Sermons

[11-21] < లేవీ కాండము 16:1-34 > ప్రాయశ్చిత దినమున అర్పణమును అర్పించు ఆ ప్రధాన యాజకుడు



< లేవీ కాండము 16:1-34 >

“అహరోను ఇద్దరు కుమారులు యెహోవా సన్నిధికి సమీపించి చనిపోయిన తరువాత యెహోవా మోషేతో మాటలాడి ఇట్లనెను నేను కరుణాపీఠము మీద మేఘములో కనబడును గనుక నీ సహోదరుడైన అహరోను చావకయుండునట్లు అతడు మందసము మీద కరుణాపీఠము ఎదుటనున్న అడ్డతెర లోపలికి ఎల్లప్పుడును రాకూడదని అతనితో చెప్పుము. అతడు పాపపరిహారార్థబలిగా ఒక కోడెదూడను దహనబలిగా ఒక పొట్టేలును తీసుకొని వీటితో పరిశుద్ధ స్థలములోనికి రావలెను. అతడు ప్రతిష్టితమైన చొక్కాను తొడుగుకొని తన మానమునకు సన్ననారలాగు తొడుగుకొని సన్ననార దట్టి కట్టుకొని సన్ననారపాగా పెట్టుకొనవలెను అవి ప్రతిష్ఠతవస్త్రములు కనుక అతడు నీళ్లతో దేహము కడుగుకొనివాటిని వేసుకొనవలెను. మరియు అతడు ఇశ్రాయేలీయుల సమాజము నొద్ద నుండి పాప పరిహారార్థ బలిగా రెండు మేక పిల్లలను దహనబలిగా ఒక పొట్టేలును తీసుకొనిరావలెను. అహరోను తన కొరకు పాప పరిహారార్థబలిగా ఒక కోడె దూడను అర్పించి తన నిమిత్తము తన యింటి వారి నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేసి ఆ రెండు మేక పిల్లలను తీసుకొని వచ్చి ప్రత్యక్ష గుడారము యొక్క ద్వారము నొద్ద యెహోవా సన్నిధిని వాటిని ఉంచవలెను. అప్పుడు అహరోను యెహోవా పేరిట ఒక చీటిని విడిచిపెట్టే మేక పేరట ఒక చీటిని ఆ రెండు మేకల మీద రెండు చీట్లను వేయవలెను. ఏ మేక మీద యెహోవా పేరట చీటి పడునో, ఆ మేకను అహరోను తీసుకొని వచ్చి పాప పరిహారార్థ బలిగా అర్పింపవలెను. ఏ మేక మీద ‘విడిచి పెట్టుట’ అనే చీటి పడునో దాని వలన ప్రాయశ్చిత్తము కలుగునట్లు దానిని అరణ్యములో విడిచి పెట్టుటకై యెహోవా సన్నిధిని దానిని ప్రాణముతోనే ఉంచవలెను. అప్పుడు అహరోను పాపపరిహారార్థ బలియగు ఆ కోడెను తీసికొనివచ్చి తన నిమిత్తమును తనయింటి వారి నిమిత్తమును ప్రాయశ్చిత్తమును చేసుకొనవలెను. తరువాత అతడు తన కొరకు తానర్పించు పాప పరిహారార్థ బలియగు కోడెను వధించి యెహోవా సన్నిధి నున్న ధూప పీటము మీద నుండి ధూపార్తెడు నిప్పును తన పిడికెళ్ళతో పరిమళ ధూప చూర్ణమును తీసికొని అడ్డ తెరలోపలికి వాటిని తెచ్చి తాను చావకుండునట్లు ఆ ధూపము మేఘము వలే శాసనముల మీదనున్న కరుణాపీఠమును కమ్ముటకు యెహోవా సన్నిధిని ఆ అగ్ని మీద ఆ ధూపద్రవ్యమును వేయవలెను. అప్పుడతడు ఆ కోడె రక్తములో కొంచెము తీసుకొని తూర్పు ప్రక్కన కరుణాపీఠము మీద ప్రోక్షించి, కరుణాపీఠము ఎదుటతన వ్రేలితో ఆ రక్తములో కొంచెం ఏడు మారులు ప్రోక్షింపవలెను. అప్పుడతడు ప్రజలర్పించు పాప పరిహారార్థ బలియగు మేకను వధించి అడ్డ తెరలోపలికి దాని రక్తము తెచ్చి ఆ కోడె రక్తముతో చేసినట్లు దీని రక్తముతోను చేసి, కరుణాపీఠము ఎదుట దానిని ప్రోక్షింపవలెను. అట్లు అతడు ఇశ్రాయేలీయుల సమస్త పాపమును బట్టియు, అపవిత్రతను బట్టియు వారి అతిక్రమములను బట్టియు పరిశుద్ధ స్థలమునకు ప్రాయశ్చిత్తము చేయవలెను. ప్రత్యక్ష గుడారము వారి మధ్య ఉండుట వలన వారి అపవిత్రతను బట్టి అది అపవిత్రమగుచుండును గనుక అతడు దానికి ప్రాయశ్చిత్తము చేయవలెను. పరిశుద్ధ స్థలములో ప్రాయశ్చిత్తము చేయుటకు అతడు లోపలికి పోవునప్పుడు అతడు తన నిమిత్తమును తన యింటి వారి నిమిత్తమును ఇశ్రాయేలీయుల సమస్త సమాజము నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేసి బయటికి వచ్చువరకు ఏ మనుష్యుడును ప్రత్యక్ష గుడారములో ఉండరాదు. మరియు అతడు యెహోవా సన్నిధినున్న బలిపీఠము నొద్దకు పోయి దానికి ప్రాయశ్చిత్తముచేయవలెను. అతడు ఆ కోడెరక్తములో కొంచెమును ఆ మేకరక్తములో కొంచెమును తీసుకొని బలిపీఠపు కొమ్ముల మీద చమిరి యేడు మారులు తన వ్రేలితో ఆ రక్తములో కొంచెము దాని మీద ప్రోక్షించి దాని పవిత్రపరచి ఇశ్రాయేలీయుల అపవిత్రతను పోగొట్టి దానిని పరిశుద్ధ పరచవలెను. అతడు పరిశుద్ధ స్థలమునకును ప్రత్యక్షపు గుడారమునకును బలిపీఠమునకు ప్రాయశ్చిత్తము చేసి చాలించిన తరువాత ఆ సజీవమైన మేకను దగ్గరకు తీసుకొని రావలెను. అప్పుడు అహరోను సజీవమైన ఆ మేక తలమీద తన రెండు చేతులుంచి ఇశ్రాయేలీయుల పాపములన్నియు అనగా వారి దోషములన్నియు వారి అతిక్రమములన్నియు దాని మీద ఒప్పుకొని ఆ మేక తలమీద వాటిని మోపి తగిన మనుష్యుని చేత అరణ్యములోనికి దానిని పంపవలెను. ఆ మేక వారి దోషములన్నిటిని ఎడారి దేశమునకు భరించిపోవును. అతడు అరణ్యములో ఆ మేకను విడిచిపెట్టవలెను.

అప్పుడు అహరోను ప్రత్యక్షపు గుడారములోనికి వచ్చి తాను పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళినప్పుడు తాను వేసికొనిన నారబట్టలను తీసి అక్కడ వాటిని ఉంచి పరిశుద్ధ స్థలములో దేహమును నీళ్ళతో కడుగుకొని బట్టలు తిరిగి ధరించుకొని బయటికి వచ్చి తన కొరకు దహనబలిని ప్రజల కొరకు దహన బలిని అర్పించి, తన నిమిత్తమును ప్రజల నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేయవలెను. పాప పరిహారార్థబలి పశువు యొక్క క్రొవ్వును బలిపీఠము మీద దహించవలెను. విడిచిపెట్టే మేకను వదిలినవాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్ళతో దేహము కడుగుకొని తరువాత పాళెములోనికి రావలెను. పరిశుద్ధ స్థలములో ప్రాయశ్చిత్తము చేయుటకు వేటి రక్తము దానిలోపలికి తేబడెనో పాప పరిహారార్థ బలియగు ఆ కోడెను ఆ మేకను ఒకడు పాళెము వెలుపలికి తీసికొనిపోవలెను. వాటి చర్మమును వాటి మాంసమును వాటి మలమును అగ్నితో కాల్చివేయవలెను. వాటిని కాల్చివేసినవాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్ళతో దేహము కడుగుకొని తరువాత పాళెములోనికి రావలెను. ఇది మీకు నిత్యమైన కట్టడ స్వదేశులుగాని మీ మధ్య నుండు పరదేశులు గాని మీరందరు ఏడవ నెల పదియవనాడు ఏ పనియైనను చేయక మిమ్మును మీరు దుఃఖపరచుకొనవలెను. ఏలయనగా మీరు యెహోవా సన్నిధిని మీ సమస్త పాపము నుండి పవిత్రులగునట్లు ఆ దినమున మిమ్ము పవిత్రపరచునట్లు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయబడెను. అది మీకు మహా విశ్రాంతి దినము. మిమ్మును మీరు దుఃఖపరచుకొనవలెను. ఇది నిత్యమైన కట్టడ. ఎవరు తన తండ్రికి మారుగా యాజకుడగుటకై అభిషేకము పొంది తన్ను ప్రతిష్టించుకొనునో ఆ యాజకుడు ప్రాయశ్చిత్తము చేసికొని నార వస్త్రములైన ప్రతిష్టిత వస్త్రములను ధరించుకొనవలెను. మరియు అతడు అతి పరిశుద్ధముగా నన్ను మందిరమునకును, ప్రత్యక్ష గుడారమునకును బలిపీఠమునకును ప్రాయశ్చిత్తము చేయవలెను. మరియు అతడు యాజకుల నిమిత్తమును సమాజము నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేయవలెను. సంవత్సరమునకు ఒకసారి ఇశ్రాయేలీయులు సమస్త పాపములను బట్టి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకు ఇది మీకు నిత్యమైన కట్టడ. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేసెను.’’



ఇశ్రాయేలు ప్రజల కొరకు ప్రాయశ్చిత్త దినమున అర్పణ అర్పించిన వారిలో ప్రధాన యాజకుడు ఒకరు. ఈ అర్పణము ప్రతి ఏడవ నెల పదియవ దినమున ఇశ్రాయేలీయుల క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరమునకు ఒకసారి అర్పించబడును. ఈ దినమున ప్రధాన యాజకుడైన అహరోను ఇశ్రాయేలు ప్రజల నిమిత్తము వారి పక్షమున అర్పణమును అర్పించును కనుక వాస్తవముగా వారి దోషములన్నియూ బలిపశువుపై మోపబడును కనుక అవి కడుగబడును. కాబట్టి ఆ బలి అర్పణ దినము ప్రజలకు గొప్ప పండుగ దినమాయెను.

ఇతర అర్పణములవలెనే ప్రాయశ్చిత్త దినము యొక్క అర్పణము కూడా మూడు స్థిర పద్ధతుల ద్వారా జరుపబడును. నిర్ధోష బలిపశువు దానిపై చేతులుంచుట బలిపశువు యొక్క రక్తము చిందించుట. ఈ విధానము ద్వారా అర్పించబడిన బలిని దేవుడు సంతోషముగా అంగీకరించును. మిగిలిన బలులకు ఈ బలికి గల తేడా ఆ ప్రధాన యాజకుడు బలిపశు రక్తమును పరిశుద్ధ స్థలమునకు తీసికొని పోవును.

తన నిమిత్తమును తన యింటి వారి నిమిత్తమును బలి అర్పించిన తరువాత ప్రధాన యాజకుడైన అహరోను ఇశ్రాయేలీయుల కొరకు దేవునికి రెండు మేకలను అర్పించెను. మొదట వాటిలో ఒకదానిని అతడు పాప పరిహారార్థ బలిగా అర్పించు కోడెవలెనే ప్రభువైన దేవునికి అర్పించెను. తరువాత రెండవ దానిని అతడు విడిచిపెట్టు మేకగా అర్పించెను. అతడు ఇశ్రాయేలీయుల పాపమును విడిచిపెట్టు మేకతలపై ఇశ్రాయేలీయుల ఎదుట మోపెను. వారి పాపమును అంగీకరించిన ఈ మేక తరువాత సరియైన వ్యక్తి ద్వారా అరణ్యములోనికి పంపబడును.



ప్రాయశ్చిత్త దినము యొక్క బలి అర్పణ ఇశ్రాయేులు ప్రజల యొక్క పాపాలన్నిటిని తుడిచివేసెను.


ప్రాయశ్చిత్త దినమున ప్రధాన యాజకుడు ఇశ్రాయేలు ప్రజల పక్షముగా పాప పరిహారార్థ బలి పశువు యొక్క తలపై చేతులను ఉంచుట ద్వారా వారి పాపాలను దాని తలపై మోపును. అతడు సజీవమైన రెండు మేకలను తెచ్చి వాటి కొరకు చీటీలు వేసెను. ఒకటి దేవుని కొరకును మరొకటి ఇశ్రాయేలు ప్రజల కొరకు.

ఇక్కడ చేతులుంచుట అనగా బలి పశువుపై చేతులు పెట్టుట ద్వారా దానిపై పాపములన్నీ మోపుట అని అర్థము. ఈ విధముగా చేతులుంచుట పాపమును కడుగుకొనుటకై దేవునిచే నియమించబడినది. మరియు క్రొత్త నిబంధన సమయంలో కూడా ఇదే విధానము ద్వారా మానవులందరి పాపము కడుగబడుట కొరకు యేసుని పై చేతులు ఉంచబడినవి. ప్రధాన యాజకుని పాపాల పరిహారమునకై తన యింటి వారి పాపముకును ఒక సంవత్సర కాలంలో ఇశ్రాయేలీయులు చేసిన పాపము కొరకు అతడు ఖచ్చితంగా తన చేతులను మేకతలపై ఉంచి ఈ పాపాలన్నిటిని దానిపై మోపును. అట్టి విధముగా ప్రధాన యాజకుడు బలిపశువు తలపై చేతులుంచుట ద్వారా ఇశ్రాయేలీయుల పాపాలను దానిపై మోపెను. కనుక ఇశ్రాయేలీయులు ఒక సంవత్సర పాపములన్నియూ తుడిచివేయబడెను. ఈ విధముగా ప్రాయశ్చిత్త దినమున ఇచ్చు బలి ద్వారా ఇశ్రాయేలీయులు తమ పాపాలన్నిటి నుండి తమను కాపాడినందుకు దేవునికి కృతజ్ఞులై ఉంటారు.

పాపము కల ప్రతివారు తప్పింపబడక శిక్షింపబడాలి. బలిపశువు ప్రజల పాపముకై ఘోరముగా శిక్షింపబడును కనుక మొదట అది వారి పాపాలను అంగీకరించవలసియున్నది. తన చేతులను బలి పశువుపై మోపకనే ప్రధాన యాజకుడు దానిని దేవునికి అర్పించినయెడల ఆ అర్పణము యెహోవాకు దూషణ. కనుక అతడు అట్లు చేయుచుండవలెను. పాపులుగా మారిన మానవాళినందరినీ రక్షించుటకు దేవుడు తన రక్షణ యొక్క ప్రణాళికను స్థిరపరచి, దానిని చేతులు ఉంచుట ద్వారా నెరవేర్చెను. ఇశ్రాయేలీయుల పాపాలను తుడిచిపెట్టుటకు దేవుడు ప్రధాన యాజకుని ఏర్పాటు చేసి ఒక్కసారిగా తన ప్రజల పాపములను వారి ప్రతినిధిగా బలిపశువు తలపై ఉంచుట ద్వారా దానిపై మోపెను. అలాగే మిగిలిన బలిపశువులన్నీ ప్రత్యక్ష గుడారములో దేవునికి అర్పించబడినప్పుడు చేతులుంచుట ద్వారా ఇశ్రాయేలీయుల పాపాలను అంగీకరించును మరియు వారికి బదులుగా అవి వారి శిక్షను భరించును. తన రక్తమును చిందించి చనిపోవును.

