Sermons

[11-16] < నిర్గమ 25:10-22 > సాక్ష్యపు మందసములో దాగి వున్న ఆత్మీయ మర్మములు



< నిర్గమ 25:10-22 >

“వారు తుమ్మకర్రతో నొక మందసమును చేయవలెను. దాని పొడుగు రెండు మూరలు నర, దాని వెడల్పు మూరెడు నర, దాని యెత్తు మూరెడు నర. దాని మీద మేలిమి బంగారు రేకు పొదిగింపవలెను. లోపలను వెలుపలను దానికి పొదిగింపవలెను. దాని మీద బంగారు జవను చుట్టు కట్టవలెను. దానికి నాలుగు బంగారు ఉంగరములను పోతపోసి, ఒక ప్రక్కను రెండు ఉంగరములు, ఎదుటి ప్రక్కను రెండు ఉంగరములు ఉండునట్లు దాని నాలుగు కాళ్లకు వాటిని వేయవలెను. తుమ్మకర్రతో మోతకర్రలను చేసి వాటికి బంగారు రేకులను పొదిగించి వాటితో ఆ మందసమును మోయుటకు ఆ ప్రక్కల మీది ఉంగరములలో ఆ మోత కర్రలను దూర్చవలెను. ఆ మోత కర్రలు ఆ మందసపు ఉంగరములోనే ఉండవలెను. వాటిని దాని యొద్ద నుండి తీయకూడదు. ఆ మందసములో నేను నీకిచ్చు శాసనముల నుంచవలెను. మరియు నీవు మేలిమి బంగారుతో కరుణాపీఠమును చేయవలెను. దాని పొడుగు రెండు మూరులునర దాని వెడల్పు మూరెడు నర. మరియు రెండు బంగారు కెరూబులను చేయవలెను. కరుణా పీఠము యొక్క రెండు కొనలను నకిషిపనిగా చేయవలెను. ఈ కొనను ఒక కెరూబును ఆ కొనను ఒక కెరూబును చేయవలెను. కరుణాపీఠమున దాని రెండు కొనల మీద కెరూబులను దానితో ఏకాండముగా చేయవలెను. ఆ కెరూబులు పైకి విప్పిన రెక్కలుగలవై కరుణా పీఠమును తమ రెక్కలతో కప్పుచుండగా వాటి ముఖములు ఒండొంటికి ఎదురుగా ఉండవలెను. ఆ కెరూబూల ముఖములు కరుణాపీఠము తట్టునుండవలెను. నీవు ఆ కరుణాపీఠమును ఎత్తి ఆ మందసము మీద నుంచవలెను నేను నీకిచ్చు శాసనములను ఆ మందసము లో నుంచవలెను. అక్కడ నేను నిన్ను కలిసికొని కరుణా పీఠము మీద నుండియు, శాసనములుగల మందసము మీద నుండు రెండు కెరూబుల మధ్య నుండియు నేను ఇశ్రాయేలీయుల నిమిత్తము మీ కాజ్ఞాపించు సమస్తమును నీకు తెలియచెప్పెదను.

ఈ రోజు మన అంశము శాసనముల మందసము. ఆ శాసనముల మందసము. 113 సెం.మీ పొడుగు, 68సెం.మీ వెడల్పు మరియు 68 సెం.మీ ఎత్తు కొలతలు కలిగి తుమ్మకర్రతో చేయబడి మేలిమి బంగారుతో పొదగబడినది. ఆ మందసము లోపల పది ఆజ్ఞలు చెక్కబడి దానిలో చేర్చబడినవి. అయినప్పుడు మందసములో నుంచబడిన ఈ మూడు వస్తువులు మనకు ఏమి చెప్పుచున్నవి? ఈ విషయము ద్వారా యేసుక్రీస్తుని మూడు సేవలను సవిస్తారముగా వివరించాలని నేను ఆశించుచున్నాను. ఈ శాసనములు మందసములోనున్న మూడు విషయములలో బయలుపరచబడిన ఆత్మీయ సత్యమును మనమిప్పుడు పరిశీలించెదము.’’



ఆజ్ఞలు చెక్కబడిన ఆ రెండు రాతి పలకలు


మందసములో నుంచబడిన ఆజ్ఞలు చెక్కిన ఆ రెండు పలకల ద్వారా మనకు ఇచ్చెను. రోమా 8:1-2 చెప్పుచున్నది. ‘‘కాబట్టి యిప్పుడు క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షావిధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేసెను.’’ ఈ వచనము నుండి దేవుడు మన హృదయాలలో రెండు ఆజ్ఞలను స్థాపించెను. జీవము యొక్క ఆజ్ఞ మరియు శిక్ష యొక్క ఆజ్ఞ.

ఆ రెండు ఆజ్ఞలతో దేవుడు శిక్షను, రక్షణను మానవులందరికీ తెచ్చెను. మొదటగా ఆ ఆజ్ఞ ద్వారానే మనము పాపులమని తప్పక నరకపాత్రులమని మనం గుర్తించవచ్చును. అయిననూ తమ పాపస్వభావమును నిర్ణయించబడిన కర్మము ఎరిగినవారికి దేవుడు తన రక్షణ అను ఆజ్ఞ నిచ్చెను. ‘‘యేసుక్రీస్తు నందు ఆత్మ నియమము యొక్క జీవము.’’ వారందరికీ ఈ రెండు ఆజ్ఞలను ఇచ్చుట వలన వారందరికీ ఆయన నిజ రక్షకుడయ్యెను.



బంగారు పాత్రలోనున్న మన్నా


మందసములోనున్న ఆ బంగారు పాత్రలో మన్నా కలదు. 40 సంవత్సరాలు ఇశ్రాయేలీయులు అరణ్యంలో గడిపినప్పుడు దేవుడు ఆకాశము నుండి వారికి ఆహారమును కురిపించెను. ఈ మన్నాను అనేక విధములుగా వండుకొనుచూ ఇశ్రాయేలీయులు జీవించిరి. అది తెల్లని కొత్తిమీర గింజవలే తేనెతో కూడిన ఆపముతో చేయబడినది. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడిచ్చిన మన్నా వారు కనాను దేశము చేరువరకు వారిని పోషించెను. అలాగే గుర్తుగా ఈ ఆహారమును ఉంచుటకే అది పాత్రలో ఉంచబడినది.

దీని అర్థమేమనగా ఈ దినములలో విశ్వాసులమైన మనము కూడా జీవాహారమును తినవలెను. ఎట్లనగా ఈ లోకములోనుండగా దేవుని పిల్లలు ఆ ఆహారముతోను పరలోకము చేరువరకు పోషింపబడవలెను. కానీ ఈ లోక సంబంధ ఆహారమును కూడా కలిగియుండాలనే నియమము కూడా కలవు. అనగా దేవుని వాక్యమునకు బదులుగా ఈ లోక బోధలు కూడా. అయిననూ వాస్తవముగా దేవుని పిల్లలు ఆత్మీయ దేశమైన కనాను చేరు వరకూ పరలోకము నుండి దిగివచ్చు ఆ నిజమైన ఆత్మీయ ఆహారమును తీసుకొనవలెను.

ఎల్లప్పుడూ జీవాహారమును తీసుకొనువారు ఎన్నడును అలసిపోరు. ఎక్కువగా జీవాహారమును తీసుకొన్ననూ అది ఎంత ఎక్కువగా మన ఆత్మలకు నిజ జీవమై ఉండును. కానీ మనము దేవుని వాక్యమునకు బదులుగా లోక బోధపై జీవించునప్పుడు మన ఆత్మలు నశించును.

