Sermons

[11-17] < నిర్గమ 25:10-22 > ఆ కరుణా పీఠముపై పాప పరిహారార్థ బలిగా ప్రోక్షింపబడెను< నిర్గమ 25:10-22 >

“దాని పొడుగు రెండు మూరలునర, దాని వెడల్పు మూరెడునర, దాని యెత్తు మూరెడునర దాని మీద మేలిమి బంగారురేకు పొదిగింపవలెను. లోపలను వెలుపలను దానికి పొదిగింపవలెను. దాని మీద బంగారు జవను చుట్టు కట్టవలెను. ఒక దానికి నాలుగు బంగారు ఉంగరములను పోతపోసి ఒక ప్రక్కను రెండు ఉంగరములు ఎదుటి ప్రక్కను రెండు ఉంగరములు ఉండునట్లు దాని నాలుగు కాళ్ళకు వాటిని వేయవలెను. తుమ్మకఱ్ఱతో మోతకఱ్ఱలను చేసి వాటికి బంగారు రేకులను పొదిగించి వాటితో ఆ మందసమును మోయుటకు ఆ ప్రక్కల మీది ఉంగరములలోనే ఆ మోతకఱ్ఱలను దూర్చవలెను. ఆ మోతకఱ్ఱలు ఆ మందసపు ఉంగరములోనే ఉండవలెను. వాటిని దానియొద్ద నుండి తీయకూడదు. ఆ మందసములో నేను నీకిచ్చు శాసనములను ఉంచవలెను. మరియు నీవు మేలిమి బంగారుతో కరుణాపీఠమును చేయవలెను. దాని పొడుగు రెండు మూరలునర దాని వెడల్పు మూరెడునర, మరియు రెండు బంగారు కెరూబులను చేయవలెను. కరుణాపీఠము యొక్క రెండు కొనలను నకిషీపనిగా చేయవలెను. ఈ కొనను ఒక కెరూబును ఆ కొనను ఒక కెరూబును చేయవలెను. కరుణాపీఠము దాని రెండు కొనల మీద కెరూబులను దానితో ఏ కాండముగా చేయవలెను. ఆ కెరూబులు పైకి విప్పిన రెక్కలు గలవై కరుణాపీఠమును తమ రెక్కలతో కప్పుచుండగా వాటి ముఖములు ఒకదానికొకటి ఎదురుగా నుండవలెను. ఆ కెరూబుల ముఖములు కరుణా పీఠము తట్టు నుండవలెను. నీవు ఆ కరుణాపీఠమును ఎత్తి ఆ మందసముమీద నుంచవలెను. నేను నీకిచ్చు శాసనములను ఆ మందసములో నుంచవలెను. అక్కడ నేను నిన్ను కలిసికొని కరుణా పీఠముమీద నుండియు, శాసనములు గల మందసము మీద నుండు రెండు కెరూబుల మధ్య నుండియు, నేను ఇశ్రాయేలీయుల నిమిత్తము మీకాజ్ఞాపించు సమస్తమును నీకు తెలియచెప్పెదను.’’కరుణా పీఠము


చేతి మొదటి నుండి మోచేయి వరకు చాచిన పొడవు అడుగు. బైబిల్‌ నందు ఒక అడుగుగా కొలువబడినది. ఈ దినములలో 45సెం.మీ కొలతకు సమానము. కరుణా పీఠము పొడుగు రెండున్నర అడుగులు. కనుక దానిని మీటర్లలోనికి మార్చిన ఈ కొలత దాదాపు 112.5సెం.మీ మరియు దాని వెడల్పు ఒకటిన్నర అడుగు. దాదాపుగా 67.5సెం.మీ కొలత ఉండవచ్చు. వీటిలో కరుణాపీఠము యొక్క సాధారణ కొలతలు తెలియుచున్నవి.

మందసము మొదటి తుమ్మకర్రతో చేయబడి తరువాత లోపల బయట బంగారుతో తాపడము చేయబడినది. మరియు దాని రెండు చివరల తమ రెక్కలు చాచుటకు రెండు కెరూబులు ఉంచబడినవి. అవి మందసపు మూతలను పూర్తిగా కప్పుచున్నవి. అనగా, ఆ కరుణా పీఠము, కరుణా పీఠము వైపు ముఖము త్రిప్పిన కెరూబులు, దేవుని యొద్దకు విశ్వాసముతో వచ్చు వాని పై ఆయన తన కరుణను కుమ్మరించునదే కరుణాపీఠము.

మందసమునకు నలుమూలలా బంగారు రింగులు ఉంచబడినవి. ప్రతి ప్రక్కను రెండు రింగులు ఉంచబడినవి మరియు రింగులో దూలములు నుంచుట వలన ఆ మందసమును మోయగలము. ఈ దూలము కూడా తుమ్మచెక్కవి, బంగారు రేకులతో తాపడము చేయబడినవి. ఒకవైపునున్న రెండు రింగులలో దూలములను, మరొక ప్రక్కగల వాటిలో మరొకటి ఉంచబడును. ఇద్దరు మనుష్యులు దానిని ఎత్తి మోయునట్లు దేవుడు దాని చేసెను. ‘‘నేను ఈ కరుణాపీఠముపై మిమ్మును కలిసికొందునని” ప్రభువు చెప్పెను. మందసమును మోయునట్లుగా ఇశ్రాయేలీయులకు దేవుడు చేసెను. దీని భావమేనగా ఈ సువార్తను లోకమంతటా ప్రచురించుటకు దేవుడు కోరుచున్నాడు. ఇదే బలిపీఠము విషయములోని సత్యమైయున్నది. అనగా దాని రెండు వైపులా రింగులు ఉంచబడినవి. ఈ రింగుల ద్వారా మోతకర్రలు దూర్చబడినవి. ఆ బలిపీఠమును మోయుటకు ఇద్దరు మనుష్యులుండిరి. ఇది కూడా మనము కష్టమును ఎదుర్కొన్నప్పుడు దేవుని సహాయము కొరకు ప్రార్థించాలి. మరియు మనము వెళ్ళిన చోటుకెల్లా ప్రపంచమునంతటా సువార్తను ప్రకటించుట కొరకు ప్రార్థించాలి అని వివరించుచున్నది.