దేవుని నీతిని ప్రేమను సంపూర్తిగా నెరవేర్చుటకు ఇశ్రాయేలీయుల ప్రాయశ్చిత్త దినము అర్పణమును అర్పించవలెను. ఎట్లనగా ప్రధాన యాజకుని చేతులను బలిపశువుపై ఉంచుట ద్వారా సంవత్సరమునకు ఒకసారి వాటి మెడను వధించుట ద్వారా ఘోరముగా తన రక్తమును చిందించును. అనగా ఈ బలి అర్పణము ద్వారా ఒక సంవత్సర కాలము ఇశ్రాయేలీయుల పాపాలను ఒకేసారిగా తుడిచివేయాలని దేవుని కోరిక. ఇదే దేవుని ప్రేమ యొక్క నియమము. అది ఆయన యొక్క కరుణను, న్యాయమును నెరవేర్చును. దేవుడు నీతిమంతుడు కనుక ఒక్కసారిగా ప్రజల పాపములను ఆయన నీతి నియమ ప్రకారము తుడుపు పెట్టుటకై దేవుడు యేసుక్రీస్తు అను గొర్రెను తయారుచేసెను. చేతులుంచుట ద్వారా పాపమును ఆయనపై మోపెను. సిలువపై ఆయన రక్తము కార్చునట్లు చేసెను.

నిత్యబలిగా తనను తాను అర్పించుకొనిన యేసు ఈ విధానము ద్వారా ఒకేసారిగా ప్రతివాని పాపాలను మోపుకొని తద్వారా పాపము నుండి వారిరక్షణను నెరవేర్చెను. అలాగే మనము కూడా నీలి, ధూమ్ర, రక్తవర్ణ దారము మరియు పేనిన సన్నపునారలో బయలుపరచబడిన రక్షణ యొక్క సత్యమును నమ్ము విశ్వాసముతో దేవుని యెదుటకు రావలెను. ఈ విశ్వాసము ద్వారానే ఒక్కసారిగా పాపము క్షమించబడును. కాబట్టి ఒకేసారి పాపక్షమాపణ కోరువారు నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను నిజముగా నమ్ము విశ్వాసముతో దేవుని యొద్దకు రావలెను.



చేతులుంచుట అనగా అర్థము


చేతులను ఉంచుట అనగా మోపుట. బదిలీ చేయుట లేదా పాతి పెట్టుట (లేవీ 1:3-4) ఇశ్రాయేలీయులలో ఎవరైనా తెలియక పాపము చేసినప్పుడు దానిని గూర్చి తెలిసికొనిన తరువాత అతడు దేవునికి దహనబలిని అర్పించవలెను. (లేవీకాండము 4:27-29) అతడు నిర్ధోషమైన బలిపశువును తేవలెను. తరువాత తన చేతులను దాని తలపై ఉంచుట ద్వారా తన పాపాలను దానిపై మోపవలెను. అతడు దాని మెడ వధించి దాని రక్తమును తీసుకొని ఆ రక్తమును యాజకునికి ఇవ్వవలెను. (లేవీ కాండము 4:27-28) ఆ యాజకుడు ఈ రక్తములో కొంచెమును తన వ్రేళ్ళతో తీసికొని దానిని దహనబలి పీఠపు కొమ్ముపై ఉంచును. మిగిలిన రక్తమును బలిపీఠము క్రింద పోయును. అతడు దాని కొవ్వును బలిపీఠముపై దహించవలెను. మరియు దేవుడు ఈ బలిలో అర్పించబడిన క్రొవ్వు యొక్క దహన సువాసనను ఆఘ్రాణించును.

ఇశ్రాయేలీయుల పాపమును తుడుపు పెట్టుటకు దేవుడు ప్రాయశ్చిత్త దినమున బలిని సిద్ధపరచెను; దానిలో బలి పశువు చేతులను ఉంచి దాని రక్తమును సేకరించవలెనని మనము ఇప్పటికే చదివియున్నాము. ఈ పరిస్థితులలో కూడా దేవుడు చేతులుంచకుండా ఇశ్రాయేలీయుల పాపాలను తుడిచిపెట్టడు. అలాగే ప్రాయశ్చిత్త దినము యొక్క బలి పాతనిబంధనలో ఉన్నట్లే క్రొత్త నిబంధనలోని యేసుని బాప్తిస్మము మరియు రక్తముతో సంబంధం కలిగి యున్నది.

పాత నిబంధన యొక్క బలి అర్పణము నిర్దోష పశువుపై ఉండినట్లుగానే క్రొత్త నిబంధనలో కూడా యేసు దేవుని యొక్క నిర్ధోష గొర్రెగా వచ్చెను మరియు పాపులందరి దోషమును కడిగి వేయుటకై ఆయన బాప్తిస్మం పొంది సిలువపై రక్తమును కార్చెను. పాత నిబంధనలోపలే చేతులుంచుట ద్వారా బలిపశువు పాపుల దోషమును భరించినట్లే యొర్దాను నదిలో బాప్తిస్మమిచ్చుయోహాను యేసు తలపై చేతులుంచుట ద్వారా లోకపాపము యేసునిపై మోపబడెను. (మత్తయి 3:15) పాత నిబంధన బలిఅర్పణము మరియు నూతన నిబంధనలో యేసు ఒకే విధముగా చేతులను ఉంచుట ద్వారాను చనిపోవు వరకు ఒకే విధముగా రక్తము కార్చెను. చేతులుంచుట అను బలి మరియు రక్తము కార్చుట అనునవి పాత నిబంధనలోను క్రొత్త నిబంధనలోనూ రెండూ పాపుల కొరకే సిద్ధపరచబడెను.



తప్పిన మానవాళి పాపము దానిని అనుసరించు దేవుని కోపము.


దేవుని ముందు పాపులమైన మనమందరమూ మన పాపము కొరకు చనిపోవలసిన వారమే. కేవలము బలిపశువు తాను అంగీకరించిన పాపము కొరకు చంపబడినట్లే బలిపశువును ముక్కలుగా విధింపబడిన దహన బలిపీఠముపై దహించబడుటను చిత్రీకరించినప్పుడు దానివలేనే మనమందరం కూడా దేవుని యెదుట నాశనపరచబడవలసిన వారమేనని గుర్తించగలము. అయిననూ యోహానుచే బాప్తిస్మము పొంది తన రక్తమును కార్చి ప్రభువు మనలను రక్షించెను.

అలాగే తిరిగి జన్మించని వారందరూ తాము పాపులమని తాము దేవుని యెదుట అగ్ని గుండ శిక్షను ఎదుర్కొనవలెనని తెలుసుకోవాలి మరియు తమ రక్షణ కొరకు ప్రభుని బాప్తిస్మమును ఆయన రక్తమును తప్పక నమ్మాలి. మన పాపము కొరకు మనలను శిక్షించుటకు బదులుగా మనలను రక్షించుటకు దేవుడు రక్షణ యొక్క అర్పణమును సిద్ధపరచి మన పాపమును నిత్య బలియైన ఈ అర్పణ మీదికి మోపును. మరియు దాని ద్వారా మన పాపాలన్నిటిని కడిగెను. (లేవీ 16:1-34, రోమా 8:3-4, హెబ్రీ 10:10-12) నీవు ఇంకనూ నీ హృదయంలో పాపమును కలిగియున్నావా? అయితే మొదటిగా నీవు దేవుని యెదుట నీవు దేవుని కోపమును ఎదుర్కొనుచున్నావని ఒప్పుకోవాలి యేసుక్రీస్తు ద్వారా దేవుడు ఏర్పరచి ప్రణాళికన చేసిన నీ రక్షణను లోక పునాదుల కంటే ముందుగానే నెరవేర్చెనని ఒప్పుకోవాలి.

పాపము సరియైన పరిహారము లేకుండా ప్రాయశ్చిత్తము చేయబడదు. అందువలననే దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు బలివ్యవస్థను అనుగ్రహించెను. ఈ బలి వ్యవస్థలో చేతులు ఉంచబడి రక్తమును కార్చినది మాత్రమే విశ్వాసము యొక్క నిజ బలియై అది ఇశ్రాయేలీయుల పాపమును కడిగివేయ కలదు.

విశ్వాసముతో మాత్రమే చేతులుంచబడి రక్తమును కార్చిన బలిని మనము అర్పించవలెను. ఇది అంతయూ వేదములో వ్రాయబడిన బలి వ్యవస్థను అనుసరించినదై ఉండవలెను. ఆ ప్రభువు తన రక్తమును కార్చెను. ఎందుకనగా తన బాప్తిస్మం ద్వారా ఆయన మన పాపములను మోసెను. మన స్థానంలో ఘోరమైన మన పాపశిక్షను భరించెను. తద్వారా మన ఈ పాపమును తుడిచివేసెను. (మత్తయి 3:15, యోహాను 1:29, యెషయా 23:1-7) మనము నీరు మరియు ఆత్మమూలమైన వాక్యమును నమ్మినప్పుడు మన బలి అర్పణముగా మారిన మన ప్రభువుపై చేతులనుంచినప్పుడు మన పాపాలను ఆయనపై మోపినప్పుడు. ఆ ప్రభువు మన పాపములను వహించి వాటి నిమిత్తము మనకు బదులుగా శిక్షను భరించెనని విశ్వసించుట ద్వారా మనము పాప క్షమాపణను పొందగలము. నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను విశ్వసించుటతో మన బలి అర్పణముగా మారిన ఆ ప్రభునిపై మన పాపమును మోపగలము. ఆయనతోపాటు మనము చనిపోయి ఆయనతో పాటుగా మనము జీవించగలము. (రోమా 6:1-11, గలతీ 3:27)

ప్రాయశ్చిత్తము యొక్క అర్పణము నుండి మనము నేర్చుకొనవలసిన ఆత్మీయ పాఠము మొదటిగా, మనము మన పాపమును ఆ పాపము యొక్క శిక్షను తెలిసికొని తరువాత దేవుడు అంగీకరించకోరిన బలిని విశ్వాసముతో ఇవ్వవలెను. అనగా మన రక్షణను తన బాప్తిస్మము మరియు సిలువపై కార్చిన రక్తము ద్వారా నెరవేర్చిన యేసును తప్పక విశ్వసించవలెను. మన యేసుని బాప్తిస్మమును నమ్ముట ద్వారా ఆయన తలపై మన చేతులను ఉంచవలెను ఎందుకు? ఎందుకనగా మనము విశ్వాసముతో ఆ బలిపశువు తలపై చేతులుంచి దాని రక్తమును చిందించినప్పుడే మన పాపముల నుండి రక్షింపబడెదము.

అలాగే దేవుని యెదుట ఆమె/అతని పాపము నుండి క్షమించబడుటకు కోరినవారు ఎవరైననూ వారు తమ జీవితము యొక్క జీతమును చెల్లించవలెను. ఎందుకనగా పాపమునకు జీతము మరణము. ధనవంతులైననూ బీదలైననూ ఒకని పాపమునకైనను జీతమును చెల్లించుటకు ఒక బలి అర్పణము. ప్రాయశ్చిత్తము క్రయధనము ఉండవలసినదే. ఈ విధముగా కాని యెడల ఎవరునూ విశ్వాస మూలముగా పాపక్షమాపణమును పొందలేరు.



పాత నిబంధన యొక్క ప్రాయశ్చిత్త దినము యొక్క బలి అర్పణము


మనము ఒకసారి లేవీ 16:6-10 చూద్దాము. ‘‘అహరోను తన కొరకు పాప పరిహారార్థ బలిగా ఒక కోడెను అర్పించి తన నిమిత్తమును తన ఇంటి వారి నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేసి ఆ రెండు మేక పిల్లలను తీసికొని వచ్చి ప్రత్యక్ష గుడారము యొక్క ద్వారము నొద్ద యెహోవా సన్నిధిని వాటిని ఉంచవలెను. అప్పుడు అహరోను యెహోవా పేరిట ఒక చీటిని విడిచిపెట్టే మేక పేరిట ఒక చిటీని ఆ రెండు మేకల మీద రెండు చీట్లను వేయవలెను. ఏ మేక మీద యెహోవా పేరిట చీటి పడునో ఆ మేకను అహరోను తీసికొని వచ్చి పాప పరిహారార్థ బలిగా అర్పింపవలెను. ఏ మేక మీద విడిచి పెట్టుట అనే చీటిపడునో దాని వలన ప్రాయశ్చిత్తము కలుగునట్లు దానిని అరణ్యములో విడిచిపెట్టుటకై యెహోవా సన్నిధిని దానిని ప్రాణముతోనే ఉంచవలెను.’’

విశ్వాసముతో ఇశ్రాయేలీయులు తమ పాపములకు క్షమాపణ పొందగలుగునట్లు చేయుటకు ఆ ప్రధాన యాజకుడు. వారి పక్షముగా చేతులుంచిన మరియు రక్తమును కార్చిన బలిని అర్పించెను. అట్లయిన ఈ దినములలోని క్రైస్తవుల విశ్వాసము ఎట్లున్నది? వారి అర్పణము పాపక్షమాపణ కోరుచూ కనీసము చేతులుంచిన మరియు రక్తమును కార్చిన బలిని అర్పించెను. అట్లయిన ఈ దినములలోని క్రైస్తవుల విశ్వాసము ఎట్లున్నది? వారి అర్పణము పాప క్షమాపణ కోరుచూ కనీసము చేతులుంచుటయైననూ లేనట్టి వారి విశ్వాసము ఒడిదుడుకులకు నిరాధారమైనది కాదా? నీ విశ్వాసము చేతులుంచుట ద్వారా యేసుక్రీస్తు పైకి నీ పాపములను మోపలేనటువంటి విశ్వాసము నీది కాని యెడల నీవు సమస్యలో నున్నట్లే నీ విశ్వాసము యేసు యొక్క బాప్తిస్మమును సిలువలో ఆయన కార్చిన రక్తమును నమ్మునట్టి విశ్వాసమును నీవు కలిగియుండకపోతే అట్టి విశ్వాసము నిజమైనది కాదు.

దేవుని యెదుట మనము ఆజ్ఞను అనుసరించలేము. కానీ తప్పించుకొనక గతించిన సంవత్సరములన్నిటిలో మనము అనేకమైన పాపములు చేసియున్నాము. కనుక ఒకవేళ మనము పాతనిబంధన కాలములో నివసించియుంటే మనము మనకు బదులుగా ఆ ప్రధాన యాజకుడు అర్పించు పాప పరిహారార్థ బలిని అర్పించి మన పాప పరిహారమును పొందవలసి వచ్చి యుండెడిది. దేవునికి విశ్వాస అర్పణమును అర్పించుటకు మొదటగా మనము మన పాపము నిమిత్తము నాశనపరచబడవలసిన వారమని తెలిసికొని తరువాత దేవుడు మన కొరకు కోరుకొనిన బలిపశువుపై చేతులునుంచుట ద్వారా ఆ పాపమును దానిపైకి మోపుట అనుదానిలో విశ్వాసము నుంచి ఆ బలి అర్పణము యొక్క రక్తమును చిందించవలెను.