ఆకాశము నుండి కురియుచున్న మన్నాను ఒక పాత్రలో తీసిదానిని భద్రపరచుమని దేవుడు ఇశ్రాయేలీయులను ఆజ్ఞాపించెను. నిర్గమ 16:33లో చూపబడినట్లుగా దేవుడు చెప్పెను. ‘‘ఒక గిన్నెను తీసుకొని, దానిలో ఒక ఓమెరు మన్నాను పోసి, మీ వంశస్థులు తమ వద్ద ఉంచుకొనుటకు యెహోవా సన్నిధిలో దాని ఉంచమనెను”. ఆకాశము నుండి కురిసిన ఆ మన్నా ప్రజల ఆత్మ కొరకైన నిజ జీవాహారమైయున్నది. ‘‘ఆహారము వలననే గాక యెహోవా సెలవచ్చిన ప్రతిమాట వలన నరులు బ్రదుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి నీవేగాని నీ పితరులే గాని యెన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించెను.’’ (ద్వితీ 8:3)



మన కొరకైన నిజ జీవాహారము ఎవరు?


మన పాపములను తన శరీరముపై మోసుకొను నిమిత్తము యేసుక్రీస్తు పొందిన బాప్తిస్మమును. ఆయన సిలువ త్యాగము మరియు కార్చిన రక్తము మన నిజ జీవాహారమైయున్నవి. తన శరీరమును రక్తమును మనకిచ్చుట వలన యేసుక్రీస్తు నిత్య జీవాహారముగా మారెను. యోహాను 6:48-58 మనకు చెప్పినట్లు జీవాహారము నేను. మీ పితరులు అరణ్యములో మన్నాను తినియు చనిపోయిరి. దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమిదే. పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారమును భుజించితే వాడెల్లప్పుడును జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను. ఈ ఆహారమును భుజించితే వాడెల్లప్పుడును జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను. యూదులు ఆయన తన శరీరమును ఏలాగు తిననియ్యగలడని యొకనితో ఒకడు వాదించిరి. కావున యేసు ఇట్లనెను మీరు మనుష్యకుమారుని శరీరము తిని ఆయన రక్తమును త్రాగితేనే గాని మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్యజీవము కలవాడు అంత్యదినమున నేను వానిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును. నా రక్తము నిజమైన పానమునైయున్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నాయందును నేను వానియందును నిలిచియుందుము. జీవముగల తండ్రి నన్ను పంపెను. గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే. నన్ను తినువాడును నా మూలముగా జీవించును. ఇదే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము. పితరులు మన్నాను తినియు చనిపోయినట్లు కాదు. ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడును జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాననెను.

మన ప్రభువు చెప్పెను. ‘‘పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమిదే. పితరులు అరణ్యములో మన్నాను తినియు చనిపోయిరి ఈ జీవాహారమును తినువారు ఎల్లప్పుడు జీవించును.’’ పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము” ఏమిటి? అదేమనగా యేసుని శరీరమును రక్తమని అర్థము. బైబిల్‌లో యేసు శరీరము మనకు చెప్పునదేమనగా యొర్దాను నదిలో యోహాను ద్వారా బాప్తిస్మము పొందిన యేసు శరీరము లోక పాపమును వహించుకొనెను. మరియు యేసుని రక్తము మనకు చెప్పునదేమనగా యేసు బాప్తిస్మం పొందిన కారణముగా ఆయన లోక పాపమును మోసికొని సిలువ వేయబడుట ద్వారా పాపశిక్షను అనుభవించెననియే.

మందసములో నున్న ఆ పాత్రలో ఉంచబడిన మన్నా ఇశ్రాయేలీయులు అరణ్యములో నున్నప్పుడు వారికి ఆహారము మరియు క్రొత్త నిబంధన కాలములో దాని ఆత్మీయ అర్థమేదనగా అది యేసుని శరీరమే పాపులందరి దౌర్బల్యమును యేసు వహించిన బాప్తిస్మము మరియు సిలువపై ఆయన కార్చిన రుధిరము ఆ సత్యమును చూపుచున్నది. యేసు లోక పాపములన్నిటిని తనపై మోపుకొనుటకై పొందిన బాప్తిస్మము మరియు సిలువ రక్తము చిందించెను, సిలువలో మరణించెను. కనుక ఆయన బాప్తిస్మము ఆయన చిందించిన రక్తము విశ్వాసులు తిరిగి జన్మించునట్లు చేయగల నిత్యజీవమునకు శాశ్వతమైన ఊటగా మారెను.

బాప్తిస్మము ద్వారా పాపుల బలహీనతలు వహించుటకై యేసు ఇచ్చిన శరీరము మరియు ఆయన సిలువలో కార్చిన రక్తము పాపులందరూ పాప పరిహారము పొందునట్లు చేయగల జీవాహారమైయున్నవి. కనుక ‘‘మీరు మనుష్య కుమారుని శరీరముతిని ఆయన రక్తము త్రాగితే కాని, మీలో మీరు జీవముగలవారు కారని} (యెహాను 6:53) యేసు చెప్పిన కారణమును మనము తప్పక గుర్తించవలసియున్నది.



ఎవరు గొప్పవారు?


మనము యెహాను 6ను చూచినప్పుడు ఆ కాలములోనున్న యూదులు అనేకులు యేసు కన్నా మోషే గొప్పవాడనిరి. యేసు ఈ లోకమునకు వచ్చినప్పుడు ఆయనను వారు ‘‘నీవు నీ తండ్రి మోషే కంటే గొప్పవాడవా?’’ అని అడిగిరి. వాస్తవానికి వారు మోషే అందరికంటే గొప్పవాడని పరిగణించిరి. ఎందుకనగా వారు యేసును మెస్సయ్య అని గుర్తించలేకపోయారు. వారాయనను అసహ్యించుకొనిరి. కనుకనే నీవు మోషే కంటే గొప్పవాడవా? అని ఆయనతో వాదనకు దిగిరి. ఇశ్రాయేలు ప్రజలు యెహోవా దేవుని నమ్మారు? ఆయన వలేనే ఒక 30 సంవత్సరాల యువకుడు వచ్చి ‘‘పితరులు మన్నాను తినియు చనిపోయినట్లు కాక నేనిచ్చు ఆహారము తినువాడు చావడు” అని చెప్పుటను జీర్ణించుకోలేదు. ఇందువలననే వారు మోషే, యేసు శక్తిని పోల్చుటకు చూచారు.

తరువాత యేసు ప్రకటించినట్లుగా ‘‘అబ్రాహాము పుట్టకమునుపే నేనున్నాను.’’ మానవ చరిత్ర అంతటిలోనున్న వారందరిలో ఆయన గొప్పవాడు. ఎందుకనగా ఆయనను తానే సృజించుకొన్నాడు. ఒక సృష్టము దాని సృష్టికర్తను ప్రశ్నించగలదా? అలాగే కొంతమంది యేసు కేవలము ఒక గొప్ప బోధకుడు మాత్రమే. మానవ చరిత్రలో ఒక గొప్ప జ్ఞాని అని చెప్పువారు ఇంకనూ కలరు. అది ఎంత దూషణ! యేసు దేవుడు, రాజులకు రాజు మరియు ఆయన ఈ విశ్వమంతటి సృష్టికర్త. ఆయన సర్వాంతర్యామి, సర్వశక్తిమంతుడు అయిననూ ఆయన తనను తాను తగ్గించుకొనెను. మన నిజ రక్షకుడగుటకు నిన్ను నన్ను మన పాపము నుండి నిత్య నరకము నుండి రక్షించుటకు ఆయన శరీరధారియై మానవ రూపములో ఈ లోకమునకు వచ్చెను.

