Sermons

[11-22] < నిర్గమ 26:1-14 > ప్రత్యక్ష గుడారపు పై కప్పులో దాగిన ఆ నాలుగు మర్మములు.



< నిర్గమ 26:1-14 >

“మరియు నీవు పది తెరలతో ఒక మందిరమును చేయవలెను. నీలి ధూమ్ర, రక్తవర్ణములు గల పేనిన సన్నపు నారతో వాటిని చిత్రకారుని పనియైన కెరూబులు గల వాటినిగా చేయవలెను. ప్రతి తెర పొడుగు ఇరువది ఎనిమిది మూరలు. ప్రతి తెర వెడల్పు నాలుగు మూరలు ఆ తెరలన్నిటికి ఒకటే కొలత. అయిదు తెరలను ఒకదానితో ఒకటి కూర్పవలెను. మిగిలిన అయిదు తెరలను ఒకదానితో ఒకటి కూర్పవలెను. తెరల కూర్పు చివరను మొదటి తెర అంచున నీలినూలుతో కొలుకులను చేయవలెను. రెండవ కూర్పునందలి వెలుపలి తెర చివరను అట్లు చేయవలెను. ఒక తెరలో ఏబది కొలుకులను చేసి ఆ కొలుకలు ఒక దానికొకటి తగులు కొనునట్లు ఆ రెండవ కూర్పునందలి తెర అంచున ఏబది కొలుకులను చేయవలెను. మరియు ఏబది బంగారు గుండీలను చేసి ఆ గుండీల చేత ఆ తెరలను ఒకదానితో ఒకటి కూర్పవలెను. అది ఒకటే మందిరమగును. మరియు మందిరముపైని గుడారముగా మేక వెంట్రుకలతో తెరలు చేయవలెను. పదకొండు తెరలను చేయవలెను. ప్రతి తెర పొడుగు ముప్పది మూరలు. వెడల్పు నాలుగు మూరలు పదకొండు తెరల కొలతలు ఒకటే. అయిదు తెరలను ఒకటిగాను, ఆరు తెరలను ఒకటిగాను ఒకదానికొకటి కూర్పవలెను. ఆరవ తెరను గుడారపు ఎదుటి భాగమున మడవవలెను. తెర కూర్పునకు వెలుపలనున్న తెర అంచున ఏబది కొలుకులను రెండు కూర్పునందలి తెరల అంచున ఏబది కొలుకులను చేయవలెను. మరియు ఏబది ఇత్తడి గుండీలను చేసి యొకటే గుడారమగునట్లు ఆ గుండీలను ఆ కొలుకులకు తగిలించి దానిని కూర్పవలెను. ఆ గుడారపు తెరలలో మిగిలి వ్రేలాడు భాగము. అనగా మిగిలిన సగము తెర మందిరము వెనుక ప్రక్కమీద వ్రేలాడవలెను. మరియు, గుడారపు తెర పొడుగులో మిగిలినది ఈ ప్రక్కను ఒక మూరయు. ఆ ప్రక్కను ఒక మూరయు, మందిరమును కప్పుటకు ఈ ప్రక్కను ఆ ప్రక్కను దాని ప్రక్కల మీద వ్రేలాడవలెను. మరియు ఎర్రరంగు వేసిన పొట్టేళ్ళ తోళ్ళతో పై కప్పును దానికి మీదుగా సముద్రవత్సల తోళ్ళతో పై కప్పును చేయవలెను.’’



ప్రత్యక్షగుడారము యొక్క పై కప్పు


ఇప్పుడు మనము ప్రత్యక్ష గుడారపు పై కప్పును గురించి శ్రద్ధ చూపుదాము. ప్రత్యక్ష గుడారపు కప్పులు నాలుగు పొరలతో చేయబడినది. దేవుడు ప్రత్యక్ష గుడారమును నిర్మించమని మోషేతో చెప్పినప్పుడు ఆయన అతనికి స్పష్టమైన సూచనలను చేసెను. సాధారణముగా ప్రత్యక్ష గుడారములో నుండి మొదటి పొర మాత్రమే కనబడును. ప్రత్యక్ష గుడారపు పలకలను మరియు దాని ఉపకరణములన్నిటిని అది కప్పును ఈ కప్పు ప్రత్యక్ష గుడారపు పలకలన్నిటిని చుట్టి పరిశుద్ధ అతి పరిశుద్ధ స్థలమును కూడా కలుపుచూ నేలమట్టుకు చుట్టబడెను. మరియు అది నీలి, ధూమ్ర, రక్తవర్ణ దారము మరియు పేనిన సన్నపు నారతో చేయబడెను. మరియు దానిపై కెరూబుల యొక్క అందమైన చిత్రములు నేయబడెను.

ఆ మొదటి కప్పు రెండు ప్రధానమైన తెరలు ఒకదానితో ఒకటి కలుపబడి దానిలో ప్రతి తెరను ఒకదానితో ఒకటి కూర్చుట వలన చేయబడెను. ఈ ముఖ్యమైన రెండు తెరలను కలుపుటకై నీలిదారముతో చేయబడిన యాబది కొలుకులు ప్రతి కొలుకుల ప్రక్కను వాటిని చేయవలెను. ఈ నీలి దారపు కొలుకులు బంగారు గుండీలతో జత చేయబడెను. రెండు జత తెరలను కలుపుచూ ఒక తెరనేయబడెను.

ప్రత్యక్ష గుడారపు మొదటి తెర పది తెరలతో చేయబడెను. అవి రెండు జతలు వెడల్పాటి తెరలుగా చేయబడెను. దాని పొడుగు 28 అడుగులలు. ఒక అడుగు సుమారు 45సెం.మీ ఉండును. కనుక ఈ కాల కొలతలు ప్రకారం దాని పొడుగు 12.6 మీ ఉండును. ప్రతి తెర వెడల్పు 4 అడుగులు. 1.8 మీటర్లు మొదటి ఐదు తెరలు ఒకదానితో ఒకటి కలుపబడి రెండు జత తెరలుగా చేయబడినవి. మరియు ఈ తెరలు యాబది నీలి నూలుతో చేయబడి కొలుకు మరియు యాబది బంగారు గుండీలతోను కలుపబడును. ఈ విధముగా ప్రత్యక్ష గుడారము యొక్క మొదటి పొర పూర్తి చేయబడెను. కానీ ఇంకను మూడు తెరలు కలవు. ప్రత్యక్ష గుడారపు ఆ మొదటి తెర నీలి, ధూమ్ర, రక్తవర్ణము గల పేనిన సన్నపునార దారముతోనే నేయబడిన చిత్రమైన పనిగల కెరూబులతో చేయబడెను.

ఇదంతయూ పరలోక రాజ్యమునకైన మార్గమును మనకు చూపించుటకే. ఉదాహరణకు ప్రత్యక్ష గుడారపు మొదటి తెరకు ఉపయోగించిన నీలి దారములు లోక పాపములను తనపై మోపుకొనుటకు యోహాను ద్వారా యేసు పొందిన బాప్తిస్మమును తెలియజేయుచున్నది. బాప్తిస్మము పొందుట ద్వారా యేసు లోకపాపములన్నిటిని తనపై మోపుకొనెను. (మత్తయి 3:15) ఆయన బాప్తిస్మము ఇప్పుడు రక్షణకు సాదృశ్యమాయెను. (1పేతురు 3:21)

ప్రత్యక్ష గుడారము యొక్క రెండవ తెర మేక వెంట్రుకలతో చేయబడినది. (నిర్గమ 26:7) దాని పొడవు మొదటి తెరకంటే 90సెం.మీ పొడవైనది 30 అడుగులైతే అది 13.5 మీటర్లు నాలుగు అడుగులైతే వెడల్పు 1.8మీటర్లు. ఈ తెర పదకొండు తెరలతో చేయబడినది. దానిలో ఒకటి ఐదు తెరలతోను మరొకటి ఆరు తెరలతో చేయబడి అవి ఒక దానితో ఒకటి రెండు తెరలు జతగా కలుపబడి యుండెను. తరువాత ఈ తెరలు ఇత్తడి గుండీలతో కలుపబడెను.

ప్రత్యక్ష గుడారపు రెండవ తెర మేక వెంట్రుకలతో చేయబడినది. అనగా యేసు మనలను దేవుని నీతితో పరిశుద్ధులనుగా చేసెను. ఈ లోకమునకు వచ్చి మన ప్రభువు 30సంవత్సరములు వయస్సు కలిగినప్పుడు ఆయన తన స్వంత నిర్ణయ ప్రకారము యోహాను వద్ద బాప్తిస్మమును పొందెను. దీని ఫలితముగా ప్రభువు లోకపాపములను సిలువ వరకు మోసెను. సిలువ వేయబడెను. ఒకేసారిగా మన పాపములను తుడుపు పెట్టెను. అందువలన మనకు రక్షకుడాయెను. కాబట్టి ఆ రెండవ తెర తెల్లని తెర మేక వెంట్రుకలు కలదై యేసుక్రీస్తు విడిచిపెట్టబడిన మేకగా మారి, తన బాప్తిస్మము మరియు రక్తము ద్వారా మనలను పాప రహితులనుగా చేసెను అని చెప్పుచున్నది.

ప్రత్యక్షగుడారపు మూడవ తెర ఎరుపురంగు వేసిన పొట్టేలు తోళ్ళతో చేయబడినది. యేసు బాప్తిస్మము పొందుట ద్వారా మన పాపములను వహించుకొనెను. వాటిని సిలువ వరకు మోసికొని పోయి, తన రక్తమును కార్చెను, శిక్షింపబడెను. ఆ విధముగా మనలను మన పాపములన్నిటి నుండి విడిపించెను.

ప్రత్యక్ష గుడారపు నాల్గవ తెర సముద్రవత్సల తోళ్ళతో చేయబడెను. సముద్ర వత్సల తోళ్ళు అనగా యేసుక్రీస్తుని చూచినప్పుడు బాహ్యముగా కోరదగినవి ఆయనలో ఏమియూ లేవు అని అర్థము కాని ఆయన తనంతట తానే దేవుడు సముద్రవత్సల తోళ్ళు మనలను ఈ లోక పాపము నుండి రక్షించుటకు తనను తాను తగ్గించుకొని మానవ ఆకారములో ఈ లోకమునకు వచ్చిన యేసుక్రీస్తు వారి స్వరూపమును చూపుచున్నది.

ఇప్పుడు మనము ప్రత్యక్ష గుడారపు నాలుగు తెరలను మరింత వివరంగా పరిశీలన చేయుదము.



ప్రత్యక్ష గుడారపు మొదటి తెర యొక్క ఆత్మీయ భావము.


ప్రత్యక్ష గుడారము యొక్క నాలుగు తెరలలోని మొదటి వరకు నీలి, ధూమ్ర, రక్తవర్ణము గల పేనిన సన్నపునారను ఉపయోగించిరి. దానిలోని నాలుగు వర్ణములు ప్రత్యక్ష గుడారము లోపలి నుండి కనబడు విధముగా తయారు చేయబడినవి. మరియు చిత్రమైన పనిగల దేవదూత బొమ్మలు కూడా చిత్రించబడినవి. కాబట్టి ఆ దూతలు పైనుండి ప్రత్యక్ష గుడారమును చూచునట్లుండును. ఈ నాలుగు వర్ణముల దారాలకు గల ఆత్మీయ భావము ఈ క్రింది విధముగా ఉన్నది.

ప్రత్యక్ష గుడారము యొక్క మొదటి తెరను చేయుటకు ఉపయోగించబడిన నీలిదారములో బయలుపరచబడిన మర్మము. మెస్సయ్య ఒక్కసారిగా తన బాప్తిస్మము ద్వారా లోకపాపములను అంగీకరించెననునది. ఈ లోకమునకు వచ్చెను మరియు బాప్తిస్మమిచ్చుయోహాను ద్వారా బాప్తిస్మము తీసుకొనెను. ఈ లోకపాపములన్నిటిని భరించుటకు ఆయన మానవుల ప్రతినిధియైన పాతనిబంధన యొక్క పాప పరిహారార్థ బలి పశువైనట్లే. చేతులుంచుట ద్వారా పాపుల దోషములను తనపై మోపుకొనినట్లుగానే అంగీకరించెను. మరియు ఈ లోకపాపములన్నిటి కొరకైన పాపశిక్షను పొందుట ద్వారా ఒక్కసారిగా వాటిని కడిగివేసెనను సత్యమును చెప్పుచున్నది.

మరొక ప్రక్క ధూమ్రవర్ణదారము చెప్పునదేమనగా యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చిన రాజులరాజై యున్నాడు. మరియు మనకొరకైన దేవుడు ఆయనే. యేసు తనంతట తానే తన రూపంలో దేవుడైయున్నాడు అని చెప్పుచున్నది. ప్రత్యక్ష గుడారములో రక్తవర్ణముగల దారాలు బయలుపరచినది ఏమనగా యేసు యోహాను నుండి పొందిన బాప్తిస్మము ద్వారా ఒక్కసారిగా మన పాపాలన్నిటిని అంగీకరించినవాడై సిలువపై తన రక్తమును చిందించెను మరియు స్వచ్ఛందముగా మనకు బదులుగా మన పాపము యొక్క శిక్షను భరించి త్యాగమును చేసెను.

యేసు బాప్తిస్మము ఆయన సిలువ రక్తము ఒక నిర్దోష బలిపశువు చేతులుంచుట చేత పాపుల దోషమును అంగీకరించునట్లున్న పాత నిబంధనా కాలములోని బలి వ్యవస్థ అర్పణము రక్తము కార్చి ఈ పాపము కొరకైన శిక్షను భరించి చనిపోవుటతో సమానము అలాగే క్రొత్త నిబంధనలో యేసు బాప్తిస్మము పొందెను. తన రక్తమును చిందించెను. మరియు దానిపై చనిపోయెను.

యేసుక్రీస్తును బైబిలు కూడా బలి పశువుగానే వర్ణించెను. ‘‘యేసు” అను నామము అనగా ఆయన తన ప్రజలను వారి పాపము నుండి రక్షించును. (మత్తయి 1:21) మరియు ‘‘క్రీస్తు” అనగా అభిషిక్తుడు అని అర్థము. పాతనిబంధనలో మూడు రకాల వ్యక్తులు అభిషేకించబడెదరు. రాజు, ప్రవక్తలు, మరియు యాజకులు కాబట్టి యేసుక్రీస్తు అను నామము ఆయన రక్షకుడు, దేవుడు తనుకు తానే పరలోక రాజ్యము యొక్క ప్రధాన యాజకుడు. మరియు నిత్యసత్యవంతుడైన ప్రభువు. ఈ లోకమునకు వచ్చుటతో యోహానుచే బాప్తిస్మము పొందెను. మరియు తన రక్తమును కార్చెను ఆయనే మన నిజరక్షకుడు. 

ఈ విధముగానే ప్రత్యక్ష గుడారము యొక్క మొదటి తెరలో నీలి, ధూమ్ర, రక్తవర్ణము గల పేనిన సన్నపునార ద్వారా మెస్సయ్య వచ్చెను మరియు ఈ విధముగా ఆయన తనను విశ్వసించు వారిని వారి పాపము మరియు శిక్ష నుండి రక్షించెను. ఈ సేవలు యేసుని బాప్తిస్మము మరియు సిలువపై ఆయన కార్చిన రక్తము కాక మరి ఏమియు కాదు. మొదటి తెరలోనున్న నాలుగు రంగులలోబయలుపరచిన రక్షణ యొక్క ఆ సేవలు, మెస్సయ్య భూమిపైకి వచ్చెను. బాప్తిస్మమును పొందుట ద్వారా మానవుల పాపములను తనపై మోపుకొనెను. చనిపోవువరకు సిలువ వేయబడెను మృతి నుండి తిరిగి లేచెను.