బలిపశువుపై చేతులుంచుట మరియు దాని రక్తమును ఒలికించుట అనునది రక్షణ నివ్వగల శక్తికొలది కనుక పాతనిబంధన ప్రజలు వారి పాపము పరిహారమును దేవుడు నియమించిన బలి వ్యవస్థను బట్టి ప్రధాన యాజకులు అర్పించు బలి ద్వారా పొందగలరు. బలి పశువుపై తన చేతులను ఉంచుట ద్వారా ఆ ప్రధాన యాజకుడు తన ప్రజల యొక్క ఒక సంవత్సర కాలమునకు సరిపడనంత పాపమును దానిపై మోపును. దాని మెడను వధించి రక్తమును తీసికొని ఆ రక్తమును కరుణాపీఠము ఎదుట దాని తూర్పు వైపు ఏడుసార్లు చల్లవలెను. అలాగు చేయుట వలన ప్రతి సంవత్సరము సరియైన బలిని దేవుని యెదుట అర్పింపక మానకూడదు. ఈ విధముగా ఇశ్రాయేలు ప్రజలు ఆ దినములలో పాప క్షమాపణను ఖచ్చితముగా పొందెడివారు.

అటువలే ప్రధాన యాజకుడు అర్పించిన పాప పరిహారార్థ బలి ద్వారా ఇశ్రాయేలీయులందరూ తమ పాపములన్నియూ క్షమించబడునని నమ్మి విశ్వసించిరి. పాత నిబంధన బలి యొక్క ప్రాయశ్చిత్త దినము మనకు చూపించునది ఏమనగా క్రొత్త నిబంధన గ్రంథములో యేసుక్రీస్తు యోహాను ద్వారా బాప్తిస్మం పొందుట ద్వారా ఈ లోకపాపమును వహించుకొనెను. తన రక్తమును సిలువపై చిందించెను. ఆ యేసుక్రీస్తునే మనము మన రక్షకునిగా విశ్వసించి తద్వారా శాశ్వతమైన పాప క్షమాపణ పొందవలెను. ఈ లోకములో తమ పాపములను బట్టి బాధింపబడుచూ, క్షోభించుచున్న ఆత్మలన్నియూ తాము నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను నమ్ముట ద్వారా శాశ్వత పాప క్షమాపణ పొందగలమని తప్పక గుర్తించి, వారు తమ హృదయాలలో విశ్వసించవలెను. ఈ విధముగా పాపములన్నిటి క్షమాపణకైన బలి ముందుగానే దేవునిచే నియమించబడి నెరవేర్చెదరని ఆయనే ప్రయాణము చేసెను. మరియు రక్షణ యొక్క ఈ వాగ్ధానము కూడా ప్రత్యక్ష గుడారము యొక్క సామాగ్రిగా ఉపయోగించబడిన నీలి, ధూమ్ర, రక్త వర్ణదారములు మరియు పేనిన సన్ననినారలో బయలుపరచబడెను.



ప్రాయశ్చిత్త దినము యొక్క ఆ బలి ప్రత్యక్ష గుడారములో నెరవేర్చబడుట


ప్రాయశ్చిత్త దినము. ఇశ్రాయేలీయుల పాపములన్నిటి నిమిత్తము జాగ్రత్త తీసుకొనుటకై ఆ ప్రధాన యాజకుడు ఇశ్రాయేలీయులందరి యెదుట ఆ బలిపశువు తలపై చేతులుంచెను. (లేవీ 16:1-23) వారికి బదులుగా ఆ బలిపశువు తలపై చేతులను ఉంచుట ద్వారా పాపములను మోపుట ఖచ్చితముగా అతడు చేయవలసియున్నది. ఆ ప్రధాన యాజకుడైన అహరోను ఇశ్రాయేలు ప్రజలకొరకు ప్రత్యక్ష గుడారములో ప్రాయశ్చిత్త దినమున బలిని అర్పించినప్పుడు అతను తప్ప మరి ఎవరునూ ప్రత్యక్ష గుడారములో ప్రవేశించరాదు. అది ఒక అసాధారణ చర్య. ఎందుకనగా ప్రాయశ్చిత్త దినమున తప్ప మిగిలిన దినములలో అక్కడ అనేకులు యాజకులు ఉండెడివారు.

ఆ ప్రధాన యాజకుడు బలిపశువు యొక్క తలపై తన చేతులను ఉంచుట ద్వారా ఇశ్రాయేలీయుల పాపమును దానిపై మోపి ఆ బలి యొక్క రక్తమును అతి పరిశుద్ధ స్థలములోనికి తీసుకొనివచ్చి దానిని తన వ్రేళ్ళతో కరుణా పీఠముపై దాని తూర్పున చల్లెను. మరియు కరుణాపీఠము ఎదుట దానిని ఏడు మారులు చల్లెను. (లేవీ 16:14)

ఆ సమయములో ఆ ప్రధాన యాజకుని నడుమునకున్న దట్టి యొక్క బంగారు గంటలు మ్రోగవలసియున్నది. కనుక కరుణా పీఠము ఎదుటను తూర్పు దిక్కునను అతడు రక్తమును చల్లునప్పుడు ప్రతిసారీ ఆ గంటలు మ్రోగును. ఆ గంట శబ్ధమును ప్రత్యక్ష గుడారము బయట నిలబడిన ఇశ్రాయేలు ప్రజలు వినగలరు. ఇశ్రాయేలీయులు ఈ గంట శబ్ధంను వినునప్పుడు, ఆ ప్రధాన యాజకుడు తమకు బదులుగా బలిని దేవునికి అర్పించుచున్నాడని గుర్తించెదరు. ఈ ఏడు సార్లు గంట శబ్ధమును వారు విని, వారు ఊరటగా నిట్టూర్చెదరు. ఎందుకనగా ఇప్పుడు ప్రాయశ్చిత్త దినము యొక్క బలిని అర్పించుట పూర్తాయెను. ఒక సంవత్సర పాపము క్షమించబడుటకైన బలి పూర్తగుటను నిశ్చయపరచును.

ఆ తరువాత ప్రధాన యాజకుడైన అహరోను ప్రత్యక్ష గుడారము బయటికి వచ్చును. మిగిలిన మరొక మేకను అర్పణముగా తీసుకొనును. మరియు ఇశ్రాయేలు ప్రజల యెదుట ప్రాయశ్చిత్త దినము యొక్క బలిని అర్పించును. ఇశ్రాయేలు ప్రజలు ప్రాయశ్చిత్త దినమున ఏ పనియు చేయకూడదని దేవుడు ఆజ్ఞాపించెను. (లేవీ16:20-21,29). ప్రత్యక్ష గుడారమునకు బయట బలి అర్పణమును చూచుటకై ఇశ్రాయేలు ప్రజల సమూహము గుమిగూడిన ప్రజలతో, ఆ ప్రధాన యాజకుడు విడిచిపెట్టు మేకపై తన కర్తవ్యమును నెరవేర్చుటకు తన చేతులు నుంచును. మరియు యోగ్యుడైన మనుష్యుని ద్వారా అతడు దానిని అరణ్యమునకు తోలివేయవలెను.

ఆ ప్రాయశ్చిత్త దినమున ప్రధాన యాజకుడు బలి మేకను ఇశ్రాయేులు ప్రజల యెదుటికి తెచ్చి దాని తలపై తన చేతులను ఉంచి ఇశ్రాయేలు పిల్లల యొక్క పాపమును దోషమును ఒప్పుకొనును. వాటిని దానిపై మోపును. ‘‘ప్రభువా గతించిన సంవత్సరములో ఇశ్రాయేలీయులు చేసిన పాపములన్నిటిని నేను ఒప్పుకొనుచున్నాను. ఆజ్ఞలనన్నిటిలో పూర్తిగా అనుసరించుటలో మేము తప్పిపోతిమి. మేము నీకును, ప్రతి ఒక్కరికిని వ్యతిరేకముగా లెక్కలేనన్ని పాపములు జరిగించితిమి. నీవు మమ్మును జీవించమని ఆజ్ఞాపించునట్లుగా జీవించుటలో తప్పిపోతిమి. మరియు మేము నీవు మమ్మును చేయకూడదని ఆజ్ఞాపించిన వాటిని చేయకుండుటలో తప్పిపోతిమి. గతించిన సంవత్సరములో మేము నీవు ఆజ్ఞాపించిన వాటిని చేయకుండుటలో తప్పిపోతిమి. గతించిన సంవత్సరములో మేము నీ ఆజ్ఞను చాలా వాటిని అధిగమించితిమి” ఇవ్విధముగా ఇశ్రాయేలీయుల పాపాలన్నిటిని వారి యెదుట ప్రధాన యాజకుడు బలి మేకపై తన చేతులునుంచుట ద్వారా దానిపై మోపి దానిని యోగ్యుని ద్వారా అరణ్యములోనికి తోలివేయును.

పాపమునకు జీతము మరణము. బలిపశువు ఇశ్రాయేలు ప్రజల పాపమును అంగీకరించిన తరువాత ఆ బలి మేక జీవించి యుండుటను దేవుడు అనుమతించలేదు. అరణ్యములో విడువబడిన విడిచిపెట్టు మేక అరణ్యములో బాధింపబడి చనిపోవలెను. ఎందుకనగా అది ఇశ్రాయేలీయుల దోషమును అతిక్రమములను మోసెను. ఇప్పుడు ఇశ్రాయేలీయులందరూ ప్రత్యక్ష గుడారపు విందును జరుపుకొనుటకు మొదలు పెట్టెదరు. (లేవీ 23:34) ఎందుకనగా వారు ప్రాయశ్చిత్త దినము యొక్క అర్పణము ద్వారా సంవత్సరకాలముగా వారి నంటి పెట్టుకొనిన పాపము నుండి విడిపించబడిరి.

చేతులుంచుట ద్వారా ప్రజలందరి పాపము బలి పశువుపై మోపబడును. ప్రధాన యాజకుడు తన చేతులను బలిపశువుపై ఉంచినప్పుడు ఒక సంవత్సరమంతయూ పోగుబడిన ఇశ్రాయేలు ప్రజల పాపములన్నియు దానిపైకి ఒక్కసారిగా మోపబడెను. ఇశ్రాయేలీయులలోని ప్రతివాని యొక్క ఒక్కొక్క ప్రతిపాపము ప్రధాన యాజకుని చేతులునుంచుటద్వారా ఒకేసారిగా బలి అర్పణము పైకి మోపబడును.

ఈ కాలపు ప్రజల పాపములన్నీ చేతులుంచుట ద్వారా బలి అర్పణముపై మోపుట సాధ్యమేనా. ఎట్లనగా ఇశ్రాయేలు ప్రజల దోషము పాత నిబంధనలో ప్రధానయాజకుని చేతులుంచుట ద్వారా మోపబడినట్లు సాధ్యపడునా? ఇవి సాధ్యముకానియెడల ఈ కాల ప్రజలు తమ పాపాలకు క్షమాపణ పొందునట్లు మార్గము కలదా. ఈ కాల ప్రజల పాపాలు ఎవని ద్వారా ఎట్టి విధముగా ఎవరు మోపెదరు? పాతనిబంధన కాలములో దేవునిచే స్థాపించబడి బలి అర్పణ వ్యవస్థ అనుసారము క్రొత్త నిబంధన కాలములో దేవునిచే స్థాపించబడి బలి అర్పణ వ్యవస్థ అనుసారము క్రొత్త నిబంధన కాలములో లోక పాపాలు బాప్తిస్మమిచ్చు యోహాను ద్వారా యేసుక్రీస్తు బాప్తిస్మం పొందుట ద్వారా తనపై మోపుకొనెను. ఒక సంవత్సర పాపము బలినిచ్చుమేకపై మోపబడి ప్రాయశ్చిత్త దినమున అర్పణము ద్వారా ఇశ్రాయేలు ప్రజల కొరకు ప్రధాన యాజకుడు అర్పించినట్లే. మన పాపము కూడా అతి ప్రధాన యాజకుడైన బాప్తిస్మమిచ్చు యోహాను ద్వారా బాప్తిస్మం పొందిన యేసుక్రీస్తుపై మోపబడెను. అయితే ఈ కాల ప్రజల పాపములు ఎక్కడున్నవి? అవన్నియూ ఇప్పుడు యేసుక్రీస్తు తలపై మోపబడినవి.

ప్రధాన యాజకుని చేతులుంచుట ద్వారా ఇశ్రాయేలు ప్రజల పాపములను విడిచిపెట్టు మేక అంగీకరించినట్లే యేసు ప్రస్తుత కాలములో నివసించుచున్న మన అందరి పాపములకు శాశ్వతమైన పాప క్షమాపణ యొక్క బలి పశువాయెను. యేసు తానే మన కొరకైన విడిచిపెట్టబడు మేకయై మన పాపము కొరకు తనను తాను బలి అర్పణముగ దేవునికి సమర్పించుకొనెను. యేసు మరొక విధముగా యోహాను ద్వారా బాప్తిస్మం పొంది తనను తాను సిలువకు అప్పగించుకొనెను. పాత నిబంధనలో దేవుడు ఇశ్రాయేలు ప్రజల కొరకు వారి పాపము మోపబడుటకై బలి అర్పణమును నియమించి దానిని వారికి బదులుగా శిక్షించెను.

అరణ్యములోనికి తొలివేయబడిన విడిచిపెట్టు మేక ఆ ఇసుక నేలలో మండుచున్న సూర్యరశ్మి తప్ప నీరు కూడా దొరకదు కనుక అది మరణించును. అలాగే యేసు కూడా తప్పింపబడక సిలువ వేయబడెను. ఎందుకనగా ఆయన అప్పటికే బాప్తిస్మము ద్వారా లోకములోని మానవుల పాపములను మోయుచుండెను. విడిచిపెట్టు మేక నిర్జనమైన అరణ్యములో వదలబడినట్లుగా లోకపాపమును తనపై మోపుకొనిన యేసు అనేకమంది చేత ద్వేషింపబడి తృణీకరించబడెను. బలిమేకను నిజమైన నిర్జీవమైన ఎడారిలోనికి వదలి వేయబడినప్పుడు అది ఆ ప్రాంతమంతయూ తిరుగుతూ దాహము చేత మరణించదా?

అలాగుననే మన పాపాలను అంగీకరించిన యేసయ్య అనేకులచే తృణీకరించబడెను. మన పాపశిక్షను భరించుటకై ఆయన సిలువ వేయబడెను. తన రక్తమును చిందించెను. మరియు మరణించెను. మనకు ఆయన నీరు మరియు ఆత్మమూలమైన సువార్తలోనున్న సత్య రక్షణను నెరవేర్చిన యేసు యొక్క రక్షణ ఇదియే.

ఇశ్రాయేలు ప్రజల పాప పరిహారమునకైన ప్రాయశ్చిత్తము యొక్క విధానమును తమ స్వంత కన్నులతో చూచిరి. తమ హృదయములో దానియందు విశ్వాసముంచిరి వారి వలే మనము కూడా ఇప్పుడు యేసుక్రీస్తు నీతిక్రియలను చూచుచు వినుచు విశ్వసించుచు మన హృదయాలలో పాప పరిహారమును పొందగలము. ఈ భాగము మనతో చెప్పునది యేసుక్రీస్తు యోహానుచే బాప్తిస్మమును పొందియుండాలి. లోకపాపాలను మోసికొని పోవాలి. సిలువ వేయబడాలి. తన రక్తమును చిందించి చనిపోయి మృతి నుండి తిరిగి లేచెను. వీటన్నిటిని మన ఆత్మీయ నేత్రములతో చూచి మన హృదయమందు విశ్వసించాలి.

ప్రాయశ్చిత్త దినము యొక్క బలి అర్పణము ఇశ్రాయేలీయులు ఉన్నంతకాలము కొనసాగుచూనే ఉండును. వారు ఇప్పటికి ప్రాయశ్చిత్త దినము యొక్క అర్పణమును వారి క్యాలెండర్‌లో ఏడవ నెల 10వ దినమున అర్పించెదరు. ఎందుకనగా దేవుడే వారికి చెప్పెను. ‘‘సంవత్సరమునకు ఒకసారి ఇశ్రాయేలీయులు సమస్త పాపమును బట్టి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకు ఇది మీకు నిత్యమైన కట్టడ” (లేవీ 16:34). ఈ విధముగా ఇశ్రాయేలీయులను ప్రాయశ్చిత్త దినమున అర్పణము అర్పించునట్లు చేయుట ద్వారా దేవుడు వారిపై తన కరుణను కుమ్మరించెను. ఎట్లనగా వారి పాపములన్నియూ కడుగబడును. మరియు వారు ఈ పాపశిక్ష నుండి విడిపింపబడెదరు.

