Sermons

[11-18] < నిర్గమ 37:10-16 > సన్నిధి రొట్టెల బల్ల< నిర్గమ 37:10-16 >

“మరియు అతడు తుమ్మకర్రతో బల్లను చేసెను. దాని పొడుగు రెండు మూరలు దాని వెడల్పు మూరెడు దాని యెత్తు మూరెడునర అతడు దానికి మేలిమి బంగారు రేకు పొదిగించి దానికి చుట్టూ బంగారు జవను చేసెను. దానికి చుట్టూ బెత్తుడు బద్దె చేసి దాని బిద్దెపైని చుట్టూ బంగారు జవాను చేసెను. దానికి నాలుగు బంగారు ఉంగరములను పోతపోసి దాని నాలుగు కాళ్ళకుండిన నాలుగు మూలలయందు ఆ ఉంగరములను వేసెను. బల్లను మోయుటకు మోతకర్రలుండు ఆ ఉంగరములు దాని బద్దెకు సమీపముగా ఉండెను. బల్లను మోయుటకు తుమ్మకర్రతో మోతకర్రలను చేసి వాటికి బంగారు రేకులు పొదిగించెను. మరియు అతడు బల్ల మీద నుండు దాని ఉపకరణములను, అనగా దాని గంగాళములను దాని ధూప కలశములను దాని గిన్నెలను, తర్పణము చేయుటకు దాని పాత్రలను మేలిమి బంగారుతో చేసెను.’’మన హృదయములో ఒక బద్దెను ఉంచుటచే జీవాహారమును తినువారముగా తప్పక మనము మారవలెను.


ప్రత్యక్ష గుడారములో ఉన్న ఉపకరణములలో సన్నిధి రొట్టెల నుంచు బల్ల ఒకటి. తుమ్మకర్రతో చేయబడినది. బంగారు రేకుతో పొదిగింపబడినది. రెండు మూరలు (90సెం.మీ) పొడుగు ఒకటిన్నర మూరల (67.5సెం.మీ) ఎత్తు ఒక మూర (45 సెం.మీ) వెడల్పును కలిగియున్నది. మరియు ఆ రొట్టెలను యాజకులు మాత్రమే తినవలెను. (లేవీకాండము 24:5-9)

సన్నిధిరొట్టల బల్ల వద్ద ఉన్నవేవనగా దాని చుట్టూ బెత్తెడు వెడల్పున్న బద్దె కలదు బద్దె చుట్టూ బంగారు జవ ఉంచబడెను. నాలుగు బంగారు ఉంగరములు నాలుగు మూలలు ఉండెను. ఈ ఉంగరములలో బంగారముతో తాపడము చేయబడిన మోతకర్రలున్నవి. అవి బల్లను మోయుటకు ఉపయోగము బల్ల మీద నుండు దాని ఉపకరణములు దాని గంగాళము దాని ధూపకలశము, గిన్నె తర్పణము చేయు పాత్రలు బంగారముతో చేయబడినవి.

నిర్గమ 37:11-12 గ్రంథస్తమైనది. ‘‘అతడు దానికి మేలిమి బంగారు రేకు పొదిగించి దానికి చుట్టూ బంగారు జవను చేసేను. దేవుని గృహము యొక్క పరిశుద్ధ స్థలములోనున్న సన్నిధి రొట్టెలుంచు ఆ బళ్ళకున్న బద్దె బెత్తెడందుకు ఆజ్ఞాపించెను? ఈ బెత్తెడు బద్ద 10సెం.మీ వరకు సాగియుండును. ఎందుకనగా బల్ల నుండి రొట్టెలు క్రింద పడకుండునట్లు.

సన్నిధి బల్ల యొక్క రొట్టెలను యాజకులు మాత్రమే తినవలెనని యుండగా మనము కూడా ఆత్మీయముగా ఈ రొట్టెలను తినగలవారము కావలెను. యేసుక్రీస్తు పొందిన బాప్తిస్మమును ఆయన రక్తమును నమ్మి నిత్యజీవమును పొంది పాపము నుండి రక్షింపబడిన వారే అనగా నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను రక్షణగా నమ్మువారు మాత్రమే ఈ రొట్టెలను తినగలరు.

బెత్తడంత ఎత్తుగల బద్దె ప్రత్యక్షగుడారము యొక్క సన్నిధి రొట్టెల బల్ల చుట్టూ ప్రత్యేకముగా ఉంచబడిన కారణము. అది ఆ రొట్టెలు జారి క్రింద పడకుండుటకే మరియు ప్రతి సబ్బాతును, తాజాగా చేసిన వేడి రొట్టెలు ఆ బల్లపై నుంచబడును. సన్నిధి రొట్టెల బల్ల చుట్టూనుంచబడిన బెత్తెడు బద్దెపై మన ప్రత్యేక ధ్యానమునుంచవలెను. మరియు ఆ బద్దె చుట్టూ బంగారు జవ ఉంచబడెను.

సన్నిధి రొట్టెలుంచు బల్ల మనకు బోధించునదేమనగా మనకు రక్షణను తెచ్చు సత్య వాక్యమును మన హృదయాలలో ఉంచుకోవాలి. దాని వలన నిత్యజీవమును పొందాలి. ప్రత్యక్ష గుడార ద్వారము యొక్క తెరకు ఉపయోగించబడిన నీలి, ధూమ్ర రక్తవర్ణము పేనిన సన్నపు నార దారములో నున్న ఆత్మీయ విశ్వాసమును మనం పొందుకొనగలం. ఎట్లనగా యేసుక్రీస్తు బాప్తిస్మమును, ఆయన రక్తమును విశ్వసించినప్పుడే. ఈ ప్రకటన ద్వారా మనకు బోధపడునదేమనగా నీలి, ధూమ్ర, రక్తవర్ణము గల పేనిన సన్నపునార యొక్క దారములో బయలుపరచబడిన ఈ సత్యమును నమ్మువారే దేవుని బిడ్డలగుదురు.

యేసుని జీవాహారమును వెదకు మనమంతా నీలి, ధూమ్ర, రక్తవర్ణ దారములు మరియు పేనిన సన్నపునారలో బయలుపరచబడిన నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను నమ్ము విశ్వాసముతో ఉండాలి. ఎందుకనగా దీనిలో మనకు నమ్మకము లేని యెడల దేవుడు మనకు ఏమీ చేయలేడు. నీరు మరియు ఆత్మమూలమైన సువార్తయే నిజ సువార్త అని మనము తప్పక విశ్వసించాలి. రక్షణ వాక్యము మనలో నుండి జారిపోకుండునట్లు మన హృదయంలో విశ్వాసము యొక్క ఫలకమును ఎత్తుమని దేవుడు క్లుప్తముగా చెప్పుచున్నాడు.

ఈ నీరు మరియు ఆత్మమూలమైన సువార్త ఆది సంఘము నుండి మనకు అందించబడియున్నది. ఆది సంఘ కాలము నుండి ఈ దినము వరకు ఈ సువార్తను విశ్వసించు వారి పాపాలను దేవుడు కడిగి వేసెను. పూర్వము వలెనే నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను విశ్వసించువారి యొక్క ఆత్మలను దేవుడు రక్షించును. ప్రత్యక్ష గుడారపు ద్వారములో బయలుపరచబడిన సత్యమును విశ్వసించుట ద్వారా రక్షింపబడిన మనమందరమూ మన హృదయములలో ఆత్మీయముగా ఒక ద్వారమును ఎత్తునట్లుగా దేవుడు చేసెను.

ప్రభువు అనుగ్రహించిన నీరు మరియు ఆత్మమూలమైన సువార్తలో మనకున్న విశ్వాసము నుండి మనము నిత్యజీవమును పొందితిమి. మరియు ఈ సువార్త సత్యముతో మనము ఇతరులతో జీవాహారమును పంచుకొనగలము. మరియు మనము దేవుని నీతిక్రియలను ప్రకటించవలెను. మనము నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను మనం నమ్మిననూ, సమయమును గడుపుచూ ఈ సువార్త సత్యమును గట్టిగా పట్టుకొనలేక పోయిన మనము పొగొట్టుకొనునది మన జీవితమునే అలాగుననే మనము విశ్వాస దారమును మన హృదయములలో నిలుపుకొనుచూ నీరు మరియు ఆత్మమూలమైన సువార్తలో విశ్వాసముతో నాటుకొనవలెను.నీలి ధూమ్ర రక్తవర్ణ దారములలో ఉన్న సువార్తలోనున్న విశ్వాసము మన హృదయములోనే ఉంచుకొనవలెను.


