Sermons

[11-15] < నిర్గమ 26:37-37 > ప్రత్యక్ష గుడారపు ప్రతి పలక కొరకు రెండు వెండి దిమ్మలు మరియు రెండు కుసులు.



< నిర్గమ 26:37-37 >

“ప్రతి పలకలో ఒక దాని కొకటి సరియైన రెండు కుసులుండవలెను. అట్లు మందిరపు పలకలలన్నిటికీ చేసి పెట్టవలెను. ఇరువది పలకలు కుడివైపున అనగా దక్షిణ దిక్కున మందిరమునకు పలకలను చేయవలెను. మరియు నొక్కక్క పలక క్రింద దాని రెండు కుసులకు రెండు దిమ్మలను ఆ ఇరువది పలక క్రింద నలువది వెండి దిమ్మలను చేయవలెను. మందిరపు రెండవ ప్రక్కను అనగా ఉత్తరదిక్కున, ఒకొక్క పలక క్రింద రేడు దిమ్మలు ఇరువది పలకలను వాటి నలువది వెండి దిమ్మలు ఉండవలెను. పడమటి తట్టు మందిరము యొక్క వెనుక ప్రక్కకు ఆరు పలకలను చేయవలెను. మరియు ఆ వెనుక ప్రక్కను మందిరము యొక్క మూలలకు రెండు పలకలను చేయవలెను. అవి అడుగున కూర్చబడి శిఖరమున మొదటి ఉంగరము గనుక ఒకదానితో ఒకటి అతికింపబడవలెను. అట్లు ఆ రెండింటికి ఉండవలెను. అవి రెండు మూలలకుండును. పలకలు ఎనిమిది; వాటి వెండి దిమ్మలు పదునారు. ఒక్కొక్క పలక క్రింద రెండు దిమ్మలుండవలెను. తుమ్మకర్రతో అడ్డకర్రలను చేయవలెను. మందిరము యొక్క ఒక ప్రక్క పలకలకు అయిదు అడ్డకర్రలను చేయవలెను. మందిరము యొక్క రెండొవ ప్రక్క పలకలకు అయిదు అడ్డకర్రలను పడమటి వైపున మందిరము యొక్క ప్రక్క పలకలకు అయిదు అడ్డ కఱ్ఱలును ఉండవలెను.

ఆ పలకల మధ్య నుండు నడిమి అడ్డకర్ర ఈ కొస నుండి ఆ కొసల వరకు చేరియుండవలెను. ఆ పలకలకు బంగారు రేకును పొదిగించి వాటి అడ్డ కర్రలుండు వాటి ఉంగరములను బంగారుతో చేసి అడ్డకర్రలకును బంగారు రేకును పొదిగింపవలెను. అప్పుడు కొండమీద నీకు కనుపరచబడిన దాని పోలిక చొప్పున మందిరమును నిలుబెట్టవలెను. మరియు నీవు నీల ధూమ్ర రక్తవర్ణములు గల ఒక అడ్డతెరను పేనిన సన్నపునారతో చేయవలెను. అది చిత్రకారుని పనియైన కెరూబులు గలదిగా చేయవలెను. తుమ్మకర్రతో చేయబడి బంగారు రేకు పొదిగిన నాలుగు స్తంభముల మీద దాని వేయవలెను. దాని వంకులు బంగారువి వాటి దిమ్మలు వెండివి. ఆ అడ్డతెరను ఆ కొలుకుల క్రింద తగిలించి సాక్ష్యపు మందసము అడ్డతెర లోపలికి తేవలెను. ఆ అడ్డ తెర పరిశుద్ధ స్థలమును అతి పరిశుద్ధ స్థలమును వేరుచేయును. అతి పరిశుద్ధస్థలములో సాక్ష్యపు మందసము మీద కరుణా పీఠముంచవలెను. అడ్డతెర వెలుపల బల్లను ఆ బల్ల యెదుట దక్షిణ వైపున నున్న మందిరము యొక్క ఉత్తర దిక్కున దీపవృక్షమును ఉంచవలెను. మరియు నీల ధూమ్ర రక్తవర్ణములు గల పేనిన సన్నపునారతో చిత్రకారుని పనియైన తెరను గుడారపు ద్వారమునకు చేయవలెను. ఆ తెరకు అయిదు స్తంభములను తుమ్మకర్రతో చేసి వాటికి బంగారు రేకు పొదిగింపవలెను. వాటి వంపులు బంగారువి వాటికి అయిదు ఇత్తడి దిమ్మలు పోతపోయవలెను.’’



ప్రత్యక్ష గుడారము అంతయూ 48 పలకలతో నిర్మించబడినది. ఉత్తర దక్షిణ దిక్కు ఒక్కొక్క దానికి ఇరువై పలకలు. వాటిలో ఆరు పలకలు పడమర వైపునకు మరియు రెండు పలకలు రెండు మూలలకు ఉంచబడియున్నవి. ప్రతి పలక 4.5మీ పొడవు మరియు 67.5మీ వెడల్పు గలవి. ప్రతి పలక సరిగా నిలబెట్టుటకు వాటికి రెండు పొడవు దిమ్మలును రెండు కుసులును ఒక దానికొకటి కూర్చబడునట్లుండవలెను. అనగా క్రీస్తునందున్న విశ్వాసము ద్వారానే దేవుని రక్షణ కేవలము ఆయన కృప వలన అనుగ్రహింపబడెనని మరోసారి తెలియజేయబడెను.



క్రీస్తునందు విశ్వాసము ద్వారా కృప అనుగ్రహింపబడిన రక్షణ


క్రైస్తవులు అనేకులకు ఎఫెసీ 2:8-9 తెలుసు మరియు అది కంఠిత వాక్యము. ‘‘మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు. ఇది మీ వలన కలిగినది కాదు. దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడును అతిశయ పడ వీలు లేదు.’’ కానీ దురదృష్టవశాత్తు ఆయన కృప ఎట్టిదో వారికి ఖచ్చితంగా తెలియదు మరియు రక్షింపబడుటకు వారికి ఎట్టి విశ్వాసము అవసరము? అయిననూ ఆ రెండు వెండి దిమ్ములు మరియు రెండు కుసులు ఒకదానితోనొకటి సరిగా సరిపోవునట్లు కూర్చబడినట్లుండిన మర్మము దేవుని రక్షణ అను మర్మమును స్పష్టముగా తెలియచేయుచున్నది.

ఆ పలక క్రింద ఉంచబడిన రెండు కుసులు మరియు రెండు వెండి దిమ్మల యొక్క సత్యమును తెలిసికొనుటకు మొదటగా మనము సువార్తయందలి మూల సత్యమును తెలిసికొనబడితే. ఈ నాలుగు రంగులు మన పాపము నుండి నాశనము నుండి రక్షింపబడుటకు మనము యేసుని బాప్తిస్మము మరియు రక్తము అవసరమై యున్నవి. అవి మనము యేసుని రక్షణ యొక్క సత్యమును విశ్వసించు ప్రతి అనుమానము నుండి విడిపించబడునట్లు చేయును. నీల ధూమ్ర రక్తవర్ణము పేనిన సన్నపునారలో చూపబడి మనలను రక్షించిన సత్యమునుగూర్చిన స్పష్టమైన జ్ఞానమును కలిగి దానిని విశ్వసించవలెను.

యేసు చెప్పెను ‘‘మీరు సత్యమును గ్రహించెదరు; అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయును.’’ (యోహాను 8:32) అలాగే ప్రత్యక్ష గుడారపు ద్వారమునకున్న తెరలో అతి పరిశుద్ధ స్థల తెరలో చూపబడిన రంగులలో దాగియున్న తెరలో చూపబడిన రంగులలో దాగియున్న ఆత్మీయ సత్యమును తెలిసికొనుట వలన మన పాపము నుండి పరిపూర్ణ పరిహారమును పొందాలి. నీల ధూమ్ర రక్తవర్ణ దారము మరియు పేనిన సన్నపు నార అను పదార్థముతో ప్రత్యక్ష గుడారపు తెర తయారు చేయబడినది.

అనగా యేసుక్రీస్తు మన రక్షకుడును, విశ్వసించువారందరికినీ రాజైయున్నాడు. యోహాను ద్వారా బాప్తిస్మము పొందుటను బట్టి ఆ లోకపాపములన్నిటి నుండి ఆయన మనలను రక్షించెను. మరియు లోకపాపమును మోసి సిలువలో రక్తమును కార్చెను. అనగా రాజైన యేసుక్రీస్తు మనలను ఖచ్చితముగా మన పాపమునుండి రక్షించాలి. ఎందుకనగా ఆయన బాప్తిస్మం పొందెను మరియు సిలువ వేయబడెను. కాబట్టి మన పాపము నుండి మనలను రక్షించుటకై ఖచ్చితమైన, స్పష్టమైన సత్యమును, నీలధూమ్ర రక్తవర్ణ పదార్థము విడువక మనకు బయలుపరచుచున్నవి. మన పాపములను తన భుజముకెత్తుకొనుటకు యేసు యోహాను వద్ద బాప్తిస్మము పొందెను. లోకపాపములను సిలువలో మోసెను. ఆ సిలువపై తన రక్తమును కార్చెను. ఒకేసారిగా మనందరి పాపము నుండి ఆయన మనలను రక్షించెను. అట్లు ఆయన తన రక్షణ కార్యమును పూర్తి చేసెను. నీలిదారము (యేసుని బాప్తిస్మం), ధూమ్రవర్ణదారము (ఆయన చిందించిన రక్తము), రక్తవర్ణ దారము (ఆయనే మన రాజు) మరియు పేనిన సన్నపు నార (వాక్యమైయున్న దేవుడు ఆయనే మనలను నీతిమంతులనుగా చేసెను) అను ఈ నాలుగు విషయములను మనము విశ్వసించాలి. ఇవన్నీ మన రక్షణ కొరకు ఉపయోగించబడిన పదార్థము బదులుగా వాటిలో ఏదో ఒక దాని నమ్ముట ద్వారానే మన పాపము నుండి రక్షింపబడుటకు ప్రయత్నించినట్లయిన అట్టి రక్షణ పరిపూర్ణమైనది కాదని మనము తప్పక గుర్తించాలి. ఎందుకనగా ప్రత్యక్ష గుడార ప్రతి పలక క్రింద భాగములో రెండు కుసులు బయటకు వచ్చి పలకకు బలమిచ్చునట్లు అవి వెండి దిమ్మలో కూర్చబడుచున్నవి. బైబిల్ లో దేవుని కృప, మరియు బహుమానమునకు సాదృశ్యమై యున్నది. రోమా 5:1,2 లో ఇలాగు వ్రాయబడియున్నది. ‘‘కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి యుందము. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశముగలవారమై అందులో నిలచియుండి, దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము.’’ మన విశ్వాసము సరిగ్గా దేవుని కృపను కలుసుకొనినప్పుడే మనకు రక్షణ అనగ్రహింపబడును. ప్రత్యక్ష గుడారపు ప్రతి పలక అడుగు భాగమున రెండు కుసులు ఉన్నట్లుగానే, ఆ పలకలకు ఆధారము నిచ్చునట్లుగా ఈ కుసులు వెండి దిమ్మలలో కూర్చబడినట్లు మన రక్షణ కూడా అలాగే యేసుని బాప్తిస్మమును ఆయన సిలువ రక్తమును విశ్వసించినప్పటికే పూర్తగునని దేవుడు సెలవిచ్చుచున్నాడు. 

మన మందరము ప్రతి పలక నుండి చొచ్చుకొని వచ్చిన ఆ రెండు కుసులు వాస్తవంగా తయారుచేయబడిన పదార్థము మరియు కారణమును నమ్మవలసియున్నది.

ఈ రెండు వెండి దిమ్మలను రెండు కుసులును నీరు మరియు ఆత్మమూలమైన సువార్త యొక్క నీడవలే నున్నవి. ఎట్లనగా నూతన నిబంధన కాలములో యేసుక్రీస్తు వచ్చుననియు బాప్తిస్మమిచ్చు యోహానుచే బాప్తిస్మం పొందుననియు సిలువ వేయబడుననియు, సిలువపై ఆయన తన రక్తమును కార్చిచనిపోయెననియు, ఆ విధముగా మన రక్షణను సంపూర్తి చేసి నెరవేర్చునను అర్థమిచ్చుచున్నది.