అలాగే ఈ కాల ప్రజల కొరకు కూడా యేసయ్య లోకపాపములను తన స్వశరీరముపై మోపుకొనుటకై యోహాను వలన బాప్తిస్మము పొందెను. సిలువ వేయబడెను. తద్వారా పూర్తిగా పాప శుద్ధీకరణమును శాశ్వతముగా చేసెనని తెలిసికొనునట్లు దేవుడు వారికి అనుగ్రహించెను. యేసుక్రీస్తు తన బాప్తిస్మముతో మానవాళి పాపములను భుజమునకెత్తుకొనెను. మరియు పరలోకము యొక్క శాశ్వత ప్రధాన యాజకుడాయెను. ఇప్పుడు మనము మన రక్షణ కొరకు చేయగలిగినది ఏదియూ మిగులలేదు. కానీ కేవలము ఈ సత్యమును నమ్ముకొనుటయే మిగిలినది.



యేసయ్య తన స్వంత శరీరముతో తండ్రియైన దేవునికి అర్పించిన మహా ప్రాయశ్చిత్త బలి అర్పణము


ప్రాయశ్చిత్త దినము యొక్క బలి అర్పణమును తనకు అర్పించవలెనని ఇశ్రాయేలు ప్రజలకు ఎందుకు దేవుడు ఆజ్ఞాపించెను? తండ్రియైన దేవుడు మానవులందరి పాపము కొరకు యేసుక్రీస్తు అను తన కుమారుని ఆయన బాప్తిస్మముతోను, కార్చిన రక్తముతోను మహా ప్రాయశ్చిత్తము అర్పించుట కొరకు వారు తమ విశ్వాసముతో ఎదురు చూచెదరని ఆయన ఈలాగున చేసెను. ఈ కారణమునే తండ్రియైన దేవుని యొక్క ఏకైక కుమారుడును మానవుల రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రతివాని పాపములన్నియూ తుడిచిపెట్టుటకు ఈ లోకమునకు వచ్చి ప్రతిదానిని దేవుని ప్రేమతో నెరవేర్చెను. మరియు మానవాళికి రక్షణను అనుగ్రహించెను. మానవులమైన మన పాపాలను తనపై మోపుకొనుటకై యోహానుచే బాప్తిస్మం పొందుటతోను సిలువలో తన రక్తమును కార్చుటతోను యేసు ప్రతి పాపమును లోక దోషమును తొలగించి వాటి కొరకు శిక్షనొందెను. తద్వారా మనకు నిజరక్షకుడాయెను.

మొదట దేవుడు మోషేను పిలిచి అతనికి ఆజ్ఞలను ఇచ్చెను. తరువాత ఆయన నీలి, ధూమ్ర,రక్తవర్ణ దారము మరియు పేనిన సన్నపునార వంటి పదార్థములతో ప్రత్యక్ష గుడారమును నిర్మించమని అతనిని ఆజ్ఞాపించెను. మరియు అతనికి ఆయన బలివ్యవస్థను ఇచ్చెను. అలాగు చేయుట ద్వారా చేతులుంచుట మరియు రక్తమును చిందించుట అను వాటి యొక్క ఆవశ్యకతను ఇశ్రాయేలీయులు తెలిసికొనునట్లుగా దేవుడు అనుగ్రహించెను. మరియు ఫలితముగా ఆయన వారికి యేసుక్రీస్తును చూపెను. ఆయనే ప్రత్యక్షగుడారములో ప్రవచించబడిన రక్షణ యొక్క ద్వారము ఈ లోకమునకు వచ్చును. బాప్తిస్మమును పొందుట ద్వారా లోక పాపమును తనపై మోపుకొనును. సిలువ వేయబడి తన రక్తమును కార్చెను. దేవుడు మనకు అనుగ్రహించిన పాపమును కడుగుకొనుట యొక్క ఆ రక్షణ, ప్రత్యక్ష గుడారపు తలుపులకు ఉపయోగించిన పదార్థములో స్పష్టముగా బయలుపరచబడెను.

ప్రత్యక్ష గుడారపు తలుపులకు వాడిన వస్తువులలో నీలిదారమునకు ఆపాదించబడిన అర్థమేమనగా యేసు లోకపాపములన్నిటిని ఒక్కసారిగా తనపై మోపుకొనుటకు యోహాను వలన బాప్తిస్మము పొందెను. ధూమ్ర దారము యేసు రాజుల రాజనియు ప్రభువులకు ప్రభువనియు సూచించును. ఎందుకనగా ఆయనే విశ్వసము సృజించెను. రక్తవర్ణ దారము యేసు బాప్తిస్మం పొందెను. ఆయన సిలువలో రక్తమును కార్చుట ద్వారా పాపులందరి పాపముల కొరకు పాపశిక్షను ఆయన భరించెను అని చెప్పుచున్నది. మరియు పేనిన సన్నపు నార చెప్పుచున్నది నీలి ధూమ్ర రక్తవర్ణ దారములో బయలుపరచబడిన మూడు సేవల గురించి బైబిలు విస్తారముగా వర్ణించుచున్నది. మరియు దేవుడు తన వాక్యమును నమ్మిన వారికి పాప పరిహారమును ఆయన అనుగ్రహించెను.

ఇప్పుడు అందరును తమకు తాము ఈ సత్యమును గుర్తు చేసుకొని నమ్మవలెను అనగా యేసు క్రీస్తే వారి రక్షకుడు. ఆయన యోహానుచే బాప్తిస్మం పొందుట ద్వారాను మరియు సిలువపై తన రక్తము కార్చుట ద్వారా ఆయన వారి పాపములన్నిటిని కడిగివేసెను. అతి నీలి, ధూమ్రరక్త వర్ణదారము మరియు పేనిన సన్నపునార వంటి పదార్థముగా వాడిన ప్రత్యక్ష గుడారములో బయలుపరబడెను. మరియు వారు తద్వారా తమ పాపక్షమాపణ వారు పొందగలరు. మోషే ద్వారా దేవుడు రక్షణ నియమమును ఏర్పరచెను. మానవుల కొరకు పాప పరిహారమును ఏర్పరచెను. మరియు సమయము వచ్చినప్పుడు, ఆయన యేసుక్రీస్తును ఈ లోకమునకు పంపెను. మరియు యోహానుచే బాప్తిస్మం పొందునట్లును సిలువపై ఆయన రక్తమును కార్చునట్లు చేసెను. కనుక యేసు లోక పాపములను కడిగివేయగల బలి అర్పణము ఆయెను. మరియు అలాగు చేయుట ద్వారా విశ్వాసముతో నమ్మువారందరూ తమ పాపముల నుండి కడిగివేయబడునట్లు అనుమతించెను.

కాబట్టి యేసుక్రీస్తును రక్షకునిగా విశ్వసించమని మనము చెప్పినప్పుడు యేసు పొందిన బాప్తిస్మమును ఆయన సిలువ రక్తమును తెలిసికొని మనము విశ్వసించవలెను. పాత నిబంధనలో బలి పశువుపై చేతులుంచబడుట వలన పాపుల దోషములను అంగీకరించి వారి స్థానములో తన రక్తమును చిందించుట ద్వారా ఘోరశిక్షను పొందినట్లే. యేసుక్రీస్తు ఈ లోకములో నివశించుచున్న ప్రతివారి పాపము కొరకు బలిపశువుగా వచ్చెను. బాప్తిస్మము పొందుట ద్వారా లోకపాపమును వహించుకొనెను. సిలువ వేయబడెను. తన ప్రశస్త రక్తమును చిందించెను. మరియు విశ్వసించువారి పాపమును ఒకేసారిగా శాశ్వతముగా తుడుపుపెట్టెను.

వ్రాయబడిన వాక్యము యొక్క సత్యమును ఉన్నది ఉన్నట్లుగానే మనము విశ్వసించవలెను. బైబిలు పరమైన సత్యమేమనగా పాతనిబంధనలో తన ప్రజల కొరకు ప్రధాన యాజకుడు బలి అర్పించిన విధానములోనే యేసు ఈలోకమునకు వచ్చెను. బాప్తిస్మం పొందెను. సిలువ వేయబడెను మరియు మనలను ఈ లోకపాపములన్నిటి నుండి ఒక్కసారిగా రక్షించుటకు తన రక్తమును చిందించెను. కనుక మనము బైబిలును వ్రాయబడిన రీతిగానే తప్పక విశ్వసించవలెను. మన పాపములను బట్టి తప్పించుకొనలేము కానీ శాశ్వతముగా శిక్షింపబడివలసిన వారము కానీ యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చెను తన బాప్తిస్మముతోనూ, రక్తముతోనూ మనలను మన పాపములన్నిటి నుండి రక్షించెను.

దీనిని నమ్మకుండా ఈ విధముగా దేవుడు మన పాపములను క్షమించినప్పటికీ దేవునిచే ఎన్నటికీ క్షమించబడని పాపము ఉన్నదా. ఆయన ‘‘పరిశుద్ధాత్మ విషయము దూషించుట” (మార్కు 3:28-29) అను పాపము తప్ప మిగిలిన పాపములన్నిటిని క్షమించెను. అలాగే నిజముగా పాపక్షమాపణను కోరుకొను వారు యేసు బాప్తిస్మము పొందెను. తన రక్తమును కార్చెను. మృతి నుండి తిరిగి లేచెను తద్వారా అందరినీ లోకపాపముల నుండి విడిపించెను సత్యమును నమ్మవలెను. అట్టి విశ్వాసము నుండి వేరై మన పాప క్షమాపణము కొరకు ఏ మంచి పని అవసరము? నీరు మరియు ఆత్మమూలమైన సువార్త యొక్క సత్యమనగా ఏమిటో మనము తెలిసికొనవలసిన సమయము ఇదే మరియు ఈ సత్యమును నమ్మవలెను.

నీలి, ధూమ్ర, రక్తవర్ణ దారములు మరియు పేనిన సన్నపునారతో నేయబడిన ప్రత్యక్ష గుడారపు తలుపులలో బయలుపరచబడిన సత్యమే నిజ రక్షణ యొక్క సువార్త. మరియు వచ్చుచున్న యేసుక్రీస్తు నీడయైయున్నది. ఇప్పటి వరకు యేసుక్రీస్తును నమ్ముట గురించి ఆయన పొందిన బాప్తిస్మము మరియు సిలువపై ఆయన కార్చినరక్తము మన రక్షణకు అత్యంత అవసరము కనుక వాటిని మనము నమ్మవలెను. వివాదరహితమైన తిరస్కరించలేనట్టి సత్యము ఏదనగా తన బాప్తిస్మమును ఆయన సిలువపై కార్చిన రక్తమును మృతి నుండి ఆయన పునరుత్థానమును విశ్వసించు వారికి యేసు రక్షణ నిచ్చెను. మరియు మనలను లోక పాపము నుండి రక్షించుటకే వీటన్నిటిని ఆయన చేసెను.



తండ్రియైన దేవుడు కోరుకొనిన కుమారుని యొక్క బలి అర్పణము


హెబ్రీయులకు 10:5-9వైపు తిరుగుదాము. ‘‘కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించునప్పుడు ఈలాగు చెప్పుచున్నాడు. బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి. పూర్ణ హోమములను పాపపరిహారార్థ బలులును నీకిష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంధపుచుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము. దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చియున్నానంటిని బలులు అర్పణలు పూర్ణహోమములు పాప పరిహారార్థ బలులును నీవు కోరలేదనియు అవి నీకిష్టమైనవి కావనియుపైని చెప్పిన తరువాత ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చియున్నానని చెప్పుచున్నాడు. ఇవన్నియు ధర్మశాస్త్రము చొప్పున అర్పింపబడుచున్నవి. ఆరెండవ దానిని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టి వేయుచున్నాడు.’’

ఇక్కడున్న భాగములో దేవుడు బలి అర్పణమును కోరుకొనలేదని దీని అర్థమా? ఈ భాగము కీర్తను 40:6-7 నుండి తీసుకొనబడినది. దీని భావమేదనగా లోక పాపము పాత నిబంధన యొక్క అనుదిన అర్పణముద్వారా పూర్తిగా తుడుపు పెట్టబడదు. మరియు పాప పరిహారార్థ బలిని శాశ్వతముగా సమర్పించుటకు యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చెను కాబట్టి బాప్తిస్మము పొందెను. తనరక్తమును కార్చెను. మృతి నుండి తిరిగి లేచెను. తద్వారా మన అందరికీ రక్షకుడాయెను. కీర్తన 40:7 యొక్క భావము చెప్పునదేమనగా ‘‘అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చియున్నాను.’’ యేసుక్రీస్తు ఖచ్చితంగా వ్రాయబడిన విధముగానే ఈ లోకమునకువచ్చెను. చేతులుంచబడుట ద్వారా రక్తము కార్చుట ద్వారా అన్ని పాపములను కడిగివేసెను ఇదంతయూ పాత నిబంధనలో వ్రాయబడెను.

పాత నిబంధన కాలములో ప్రాయశ్చిత్త దినమున ప్రధాన యాజకుని చేతులుంచుట వలన బలి పశువు వధించబడి దాని రక్తమును చిందించుట ద్వారా ఇశ్రాయేలీయుల పాపములు క్షమించబడినవి. అలాగే మానవులందరి పాపములకు శాశ్వత బలిగా మారుటకు యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చెను బాప్తిస్మము పొందుట ద్వారా మానవుల పాపమును వహించెను. అది చేతులుంచుట యొక్క రూపమే. మానవులందరి ఈ లోక పాపములను సిలువకు మోసికొనిపోయి వాటన్నిటి శిక్షను భరించెను. ఎందుకనగా సిలువవేయబడెను. తన ప్రశస్త రక్తమును చిందించెను ఇదంతయూ విశ్వసించినవారికే.

ప్రత్యక్ష గుడారము ద్వారా దేవుడు వాగ్ధానమిచ్చినట్లే క్రొత్త నిబంధనలో యేసు ఈ లోకమునకు వచ్చెను తద్వారా ఒక్కసారిగా రక్షణను నెరవేర్చెను. కనుక విశ్వసించినవారు పాపములన్నిటి నుండి రక్షింపబడెదరు. యేసు శాశ్వతముగా ప్రజలందరి పాపములను, బాప్తిస్మం పొందుట మరియు రక్తమును కార్చుట ద్వారా ఒకేసారిగా తుడిచివేసెను. ఇది ప్రత్యక్ష గుడారములోని దేవుని వాగ్ధానము. మరియు యేసు వాస్తవంగా వచ్చి వాగ్ధాన పరచిన రక్షణను బాప్తిస్మం పొంది తన రక్తమును గూర్చి తద్వారా సంపూర్తిగా దేవుని వాక్యమును నెరవేర్చెను. దేవునియొక్క రక్షణ యొక్క వాగ్ధానము మరో విధముగా యేసుక్రీస్తు నందు వాస్తవముగా నెరవేరెను.

పాత నిబంధన యొక్క నియమము మరియు ప్రవక్త యొక్క మాటలు దేవుని వాక్యమని ఇశ్రాయేలు ప్రజల నమ్మకము. కానీ వారు నూతన నిబంధన కాలములో రక్షకుడైన దేవునిగా వచ్చిన యేసుక్రీస్తును నమ్మలేదు. ఈ లోక ప్రజలందరూ ఇశ్రాయేలీయులతో కలిపి అందరూ యేసుక్రీస్తు తానే దేవుడని తప్పక ఇప్పుడు నమ్మవలెను మరియు ఆయనే రానైయున్న మెస్సయ్య అని తమ హృదయములో అంగీకరించవలెను.



