Sermons

[7-1] <రోమా 8:28-30> ముందస్తు నిర్ణయం మరియు దైవ ఎన్నిక సిద్ధాంతంలో ఉన్న తప్పులు

<రోమా 8:28-30>

“దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి, మేలుకలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని యెరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు, దేవుడెవరిని ముందు ఎరిగెనో, వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను: ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను; ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమ పరచెను.’’ • దేవుడు నిజముగా మనలో కొందరినే ముందుగా ఎన్నిక చేసికొనెనా?
 • లేదు. ప్రభువైన యేసుక్రీస్తు నందు మనలనందరిని ఎన్నిక చేసెను.


క్రైస్తవ సిద్ధాంతాన్ని రూపొందించే ప్రాథమిక వేదాంతశాస్త్రాలలో ఒకటైన ముందస్తు నిర్ణయం మరియు దైవిక ఎన్నికల వేదాంత సిద్ధాంతం, యేసును విశ్వసించాలనుకునే చాలామంది దేవుని వాక్యాన్ని తప్పుగా అర్ధం చేసుకోవడానికి దారితీసింది. ఈ తప్పుదోవ పట్టించే సిద్ధాంతం చాలా గందరగోళానికి కారణమైంది.

దేవుడు తాను ప్రేమించువారిని ముందుగా నిర్ణయించెననియు, ఆయనకు అయిష్టులైన వారిని నాశనమునకు అప్పగించెనదే తప్పుడు సిద్ధాంతము. అంటే నీరు మరియు ఆత్మ ద్వారా కొందరినే రక్షించుట దేవుని చిత్తమనియు, వారే పరలోకములో ప్రవేశింతురని,ఆవిధముగాఎన్నుకొనబడనివారు నరకాగ్నికి అప్పగింపబడుదురనునదే ఈ తప్పుడు సిద్ధాంతము.

ఒకవేళ దేవుడు నిజముగా మనలో కొందరినే ముందుగా ఎన్నిక చేసుకొన్నట్లయితే, ఈ ప్రశ్న మన హృదయములను బాధించును.‘‘నేను రక్షణకు నిర్ణయింపబడితినా?”అను ఈ ప్రశ్న కలుగును. ఒక వేళ ఈ సిద్ధాంతము ప్రకారం మనము ఎన్నిక చేయబడినట్లయితే యేసు నందు విశ్వాసముంచుట అర్థరహితమే. విశ్వాసముంచవలెనా, లేక దేవునితో ఎన్నిక చేయబడవలెనా అను సందేహంలో అనేకులను ఈ తప్పుడు సిద్ధాంతము ఇబ్బంది పెట్టుచున్నది.

ఈ సిద్ధాంతమును మనo నమ్మినట్లయితే మనమేలాగు మన మనస్సులో వున్న సంశయము తొలగించుకొని దేవుని యందు విశ్వాసముంచ గలము. దేవుడు మనలను ఎన్నిక చేసుకొనెనని ఎట్లు ధృడపరచుకొనగలము?“అటులయినచో దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? అన్యజనులకును దేవుడే”(రోమా 3:29).అని వాక్యములో తెలియజేసినను దేవుడు ఎన్నిక చేసుకున్నవారికే దేవుడవును గదా.

అయితే అనేకులు ఈ విధముగా ముందుగా నిర్ణయింపబడుట, దైవిక ఎన్నిక అను పదమును అపార్థము చేసుకొని, యేసునందు విశ్వాసముంచిననూ ఎన్నిక చేయబడని యెడల మనము నశించిపోదుమని భావించుచున్నారు.

ఎఫెసీ 1:3-6లో ఈ విధముగా తెలియజేయుచున్నది‘‘మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తు నందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకనుగ్రహించెను. ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనుకనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు, తన చిత్త ప్రకారమైన దయాసంకల్పము చొప్పున, యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుకొని, మనము తన యెదుట పరిశుద్ధులమునునిర్దోషులమునై యుండవలెనని జగత్తు పునాది వేయబడకమునుపే, ప్రేమచేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను.’’

కనుక ఈ ముందస్తు నిర్ణయం మరియు దైవిక ఎన్నికలోని వేదాంతపరమైన సంకల్పమును మనము మార్చుకొనవలెను. కనుక మన ఈ పదముకు సరిగా అర్థము తెలుసుకొని మన నమ్మికను శక్తివంతము చేసుకొని నీరు మరియు ఆత్మ సంబంధమైన రక్షణ యందు విశ్వాసముంచవలెను.

రోమా పత్రిక మనకేమి బోధించుచున్నది? అనేకులైన వేదాంతులు‘‘ఈ షరతులు లేని దైవిక ఎన్నిక సిద్ధాంతమును’’ బోధించుచున్నారు. వేదాంతమే దేవుడా? వేదాంతము దేవుడు కాదు గదా.

జగత్తు పునాది వేయబడకమునుపే దేవుడు సకలమానవాళిని, ప్రభువైన యేసునందు ఏర్పరచుకొనెను.మనలనందరిని నీతిమంతులుగా తీర్పు తీర్చి రక్షించెను. యేసు మనలను ఏ షరతు లేకుండా ప్రేమించెను. ఆయన మనయందు తేడా చూపిన వాడు కాదు. అవిశ్వాసులు తమ సొంత ఆలోచనతో విశ్వాసముంచుదరు. అయితే విశ్వాసులు లిఖించబడిన వాక్యమునందు విశ్వసించెదరు.పాత నిబంధనలోని దైవిక ఎన్నిక


 • ఏ షరతులు లేని దైవిక ఎన్నిక నిజమా?
 • కాదు. దేవుడు అటువంటి సంకుచితమైన హృదయము కలవాడు కాడు. దేవుడు ప్రభువైన యేసులో పాపులందరిని రక్షించవలెనని ఏర్పరచుకున్నాడు. కేవలము కొందరిని కాదు.

ఆదికాండము 25:21-26 వచనములో మనము ఇస్సాకు యొక్క ఇరువురు కుమారులు ఏశావు మరియు యాకోబును గురించి ధ్యానించియున్నాము. ఇస్సాకు కుమారులు ఇరువురిలో యాకోబును దేవుడు తల్లి గర్భముననే ఏర్పరచుకొనెను.

ఈ వాక్యభాగమును అనేకులు, అపార్థము చేసుకొని ఈ షరతులు లేని దైవిక ఎన్నికయను సిద్ధాంతమును విశ్వసించెదరు.అటులయితే క్రైస్తవ్యములోనికి కర్మసిద్ధాంతమును తీసుకువచ్చుచున్నాము.

ప్రభువైన యేసునందు కాకుండా, దేవుడు మనలను ‘‘షరతులు లేని ఎన్నిక’’ విధానములో ఏర్పరచుకొనినట్లయితే, మనము విగ్రహారాధన సంబంధమైన కర్మ సిద్ధాంతమునకు సంబంధించిన దేవుని ఆరాధిస్తున్నామని అర్థం. కానీ మన దేవుడు ‘విధి’ లేక ‘కర్మ’కు సంబంధించిన దేవుడు కాడు. ఒకవేళ మనమటువంటి దేవుని విశ్వసిస్తున్నట్లయితే, మన యెడల దేవుడు కలిగియున్న ప్రణాళికను త్రోసి సైతాను వేసిన పన్నాగములో పాలుపంచుకున్నవారమగుదుము.

మానవులు దేవుని చిత్తమునకు విధేయులు కాకపోయిన యెడల వారు నశించు మృగమును పోలియున్నారు. విశ్వాసులమైన మనము మృగము వంటి వారము కాము. కనుక బైబిలులో తెలియజేయబడిన సత్యమును విశ్వసించి నిజమైన విశ్వాసులము కాగలము. వాక్యమును విశ్వసించిన యెడల మనంతట మనము సాతానుకు అప్పగించుకొనుచున్నాము.

నిజ విశ్వాసమేమనగా, బైబిలులో లిఖించబడిన సత్యమును గ్రహించి, యేసు నందు తిరిగి జన్మించు విశ్వాసమును పాటించవలెను.

కాల్విన్‌ మహాశయుడు సెలవిచ్చిన ‘‘కాల్వినిజం’’ మనల్ని అసంపూర్ణ విమోచనకు నడిపించును. అనగా దేవుని ప్రేమ మరియు విమోచనకు అందరూ అర్హులముకామని భావము. ఇది నిజమైయుండునా?

‘‘ఆయన మనుష్యులందరు రక్షణ పొంది, సత్యమును గూర్చిన అనుభవజ్ఞానము గలవారై యుండవలెనని యిచ్చయించుచున్నాడు.’’ అని బైబిలులో 1 తిమోతి 2:4లో తెలుపబడినది. ఒక వేళ విమోచనా ఆశీర్వాదము కేవలము కొందరికే లభించినయెడల అనేకమంది విశ్వాసులు యేసుని యందలి నమ్మకమును తిరస్కరించగలరు.అలాగైతే ఇటువంటి సంకుచిత మనస్తత్వము కలిగిన దేవుని విశ్వసించక యుండుటే మేలు.

మన దేవుడు అటువంటి సంకుచిత మనస్తత్వము కలిగినవాడు కాదు. గనుక ఆయన యందు నమ్మిక యుంచుదము. మన దేవుడు ప్రేమామయుడు, సత్యము కలిగినవాడు. న్యాయవంతుడు మనము యేసు నందు అటులనే ఈ తిరిగి జన్మించు అనుభవమును ఇవ్వగలిగిన నీరు మరియు ఆత్మ సంబంధమైన సువార్త నందు విశ్వాసముంచవలయును. దాని ద్వారా మన సమస్త పాపముల నుండి రక్షణ పొందగలము. నీరు మరియు ఆత్మ ద్వారా తిరిగి జన్మించిన వారందరికీ యేసు`ప్రభువై యున్నాడు.

కాల్విన్‌ మహాశయుని సిద్ధాంతము ప్రకారము పదిమంది వున్న యెడల వారిలో కొందరు రక్షించబడుదురు. మిగిలిన వారు నరకాగ్నికి పాత్రులగదురు. ఇది అబద్ధమైన విషయము.

దేవుడు కొందరిని ప్రేమించి, మరి కొందరిని త్రోసివేయుననుటలో అర్థమే లేదు. దేవుడు ఇప్పుడు మనతో వున్నాడని ఊహించుకొనండి. మనలో తన కుడి ప్రక్కన వున్నవారిని పరలోకమునకు, ఎడమవైపున వున్నవారిని నరకమునకు పంపినచో ఆయన దేవుడెట్లగును?

ఆయన చేత విడిచి పెట్టబడిన వారు దేవునికి వ్యతిరేకముగా మాటలాడరా? ‘‘ దేవుడు ఇంతటి అన్యాయస్తుడా’’అని అరచెదరు గదా? షరతులు లేని ఎన్నిక అనునది నిజము కాదు. దేవుడు క్రీస్తుయేసులో సమస్త మానవులను ఏర్పరచుకొనెను.

