత్సరములు గడిచినప్పుడు ఆయన సిలువ వేయబడెను. అది ఎందుకనగా మన ప్రభువు బాప్తిస్మం పొంది లోక పాపమును మోసికొనిపోవుట ఎందుకనగా మన పాపము కొరకు మాత్రమే. బాప్తిస్మమిచ్చు యోహాను ద్వారా బాప్తిస్మం పొందుట ద్వారాను సిలువ రక్తము ద్వారాను ప్రభువు మన పాపములన్నిటిని తుడిచివేసెను. దాని వలన ఆయన వారి పాపము నుండి రక్షింపబడాలని కోరుకొనువారికి రక్షింపబడునట్లు అనుమతించెను.

ప్రజలు ఎంత అజ్ఞానులైననూ ఏ బలహీనతలచే పట్టబడిననూ వారు ఎటువంటి పాపము చేసినవారైనను ఏ బేధమును లేక నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను విశ్వసించువారమైన మనలను దేవుడు ప్రభువు రాజ్యమైన పరలోకంలో ప్రవేశింప అనుగ్రహించెను పాపమునకైన జీతమును చెల్లించుటకే యేసు యొర్ధాను నదిలో బాప్తిస్మం పొంది తన రక్తమును సిలువలో 

కార్చెను. మన పాపమునకు తగిన పరిహారమును యేసు తనకు తానే బలియాగమగుట ద్వారా నెరవేర్చెను కనుక విశ్వసించు వారమైన మనము నీరు మరియు ఆత్మమూలమైన సువార్త ద్వారానే మన పాపమును కడుగుకొనగలము. ఇదే క్రైస్తవ్యము యొక్క మూల సత్యము మరియు పాప పరిహారమునకైన ప్రధాన అంశము.

ఈ లోకపాపులందరికి రక్షకునిగా ప్రభువు ఈ లోకమునకు వచ్చెను. వాస్తవముగానే ఆ ప్రభువే మనలను పాపము నుండి విడిపించెను. మన ప్రభువు వారెవరైననూ ఏ బేధమును లేక పాపులందరినీ ఆయన క్రియల యందు విశ్వాసముంచుట ద్వారా పరలోకరాజ్యములో ప్రవేశింప అర్హులనుగా చేసెను.

ఇదే ఆ ప్రభుని ప్రేమ. ఆయన మనలను ఎంతో ప్రేమించెను కనుకనే ఆయన మనలను రక్షించుటకు తానే బాప్తిస్మమును పొంది తన రక్తమును కార్చెను. మనలను పాపము నుండి విమోచించుటకు తన స్వంత శరీరమును వలే ఆయన ఎవరిని అధికముగా ప్రేమించెనో వారి కొరకు మన ప్రభువు తానే బాప్తిస్మము పొంది తన రక్తమును కార్చుట ద్వారా రక్షణను నెరవేర్చెను. పాపులమైన మనము చనిపోవు దినము వరకు పాపము చేయుచూనే ఉంటాము. పాపము వలన చీల్చబడి మన తండ్రియైన దేవునికి దూరమైపోతూ ఉంటాము. మన వంటి ప్రజలను రక్షించుటకు మనలను తనతో ఐక్యపరచుటకు దేవుడు తన రక్షణ క్రియలను జరిగించెను.

పాపులమైన మనలను ప్రభువు దేవుని ప్రేమ చేత రక్షించెను. పాపులమైన మనలను మన బలహీనతల నుండి రక్షించుటకు ఆయన నీతిని, దేవుని ప్రేమను తన బాప్తిస్మమును పొంది రక్తమును కార్చుట ద్వారా ఆయన సంపూర్తి చేసెను. ఈ సువార్తను విశ్వసించువారమైన మనము మన ప్రభువు మన కొరకు జరిగించిన దానిని బట్టి కృతజ్ఞులమై యున్నాము. మనము ఆయన ముందు మోకరిల్లి మన విశ్వాసమును బట్టి కృతజ్ఞతలు చెల్లించుటకు మాటలు చాలవు. మన ప్రభువు మనకిచ్చిన పాప పరిహారమను సత్యము ఏ వాదన పూరితమైన మాటకు అందనంత ఖచ్చితమైన ప్రేమగలవి. ఏ తీయని మాటలు ఎల్లప్పుడూ వర్ణించలేనిది మరియు ప్రత్యేకమైనది.

2 వేల సంవత్సరాలకు పూర్వము మనలో ఎవరమూ జన్మించియుండలేదు. భూలోకములోని మందిరమునకు పరలోక మందిరమునకు మధ్యనున్న తెర చినిగి ఇప్పటికి 2 వేల సంవత్సరములైనది. ఆ సమయమునకు మనము మన తల్లి గర్భములోనైననూ లేము. కానీ మన ప్రభువునకు అప్పటికే మన గూర్చి పూర్తిగా తెలియును. నీవు పుడతావని ఆయనకు తెలియును. మీలో ప్రతివారు వారి ప్రత్యేకతతో జీవిస్తారని ఆయనకు తెలియును. మరియు ఆ ప్రభువు నన్ను ప్రేమించెను. నన్ను మాత్రమే కాదు కానీ నిన్ను ప్రతివానిని ఒకే విధముగా ఆయన ప్రేమించెను. మన ప్రభువు మనలను ఎంతో ప్రేమించెను. యేసు మన కొరకు నెరవేర్చి నీరు రక్తము మరియు ఆత్మ అను సువార్తను మనము విశ్వసించుట ద్వారా పాపులమైన మనలను ఆయన పరలోకములో ప్రవేశించుటకు అనుమతించెను. నీరు మరియు ఆత్మ ద్వారా (యేసు బాప్తిస్మము మరియు ఆయన సిలువ రక్తము) పాపము నుండి మన రక్షణ అనుక్రియలను యేసు నెరవేర్చేను.

దేవాలయపు తెర పై నుండి క్రింది వరకు చినిగెననునది నిజముగా ఒక ఆశ్చర్యమైన సంఘటన. అతి పరిశుద్ధ స్థలపు తెర ఎట్లు చినిగెను? కేవలము యేసు సిలువలో మరణించినందుకే ఆ తెర ఈ దినాలలోని కార్పెట్‌ వలే ఉండెను. అది చాలా చిక్కగా మందముగా వేయబడెను. పాలస్తీనాలో ఈ దినాలలో కూడా కార్పెట్‌ వలే మందముగా నేయబడిన తెరను మనము చూడగలము. అవి ఎంత గట్టిగా నేయబడుననగా నాలుగు గుర్రములు ఇరువైపులా నుండి వ్యతిరేక దిశలో లాగితే గాని అవి చినగవు. గుర్రము ఎంత బలమైనది. అయిననూ నాలుగు గుర్రముల బలము అవసరమైనంత గట్టిగా నేయబడిన తెర యేసు సిలువపైమరణించగా పై నుండి క్రిందికి చినిగెను.

