Sermons

[11-20] < నిర్గమ 30:1-10 > ధూప వేదిక< నిర్గమ 30:1-10 >

“మరియు ధూపము వేయుటకు నీవు ఒక వేదికను చేయవలెను. తుమ్మకర్రతో దానిని చేయవలెను దాని పొడుగు ఒక మూర దాని వెడల్పు ఒక మూర. అది చచ్చౌకముగా నుండవలెను. దాని యెత్తు రెండు మూరులు దాని కొమ్ములు దానితో ఏకాండమై యుండవలెను. దానిపై భాగమునకును దాని నాలుగు ప్రక్కలకును దాని కొమ్ములకును మేలిమి బంగారు రేకు పొదిగించి దానికి చుట్టు బంగారు జవను చేయవలెను. దాని జవకు దిగువను దానికి రెండు బంగారు ఉంగరములు చేయవలెను. దాని రెండు ప్రక్కల యందలి దాని రెండు మూలల మీద వాటిని ఉంచవలెను. అవి దాని మోయు మోత కఱ్ఱలకు స్థలమును ఆ మోత కఱ్ఱలను తుమ్మకఱ్ఱతో చేసివాటికి బంగారు రేకు పొదిగింపవలెను. సాక్ష్యపు మందసము నొద్ద నుండు అడ్డ తెర యెదుట అనగా శాసనముల మీది కరుణాపీఠము నెదుట నీవు దానిని ఉంచవలెను. అక్కడ నేను నిన్ను కలిసికొందును అహరోను ప్రతిదినము ప్రొద్దున దాని మీద పరిమళద్రవ్యము ధూపము వేయవలెను. అతడు ప్రదీపములను చక్కపరచునప్పుడు దాని మీద ఆ ధూపము వేయవలెను. మరియు సాయంకాలమందు అహరోను ప్రదీపములను వెలిగించునప్పుడు దాని మీద ధూపము వేయవలెను. అది మీ తరతరములకు యెహోవా సన్నిధిని నిత్యమైన ధూపము. మీరు దాని మీద అన్యధూపమునైనను దహన బలి సంబంధమైన ద్రవ్యమునైనను నైవేద్యమునైనను అర్పింపకూడదు. పానీయములనైనను దానిపైన పోయకూడదు. మరియు అహరోను సంవత్సరమునకొకసారి ప్రాయశ్చితార్థమైన పాపపరిహారార్థబలి రక్తము వలన దాని కొమ్ములు నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. మీ తరతరములకు సంవత్సరమునకు ఒకసారి అతడు దాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. అది యెహోవాకు అతి పరిశుద్ధమైనది.’’ఆ ధూపవేదిక ప్రార్థన స్థలమైయున్నది.


ధూపవేదిక తుమ్మకర్రతో చేయబడినది. అది చచ్చౌకముగా ఉన్నది. దాని రెండు పొడవు వెడల్పు ఒక మూర (45సెం.మీ) మరియు దాని ఎత్తు 2 మూరలు. అతి పరిశుద్ధ స్థలము లోపల ధూపవేదిక అంతయు బంగారుతో పొదిగించబడినది. దాని చుట్టూ బంగారు జవతో చుట్టబడినది. దాని మోత కర్రలుంచుటకు నాలుగు బంగారు ఉంగరములు దిగువన ఉన్నవి. ఆ ధూపవేదికపై పరిశుద్ధ అభిషేక స్థలమును పరిమళ ద్రవ్యము ధూపమును వేయవలెను. (నిర్గమ 30:22-25)

ధూప వేదిక దేవునికి ప్రార్థన ధూపము అర్పించు స్థలము, ధూపవేదిక పై ప్రార్థించుటకు ముందు మనము ఆ వేదిక వద్ద ప్రార్థించుటకు అర్హులమో, కాదో చూచుకొనవలెను. పరిశుద్ధ దేవుని ప్రార్థించుటకు అర్హత పొందగోరువారు మొదట అతని/ఆమె పాపాలను విశ్వాసంలో కడుగుకొని పాపరహితులు కావలెను. అట్లు చేయుటకు ఒకడు అతని/ఆమె పాపాలను దహనబలి అర్పణ మరియు విశ్వాసముతో వారి పాపమును కడుగుకొనవలెను.

దేవుడు పాపుల ప్రార్థనలను అలకించడు (యెషయా 59:13) ఎందుకు? నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను విశ్వసించుట ద్వారా తమ పాపాలన్నిటిని కడుగుకొన్న వారిని మాత్రమే అంగీకరించును. ఎందుకనగా నీలి, ధూమ్ర, రక్తవర్ణ దారము మరియు పేనిన సన్నపునార దారములో బయలుపరచబడిన సత్యము ద్వారా దేవుడు మన పాపాలన్నిటిని కడిగివేసెను. అనగా దేవుడు నీతిమంతుల ప్రార్థన వినుటకే సంతోషిస్తాడు. (కీర్తన 34:15, 1పేతురు 3:12)మానవులందరి స్వభావము మరియు వాస్తవము


సూక్ష్మంగా మనము చూచిన యెడల మానవులందరూ నీవు నేను కూడా పాపపు విత్తనము వలె జన్మించితిమి. కనుక అదంతయూ పాపమే. ప్రతి ఒక్కరూ దుష్టత్వ ఫలములే. ప్రజలు వాస్తవంగా పాపంతో జన్మించారు. కనుక పాప క్రియలు చేయుచూ జీవించుట తప్ప వేరొక మార్గం లేదు. నీవు ఎవరివైననూ నిన్ను గూర్చి నీవు ఆలోచించుకో మనము అందరం పాపులమనియు నరకంలో పడవేయవలసిన వారమని దేవుని యెదుట ఒప్పుకొనవలెను. వీటన్నిటికి మించి మన క్రియలను మనం తీర్పుతీర్చుకొనిన పాపమునకు జీతము మరణమని ప్రకటించు దేవుని ఆజ్ఞ ప్రకారం పాపమునకైన న్యాయ తీర్పు నుండి తప్పించుకొనలేమని గుర్తించగలము.

ఎందుకనగా మానవ హృదయము నుండి బయటికి వచ్చునవి దురాలోచనులను, నరహత్యలు, వ్యభిచారములు, అహంకారము మరియు బుద్ధి హీనతలు మొదలగునవి. వారికి అవకాశము కుదిరినప్పుడెల్ల వీటన్నిటిని చేస్తారు. (మార్కు 7:21-27) మూలముగా దుష్టత్వపు విత్తనాలుగా పుట్టిన వారైన మానవుల హృదయము పరిస్థితులు అనుకూలించినప్పుడు మరియు అవకాశము కుదిరినప్పుడును, ఎల్లప్పుడును దేవుని యెదుట సిగ్గులేని విధముగా ప్రవర్తింపకుండా ఉండగలవా? అది మానవ ప్రయత్నము ద్వారా అసంభవము దేవుని యెదుట సిగ్గుపడకుండునట్లు మనలను అనుతించు ఒకే ఒక విశ్వాసము ఉన్నది. అది ఇక్కడ ఉన్నది. నీలి, ధూమ్ర, రక్తవర్ణ దారము మరియు పేనిన సన్నపు నారతో చేయబడిన సత్యమును విశ్వసించి మనము తెలుసుకొనవలెను. ఈ సత్యము మన పాపాలన్నిటిని శుద్ధీకరించునట్లు చేయును కనుక సిగ్గుపడకుండా మనం దేవుని యెదుట నిలువగలము. అలాగే మన అందరికీ ఖచ్చితంగా నీరు మరియు ఆత్మమూలమైన సువార్త అవసరమే.

మనమందరమూ మన పాపము కొరకు నరకపాత్రులమను సత్యమును త్రోసివేయలేము కానీ ఈ సత్యమును ఒప్పుకొనవలెను. దేవుని యెదుట తాము నరకపాత్రులమని గుర్తించువారి కొరకు దేవుడు అనుగ్రహించిన రక్షణను తమ హృదయములో విశ్వసించుట వారికి కష్టము కాదు. సత్యముతోను, నమ్మకముతోను మనము దేవుని ఎదుర్కొనిన మన హృదయమును ఆయనకు చోటు చేయలేము. కనుక దేవుని నీతి యొక్క న్యాయమును తెలిసికొనెదము. దేవుని న్యాయ తీర్పును బట్టి తమ పాపము కొరకు శిక్షింపబడుట తప్పుకొనలేని పరిస్థితిలో ప్రతివారు ఉన్నారు.