కనుక క్రీస్తు యేసు పేరట పిలువబడిన ప్రతివారూ ఎన్నుకొనబడిన వారే. దేవుడు ఎవరిని తన యొద్దకు పిలుచును? ఆయన పాపులను పిలువవచ్చెను కానీ నీతిమంతులను పిలువరాలేదు. తమను తాము నీతిమంతులుగా భావించుకున్నవారిని దేవుడు పిలువడు.

దేవుని విమోచనాత్మకమైన ఆశీర్వాదము పాపులకొరకే మరియు నశించిపోవుచున్న వారి కొరకే. ఎన్నిక అనగా పాపులను దేవుడు పిలిచి వారిని తన నీతి కుమారులుగా చేయును.దేవుడు నీతిమంతుడు


 • దేవుడు కేవలము కొంత మందిని ఏర్పరచుకున్నవారినే పిలుచునా?
 • లేదు. దేవుడంతటి సంకుచిత మనస్తత్వము కలవాడు కాడు. దేవుడు నీతిమంతుడు, న్యాయాధిపతి.

దేవుడు నీతిమంతుడు. కేవలము ఏ షరతులు లేక ఎన్నిక చేయబడిన వారిని పిలుచు దేవుడు కాడు. యేసుక్రీస్తు పేరిట పాపులందరిని ఆయన పిలుచుచున్నాడు. యేసుక్రీస్తు ద్వారా లభించు విమోచనాత్మకమైన రక్షణ మరియు పాపక్షమాపణ లేకుండా దేవుని ప్రేమను, రక్షణను ఎట్లు గుర్తించగలము? ఎన్నడూ దేవుని అన్యాయస్తుని చేయవద్దు.

ఎఫెసీ 1:3-6 వరకు ధ్యానించునప్పుడు ‘‘అక్కడ లోపించిన పదమును గ్రహించవలెను.‘‘మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక.ఆయన క్రీస్తు నందు పరలోక విషయములలో ఆత్మసంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకనుగ్రహించెను. ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు, తన చిత్త ప్రకారమైన దయాసంకల్పముచొప్పున, యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుకొని, మనము తన యెదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై యుండవలెనని జగత్తు పునాది వేయబడకమునుపే, ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను.’’ ఇక్కడ ‘‘క్రీస్తులో’’ అన్న పదమును గ్రహించవలెను.

కాల్విన్‌ మహాశయుడు సెలవిచ్చినట్లు షరతులు లేని ఎన్నిక అను విషయము బైబిలు వాక్యములకు సరిపోదు.‘‘జగత్తుపునాది వేయబడకమునుపే ప్రేమచేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను.’’ అని బైబిలు సెలవిచ్చుచున్నది.

దేవుడు క్రీస్తు యేసులో మనందరము నీరు మరియు ఆత్మ సంబంధమైన సువార్తద్వారా తిరిగి జన్మించవలయునని, మనలను ఎన్నుకొనెను. ఏ మాత్రము ఆశలేని జన్మపాపి కూడా పాపము నుండి విడిపింపబడి దేవుని పిల్లలగుటకు ఆయన అనుగ్రహించెను. ఆయన సకల మానవులు రక్షింపబడుటకు క్రీస్తు యేసు నందు మనలను ఏర్పరచుకొనెను.

ఈ షరతులు లేని దైవిక ఎన్నిక విషయంలో అనేకమంది వేదాంతులు. కొందరే ఏర్పాటు చేయబడిరి అని తెలియజెప్పుదురు. ఈ విధముగా ఒక దానికొకటి సంబంధము లేని వేదాంతము వలన అనేకమంది ప్రజల పరిస్థితి అగమ్యగోచరముగా వుండెను. ఈ అబద్ధ వేదాంతులు దేవుడు ముందుగా నిర్ణయించుకొనిన ప్రకారము   కొందరినే ఏర్పరచుకొనుననియు, మిగిలిన వారిని త్రోసివేయునని తెలియజేసెదరు.   అయితే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పాపులైన వారినందరిని ఏర్పాటుచేసుకొనెనని వాక్యము ద్వారా గ్రహించవలెను. అనేకులు తమ మూఢనమ్మకాల సంబంధమైన విశ్వాసము వలన ఈ అసత్య వేదాంతమునకు దాసులగుదురు.

మేము అంగీకరించిన విషయం ఏమనగా, దేవుడు క్రీస్తుయేసునందు సకల మానవులను రక్షించి, యేసునందు విశ్వాసముంచిన వారి పాపము శుద్ధీకరించెను. ఆ విధముగా చేయుట ద్వారా మనము పాపము నుండి తప్పించబడుదుము. ఆయనయందు విశ్వాసముంచి, మనము దేవుని పిల్లలము కాగలము. నీతిమంతులుగా తీర్చబడెదము. నిత్యజీవమును కలిగియుందుము. అంతేకాక దేవుడు నీతిమంతుడన్న విషయములో నిశ్చయ ముంచుదుము.యాకోబు మరియు ఏశావు కథలో దైవిక ఎన్నిక


 • దేవుడు ముందుగా నిర్ణయించు కొనినవారినే ఏర్పరచుకొనునా?
 • లేదు. దేవుడు క్రీస్తుయేసునందు సమస్త మానవులను ఎన్నుకున్నాడు. యేసునందు విశ్వాసముంచి, హృదయములో పాపము లేకుండా వున్నవారే యెన్నుకొనబడును.

ఆది కాండము 25:19-28. ఇక్కడ ఏశావు యాకోబులు తల్లి గర్భమున నుండగానే ఒకరితో ఒకరు కలహించుకొనుట చూడగలము. దేవుడు ఆదికాండము 25:23లో చెప్పెను.‘‘రెండు జనములు నీ గర్భములో కలవు. రెండు జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును. ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై యుండును. పెద్దవాడు, చిన్నవానికి దాసుడగును.”

దైవిక ఎన్నిక లేక ముందుగానే నిర్ణయించుకొనుటలాంటి పదమును వేదాంతములోనికి పాపులైన వారు ప్రవేశపెట్టిరి. అనేకులు వారు ఏర్పరచుకొనబడితిరా! అన్న విషయంలో తికమకపడుచున్నారు. తామే ఎన్నిక చేయబడితిమని భావించిన యెడల నీరు మరియు ఆత్మ ద్వారా తిరిగి జన్మించిన అనుభవమును బట్టి అందరూ రక్షింపబడవలయును.

ఈ షరతులు లేని ఎన్నిక అను సిద్ధాంతము అనేకులను యేసుక్రీస్తు అనుగ్రహించిన విమోచన నుండి తప్పించి, నరకమునకు నడిపించెను. అందునుబట్టి దేవుడు అన్యాయస్తుడా?

అనేకమంది వేదాంతులు, తమ సొంత ఆలోచనానుసారమైన అబద్ధ సిద్ధాంతమును రూపొందించిరి. వాటి వలన అనేకమంది యేసునందు విశ్వాసముంచకుండా, తాము ఎన్నుకొనబడ్డామా లేక వారి విమోచన ముందుగా నిర్ణయింపబడినదా లేదా అన్న ఆలోచనకు గురి అగుదురు.

యాకోబు మరియు ఏశావులలో ఎవరు దేవుని చేత ఎన్నుకొనబడిరి. ఆయన యేసుక్రీస్తు నందు యాకోబును నిర్ణయించుకొనెను. రోమా 9:10-11 ప్రకారము దేవుడు ఏశావును కాక యాకోబును పిలిచెనని తెలియపరచబడినది. వారింకను జన్మించలేదు.    వారిరువురూ ఒక తండ్రిబిడ్డలే, వారింకనూ మంచి గాని లేక చెడుగాని చేసియుండలేదు.

దేవుని ఉద్దేశ్యము ప్రకారము ఇక్కడ యాకోబు ఎన్నుకొనబడెను. యాకోబు చేయు మంచి పనుల నిమిత్తము కాదు, దేవుడు యాకోబును ఏర్పాటు చేసుకొనినది. బైబిలు ఈ విషయంలో మాట్లాడుచూ, యేసు కేవలము పాపులను పిలువ వచ్చెననియు, నీతిమంతులుగా జీవించు వారిని కాదనియు తెలియపరచెను.

ఆదాము వారసులందరు పాపులుగానే జన్మించిరి. నేను నా తల్లి గర్భమున ఉన్నప్పుడే పాపిననియు, దోషములోనే జన్మించితిననియు, దావీదు తెలియజేసెను.‘‘ నేను పాపములో పుట్టినవాడను పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను’’ (కీర్తన 51:5).

ఇంకనూ పాపము చేయని ఒక చిన్నబిడ్డ కూడా, ఆ బిడ్డలో వున్న పాపపు బీజమును బట్టి, పాపిగానే పరిగణింపబడును. ఆ బిడ్డ హృదయములోనే చెడు తలంపు, వ్యభిచారము, హత్య మొదలగు భావము కలిగి జన్మించును. తన పూర్వీకుల పాపములు తనలో కలిగియుండును. ప్రతి వ్యక్తి ఇంకా జన్మించక పూర్వమే పాపియైయున్నాడు.

మనము అసంపూర్ణులుగా ఎందుకు ఉంచబడ్డామో తెలుసుకొనవలయును. సమస్త మానవాళి దేవుని సృష్టియై యున్నది. మనలను పాపము నుండి రక్షించి, తన బిడ్డలుగా చేసుకొనవలయునన్నదే. దేవుని ప్రణాళిక. అందుకే ఆదాము పాపము చేసెను.

దాని ఫలితముగా మనందరము పాపులమైతిమి. దేవుడు తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకమునకు పంపి, ఆయన స్వీకరించిన బాప్తిస్మము ద్వారా సకల మానవుల పాపములను ఆయన తొలగించెను.

యేసుక్రీస్తు పొందిన నీటిబాప్తిస్మము మరియు సిలువలో కార్చిన రక్తము వలన సకల మానవాళిని విమోచించుటే దేవుని ఉద్దేశ్యమైయున్నది. అందువలన ఆయన యందు విశ్వాసముంచిన మనము దేవుని పిల్లలగుటకు శక్తి అనుగ్రహింపబడినది. క్రీస్తులో సకల పాపములు పరిహరింపబడునట్లు ఆదాము పాపము చేసెను.

తప్పుడు సిద్ధాంతములు ప్రకటించు పాపులు ‘‘యాకోబు మరియు ఏశావులను చూడండి, ఆయన ఒకరిని విడిచి మరొకరిని బేషరతుగా ఎన్నుకొనెను’’. అని చెప్పుదరు. దేవుడు మనలను బేషరతుగా అంగీకరించలేదు. మనలను యేసుక్రీస్తులో ఏర్పరచుకొనెను. మనము లిఖించబడిన జీవవాక్యమును ధ్యానించవలెను. రోమా 9:10-12లో ఈ విధముగా తెలియపరచబడెను. ‘‘రిబ్కా మన తండ్రియైన ఇస్సాకు అను ఒకని వలన గర్భవతియైనప్పుడు, ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము, క్రియల మూలముగా కాక పిలుచువాని మూలముగానే నిలకడగా ఉండు నిమిత్తము, పిల్లలింక పుట్టి మేలైనను కీడైనను చేయక ముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని ఆమెతో చెప్పబడును.’’