యేసు ఎందుకు వచ్చెను?


తండ్రియైన దేవుని చిత్తమును నెరవేర్చుటకు యేసు వచ్చిన విధముగా విశ్వసించు వారందరికీ ఆ విధముగానే వారందరికీ రక్షకుడు. మరియు ఆయన వారి పాపములన్నియు ఎప్పటికీ కడిగివేయుటకు ఈ లోకమునకు వచ్చెను. హెబ్రీ 10:10లో చెప్పినట్లే ‘‘యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడియున్నాము.’’

తండ్రియైన దేవుని చిత్తప్రకారమే యేసుక్రీస్తు ఈ లోకములో పుట్టెను. తండ్రి చిత్తము చొప్పుననే బాప్తిస్మము పొందెను. ఈ చిత్తముతోనే ఆయన సిలువ వేయబడెను. సిలువపై చనిపోవుటకు తన రక్తమంతా కార్చెను. మృతి నుండి తిరిగి లేచెను. తద్వారా విశ్వసించు వారికి రక్షకుడాయెను అని మనమందరమూ స్పష్టముగా గుర్తించి విశ్వసించవలెను. మన పాపములన్నిటిని తండ్రియైన దేవుని చిత్త ప్రకారము తుడుపు పెట్టుటను యేసుక్రీస్తు నెరవేర్చుటకు ఆయన తాను పొందిన బాప్తిస్మముతోనే ఆయన కార్చిన రక్తముతోను మానవుల పాపములను తుడిచి రక్షణ నిచ్చెను. అలాగే ఆయనను తాను బలిగా అర్పించుకొనెను. తద్వారా మనకు ఖచ్చితమైన రక్షణనిచ్చెను.

యేసుక్రీస్తు కేవలము ఇశ్రాయేలీయుల పాపములనే కాక మానవులందరి పాపమును తుడుపు పెట్టుటకు తనను తాను సమర్పించుకొనెను కనుక మనలో ప్రతి ఒక్కరు దీనియందు మన హృదయములో విశ్వాసము నుంచినప్పుడే రక్షింపబడెదము. ఆయన యొక్క 33 సంవత్సరముల జీవితంలో యేసయ్య ఒకే ఒకసారి బాప్తిస్మము పొందెను. ఒక్కసారే బలి ఆయెను. తద్వారా లోకములోని పాపులను ఒకేసారిగా రక్షించెను. ఇది ఒక్కటే ఖచ్చితమైన రక్షణయై ఉన్నది.

ఈ లోకము ఆరంభమైనప్పటి నుండి అంతము వరకు మానవులు చేసిన పాపములన్నిటిని యేసయ్య ఒక్కసారిగానే తుడిచినట్లు ఆయన మనలను కూడా విశ్వాసము ద్వారా ఒక్కసారిగా రక్షణ పొందననుగ్రహించెను. ఒక్కసారిగా తన శరీరమును అర్పించుట ద్వారా యేసుక్రీస్తు మనలను నిత్య సంపూర్ణులనుగా చేసెను. ఆయన యోహాను ద్వారా బాప్తిస్మం పొంది తన రక్తమును చిందించుట ద్వారా మన అందరి పాపములకై శిక్షించబడినట్లే. మనము కూడా ఇప్పుడు మన హృదయాలలో ఈ సువార్తను సంతోషముగా నమ్ముట ద్వారా మన పాపములన్నిటి నుండి రక్షింపబడెదము తండ్రియైన దేవుని చిత్తప్రకారము యేసుక్రీస్తు మన పాపములన్నిటిని వహించుకొనుటకును జీవమునకైన జీతమును చెల్లించుటకును ఈ లోకమునకు వచ్చెను మరియు ఆయన విజయవంతంగా తండ్రి చిత్తానుసారముగా దేవుని ప్రేమ ద్వారా తన నిజ రక్షణను కనుపరచెను. 

ఈ నవీన లోకములో జీవించుచున్న నీవును, నేనును తప్పక ఈ మాటను నమ్మవలెననుట ఖచ్చితముగా వాస్తవమే మనము తప్పక యేసయ్య బాప్తిస్మమును, ఆయన సిలువలో కార్చిన రక్తమునకు లోబడి ఆ రెండింటిని కలిపి ఒకే సత్య సమితి. సంపూర్ణముగా మనలను రక్షించెనని నమ్మవలెను. అట్లు చేయుటలో మనము తప్పిపోయిన యెడల మనము నిత్య పాపక్షమాపణమును కోల్పోయెదము. అటువలే మనము వ్రాయబడియున్న దేవుని వాక్య ప్రకారము నీరు మరియు ఆత్మమూలమైన సువార్త రక్షణ యొక్క వెలుగును ప్రసరించు కానీ మనము దేవుని నమ్మునప్పుడు దానికి మనము ఏదైనను కలిపిన లేదా సత్యవాక్యము నుండి ముఖ్యమైన దానిని కొంత తీసివేసిననూ లేదా సత్యమును ఉన్నది ఉన్నట్లుగా విశ్వసించక పోయినను రక్షణ యొక్క సువార్త వెలుగును కోల్పోతాము.

నీరు మరియు ఆత్మమూలమైన సువార్త యొక్క సత్యమును లోకసంబంధమైన బోధనలలో ఒకటి అను తప్పుడు అభిప్రాయములో మనము ఉండకూడదు ఎట్లనగా దేవుని మన అనుదిన పాపములను క్షమించుమని పశ్చాత్తాప ప్రార్థనలను చేయుట ద్వారా పాప క్షమాపణము పొందగలమని బోధించు బోధనలతో కలుపకూడదు. హెబ్రీ 10:11లో దేవుడు స్పష్టముగా చెప్పెను. ‘‘మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయుచు పాపములను ఎన్నటికి తీసివేయలేని ఆ బలులనే మాటి మాటికి అర్పించుచు ఉండును.’’ ఆయన మరొక విధముగా మనకు చెప్పెను. ఎట్లనగా మనము అనుదినము చేయు పాపమును కడుగుకొనలేము కారణము మనము మన అనుదిన పాపక్షమాపణ కొరకు సిలువ రక్తములోనే విశ్వాసముంచి అడుగుతాము.

యెహాను ద్వారా బాప్తిస్మము పొంది సిలువలో మరణించుటతో యేసుక్రీస్తు తండ్రియైన దేవునికి అర్పించిన బలి అర్పణము పరిపూర్ణమైన రక్షణ యొక్క అర్పణము. ఈ అర్పణము మనము నమ్ముకొనుట వలననే మనము పూర్తిగా రక్షింపబడితిమి. ఎందుకనగా ఈ లోకపాపములన్నియూ ఒక్కసారిగా యేసు క్రీస్తు యోహాను వలన బాప్తిస్మమును పొందుట ద్వారా ఆయనపైన మోపబడెను. ఆ యేసయ్య మన పాపములను సిలువకు మోసుకొని పోయెను. మరియు వారి పాపశిక్షను అంతము చేయుటకై సిలువపై మరణించెను. మరియు ఇందువలననే ఆయన బాప్తిస్మమును మరియు చిందించిన రక్తమును నమ్మువారందరూ కడుగబడిరి.

యేసు పొందిన బాప్తిస్మమును ఆయన సిలువ రక్తమును విశ్వసించుట ద్వారా మనము కూడా యేసుక్రీస్తుతో కూడా చనిపోయి ఆయనతో పాటుగా విశ్వాసముతో సజీవులమైతిమి. రోమా 6:23 చెప్పుచున్నది. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము. అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తుయేసునందు నిత్యజీవము పాపమునకు జీతము మరణము. అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్యజీవము పాపమునకు జీతము మరణము. అది ఏదైనను సరే దాని జీతము ప్రాణముతోనే చెల్లించవలెను. ఇందువలననే యేసుక్రీస్తు శరీరధారియై ఈ లోకమునకు వచ్చును. యోహానుచే బాప్తిస్మము పొందెను. మరియు ఆయన తన రక్తమును సిలువపై చిందించెను. నిజముగా నీ పాపమును యేసుక్రీస్తు శరీరముపై మోపుట ఆయన బాప్తిస్మముతో సంబంధము కలదైయున్నది. మరియు ఈ పాపమును భుజమునకు ఎత్తికొని చనిపోవుట ద్వారా యేసు నీ పాప జీతమును చెల్లించెను. తద్వారా వాటన్నిటిని ఒకేసారిగా తడుపుపెట్టెను. అయినను అంత మాత్రమే కాక దేవుడు సత్యము యొక్క ఈ సువార్తను మనకు ఇచ్చినప్పటికి ప్రతి దినము తమ పాపమును వాస్తవముగా క్షమించమని దేవుని బ్రతిమాలుకొను వారు అనేకులు కలరు. వారు నీరు మరియు ఆత్మమూలమైన సువార్త యొక్క సత్యమును ఎరుగని వారైయున్నారు.

ప్రజలు తమహృదయములలో పాపము జరిగించినప్పుడు, ఆ పాపమును బట్టి వారు దేవుని యెదుట భయపడి వణికెదరు. నీరు మరియు ఆత్మమూలమున సువార్తను గూర్చిన జ్ఞానము లేనివారు ఇంకను అనేకులు ఉన్నారనియు ఇంకనూ తమ పాపాలను కడుగుకొనిన వారును వారి ఆత్మ యొక్క పాపము కారణముగా భయము చేత పట్టబడినవారు ఉన్నారనునది సత్యము ఏదేమైననూ యేసయ్య అట్టి వారిని వారి పాపములన్నిటి నుండి విడిపించుటకే ఈ లోకమునకు వచ్చెను. యోహానుచే బాప్తిస్మమును పొందెను. సిలువలో తన రక్తమును చిందించెను. అందువలన వారిని సంపూర్తిగా రక్షించెను. నీరు మరియు ఆత్మమూలమైన సువార్త దేవుని రక్షణ యొక్క సువార్త మనలను పూర్తిగా రక్షించెను. మరియు మన పాప శిక్షయొక్క బాధ్యతను తీసుకొనెను అట్లయిన మనమిక బాధపడవలసిన అవసరము ఏమున్నది.

యేసయ్య మానవుల పాపములన్నిటిలో తుడుపు పెట్టెనని నీరు మరియు ఆత్మమూలమైన సువార్త ద్వారా తెలిసికొని విశ్వసించువారు వాస్తవముగా విశ్వాసముతో పూర్తిగా రక్షణను పొందగలరు. ఎట్లనగా దేవుడు ఇట్లు వాగ్ధానము చేసెను. ‘‘మీ పాపము రక్తము వలే ఎఱ్ఱనివైననూ అవి హిమమువలే తెల్లబడును. కెంపువలే ఎఱ్ణనివైనను గొర్రెబొచ్చువలే తెల్లనివగును” (యెషయా 1:18) 

మనము అందరము విశ్వాసమూలముగా జీవింపబడెదము. ఎట్లనగా పాత నిబంధనలో సిద్ధపరచబడిన దేవునిచే నియమించబడిన ప్రకారము ఈ లోకపాపములను అంగీకరించుటకై యేసు బాప్తిస్మం పొందెను. అట్లు చేయుట వలన పాపము చేతులుంచుట వలన బలిపశువుపై మోపబడిన రీతిగానే యేసు అనుభవించెను. ఎందుకనగా యేసయ్య సిలువలో మరణించునట్లు యోహాను వలన బాప్తిస్మమును పొంది లోకపాపమును వహించుకొనెను. పాత నిబంధనలో దేవుడు చెప్పిన మనపాపములన్నిటి నుండి మన విశ్వాసము ద్వారా రక్షణ పొందునట్లుగా నెరవేర్చబడెను.

ఈ త్రోసివేయలేని సత్యము ఉండగా అది అనుభవించదగిన ఒక వ్యాయామమని నమ్మువారు ఇప్పటికీ అనేకులున్నారు. వారు అనుదినము తమ విశ్వాసమును పెంపొందించుకొనుట కొరకు ఏడ్చుచూ, మొర్రపెట్టెదరు. ఎందుకనగా వారి విశ్వాస ఆధారము యేసు సిలువలో అనుభవించిన మరణ వేదనను బట్టి జాలిని చూపుట అట్టి ప్రజల హృదయము సంపూర్తిగా తప్పిదములో నున్నవి. వారు ఇట్టి తప్పుడు విశ్వాసమును విడువవలెను.

నీవును నేనును మన రక్షకుడైన యేసయ్య బాప్తిస్మముతోను రక్తముతోను కడగబడిన వారము. కానీ యేసయ్యకు మన జాలి మరియు భక్తి అవసరము లేదు. చిన్న సత్యమేమనగా మనకు రక్షకుడైన యేసయ్య ఎంత అవసరము అయిననూ తమ స్వంత కారణము ఏమియూ లేకయే యేసయ్యకు ఏదో తక్కువైనదని ఆయనే వారిని విశ్వసించమని ముష్టి అడుగుచున్నాడని తలంచుచూ దేవుని విశ్వసించువారు అనేకమంది ఉన్నారు. కానీ ఒక పద్ధతిని నమ్మునట్టి విశ్వాసమును దేవుడు త్రోసివేయును.

యేసయ్యను నమ్ముచున్నామని నమ్మకముగా ఆయనతో చెప్పువారు హృదయము కలవారు ఆయనకు ఏదో మేలు చేయుచున్న వారి వలే దేవుని కంటే అధికులుగా తమను ఊహించుకొనుచు పాపము నుండి పరిపూర్ణముగా తమను రక్షించునట్టి నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను వారి తిరుగుబాటు స్వభావముతో తమ హృదయములలో అంగీకరించరు. వారు దేవుని వాక్యమునకు అతి తక్కువ ప్రాముఖ్యతనిస్తారు. ఎందుకనగా వారి యొక్క ఇరుగుపొరుగు చెప్పుమాటలకు వాక్యమునకు తేడా చిన్నదిగా పరిగణిస్తారు. దానిని విశ్వసించుట వలన తమ జాతితో దేవుని మేలు చేయుచున్నట్లుగా అనుకొంటూ ఉంటారు.

అంతమున యేసు యొక్క బాప్తిస్మమును ఆయన చిందించిన రక్తమును తమకు పాపక్షమాపణ నిచ్చునని వారు విశ్వసించరు. దేవుని ఎదిరించువారిగా ఉంటారు. నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను కూడా నమ్మక తమ పశ్చాత్తాపముతో రోధించి చేయు ప్రార్థనల ద్వారానే తమ పాపము కడుగబడునని వారు నమ్ముతారు. దేవుని నామమును వారు వ్యర్థపరచిన కారణముగా రక్షకుడైన యేసుక్రీస్తు తమ పాపములను సంపూర్తిగా తుడుపు పెట్టెనని తెలియనివారై ఆయనను విశ్వసించరు. మరియు వారు రక్షింపబడలేరు.

దేవుడు ఇట్లు చెప్పెను. ‘‘ఎవనిని కరుణింతునో వానిని కరుణింతును. ఎవని యెడల జాలి చూపుదునో వాని యెడ జాలి చూపుదును” (రోమా 9:15) దేవుడు రక్షణ యొక్క నియమముతో రక్షించవలెనని తన దయ చొప్పున నిర్ణయించుకొనిన యెడల, ఆయన ఎట్లు నిర్ణయము చేసెనో అట్లు తప్పక జరిగించును. కాబట్టి మనము తప్పక నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను నమ్మవలెను. మరియు ఆ విధముగా మన నిజ రక్షణను పొందగలము.