దేవుని న్యాయ శాసనమైన పాపమునకు జీతము మరణము అనునది పాపులందరూ తమ స్వంత ఆలోచనలు మరియు మత విశ్వాసము చుట్టూ వేషము వంటిది కాదు. దేవుని శాసనములు వివరమైనవి, ఖచ్చితమైనవి మరియు న్యాయమైనవి. అతని/ఆమె పాపము కొరకు అతడు/ఆమె నరక పాత్రులమని ఒప్పుకొను వారిని బలవంతము చేయును. తమ చిన్న పాపము కొరకైననూ దేవుని న్యాయ తీర్పు నుండి తప్పించు కొనలేమని పాపులు గుర్తించవలెను.

కాబట్టి మనలనందరినీ పాపము నుండి విడిపించగలిగిన ఒక రక్షకుడు మనకు అవసరము. మరియు ఈ రక్షకుడు ఎవరు అనునది మనము కనుగొనవలెను. ఆయన యేసుక్రీస్తే మానవాళి అందరికీ రక్షకుడు ఎవరు అనునది మనము కనుగొనవలెను. యేసుక్రీస్తే మానవాళి అందరికి రక్షకుడు. ఆయన ఈ లోకమునకు వచ్చి లోకపాపమును తనపై వహించుకొనుటకై యోహానుచే బాప్తిస్మం పొంది సిలువవేయబడి రక్తమును చిందించుట ద్వారా పాపులందరి బలహీనతల యొక్క శిక్షను పొందెను. అందువలన ఆయన మనలను మన పాపాలన్నిటి నుండి రక్షించెను.

పాప పరిహారము పొందుట ఎంతో కష్టతరమని మనమందరమూ అపార్థములో ఉన్నాము. వాస్తవానికి బైబిలును అంతటినీ తెలుసుకున్నప్పుడే మనము రక్షింపబడతామనీ లేదా కొన్నిమంచి పనుల వలన మనకు రక్షణ కలుగునని మనము ఆలోచించవచ్చు. కానీ దేవుడు ఇచ్చిన రక్షణ యొక్క సత్యము వేరైయున్నది. దేవుని ఆజ్ఞ యెదుట మనస్సాక్షిని పరీక్షించుకొనుటతో మన పాపములన్నిటి నుండి రక్షింపబడుటకు మన హృదయంలోని పాపాలను రక్షించుటకు మరియు నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను విశ్వసించుటకు ఈ సత్యము మార్గమును తెరచి చూపించెను. ఈ సత్యము ప్రత్యక్షగుడారపు ద్వారము యొక్క నీడగా ముందుగానే కనిపించెను.

మానవుల పాప క్షమాపణ నీలి, ధూమ్ర, రక్తవర్ణ దారము మరియు పేనిన సన్నపునార దారము ద్వారా నెరవేర్చబడిన ప్రశస్త రక్షణ యొక్క సత్యము నుండి వచ్చును. అనగా ఈ సత్యమును నమ్ముట వలన ఒకేసారి అందరూ పాపక్షమాపణ పొందగలరు. అట్లు చేయుటకు తమ పాపముకై అందరూ నరకపాత్రులమని మరియు నీలి, ధూమ్ర, రక్తవర్ణ దారములో బయలుపరచబడిన సువార్తను నమ్ముట ద్వారా ఒకేసారి అందరూ తమ పాపక్షమాపణ పొందగలమని గుర్తించాలి. దేవుడు మనకు ఇచ్చిన సువార్త నీలి, ధూమ్ర, రక్తవర్ణ దారము మరియు పేనిన సన్నపు నారలో దాగిన సత్యము యొక్క సువార్తలో కనుగొంటాము.

అందరమూ ఈ సత్యసువార్తను తప్పక నమ్మాలి. ఎందుకనగా ఈ సువార్తలో నున్న సత్యమును వారు నమ్మనియెడల వారు తమ పాపము నుండి విడిపించబడలేరు. కానీ నీరు మరియు ఆత్మమూలమైన సువార్తతో దేవుడు నెరవేర్చిన రక్షణ యొక్క సత్యమును నమ్మువారు తమ పాపాలన్నిటి నుండి రక్షింపబడుటకు కావలసిన అర్హత గలవారు మరియు దేవుని సొంత పిల్లలగుదురు. అలాగే దేవుని యెదుట నిలబడి ప్రార్థించగలవారమగుటకు మొదట మనం నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను తప్పక నమ్మాలి. అదే పాపక్షమాపణ యొక్క సువార్త నిజసువార్తను తెలిసికొని దానిని మన హృదయంలో నమ్ముకొని పాపాలన్నిటి నుండి రక్షింపబడినప్పుడు మనం దేవునికి ప్రార్థన చేయుటకు అర్హులమవుతాము. దేవునికి ప్రార్థన చేయుటకు మనలను అనుమతించు ఆ విశ్వాసము నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను మన హృదయంలో విశ్వసించుటతోనే సాధ్యమగును. ఆ సువార్త దేవుని నుండి వచ్చినది.

ప్రత్యక్ష గుడారపు ద్వారపు తెరతో బయలుపరచబడిన నీలి, ధూమ్ర, రక్తవర్ణము యొక్క సత్యమును తెలిసికొని విశ్వాసముంచగల నమ్మిక లేకుండా దేవునికి ప్రార్థింప ప్రయత్నించుట తప్పిదము. అట్టి విశ్వాసము దేవునికి వ్యతిరేకముగా దూషణ మరియు హేళన చేయుట వంటి పాపమును చేయుటతో సమానము. మన హృదయాల్లో ప్రత్యక్ష గుడారములో బయలుపరచబడిన సత్యమును నమ్ముటకు తృణీకరించి దేవునికి శత్రువులము కాగలమా?

నీలి, ధూమ్ర, రక్తవర్ణ దారము యొక్క సత్యము ద్వారా వచ్చిన యేసుక్రీస్తును విశ్వసించుటకు నీవు త్రోసివేసినప్పుడు దేవునితో శత్రుత్వమును పొందుటకు నీవు అది దగ్గర దారి దేవుని పరిశుద్ధతను నిర్లక్ష్యపరచుచు పాపము చేయుటకు కొనసాగించు వారు దేవుడు తమ కొరకు నెరవేర్చిన రక్షణను విశ్వసించువారు. కానీ వారు తమ స్వంత ఆలోచనలు మరియు స్వంత ఉద్దేశ్యమును అనుసరించి నమ్మిక ఉంచుతారు. అట్టి ఆత్మలు, దేవుని ప్రేమ, దయకు మారుగా తమను తాము అంజూరపు ఆకులతో కప్పుకొను అపహాసకులు.

కానీ ఇట్టి ప్రజలు తమను తాము మోసము చేసికొనిననూ వారు దేవుని తీర్పు నుండి తప్పించుకొనలేరని నీవు తప్పక గుర్తించాలి. అట్టి విశ్వాసులు దేవుని ఆజ్ఞను అనుసరించి భయంకరమైన తమ పాపశిక్షతో బాధించబడెదరు. ఎందుకు? తమ పాపాలను తుడిచిపెట్టిన నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను తెలిసికొనుటకైనను (లేదా) ఈ సువార్తను విశ్వసించుటకైనను వారు ప్రయత్నించలేదు.

మన మనస్సాక్షి మనకే మిక్కిలిగా నున్నప్పుడు మన పాపాలను పరిశుద్ధుడైన దేవుని నుండి ఎట్లు దాచగలము? అది అసాధ్యము అతని/ఆమె పాపాలను దాచుకొనగోరినవారు దేవుని ప్రేమ కరుణ నుండి విడువబడెదరు. తమ స్వంత హృదయాలను మోసగించుకొనువారు. దేవుని తమ తోటి వారిని మోసగించు సాతాను దుష్ట పరిచారకులవలే మిగిలెదరు. ఏదో ఒక విధముగా తమ కన్నులను గుడ్డివిగా చేసికొనుటతో దేవుని మోసగించవలెనని తలంచువారు కఠినమైన తమ ఆలోచనల నుండి బయటికి వచ్చు తమ పొగరును ప్రతిబింబింప చేయుచున్నారు. వాస్తవానికి తమ స్వంత ఆలోచనలపై ఆధారపడువారు నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను సవాలు చేయును. తమ స్వనీతి చేత సాతానునకు పరిచారకులగు వారునైయున్నారు.