దేవుడు యాకోబును, యేసునందు ఏర్పాటు చేసికొనెను. యాకోబు పాపులకు ప్రతినిధియై యున్నాడు. ఏశావు తామే నీతిమంతులమని తీర్మానించుకొను వారికి సూచనయై యున్నాడు. ఎఫెసీ 1:4లో దేవుడాయనను ఏర్పాటు చేసుకున్నాడని చెప్పబడెను.

దేవుడెవరిని పిలుచును? యాకోబు తాను పాపినని, దేవుని యెదుట అనీతిమంతుడననియు, గ్రహించి దేవునిపై ఆధారపడ్డవ్యక్తి గనుకనే ఆయన యాకోబును పిలిచెను. దేవుడు యాకోబును తన కుమారుడైన యేసునందు నీరు మరియు రక్తము వలననైన సువార్త ద్వారా పిలిచి, తన ప్రజలుగా చేసికొనెను. కనుకనే దేవుడు యాకోబును పిలిచి విమోచనతో ఆశీర్వదించెను.

దేవుడు ప్రభువైన యేసు ద్వారా విమోచించి, నీతిమంతులుగా తీర్చుటకు పాపులను పిలిచెను. అదే దేవుని ప్రణాళిక.షరతులు లేని ఎన్నిక సిద్ధాంతములో తప్పులు 


 • దేవుడు యాకోబునెందులకు ప్రేమించెను?
 • యాకోబునకు తాను నీతిమంతుడను కానని తెలుసు గనుక.

ఈ మధ్య  నేను బేషరతుగా లభించు దైవిక ఎన్నిక ఇతి వృత్తంగా గల ఒక పుస్తకం చదివాను. ఒక యవ్వనస్తుడికి ఒక కలవస్తుంది. ఒక వృద్ధురాలు కలలో ఆ యవ్వనస్తునికి కనిపించి ఒక ప్రదేశానికి రావలసినదిగా చెబుతుంది. వెంటనే ఆ యవ్వనస్తుడు అక్కడికి వెళతాడు.నీవు దేవుని చేత ఎన్నుకొనబడ్డావని అక్కడ ఆ వృద్ధురాలు ఆ యవ్వనస్తునితో చెప్పును.

నేను దేవుని ఉనికినే నమ్మను, అటువంటప్పుడు నన్ను దేవుడు ఏర్పరచుకొనుట ఎలా తటస్థించిందని ఆ యవ్వనస్తుడు ప్రశ్నిస్తాడు. నీవు అవిశ్వాసివైనను దేవుడు నిన్ను బేషరతుగా ఎన్నుకున్నాడని ఆ స్త్రీ ఆ యవ్వనస్తునితో చెప్పింది.

ఇది సత్యదూరమైన విషయం. దేవుడు కొందరిని నరకమునకు, మరికొందరిని రక్షణకు ముందుగానే ఎలా ఎంచుకొనగలడు? దేవుడు యేసునందు అందరినీ ఏర్పరచుకొనెను.

యేసు లేకుండా జరిగే ఏ ఏర్పాటైనను, పిలుపైనను ఎంత వేదాంతపరముగా జరిగినను అది అసత్యమే. అయితే అనేక వేదాంతులు, దేవుడు మనలో కొందరినే ఏర్పరుచుకున్నాడని చెబుతుంటారు. ఇది సత్యదూరమే. ప్రభువైన క్రీస్తు నందు అందరినీ రక్షించాలనే దేవుని అభిమతం. కేవలము యేసుక్రీస్తు అందించిన విమోచనాత్మకమైన నీరు మరియు ఆత్మ నందు విశ్వాసముంచిన వారే రక్షింపబడరు.

దేవుడు, తన కుమారుడైన యేసునందు సమస్త మానవులను రక్షించుటకే ముందుగా నిర్ణయించుకొనెను.జగదుత్పత్తికి ముందుగానే మనలను ఆయన పిల్లలుగా చేసుకోవాలని దేవుని ఆశయం. యేసుక్రీస్తు వారు అనుగ్రహించిన విమోచనను సకల మానవులకు అందించాలనేదే, దేవుని ప్రణాళిక. బైబిలులో లిఖించబడిన సత్యమిదియే.

యేసునందు తిరిగి జన్మించి నీతిమంతులైన వారే ఎన్నుకొనబడిన వారు. అయితే దేవుడు మనలో కొందరినే ఏర్పరచుకొనునని కొందరు వేదాంతుల వ్యాఖ్యానం. ఉదాహరణకు బౌద్ధ భిక్షువులను దేవుడు ఏర్పరచుకొనలేదని వారు చెబుతారు. అయితే దేవుడు ప్రభువైన యేసుద్వారా వారికిని రక్షణను అనుగ్రహించును.

దేవుడు యేసు లేకుండా, బేషరతుగా అనేకులను ఏర్పరచుకుంటే, ఈ సువార్తే ప్రకటించనవసరము లేదు గదా. యేసు లేకుండా, దేవుడు కొందరిని ముందుగానే ఎన్నిక చేసుకుంటే, పాపులైనవారికి యేసుక్రీస్తు యొక్క అవసరమే ఉండదు గదా. వాక్యం ఏ విధంగా నిరూపించబడుతుంది?

దైవ సేవకులకు ఈ లోకములో సువార్త ప్రకటించుటకు ఇంకా కారణమేమైనా కలదా? యేసు లేకుండా దేవుడు కొందరిని రక్షణకు, మరికొందరిని నాశనమునకు ఏర్పరచుకొనుటలో అర్థమే లేదు.

యాకోబును యేసునందు ఏర్పాటు చేసుకొనుటకును, ఏశావును దూరపరచుటకు అసలైన కారణమేమంటే, వారు జన్మించుటకు ముందుగానే యాకోబు యేసునందు విశ్వాసముంచుననియు, ఏశావు విశ్వాసముంచడనియు దేవుడు యెరిగియున్నాడు.

ఈ లోకములో అనేకమంది పాపులు యేసునందు విశ్వాసముంచుదురు. కొందరు అందులో యాకోబు, కొందరు ఏశావు ఉండియున్నారు.

దేవుడసలు యాకోబును ఎందుకు ప్రేమించెను? యాకోబు తాను నీతిమంతుడు కాననియు, దేవుని కృపకు పాత్రుడగుటకు అర్హత లేదనియు యెరుగును. అందుకే తాను ఒక పాపినని యెరిగి, యాకోబు దేవుని కృపను అర్ధించెను. అందును బట్టి యాకోబును దేవుడు రక్షించెను. 

అయితే ఏశావు దేవునిపై కాక, స్వశక్తిపై ఆధారపడ్డాడు. దేవుని కృపకై ఏ మాత్రము ఎదురు చూసినవాడు కాదు. అందుకే నేను యాకోబును ప్రేమించుచున్నానని, ఏశావును ద్వేషించుచున్నానని దేవుడు తెలిపెను. ఇది నిజమైన దైవవాక్యము.

దేవుడు మనలనందరిని యేసుక్రీస్తు నందు రక్షణ కొరకై ఏర్పరచుకొనెను. పాపులందరి కర్తవ్యం యేసునందు విశ్వసించుటయే. అప్పుడే దేవుని సత్యము మరియు నీతి మన హృదయములో ప్రతిష్టించబడును. మనమందరము హృదయములో యేసుక్రీస్తు అనుగ్రహించు రక్షణను విశ్వసించవలెను. యేసు ద్వారా లభించు విమోచనయందు మనము విశ్వసించవలెను.అంచెలంచెలుగా పవిత్రీకరణ అనేది తప్పుడు సిద్ధాంతం 

  

 • ఒకపాపి అంచెలంచెలుగా పరిశుద్ధుడగుటకు అవకాశమున్నదా?
 • లేదు. అది అసాధ్యము. యేసుపొందిన బాప్తిస్మము మరియు సిలువ మరణము ద్వారా దేవుడు పాపులనందరిని ఒక్కసారిగా విమోచించి నీతిమంతులుగా తీర్చెను.

ఈ అంచెలంచెల పరిశుద్ధతా సిద్ధాంతము ద్వారా సైతాను పాపులను మోసము చేయును. కనుక పాపులు తమ పాపము నుండి విడిపింపబడకుండా వుండునట్లు చేయును. ఈ అంచెలంచెల పరిశుద్ధత అనగా పాపులు యేసునందు విశ్వాసముంచటం ప్రారంభించిన తరువాత క్రమేణా రక్షింపబడుదురు అని భావము.

పాపులు ఒక్కసారే రక్షింపబడు మార్గమేదియును లేదు. యేసునందు విశ్వాసముంచగానే పాపులు తమ పాపముల నుండి రక్షింపబడుదురు. ఆ తరువాత వారి అనుదిన ప్రార్థనలు, పాపపు ఒప్పుకోలు వలన క్రమేణా శుద్ధీకరింపబడుదురు అన్నదే ఈ సిద్ధాంతము.

ఈ సిద్ధాంతములో ముఖ్యమైన విషయం అంచెలంచెలగా లభించు పరిశుద్ధత. ఒక వ్యక్తి యేసును నమ్మిన తరువాత కాలక్రమేణా పరిశుద్ధీకరింపబడి మంచి క్రైస్తవుడు కాగలడన్నదే ఈ సిద్ధాంత ముఖ్య లక్ష్యం. అనేక సంవత్సరాలుగా వారికి ఒక నిశ్చయతను ఇచ్చి ఈ సిద్ధాంతము క్రైస్తవులను మోసగిస్తున్నది. కనుకనే ఈనాటి   క్రైస్తవ్యములో ‘నీ కంటే నేను పరిశుద్ధుడను’ అనువారు అనేకులు కనిపించుచున్నారు. 

ఒకానొకరోజు వారు ఆకస్మాత్తుగా మార్చబడి పాపమిక చేయక ఉందురని వారి ఆలోచనా విధానము. అయితే ఆ రోజు యెరుగకనే వారు పాపులుగానే జీవించి, పాపులుగానే తీర్పు పొందుదురు.

బైబిలులోని సత్యవాక్యాన్ని ధ్యానిద్దాము. రోమా 8:30 ఈలాగు సెలవిస్తుంది.‘‘ మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను; ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను; ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను.’’

29వ వచనములో ఈలాగున్నది‘‘ఎందుకనగా తన కుమారుడు అనేక    సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు సారూప్యము దేవుడెవరిని ముందు ఎరిగెనో, వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను.’’     మొదటిసారి వాక్యమును చదివినప్పుడు నీతిమంతులగుటకు అనేక అంచెలున్నవని అనిపిస్తుంది. అయితే వాక్యం లోతుగా ధ్యానిస్తే, నీతి అనునది ఒక్కసారి అనుగ్రహింపబడునని సులభంగా గ్రహించగలము. 

‘ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్పుతీర్చెను.’’ యేసు యొర్దానులో పొందిన బాప్తిస్మము ద్వారా మరియు సిలువ మరణము ద్వారా పాపులను పిలిచి, నీతిమంతులుగా చేసెను.