యేసు చెప్పెను. ‘‘వారందరును దేవుని చేత బోధింపబడుదురని లేఖనములో వ్రాయబడియున్నది. గనుక తండ్రి వలన విని నేర్చుకొనిన ప్రతివాడును నా యొద్దకు వచ్చును. దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు తప్ప మరి యెవడును తండ్రిని చూచియుండలేదు. ఈయనే తండ్రిని చూచియున్నాడు.’’అంతమున యూదులు ఎదురుచూచుచున్న క్రీస్తును తానేనని యేసు వారికి చెప్పెను. వారు యేసు చెప్పిన దానిని అర్థం చేసికొనలేకపోయిరి. వారు దానిని విశ్వసించలేదు, అంగీకరింపలేదు. మరియు ఇది పెద్ద అపార్థమునకు దారి తీసెను. వారు ఆశ్చర్యపడినట్లు ‘‘ఈయన తన శరీరమును ఏలాగు తిననియ్యగలడు”? మేము వాస్తవముగా నీ శరీరమును తిని నీ రక్తమును తాగినట్లయిన మేము నిత్యజీవము పొందుదమని నీవు చెప్పుచున్నావా? ఇక్కడ మమ్ములను ఒక రకమైన నరమాంస భక్షకులము అని అనుకొనుచున్నావా? అని ప్రశ్నించి ఉంటారు

కానీ యేసు శరీరమును తిని ఆయన రక్తమును త్రాగువారు నిత్యము జీవించెదరు. యేసు శరీరము జీవాహారము. పాత్రలో నుంచబడిన మన్నా అను ఆ పదార్థము యేసుక్రీస్తుని శరీరమును రక్తమునైయున్నది. ఈ లోకమునకు వచ్చి తన రక్తమును శరీరమును ఇచ్చుట ద్వారా యేసు మనము జీవాహారమును భుజించి నిత్యజీవము పొందననుగ్రహించెను.

అట్లయిన ప్రతివారు ఆయన శరీరమును తిని, ఆయన రక్తమును త్రాగగలరా? యేసుని శరీరమును తిని ఆయన రక్తమును సేవించుటకైన ఏకైక మార్గము. యేసు బాప్తిస్మమును ఆయన సిలువ రక్తమును విశ్వసించుటయే. మనము విశ్వాసముతోనే యేసుని శరీరమును తిని ఆయన రక్తమును త్రాగవలెను. నీకు నాకు పాపక్షమాపణ మరియు పరలోక రాజ్యములో నిత్య నివాసమును ఇచ్చుటకు మన ప్రభువు బాప్తిస్మం పొందుట మరియు సిలువలో రక్తము కార్చుట ద్వారా ఒకేసారిగా మన పాపాలను శుద్ధీకరించెను. ఆ విధముగా ఆయన మన ఆత్మకు ఆహారమాయెను. ఇప్పుడు నీరు మరియు ఆత్మమూలమైన దేవుని వాక్యమును నమ్మినప్పుడు మనము ఆత్మీయ ఆహారమును తినెదము మరియు నిత్యజీవమును పొందగలము.

 యేసయ్య శరీరమును తిని ఆయన రక్తమును పానము చేయుట ఏలాగో మరింత స్పష్టముగా మీకు నేను సాక్షాత్కరిస్తాను. నీవు నేను బాగుగా ఎరిగినట్లే యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చెను. 30 సంవత్సరాల వయస్సులో యోహానుచే బాప్తిస్మం పొందుట వలన మానవుల పాపములను తనపై వహించెను. ఆ తరువాత ఆయన సిలువలో మరణమగు వరకు రక్తమును కార్చుట వలన పాపశిక్ష నంతటిని భరించెను. ఈ సత్యమును మనము నమ్ముట వలననే మనము ఆయన శరీరమును తిని ఆయన రక్తమును సేవించగలము. మానవుల పాపము బాప్తిస్మం ద్వారా యేసు శరీరముపై మోపబడెను. ఆయన రక్తమును త్రాగుట అనగా యేసు బాప్తిస్మం పొంది సిలువపై రక్తము చిందించినట్లే. ఆయన చిందించిన ఈ రక్తమే మన పాపశిక్షను భరించెను.

అటువలే తమ హృదయములో యేసు యొక్క రక్తమును నమ్మువారు తమ దాహమును తీర్చుకొందురు. ఎందుకనగా యేసు భరించిన సిలువ యొక్క శిక్షతో వారి పాపము శిక్ష అంతయూ తొలగించబడెను. మనము తప్పక ఈ సత్యమును గుర్తించవలెను. మరియు మనము దీనిని నమ్మవలెను. యేసు ఈ లోకమునకు వచ్చి యోహానుచే బాప్తిస్మం పొందినందు వలన ఈ సత్యమును నమ్ముట వలన మన పాపములన్నీ ఒకేసారిగా శుద్ధీకరించబడినవి.

యేసు శరీరమును తిని ఆయన రక్తమును విశ్వాసముతో త్రాగవలెనని దేవుడు మనకు చెప్పెను. ఎందుకనగా యేసు యోహాను నుండి పొందిన బాప్తిస్మము ద్వారా మన దోషము ఒకటి కూడా విడువబడక అన్నిటిని తనపై మోపుకొనెను. మరియు ఎందుకనగా ఆయన తన దేహమును సిలువ యొక్క శిక్షకు అప్పగించెను. తన శుద్ధరక్తమును కార్చెను. విశ్వసించువారి హృదయాలు శుద్ధీకరింపబడి తృప్తిగా నుండును. ఎట్లనగా వారు తమ విశ్వాసము ద్వారా పాపములు శుద్ధీకరింపబడి వాటి శిక్షను అనుభవించిరి. ఇందువలననే యేసు చెప్పెను. ‘‘నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమునైయున్నది.’’ (యోహాను 6:55)

ఎంతో నమ్మకముగా యేసే నిజ రక్షకుడు ఆయన దేవుని కుమారుడైయుండి మన పాపమును వహించి వాటి శిక్షను భరించెను. పాపమునకు జీతం మరణమను ఆజ్ఞ నుండి మనలను విడిపించుటకును మన పాపాల నుండి మనలను శుద్ధీకరించుటకును మన శిక్ష నుండి మనలను విడిపించుటకు దేవుని కుమారుడైన రక్షకుడు ఒక్కడే. తన స్వశరీరమును సిలువకు అప్పగించెను. తన రక్తమును కార్చెను. విశ్వసించువారి హృదయాలను శుద్ధి చేసెను. వారి దాహమును తీర్చెను. ఇదే యేసుని శరీరము మరియు రక్తము యొక్క ప్రతిఫలము.

మానవుల పాపమును వాటి శిక్షను తొలగించిన యేసే రక్షకుడై ఉన్నాడు. తాను పొందిన బాప్తిస్మము ద్వారా మానవుల పాపములను అంగీకరించిన రక్షకుడు యేసు. ఆయన సిలువ వేయబడెను. ఈ పాపశిక్షను భరించుటకే తన రక్తమును కార్చెను. యేసు లోక పాపమును తనపై వహించుకొనుటకు అంగీకరించెను. సిలువ వేయబడుట ద్వారా పాప శిక్ష భరించెను. కనుక అదే మన పాపశిక్ష.