పాపపరిహారము అను కృప అనగా యేసుక్రీస్తు యోహాను ద్వారా బాప్తిస్మం పొంది తమ పాపములను కడుగుటకు తన రక్తమును సిలువలో చిందించెను తమ కొరకైన నీతిగల రక్షణను వాస్తవముగా నమ్మినవారి హృదయముపైనే కుమ్మరింపబడును. అలాగే మన పాపము నుండి మనము రక్షింపబడుటకై యేసుని ఈ క్రియలను విశ్వసించు నమ్మికను రక్షించిన వివరణాత్మకమైన స్వరూపమును పొందుపరచెననునది వాస్తవమైన విషయము, ఆ ప్రభువు ప్రత్యక్షగుడారపు పలకలకు రెండు వెండి దిమ్మలను రెండు కుసులను ఉపయోగించునట్లు ఇశ్రాయేలీయులను ప్రేరిపించుట ఏ కారణము లేనిదై ఉండలేదు.

మన పాపములన్నిటి నుండి వాటి అంతటి నుండి పూర్తిగా మనము రక్షింపబడి విమోచింపబడితిమి. ఎట్లనగా దేవుడు మనకిచ్చిన బాప్తిస్మము మరియు రక్తము కార్చుట అను క్రియల ద్వారానే, అనగా మనము దేవుని పిల్లలమగు హక్కును కల్పించిన నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను విశ్వసించుట ద్వారానే మేలిమి బంగారము వలెనున్న మన విశ్వాసము దేవుని వరమును పొందుట ద్వారానే నిర్మించబడినది.



యేసుని నీవు విశ్వసించిననూ నీవు వాస్తవముగా ఎవరివో నీకు ఇకనూ తెలియదా?


నీకు నీవు మంచి అని పరిగణించుచున్నావా? ఏ పరిస్థితులోనైననూ, ఏవిధముగానైననూ అట్టివి నీతిని భరించలేనంతగా నీకు నీతి గల వ్యక్తిత్వమున్నదని నీకు నీవే తలంచుచున్నావా? నీవు దేవుని ఎదుట నీతిమంతుడవని తలంచుచున్నావా? ఎందుకనగా దేవుని ఆజ్ఞలను ప్రతిదినము నీ హృదయములో నుంచుకొని, వాటికి లోబడి జీవితంలో అనుసరించుచున్నావని తలంచుచున్నావా? మనము చేయునదేమనగా నీతిమంతులముగానున్నట్లు నటించుచూ రహస్యముగా మనము వ్యభిచరించు విగ్రహారాధన చేయుచున్నాము.

ఈ దినాలలో కేబుల్‌ నుండి గానీ శాటిలైట్‌ టి.విలోనూ చూచుటకు మనకు అనేకమైన ఛానల్లు మనకందుబాటులో ఉన్నవి. ఒక దినంలో 24 గంటలు ప్రసారాలను కలిగిన ఈ ఛానల్స్‌ వాటి ప్రత్యేకమైన కార్యక్రమాలను ప్రసారం చేయుచూ ప్రజలను నిరంతరాయంగా ఆకర్షిస్తున్నాయి. ఈ ఛానళ్లలో అన్నింటికన్నా ఎక్కువగా వ్యాపార రీత్యా పురోభివృద్ధి సాధించిన ప్రత్యేక ఛానళ్లు పెద్దవాళ్ల కొరకే ఉన్నవి. ఛానళ్లు కేవలము మార్చుట ద్వారా చూచుటకై అసభ్యకరమైన కార్యక్రమాలను చూడవచ్చు. ఈ అసభ్యకరమైన వెబ్‌సైట్ల గురించిన విషయం ఏమిటి? చెప్పనవసరం లేదు కానీ అసభ్యకరమైన మెయిల్ ప్రపంచం వ్యాప్తంగా ప్రవహిస్తున్నాయి. ప్రతి వారు అసభ్యకరమైన వెబ్‌సైట్ల గురించిన దుష్టత్వం గురించి బాధపడుతున్నారు. కానీ ‘‘సప్లయి - డిమాండు సూత్రము’’ గూర్చి మనం విచారించనట్లయిన ఈ జీవన రహస్యముగా ఎంతోమంది ఈ వెబ్‌సైట్లను బట్టి వాస్తవముగా ఆనందించుచున్నారని అర్థమగుచున్నది.

ఈ పద్ధతి మనకు చెప్పునదేమనగా మానవులమైన మనము పాపము మూలముగా చెడిపోయిన వారమును అసభ్యకరమునై ఉన్నాము. మానవుల హృదయాలలో నున్న వ్యభిచారమును, జారత్వమును, కామాతురత అను పాపమును బైబిల్‌ ఎత్తి చూపుచున్నది. ఈ కార్యము ప్రజలు ప్రజల హృదయము నుండి బయలుపడి వారిని అపవిత్రులను చేయుచున్నది. మరియు అవి స్పష్టమైన పాపము. మనము అందరము పాపముచే అపవిత్రులము కాదా? మన స్వతః సిద్ధమైన స్వభావము పాపభూతమైనదని దేవుడు పదే పదే హెచ్చరించుచున్నాడు.

కానీ దీనిని నిజంగా మనము ఒప్పుకొనగలమా? అది ఎట్లుండును? మన కండ్లను మూసుకొని మన చెవులను ద్వార మనలోనున్న స్వభావసిద్ధమైన పాప ఫలము నుండి మనము తప్పించుకొనగలమా? తప్పించుకొనలేము గాని మన ఆలోచనలతోనూ మనస్సుతోనూ, ఊహాతోనూ అన్నిరకముల పాపములను చేయుచున్నాము. అట్టి పాపము నుండి మనం పారిపోవలెనని మనం ఎంతగా మనకు మనం చెప్పుకొనుచున్ననూ అట్లు తప్పించుకొనటకై మనము ఎంతగా ప్రయత్నించిననూ అవన్నియూ నిష్ఫలమే. వాస్తవానికి జన్మ పాపము లేకుండునట్లు మన శరీర ప్రయత్నము వలన మనము పరిశుద్ధులము కాలేము. పాపమునకు దూరముగా ఉండవలెనను కోరిక కలిగియున్ననూ పాపము చేయుటఅనే స్వభావము మనలో ఉన్నది. మానవుల శరీరమును హృదయమును పరిశుద్ధమైన వాటి నుండి ఎల్లప్పుడూ తొలగిపోవునవి. అది వాస్తవమే అదియు కాక వారు పాపమునకు సమీపముగా ఉండకూడదని కోరుకొనుట కాదు గానీ అంతకన్నా గొప్ప పాపము చేయాలని కోరుకొనెదరు.

తూర్పున అనేకులు కన్ఫూషియస్‌ యొక్క బోధనలను వారు పుట్టినప్పటి నుండి నేర్చుకొనెదరు. కనుక అట్టి బోధనలను ఆచరించుటకై ఎంతో కష్టపడతారు. పడమటి దిక్కు వారు మరో ప్రక్క కేథలిక్కుల, శాస్త్రీయ క్రైస్తవ సంఘము వారు మతపరమైన అధిక్యతను కలిగియున్నారు. మరియు అనేకులైన పడమటి వారు ఎంతో కష్టించి ప్రయత్నించి కొద్ది పరిశుద్ధులమై అతి పరిశుద్ధులము కాగలమని ఆలోచించుచూ దేవుని ఆజ్ఞలను అనుసరించుటకై ప్రయత్నించెదరు. కానీ వారి మతపరమైన ఆధారము ఏదైననూ, తమను తాము దేవుని యెదుట ఉంచుకొనినప్పుడు కేవలము వారు పాప ముద్దలై యుండెదరు. మరియు అందరునూ ఒకే విధముగా దుష్టత్వపు విత్తములై యున్నారు.

మానవులు బలహీనతలతో నిండిన వారై అవినీతిపరులైయున్నారు. ధూళితోనూ, దుమ్ముతోనూ చేయబడి పాపపు ముద్దలై యున్నారు. మంచివారుగా కనబడుచున్న వారైననూ, హృదయ పూర్వకంగా మేలు చేయుచూ ఏ గొప్పలునూ ఆశించనివారై మంచి కార్యమును చేయుచున్ననూ వారి మంచి పనులకై వాస్తవముగా ఎటువంటి పొగడ్తను సహించలేనివారిగా ఉన్నప్పటికి తమ మూల సారాంశము వారిపై దేవుని యెదుట ప్రసరించినప్పుడు వారు తప్పించుకొనలేరు. వారు పాపభరితులైన దుష్టసంతానముగానే నిలిచెదరు. ఎందుకనగా మనుష్యులు నీతిమంతులని వాదించగల దేవుని యెదుట దుష్కార్యమై ఉన్నది. మనుష్యులు తమ శిక్షను గుర్తించిన వారై దేవుని ప్రేమను నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను అంగీకరించనట్లైన వారు పాప శిక్ష నుండి తప్పించుకొనలేరు. దేవుని ఎదుట మానవులు ఏ ప్రయత్నమైననూ మంచిదిగా మారలేదు. ధూళి వలే చిన్నవారమైననూ ఆయన ఎదుట మానవుల చిత్తము మలినమైనది.

బైబిలులో మనుష్యులు తరచుగా చెక్కతో పోల్చబడియున్నారు. ఒక తుమ్మ మొద్దు తనంతట తాను దేవుని మందిరమునకు ద్వార స్తంభముగా నిలపబడదు. అది దేవునిచే బంగారముతో చుట్టబడవలెను. దేవునిచే అనుగ్రహింపబడిన రక్షణ కృపలేకుండా పొందుకోలేరు. వారేమియూ చేయలేరు కానీ నరకము యొక్క తీర్పును ఎదుర్కొనెదరు.

ఏదేమైననూ మనము ఇంకనూ పాపులముగా ఉండగా యేసుక్రీస్తు అను మెస్సయ్య బాప్తిస్మము పొంది మరణమగునంతగా రక్తమును కార్చిన కారణముతో దేవుడు మన మెస్సయ్య రాక పూర్వము వెయ్యి సంవత్సరాలకు ముందే అట్టి రక్షణ రాజైన దావీదుచే స్పష్టముగా ప్రవచించబడెను. ‘‘పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరచియున్నాడు; తండ్రి తన కుమారుల యెడల జాలిపడునట్లు యెహోవా తనయందు భయభక్తులు గల వారి యెడల జాలిపడును. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసేయున్నది. మనము మంటి వారమని ఆయన జ్ఞాపకము చేసుకొనుచున్నాడు” (కీర్తన 103:12-14).

దేవుని పరిశుద్ధతను తెలిసికొనుటకు ముందు మానవుని నీతి అంతయూ మన జీవనస్థాయిని బట్టి నియమింపబడినది. దేవుని వరమైన రక్షణను నేను తెలిసికొనక పూర్వము నేను కూడా అట్టివాడనే. ఆయన వాక్యము మీద నమ్మకము లేని వాడనైయుంటిని. వాస్తవానికి నా స్వంత నీతి కూడా లేని వాడనైయుంటిని. కానీ నాకు నేను చాలా యోగ్యునిగా తలంచుకునే వాడిని. కనుక నా బాల్యదశనుండి అనేకసార్లు అవినీతిని సహించలేనప్పుడు నాతో సరిపోవాలని వారితో అనేకసార్లు ఘర్షణ పడితిని. నీతిగా జీవించాలని జీవిత ధ్యేయం కలిగి యుంటిని. అలాగే నాకు నేను స్వనీతితో నిండియున్ననూ, దేవుని యెదుట నేను కనుగొనలేకపోతిని. కాబట్టి నన్ను నేను ఇతరుల కంటే ఉన్నతముగా ఊహించి నీతిమంతునిగా ఉండుటకు ఎంతో కష్టించే వాడిని.

కానీ, అట్టివాడైనను నేను దేవుని నీతి ముందర పాపపు ముద్దనైతిని. నేను దేవుని పది ఆజ్ఞలను కానీ 613 దేవుని విధులను అనుసరించునట్టి వాడను కాదు. నిజానికి నేను వాటిని నెరవేర్చవలెను ఆలోచన కలిగియుండుట కూడా దేవుని వాక్యముపై తిరిగబడినట్టి అవినీతి చర్య అగును. ఆయనకు విరోధముగా మనలను నిలుపును. మనుష్యుల నీతి దేవుని యెదుట కేవలము అవినీతి మాత్రమే.

కామాతురతయను అవినీతి ప్రవాహము మధ్య దేవుని ఆయన ఆజ్ఞలను ఈ తరము కోల్పోయినది. సిగ్గును కూడా కోల్పోయినది. ఏది ఏమైననూ మానవులమైన మనము ప్రతిదినము పాపమును చేయుచున్నామని మనం గుర్తించాలి. కనుక ఏ బేధము లేక మనము నరకమునకు పోవుటకై ప్రోగు చేయబడితిమని తలంచాలి.



మనము అవినీతి పరులమును పాపముతో నిండియుంటిమి. కానీ ఆ ప్రభువు నీరు మరియు ఆత్మమూలమైన సువార్తతో మన పాపములను రక్షించుట ద్వారా మనలను తన స్వంత ప్రజలుగా చేసెను.