ఈ నీరు మరియు ఆత్మమూలమైన సువార్త వాక్యమును విశ్వసించనివారు వ్యక్తిగతముగా ఆయన ఉగ్రత కోపమును ఎంత గొప్పదో కనుగొనగలరు. నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను విశ్వసించువారు. మరొక ప్రక్క దేవుని ప్రేమ యొక్క ఔన్నత్యమును ఆయన కరుణను చూచెదరు. అతని/ఆమె యొక్క పాపమును దేవుని ఎదుట తెలియజేసి నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను గుర్తించి నమ్మిక నుంచువారు దేవుని సువార్త యొక్క పూర్ణ రక్షణను పొందినవారై తమ పాపములన్నిటి నుండి విడుదల పొందెదరు.

యేసుక్రీస్తు బాప్తిస్మమును పొందెను కనుక తమ పాపములన్నిటిని ఆయన వహించుకొనెనని నమ్మువారు తమ పాపములన్నిటి నుండి విడిపించబడగలరు. ఈ సత్యమును తృణీకరించువారు దీనికి భిన్నముగా తమ పాపములకైన భయంకర పాపశిక్షను అనుభవించెదరు. కాబట్టి ఈ లోకములోని ప్రజలందరు తప్పక ఆ నిజ సత్యమైయున్న నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను విశ్వసించవలెను. దేవుని న్యాయ తీర్పునకు భయపడకయు, నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను నమ్మనివారు తప్పక వారి పాపముకై శిక్షింపబడెదరు. కానీ యేసు పాపములను కడిగెనని సత్యమును నమ్ముతారు. తమ పాపములన్నిటి నుండి రక్షింపబడెదరు.

ఎవరి మనస్సాక్షి పాపమును కలిగియుండునో వారు తేలికగా వ్యాధి కలవారగుదురు. కాబట్టి ఆధారము లేని కనుగొనబడనట్టి రక్షణ యొక్క సువార్తతో వచ్చువారు. పూర్తిగా నీరు మరియు ఆత్మమూలమైన సువార్తకు వేరై తమ తప్పుడు మనస్సాక్షిని ఊరడించుకొనుటకు ప్రయత్నించెదరు. ‘‘నేను యేసును నమ్ముకొన్నంత కాలము నా హృదయములో పాపము ఉన్ననూ నాకేమి కాదు” అని చెప్పుకొనెదరు. ఎట్లనగా నిశ్చయముగా దేవుడు వారి పాపములనుబట్టి ప్రజలకు తన న్యాయ తీర్పునిచ్చును. వారు సాతాను పక్షము వహించిరి కనుక దేవుడు వారిని వదిలివేయడు.

కానీ దేవుని నీతిని తెలిసికొనినట్టివారు పాపమునకైన న్యాయతీర్పు కలదని తెలిసికొన్న వారు దేవుని యొక్క కరుణతో కూడిన ప్రేమ కొరకు అడిగెదరు. తమ పాపములన్నిటి నుండి రక్షింపబడకోరుకొని, సత్యమును అన్వేషిస్తారు. దేవుని పక్షమున నిలవాలనే కోరికను కలిగి ఉంటారు. అట్టి ప్రజల కొరకు యేసు క్రీస్తు బాప్తిస్మమును పొందినవాడై మానవుల పాపములను తాను మోసెనను సత్యము కలదు. ప్రతి పాపి దానిని నమ్మవలెను. మరియు పాప క్షమాపణమును పొందవలెను. తన బాప్తిస్మము ద్వారా యేసుక్రీస్తు ఈ లోకపాపములన్నిటిని ఒక్కసారిగా అంగీకరించెను. ఒక్కసారే సిలువపై చనిపోయెను. మరియు ఆ విధముగా మన పాపములన్నిటిని కడిగి మనలను నీతిమంతులనుగా చేసెను.

నీరు మరియు ఆత్మమూలమైన సువార్త వాక్యము ద్వారా మనలో ప్రతివారు మన నిజ రక్షణ ఏమైయున్నది అని ఆలోచన కలిగియుండవలెను. మరియు మన హృదయాలలో ఈ సువార్తను నిజముగా నమ్మునట్టి విశ్వాసమును కలిగియుండవలెను. తమ హృదయాలలో ఈ సత్యమును నమ్మువారందరూ వారు చేసిన పాపము ఏ విధమైనది అయినను సంబంధం లేక విశ్వాసము ద్వారా అవన్నియూ వాస్తవముగా కడిగివేయబడును మరియు పాపమునకైన నిజ క్షమాపణను నిత్యజీవమును పొందెదరు. నీవు సువార్త వాక్యమును నమ్ముకొనక నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను విశ్వాసముతో గైకొనక నీ హృదయములోని పాపములన్నిటిని పోగొట్ట గల ఆ సువార్తను నమ్ముకొన్నావా? దేవుని ఎదుట ఈ నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను విశ్వసించువారు నిశ్చయముగా పాప క్షమాపణను పొందెదరు.



నీ పశ్చాత్తాప ప్రార్థనలు నిన్ను రక్షింపలేవు


ఈ దినాలలో యేసుక్రీస్తును నమ్ముచున్నామని ప్రకటించువారు తమ పాపములను క్షమించమని అనుదినము దేవునికి పశ్చాత్తాప ప్రార్థనలను చేయుదురు. అట్టివారు ప్రతిదినము దేవునికి బలియాగమును అర్పించుచూ తమ విశ్వాస జీవితమును జీవించెదరు. అంతయూ పాత నిబంధన సమయము వలెనే చేసెదరు. కానీ అట్టి విశ్వాస జీవితమును జీవించెదరు. అంతయూ పాతనిబంధన సమయము వలెనే చేసెదరు. కానీ అట్టి విశ్వాస జీవితమును జీవించాలని నీవు కోరుకొనకూడదు. నీవు నీ పశ్చాత్తాప ప్రార్థనలను చేసిన ప్రతిసారి యేసయ్య నీ పాపములను కడిగివేయుటకు సిలువలో రక్తము కార్చునా? పరిస్థితి ఇట్టిది కాదు. దానికి బదులు యేసుక్రీస్తు యొక్క బాప్తిస్మశక్తి మరియు ఆయన కార్చిన రక్తము యొక్క ప్రభావము నిత్యమైనదని నమ్ముట ద్వారా ఒకేసారిగా నీవు నీ పాపమును కడిగి వేసికొనవలెను. తమ పాపములను అనుదిన పశ్చాత్తాప ప్రార్థనలను చేయుట ద్వారా విడిపించబడవలెనని ప్రయత్నించువారు నిత్యపాప క్షమాపణను పొందలేరు. లేదా సత్యరక్షణను తాము పొందగలుగునట్లు చేయగల విశ్వాసమును కలిగియుండలేరు.

ప్రతి వాని పాపము అట్టి ప్రార్థనల ద్వారా క్షమించబడినట్లయిన లేదా మానవ కల్పిత ఆచారము వలన పోయినట్లయితే దేవుడు పాపమునకు జీతము మరణమగు ఆజ్ఞను నియమించక పోవును. ప్రజలు తమ పాపము క్షమించబడుటకు, వాస్తవముగా వారు విశ్వాసముతో తమ పాపములను యేసయ్య శరీరముపై మోపెడి అర్పణమును అర్పించవలెను. మనము కలిగియుండవలసినది అనుదినము పశ్చాత్తాప ప్రార్థనలను సమర్పించెడి విశ్వాసము కాదు. కానీ ప్రత్యక్ష గుడార తలుపులకు ఉపయోగించిన నీలి, ధూమ్ర, రక్తవర్ణ దారము మరియు పేనిన సన్నపునారలో బయలుపరచబడిన నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను నమ్మునట్టి విశ్వాసమును కలిగి యుండవలెను. మరొక విధముగా నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను విశ్వసించు నమ్మిక మాత్రమే సత్యముగా పాపము వలన శుద్ధీకరించునని మనము తప్పక తెలుసుకొనవలెను. మరియు దీనిని మనము మన హృదయములలో నమ్ముకొనవలెను.

పాత నిబంధనలోని పాపులు తమ బలిపశువు తలపై చేతులనుంచుట ద్వారా తమ పాపములను దానిపై మోపి తమ పాప బలిని అర్పించెదరు. మనము కూడా యేసుక్రీస్తుని బాప్తిస్మమును నమ్ముకొనుట ద్వారా ఆయనపై మోపి అట్టి విశ్వాసము ఆయన బాప్తిస్మమును మరియు ఆయన సిలువలో కార్చిన రక్తమును నమ్మి దేవుని యొద్దకు వచ్చి నిత్యమైన పాపక్షమాపణమును పొందుకొనవలెను. దేవుడు చెప్పెను ‘‘ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును. రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. కాగా వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును.’’ (రోమా 10:10, 17)

యోహాను 1:29లో చెప్పెను. ‘‘మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి ఇదిగో లోకపాపమును మోసికొనిపోవు దేవుని గొర్రె పిల్ల” ఈ భాగములో బాప్తిస్మమిచ్చు యోహాను, యేసునకు బాప్తిస్మమిచ్చిన తరువాత రోజున సాక్ష్యమిచ్చుచున్నాడు. యేసు తనను సమీపించుట బాప్తిస్మమిచ్చు యోహాను చూచినప్పుడు అతడు ‘‘ప్రజలారా చూడుడి! అక్కడ ఒకడు పోవుచున్నాడు” అని చెప్పెను. ఇది యోహాను చుట్టూ గుమిగూడిన ప్రజలలో కలకలము రేపినది. యోహాను బిగ్గరగా ఇట్లు చెప్పెను. ‘‘ఇదిగో దేవుని గొర్రె పిల్ల వచ్చుచున్నది! అతడు దేవుని కుమారుడు నా ద్వారా మానవుల పాపములను తనపైన మోపుకొనిన ఆ దేవుని గొర్రె పిల్ల. అతడు మన రక్షకుడు.’’

అతడు యేసుక్రీస్తు దేవుని గొర్రెపిల్ల ఇదిగో లోక పాపములను మోసికొనిపోవు దేవుని గొర్రె పిల్ల. ఏలయనగా బాప్తిస్మమిచ్చు యోహాను యేసుక్రీస్తునకు బాప్తిస్మమునిచ్చి లోకపాపమును ఆయనపై మోపెను గనుక ఆ యోహాను తానే యేసును గూర్చి వ్యక్తిగతముగా సాక్ష్యమును కలిగియున్నాడు. యేసుకు బాప్తిస్మమిచ్చుట ద్వారా యోహాను మన పాపములను ఆయనపై మోపెను. కనుక మరొక విధముగా చూచిన యేసుక్రీస్తు బలి గొర్రె పిల్లగా వచ్చెను. తండ్రియైన దేవుని చిత్తానుసారముగా ఆయన మన పాపములను తానే మోసెను.

పాత నిబంధనలో పాప క్షమాపణను దేవునికి బలి అర్పణమును అర్పించుట ద్వారా పొందిరి. కానీ నూతన నిబంధనలో యేసుని బాప్తిస్మమును, ఆయన సిలువపై కార్చిన రక్తమును పూర్తిగా విశ్వసించుట ద్వారా మాత్రమే మనము మన పాప పరిహారమును పొందగలము. దేవుడు అట్టి సజీవమైన ఎద్దులను, గొర్రెలను మరియు మేకను బలి అర్పణముగా ఇశ్రాయేలు ప్రజల పాప శుద్ధీకరణ కొరకు అంగీకరించెను కనుక లెక్కలేనన్ని పశువులు రక్తము కార్చెను. ముక్కలుగా చేసి దహన బలిపీఠము మీద దహించబడెను. ప్రజల పాపమును బట్టి అనేకమైన బలిపశువులు వాస్తవముగా చంపబడెను.

కానీ నూతన నిబంధన కాలములో యేసయ్య అట్టి బలిపశువును అర్పించలేదు. కానీ మన కొరకు ఆయన తన స్వంత శరీరమును అర్పించెను. యేసయ్య దేవుని గొర్రె పిల్లవలే ఈ లోకమునకు వచ్చెను. తన బాప్తిస్మము ద్వారా లోకపాపములను తన శరీరముపై మోపుకొనెను. తన రక్తమును సిలువపై చిందించెను. దీనిని నమ్ము ప్రతివాడు ఒకేసారిగా తమ పాపముల నుండి రక్షింపబడుటకు ఆయన అనుగ్రహించెను. ఎట్లనగా మన పాపములను శాశ్వతముగా అంతము చేయుటకు యేసయ్య మన యొద్దకు నీరు, రక్తము మరియు ఆత్మగా వచ్చెను.

ఇప్పుడు నిజమైన రక్షణ యొక్క సత్యమును నీవును నేనును నమ్మిక ఉంచవలెనని దేవుడు ఆజ్ఞాపించుచున్నాడు. అతడు మనకు ఇట్లు చెప్పుచున్నాడు. ‘‘నేను నీ పాపములన్నిటిని తుడుపుపెట్టితిని, ఎందుకనగా నేను నిన్ను ప్రేమించితిని. ఇట్లు నేను నిన్ను రక్షించితిని. కాబట్టి విశ్వసించుము. నేను నీ కొరకు నా స్వంత కుమారుని పాపబలిగా అర్పించుట ద్వారా నీ పాపమును తుడుపు పెట్టితిని. నా కుమారుడు 33 సంవత్సరములు ఈ లోకములో జీవించునట్లు చేసితివి. అతనిని బాప్తిస్మము తీసుకొననిచ్చితిని. నీ కొరకు అతడు తన రక్తమును సిలువలో కార్చునట్లుగా చేసితిని. ఆలాగు జరిగించుట వలన నేను నిన్ను నీ పాపములన్నిటి నుండి వాటి శిక్ష నుండి పూర్తిగా విడిపించితిని. ఇప్పుడు ఈ సత్యమును నమ్ముకొనుటతో నీవు నేను ప్రేమించునట్టి నా స్వంత బిడ్డవు కాగలవు. నీవు నా కౌగిటిలో ఉండెదవు.’’ దీనిని తెలిసికొని మీ హృదయములో నమ్ముకొనుడి యేసుక్రీస్తు పొందిన బాప్తిస్మమును ఆయన సిలువలో కార్చిన రక్తమును నమ్ముకొను వారికి ఇది తమ పాపాలన్నిటి నుండి విడిపించబడుటకే కాదు కానీ వారు దేవుని స్వంత పిల్లలగు హక్కును కూడా పొందెదరు.



యేసయ్య ఈ లోకపాపములను అన్నిటినీ క్షమించుట వాస్తవామా?


మనము హెబ్రీ 10:14-18 వైపుకు తిరుగుదాము. ‘‘ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులనుగా చేసియున్నాడు. ఈ విషయమై పరిశుద్ధాత్మకూడా మనకు సాక్ష్యమిచ్చుచున్నాడు. ఏలాగనగా ఆ దినములైన తరువాత నేను వారితో చేయబోవు నిబంధన ఇదే. నా ధర్మవిధులను వారి హృదయమునందుంచి వారి మనస్సు మీద వాటిని వ్రాయుదును అని చెప్పిన తరువాత వారి పాపములను వారి అక్రమములను ఇకను ఎన్నటికిని జ్ఞాపకము చేసికొనను అని ప్రభువు చెప్పుచున్నాడు. వీటి క్షమాపణ ఎక్కడ కలుగునో అక్కడ పాపపరిహార్థా బలి యికను ఎన్నడును ఉండదు.’’

ఈ భాగము దీనిని స్పష్టపరచుచున్నది. ‘‘వీటి క్షమాపణ ఎక్కడ కలుగునో అక్కడ పాపపరిహారార్థబలి యికను ఎన్నడును ఉండదు.’’ దీవెనకరమైన ఈ వార్తను వినండి. అదేదనగా మన పాపాలన్నీ ఆయన పొందిన బాప్తిస్మము ద్వారా యేసయ్యపై మోపబడెను. నీవు నేను మన జీవిత కాలమంతటితో చేసిన ప్రతి పాపము యేసయ్యపై మోపబడుట మాత్రమే కాక మానవుల పాపములన్నీ అలాగే ఆయనపై మోపబడెను. దేవుని నీతిని నెరవేర్చుటకు యేసు చేతులుంచబడును అనుభవించి నీటిలో బాప్తిస్మం పొంది, బయటకు వచ్చుటతోనే పాపాలన్నీ తనపై మోపుకొనెను.