ఆ తెర ఎందుకు చినిగినది? ఎందుకనగా యేసు మానవాళి హృదయములో నున్న పాపములన్నిటిని కడిగి వేసినందుకే. యేసు తన నీతి క్రియలన్నిటిని బాప్తిస్మమును పొంది సిలువలో చనిపోవుట ద్వారా నెరవేర్చిన కారణముగానే ఆ తెర చినిగెను. బాప్తిస్మము పొందుట ద్వారా లోక పాపమును వహించి, సిలువపై శిక్షింపబడుట ద్వారానే యేసు విశ్వసించువారు ప్రవేశించినట్లు మార్గమును తెరచెను. నీవు చేయవలసినందతయూ కేవలము నమ్మిక ఉంచుట మాత్రమే మీరందరూ విశ్వసించుట ద్వారా ప్రవేశించునట్లు ప్రభువు పరలోక ద్వారమును తెరచెను.యేసు బాప్తిస్మము మరియు రక్తము అను రెండు అంశములు మన రక్షణకు అవసరమైనవేనా?


పాత నిబంధన కాలము కంటే కూడా ముందుగా నిర్ణయించబడిన విధముగా యేసుని తలపై చేతులుంచుట ద్వారా రక్షణ కలుగును అను విధానము ప్రకారమూ కేవలము దహన బలి అర్పణకే దానిని ఆచారముగా నుంచుట జరిగినది. చేతులుంచుట ద్వారా బలిపశువు పాపమును మోయవలెను రక్షణ సూత్రము మరియు చనిపోవుట అనునది దేవుని వలన ఏర్పరచబడినది. కనుక యేసు తానే మనలను శాశ్వతముగా అందరినీ ఒకేసారి రక్షించుటకు రాబోవుచుండెను కనుక ఆయన బాప్తిస్మము ద్వారా ఒక విధమైన చేతులుంచబడుటను పొంది మన పాపములన్నిటిని తుడుపు పెట్టెను. ఇందువలన అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించుటకు ప్రధాన యాజకుడు కూడా తాను చేతులుంచుట ద్వారా తన పాపమును వహించుకొనిన బలిపశు రక్తమును తనతో కూడా తీసికొనిపోవలెను.

అయిన ప్రధాన యాజకుడు ఎందువలన తనతో కూడా రక్తమును తీసికొనిపోవలసి వచ్చినది? ఎందుకనగా శరీర ప్రాణము రక్తములో నున్నది. దేవుడు దానిని యాజకుని ప్రాయశ్చిత్తమై అనుగ్రహించి దానితో తన సముఖమునకు రమ్మనెను. (లేవీ 17:11) ప్రజలందరునూ వారి పాపము నిమిత్తము చావవలసియుండెను. కానీ యేసు యొర్ధాను నదిలో బాప్తిస్మమును పొందుట వలన (యేసుని బాప్తిస్మము ద్వారా పాపములన్నీ ఆయనపై మోపబడెను.) మానవాళి పాపమును ఆయన వహించెను. మరియు వాటిన్నిటిని భుజమునకెత్తు కొనెను. యేసు సిలువ వేయబడి ఆయన కార్చిన రక్తము మరియు తన ప్రాణము ద్వారా మనలను రక్షించెను. ఈ కార్యక్రమం మనకు చెప్పునదేమనగా పాపులు ప్రభువు సన్నిధికి వచ్చునప్పుడు వారు తప్పక తమతో కూడా నీరు మరియు రక్తమును గూర్చిన విశ్వాసమును తీసుకొనిపోవలెను. మనము యేసుని బాప్తిస్మపు నీటిని ఆయన కార్చిన రక్తమును పూర్ణహృదయముతో అంగీకరించినప్పుడే మన పాపము నిమిత్తము మనము శిక్షింపబడకుండా తప్పించుకొనగలము.

ఇప్పుడు యేసు పాపములన్నింటిని కడిగివేసెను కాబట్టి ఇక పశ్చాత్తాప ప్రార్థనలను కానీ ఉపవాసమును కానీ అతని ఆమె పాప ప్రాయశ్చిత్తమునకై బలులను గాని ఇవ్వనవసరం లేదు. మనము పశ్చాత్తాప ప్రార్థనలను చేయనవసరం లేదు. లేదా మన పాపమును బట్టి మనము శిక్షింపబడనవసరం లేదు. ఎందుకనగా పాప పరిహారమునకైన మరియు శిక్షకైన బలిని యేసయ్య అర్పించెను. మనం చేయవలసినదంతయూ నీలి, ధూమ్ర రక్తవర్ణ దారములో చూపబడిన రక్షణను హృదయ పూర్వకంగా నమ్మాలి.

ఎవరైననూ చేయవలసినదేమనగా, పాత నిబంధన గ్రంథములో ప్రత్యక్ష గుడారమునకు ఉపయోగించబడిన నీలి దారమునకు సాదృశ్యముగా యేసయ్య పొందిన బాప్తిస్మమును ఎరుపు దారమునకు సాదృశ్యమైన యేసుని రక్తమును నమ్మాలి. ప్రత్యక్ష గుడారమునకు ఉపయోగించబడిన ధూమ్ర వర్ణ దారములో చూపబడిన ప్రధాన అంశమైన యేసయ్యరాజు అను సత్యమును నమ్మాలి. అలాగే నీలి ధూమ్రరక్తవర్ణములో చూపబడిన పాప పరిహారమును నమ్మి మన పాపమును కడుకొనినట్లైన మనకైన శిక్షలన్నీ ముగింపబడెనని మనలో ఎవరైననూ పరలోక రాజ్యం చేరగలమని నమ్మాలి. ఈ సువార్తే నీరు మరియు ఆత్మమూలమైన సువార్త.యేసు చనిపోయినప్పుడు దేవాలయపు తెర ఎందుకు చినిగినది? దీనిని మనము మరొకసారి పరిశీలిద్ధాం.


పాత నిబంధనలో చూపబడిన నీలి ధూమ్ర రక్తవర్ణ దారము పాప పరిహారమును విశ్వసించువారికి పరలోకరాజ్య ప్రవేశ అర్హతను అనుగ్రహించు దీవెన సువార్తగా నున్నది. దీని కొరకే యేసయ్య బాప్తిస్మం పొంది సిలువలో చనిపోయినప్పుడు ఆ తెర చినిగినది. యేసయ్యను నమ్ము వారికి దేవుడు తానే అనుగ్రహించిన నీరు మరియు ఆత్మమూలమైన సువార్త సత్యము ఆహా ఇది ఎందుకనగా యేసయ్య నా స్థానంలో యోహాను ద్వారా బాప్తిస్మం పొందెను. ఆయన సిలువలో తన రక్తమును కార్చి చనిపోయెను. దాని వలన పాపము వలన వచ్చు జీతమును, మరణమును చెల్లించెను. యేసు సిలువలో ప్రాణం విడచుచూ ఇలా చెప్పాడు సమాప్తమైనది. అనగా ఆ సమయంలో ఆయన పరలోక రాజ్యమును మనమందరమూ ప్రవేశించునట్లు తెరచెను.