మనము నీరు మరియు ఆత్మ యొక్క సత్యమును విశ్వసించుట ద్వారా మనము పాప పరిహారమును పొందగలము. యేసుని బాప్తిస్మము మరియు కార్చిన రక్తమును నీ స్వంత పాప పరిహారముగా నీవు విశ్వసించాలి. ఈ సత్యసువార్తను విశ్వసించుట వలన ఆత్మీయముగా మనము యేసయ్య శరీరమును తిని, ఆయన రక్తమును సేవించగలము. విశ్వసించుట ద్వారా అనగా దేవుని కుమారుడైన యేసు ఈ లోకమునకు వచ్చెను. తన బాప్తిస్మం ద్వారా మన పాపములను తనపై వహించెను. సిలువపై మన పాప శిక్షనంతటినీ భరించెను. కనుక మనము ఆయన శరీరమును తిని రక్తము పానము చేయగల అర్హత పొంది దాని వలన నిత్యజీవమును పొందగలిగాము. యేసుని బాప్తిస్మము మరియు కార్చిన సిలువ రక్తమును విశ్వసించుట వలన ఇప్పుడు మనము ఆయన శరీరమును తిని, రక్తమును త్రాగగలుగుచున్నాము. యేసు శరీరమును ఆయన కార్చిన సిలువ రక్తమును పాప పరిహారము యొక్క ఆహారముగా మనం భుజించుట వలన మనము మన పాపాలన్నిటి పరిహారమును పొందగలము అనగా ఈ విశ్వాసము వలననే మనము పాప పరిహారము పొందగలము. దేవుని పిల్లలం కాగలము. దేవుని రాజ్యములో నిత్యము జీవించగలము.



చిగురించిన అహరోను కర్ర


మందసములో ఉంచబడిన వస్తువులలో చిగురించిన అహరోను కర్ర పరలోక రాజ్యము యొక్క నిత్య ప్రధాన యాజకుడగు యేసుకు సాదృశ్యము. నిత్య జీవము దానిలో ఉన్నదని కూడా మనకు తెలుపును. మన ఈ భావ సౌకర్యం కొరకు మనము సంఖ్యా 16:1-2ను పరిశీలిద్ధాం. ‘‘లేవికి ముని మనమడును కహాతుకు మనుమడును ఇస్హారు కుమారుడునగు కోరహు, రూబేనీయులలో ఏలీయాబు కుమారులైన దాతాను, అబీరాములును పేలెతు కుమారుడైన ఓనును యోచించుకొని ఇశ్రాయేలీయులలో పేరు పొందిన సభికులును సమాజ ప్రధానులునైన రెండువందల ఏబది మందితో మోషేకు ఎదురుగా లేచి.’’

ఈ పేరా మనతో చెప్పునది లేవీయుల సమాజములో పేరు పొందిన 250మందిని మోషేకు ఎదురుగా లేచెను. వారిట్లు చెప్పిరి. మోషే అహరోనులైన మీరు మమ్ములను ఐగుప్తు నుండి నడిపించి చేసినది ఏమిటి? మీరు మాకు ద్రాక్ష తోటను ఇచ్చిరా? మీరు మమ్మును నీటిబుగ్గలకు నడిపించిరా? మీరు మా కొరకు ఏం చేశారు? అంతమున మేము ఈ ఎడాది ఇసుకలో చనిపోవునట్లుగా మమ్మును మీరు అరణ్యములోనికి నడిపించారు కారా? మిమ్మును మీరు దేవుని సేవకులమని ఎట్లు చెప్పుకొనుచున్నారు? దేవుడు మీ ద్వారానే ఈ క్రియలు జరిగించెను? మరొక మాటలో మోషే అహరోను నాయకత్వమునకు వ్యతిరేకముగా తిరుగుబాటు పుట్టెను.

ఆ సమయములో తిరుగుబాటు చేసిన సమాజపు నాయకులైన కోరహు దాతాను, ఓనుతో దేవుడు చెప్పెను. ‘‘వారి పితరుల కుటుంబాల చొప్పున పండ్రెండు కర్రలను తీసుకొని యెవరి కర్ర మీద వారి పేరు వ్రాయుము. వాటిని ప్రత్యక్ష గుడారములోని శాసనము యెదుట వాటిని ఉంచవలెను. అప్పుడు నేను ఎవనిని ఏర్పరచుకొందునో వాని కర్ర చిగురించును. ఇశ్రాయేలీయులు మీకు విరోధముగా సణుగుచుండు సణుగులు నాకు వినబడకుండా మాన్పి వేయుదును.’’ (సంఖ్యా 17:2-5) వచనం 8లో లేవీ వంశస్థుడైన అహరోను కర్ర చిగిర్చియుండెను. పువ్వు పూసిబాదము పండ్లుగల దాయెను. అని మనం చూస్తాం.

తరువాత వచనం 10లో అప్పుడు యోహోవా మోషేతో ఇట్లనెను. తిరుగబడిన వారిని గూర్చి ఆనవాలుగా కాపాడబడునట్లు ఆ అహరోను కర్రను మరల శాసనము యెదుట ఉంచుము. వారు చావకుండునట్లు నాకు వినబడకుండ వారి సణుగులను కేవలము అణచి మాన్పివేసిన వాడవౌదువు అని చూస్తాం. ఈ విధముగా చిగిర్చిన అహరోను కర్ర మందసములో ఉంచబడినది.

ఈ విధముగా లేవి వంశస్థుడైన అహరోను ఇశ్రాయేలు ప్రజల ప్రధాన యాజకునిగా నియమించబడెను. మోషే దేవుని ప్రవక్త. అహరోనును అతని వంశీయులను ఇశ్రాయేలీయుల యొక్క ప్రధాన యాజకులై ఉండిరి. దేవుడు తానే ఈ లోక ప్రధాన యాజకుని విధిని అహరోనునకు అప్పగించెను. దేవుడు మోషేకు బలి వ్యవస్థను చూపెను. ఇశ్రాయేలీయులు పాపము చేసినప్పుడెల్ల బలులను దేవునికి సమర్పించవలెను. మరియు అహరోను బలి వ్యవస్థను అవసరమైన వాటన్నిటి ప్రకారము ఈ బలులను అర్పించునట్లుగా ఆయన చేసెను.

ప్రధాన యాజకుడైన అహరోనునకు దేవుడు యాజకత్వపు పనులను అప్పగించినను అతని యాజకత్వమును ప్రశ్నించిన ప్రజలు మిగిలి యుండిరి. ఇందువలననే దేవుడు అహరోను కర్ర చిగురించునట్లు చేసెను. ఈ విధముగా ఆజ్ఞలు రెండు రాతి పలకలు, మన్నాగల పాత్ర. చిగిరించిన అహరోను కర్ర మందసములో ఉంచబడినవి. ఆత్మీయముగా ఈ మూడు వస్తువుల సూచించునది ఏది? అవి మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిచర్యను సూచించును.



మన పాపములన్నిటిని తుడుపుపెట్టుటకు యేసుక్రీస్తు నెరవేర్చిన ఆ పరిచర్యలు ఏమిటి?


మొదటిగా ఆయన ప్రవక్త పరిచర్యను నెరవేర్చెను. ఆయనే ఆల్ఫాయు, ఓమెగయునై యున్నాడు. ఆయన ఆద్యంతమును ఎరిగిన వాడు,ఆయన ఆరంభమును మరియు అంతమును గూర్చి మనకు బోధించెను. మనము పాపులముగానే ఉన్న యెడల మానవులకు, నీకును, నాకును ఏమి సంభవించునో మన ప్రభువుకు తెలియును.

రెండవదిగా యేసు పరలోక రాజ్యములో నిత్య ప్రధాన యాజకుడయ్యెను. ఆయన ఈ లోకమునకు వచ్చెను. ఎందుకనగా మనలను పాపము నుండి రక్షింపగోరెను. తానే మన రక్షకుడు కావలెననియు, పరలోక రాజ్య ప్రధాన యాజకుడగుట ద్వారా పూర్తిగా మనలను రక్షించకోరెను.

మూడవదిగా యేసుక్రీస్తే మన రాజు, అని బైబిలు ప్రకటిస్తుంది. ‘‘రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రము మీదను తొడల మీదను వ్రాయబడినయున్నది.’’ (ప్రకటన 19:16) ఆయనే ప్రపంచమును నిర్మించినది. ఆ విధముగా ప్రతి దానిని పాలించుటకు అతినికి అధికారమియ్యబడెను.