తప్పక ప్రజలకు ఈ సువార్తలో అవిశ్వాసమున్నచో వారు తమ పాపము నుండి రక్షింపబడలేరు. తాము రక్షింపబడినామని తమంత తాము నమ్ముచున్ననూ ఇప్పటికి నీలి, ధూమ్ర, రక్తవర్ణదారములో బయలుపరచబడిన నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను వారి హృదయము విశ్వసించక దానికి కట్టుబడక ఉన్నట్లయితే వారికి ఉన్న విశ్వాసము సంపూర్ణమైనది కాదు.

నీరు మరియు ఆత్మమూలమైన సువార్త యొక్క సత్యమును విశ్వసించనట్లయిన అది ప్రభువును వదిలిన పాపముతో సమానము. ఆ జీవాహారము మనము కలిగియుండవలసినది కాక అది మన నోటిలో పెట్టుకొని దానిని నమిలి దాని సత్యమును స్వంతం చేసుకోవాలి. మనము దేవుని వాక్యమును నమ్మకుండా దానినే మన హృదయంలో ఉంచుకొననట్లయితే అప్పుడు ఈ సువార్త యొక్క సత్యము అప్పుడే మన హృదయములో నుండి మాయమగును.

నీవు పాపము నుండి ఇప్పటికే రక్షింపబడిననూ అట్టి ప్రశస్తమైన రక్షణను పోగొట్టుకొనుట ఎట్లు సాధ్యమో అని నీవు ఆశ్చర్యపోవచ్చును. కానీ దురదృష్టంగా దేవుని వాక్యమునకు అంటుకట్టబడక మొదట ఈ సత్యమును సంతోషముతో అంగీకరించిననూ, వారు సత్యసువార్తలో విశ్వాసమునందు నాటబడనందున వారు మరణమగుదురు.

ఈ విషయమును గూర్చి యేసు ‘‘విత్తువాని గూర్చిన ఉపనమానము” (మత్తయి 13:3-9, 18-23) ద్వారా హృదయము యొక్క నాలుగు భిన్న ప్రవృత్తుల గురించి చెప్పెను. ఈ ఉపమానములో దేవుని సత్యము యొక్క విత్తనము నాలుగు రకాల భూముల యొక్క మానవ హృదయములో నాటబడనట్లుగా ఉన్నది. మొదటిది త్రోవ ప్రక్కను, ఆ రెండవది రాతి నేలను, మూడవది ముళ్ళపొదల్లోను, నాల్గవది మంచినేలను ఉండెను. వీటిలో మొదటి మూడు నేలలో పడిన విత్తనములు ఫలించలేదు. నాల్గవదిగా నేలపై పడినవి మాత్రమే మంచి నేలైనందున ఫలించినవి. దీని భావమేమనగా ప్రజలు ఒకసారి నీరు మరియు ఆత్మమూలమైన సువార్తన రక్షణ యొక్క నిజ సువార్తను విని ఆమోదించిననూ వారు మధ్యలోనే తమ రక్షణను కోల్పోవుదురు. అలాగే మన హృదయమనే నేల సరియైనది కానప్పుడు ప్రభువుమనకిచ్చిన రక్షణను కోల్పోవుట సాధ్యమేనని మనం గుర్తించవలెను.

నీలి, ధూమ్ర, రక్తవర్ణదారముల నుండి కలిగిన రక్షణను మన హృదయములో నమ్మిన యెడల అప్పుడు మన హృదయ నేల మంచిదైయుండును. కాని కొన్ని సమయాలలో తమ అయోగ్యతలను బట్టి తమ విశ్వాసమును కాపాడుకొనలేక రక్షణను కొందరు పొగొట్టుకొనుటకు కారణము దేవుని వాక్యమందు తమ విశ్వాసము లోతుగా లేకపోవుటయే. ఇందువలనే మనం దేవుని సంఘములో ఉండాలి. ప్రతిదినం జీవాహారము భుజించాలి. మరియు విశ్వాసంలో వెలగాలి. నీలి, ధూమ్ర, రక్తవర్ణదారములో బయలుపరచబడిన సత్యముతో మన విశ్వాసం ఎదుగునట్లుగా దేవుడు మనలను పెంచుచున్నాడు.

మనం పొందిన పాపక్షమాపణకు మనము తప్పక ప్రతిదినం బద్ధులమై ఉండాలి. మన హృదయాలలో కనబడవలసిన ఆ సత్యము నీలి, ధూమ్ర, రక్తవర్ణ దారము మరియు పేనిన సన్నపునారలో బయలుపరచబడిన నీరు మరియు ఆత్మమూలమైన సువార్త యొక్క రక్షణయే. ఈ రక్షణ యొక్క సత్యము పాపక్షమాపణ పొందిన వారి హృదయాలలో ఉన్నది. ఈ సత్యసువార్తయైన నీరు మరియు ఆత్మమూలమైన సువార్తలో మనకున్న విశ్వాసమును నూతన పరచుకొనుటతో దినము వెంబడి దినము మనము దేవుని పిల్లలముగా జీవించగలము.

అలాగే నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను నమ్మువారు కూడా నీలి, ధూమ్ర రక్తవర్ణదారము మరియు పేనిన సన్నపునారలో బయలుపరచబడిన దేవుని నీతి యొక్క సువార్తపై అనుదినము నాటబడాలి. మరియు వారి విశ్వాసాన్ని రోజు దృఢపరచుకోవాలి ఎందుకు? మనము నీరు మరియు ఆత్మమూలమైన సువార్తలో ఎల్లప్పుడు స్థిరముగా నిలిచి, దానిని ధృఢపరచని యెడల మనము దానిని ఎల్లప్పుడైననూ కోల్పోవచ్చు. హెబ్రీ పత్రిక రచయిత యూదా డయాస్పోరాతో ఇట్లు చెప్పెను. ‘‘కావున మనము వినన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొనిపోకుండునట్లు వాటియందు మరి విశేష జాగ్రత్త కలిగియుండవలెను.’’ (హెబ్రి 2:1)

ఈ దినాల్లో నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను తెలిసికొన్న వారిలో కూడా సమయం గడిచే కొద్ది అనేకులలో సువార్తయందలి వారి విశ్వాసము సన్నగిల్లుచున్నది. ఎందుచేతననగా వారు అప్పటికే నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను విశ్వసించిననూ, పరిశుద్ధ స్థలములో జీవాహారము నిరంతరం భుజించలేదు. మరియు వారి హృదయాలు నిజ విశ్వాసముతో రూపుదిద్దుకొనలేదు.

ఈ లోకములో సాతాను సేవకులు అనేకులు పాడైన ఆహారమును పెట్టుచూ పరిశుద్ధులను చంప ప్రయత్నించుచున్నారు. అనగా వారి స్వంత శరీరానుసార బోధలను బోధించుచున్నారని చెప్పవచ్చు. దేవుని సంఘములోనికి తప్పుడు బోధనలను అనుమతించిన యెడల సత్యము అబద్ధముతో కలిసిపోవును విశ్వాసులను ప్రభువు అంగీకరించలేని వారినిగా చేయును. అట్టివారు సత్యము తెలిసిననూ విశ్వాసము ఉంచరు. ఎందుకనగా వారి విశ్వాస గుమ్మమును పైకెత్తుటలో తప్పిపోయిరి. కనుక పాపము నుండి పూర్తిగా తమను రక్షించుకొనలేని వారిగా ముగించెదరు. సామెత 22:28 చెప్పుచున్నట్లు ‘‘నీ పితరులు వేసిన పురాతనమైన పొలిమేర రాతిని నీవు తీసివేయకూడదు.’’