ఈ సేవలతో తనను నమ్మినవారిని తమ పాపము నుండి యేసుక్రీస్తు రక్షించెను. మరియు వారిని దేవుని ప్రజలుగా చేసెను. యేసుక్రీస్తే రాజుల రాజు మరియు పాపుల దోషములను శుద్ధీకరించిన బలిపశువు. మరియు విశ్వసించువారిని వారి పాపము మరియు శిక్షనుండి విడిపించెను.



ప్రత్యక్ష గుడారము యొక్క రెండవ తెర యొక్క ఆత్మీయ భావము.


ప్రత్యక్ష గుడారము యొక్క రెండవ తెర చేయుటకు ఉపయోగించినది మేక వెంట్రుకలు. రానున్న మెస్సయ్య ప్రజలను వారి పాపముల నుండి ఆ పాపశిక్ష నుండి విడిపించుటతో మానవులకు న్యాయ తీర్పు తీర్చును అని మనకు చెప్పుచున్నది. ఇది మనకు చూపునది ఏమనగా మానవులు దేవుని యొక్క నీతి మతత్వమును పొందుటకు వారు నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను విశ్వసించుట అత్యంత అవసరమని మరొక విధముగా చెప్పుకొనవచ్చును దేవుని నీతిమత్వము మన హృదయమును హిమమంత తెల్లగా శుద్ధీకరించెను. మరియు ఆ విధముగా మన పాపములకు క్షమాపణమును పొందగలుగునట్లు చేసెను.



ప్రత్యక్ష గుడారము యొక్క మూడవ తెర యొక్క ఆత్మీయ భావము.


ప్రత్యక్ష గుడారము యొక్క మూడవ తెర తయారు చేయుటకు ఎర్రని రంగు వేసిన గొర్రె చర్మము ఉపయోగించబడినది. మెస్సయ్య ఈ లోకమునకు వచ్చెననియు బాప్తిస్మము పొందుట ద్వారా లోకపాపములను వహించుకొనెననియు ఆ విధముగా తన ప్రజల పాపముకై పాపపరిహారార్థబలి అగుననియు బయలుపరచుచున్నది. యేసుక్రీస్తు సిలువలో కార్చిన రక్తము లోకపాపముల కొరకైన మరణము యొక్క జీతమును చెల్లించెను. మరొకమాటలో యేసుక్రీస్తు తానే పాపపరిహారార్థబలి ఆయెను. మరియు ఆ విధముగా తన ప్రజలను వారి పాపము నుండి రక్షించెను. (లేవీ 16)

ప్రాయశ్చిత్త దినమును ఇశ్రాయేలు ప్రజలందరి పాపమును వహించుటకై రెండు బల్యర్పణ మేకలను సిద్ధపరచబడెను. వాటిలో ఒకటి వారి పాపము కొరకు ప్రాయశ్చిత్తముగా దేవునికి పాప పరిహారార్థబలి అర్పణముగా అర్పించబడును. ఆ సమయములో ప్రధాన యాజకుడు మొదటి పాప పరిహార బలిమేకపై తన చేతులను ఉంచి ఒకేసారిగా తన ప్రజలందరి పాపమును దానిపై మోపును. తరువాత అతడు దాని రక్తమును తీసికొని, దానిని కరుణాపీఠమునకు తూర్పువైపున చల్లుచు కరుణాపీఠము యెదుట దానిని ఏడుమార్లు చిలకరించును. ఈ విధముగా ఇశ్రాయేలు ప్రజల యొక్క ప్రాయశ్చిత్త బలి దేవునికి అర్పించబడును.

తరువాత ప్రత్యక్ష గుడారము చుట్టూ గుమిగూడిన ఇశ్రాయేలీయులందరి సాక్ష్యముగా వారి యెదుట ఆ ప్రధాన యాజకుడు రెండవ మేకతలపై తన చేతులుంచి ప్రజల అందరి సంవత్సరమంతా చేసిన పాపము అన్నింటిని దానిపై మోపును. ఇదంతయూ ఇశ్రాయేలీయులందరికి తమ గత సంవత్సర పాపాలన్నియూ ప్రధాన యాజకుని చేతులుంచుట ద్వారా అవి తొలగించబడెనను నమ్మకమును కలిగించుటకే. తరువాత ఈ విడిచి పెట్టు మేక తనతోపాటు ఈ పాపములన్నిటిని మోసుకొనుచూ మరణించుటకు అరణ్యములోనికి వదలబడును. (లేవీ 16:21-22) మెస్సయ్య ఈ భూమి మీదికి వచ్చును. బాప్తిస్మమునిచ్చు యోహాను ద్వారా బాప్తిస్మమును పొందుటతో లోకపాపములను తనపై మోపుకొనెను. మానవులందరి మధ్యవర్తియై (మత్తయి 11:11-13, 3:13-17) ఇష్టపూర్వకముగానే పాపము కొరకైన శిక్షను భరించెను మరియు తన ప్రజలను వారి పాపము నుండి రక్షించునని దేవుని వాగ్ధానమైయున్నది.



ప్రత్యక్ష గుడారము యొక్క నాల్గవ తెర యొక్క ఆత్మీయ భావము


సుముద్రవత్సల తోళ్ళు మన స్వంత రూపమే. అలాగే ప్రభువు ఈ లోకమునకు వచ్చినప్పటి ఆయన రూపము కూడా అదే. మన ప్రభువు పాపులు అని పిలువబడుటకు మానవ శరీరముతో ఈ లోకమునకు వచ్చెను. మరియు వారిని నీతిమంతులుగా చేసెను. సముద్రవత్సల తోళ్ళు కూడా యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చినప్పుడు తనను తాను హెచ్చించుకొనలేదు కానీ దానికి బదులుగా తనను తాను తగ్గించుకొని దీనునిగా జన్మించెనని చెప్పుచున్నది.

పాత నిబంధన కాలములో ప్రవక్త ద్వారా దేవుడు చెప్పినదేమనగా మెస్సయ్య వచ్చునని లోక పాపులను తమ దోషమునుండి విడిపించును. యేసుక్రీస్తుని బాప్తిస్మము మరియు సిలువలో కార్చిన రక్తము ద్వారా తన సేవకులచే పలికించిన ప్రవచన వాక్యమును దేవుడు నెరవేర్చుట మనము చూచెదము. ఈ ప్రవచన వాక్యము ఆజ్ఞ వంటి వాక్యముగా ఉన్నది. మెస్సయ్య ఇశ్రాయేలీయుల పాపములను మాత్రమే కాక ఈ లోకములోని ప్రతివారి పాపములను వాటి శిక్షను కూడా భరించెను. మరియు ఆయన తనను విశ్వసించు వారందరిని రక్షించును మరియు వారిని తన పిల్లలనుగా చేయును.

నిర్గమ కాండం 25లో ప్రత్యక్ష గుడారమును నిర్మించుటకు ఉపయోగించిన వస్తువులు గురించి మాట్లాడును. ప్రత్యక్ష గుడారములోని వస్తువులలో నీలి ధూమ్ర, రక్తవర్ణము గల పేనిన సన్నపునార, మేక వెంట్రుకలు, ఎర్రని రంగు వేసిన గొర్రె చర్మము, సముద్రవత్సల తోళ్ళు, బంగారము, వెండి, ఇత్తడి, సుగంధద్రవ్యాలు, నూనె, ప్రశస్త రాళ్ళు ఉన్నవి. ఈ వస్తువులన్నియూ మెస్సయ్య ఈ లోకమునకు వచ్చును మరియు ఆయన బాప్తిస్మము మరియు చిందించిన రక్తము ద్వారా తన ప్రజలను వారి పాపము నుండి రక్షించునని ఈ వస్తువులన్నిటిలో బయలుపరచబడెను. అలాగే తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించుటకు దేవుడు ఏర్పరచిన స్థిరమైన ప్రణాళిక ప్రత్యక్ష గుడారము యొక్క తెరలో దాగియున్నది.

నీలి ధూమ్ర, రక్తవర్ణము గల దారమును ఉపయోగించిన ప్రత్యక్ష గుడారము యొక్క తెరను చేయమని ఎందుకు దేవుడు ఆజ్ఞాపించెను? మేక వెంట్రుకలు, గొర్రెచర్మము మరియు సముద్రవత్సల తోళ్ళును ఉపయోగించమని ఆజ్ఞాపించెను. ఎందుకు? లోక పాపము నుండి మనలను విడిపించుటకు దేవుడు చేసిన ప్రణాళికను మనము ఎందువలన జాగ్రత్తగా పట్టించుకొనవలెను. యేసు తన ప్రజలను వారి పాపము నుండి వారున్న స్థితిలో వారిని రక్షించిన నీలి, ధూమ్ర, రక్తవర్ణదారములో బయలుపరచబడిన సేవలను మనము తప్పక నమ్మవలెను. మరియు ఈ విధముగా మన పాపము నుండి రక్షింపబడి దేవుని పిల్లలముగా మారెదము. మరొక మాటలో ప్రత్యక్ష గుడారపు తెరలో బయలుపరచబడిన దేవుని ప్రణాళికను మనము తెలిసికొనవలెను మరియు తప్పక నమ్ముకొనవలెను.



నాలుగు పద్ధతులతో


ప్రత్యక్షగుడారము యొక్క నాలుగు తెరలు మనకు చెప్పునది దేవుడు మనలను మన పాపము నుండి విడిపించిన విధానము సవివరముగా ఆ మెస్సయ్య శరీరధారియై ఈ లోకమునకు వచ్చును. యోహాను నుండి ఆయన పొందిన బాప్తిస్మముతో లోకపాపములన్నీ వహించుకొనును. ఆ పాపము కొరకు సిలువ వేయబడెను. తన ప్రజల పాపములకు పరిహారమును చెల్లించును మరియు తన స్వరక్తముతో వారిని వారి పాపము నుండి రక్షించును. అయిననూ మెస్సయ్యను తమ రక్షకుడని విశ్వసించు వారికి మాత్రమే ఈ రక్షణ నెరవేరును. ప్రత్యక్ష గుడారపు తెర యొక్క వస్తువులలో బయలుపరచబడిన మెస్సయ్య వాస్తవముగా తన బాప్తిస్మము మరియు సిలువతో వచ్చెను. మరియు ఆ విధముగా మనలను మన పాపములన్నిటి నుండి రక్షించెను.

ప్రత్యక్ష గుడారము యొక్క తెరలలో బయలుపరచబడిన నీలి, ధూమ్ర, రక్తవర్ణ దారముల యొక్క ప్రవచనము ప్రకారము, దేవుని కుమారుడు కొత్త నిబంధన కాలములో పాపపరిహారార్థబలిగా మన వద్దకు వచ్చెను. బాప్తిస్మము పొందెను. రక్తమును కార్చుటకై సిలువ వేయబడెను. అదేగాక ప్రత్యక్ష గుడారము యొక్క తెరలలో కనుపరచబడిన మెస్సయ్యను నమ్ముటతో మనలను రక్షించునట్టి విశ్వాసము యొక్క అర్పణమును దేవునికి ఇవ్వగలము.

అలాగే నీలి, ధూమ్ర,రక్తవర్ణము గల దారములలో బయలుపరచబడిన సత్యమును తప్పక నమ్మవలెను. దేవుని ఎదుటకు రానివారును, నీలి, ధూమ్ర, రక్తవర్ణ దారములో బయలుపరచబడిన యేసు యొక్క సేవలో విశ్వాసమునుంచిన నమ్మకము యొక్క అర్పణమును ఇవ్వనివారును అతని/ఆమె తమ పాపముల కొరకు తప్పక నాశనపరచబడెదరు. ఎవరైనా ఈ సత్యమును నమ్మినట్లయితే అతని/ఆమె రక్షణ యొక్క విశ్వాసముతో అతని/ఆమె ఆయన పిల్లలముగా అన్ని సమయాలలోనూ దేవునియెదుటకు వెళ్ళగలము. ప్రత్యక్ష గుడారము మనకు చెప్పునదేమనగా పాప పరిహారార్థబలిగా వచ్చినయేసుక్రీస్తుని నమ్మనివారు మరియు నీలి, ధూమ్ర,రక్తవర్ణ దారములో బయలుపరచబడిన వాటిని నమ్మనివారును దేవుని రాజ్యములో ప్రవేశించలేరు.

కనుక ప్రత్యక్ష గుడారము యొక్క తెరలు మనకు పరలోకరాజ్యమునకు మార్గమును చూపును. నీలి, ధూమ్ర, రక్తవర్ణ దారములో కనుపరచిన సత్యమును నమ్ముట ద్వారా మనము పరలోకరాజ్యములో ప్రవేశించు మార్గమును కనుగొనవలెను. దేవుని రాజ్యములో ప్రవేశింపకోరువారు మొదట అతని/ఆమె పాపము యొక్క సమస్యను నీలి, ధూమ్ర, రక్తవర్ణ దారములలో బయలుపరచబడిన పాప పరిహారము యొక్క సత్యమును నమ్ముటతో తొలగించుకొనగలరు. అలాగే ప్రజలు ఈ సత్యమును నమ్మి దేవుని సన్నిధిలో ప్రవేశించిన లేక విశ్వసించక ఆయన చేత తిరస్కరింపబడినను ఏది అనుదని వారే కోరుకొనవలెను.

అయిననూ ప్రత్యక్ష గుడారములో బయలుపరచబడిన రక్షణ యొక్క సత్యమును నమ్ముట లేదా నమ్మకపోవుట అనునది మన మనస్సాక్షి యొక్క స్వాతంత్య్రమునకు వదిలిపెట్టబడినది. కానీ ఈ సత్యమును నమ్మకొనకపోయిన దాని పర్యవసానము భరించుట ఎవరికైననూ ఎంతో కష్టము.ఏదేమైననూ దేవునిచ్తిత ప్రకారము వెలుగొందుచున్న ఆయన గృహములో మనము ప్రవేశించుటకు మనము తప్పక మెస్సయ్య, యోహాను నుండి పొందిన బాప్తిస్మము మరియు సిలువ రక్తమును నమ్ముట ద్వారా మన పాపముల నుండి మనము శాశ్వతముగా రక్షింపబడితిమని నమ్మవలెను. మెస్సయ్య పొందిన బాప్తిస్మము మరియు ఆయన సిలువలో కార్చిన రక్తము మన పాపములన్నిటిని క్షమించెనని మన మందరము తప్పక విశ్వసించవలెను. కేవలము వారు నమ్మకముంచినప్పుడు శాశ్వత పాప క్షమాపణము పొంది దేవుని యొక్క మహిమలో ప్రవేశించగలరు.

ప్రత్యక్ష గుడారపు మొదటి తెర నాలుగు భిన్నమైన వర్ణములతో నేయబడినది. మరియు అది మేక వెంట్రుకలతో చేయబడినట్టి రెండవ తెర క్రింద పరచబడినది. దీని ద్వారా మనము పాపక్షమాపణము పొందుకొన్నట్టి యేసయ్య పరిచర్య సత్యమును చూపుచున్నది. ఆయన బాప్తిస్మము మరియు అతని స్వరక్తము అలాగే దేవుని నీతియందు నమ్మిక ఉంచుట ద్వారా మనము పొందిన పాపక్షమాపణము మొదటి తెరలలో బయలుపరచబడిన నీలి, ధూమ్ర, రకవర్ణదారములతో పేనిన సన్నపునారలో నున్న మన విశ్వాసముపై ఆధారపడి ఉండును. ఈ సత్యము ఎంత సత్యమో తెలిసికొనుటకు క్రింద చెప్పబడిన దేవుని వాక్యము వైపునకు తిరుగుదాము.