పాపమనే గోడను నిర్మించుట తప్ప మానివేయుట ఎరుగని వారై దేవుని నుండి తమను వేరు పరచుకొనుచున్న వారిని రక్షించుటకే యేసయ్య ఈ లోకమునకు వచ్చెను. ఇది యేసయ్య స్వంత ఉద్దేశ్యము కానీ అదే సమయంలో అది తండ్రియైన దేవుని ఆజ్ఞయై యుండెను. అది మనకొరకైన ఆయన ప్రేమ. తండ్రి చిత్తమునకు లోబడి లోకపాపమును తన శరీరముపై మోపబడునట్టి బాప్తిస్మమును యేసయ్య పొందెను. తన బాప్తిస్మము ద్వారా యేసయ్య లోకపాపమును వహించెను. కనుక ఆయన సిలువ వేయబడెను. తన రక్తమును కార్చెను చనిపోయెను. మూడు దినములలో మృతి నుండి తిరిగి లేచెను. దీని వలన రక్షణ అను తన క్రియలను నెరవేర్చెను. నీలి ధూమ్ర రక్త వర్ణములో చూపబడిన సేవలు ఇవే. తమ పాపము నుండి పాపులను విమోచించుట మరియు బలి వ్యవస్థ సంపూర్తి.

ఎట్లనగా యేసు తన పరిచర్య ద్వారా ఏ మనుష్యుడు ఎన్నడూ, ప్రవేశించని పరలోక ద్వారమును ఇప్పుడు తెరచెను. దీని వలన మనకు తెలియచేయబడినదేమనగా పాత నిబంధనలో బలిపశువుపై చేతులుంచి దాని రక్తమును చిందించుట ద్వారా తెరువబడని రక్షణ ద్వారము ఇప్పుడు యేసు పొందిన బాప్తిస్మమును ఆయన కార్చిన రక్తమును విశ్వసించుట ద్వారా తెరవబడెను. ఆ చినిగిన తెర వలన రక్షణ సంపూర్తి చేయబడెను. ప్రభువు నెరవేర్చిన నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను తెలిసికొని వాస్తవముగా నమ్ము ప్రతివారు పరలోకములో ప్రవేశించుటకు అనుమతించెను. ఇందువలననే దేవాలయపు తెర చినగవలసియున్నది. 

యేసుని బాప్తిస్మమును ఆయన సిలువ రక్తమును నమ్మి విశ్వాసముతోనే నీవు పరలోక రాజ్యములో ప్రవేశింపవలెను. ఏ దోషము లేనివాడైన యేసు మానవ అవతారిగా ఈ లోకమునకు వచ్చి మనందరి పాపమును అంగీకరించుటకై యోహానుచే యేసు బాప్తిస్మము పొందెను. (మత్త 3:15) విశేషముగా మన ప్రభువు తన ప్రాణమును మన పాప జీతమునకై బలి అర్పణగా అర్పించెను. ఆ రక్తమును మనము దేవుని యెదుటకి పోవునప్పుడు తీసికొని వెళ్ళవలెను. కాబట్టి బాప్తిస్మము పొందిన తరువాత యేసు మన రక్షణ కొరకు చిందించిన రక్తమును మనము అందరమూ తప్పక నమ్మాలి. మానవులను పాపము నుండి విడిపించి దేవుని స్వజనులుగా చేయుటకు మన తన స్వంత శరీరమును చింపుట ద్వారా పరలోక ద్వారమును తెరచెను.

యేసు మనలను రక్షించిన విధానమును బట్టి ఏదో కేవలం సిలువపై రక్తమును కార్చుటను బట్టి కాదు. సిలువపై మరణించుటకు మూడు సంవత్సరములు ముందు ఆయన యొర్ధాను నదిలో బాప్తిస్మము పొందుట ద్వారా మన పాపమును తన శరీరముపై వహించుకొనెను. కనుక యేసు, యోహాను ద్వారా మానవుల పాపము కొరకు బాప్తిస్మం పొందెను. ఆ తరువాత రోమా సైనికులచే సిలువ వేయబడెను. నీవు నేను ఈ లోకములో పుట్టక మునుపే యేసు తాను బాప్తిస్మం పొంది సిలువలో రక్తము కార్చుట ద్వారా మన పాపములన్నిటిని కడిగివేసెను.

యోహాను నుండి యేసు పొందిన ఆ బాప్తిస్మము ఒకేసారి మన పాపములన్నిటిని ముందుగానే తనపై మోపుకొనునట్లు ఖచ్చితముగా ఆయన నెరవేర్చవలసిన రక్షణ విధానము. సిలువలో ఆయన కార్చిన రక్తము ఆ పాపములన్నిటి జీతమును చెల్లించుట. యేసు తానే దేవుడు కనుక ఆయన పొందిన బాప్తిస్మము సిలువలో ఆయన కార్చిన రక్తము ఖచ్చితముగా మన పాపముల నుండి రక్షించగలదు. మానవులందరి రక్షణ నిమిత్తము మన ప్రభువు చేసిన ఖచ్చితమైన త్యాగము ఇదే. నీరు ఆత్మమూలమైన సువార్త వాక్యము నీ పాపములన్నీ కడిగి మన పాపములన్నిటి నుండి శిక్ష నుండి మనలను విమోచించెనని నీవు నమ్ముచున్నావా?యేసుని బాప్తిస్మము, సిలువ రక్తము ద్వారా మానవుల పాపాలన్నీ ఇప్పుడు కడుగబడినవి.


మానవుల పాపాలన్నీ కడిగివేయుటకే యేసు యోహాను ద్వారా బాప్తిస్మం పొందెను. యేసుని సామాజిక జీవితం నుండి ఆయన పొందిన బాప్తిస్మమును వదిలి ఆయన పరిచర్యను మనం పరిగణించనట్లయితే ప్రపంచ పునాదులు వేయబడక మునుపే యేసుక్రీస్తు నందు ప్రణాళిక చేయబడిన మానవ రక్షణ అంతయూ అబద్ధమగును. జగత్తు పునాది వేయబడక మునుపే మానవాళి పాపమును తనపై మోపుకొని తన రక్తమును కార్చుటకు యేసు సిద్ధపరచబడెను.

ఇందువలననే బాప్తిస్మమిచ్చు యోహాను ద్వారా యేసు బాప్తిస్మం పొందెను. మానవుల రాయబారి ఆయెను. తద్వారా మానవుల పాపమును వహించెను. (మత్తయి 11:11-12, మత్తయి 3:15) పాపుల బలహీనతలను కడిగివేయుట కొరకు యేసు బాప్తిస్మము పొందుట అనునది రక్షణ విధానమైయున్నది. యేసు పాపుల బలహీనతలను అంగీకరించి వాటిని కడిగెను. మన పాపముల నిమిత్తం మనకు బదులుగా అయన ఘోరమరణం మన స్థానంలో పొందెను. అట్లు మరణం పొందుట ద్వారా విశ్వసించు వారందరినీ వారి పాప శాపములన్నిటిని విడిపించెను. ఈ విధానం ద్వారా (బాప్తిస్మ విధానం) యేసు మానవుల పాపములన్నిటిని తనపై మోపుకొని, సిలువపై తన రక్తము చిందించుట వలన పాప శిక్షను వహించగలిగెను. ‘‘నీతియావత్తు ఈలాగు నెరవేర్చుట మనకు తగియున్నది.’’ (మత్తయి 3:145) యొర్ధాను నదిలో యేసు బాప్తిస్మం పొందుటనగా పాపులమైన మన పాపమును ఆయన అంగీకరించెనని అర్థము.