పాపములన్నిటిని భుజమునకెత్తుకొని, అంత మాత్రమే కాక సిలువ వేయబడెను తద్వారా మానవులందరి పాపశిక్షను భరించెను. కాబట్టి ఇప్పుడు విశ్వసించువారు తమ తీర్పులన్నిటి నుండి విడిపింపబడిరి. ప్రధాన యాజకుడు బలి పశువు తలపై చేతులునుంచుట ద్వారా ఇశ్రాయేలు ప్రజల పాపాలను దానిపై మోపిన విధముగానే బాప్తిస్మమిచ్చుయోహాను యేసయ్యకు బాప్తిస్మమిచ్చుట ద్వారా మన పాపములన్నిటిని ఆయనపై మోపెను. దానికి తరువాత యేసయ్య ఈ పాపమును మోసి, సిలువ వేయబడెను. కనుక తనను విశ్వసించు ప్రతివారిని పాపము నుండి విడిపించెను. కాబట్టి దీనిని నమ్మువారు దేవుని స్వంత పిల్లలగుటకు హక్కును పొందుకొనగలరు.

రోమా 10:10 చెప్పుచున్నది. ‘‘ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును.” అన్నిటి కొరకు దేవుని నీతిని హృదయముతో నమ్ముకొనునప్పుడు వారు నీతిని పొందెదరు. తమ హృదయముతో రక్షణయొక్క సత్యమును నమ్మినప్పుడు వారు పాపపరిహారమును పొంది పరలోకములో ప్రవేశించగలరు. సహోదర, సహోదరీలారా మీరు మీ హృదయముతో నమ్ముకొని, నోటితో ఒప్పుకొనుట ద్వారానే ఏలయనగా యేసుని యొక్క బాప్తిస్మము మరియు రక్తము అనునవి.’’ దేవుని నీతిమత్వమును రక్షణ యొక్క సత్యమును మరియు ‘‘పాపపరిహారము యొక్క సువార్త”ను రక్షణ పొందుటకు అవసరమైన విషయముని నమ్మి రక్షింపబడినారా? పాత నిబంధనలోని బలి వ్యవస్థ క్రింద బలిపశువుపై చేతులుంచబడి వారి పాపము దానిపై మోపబడకుండా బలి అర్పించబడినప్పుడు ఇశ్రాయేలు ప్రజల పాపము క్షమించబడలేదు. అలాగే మనము యేసయ్య పొందిన బాప్తిస్మమును విడిచి, పాపము క్షమించబడలేదు. అలాగే మనము యేసయ్య పొందిన బాప్తిస్మమును విడిచి కేవలము ఆయన సిలువ రక్తమును మాత్రమే విశ్వసించుట వలన మన పాపములు కడుగబడవు.

‘‘వారి పాపములను వారి అతిక్రమములను ఇకను ఎన్నటికిని జ్ఞాపకము చేసికొనను అని ప్రభువు చెప్పుచున్నాడు. వీటి క్షమాపణ ఎక్కడ కలుగునో అక్కడ పాపపరిహారార్థ బలి యికను ఎన్నడును ఉండదు” (హెబ్రీ 10:17-18) మన పాపమును ఇకను ఎన్నటికిని జ్ఞాపకము చేసికొనని దేవుడు ఎందుకు చెప్పుచున్నాడు? మనము చనిపోవు దినము వరకు తప్పక పాపము చేయుట కొనసాగించినప్పటికి యేసయ్య ఒకేసారిగా బాప్తిస్మమును పొందుట ద్వారా మన పాపములను వహించుకొనెను కనుక, ఇప్పుడు మనకు రక్షణ సిద్ధించెను. మరియు అది శాశ్వతముగా ఉండును. మరియు దీనియందు నమ్మికనుంచువారు ఇప్పుడు పాపరహితులగుదురు. ఇందువలననే మన పాపమును దేవుడు గుర్తు చేసుకొన అవసరము లేదు.

దేవుని నీతిమత్వము అనగా ఆయన న్యాయము. తండ్రియైన దేవుని నీతి మనకు ఆజ్ఞాపించునదేమనగా ఆయన నీతిగలవాడు గనుక నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను నమ్మువారు కూడా పరిశుద్ధులుగాను, నీతిమంతులుగాను ఉండవలెను. ఆది నుండి దేవుడు మనలను ప్రేమించెను. మరియు మనలను తన స్వంత పిల్లలనుగా చేయవలెనని కోరుచున్నాడు. కానీ ఆయన మనలను తన పిల్లలనుగా చేసుకొనవలెనని కోరుకొనిననూ, ఆయన ఆలాగు చేయలేడు కారణము మన పాపమే. కాబట్టి తండ్రియైన దేవుడు ఈ సమస్యను తీర్చుటకై ఒక పరిష్కారమును కొనుగొనెను.

దేవుడు ఒక నిర్దోషమైన బలిని ప్రత్యామ్నాయ అర్పణముగా మన పాపమును కడిగివేయుటకు ఆ బలిపశువు పైకి మన పాపమును మోపి మనకు బదులుగా బలిపశువుగా మారుటకు మనకు బదులుగా మన స్థానములో శిక్షింపబడుటకు మరియు ఆ విధముగా శాశ్వత బలి అర్పణమును అర్పించుటకు నిరాకరించలేదు. మరియు ఈ బలి అర్పణము ద్వారా దేవుడు విశ్వసించువారిని వారి పాపము నుండి విడిపించుటకు, వారిని తన స్వంత పిల్లలగునట్లు శుద్దీకరణమును నియమించెను. ఇప్పుడు ఈ సువార్త సత్యమును నమ్మువారికి దేవుని యెదుట వారి పాపములన్నియూ పరిహరించబడును. యేసయ్య ఈ లోక పాపములన్నిటిని బాప్తిస్మమును పొందుట వలన కడిగివేసెను. గనుక మానవుల పాపములను వారికి బదులుగా శిక్షింపబడుట ద్వారా శుద్ధీకరించిన యేసయ్యను మనము నమ్ముకొనినయెడల, మన పాపము కొరకు మనము ఇకను ఏ అర్పణము అర్పించనవసరము లేదు. సహోదర సహోదరులారా మనము మన పాపము కొరకు అర్పణము అర్పించవలసిన అవసరము ఇంకనూ ఉన్నదా? లేదా ఖచ్చితంగా అవసరం లేదు.

యేసుక్రీస్తు పాపరహితుడును స్వచ్ఛమైవాడు అయిననూ ఆయన ఎందుకు సిలువ వేయబడెనో నీకు తెలియునా? యేసయ్య సిలువ వేయబడినప్పటికి వాస్తవముగా ఆయన ఏ తప్పిదమును చేయలేదు. యేసయ్య యొర్ధానునదిలో బాప్తిస్మమును పొందుట ద్వారా మానవుల పాపమును మోయుటకు అంగీకరించెను గనుక ఆయనే మన స్థానంలో మృతి పొందవలసివచ్చెను. ఆయన సిలువలో మరణించుటకు కారణమేమనగా, ఆయన అప్పటికే తాను పొందిన బాప్తిస్మము వలన లోకపాపమును వహించుటకు ఒప్పుకొనెను మరియు నీతి అంతటిని నెరవేర్చుటకు సిద్ధపడెను.

ఈ విధముగా దేవుని కుమారుడు నీతిని నెరవేర్చుటకు బాప్తిస్మమును పొందియుండగా ఆయనకు కృతజ్ఞతలను మనము తెలుపక ఉందుమా? ఎట్లనగా యేసయ్య మన పాపములను బొచ్చు కత్తిరించువానియెదుట గొర్రె ఉన్నట్లుగా మైనముగానే సిలువ శ్రమను భరించెను. మనము ఆయన బాప్తిస్మమును సిలువను నిత్యముగా జ్ఞాపకముంచుకొనవలెను. ఎట్లనగా ఆయన సిలువ వేయబడి, శిక్షింపబడలేదా, లేనట్లయిన మనము ఖచ్చితముగా శిక్షింపబడవలసి యుండెడిది.

మన ప్రభువు మన పాపములన్నిటిని వహించుటే కాక, ఆయన తానే పాపము యొక్క శిక్ష అంతటినీ భరించెను. వేరుగా యోచిస్తే యేసు తానే రక్షకుడై ఉండి, మన పాపములను తనపై మోసెను. మన పాపము యొక్క బలి ఆయెను. ఆ విధముగా దేవుని చిత్తమును నెరవేర్చెను. ఇందువలననే బైబిలు ఇట్లు చెప్పుచున్నది. ‘‘వీటి క్షమాపణ ఎక్కడ కలిగెనో అక్కడ పాపపరిహారార్థ బలి యికను ఎన్నడును నుండదు. సహోదరులారా యేసు మన కొరకు ప్రతిష్టించిన మార్గమున అనగా నూతనమైనదియు, జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా యేర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగియున్నది.’’ (హెబ్రి 10:18-20)

యేసుక్రీస్తు సిలువ వేయబడినది ఎందుకో ఇప్పుడు మీకు అర్థమైనదా? మనము కేవలము యేసు సిలువ రక్తమును మాత్రమే విశ్వసించుట కాదుకానీ ఆయన సిలువపై మరణించిన కారణమున అర్థము చేసుకొనవలెను. మరియు ఆ కారణము ఆయన పొందిన బాప్తిస్మముతో గుప్తమైనదని మనము సరిగా అర్థము చేసుకొనవలెను. మరియు ఆ కారణము ఆయన పొందిన బాప్తిస్మములో గుప్తమైనదని మనము సరిగా అర్థము చేసికొనవలెను. మన పాపము ఎక్కడ ఎట్లు శుద్ధి చేయబడెనో సరిగా తెలిసికొని నమ్మవలెనని మీరును నేనును కోరినయెడల యేసయ్య యొర్ధాను నదిలో యోహానుచే బాప్తిస్మమును పొందినప్పుడు మన పాపము ఆయనపై మోపబడెను అను విశ్వాసముతోనే పాపము క్షమించబడెనని మనము గ్రహించి విశ్వసించవలెను.



నీరు మరియు ఆత్మమూలమైన సువార్త యొక్క సత్యమును తెలిసికొని నమ్ముకొనుట ద్వారా ఇప్పుడు మనము మన పాపములన్నిటి నుండి రక్షింపబడెదము.


ఇప్పటి వరకు నేను మీకు నీరు మరియు ఆత్మమూలమైన సువార్త యొక్క సత్యములో బైబిలు చెప్పు విషయమును సుదీర్ఘముగాను, స్పష్టముగాను చెప్పితిని. మరియు ఈ సత్యము లోకపు పునాదులు వేయబడక మునుపే సిద్ధపరచబడిన రక్షణైయున్నది. మరియు ఈ రక్షణ ప్రత్యక్షగుడారపు తలుపలకు ఉపయోగించబడి నీలి, ధూమ్ర, రక్తవర్ణ దారములో ప్రత్యక్ష పరచబడిన సత్యమును ఈ లోకములోని అనేకమంది ప్రజలకు బోధించుచున్నాను. ఇప్పటికి కూడా ఈ ప్రస్తుత గంటలో సహితము ఈ సువార్త లోకమందంతటా మా పుస్తకము ద్వారా వ్యాప్తి చెందుచున్నది. 

అయిననూ నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను ఎరుగకయే అనేకులు తాము యేసును విశ్వసించితిమని చెప్పుకొనుచున్నారు. అట్టి ప్రజలు తెలివిలేని వారని నేను ధైర్యముగా చెప్పగలను. ఎట్లనగా నీరు మరియు ఆత్మమూలమైన సువార్త యేసు ద్వారా నెరవేర్చబడిన నిజ బలి అర్పణ వ్యవస్థ యొక్క ముఖ్య సత్యమును చెప్పుచున్నది. అదే ప్రత్యక్ష గుడారములో బయలుపరచబడిన రక్షణ యొక్క సాదృశ్యమైయున్న వాస్తవ విషయము. అది ఇప్పుడు మీ వంతు వాస్తవ సత్యమును తెలిసికొనక మీరు విశ్వసించిన యెడల నీవు ఒకసారి తిరిగి పరీక్షించుకొనవలసిన సమయము ఇదే నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను నమ్మండి మరియు మీ పాపము పరిహారమును పొందండి.

యేసుని బాప్తిస్మమును సిలువపై ఆయన మరణమును లోకపునాదులు వేయబడక మునుపే వాగ్ధానపరచబడినవి. మరియు అవి నీలి, ధూమ్ర, రక్తవర్ణదారము మరియు పేనిన సన్నపునారలో కూడా కనబడెను. ఈ వాగ్ధానమును నెరవేర్చుటకు మరియు వాస్తవముగా నిన్ను నన్ను పాపము నుండి రక్షించుటకు యేసు బాప్తిస్మము పొందెను. సిలువలో మరణించెను. మృతి నుండి తిరిగి లేచెను. ఇప్పుడు తండ్రియైన దేవుని యొక్క కుడి పార్శ్వమున కూర్చుండెను.

నీ స్వంత ప్రయోగములతోనూ, ఆవేశములతోనూ అనుసరించుచూ ఈ సత్యమును తెలిసికొనకయే నీవు యేసయ్యను నమ్ముచున్నావా? అట్టి ప్రజలు అనేకులు ఈ లోకములో ఉన్నారు. కానీ వారిప్పుడు తమ తప్పుడు విశ్వాసము నుండి తిరిగి తమ పూర్ణ హృదయముతో ప్రత్యక్షగుడారపు తలుపులలో బయలుపరచబడిన నీలి, ధూమ్ర, రక్తవర్ణదారము మరియు పేనిన సన్నపునారలో దాగియున్న నీరు మరియు ఆత్మ మూలమైన సువార్తను నమ్ముకొనవలెను.

హెబ్రి 10:19-20 చెప్పుచునద్ని, ‘‘సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్టించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా యేర్పరచబడినదియునైన మార్గమున బాప్తిస్మమును పొందుట ద్వారా లోకపాపములను తనపైన మోపుకున్న వాడైన యేసు సిలువ వేయబడెను గుడి తెర చినిగెను

యేసు యొక్క బాప్తిస్మముతోనూ సిలువలోని ఆయన రక్తముతోనూ కడిగివేయబడినవి. ఆ గుడి తెర నీలి, ధూమ్ర, రక్తవర్ణదారమును మరియు పేనిన సన్నపునారతో నేయబడినవై దాని నాలుగు మూలలను పట్టుకొని నాలుగు గుర్రములచే లాగించిననూ చినగనంత గట్టివైయున్నవి.

అట్టి బలిష్టమైన ఆలయ తెర, ఎవరూ ముట్టుకొనకుండగనే ఏ ప్రయత్నము చేయకయే పైనుండి క్రింది వరకు చినిగెను. దీని వలన యేసుక్రీస్తు తన సేవలను ముగించిన క్షణమందే పరలోకపు ద్వారము పూర్తిగా తెరవబడెను అని చూపుట ఆలయ తెరపై నుండి క్రిందికి చినుగుట అనగా పాపపు గోడలు పడగొట్టబడినవి యేసుక్రీస్తు ద్వారా దేవుడు ఆ పాపపు గోడను పడగొట్టెను.