యెషయా 53:6 చెప్పుచున్నది. ‘‘యెహోవా మన అందరి దోషములను అతని మీద మోపెను.’’ హెబ్రి 9:28 ఇట్లు ప్రకటించెను. ‘‘క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడెను.’’ మరియు 2కొరింథీయులకు 5:21 చెప్పుచున్నది. ‘‘ఎందుకనగా మనమాయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను.’’ ఈ భాగములన్నీ ప్రత్యక్ష గుడారము యొక్క మొదటి తెరలకు ఉపయోగించిన పేనిన సన్నపునార మరియు నీలి, ధూమ్ర, రక్తవర్ణ దారములో బయలుపరచబడిన రక్షణ యొక్క యేసు పరిచర్యలఫై ఆధారపడి మన రక్షణను నెరవేర్చెనని మనకు చెప్పుచున్నది. క్రీస్తు తానే తనను సిలువకు వ్రేలాడదీసుకొనెను మరియు మనకు బదులుగా మన పాప శిక్షను పొందుట అనుదానిని మన పాపమును వహించుకొనుటకై మొదటిగా యోహాను వద్ద బాప్తిస్మము పొందెను. మరియు సిలువపై మన పాపములను కాక లోకపాపమంతటిని ఆయన భరించెను.

యేసు బాప్తిస్మము పొందుట ద్వారా లోకపాపములను వహించెను. మరియు వాటి ప్రాయశ్చితమునకై సిలువ మరణ యాతనను భరించెను. ఆయన భయపడలేదు. దానికి భిన్నముగా ఆయన ఆనందించెను ఎందుకు? ఎందుకనగా అదే ఆయన నీతి యావత్తును నెరవేర్చదగిన (మత్తయి 3:15) సమయము ఆయనకు అదే. మనలను మన పాపము నుండి విడిపించుటకు యేసు బాప్తిస్మమును పొందెను మరియు ఆయన సిలువలో తన రక్తమును చిందించెను. ఆయన మనలను ప్రేమించెను కనుక అలాగు చేసెను. దీని కొరకే ఆయన ఈ లోకమునకు వచ్చెను. యోహానుచే బాప్తిస్మమును పొందెను. మరియు ఇష్టపూర్వకముగానే శ్రమ గిన్నెలోనిది త్రాగెను. ఆ ప్రభువు కలువరిలో తన రక్తమును చిందించునట్లుగా ఆయన తన బాప్తిస్మము ద్వారా మన పాపమును మరియు దోషమును ఇందుకొరకే తనపై మోపుకొనెను. మరియు మన పాపములన్నిటి శిక్షను మనకు బదులుగా ఆయనే పొందెను.



ప్రత్యక్ష గుడారపు మొదటి తెరను ఒకదానితో ఒకటి కూర్చుటకైన ఆ గుండీలు బంగారముతో చేయబడినవి.


ప్రత్యక్ష గుడారపు మొదటి తెర ఒక్కొక్కటి ఐదేసి చొప్పున రెండు తెరలతో చేయబడి ఒకదానితో ఒకటి బంగారు గుండీలతో కూర్చబడినవి. ఇది వాస్తవముగా మనకు చూపించునది ఏమనగా నీలి, ధూమ్ర, రక్తవర్ణ దారములో బయలుపరచబడిన పాపక్షమాపణ యొక్క సత్యమును మనము నమ్మినప్పుడే మనము పరలోకరాజ్యములో ప్రవేశించగలము. ఐదేసి చొప్పున రెండు తెరలు ఒకదానితో ఒకటి ఏబది గుండీలతో కూర్చబడి ఉండుట, మనము మన పాపములన్నిటి నుండి విడిపించబడుట ఆయన రక్షణ నందు మనకు స్పష్టమైన విశ్వాసము ఉన్నప్పుడే విడిపించబడగలమని చెప్పుచున్నది. బైబిలులో బంగారము దేవుని వాక్యమునకు సాదృశ్యమైయున్నది.

అటువలెనే మనలో ప్రతి ఒక్కరు దేవుని వాక్యమంతటిని నమ్ముకొనవలెను. ప్రత్యేకముగా అది నీలి దారములో బయలుపరచబడిన సత్యమునందు మనము విశ్వాసమును ఉంచుటకు ఎంతో ప్రాముఖ్యమైనది. యేసుని సిలువ ఒక్కటే. మన రక్షణను గూర్చి ఉన్నదానంతటిలోనూ, సిలువలోనూ మరియు సిలువ ద్వారానే ఏ విధమైన ప్రభావము కలిగి లేదు. ఎందువలన? ఎందుకనగా ఆయన సిలువ వేయబడుటకు ముందు ఉన్న క్రమమేమనగా పాపులు తమ పాపములను యేసుక్రీస్తుపై మోపుటకు అనువుగా యేసు బాప్తిస్మము ఉన్నది. తండ్రియైన దేవుడు ఈ లోకపాపమును బాప్తిస్మము పొందుట ద్వారా యేసుక్రీస్తు అంగీకరించునట్లుగా చేసెను అని మనము నమ్మినప్పుడే సిలువ మన రక్షణార్థమై ప్రభావమును కలిగియుండును.



ప్రత్యక్ష గుడారములో పేనిన సన్నపునార మనకు ఏమి చెప్పుచున్నది?


దేవుడు తన యొక్క సుదీర్ఘమైన సత్యవాక్య ప్రకారముగానే మన మధ్య పనిచేసెనని మనకు తెలుపుచున్నది. మెస్సయ్య వాస్తవముగా ఈ లోకమునకు వచ్చెను మరియు యోహాను ద్వారా తాను పొందిన బాప్తిస్మము ద్వారా శిక్ష మన పాపమును వహించెను, శిక్షింపబడెను. ఆయన తన వాక్యములో వాగ్ధానము చేసినట్లుగానే ఆయన రక్షణ అప్పటికే నెరవేరెనని మనకు తెలుపుచున్నది.

క్రొత్త నిబంధన కాలములో మన ప్రభువు వాస్తవముగా ఈ లోకమునకు వచ్చెను. యోహాను ద్వారా బాప్తిస్మము పొందుటతో మన పాపములను వహించెను. మరణమగునట్లు రక్తమును కార్చెను. మన పాపాలన్నిటి శిక్షను భరించెను. మరియు ఆ విధముగా రక్షణ యొక్క వాగ్ధానములన్నిటిని నెరవేర్చెను. యోహాను ద్వారా బాప్తిస్మము పొందెను. సిలువ వేయబడెను. మన ప్రభువు తండ్రియైన దేవుని చిత్తమును సంపూర్తి చేసి నెరవేర్చెను. దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీయులతో చేసిన ఆజ్ఞలన్నిటిని తన కుమారుడైన యేసు ద్వారా నెరవేర్చెను.

అయితే ఈ సత్యమునకు సమీపమైన శ్రద్ధను ఎవరు చూపించవలెను? లేదా అది నీవు, నేనునా? ప్రత్యక్ష గుడారపు మొదటి తెర ఏబది బంగారు గుండీలతో ఒకదానికొకటి కూర్చబడెను. సత్యము నిజ విశ్వాసమును మన నుండి కోరుచున్నది. ప్రత్యక్ష గుడారపు మొదటి తెరకు ఉపయోగించబడిన నీలి, ధూమ్ర, రక్తవర్ణ దారముతో పేనిన సన్నపు నారలో బయలుపరచబడిన ఆయన పరిచర్యల ద్వారా యేసు మన పాపాలన్నిటిని కడిగివేసెనని మనము నమ్మినప్పుడే మనము దేవుని రాజ్యములో ప్రవేశించగలమని మనకు చూపబడెను.

మరొక మాటలో పాపక్షమాపణ వాక్యము యొక్క సత్యమును తెలిసికొనుట ద్వారానే పొందమని మనకు తెలుపుచున్నది. పాతనిబంధన మరియు క్రొత్త నిబంధన వాక్యము ద్వారా మన పాపములన్నిటి నుండి మనలను రక్షించిన ప్రత్యక్ష గుడారపు తెరలో బయలుపరచబడిన బాప్తిస్మము మరియు సిలువ రక్తమును విశ్వసించుట ద్వారా మనము మన నిజరక్షణను పొందుకొనగలమని వాస్తవముగా దేవుడు సవివరముగా మనకు చూపించుచున్నాడు.

దేవుడు నిజానికి మనము మన పాపములన్నిటి నుండి శుద్ధీకరించబడి ప్రత్యక్ష గుడారపు మొదటి తెర కొరకు ఉపయోగించిన నీలి, ధూమ్ర, రక్తవర్ణ దారములలో పేనిన సన్నపునారలో కనుపరచబడిన సత్యమును నమ్ముటతో హిమమువలే తెల్లగా మారుటకు దేవుడు మనలను అనుమతించెను. మరియు దేవుడు ఇట్టి విశ్వాసము కలవారిని మాత్రమే తన రాజ్యములో ప్రవేశించుటకు అనుమతించెను. ప్రత్యక్ష గుడారపు తెరను గురించి తెలిసికొని వాటిని నమ్ముకొనవలెను. నీలి, ధూమ్ర,రక్తవర్ణ దారము యొక్క పరిచర్యల ద్వారా ఈ లోకమునకు వచ్చిన యేసుక్రీస్తును నమ్ముట ద్వారా మనము నిజముగా దేవుని పిల్లలమగుటకు అనుమతిని పొందెదము. మరియు ఆయన రాజ్యములో ప్రవేశించుట యొక్క మహిమను పొందెదము.

నీలి, ధూమ్ర,రక్తవర్ణ దారములలో బయలుపరచబడిన ఆయన క్రియల ద్వారా మెస్సయ్య మనలను మన పాపము నుండి రక్షించినప్పుడు దేవుని యొక్క లోతైన మరియు విశాలమైన ప్రేమ యొక్క రక్షణను మనము నమ్మకుండా ఉండి, దానిని త్రోసివేయగలమా? విశ్వాసముతోనే పొందుకొనగలిగిన మన పాపక్షమాపణమును, పరలోక రాజ్యమును తిరస్కరించెదము? మనము తప్పక యేసుక్రీస్తును మన స్వంత రక్షకుడని ఆయన బాప్తిస్మము పొందుట మరియు సిలువపై తన రక్తమును చిందించుట వలన ఈ లోకము యొక్క పాపము నుండి రక్షించెను. అప్పుడు మాత్రమే మనము దేవుని యొక్క ప్రజలముగా మారెదము.

ప్రత్యక్ష గుడారము యొక్క మొదటి తెరలో బయలుపరచబడిన నీలి, ధూమ్ర, రక్తవర్ణ దారముల యొక్క సత్యమును విశ్వసించనివారు నిజానికి విశ్వాసముతో తమ పాపమును కడుగుకొనలేరు. ఈ సత్యమును విశ్వసించనివారు దేవుని పిల్లలు కాలేరు. ప్రత్యక్షగుడారము యొక్క తెరను ఉపయోగించబడిన నీలి, ధూమ్ర, రక్తవర్ణ దారముతో చూపబడిన రక్షణ యొక్క సత్యమును మనము తప్పక నమ్మవలెను. మరియు అట్లు మనము నిత్యజీవమును పొందగలము.



మేక వెంట్రుకలతో చేయబడిన తెర ప్రత్యక్ష గుడారము యొక్క మొదటి తెర కన్నా పెద్దది?


మేక వెంట్రుకలతో చేయబడిన రెండవ తెర ప్రత్యక్ష గుడారపు మొదటి తెర కన్నా పెద్దదైయున్నది. దీని భావమేమనగా దేవుని వ్యతిరేకిగా నిలువబడినవారు ప్రత్యక్ష గుడారపు మొదటి తెరలో చూపబడిన సత్యభాగమును చూడలేరు. వాస్తవానికి ప్రత్యక్ష గుడారపు మొదటి తెర యొక్క నీలి, ధూమ్ర, రక్తవర్ణ దారముల యొక్క పాప పరిహారము యొక్క మర్మము దాగియున్నది. ఇది ఎందుకనగా ఆయనకు భయపడి గౌరవము చూపువారిని నీలి, ధూమ్ర, రక్తవర్ణ దారములలో బయలుపరచబడిన యేసుని పరిచర్యలను విశ్వసించుటతో ఆయన రాజ్యము ప్రవేశించునట్లు దేవుడు నియమించెను.

ఇందువలననే దేవుడు ఏదేనుకు తూర్పువైపున కెరూబులను అన్ని దిక్కులకు తిరుగగల మండుచున్న ఖడ్గమును జీవ వృక్ష మార్గమును కావలికాయుటకు పాపములో పడియున్న మానవుని వెళ్ళగొట్టిన తరువాత దేవుడు నియమించెను. (ఆది 3:24) ఒకడు పరలోక రాజ్యములో ప్రవేశించునట్లు అనుమతించు ఆ సత్యము. మొదటి దేవుని విశ్వసించకుండా ఏ ఒక్కరూ చూచుటకైననూ అనుమతించలేదు. ఇందువలననే దేవుడు మేక వెంట్రుకలతో చేయబడని రెండవ తెర ప్రత్యక్ష గుడారము యొక్క మొదటి తెరలకన్నా కొద్దిగా పెద్దగా ఉండునట్లు దేవుడు చేసెను.

ప్రత్యక్ష గుడారపు రెండవ తెరలో చూపబడినదేమనగా మొదటి తెరలో బయలుపరచబడిన పాపక్షమాపణను పొందినప్పుడు మాత్రమే మనము నీతిమంతులము కాగలము. భిన్నముగా చేస్తూ తన వాక్యమును గౌరవముతోనూ భయముతోనూ నమ్ముకొనినవారే ఆయన ప్రజలగుటకు దేవుడు అనుమతించెను. ఇది ఇలాగే జరుగవలెనని దేవుడు సంకల్పించెను కనుక ఆయన నియమించిన నీలి, ధూమ్ర,రక్తవర్ణ దారములలోని పాప క్షమాపణము యొక్క సత్యమును మొదట విశ్వసించకుండా ఆయన పిల్లలగునట్లుగా ఆయన ఎవరినీ అనుమతించలేదు. దేవుని చిత్తమేదనగా దుష్ట మనస్సు కలవారు నీలి, ధూమ్ర,రక్తవర్ణ దారములోని మర్మముయొక్క ఒక భాగమును కూడా ఎప్పటికి గుర్తించలేరు.



ప్రత్యక్ష గుడారపు రెండవ తెర మేక వెంట్రుకలతో చేయబడినది మరియు దాని గుండీలు ఇత్తడితో చేసినవి.


ఇత్తడి గుండీలలోనున్న ఆత్మీయ భావమేదనగా ప్రజల పాపముల యొక్క తీర్పు. ఇత్తడి గుండీలు చెప్పునదేమనగా మన పాపములన్నిటికి న్యాయమైన జీతమును చెల్లించవలెను. అలాగే ఇత్తడి గుండీలలో కల సత్యమేమనగా మెస్సయ్య సిలువపై తన రక్తమును చిందించవలెను. ఎందుకనగా ఆయన ఈ లోకమునకు వచ్చి బాప్తిస్మమును పొందుట ద్వారా ఈ లోక పాపములన్నిటిని తనపై ఒక్కసారిగా మోసెను. మెస్సయ్య తాను యోహాను నుండి పొందిన బాప్తిస్మము ద్వారా మొదటిగా ఈ లోకపాపములను వహించెను కనుక తరువాత ఆయన ఈ లోకపాపము యొక్క శిక్షను ఆయన సిలువపై కార్చిన తన రక్తము ద్వారా.