కనుక యేసు అనుగ్రహించిన ఈ విమోచనయందు విశ్వసించిన వారు దేవుని మహిమగల పిల్లలుగా మార్చబడుదురు. పాపులను విమోచించి, వారిని యేసు నామములో మహిమపరచుట ఆయన కృప మాత్రమైయున్నది. 

ఇదే దేవుడు మనకు ఉపదేశించినది. అనేకులు రోమా 8:30 చదవమని చెబుతారు. పరిశుద్ధపడుటకు అంచెలున్నవని సెలవిస్తారు. అంటే మనం క్రమేణా మార్పునకు గురి కావలెయునా? వారి ఇలా చెప్పి మనలను మోసగిస్తారు. భవిష్యత్తు లో పాపులు క్రమేణా, కాలానుగుణంగా పరిశుద్ధులుగా కాగలరన్నదే వారి విపరీత బోధ.

అయితే బైబిలు మనకు భవిష్యత్‌ విషయం ఇక్కడ సెలవిచ్చుటలేదు. భూతకాలంలో మనకీ వాక్యపు అర్ధాన్ని తెలియజేస్తున్నది. మనము యేసునందు సంపూర్ణముగా విశ్వసించగానే నీతిమంతులంకాగలము. భవిష్యత్తులో జరుగబోయే దానికి, భూతకాలంలో జరిగినదానికి ఎంతో తేడా కలదు.

మనము సత్యవాక్యమును విశ్వసించవలెను. వ్రాయబడిన వాక్యము ప్రకారము మనము ఒక్కసారిగా దేవుని పిల్లలుగా కాగలమన్నదే సత్యవాక్యం. ఇది అంచెలంచల పరిశుద్ధతకు విరుద్ధమైనది.

ఈ అంచెలంచెల పరిశుద్ధతా సిద్ధాంతమువలన, మనము యేసునందు విశ్వాసముంచగానే మనము మూల పాపము నుండి తొలగించబడుచున్నామని తెలియవచ్చుచున్నది. అనగా మనము మత విషయముగా జీవించి, అనుదినము మన పాపము నిమిత్తమై పశ్చాత్తాపము చెంది ప్రార్థించవలయును, క్రమేణా, ఒకానొక రోజు మనము దేవుని సన్నిధిలో కూడినప్పుడు మనము నీతిమంతులుగా మార్పు చెందగలమన్నదే ఈ సిద్ధాంతము.

అనేకులు ఈ సిద్ధాంతము నందు విశ్వాసముంచుచున్నందున వారు యేసునందు విశ్వాసముంచుట ప్రారంభించిన ఇంకను పాపులుగానే మిగిలియున్నారు. అందువలన క్రమక్రమముగా శుద్ధీకరించబడుట అనునది వాక్యానుసారము కాదు.

బైబిల్‌ స్పష్టముగా విశ్వాసముచేత మనము నీతిమంతులముగాను మరియు దేవుని కుమారులగుదుమని చెప్పుచున్నది. శిశువులు ఏ విధముగా ఈ లోకములో జన్మించుచున్నారో అదే విధముగా దేవుని పిల్లలు కూడా యేసు విమోచనమునందు విశ్వాసముంచిన వెంటనే శుద్ధీకరించబడుదురు. క్రమక్రమముగా శుద్ధీకరించబడు తప్పు సిద్ధాంతo అనేది అబద్ధముల నుండి ఉబికినది.సమస్త పాపముల నుండి లభించు సంపూర్ణ విడుదల


 • సంపూర్ణముగా శుద్ధీకరించబడుటకు మనమేమి చేయవలెను?
 • ఈ నీరు మరియు ఆత్మ వలన సిద్ధించు విమోచనయందు ధృడ విశ్వాసము కలిగియుండవలెను.

రోమా 8:1-2లో ఈ విధముగా తెలుపబడినది.‘‘కాబట్టి యిప్పుడు క్రీస్తుయేసు నందున్న వారికి ఏ శిక్షావిధియు లేదు. క్రీస్తుయేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాపమరణము నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలక పోయెనో దానిని దేవుడు చేసెను’’. పాప నియము ధర్మశాస్త్రము నుండి విడుదల చేసి దేవుడు పాపులనందరిని నీతిమంతులుగా తీర్చెను అనునది దీనిలోని సత్యమైన భావము.

హెబ్రీ 9:12లో సంపూర్ణ విమోచన గురించి ఉదాహరింపబడియున్నది. “మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక, తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను.”అనగాయేసునందు విశ్వాసముంచిన మనము విమోచింపబడి పరలోకములోనికి ప్రవేశించగలము. 

నీరు మరియు ఆత్మ విమోచనా సువార్తను విని యేసుక్రీస్తునందు మన పాపములన్నీ క్షమించబడినవని విశ్వసించియున్నాము. కేవలము మూలపాపము మాత్రమే క్షమించబడినవని విశ్వసించు పాపాత్ములు నిజముగా రక్షించబడలేరు. యేసునందు విశ్వసించిన తరువాత పానముల నిమిత్తము శుద్ధీకరించబడవలెనని తీర్మానించుకుంటారు, వారు ప్రతిదినము పశ్చాత్తాపపడాలని భావిస్తారు.

తప్పుగా నడిపించబడిన వారి విశ్వాసము వారిని నరకమునకు నడిపిస్తుంది. పొరపాట్లతో కూడిన వారి విశ్వాసములు వారి దోషములనుండి స్వతంత్రులగుటకు వారు ప్రతిదినము పశ్చాత్తాపపడునట్లు చేస్తాయి.  మనలను నరకమునుండి రక్షించు నిజమైన విశ్వాసము ఇదికాదు.

ఒకేసారి శాశ్వతముగా విమోచింపబడియున్నామని, యేసునందు విశ్వాసముంచిన యెడల వారు నీతిమంతులై దేవుని బిడ్డలై యుండేవారు. నిజమైన విమోచన విశ్వాసులను నీతిమంతులుగాను అంతయు సమూలముగా ఒకేసారి దేవుని బిడ్డలుగా రూపాంతరము కలిగిస్తుంది

విశ్వాసులు లోక పాపములనుండి విడుదల పొందినప్పటికీ, వారు మరణించేంత వరకు వారి శరీరములు మార్పు చెందవు. అయితే వారి హృదయములు దేవుని నీతిలో ముంచబడివుంటాయి. ఈ వాస్తవమును మనమెన్నడును అపార్ధము చేసుకొనకూడదు.

సువార్తను హృదయపూర్వకముగా విశ్వసించగానే మనము నీతిమంతులమై, పరిశుద్ధులుగా మార్పు చెందుదుమని సత్యగ్రంథము తెలియజేయుచున్నది. 

హెబ్రీ 10:9-14 వరకు ధ్యానిద్దాం.‘‘ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చియున్నానని చెప్పుచున్నాడు. ఇవన్నియు ధర్మశాస్త్రము చొప్పున అర్పింపబడుచున్నవి. ఆ రెండువ దానిని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేయుచున్నాడు. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడియున్నాము. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవచేయుచు, పాపములను ఎన్నటికిని తీసివేయలేని ఆ బలులనే మాటిమాటికి అర్పించుచు ఉండును. ఆయనయైతే పాపము నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి, అప్పటి నుండి తన శత్రువు తన పాదములకు పాదపీఠముగా చేయబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడాయెను. ఒక్క అర్పణచేత ఈయన పరిశుద్ధపరచబడువారిని సదాకాలమునకు సంపూర్ణులనుగా చేసియున్నాడు.’’

“యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడియున్నాము.’’ఈ వాక్యము వర్తమాన కాలములో వ్రాయబడి ఉన్నది గానీ, భవిష్యత్‌ కాలములో కాదని వ్యాకరణ పరముగా గుర్తించవలయును.

యేసు మనకనుగ్రహించిన నీరు మరియు ఆత్మవలననైన విమోచనను అంగీకరించి మనము సంపూర్ణులముగా పరిశుద్ధపరచబడవలెను.నిత్యవిమోచనను యేసు ఒక్కసారిగా అందరికి అనుగ్రహించెను.


 • ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుట మనిషికి ఎలాంటి అర్హత ఉంది? 1 థెస్స 5:16)
 • యేసు మన పాపములనన్నియు తొలగించెను గనుక, మానవులు దేవుని యెదుట విధేయత కలిగి ఆయన కృపకై కృతజ్ఞతతో జీవించవలెను.

ఈ నిత్య విమోచనయందు విశ్వాసముంచిన యెడల మనము ఒక్కసారిగా పరిశుద్ధపరచబడితిమని విశ్వసించవలయును. బైబిలు ఈ విధంగా చెబుతుంది. ‘’ఎల్లప్పుడు సంతోషముగా ఉండుడి;యెడతెగక ప్రార్థన చేయుడి; ప్రతివిషయము నందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి’’ (1 థెస్స 5:16-18).

ఎల్లప్పుడూ ఆనందించుడి. మనమెల్లప్పుడు ఏలాగు ఆనందించగలము? ఒక్కసారిగా నిత్య విమోచన లభించిన వారు ఎల్లప్పుడూ, ఎడతెగక ఆనందించగలరు. యేసు యొర్దానులో వారి పాపమును స్వీకరించెనన్న జ్ఞానము చేత, వారు పాపవిముక్తులైతిరి గనుక వారు భద్రపరచబడియున్నామని తెలిసి సంతోషించవలయును. వారు దేవుని సన్నిధిలో విధేయులై, ఆయన కృపకు కృతజ్ఞత కలిగి ఎడతెగక ఆనందించవలయును.

‘’తన అతిక్రమముకు పరిహారము నొందినవాడు తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడుధన్యుడు’’(రోమా 4:7).మన పాపములు హృదయములో ఇంకను నిలచియున్ననూ, అవి కప్పబడినవని ఈ వచనము యొక్క భావము కాదు. మన హృదయం సంపూర్ణముగా శుద్ధీకరింపబడియున్నది. యేసు మన పాపములను సంపూర్ణముగా శుద్ధీకరించి మనలను శాశ్వతంగా రక్షించెను.

  నూతన నిబంధనలో ఈ సత్యవిమోచన తెలియపరచబడినది.యేసు బాప్తిస్మము  పొందు సమయమున ఈలాగు సెలవిచ్చెను.‘‘యేసు`ఇప్పటికి కానిమ్ము; నీతి యావత్తు ఈలాగు నెరవేర్చుట మనకు తగియున్నదని అతనికి ఉత్తరమిచ్చెను’’ (మత్తయి 3:15).

పాత నిబంధనలో హస్తనిక్షేపణ ద్వారా ఏ విధముగా గొఱ్ఱె లేక మేకలు ప్రజల పాపమును ఏలాగు తొలగించెనో, యేసు ఈ లోకపాపమంతయు తనపై మోపుకొని, మానవాళిని సరైన విధానములో పరిశుద్ధపరచెను.

‘‘ఈలాగు నెరవేర్చుట మనకు తగియున్నది’’ అని యేసు ఉత్తరమిచ్చెను యేసు సరైన విధానములో బాప్తిస్మము పొంది,మానవుల పాపములు తానే తొలగించి మనకు సరైన మార్గము ఏర్పరచెను.