సహోదరీ, సహోదరులారా 2 వేల సంవత్సరాల క్రితం యేసయ్య ఈ లోకమునకు వచ్చాడని, ఆయన 30 సంవత్సరాల వయస్సులో బాప్తిస్మం పొందాడని నీ కొరకు ఆయన తన రక్తమును కార్చెనని నీవు నీ కళ్ళతో చూడకపోయినందున నమ్మలేక పోవుచున్నావా? కానీ మన బలహీనతలను ఎరిగినవాడై దేవుడు జగత్తు పునాది వేయబడక మునుపే నీరు మరియు రక్తముతో మన రక్షణ కొరకైన ప్రణాళికను దేవుడు సిద్ధపరచెను. మరియు యేసుక్రీస్తును బాప్తిస్మమిచ్చుయోహానును లోకమునకు పంపించుట కూడా ఆయన ప్రణాళికయే. మన అందరి రక్షణ కార్యమును ఆయన నెరవేర్చెను. ఈ సత్యమును తెలిసికొని, మనలను గ్రహించునట్లు చేయుటకు దేవుడు తనవాక్యమును వ్రాయుటకు తన సేవకులను లేపెను. వ్రాయబడిన తన వాక్యము ద్వారా మానవులందరి రక్షణ ప్రణాళికను గూర్చియు దాని నెరవేర్పును గూర్చియు సమస్తమును ఆయన బయలు పరచెను. ఇప్పుడు ఆయన వ్రాయబడిన తన వాక్యము ద్వారా మన పాపములను తానే వహించుకొనుటకు యొర్ధాను నదిలో యోహాను ద్వారా యేసు బాప్తిస్మం పొందెనను సత్యమును ప్రతివారు గ్రహించుకొనునట్లు చేసెను.

మన స్వంత రక్షణ కొరకు యేసు పొందిన బాప్తిస్మమును సిలువలో ఆయన కార్చిన రక్తమును మనమందరమూ ఇప్పుడు తప్పక నమ్మాలి. మన శరీర నేత్రములతో దానిని మనం చూడకపోయిననూ మన హృదయంలో తప్పక విశ్వసించాలి. మన విశ్వాసం ఆయన వాక్యముపై ఆధారపడినప్పుడు నిజ విశ్వాసం మనకు కలుగుతుంది. ప్రభువు తోమాతో ఇట్లు చెప్పెను. ‘‘చూడక నమ్మినవారు ధన్యులు’’ (యోహాను 20:29) నిన్ను, నన్ను యేసు తాను పొందిన బాప్తిస్మము మరియు ఆయనకార్చిన రక్తము ద్వారా రక్షించెను. దీనిని విశ్వసించు వారు ఎవరైననూ పరలోకంలో ప్రవేశించుటకు దేవుడు అనుమతిచ్చెను.

ఇందు మూలముగానే యేసు సిలువలో మరణించగా దేవుడు దేవాలయము తెరను చింపెను. మానవులమైన మనలను దేవునికి మరగుపరచిన పాపము అను గోడను యేసు పడగొట్టెను. పాపము యొక్క తెరలన్నిటిని చింపుటకు కావలసిన దానికంటే అది త్యాగమును యేసు చేసెను. హృదయములో నీరు మరియు ఆత్మమూలమైన సువార్త నమ్ముకొనుట ద్వారా ఏ ఆటంకము లేకుండా ప్రతివారు పరలోకములో ప్రవేశించుటకు ఆయన సాధ్యపరచెను. ఈ సత్యమును మనకు ఇచ్చినందున మన ప్రభువునకు నా కృతజ్ఞతలు. కనుక మన హృదయములో మనం కేవలము నమ్ముకొనుట వలన మనమందరమూ నిజముగా పరలోకంలో ప్రవేశించగలము.

పాపులను రక్షించుట కొరకు ఈ లోకములో యేసు శరీరధారిగా జన్మించిన ఈ సంఘటన ఎంత ఘనమైనది. లోక నిర్మాణముతో పోల్చిననూ ఈ సంఘటన వాస్తవముగా ప్రత్యేకత కలది. సమస్త సృష్టిని చేసిన మన ప్రభువు, సృష్టికర్తగా తన కొరకు జీవులను సృజించును. కానీ సృష్టికర్త సృష్టిగా మారెను. బాప్తిస్మం పొందుట ద్వారా లోకపాపములను మోసెను. సిలువ వేయబడెను. ఇది ఏదో ఒకటి కాదు కానీ రక్షణ యొక్క గొప్ప సంఘటన.

సృష్టికర్త ఒక సృష్టముగా తానే ఎట్లు మారెను? అయిననూ తానే దేవుడైన యేసు బాప్తిస్మమిచ్చు యోహానుచేత యొర్ధాను నదిలో బాప్తిస్మం పొందునంతగా తనను తాను తగ్గించుకొనెను. ఆయన మానవ రాయబారి. ఇది ఎంత అద్భుత సంఘటన? కానీ ఇది అంతముకాదు. యేసు తన్ను తాను తగ్గించుకొని మరణమగునంతగా లోబడినందున, భరించలేని గొప్ప బాధను సిలువలో భరించుటకు ఒప్పుకొని, తన రక్తమును కార్చి చనిపోవునంతగా తనను తగ్గించుకొనెను. ఈ విషయాలన్నీ అర్థరహితం కాదు కానీ నీ దేవుని ప్రేమ, ఆయన కరుణ మరియు ఆయన గొప్ప కృప.

మానవుల పాపములన్నియూ ప్రభువు పొందిన బాప్తిస్మము మరియు ఆయన సిలువ రక్తముతో ఒక్కసారిగా కడిగివేయబడెను. దేవాలయ తెర చింపిన తరువాత యేసు మూడు దినములలో మృతి నుండి లేచి, ఈ సత్యమును నమ్మువారందరినీ ఈ సత్యముతో కలవాలని ఇప్పుడు ఆయన కోరుచున్నాడు. ఈ విధంగా పాపులను రక్షించిన ప్రభువు యొక్క క్రియలు ఈ లోకమును, దాని సమస్తమును సృజించిన ఆయన సృష్టికార్యము కంటే గొప్పవియును పెద్దదియునైయున్నది. యేసు జన్మం, ఆయన బాప్తిస్మము, సిలువపై ఆయన మరణము, ఆయన పునరుత్థానము, ఆరోహణము రాకడ మరియు ఆయన మనలను తన స్వంత బిడ్డలుగా చేయుట అనునవి దేవుని ప్రేమ క్రియలు.

మన ప్రభువు నిన్ను, నన్ను పాపం నుండి రక్షించెను. మన ప్రభువు ఒకేసారిగా నిన్ను నన్ను నీరు మరియు ఆత్మ మూలమున సువార్త ద్వారా పాపము నుండి విడిపించెను. కనుక మనం విశ్వాసము వలన నీతిమంతులముగా చేయబడినాము కనుక దేవునికే కృతజ్ఞతలు దేవుడు మనపై పరిపూర్ణ రక్షణ అను తన దీవెనను క్రుమ్మరించెను. నీవు నమ్ముచున్నావా?