ఇత్తడి గుండీల నుండి మనము దేవుని ఆజ్ఞలను గైకొనగలము. ఎట్లనగా పాపమునకు జీతము మరణము (రోమా 6:23) కాబట్టి దేవుడు మన పాపముకైన తీర్పును మెస్సయ్య ద్వారా నెరవేర్చెనని మనము తప్పక గుర్తించవలెను. యేసుక్రీస్తు యోహాను ద్వారా బాప్తిస్మము పొందెను. మరణమగునట్లు తన రక్తమును చిందించెను. కనుక మానవుల పాపముంతటి తీర్పును సంపూర్తి నెరవేర్చెను.

మనము దేవుని ఎదుటికి పోవునప్పుడు నీవు నేను మన మనస్సులో నిజము ఏమిటి అని ఆలోచించవలెను. మన హృదయములతో ఆలోచనలతో క్రియలతో నిజముగా ప్రతిదినము పాపము చేయుచు మనం జీవించుచున్నాము. ఏది ఏమైననూ మెస్సయ్య వాస్తవమైన ఈ అనుదిన పాపములన్నిటిని అంగీకరించెను. ఈ పాపము జీతమును తన ప్రాణము పెట్టి చెల్లించెను. ఆ విధముగా మన కొరకు మన రక్షణను సంపూర్తి చేసెను. దేవుని ఎదుట మన మనస్సాక్షి వాడిపోయి ఎండిపోవునట్టిది ఎట్లనగా మనకు ఆయన సత్యమందు విశ్వాసము లేదు కనుక మనమందరమూ ఈ సత్యమును విశ్వసించవలెను. కనుక మన మరణమగు ఆత్మలు రక్షింపబడి తిరిగి జీవించును.

ఈ ఇత్తడి గుండీలలో బయలుపరచబడిన సత్యమును విశ్వసించవలెనని కోరిక మీ హృదయములలో కలిగియున్నారా? ఇత్తడి గుండీలు చెప్పుచున్న సత్యమేదనగా మనము మన పాపములను బట్టి శిక్షింపబడకుండా తప్పించుకొనలేము కనుక మెస్సయ్య బాప్తిస్మము పొందుట ద్వారా మన పాపములను వహించెను. మరియు మనకు బదులుగా ఈ పాపములన్నిటి కొరకు మనస్థానంలో శిక్షింపబడెను. యేసు వాస్తవముగా తన బాప్తిస్మముతోను సిలువ రక్తముతోనూ ఒకేసారిగా పాపము యొక్క శిక్షను భరించెను. అట్లు చేయుట వలన యేసుక్రీస్తు మనకు విశ్వాసమునిచ్చి దేవుని రాజ్యములో ప్రవేశించు అర్హతను ఇచ్చెను.

దేవుని యెదుట ఎవరైనా పాపమును అతని/ఆమె హృదయములో ఉన్నప్పుడు అతడు/ఆమె నరకములోనికి తప్పక త్రోయబడవలెను. మన పాపములను బట్టి మనము అర్హత పొందదగినది ఏదనగా నిత్యమరణమే. కానీ మెస్సయ్య మన పాపముల కొరకు మనకు బదులుగా బలి అర్పణమాయెను మరియు ఆ విధముగా మనలను వాటి శిక్ష నుండి తప్పించెను. మనము మన పాపములను బట్టి శిక్షార్హులము. అయిననూ మెస్సయ్య మన స్థానములో శిక్షింపబడెనని విశ్వసించుటచేత ఇప్పుడు మనము దేవుని రాజ్యములో ప్రవేశించగలము.

ఈ సత్యమును మనము మన హృదయములో నమ్ముకొనుట ద్వారా, మనము ఈ లోకము యొక్క మన పాపము నుండి క్షమించబడి మన పాప శిక్ష నుండి తప్పించుకొనగలము. అనగా ఈ రక్షణ క్రియను చేయుటకు మెస్సయ్య లోకపాపమును యోహాను ద్వారా బాప్తిస్మము పొందుటతో అంగీకరించెను. మరియు ఈ లోక పాపము కొరకు సిలువ వేయబడెను. ఈ సత్యమును తెలిసికొని విశ్వసించుట ద్వారా మనము క్షమాపణమును పొందుట మాత్రమే కాక పాపశిక్ష నుండి కూడా మనము రక్షింపబడెదము.

మెస్సయ్య మన పాపమును తనపై మోసుకొనెననియు, ఈ పాపము శిక్షను ఈ లోకమునకు వచ్చుట ద్వారాను మొదట చేతులుంచుట అను విధానము ద్వారా తను బాప్తిస్మమును పొందుట ద్వారా భరించెను. మెస్సయ్య ఈ లోకములోని మన అందరి పాపములను యోహాను నుండి తాను పొందిన బాప్తిస్మము ద్వారా తనపై వహించుకొనెను కనుక ఈ పాపము జీతమును చెల్లించుటకు ఆయన సిలువ వేయబడినచో మనము కూడా ఆ విధముగానే నమ్మవలెను. అట్టి విధముగా నమ్మువారికి దేవుడు నూతన జీవితమునిచ్చును.

మన పాపములను బట్టి మనము నరక పాత్రులము. కనుక మెస్సయ్య మన పాపమును అంగీకరించెను మరియు మన స్థానములో చనిపోయెను. ఆ విధముగా మన పాపశిక్షను భరించెను. మన పాపశిక్షను బట్టి చావవలసియున్న మన కొరకు మన ప్రభువు మనకు బదులుగా మన స్థానంలో శిక్షను భరించెను. మన పాపము కొరకైన తీర్పు నుండి మనలను రక్షించుటకు ప్రభువు సిలువ మరణమును పొందినప్పుడు మనము అట్లే నమ్మవలెను.

మనము మన ఆత్మలో ప్రభుని రక్షణను అంగీకరించవలెను. మన హృదయ లోతులోనికి పైపైన కాక ఆత్మీయ విశ్వాసమును ఆయన వాక్యములో ఉంచవలెను. మీలో ప్రతి ఒక్కరు ఇప్పుడు ఈ వార్త విన్నవారు మీ హృదయాలలో ఈ సత్యమును నమ్ముకొనవలెను. ఎట్లనగా మెస్సయ్య తన బాప్తిస్మము మరియు కార్చిన తన రక్తము ద్వారా మనలను రక్షించెను కనుక విశ్వసించువారు నిజముగా రక్షింపబడెదరు.

ప్రజలు తాము నరకపాత్రులమని నమ్మనిచో, వారు నీలి, ధూమ్ర, రక్తవర్ణ దారము ద్వారా వచ్చిన వాడైన మెస్సయ్యను నమ్ముట ద్వారా రక్షింపబడవలసిన అవసరం వారికి ఉండదు. కానీ ప్రజలు తాము నిజముగా నరకపాత్రులమని ఒప్పుకొనుట మాత్రమే కాక. అట్టి శిక్ష నుండి తప్పింపబడవలెనని నిజమైన కోరికను కలిగి ఉండాలి. కనుక మనము ఈ వార్తను నమ్ముకొనుట ద్వారా మన పాపాలన్నిటి నుండి కడుగబడెదము. మన పాపములన్నిటి న్యాయశిక్షను విశ్వాసము ద్వారా భరించునట్టి జీవన విధానము ఇదియే.

ప్రత్యక్ష గుడారము యొక్క మొదటి తెర కొరకు ఉపయోగించబడిన నీలి, ధూమ్ర, రక్తవర్ణ దారములో బయలుపరచబడిన యేసు పరిచర్యలో విశ్వాసము లేకుండా మనము ఖచ్చితముగా ఇప్పుడు నరకమును ఎదుర్కొనబోవు చున్నాము. మెస్సయ్య పొందిన బాప్తిస్మము మరియు సిలువపై ఆయన కార్చిన రక్తమును మన ఆత్మల రక్షణకు ఎంతో దగ్గర సంబంధము కలవైయున్నవి.

మనము ఆదామునకు వారసులముగా జన్మించిన కారణాన మనము పాపులము. మనము నరకపాత్రులము. కనుక మనము పాపులమనియు, నరకపాత్రులమనియు దేవుని ఎదుట తప్పక ఒప్పుకొనవలెను. మీరు దీనిని ఒప్పుకొందురా. దేవుడు మనలను చూచినప్పుడు మనము నరక పాత్రులమని ఆయన చూచును. అట్లే మనము దేవుని ఎదుట మనలను పరిశీలించుకొనిన మనము కూడా నరకపాత్రులమేనని మనకు కనబడును. ఇది ఎందుకనగా మీరును నేనును నరకమునకు దారితీయువారము కాగా మన పాపము నుండి మనలను రక్షించుటకు రక్షకుడు ఈ లోకమునకు వచ్చెను.

ఈ లోకమునకు వచ్చుటతో బాప్తిస్మమును పొంది తన రక్తమును చిందించుట మరియు మరణించుట వలన మన ప్రభువు మనలను రక్షించుట అను తన క్రియను నెరవేర్చెను మనము పాపము మూలముగా నరకపాత్రులము కాకపోయినచో ప్రభువు ఈ రక్షణ క్రియ చేయవలసిన అవసరం ఉండకపోదు. కానీ స్పష్టముగా ఇప్పుడు మన హృదయాలలో తిరిగి జన్మించిన మనకు పాపము లేకపోయిననూ మనము పూర్వము పాపులమే.

పాపులందరూ తప్పక నరకమునకు వెళ్లవలెను. పాపమునకు జీతము మరణము. దీని భావమేమనగా పాపులు నిశ్చయముగా నరకములో త్రోయబడెదరు. కానీ విశ్వాసము ద్వారా పాపక్షమాపణ అను వరమును మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పొందిన వారి నిత్యజీవమును పొందెదరు. మీరు నేను యేసు అను మెస్సయ్యను మన రక్షకునిగా విశ్వసించినప్పుడు ఆ ప్రభువు మన కొరకైన తన ప్రేమలో మన పాపశిక్ష నుండి మనలను రక్షించెను. ఆమెన్‌! హల్లెలూయ!



మన హృదయములలో ప్రభువు అనుగ్రహించిన నిజ విశ్వాసము మనకు కలదో లేదో మనకు మనము పరీక్షించుకొనవలెను.


మనలను మనము చూచుకొందుము. మీరు నేను దేవుని వాక్యము యొక్క ఆజ్ఞలను అనుసరించి విశ్వసించితిమా అట్లయిన దేవుని యెదుట మనకు సంభవింపబోవునది ఏమిటి? మన పాపములను బట్టి మనము దేవునిచే శిక్షిపంబడవలసిన వారమేనా? మన దేవుడు పాపులను శిక్షించకుండా ఉండుటకు నీతిలేని వాడు కాదు. ఎందుకనగా దేవుడు పరిశుద్ధుడును, నీతిమంతుడును కనుక ఆయన పాపమును ఓర్చువాడు కాడు. దేవుడు మనకు చెప్పెను. ఇప్పటికినీ విశ్వసించక ఆయన ఎదుట పాపులైన వారిని తప్పక నరకములో పడవేయును.

ఆయన అట్టి వారిని మండుచున్న వేడిమిగల అగ్నిగంధకములో పురుగు (ఆత్మ) కూడా చావలేని ముండుచున్న పాతాళములోనికి త్రోసివేయుదునని ఆయన మనతో చెప్పెను. తమ పాపములను తామే స్వంతంగా కడుగుకొనువారిని తమ హృదయములను తామే ఓదార్చుకొనువారిని అందరినీ దేవుడు పాతళములోనికి త్రోయును. ఇందును గూర్చి అట్టి ప్రజలకు ప్రభువు చెప్పెను. ‘‘అక్రమము చేయువారలారా నా యొద్ద నుండి పొండి” (మత్తయి7:23)

అలాగే మనము మెస్సయ్యను విశ్వసించాలి. ఆయన ఈ లోకమునకు వచ్చినప్పుడు ఆయన పొందిన బాప్తిస్మమును సిలువ రక్తమును మరియు మృతి నుండి ఆయన పునరుత్థానమును మనము తప్పక నమ్ముకొనవలెను. ఎందుకు ఎట్లనగా మూలములలో మాట్లాడిన మనమందరమూ దేవుని యెదుట పాపులమైయున్నాము. కనుక అందరము నరకపాత్రులమే. ఇందువలననే మెస్సయ్య నీలి, ధూమ్ర, రక్తవర్ణదారము ద్వారా వచ్చెను. తన స్వంత శరీరముతో రక్షణ యొక్క బలిపశువును అర్పించెను. దాని ద్వారా మన పాపములన్నిటిని తుడుపు పెట్టెను. కనుక మనము మన ప్రభువు బాప్తిస్మము పొందెను. సమస్తమును మన కొరకు అర్పణము చేసెనని విశ్వసించవలెను. మనము నరకపాత్రులమని మనలను గుర్తించలేకపోయిన యెడల మనము ప్రభువును బట్టి చేయగలిగినది ఏదియును లేదు.

అయిననూ అనేకమంది తమ పాపములను బట్టి నరకమునకు విధించబడిన వారమని ఆలోచించుటలేదు. వారు తమ డాక్టర్లను సంప్రదించుటకై తగినంత ధనము మాకు ఉన్నదని అనుకొందురు. అట్టి వారు యేసును మంచివాడు. చక్కని ప్రవర్తన కలవానిగాను, గౌరవించదగిన వ్యక్తి అని బోధకుడని గుర్తిస్తారు. మరియు తాము మంచి వ్యక్తిత్వం కలవారిగా గుర్తించబడటానికే యేసయ్యను విశ్వసించినట్లు నటిస్తారు. అట్టి ప్రజలకు మన ప్రభువు చెప్పుచున్నాడు. ‘‘రోగులకే గాని ఆరోగ్యము గలవారికి వైద్యుడక్కరలేదు” (మత్తయి 9:12) అట్టివారు ఇప్పుడే బైబిలు పరమైన ఆధారమునుబట్టి తమ మనస్సును లోతుగా పరీక్షించుకోవాలి. లేని యెడల వారు నరకపాత్రులై నశిస్తారు.

మనము యేసును నమ్ముకొనుటకు గల కారణము ఆయనను మన రక్షకునిగా విశ్వసించుట ద్వారా మన పాపము నుండి విడిపించబడుటకే. అంతేకాని మెస్సయ్యను మనము విశ్వసించి మన విలువ పెంచుకొనుటకు కాదు. లేదా మన పాపము కొరకు మీకు నాకు మెస్సయ్యను నమ్ముకొనుట ఖచ్చితముగా అవసరమే. ఇందుకే మనము విశ్వసిస్తాము. యేసు మెస్సయ్య ఈ లోకములో జన్మించెను. 30 సంవత్సరాల వయస్సులో యోహానుచే బాప్తిస్మమును పొందెను. ఆయన లోకపాపమును మోసుకొనిపోయి తన రక్తమును సిలువ వేయబడుట ద్వారా కార్చెను. ఆయన మృతి నుండి మూడు దినములలోగా లేచెను. మరియు ఆయన ఇప్పుడు తండ్రియైన దేవుని కుడి పార్శ్వమందు కూర్చొనెను ఈ సంగతులన్నియూ మన పాప పరిహారమునకైన సాక్ష్యమును పొందెను. ఈ క్రియలన్నియూ మనలను మన పాపము నుండి విడిపించిన రక్షకునివి కనుక మనము ఖచ్చితంగా వాటన్నిటిని ఒక్కటి కూడా విడువక విశ్వసించవలెను.

మన స్వంత ఆలోచనలలో ప్రత్యక్షగుడారపు తెరను ఏదో గట్టి దారములతో నేయబడుట అనునది బాగుగానే కనబడును కానీ బైబిలులో ఎట్లు చేయబడవలెనో కొన్ని గుండీలు బంగారముతోను కొన్ని ఇత్తడితోను ఎట్లు చేయవలెననునది దేవుడు ఉద్దేశ్యపూర్వకముగానే సవివరమైన వర్ణన చేసెను. దేవుడు ఆలాగు ఆజ్ఞాపించుట ఎందుకని నీవు యోచించావా? ఎందుకనగా ఈ విషయము లన్నియూ ఆత్మీయ ప్రాముఖ్యతను మనకు తెలియచేయుటకే ఆయన ఆజ్ఞాపించెను. ఇందువలన వాటిలో ఏ ఒక్కదానిని నిర్లక్ష్యపరచరాదు.