కనుక మనకు ప్రాముఖ్యమైనది ఏమనగా మన విశ్వాసము యొక్క పొలిమేర రాతిని తీసివేయకూడదు. మన నిజ విశ్వాసమునకై ఒక స్పష్టమైన సరిహద్దు మనకు ఉండవలెను మరియు మన ప్రభువు రాకడ వరకు దానిన కాపాడుకొనవలెను. అప్పుడు మాత్రమే మనము ఎల్లప్పుడూ జీవాహారమును భుజింపగలము. అప్పుడే ప్రభువు మన హృదయాలలో నివసించును. మరియు అప్పుడే మనము నిత్యజీవమును పొందగలము దేవుడు మనకు ఎంత ఆహారమిచ్చిననూ, దాని ప్రాధాన్యమును మనము ఒప్పుకొనలేక దానిని మన హృదయములో నిలుపుకొనలేకపోయిన లేదా మన హృదయ గుమ్మమును తొలగించి జీవాహారమును బల్లపైనుండి పడునట్లు చేసినచో మనము చెరుపుచేయు పిల్లలమై తప్పిపోవుదుము.

మనలో కొందరు క్రొత్తగా క్షమాపణ పొందియుంటారు. కాగా కొందరు నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను విని పాపక్షమాపణ పొంది కొన్ని దశాబ్ధాలై ఉండును. మనము ప్రతి దినము నీరు మరియు ఆత్మమూలమైన సువార్త యొక్క వాక్యమును గూర్చి వినుచున్ననూ మనలో కొందరు నీరు మరియు ఆత్మమూలమైన సువార్త చెప్పుచున్న ‘నీరు’ అను మాట వినగానే అలసిపోవచ్చును కానీ మనము జీవాహారమును తినుట కొనసాగించవలెను ? ప్రభువు రాకడ దినము వరకు.

మీలో కొందరు నేను నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను ఎల్లప్పుడూ బోధించుచునే ఉన్నానని చెప్పవచ్చును. కానీ నేను ఈ మార్గములో ఎందుకు బోధించవలసి వచ్చినదో గుర్తించవలెను. ఎందుకనగా మన విశ్వాసము మరింత బలపడి నీరు మరియు ఆత్మమూలమైన సువార్తలో ఎదుగుచున్నట్లయిన మనము దేవుని జత పనివారము కాగలము. మనము ఈ యుగములోని ఆత్మలకు నమ్మకమైన వారిగానూ నిజకాపరులు పాత్రను తప్పక పోషించవలసిన వారమైయున్నాము. తిరిగి జన్మించిన ఆత్మలను కూడా ఈ నిజ సువార్తయైన నీరు మరియు ఆత్మమూలమైన సువార్త జీవాహారమును విశ్వాసము యొక్క నిజ ఆహారమునైయున్నది. అలాగే ఈ ఆహారమును మనము ప్రతిదినము భుజించాలి. ఇంతేకాక దానిని మనము ఒక్కరమే తినుట కాదు కానీ దానిని మనము ప్రతిదినమూ ఇతరులతో పంచుకొనవలెను. అప్పుడు వారు కూడా పాప పరిహారమును పొందగలరు.

నీతిమంతులకు ఆహారమేదనగా నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను ప్రపంచమంతా వ్యాప్తి చేయుట మరియు చీకటి శక్తి నుండి వారిని విడిపించి ఆయన ప్రేమ యొక్క కుమారుని రాజ్యములోనికి వారిని పంపించాలి. (యోహాను 4:34, కొలస్సీ 1:13). నీరు మరియు ఆత్మమూలమైన సువార్త యొక్క ఆహారమును మనము నిర్లక్ష్యము చేసినచో మనము ఎరుగకనే వ్యాధి బారినపడి చనిపోయెదము. ఆయా సమయాలలో మన శరీర బలహీనతలను బట్టి నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను గట్టిగా పట్టుకున్నచో సువార్త వాస్తవముగా మన ఆత్మల కొరకు అవకాశము యొక్క తలుపు తెరచి మరింత బలమిచ్చును.

ఈ సత్య సువార్తను విని దీనిలో మనము నాటబడిన యెడల మనము ఎంత ఎక్కువగావింటే అంతగా మన ఆత్మలు బలపరచబడును. మన విశ్వాసము అంతగా బలపడును మరియు మన హృదయాలు అధిక బలమును పుంజుకొనుట మనము చూస్తాము. మనము నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను ప్రతి దినము విని ఈ సువార్తయందున్న మన విశ్వాసమును బలపరచుకొని, అభివృద్ధి పొందవలెను. దేవుడు చెప్పుచున్నట్లు ‘‘వెండిలోని మష్టు తీసివేసిన యెడల పుటము వేయువాడు పాత్రయొకటి సిద్ధపరచును.’’ (సామెతు 25:4) మన విశ్వాసమును పదును పెట్టుకొనవలెను. అనగా నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను వింటూ ఉండాలి. దానికై మన హృదయంలో కృతజ్ఞత కలిగి ఉండాలి. దినదినము దానిపై ఎదుగుచుండవలెను. ఎందుకనగా నీరు మరియు ఆత్మమూలమైన సువార్త జీవాహారము కనుక మనను జీవింప చేయును. పరలోక ప్రార్థనలో యేసు చెప్పినట్లు ‘‘మా అనుదిన ఆహారము మాకు దయచేయుము”. వాస్తవముగా ప్రభువు నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను మనకు ఇచ్చెను. అందువలననే మనము ఈ విధముగా ప్రార్థించవలెనని ఆయన చెప్పెను.

దేవుడు అనుగ్రహించిన పాపక్షమాపణ యొక్క రక్షణ వచ్చినప్పుడు మనము పాపము నుండి విడిపింపబడక పూర్వము మన విశ్వాసము ఎట్లున్నది అను దానిని స్పష్టముగా తెలిసికొనవలెను. ‘‘నేను ఈ సత్యమును ఎరుగక మునుపు నేను పాపము నుండి విడిపింపబడలేదు.’’ ఆ సమయములో మనము యేసును విశ్వసించిననూ మనము పాపము నుండి రక్షింపబడియుండలేదని స్పష్టముగా ఒప్పుకొనవలసియున్నది. ఆ సమయములో నేను పూర్తిగా రక్షింపబడలేదు కానీ నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను వినుచుండగా సరైన సమయములోనే దానిని నేను నా హృదయంలో విశ్వసించాను.

పూర్వము యేసే నా రక్షకుడని నేను విశ్వసించినప్పటికీ అప్పటి వరకు నా రక్షణ పరిపూర్ణం కాలేదు. కానీ ఇప్పుడు నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను వినుట వలన నేను నిజముగా రక్షింపబడితిని. ‘‘ఇప్పుడు నేను నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను నిజముగా నమ్మితిని మరియు దానిని వాస్తవంగా నమ్మితిని.’’ ప్రభువు పాపము నుండి తన బాప్తిస్మము మరియు సిలువ రక్తముతో పూర్తిగా నిన్ను రక్షించెనని నీవు గుర్తించి విశ్వసించనప్పుడు మాత్రమే పరలోకము నుండి నిజరక్షణ యొక్క బహుమానము నీపై దిగును. సత్యమును నమ్ము ఈ విశ్వాసము నిన్ను రక్షించు నిజ విశ్వాసమైయున్నది.

బైబిలులో చూపబడిన నీరు మరియు ఆత్మమూలమైన సువార్త మనకు ఇంతకు పూర్వమున్న విశ్వాసమునకు భిన్నమైనది. మనము కేవలము నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను మాత్రమే విశ్వసించి ఆ సమయంలో నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను విస్మరించాము. కేవలము సిలువను విశ్వసించుట మరియు నీరు మరియు ఆత్మమూలమైన సువార్తయందు విశ్వాసము ఒకేవిధముగా కనిపించిననూ అంతమున అవి రెండు పూర్తిగా విరుద్ధమైనవి. నీవు ఈ నీరు మరియు ఆత్మమూలమైన సువార్త విశ్వసించక ముందు సిలువను మాత్రమే నీవు విశ్వసించలేదా? అప్పుడు నీ పాపములన్నీ క్షమించబడినవా? కాకపోవచ్చును. నీవు కేవలము యేసు సిలువ రక్తమునే విశ్వసించినప్పుడు నీ హృదయంలో ఇంకనూ నీవు నిజముగా పాపమును కలిగియున్నావు. నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను విశ్వాసమునకు కేవలము సిలువ రక్తమును నమ్ముకొనుటయందు విశ్వాసమునకు గల బేధము ఇది మాత్రమే.