మందసములో మూడు వస్తువులు ఉంచబడినవి. మన్నా ఉంచిన బంగారు పాత్ర, చిగురించిన అహరోను కర్ర ఆజ్ఞల పలకలు, వీటి అర్థమేమి? మొదటిగా మన్నాగల బంగారు పాత్ర భావము ఏదనగా యేసుక్రీస్తు విశ్వాసులకు నూతన జీవమునిచ్చును. ఒకసారి ఆయన చెప్పెను. ‘‘జీవాహారమును నేనే నా యొద్దకు వచ్చువాడు ఆకలిగొనడు. మరియు నాయందు విశ్వాసముంచు వారు ఎన్నటికి దప్పిగొనరు.’’ (యోహాను 6:35)

అహరోను చిగురించిన కర్రమనకు చెప్పునదేమనగా యేసుక్రీస్తే పునరుత్థాన ప్రభువు ఆయన మనకు నిత్యజీవమును ఇచ్చును. ఆజ్ఞలు కల రాతి పలకలు చెప్పునదేమనగా మనము తప్పించుకొనక ఆజ్ఞ ఎదుట శిక్షకుపాత్రులమై చావుకు నియమింపబడితిమి. ఏదైననూ ఆజ్ఞ విధించిన మన పాపశిక్ష అంతటినీ అప్పచెప్పగలిగినంతటి కృప దేవుని కృప. బయటకు వచ్చు మందస ఆజ్ఞలను సంపూర్తిగా రూపుమాపగలిగేట్టు ఆ కరుణా పీఠము కూర్చబడినది. తన కుమారుడైన యేసును త్యాగమిచ్చి ఆ కరుణా పీఠమును దేవుడు సంపూర్తి చేసెను. కనుక నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను నమ్ము ప్రతివాడు కృపాసనమునకు, కరుణాపీఠము నొద్దకు ధైర్యముగా రావలెను.ఆ కరుణా పీఠముపై ప్రోక్షింపబడిన ఆ ప్రశస్త రక్తము.


కరుణా పీఠములో దాగియున్న మర్మమును మనము మొదట కనుక్కొందాము. సంవత్సరమునకు ఒకసారి ప్రధాన యాజకుడు బలి పశువు రక్తమును తీసికొని అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించును. తరువాత సరిగ్గా ఏడుసార్లు ఈ బలిపశువు రక్తమును కరుణా పీఠముపై చిలకరించును. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలను ఆ కరుణా పీఠముపై కలుసుకొందునని దేవుడు చెప్పెను. ఎవరికైతే ప్రధాన యాజకునికి ఉండు విశ్వాసం ఉండునో అనగా బలి వ్యవస్థలో బయలుపరచబడిన పాప పరిహారమును నమ్ముతారో వారిని దేవుడు కలియునని చెప్పెను.

కరుణా పీఠముపై చిలకరింపబడిన బలి పశురక్తము పాపమును గూర్చిన న్యాయ తీర్పు మరియు మానవాళిపై ఆయనకు గల కరుణను చూపుచున్నది. బలి దినము ఏడవ నెల పదియ వదినమున ప్రధాన యాజకుడైన అహరోను, ఇశ్రాయేలీయులు సంవత్సర మంతటి పాపాన్ని బలి పశువుపై మోపుటకు దాని తలపై చేతులుంచును. తరువాత అతడు దాని రక్తమును చిందించునట్లు దాని గొంతును కోసి తరువాత దాని రక్తమును తెరలోనికి తీసికొనిపోయి కరుణాపీఠముపై దానిని ప్రోక్షించును. (లేవీ 16:11-16)

అట్లు చిలకరింపబడిన ఆ రక్తము ద్వారా, దేవుడు ఇశ్రాయేలీయులను కలుసుకొని వారికి ఆ పాపపరిహార దీవెనలను ఇచ్చును. బలి వ్యవస్థను ఏర్పరచిన ఇశ్రాయేలీయులపై చూపిన దేవుని కృప ఇదియే. బలి పశువుపైన దాని రక్తముపైన చేతులు ఉంచుటతో దేవుడు వారి పాపములను తుడిచి వారికి తన కృపనిచ్చును. వారి పాప పరిహారము కృప ద్వారానే.

ఈ కృపను మనము ఎట్లు సాధించగలము? ఏ వాక్యముతో మన పాపమును తుడుపు పెట్టెను? మన కొరకు నియమించబడిన బలివ్యవస్థలో బయలుపరచబడిన సత్యమును తెలిసికొని విశ్వాసం కలిగియుండాలని తెలిసికొనునట్లు దేవుడు మనకు తెలియజేసెను. ఎందుకనగా ఆయన మనపై కుమ్మరించిన బహుమానమును మనం పొందుకొనునట్లు చేయుటకు. ఈ రెండు విషయాలు ప్రధాన యాజకుడు నెరవేర్చగలిగినట్లు దేవుడు చేసెను. బలిపశువుపై చేతులు ఉంచుట మరియు దాని రక్తము పాత నిబంధన యొక్క బలి యేసుక్రీస్తుని బాప్తిస్మము మరియు సిలువలో ఆయన కార్చిన రక్తమే కాని మరొకటి కాదు.

మన పాపాల కొరకే దేవుని కుమారుడైన యేసు లోకపాపమును వహించుటకై యోహాను వలన బాప్తిస్మం పొందెను. ఈ పాపము జీతమును చెల్లించుటకు సిలువపై బలియాగమాయెను. మన కొరకు మరణించెను. మనలను సజీవులుగా చేయుటకే మృతి నుండి లేచెను. యేసుక్రీస్తు పొందిన బాప్తిస్మము సిలువలో ఆయన కార్చిన రక్తము మనకు పాప పరిహారమిచ్చుటకే అవి నిజమైన దీవెన యొక్క కృపయై అట్టి విశ్వాసము కలవారు దేవుని చూచునట్లు చేయును. ఈ సత్యమే నీరు మరియు ఆత్మమూలమైన సువార్త యొక్క నీడ నీరు మరియు ఆత్మమూలమైన సువార్త సత్యమైనది. నిజ విశ్వాసమను పునాది ఏర్పరచెను. ఆ పునాది పాపులు దేవుని నుండి పరిహారము పొందునట్లు చేసెను. యేసుక్రీస్తు మన పాపము కొరకై బలిపశువాయెను. ఆయన సత్యమునకు వారధి ఆయెను. ఆ వారధి మనలను పరిశుద్ధ తండ్రియైన దేవుని యొద్దకు నడిపించును.

మరల ఈ సత్యమును గూర్చిన సాక్ష్యమును ప్రత్యక్ష గుడారపు ద్వారమునకు వాడిన దారము వర్ణములైన నాలుగు వర్ణములలో కనబడును. నీలి, ధూమ్ర, రక్తవర్ణ, పేనిన సన్నపునారదారము. ప్రత్యక్ష గుడారపు ద్వారము యొక్క ఆ నాలుగు వర్ణములు మనకు సత్యసువార్తకైన ఆధారమును ఇచ్చును.