మత్తయి 3:15లో లిఖించబడిన ప్రకారము యేసు ఈ లోకపాపమంతయు తొలగించెను. అందువలన దేవుని నీతి నెరవేర్చబడినది. ఈ నిత్యవిమోచనను అర్థము చేసుకొనుటకు ఎంతో ఆలోచించవసిన అవసరత లేదు. ఆయన చెప్పిన మాట తూచా తప్పక స్వీకరించి,నడుచుకొని విమోచన పొందవలెను.‘‘తనఅతిక్రమముకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు’’ (కీర్తన 32:1).

యొర్దాను నదిలో బాప్తీస్మం మిచ్చు యోహాను ద్వారా బాప్తిస్మము పొందగానే యేసు మన శారీరక, హృదయ పాపమును శుద్ధీకరించాడు. ఈ భయంకరమైన పాపభూయిష్టమైన లోకములో మన పాపము నిమిత్తమై యేసు సిలువలో తీర్పుకు లోనాయెను. మన పాపములన్నియు స్వీకరించి యేసు వాటి నిమిత్తమై సిలువలో మరణించెను.

ఈ పాప విమోచనా వాక్యం నుందు విశ్వాసముంచిన ప్రతివారూ, ఏ లోపము లేక ఒక్కసారే విమోచింపబడుదురు. యేసు నిత్యత్వంలో నివసిస్తున్నాడు. గనుక ఈ విమోచన యందు విశ్వాసముంచిన వారు, క్రీస్తు నందు నీతిమంతులు కాగలరు.

ఇప్పుడు మనము దేవుని యెదుట ధైర్యముగా నిలబడగలము.‘‘దేవా, మీ అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచుచున్నాను.యేసుక్రీస్తు వారి వలే నేనూ మీ బిడ్డనైనాను. తండ్రీ మీకు కృతజ్ఞతలు. నన్ను మీ బిడ్డగా అంగీకరించినందుకు మీకు వందనస్తుడను. ఇది నా క్రియను బట్టి సాధ్యపడలేదు. ప్రభువైన యేసు అనుగ్రహించిన నీరు మరియు ఆత్మ సంబంధమైన విమోచన ద్వారా సాధ్యపడినది.’’        మీరు నన్నుఈ లోకపపాములన్నిటి నుండి రక్షించారు.మీరు చెప్పిన వాక్యముయందు నేను విశ్వసిస్తున్నాను.‘‘నీతియావత్తు నెరవేర్చుట మనకు తగియున్నది’’(మత్తయి 3:15).యేసు పొందిన బాప్తిస్మo మరియు సిలువ మరణము ద్వారా నేను మీ బిడ్డగా మారియున్నాను. అందువలన నేను మీకు సర్వదాకృతజ్ఞుడను అని చెప్పవలసిన వారమైయున్నాము.

నీ పాపములన్నియు యేసునకు ఆపాదించి యున్నావా?నీ పాపములన్నియు ఆయన తొలగించి యున్నాడా? యేసుపొందిన బాప్తిస్మమునకు మరియు ఆయన పొందిన సిలువ మరణమునకు మనము కృతజ్ఞత కలిగి యుండవలెనని బైబిలు తెలియజేయుచున్నది. ఈ విశ్వాసమునకు లోబడి, పాపులు పరిశుద్ధులుగా మారగలరు.యేసుపొందిన బాప్తిస్మము మరియు విమోచనకు గల సంబంధము   

    

 • యేసుపొందిన బాప్తిస్మము మరియు విమోచనకు గల సంబంధమేమై యున్నది?
 • పాతనిబంధనలో హస్త నిక్షేపణము ద్వారా ప్రవచించిన విమోచనకు సాదృశ్యమే ఈ బాప్తిస్మము.

యేసునందు విశ్వాసముంచి, సంఘములో ప్రార్థించుచున్న ఒక పాపిని ఊహించుకుందాము.‘‘ఓ ప్రియమైనదేవా, గతవారం నేను చేసిన పాపములను మన్నించండి. గత 3 రోజుల పాపము విషయమై నన్ను విమోచించండి. ఓ ప్రభువా, ఈ దిన పాపము నిమిత్తమై నన్ను క్షమించండి. నేను యేసునందు విశ్వాసముంచుచున్నాను.’’ అని ప్రార్థన చేయును.

ఈ దిన పాపాల నిమిత్తమై మన్నింపు ఈ వ్యక్తికి దొరికినదని ఆశిద్దాము. అయితే ఆ తరువాత కూడా ఈ వ్యక్తి అనేక పాపాలు చేస్తుంటాడు కదా! మరలా పాపిగా మారతాడు.

యేసుదేవుని గొఱ్ఱెపిల్లగా ఈ లోకపాపమంతయు, తాను పొందిన బాప్తిస్మము ద్వారా స్వీకరించి, సిలువమరణం ద్వారా మనకు ప్రత్యామ్నాయముగా మరణించి మనలను విమోచించెను. కనుక విమోచింపబడుటకు పాపులు ఈ క్రింద విధముగా విశ్వసించవలయును. 

బాప్తీస్మం మిచ్చు యోహాను వలన బాప్తిస్మము పొంది ఈ లోక పాపమంతయు యేసు తానే స్వీకరించి దేవుని నీతిని నెరవేర్చును. ఈ లోకపాపమంతయు ఆ విధముగా పరిశుద్ధపరచబడెను. ఈ సత్యములో విశ్వాసముంచిన అందరు కూడా పరిశుద్ధపరచబడెను.ఈ సత్యములో విశ్వాసముంచిన వారందరూ విడుదల పొందుదురు. మత్తయి సువార్త 3:13-17లో వ్రాయబడినట్టు యేసు ‘‘ఇప్పటికి కానిమ్ము’’ అని బాప్తీస్మం మిచ్చు యోహాను చేత బాప్తిస్మం తీసుకున్నాడు మరియు విశ్వాసులందరికీ రక్షకుడయ్యాడు..

యేసు ఈ లోకపాపమంతయు ఒక్కసారిగా తొలగించెనని సత్యసువార్త వక్కాణిస్తున్నది. అయితే అబద్ధ సువార్తేమో మనము ప్రతిదినము విమోచింపబడాలని సెలవిస్తున్నది. మనము దేనియందు విశ్వాసముంచాలి? మనము ఒక్కసారిగా విమోచింపబడ్డామా లేక దినదినమూ విమోచింపబడాలా?

సిలువపై బాప్తిస్మం మరియు మరణం ద్వారా యేసు మనలను ఒక్కసారిగా విడిపించాడని నమ్మడం ద్వారా నిజమైన విముక్తి లభిస్తుందని వారు తెలుసుకోవాలి. మనం చేయాల్సిందల్లా దేవునికి కృతజ్ఞతలు చెప్పడం మరియు ఈ నిజమైన సువార్తను విశ్వసించడం. 

యేసు పొందిన బాప్తిస్మము మరియు సిలువ మరణము ద్వారా, మనము ఒక్కసారిగా విమోచించబడి యున్నామని వారు విశ్వసించవలయును. మనము ఈ సత్య సువార్తయందు విశ్వాసముంచి, దేవునికి కృతజ్ఞత కలిగి యుండవలెను. 

విశ్వాస విషయంలో తప్పిపోయిన వారు, మనము దీని వలన కేవలము మూల పాపమునుండియే తొలగింపబడియున్నామని చెప్పుదురు. మన అనుదిన పాపము నిమిత్తమై దినదినమూ, విమోచింపబడవలెనని చెప్పుదురు. అందునుబట్టి మనము క్రమేణా, అనగా అంచెలంచెలుగా నీతిమంతులము కాగలమని బోధించెదరు. ఇది తప్పుడు సిద్ధాంతము.

యేసు పొందిన బాప్తిస్మo మరియు సిలువ మరణము మనకు ఒక్కసారిగా పాప విమోచన కలిగించినవి. ఇది సత్యము. మన రక్షణ నిమిత్తమై బాప్తీస్మం మిచ్చు యోహాను ద్వారా బాప్తిస్మము పొంది, మన పాపములను ఆయనే వహియించి, వాటి నిమిత్తమే సిలువనందు మనకు ప్రత్యామ్నాయముగా మరణించి, మనకు ఒక్కసారిగా విడుదల, విమోచన అనుగ్రహించెను.

మనము ప్రతిసారి పాపము చేసి,‘‘దేవా క్షమించు’’ అని తెలియజేసినట్లయితే, అది దేవుని నీతిని నెరవేర్చదు. దేవుని న్యాయము పాపమునకు జీతము మరణము. దేవుడు నీతిమంతుడు, పరిశుద్ధుడైయున్నాడు.

‘‘దేవా నన్ను క్షమించండి, నా పాపమును పరిహరించండి’’అని పాపము చేసినప్పుడెల్లా చేసే ప్రార్థన దేవుని నీతిని నెరవేర్చదు.వారు పాపక్షమాపణ నిమిత్తమై చేసే ఈ ప్రార్థన కేవలం వారి మనస్సాక్షిని సంతోషపరచుటకేనని గ్రహించవలెను.   ప్రతిరోజూ పాపాలను చేస్తూ, ప్రతిసారి మన మనస్సాక్షిని ఒప్పించు నిమిత్తమై పాపక్షమాపణా ప్రార్థన చేయుట సమ్మతమా? కేవలము యేసుపొందిన బాప్తిస్మము మరియు సిలువమరణము యందు విశ్వాసముంచుటే విమోచనకు గల ఏకైక మార్గము. ఈ సత్యము మన హృదయములో విశ్వసించవలెను. దీని వలన మాత్రమే   దేవుని తీర్పునుండి మనము తప్పించబడగలము.

పాపము నుండి విడుదల నిమిత్తమై మరింత ధ్యానిద్దాము. హెబ్రీ పత్రిక 9:22లో ఈ విధముగా తెలుపబడినది.‘‘ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులు రక్తము చేత శుద్ధి చేయబడుననియు, రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగదనియు, సామాన్యముగా చెప్పవచ్చును.’’

దేవుని ధర్మశాస్త్రము ప్రకారము పాపములన్నియు రక్తము చేత శుద్ధిచేయబడవలెను. రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగదు. ఇది దేవుని న్యాయము. పాపమునకు జీతము చెల్లించకుండా, పాపక్షమాపణ సిద్దించదు. 

దేవుని ధర్మశాస్త్రము న్యాయమైనది. పాపులమైన మనలను విమోచించుటకు, యేసు బాప్తీస్మం మిచ్చు యోహానుచే బాప్తిస్మము స్వీకరించి సిలువపైన మరణించెను. తాను పొందిన బాప్తిస్మము ద్వారా మన అతిక్రమములన్నియు స్వీకరించి, మన పాపము కొరకైన జీతము చెల్లించుటకు సిలువపై తన స్వరక్తము చిందించెను. మన పాపముకు ఆయన జీతము చెల్లించెను.


 • విమోచన అందరికీ, ఒక్కసారిగా లభించినదా లేక అనుదినము లభించవలెనా?
 • ఒక్కసారిగా లభించినది. యేసుపొందిన బాప్తిస్మము ద్వారా లోకపాపమంతయు ఒక్కసారిగా తొలగింపబడినది.