యేసుక్రీస్తే మన నిజ రాజు, పాపము నుండి మన యొక్క రక్షణ యొక్క సత్యమును గూర్చి బోధించిన ప్రవక్త మరియు పరలోకము యొక్క శాశ్వత ప్రధాన యాజకుడు. ఆయనే ఇప్పుడు మన నిజ రక్షకుడాయెను.

మన ప్రభువు నిన్ను, నన్ను పాపము నుండి విడిపించెను. మనలను దేవుని ప్రజలుగా ఆయన బిడ్డలుగా తన పరిచారకులుగా చేసెను. మరియు మనలను మంచి పని చేయగలవారినిగా చేసెను. ఆయన మన ఆత్మలు తిరిగి జన్మించునట్లు చేసెను. కనుక ఈ లోకంలో కూడా మనం ఒక నూతన జీవితం జీవించగలము. ఆయన మనకు నూతన జీవమిచ్చెను కనుక సమయము వచ్చినప్పుడు ఆయన మన శరీరమును లేపి నిత్యము ఆయనతో కూడా పరలోకములో మనలను నివశింపజేయును. నీకును, నాకును యేసుక్రీస్తు ఉన్నాడు? ఆయన మన నిజ రక్షకుడు మరియు యేసుక్రీస్తు మన ప్రవక్త. మన నిత్య ప్రధాన యాజకుడు మరియు మన రాజు.

దేవుని చిత్తమునకు లోబడకూడదని మనం కోరుకొనకపోయిననూ మనం తప్పించుకొనలేనంత బలహీనతలు కలిగిన వారమై ఎల్లప్పుడూ పాపములనే చేస్తాము. ఇలాగే మనం జీవించుట కొనసాగించినట్లయిన ఇట్లాగే చనిపోయిన తరువాత దేవుని యెదుట నిలుచునప్పుడు మనం వెళ్ళవలసిన సరియైన స్థలం ఏది? అది పరలోకమా లేక నరకమా? పాపమునకు జీతము మరణమని ప్రకటించుచున్న ఆజ్ఞను బట్టి మనకు తీర్పు తీర్చబడితే మనమందరమూ నాశనము కావలసిన వారము కామా? అట్టి ప్రజలమైన మనలను పాపము నుండి నాశనము నుండి రక్షించి మన రక్షకుడైన యేసుక్రీస్తు ఆయన తానే ఈ లోకమునకు వచ్చెను. మనలను ప్రేమించెను. మనలను పాపము నుండి విడిపించు రక్షకుడాయెను. దాని వలన తన మందకు గొప్ప కాపరి అయెను.

యోహాను 3:16 చెప్పెను. ‘‘దేవుడు లోకమునెంతో ప్రేమించెను. కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచువాడు నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.’’ దేవుడు నిన్ను నన్ను ఎంతగానో ప్రేమించెను కాగా ఆయన తానే మన కొరకు ఈ లోకమునకు వచ్చెను. లోక పాపమును తనపై మోపుకొనుటకై బాప్తిస్మం పొందెను. సిలువ వేయబడెను మరియు సిలువపై మృతినొందెను. మృతి నుండి తిరిగి లేచెను. అందువలన ఆయన నిజముగా మనకు రక్షకుడాయెను. కాబట్టి మన హృదయాలలో మన రక్షకుడైన యేసుక్రీస్తును విశ్వసించుటతోనే మనము పాపము కడుగబడిన వారమైనాము. రక్షణను కృపను పొందితిమి. మనలను దేవుని బిడ్డలగునట్లు చేసెను మరియు నిత్యజీవము పొందగలిగాము.

దేవుని విశ్వసించుటకు ముందు మనము తప్పక చేయవలసినది ఒకటి కలదు. అదేమనగా దేవుడు మనలను ప్రేమించెను. మన పాపములను తుడిచివేయుటకు ఆయన మానవ శరీరమును ధరించుకొని ఈ లోకమునకు వచ్చెను, బాప్తిస్మం పొందెను. సిలువపై మృతినొందెను. మృతి నుండి తిరిగి లేచెను. కనుక ఆ విధముగా మన నిజ రక్షకుడాయెను. మన హృదయ విశ్వాసముతో యేసుని శరీరమును తిని ఆయన రక్తమును త్రాగినచో అప్పుడు నిత్యజీవము మనకు దొరుకును. ఈ సత్యము కంటే మరేదియూ ఇంతకన్నా స్పష్టము కాలేదు కనుక చేయునది ఏమీ లేదు కానీ దీనిని తెలిసికొని నమ్మాలి.

మనమాయన శరీరమును, రక్తమును విశ్వాసముతో తీసుకోవాలి. ఇట్టి విశ్వాసం కల వారెవైననూ ఉన్నది ఉన్నట్టుగానే యేసు నెరవేర్చిన నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను గుర్తించి, విశ్వసిస్తారు. మనకు చేయుటకు ఏమీ లేదు కానీ నమ్మాలి. దేవునికి వ్యతిరేకముగా నిలబడుట తప్ప మరేదైననూ మనము చేయవచ్చును. దేవుని ఎదిరించి పాపము చేయుటకు మనం త్వరపడతాం. కానీ అట్టివారమైననూ దేవుడు నిన్ను నన్ను పాపము నుండి ఒకేసారిగా విడిపించెను. ఎందుకనగా ఆయన అందరినీ ప్రేమించెను.



పాత నిబంధన కాలములో దేవుడు తన రక్షణను గురించి ఎట్లు మాట్లాడెను.


ప్రభువు మనలను ఏ విధానము ద్వారా రక్షించెను? పాత నిబంధనలో ఈ రక్షణనుగురించి ఆయన ప్రత్యక్ష గుడార ద్వారములోనున్న రంగుల ద్వారా మరియు ప్రధాన యాజకుని వస్త్రము ద్వారా మాట్లాడెను. నీలి, ధూమ్ర, రక్తవర్ణ దారము పేనిన సన్నని నార రంగులో బయలుపరచబడిన ప్రత్యక్ష గుడార ద్వారపు తెరయే ఆయన సంపూర్ణ రక్షణ యొక్క ప్రకటన ప్రధాన యాజకుని వస్త్రముపై బంగారు దారము కూడా ఉండెను.

ఆ నీలి దారము మనకు చెప్పునది మన రక్షకునిగా యేసుక్రీస్తు ఈ లోకములోనికి వచ్చెను. బాప్తిస్మం పొందుట వలన మన పాపమును వహించెను. ధూమ్ర వర్ణ దారము చెప్పునదేమనగా యేసుక్రీస్తు రాజులకు రాజును ఈ ప్రపంచమును నిర్మించిన దేవుడు రక్తవర్ణము చెప్పునదేమనగా ఆయన తన బాప్తిస్మం ద్వారా మన పాపమును వహించుకొనెను. గనుక యేసుక్రీస్తు లోక పాపమును మోసి సిలువపై వాటి కొరకైన శిక్షను అనుభవించి, తన రక్తమును కార్చి చనిపోయెను. తద్వారా మన పాపములన్నిటి శిక్షనుండి మనలను విడిపించి రక్షించెను.

పేనిన సన్నపు నార అనగా ఆ ప్రభువు ఈ లోకమునకు వచ్చెను. బాప్తిస్మం పొందెను. సిలువపై చనిపోయెను. మృతి నుండి తిరిగి లేచెను. ఆ విధముగా నిజమైన విశ్వాసము కలవారి పాపమును తుడిచెను. వారి ఆత్మను హిమము వలె తెల్లగా చేసెను. వారిని రక్షించెనని చెప్పునట్టి పాత క్రొత్త నిబంధనలోగల విస్తారమైన వాక్యమే. ఆ బంగారు దారము, యేసుక్రీస్తు మన కొరకై జరిగించిన వాటియందున్న విశ్వాసమును సూచించును. ఇందువలనే ఆ బంగారు దారము మెరయును. నీవు, నేను గొప్ప చెప్పుకొనుటకు ఏమియూ లేదు. కానీ యేసుక్రీస్తు తానే దేవుడును, దేవుని కుమారుడు మన కొరకు జరిగించిన వాటిని మనం పూర్ణ హృదయముతో విశ్వసించాలి. ఆయన జరిగించిన నీతిక్రియయందు విశ్వాసము ఉంచుట ద్వారానే మనము నిజముగా ఆయన ప్రేమను పొందెదము. ఆయన దీవెనలను పొందెదము. ఆయన వలన వృద్ధిపొందెదము. ప్రత్యక్ష గుడారము ద్వార దేవుడు చెప్పునది ఇదే.