మొదటి ఆధారము ప్రత్యక్ష గుడారము ద్వారములో అమర్చబడిన నీలిదారపు మర్మము. ఆ మర్మమేదనగా యేసుక్రీస్తు యోహాను వలన బాప్తిస్మం పొందెను. అనగా ఆయన ఈలోక పాపమును వహించెను. అందువలననే ఆయన బాప్తిస్మమిమ్మని యోహానును బ్రతిమాలుకొనుచు ఇట్లనెను. ‘‘ఇప్పటికి కానిమ్ము, నీతి యావత్తు ఈలాగు నెరవేర్చుట మనకు తగియున్నది.’’ (మత్తయి 3:15)

రెండవ ఆధారము ప్రత్యక్ష గుడారములో అమర్చిన ధూమ్ర వర్ణమైయున్నది. ధూమ్ర వర్ణము రాజులవరమైయున్నది. యేసుక్రీస్తు రాజులకు రాజైయుండెను. మానవాళి యొక్క రక్షకునిగా తమ పాపము నుండి వారిని రక్షించుటకు ఈ లోకమునకు వచ్చెను. ఆయన పరలోక మహిమను విడచెను. యేసుక్రీస్తు తనలో తాను దేవుడైయుండెను. కానీ మనలనందరినీ మన పాపము నుండి రక్షించుటకు ఆయన ఈ లోకమునకు వచ్చెను. బాప్తిస్మం పొందెను. తండ్రి చిత్తమునకు లోబడినవాడై సిలువ వేయబడెను. మన పాపములన్నీ తుడిచివేయుటకు అనగా దేవుడు పరలోకము యొక్క మహిమగల తన సింహాసనమును విడిచి శరీరధారిగా కన్య మరియ గర్భమందు ఈ లోకములో పుట్టినది పాపులను రక్షించుటకే, కనుక దేవుడు తానే శరీరధారిగా కన్య మరియ ద్వారా జన్మించుట. బాప్తిస్మం పొందుట సిలువలో రక్తము కార్చుట. ఇవన్నీ 700 సంవత్సరాల క్రితం ప్రవక్త యెషయాకు చేసిన వాగ్ధానము నెరవేర్చుటకేనని మనము గుర్తించాలి.

మూడవ ఆధారము రక్తవర్ణ దారము. అది యేసుని రక్తమును సూచించును. ఈ సత్యము బయలుపరచునదేమనగా దేవుని రక్షణ అను వ్యవస్థను యేసు తన రక్తమును కార్చుట ద్వారా పూర్తి చేసెనని ఆయన సిలువలో రక్తమును కార్చుట అనునది నేరస్థులలో పొందు భయంకరమైన శిక్షయే. తాను బాప్తిస్మము ద్వారా పొందని పాపము యొక్క శిక్ష పొందుటతో మానవులందరి పాపములు తీర్పు తీర్చబడినవి. సిలువ వేయబడి తన రక్తమును కార్చుట ద్వారా ఆయన లోకపాపము శిక్ష అంతటిని భరించెను గాని మనలను పాపము నుండి విడిపించెను. తాను యోహాను వద్ద బాప్తిస్మం పొందుట ద్వారా అంగీకరించిన పాపములోను మరణమగుటకై తండ్రికి విధేయుడై దేవుడు పాపులందరినీ వారి అనర్హత నుండి రక్షించెను.

దేవుడు పాపము యొక్క శిక్ష అంతటిని రూపుమాపెనని, విశ్వాసులను దేవుని బిడ్డలనుగా చేయుటకు సిలువ వేయబడుట ద్వారా మన శిక్షను భరించుటకు ఘోరశిక్ష నొందెనని నీవు నమ్ముచున్నావా? దేవుడు వీటన్నిటిని చేసెను. మనము ఈ సత్యమును నమ్మి నిత్య జీవమును పొందెదమనియే. యేసు బాప్తిస్మం పొంది, సిలువపై శిక్షింపబడెను. అనగా ఆయన మనలను పాపము నుండి విడిపించెను. ఇందువలననే ఆయన చివరిగా బిగ్గరగా కేక వేసెను. ‘‘సమాప్తమాయెను” (యోహాను 19:30) యేసు మన రక్షణను నెరవేర్చుట ముగించినప్పుడు గొప్ప సంతోషముతో విడుదల పొందినవాడై యేసు తాను పాపము నుండి మన రక్షణను తండ్రి చిత్త ప్రకారము నెరవేర్చినందుకు గొప్ప నెమ్మదితోను సంతోషముతోనే అరచెను.

ఆఖరుగా పేనిన సన్నపునార దేవుడు వాక్యమైయుండెనని ఒప్పుకొనెను. ఆయన దేవుని చిత్తమును విస్తారమైన నీతి వాక్యముతో విశదపరచెను. పాత నిబంధన అంతటా తాను ఈ లోకమునకు వచ్చెదననియు తన బాప్తిస్మము మరియు సిలువ ద్వారా మానవులనందరినీ రక్షిస్తానని ముందుగానే చెప్పెను. తరువాత ఆయన తన వాగ్ధానములన్నిటిని సంక్షిప్తముగా క్రొత్త నిబంధనలో నెరవేర్చెను. ఇందువలననే బైబిలు చెప్పుచున్నది. ‘‘ఆదియందు వాక్యముండెను. ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను. ఆ వాక్యము దేవుడైయుండెను... ఆ వాక్యము శరీరధారియై మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమవలె మనము ఆయన మహిమను కనుగొంటిమి.’’ (యోహాను 1:1-14).

ఈ సత్యము మన పాపములను మహిమవలె తెల్లగా చేసుకొనుటకు మనలను అనుమతిచ్చెను. యేసు పొందిన బాప్తిస్మము ఆయన కార్చిన రక్తమును చేతులుంచుట బలి వ్యవస్థ యొక్క న్యాయ తీర్పు యొక్క బలివిధానమును చిందించెను. మనకు బదులుగా మన పాపములను భరించెను. కనుక సిలువపై తన రక్తమును చిందించెను. మనకు బదులుగా మన పాపములను యేసు మోయవలసియున్నది. సిలువ మోసి, రక్తమును కార్చవలసియున్నది అను సత్యమే మన పాపాలన్నిటిని కడిగిన బలిదానమాయెను.

మన ప్రభువు మనుష్యునిగా ఈ లోకమునకు వచ్చినప్పుడు బాప్తిస్మం పొందెను. సిలువపై ఆయన రక్తము కార్చెను అనునవి. నీలి ధూమ్ర రక్త వర్ణములో బయలుపరచబడిన సత్యములైయున్నవి. యేసు 2 వేల సంవత్సరాల క్రితమే ఈ లోకములో జన్మించెను. బాప్తిస్మం పొందుటచే లోకపాపమును వహించెను. సిలువలో చనిపోయెను. మూడు దినములలో మృతి నుండి తిరిగి లేచెను. అప్పటి నుండి 40 దినములు సాక్ష్యం పొందెను. దేవుని కుడి పార్శ్వమునకు ఆరోహణమాయెను. నీలి, ధూమ్ర దారములో బయలుపరచబడిన సత్యము ఇదియే. మన పాపములను తుడిచివేయుట వలన ఆయన మనలను రక్షించెనను సత్యమును నమ్మవలెనని దేవుడు చెప్పుచున్నాడు.