సహోదరీ, సహోదరులారా, నీవును నేనును నరకపాత్రులము. మనము మన పాపము నిమిత్తము నాశనపరచబడి బాధతో మన జీవితమును గడపలవసిన వారము. కానీ ప్రభువు మనలను పాపము నుండి లోక పునాది వేయబడకమునుపే ప్రణాళిక చేసిన రక్షణతో మనలను రక్షించెను. మన పాపము మధ్య కూర్చిని దుఃఖించుచూ, పశ్చాత్తాపపడుచూ మన దురదృష్టమును శిపించుట తప్ప మనకు వేరొక మార్గము లేదు కానీ మన వంటి ప్రజలను పరలోకంలో ప్రవేశింపచేయుటకు ప్రభువు మనలను పాపము నుండి విడిపించెను. అందువలననే మన ప్రభువు రక్షణ ప్రభువాయెను.

యేసు మనకు నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను అనుగ్రహించెను. మరియు ఆయన మన పాప ప్రాయశ్చిత్త నిశ్చయతను అనుగ్రహించెను. యేసు తనకుతాను గానే రక్షణ యొక్క ప్రభువాయెను. యేసు మనకు బదులుగా తానే వహించుకొని మన స్థానంలో ఆయన మరణమొందెను. అందువలన మన పరిపూర్ణ రక్షకుడాయెను.నీవు యేసు పొందిన బాప్తిస్మమును ఆయన చిందించిన రక్తమును నమ్ముచున్నావా?


మన పాప విమోచన యేసు పొందిన బాప్తిస్మమును, ఆయన సిలువ రక్తమును విశ్వసించుటతో పరిపూర్ణమవుతుంది. యేసును తమ స్వరక్షకునిగా నమ్ముట వలన రక్షింపబడిన పాపులు ఆయన బాప్తిస్మమును సిలువ అదే క్రమముగా తప్పక పరిగణించాలి. మరియు రెండింటి కలయిక ద్వారానే రక్షణ పరిపూర్ణమగునని తప్పక నమ్మాలి.

ఏ కారణంగానైనా, యేసు బాప్తిస్మం పొంది సిలువలో మరణమాయెనని నీవు విశ్వసించుటలేదా? యేసు యోహాను నుండి పొందిన బాప్తిస్మమును నిర్లక్ష్యపరచి, దానిని విశ్వసించుటను త్రోసివేయుచున్నావా? యేసు పొందిన బాప్తిస్మము ద్వారా ఆయన పాపులందరి బలహీనతలు తనపై మోపుకొనెను? తన అమూల్య రక్తమును చిందించి బాధను భరించుచూ పొందిన మరణము మన పాప శిక్ష కనుక దేవుడు తన నీతిని నీటి ద్వారా నెరవేర్చెను. అలాగుననే నీవు, నేను యేసు నమ్మమని చెప్పినప్పుడు మనం తప్పక ఆయన బాప్తిస్మమును ఆయన సిలువ రక్తమును ఒకే విధమైన రక్షణ చర్యగా అంగీకరించాలి.

దేవుడు తన వాక్యములో యేసు బాప్తిస్మము మరియు రక్తప్రోక్షణను గూర్చిన అవసరతను వ్రాయించెను. ఇంకనూ దానిని త్రోసి అనేకులు కేవలము యేసు రక్తమును నమ్ముట వలన రక్షణ కలుగునని బలవంత పెడతారు. అట్టివారిలో నీవు ఉన్నట్లయిన, నీవు నిజముగా నీ విశ్వాసమును సరిచేసుకొనవలెను. తిరిగి చూచుకొని ఈ అత్యంత ప్రాముఖ్యమైన రెండింటిని విశ్వసించు, అలాగు నీవు చేయు సిలువ రక్తమునే నమ్మిన, ప్రభుని ప్రజా జీవితంలోని పరిశుద్ధ పరిచర్యను నీవు వ్యర్ధపరచుచున్నావు. నీవు అట్టి విశ్వాసము ఉన్నట్లయిన తప్పుడు విశ్వాసము నుండి నీవు తొలగి బైబిల్‌లో అనేకమార్లు చెప్పిబడిన నిజ విశ్వాసమును కలిగియుండవలెను. ఆయన బాప్తిస్మం లేకుండా ఆయన సిలువ మరణముతో మనకు ఏమి సంబంధము ఉంటుంది? యేసు బాప్తిస్మమిచ్చు యోహాను వలన బాప్తిస్మం పొందనట్లయిన ఆయన మరణం వలన మన పాప పరిహారమునకు సంబంధమేమీ లేకపోయెను.

సహోదర సహోదరీలారా, ఒక బిల్లు నుండి నీ పేరును తొలగించుకొనుటకు వాస్తవంగా నీవు డబ్బు చెల్లించుట లేదా? అప్పుపొందిన వారు తమ అప్పును చెల్లించాలి. అప్పుడే వారి పేర్లు జాబితా నుండి తొలగించబడును. ఈలాగే మన పాప జీవితమును చెల్లించుటకు అట్టి పాపమును బలహీనతలను యేసు తన బాప్తిస్మము ద్వారా అంగీకరించి తన రక్తమును కార్చుట ద్వారా వాటిని తుడుపుపెట్టెను.

ప్రభువు మన పాపములన్నింటిని బాప్తిస్మం పొందుట ద్వారా ఆయనపై మోపుకొనెను. కనుక ఆయన తన రక్తమును కార్చుట ద్వారానే మన పాపములన్నిటి కొరకు శిక్షింపబడెను. అప్పు తీర్చుటకు సమానమైన విలువ కల దానిని ఇవ్వవలెననునది సహజముగా అందరికీ తెలిసినదే కదా. అప్పుచేసినవారు, దానికి సరిపడినంత సొమ్ము ఇవ్వకుండా తమ పేర్లు తుడుపు పెట్టబడవు. ఒత్తిడి చేసినట్లయితే వారి పేర్లు నిజంగా తుడుపు పెట్టబడునా? తమ పేర్లు తుడుపు పెట్టబడెనని వారు ఎంత విశ్వసించిననూ వాస్తవంగా వారి పేర్లు అప్పు చిట్టా నుండి తుడిచి పెట్టబడవు.

అప్పు చేసిన వారు అప్పు తీర్చిన తరువాత వారి పేర్లు ఆ చిట్టా నుండి ఎట్లు తీసివేయబడవో అలాగే పాపులమైన మనము మన హృదయాలతో యేసు పొందిన బాప్తిస్మం ద్వారా మన పాపము ఆయనపై మోపబడెనని విశ్వసించాలి. మన పాపములను యేసు తలపైకి మోపిన ఈ బాప్తిస్మమును విడువకూడదు.