అట్టివారు తమ స్వహృదయాలను మోసపుచ్చుకొన్నప్పటికి వారు దేవుని మోసగించలేరని ప్రజలు గుర్తించవలెను. దేవుని వాక్యానుసారముగా నమ్మునట్లు తమ మనస్సును మార్చుకొనవలసియున్నది. నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను విశ్వసించకుండా ప్రతివారు తమ పాపమును ఎట్లు కడుగుకొనెదరు? పాపమునకు జీతము మరణమని వ్రాయబడి ఉన్నట్లుగా, దేవుని యెదుట ఆమె/అతని హృదయమును మోసగించుకొనువారైన పాపులు దేవుని తీర్పు నుండి తప్పించుకొనలేరు. దేవుని ఆజ్ఞను మనం ఎరిగియున్నట్లైతే మన పాపములను బట్టి మనము నరకపాత్రులమని స్పష్టమగుచున్నది. అలాగే దేవుని యొద్దకు వచ్చుటకు కోరుకొనువారు ప్రత్యక్ష గుడారపు ద్వారములో బయలుపరచబడిన సువార్త యొక్క సత్యమును నమ్ముట ద్వారా తప్పక రక్షింపబడవలెను.

అయినను అనేకులు తమ పాపము కొరకు తాము శిక్షింపబడవలెనని గుర్తించలేకపోయినందు వలన నీలి, ధూమ్ర, రక్తవర్ణ దారము యొక్క సత్యము ద్వారా వచ్చిన రక్షణయొక్క సువార్తను వారి హృదయముతో అంగీకరించ లేకపోయిరి. ఫలితంగా వారు నరకమునకు దారి తీయుచున్నారు. వారు క్రైస్తవులం కాదా అని కాకుండా నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను విశ్వసించనివారు కూడా అట్టి శిక్షనే పొందెదరు. అలాగే మన దేవుని ఎదుట మన మనస్సాక్షిని మనము మోసపుచ్చుకొనకూడదు. కానీ మన హృదయాలను నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను లోపరచుకొని కృతజ్ఞత కలిగి ఈ సువార్త సత్యమును నమ్మవలెను.సత్యవాక్యమును నమ్ముట ద్వారా మన పాపాలను మనము తప్పక కడిగివేసికొనవలెను.


ప్రజలు రెండు స్పృహలను కలిగి ఉంటారు. ఒకటి శరీర స్పృహ మరియొకటి సువార్త సత్యమును గూర్చిన విశ్వాసపు స్పృహ. ఈ రెండు స్పృహలలోనూ మనము ప్రత్యేకముగా సువార్త యొక్క సత్యమును గుర్తించు స్పృహను కలిగియుండుటలో తప్పిపోకూడదు. దేవుని వాక్యము ముందు మనకున్న విశ్వాస స్పృహను తప్పక పరీక్షించుకోవాలి. యేసు బాప్తిస్మం పొందుట ద్వారా మన పాపాలను అంగీకరించెను. సిలువపై శిక్షింపబడెను. మరియు మనలను రక్షించెను. ఈ విశ్వాసము ద్వారా మన స్పృహ యొక్క పాపాలన్నిటిని కడిగివేసెను. ఇంతకన్నా ఈ సత్యము స్పష్టమైయుండుట అసాధ్యమైననూ ఈ సత్యసువార్తను అనేకమంది ప్రజలు విశ్వసించకపోవుట నాకు కోపము తెప్పించుచున్నది.

మనలోని స్పృహను కడుగుటకై విశ్వాసక్రమము ఉన్నది. మొదటిగా మనము నరకపాత్రులము మొదటిగా గుర్తించి దానిని స్థిరపరచుకోవాలి. రెండవదిగా మన రక్షకుడు ఈ లోకమునకు వచ్చెనని మన పాపాల కొరకే యోహానుచే బాప్తిస్మం పొందెనని సిలువలో చనిపోయెను. మృతి నుండి తిరిగి లేచెను. తద్వారా మన పాపాలన్నిటి నుండి మనలను రక్షించెనని మన హృదయాలలో మనము నమ్మవలెను. పాపులు తమ బలహీనతల నుండి రక్షింపబడాలి. నిత్యజీవమును పొందాలి. ఎట్లనగా నీరు మరియు ఆత్మ మూలమైన సువార్తను విశ్వసించుట ద్వారానే అదే నీలి ధూమ్ర రక్తవర్ణ దారములో బయలుపరచబడినది.

మనము మన పాపాల నుండి రక్షింపబడకుండుటయే కాక, కొంతమంది ప్రజలు ఇంకనూ విశ్వసించరు. నీలి, ధూమ్ర, రక్తవర్ణ దారము ద్వారా పాప పరిహారము నెరవేర్చబడెనని వారికి తెలిసేఉన్నది. వారలాగు ఎట్లు చేయగలరు? ఖచ్చితంగా వారు తమ అవిశ్వాసమునకైన ఫలితమునకు వారే బాధ్యులు. మనము నీలి, ధూమ్ర, రక్తవర్ణ దారములో బయలుపరచబడిన సత్యమును ఎరిగియుండియు నమ్మని యెడల మనము ఇంకనూ పాపములోనే ఉన్నాము. మనమింకనూ పాపములోనే ఉంటే దేవుని నీతి ప్రకారము మన పాపముకొరకై తీర్పు తీర్చబడమా? మనలో ప్రతి ఒక్కరము స్త్రీయైనా, పురుషుడైనా నీలి ధూమ్ర రక్తవర్ణదారము ద్వారా దేవుడు నెరవేర్చిన రక్షణ యొక్క సత్యమును విశ్వసించుటతోనే పాపము నుండి విడిపింపబడెదరు.

ప్రజలు తమ పాపముల నుండి రక్షించునట్టి విశ్వాసమును కలిగియుండవలెను. వారు కేవలము నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను మాత్రమే నమ్మవలెను. ఆ ప్రభువు బాప్తిస్మం పొందుట ద్వారా మన పాపమును వహించెను సిలువలో ఆయన కార్చిన రక్తము ద్వారా మనలను రక్షించెనని నీలి, ధూమ్ర, రక్తవర్ణదారములో బయలుపరచబడిన సువార్తను నీవు నమ్ముచున్నావా? నిన్ను గురించి నీవు యోచించుకొన్నట్లయితే నీవు వాస్తవముగా నరకపాత్రుడవేనని నీవు ఒప్పుకొందువా? నీవు నరక పాత్రుడవని, ఆ ప్రభువు నీలి, ధూమ్ర, రక్తవర్ణ దారములో బయలుపరచిన సత్యముతో మన పాపముల నుండి రక్షించెను అని నీవు గుర్తించగలవా?

మన పాపాలన్నిటిని గూర్చి బాధ్యత వహించుటకే ప్రభువు ఈ లోకమునకు వచ్చెనని బాప్తిస్మం పొందెను. తన రక్తమును కార్చెనని నీవు గుర్తించాలి. నీ, నా పాపాలను తుడిచివేయుటకు మన ప్రభువు మానవ శరీరమును ధరించుకొన్నవాడై ఈ లోకమునకు వచ్చెను. మానవాళి అందరి పాపాలను తన శరీరముపై మోపుకొనుటకై యోహానుచే యొర్ధాను నదిలో 30సం.ల వయస్సులో బాప్తిస్మం పొంది ఒకేసారిగా పాపశిక్ష భరించుటకై సిలువ వేయబడి రక్తము కార్చి చనిపోయెను. వీటన్నిటితో ప్రభువు ఒక్కసారిగా నమ్మువారి పాపాలను పరిహరించెను.

నీలి, ధూమ్ర రక్తవర్ణ దారములో బయలుపరచబడిన సత్యమును నమ్ముట ద్వారా మనము మన పాపాల నుండి రక్షింపబడతాము. ఈ సత్యము ద్వారా నిజముగా మనము రక్షింపబడినామో లేదో అని మనలను పరీక్షించుకొని రూఢి పరచుకోవాలి రక్షకునిగా నీలి, ధూమ్ర రక్తవర్ణల దారము ద్వారా వచ్చిన వాడైన యేసుక్రీస్తును విశ్వసించు నమ్మికను మనము కలిగియుండవలెను. బైబిలు చెప్పుచున్నట్లు ‘‘ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును; రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును.’’ (రోమా 10:10) రోమా 10:17కూడా ప్రకటించుచున్నది. ‘‘కాగా వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును.’’