ఈ సత్యమును మనము నమ్మినప్పుడు దేవుడు మనకిట్లు చెప్పుచున్నాడు. ఇప్పుడు మీరు పిల్లలైయున్నారు. మీరు పాపులు కారు. మీరిక పాపులు కాదు, నా పిల్లలు నేను మిమ్ములందరినీ మీ పాపము నుండి, శిక్ష నుండి, శాపము నుండి రక్షించియున్నాను. నేను నా అమితమైన ప్రేమతో రక్షించితిని. ఎందుకనగా నేను మిమ్ములను ప్రేమించుచున్నాను. నేను ఏ నియమము లేకయే రక్షించితిని ఎందుకనగా నేను మిమ్మును ప్రేమించితిని. నేనే నా స్వంతంగా మిమ్ములను రక్షించితిని కానీ నేను నా ప్రేమను మీకు ఈ విధంగా చూపించితిని. నా బలి రక్తమును చూడుము. నాకు మీ పట్ల గల ప్రేమకు ఇదే సాక్ష్యము. నేనే ఈ సాక్ష్యమును చూపితిని.

మనము ఆత్మీయముగా బీదలమై ప్రభువు నొద్దకు వచ్చినప్పుడు తాను మనలను నీలి, ధూమ్ర రక్త వర్ణదారములో మనలను రక్షించెనని మనకు చూపించెను. ఆ ప్రభువు ఈ లోకమునకు వచ్చెను. బాప్తిస్మం పొందెను. తృణీకరించబడెను. సిలువ మరణమును శిక్ష విధించబడెను. మృతి నుండి తిరిగి లేచెను. పరలోకమునకు ఆరోహణమాయెను. ఆయన రక్షణ యొక్క ప్రేమను నమ్మువారిని దేవుడు దర్శించును.

విశ్వసించు వారిపై దేవుడు తన కృపను కుమ్మరించును. ఆయన రక్షణ సామాన్యులను దేవుని పిల్లలుగా మార్చెను. దేవుడు మనతో చెప్పుచున్నాడు. ‘‘మీరు ఇప్పుడు నా పిల్లలు. నా కుమారులు, కుమార్తెలు. మీరిక సాతాను పిల్లలు కారు కానీ నా స్వంత పిల్లలు. మీరిక సామాన్యులు కానీ నా సొంత ప్రజలు. నేను మీ పాపములన్నిటిని నా కుమారుడైన యేసు ద్వారా పరిహరించితిని. నేను ఇప్పుడు నా ప్రజలుగా చేసితిని. విశ్వాసము వలన వారు నా పిల్లలైతిరి. దేవుడు పాపులను రక్షించుటకే కాక వారిపై తన స్వంత పిల్లలనుగా చేసికొన్న కృపను క్రుమ్మరించెను.

దేవుని మందసము యొక్క మూతనే కరుణా పీఠమని పిలిచెను. రెండు కెరూబులను క్రిందికి చూచునట్లు దానిపై ఉంచబడెను. ఆ కరుణా పీఠముపై తాను ఇశ్రాయేలీయులను దర్శింతునని దేవుడు ఎందుకు తెలియజేసెను? దీనికి కారణము చేతులుంచుట ద్వారా తమ పాపములను వహించుకొనిన బలిపశువు యొక్క రక్తమును అంగీకరించుట ద్వారా ఇశ్రాయేలీయుల పాపములను దేవుడు అక్కడనే పరిహరించెను.

కనుక దేవుడు చెప్పెను. నిక్షేపణము ద్వారా తమ పాపమును బలిపశువుపై మోపుట ద్వారా ఆ బలిపశువు తమకు బదులుగా ఘోరముగా ఆ పాపము పరిహారమును చెల్లించుటతో ఇశ్రాయేలీయులకు ఆయన పాప పరిహారమివ్వగోరెను. ఇదంతయూ తన ప్రజల దౌర్బల్యమును తుడిచి వేయుటకే.

ప్రతివారు ఆదాము వారసులుగా ఈ లోకములో పాపముతోనే జన్మించిరి. కనుక ప్రతి వారు పాపము కలిగియున్నారు. బలి అర్పణ లేకుండా మూలమున ఇశ్రాయేలీయులు పాప పరిహారముగా అర్పించబడిన బలి అర్పణను ఆయన అంగీకరించి కరుణా పీఠముపై వారిని దర్శించును.

ఏడవ నెల పదియవ దినమును అర్పణనిచ్చు దినముగా ఇశ్రాయేలీయులు నియమించునట్లుగా దేవుడు చేసెను. ఇశ్రాయేలీయులు ఒక సంవత్సర పాపముకు సరిపడునట్లుగా బలిపశువు ఆ అర్పణము యొక్క రక్తమును తనకు ఇచ్చునట్లుగా దేవుడు ప్రధాన యాజకుని నియమించెను. ఆ దినముననే సంవత్సరమంతటి ఇశ్రాయేలీయుల పాపాలన్నియూ పరిహారమొందెను. ఆ దినముననే ఇది ఎందుకనగా ప్రధాన యాజకుడు తమకు బదులుగా పాపపరిహారమును అర్పించెను.పాపులు తమ అయోగ్యతల విమోచన కొరకైన పాత నిబంధన బలి వ్యవస్థ


లేవీకాండము 1:4 చెప్పినట్లు అతడు దహనబలిగా పశువు తల మీద తన చేయి నుంచవలెను. అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగునట్లు అది అతని పక్షముగా అంగీకరించబడును. ఒక పాపి యొక్కపాపాన్ని బలిపశువు తలపై తన చేతులను ఉంచుట వలన విడువబడే మేకపై మోపబడును. దేవుడు అట్టి అర్పణను సంతోషముతో అంగీకరించును. అది తన దేవుడు నియమించిన బలివ్యవస్థలోని మొదటి ముఖ్యాంశము.

ఆ వ్యక్తి దాని మెడ కోసి, రక్తమును పిండి ఈ రక్తమును యాజకునికి ఇచ్చును. తరువాత యాజకుడు ఈ రక్తమును దహనబలిపీఠ కొమ్ములపై నుంచును. దాని మాంసమును బలిపీఠముపై దహించును. దానిని పాపుల యొక్క పాపముకైన బలి అర్పణగా దేవునికిచ్చెదరు. ప్రతి పాపి యొక్క పాపమును క్షమించుటకు దేవుడు నియమించిన రక్షణ ఆజ్ఞ.