మెస్సయ్యగా వచ్చిన యేసుక్రీస్తుని బాప్తిస్మమును మరియు రక్తమును మనము నిశ్చయముగా విశ్వసించాలి.


మన పాపములను బట్టి మనము నరకములో వేయబడవలసి వుండగా యేసుక్రీస్తు అనుబడిన మెస్సయ్య ఈ లోకమునకు వచ్చెను. మరియు మనలను మన పాపముల నుండి రక్షించెను. యేసుక్రీస్తు నిజముగానే బాప్తిస్మమును పొందెను. సిలువ వేయబడెను. మరియు తన రక్తమును చిందించెను. అలాగుననే మనము యేసుక్రీస్తుని బాప్తిస్మమును మరియు ఆయన సిలువలో కార్చిన రక్తమును మొదట మన హృదయములలో విశ్వసించకనే మనము పాప రహితులమని చెప్పుకొనుట మనకు న్యాయమైనది కాదు. మెస్సయ్యగా వచ్చిన యేసుక్రీస్తు. వాస్తవముగా మనలను రక్షించుటకే ఈ లోకమునకు వచ్చెను తాను పొందిన బాప్తిస్మము ద్వారా నిజముగానే మానవుల పాపములను తన సొంత శరీరముపై అంగీకరించెను. మన శిక్షను భరించి మరణించెను. మృతి నుండి తిరిగి లేచెను. ఆ విధముగా మనకు నిజమైన శాశ్వత రక్షకుడాయెను. ఈ విధముగా యేసు మనలను రక్షించినది ఎందుకనగా ఈ యేసును నమ్ముట వలననే మన పాపములన్నిటి నుండి విడిపించగలము.

రక్షణ క్రియను సంపూర్తి చేయుటకు మెస్సయ్య బాప్తిస్మమిచ్చువాడైన యోహానుచే బాప్తిస్మము పొందెను మరియు సిలువపై చనిపోయెను. దీని భావము మొదటి నుండి మన పాపము కొరకు మనము శిక్షింపబడవలసిన వారమే. కానీ వాస్తవము ఇకను మనము ఈ శిక్షను భరించవలసిన అవసరము లేదు. ఎందుకు? పాప రహితుడైన మెస్సయ్య వాస్తవానికి శిక్షింపబడవలసిన వాడుకాదు కానీ మన పాపమును తనపై వహించుకొనుటకు అంగీకరించెను. మరియు మనకు బదులుగా మన పాపములన్నిటి కొరకు శిక్షింపబడెను. కాబట్టి హృదయ పూర్వకముగా యేసుబాప్తిస్మమును ఆయన సిలువ రక్తమును విశ్వసించినందున మన పాపము కొరకైన శిక్ష నుండి విడిపించబడితిమి.

మనము అనేక కార్ల వెనుక అద్దంపై ‘‘యేసు నిన్ను ప్రేమించుచున్నాడు” అను స్టిక్కర్లను చూస్తుంటాం. యేసు నీవు తెలుసుకోవాలని కోరుకొనినది అంత వరకేనా? మన ప్రభుని రక్షణ అట్టి మాటలతోనే చేయబడినది కాదు. ‘‘నేను నిన్ను ఎంతో ప్రేమించుచున్నాను కాబట్టి నేను నీ పాపమును క్షమించితిని. కేవలము నాయందు నమ్మిక ఉంచుడి. నేను మిమ్మును నా పిల్లలనుగా చేయుదును” అని ఆయన మనకు తెలియచేయ కోరుచున్నారు. మెస్సయ్య వాస్తవముగా బాప్తిస్మమును పొంది సిలువ వేయబడెను. తన రక్తమును కార్చెను మరియు మృతి నొందెను. ఇవన్నియూ మనలను మన పాపము నుండి విడిపించుటకే, ఆ ప్రభువు నిజముగా మనలను రక్షించెను మరియు మన కొరకు వేచియున్న తీర్పు నుండి విడిపించెను.

ఆ ప్రభువు మన పాప రోగమును స్వస్థపరచు వైద్యుడాయెను. ఈ లోకమునకు వచ్చి ఆయన నిజముగా బాప్తిస్మము పొందుట ద్వారా మన పాపములను తన సొంత శరీరముపై మోపుకొనెను. సిలువ వేయబడి మరణమగు వరకు రక్తం కార్చెను. వాస్తవముగా మృతి నుండి తిరిగి లేచెను. అట్లు మనలను రక్షించెను మనము మన పాపమును బట్టి నిశ్చయముగా పాతాళమునకు తగినవారమైయుండగా ఆ ప్రభువు ముందుగానే మనలను మన పాపము రోగమునుండి స్వస్థత నిచ్చెను. మనము సరియైన విశ్వాసముతో తప్పక మన పాపము నుండి స్వస్థత పొందాలి.

ప్రజలు పాపులమైనప్పటికి నరకములోనికి త్రోయబడవలసిన అవసరము లేకపోయిన మెస్సయ్య ఈ లోకమునకు వచ్చి తన రక్తమును కార్చవలసిన అవసరం లేదు. కానీ ప్రజలు ఖచ్చితముగా యేసును విశ్వసించవలసిన కారణమేదనగా వారు భయంకరమైన పాపరోగమును కలిగి అది వారిని నరమునకు నడిపించును. నిజానికి ఇట్టి భయంకరమైన పాపరోగము కల ప్రజలు తప్పించుకొనలేరు కానీ పాతాళములో త్రోయబడెదరు. కనుక వారు మరేమియు ప్రశ్నించక మెస్సయ్యగా వచ్చిన యేసు యొక్క బాప్తిస్మమును, రక్తమును విశ్వసించవలెను.

తమ హృదయములలో పాపము కలవారు నిశ్చయముగా పాతాళ శిక్షను పొందెదరు. ఎట్లనగా దేవుని ఆజ్ఞానుసారముగా ప్రతివానికి పాపమునకు జీతము మరణము సూక్ష్మంగా తీసుకొన్నట్లయిన ఒకడు అతని/ఆమె హృదయములో కొంచెము పాపమున్న యెడల అతడు /ఆమె నరకములో త్రోయబడును. ఇందువలననే యేసు మన వద్దకు వచ్చెను. కాబట్టి మన పాపములను పరిపూర్ణముగా కడిగివేసిన మెస్సయ్యను మనము నిజముగా విశ్వసించిన మనము మన పాపములన్నిటి నుండి విడిపించబడగలిగెదము. మనము యేసయ్యను మన రక్షకుడని తప్పక నమ్మవలెను. మరియు ఆయన మన కొరకు జరిగించిన దానిని ఉన్నది ఉన్నట్లుగానే నమ్మవలెను.

యేసు వాస్తవంగా తానే దేవుడు. ఆయనే నిజ సృష్టికర్త. కానీ ఆయన తన పరలోక మహిమను ప్రక్కనుంచెను. కొంతకాలము మానవ శరీరమును ధరించుకొనెను. ఇదంతయూ ఆయన ప్రేమించిన మిమ్మును నన్ను భయంకరమైన పాప, నరక, నాశన, శాప శిక్ష నుండి విడిపించుటకు జరిగించెను. మరియు ఆయన నిజముగా బాప్తిస్మం పొందెను, సిలువ వేయబడెను, పునరుత్థానుడాయెను. మరియు పరలోకమునకు ఆరోహణమాయెను. ఇది సత్యము ఇది ఏదో స్వల్పమైన సత్యమని ఏదో ఒక చతురు అనియు మనము గుర్తించకూడదు. మనము నిశ్చయముగా ఈ వాస్తవమైన సత్యమును మన హృదయాలలో నమ్మాలి. దానిని ఖచ్చితంగా తెలుసుకోవాలి.

సమానార్థబలిగా అర్పించబడు గొర్రెలు, మేకలలో ఏ పాపమైననూ ఉన్నదా? ఏ పశువునకు పాపమనగా ఏమో అని కనీస అవగాహన కూడా ఉండదు. ఈ పశువు పాత నిబంధనలోని ఇశ్రాయేలీయుల పాపములను చేతులుంచుటద్వారా అంగీకరించెను కనుక అవి వారి స్థానములో, వారికి బదులుగా మరణము నొందెను. ఎందుకనగా పాపమునకు జీతము మరణము దీనిని దేవుడే స్థిరపరచెను. కనుక ప్రాయశ్చిత్త దినమున బలి అర్పణముగా అర్పింపబడునది ఇశ్రాయేలు ప్రజలందరి పాపమును అంగీకరించెను కనుక అది నిశ్చయముగా చావవలసియున్నది. కాబట్టి ఇదే కారణము కొరకు యేసు ఇప్పటికే తన బాప్తిస్మము ద్వారా లోకపాపమును భరించెను కనుక ఆయన కూడా చనిపోవలెను.

ఈ క్రియలన్నియూ నిజానికి ఎవరి కొరకు జరిగించబడినవి? అవి నిజముగా మీ కొరకు, నా కొరకే. అయితే ఇది మనము నమ్మవచ్చు లేదా లేకపోవచ్చునా? ప్రజలు నమ్మరు. ఎట్లనగా వారు తమ పాపము యొక్క తీవ్రతను పూర్తిగా పట్టించుకొనరు. కానీ అతి చిన్నపాపము కొరకు కూడా వారు నరకములో పడవేయబడుదురను సత్యము వారికి తెలిసియున్ననూ మెస్సయ్యగా వచ్చిన యేసుక్రీస్తుని రక్షణను ఏదో ఒకటి కోరుకొనుదానిగాను లేదా ఏ కారణము లేక తాము నమ్ముకొనదగిన దానిగా వారు గుర్తించలేరు.

ప్రజలు పాపులైతే గింజంత చిన్నదైననూ వారు నరకములో త్రోయబడెదరు. వారు నాశనపరచబడెదరు. వారు ఈ భూమిపై జరిగించు ప్రతి విషయము వారి యొక్క నిత్యశాపముతో ఆఖరుకు అంతమగును. తమలో పాపమున్ననూ ఏమీ కాదని తలంచువారు లోతుగా శిక్షింపబడెదరు. పాపము వలన వచ్చునది నిర్వివాదముగా మరణము. అయిననూ తమ హృదయాలలో పాపము ఉన్నప్పటికి కొంతమంది వాస్తవంగా విజయవంతులై జీవిస్తూ ఉంటారు. యవ్వనస్తులు అవాస్తమైనవాటిని ఆరాధించుచూ ఏదో ఒక దినాన వాటిని కలుసుకొనెదమని కలలుకంటూ వుంటారు. కానీ విలాసవంతముగా కనబడుచున్న వారి జీవితము ఎల్లప్పుడూ అట్లే ఉండునా? వారిలో అనేకులు తమ పదిహేను నిమిషాల ప్రఖ్యాతి ముగియగానే దుఃఖకరముగా మారెదరు.

కొంతమంది ఏది చేపట్టిననూ చెడు సంభవించువారు ఉంటారు. నీవు ప్రభువును కలుసుకొనుటకుముందు మీరు కూడా అట్లే ఉండి ఉంటారు. ఏ ఒక్కటీ మీరు కోరుకొనిన విధంగా మంచిగా జరిగి ఉండకపోవచ్చు. నీవు శాపజీవితమును జీవించుచున్నట్లయితే ఇదే తప్పక జరుగునని నీవు తలంచినది అట్లు జరుగదు. మరియు అంతా సవ్యముగా జరుగుచున్నదని నీవు తలంచినది మారిపోవును. మీరు పెద్దగా ఊహించినది వాస్తవ రూపము పొందక నీవు ఊహించినది చిన్న చిన్నగా మారును. చివరకు అది మాయమగును. నీ అతి చిన్న ఊహా వాస్తవము కాలేదని నీవు గుర్తించినప్పుడు ఆఖరును నీ కల కూలిపోవును.

ఇట్లు ఎందుకు జరుగుచున్నది? ఎందుకనగా మీ హృదయాలలో కల పాపము వలననే తమ హృదయాలలో పాపము ఉన్నవారు ఎప్పటికి సంతోషించలేరు వారు ఎంతగా ప్రయత్నించిననూ దేవుడు వారిని దీవించడు. కొంతమంది పాపములున్ననూ అభివృద్ధి పొందుచున్నట్లు కనిపించిననూ, దేవుడు వారిని విడిచెనని నీవు తప్పక గుర్తించవలెను. వారి ఇప్పటి జీవితము విజయవంతమైనప్పటికి, దేవుడు వారిని నరకమునకు అప్పగించెనని నీవు తప్పక తెలిసికొనవలెను. ఈ లోకము పూర్తిగా పాప రహితులతో నిండియుండి ఉంటే నరకము ఉంచవలసిన అవసరం ఉండేది కాదు. దేవుడే వాస్తవముగా నరకమును సృజించెను దానిని తమ హృదయాలలో పాపము కల వారి కొరకే ఆయన సృజించెను.

ప్రత్యక్ష గుడారపు మొదటి నీలి, ధూమ్ర, రక్తవర్ణ దారముతో చేయమని దేవుడు ఆజ్ఞాపించినది వాస్తవముగా మన హృదయముకు పాప క్షమాపణమును నిచ్చుటకే మరియు అది నూతన నిబంధన కాలము వచ్చునప్పటికి యేసుక్రీస్తు యోహాను ద్వారా బాప్తిస్మమును పొందుట ద్వారా లోకపాపములను తనపై వహించుకొనునని తరువాత ఆయన ఈ పాపము కొరకైన శిక్షను భరించుటకు సిలువ వేయబడి మరణించునని కూడా తెలియచెప్పుచున్నది. వాస్తవముగా మన ప్రభువు పాపులకు రక్షకుడాయెను.

ఇందువలన ఆయన నీలి, ధూమ్ర, రక్తవర్ణ దారముల యొక్క తన క్రియల ద్వారా పాపులకు పాపక్షమాపణము నిచ్చెను. దీనిని మీరు ఇప్పుడు గుర్తించుచున్నారా? యేసుక్రీస్తు నిజముగా మన పాపములను వహించుటకే యొర్దానులో బాప్తిస్మమును పొందెను. ఆయన సిలువ వేయబడెను మరియు ఈ పాపము జీతమును చెల్లించుటకే తన రక్తమును చిందించెను. యేసు సిలువపై మరణించినది మొదట ఆయన యోహాను నుండి పొందిన తన బాప్తిస్మము ద్వారా మన పాపములను వహించుకొనెనని నీవు నమ్ముచున్నావా?



మన శరీరములో నీవు మరియు నేను సముద్రవత్సల తోళ్ళవలే ఉన్నాము.


నాల్గవ తెర సముద్రవత్సల తోళ్ళతో చేయబడినవి. పాతనిబంధనలో హెబ్రీ భాషలో ‘‘తకాష్‌” అని పిలువబడు సరీసృపము యొక్క తర్జుమా పేరే సముద్రవత్సలము. అది కొన్ని సరీసృపముల వలే తర్జుమా చేయబడినది. ఉదాహరణకు సముద్ర ఆవు (ఎన్‌.ఐ.వి.), సీల్‌ (ఎ.ఎస్‌.వి.), మంచిమేక (ఎన్‌.ఎల్‌.టి.) మరియు ఫోర్‌ పోయిస్‌ (ఎన్‌.ఎ.ఎస్‌.బి.) ఈ సరీసృపము ఏదో ఖచ్చితముగా మనము కనుగొనలేకపోయాము. బైబిలు పరమైన తత్వవేత్తలు ‘‘తకాష్‌”లు అను మాట పుట్టుక నూతన విశ్లేషణగా ఉన్నది.ఏది ఏమైననూ, తకాష్‌ అని పిలువబడు సరీసృపము యొక్క చర్మము ప్రత్యక్ష గుడారపు నాల్గవ తెరకు ఉపయోగించబడినది. మరియు ఆ తెర అందమైనది కాదు. ఏ మంచి లక్షణము కలిగియుండలేదని చెప్పుకొనుట ఎంతైనా ఖచ్చితమైనది.