క్రీస్తు యొక్క ఈ వాక్యము మనకు చెప్పునది మనము నీలి, ధూమ్ర రక్తవర్ణ దారములతో నెరవేర్చబడిన రక్షణను నమ్ముట ద్వారానే రక్షింపబడితిమి. పాప పరిహారము అనునది మన స్వంత ఆలోచనలతో నమ్ముట ద్వారా సాధించునది కాదు కాని నీలి, ధూమ్ర, రక్తవర్ణల దారము ద్వారా వచ్చిన రక్షణను మన హృదయములో నమ్ముకొనుట ద్వారా వచ్చునదే. మనలను నిజముగా నమ్మునట్టి విశ్వాసము ద్వారానే వచ్చును.

ఈ సత్యము నందు మనము విశ్వాసముంచు దేవుని ప్రార్థించాలి? ఆత్మలోనే మనము ఎల్లప్పుడు ప్రార్థనలను, విజ్ఞాపనలను చేయుచూ సత్యముతో మన ప్రయాసమును జోడించవలెను. (ఎఫెస్సీ 6:14-18) కానీ ఈ సత్యము ఏమైయున్నది?

అది మన ప్రభువు మనలను రక్షించుటకు ఈ లోకమునకు వచ్చెను 30 సంవత్సరముల వయస్సులో బాప్తిస్మమిచ్చు యోహాను వలన బాప్తిస్మం పొందెను. లోకపాపాలన్నీ మోసికొనిపోయెను. తన రెండు చేతులు కాళ్లలో మేకులు కొట్టబడెను. ఉమ్మివేయబడెను. తన రక్తమును చిందించెను. అట్లు మన పాపాలన్నిటిని కడిగెను అని చెప్పు సువార్త మాత్రమే. ఈ సత్యమునందు మనకున్న విశ్వాసము ద్వారా మన పాప పరిహారము నెరవేరెనని మనము ఒప్పుకొనవలెను. మన ప్రభువు తన బాప్తిస్మము మరియు సిలువలో కార్చిన రక్తము ద్వారా మన పాపములకై శిక్ష పొంది మనలను పాపము నుండి రక్షించెను.

“ప్రభువా నీవు నన్ను ఎంతో ప్రేమించావు కనుక నన్ను దేవుని స్వంత బిడ్డలుగా చేశావు”, ఈ విధముగా మనము మన విశ్వాసమును ఒప్పుకోవాలి. మనము కలిగియున్నదంతయూ పాపమైనప్పుడు మన ప్రభువు తన బాప్తిస్మము మరియు సిలువ వేయబడుట ద్వారా మన పాపాలను తుడిచి పరలోక రాజ్యంలో ప్రవేశించు అర్హతను మనకు ఇచ్చెను ఈ సత్యమును మనము నమ్మి, నిత్యజీవమును పొందాలి.

ఈ సత్యమును నమ్మకపోవుటకై నీకు గల కారణమేమి? నాకైతే ప్రభువు నన్ను నా పాపం నుండి విడిపించుటకు బాప్తిస్మం పొందక పోయిననూ నేనేమి అనలేను. కానీ నా కొరకే నిజానికి ఆయన బాప్తిస్మం పొందెను. తన రక్తమును కార్చెను. కనుక నన్ను నా పాపాల నుండి రక్షించెను. కనుకనే నేను నమ్ముతాను. మన మందరమూ ఈ సువార్తను నమ్మకపోవుటకు యే కారణము లేదు. పాపులు నీరు మరియు ఆత్మమూలమైన సువార్త యొక్క సత్యమును నమ్ముట ద్వారా ఇప్పుడే పాపము నుండి రక్షింపబడాలని కోరుకొనుచున్నాను.

నేను యేసును నమ్ముచున్నానని ప్రవచించుచూనే నా మట్టుకు నేను పాపిగా మిగిలిపోయిన సమయము ఉన్నది. మంచి క్రైస్తవునిగా ఉండాలని కోరుకోనుచూనే పరలోకములో సిగ్గుపడకుండా ఉండాలని నేను ఎంతో ప్రయత్నించాను. కానీ నా కోరికలకు భిన్నంగా ఆయా సమయములలో పాపము చేయుచూ వచ్చాను. నాకున్న ఓదార్పు ఏమనగా నన్ను నేను ఇతరులతో పోల్చుకొన్నప్పుడు వారికంటే నేను కొంచెం ఫరవాలేదులే అని నేను తలంచే వాడిని. అయిననూ నా మనస్సాక్షిలో ఇంకా పాపం ఉందని చెప్పుచూ ఉండేది. మరియు దేవుని నీతి ప్రకారము పాపమునకు జీతము మరణము కనుక నా దోషమును బట్టి నేను నరకమునకే చెందినవాడనని నా మనస్సాక్షి చెప్పేది.

న్యాయపరమైన ఊపిరాడని నా జీవితము ఒక దశాబ్ధం తరువాత నేను ఆత్మీయంగా చనిపోయినట్టుగానే ఉన్నాను. అయిననూ దేవుని కృప చొప్పున నన్ను మేల్కొల్పెను. తన కృప చొప్పున యేసుక్రీస్తు నా కొరకు బాప్తిస్మం పొంది నా పాపమును తనపై మోపుకొనెను. ఆయన నా పాపాలను మాత్రమే కాక ఈ లోకములోనున్న ప్రతి ఒక్కరి పాపాలను వహించెను. తరువాత ఆయన వాటిని సిలువ వరకూ మోసి, మృతి నుండి తిరిగి లేచెను. కనుక ఇప్పటికీ జీవించుచున్న నిజరక్షకుడాయెను. ఈ సువార్త సత్యమును నేను తెలుసుకొన్నప్పుడు నేను దానిని నమ్మకుండా ఉండలేకపోయాను. మరియు తన బాప్తిస్మము మరియు సిలువలో కార్చిన రక్తము ద్వారా యేసుక్రీస్తు నా రక్షణ యొక్క దేవుడని నమ్మికతో నా పాపాలన్నియూ కడిగివేయబడినవి. నేను నా హృదయ విశ్వాసముతో పాపపరిహారము పొందియున్నాను.

నేను నా పాప పరిహారము పొందిన దేవుని వాక్యము అంతయూ నాకు తెలియును కనుక నా మనస్సాక్షి యొక్క పాపమును తెలిసికొని ఆయన బాప్తిస్మం ద్వారా ఈ పాపాలను యేసుక్రీస్తుపై మోపి నా పాప జీతమును చెల్లించుటకు ఆయన సిలువలో శిక్షింపబడెనని నీ హృదయంలో నమ్ముట వలన నేను రక్షింపబడితిని. నేను పాప పరిహారమును పొందియున్నాను. కనుకనే సువార్తను బోధించుచూ నా జీవితమును గడుపుచున్నాను. నీవు నేను ఒకే రీతిగా ఉన్నాము. వాస్తవంగా మన మధ్య ఏ బేధమును లేదు.

నీవలెనే నేను కూడా నరకపాత్రుడనే కేవలము నీవలెనే నేను కూడా నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను నమ్ముట ద్వారానే పాప పరిహారమును పొందితిని. దేవుడు మన పాపాలను తుడుపుపెట్టిన ఈ సువార్తను నమ్మినట్లైతే నీవును నేనును ఒకే రీతిగా పాపము నుండి రక్షింపబడతాము. కనుక నేను నా ప్రభువుకు కృతజ్ఞతలు చెప్పుచున్నాను. ఈ విధముగా మనము నీరు మరియు ఆత్మమూలమైన సువార్త ద్వారా పరిపూర్ణ పాప పరిహారమును పొంది విశ్వాసము యొక్క స్పృహను ఇప్పుడు కలిగియున్నాము. కనుక మనము దేవుని యొద్దకు పోయి ఆయన స్వంత పిల్లల వలెనే పాప పరిహారమును పొంది ఆయనకు ప్రార్థన చేయగలము.

పరిమళ ధూపము వేయు వేదిక అభిషేక తైలమును సువాసన ధూపముతో వేయబడిన సువాసన అని బైబిలు మనకు చెప్పుచున్నట్లు యేసు మనలను పరిశుద్ధ సువార్తయొక్క సత్యముతో మన పాపాలను కడిగి మనలను పరిశుద్ధులుగా చేసెను. పాతనిబంధన కాలములో, దేవుడు ఆజ్ఞాపించినట్లే ఇశ్రాయేలు ప్రజలు ఈ ధూపమును చేసి దానిని ఆ బల్ల ఫై దహించవలెను. కనుక పరిశుద్ధ స్థలములో ధూపము దహించబడేది. దాని సువాసన ప్రతి దినమూ పైకి వచ్చేది. ధూపమనగా దేవునికి ప్రార్థన చేయుట.