మనము అవినీతిపరులము. కానీ రక్షణ అను వరముతో ఆ ప్రభువు అట్టి ప్రజలమైన మనలను పాపము నుండి రక్షించెను. పరిశుద్ధ స్థలములని ప్రతి పలక 4.5మీ ఎత్తున 67.5 సెం.మీ వెడల్పు కొలతలు కలిగి బంగారంతో తాపడము చేయబడిన తుమ్మకర్రతో తయారు చేయబడెను మరియు పరిశుద్ధ స్థల గోడలుగా నిలబెట్టబడెను. ప్రతి పలక క్రింద రెండు దిమ్మలు చేయబడి పలక నిలబడుటకై ఉండవలెను. ఇక్కడ వెండి దిమ్మలు, సాదృశ్యమేమనగా దేవుడు నిన్ను నన్ను పూర్తిగా తానే రక్షించెను.

పాపము నుండి దేవుడు మనలను రక్షించెను సత్యము ఆయన ప్రేమయే. దానిలోనే యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చెను. మన పాపము నుండి శిక్ష నుండి మనలను రక్షించెను. ఆయన మనకు అనుగ్రహించిన రక్షణ అను వరమును విశ్వసించుటతో మనము తిరిగి జన్మించిన వారమైతిమి. ఆ ప్రభువు మనకు అనుగ్రహించిన రక్షణ వరము బంగారము వలే కల్తీలేనిది. కనుక అది ఎప్పటికి మారనిది.

ప్రభువు మనకు అనుగ్రహించిన రక్షణ యేసు యొక్క బాప్తిస్మము మరియు రక్తముతో చేయబడినది. మరియు ఆ రక్షణ మన పాపములన్నిటిని సంపూర్తిగా పరిశుద్ధంగా తుడిచివేసెను. నీవు నేనునూ మన మనస్సుతోనూ, ఆలోచనలతోనూ మన వాస్తవ క్రియలతోనూ చేసిన పాపములన్నిటి నుండి ప్రభువు మనలను రక్షించెను గనుక మన హృదయాలలో దేవుడు మనకు ఇచ్చిన రక్షణ అనువరమును విశ్వసించినట్లయిన మనము ఆయన ప్రశస్తమైన పరిశుద్ధులము కాగలము. ప్రత్యక్ష గుడారపు ప్రతి పలక క్రింద ఉన్నట్టి ఆ రెండు దిమ్మల ద్వారా దేవుడు మనకు నీరు మరియు ఆత్మ యొక్క రక్షణను గూర్చి చెప్పుచున్నాడు. తన 100 శాతపు కృప మరియు వరము వలన మనము ఆయన బిడ్డలమైనామని దేవుడు చెప్పుచున్నాడు.

మనము మన నుండి యేసు యొక్క బాప్తిస్మము మరియు రక్తము నందున్న విశ్వాసము తొలగించినట్లయిన మనలో ఇక యేదియూ మిగిలి యుండదు. మనము అందరము మన పాపము కొరకు శిక్ష పొందవలసిన వారమే. పాపమునకు జీతము మరణము అను దేవుని ఆజ్ఞ ప్రకారము మనము మరణము ఎదుట నిశ్చయముగా అశాశ్వతమైన వారము. మన కొరకు ఉంచబడిన అగ్ని గుండమును న్యాయతీర్పును తెలిసికొని దుఃఖించవలసిన వారము. ఇందువలనే మనము నీరు ఆత్మమూలమైన సువార్త నందున్న విశ్వాసమును కోల్పోయిన టు వంటి వారమే. 

పాపముతో నిండియున్న లోకములో ఇప్పుడు జీవించుచున్న మనము మన భవిష్యత్తు కేవలము అగ్ని తీర్పునకు నియమించబడినదని ఎప్పుడు మరువరాదు. మనము అట్టి అశాశ్వతమైన వారము. అయిననూ మనపై దేవుని కృప సంపూర్తిగా కుమ్మరింపబడెను. ఎందుకనగా ఆయన మనకు నీరు ఆత్మమూలమైన రక్షణను అనుగ్రహించెను. మెస్సయ్య ఈ లోకమునకు వచ్చెను యోహానుచే బాప్తిస్మం పొందెను. తన రక్తమును కార్చి సిలువలో చనిపోయెను. మృతి నుండి తిరిగి లేచెను. తద్వారా మన పాపములన్నింటి నుండి మన అవినీతి అంతటి నుండి శిక్ష నుండి మనలను రక్షించెను. ఈ పరిపూర్ణమైన నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను విశ్వసించుటతో మనము ఇప్పుడు మన పాపములన్నిటి నుండి రక్షింపబడితిమి మన విశ్వాసముతో మనము ఆయనకు కృతజ్ఞతలు చెల్లించవలెను.

మనము శరీరరీతిగా బలహీనులమైననూ మన పనివారు సేవకులు నేనును లోకమందు అంతటా ఈ నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను బోధించుచున్నాము. ఈ కాలము అట్టి అవినీతి మయమైయున్ననూ మనము నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను విశ్వసించుచున్నాము. కనుక మనము ప్రభువును దుష్టత్వము లేకుండా పరిశుద్ధలముగా సేవించగలుగుతున్నాము. మనము ఇట్టి మనస్సు కలవారమై యుండుటకు కారణము మన స్వశక్తిని బట్టి కాదు. కానీ ఆ ప్రభువు తన రక్షణ అను కృపను ధరింపచేసి పరిశుద్ధతను అనుగ్రహించెను.

ఎందుకనగా ఆ ప్రభువు మనలను పాపము నుండి శిక్ష నుండి పరిపూర్ణంగా రక్షించెను. కనుక ఈ రక్షణ యొక్క శక్తితో మనము కప్పబడ్డాము. మరియు సంపూర్తిగా ఈ కారణము వలననే మనము ప్రభువును పరిశుద్ధలముగా ఆరాధించగలుగుచున్నాము. ఆ ప్రభువు మనలను నీరు మరియు ఆత్మమూలమున పాపము నుండి రక్షించెను కనుక మనము బలహీనులమును ఆయనను మనము సేవించగలుగుతున్నామని పాపమునకు బలహీనతలకు శిక్షకు మనము ఇకను దాసులము కాము.

నేనేమైయున్నానో అది నిశ్చయముగా దేవుని కృప వలనే అయి వున్నాను.

నిజముగా మన ప్రభువు యొక్క కృప కాని యెడల ఇవన్నియూ చేయుటకు అసాధ్యము. నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను లోకము అంతటా ప్రచురపర్చుట మరియు ఈ సువార్త సేవను పరిశుద్ధలముగా జరిగించుట ప్రభువు కృప లేనట్లయితే అసాధ్యమే. నీవు నేను సువార్త పరిచర్య చేయుచూ కాపాడుకొనుచూ మన జీవితము జీవించుటకు 100 శాతము దేవుడు మనకు అనుగ్రహించిన రక్షణ యొక్క కృపయే.

మనము దేవుని యొక్క ప్రత్యక్ష గుడారపు స్తంభముపై యున్నాము. (ప్రకటన 3:12) మరియు విశ్వాసము ద్వారా ఆయన రాజ్యసంబంధులమైన ప్రజలమై యున్నాము. బంగారము వంటి విశ్వాసమును దేవుడు మనకు అనుగ్రహించిన కారణాన మనము ఇప్పుడు దేవుని గృహములో నివశించుచున్నాము. లోకము పాపములో కొట్టుకొనిపోవుచూ దానిలో మునుగుచున్న ఈ కాలములో చాలామంది దేవుని మరచిపోయి లేదా దూషించుచున్న ఈ యుగములో నిర్మలమైన నీటిలో మనము కడగబడి శుభ్రపడి యున్నాము. మనము నిర్మలమైన జలమును త్రాగగలుగుతున్నాము. మరియు నిర్మలముగా ప్రభువును సేవించుచున్నాము. ఈ దీవెన కొరకు మిక్కిలిగా తెలుపుటకు మాటలు చాలవు.

మన విశ్వాసము వాస్తవముగా ఎట్లున్నది? మనము ఏలాగు నీతిమంతులము కాగలము? మనలో ఏ మంచి లేనప్పుడు మనకు మనమే నీతిమంతులము ఎట్లుకాగలము? నీ శరీర నీతి వలన నీవు పాపరహితుడవుగాను, నీతిమంతుడవుగాను మారగలవా? నీ శరీర ఆలోచనలు నీ స్వంత ప్రయత్నములు, నీ స్వంత క్రియలు వీటిలో ఏ ఒక్కటైననూ నిన్ను పాపములేనివానిగాను మరియు నీతిగలవానిగానూ మార్చగలవా? నీరు మరియు ఆత్మమూలమైన సువార్త నందు విశ్వాసము లేకుండా నీవు నీతిమంతుడవు కాగలవా? నీల, ధూమ్ర, రక్తవర్ణము గల పేనిన సన్నపునార యొక్క దారములో బయలుపరచబడిన దేవుని రక్షణ విశ్వాసము ద్వారా కాకుండా నీవు నీతిమంతుడవు కాగలవా? మెస్సయ్య నెరవేర్చిన నీరు మరియు ఆత్మమూలమైన సువార్తద్వారాను దేవుని వాక్యములో బయలుపరచబడిన వాటి ద్వారాను పొందిన నీ రక్షణను విశ్వసించకుండా నీవు నీతిమంతుడవు కాగలవా? నీవు ఎప్పటికి అలాగు కాలేవు. ధూమ్ర వర్ణ దారమును మాత్రమే విశ్వసించుట వలన మనము నీతిమంతులము కాలేము.

యేసుక్రీస్తు మన రక్షకుడును, మెస్సయ్యయైయున్నాడు. కనుక మన జీవితకాల పాపములతో సహా అన్నింటిని యోహాను ద్వారా ఆయన పొందిన బాప్తిస్మము ద్వారా మనకు బదులుగా మన పాపమును పొగొట్టుటకు లోకపాపములన్నిటిని తన భుజమునకు ఎత్తుకొనెను. విశ్వాసము వలన మనము నీతిమంతులముగా మార్చబడినాము. పాతనిబంధన యొక్క బలి పశువు పాపులు లేదా ప్రధాన యాజకులు దాని తలపై చేతులుంచినప్పుడు పాపమును భరించినరీతిగానే యోహానుచే బాప్తిస్మం పొందుట ద్వారా మన పాపమును తనపై మోపుకొనెను. (మత్తయి 3:15) ఆయన యోహాను వలన ఈలాగు సాక్ష్యము పొందెను. ‘‘ఇదిగో లోక పాపమును మోసుకొనిపోవు దేవుని గొర్రెపిల్ల” (యోహాను 1:29)

తను బాప్తిస్మము పొందినవాడై యేసయ్య తరువాత మూడు సంవత్సరములు ఆయన జీవితమును మన రక్షణ కొరకు జీవించెను. సిలువకు అప్పగింపబడుట ద్వారా మన పాపములన్నిటిని వాటి శిక్షను అంతము చేసెను. మరియు బొచ్చు కత్తిరించు వాని యెదుట గొర్రెవలే ఆయన తన స్వంత శరీరమును దేవునికి అప్పగించెను. మనకు నూతన జీవితమును ఇచ్చెను.

యేసుక్రీస్తు యోహాను యొద్ద నుండి పొందిన బాప్తిస్మము ద్వారా మన పాపములను తాను ఎత్తుకొని తనను తాను మౌనముగా అప్పగించుకొనెను. మరియు రోమా సైనికులు వలన సిలువ వేయబడినప్పుడు తన రెండు అరచేతులలోనూ, అరకాళ్లలోను మేకులు కొట్టబడినవాడాయెను, సిలువలో వ్రేలాడెను. యేసయ్య తన దేహములో నున్న రక్తమునంతా కార్చెను. మరియు ఆయన మన రక్షణ కొరకు అఖరి సమయమును ఏర్పరచెను. ఇట్లు చెప్పి ‘‘సమాప్తమాయెను.’’ (యోహాను 19:30)

అలాగు చనిపోయినవాడై మూడు దినములలో ఆయన మృతి నుండి తిరిగి లేచెను. పరలోక రాజ్యమునకు ఆరోహణుడాయెను. మనకు నిత్యజీవమును ఇచ్చెను కనుక మనకు రక్షకుడాయెను. బాప్తిస్మమిచ్చు యోహాను వలన బాప్తిస్మం పొందుట ద్వారా లోకపాపమును వహించుటచే తను ఆయన పొందిన సిలువ పునరుత్థానము మరియు ఆరోహణము ద్వారా యేసయ్య మనకు పరిపూర్ణ రక్షకుడాయెను. కనుక బైబిలు ఈలాగు ప్రకటించుచున్నది. ‘‘వీటి క్షమాపణ ఎక్కడ కలుగునో అక్కడ పాప పరిహారార్థ బలి యికను ఎన్నటికిని ఉండదు.’’ (హెబ్రీ 10:18)



సిలువ యొక్క రక్తము మరియు అధిక పవిత్రతను గూర్చిన బోధన యందలి విశ్వాసము మూలముగానే నీవు నీ పాపము నుండి పరిపూర్ణముగా రక్షింపబడలేదు.