మత్తయి 3:15లో, యేసు సరియైన విధానములో బాప్తిస్మము పొందగానే, దాని వలన మన పాపములన్నియు సంపూర్ణముగా శుద్ధీకరింపబడి, వాటి నిమిత్తము ఆయన సిలువ మరణము పొందెను.

రోజూ పాప క్షమాపణ అడుగుట అనగా ప్రతిరోజు ప్రభువైన యేసుక్రీస్తును బాప్తిస్మo తీసుకొని, ప్రతిరోజూ మరణించమని చెప్పుటయే. దేవుని న్యాయమైన ధర్మశాస్త్రమును అర్థము చేసుకొనవలయును. మన పాపము నుండి సంపూర్ణముగా విమోచించు నిమిత్తము, యేసు మరలా, మరలా మరణించనవసరము లేదు. 

మానవులు తాము చేసిన పాపముల నిమిత్తము అనుదినము రక్షించమని ప్రార్థించుట హాస్యాస్పదము. దేవుడు వారిని ‘‘దివాళాకోరులుగా’’ గుర్తించును.‘‘ఈ దివాళాకోరు జనాంగము! నా కుమారుడైన యేసును మరలా రెండవసారి బాప్తిస్మము తీసుకొనమని, మరలా సిలువనందు మరణించవలసినదిగా కోరుచున్నారు! వారు యేసు అనుగ్రహించిన విమోచనయందు విశ్వాసముంచుచూ, ఇంకను తమను తాము పాపులుగా పరిగణించుచున్నారు!నా నీతివంతమైన న్యాయమును వారి యెడల నెరవేర్చి, వారిని నరకాగ్నిలోనికి పంపించగలను. అద్వితీయ కుమారుడైన యేసును రెండుసార్లు మరణింపజేయుటకు మీరంగీకరించుచున్నారా? మీరు చేసిన పాపాలను బట్టి మరియొకసారి నా కుమారుని మరణమునకప్పగించ గోరుచున్నారు. ఈ లోకపాపమును పరిహరించుటకు నా కుమారుని ఒకసారి సిలువ మరణముకప్పగించి యున్నాను. మీ పాపమును మరలా, మరలా పరిహరించమని వేడుకొని నా కోపమును రగుల్పవద్దు. నీరు మరియు రక్తము వలననైన సువార్త ద్వారా లభించు సంపూర్ణ విమోచన యందు హృదయపూర్వకంగా విశ్వాసముంచండి.’’ 

పాపులు, ఈ విమోచనాత్మక సత్యసువార్త బోధించు సంఘమునకు వెళ్ళి, తప్పుడు విశ్వాసమున పరిత్యజించి, అబద్ధమును నిజ విశ్వాసము ద్వారా జయించి విమోచన పొందవలసినదిగా యేసు మిమ్ము పిలుచుచున్నాడు.

నీ హృదయములో విశ్వాసముంచి రక్షింపబడుటకు సరైన సమయమిప్పుడు ఆసన్నమాయెను. ఇప్పుడైనా నిజ విశ్వాసమును అంగీకరించుచున్నావా?విశ్వాసం యొక్క ఫలితం సత్యమందు కాక క్రియలలో ఉండవలెను


 • ఎందువలన అనేకమంది క్రైస్తవులు నిలకడగా విశ్వాస జీవితము జీవించలేరు?
 • వారు తమ క్రియల పైన ఆధారపడుదురు గనుక.

యేసునందు విశ్వాసముంచిననూ, ఇంకనూ విమోచింపబడకుండా పాపులుగా నిలచియున్న వారు కూడా తమ జీవితములో 3-5 సంవత్సరాలు వెలుగులో ప్రకాశిస్తారు. వారు ప్రారంభ దినాలలో విశ్వాసమునందు ఎంతో ఉత్సాహముతో కూడి యుందురు. అయితే రోజులు గడుస్తున్న కొద్దీ వారిలో విశ్వాసము సన్నగిల్లును. కేవలము నీ క్రియలను బట్టి యేసునందు విశ్వాసముంచిన యెడల, త్వరలో నీలో వున్న విశ్వాసము సన్నగిల్లి ఆరిపోవును. 

గుడ్డివారు చూడలేరు. కనుక వారు తమ ఇతర జ్ఞానేంద్రియములపై ఆధారపడి, అనుభవజ్ఞానము సంపాదించుకొందురు. వారిలో కన్నీరు ఉబికినప్పుడు, అది క్షమాపణకు గుర్తుగా భావింతురు. నిజమైన క్షమాపణా అనుభవము మనలో జనించే బవేద్రేకాలకు అతీతము. 

ఆధ్యాత్మికంగా గుడ్డివారైన వారు తాము కోల్పోయిన మొదటి ప్రేమను ఉత్సాహాన్ని తిరిగి సంపాదించుకొనుటకు ఉజ్జీవమహాసభలో ఎక్కువగా పాల్గొంటారు. కానీ వారిలో ఆ భావం తిరిగి జన్మించదు. పాపములకు క్షమాపణ సంపాదించుట దుర్లభము. ప్రారంభదినముల నుండి వారి విశ్వాసము సరిగా వున్న యెడల, రోజులు గడుస్తున్నకొద్దీ క్షమాపణా అనుభవముతో కూడిన కృప మరింత అధికముగా మనపై ప్రసరించి మన జీవితమును కాంతివంతముగా చేయును. 

నిజము కాని క్షమాపణా అనుభవం ప్రారంభదినాల్లో మనలను వెలుగుతో నింపుతుంది. కాలం గడిచేకొద్దీ దానిలోని మెరుపు తగ్గిపోతుంది. ఉత్సాహభరితమైన ప్రకాశం త్వరలో అదృశ్యమవుతుంది. ఆధ్యాత్మికంగా గుడ్డివారైన వారి జీవితాలలో ప్రారంభం నుంచి సత్యసువార్తపై విశ్వాసం ఉండదు. 

వేషధారులైన శాస్త్రులు, పరిసయ్యులు వంటివారు బైబిలు గ్రంధాలను తమ చేతపట్టుకొని సంచరిస్తారు. ప్రభువు ప్రార్థన మరియు అపొస్తలుల విశ్వాసాన్ని జ్ఞాపకం చేసుకోండి మరియు అన్ని సమయాలలో ప్రార్థిస్తారు. సంఘములో వారి పరపతి రోజురోజుకీ పెరుగుతుంటుంది. వారు ఎంతో ఆవేశపూరితంగా మాట్లాడతారు. అయితే వారి అంతరంగంలో పాపం కూడా దినదినాభివృద్ధి చెందుతూ పేరుకుపోయి చివరకు దేవుని చేత పరిత్యజింపబడతారు. బాహ్యంగా వారిని చూస్తే మత సంబంధమైన తీవ్రతతో పరిశుద్ధతను సంతరించుకున్నామంటారు. గానీ, వారి అంతరంగములో పాపముతో కుళ్లిపోతుంటారు. కేవలము మతసంబంధమైన క్రియల వలన అనగా విశ్వాససహితము గాని ప్రవర్తన వలన వారికి సంభవించే పరిస్థితి ఇదే.మనము కేవలము విశ్వాసమూలముగానే నీతిమంతులము కాగలము.


 • ఈలోక పాపములకు సంపూర్ణ విమోచన ఇప్పటికే నెరవేరియున్నదా?
 • అవును. యేసుపొందిన బాప్తిస్మము మరియు సిలువ మరణము ద్వారా ఇప్పటికే నెరవేరియున్నది.


ఇప్పుడు హెబ్రీ పత్రిక 10:16-18 వరకు ధ్యానిద్దాము.‘‘ఆ దినములైన తరువాత నేను వారితో చేయబోవు నిబంధన ఇదే నా ధర్మవిధులను వారి హృదయము నందుంచి వాని మనస్సు మీద వాటిని వ్రాయుదును. అని చెప్పిన తరువాత వారి పాపములను వారి అక్రమములను ఇకను ఎన్నటికిని జ్ఞాపకము చేసికొనను అని ప్రభువు చెప్పుచున్నాడు. వీటి క్షమాపణ ఎక్కడ కలుగునో అక్కడ పాపపరిహారార్ధబలి యికను ఎన్నడును ఉండదు.’’

మనమిప్పుడు యేసుపొందిన బాప్తిస్మము మరియు సిలువ మరణము ద్వారా విమోచింపబడియున్నాము. కనుక ఇక మన పాపములకు పరిహారం అవసరత లేదు. మొదటిసారిగా ఈ విషయం మీరు వినినప్పుడు మీకిది వింతగా వినిపించవచ్చును. కానీ బైబిలులోని వాక్యములో ఇదే తెలుపబడినది. ఇవి కేవలము మానవుల మాటలా? కాదు, బైబిలు మనకు న్యాయపీఠము మరియు గీటురాయి అయివున్నది.

‘’ఆదినములైన తరువాత నా ధర్మవిధులను వారి హృదయమునందుంచి వారి మనస్సు మీద వాటిని వ్రాయుదును ‘’(హెబ్రీ 10:16). విమోచింపబడిన తరువాత మీ హృదయ భావన ఏ విధముగా ఉండును? ఇప్పుడు మీ హృదయంలో పాప భావనలేదు.కనుక మీరు ఎంతో నూతన ఉత్సాహము పొందుదురు. ఉల్లాసముగా నుందురు. మీరు ఇప్పుడు నీతిమంతులుగా మార్పుచెంది, దేవుని వెలుగులో జీవించగలుగుదురు.

హెబ్రీ 10:17లో ప్రభువీలాగు సెలవిచ్చుచున్నాడు.‘‘వారి పాపమును, వారి అక్రమమును ఇకను ఎన్నటికిని జ్ఞాపకము చేసికొనను’’విమోచింపబడిన వారి పాపమును, అతిక్రమమును ఇకెన్నడూ జ్ఞాపకము చేసికొననని దేవుడు తెలిపియున్నాడు.ఎందువలన? ఎందుకనగా యేసు సరియైన విధానములో బాప్తిస్మము పొందియున్నాడు.‘‘ఇప్పటికి కానిమ్ము’’, అని చెప్పి బాప్తిస్మము పొందుట ద్వారా లోకపాపమంతయు యేసు స్వీకరించి, ఆయన యందు విశ్వాసముంచిన వారి పక్షముగా పొందవలసిన తీర్పును, శిక్షను ఆయనే పొందెను. 

          ఇప్పుడాయన మన పాపముకు ఒకవేళ లభించవసిన ప్రతి ఫలమును పొందియున్నాడు. గనుక మనకు ఒకవేళ పాపములు గుర్తు వున్నను వాటి విషయమై మనమిక నేరస్థులము కాము. మన పాపo నిమిత్తమై శిక్షను, మరణమును మనమిక పొందనవసరము లేదు. అందునిమిత్తమే యేసు మన పాపమును శుద్దీకరించి, సిలువపై మరణించెను. 