నూతన నిబంధన కాలములో పరిశుద్ధ స్థలములో ఉంచుటకై నీవు మొదట సత్యసువార్తను నమ్మాలి. మరియు నీ హృదయంలో పాప పరిహారమును పొందాలి. మరొక విధంగా సత్యసువార్తను నమ్ముట ద్వారా ఒకడు ప్రార్థనా ధూపమును వేయవచ్చును. ఏదేమైననూ మనము పాత నిబంధన కాలములో వలనే ధూపమును వేయుట మనకు సాధ్యమా? దహన బలిపీఠము యొక్క అట్టి ఉపకరణము ఇప్పుడు మన చుట్టూ లేకపోయినందున నీవు నేను దహనబలిని చేసి ఎట్లు బలిపీఠముపై అందించగలము? మనము విశ్వాసముతో ప్రార్థనా ధూపమును వేయగలము ఎందుకనగా యేసుక్రీస్తు మన పాపాలను తుడిచి మనలను రక్షించెను. మనము పాప పరిహారమును పొందినప్పుడు మన హృదయాలు కడుగబడును కనుక మనము మన హృదయ పూర్వక ప్రార్థనతో దేవుని యొద్దకు చేరునట్లు ఇప్పుడు మనము ధూపమును వేయగలము.

నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను మన పూర్ణ హృదయాలతో నమ్మితిమి కనుక మన పాపాలన్నియూ యేసుక్రీస్తుపై మోపబడెను. మరియు మనకు బదులుగా యేసుక్రీస్తు మన పాప శిక్షను భరించెను. అందువలన నీ నా హృదయాలు శుద్ధి చేయబడినవి. మన హృదయ పాపాలు యేసుపై మోపబడెను. కనుక మన హృదయాలన్నీ ఒకేసారిగా పూర్తిగా శుద్ధి చేయబడినవి. మన పాపాలన్నీ యేసు యోహాను యొద్ద నుండి పొందిన బాప్తిస్మం ద్వారా ఆయనపై మోపబడినా నీపాపాలన్నీ కడుగబడి ఒక్కసారిగా తుడిచివేయబడెను. ఇక ఎప్పటికీ నీ పాపాలన్నీ కడుగబడి ఒక్కసారిగా తుడిచి వేయబడును. ఇక ఎప్పటికీ ఏ పాపము నీ హృదయములో విడువబడదు. సువార్తను నమ్ముటతోనే మన పాపాలు శుద్ధి చేయబడి తుడువబడినవి. కనుక ఇప్పుడు మనము పరిశుద్ధ దేవునికి ప్రార్థన చేయుట మన విశ్వాసంపై ఆధారపడును. ఖచ్చితంగా మనము సువార్తను నమ్ముట ద్వారానే పాప పరిహారమును పొందినాము. అదే ఇప్పుడు నమ్మకమైన మన హృదయాలకున్న పునాది.

సహోదరి సహోదరులారా ధూపవేదిక యొద్దకు వెళ్ళి పరిమళ దూపము వలె ప్రార్థన చేయుడి. ‘‘దేవా దయచేసి నాకు సహాయము చేయుము. నేను ఉన్న పరిస్థితి ఇది. కనుక ఇది నాకు అవసరము. నేను సత్యసువార్తను ప్రచురపరచుచూ నీతిగా బ్రతకాలని కోరుకొనుచున్నాను తండ్రీ, నిజముగా తమ పాప పరిహారము పొందినవారి వలే సత్యమైన జీవితం గడపాలని కోరుకొనుచున్నాను. నేను నీతి ఫలాలను ఫలించాలని కోరుకొనుచున్నాను. నీ యందు నాకు విశ్వాసమునిమ్ము. నీ చిత్తప్రకారముగా జీవించాలని కోరుకొనుచున్నాను.’’ ఇట్లు ఒకని అవసరతను అడగడమే ప్రార్థన. అనగా ఆయన నీతి అనుగుణంగా దేవుని సహాయమును కోరుకొనుటయే.

నీకు అనేకమైన ప్యాషన్లు మరియు కోరికలు ఉండి ఉండవచ్చును. మనలను తీర్చిదిద్దిన నీరు మరియు ఆత్మమూలమైన సువార్తయందున్న నమ్మకము వలన మనము నీతిమంతులుగా చేయబడినాము కనుక దేవుని మనము అన్ని విషయాలను ప్రార్థనతో అడుగుట ఇప్పుడు ఎంతో వీలైనది. దేవుని సహాయము కొరకు దేవుని ప్రార్థించువారు సంతోషంగా ఉంటారు. ఇప్పుడు నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను నమ్మినందున మనమందరమూ మన పాప పరిహారం పొందితిమి కనుక సందేహించక మనమందరమూ దేవునికి ప్రార్థించగలము.

దేవుని యందు నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను నమ్మిక ఉంచువారు. తమ హృదయములో పాప పరిహారమును పొందియున్నారు. కనుక పరిశుద్ధులు దేవుని యొద్దకు వెళ్ళి ఆయన సహాయమును అడుగుటకు అనుమతి పొందియుంటారు. తిరిగి జన్మించిన విశ్వాసులందరూ తప్పకుండా తమ జీవితాలలో తండ్రి సహాయమును కోరుకుంటారు. ఎట్లనగా ఒక పసి పిల్ల తన తల్లి / తండ్రి సహాయమును కోరుకుంటారు. అతడు/ఆమె కష్టములో నున్నప్పుడు ఏడ్చినట్లుగానే వారికి పాప పరిహారము నిచ్చిన వారి విశ్వాసము దేవుని వారు తండ్రీ అని పిలువగలిగినట్లు అనుమతించుట కాక వారిని అతని స్వంత కుమారుడు మరియు కుమార్తెవలే అన్ని సమయాలలో సహాయము చేయుమని తండ్రికి ప్రార్థించునట్లును ఈ విశ్వాసం చేయును. మన విశ్వాసము వలన దేవుడు మనకు తండ్రియైనందున మన అవసరతను బట్టి మన ప్రార్థనల ద్వారా ఆయన సహాయము కోరగలము.


నీవు పాపపరిహారం పొందినంతగా నీ స్వంత ప్రార్థనలు ఎట్లు ఉండునో లేదా అవి దేవునిచే తెలుసుకోగలుగుతామా అనేది నాకు తెలియదు. కానీ నాకు తెలిసినది ఏమంటే దేవుని సంఘముతో మనము కలిసియుండునట్లు చేయుమని సువార్త ప్రచురించమని ఆయనను నీవు ప్రార్థించినప్పుడు ఆయన ఖచ్చితంగా నీ ప్రార్థనలకు జవాబులను ఇస్తారు. అనగా ఈ విధముగానే ఇతరుల గూర్చి కూడా మనము ప్రార్థించవచ్చును. మొదటిగా ప్రతి ఒక్కరు అతని / ఆమె శరీర అవసరత కొరకే ప్రార్థిస్తారు. కానీ పరిశుద్ధాత్మ క్రియల వలన ఇతరుల కొరకు ప్రార్థించుటకు అత్యవసరము ఉన్నదని మనము గుర్తించగలము. మరియు ఇతర ఆత్మల రక్షణ కొరకు ప్రార్థించుటకు మరియు ప్రపంచమంతటయూ నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను ప్రచురించాలని మనలను మనం అట్లు గుర్తించుకొనగలము. ఎందుకు ? ఎందుకనగా తిరిగి జన్మించిన పరిశుద్ధుల ప్రార్థనలు పరిశుద్ధాత్మ నడిపింపునకై ఉంటాయి. ప్రభువు మనతో చెప్పెను? ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి. (మత్తయి 6:33)

కానీ తిరిగి జన్మించిన వారిలో ఆత్మీయంగా పరిణతి చెందనివారు సరియైన వాటి కొరకు ఎట్లు ప్రార్థించాలో తెలియనివారై ఉంటారు. ఎందుకనగా వారు దేవుని సమాధానమును ఇంకనూ పొందనివారై ఉంటారు. ఇలా ఎందుకనగా దేవుని నీతియందలి విశ్వాసము ఎంత శక్తిగలదో వారికి తెలియదు. విశ్వాసము కొద్దిగా కలవారు తమ ప్రార్థనలకు జవాబు వస్తుందో లేదో తెలియనివారై ఉంటారు. కానీ వారిని ఎన్నో అనుమానాలు వెంటాడుతూ ఉంటాయి.