తమ పాపము నుండి వారు కేవలము యేసయ్య సిలువ రక్తములో విశ్వాసమును ఉంచుట మూలముననే పూర్ణముగా రక్షింపబడని క్రైస్తవులు తప్పక తెలుసుకొనవలెను. ఎందుకనగా ప్రజలు తమ కన్నుల ద్వారాను క్రియల ద్వారాను ప్రతిదినము పాపము చేయుదురు కనుక కేవలము ఒక్క సిలువ రక్తమును మాత్రమే విశ్వసించుట వలన తమ పాపమును తుడుపు పెట్టలేరు. ఈ దినములలో ప్రజలు అత్యంత త్వరగా పడిపోవు బలహీనతలో ఒకటి అక్రమలైంగిక సంబంధం. తేటగానున్న సంస్కృతి మరియు అసభ్యకర లైంగికత లోకములో వ్యాపించుచుండగా ఈ పాపము మన శరీరమును గట్టిగా పట్టును. వ్యభిచరించవద్దని బైబిలు ఆజ్ఞాపించుచున్నది. కానీ ఈ దినాలలో తమ చుట్టూ ఆవరించియున్న పరిస్థితుల కారణంగా అనేకమంది ప్రజలు తమకు అవసరత లేకున్ననూ పాపము చేయుచున్నారు.

దేవుడు ప్రకటించునదేమనగా ‘‘ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసినవాడగును” (మత్తయి 5:28) అయిననూ ప్రతిదినము మన కన్ను చూచునది అసభ్యతనే. కనుక ప్రజలు అట్టి కామకరమైన పాపమును ప్రతి నిమిషము, ప్రతి సెకను చేయుచున్నారు. పరిస్థితి ఇట్లున్నప్పుడు వారు పశ్చాత్తాప ప్రార్థనలను చేయుచూ వారు తమకు తాము ఎట్లు నీతిమంతులవుతారు? తమను తాము చాలా కాలము అదుపులో ఉంచుకొనినప్పుడు మరియు వారు ముసలివారైనప్పుడు ఎట్లో తమను శుద్ధిచేసుకొను వారి హృదయములు నీతిగలవి కాగలవా? వారి శీలము సౌమ్యముగా ఉండునా? కాకపోవచ్చు. జరుగునదేమనగా ఖచ్చితంగా దీనికి వ్యతిరేకముగా జరుగును.

అందుబాటులోనున్న క్రైస్తవ బోధనలలో పరిశుద్ధతను పెంపొందించుట అను బోధ కూడా ఉన్నది. ఈ బోధ ఇట్లు చెప్పబడుచున్నది. పూర్వము యేసయ్య సిలువపై పొందిన మరణము క్రైస్తవులు నమ్మి, ప్రతి దినము పశ్చాత్తాప ప్రార్థనలను చేయుచూ ప్రతి దినమూ ప్రభువును ఆరాధించినప్పుడు క్రమక్రమంగా వారు పరిశుద్ధులై మంచి నడవడి కలవారుగా మారతారు. మనం యేసయ్యను విశ్వసించే నాటికే ఎంతో సమయం గడిచిపోతుందని పాపము చేయక మరేదియూ చేయలేని వారముగా మనము ఉన్న కొద్దీ మన క్రియలు పాపసంబంధమైనప్పుడు మరణము మనలను సమీపించు కాలములో మనం పూర్తిగా పరిశుద్ధపరచబడతాము కనుక మనము పూర్తిగా పాపరహితులమైతాము అని కూడా చెప్పెను.

మరియు ఎల్లప్పుడు మనము పశ్చాత్తాప ప్రార్థనలను చేస్తూ ఉంటాము కనుక మనము ప్రతి దినము మన బట్టలను ఉతుకుకొన్నట్లు గానే ప్రతి దినము మన పాపములను కడుగుకొంటాము. కనుక ఆఖరున మనం చనిపోవునప్పుడు పరిపూర్ణముగా నీతిమంతులైన వారి వలే మనము దేవుని యొద్దకు చేరుతాము. ఈ విధముగా నమ్మినవారు చాలామంది ఉన్నారు. కానీ ఇది అంతయూ కేవలము మనిషి చేసిన ఆలోచనలు మూలముగానున్న ఊహాచిత్రమే.

రోమా 5:19 ఇలాగు చెప్పుచున్నది. ‘‘ఏలయనగా ఒక మనష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఏలాగు చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు.’’ ఈ పేరాలో వలన చెప్పబడినదేమనగా ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. నీవును నేను చేయలేని క్రియలను యేసుక్రీస్తు వ్యక్తిగా ఈ లోకమునకు వచ్చినప్పుడే దానిని సాధించెను. నీవును నేనును మన పాపము నుండి మనము విడిపించుకొనలేమని బాగుగా తెలిసికొని, నీవు నేను ఎప్పటికీ చేయలేని పనిని మనకు బదులుగా యేసయ్య మన పాపముకు ప్రాయశ్చిత్తము చేసెను. ఈ లోకమునకు వచ్చినప్పుడే దానిని సాధించెను. నీవును నేనును మన పాపము నుండి విడిపించుకొనలేమని బాగుగా తెలిసికొని, నీవు నేను ఎప్పటికీ చేయలేని పనిని మనకు బదులుగా యేసయ్య మన పాపములకు ప్రాయశ్చిత్తము చేసెను. ఈ లోకమునకు వచ్చుట ద్వారాను బాప్తిస్మం పొందుట ద్వారాను సిలువలో చనిపోయెను. మృతులలో నుండి తిరిగి లేచి ఆయన నిన్ను నన్ను రక్షించెను. ఒక్కసారిగానే మన పాపములన్నిటిని కడిగెను.

తన ప్రజలకు యేసుక్రీస్తు వారి పాపము క్షమాపణ ద్వారా రక్షణ అనుగ్రహించగలడు. ఎందుకనగా దేవుని చిత్తమునకు లోబడిన యేసుక్రీస్తు తన బాప్తిస్మము సిలువ మరియు పునరుత్థానము ద్వారా రక్షణ అను యేసయ్య పాప పరిహారమును మనకు అనుగ్రహించుట ద్వారా యేసయ్య పాప పరిహారమును పరిపూర్ణముగా నెరవేర్చెను. మరియు ఇప్పుడు విశ్వాసము వలన ఈ రక్షణ అను వస్త్రమును ధరించియున్నాము. ఎందుకనగా మన ప్రభువు పాపము నుండి మన రక్షణ కార్యమును నెరవేర్చెను అది మన స్వప్రయత్నము ద్వారా సాధించలేము.

అయిననూ క్రైస్తవులు అనేకులు యేసయ్య పొందిన బాప్తిస్మమందు నమ్మికయుంచరు. కానీ దానికి బదులుగా కేవలము ఆయన సిలువలో కార్చిన రక్తమును మాత్రమే నమ్ముకొని తమ స్వంత క్రియల ద్వారా పరిశుద్దులగుటకు ప్రయత్నిస్తారు. ఒక విధంగా యోహాను వలన బాప్తిస్మం పొందినప్పుడు యేసయ్య మానవుల పాపాలను తనపై మోపుకొనిననూ, ప్రజలు ఈ వాస్తవమును విశ్వసించరు. మత్తయి సువార్త 3వఅధ్యాయం యేసయ్య తన బహిరంగ జీవితంలో మొదటి యోహానుచే బాప్తిస్మమును పొందెనని చెప్పుచున్నది. సువార్త రచయిత ఈ సత్యమును ధృవీకరించిరి.

యేసయ్య యోహానుచే బాప్తిస్మం తీసుకొనుటచే మన పాపమును మోసెను. మానవుల ప్రతినిధియై స్త్రీలు కనిన వారందరిలో అత్యున్నతుడైననూ చాలామంది ఈ సత్యమును నిర్లక్ష్యపరచి దానియందు విశ్వాసమునుంచరు. అట్టి ప్రజలు యేసయ్య బాప్తిస్మమును విశ్వసించకుండానే యేసయ్యను నమ్ముతున్నారు. పర్యావసానముగా ఆయన సిలువలో చిందించిన రక్తమునే మహిమ పరచుచున్నారు. యేసయ్య సిలువలో పొందిన మరణము వలన గాయపరచబడినవారై వారు భావోద్రేకముతో ప్రేరేపించబడినవారై అన్నిరకములైన పొగడ్త వచనముతో ఈలాగు గట్టిగా మాట్లాడుతారు. రక్తములో ఆశ్చర్యకరమైన శక్తి ఉన్నది. అద్భుతంగా పనిచేయు శక్తి ప్రశస్తమైన గొర్రె పిల్ల రక్తములో ఉన్నది. వారు దేవునివారై ఉంటారు. వారు ఎంత అధికముగా అలాగున చేయుకొలది అంత అపహాసకులుగా వారు మారతారు. పరిశుద్ధులైనట్లుగా నటించెదరు కానీ రహస్యముగా తమ హృదయములో పాపమును ప్రోగుచేసుకొనుట వాస్తవమని నీవు తప్పక గ్రహించాలి.



నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను కూడా తెలిసికొనకుండా మనము యేసయ్యను మన రక్షకుడని ఎట్లు విశ్వసించగలము?


ప్రజలు ప్రత్యక్ష గుడారమును గురించి మాట్లాడునప్పుడు వారు మాట్లాడుచున్న దాని గురించి కొంచెమైననూ ఎరుగనివారని తరచూ మనం చూస్తుంటాం. ప్రత్యక్ష గుడారమును విశ్వసించుటను గురించి ఏదో మనకు తోచిన విధముగా మనకు అనుకూలముగా విశ్వసించగలమా? ఎందుకనగా ప్రభువు నెరవేర్చినట్లు పాపము నుండి కలుగు రక్షణ విస్తారమైయుండగా ఎంత విస్తారముగా ఎంత దృఢముగా మన రక్షణ నెరవేరినదో దానిని మనము తెలిసికొనునట్లు దేవుడు అనుగ్రహించెను.

ప్రత్యక్ష గుడారము ద్వారా ఆ ప్రభువు నీలి ధూమ్ర రక్తవర్ణ దారములైన నీరు మరియు రక్తము ద్వారా రక్షించెనని మనము తెలిసికొనునట్లుగా ఆయన చేసెను. మన పాపమును తుడిచివేయుటకు ఆ ప్రభువు వచ్చెనని మనము తెలిసికొనగలము. ‘‘నీళ్ళతో మాత్రమే గాక నీళ్ళతోను, రక్తముతోను వచ్చెను”. (1యో 5:6) మనము విశ్వసించు ఆ నీరు, రక్తము మరియు ఆత్మ ఒకటైయుండెను మనుష్యునిగా వచ్చి బాప్తిస్మమిచ్చి యోహాను ద్వారా బాప్తిస్మం పొంది, మరణించి మృతి నుండి తిరిగి లేచుట వలన ఆ దేవుడు మనలను రక్షించెను.

ప్రత్యక్ష గుడారము ద్వారా ఆ వివరణాత్మకమైన రక్షణ యొక్క స్వరూపమును మనము ఆవిష్కరించగలుగుతున్నాము. ప్రతి ఫలకము యొక్క రెండు కుసులు మరియు రెండు వెండి దిమ్మలను గూర్చి అధ్యాయనం చేయుటతో, ఏ విధానముతో యేసయ్య మనలను రక్షించెను అనునది మనం తెలిసికొనగలము. అట్లు మనం సత్యమును తెలిసికొనిన మనము నీలి, ధూమ్ర, రక్తవర్ణదారములో చూపబడిన యేసయ్య సేవలను మనము తప్పక నమ్మాలి.

బైబిలు నుండి తప్ప మరి ఎక్కడ ఈ రక్షణ యొక్క ప్రారంభమును మనము కొనుగొనలేము. బాప్తిస్మము మరియు సిలువ అను రెండు పదార్థముల ద్వారా చేయబడిన రక్షణ యొక్క బహుమానము మనకు అవసరమైయున్నది. ఈ సత్యమును విశ్వసించువారు దేవునిలో జన్మించినవారు కాగలరు. నీరు మరియు ఆత్మమూలముగా మనను మన పాపము నుండి విడిపించుటతో మన రక్షణను పరిపూర్ణముగా దేవుడు నెరవేర్చెను.