సముద్రవత్సల తోళ్ళ యొక్క నాల్గవ తెర అనగా యేసుక్రీస్తు మానవ రూపములో ఈ లోకమునకు వచ్చెనను సాదృశ్యము. మరియు ఆయన ముఖములో ఏ విధమైన ఆకర్షణ లేనివానిగా కనబడెను. అతని రూపమును వర్ణించుచూ బైబిల్‌ ఇట్లు చెప్పుచున్నది. “లేత మొక్కవలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన యెదుట పెరిగెను. అతనికి సురూపమైనను సొగసైనను లేదు. మనమతని చూచి అపేక్షించునట్లుగా అతని యందు సురూపము లేదు.’’ (యెషయా 53:2)

ఆ దేవుని కుమారుడు దీనునిగా జన్మించిన శరీరాకారముగా ఈ లోకమునకు వచ్చినది. మన మరణదినము వరకు అవమానకరమైన బ్రతుకు బ్రతుకుటకు తప్ప ఏమి చేయలేని మనలను రక్షించుటకే దేవుడు ఆదాము సంతానమైన మనలను చూచినప్పుడు, మనలను కూడా ఏ ఆకర్షణ లేని చర్మపు తెరవలె ఆయన చూచును. అంతేగాక మనము కేవలము పాపము చేయుటకే ఇష్టపడతాము. మురికి కంపుకొట్టు జంతువులవలే, మనుష్యులు తమ స్వంత కడుపు నింపుకొనుటకే తాము పుట్టినప్పటి నుండి చనిపోవువరకు ఆసక్తిని కలిగి ఉంటారు. ఇట్టి కారణము వలనే యేసయ్య మానవ శరీరధారియై ఈ లోకమునకు వచ్చెను మరియు బాధతో శిక్ష అనుభవించెను.

తమ పాప స్వభావము యొక్క తీవ్రతను వాస్తవముగా ఎరిగిన వారు మాత్రమే మెస్సయ్యను నమ్ముకొనగలరు మరియు తమ పాపములకైన శిక్షను ఎరుగని వారు పాప పరిహారమును పొందుటకై అర్హతను పొందినవారు కారు. అట్టి ప్రజలు నశించు మృగము కంటే మంచి స్థితి కలవారు కారని దేవుడు చెప్పుచున్నాడు. (కీర్తన 49:20)

మనమందరమూ దేవుని పోలికగా సృజింపబడినప్పటికి అందరూ దేవుని ప్రేమను అంగీకరించుట లేదు. దేవుని రక్షణ యొక్క ప్రణాళికను నమ్మని వారు తమ హృదయాలలో పాప పరిహారమును పొందలేరు. కాబట్టి వారు మృగముల వలే నాశనపరచబడతారు. దేవునికి మనుష్యుల పట్ల ఒక ప్రణాళిక ఉన్నది కనుక స్వరూపములో వారిని సృజించెను.

ప్రతివారు చేయునది యోచించుదానిని క్షుణ్ణంగా పరిశీలించు. నేను ప్రత్యేకముగా మిమ్మును గూర్చి చెప్పుట లేదు. కానీ నేను మానవ జాతి అంతటిని గూర్చి చెప్పుచున్నాను. అనేకమంది ప్రజలు తమను సృష్టించిన సృష్టికర్త ఎవరో తెలియకయే ఉన్నారు. ఇంకనూ వారిలో చాలామంది మేము పాపము చేయలేదని చెప్పుకొందురు. వారే ఇతరుల కంటే శ్రేష్ఠులని తలంచెదరు. మనుష్యులు ఎంత మూఢులు, ఎంత బుద్ధిహీనులు, దేవుని ఎరుగనివారు పూర్తిగా ఎదిరించు స్వభావం కలిగి ఉంటారు. మనలను మనము ఇతరులతో పోల్చుకొనునప్పుడు వాస్తవముగా ఏ బేధమును మనము కనుగొనెదము? మనము ఎంత అధికులము లేదా నీచులము అనే చూస్తామా? అయిననూ ప్రజలు తమ స్వప్రయోజనము కొరకైన స్వార్థమును వెదకుచూ ఇతరులకు హాని చేస్తారు ఇది ఎంత తప్పిదము?

ఒక జీవిత కాలములో ప్రతివారు ఎన్ని పాపములను చేసెదరో అని మనలను మనము లోతుగా చూచుకొనలేము. మానవ స్వభావమును నీచపరచుటకు నేను ఇట్లు చెప్పుట లేదు కానీ నేను కేవలము సత్యమును ఎత్తిచూపుచున్నాను. ఎట్లనగా దేవుడు మానవుని ఎంతో ప్రత్యేకముగా సృజించిననూ, అనేకులు ఇంకనూ గుర్తించనివారై వారు వాస్తవముగా తమ పాపములను బట్టి నాశనమగుచున్నారు. తమ ఆత్మలను గూర్చి ఎట్టి జాగ్రత్త కలిగి ఉండాలో ప్రజ లకు తెలియుటలేదు. వారు తమ కొరకైన తమ భవిష్యత్తును సిద్ధపరచుకొనలేక పోవుచున్నారు. వారు దేవుని వాక్యమును గుర్తించరు. మరియు వారు నిత్య నాశనమును తప్పించుకొనుటకు ఏ మార్గము లేక పోయిననూ ఆయనను విశ్వసించరు. నశించిపోవు మృగమును పోలినవారై యున్నారు.



కానీ దేవుడు మనలను మన నాశనమునకు విడువడు


మనలను మన పాపము నుండి రక్షించుటకు యేసు ఈ లోకమునకు వాస్తవముగా వచ్చెను. ఆయన బాప్తిస్మము పొందెను. సిలువపై ఆయన తన రక్తమును చిందించెను. మృతి నుండి తిరిగి లేచెను. ఆ విధముగా ప్రభువు మన రక్షకుడాయెను. మనము ఈ సత్యమును నమ్మవలెను. మీరు నమ్ముచున్నారా? ఏ విధమునైననూ, మీ అజ్ఞానమును బట్టియు, బైబిలు జ్ఞానము లేకపోవుటను బట్టియు ‘‘దానిలో విశేషమేమిటి. ఎట్లయిననూ మనము యేసును నమ్మినచో, మనమందరమూ పరలోకము వెళ్తామా? అని మీరు అనుచున్నారా?’’ ఇట్లు చెప్పువారు కూడా కొద్దిమంది కలరు. ‘‘మీరు యేసు రక్తమును నమ్మినట్లయిన పరలోకము మనదగును.’’ కానీ ఇట్టి విశ్వాసము సరియైనదేనా?

వాస్తవముగా దేవుడు, సత్యమైన దేవుడైయున్నాడు. ఆయనే తన ప్రణాళికను గూర్చి మనతో మాట్లాడినవాడు. తన వాక్య ప్రకారము తన రక్షణ క్రియను ఉన్నట్లుగానే నెరవేర్చినవాడు. మనకు పాప క్షమాపణమును ఇచ్చినవాడు. ఈ సత్యము ద్వారానే మనలను కలుసుకొనువాడు. దేవుడు సజీవుడైయున్నాడు. దేవుడు ఒక్కడు ఇప్పటికినీ ఉన్నాడు. మనలో ప్రతి ఒక్కరితోనూ ఉన్నాడు. తమ హృదయములలో పాపము కలవారు దేవుని మోసపుచ్చుటకు ప్రయత్నించకూడదు. ప్రజల మనస్సులో పాపము ఉండి అది వారి మనస్సాక్షిని తినివేయుచుంటే వారు ఆయన పొందిన బాప్తిస్మమును మరియు ఆయన కార్చిన రక్తమును విశ్వసించి ఆ సమస్యను తీర్చుకొనవలెను. పాపులు, తాము నరకపాత్రులైరి కనుక ప్రభువు వారిని తమ పాపములన్నిటి నుండి తన బాప్తిస్మము మరియు తన సిలువ రక్తము ద్వారా రక్షించెను. సత్యమును తప్పక నమ్మవలెను.

నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను విశ్వసించి తమ పాప సమస్యను తొలగించుకొనలేని వారు ఖచ్చితంగా ఎవరునూ లేరు. కానీ ప్రభువు మనలను నీటి ద్వారాను, రక్తము మరియు ఆత్మ ద్వారా రక్షించిననూ (1యోహాను 5:6-8) మనమట్టుకు మనము ఈ సత్యమును గుర్తించక మరియు నమ్ముకొనక యున్న కారణమును బట్టి నాశనము చేయబడెదరు. దీనంతటికి మనమే కారణమగుదుము. మనము అందరమూ దేవుని ఎదుట ఒప్పుకోవాలి. ‘‘నేను పాపిని కనుక నరకపాత్రుడను కానీ నేను నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను నమ్ముచున్నాను. మనము అట్టి విశ్వాసమును కలిగి ఉండాలి. మన ప్రభువు మనలను నీరు రక్తము మరియు ఆత్మమూలమైన సువార్త ద్వారా మనలను రక్షించెనని మన హృదయములలోనమ్మాలి మన నమ్మకమైన హృదయము మరియు విశ్వాసముతో మనము మనలను నీరు మరియు ఆత్మమూలమైన సత్యముతో ఐక్యపరచుకోవాలి. అప్పుడు మాత్రమే మనము మన పాపము నుండి రక్షింపబడెదము.

ఆలాగుననే ఈ విషయాలన్నిటిని మనము అర్థము చేసుకోవాలి. వాటి సత్యమును విశ్వసించాలి. ప్రత్యక్ష గుడారములో బయలుపరచబడిన సత్యమును నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను తెలిసికొనకయే కొంతమంది విశ్వసిస్తారు. ‘‘నాలో ఇంకనూ పాపము ఉన్నప్పటికి నేను విశ్వసించాను. కనుక నేను పరలోకంలో ప్రవేశించెదనని” నమ్ముదురు. కానీ పాపులందరూ నరకములోనికి త్రోయబడెదరని దేవుడు చెప్పెను. వారు యేసును నమ్ముకొనిననూ పాపము కలవారైతే విశ్వాస కారణముగా వారు నరకములోనికి త్రోయబడరని ఆయన చెప్పలేదు. అన్నిటిలోకి మూర్ఖమైన వారగుటతో ఇది సమానము. కేవలము యేసును విశ్వసించిన కారణాన తాము పరలోకమునకు వెళ్ళెదమని చెప్పుట వాస్తవముగా వారికి ఇష్టమైన విధముగా వారు విశ్వసించిరి. ఇది అవివేకమును ప్రతిరూపము, అజ్ఞానమైన పూర్తి గుడ్డి నమ్మకమైయున్నది.

మరి కొందరు చెప్తారు. ‘‘నరకములో త్రోయబడిన వారిని ఒక్కరినైననూ, లేదా పరలోకములోనికి వెళ్ళినవారిని ఒక్కరినైననూ నేను చూడలేదు. తీర్పు దినము వరకు మనము కనుగొనలేము.’’ కానీ వాస్తవముగా పరలోకము నరకమును ఉన్నవి. ఈ లోకములో మన కనులతో చూడగలిగినవే ఉన్నవా? నీ కనులతో నీవు గాలిని చూడగలవా? కనబడనివి కూడా ఖచ్చితముగా ఉన్నవి. పాపులందరూ దేవుని విశ్వసించరు. ఎందుకనగా వారు ఆయనను చూడలేని వారు గాను నశించు మృగములవలెను ఉన్నారు.

అలాగే తమ హృదయములలో పాపము కలిగి ఉంటే, తాము నాశనపరచబడెదమని వారు గుర్తించవలెను మరియు వారు నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను నమ్మవలెను. దేవుని తీర్పు నుండి తొలగిపోవలెను. తెలివైనవారు తమ చుట్టూ నున్న ప్రజల పట్ల అనేకమైన తప్పిదము చేయకపోయినను ఎట్లైనను తాము దేవునికి వ్యతిరేకముగా అనేక తప్పిదమును చేసితిమని గుర్తించెదరు. కాబట్టి వారు ఆయన యెదుట నిలిచిన వెంటనే తప్పక తీర్పుపొందెదమని ఒప్పుకొందురు.

మనము మన అజ్ఞానమును బట్టి నశించకూడదు మరియు దేవుని ఆయన న్యాయ తీర్పును గుర్తించకుండా ఉండకూడదు. ప్రతి ఒక్కపాపిని ఆయన నిశ్చయముగా నిత్య నరకాగ్నితో నరకములో శిక్షించును. ప్రజలు ప్రత్యక్ష గుడారములో బయలుపరచబడిన సత్యమును వినినప్పటికి ఆ సత్యమును విశ్వసించక నాశనపరచబడినచో వారు సాతాను పిల్లలైయుందురు. మనము అందరమూ పాప క్షమాపణ పొందదగిన మరియు పరలోకరాజ్యములో ప్రవేశించగలిగిన విశ్వాసమును మన నుండి మెస్సయ్య కోరుచున్నాడు.



దేవుడు మనలను బొమ్మలనుగా చేయలేదు.


మానవులమైన మనలను దేవుడు చేసినప్పుడు ఆయన మనలను పాపముచే బాధించబడకుండా మనలను నివసింపచేయాలని ఉద్దేశించును. కానీ ఎల్లప్పుడూ నిత్యజీవమును అనుభవించుటకును, మనలను నరకమునకు పంపించక ఉంచుటకు మెస్సయ్య బాప్తిస్మము పొందెను. లోక పాపములను తనపై వహించుకొనెను. సిలువపై తన రక్తమును కార్చెను. ఆ విధముగా మన పాపములను శుద్ధి చేసెను. దేవుడు మనలను ఇంతగా ప్రేమించినప్పుడు ఈ ప్రేమను మనము తెలిసికొనకుండా సగము హృదయములతో ఆయన ఇచ్చిన రక్షణను నమ్మినయెడల మనము నిశ్చయముగా దేవుని కోపము నుండి విడిపింపబడలేము.

దేవుడు తన స్వంత కుమారుని త్యాగము చేసి మనలను మన పాపము నుండి విడిపించెను. మెస్సయ్య మన పాపములన్నిటిని తనపై వహించుకొనుటకు బాప్తిస్మమును పొందెను. మరియు ఆయన తానే మన కొరకైన పాపపరిహారార్థబలిగా తనను అర్పించుకొనెను. ఆయన నిజముగా మనలను ఈ లోక పాపము నుండి రక్షించెను. అనగా మనము మన పాపము నుండి నరకపాత్రులమై ఉన్నప్పుడు మన ప్రభువు మనపై కృప చూపెను. దీని మూలమునే ఆయన బాప్తిస్మమును పొందెను. మరణమగువరకు ప్రభువు మనపై కృప చూపెను. దీని మూలముననే ఆయన బాప్తిస్మమును పొందెను. మరణమగు వరకు రక్తము కార్చెను. మృతి నుండి తిరిగి లేచెను. అట్లు మనలను మన పాపములన్నిటి నుండి రక్షించెను. మరియు మనలను దేవుని పిల్లలనుగా చేసెను. దేవుడు మనలను ఆయన బొమ్మలుగా చేయలేదు.