స్పష్టమైన తేడా ఏదనగా కేవలము సిలువ రక్తములోనే విశ్వాసమునుంచువారు రక్షింపబడరు కాగా నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను విశ్వసించువారు తమ పాపము నుండి రక్షింపబడుదురు. అలాగే వారి ఆత్మలు భిన్నమైనవి అనుటకు సందేహము లేదు.కానీ సామన్యులు దీనిని గుర్తించలేరు. ఈ రెండు సువార్తలు ఒకే విధముగా ఉన్ననూ వాటి విశ్వాసములో ఎంతో దూరము కలిగినవై కలపలేనంతగా భిన్నమైనవై ఉన్నవి. యేసుక్రీస్తుని బాప్తిస్మమును మనము విశ్వసించామా లేదా అను చిన్న తేడాను బట్టి మనము నిత్య జీవమును పొందెదమా లేదా అనునది ఆధారపడును. అప్పుడు మాత్రమే మనము ఈ రెండింటికి గల తేడా కొట్టి వేయలేదని తెలిసికొంటాము.

ఏ విశ్వాసము పాపము నుండి మనకు రక్షణ ప్రాకారమును నిర్మించగలదో మనము స్పష్టముగా తెలుసుకోవాలి. పాపము నుండి విడిపించబడుటకు మనము తప్పక నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను నమ్మాలి. ఈ నీరు మరియు ఆత్మమూలమైన సువార్తయే పాపక్షమాపణ యొక్క సత్యము. రక్షణ యొక్క స్పష్టమైన స్థితి నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను నీవు నమ్ముకొనక ముందు నీవు ఖచ్చితంగా రక్షింపబడలేదని ఒప్పుకొన్నప్పుడును నీవు ఇప్పుడు నీ పూర్ణ హృదయముతో నిజ సువార్తను విశ్వసించిన ఆ రక్షణ యొక్క స్పష్టమైన స్థితి నీ స్వంతమగును.

మీ హృదయములలో నీవు నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను నమ్ముకొన్నచో నీవు నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను విని విశ్వసించుట ద్వారానే నీ పాపముకు క్షమాపణ పొందియున్నావని దేవుని ముందు స్పష్టముగా ఒప్పుకొనవలెను. నీవు ఇప్పుడు నీరు మరియు ఆత్మమూలమైన సువార్త సత్యమును నమ్మినప్పుడు దాని ఋజువును నీ హృదయములో కనుగొనక తప్పదు.

దేవుని ముందు మన విశ్వాసమును జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. ఖచ్చితముగా మన విశ్వాసమును పరీక్షించుకొనుటలో ఎటువంటి సిగ్గు కలుగదు. నీవు యేసుక్రీస్తును నమ్ముకొన్న తరువాత నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను నీ హృదయంలో నమ్ముకొనుటకు ఐదు సంవత్సరాలు పట్టిననూ సిగ్గుపడనవసరం లేదు. నీవు రక్షింపబడుటకు 10 సంవత్సరాలు తీసుకొన్ననూ సిగ్గుపడకూడదు. 20 సంవత్సరాలు నీవు రక్షింపబడుటకు తీసికొనిననూ దానిలో ఏ అవమానమును ఉండదు. దానికి భిన్నంగా అది దీవెనకరము.

అయిననూ వాస్తవమేమనగా పాపము నుండి రక్షింపబడినట్లే నటించువారు అనేకులు కానీ సమస్తమును శోధించు పరిశుద్ధాత్మ వారి విశ్వాసమును ధృవీకరించదు. ఎందుకనగా నిజాయితీగా రక్షణ యొక్క స్పష్టమైన గీతను వారు గీయలేదు. ఇప్పటికైననూ, మన రక్షణకు పరిధిని ఖచ్చితంగా గీయుట అనునది ఎంతో తెలివైన పని మనము రక్షింపబడిన ఖచ్చితమైన రోజు తెలియకపోయినా, ప్రాముఖ్యమైనదేమనగా మనము రక్షింపబడుటకు ముందు తరువాత ఉన్న స్థితికి గల తేడాను వేరు పరచగలగాలి. నీ విశ్వాస పరిపూర్ణత బేధమును ఒప్పుకోవాలి.విశ్వాసంలో మన తండ్రులు కూడా మనము ఇప్పుడు విశ్వసిస్తున్న సువార్తనే విశ్వసించిరి.


ఎర్ర సముద్రమును దాటిన ఇశ్రాయేలీయులు కనాను దేశములో ప్రవేశించుటకు యొర్దాను నదిని దాటుటకు ప్రయత్నించినప్పుడు దేవుని మందసమును మోయు యాజకులను వారు అనుసరించినప్పుడే దానిని క్షేమముగా దాటిరి. ‘ఓహో’, అలాగే నేను కూడా యొర్దానును దాటెదనని మనలను గూర్చి మనము తలంచి వాస్తవముగా అట్లు చేయని యెడల మనము కనాను దేశములో ప్రవేశించలేము. ఎందుకనగా మనము ఇంకనూ నదికి అవతలనే ఉండి ఉంటాము. కనానులో ప్రవేశించుటకు మనం ఖచ్చితంగా ఎర్రసముద్రమును మరియు యొర్దాను నదిని ప్రభువులో మనకు కల విశ్వాసముతో దాటవలెను. 

ఆత్మీయంగా మాట్లాడితే యొర్దాను నది మరణము మరియు పునరుత్థానము యొక్క నదియై యున్నది. మనను మన పాపము నుండి రక్షించిన ఆ విశ్వాసము ‘‘నేను నరకపాత్రుడను, కానీ ప్రభువు ఈ లోకమునకు వచ్చి తన బాప్తిస్మముతోను, సిలువ రక్తముతోనూ నన్ను రక్షించెనని” నమ్ము విశ్వాసమే. మనలను పూర్తిగా రక్షించుటకై మన ప్రభువు యొర్ధాను నదిలో బాప్తిస్మము పొందెను మరియు సిలువపై తన రక్తమును కార్చెను. ఈ విధముగా ఆయన మన పాపములను వహించెను. మరియు సిలువపై తన రక్తమును కార్చెను ఈ విధముగా ఈయన మన పాపమును వహించెను మరియు మనకు బదులుగా తన ప్రాణమును అర్పించుట ద్వారా పాపము యొక్క జీతమును చెల్లించెను. ఇప్పుడు ఈ సత్యమును మనము నమ్మాలి. మన హృదయాల్లో విశ్వాస సరిహద్దును, రక్షణ సరిహద్దును గీయవలెను.

నేను దేవుని వాక్యమును బోధించుచుండగా, ఆయన సంఘములోని అనేకులు తమ హృదయాలలో రక్షణ సరిహద్దును ఇంకనూ తీయక, ప్రభువును అనుసరించలేకపోవుచుండుటను నేను చూస్తున్నాను. రక్షణకు ముందు వెనుక ఈ రక్షణ గీతను ఎట్లు గీయగలమని వారు ఆశ్చర్యపడతారు. ఇట్లు చెప్పుచూ తమను తాము సమర్థించుకుంటారు. ‘‘ఇట్టి గీత గీసినవారు ఈ లోకములో ఇప్పటి వరకూ ఎవరైనా వున్నారా? అపోస్తులుడైన పౌలు గీసాడా? పేతురు రాశాడా? ఎవరూ అట్లు గీయలేదు.’’ కానీ విశ్వాసములో అపోస్తులుడైన పౌలు, పేతురు వంటివారు అందరూ రక్షణ గీతను గొనిరి.

పౌలు విషయమైతే దమస్కు వెళ్లే మార్గములోనే అతడు గీసియున్నాడు కనుక అతడు తన మాటలో తరచుగా దీనిని ప్రస్తావించెను. ‘‘పూర్వపు దినములలో లేదా పూర్వము” అను మాటను ఇప్పుడు అను మాటకు భిన్నంగా వాడెను. పేతురైతే పైనున్న మాటనే పలికియుండెను. (1పేతురు 2:10, 14, 25) అతడు కూడా ఈ గీతను గీచియుండుట అతని పలుకులు చూచినప్పుడు మనకు తెలియును. ‘‘నీవు క్రీస్తువు, సజీవుడైన దేవుని కుమారుడవు” (మత్తయి 16:16) మరియు దానికి సాదృశ్యమున బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. అదేదనగా శరీర మాలిన్యము తీసివేయుట కాదు గానీ యేసుక్రీస్తు పునరుత్థాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే (1 పేతురు 3:21) పౌలును పేతురును కూడా రక్షణకు ముందు వెనుక ఒక గీతను గీసియున్నారు.