హెబ్రీ పత్రిక 10:18 ఈ విధముగా సెలవిచ్చుచున్నది.‘‘వీటి క్షమాపణ ఎక్కడ కలుగునో అక్కడ పాపపరిహారార్థ బలి యికను ఎన్నడును ఉండదు.’’ అనగా ఈ లోకపాపమoతయు ప్రభువు పరిహరించెను. యేసునందు తిరిగి జన్మించిన వారు ఇక ఎన్నడూ పాపపరిహారార్థ బలి సమర్పించవలసిన అవసరత లేదు.

“దేవా, నన్ను క్షమించండి. నేను యేసునందు విశ్వాసముంచిననూ, ఇంకనూ దుఃఖ పూరితమైన జీవనం సాగిస్తున్నాను. అనగా నేనింకనూ విమోచింపబడలేదని గ్రహించాను. నేను క్రైస్తవునిగా జీవిస్తున్నాను. అయితే నా మనస్సు పాపముతో కూడియున్నది.” అని ఇంకనూ ప్రార్థించవలసిన అవసరత లేదు. 

పాపులు, పాపపు స్పృహలేకుండగానే, పాపం చేస్తారు. దేవుని సత్యమైన న్యాయము వారికి తెలియదు గనుక వారు చేసేది పాపం అన్న అవగాహన లేకుండానే అనేక పాపాలు చేస్తారు. వారి మనస్సాక్షికి పాపముగా తోచనిది, దేవుని దృష్టిలో పాపమైన దేదియు వారికి తెలియనే తెలియదు. యేసునందు విశ్వాసము ఉంచకపోవుట కూడా పాపమేనని దేవుడు తెలియజేసియున్నాడు.

యోహాను 16:9 దేవుని యెదుట ఏది సాధ్యమైయున్నదో వివరించబడినది. ‘’లోకులు నాయందు విశ్వాసముంచలేదు గనుక పాపమందు నిలచియున్నారు.’’ యేసునందు విశ్వాసముంచక పోవుట దేవుని దృష్టిలో నేరము,పాపము అయి వున్నది. యోహాను 16:10లో నీతిమంతత్వము గురించి తెలుపబడినది. ‘‘నేను తండ్రి యొద్దకు వెళ్లుట వలన మీరిక నన్ను చూడరు గనుక, పాపమును గూర్చియు, నీతిని గూర్చియు ఒప్పుకొనజేయును.’’ ఇంకో విధంగా చెప్పాలంటే, యేసు ఈ లోకమునంతయు పాపము నుండి విడుదల చేసియున్నాడు. కనుక మరియొక సారి ఆయన బాప్తిస్మము పొంది, సిలువపై చనిపోవ అవసరము లేదు. 

ఈ విమోచన యందు విశ్వాసముంచిన వారిని ఆయన పిలిచి, శుద్దీకరించి నీతిమంతులుగా చేయును. ఈ లోక విమోచన అంతయు, యేసు పొందిన బాప్తిస్మo మరియు సిలువ మరణము ద్వారా నెరవేర్చబడినది. కనుక పాపులను విడుదల చేయుటకు ఇంక ఏ విధమైన విమోచన అవసరము లేదు.

‘‘మరి ఎవని వలనను రక్షణ కలుగదు; ఈ నామమునే మనము రక్షణ పొందవలెను గాని, ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను’’ (అపో.4:12). యేసు ఈ లోకమునకు దిగివచ్చి స్థానికుడైన యోహాను ద్వారా బాప్తిస్మము పొంది, పాపుల విమోచనార్ధమైన సిలువ మరణమును పొందెను. ఈ సువార్తను మీ హృదయముల యందు విశ్వాసముంచినచో రక్షింపబడుదురు. నీరు మరియు ఆత్మ ద్వారా యేసు మిమ్మును శుద్ధీకరించెను.

నీరు మరియు ఆత్మ ద్వారా మన శరీరములో నిలచియున్న పాపములనన్నియు యేసు తొలగించెను. మనము విశ్వాసము వలన రక్షింపబడ్డాము. మనము సత్యమునందు విశ్వాసముంచిన యెడల, యేసుక్రీస్తు వలననైన సువార్తయందు విశ్వాసముంచిన యెడల, మనము ఎన్నటెన్నటికి నీతిమంతులుగా మారగలము. యేసుపొందిన బాప్తిస్మము మరియు సిలువ మరణములే ప్రాథమిక సత్యములై యున్నవి.పాపులు తమకు కవచముగా ఉపయోగించుకొను వాక్యములు


 • మనమిప్పుడు మన పాపములు ఒప్పుకొనుట ద్వారా విమోచింపబడుదుమా లేక ఇప్పటికే విమోచింపబడియున్నామా?
 • దేవుడు మన పాపముల నుండి విమోచనను ఒక్కసారిగా, అందరికీ అనుగ్రహించియున్నాడు.

1 యోహాను 1:9 ఈ విధముగా తెలుపుచున్నది,’’మనపాపములను మనము ఒప్పుకొనిన యెడల, ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును.’’

కేవలం మన పాపములను క్షమాపణార్థమై ఒప్పుకొనుట మంచిదే. అయితే ఈ వాక్యమును మనస్సులో ఉంచుకొని అనేకులైన వేదాంతులు నూతనమైన సిద్ధాంతాలను ప్రతిపాదించారు.మనపాపములొప్పుకొను ప్రతిసారీ మనము క్షమింపబడుదమని దృఢముగా బోధిస్తున్నారు. ఇది చాలా సులువైన విషయం కదా?   అయితే మనము దేవుని యెదుట పాపము ఒప్పుకొనిన ప్రతిసారీ క్షమింపబడగలమని యేసు చెప్పలేదు.

మనము కేవలము పాపములను ఒప్పుకున్నంత మాత్రమున క్షమింపబడుదుమా? లేక మన మెప్పుడో విమోచింపబడినామా? మీరు దీనిని విశ్వసిస్తున్నారా? ప్రతిసారీ మన పాపాలు ఒప్పుకున్నట్లయితే క్షమింపబడగలమని ఈ తప్పుడు సిద్ధాంత వేత్తలు బోధిస్తున్నారు. కానీ సత్యమేమంటే ఇంకనూ వారి హృదయాల్లో పాపం నిలచే ఉన్నది. వారికి నిజమైన విమోచనాత్మకమైన సువార్త గురించి తెలియనే తెలియదు. అయితే యేసునందు విశ్వాసముంచిన పాపుల పాపములు, వారు క్షమాపణార్థమై ప్రార్థించినప్పుడెల్లా క్షమించబడును అని చెప్పుటలో అర్థమే లేదు.

ఈ కారణము వలన మనము విమోచనాత్మకమైన యేసు చెప్పిన దైవవాక్యముకు తలవంచవలెను. అసత్యమునకు, సత్యమునకు గల తేడాను గ్రహించవలెను. మనకు ఇదివరకు చెప్పబడినవేవైననూ మనము సత్యమునే స్వీకరించవలయును.

పాపులు 1 యోహాను 1:9 వాక్యమును అపార్ధము చేసికొనుచున్నారు. అనుదిన పాపము కొరకైన క్షమాభ్యర్థనగా వారీ వాక్యమును అర్థము చేసుకుంటున్నారు. ఇది సరియైన అవగాహన కాదు. ఈ బోధను, వాక్యమును జాగ్రత్తగా పరిశీలిద్ధాము. ‘‘మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల, ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును.’’ మనము కేవలము మన మూల పాపముల నుండి మాత్రమే రక్షింపబడితిమని మీరు భావిస్తున్నారు. కనుక ఆయన నీతిమంతుడు, నమ్మదగినవాడు గనుక మన అనుదిన జీవిత పాపముకై పాపక్షమాపణ నిమిత్తమై ప్రార్ధించ ఉండవలసినదేనని విశ్వసిస్తున్నారా, అప్పుడే ఆయన క్షమించగలడని భావిస్తున్నారా? ఇవన్నియు కేవలము బలహీనమైన మన శరీరమును ఆధారము చేసికొని ఉద్భవించిన ఆలోచనలే. 

యేసు పొందిన బాప్తిస్మము మరియు సిలువ మరణమును విశ్వసించినట్లయితే, ఇట్టి ఆలోచనలు సత్యానికి విరోధమని మనము గ్రహించగలము. ఏనాడో, ఎప్పుడో మన పాపములన్నియు యేసు పొందిన బాప్తిస్మము మరియు సిలువ మరణము ద్వారా శుద్దీకరింపబడినవన్నదే సత్యము.

ఆత్మ యందు మనము విశ్వాసముంచుట మరియు సత్యదూరమైన ఆలోచన వలన విశ్వసించుట రెండు వేరు వేరు విధానాలు. తమ స్వంత ఆలోచన ప్రకారము విశ్వసించువారు అనుదినము తమ పాపముల శుద్దీకరణ నిమిత్తమై క్షమాపణ కోరుకుంటూ ఉండాలని ఆశిస్తారు. అయితే నీరు మరియు రక్తము ద్వారా లభించు విమోచనను నమ్మిన వారు తమ పాపములకు విమోచన ఒక్కసారిగా యేసు పొందిన బాప్తిస్మము మరియు సిలువ మరణము ద్వారా విమోచన లభించెనని విశ్వసించెదరు.

ప్రతిదినము పాపక్షమాపణ కోరుకొనుట ద్వారా నూతన పరచబడుచూ ఉన్నామని విశ్వసించువారు. యేసుపొందిన బాప్తిస్మము మరియు చిందించిన సిలువ రక్తముయందు కోల్పోయిన విశ్వాస నిమిత్తమై ఇంకనూ పాపము చేయుచూ వున్నారని గ్రహించవలెను.

మీరు ఒక్కసారిగానే యేసుపొందిన బాప్తిస్మము మరియు చిందించిన రక్తము వలన విమోచింపబడితిరా? ఆ విధముగా విశ్వసించని వారు అనుదినము తమ పాపములు ఒప్పుకొనుచూ రక్షణకై ప్రయత్నించుచుందురు. అటులయినచో వారు భవిష్యత్తులో చేసే పాపాల నుండి ఏవిధముగా విమోచన పొందగలరు? 

యేసుయొక్క బాప్తిస్మo మరియు రక్తము ద్వారా మీరు ఒక్కసారిగా విమొచింపబడియున్నారా? విమోచింపబడని వారు వారి అనుదిన పాపములను ఒప్పుకొనుటచేత రక్షణను గెలుచుకొనుటకు ప్రయత్నము చేస్తారు. అది వారు భవిఫ్యత్తులో వారు చేయు వాస్తవ పాపముల గురించి సమస్యలను వారికి విడిచిపెడుతుంది.

వారి బవిఫ్యత్తు పాపములను ముందుగానే ఒప్పుకోవాలని ప్రయత్నిస్తారు. అయితే వారు ఇలా చేయుట ద్వారా యసునందు విశ్వాసము లేకపోవుటనే వారు చూపించుచున్నారు. ఈ ప్రజలు విమోచనా సువార్తకు గ్రుడ్డివారైయున్నారు. యేసు తీర్పును తనపైకి తీసుకొనుటచేత ఆయన బాప్తస్మము మరియు రక్తముతో ఒకేసారి మనలను విడిపించెను. ఆయనయందు విశ్వాసముంచుట వలన తేలికగా విడుదల పొందియున్నాము.