అలాగే వారు తమకంటే ముందుగా విశ్వసించిన వారితో కలిసి ప్రార్థించవలెను.ఎవరి విశ్వాసము లేతగా ఉండునో వారు ప్రార్థించుటకు ఇష్టపడరు. వారు ప్రార్థించునప్పుడు తమకు ఏది కావాలో దానినే అడుగుతారు నా కివ్వు నా కివ్వు కానీ చిన్నవారు గొప్ప విశ్వాసం లేనప్పటికి సంఘముతో కలిసి ప్రార్థిస్తే అప్పటికీ ప్రార్థన అంటే ఏమిటో వారు తెలుసుకొనగలరు. ఎట్లనగా సంఘములో పెద్ద విశ్వాసులు దేవుని నీతి కొరకూ ప్రార్థిస్తూ ఉంటారు. మరియు సంఘముతో కలిసి ప్రార్థించు వారికి పరిశుద్ధాత్మ విశ్వాస ప్రార్థన అనుగ్రహించును. కనుక క్రమముగా వారు దేవుని నీతికొరకు ప్రార్థించగలుగుతారు. ‘‘నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై యుండును.’’(యాకోబు 5:16)

తిరిగి జన్మించిన వాని విశ్వాస పూరిత ప్రార్థన దేవుని యెదుట హక్కుగలదై బహుబలముగా నుండును. దేవునియందు విశ్వాసము కలవారి ప్రార్థనలు వాస్తవముగా ఆయనచే జవాబును పొందును. ప్రజలు దేవునికి ప్రార్థించినప్పుడు వారి ప్రార్థనకు తండ్రి జవాబిచ్చును కనుక వారు మొదటగా దేవుడు తమ స్వంత తండ్రి అని నమ్మవలెను. ఆయన వారి ప్రార్థనకు సరియైన జవాబును వారి విశ్వాసమును బట్టి దయచేయును. అలాగే విశ్వాసంలో పెద్దవారు తమ అడుగుజాడలను అనుసరించి నడుచువారి కొరకు. మరియు సువార్త ప్రకటన అను నీతి కార్యము కొరకు ఏకముగా ప్రార్థించినప్పుడు గొప్ప క్రియలను వారు అనుభవింతురు. దేవునిలో నమ్మికనుంచని పెద్ద తరువాత నీవు నిలబడితే నీవు నీ విశ్వాసంలో ఎంతో సహాయమును పొందుతావు. మనము ఉన్నామని ఆయన రక్షణ అను కృపతోనే కాక జీవితంలోని మిగిలిన అంశములో కూడా తన సహాయము మనకు అవసరమని దేవునికి తెలియును కనుక ఆయన మన ప్రార్థనలకు జవాబిచ్చును. ఇందువలన మన అందరికీ దేవుని సంఘముతో ఐక్యమైన విశ్వాసము అవసరము.

దేవుని సంతోషపెట్టువాటి కొరకు మనము ప్రార్థిస్తే మన విశ్వాసము అధికముగా వర్ధిల్లును సమాయానుకూలముగా ఆత్మీయ పిల్లలు సమయానుసారముగా వారి పరిణతి చెందిన స్వంత ప్రార్థనలను చేస్తూ ఉన్నప్పుడు తరువాత మనము కూడా తండ్రియైన దేవునికి మన స్వంత సమస్యల కొరకు ప్రార్థించగలము. అట్లు చేయువారు దేవుని నిజముగా నమ్మి వాస్తవ సత్యమును అనుసరించుచూ విశ్వాసమార్గములో నడిచెదరు. బైబిలు చెప్పుచున్న ప్రకారము నీతిమంతులు విశ్వాస మూలముగా జీవించును. వారు తమ కొరకే కాక మిగిలిన ఆత్మల రక్షణ కొరకు కూడా జీవించెదరు.

దేవుని ప్రార్థించునట్టి అర్హతను మనము ఎట్లు పొందగలము? దానిని మనము దేవుడు అనుగ్రహించిన నీరు మరియు ఆత్మమూలమైన సువార్త యందు మనకున్న విశ్వాసము ద్వారా తిరిగి జన్మించి పొందుకొనగలిగాము. కేవలము నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను నమ్మి పాప క్షమాపణ పొందిన వారికి తండ్రియైన దేవుడు అనుగ్రహించిన విశ్వాసము యొక్క ధైర్యము దేవుని ప్రార్థించునట్లుగా చేసెను. విశ్వాసము దేవుని వరమే. ప్రార్థించు అర్హతను సంపాదించుట అనగా దేవుని నుండి విశ్వాసమను గొప్పవరము పొందుటయే.

ఈ గ్రహముపై నున్న క్రైస్తవులలో అట్టి విశ్వాసముతో ప్రార్థించు అర్హత పొందినవారు ఎంతమంది ఉన్నారని మీరు తలంచుచున్నారు? ఎంతోమంది కాదు. దేవునియొక్క గొప్ప వరములో ఒకటి. మొదటిగా నీలి, ధూమ్ర, రక్తవర్ణ దారములో బయలుపరచబడిన సత్యముతో మనలను పాపము నుండి రక్షించిన విశ్వాసమును కలిగియుండుటయే. రెండవదిగా మనము దేవునికి ప్రార్థించునట్లు ఆయన స్వంత పిల్లల వలే శక్తిని అర్హతను పొందియుంటిమి. మూడవదిగా మనము దేవుని పరిచారకులుగా పనిచేయగల విశ్వాసమును పొందియున్నాము.దేవుడు పాపుల ప్రార్థనలకు జవాబునివ్వడు


కొంతమంది పాపులు తాము యేసుని నమ్ముచున్నామని చెప్పుకొన్ననూ తమ పాపాలను తుడిచివేసికొనుటకై కొన్ని కొండలెక్కి ప్రభుని నామమున తరచుగా బిగ్గరగా ప్రార్థించాలని చెప్పుదురు. చల్లటి గాలులు వీచుచున్న రాత్రులలో కూడా వారు కొండ లెక్కుచూ తమ శరీరమును ప్లాస్టిక్‌ పేపరుతో కప్పుకొనుచూ తమకు భయము కలుగుచున్ననూ వారు తమ భక్తి కొలదీ బాగా ప్రార్థన చేస్తారు. కానీ వారి ప్రార్థనలు ఖాళీ ప్రదేశాల్లోనే తిరుగుచుంటాయి.

వారు రాత్రంతా ప్రార్థించిననూ దేవుడు నిజముగా తమ ప్రార్థనలకు జవాబిస్తాడనే విశ్వాసము లేకుండానే ఉంటారు. వారు విశ్వాసము లేనివారై అంత భక్తిగా ప్రార్థించుటకు కారణము అది ఏదో ఒక ఎగ్జిబిషన్‌ వలే ఇతరులకు కనబడాలని ప్రార్థిస్తారు. వారి ప్రార్థనలు జవాబులేని ప్రార్థనలు వాస్తవానికి తమ ప్రార్థనలు చేరుటలేదని తమ మనస్సాక్షికి తెలిసియుండును. ఎట్లనగా ఇంకనూ వారు హృదయంలో పాపమును కలిగి ఉంటారు. వారు తమ పాపాలకు క్షమాపణ పొందాలి. కనుక వారి అనేక ప్రార్థనలకు జవాబు రాదు. వారు ఎంతగా ప్రార్థించిననూ అరచి మొర్రపెట్టిననూ తమ పూర్ణ శ్వాసతో ఊపిరిని పీల్చిననూ వారి అవసరత కొరకు దేవుని ఎంతగా అడిగిననూ వ్యర్థమే.

వారు గ్రహించవలసినదేమనగా దేవునికి ప్రార్థించుటకు ముందు వారికి అవసరమైనదేమనగా మొదటిగా పాపక్షమాపణ చాలావరకు పాపులు నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను తెలుసుకొను వరకు వారికి మరొక మార్గములేదు. కనుక తమ జీవితాలను పాపులుగానే కొనసాగించెదరు. ప్రజలు దేవుడు వారికిచ్చిన నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను తమ హృదయాలలో నమ్మగానే ఒక్కసారిగా తమ పాపాలు కడుగబడక పోయినట్లయిన వారి ప్రార్థనలు నిజముగా నిష్ఫలమే. పాపులు దేవునికి ప్రార్థించ ప్రయత్నించినప్పుడెల్లా వారి మనస్సు ఇట్లు బిగ్గరగా కేకవేయును. నీ ప్రార్థనలో దేవుని నీవు తలంచుచున్నావా? ‘‘కనుకను! అవన్నీ నిష్ఫలమే!’’ ఒకవేళ వారు ‘‘ఇదినాకివ్వు, అది నా కివ్వు’’ అని దేవుని ప్రార్థించుచూ ఉన్నను వారి ప్రార్థనలు నిజముగా ఫలరహితమే.