మరియొక విధముగా రెండు కుసులు ఆ రెండు పలకల క్రిందుగా తయారుచేయబడి రెండు వెండి దిమ్మలలో కూర్చబడినవి. మనకు మన పాప విమోచనకు ఈ సత్యము ఖచ్చితముగా అత్యవసరమైనది మరయు అత్యంత ప్రాముఖ్యమైనది. అది ఖచ్చితంగా దేవుడు మన కొరకు నెరవేర్చిన రక్షణను మనము తప్పక విశ్వసించాలి. ఎందుకనగా నీలి,ధూమ్ర, రక్తవర్ణదారము యొక్క సత్యమునందు మనము విశ్వాసమును ఉంచని యెడల మనము ఎప్పటికీ రక్షింపబడలేము.

ప్రత్యక్ష గుడారపు ప్రతి పలక సరిగా నిలబడుటకు రెండు వెండి దిమ్మలు అవసరమైనట్లుగానే యేసుక్రీస్తును విశ్వసించు విషయానికి వచ్చినప్పుడు ఆయన కృప యొక్క రెండు సత్యములు ఖచ్చితంగా అవసరమైయున్నవి. అవి ఏవి? అవేవనగా యేసు బాప్తిస్మం పొందుట ద్వారా మన పాపములను వహించుకొనుట వాటిని సిలువకు మోసికొనిపోవుట ద్వారా మన పాపము యొక్క శిక్షను శాపమును ఆయనే భరించెను. మరియు సిలువ వేయబడెను. నీతిమంతులుగా మారిన వారు ఎవరైననూ అతడు/ఆమె పరిపూర్ణ రక్షణ యొక్క రెండు కృపను సంపూర్ణముగా విశ్వసించినవారే. యేసయ్య బాప్తిస్మము మరియు ఆయన సిలువ రక్తము అను రెండు ప్రధాన అంశములైన ఆయన రక్షణ యొక్క కృపనందు మన విశ్వాసము దేవుని ఇంటిలో మనలను స్థిరముగా నిలుపునట్లు చేయును. ఆ రెండు వెండి దిమ్మల్లో రెండు కుసులు కూర్చబడినట్లుగానే, ప్రతి పలక తిన్నగా నిలబడవలెను.

అలాగే ఆయన రక్షణ యొక్క రెండు ప్రధానాంశముల పై మనకున్న నమ్మకము యొక్క సరైన విశ్వాసముతో మనము నిందారహితమైన ఆయన ప్రజలు కాగలము. యేసు అనుగ్రహించిన నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను విశ్వసించుట ద్వారా మార్పులేని శాశ్వతమైన సువర్ణముగా మనము మారగలము. ఆత్మమూలమైన ఈ సువార్తను విశ్వసించుటతోనే మనము పాపముకు పూర్ణమైన పరిహారమును పొందిన రక్షణ గలవారమైన పరిశుద్ధులముగా కాగలము.



ఇప్పటి వరకు ఉన్న తత్త్వశాస్త్రము మరియు నీరు ఆత్మమూలమైన సువార్త యొక్క యుగము.


ఆది సంఘ కాలమును తొలగించి మిలాన్‌ 313 ఎ.డి.లో జారీచేసిన శాసనకాలము నుండి క్రైస్తవ్యము. ఈ దినము క్రైస్తవ్యమును కూడా కలిసి యేసుని బాప్తిస్మంను విడిచి సిలువను గూర్చిన సువార్తను ప్రకటించుచూనే ఉన్నాయి. ఆది సంఘ కాలము నుండి 313 ఎ.డి. వరకు ఉన్న కాలము. క్రైస్తవ్యమును క్రొత్త రోమను మతముగా చట్టపరచెను. క్రైస్తవ్యము నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను ప్రకటించెను. కానీ మతపర దృశ్యమును ఆ తరువాత రోమా కేథలిక్కుల సంఘము ఆధిపత్యము చేసెను. అప్పుడు ఆది 14వ శతాబ్ధాము మానవ ఆలోచనలను కేంద్రీకరించిన ఒక సంస్కృతి వచ్చెను. మానవత్వము పునరుజ్జీవించునని పిలువబడుట ప్రారంభమయ్యెను. మొదటిగా ఒక అభివృద్ధి చెందుచున్న పట్టణమైన ఉత్తర ఇటలీ రాజ్యములో ఆరంభమయ్యెను. అది ఒక పునరుజ్జీవము.

16వ శతాబ్ధములో ఇటలీతో ప్రారంభమై నిగూఢముగా నున్న ఈ సంస్కృతి వెస్ట్రన్‌ ప్రపంచమంతటా వ్యాపించుటకు ఆరంభించెను. మరియు మానవత్వమును అధ్యయనం చేసిన పండితులు. మానవ నిర్మిత తత్వము తత్వశాస్త్రమును పరిశీలించుట మొదలాయెను. తమ స్వంత జ్ఞానముతో బైబిలును అన్వయించుచూ వారు క్రైస్తవ బోధలను నిర్మించుటకు ప్రారంభించిరి. వారు సత్యమును ఎరుగనివారు కనుక వారు బైబిలును సంపూర్ణముగాను ఆరోగ్యవంతముగాను అర్థము చేసుకొనలేరు. కనుక తమ జ్ఞానముతో వారు అర్థము చేసుకొనలేని దానిని లౌకిక జ్ఞానము మరియు ఆలోచనతో దానిని భర్తీచేయుట ద్వారా ఆ సమస్యను అంగీకరించిరి. కనుక తమ స్వంత క్రైస్తవ బోధనలు ఉత్పత్తి చేసిరి.

దాని ఫలితముగా క్రైస్తవ చరిత్రలో అనేకమైన క్రైస్తవ బోధనలు మరియు తాత్వికతలు పుట్టినవి. లూథరనిజమ్‌, కాల్వినిజమ్‌, ఆర్మేనియానిజమ్‌, న్యూథియాలజీ, కన్‌సర్వేటిజమ్‌, రేషనలిజమ్‌ క్రిటికల్‌ థియారీ, మిస్టికల్‌ థియరీ, లిబరేషన్‌ థియరీ, ఫెమినిస్ట్‌ థియరీ, బ్లాక్‌ థియాలజీ మరియు ఆఖరున ఎథిస్టిక్‌ థియాలజీ కూడా.

క్రైస్తవ చరిత్ర చాలా పెద్దగా కనబడును. కానీ వాస్తవముగా అంత పెద్దదేమీ కాదు. ఆది సంఘ కాలము నుండి మొదలుకొని 300 సంవత్సరముల వరకూ బైబిలును గూర్చి ప్రజలు నేర్చుకోగలిగారు కానీ త్వరగానే మిడీవియల్‌ కాలమును అనుసరించెను. అది క్రైస్తవ్యమునకు చీకటి కాలము. ఈ కాలములో పేద ప్రజలు బైబిలును చుదువుటయే పెద్ద శిక్షింపతగిన నేరము. శిరచ్ఛేధన శిక్ష విధింపబడును. 1700లో థియాలజీ గాలి వీచువరకూ కొనసాగెను. మరియు థియాలజీ అధికముగా చురుకుగా అభివృద్ధి చెందిన తరువాత 1800 మరియు 1900లో వికసించెను. కానీ ఇప్పుడు అనేకులు కల్పనా కథలైన బోధనలో పడిపోవుచూ తమ స్వంత అనుభవముతో దేవుని నమ్ముచున్నారు. అని థియాలాజికల్‌ వైరుద్యాలకు బదులుగా క్రైస్తవ్య ప్రవాహపు అన్ని శాఖలు ఒకే విశ్వాస బోధనలు కలిగియున్నవి. అదేదనగా కేవలము సిలువ రక్తమును విశ్వసించుటయే.

కానీ ఇది నిజమా? నీవు ఈ విధముగానే విశ్వసించినప్పుడు నిజముగా నీ పాపము పోయినదా? నీవు ప్రతి దినమూ పాపం చేస్తావు. నీవు ప్రతిదినం నీ హృదయముతో, ఆలోచనలతో, క్రియలతో, బలహీనతలతో పాపము చేస్తావు. అట్టి సమయంలో నీ ఈ పాపము నుండి విమోచనను కేవలము యేసు సిలువలో కార్చిన రక్తము ద్వారా సాధ్యమేనా? ఆ యేసు బాప్మిస్మం పొందుట ద్వారా మన పాపమును వహించుకొనెను. మరియు సిలువలో చనిపోయెననునది బైబిలు పరమైన సత్యము. అయిననూ అనేకులు ఇలాగు చెప్పుచున్నారు. కేవలము సిలువ రక్తమును నమ్మినప్పుడే తమ పాపము క్షమించబడెననియు ప్రతిదినము పశ్చాత్తాప ప్రార్థనలను చేయుట వలన రక్షింపబడిరి. అట్టి పశ్చాత్తాప ప్రార్థనలను చేయుట వలననే నీ హృదయ పాపము మరియు నీ మనస్సాక్షి పాపాలు కడుగబడెనా ఇది అసాధ్యము.

మీరు క్రైస్తవులైతే ఈ సత్యము యొక్క రక్షణను ఇప్పుడు తెలిసికొని నమ్ముకోవాలి. ఎట్లనగా ఆ యేసు ఈ లోకమునకు వచ్చెను. యోహానుచే బాప్తిస్మం పొంది ప్రయత్నించకుండానే లేక విశ్వసించకనే నీవు ఇంకనూ ఈ సత్యమును గమనించవా? అలాగైన యేసును అవమానపరచుచూ ఆయన నామమును తగ్గించుచూ, దూషించుచూ నీవు పాపము చేయుచున్నావు మరియు నీవు యేసు నా స్వంత రక్షకుడని వాస్తవంగా నీవు చెప్పలేవు. యేసుక్రీస్తు నెరవేర్చిన ఈ రక్షణ యొక్క యేసుని బాప్తిస్మమును వదలినందున మరియు నీకు నచ్చిన విధముగా యేసుని నమ్ముకొనుట వలన నీవు రక్షణ వస్త్రమును ఎప్పటికినీ ధరించలేవు.

ఇప్పటికీ ఈ సత్యమును క్రైస్తవులు అనేకులు ఉన్నది ఉన్నట్లుగా విశ్వసించుటలేదు. ఏమనగా యేసయ్య మన పాపములను కడిగెను అను వారికి బదులు తమ స్వంత ఆలోచనలను అనుసరించుచూ వారు నమ్ముకొనిన త్రిప్పివేయబడిన సత్యమును విశ్వసిస్తారు. ఈ దినాలలో వారి హృదయాలు తప్పుడు బోధన యందు ఉంచు విశ్వాసము వలన మరి అధికముగా కఠినమగుచున్నవి. తమ పాపము కేవలము సిలువ రక్తమును మాత్రమే నమ్ముటవలన కడుగబడుననే విశ్వాసంతో ఉంటారు.

కానీ దేవునిచే ప్రణాళిక చేయబడిన రక్షణ యొక్క సమాధానము ఈ క్రింది విధముగా ఉండును మనము యేసయ్య బాప్తిస్మము సిలువపైన ఆయన మరణమును ఆయన పునరుత్థానమును విశ్వసించుట వలన శాశ్వతమైన పాప పరిహారమును మనము పొందుకొనగలము. ఈ రక్షణ యొక్క సత్యము నుండి ఆయన పొందిన బాప్తిస్మమును తీసివేసి యేసయ్యను నమ్ముకొను ప్రజలు అనేకులు ఉన్నప్పటికి వారు మార్చలేనట్టి ఆ ఆజ్ఞను అపార్థము చేయుచూ, అపనమ్మకమును ఉంచుచున్నారు. ‘‘యేసు (ఆ సిలువ మరియు ఆయన పునరుత్థానము) + పశ్చాత్తాప ప్రార్థనలు + నిజ క్రియలు = అభివృద్ధి పొందుచున్న పరిశుద్ధత ద్వారా పొందిన రక్షణ” ఈ విధానమును నమ్ముకొనువారు కేవలము వారి పెదవులతోనే వారు పాపక్షమాపణ పొందినామని చెప్పుచున్నారు. ఏదేమైననూ వాస్తవమేమనగా వారి హృదయాలు పాపరాసులతో నిండినవై ఇంకనూ పరిష్కరింపబడియుండలేదు.