అయినను ప్రాయశ్చిత్తం చేయగల బలిని అర్పించునట్లు తన ప్రజలను దేవుడు అనుమతించెను. ఆ దినమున ప్రధాన యాజకుడు ఇశ్రాయేలీయుల ప్రతినిధియై రెండు మేకలను సిద్ధపరచవలెను. ‘‘అప్పుడు అహరోను యెహోవా పేరిట ఒక చీటిని విడిచి పెట్టే మేక పేరిట చీటి పడునో ఆ మేక మీద రెండు చీట్లు వేయవలెను. ఏ మేక మీద యెహోవా పేరిట చీటి పడునో. ఆ మేకను అహరోను తీసుకొని వచ్చి పాపపరిహారార్థ బలిగా అర్పింపవలెను”. (లేవీకాండము 16:8-9) అతడు ఆ మొదటి మేక తలపై తన చేతులను ఉంచును కనుక ఇశ్రాయేలీయులందరి ఒక సంవత్సర పాపాన్ని దానిపై మోపబడెను. వాస్తవంగా దానిని చంపి అతడు ఆ రక్తమును పిండి, అతి పరిశుద్ధ స్థలములోనికి పోవలెను. తూర్పున నున్న కరుణా పీఠముపై ఆ రక్తమును తన వ్రేళ్ళతో జల్లును, కరుణాపీఠము యెదుట దానిని ఏడు మార్లు చిలకరించును. ఆ బలిఅర్పణ యొక్క రక్తమును అంగీకరించి, దేవుడు వారి పాపాలను కడిగి వారిని తన ప్రజలుగా గుర్తించును.

తరువాత ప్రత్యక్ష గుడారములో నుండి ప్రధాన యాజకుడు బయటికి వచ్చును. మరియొక మేకను ఇశ్రాయేలీయుల యెదుటికి వచ్చును. నిజముగా ఇశ్రాయేలీయుల పాపము మోపుటకై ఆ బలి అర్పణపై తన చెయ్యి ఉంచును అప్పుడతడు ఒప్పుకొనును. ‘‘నా ప్రజలు గత సంవత్సరం చేసిన పాపాలన్నింటిని ఈ అర్పణముపై మోపుచున్నాను.’’ దీనిని తరువాత తగిన వ్యక్తి ద్వారా ఆ పశువును ఎడారిలోకి తోలివేయును.

ఆ మేకను నిర్జల అరణ్యములోనికి మరణించునట్లు పంపబడు పూర్తిగా క్షయించబడుటకై ప్రాయశ్చిత్త దినము ఇవ్వబడెను. (లేవి. 16:20-22) ఈ విడిచిపెట్టు మేక యేసుక్రీస్తుకే సాదృశ్యమైనదిగా ఉన్నది. ఈ పాపపరిహారార్థ బలి బయలు పరచునది యేసుక్రీస్తు యోహాను ద్వారా బాప్తిస్మము పొంది ఈ లోకములో ప్రతివాని పాపమును తుడుచుటకై యేసుక్రీస్తు సిలువ వేయబడుట ద్వారా నేరవేర్చిన రక్షణ యొక్క సత్యమును బయలు పరచుచున్నది. ఆజ్ఞలను నెరవేర్చు అరణ్యమును ప్రధాన యాజకుని ద్వారా ఇశ్రాయేలీయులు అర్పించునప్పుడు దేవుడు వారిని కరుణా పీఠముపై కలిసికొందునని వాగ్ధానము చేసెను. ఇశ్రాయేలు ప్రజలు ప్రధాన యాజకుని కరుణాపీఠమును ప్రశస్తముగా పరిగణించిరి. ఎట్లనగా తమకు బదులుగా ప్రతి సంవత్సరము ప్రధాన యాజకుడే పాపపరిహారార్థ బలి అర్పించును. కరుణాపీఠము వద్దనే తమ తప్పిదము క్షమించబడెను. అలాగే యేసు మనలను దేవునితో సమాధానపరచెను. ఎట్లనగా తన బాప్తిస్మము మరియు కార్చిన రక్తము ద్వారా మన పాపము కొరకు శాశ్వతమైన బలిగా తన శరీరమును అర్పించెను. ఇందువలన మనము ప్రభువైన యేసుకు చాలినంతగా కృతజ్ఞతను చూపలేము. కనుకనే మనము ఆయన బాప్తిస్మమును ఆయన సిలువ త్యాగముతో పాటు నమ్మవలెను.మందసములో నుంచబడిన పది ఆజ్ఞలు కల రెండు పలకలను కరుణా పీఠము మూసివేసెను.


సీనాయి పర్వతము మీద దేవుడు మోషేకు ఆజ్ఞాపించెను. ఎట్లనగా పది ఆజ్ఞలే చెక్కబడిన రెండు రాతి పలకలను మందసములో ఉంచి మందసమును కరుణా పీఠముతో మూసివేయవలెను. దేవుడాలాగు చేసిన కారణమేదనగా ఆయన తన ప్రేమ యొక్క కరుణను ఇశ్రాయేలీయులపై క్రుమ్మరింప కోరెను. ఎట్లనగా వారు ఆజ్ఞలను అనుసరింపలేకపోయిరి. అనగా ప్రతి దినము పాపము చేయు ప్రజలతో దేవుడు పాపమునకు జీతము మరణమును తన న్యాయమైన ఆజ్ఞ ద్వారా నడిపించలేడు. కనుక ఇది కూడా ఇశ్రాయేలీయులకు పాపపరిహారమిచ్చునదే.

ఒక రకముగా ఇశ్రాయేలు ప్రజలు తమ క్రియలలో దేవుని ఆజ్ఞలను అనుసరించలేని బలహీనులు. కనుక దేవుడు వారికి ఆజ్ఞతోపాటుగా బలి వ్యవస్థ నిచ్చెను. అది బలి అర్పణ ద్వారా వారి పాపము కడుగబడునట్లు చేయుటకే, ఇశ్రాయేలీయులు పాపమును తుడుచుటకు, తమ పాపములను బలిపశువుపై మోపుటకు దానిపై చేతులుంచమని దాని మెడను వధించి తమ స్థానములో దానిని చంపమని దేవుడు వారిని కోరెను అని చూపుచున్నది. దేవుడు తన రక్షణ యొక్క ప్రేమ యొక్క ఆజ్ఞతో పాటు తన నీతిగల రోషము యొక్క ఆజ్ఞలను ఇశ్రాయేలీయులకు ఇచ్చెను. అలాగే దేవుని రక్షణ యొక్క రెండు ప్రధాన సత్యమును మనము నమ్మవలసి యున్నది. యోహాను నుండి మెసయ్య పొందిన బాప్తిస్మము మరియు ఆయన సిలువపై కార్చిన రక్తమును.

పాత నిబంధనలో పాపపరిహారార్థమునకైన బలిపశువు, క్రొత్త నిబంధనలో మెస్సయ్య యొక్క దేహమాయెను. లేఖనములో మన కొరకు ఇవ్వబడిన బలి అర్పణలు మన పాపమును తుడుచు దేవుని ప్రేమ యొక్క కృప అయివున్నవి. పూర్వము వలెనే ఇప్పుడు మన పాప పరిహారమునకు ప్రాయశ్చిత్తముకైన బలి పశువు ఖచ్చితముగా మనకు అవసరమే పాపాలను తుడిచివేయుటకైన దేవుని న్యాయము. ఆయన ప్రేమ కృప పూర్వకాలం నుండి ఉన్నవి.