కనుక నీవు నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను విశ్వసించావా లేదా అను ప్రశ్న ఎవరి సమస్య కాదు కానీ అది నీ ఆత్మలకు మాత్రమే సంబంధించినది. బైబిలునందున్న దేవుని పరిచారకులందరూ పాపమను సమస్యను ఎదుర్కొన్నవారే. ఎందుకనగా ఇది మన అందరికీ అతిప్రాముఖ్యమైన సమస్య. మనకు మనమే దీనిని విశ్వాసం ద్వారా పరిష్కరించుకొనవలెను. నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను మనము నమ్మినప్పుడు మన హృదయ మధ్యమము నుండి ఆ సమస్యను పరిష్కరించవచ్చును. దేవుడు ఎంతో ఆనందించును. నీవు దేవుని సంతోషపరచుటకు కోరుచున్నావా? అయితే నీవు చేయవలసినదంతయూ నీ పాపమును గుర్తించి ఆ సమస్యను నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను విశ్వసించుట ద్వారా పరిష్కరించుకోవలెను. ఇప్పటి వరకూ నీవు రక్షింపబడకపోయినట్లయితే నీవు ఇట్లు ఒప్పుకోవాలి. ‘‘దేవా! నేను ఇంకనూ రక్షింపబడలేదు.’’

యేసు చెప్పెను. ‘‘పరలోక రాజ్యము తాళపు చెవులు నీకిచ్చెదను నీవు భూలోకమందు దేనిని బంధించుదువో అది పరలోకమందును బంధించబడును; భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పెను” (మత్తయి 16:19) మన వైపు నుండి మనము మొదట ఒప్పుకొనవలెను. ‘‘దేవుడు నన్ను నీరు మరియు ఆత్మమూలమైన సువార్త రక్షించెను. ఇప్పుడే నీ హృదయములో నేను నీరు మరియు ఆత్మమూలమైన సువార్త యొక్క సత్యమును నమ్ముచున్నాను. దేవుడు నన్ను నీరు మరియు ఆత్మమూలమైన సువార్త ద్వారా రక్షించెననుటకు ఏ సందేహమును లేదు.

మనము అందరము మన హృదయంలో నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను అంగీకరించాలి. ‘‘నేను ఈ సువార్తను నమ్ముచున్నాను. ఎందుకనగా అదే సత్యము, ఎందుకనగా అధికముగా నా ప్రభువు నా పాపమును తుడిచెను. ఇప్పుడు నేను ఈ సువార్తను నమ్ముచున్నాను. నేను విశ్వాసము ద్వారానే రక్షింపబడలేదు.’’ ప్రభువు ఇచ్చిన సువార్తను పై విధముగా గుర్తించి విశ్వసించినప్పుడు దేవుడు మనతో ఇలా చెప్తాడు. ‘‘నేను నీ విశ్వాసమును ధృవీకరించుచున్నాను.’’

దేవుడు మనకు నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను ఇచ్చియుండగా అది మనలను పూర్ణముగా రక్షించగలదు. మన పాత్రలో మనము రక్షణ గీతను గీయక పోయినట్లయిన ఈ సత్యమును నమ్ముచూ ఈ రక్షణను అంగీకరించలేకపోయినప్పుడు దేవుడు ఒక వంతుగా మనలను రక్షింపబడిన వారముగా గుర్తించడు. ఇట్లనగా దేవుడు మనలను వ్యక్తిత్వమును బట్టి చూచును కానీ చేయవలసినదే అను దానిని బట్టికాదు. నీ హృదయమందు నీవు నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను నమ్మకపోయినట్లయిన ఆయన నీకు పాపక్షమాపణను ఇవ్వడు. నీవు నీ హృదయంలో నీరు మరియు ఆత్మమూలమైన సువార్త పట్ల కృతజ్ఞత లేకుండిన యెడల అనగా పరిశుద్ధాత్మ నీ హృదయంలో నివసించడు.

మనము నీరు మరియు ఆత్మమూలమైన సువార్త తప్ప మిగిలిన వాటిని అన్నిటిని తిరస్కరించామా? అట్టి తప్పుడు బోధలు ఇంకనూ ఉపయోగకరమని తలంచుచూ వాటిని పారవేయనవసరము లేదని అనుకొనుచున్నావా? మనలను మనమే పరీక్షించుకొని ఎంత ఖచ్చితంగా విశ్వసిస్తున్నామో చూచుకోవలెను. ఒక నిమిషం మనము ఊహించుకొందాం మనము వాడేసిన ఎలక్ట్రానిక్‌ పరికరాల గుట్ట యొద్ద ఉన్నాము. వాటిలో కొన్నింటిని ఇంటికి తెచ్చుకున్నామనుకుందాం. ఇక మనం వాటిని ఉపయోగంలో పెట్టవచ్చునని ఆలోచిస్తాము కానీ వాటిలో ఏదీ పనిచేయదనీ, అవి నిరూపయోగమైనవనీ తరువాత తెలిసికొంటాం. తరువాత కూడా వాటిని ఉంచుతామా పారవేస్తామా? అవన్నీ ఉపయోగపడవని ఒకసారి నిర్ణయించిన తరువాత, వాటన్నింటిని మనం పారవేయవచ్చు ఏదైనా ఒక ఉపయోగపడదను అభిప్రాయమునకు నీవు వచ్చిన తరువాత అది నీకు ఎప్పటికీ ఉపయోగపడదు. ఇకను అది ఉంచుకొనదగినది కాదు కనుక నిర్ణయాత్మకంగా దానిని ఎట్లు పడవేయవలెనో నీవు తెలుసుకొనవలెను.

లోక సంబంధమైన వాటి విషయంలోనే ఇట్లు చేయుచుండగా అవి మన ఆత్మీయతకు సంబంధించినప్పుడు మనము ఎట్లు ఇంకెట్లు చేయుదము? మన ఆత్మీయ విషయములో అబద్ధమును తిరస్కరించుటకు మరింత నిర్ణయము కలవారమైయుండవలెను. నీరు మరియు ఆత్మమూలమైన సువార్తయందు మనకున్న విశ్వాసము నుండి కేవలము సిలువ రక్తమును విశ్వసించు తప్పుడు విశ్వాసము వేరు చేయుచూ ఒక స్పష్టమైన గీతను గీయవలెను. కేవలము సిలువ రక్తమునే గుర్తించు విశ్వాసము ఎప్పటికినీ రక్షణను తేలేదు. మరియు ఈ తప్పుడు బోధనలను నిర్ణయాత్మకముగా పారవేయవలెను. ఏ సువార్త బైబిల్‌పరముగా బలమైనది? అది కేవలము సిలువ రక్తమును గూర్చిన సువార్తయేనా? లేదా అది నీరు మరియు ఆత్మమూలమైన సువార్తలో నీకున్న విశ్వాసము మరియు నిన్ను నీ పాపము నుండి రక్షించుటకు దేవునిని సంతోషపరచును.

క్లుప్తముగా రెండు రకముల క్రైస్తవులున్నారు. నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను నమ్మువారు మరియు నమ్మనివారు. ఈ రెండు ఒకేవిధమైన విశ్వాస జీవితములోనున్నట్లు కనిపించినప్పటికీ అసలు విషయమేమనగా అవి రెండు పూర్తిగా విరుద్ధమైనవి. నీవు ఇంతకు పూర్వము నమ్మిన అపరిపూర్ణ సువార్త వలన ఏ ఉపయోగమైననూ ఉన్నదని ఏ కారణము చేతనైననూ నీవు ఆలోచిస్తున్నావా? అది ఎప్పటికైనా అవసరమగునని ఇంత కాలము దానిని నీవు నీతోనే ఉంచుకొనుచునే ఉన్నావా?

అట్టి విశ్వాసము తప్పు. అట్టిది ఏవో మానవ నిర్ణీత యోచనతో వచ్చినవే. కనుక నీవు పాతవైన అట్టి బరువంతటిని నీవు పారవేయవలెను. సత్యము కాని అబద్ధమైన వాటిని నీవు పారవేయక ఇంకనూ నీతోనే ఉంచుకొనిన కారణమేమనగా నీ హృదయంలో నీకు కొన్ని సమస్యలు కలిగియున్నావు. ఆయన వాక్యమును జ్ఞాపకం చేసుకొనమని నీకు గుర్తు చేయుచున్నాను. ‘‘మీరు నా కట్టడలను ఆచరింపవలెను. నీ జంతువులను ఇతర జాతి జంతువులను కలయనీయ కూడదు; నీ పొలములో వేరు వేరు జాతు విత్తనము చల్లకూడదు. బొచ్చును నారయు కలిసిన బట్ట నేసికొనకూడదు.’’ (లేవీకాండం 19:19)పరిశుద్ధ స్థలములో ప్రవేశించుటకు మనము దాని ద్వారము ద్వారానే ప్రవేశించవలెను.