నీవు ఇంకనూ నీ హృదయంలో పాపమును కలిగియున్నావా? ఇప్పుడు నీవు యేసయ్యను నమ్ముచున్నానూ నీ హృదయంలో ఇంకనూ పాపము ఉన్న యెడల నీ విశ్వాసములో కష్టతరమైన సమస్యలున్నవని స్పష్టమగుచున్నది. అదేమనగా నీవు యేసయ్యను కేవలము ఒక మత సంబంధమైన విషయములో పాపమును కలిగియుండుట ఎంతైన అదృష్టమైన విషయమే ఎందుకు? ఎందుకనగా ఎవరైతే తమలో పాపము ఉన్నదని గుర్తిస్తారో వారు తాము తపింప్పబడక నరకములో ఈ పాపం కొరకు పడవేయబడెదమని గమనిస్తారు. అలాగు వారు చేసినప్పుడు వారు తమ ఆత్మలో బీదలై, అటు తరువాత నిజరక్షణ యొక్క వాక్యమును ఆలకించెదరు.

దేవుని యొద్ద నుండి నీవు నీ పాపక్షమాపణ కోరిన యెడల నీ హృదయాలు సిద్ధపడి ఉండవలెను. ఎవరి హృదయములు సిద్ధపడి దేవుని యెదుట ‘‘దేవా, నేను 

పాపక్షమాపణ పొందకోరుచున్నానని ఒప్పుకొనును. నేను చాలా కాలంగా యేసయ్యను నమ్ముచున్నాను. కానీ నాలో ఇంకనూ పాపము ఉన్నది. పాపమునకు జీతము మరణము కనుక నేను తప్పింపబడక నరకములో త్రోయబడతాను.’’ ఈ విధముగా తాము దేవుని యెదుట పూర్తిగా పాపులమని గుర్తించగలుగుతారు. దేవుని వాక్యమును గుర్తించినవారు దేవుని వాక్యము చెప్పుచున్న ప్రకారము నెరవేర్పుకలవారై విశ్వాసమును ఉంచెదరు. సిద్ధపాటు కల హృదయము అట్టి వారికవే కానీ మరి ఎవనివి కావు.

ఏ బేధమును లేకుండా దేవుడు అట్టి ఆత్మను కలుసుకుంటాడు. అట్టి ప్రజలు ఆయన వాక్యమును వింటారు. వారు తమ కన్నులతో వాక్యమును చూచి, దానిని రూఢిపరచుకొంటారు. మరియు అలాగు చేసి నేను విశ్వసించినది తప్ప లెక్కలేనంత మంది ప్రజలు తప్పుడు విశ్వాసాన్ని కలిగియుంటున్నారు అని గుర్తిస్తారు. నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను విశ్వసించుచూ, ఇతరులు ఏది చెప్పిననూ గుర్తించక వారు తమ పాపక్షమాపణను పొందుకుంటారు.



తమ పాపములన్నిటి నుండి రక్షింపబడినవారు తప్పక తమ విశ్వాసమును నీరు మరియు ఆత్మ మూలమైన సువార్తను విశ్వసించుట ద్వారా కాపాడుకొనవలెను.


ఈ లోకము లెక్కలేనన్ని దుష్టబోధనలతో నిండినప్పటికి అవి తిరిగి జన్మించినవారి హృదయములను కూడా గలిబిలి చేయుచూ భ్రష్టుపట్టించును. ప్రభువైన యేసు మనలను ఇట్లు హెచ్చరించెను. ‘‘పరిసయ్యుల పులిసిన పిండిని గూర్చి హేరోదు పులిసిన పిండిని గూర్చియు జాగ్రత్తపడుడని వారిని హెచ్చరించెను.’’ (మార్కు 8:15) కానీ ఇప్పుడు ఎన్ని పులిసిన పిండి వంటి బోధలున్నవో మనము లెక్కించలేము. అవి కేవలము ఒకసారి వినుట వలననే ప్రజల హృదయమును భ్రష్టు పట్టించును. ఈ లోకము లైంగిక పరమైన అక్రమాలతో ఎట్లు కొట్టుకొని పోవుచున్నదోషమును తప్పక గుర్తించాలి.

విశ్వాసముంచుచున్న మనము ఇప్పుడు మనము ఎటువంటి దినాలో తెలిసికొనవలెను. విశ్వాసమును కాపాడుకొనవలెను. అట్టి పాపభరితమైన లోకములో మనము నివసించుచున్నప్పటికి ప్రభువు మన పాపము నుండి మనలను విమోచించెనను వెలకట్టలేని సత్యము మన హృదయాల్లో ఉన్నది. మార్పులేనట్టి మన రక్షణకు ఉన్న సాక్ష్యవాక్యము ఏదనగా అది నీరు మరియు ఆత్మమూలమైన సువార్తయే.ఈ సత్యము నందు మనము కదిలించబడనట్టి విశ్వాసమును తప్పక కలిగియుండవలెను.

ఈ లోకములోనున్నదేదియూ సత్యముకాదు. నీతిమంతులు లోకమును జయించెదరని దేవుడు మనతో చెప్పెను. అది ఎట్లనగా మార్పులేని సువార్తనందున్న విశ్వాసము వలన ఆ నీతిమంతులు సాతానును జయించెదరు. మరియు లోకముపై విజయము పొందెదరు. మనము అయోగ్యులమైననూ, మన హృదయము, ఆలోచనలు, శరీరము ఇంకనూ దేవుని గృహములో ఉన్నందున రక్షణ యొక్క సువార్తయందు స్థిరముగాను ఉన్నవి. ప్రభువు మనలను రక్షించిన నీరు మరియు రక్తము యొక్క సువార్త మీద మనము స్థిరముగా నిలబడియున్నాము.

ఈ కారణముగా మనము దేవునికి ఎంతో ఋణస్థులమైనాము. ఈ లోకమును పాపము ఎంతగా బంధించిననూ నీతిమంతులమైన మనమైననూ, నిష్కళంకమైన మనస్సాక్షి కలిగి యుంటిమి. మరియు సువర్ణము లేక ప్రకాశించు విశ్వాసము మన హృదయములో ఉన్నది. నీతిమంతులమైన మనమందరము ఈ లోకమును జయించునట్టి విశ్వాసముతో జీవించెదము. ప్రభువు రాకడ దినము వరకు మనము ఆయన రాజ్యములో ఉన్నప్పటికి మనమందరమూ ఈ విశ్వాసమును బట్టి స్తుతింపబోవుచున్నాము. మనలను రక్షించిన ఆ ప్రభువును మనము ఎల్లప్పుడూ స్తుతిస్తాము. మరియు ఇట్టి విశ్వాసమును మనకు ఇచ్చిన దేవుని స్తుతిస్తాము.

మనం కలిగియున్న ఈ సత్యముగల విశ్వాసము బండ మీద దేవుని యెదుట కట్టబడినట్లే అది ఎట్టి పరిస్థితులలోనూ కదల్చబడదు. అలాగునే మనము ఆ ప్రభువు ముందు నిలబడు దినము వరకు మనం ఈ లోకములో నివసించుచుండగా మనకు ఏమి జరిగిననూ విశ్వాసము ద్వారా మనలను హృదయమును మనము కాపాడుకొనెదము. ఈ లోకములోనున్న ప్రతి వస్తువు నాశన పరచబడిననూ, ఈ లోకము పాపములోకి మునిగిపోవుచున్ననూ పాత కాలము నాటి సొదొమ గొమొఱ్ఱా కంటే చెడ్డదిగా ఈ లోకము మారిననూ మనము ఈ లోకమును అనుసరింపకూడదు కానీ మనము దేవునిని స్థిరముగా విశ్వసించినవారమై ఆయన నీతిని వెదకాలి. మరియు మనము ఈ రెండింటి (యేసయ్య బాప్తిస్మము మరియు ఆయన మరణము) యొక్క రక్షణను నిజమైన దేవుని కృపను వ్యాప్తి చేయవలెను.



ఈ సత్యసువార్తను నమ్మినట్లుగా నటించువారు


కొంతమంది నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను వారు నిజముగా నమ్మకపోయిననూ నీలి, ధూమ్ర, రక్తవర్ణదారము యొక్క సత్యమును నమ్మినట్లుగానే నటించెదరు. కానీ అట్టి ప్రజలు నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను నమ్మకముగా గైకొనని కారణముగా తమ హృదయములో పాపము ఉన్నట్లు మనము చూడగలము. అట్టివారు తమ పొరుగువాని యొద్ద అరువు తీసికొనిన ఇనుపగొడ్డలి వలన నీటిలో పొగొట్టుకొనిన వారిని పోలియుందురు. (2రాజు 6:5)

ఆ విధముగానే అవసరము కలిగినప్పుడు కొంతమంది ప్రజలు కొద్దికాలం నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను ఉపయోగించుకొను అవకాశమున్నది. కాని నీరు మరియు ఆత్మమూలమైన సువార్త సత్యమని నమ్మక వారు బోధించునప్పుడు కానీ సహవాసములో కానీ నిజ విశ్వాసముతో వారు మాట్లాడలేకపోవుచున్నారు. ఆ సత్యమును నమ్మనివారు మధ్యలోనే తమ విశ్వాస జీవితమును దుఃఖకరముగా అంతము చేసుకొనుచున్నారు. కానీ నీరు మరియు ఆత్మమూలమైన సువార్త యొక్క సత్యము మార్పులేనిది మరియు ఇందుమూలముగానే వారు నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను నమ్మవలెను.

కానీ హెబ్రీ 7:12లో చెప్పబడినట్లుగా ‘‘యాజకులు మార్చబడిన యెడల ఆవశ్యముగా యాజక ధర్మము సహా మార్చబడును.’’ అని చెప్పబడినట్లు కొంతమంది ఆ ధర్మము కూడా మార్చబడినది. కనుక యేసయ్య నెరవేర్చిన ఆ రక్షణ పాత నిబంధన పద్ధతి ప్రకారము నిజముగా నెరవేర్చబడలేదు. యేసయ్య వచ్చి సిలువలో చనిపోవుట చేత మనలను రక్షించెను. ఇది మార్పు చెందిన పద్ధతి” అని చెప్పుదురు మరికొంతమంది, ‘‘దేవుడు మన పాపమును తన కుమారునిపై ఎప్పుడు మోపెనో అప్పుడు యేసయ్య సిలువపై చనిపోయెనట్లుగా కనిపించుచున్నదని చెప్పుచున్నారు.’’

కానీ అవన్నియూ కేవలము, తప్పైనవియు నిరాధారమైయున్నవి. మనము వాటన్నిటిని ఇలాగు అడుగుట వలన త్రిప్పి కొట్టవచ్చును. ‘‘అనగా పాపరహితుడైన యేసయ్యను మనము దేవుని వాక్యమును నమ్మనప్పుడు అది ఉన్నది ఉన్నట్లుగానే నమ్మవలెను. కానీ మన స్వంత ఆలోచనలను దానిపై రుద్దకూడదు. ఒకవేళ మన ఉద్దేశ్యము మనం కలిగియున్ననూ, ఈ ఉద్దేశ్యము తప్పు అని బైబిలు చెప్పినప్పుడు మన స్వనీతిని మనం విడువలెను మరియు దేవుని వాక్యమును విశ్వసించవలెను.

అధిక సమయము గడిచేకొద్ది ప్రభువు మనలను నీరు మరియు ఆత్మమూలమైన సువార్తతో రక్షించెనను నిజము మరింత గొప్పదై ప్రశస్తమైనదగును. మన స్వంత ఆలోచన ప్రకారము నమ్మినప్పుడు మన విశ్వాస జీవితము కష్టమును ఎదుర్కొను సమయము వచ్చును. అప్పుడు దాదాపుగా మనము సంఘమునకు వేరైపోదుము. కానీ ప్రత్యక్ష గుడార ప్రతి పలకకు ఉన్న రెండు కుసులు. రెండు వెండి దిమ్మలలో దిగబడి పలకలను నిలువబెట్టినట్లుగానే యేసయ్య సత్యములో మనకున్న విశ్వాసము. అనగా బాప్తిస్మము పొందుటతో ఆయన మన పాపమును భరించెననియు తన రక్తమును చిందించెననియు ఉన్న విశ్వాసం మనలను స్థిరపరచును. యోహానుచే బాప్తిస్మం పొంది సిలువ వేయబడుట తన రక్తమును కార్చుట ద్వారా మన ప్రభువు మన పాపము నుండి మనలను రక్షించెను. అలాగుండిన యెడల మన విశ్వాసము ఎన్నటికి కదల్చబడదు.