మనలో పాపమున్న యెడల దేవుని నీతి మనకు తీర్పు తీర్చును కనుక మనము మన పాపమును పాపపరిహారార్థ అర్పణముపై మోపి వాటిని కడుగుకొనవలెను. కొరియాలో ఒక సామెత ఇట్లున్నది. ‘‘పాపమును ద్వేషించు కానీ పాపులను ద్వేషించకుము” మన పాపమును ద్వేషించెను కానీ మన ఆత్మలను ద్వేషించలేదు. దేవుడు మన ఆత్మ పాపమును తుడచుటకై మన చేతులను మనము బలి అర్పణపై నుంచి దాని రక్తమును ఓడ్చి దానిని దేవుని కివ్వవలసియున్నది. పాత నిబంధనలో దేవుడు ఇశ్రాయేలీయుల ప్రజలు పాప ప్రాయశ్చిత్తము చేసెననగా దేవుడు వారి బలి అర్పణమును అంగీకరించి వారి పాపములను క్షమించెనని అర్థం.

ఇశ్రాయేలీయులకై ఆజ్ఞలను చేయువాడు దేవుడే. యెహోవా, ఆయనే ఇశ్రాయేలీయుల ఎదుట తనను కనపరచుకొనెను. ఆయన తనంతట తానే ఉండును. మనము ఆజ్ఞ యొక్క నాయకుడని మనము దేవుని గుర్తించినట్లే. ఆయనే మనందరి దేవుడని మన పాపములను తుడుచుటకై బలి వ్యవస్థను ఆయన అంగీకరించెనని మనము గుర్తించవలెను. దేవుడు స్థాపించిన బలి వ్యవస్థ ద్వారా దేవుడు మనలను ఎంతగా ప్రేమించెనో. ఎంత రీతిగా ఆయన మనలను పాపము నుండి విమోచించెనో మనము తేలికగా గుర్తించగలము, దేవుని ఆజ్ఞ ద్వారా మనము ఆయన ఆజ్ఞలను ఎట్లు అనుసరించలేమో కూడా తేలికగా గుర్తించగలము. మనము పునాదిరీత్యా దేవుని యెదుట విగ్రహారాధికులము. అన్నిరకముల దోషములను. అపరాధములను చేయునట్టి వారము. కాబట్టి ఏ సమయములోనైనా మనము నరకపాత్రులమేనని ఒప్పుకొని తీరాలి. అందువలననే దేవుడు తానే మన యొద్దకు రక్షకునిగా వచ్చెను.

యేసుక్రీస్తు లోకపాపము కొరకు తన దేహమును శాశ్వతమైన బలిగా అర్పించెను. పాతనిబంధనలో పాప పరిహారార్థబలి అర్పించబడిన రీతిగానే ఆయన తనను తాను అర్పించుకొనెను. ప్రాముఖ్యముగా ప్రాయశ్చిత దినమున చూపబడినట్లుగానే బలిపశువుపై చెయ్యి నుంచుట ద్వారా దాని రక్తమును చిందించినట్లే మందసములో ఉన్న రెండు రాతి పలకలను, కరుణాపీఠమును తమ పాపపరహారమును పొందుట అను ఆయన వాగ్ధానమును విశ్వసించు వారికి అట్లు అనుగ్రహించెను. ఈ దినము దేవుని నీతిని చూపించు నట్టి ఆజ్ఞ. పాపము నుండి నిత్యరక్షణకు తెచ్చు ఆయన సత్యవాక్యము ఇశ్రాయేలీయులనే కాక మనందరమూ దేవుని కలుసుకొని నిత్యజీవమును పొంద అనుగ్రహించెను.

ఈ యుగములో జీవించుచున్న నీవు నేను మన దేవుని ఆయన బోధనను దేని ద్వారా ఆయన మనను పాప పరిహారము పొంద అనుగ్రహించెనో తెలిసికొని విశ్వసించాలి. పాత నిబంధన గ్రంథము యొక్క ప్రత్యక్ష గుడార ద్వారములో చూపబడిన నీలి ధూమ్ర రక్తవర్ణ దారము, పేనిన సన్నపు నార ద్వారా దేవుడు నిన్ను నన్ను పిలిచెను. మనను అంగీకరించెను. వీటిని నమ్ము విశ్వాసము నిచ్చెను.నీలి దారము సరిగ్గా యేసు పొందిన బాప్తిస్మమును పోలియున్నది.


మనము మత్తయి 3:13-17వైపు చుద్దాం. ‘‘ఆ సమయమున యోహానుచేత బాప్తిస్మము పొందుటకు యేసు గలిలయ నుండి యొర్ధాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చెను. అందుకు యోహాను నేను నీ చేత బాప్తిస్మము పొందవలసిన వాడనైయుండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా? అని ఆయనను నివారింపజూచెను గానీ యేసు ఇప్పటికి కానిమ్ము. నీతి యావత్తు ఈలాగు నెరవేర్చుట మనకు తగియున్నదని అతనికి ఉత్తరమిచ్చెను గనుక అతడాలాగు కానిచ్చెను. యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఆయనయందు నేనానందించుచున్నానని యొక శబ్ధము ఆకాశము నుండి వచ్చెను.’’

పాత నిబంధన గ్రంథము యొక్క బలి వ్యవస్థ ద్వారా అర్పింపబడువాటి ద్వారా తండ్రియైన దేవుడు, తాను లోకపాపాలన్నిటిని తన ఏకైకకుమారుడైన యేసుక్రీస్తుపై మోపెదనని నిజముగా చూపించెను. బాప్తిస్మమిచ్చు యోహాను యేసుకు బాప్తిస్మమిచ్చి నిజముగా దేవుని యొక్క నీతిని నెరవేర్చెను. యేసు యోహాను వలన బాప్తిస్మం పొందెను కనుక లోకపాపము ఆయనపై మోపబడెను. ఎవరైతే దీనిని నమ్ముతారో తమ హృదయ పాపాలన్నిటిని తొలగించుకొనగలుగుతారు.