“నీవు నాకు ప్రార్థన చేయకమునుపే మొదటిగా నీ పాపాలకు క్షమాపణ పొందు” అది దేవుని చిత్తము. పాపక్షమాపణ పొందని వారు దేవుని ప్రార్థిస్తే వారు స్వానుభవముతో తమ మనస్సు తమతో ఏకీభవించలేదు గ్రహిస్తారు. పాపులు ‘‘ప్రభువా నాకిది ఇవ్వు. దానిని కూడా ఇవ్వు” అని ప్రార్థించుచూ ఉంటే వారి మనస్సే వారికి చెప్పును. ‘‘దారిలేదు, నీ ప్రార్థనలకు జవాబు రాదు. ఎందుకనగా నీవు పాపివి.’’

తమ మనస్సాక్షిలో కూడా పాపపు నమ్మికను భరించలేనప్పుడు దేవుని మోసగించుట సాధ్యమేనా? వారు దేవునిచే ఎట్లు అనుమతి పొందగలరు. వారి ప్రార్థనలకు జవాబు ఎట్లు వచ్చును? సూక్ష్మంగా పాపులు దేవునికి ప్రార్థించ అర్హులు కారు. దానికిపైగా వారి హృదయాలే వారి ప్రార్థనలకు ఆటంకము కలిగించును.మనము విశ్వాసంతో నీతిమంతులమైనప్పుడే మన ప్రార్థనలకు జవాఋ ప్రారంభించును.


అనేకులు పూర్వము పాపులైన వారి ప్రార్థనలు ఒక్కసారిగా జవాబివ్వబడుట ప్రారంభించును. ఎట్లనగా వారు ప్రత్యక్ష గుడారము యొక్క నీలి, ధూమ్ర, రక్తవర్ణ దారములో బయలుపరచబడిన నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను తమ హృదయములో విశ్వసించువారు తమంతట తాము పరిపూర్ణులు కాలేకపోవచ్చును. కానీ విశ్వాసముతో వారు దేవుని యొద్దకు వెళ్ళగలరు. విశ్వాసముతోనే వారు ధైర్యముగా ఆయనకు ప్రార్థించగలరు. ఆయనను తమ అవసరత కొరకు అడుగగలరు. విశ్వాసముతో పాపక్షమాపణ పొందిన వారు దేవుని, ఆయన చిత్తానుసారముగా ప్రార్థించగలరు. అప్పుడు వారు ధైర్యముగా ప్రార్థించెదరు.

కానీ వారు తమ స్వంత శరీరము కొరకు ప్రార్థించుచున్నప్పుడు ఆ సమయంలో వారు తగినవారిగా కనబడలేరు. నీతిమంతులమైన మనము నీరు మరియు ఆత్మమూలమైన సువార్త వ్యాప్తికై ప్రార్థించునప్పుడు అత్యంత సంతోషం పొందెదము. ఎట్లనగా మిగిలిన ఆత్మల కొరకు మనము సువార్త యొక్క స్థిరమైన వ్యాప్తి కొరకు ప్రార్థించినప్పుడు శరీరము యొక్క ఆటంకము వలన పట్టబడిననూ మనకున్న పరిధిని గూర్చిన ఆటంకమును విశ్వాస మూలమైన ప్రార్థన ద్వారా జయించగలము. కానీ ఆయా సమయములలో అట్టి ఆటంకమును విశ్వాసము ద్వారా జయించలేనప్పుడు కృంగి పోయెదము. అట్టి సమయాలలో మనము ప్రార్థన చేయుచూ దేవుడు జవాబులిచ్చునని విశ్వసించగలము మరియు ఖచ్చితముగా ఆ సమయంలో అట్టి ప్రార్థనలకు దేవుడు జవాబిచ్చినను సాక్ష్యము పొందెదము.

మనము చేయవలసినది ప్రార్థించి వేచి యుండటం. కానీ నా ప్రార్థనలకు జవాబు ఎందుకురాలేదు అసహనముతో ఆశ్చర్యపోకూడదు. మనము విశ్వాసముతో ప్రార్థించాలని దేవుడు మనలను కోరుచున్నాడు. మన ప్రార్థనలు దేవుని చిత్తముతో సమముగా ఉన్నప్పుడు సమయము వచ్చినప్పుడు ఆయన సమాధానమిచ్చునని విశ్వాసము కలిగి ఉండాలి. మరియు విశ్వాసము ద్వారా మనము పాపపరిహారమును పొందినప్పుడు మన జీవితంలో విశ్వాసంతో ప్రార్థించినప్పుడు వాస్తవంగా మన ప్రార్థనలో అనేక జవాబులు పొందెనను అనుభవమును పొందెదము.

ఇట్టి విశ్వాసముతో నీవు జీవించావా? అలాగైతే నీవు నిజముగా దేవుని ప్రార్థించగలవు. మరొకసారి మనలను పరీక్షించుకొంటే మనము నరకపాత్రులమని గుర్తించగలము. నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను విశ్వసించుట ద్వారా మన పాపపరిహారమును పొందుట వలననే ప్రార్థించ అర్హత పొందినామని గ్రహించగలము. అలాగే ప్రార్థించగల వారందరూ తమ పాపపరిహారమును పొందినవారే. ఎట్లనగా నీరు మరియు ఆత్మమూలమైన సువార్త వలన తమ జీవితకాల పాపమును ప్రభువు తుడిచెనని విశ్వసించుట వలననే.

తిరిగి జన్మించని వారిలో తమను గూర్చి తాము గర్వించువారు అనేకులున్నారు. నీ గురించి ఏమిటి? గర్వించదగినది నీకేమైనా ఉన్నదా? నీ చేతులు బలము గలవా? నీ కాళ్ళు బలముగలవా? మన శరీరాలు ఎంత బలమైనవైననూ అవి సాధారణ జలుబు వైరస్‌కు తట్టుకొనలేవు. లేదా ఏదైనా భౌతిక బలముకు తట్టుకొనగలవా. వాటి నిజ బలహీనతలను కనుపరచును. మనుష్యులు ఎంత బలహీనులో నీవు గ్రహించగలవా? మనము దోమకాటుకే చనిపోతాము. నడుచుచుండగా జారిపడిన రాతిదెబ్బ వలనచచ్చెదరు. మనము అశక్తులము. మన అహమును గాయపరచునట్లు ఎవరైనా ఒక్క మాట అంటే మన హృదయం గాయపరచబడి సగము చచ్చిన వారమౌతాము. ఇది వాస్తవం కాదా? అదే కావచ్చు.

ఎంతమంది 60 సంవత్సరాలు నిండకుండానే చనిపోవుచున్నారు. 30 సంవత్సరాల వయస్సు చూడకుండానే గతించువారు అనేకులు. అట్టి బలహీనులు మానవులే. మానవులకు శాశ్వతమైన బలము ఎక్కడా కనబడదు. అట్టి బలహీనుల హృదయాలను మాత్రం కఠినపరచుకొని వాక్యమును తమ హృదయాలలో నమ్మకుండా ఉండవచ్చునా? ఏ గర్వము లేకుండా బలవంతులమని నటించక ఉండవలెను.

అలాగే మన బలహీనతలను మనము గుర్తించాలి. మన అసంపూర్ణతను పాపమును గ్రహించాలి. మన హృదయాలలో నీలి, ధూమ్ర, రక్తవర్ణ దారము ద్వారా నెరవేరిన సత్యసువార్తను నమ్మాలి. తద్వారా దేవుని ప్రార్థించగల అర్హతను పొందుకొనగలము. మనము దేవునిలో విశ్వాసమును కలిగి ఉండాలి. హృదయంలో దేవుని సంతోషపరచునట్టి విశ్వాసము పొందుటకు ప్రజలు నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను విశ్వసించాలి కానీ దానిని నమ్మనివారు ఇంకనూ అనేకులున్నారు. దేవునికి ప్రార్థించు హక్కును నీవు నీరు మరియు ఆత్మమూలమైన సువార్త ద్వారా కాక ఇతర సువార్త వలన సంపాదించితివా? నీ పాపమును తుడిచినది, యేసు ఈ లోకమునకు వచ్చి నీ పాపాలను ఆయన మీద నీ కొరకు మోపుకొనుట ద్వారా కాదా? నీ హృదయ పాపాలను యేసుపై మోపి, యేసుపొందిన బాప్తిస్మమును నమ్ముట ద్వారా వాటిని కడిగివేయలేదా?