కొంతకాలము క్రితం మా సంఘ సహోదరి ఒక కళాశాలలో ఉన్నప్పుడు ఆమె పట్టా ప్రధాన పండుగకు వెళ్ళు అవకాశం నాకు కలిగినది. అక్కడ కళామందిరములో వివిధ రకాల పెయింటింగ్‌ను నేను చూచాను. పట్టా పొందబోవు తరగతి వారు చేసిన పెయింటింగ్‌లో ఆదాము హవ్వలు మంచి చెడు జ్ఞానమునిచ్చువృక్షము నుండి తినుచున్నట్లుగా చిత్రించిన కాన్వాసు పై ఇట్లు వ్రాయబడెను. ‘‘దేవుడు మానవులను బొమ్మలనుగా తయారుచేసేనా? ఆ కాన్వాసుపై ఎవరో ఈ ప్రశ్నకు సమాధానము వ్రాసిరి. ఎట్లనగా దేవునికి విసుగు కలిగెను కనుక ఆయన మనలను తనకు బొమ్మలనుగా చేసెను.’’

ఈ సమాధానము కంటే అధికమైన తప్పిదము మరొకటి లేదు. అటువంటప్పుడు దేవుడు మంచి చెడుల జ్ఞానమునిచ్చు చెట్టును ఎందుకు సృజించెను. తరువాత ఆదాము హవ్వలను తినవద్దని ఎట్లు చెప్పెను. కేవలము వారు ఆ పండ్లను తినబోవుచున్నారని ఆయనకు తెలియును. అయిననూ ఆయన ఆ వృక్షమును చేసి వాటిని తినవద్దని చెప్పెను. వారు తినినప్పుడు వారు పాపములో పడిన కారణాన ఆయన వారిని ఏధేను వనము నుండి బయటకు త్రోసివేసెను. తరువాత ఆయన పాపులందరూ తిన్నగా నరకమునకు పోవుదురని చెప్పెను. దేవుడు ఇలాగు ఎందుకు చేసెను? దేవునికి నిజముగా బొమ్మలు లేని కారణాన ఏమీ తోచక ఉన్నందుననూ ఆయన మనలను తయారుచేసెనా? ఆయనకు ఏమీ తోచని కారణాన దానిని ఇకను భరించలేని వాడై ఆయన మానవులను సృజించెనా? కాకపోవచ్చు.

సహోదర, సహోదరీలారా దేవుడు చేయకోరినది ఏమనగా మనలను తన స్వంత ప్రజలుగా మార్చవలెనని మనలను అమర్య్తులనుగా చేయవలెనని మరియు ఆయనతో సంతోషముగా నిత్యము జీవింపచేయాలని వీటన్నిటిని మానవులకు సమకూర్చుటకు ఆయన అనుమతించినది మనలను మరణములేని వారినిగా చేసి శాశ్వతమైన మహిమను అనుభవించుటకు నిత్యము మహిమలో నివసించు వారినిగా చేయుటకే కనుక మీరు నేను సాతాను వలన మోసపుచ్చబడినప్పుడు పాపములో పడినప్పుడు నరకమునకు పాత్రులమైనప్పుడు మనలను రక్షించుటకై దేవుడు తన ఏకైక కుమారునిగా పుట్టిన వానిని ఈ లోకమునకు పంపెను. కుమారుని బాప్తిస్మము పొందునట్లుగా చేసి లోక పాపాలను ఆయనపై మోపెను. తన రక్తమును చిందించెను మృతి నుండి తిరిగి లేచెను దేవుడు మనలను సాతాను నుండి రక్షించెను.

అయిననూ దేవుడు తనకున్న ఏమీ తోచని స్థితిని తొలగించుటకే మనలను ఎలాగో బొమ్మలుగా చేసెనను వింతైన తప్పుడు అభిప్రాయమును పెక్కుమంది ప్రజలు కలిగియున్నారు. యేసునందున్న విశ్వాసమును కొల్పొవుచున్న వారిలోను మొదటి నుండి ఆయనను ఎల్లప్పుడూ నమ్మనివారు అందరూ మరియు 

దేవునియందు చేదు అని తలంచువారు దేవుడు నన్ను ఎందుకు ఒత్తిడి చేయాలి? నేను ఆయనను నమ్మితే రక్షణను ఇస్తానని నమ్మకపోతే ఇవ్వనని నాతో ఆయన ఎందుకు చెప్పాలి? అని పలికెదరు. దేవుడు మానవాళికి ఇచ్చిన లోతైన రక్షణ యొక్క అవకాశము వారికి తెలియనందు వలననే అట్లు చెప్పెదరు.

మెస్సయ్య యొక్క ఈ లోతైన అవకాశము ఎందుకనగా ఆయన మనలను దేవుని పిల్లలనుగా అంగీకరించాలని దాని వలన మనలను తన స్వంత పిల్లలనుగా చేయాలని పరలోకము యొక్క దివ్యత్వమును మహిమను ఆయన కుటుంబముగా మనము అనుభవించాలని. ఇందుకు దేవుడు మానవులను సృజించెను. నా మట్టుకు నేను నీరు మరియు ఆత్మ వలన తిరిగి జన్మించువరకు ఈ సత్యమును అర్థము చేసుకొనలేదు. కానీ నేను పాప క్షమాపణమును పొంది తిరిగి జన్మించిన తరువాత ‘‘ఆహా! ఇందుకు దేవుడు నన్ను సృజించెను అని తెలుసుకున్నాను.’’

మెస్సయ్య 2000 సంవత్సరముల పూర్వం ఈ లోకమునకు వచ్చినప్పుడు మన పాపములను తనపై మోపుకొనుటకు ఆయన నిజముగా ఏమి చేసెను? మన పాపములను ఆయన మోయునట్లు చేసినది ఏమిటి? ఆయన బాప్తిస్మమును పొందెను. తన రక్తమును కార్చెను. ఇవన్నియూ మన పాపములను తుడుచుటకైన నీతియుక్తమైన క్రియలను, న్యాయమైన, త్యాగమునైయున్నవి.

మనము దేవుని నిజముగా ఎందుకు నమ్మవలెనను కారణము మరియు యేసుక్రీస్తును మన రక్షకుడైన దేవుడని ఎందుకు నమ్మవలెనను కారణము ఇక్కడ ఇమిడి ఉన్నది. మీరు నేను నరకపాత్రులమైయుండగా మనలను రక్షించుటకు దేవుడు తానే ఈ లోకమునకు వచ్చెను. అనగా యేసు యోహాను వలన బాప్తిస్మమును పొందవలెను. సిలువలో చనిపోవలెను. మరియు మృతి నుండి తిరిగి లేవవలసియున్నది. నీలి, ధూమ్ర, రక్తవర్ణ దారములలో కనుపరచబడిన పాప క్షమాపణమును మనము విశ్వసించవలసిన కారణమేదనగా మనము ఆ విధముగా మన పాపములన్నిటి నుండి క్షమింపబడుటకే. దేవునికి మన పట్ల ఉన్న ఉద్దేశ్యము నెరవేర్చబడుటకు మనము తప్పక ఆయనను విశ్వసించవలెను. మరియు మనము దేవుని రక్షణను విశ్వసించినప్పుడు ఎవరి లాభము కొరకో మనము అట్లు చేయకూడదు కానీ మన స్వంత లాభము కొరకే నమ్మాలి.



దేవుని రక్షణ యొక్క సత్యమును విశ్వసించుటకు అనుకూలమైన సమయము ఇదియే.


ఈ క్రింది అవగాహనను ఎవరైననూ అందుకొనవలెనని కోరిన ఆ వ్యక్తి ఇప్పుడే అతని/ఆమె యొక్క తప్పుడు విశ్వాసమును ప్రక్కన పెట్టవలెను. మరియు తమ హృదయంలో నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను విశ్వసించవలెను. నేను నరకపాత్రుడనని నాకు తెలియదు. యేసు నా పాపములను తుడిచెనని నేను చెప్పబడితిని కనుక కేవలము నేను నమ్మియున్నాను. కానీ నా విశ్వాసమంతయూ తప్పుడు భావమును ఆధారం చేసికొనినది. సరియైనది ఏదో దానిని నేను ఇప్పుడు నేర్చుకొనవలెను మరియు ఆ బలము పై నా విశ్వాసము కట్టబడాలి. ఇప్పటి వరకూ నేను తప్పుగా విశ్వసించితిని. కానీ ఇప్పటికీ ఆలస్యము కాలేదు. నేను చేయవలసినదంతయూ గుర్తించితిని. ఇప్పటి నుండి నా పాపము కొరకు నేను నరకమునకు పాత్రుడనైననూ మెస్సయ్య తన బాప్తిస్మము మరియు రక్తము ద్వారా నన్ను నరకమునకు పాత్రుడనైననూ మెస్సయ్య తన బాప్తిస్మము మరియు రక్తము ద్వారా నన్ను నరకమునకు పాత్రుడనైననూ మెస్సయ్య తన బాప్తిస్మము మరియు రక్తము ద్వారా నన్నురక్షించెనని నా హృదయములలో నమ్ముచున్నాను. మరియు నా పాప క్షమాపణమును పొందుచున్నాను. కనుక నేను నరకపాత్రుడను కాను.

నిజముగా అతికొద్దిమంది క్రైస్తవులు వారు మొదట విశ్వాసమును ఆరంభించినప్పుడు నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను గూర్చి సరియైన ఖచ్చితమైన అవగాహనను కలిగియున్నారు. నా మట్టుకు నేను, కూడా నేను క్రైస్తవుడనైనది మొదలుకొని యేసు తన బాప్తిస్మముతో లోక పాపములను తనపై వహించుకొనెనని, సిలువపై మరణమాయెనని తెలిసికొనుటకు 10 సంవత్సరాలు పట్టినది. మరియు అప్పుడు నేను యేసును మరలా నా స్వంత రక్షకునిగా విశ్వసించుట ద్వారా రక్షింపబడితిని. నేను క్రైస్తవుడనైన 10 సంవత్సరముల తరువాత నేను నా తప్పుడు విశ్వాసమును పారవేసి, నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను సరిగా అర్థం చేసుకొని దానిని సరిగా విశ్వసించితిని. కానీ మిగిలిన వారికి ఒకవేళ 20 సంవత్సరముల కన్నా ఎక్కువ సమయము సత్యమును తెలిసికొని తిరిగి విశ్వసించుటకు పట్టవచ్చును.

20 సంవత్సరాల తరువాత అట్టి ప్రజలు తెలిసికొనినప్పుడు దేవుడు వారిని నీరు మరియు ఆత్మమూలమైన సువార్త ద్వారా రక్షించుటకు ప్రణాళిక చేసెనని తెలిసికొనినప్పుడు యేసు తమ పాపముల కొరకే బాప్తిస్మమును పొంది మరణించెనని వారు తప్పక నమ్మవలెను. సత్యమును తెలిసికొని, దానిని విశ్వసించుటకు తిరస్కరించుట కంటే అధికమైన చెడుతనము దేవుని యెదుట మరొకటి ఉండదు. కానీ ఒకవేళ వారు ఇప్పుడు నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను విశ్వసించవలసియుండగా 10, 20 సంవత్సరాల క్రైస్తవులుగా జీవించిన తరువాత ఇది చెడుతనము కాదా? కాకపోవచ్చును. దీనిలో తప్పిదమైననూ సిగ్గుపడవలసినదియైననూ ఏదియూ లేదు. నీలి, ధూమ్ర, రక్తవర్ణ దారములలో బయలుపరచబడిన పాపక్షమాపణమును వాస్తవముగా ప్రజలు తెలిసికొనినప్పుడు వారు నిజముగా రక్షింపబడెదరు. నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను విశ్వసించుటయే దేవుని సంతోషపరచును. మీరందరూ వాస్తవముగా సంపాదించబడిన రక్షణను దాని నెరవేర్చు నీలి మరియు రక్తవర్ణ దారము ద్వారా నెరవేరెనని విశ్వసించెదరని నేను నమ్ముచున్నాను.

ప్రత్యక్ష గుడారపు తెరలు విస్తారమైన వివరణను ఇచ్చినవి. మేక వెంట్రుకలతో చేయబడిన తెరపై ఎర్రని రంగు వేసిన గొర్రె చర్మము కప్పబడెను మరియు దానిపై సముద్రవత్సల తోళ్ళు పరచబడెను. అను సత్యమును చూచుట ద్వారా మనమందరమూ నరకపాత్రులమని స్పష్టముగా బయలుపరచబడుటను మనమందరమూ చూడగలము. కానీ మన ప్రభువు ఈ లోకమునకు వచ్చెను. నిజముగా బాప్తిస్మమును పొందుట ద్వారా మన పాపములను వహించుకొనెను. మన ఈ పాపముల కొరకై బలిపశువై సిలువపై తన రక్తమును కార్చెను. సిలువపై మరణించెను. నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను మనమందరమూ విశ్వసించవలెను. ఎట్లనగా నీలి, ధూమ్ర,రక్తవర్ణ దారము ద్వారా బయలుపరచబడిన యేసు పరిచర్యల ద్వారా ప్రభువు మనలను వాస్తవముగా రక్షించెను. ప్రత్యక్ష గుడారపు తెరలు ఈ రక్షణ యొక్క మర్మమును కలిగియున్నవి.

బైబిలును గూర్చి అభ్యసించుట ముఖ్యము కాదు. దేవుని సంతోషపరచునది బైబిలు అభ్యసన సూత్రము కాక విశ్వసించుట అనగా నీలి, ధూమ్ర, రక్తవర్ణ దారములలో కనుపరచిన యేసు యొక్క క్రియల ద్వారా మనలను రక్షింపవలెనని దేవుని సంకల్పమని బైబిలు చెప్పినచో, అప్పుడు దీనిని మీరును నేనును మన హృదయములలో ఒప్పుకొని అట్లు విశ్వసించవలెను. ఇట్లు మనము దేవుని సంతోషపెట్టగలము. మన హృదయాలలో మనము నిజముగానే దేవుని వాక్యమును వినినయెడల మన పాపమును గుర్తించి ప్రభుని బాప్తిస్మమును సిలువ రక్తమును విశ్వసించినప్పుడు మనము కూడా నిజముగానే పాపక్షమాపణమును పొందగలము. కానీ ప్రభువు ఇచ్చిన ఈ పాప క్షమాపణమును మనము నమ్మని యెడల మరియు దానికి బదులుగా ఆయనను మౌఖికముగానే నమ్మినప్పుడు మనము నొప్పించబడుచున్న అపరాధమైన మనస్సాక్షినే కలిగియుందుము.

నీరు మరియు ఆత్మను విశ్వసించి మన వాస్తవ పాపము యొక్క సమస్యను పరిష్కరించనియెడల, ఈ అపరాధమైన మనస్సాక్షి మన హృదయమును తినివేయును. అయినను నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను మన హృదయాలలో నమ్మిన యెడల, మనము ఈ అపరాధమైన మనస్సాక్షి నుండి విడిపించబడెదము. ఎట్లనగా మనము సంపూర్ణ పాపక్షమాపణమును పొందుట ద్వారా పాప రహితులమైనప్పుడు మరలా పాపము వలన ఎట్లు బాధించబడతాము? ఇందువలననే మనము వాస్తవముగా నమ్మవలెను. నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను నమ్మినప్పుడు, మన పాప సమస్యలన్నిటి నుండి విడిపించబడెదము. అట్లు చేయుటకు తప్పిపోయినవారు మరి ఏ అవకాశము లేక పాప దాస్యములో కొనసాగెదరు.