బాప్తిస్మమిచ్చు యోహాను అను మధ్యవర్తి ద్వారా మన పాపములను యేసుపై మోపగలిగాము. బాప్తిస్మమిచ్చు యోహాను బాప్తిస్మం పొందిన యేసు లోకపాపములను భరించెను. సిలువవరకూ వాటిని మోసెను. తన రక్తమును కార్చెను మరణమొందెను. ఆయన బాప్తిస్మమును నమ్ముట ద్వారా రక్షణ మార్గమును పాప విరుగుడుగా యేసు మన పాపములను భరించి మనలను రక్షించెను. దాని ద్వారా మన రక్షణ నిశ్చయతను పొందగలిగితిమి. ప్రభువు మన కొరకు జరిగించిన క్రియలను మన హృదయమందు విశ్వసించుట వలన ఇప్పుడు మనం పాపవిమోచన పొందగలిగాము. ఎందుకు? ఆయన బాప్తిస్మము మరియు రక్తము ద్వారా మన ప్రభువు మనకు క్రొత్త జీవితమును అనుగ్రహించెను.

యేసు సిలువలో మరణించినప్పుడు అతి పరిశుద్ధ స్థల తెరలు రెండుగా చినిగెను. భూమి కంపించెను. రాళ్ళు దొర్లెను సమాధులు తెరువబడెను. నిద్రించిన పరిశుద్ధులు తిరిగి లేచిరి. ఈ చర్యల ద్వారా దేవుడు మానవాళి పాపములను తుడిచివేయుటకై యేసుక్రీస్తు వచ్చును. తన మాటను విశ్వసించినవారిని లేపెదనని చెప్పెను. వాస్తవముగా యేసు మృతి నుండి లేచెను. కనుక యేసును విశ్వసించు వారు కూడా వాస్తవంగా సజీవులుగా లేపబడెదరని ఆయన నిరూపించెను. యేసు మనలను పాపము నుండి రక్షించుట మాత్రమే కాక, ఆత్మీయముగా చచ్చినవారమైన మనకు నూతన జీవమిచ్చెను. మనకు నూతన జీవమిచ్చుటకు యేసు బాప్తిస్మమును పొందెను. సిలువలో మృతి పొందెను. తిరిగి సజీవుడయ్యెను. సదాకాలము మనము నివసించునట్లు తన పరిశుద్ధ స్థలములో ప్రవేశించుటకు దేవుడు మనలను అనుమతించెను. నా విశ్వాసముతో కూడిన నిజ కృతజ్ఞతలను నేను చెల్లించుచున్నాను.

పాపవిమోచన పొందినవారు నివసించబోవు స్థలము పరలోకము. కనుక ఈ లోకములో పాప పరిహారము పొందినవారందరూ పరలోకంలో ప్రవేశించి దానిలో నివసించెదరని విశ్వసించుము. పాప పరిహారము పొందిన వారిది పరలోకరాజ్యము. నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను విశ్వసించి తిరిగి జన్మించుట అనునవి రెండు భిన్నమైన అంశములు కాదు కానీ అవి రెండూ ఒకటే.

నీరు మరియు ఆత్మమూలమైన సువార్త వాక్యమును ఎవరైనా విశ్వసించిచో అతను/ఆమె విశ్వసించిన మరుక్షణమే తిరిగి జన్మించెదరు. పాపులు పాప పరిహారమును పొందినప్పుడు వారు దేవుని స్వంత పిల్లలగుదురు. మరియు తన పిల్లలకు, పరలోకమును బహుమతిగా దేవుడనుగ్రహించెను. మరో శరీరమందు మనకు స్వంత పనులు ఏవీ లేనప్పటికి, మనము రక్షకునిపై ఉంచు విశ్వాసమును చూచినప్పుడు మన ప్రభువు మనకు పాప క్షమాపణ నిచ్చి పరలోకమును బహుమతిగా మనకిచ్చెను.

మన ప్రభువు లోకమునకు వచ్చిఆయన బాప్తిస్మం పొందుట తన రక్తమును కార్చుట అనునవన్నీ వాస్తవములే. యేసు సిలువపై మరణించినప్పుడు బాప్తిస్మం తీసుకొనుట ద్వారా లోకపాపము ఆయన తనపై భరించెను. యేసు సిలువ వేయబడక ముందు అప్పటికే యోహాను వలన బాప్తిస్మము పొందినవాడై అప్పటికి ఆయన లోకపాపమును మోయుచుండెను. యేసు ఆజ్ఞానుసారముగా పాపమునకు పొందవలసిన జీతమైన మరణమును తాను అనుభవించవలసిన కారణాన బాప్తిస్మం పొందుట ద్వారా ఆయన లోకపాపమును భుజమున కెత్తుకొని భరించెను. మానవులను పాపము నుండి రక్షించుటకు యేసు తాను పొందిన బాప్తిస్మము ద్వారా తనపై మోపుకొనిన పాప భారమును భరించుచుండగా ఆయన సిలువపై మృతి నొందవలెను.

యేసు సిలువ వేయబడినప్పుడు ఆయనను మేకులతో గుచ్చినవారు యూదులు కారు గానీ వారు రోమా సైనికులు. యేసును అన్యసైనికులు సిలువ వేసిరి. మన పాపాల కొరకు తనరక్తమునంతటినీ కార్చుచూ ‘‘సమాప్తమైనది” అని యేసు తన చివరి శ్వాసతో బిగ్గరగా కేకవేసెను. ఆ క్షణమే దేవాలయ తెరపై నుండి, క్రింది వరకూ రెండుగా చీలెను. అంతేకాక భూమి కంపించెను. రాళ్ళు దొర్లెను. సమాధులు తెరువబడి నిద్రించిన పరిశుద్ధుల శరీరములు లేచెను. (మత్తయి 27:51-52) అని బైబిలు చెప్పుచున్నది. అధికారులును రోమా సైనికులును యేసు సిలువలో మరణించినప్పుడు సంభవించిన వాటిని చూచినప్పుడు, ‘‘ఈయన నిజముగా దేవుని కుమారుడని” సాక్ష్యమిచ్చిరి. యేసు సజీవుడైన దేవుని కుమారుడని ఆ రోమా సైనికులు నోళ్ళు సాక్ష్యము పలుకునట్లు దేవుడు చేసెను.

ఇప్పుడు లోకమంతటా నిజసువార్తను గూర్చి సాక్ష్యమివ్వవలసిన వారు ఎవరో కాదు కానీ నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను విశ్వసించువారమైన మనమే. అనగా నీరు మరియు ఆత్మమూలమైన సువార్త ద్వారా ప్రతివారు మారెదరు. యేసుని యొద్ద ప్రజలు పాపక్షమాపణ పొంది తరువాత ఏ ప్రయత్నము చేయకయే వారు మార్పు పొందినవారై వారి హృదయములోని పరిశుద్ధాత్మ నివసించును. మరియు తిరిగి జన్మించిన వారైన పరిశుద్ధుల హృదయము అనుదినము నూతన పరచబడును. ఎందుకనగా వారు ఖచ్చితంగా దేవుని సంఘములో నీరు మరియు ఆత్మమూలమైన సువార్త బోధనలను పొందెదరు. వారు వాక్యమును వింటారు. యేసుని స్తుతిస్తారు. వారు స్తుతించగా వారి హృదయములలో పాటలు నిక్షేపించినట్లు అనుభవం పొందుతారు. అందువలన తమ హృదయాలను ప్రతిదినమూ నూతన పరచుకొనెదరు. నీతిమంతుల హృదయాలు మార్పు పొందుతూనే ఉంటాయి. అట్టి గుర్తించదగిన మార్పును తమంతట తామే తెలిసికొనగలరు.