సామెతలు 25:4 చెప్పును. ‘‘వెండిలోని మష్టు తీసివేసిన యెడల పుటము వేయువాడు పాత్ర యొకటి సిద్ధపరచును.’’ ఈ వచనము వలనే నీచత్వము, దుష్టత్వము, అవినీతి వంటి అనేకమైన విషయములు శరీర సంబంధమైన మన తలంపులో నుండి వచ్చినను ఆయన బాప్తిస్మం మరియు రక్తము వలన యేసయ్య మనలను ఇట్టి మలినమైన వాటి నుండి శుద్ధి చేసెను. మనుష్యుల యొక్క పాపము నుండి దేవుని యొక్క నీతిగల పనివారముగా మనలను చేసెను. ఈ లోక పాపము నుండి ఆ ప్రభువు మనలను శుద్ధి చేసెను. యోహాను వలన బాప్తిస్మమును పొంది దాని ద్వారా ఒకేసారిగా మన పాపములన్నిటిని అంగీకరించెను. మరియు సిలువ వేయబడి తన రక్తమును కార్చెను. తద్వారా మన పాపమంతటి శిక్షను భరించెను. యేసయ్య మనలను లోకపాపము నుండి శుద్ధులుగా రక్షించెను.

అలాగే నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను విశ్వసించువారు తమ నిత్య రక్షణను బట్టి నిశ్చయత గలవారైయున్నారు. మన క్రియలు ఆయా సమయాలలో బాధించునవిగా కనబడవచ్చును. కానీ నీరు మరియు ఆత్మమూలమైన సువార్త మన విశ్వాసమును స్థిరపరచును. ఎట్లనగా వెండి దిమ్మలు, కుసులను తమలో కూర్చుకొని ప్రతి పలకను నిలబెట్టినట్లుగానే.

మనలను నిలుపుచున్న ఆ శాశ్వత కృప యొక్క రక్షణ

ఇప్పుడు ప్రత్యక్ష గుడారపు పలకలను కలుపుచున్న ఆ అడ్డ కఱ్ఱలపై మన దృష్టిని నిలుపుదాము. నిర్గమ 26:26-27 చెప్పుచున్నది. ‘‘తుమ్మకర్రతో అడ్డకఱ్ఱలను చేయవలెను. మందిరము యొక్క ఒక ప్రక్క పలకలకు అయిదు అడ్డకఱ్ఱలును మందిరము యొక్క రెండవ ప్రక్క పలకలకు ఐదు అడ్డకర్రలను పడమటి వైపున మందిరము యొక్క ప్రక్క పలకలకు అయిదు అడ్డ కఱ్ఱలును ఉండవలెను.’’ ఆ ప్రత్యక్ష గుడారపు ఆకారమంతయూ దీర్ఘ చతురస్రాకారములో ఉన్నది. అతి పరిశుద్ధ స్థల తెర కొరకు దూలములు ప్రత్యక్ష గుడారము ద్వారము నొద్ద ఉంచబడినవి. మరియు మిగిలినది పలకలతో చేయబడినది. పలకలు చుట్టూరా అయిదు అడ్డకర్రలచే మూయబడినవి.

ఈ అడ్డు కర్రలను పట్టి ఉంచుటకు ప్రతి పలకపై అయిదు సువర్ణ రింగులు ఉంచబడినవి. మరియు ఆ అడ్డ కర్రలు, తుమ్మకర్రచే చేయబడినవి. అవి కూడా బంగారముతో తాపడము చేయబడినవి. ఆ అయిదు అడ్డకర్రలు ప్రత్యక్ష గుడారపు మూడు వైపులా నున్న ఉత్తర దక్షిణ మరియు పడమర వైపునున్న పలకలపై ఉంచబడినవి. ఈ అడ్డుకర్రలు ఆ అడ్డుకర్రపై నున్న బంగారు రింగులతో తొడిగినప్పుడు అవి స్థిరముగా నుండును. కనుక క్రింద వెండి దిమ్మల వలన ఆసరాతోనూ అయిదు అడ్డుకర్రలతో అన్ని ప్రక్కలను కలుపబడిన ఆ పలకలు స్థిరముగా నిలపబడినవి.

ఆ 48 పలకలు అన్నివైపులా అయిదు అడ్డుకర్రలతో ఆవరింపబడి ఒకదానికొకటి బలమునిచ్చుచు ఉన్నట్లు దేవుని ప్రజలు కూడా నీరు మరియు ఆత్మ మూలమైన సువార్త దేవునితో కట్టబడియున్నారు. నీరు మరియు ఆత్మమూలమైన సువార్త యొక్క రక్షణ అను వరమును పొందినవారు దేవుని మందిరమను స్థలములో కూడుకొని విశ్వాసముతో తమ జీవితమును జీవించెదరు. నీవు బండపై నా సంఘమును కట్టెదవని పేతురుతో యేసయ్య చెప్పెను. (మత్తయి 16:18-19) అటువలే పాప పరిహారమును పొందినవారు కూడుకొనుట వలన దేవుని రాజ్యము ఏర్పడు స్థలమే దేవుని సంఘము. నీలి, ధూమ్ర, రక్తవర్ణ దారములో బయలుపరచబడిన దేవుని క్రియల వలన దేవుడు మనలను ఈ లోకపాపమునుండి పూర్ణముగా రక్షించియున్నానని ఆయన మనకు చూపించుచున్నాడు.

నిర్గమ 26:28 చెప్పుచున్నట్లు ఆ పలకల మధ్య నుండి నడిమి అడ్డకర్ర ఈ కొన నుండి ఆ కొన వరకు చేరియుండవలెను. ఈ అడ్డుకర్ర ఒక ప్రక్కకున్న పలకలనన్నిటిని ఒకేసారిగా కలిపి ఉంచగలిగినంత పొడవుగా తయారు చేయబడియున్నవి. అట్లయిన ఆ పలకలమధ్య నుండు నడిమి అడ్డకర్ర ఆ కొన నుండి ఈ కొన వరకు చేరియుండుటలోనున్న అర్థమేమిటి? ఏమనగా నీతిమంతులు ఒకనికొకరు కలిసియుండు తమ విశ్వాసములో కూడా ఏ రకమై యుండెదరు. అనగా ప్రభువు అనుగ్రహించిన నీరు మరియు ఆత్మమూలమైన సువార్త వలన నెరవేర్చబడిన రక్షణను విశ్వసించుట వలన వారు విశ్వాస విషయములో సహవాసము గలవారైయుంటారు. ఇందువలననే మనము మన సహ పరిశుద్ధులనుగానీ, జతపనివారితోగానీ కలిసియుండి వారి సహవాసమును కలిగి యుండాలి. వాస్తవముగా మన హృదయ సహవాసము అనుభూతిని పొందవలెను.



‘‘తండ్రి ఒక్కడే, బాప్తిస్మమొక్కటే, దేవుడు ఒక్కడే”


ఎఫెసీ 4:3-7 త్రిప్పుదాం ‘‘మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని, ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొను చున్నాను. శరీరము ఒక్కటే, ఆత్మయు ఒక్కడే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణయందుండుటకు పిలువబడితిరి. ప్రభువు ఒక్కడే విశ్వాసమొక్కటే బాప్తిస్మమొక్కటే. అందరికి తండ్రియైన దేవుడొక్కడే. ఆయన అందరికి పైగా నున్న వాడై అందరిలోను వ్యాపించి అందరిలో వున్నాడు. అయితే మనలో ప్రతివానికి క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృపయియ్యబడెను”. అపోస్తులుడైన పౌలు దీర్ఘశాంతముతో ఆత్మ ఐక్యతను కాపాడుకొనుడని బోధించారు. యేసు బాప్తిస్మము మరియు సిలువ వీటి నుండి కలిగిన మన రక్షణ అను వరము వలన శాంతి మన హృదయములోనికి వచ్చినది. మన హృదయములో పాప క్షమాపణను పొందినప్పుడు మనము క్రీస్తునందు ఒక కుటుంబమైతిమి. మనం ఒక్కమాటలో చెప్పాలంటే ఒకటే శరీరము.

“ప్రభువు ఒక్కడే” మనలను రక్షించిన యేసుక్రీస్తు ఒక్కడే. ‘‘విశ్వాసము ఒక్కటే” దేని యందు విశ్వాసముంచుచున్నావు? నీవు యేసు, నీరు రక్తము మరియు ఆత్మ రక్షణ అను మూడురంగుల పొడుగు బ్లూ, ఊదా, మరియు ఎరుపు రాణి రంగుల యందా లేక మూడు విధముల దారములచే నేయబడిన వస్త్రము నందా? ‘‘ఒకే బాప్తిస్మము” మరొకమారు యేసు బాప్తిస్మమును అపోస్తులుడైన పౌలు చెప్పుచున్నారు ఆయన ఇక్కడ సిలువను తీసుకురావడం లేదు కాని క్రీస్తు బాప్తిస్మము నియమం లేకుండా విశ్వాసులందరిని కడిగివేసినది. మనమాయన బాప్తిస్మము నందు విశ్వాసముంచుట క్రీస్తులోనికి బాప్తిస్మము తీసుకొన్నట్లు అనగా క్రీస్తును ధరించుకొనుట (గతీ 3:27). ‘‘దేవుడొక్కడే” ఒక్కడే దేవుడు. ఈ దేవుడు తన సొంత కుమారుని పంపుట ద్వారా మనలను రక్షించెను.

ఈ విషయాలన్నీ నీరు రక్తము మరియు ఆత్మకు సంబంధించిన ఒకే విశ్వాసమును చూపుచున్నవి. (1యోహా 5:8) మనము నీరు, రక్తము, ఆత్మయందు మనము విశ్వసించుట ద్వారా మన హృదయము కలియుచున్నది. ఒకదానితో నొకటి ఏకీభవించుచున్నవి. పాపక్షమాపణ పొందినవారందరు ఒకరిని ఒకరు తప్పక కలుసుకొందురు. తక్కువగా. కొన్నిసార్లు ఒకరినొకరు పూర్తిగా గ్రహించలేకపోవచ్చును గాని రక్షించబడిన ప్రతివాని ప్రధాన హృదయ ద్వారము గుండా ఈ చివరి నుండి ఆ చివరికి ఇది ప్రవహిస్తుంది. వీరు నిజముగా రక్షించబడియుంటే వారి అంతరంగములో పాపక్షమాపణ పొందినయెడల వారందరు ఒకరితో నొకరు సహవాసములో నుందురు. ‘‘ఈ సహోదరుడు కూడా రక్షించబడినాడు చాలా శరీర బలహీనతలు అతని హృదయము నందున్నవి. మిగిలిన అందిరిలాగానే అతను కూడా చెడు జరిగించేవాని నుండి వచ్చినవాడే అయినప్పటికి ప్రభువు అతని పాపాన్ని నీరు మరియు ఆత్మసువార్త ద్వారా క్షమిస్తున్నారు.’’ ఈ విధముగా వారు ఒకరినొకరు గ్రహించి దేవుని మహిమపరచుచున్నారు.

ప్రజలు ఎంతటివారైనా ఫర్వాలేదు. వారు పాపక్షమాపణనొంది సంఘములోనున్నట్లయిన, వారి ముఖము ప్రకాశించును. వారి తలంపు ప్రకాశించును వారి హృదయము కూడా ప్రకాశించును మరియు వారు ఒకరితోనొకరు సహవాసము చేయగలరు. నీతిమంతులు ఒకరినొకరు పూర్తిగా ఎరుగుదురు. ఇదెలాగ సాధ్యమౌతుంది? విశ్వాసము దీన్ని చేస్తుంది. వారు ఒకరితోనొకరు ఐక్యమగుటకు మరే కారణము లేదు ఒక్క విశ్వాసమే దీనిని చేయగలదు. మరికొంతమందితో మనము కలిసివుండలేక పోవడానికి కారణమును ఏది వివరిస్తుంది? క్రీస్తునందు లేనివారితో మన హృదయాన్ని పంచుకొనలేము. ఎందుకనగా వారు సత్యమును, నీరు ఆత్మ బాప్తిస్మము నందు విశ్వసించలేదు. నీరు మరియు ఆత్మ సువార్తను వారి హృదయములో విశ్వసించలేదు. ఈ సువార్తయందు విశ్వాసముంచనివారు మనతో యెంతమాత్రము సహవాసము చేయరు.

సహోదరి సహోదరులారా, నిజానికి దేవుని సంఘమంటే ఏమిటి? క్రీస్తునందు శుద్ధీకరించబడిన, పరిశుద్ధులుగా నుండుటకు పిలువబడినవారి సమాజము. (1కొరి 1:2) బాప్తిస్మమిచ్చుట ద్వారా యేసు క్రీస్తు వారి పాపమును కడిగివేసెనని సిలువపైన వారి పాపముకు శిక్షనంతటిని భరియించి మరణించి తిరిగిలేచి వారి సొంత రక్షకుడాయెనని విశ్వసించినవారి సమాజము, దేవుని సంఘము నీరు ఆత్మ బాప్తిస్మమునందు విశ్వసించిన వారి కూడిక మాత్రమే.