జీవితము ఎంతో క్లుప్తమైనది, బాధతో కూడినది దేవుడు బాధను ప్రతి మనుష్యునికి అనుమతించెను. దేవుడు మనకు బాధను నియమించుటకు కారణమేమి? ఎందుకనగా మన పాప బాధ ద్వారా ఆయన నీరు మరియు ఆత్మమూలమైన సువార్త యొక్క ప్రశస్తతను మనము తెలిసికొనవలెనని ఆయన కోరెను. మరియు వాస్తవముగా మన పాపమునుండి విడిపించబడాలని కోరెను. ఆయన పాప బాధను నీకు ఇచ్చాడు. ఎందుకనగా మెస్సయ్య తన బాప్తిస్మము మరియు సిలువ రక్తము ద్వారా నీ పాపములన్నిటిని కడిగి వేసెనని నీ హృదయములలో నమ్మెవలెను. నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను సత్యమని నమ్మకపోవుట అత్యంత తెలివితక్కువ చర్య మానవుల పాపములన్నియూ నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను వాస్తవమని నమ్ముట ద్వారా నే పూర్తిగా శుద్ధీకరింపబడును.

సత్య సువార్తను నమ్మి మన పాప సమస్యను తొలగించుకొనమని దేవుడు చెప్పుచున్నాడు. కనుక మనము తప్పక యేసును నమ్మవలెను. ఆయన నిజ రక్షకుడు మీరు కూడా మీ హృదయాలలో యేసుక్రీస్తుని మీ స్వంత రక్షకుడని వాస్తవంగా నమ్మాలి. దేవుని యెదుట మీ పాపమును ఒప్పుకోవాలి. నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను నమ్మాలి దాని ద్వారా రక్షింపబడాలి. రక్షకుడైన యేసు బాప్తిస్మమును ఆయన సిలువ రక్తమును నీ హృదయములలో నీవు నమ్మినప్పుడు నీ పాపములన్నిటి నుండి వాస్తవముగా నీవు క్షమించబడెదవు. యేసు యొక్క బాప్తిస్మమును ఆయన సిలువ రక్తమును సత్యమని మనము నమ్మినప్పుడు మనము మన పాపాలన్నిటి నుండి రక్షింపబడెదము.



ఆ తెరల క్రమము మన రక్షణయొక్క క్రమముతో ఖచ్చితమైన పోలిక కలిగియున్నది.


మన రక్షణ యొక్క క్రమము విషయములో ప్రథమముగా ఈ లోకములో మనము జన్మించిన మరు క్షణము నుండి నశించు జీవుల వలె మనమందరమూ పాపముతో నిండియున్నామని నమ్మకముగా మనము గుర్తించాలి. మరియు మనము మన పాపము నిమిత్తము చావు విధింపబడి నరకములో త్రోయబడవలసిన వారము అని నమ్మవలెను. ఇంకొంచెము మనము మన పాపముల నుండి విడిపించబడుటకు మనకు ఒక బలిపశువు నిజానికి అవసరము. అలాగుననే ఆ మెస్సయ్య వాస్తవంగా ఈ లోకమునకు వచ్చి బాప్తిస్మము పొందుట ద్వారా వాటిని భరించెను. మన రక్షకుడు మానవుడు కాదని తానే దేవుడని మనము నమ్మవలెను. మరియు మనము రక్షకుడైన యేసు వాస్తవముగా తన బాప్తిస్మము మరియు సిలువ ద్వారా మనలను రక్షించెనని మనము విశ్వసించవలెను.

ఒకవేళ పరిస్థితి ఇది కాని యెడల ప్రత్యక్ష గుడారముపై దేవుడు రెండు తెరలను మాత్రమే కప్పించును. యేసు బాప్తిస్మమును విడచుట ద్వారా రక్షణ పొందగలిగిన యెడల ప్రత్యక్ష గుడారము యొక్క తెరకు నాలుగు ప్రత్యేకమైనవి తయారు చేయించవలసిన అవసరము లేదు. మరియు దేవుడు దానిని సముద్రవత్సల తోళ్ళతోనూ, గొర్రె చర్మములతోను కప్పించి ఉండును. కానీ నిజముగా ఈ రెండు తెరలే ఉపయోగించబడినవా? లేదు! ప్రత్యక్ష గుడారము నాలుగు వేరు వేరు తెరలతో కప్పబడవలెను. నీలి, ధూమ్ర, రక్తవర్ణ దారములు గల పేనిన సన్నపునార తెరలు. మేక వెంట్రుకలతో చేయబడిన మరొక తెర వేరొకతెర గొర్రె చర్మము గలది. ఆ కర్ర తెర సముద్ర వత్సల తోళ్ళతోను చేయబడినది.

మనము సత్యమును ఉన్నది ఉన్నట్లుగానే నమ్మవలెను. అనగా యేసు బాప్తిస్మము పొంది మన పాపములన్నీ అంగీకరించెను, సిలువపై మరణించెను. అట్లు నశించుపోవు, నరకపాత్రులమైన ఆత్మలను మన పాపము నుండి రక్షించెను. మనలను దేవుని స్వజనులనుగా చేసెను. ప్రత్యక్ష గుడారపు నాలుగు తెరలలో దాగియున్న మర్మము ప్రత్యక్ష గుడారముపై ఈ నాలుగు తెరలు కప్పబడిన క్రమము మన రక్షణ క్రమములోనే ఉన్నది.

ప్రత్యక్ష గుడారపు మొదటి రెండవ తెరను ఒకదానితో ఒకటి కూర్చుటకు బంగారు, ఇత్తడి గుండీలు అవసరమైనవి ఒక్కొక్క తెరగా చేయుటకు ఉపయోగించిన ప్రతి జత తెరలో నీలి దారపు కొలుకులతో కలుపబడుట యొక్క యదార్థ భావము తెలిసికొనుట అసాధ్యము నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను విశ్వసించువారు మాత్రమే నాలుగు తెరలలో దాగియున్న సత్యమును అర్థము చేసుకొని నమ్మగలరు.

నీలి దారపు కొలుకులు యొర్దాను నదిలో యేసుపొందిన బాప్తిస్మమును తెలుపును. ఆయన జనులు ఎందుకు యేసు లోకపాపమును తనపై మోపుకొని బాప్తిస్మమును పొందిరో నమ్మరు. కానీ సిలువ రక్తమునే విశ్వసిస్తారు? ఎందుకనగా వారు దేవుని వాక్యమును ఉన్నది ఉన్నట్లుగా నమ్మరు. మనము యేసును నమ్ముచున్నామని చెప్పుకొన్నప్పుడు దేవుని వాక్యమునకు కలుపుట, లేదా తీసివేయుట లేకుండా అయినను సరిగా నమ్ముకొనలేము. మనము తప్పక దేవుని వాక్యమును ఉన్నది ఉన్నట్లుగా అవును అని చెప్పుచూ నమ్మవలెను.

యేసును నమ్ముకొన్నామని చెప్పుకొను అనేకమందిలో చాలామంది సిలువలో ఆయన కార్చిన రక్తమును నమ్మరు. ఆయన పొందిన బాప్తిస్మమును విడిచిపెడతారు. ఈ కారణముగా అనేక క్రైస్తవులు ప్రత్యక్ష గుడారపు తెరలో బయలుపరచబడిన మర్మము యొక్క సత్యమును తెలిసికొనలేరు. మరియు ఇందువలననే ఈ దినాలలో క్రైస్తవులు మెస్సయ్య పూర్తిగా నెరవేర్చిన నిజ పాపక్షమాపణమును నమ్మలేరు. వ్యర్థముగానే వారు యేసును నమ్ముతారు. ఏదో లోక సంబంధ మతమును కనుగొనిన వానిగా నమ్ముతారు. అలాగే క్రైస్తవులు అనేకులు నిజానికి తప్పు మార్గములోనడుచుచున్నారు. వారు ప్రతి దినము పాపం చేస్తారు. అయినా అనుదిన పశ్చాత్తాప ప్రార్థనల ద్వారా పరలోకానికి వెళ్ళెదమని చెప్పుదురు. ఈ లోక లౌకిక నాయకులు క్రైస్తవులను తరచుగా విమర్శించుటను ఇది వివరించుచున్నది.

మనము ఎట్టిది మరియు ఏ విధమైన విశ్వాసమును కలిగియుండట ద్వారా మన పాప సమస్యను తొలగించు కొనగలమని క్రైస్తవులను అడిగినప్పుడు వారిలో అనేకులు ఇట్లు చెప్తారు. ‘‘మనము అనుదినము యేసు రక్తమును నమ్ముచూ పశ్చాత్తాప ప్రార్థనలను చేయుట ద్వారా దానిని పరిష్కరించుకొందుమని” తరువాత వారిని ‘‘నీ హృదయములో పాప సమస్య పరిష్కరించబడుతుందా.’’ అని అడిగినప్పుడు వారిట్లు చెప్పెదరు. వాస్తవంగా నా పాపము నా హృదయంలోనే ఉన్నది. తన హృదయములో పాపము కలవారు ఇంకనూ దేవుని ప్రజలు కారు. అట్టి ప్రజలు యేసుక్రీస్తునకు బయటివారు వారు నీరు మరియు ఆత్మ మూలమైన సువార్తను విశ్వసించుట ద్వారా త్వరగా యేసుక్రీస్తు లోనికి రావలెను.

ఏ సరియైన విధానము ద్వారా మన ప్రభువు మన పాపములను తుడిచిపెట్టెనో అది వాస్తవమైనదని మనము తప్పక వివరముగ తెలుసుకోవాలి. ఆయన నిజముగానే యోహాను వద్ద పొందిన బాప్తిస్మము ద్వారా లోక పాపములను సిలువ వరకు మోసుకొనిపోయెను మరియు తన రక్తమును కార్చుట ద్వారా మన ప్రభువు వాస్తవముగా మన పాపమును తుడుపు పెట్టెను. మనము దేవుని సన్నిధిలోనికి ప్రవేశించకోరిన యెడల నీలి, ధూమ్ర, రక్తవర్ణ దారములతో పేనిన మన రక్షణను నమ్ముట ద్వారా విశ్వసించి ప్రవేశించవలెను. ఒకడు ఎంత భక్తి భావముతో దేవుని నమ్మెననునది కాక అతడు/ఆమె ఇంకనూ అపార్థము చేసుకొని మరియు అపనమ్మకమును పూర్తి కాలము కలిగియుండు అవకాశము ఉండును. మనము దేవుని రాజ్యములో ప్రవేశించుటకు నీలి, ధూమ్ర, రక్తవర్ణ దారములతో చేయబడిన రక్షణను మనము అంగీకరించవలెను. ఎట్లనగా ఆ విధానము ద్వారానే మెస్సయ్య మన పాపములను తుడుపు పెట్టెను. ఇది సత్యము దీనిని నమ్ముము.

దేవుని యెదుట మన విశ్వాసము తప్పిదమైనప్పుడు మనము దానిని మరల నిలిపి సరిగా నమ్మకము నుంచవలెను. అది ఎంత తరచుగానైనా సరే మనము రక్షణను నమ్మాలి. ఎట్లనగా సత్యముగా ప్రభువు తన బాప్తిస్మము ద్వారా మన పాపములను వాస్తవముగా తనపై వహించుకొని వాటన్నిటిని శుద్ధీకరించెను. ఆ ప్రభువు వాస్తవముగా మన పాపములన్నిటిని ఒకేసారిగా తన బాప్తిస్మముతో వహించి, ఆయన సిలువ రక్తము ద్వారా వాటన్నిటి పాప శిక్షను భరించెను.

ప్రత్యక్ష గుడారము యొక్క నీలి, ధూమ్ర, రక్తవర్ణదారములలో బయలుపరచబడిన యేసు యొక్క పరిచర్యలను నిజముగా నమ్మినచో మనము మెస్సయ్యను కలుసుకొనగలము. ప్రత్యక్ష గుడారము ద్వారా మనమిప్పుడు నీరు మరియు ఆత్మ మూలమైన సువార్తను ఎంతో భిన్నంగా గ్రహించగలిగాము. మరియు దాని విశ్వాసము నీలి,ధూమ్ర, రక్తవర్ణ దారములతో పేనిన సన్నపు నారలో బయలుపరచబడిన సత్యముపై ఆధారపడెను. మనము ఇప్పుడు తప్పక కలిగి యుండవలసిన మూల విశ్వాసమేదనగా నీలి,ధూమ్ర, రక్తవర్ణ దారములతో చేయబడిన రక్షణను మన హృదయములలో వాస్తవముగా నమ్ముకొనుటయే.

మనము ఇప్పుడు నీలి, ధూమ్ర, రక్తవర్ణ దారము మరియు పేనిన సన్నపునారతో చేయబడిన ప్రత్యక్ష గుడారములో నున్న సత్యమును గూర్చి వినుచూ, నేర్చుకొనుచున్నాము. ఇప్పుడు ఆ మెస్సయ్య మన కొరకు వేచి చూచుచున్నాడు. ఆయన నీలి,ధూమ్ర, రక్తవర్ణ దారములలో బయలుపరచబడిన తన క్రియల ద్వారా నిజముగా ఇప్పటికే మన పాపములన్నిటిని క్షమించెను.

మీ పూర్ణ హృదయముతో ఈ సత్యమును మీరు నమ్మవలెనని దేవుడు బోధించుచున్నాడు. నీ హృదయములో ఇంకనూ పాపమున్నదా? అయితే మీ హృదయాలలోనున్న పాపము ఎంత చీకటియై మురికిగా నున్నదో దేవునియెదట మీరు స్పష్టముగా గుర్తించవలెను. మీ పాపమును ఒప్పుకొనుడి నీలి, ధూమ్ర, రక్తవర్ణ దారముతో బయలుపరచబడిన సత్యమును నమ్ముకొనుడి. మరియు ఆ విధముగా మీ పాపములన్నిటికి క్షమాపణ పొందుకొనుడి. యేసు మీ పాపములన్నిటిని క్షమించెనని మీరు నిజముగా నమ్మినయెడల మీ హృదయములలో నున్న పాపములన్నియూ ఆయనపై మోపబడెనని నీవు కనుగొందువు. మరియు ఆయన యొక్క పూర్ణ పాప క్షమాపణమును పొందుకొనెదవు.

మన మందరమూ మన హృదయాలలో దేవుడు వాస్తవముగా మన కొరకు ప్రణాళిక పరచిన నీలి, ధూమ్ర,రక్తవర్ణం గల పేనిన సన్నపునారతో చేయబడిన పాప క్షమాపణమును తప్పక పొందుకొనవలెను. దేవుడు మనకు అద్భుతమైన యేసు పరిచర్యతో చేయబడిన సువార్తను అనగా నీలి, ధూమ్ర, రక్తవర్ణ దారము లోనైన దానిని మనకిచ్చెను. మరియు పాప క్షమాపణమును మనము పొందుకొనగలిగినట్లు చేసెను. మరియు ఆయన స్వంత పిల్లలముగా అధికారమును శక్తిని అంతటిని అనుభవించనిచ్చెను. ఆ ప్రభువు మనలను మన పాపములన్నిటి నుండి శిక్ష నుండి రక్షింపబడుటకు నిత్యజీవమును పొందునట్లును అనుగ్రహించెను. ఎట్లనగా రక్షణ క్రియలను నీలి, ధూమ్ర, రక్తవర్ణ దారములలో బయలుపరచబడినట్టి రక్షణను విశ్వసించునట్లు చేసెను.

మనము రక్షింపబడునట్లు నీలి,ధూమ్ర,రక్త వర్ణ దారములు గల పేనిన సన్నపు నారలో బయలుపరచబడిన సత్యమును నమ్ముటను మనకు సాధ్యపరచిన మన ప్రభువునకు కృతజ్ఞతా స్తుతులను చెల్లించుచున్నాను. ఈ సత్యమును నమ్ముట ద్వారా మనము మన పాపములన్నిటి నుండి క్షమింపబడెదము మరియు విశ్వాసముతో దేవుని రాజ్యములో ప్రవేశించెదము. హల్లెలూయ!