సమాధానము కాదు అనేనా, కానీ అది ఖచ్చితంగా తప్పు యేసు యోహాను నుండి పొందిన బాప్తిస్మం ద్వారా మన పాపాలను భరించెను కనుక ఆయన సిలువ వేయబడి తన స్వంత రక్తముతో ఆ పాప శిక్షను భరించెను. నీవు యేసుని బాప్తిస్మము మరియు సిలువ వలన కాకుండా నీవు రక్షింపబడెదవా? రక్షింపబడలేవు. యేసు బాప్తిస్మం పొంది మన పాపాలన్నిటిని వహించుకొని వాటిని కడిగివేసెను. మన పాపాలను శుద్ధి చేయుటకే మరియు ఆయన సిలువ వేయబడినది మన పాపము శిక్షను భరించుటకే అనగా నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను నమ్ముటతో మనము మన పాపాలన్నిటిని పొగొట్టుకొంటిమి.

కనుక మనము ఏ సమయములోనైనా ధైర్యముగా దేవునియొద్దకు వెళ్ళి ఇట్లు ఒప్పుకొనగలము. ప్రభువా నేను ఇంత అయోగ్యుడను. కానీ నీవు నన్ను నీరు మరియు నీ రక్తముతో నన్ను రక్షించితివి కనుక. నేను ఇప్పుడు పాప రహితుడనైతిని. నీవు ఈ లోకమునకు వచ్చి ఒక్కసారిగా బాప్తిస్మం పొందుట ద్వారా పాపాలన్నీ నీపై వహించుకొని ఈ లోకపాపాలను సిలువపై మోసి వాటికొరకై శిక్షింపబడి. మృతి నుండి తిరిగి లేచితిమి. మరియు అలాగు చేయుట వలన ప్రభువా నీవు నిజముగా నాకు రక్షణ అనుగ్రహించి మృతి నుండి తిరిగి లేచితివి. మరియు అలాగు చేయుట వలన ప్రభువా నీవు నిజముగా నాకు రక్షణ కర్తవైతివి. ఇట్టి విశ్వాసముతోనే నేను నిన్ను నమ్ముకొనియున్నాను. అనగా మనము విశ్వాసమును ఉంచినప్పుడు మనము ఎల్లప్పుడూ దేవుని యొద్దకు పోయి మన అయోగ్యతకు బదులుగా ప్రార్థించగలము. ఆయన రాజ్యవ్యాప్తి కొరకు ప్రార్థించగలము. మన సహోదర సహోదరీల కొరకు ప్రార్థించగలము. ఇంకనూ పాప క్షమాపణను పొందవలసిన ఇతర ఆత్మల కొరకు ప్రార్థించగలము.

ప్రజలు నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను నమ్మినప్పుడే ఆకాశము క్రింద వారు సిగ్గుపడకయుందురు. కానీ నీరు మరియు ఆత్మమూలమైన సువార్తలో ఇట్టి విశ్వాసము లేనట్టి కొందరు దానిని మరొక దానితో నింపుటకు ప్రయత్నించెదరు అట్టి ప్రయత్నము పూర్తిగా నిరర్థకమని నీవు గుర్తించవలెను. ఇందువలన వారి హృదయము కృంగి దుఃఖపూరితమైన వారి జీవితము భరించలేనివిగా మారును. సత్యమందు గానీ అసత్యమందు గానీ ప్రతివారు ఏదో ఒక దానిని నమ్మెదరు. నిన్ను గూర్చి యోచించు.

నిజముగా నీవు నీరు మరియు ఆత్మమూలమైన సువార్త యందు నమ్మికతో ప్రభువును విశ్వసించుచున్నావో లేదో ఈ నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను నమ్ముచున్నావో లేదో నిన్ను నీవే పరీక్షించుకొనవలెను. ఆ ప్రభువు మన పాపాలను తన నీరు మరియు రక్తముతో తుడిచివేసెను. నీవు దీనిని నమ్మితే నీ హృదయములో ఇంకనూ పాపము ఉండునా? నీవు నిజముగా నీ హృదయ అంతరంగములో నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను నమ్మితే నిశ్చయముగా నీలో ఇక పాపము ఉండదు. ఈ సత్యములో నీ హృదయ పూర్వక నమ్మికతో నీ పాపము కొరకై నిజమైన క్షమాపణను నీవు పొందగలవు.

నీలి, ధూమ్ర, రక్తవర్ణ దారములు మరియు పేనిన సన్నపునారలో బయలుపరచబడిన సత్యము ద్వారా పాపక్షమాపణ దేవుడు ఇచ్చెను కనుక ఇప్పుడు మనము శాశ్వతమైన పాపక్షమాపణ పొందుచున్నాము. దీని వలన ఈ సత్యములో నమ్మిక ఉంచువారు దేవుని స్వంత పిల్లలుకాగలరు. తన కృపను ధరించి ఆయన ఎదుటకు వెళ్ళునట్లు వారు అనుమతి పొందెదరు. కాబట్టి మనము ఒకరినొకరు ప్రేమించవలెను. ప్రతివారి బలహీనతలను అర్థము చేసికొనవలెను. అంతము వరకు దేవుని సేవచేయవలెను. అప్పుడు ఆయన ఎదుటకు వెళ్ళి ఆయన ముందర నిలువగలము.

పాపక్షమాపణ పొందినవారు పాపులందరిని ప్రేమించవలెను. నీతిమంతులు నీలి, ధూమ్ర, రక్తవర్ణదారములో బయలుపరచబడిన సత్యమును పాపులందరూ తెలిసికొనవలెనని తిరిగి జన్మించవలెనని కోరుకొందురు. కానీ ప్రజలను ప్రేమించలేనటువంటి వారు కొందరు ఉంటారు. అట్టివారు మూర్ఖమైన పాపులు తమ విశ్వాస మనస్సాక్షిని మోసపుచ్చుకొనుచూ పాపభరితులగుచున్ననూ తాము దేవుని విశ్వసించుచున్నామని తలంచుచున్న క్రైస్తవులు తమను మోసపుచ్చుకొనుచున్నారు.

నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను నమ్మి మన హృదయంలో పాప పరిహారము పొందిన మనము తప్పక విశ్వాస మనస్సాక్షిని కాపాడుకొనవలెను. అంతము వరకు పందెమందు మనము మన విశ్వాస మనస్సాక్షిని కాపాడుకొనుచూ, విశ్వాసము కోల్పోకుండా పరుగెత్తదము. మరియు కొందరు ఆత్మీయంగా కష్టసమయంలో ప్రయాణిస్తున్నప్పుడు ఒకరికొకరము సహాయపడుచూ స్థిరముగా ఒకనినొకడు పట్టుకొనెదము. ఏమి జరిగిననూ నీతిమంతుల సంఘమును విడువరాదు. నీతిమంతులు దేవుని సంఘమును విడచిన వారు వెనువెంటనే మరణిస్తారు. దేవుని సంఘమును విడచుట నీ స్వగృహమును విడిచిపెట్టుట వంటిదే. నీ గృహమును విడచుట నీ కాపుదలను పోగొట్టుకొనుటే కనుక నీ హృదయము ఎక్కడైనా విశ్రాంతిని కానీ ఆదరణను కానీ పొందలేదు. మరియు చివరికి నీవు చచ్చెదవు.

దేవుని సంఘము ఆయన గొర్రెలు మేపబడును మరియు విశ్రాంతిని నెమ్మదిని పొందు స్థలము. అలాగే గొర్రెల బలమును కోల్పోయి బలహీనపడినప్పుడు దేవుని సంఘము వాక్యమును వినిపించుట ద్వారా వారి హృదయాలను బలపరచెదరు. నీ హృదయంలో నమ్ముచూ దేవుని వాక్యమును అంగీకరించునప్పుడు నీలోనున్న పరిశుద్ధాత్మ ఆనందించును. మీ హృదయాలలో కూడా బలము పొందును. చివరి ఫలితంగా నీవు నిత్యజీవమును పొందెదవు.

నీతిమంతులమైన మనము మన కృతజ్ఞతలను దేవునికి తెలుపవలెను. మనము ప్రార్థించు అర్హత నిచ్చునందుకు మనము ప్రభువునకు కృతజ్ఞులము. ఆయన మనకు నీరు మరియు ఆత్మమూలమైన సువార్త నిచ్చెను. హల్లెలూయ! మనము ఆయనను విశ్వసించునట్లు మరియు విశ్వాసమూలముగా జీవించునట్లు అనుమతించగల సజీవుడైన దేవుని నేను ప్రార్థించుచున్నాను.