ప్రత్యక్ష గుడారము ఏ పదార్థముతో నిర్మితమైనది? అది నీలి ధూమ్ర రక్తవర్ణదారముతో వేయబడినది. నీరు మరియు ఆత్మమూలముగా తిరిగి జన్మించిన వారు తప్పక ప్రత్యక్ష గుడారపు తలుపుల స్తంభముల కింద ఇత్తడి దిమ్మలు ఉంచబడియున్నవి. ఈ ఇత్తడి దిమ్మలు మనకు తెలియచేయునది ఏమనగా నీరు మరియు ఆత్మమూలమైన సువార్తయే సత్యమైన రక్షణ అనియే.

మన స్వంత ఆలోచనలను, విశ్వాసమును పారవేసినప్పుడే గానీ మనము నీలి ధూమ్ర రక్తవర్ణ దారములో చూపబడిన రక్షణను విశ్వసించలేము. నీలి, ధూమ్ర, రక్తవర్ణ దారములో పేనిన సన్నపు నారలో బయలుపరచబడినది సత్యమే నీరు మరియు ఆత్మమూలమైన సువార్త అని మనము తప్పక గుర్తించాలి మరియు మనము కేవలము సిలువ రక్తములోనే మన విశ్వాసమును కలిగియున్న పూర్వపు స్వంత ఆలోచనలోని తప్పును తెలుసుకోవాలి.

దేవుని చిత్తమైతే నీరు మరియు ఆత్మమూలమైన సువార్త యొక్క సత్యమునకు ఆయన నిన్ను నడిపించెను. నీరు మరియు ఆత్మమూలమైన సువార్త సత్యమును నమ్మినవారు మాత్రమే తమ పాపములన్నిటి నుండి క్షమింపబడి నిత్యజీవమును పొందెదరు. అప్పుడు మాత్రమే మనము ప్రత్యక్ష గుడారపు తలుపు తెరచి తమ హృదయాలలో ఈ సత్యమును నమ్ముట ద్వారా పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించగలరు.

నీవు ఇంతకు ముందున్న పాత విశ్వాసము నీరు మరియు ఆత్మమూలమైన సువార్త తెలుసుకున్న తరువాత నున్న విశ్వాసమును కప్పివేయు భయం నుండి తొలగిపోవుటలో తప్పి పోయినట్లయితే నీవు పాపశిక్షను భరించవలెను. ఎందుకనగా నీవు రక్షింపబడలేకపోతివి. అట్లు జరిగిన యెడల నీవు పరిశుద్ధ స్థలములో ప్రవేశించలేవు. జీవాహారమును భుజించలేవు. నీరు మరియు ఆత్మమూలమైన సువార్తలో విశ్వాసంతోనే పరిశుద్ధ స్థలములో నీవు ప్రవేశింపగలవు మరియు జీవాహారమును పొందగలవు.

ప్రభువు నిన్ను దేవుని పిల్లలుగా చేయుటకై నీలిదారమైన తన బాప్తిస్మంతో నీ పాపమును కడిగెను. సిలువలో రక్తము కార్చుట ద్వారా నీ పాపశిక్షను భరించెను. అదే ధూమ్ర వర్ణ దారము. నీవు నీరు మరియు ఆత్మమూలమైన సువార్త సత్యమని అది ఖచ్చితంగా నీకు అవసరమని స్పష్టంగా గుర్తించి నమ్మాలి. నీవు దేవుని సంఘమునకు రావలెను మరియు జీవాహారమును నీతిమంతులతో పాటు పంచుకొనగలవు ఎట్లనగా దేవుడే నీకు నీరు మరియు ఆత్మమూలమైన సువార్త ఇచ్చెనని ఆ సువార్తను నీవు నమ్మినప్పుడు మాత్రమే చేయగలవు.ప్రభువు శరీరమే జీవాహారమైయున్నది మరియు పాపక్షమాపణయైయున్నది.


యోహాను 6:49-53 వైపు తిరుగుదాం. మీ పితరులు అరణ్యములో మన్నాను తినియు చనిపోయిరి. దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగివచ్చిన ఆహారమిదే. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడును జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను. యూదులు ఈయన తన శరీరమును ఏలాగు తిననియ్యగలడని యొకనితో ఒకడు వాదించిరి. కావున యేసు ఇట్లనెను మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కాని మీలో మీరు జీవము కలవారు కారు. నా శరీరమును తిని ఆయన రక్తమును త్రాగితేనే గాని మీరు నిత్యజీవము కలవారుకారని యేసు చెప్పెను.” ఈ భాగము యొక్క అర్థమేమనగా మనమందరమూ ఆయన శరీరమును తిని ఆయన రక్తమును త్రాగవలెనని.

అయినప్పుడు మనము యేసుని శరీరమును తిని ఆయన రక్తమును త్రాగగలమా? అనగా నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను నమ్మినచో మనము యేసుని శరీరమును తిని ఆయన రక్తమును త్రాగగలము. యేసయ్య తన బాప్తిస్మంతో మన పాపమును వహించుకొనెనని నమ్ముట ద్వారా మనము ఆయన శరీరమును తినగలము. మరియు యేసు మన పాపములను భరించి సిలువపై వాటి కొరకు చనిపోయెనని నమ్ముట ద్వారా మనము ఆయన రక్తమును త్రాగగలము.

నీలి ధూమ్ర రక్తవర్ణ దారములు మరియు పేనిన సన్నపునారలో చూపబడిన రక్షణ యొక్క క్రియలను కూడా మనము నమ్మవలెను. యేసు మన పాపములను తుడుపుపెట్టి మనలను దేవుని స్వంత పిల్లలనుగా చేసెను. నీవు నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను నమ్మక ముందు నీవు ఎంత విశ్వాసముంచితివో దానితో లెక్కలేదు కానీ నీ పాత విశ్వాసము తప్పక నీవు గుర్తించాలి. మరియు నీవు ఇప్పుడు యేసు శరీరమును రక్తమును సేవించిన వాడవై వాక్యమును ఆహారమును తిని విశ్వాసము యొక్క ఫలకమును నిలుపుకొనవలెను.

యోహాను 6:23 చెప్పుచున్నది. కావున యేసు ఇట్లనెను మీరు మనుష్య కుమారుని శరీరమును తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము కలవారు కారు. ఇప్పటికి కూడా అనేకులు ఈ భాగమును వాదించుచూ విషయమును మార్చుటకు ప్రయత్నించెదరు. ఈ బోధ వాదించునదేమనగా ఆచారమును విశ్వాసంతో చేయునప్పుడు బల్ల ఆరాధనలో ఇచ్చు రొట్టెయు, ద్రాక్షారసమును నిజముగా యేసుని శరీరముగాను, రక్తము గాను మారును. కానీ యోహాను 6:23లో చెప్పబడినదేమనగా అర్థమును త్రిప్పివేయునట్లు కాక నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను గూర్చి మాట్లాడుచున్నదని మనము గుర్తించి విశ్వసించవలెను.

బల్లారాధన సమయంలో నీవు వరుసలో నిలబడి వేచియున్నప్పుడు బోధకుడు నీ నోటిలో రొట్టె ముక్క ఉండినప్పుడు అది యేసుని శరీరముగా మారిపోవునా? అట్లు జరుగదు. యేసు శరీరమును తిని ఆయన రక్తమును త్రాగుట ఎట్లనగా యేసు ఈ లోకమునకు వచ్చి లోకపాపమును వహించుకొని, బాప్తిస్మం పొంది సిలువ వేయబడుట ద్వారా వాటిని కడిగివేసి దానిపై చనిపోయెను. అందువలన మనలను మరణము నుండి రక్షించెనని విశ్వసించి తెలుసుకొనవలెను.