యేసు పొందిన ఈ బాప్తిస్మము ప్రజలు క్రైస్తవులగుటకు ఆచారముగా తీసుకొను నీటి బాప్తిస్మము నుండి పూర్తిగా వేరైన అర్థము కలిగియున్నది. అనగా ఈ దినాలలో ప్రజలు తీసుకొను నీటి బాప్తిస్మము కేవలము వారు క్రైస్తవులైనారని తెలియచేయు బాహ్య గుర్తు మాత్రమే. యేసు యొర్ధాను నదిలో ఈలోక పాపములన్నీ మోయుటకై బాప్తిస్మమిచ్చు మానవ ప్రతినిధియైన యోహాను చేతులను ఉంచుట వలన బాప్తిస్మమును పొందెను. యేసు పొందిన ఆ బాప్తిస్మము శాశ్వతమైన రక్షణ దేవుడు లేవీకాండములో బలి వ్యవస్థ ద్వారా స్థాపించిన పాప పరిహారము యొక్క దేవుని ప్రమాణ నెరవేర్పు అయి వున్నది. యేసు వ్యక్తిగతముగా బాప్తిస్మము పొందుట ద్వారా లోకపాపములను తనపై మోపుకొని ఈ పాపము యొక్క జీతమును చెల్లించుటకై సిలువపై మరణమగునంతగా రక్తము కార్చినది. మానవులకైన దేవుని ప్రేమయు పాపమునకై సంపూర్ణ పరిహారమైయున్నది.

మనలను లోక పాపములన్నిటి నుండి విడిపించుటకే తండ్రియైన దేవుడు తన కుమారుని యోహాను వలన బాప్తిస్మం పొందునట్లు చేసెను. ‘‘ఇప్పటికి కానిమ్ము నీతి యావత్తు ఈలాగున నెరవేర్చుట మనకు తగియున్నది” (మత్తయి 3:15) ఈలాగున యేసు మనుష్యులందరి పాపమును బాప్తిస్మం పొందుట ద్వారా తనపై మోపుకొనుననిన అర్థము. ఎందుకనగా యేసుక్రీస్తు తన బాప్తిస్మముతో మన పాపమును వహించుకొనెను. మనకు బదులుగా ఆయన తన రక్తమును కార్చి చనిపోయెను. యేసుపొందిన బాప్తిస్మము దేవుని ప్రేమ యొక్క అర్పణము మరియు పాపపరిహారము మన పాపములన్నీ వహించుటకు ఆయన ఒప్పుకొనిన తరువాత ఆయన నీటిలో ముంచబడెను. నీటిలో ముంచబడుట ఆయన మరణమును సూచించును. ఆయన నీటి నుండి బయటకు వచ్చుట ఆయన పునరుత్థానమునకు సూచన.యేసు మన సృష్టికర్త మరియు దేవుడైయున్నాడు.


మన యొద్దకు వచ్చిన యేసుక్రీస్తు తానే దేవుడై. ఈ విశ్వమును దాని సమస్తమును సృజించెను. ఆదికాండం 1:1 చెప్పుచున్నది. ‘‘ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను” మరియు ఆదికాండం 1:3 చెప్పుచున్నది. ‘‘వెలుగు కమ్మనగా ఆ ప్రకారమాయెను.” యోహాను 1:3 కూడా చెప్పెను. ‘‘సమస్తమును ఆయన మూలముగా కలిగెను. ఆయన లేకుండా ఏదియు కలిగియుండలేదు.’’ యేసుక్రీస్తు నిజముగా ఈ విశ్వమంతటిని తండ్రియైన దేవుడు మరియు పరిశుద్ధాత్మతో చేసెను.

ఫిలిప్పీ 2:5-8 చెప్పుచున్నది. క్రీస్తుయేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగియుండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగినవాడైయుండి, దేవునితో సమానముగా నుండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గానీ మనుష్యుల పోలికగా పుట్టి, దాసుని స్వరూపమును ధరించుకొని, తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యునిగా కనబడి మరణము పొందునంతగా అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడై తన్ను తాను తగ్గించుకొనెను.” ఆయనే ఈ లోకమును సృజించినవాడు. మానవులమైన మనలను సృజించెను. మనలను పాపము నుండి విడిపించుటకు ఈ ప్రభువే మన యొద్దకు మనుష్యునిగా వచ్చెను. యోహాను చేత బాప్తిస్మం పొందుట ద్వారా ఆయన లోకపాపమును తనపై మోపుకొనెను. తన బాప్తిస్మ కారణముగానే తన రక్తమును చిందించెను. దాని వలన పాపాలన్నిటి నుండి మనలను రక్షించెను.

వాస్తవముగా యేసయ్య ప్రత్యక్ష గుడార తలుపులన్నియు నీలి, ధూమ్ర, రక్తవర్ణ దారము మరియు పేనిన సన్నపు నారతో చేయునట్లు ఇశ్రాయేలీయులను చేసెను. ప్రత్యక్ష గుడార తలుపులకు నీల, ధూమ్ర, రక్తవర్ణమును ఉపయోగించునట్లు చేసిన ఆయనే మానవులందరి పాపము నుండి వారిని రక్షించుటకు ఆయనకు గల ఆలోచనలను బయలుపరచెను. యోహాను నుండి యేసు బాప్తిస్మం పొందుటతో లోకపాపమును ఆయనపై మోపుకొనెను. వాటి జీతమును చెల్లించుటకై సిలువలో రక్తమును కార్చెను.

పాత నిబంధనలో పాపులు తమ బలి అర్పణను ప్రత్యక్ష గుడారమునకు తెచ్చి దహన బలిపీఠము ఎదుట దాని తలపై చేతులుంచుట ద్వారా తమ పాపాలను దానిపై మోపిరి. అతడు తరువాత దాని తలను నరికి, దాని రక్తమును పిండి, ఆ రక్తమును యాజకునికి ఇచ్చెదరు. ఆ యాజకుడు ఈ రక్తమును దహన బలిపీఠము నాలుగు కొమ్మలకు వ్రాయుట వలన దేవునికి అర్పించెదరు. అట్లే మిగిలినిదానిని నేలపై పోయుదురు.

ప్రాయశ్చిత్త దినమున ప్రధాన యాజకుడు దేని తలపై తన చేతులు ఉంచునో దాని రక్తమును తీసికొని అతి పరిశుద్ధ స్థలములోనికి వచ్చి దానిని కరుణా పీఠముపై చిలకరించును. దేవుడు ఈ బలి అర్పణను తన ప్రజలకైన ఘోర న్యాయ తీర్పుగా పరిగణించును. ఆ బలిపశువు ఎందువలన చంపబడెను? ఎందుకనగా అది ప్రధాన యాజకుడు చెయ్యి ఉంచుట ద్వారా ఇశ్రాయేలీయుల పాపమును వహించెను. దాని రక్తము అనగా అది చెయ్యి ఉంచుట యొక్క ఫలితము కనుక దేవుడు బలిపశువు యొక్క రక్తమును అంగీకరించెను. బలిపీఠముపై దహించబడిన దాని మాంసము యొక్క కమ్మని సువాసనను అఘ్రాణించెను. దాని వలన ఇశ్రాయేలీయుల పాపాలను క్షమించెను.