ప్రత్యక్ష గుడారములో ఉంచబడిన మందసము ద్వారా దేవుడు మనకు బోధించు దానిని మనం గుర్తించాలి. యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చెను. పాపమును బాప్తిస్మమిచ్చు యోహాను ద్వారా బాప్తిస్మం పొందుట ద్వారా మానవులందరి పాపమును వహించుకొనెను. సిలువలో మరణించుట ద్వారా మన పాపశిక్షను భరించెను. మృతి నుండి తిరిగిలేచి సజీవుడాయెను అని మనం తెలుసుకొని విశ్వసించాలి. యేసుక్రీస్తు మన రక్షకునిగాను, మన స్వంత దేవునిగాను మనము నిజముగా నమ్మవలెనని మందసము ద్వారా బయలుపరచెను. వారి పాపమును వహించుటకు యేసు బాప్తిస్మం పొందెననియు, వారి పాప శిక్షగానే యేసుక్రీస్తు మరణము తమ మరణమని ఆయన పునరుత్థానమే తమ పునరుత్థామని ఇట్టి వాటియందు నమ్మిక యుంచువారిని దేవుడు రక్షించెను.

కనుక ఈ ప్రత్యక్ష గుడారము ఎవరిని చూపించుచున్నది? అది యేసుక్రీస్తును చూపించుచున్నది. యేసుక్రీస్తు నిన్ను, నన్ను మన పాపము నుండి రక్షించిన రక్షణ విధానమును అది మనకు చెప్పుచున్నది. నూతన నిబంధనలో బాప్తిస్మం పొంది సిలువపై మరణించి వారి వలన మన పాపము తుడిచి వాటన్నిటిని కడిగివేసి మన బలహీనతలను బట్టి శిక్షనొంది మనందరినీ ఒకేసారి రక్షించునది యేసుక్రీస్తు.

పాత నిబంధనలో, పాపులు తమ చేతులను తన తలపై ఉంచినందు వలన వారి పాపమును అంగీకరించి చంపబడి రక్తము చిందించిన బలిపశువు పాపులను రక్షించెను. పాత నిబంధన పాపులు చేతులుంచుట వలన వారి పాపమును వహించుకొని వారి స్థానములో పాప పరిహారార్థ బలిగా చనిపోయిన బలిఅర్పణ యొక్క మృతిని వర్ణించును. పాప పరిహారార్థ బలి వ్యవస్థ యొక్క బలి అర్పణము బయలుపరచిన పాత నిబంధనను క్రొత్త నిబంధనకు అన్వయించినప్పుడు బాప్తిస్మము మరియు రక్తము ద్వారా వచ్చి నీరు మరియు ఆత్మమూలమైన సువార్తకు కర్తయైన యేసుక్రీస్తుని చూపించును.

అట్లయిన రక్షణ యొక్క నిబంధనను చేసినది ఎవరు? మన రక్షకుడైన దేవుడే దానిని నియమించెను. పాపులను వారి పాపము నుండి విడిపించునట్లుగా దేవుడు రక్షణ యొక్క నిబంధనలను ఏర్పరచెను. మరియు ఆయనే దీనిని మనకిచ్చెను. మందసములో ఆజ్ఞలు గల పలకలు రెండు, మన్నాపాత్ర, చిగురించిన అహరోను కర్ర ఈ వస్తువులన్నియూ యేసుక్రీస్తుని పరిచర్యను వాటి ఘనతను గూర్చి మనతో చెప్పుచున్నవి.

చిగురించిన అహరోను కర్ర మనతో చెప్పునదేమనగా యేసుక్రీస్తును మనము పరలోక రాజ్యపు ప్రధాన యాజకునిగాను, మన గొప్ప కాపరిగాను మనం నమ్మినప్పుడు దేవుడు మనలను రక్షించును. మన్నా పాత్ర మన జీవాహారమైన యేసుక్రీస్తుని శరీరమును, రక్తమును గూర్చి చెప్పుచున్నది. ఆజ్ఞలు కల ఆ రెండు పలకలు దేవుడే శాసనమును, ఆజ్ఞ చేయువాడని చెప్పుచున్నది. దేవుడు ఏర్పరచిన శాసనము పాపము మరియు మరణము యొక్క పాపపరిహారము రక్షణ యొక్క ఆజ్ఞ మన కొరకు పాపశిక్ష అను ఆజ్ఞ నియమించిన యేసుక్రీస్తే జీవము యొక్క ఆజ్ఞను ఏర్పరచెను.

ఈ విధంగానే మందసము దానిలోనున్న సమస్తము యేసుక్రీస్తును గూర్చి మాట్లాడుచున్నవి. యేసుక్రీస్తుని మన రక్షకుడని విశ్వసించుట వలన మన పాపాల నుండి మనం కడుగబడి మనము రక్షణను పొందగలము. మనము ఎంత అయోగ్యులము బలహీనులమునైననూ సరే యేసుక్రీస్తు ఏర్పరచిన రెండు ఆజ్ఞలను మనము అంగీకరించి, అనుసరించిన ఎడల మనము ఒకసారి పాపులమై అదే విధముగా పాప పరిహారమును పొంది నీతిమంతులమౌతాము. తరువాత దేవుని ప్రజలుగా మారతాము. నీవు నమ్ముచున్నావా?

ఈ సమయంలో ఇప్పుడు లోకములోనున్న క్రైస్తవులందరూ వ్యర్థముగానే యేసును నమ్ముకొనుచున్నారు. ఎట్లనగా వారికి ప్రత్యక్ష గుడారములో బయలుపరచబడిన సత్యము తెలియదు. యేసుక్రీస్తుని సిలువ రక్తమును మాత్రమే నమ్ముట వలన పాపపరిహారము పొందగలమని వారి నమ్మకము. అనగా యేసుక్రీస్తు కేవలము సిలువ రక్తముతోనే తమను రక్షించెనని వారి నమ్మకము. కానీ వాస్తవముగా యేసు మన రక్షణకై కేవలం సిలువలో చనిపోయెనా? మన విమోచన కొరకు ఆయన చేసినదంతయు ఇదేనా? వీటికి విరోధముగా యోహాను ద్వారా బాప్తిస్మం పొందుట ద్వారా ఆయన ఒక్కసారిగా లోకపాపమును ఆయన వహించలేదా (మత్తయి 3:13-15, 1 పేతురు 3:21, 1 యోహాను 5:6)

అవును ఈ దినాలలో క్రైస్తవులు కేవలం యేసయ్య రక్తమునే నమ్ముకొనుచూ పాప పరిహారమును సగమే పొందుచున్నారు. యేసుక్రీస్తును తమ రక్షకునిగా నమ్మి తమ పరిహారము పొందినవారై వారు ప్రతిదినము పశ్చాత్తాప ప్రార్థనలను చేయుచూ తమ స్వంత పాపమును కడుగుకొనుటకు ప్రయత్నిస్తారు. ఈ రక్షణ ఎంత వేరుగా నున్నది? వారి పాపమును విశ్వాసం ద్వారా సగమే కడుగుకొని, తరువాత తమ స్వంత ప్రయత్నములతో మిగిలిన వాటిని కడుగుకొనుటకు ప్రయాసపడుచున్నారు.