యేసుని శరీరమును రక్తమును విశ్వాసముతో స్వీకరించువారు ఎవరనగా నీలి, ధూమ్ర, రక్తవర్ణ దారములతో యేసు మన పాపమును వహించుకొని పాపశిక్షను తన స్వంత శరీరములో భరించెనని విశ్వాసము గల వారే. మనము ఆయన బాప్తిస్మము మరియు రక్తమును నమ్ము మన విశ్వాసముతో యేసు శరీరమును తిని రక్తమును త్రాగవలెను.

తనపై మోపబడిన మన పాపమును అంగీకరించుటకు యేసు యొర్దాను నదిలో బాప్తిస్మమిచ్చు యోహాను ద్వారా బాప్తిస్మం పొందెను. మత్తయి 3:15-17 వైపుకు తిరుగుదాము. యేసు ఇప్పటికి కానిమ్ము. నీతి యావత్తు ఈలాగు నెరవేర్చుట మనకు తగియున్నదని అతనికి ఉత్తరమిచ్చెను గనుక అతడాలాగు కానిచ్చెను. యేసు బాప్తిస్మం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరువబడెను. దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు ఈయనయందు నేనానందించుచున్నానని యొక శబ్ధము ఆకాశము నుండి వచ్చెను.

ఎందుకనగా యోహాను వలన యేసు బాప్తిస్మం పొందినప్పుడు ఆయన పాపములన్నిటినీ తనపై మోపుకొనెను. ఆయన సిలువపై చనిపోయెను. ఎట్లనగా ఆయన దేవుని నీతియావత్తును నెరవేర్చెను. సువార్త సత్యమును నమ్ము మన విశ్వాసము ఏదనగా యేసు యోహాను ద్వారా బాప్తిస్మం పొందినప్పుడు లోకపాపములన్నీ ఆయనపై మోపబడెను అనునది నిజమైన విశ్వాసం దానితో మనం యేసుని శరీరమును తిని ఆయన రక్తమను త్రాగగలము.

నీవు ఈ సత్యమును గుర్తించిన యెడల నీవు యేసు శరీరమును విశ్వాసముతో తినియుండెదవు. లోకపాపము యేసుపై ఒకేసారిగా మోపబడియున్నది. సత్యము కనుక నీవు దీనిని నీ హృదయ మద్యమున నమ్ముట ఎంతో అవసరము. ఈ విశ్వాసమే యేసుని శరీరము నీవు తినునట్లు చేయు విశ్వాసము. నీ పాపము ఆయన బాప్తిస్మం ద్వారా యేసునిపై మోపబడినవా? దీనిని నీవు నమ్మితేనే నీవు యేసుని శరీరమును తినగలవు. యేసుకు బాప్తిస్మమును ఇచ్చిన తరువాత బాప్తిస్మమిచ్చు యోహాను ఇట్లు బిగ్గరగా చెప్పెను. ‘‘ఇదిగో లోకపాపమును మోసికొనిపోవు దేవుని గొర్రెపిల్ల.’’ (యోహాను 1:29)

బాప్తిస్మం పొందుట ద్వారా యేసయ్య లోకపాపమును వహించుకొనెను గనుక ఆయన వాటన్నిటిని తన స్వంత శరీరముపై మోసుకొని పోయి సిలువ వేయబడెను. తన రక్తమును కార్చి చనిపోయెను. అట్లు సిలువ వేయబడి తన చేతులతో పాదములలో మేకులు కొట్టబడినవాడై తన రక్తమును గూర్చి మరణమగుచూ యేసు బిగ్గరగా పలికెను. ‘‘సమాప్తమైనది”. తరతువాత మూడు దినములలో ఆయన మృతి నుండి లేచి 40 దినములు సాక్ష్యము పొంది ఆయన ఉన్న రీతినే పరలోకమునకు ఆరోహణమాయెను. ఆయన ఇప్పుడు తండ్రియైన దేవుని కుడి పార్శ్వమున కూర్చొన్నాడు. ఆయన పరలోకమునకు ఆరోహణమైనట్లే తిరిగి వస్తానని కూడా ఆయన వాగ్ధానం చేసెను. నీవు నీ హృదయ మద్యమున దీనిని విశ్వసిస్తావా? అనగా ఈ సత్యమును నీవు విశ్వసించుట ద్వారా నీవు యేసుని శరీరమును తిని ఆయన రక్తమును త్రాగగలవు. దానిని మనం మన హృదయంలో నిజముగానమ్మితే ఆయన శరీరమును తిని, ఆయన రక్తమును త్రాగము. అనగా ఈ విశ్వాసంతోనే మనము పరిశుద్ధ స్థల ఆహారమును తినగలము.

మనము సహజముగా కూడుకొనినప్పుడెల్ల ఆయన శరీరమును రక్తమును జ్ఞాపకము చేసుకొనుమని మన ప్రభువు ఆజ్ఞాపించెను. (1కొరింథి 11:26) అలాగే మనము కూడుకొనిన ప్రతిసారి ఎల్లప్పుడూ మనము యేసుని శరీరమును, రక్తమును తప్పక జ్ఞాపకం చేసుకోవాలి. అనగా విశ్వాసముతోనే యేసుని శరీరమును తిని ఆయన రక్తమును త్రాగవలెను. ఎప్పుడనగా మనము కూడుకొనినప్పుడెల్లా ఈ బల్లారాధనను ఏదో ఆచారపూర్వకముగా ఒక్కసారే ఎట్లు చేయగలము?

ఎందుకనగా యేసు తాను పొందిన బాప్తిస్మం ద్వారా మన పాపాలను తన స్వంత శరీరంపై మోపుకొనెనని తన త్యాగపూరిత సిలువ రక్తము చిందించెనని నమ్మి విశ్వాసముతోనే మనము ఆయన శరీరమును రక్తమును అనుదినము జ్ఞాపకము చేసుకొనుచున్నాము. ఎందుకనగా మనము నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను మనము నమ్ముచున్నాము కనుక అనుదినము మనం ఆయన శరీరమును తిని రక్తమును త్రాగుచున్నాము. యేసు చెప్పినట్లుగా ‘‘నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడే నిత్యజీవము గలవాడు” (యోహాను 6:54) అంత్యదినమున ఆయన శరీరమును తిని ఆయన రక్తమును త్రాగువారిని ఆయన లేపును.

మన విశ్వాసము ఆయన శరీరమును తిని, రక్తమును త్రాగనియ్యని యెడల అది అబద్ధ విశ్వాసమని మనము ఒప్పుకొనవలెను. మన ప్రభువు ఇట్లు చెప్పెను. ‘‘నా శరీరము తిని నా రక్తమును త్రాగువాడే నిత్యజీవముగలవాడు, అంత్యదినమున నేను వానిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునైయున్నది. నా శరీరమును తిని, నా రక్తమును త్రాగువాడు నా యందును నేను వానియందును నిలిచియుందుము. జీవముగల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్లే నన్ను తినువాడును నా మూలముగా జీవించును.’’ (యోహాను 6:54-57)

విశ్వాసంతో ప్రభువు శరీరమును తిని ఆయన రక్తమును త్రాగువాడు ఆయన మూలముగా జీవించును. మరోప్రక్క ప్రభువు శరీరమును తినక ఆయన రక్తమును త్రాగువారు మరణమగుదురు. ఎందుకనగా వారు విశ్వసించలేదు. విశ్వాసంతో యేసుని శరీరమును తిని ఆయన రక్తమును త్రాగుట మనకు కష్టమైనది కాదు.

కొద్దిసేపు మనం ఊహిద్ధాం. దేవుని రాజ్యములో ప్రవేశించుటకు మనము రక్షణ యొక్క పరీక్షను పొందవలసియున్నది. దానిలోని ప్రశ్న ఇట్లు అడుగుచున్నది. ‘‘యేసుని రక్తమును తిని ఆయన రక్తమును త్రాగునట్లు చేయగల విశ్వాసము ఏది? ఈ ప్రశ్నకు మనము ఎట్లు సమాధానమిస్తాము. యేసు శరీరమును రక్తమును సత్యమును కలిగియున్నప్పుడూ వాస్తవానికి ఆయన రక్తమును త్రాగి శరీరమును తిన్నామని చెప్పగలమా? మనము యేసుని బాప్తిస్మమును, సిలువను సమాధానముగా వ్రాసుకొనవలెను. యేసుని శరీరమును తిని రక్తమును త్రాగినప్పుడే మనము ఆయన రాజ్యములో ప్రవేశించగలము. పూర్వము మనము అపార్థమును కలిగి తప్పుడు విశ్వాసంలో ఉన్ననూ మన హృదయాలను త్రిప్పుకొని యేసుని శరీరమును తిని రక్తమును త్రాగినప్పుడే మనం పరీక్ష పాస్‌ కాగలము. ఇప్పుడే మనం యేసుని శరీరమును రక్తమును నమ్మితే ఇప్పుడే మనము పరీక్ష పాస్‌ కాగలము.