పాపపు గోడలు పడగొట్టబడెననగా దాని అర్థమేమిటి? యేసుక్రీస్తుని బాప్తిస్మమును ఆయన సిలువ రక్తమును విశ్వసించుట ద్వారా ప్రతివాడు తన పాపము నుండి పరిహారము పొందెనని భావము. ప్రత్యక్ష గుడార తలుపు ద్వారా దేవుడు నీలి ధూమ్ర రక్తవర్ణ దారము మరియు పేనిన సన్నపునారలో కనుపరచబడిన యేసు యొక్క పరిచర్య ద్వారా ఒక్కసారిగా మానవుల రక్షణ నెరవేర్చబడెనని ప్రయత్నించెను. మన అందరికి దేవునిచే వాగ్ధానపరచబడిన నిత్యమైన ప్రాయశ్చిత్తము నీలి, ధూమ్ర, రక్తవర్ణ దారము మరియు పేనిన సన్నపునారతో నేయబడిన అతి పరిశుద్ధ స్థలము యొక్క తలుపుల తెరపై నుండి క్రింది వరకు, ఏ మనుష్యుని చేతివలన కాక దేవుడు తానే తన చేతులతో చించెను.

దీని వలన యేసుక్రీస్తు మానవుల పాపముల కొరకై నిత్యమైన బలియై నీరు మరియు ఆత్మ మూలమైన సువార్తను విశ్వసించు మనలను అందరినీ రక్షించెనని తెలుపుచున్నది. యేసుక్రీస్తు పొందిన బాప్తిస్మమును మరియు ఆయన సిలువలో కార్చిన రక్తమును నమ్ము ప్రతివాడు పాప క్షమాపణను పొందును మరియు ఆయన యెదుట నిలువగలుగునట్లుగా తండ్రియైన దేవుడు నియమించెను. మీరు ఈ సత్యమును నమ్మెదరా? లేదా?

దేవుడు నిన్ను ప్రేమించినట్లే దేవుని కుమారుడైన క్రీస్తు నిన్నును ప్రేమించుచున్నాడు. మరియు యోహాను వలన బాప్తిస్మమును పొంది సిలువ వేయబడుట ద్వారా ఆయన నీకు పూర్ణ రక్షణనిచ్చెను. యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహింపబడిన దేవుని ప్రేమను పొందుకొనుచూ దేవుని రాజ్యములో మనలను ప్రవేశింపచేయు సత్యమును నమ్ముకొనుట వలన మన పాపములన్నియూ తొలగించబడెను. నీరు మరియు ఆత్మ మూలమైన సువార్తను నమ్ముట ద్వారా మన వాస్తవ పాపములన్నిటి నుండి భద్రత తీసుకొనబడదు. ఎందుకనగా మన పాపములన్నీ వాటి శిక్షయు యేసుని బాప్తిస్మము మరియు ఆయన సిలువ రక్తముతో కడిగి వేయబడినవి.

హెబ్రీయులకు 10:22 చెప్పుచున్నది. ‘‘మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయము గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరము గలవారమునైయుండి” పాపము నుండి కడుగబడుటను గూర్చి బైబిలు ఇట్లు చెప్పుచున్నది. యేసుక్రీస్తు మనము మన శరీరముతోను మనస్సుతోనూ చేసిన పాపములన్నిటిని కడిగెను సత్యమును నమ్ముట వలన మనము రక్షింపబడెదము.

ఇత్తడి గంగాళము వద్ద ఆ ప్రధాన యాజకుడు కూడా బలి అర్పణమును అర్పించిన తరువాత తన అపరిశుద్ధతను ఇత్తడి గంగాళము వద్ద కడిగివేసుకొనిన రీతినే యేసు యొక్క బాప్తిస్మమును నమ్మి మన పాపములను శుద్ధి చేసికొనిన తరువాత మనము కూడా ఇట్టి విశ్వాసమును ప్రతిదినము నమ్ముకొనవలెను. ఇత్తడి గంగాళము వద్ద ప్రధాన యాజకుడు తనను కడుగుకొనినట్లుగానే యేసుని బాప్తిస్మముతోనే మన పాపములన్నియూ శుద్ధీకరించబడెనని అనుదినము గుర్తు చేసుకొనుచూ విశ్వసించుట వలన మన వాస్తవ పాపమును కడుగుకొనవలెను. ఎట్లనగా మనము ఈ లోకములో నివసించుచుండగా దాని మరుగునకు మనము ఎదురుపడు సమయము వచ్చును.

పాపములన్నియూ శరీరముతోను, హృదయముతోను లేదా ఆలోచనలలోను దేనితో చేసినవైననూ ఈ లోకపాపమునకు చెందినవే. అట్లయితే మనము ఎట్టి విశ్వాసముతో ఈ లోకపాపములన్నిటిని శుద్ధి చేసికొనగలము? యేసు పొందిన బాప్తిస్మముతో మాత్రమే వాటన్నిటిని శుద్ధి చేసుకొనగలము. ఒకసారి యేసు బాప్తిస్మమును విశ్వసించి శుద్ధులైన వారు తమ హృదయములను శుద్ధిగా ఉంచుకొనవలెను. మరియు వారు పాపము చేసినప్పుడు వారు విశ్వాసము ద్వారా వాటిని కడుగుకొనవలెను. ప్రతిదినము యేసయ్య బాప్తిస్మమును జ్ఞాపకము చేసికొనుచూ, తమ క్రియలను వస్త్రములను ఉదుకుకొనువారు దీవెన పొందెదరు. యేసు యోహాను నుండి పొందిన బాప్తిస్మము ద్వారా మన పాపములను ఆయన మీద మోపబడిన కారణముగా ఈ సత్యములో నాటబడి ప్రతిదినము దానిని నమ్ముకొనుట ద్వారా శాశ్వతముగా మనము మన పాపములన్నిటి నుండి విడిపింపవలెను.

నీవు తప్పక నీరు మరియు ఆత్మ మూలమైన సువార్తను నమ్ముకొనవలెను. ఎట్లనగా యేసుక్రీస్తు యోహాను ద్వారా బాప్తిస్మము పొందినప్పుడు నీ పాపము కూడా ఆయనపై మోపబడెను. నీవు ఈ సువార్తను నమ్ముకొనుట వలన నీవు ఏమియు పొగొట్టుకొనలేవు. ఎట్లనగా సర్వాంతర్యామియైన దేవుడు ఈ జగత్తు పునాదులు వేయబడక మనుపే పాత నిబంధన కాలమునకు ముందే దానిని ప్రణాళిక పరచెను. యేసు యొర్దాను నదిలో బాప్తిస్మము పొందుట వలన మీ పాపమును అంగీకరించెను. మరియు సిలువకు గురియగుటచే మన పాపము శిక్షను భరించెను. కనుక దేవుని నీతిని నీవు పొందునట్లు చేసెను మరియు నిరీక్షణ నిచ్చెను అనునది సత్యము. ఈ సత్యము రాజుల రాజైన యేసు శాశ్వతముగా నిన్ను పాపము నుండి రక్షించెననియు మరియు చెడు అభిప్రాయము నుండి నీ హృదయమును వెలిగించెను మరియు నీ శరరీమును నిష్కల్మషమైన నీతితో శుద్ధి చేసినది ఈ నీరు మరియు ఆత్మ మూలమైన సువార్తయే. నీరు మరియు ఆత్మ మూలమైన సువార్త నీ జీవితము నుండి తొలిగించలేనట్టి వాక్యము, నీవు విశ్వసించినప్పుడు అది మరింతగా నీపై ఉదయించును.

అతని 3 సంవత్సరముల సాంఘిక జీవనములో మానవులందరినీ వారి పాపముల నుండి విడిపించుటకై యేసు చెప్పిన మొదటి క్రియ బాప్తిస్మమును పొందుట మరో విధముగా యేసుక్రీస్తు మన పాపములను వహించుకొనవలసియున్నది. అట్లు చేయుటకై ఆయన యోహాను యొద్దకు వెళ్ళి అతనిచే బాప్తిస్మము పొందెను. అందువలననే సువార్త నాల్గింటిలోనూ ఈ క్లిష్టమైన సంఘటన ఆరంభములోనే వ్రాయబడెను.

మీరు నేను వాస్తవంగా మన పాపము కొరకు మృతి నొందవలసినవారము. కానీ జరిగినదేమిటి? మన ప్రభువు ఈ లోకమునకు వచ్చెను. యోహానుచే బాప్తిస్మమును పొందుట ద్వారా దేవుని గొర్రె పిల్ల ఆయెను లోకపాపములను సిలువకు మోసికొనిపోయి మన పాపముల కొరకు తన రెండు చేతులు మరియు కాళ్ళలోను మేకులు కొట్టబడి తన హృదయములోనున్న రక్తమునంతా కార్చి మృతినొందెను. మరియు మృతి నుండి తిరిగి లేచెను. ఇందువలననే యేసు ‘‘సమాప్తమాయెను” అని చెప్పి సిలువలో ఆఖరి శ్వాసను విడిచెను.

యేసు చెప్పినది మరియు చేసినది అంతయూ సత్యమే. యేసు మనలను రక్షించుటకు పాప పరిహారార్థా బలి ఆయెను. మూడు దినములలో మృతి నుండి తిరిగి లేచెను. మరియు మృతి నుండి తిరిగిలేచిన తరువాత 40 దినములు తన పునరుత్థానమును గురించి సాక్ష్యమును ఇచ్చి పరలోకమునకు అరోహణమాయెను. మరియు తండ్రి యొక్క కుడి పార్శ్వమందు సింహాసనముపై కూర్చుండెను. ఈ యేసుక్రీస్తే మరల ఈ లోకమునకు వచ్చిమనలను కొనిపోవును. యేసు మొదటిగా ఈ లోకమునకు వచ్చినప్పుడు రక్షకునిగా వచ్చెను. కానీ ఆయన రెండవసారి వచ్చినప్పుడు అవిశ్వాసులైన వారినందరినీ తీర్పు ద్వారా శిక్షించుటకు వచ్చును.

యేసుక్రీస్తు ఈ లోకమునకు న్యాయాధిపతిగా తిరిగి వచ్చుననియు ఈ భూమిపై 33 సంవత్సరముల జీవితములో ఆయన నేరవేర్చిన నీరు మరియు ఆత్మ యొక్క రక్షణను విశ్వసించువారిని దేవుని యొక్క పిల్లలుగా పిలుచుటకు ఆ వెయ్యేండ్ల పాలనలో నివసించునట్లు చేయుటకు మరియు నిత్య పరలోకమును ఇచ్చుటకును నీరు మరియు ఆత్మ మూలమైన సువార్తను విశ్వసించని వారికి మరియు దేవుని ప్రేమను త్రోసివేయువారికి నిత్యమైన తీర్పు నిచ్చుటకు వచ్చునని ఇప్పుడు నీవు గుర్తించవలెను.

మీరు ఇక ఎంతో కాలము నీరు మరియు ఆత్మ మూలమైన సువార్తను నిరాకరించకూడదు మరియు దానిని గూర్చి తెలియనట్లును నటించకూడదు. కానీ ఈ రక్షణ యొక్క సత్యమును విశ్వసించవలెను. దేవుడు ప్రత్యక్షగుడారము మరియు బలి వ్యవస్థను వాగ్ధానము చేసినట్లు యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చెను. చేతులుంచుట రూపములో బాప్తిస్మము పొందెను. సిలువ వేయబడెను. అందుమూలమున లోకములోని దేశములన్నిటి నుండి రక్షించెను అని నీవు తెలిసికొనవలెను మరియు నీవు నీ పూర్ణ హృదయముతో ఈ సత్యమును విశ్వసించుట ద్వారా నీ పాపములకు పరిహారమును పొందవలెను.

అయిననూ ఇశ్రాయేలు రాజ్యము ఇప్పటికి కూడా ఈ సత్యము నుండి వెనుకగానే ఉన్నారు. మరియు మరొక మెస్సయ్య కొరకు ఎదురు చూచుచున్నారు. కానీ ఇశ్రాయేలీయులు వారు ఎంత విశ్వాసముగా యేసు తప్ప మరియొక మెస్సయ్య కొరకు ఎదురుచూచినను యేసుక్రీస్తుకు వేరుగా మరొక మెస్సయ్య లేరు. ఈ లోకములో యేసయ్య తప్ప మరొక మెస్సయ్య లేడనునది దానికదే సాక్ష్యము కల సత్యము. మరియు ఇశ్రాయేలు ప్రజలకు కూడా ఈ సత్యము విషయములో ఏ విధమైన రాయితీ లేదా వారి కొరకు ఏ రక్షకుడును లేడు.

అలాగే ఇశ్రాయేలు ప్రజలు దేవుని కుమారునిగా నమ్మలేని వారి పాపమును బట్టి పశ్చాత్తాప పడవలెను. మరియు వారు యేసుక్రీస్తే తమ నిజమైన మెస్సయ్య అని నమ్మి దీనిని సత్యమని అంగీకరించవలెను. యేసుక్రీస్తే తమ నిజమైన మెస్సయ్య అని నమ్మి దీనిని సత్యమని అంగీకరించవలెను. యేసుక్రీస్తే రానున్న రక్షకుడని స్థిరముగా నమ్మి ఇశ్రాయేలు రాజ్యము దేవునిచే ఎన్నుకొనబడని సత్యమైన ఆత్మీయ రాజ్యముగా మారవలెను.

ఇప్పటికి కూడా ఇశ్రాయేలీయులు న్యాయవంతుడైన సమర్థుడైన మరియు శక్తిమంతుడైన మెస్సయ్య తమను ఈ లోకము యొక్క దుఃఖము నుండి బాధల నుండి విడిపించుటకై వచ్చునని కనిపెట్టుచున్నారు. కానీ యేసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకమునకు మెస్సయ్యగా వచ్చియుండెను. మరియు తమ పాపములన్నిటి నిమిత్తము తప్పించుకొనలేక నరకాగ్నికైన తీర్పు పొందవలసిన వారిని రక్షించెను. అలాగే వారు ఈ సత్యమును తెలిసికొని దానిని నమ్మవలెను. వారి ఆత్మల కొరకు పాత నిబంధనలో వాగ్ధానము చేయబడిన బలి అర్పణముగా యేసు తానే ఈ లోకమునకు వచ్చెను. మరియు వారిని దేవుని స్వంత ప్రజలనుగా చేసెను.

రక్షకునిగా వచ్చిన యేసుక్రీస్తు మనలను అందరినీ నీరు మరియు ఆత్మ మూలమైన సువార్త ద్వారా వారిని రక్షించెను. ఆ సత్యము నీలి, ధూమ్ర, రక్తవర్ణదారము మరియు పేనిన సన్నపునారలో బయలుపరచబడెను. మరియు ఆయన నిశ్చయముగా దీనిని నమ్ముచున్న మనలనందరినీ ఆయనతో పాటుగా వెయ్యేండ్ల పాలనలో ఏలుటకు అనుగ్రహించును. దీని తరువాత ఆయన వారిని దేవుని నిత్యరాజ్యములో పాలివారగుటకు అనుమతించును మరియు దేవునితో నిత్యము సంతోషములోను మహిమలోనూ జీవించనిచ్చును.

అలాగే మనము ఇంక ఈ భూమిపై ఉండగానే మనమందరము మన హృదయాలలో నీరు మరియు ఆత్మ మూలమైన సువార్తను తప్పక విశ్వసించవలెను. మరియు దేవుని పిల్లలముగా మారవలెను. ఈ సువార్త సత్యమును నమ్మువారు పాపరహితులైన దేవుని పిల్లలు కాగలరు. మరియు రాబోవు లోకములో వారి కొరకు వేచియున్న దీవెనలను పొందుకొనుటకై నిశ్చయతను పొందవలెను.

హల్లెలూయ! నా విశ్వాసముతో ఆ ప్రభువుకు పరలోకమును ఆత్మీయ దీవెనలను ఇచ్చినందుకు నా కృతజ్ఞతలు. మన ప్రభువు తాను త్వరలో తిరిగి వస్తానని వాగ్ధానము చేసెను. అట్లయిన ప్రభువా, రమ్ము.