పరిస్థితి ఇట్లుండగా పదేపదే యేసుని బాప్తిస్మమును రక్తమును గూర్చి కలిపి బోధించుట కొనసాగించుట తప్ప నేనేమి చేయగలను? ఇప్పటి వరకు ఈ లోక క్రైస్తవులలో అనేకులు ఆది సంఘ క్రైస్తవులు తప్ప మిగిలిన వారు సగము విశ్వాసమునే కలిగియుండిరి. ప్రజలు ఇప్పుడు క్రైస్తవ్యమును లోక సంబంధమైన ఒక మతముగా నమ్ముట ఇందు మూలముననే కాదా?

కొద్దికాలము క్రితమే అమెరికా దేశపు వెలేరియా అను ఒకామె ఈ ప్రత్యక్ష గుడారపు సీరిస్‌లోని మొదటి పుస్తకమును చదివిన తరువాత పాప పరిహారమును పొందెను. ఈ పుస్తకమును ఆమె చదువక పూర్వము మన మిగిలిన పబ్లికేషన్‌ పుస్తకములనేకములను చదివియుండిరి. మన పుస్తకము చెప్పునది ఆమె అంగీకరించినప్పటికి ఆమె సంపూర్తిగా నీరు మరియు ఆత్మమూలమైన సువార్త వలన పూర్తిగా సర్ధి చెప్పబడలేదు. ఆమెకు ఇంకా కొన్ని అనుమానులున్నవని మాతో చెప్పి ‘‘ఇది నిజమని అనిపిస్తుంది. కానీ ఎందువలన అనేకులు దీనిని బోధించుట లేదని” చెప్పి ఆశ్చర్యపోయింది. కానీ ప్రత్యక్ష గుడారపు సిరీస్‌లోని మొదటి పుస్తకమును చదువుట ముగించిన తరువాత ఆమె స్పష్టమైన రక్షణను గూర్చిన విశ్వాసములోనికి వచ్చిరి. ప్రత్యక్ష గుడారములో బయలుపరచబడిన సత్యమే నీటిని గూర్చిన సువార్తలోనూ ఉన్నదని విశ్వసించిరి.

బెనిన్‌ నుండి ఈ పుస్తకమునే చదివిన ఒకరు మాకు వ్రాశారు. మీ పుస్తకమును చదివిన తరువాత పాప పరిహరమును పొందిన నేను. ఇప్పుడు నా సంఘమునే వదిలితినని చెప్పితే మీరు ఎంతో ఆశ్చర్యపోతారు. నేను వెళ్తున్న సంఘాన్ని నేనెందుకు వదిలాను? ఎందుకనగా వారు బైబిలు బోధించని అదనపు పరిశుద్ధతను బోధించుచున్నారు. ఈ అదనపు పరిశుద్ధత యొక్క బోధ పూర్తిగా బైబిలు పరమైనది కాదు. నా శరీరము శుద్ధి చేయబడకయే నేను శుద్ధి పడగలనని, పడతానని చెప్పుచున్నప్పుడు అట్టి బోధనలను వింటూ నేను కూర్చొన లేకపోయాను.

అందువలననే నేను ఆ సంఘము నుండి వేరుపడ్డాను. మీ పుస్తకమును చదువుట ద్వారా నేను పాప పరిహారమును పొందినాను. కనుక ఇప్పుడు నాకు వేరొక దారి లేక నేను వెళ్తున్న సంఘం నుండి వేరైపోయాను. వీటన్నిటిని చూచిన మేము ఇప్పుడు, విశ్వాసులమై మమ్ములను మేము దేవుని సంఘముతో కలుపుకొంటిమి. ఈ లోకములోని ప్రజలందరూ కూడా మార్చబడతారు. అది వారు సత్యమును తెలిసికొంటేనే. ఎట్లనగా ‘‘మీరు సత్యమును గ్రహించెదరు. ఆ సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయును” అని వాక్యము చెప్పుచున్నది.

ప్రత్యక్ష గుడారములో మందసము కూడా యేసుక్రీస్తును బయలు పరచుచున్నది. ప్రత్యక్షగుడారములో మందసము లోపల స్థలములో ఉంచబడెను. ఒకడు ప్రత్యక్ష గుడారపు తెరను ఎత్తిదానిలో ప్రవేశించును. తరువాత అతి పరిశుద్ధ తెరను ఎత్తిదానిలో ప్రవేశించును. అనగా ప్రత్యక్ష గుడార ద్వారము ఉత్తరమున ఉన్నది. మరియు మందసము ప్రత్యక్ష గుడారము యొక్క లోపలి ఉత్తరమున ఉంచబడెను.



మందసము నుండి మోత కర్రలను తీసివేయకూడదు.


నిర్గమ 15:14-15 చెప్పుచున్నది. వాటితో ఆ మందసమును మోయుటకు ఆ ప్రక్క మీది ఉంగరములో ఆ మోత కర్రలను దూర్చవలెను. ఆ మోత కర్రలు ఆ మందసపు ఉంగరములోనే ఉండవలెను. వాటిని దాని యొద్ద నుండి తీయకూడదు. ఆ వచనము భావమేమిటి? ఈ వచనముతో మనలను దేవునికి సమర్పించుకొని మనము నీరు మరియు ఆత్మమూలమైన సువార్త సేవ చేయవలెనని ఆయన మనకు చెప్పుచున్నాడు. మనలను మనము ఆయనకు సమర్పించుకొన్నప్పుడే సువార్త వ్యాప్తి జరుగును. మనలను మనము ప్రభువుకు అంకితము చేసుకొని సువార్త సేవ చేయుట ప్రభువు మన ముందు నడిచినట్లు సిలువ మార్గమును అనుసరించుటే. అందుకే ఆయన తన శిష్యులతో చెప్పెను. ‘‘నన్ను వెంబడింపగోరు వాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువ యెత్తికొని నన్ను వెంబడించవలెను.’’ (మార్కు 8:34)

ఈ సత్యసువార్తను లోకమందంతటా వ్యాప్తి చేయుటకు ఎంతో త్యాగము. శ్రమ మరియు బాధలు పడవలసి ఉన్నది. నీరు మరియు ఆత్మమూలమైన ఈ సువార్త కొరకు అపోస్తులుడైన పౌలు పడిన అవస్థలను చూస్తే మనము కనుగొనగలము. “వారు క్రీస్తు పరిచారకులా? వెఱ్ఱివానివలె మాటలాడుచున్నాను, నేనును మరి యెక్కువగా క్రీస్తు పరిచారకుడను మరి విశేషముగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని. అపరమితముగా దెబ్బలు తింటిని. అనేక మార్లు ప్రాణపాయములో ఉంటిని; యూదులచేత అయిదు మారులు ఒకటి తక్కువ నలువది దెబ్బలు తింటిని, ముమ్మారు బెత్తములతో కొట్టబడితిని; ఒకసారి రాళ్ళతో కొట్టబడితిని. ముమ్మారు ఓడ పగిలి శ్రమపడితిని. ఒక రాత్రింబగళ్లు సముద్రములో గడిపితిని. అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలననైన ఆపదలలోనూ, దొంగలవలనైన ఆపదలలోనూ, నా స్వజనుల వలననైన ఆపదలలోనూ, అన్యజనుల వలననైన ఆపదలలోనూ, పట్టణములో ఆపదలలోను, అరణ్యములో ఆపదలలోను, సముద్రములో ఆపదలలోను, కపట సహోదరుల వలని ఆపదలలోను ఉంటిని. ప్రయాసతోను, కష్టములతోను తరచుగా జాగరణములతోను ఆకలి దప్పులతోను, తరచుగా ఉపవాసములతోను, చలితోనూ, దిగంబరత్వముతోను ఉంటిని. ఇంకను చెప్పవలసినవి అనేకములున్నవి ఇవియును గాక సంఘములన్నిటిని గూర్చిన చింతయు కలదు. (2 కొరింధి 11:23-28)

అయినను తమ శిక్ష అంతటి నుండి తనను తాను అర్పించుకొనిన మన ప్రభువు కంటే తనను తాను ప్రేమించుకొనువాడు, తనను తాను దేవుని రాజ్యము కొరకు అర్పించుకొనలేడు. నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను ప్రచురించుటకు సులువైన మార్గమేదియును లేదు. ఒక రైతు చెమట కార్చకుండా మంచి పంటను ఆశించగలడా?