మనుష్యులు బాహ్య రూపమును చూస్తారు. కానీ దేవుడు హృదయాంతరంగమును చూస్తాడు. కనుక మనము యేసుని బాప్తిస్మమును రక్తమును రెంటిని నమ్మితే మనము ఆయన శరీరమును తిని రక్తమును త్రాగుచుండువారమే. మన హృదయంలో యేసుని శరీరము మరియు రక్తములో మనకు నిజముగా విశ్వాసం ఉన్నదా లేదా అని యేసయ్య మన హృదయాలను చూస్తారు. కాబట్టి మనము యేసుని శరీరమును రక్తమును మన హృదయంలో నమ్ముచున్నామో లేదో చూచును. కాబట్టి మన హృదయాలలో మనము యేసుని శరీరమును రక్తమును నమ్మనియెడల మనము మన పాపము నుండి రక్షింపబడియుండేవారముకాదు. నీవు ఇంతకు మునుపు ఎంతగా నమ్మియున్నావని కాక నీవు ఇప్పుడు యేసుశరీరము మరియు రక్తమును రెండింటిని నమ్మినట్లయిన నీవు పరలోక రాజ్యములో ప్రవేశించగలవు.

ఈ లోకములోని అనేక విధములైన మతస్థులు మహిమరూపము యొక్క బోధనల యొక్క బేధమును గూర్చి చర్చించుచున్నారు. కానీ వాస్తవముగా కావలసినది యేసు శరీరమును తిని ఆయన రక్తమును త్రాగునట్లు అనుమతించగల విశ్వాసమే. మనము నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను మన హృదయాలలో విశ్వసించినప్పుడే అది సాధ్యపడును.

యేసుని మన హృదయంలో నీరు మరియు ఆత్మమూలమైన సువార్త ద్వారా విశ్వసించుట అనగా నిజమైన ఆహారమును తిని, నిజమైన పానమును చేసినట్లే.మనము తప్పక యేసుని శరీరమును రక్తమును మన పాప పరిహారముగా నమ్మవలెను.


మన ప్రభువు చెప్పెను. ‘‘నా రక్తము నిజమైన పానము” (యోహాను 6:55) మన ప్రభువు పాపము యొక్క శిక్షను సిలువలో భరించెను. యేసు బాప్తిస్మం పొందుట ద్వారా మన పాపాలను తనపై వహించుకొనెను మరియు సిలువలో తన రక్తమును కార్చెనని నమ్ము విశ్వాసమే మనలను యేసు రక్తమును సేవించుటకు అనుమతించును. యోహాను నుండి ఆయన పొందిన బాప్తిస్మం ద్వారా యేసు మన పాపములన్నిటిని మోసెను. వాటిలో నీ పిల్లల పాపం. నీ తల్లిదండ్రుల పాపం మనలో ప్రతి ఒక్కరి పాపం ఉన్నవి. మరియు సిలువలో తన రక్తమును కార్చుట ద్వారా ఆయన ఈ పాపాలన్నిటి శిక్ష వహించెను. ఆయన బాప్తిస్మము మరియు రక్తముతో యేసు ఖచ్చితంగా పాపము యొక్క సమస్యను ఈ లోకములో ప్రతి వారి కొరకు సాధించెను. కనుక యేసు తన బాప్తిస్మ ద్వారా మన పాపమును వహించుకొనెను. సిలువలో రక్తము కార్చుట ద్వారా పాపశిక్ష భరించెనని విశ్వసించుటయే. విశ్వాసంతో యేసు రక్తమును సేవించుటతో సమానం.

ఈ దినాలలో మేము నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను నమ్ముచున్నామని కేవలం మాటలతో చెప్పువారు అనేకులు కలరు. కానీ వారు యేసు శరీరమును, రక్తమును పూర్తిగా విశ్వసించరు. యేసు శరీరము మరియు రక్తమునందు నమ్మికయంచు పూర్తి విశ్వాసము లేనివారు పాప పరిహారమును పొందలేరు. పూర్వము నీవు యేసు రక్తమే సత్యమని నమ్మియుండవచ్చు. నీకు యేసు శరీరమును రక్తమును నమ్మునట్టి స్పష్టమైన విశ్వాసము అవసరము. అప్పుడే దేవుడు నిన్ను రక్షింపబడిన వానిగా గుర్తించును. కానీ మరో ప్రక్క ఈ విషయమై నీకు నీవే ఒక స్పష్టమైన రక్షణ గీతను గీయని యెడల అనగా పాపము యొక్క పరిహారముతో మన హృదయములో యేసుని శరీరమును, రక్తమును విశ్వసించు. అప్పుడు విశ్వాసము దేవునిచే అనుమతించబడినదిగా ఉండదు.

మన ప్రభువు చెప్పెను. ‘‘నా శరీరము తిని నా రక్తమును త్రాగువాడు నా యందును నేను వానియందును నిలిచియుందుము” (యోహాను 6:56) కానీ మనము విశ్వాసంతో యేసు శరీరమును తిని, ఆయన రక్తమును త్రాగక పోయిన యెడల మనము దైవ సముఖమునకు రాలేము. మరియు యేసు శరీరమును ఆయన రక్తమును విశ్వసించు నమ్మిక లేనివారు ఎవరైనా ప్రభువులో నిలిచియుండలేరు. పరిశుద్ధుల పనివారు మరియు మన సంఘములోనున్న దేవుని పరిచారకులందరిలో ఏ ఒక్కరూ యేసు శరీరము మరియు రక్తమును నమ్ము విశ్వాసము నుండి బాధకారముగా తొలగిపోరని నేను ప్రగాఢముగా నమ్ముచున్నాను.

సొదొమా గొమొఱ్ఱా అగ్నిచే నాశనము చేయబడినప్పుడు లోతు అల్లుళ్ళు లోతు తమతో చెప్పిన దేవుని జీవ వాక్యము ఒక జోక్‌ అని అనుకొన్నారు. దేవుని వాక్యమును సీరియస్‌గా పట్టించుకొనని వారికి వ్రాయబడియున్నట్లుగా దేవుని తీర్పు వారిపైకి వచ్చును. అవిశ్వాసులు తమ అవిశ్వాసమును బట్టి గద్దించబడతారు. వారు తమ పాపమును బట్టి నాశనము చేయబడుదురు. ఇది కొన్ని జోక్ ల‌ వలన నవ్వుకునే విషయం కానేకాదు.

నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను యేసుని శరీరము మరియు రక్తమునందు ఉన్న విశ్వాసమే. ఈ సత్యమును విశ్వసించుట ద్వారా మనము మన పాపాల నుండి విడిపించబడి నిత్యజీవమును పొందగలము. యేసు శరీరము మరియు రక్తము యొక్క విశ్వాసము మనకున్నది. కనుక మనం విశ్వసించు సువార్త మన సత్యమైనది మరియు వాస్తవమైనది. ఈ విశ్వాసమును మనం మన హృదయములలో ఉంచుకోవాలి.మొదటి మన హృదయంలో విశ్వాసము యొక్క గుమ్మములను ఎత్తుకొని దేవుని వాక్యమంతటిని గట్టిగా పట్టుకొని దానిని మననుండి జారిపోకుండా జాగ్రత్తగా చూచుకొనవలెను. మన హృదయంలో విశ్వాసము నుంచి యేసుని శరీరము మరియు రక్తముతో పాపులు పాపాలను తొలగించెనని సత్యమును మనము అంగీకరించవలెను. 

ప్రభువు నెరవేర్చిన నీరు మరియు ఆత్మమూలమైన సువార్తలో మీరందరూ విశ్వాసము నుంచవలెనని నిన్ను నీ పాపము నుండి రక్షించిన రక్షణ యొక్క అహారమును తిని దాని వలన నిత్యజీవమును పొందవలెనని నేను నమ్ముచూ ప్రార్థించుచున్నాను.