క్రొత్త నిబంధన కాలములో కూడా ఈ విధముగా చేయుటకే యేసు వచ్చెను మన పాపములు వహించుటకు పాప శిక్ష భరించుటకు మన ప్రభువు కన్య మరియ శరీరము ద్వారా ఈ లోకమునకు వచ్చెను. యోహాను వలన బాప్తిస్మం పొంది సిలువపై తన రక్తమును కార్చి రక్షణ నెరవేర్చెను. నీలి, ధూమ్ర, రక్తవర్ణ దారములు వాస్తవముగా యేసు తాను దేవుడై యుండియు బాప్తిస్మం పొంది సిలువ వేయబడెనను సత్యమును బయలుపరచుచున్నది.

యేసు మన పాపములను తాను పొందిన బాప్తిస్మంతో వహించెను. ఆయన సిలువ వేయబడెను. తన రక్తమంతా కార్చి చనిపోయెను. మూడు దినములలో మృతినుండి లేచెను. దాని వలన విశ్వసించు మనకు రక్షకుడైన దేవుని సింహాసనమును కుడి పార్శ్వమందు కూర్చుండెను. నిజముగా తన యందు విశ్వాసముంచు వారిని యేసుక్రీస్తు తనను వారి రక్షకుడని దేవునిని అబ్బా తండ్రి అని పిలుచుటకు పాపము పరిహారమును తండ్రియైన దేవుని యెదుట ఒకేసారి పొందుటకు అనుమతించెను. నీలి, ధూమ్ర రక్తవర్ణ దారము యందు దాగి ఉన్న సత్యమదియే.

తన బాప్తిస్మము మరియు సిలువ రక్తము ద్వారా, మెస్సయ్య మన పాపశుద్ధీకరణ నెరవేర్చెను. మనకు బదులుగా పాపశిక్షను భరించెను. ఇప్పుడు ఆయన లోక రక్షకుడాయెను. అటువలె పాత నిబంధనలోని ప్రత్యక్ష గుడారపు తలుపు నీలి, ధూమ్ర, రక్తవర్ణదారము పేనిన సన్నపు నారపై అల్లుట వలన చేయబడెనని నమ్మాలి. క్రొత్త నిబంధనలో మన రక్షకుడు మెస్సయ్య నిజముగా ఈ లోకమునకు వచ్చి తన బాప్తిస్మము ద్వారా లోక పాపాలను తనపై మోపుకొని, సిలువపై పాపశిక్ష అంతటిని భరించెను. అందువలన మన పాప పరిహారమును మనము, తప్పక పొందాలి.క్రైస్తవునిగా నీవు ఆయన వాక్యమునకు ఎంత శ్రద్ధ చూపుచున్నావు?


నిర్గమ 25:22 చెప్పెను ‘‘అక్కడ నేను నిన్ను కలిసికొని కరుణాపీఠము మీద నుండియు శాసనములు గల మందసము మీద నుండియు నేను ఇశ్రాయేలీయుల నిమిత్తము మీకాజ్ఞాపించు సమస్తమును తెలియచెప్పెదను? ఆయన ప్రాయశ్చిత్త సువార్తయైన నీరు మరియు ఆత్మమూలమైన సువార్తకు నీవు ఎంత దగ్గరగా నున్నావు? యేసు తమ రక్షకుడని నమ్మిన మీతో ప్రభువు ఎక్కడ నుండి మాట్లాడునని ఆయన మీతో చెప్పెను? నిర్గమ 25:22లో మందసపు మూతపై నుండి మీకు తన ఆజ్ఞనిచ్చెదని ఆయన చెప్పెను. పాత నిబంధనలో ఇశ్రాయేలీయులకు కరుణాపీఠము నుండి వారికి సమస్తమును ఆజ్ఞాపించెదనని దేవుడు చెప్పెను.

ఆజ్ఞానుసారముకైన బలి అర్పణము ద్వారా నీకు పాప పరిహారమిచ్చిన తరువాత ఆయన నిన్ను తన ప్రజలుగా చేయుటకై ఆయన నిన్ను నడిపించుననునది దేవుని ప్రణాళిక అని నీవు గుర్తించవలెను. క్రైస్తవులైన మీరు ప్రభువు వలన నడిపించబడుటకు ఎంత ప్రయత్నించినను, నీవు నీరు మరియు ఆత్మమూలమైన సువార్తయొక్క సత్యమును తెలిసికొనకయే యేసును నమ్మినచో ఆయన నిన్ను నడిపించలేనని దేవుడు మనతో చెప్పుచున్నాడు. అటువలె నీవు నిజముగా ప్రభువు నడిపింపును కోరినయెడల నీవు నీ పాపములన్నిటిని ఒకేసారిగా పరిహరించిన పాపక్షమాపణ యొక్క సత్యమును మొదట తెలిసికొని తప్పక అంగీకరించిన అప్పుడు ఆయన నడిపింపు కొరకు కనిపెట్టవలెను.

నేను నీకు ఒక విషయం చెప్పదలిచాను. మీరు దేవుని పిల్లలుగా ఉండాలని కోరినట్లయితే మీరు ఆయన సంఘములో భాగస్థులవ్వాలంటే మొదట మీరు నీలి ధూమ్ర రక్తవర్ణ దారము మర్మమైన నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను తప్పక విశ్వసించి మీ పాప పరిహారమును పొందాలి. ఆ తరువాతనే మీరు ప్రభువు మందసము పై నుండి మీకాజ్ఞాపించిన ఆజ్ఞలను పొందుకొనగలరు.

పాప పరిహారము పొందుటకు అనుమతించిన నీరు మరియు ఆత్మమూలమైన సువార్తయందు మన విశ్వాసమును ఉంచి ఎల్లప్పుడూ ఆయనలో జీవించాలని ఆ ప్రభువు మనలను ఆజ్ఞాపించెను. కరుణా పీఠముపై నుండి ప్రభువు నీకిచ్చిన ఆజ్ఞలను నీవు అనుసరించుచున్నావా? లేదా నీ స్వంత భావాలపై ఆధారపడి ప్రభువును వెంబడిస్తున్నావా? 

నీ స్వంత భావాలు, ఉద్రేకము నీ విశ్వాసమును కట్టలేవు. కానీ కేవలము నిన్ను చంచల పరచును మందసముపై నుండి మాట్లాడిన దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించాలని నీవు కోరుచున్నయెడల ప్రత్యక్ష గుడారములో చెప్పినట్లుగా ఆ నీలి, ధూమ్ర, రక్తవర్ణ దారము మరియు పేనిన సన్నపు నార దేవుడు మనకిచ్చిన పాప పరిహారముని నీవు తప్పక గుర్తించి విశ్వసించాలి.

హల్లెలూయ! నేను ప్రభువు యొక్క బాప్తిస్మమును ఆయన సిలువ రక్తమును మనలను లోకపాపము నుండి రక్షించిన ఆయన శక్తిని, ప్రేమను బట్టి ఆయనకు కృతజ్ఞతలు తెలుపుచున్నాను.