అలాగే మన త్యాగముతోనే మందసమును మోయబడవలెను. ఒకసారి రాజైన దావీదు నియమాక పద్ధతిలో మోతకర్రలకు బదులుగా ఒక క్రొత్త ఎద్దుల బండిలో మందసమును తెచ్చుటకు ప్రయత్నించెను. ఇరుప్రక్కలను ఎద్దులకు కాలు జారగా, ఉజ్జా అను మనుష్యుడు చేయి చాపి దేవుని మందసమును పట్టుకొనెను. యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనెను. అతని తప్పునుబట్టి దేవుడు ఆ క్షణమందే అతనిని మొత్తెను. అతడు అక్కడనే మందసమునొద్ద పడి చనిపోయెను. (2సమూ 6:1-7) కనుక దావీదు భయపడి దేవుడు చేసిన దానికి వ్యాకులపడెను. గిత్తీయుడైన ఓబెదెదోము ఇంటిలో ఆ మందసమును ఉంచెను. మూడు నెలల తరువాత పనివారి భుజములపై మోయుచూ ఆ మందసమును తన పురమునకు తెచ్చెను. ఆ భాగము వివరించుచున్నట్లు దేవుడు మనకు చెప్పిన విధానములోనే మనము మందసమును మన చెమట మరియు రక్తముతో ఆయన సువార్త కొరకైన మన త్యాగముతోను, మార్పులేని సమర్పణతోను మోయవలెను.

గొప్ప కృతజ్ఞతతో పాప పరిహారమును నిజముగా పొందినవారు అంతకంటే అధికముగా తనను తాను మన కొరకు సమర్పించిన ప్రభువునకు సమర్పించుకొనగలరు. మనము మన కృతజ్ఞతలను మన ప్రభువును, రక్షకుడైన దేవునికి అధికముగా సమర్పించాలి. ఈ లోకములో మనలను ఈ సువార్త సేవ చేయ అనుగ్రహించినందుకు ఆయనకు కృతజ్ఞతలు చెప్పాలి.

ప్రభువు ఈ సువార్త సత్యమును ప్రచురించుటకు ఆయననుసరించుచూ ఆయనను సంతోషపెట్టునట్టి జీవితము జీవించుటకు మనలను ఎన్నుకున్నట్టి కలవంటి ఈసత్యమునకు మనము సంతోషించి ఆనందించాలి. ఈ రక్షణ సత్యము తెలిసికొనుటకు మనలను అనుమతించినందుకే మనము ఆనందించాలి. దేవుడు ఈ సువార్త సేవ జేయుటకు కూడా మనలను అనుమతించెను. అట్టి గొప్ప దీవెనలు పొందియు ఆయనకు కృతజ్ఞతలు చెల్లించకుండా ఎట్లుండగలము? మన కృతజ్ఞత అంతయు మన దేవునికి అర్పించాలి. అందువలననే మనము సమయమును ప్రయత్నమును లోక సువార్త యొక్క పరిశుద్ధ పరిచర్య మనము పొందినందుకు మనలనర్పించుకొనుటకు సిద్ధపడుచున్నాము.

మనము పాప పరిహారము పొందుట వాస్తవంగా దానికదే అనంత కృతజ్ఞతలు చెల్లించవలసినదైయున్నది. కానీ దేవుడు అక్కడే మనలను ఆపలేదు. ఈ సువార్త సత్యమును వ్యాప్తి చేయుటకు, దాడి చేయుటకు అనుమతిచ్చెను. నీరు మరియు ఆత్మమూలమైన సువార్త మనకు గొప్ప దీవెన కాక మరి ఏమిటి?

మరి ఎవరు ఈ నీరు మరియు ఆత్మమూలమైన సువార్త సేవ చేయుటకు సాహసిస్తారు? ఏ ఒక్కరో ఈ సువార్తసేవ చేయలేదు. రాజకీయ నాయకులు చేయగలరా? అధ్యక్షులు, రాజులు వారి సామాజిక స్థితి ఎంత గొప్పదైనను సరే. వారు నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను తెలిసికొనక విశ్వసించని ఎడల వారెన్నటికి ఈ సత్యసువార్త సేవ చేయలేరు. అయిననూ దేవుడు అట్టి అయోగ్యులమైన మనకు ఆ సువార్త సేవ చేయుటకు అర్హతను ఇచ్చెను. ఇది ఎంత గొప్ప దీవెన?

ఆయన మనలను రక్షించిన కృపనుబట్టి నేను దేవునికి కృతజ్ఞుడను. సహోదర, సహోదరీలారా యేసుక్రీస్తు మన దేవుడును. రక్షకుడని మనం విశ్వసిస్తాం. మన ఆత్మీయ విశ్వాసం ద్వారా మనము యేసు శరీరమును తిని ఆయన రక్తమును త్రాగ గల దేవుని ప్రజలమైయున్నాము. యేసు సజీవులకే దేవుడు మృతులకు కాదని (లూకా 20:38). బైబిలు చెప్పుచున్నది ఇక్కడ సజీవులనుగా నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను విశ్వసించుట వలన నిత్యజీవమును పొందిన వారే. ఈ సువార్త యొక్క సత్యమును నమ్మని వారు ఆత్మీయ మృతులు. దీనిని నమ్మువారు ఆత్మీయ సజీవులు వాస్తవంగా దేవుడు నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను విశ్వసించు వారికి దేవుడు.

సోదరీ, సోదరులారా యేసు తానే తన స్వంత రక్తమాంసము ద్వారా మనకు పాప పరిహారమని చెప్పెను. నీవు విశ్వసించనిచో యేసుక్రీస్తు వలన నీకు ప్రయోజనం లేదని నీవు గుర్తించాలి. యేసుక్రీస్తు నీకు పరలోక దీవెనలను, నిత్యజీవమును నీ పాప పరిహారమును ఇచ్చును. నీపై నిత్య దీవెనలను కుమ్మరించి నిన్ను నడిపించి నిలుపుచూ నీకు కాపరి కాగలిగిన వారు ఎవరు? ఆయన నీరు మరియు ఆత్మమూలమైన సువార్తకు కర్తయైన యేసుక్రీస్తే. మీలో ప్రతి ఒక్కరూ ఈ యేసును మీ రక్షకునిగా అంగీకరిస్తారని నమ్ముచూ ప్రార్థిస్తున్నాను.

నా మట్టుకు ఈ సత్యమును విశ్వసించి దేవుని సేవించుటే కాదు కానీ ముందుకు కూడా ఇట్లు చేయుట కొనసాగించెదనని నమ్ముచున్నాను. అయితే నీవు ఏమి చేస్తావు? నీవు నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను విశ్వసిస్తావా? మరియు నీవు దేవుని సంఘములోని దేవుని యొక్క ప్రేమలోను నీ విశ్వాసముతో జీవించుటను నీవు నమ్ముతున్నావా? మనమందరమూ మన దేవుని కలుసుకొను దినము వరకు నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను నమ్ముచూ మన జీవితమును సాగిద్దాము.