మనమాయన సంఘములోనున్నప్పుడు ఈ విశ్వాసము నాయందు మీయందున్నది కనుక కండ్లలో కళ్ళుపెట్టి ఒకరినొకరు చూచుకోగలము. దేవుడు మనము బయటికి యేమైయున్నది చూడనట్లే, హృదయాంతరంగమును చూచినట్లే పాపక్షమాపణ నొందిన మనము బాహ్య సౌందర్యమును కాక హృదయాంతరంగ విశ్వాసమును చూచుచు సహవాసము కలిగి యుందుము. ‘‘నిజముగా ఈ వ్యక్తి హృదయములో సత్యమునందు విశ్వాసముంచెనా?’’ దీనికొరకు మనం చూస్తున్నాము. అతను/ఆమె యొక్క వ్యక్తిత్వమునందు ఏమైనా తేడాలు వుండవచ్చును అదేం విషయం కాదు. ముఖ్యమైనది యేదనగా ‘‘ఒకే ప్రభువు ఒకే విశ్వాసము, ఒకే బాప్తిస్మము. ఒకే దేవుడు మరియు అందరికి తండ్రియైన దేవుడు ఒక్కడే.’’

మనం విశ్వసించాము గనుక మనము ప్రత్యక్షగుడారము యొక్క స్తంభమును గోడమాదిరి వాడు చెక్కయైయున్నాము. విశ్వసిస్తున్నాము గనుక దేవుని కుటుంబమైనాము. నీవు సువార్త నీరు మరియు ఆత్మ బాప్తిస్మము నందు విశ్వాసముంచుచున్నావా? మనం విశ్వసించుచున్న దానినిబట్టి ప్రపంచమంతటా రక్షణ వెలుగును వెదజల్లుచున్నాము. ఇటీవలే పాపక్షమాపణ నొందినవారితో కూడా పంచుకొనగలము. ఎందుకనగా వారి హృదయములో కూడా పరిశుద్ధాత్ముడు నివసించుచున్నాడు. మనం కేవలం పాపక్షమాపణ పొందినవారమైన, అప్పుడు మనం ఒకరినొకరము కలుసుకొందము కాని పాపక్షమాపణ పొందనియెడల, మనము కలిసివుండలేము. పాపులు బాహ్యమునకు కనబడువాటిపై ఆధారపడి ఎవరితో ఎట్లుండాలో నిర్ణయించుకొందురు. అవేవనగా వేషభాషలు, ఆస్తి, పేరు ప్రఖ్యాతులు. కానీ నీతిమంతులమగు మనము హృదయములో దీనిని తలంచము. నీతిమంతుల మధ్య తేడాలుండవు.

ప్రజలు పాపక్షమాపణ పొందిన వెంటనే, నేను తరచుగా ‘‘నీవు నిజంగా పాపక్షమాపణ పొందావా?’’ అని అడుగుతాను. ఇంకా నీలో పాపముందా? లేక నీ పాపములు మాయమైపోయినవా? అట్లా బైబిలును గురించి నీకు చాలా ప్రశ్నలుండవచ్చును లేవా? వాటిని నీ విశ్వాస ప్రయాణములో సాగిపోతూ అడుగుతుంటావు. మరియు నీలోని లోపాలు బయటపడుతుంటాయి. మరియు మార్గములో కొన్నిపొరపాట్లు చేసివుంటావు. కానీ సంఘములోని పెద్దలు నీకు ముందు ఈ మార్గములో నడిచినవారు నీకు సహాయము చేసెదరు అందువలన సానుకూలపడి సౌఖ్యముగా నుండును.’’

సహోదరీ సహోదరులారా, నీతిమంతులమైన మనకు సంఘము అవసరము. దేవుని గుడారము అనగా దేవుని సంఘమని అర్థము. నీరు రక్తము నందు విశ్వసించనివారు సంఘములోనికి రాలేరు వచ్చి అందులో నివసించలేరు. ఎవరైతే నీరు, ఆత్మ, నీలము, ఊదా, ధూమ్ర రక్తవర్ణములో ప్రత్యక్షమైనవను సువార్తయందు విశ్వాసముంచరో వారు. ఆయన సంఘము నందు ప్రవేశించి జీవించలేరు. సత్యమునందు విశ్వాసించినవారు మాత్రమే సంఘమునందు జీవించగలరు. దేవుని ప్రజలుగాను, ఆయన పనివారుగా మారగలరు. మరియు ఆయన మహిమ కూడా చూడగలరు. అది ఒక్క రక్తము లేక వారి శరీర సంబంధమైన ఏదో అర్హత వలన మాత్రమే దేవుని పిల్లలు కారు. పాస్టర్లు కొందరు యెంతో అధికారముగలవారూ యుండవచ్చును గాని వారు నీరు ఆత్మ సువార్తయందు విశ్వాసముంచనిచో వారు దేవుని పిల్లలు కారు.



నీటి ద్వారాను రక్తము ద్వారాను వచ్చిన యేసు మనలను సంపూర్ణముగా రక్షించెను.


ప్రభువారు ఈ లోకమునకు వచ్చినప్పుడు చేసిన దానిని క్లుప్తముగా ఆయన పుట్టుక, బాప్తిస్మము, రక్తము చిందించుట, మరియు పునరుత్థానమనవచ్చును. ఇవన్నీ మన పాపక్షమాపణ నిమిత్తమైన ఆయన పరిచర్యలు యేసు ఆయన పరిచర్యను యిలాగు ముగించారు. నీలి, ఊదా, ధూమ్ర వర్ణపు నూలు. మన సొంత రక్షణ కొరకు ఈ నీలి, ఊదా, ధూమ్ర వర్ణపు తాడును దేవుని గుడారము నందే కనబడినవి. దేవుని రక్షణ చాలా విశాలమైనది మన సొంత విధానములో దానిని మనము విశ్వసించలేము. వున్నదాన్ని వున్నట్లు ఆయన రక్షణను మనము విశ్వసించవలెను.

మన విశ్వాసము ఆయన రక్షణలోని రెండు సత్యములపై నిశ్చయమై యుండవలెను. ఆయన బాప్తిస్మము మరియు సిలువపై ఆయన రక్తము. వెండి స్తంభములను వెండితో చేయబడిన రెండు రంధ్రముల్లో సరిగ్గా దింపదు అందువలననే లోకము యిది ఎట్లు అని గ్రహించలేదు. యేసయ్య దానిని మనకిచ్చెనని మనం గ్రహించాలి. ఆ రెండు వెండి సాకెట్లు వంటి యేసయ్య రక్షణార్థమై చేసిన రెండు పనుల ద్వారా నీవు నేను దేవుని యెదుట యేసునందు విశ్వాసముంచుట ద్వారా రక్షించబడియున్నాము.

ఆ గుడారము యేసు ప్రభువు వారి తేటమైన విధానము మనకు తెలియపరచుచున్నది. ఈ రక్షణ యింతకు మునుపే మన నిమిత్తము నెరవేరినది. దేవుడు అనుగ్రహించిన రక్షణయైన ఆ రెండు వరములను నమ్ముము. దేవుడు గుడారమును విశ్వాసము కొరకు ఉపయోగించిన నీవు సత్యమును వున్నది ఉన్నట్లుగా విశ్వసించిన రక్షణ దేవుని మహిమ నీదవుతుంది. కాని ఎప్పుడు నీవు విశ్వసించుదువో అప్పుడే దేవుని మహిమచే కప్పబడి ఆయనచే కాపాడబడుచున్న ఆయన గుడారములో విశ్వాసము ద్వారా జీవించగోరుతున్నావా? లేక విశ్వసించకుండా నిత్యము శాపగ్రస్తుడవై జీవించగోరుతున్నావా? నీవు ఒక్క క్రీస్తు సిలువ రక్తమునందే విశ్వాసముంచిన నీవు రక్షించబడలేవు. సిలువరక్తము బాప్తిస్మము ఒక్కటేనని నీవు నమ్మాలి. దేవుని వరము ఈ రెంటితో చేయబడినది.

ఈ రెండు విషయములందు క్రీస్తు రక్తము మరియు యేసు బాప్తిస్మము దేవుని విశ్వసించినట్లయితేనే నీ హృదయములో దేవుని ఆత్మ నివసిస్తుంది. వాటియందు విశ్వాసముంచనివారి హృదయములో ఎప్పటికిని నివసించడు. నీ విశ్వాసమును కేవలం పెదవులతోనే ఒప్పుకొనినచో, మీ హృదయములో విశ్వసించనట్లయిన మరియు మీ జ్ఞానము లోకసంబంధమైన నీవెంత మాత్రము రక్షించబడవు. నీవు రక్షించబడుటకు నీ రక్షణ యింతవరకని సరిహద్దు గీతను గీసుకొనవలెను. ‘‘యిప్పటివరకు నేను రక్షించబడలేదు. నేను నమ్మిన రక్షణ నిజమైనదికాదు. కాని నీటి ద్వారాను, రక్తము ద్వారాను వచ్చిన యేసునందు విశ్వాసముంచుట ద్వారా నేనిప్పుడు రక్షించబడియున్నాను.’’ ప్రజలు ఒక్కసారైనా పాపులు కానిదే నీతిమంతులు కాలేరు వారు దీన్ని ఒప్పుకోవాలి. వారు రక్షించబడలేదు గనుక వారి పాపముకు దండన వుంటుంది. తరువాత నీరు ఆత్మను సువార్తను అంగీకరించి సరైన రక్షణ నొందెదరు.

నీలి రంగు ఊదారంగు దారము క్రీస్తు బాప్తిస్మము రక్తమును చూపించుచున్నవి. మనము సరియైన రక్షణ పొందాలి. ఆయన బాప్తిస్మము రక్తము ద్వారా మనం సరియైన రక్షణ పొందగలము. మన సొంత తలంపు ద్వారా మనం అడ్డగించబడి నమ్మలేక పోవుచున్నాము. ప్రభువు ఈ రక్షణను గుడారము ద్వారా కూడా తేటగా బయలుపరచుచున్నారు. ఎందుకనగా ఈ రక్షణ చాలా విలువైనది ఖచ్చితమైనది. ఇది ప్రతివారు నమ్మదగినది ఆయన రక్షణకొరకు చేసిన ఒక భాగమునందే విశ్వాసముంచవద్దు. మనలో ఎవరైనా యింకా విశ్వాసముంచక పోయినట్లయిన అతడు/ఆమె ఈ సత్యమునందు విశ్వాసముంచిన రక్షించబడుదురని నా మనఃపూర్వక నిరీక్షణ.

ఎవరైన క్రీస్తురక్తమునందు మాత్రమే విశ్వాసముంచినట్లయిన చాలామంది ఈ సగం వెనుకబడిన సువార్తయందు విశ్వాసముంచిన క్రైస్తవులున్నారు. కానీ నా నిరీక్షణ యిది అలాంటి తప్పుడు విశ్వాసము మీ హృదయముపై మళ్ళీ ఎన్నడు దండయాత్ర చేయదు. ఏం జరిగినా ఏమి ఫరవాలేదు. నేను రక్షించబడినవారి గుంపులో వుండలేను. మనం ఈ రెండు సంగతులను (నీలి, ఊదా దారము) విశ్వసించి సరైన రక్షణ నొందితిమి. అదేదనగా ఆయన బాప్తిస్మము రక్తము. ఈ రక్షణ కొరకైన రెండు వరములను బట్టి దేవునికి స్తోత్రము వాటి ద్వారా ఆయన నన్ను రక్షించెను. దేవుడు నా రక్షణను సరిగ్గా సంపూర్ణముగా నెరవేర్చినందున నేను శాపము నుండి తీర్పు నుండి ముందే విడిపించబడితిని.

నిజముగా మనరక్షణ నీలి మరియు ఊదా రంగు నుండి కలిగినందున మాటను మించి అవి ఎంతో విలువైనవి. గుర్తుంచుకో విశ్వసించు మన రక్షణ సంపూర్ణమైనది కేవలం సిలువ రక్తము వలనే కాదు లేక క్రీస్తు బాప్తిస్మము వలన కాదు కాని బాప్తిస్మము సిలువ రక్తము వలనైనది. ఈ రెంటియందు విశ్వాసముంచుట ద్వారా మనము దేవుని పిల్లలమగుదుము. మనము నీటిని గూర్చిన వాక్యము వలన సువార్త మరియు ఆత్మ ఈ రెండు స్తంభములు మరియు రెండు వెండి సాకెట్లు అనగా రెండు రంధ్రములు, మరియు గుడారము గుడారపు చెక్కలు.

నేను లోకపాపము నుండి మనలను రక్షించిన మన ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. హల్లెలూయ!