నీతిమంతులుగా మారిన మనలను చూచి, అవిశ్వాసులు ఈలాగున సాక్ష్యమిస్తారు. ‘‘వారు నిజముగా రక్షింపబడినవారు, వారు దేవుని పిల్లలైన నిజ క్రైస్తవులు” ఇలాగే మన పాపపరిహారము మనవరకే పరిమితమైన రక్షణ వంటిది వారు. రోమా చరిత్రకారులు, సైనికులు కూడా, సత్యమును సాక్ష్యమిచ్చిరి. దేవుని కుమారుడైన యేసు సిలువ వేయబడినప్పుడు పాపులను ఈ లోకపాపము నుండి రక్షించెను. ఈ విధముగానే నీరు మరియు ఆత్మమూలమైన సువార్త ద్వారా మన పాపము నుండి యేసు మనలను రక్షించెను. సత్యమును విశ్వసించిన మనకు దేవుడు తనంతట తానే సాక్ష్యము కలిగియుండెను.

నీరు మరియు ఆత్మమూలమైన సువార్త సాతానును కూడా లోపరచెను.

నీరు మరియు ఆత్మమూలమైన సువార్తకు సాతాను కూడా లోపరచెను. యేసు మరణమగుచున్నప్పుడు సాతాను ఇట్లు చెప్పియుండవచ్చును. ‘‘ఆహా! ఇది నాశనము లేని చర్య. కాని దీనిని నేను ఏమి చేయవలెను, అతను చెప్పినది సత్యము. ఇక ఈ లోకములో పాపము లేదు. ఏ బేధమును లేక ప్రతివారు ఇక పాపరహితులు.

అనగా, సాతాను మరేది చేయలేక యేసు నెరవేర్చిన రక్షణను తెలియచేయుచూ ధృఢపరచుచున్నది. కానీ పాపక్షమాపణను పొందిన వారు తమ విశ్వాస జీవితమును జీవించనియ్యకుండా అడ్డుకొనుటకు ఇంకనూ ప్రయత్నము చేయుచున్నది. యేసు నెరవేర్చిన నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను విశ్వసించువారు, దేవుని పిల్లలు. వారు ఆయన కొరకు జీవించుటకు ప్రయత్నము చేస్తారు. కానీ సాతానుకు దీని వలన తెలిసినదేమనగా పాపమునకు బానిసైన వారు కొద్దిమంది మాత్రమే తనకు పరిచారకులుగా ఉంటారు. కనుక దేవుని పరిచారకులు వాక్యమును ప్రపంచమంతటా బోధించకుండునట్లు చేయుటకు ప్రయత్నించును.

పాప పరిహారమును పొందిన వారు నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను వ్యాప్తిచేయుటకు కొనసాగించిన మరి ఎక్కువమంది పాపక్షమాపణ పొందెదరు. ఇందువలనే సాతాను ప్రజలు బలహీనతలను పట్టుకొని వారు విడిపించుకొనకుండా చేయును. వారిని అడ్డుకొనును. కనుక ఏ వ్యక్తీ యేసును వెంబడించకుండును.

ప్రజలకు ఇట్లు చెప్పుచూ వారి హృదయాలలో నాటును. యేసును చంపుడి ప్రజలు యేసును సిలువవేసి చంపునట్లుగా చేసెను. దీని వలన సమస్తము అంతమయ్యెనని సాతాను తలంచుచుండగా యేసు సిలువ పొంది చనిపోవుచూ బిగ్గరగా ‘‘సమాప్తమైనది” అని పలికెను. సాతాను దీని వలన ఖంగుతిని, విఘాతము కలిగించుటకు పూర్వము మన పాపములన్నిటిని ఆయన తాను యొర్ధాను నదిలో పొందిన బాప్తిస్మము ద్వారాను సిలువలో మరణించుట ద్వారాను యేసు మానవులను పాపము నుండి శిక్ష నుండి విడిపించగల రక్షణ కార్యమును నీతి యుక్తముగా నెరవేర్చెను. ఆ సాతానుకు దేవుని జ్ఞానము అందలేదు. సాతాను తలంచిన దేమనగా యేసు చంపిన సమస్తము పూర్తిఅవుతుంది. కానీ అట్లు జరగలేదు. తన బాప్తిస్మం ద్వారా లోక పాపములను తనపై మోపుకొనిన తరువాత తన శరీరమును సిలువకు అప్పగించి చనిపోవుట వలన యేసు పాపుల పాప పరిహారమును పూర్తి చేసెను.

ఆయన శరీరము మరణించుటతో పాపముకైన జీతం యేసు చెల్లించి వేసెను. అలాగే పాపము ప్రజల ఇంకా కనబడుటలేదు. ఎందువలన? ఆజ్ఞానుసారముగా పాపమునకు జీతం మరణమే పాపులకు బదులుగా యేసు మరణించెను. యేసు పాపులందరి బలహీనతలను తనపై మోపుకొని పాపుల స్థానంలో ఘోరమరణం పొందునట్లు యొర్ధాను నదిలో బాప్తిస్మము పొందెనను విషయమును మనమంతా విశ్వసించాలి.

“సమాప్తమాయెను” యేసు తన తుది శ్వాసలో సిలువలో బిగ్గరగా ఇలాగే కేక వేసెను. యేసు చనిపోయెను కనుక నీలో పాపమున్నది? కాదా? అని సాతాను మనతో చెప్పలేదు. యేసు జన్మించి ఆయన బాప్తిస్మం పొంది సిలువలో ఆయన మరణించి ఆయన సిలువలో రక్తము కార్చెను. మరియు పునరుత్థానము పొందెను. కనుక యేసుని ఎదుట సాతాను చిత్తుగా ఓడిపోయెను. దేవునితో మనకున్న సంబంధమును పాపము చేయుటద్వారా చెరిపివేసిన సాతాను చివరికి కుమారుడైన యేసుని జ్ఞానము వలనను, పాపమును శిక్షను ఆయన కడిగివేసినందున ఇక ఏమియు చేయలేక పూర్తిగా ఓడిపోయెను.

యేసు పొందిన బాప్తిస్మంను సిలువలో ఆయన కార్చిన రక్తమును నీవు నమ్మినప్పుడు నీలో ఇంకనూ పాపముండునా? లేకపోవచ్చు. మనలో పాపము లేదని చెప్పుట శరీర సంబంధమైన గుర్తుతో చెప్పలేము. కానీ యేసు పొందిన బాప్తిస్మమును, సిలువలో కార్చిన రక్తమును విశ్వసించుట ద్వారా మనము ధైర్యముగా పాపరహితులమని ప్రకటించుకొనవచ్చును. యొర్ధాను నదిలో యేసు బాప్తిస్మం పొందెనని మనకు బదులుగా సిలువలో మరణించెనని అందువలన రక్షించెనను సత్యమును నీవు విశ్వసించుచున్నావా? ఈ సత్యము నందు మనకున్న విశ్వాసము ద్వారా ఇప్పుడు మనం పాపరహితులమని చెప్పవచ్చును. నిజానికి మన హృదయంలో ఇకను పాపము వసించదు. ఒక చిన్న నాణెమంత పాపం కూడా వసించదు. అందువలనే కృతజ్ఞతతో మన హృదయాలు దేవుని ఎదుట ఉప్పొంగుచు మన విశ్వాసముతో కూడిన వందనములను తెలియచేయును.

దేవా, నా విశ్వాసము అంత గొప్పది కాదు. అవగింత విశ్వాసముతో నేను నా వందనములు తెలియచేయుచున్నాను. నీ గొప్ప ప్రేమకు నేను పాత్రుడను కాను. కానీ నీవు నా హృదయంలోనికి వచ్చావు. కనుక నీరు మరియు ఆత్మమూలమైన సువార్తలో విశ్వసించుట ద్వారా ఇప్పుడు నీ ప్రేమను నా హృదయంలో నిలుపుకొనుచున్నాను. ప్రతి దినము నా హృదయం నీకు కృతజ్ఞత చెల్లించుచున్నది. ఎందుకనగా ప్రభువు నాలో నివసించుచూ నాతో ఉన్నాడు. ఇట్టి హృదయమును నాకిచ్చినందుకు నేను నా కృతజ్ఞతలు నీకు చెల్లించుచున్నాను. ఈ విధంగా కృతజ్ఞత గల మనసులను మన దేవుడు మనకిచ్చియున్నాడు. మరియు మన దేవుడు ప్రతిదినం మనలను దీవిస్తాడు.

కనుక నేను మాత్రమే కాక ఆయన పరిపూర్ణ రక్షణ అను సత్యమును విశ్వసించిన వారెవరైనా తమ హృదయాలలో పాపరహితులే. మనము నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను విశ్వసిస్తున్నాము. కనుక రక్షణ అను దీవెనలను పొందియున్నాము. దేవుని స్వంత పిల్లలమైనాము. మరియు యేసుని జననము ఆయన పొందిన బాప్తిస్మము, కార్చిన రక్తము అను సత్యమును విశ్వసించకుండా తమ పాపము నుండి రక్షించబడుటకు వేరొకమార్గము లేదని సమస్త ప్రజలు తెలుసుకొని తనవైపు తిరుగవలెనని దేవుడు హృదయపూర్వకముగా కోరుకొనుచున్నాడు.

అ.కా.4:12 ఇట్లు ప్రకటించుచున్నది. ‘‘మరి ఎవని వలనను రక్షణ కలుగదు; ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని, ఆకాశము క్రింద మనుష్యులలో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. యేసుని మన రక్షకునిగా మనం విశ్వసిస్తున్నాం. దీని యందు విశ్వాసముంచువారు కృతజ్ఞతా హృదయంతో ఉప్పొంగెదరు. కాబట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించు హృదయము మనము కలిగియుండవలెను. మన ప్రభువు మనకు రక్షణ నిచ్చెను. కృతజ్ఞతా హృదయమును కూడా ఆయన మనకు అనుగ్రహించెను. ఆ ప్రభువు మనకు నిత్యజీవమునిచ్చెను. ఇట్టి పట్టజాలని విస్తార దీవెనలను మనకిచ్చినందుకు మన ప్రభువును మనము ఘనపరచుటకంటే మరి ఏమియూ చేయలేము.

మన విశ్వాసము అవగింజంత చిన్నదైనప్పటికి యేసు మన కొరకు చేసిన వాటిని మన హృదయాలలో ఇంకనూ విశ్వసించినచో మన మందరమూ రక్షింపబడెదము. మన రక్షణ నిమిత్తము మనమేమియు చేయలేము కానీ విశ్వా సము కలిగియుండుటేననియు, దేవుడు ఈ రక్షణను ఉచితంగా ఇచ్చెనని తెలుసుకొని దానిని విశ్వసించాలని నేను మిమ్ములను అందరినీ బ్రతిమాలుచున్నాను. ఎందుకనగా మన స్వంత ప్రయత్నము వలన పాపపరిహారము మనకు కలుగదు. కానీ దేవుడు తానే స్వంతంగా మన పాపములన్నిటిని తుడుపు పెట్టి, విశ్వసించు వారికి తన రక్షణను అనుగ్రహించెను. ఇప్పుడు మనము చేయునట్లు మిగిలినదేమనగా ఈ పాపపరిహారమును విశ్వాసముతో పొందుకొనుటయే.

కొరియాలో ఒక సామెత ఇట్లు చెప్పుచున్నది, ‘‘ఉచితమైన వాటిని నీవు ఇష్టపడే కొద్దీ నీవు ఒట్టివాడగుదువు” దీనికి సమానార్థమైన ఇంగ్లీషు సామెత. ‘‘ఉచిత భోజనం వంటిది మరొకటిలేదు”, మన జీవితంలో ఉచితంగా ఏదీ మన దగ్గరకు రాదు. తిరిగి ఏదీ ఇవ్వకయే బహుమానమును ఆశించు వారిని మనం బుద్ధిహీనులమని చెబుతాం. నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను విశ్వసించుట వలన రక్షింపబడి పరలోకమున ప్రవేశించుటకు ఉచితమైన అనుమతిని పొందితిమి. అధికముగా ఉచితమైన వాటిని తీసుకొనుట వలన లేమి కలుగుచున్నది. శరీరమందు కనబడక కానీ ఆత్మీయ లేమి దేవుని బహుమానము పొందుటకు దేవుని యెదుట దీవెనకరముగా నున్నది. మన పాపరహిత హృదయములను చూచుటకు దేవుడు సంతోషించునని మీరందరూ గుర్తించి, అట్లు మనలను చూచి ఆయన తన చేతులతో మిమ్ములను హత్తుకొనవలెనని నేను ప్రార్థించుచున్నాను.

దేవుని ఉచిత కృపను మనము ఇష్డపడుచున్నాము. మరియు మనము మన దేవునికి కృతజ్ఞత చెల్లించవలెను. మన ప్రభువు ఈ లోకమునకు వచ్చెను. నీటి ద్వారా బాప్తిస్మము పొందెను. తన రక్తమును సిలువలో కార్చెను. తర్వాత పరలోక తలుపులను తెరచెను. అతి పరిశుద్ధ స్థల తెరను పై నుండి క్రిందికి దింపి, నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను విశ్వసించిన వారిని పరలోక రాజ్యములో ప్రవేశించునట్లు చేసెను. నీవు కూడా, నీ హృదయములో నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను విశ్వసించి పరలోకంలో తప్పక ప్రవేశించాలి.

బాప్తిస్మము పొంది, తన రక్తమును కార్చి మృతి నుండి తిరిగి లేచినందున మన కొరకు పాపపరిహారపు తలుపు తెరచిన ఆయన కృపను బట్టి మన ప్రభువునకు నేను కృతజ్ఞతలు తెలుపుచున్నాను.