నీరు మరియు ఆత్మ వలన లభించు విమోచన మరియు తిరిగి జన్మించుట గురించి తెలియని అవిశ్వాసుల వలననే మీరును అనుదినము. మీ భవిష్యత్‌ పాపాల నిమిత్తమై క్షమాపణ అడగాలనుకోవటం శోచనీయం. పాపులు కేవలం పాపపు ఒప్పుకోలు ద్వారా క్షమింపబడరు.

‘‘నేనింకనూ విమోచన పొందని పాపిని’’ అని నీవు నిజముగా ఒప్పుకొని, ఈ బాప్తిస్మము మరియు సిలువ మరణమును గురించిన సత్యసువార్తను విని, తీర్పరిగా, న్యాయాధిపతిగా వచ్చినప్పుడు నీ కొరకు భయంకరమైన తీర్పు ఎదురుచూచును.

అయితే నీవు విమోచనా సువార్తయందే విశ్వాసముంచక మరియు పశ్చాత్తాప ప్రార్ధనల వనుక దాగియున్నట్లయితే, యేసు తీర్పరిగా ఈ లోకమునకు మరలా వచ్చినప్పుడు నీవు భయానకమైన తీర్పును ఎదుర్కొంటావు.

నీరు మరియు ఆత్మ సంబంధమైన విమోచన యందు విశ్వాసముంచని వారు ఆ దినమున తీర్పునకు లోనగుదురు. వారు అనుదిన పాప క్షమాపణా ప్రార్థన ముసుగులో దాగియున్ననూ, వారి కొరకు తీర్పు, న్యాయము సిద్ధపరచియుండును. కనుక ఇప్పుడే ఈ ఆశీర్వాదకరమైన నీరు మరియు ఆత్మసంబంధమైన సువార్తయందు విశ్వాసముంచవలసినదిగా విజ్ఞప్తి.నిజమైన విశ్వాసము మరియు సరియైన పాపపు ఒప్పుకోలు


 • పాపి చేయవలసిన సరైన పాపపు ఒప్పుకోలు ఏమైయున్నది?
 • ఇంకను తనలో పాపము దాగియున్నదని ఒప్పుకొని నిజమైన సువార్తయందు విశ్వాసముంచని యెడల పాపి, కేవలము నరకమునకు పోవును.


దేవుడు మనను ఎన్నటెన్నటికి విమోచించాడు. నేను చెప్పబోవు దానికి అనుభవ పూర్వకమైన ఒక ఉదాహరణ ఇస్తాను. ఉత్తర కొరియా నుండి, దక్షిణ కొరియాకు ఒక గూఢచారి వచ్చాడనుకుందాము. ఇక్కడ వారు ఎంత ఆశీర్వాదకరంగా జీవిస్తున్నారో చూస్తాడు. ఇక్కడి పరిస్థితులను చూచి ఇంతవరకు ఉత్తరకొరియాలో గడిపిన దుర్భరమైన జీవితముతో పోల్చుకొని తనను తాను దక్షిణకొరియా వారికి అప్పగించుకుంటాడు.

తనకు దగ్గరగా వున్న పోలీసుస్టేషనుకు వెళతాడు. అక్కడ అధికారితో ఈ విధంగా ఒప్పుకుంటాడు.‘‘నేను ఉత్తరకొరియా గూఢచారిని’’ లేక నేను ఫలానా వారిని హత్యచేయటానికి మీ దేశానికి వచ్చానని తెలియచేస్తాడు. మీ దేశంలో అనేక ప్రదేశాలను ధ్వంసం చేయడానికి వచ్చానని చెబుతాడు. అయితే నేనిప్పుడు మీకు లొంగిపోతున్నాను.నేనిక మీదట ఆ దేశ గూఢచారిగా ఉండబోవుటలేదు అని తెలియజేస్తాడు.

ఇది సరియైన ఒప్పుకోలేనా? తాను నిజంగా ఒప్పుకోవాలంటే కేవలం నేను గూఢచారిని అని చెపితే చాలు. మిగిలిన విషయాలు వాటంతటవే అర్థము కాగలవు.   అతనొక చెడ్డవ్యక్తి కనుక తీర్పునకు లోనుకావలసినదే, అతనికెటువంటి పనులు ఆ దేశము అప్పగించిననూ, ఈ చిన్న ఒప్పుకోలుతో తనంతట తాను లొంగిపోయిన యెడల అతను క్షమింపబడతాడు.

  అదే విధముగా, ఒక పాపి దేవుని యెదుట ‘‘నేను ఒక పాపిని, ఇంకను నేను విమోచింపబడలేదు. నేను తీర్పు పొంది, నరకములోనికి త్రోసివేయబడుటకు అర్హుడను. నన్ను రక్షించండి’’అని ఒప్పుకొనిన యెడల, యేసునందు విశ్వసించిన యెడల అతడు విమోచింపబడగలడు. యేసు మన నిమిత్తమే బాప్తిస్మము పొంది, రక్తము చిందించెను. మనము రక్షింపబడుటకు ఈ సత్యమునందు విశ్వాసముంచినచో చాలు.

ప్రకటన 2:17లో ఈ విధముగా తెలియజేయబడియున్నది.‘‘సంఘముతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినునుగాక.జయించువానికి మరుగైయున్న మన్నాను భుజింపనిత్తును. మరియు అతనికి తెల్లరాతినిత్తును; ఆ రాతిమీద చెక్కబడిన యొక క్రొత్త పేరుండును; పొందిన వానికేగాని అది మరి యెవనికిని తెలియదు.’’ సత్యసువార్తను గ్రహించిన వాడే క్రీస్తు యేసు నామము యెరుగునని బైబిలు తెలియజేస్తుంది. ఒక్కసారిగా, ఎన్నటెన్నటికి విమోచింపబడిన వానికే నీతిమంతత్వము గురించిన మర్మము తెలియును.

ఈ సత్యము గ్రహించని వాడు, అనుదినము పశ్చాత్తాప ప్రార్థన చేసినను ఇంకనూ పాపిగానే యుండును. పాపపు ఒప్పుకోలు అనగా అనుదినమూ పాపక్షమాపణ నిమిత్తమై ప్రార్థన చేయుటకాదు. ఎవరైననూ 10 సంవత్సరాలు క్రైస్తవుడిగా జీవించినా, దేవునికి ప్రతిదినము పాపక్షమాపణ నిమిత్తమే ప్రార్థిస్తుంటే అతనింకను పాపియై యున్నాడు. ఆ వ్యక్తి ఇంకనూ దేవుని కుమారుడిగా మారలేదు.

తాము పాపులమని ఒప్పుకొని, యేసు అనుగ్రహించిన విమోచనయందు విశ్వాసముంచిన రక్షింపబడుదురు. ఇదే నిజమైన విశ్వాసము.1 యోహాను 1:9లో మనకు తెలియపరచబడిన పాపపు ఒప్పుకోలు అనేది కేవలం ఒకరి పాపమును గుర్తించుటకాదు 


 • మనము రక్షింపబడుటకు మన పాపములను అనుదినము ఒప్పుకొనవలెనా లేక ఒకసారి ఒప్పుకుంటే చాలా?
 • ఒక్కసారి మాత్రమే

        

ఒక దొంగగానీ, ఒక హంతకుడు గానీ, తమ తప్పిదములను ఒప్పుకొని, క్షమాపణ అడిగి, విమోచన పొందగలరా? కేవలము తమ పాపములు ఒప్పుకొనుట ద్వారా, పాపులు విమోచన పొందలేరు. యేసుక్రీస్తు పొందిన బాప్తిస్మము మరియు సిలువ మరణముతో కూడిన, తిరిగి జన్మింపజేయు ఆశీర్వాదకరమైన సువార్త ద్వారా మాత్రమే మానవులు విమోచింపబడగలరు. కొంతమంది దారి తప్పిపోయిన క్రైస్తవులు క్రింద తెలియపరచిన విధముగా పాపపు ఒప్పుకోలు చేసెదరు.

‘‘ప్రియమైన దేవా,ఈదినమున నేనొక వ్యక్తితో ఘర్షణ పడ్డాను.నేను పాపం చేశాను.నేను ఒకరిని మోసగించాను. నేను దొంగలించాను.’’

ఇలా వరుసగా వారి పాపాల చిట్టా చెప్పుకుంటూ పోతే, దేవుడేమంటాడో తెలుసా! ‘‘ఓ పాపి, నోరు మూసుకో,అయితే ఏమిటి?’’అని అడుగుతాడు. 

అప్పుడు వారంటారు.‘‘దేవా, దయచేసి నా పాపాల ఒప్పుకోలు విను. మమ్మల్ని పాపాలు ఒప్పుకోమన్నావు గదా, నీ కృప ఆర్ధిస్తున్నాము’’ అంటారు. ఈలాంటి ప్రార్థన కాదు దేవుడు మన నుండి వినాలి అనుకునేది. నీరు మరియు ఆత్మ ద్వారా సిద్ధించు విమోచన యందు విశ్వసించు వారి ప్రార్థనను దేవుడు ఆలకించాలని కోరుకుంటున్నాడు. ఈ సువార్త యందు విశ్వసించి, తిరిగి జన్మించిన బిడ్డ పాప క్షమాపణా ప్రార్థన ఆలకించాలని దేవుడు ఎదురుచూస్తున్నాడు.

తన తల్లి పాలు తాగుతూ పాపము నిమిత్తమై పశ్చాత్తాప పడ్డానని అగస్టిన్‌ అను ప్రముఖ వ్యక్తి సెలవిచ్చాడు. ఆ విధమైన పాపపు ఒప్పుకోలు తనను దేవుని రాజ్యంలోనికి ప్రవేశింప జేస్తుందని ఆ వ్యక్తి భావించాడు. ఇది ఎంతో హాస్యాస్పదము. కేవలం మన పాపాలు ఒప్పుకొనుట వలన ఏమీ సంభవించదు.

అప్పుడు ‘‘మీరు నోరు మూసుకొని చెప్పండి, మీరు పాపం చేశారా, లేదా; ఒక వేళ చేసివుంటే, దాని గురించి మాట్లాడటం మానేయండి. ఇప్పటి దాకా మీరు తప్పుడు బోధలు ఆలకించారు. అయితే సత్యాన్ని సరిగా బోధించే సంఘానికి వెళ్ళండి. అసలైన విమోచనా సువార్తను విశ్వసించి విడుదల పొందండి. లేని యెడల నేను వచ్చినప్పుడు మీకు సరియైన తీర్పు తీర్చగలను’’ అని వారితో అంటాడు.

కేవలం పాపపు ఒప్పుకోలు ద్వారా లేక రక్షింపబడటానికి మనము చేసే ఇతర పనులేవీ కూడా ఆ పాపాల నుండి మనలను విమోచింపలేవు. అవన్నీ సత్యానికి విరోధమైన విధానాలు. 

1 యోహాను 1:9లో తెలియజేసిన ప్రకారము మన పాపములన్నియు ఒప్పుకొన్న యెడల, నీరు మరియు రక్తము వలననైన సువార్తను విశ్వసించుట ద్వారా మనము పాపపు బంధకముల నుండి విడిపింపబడి, రక్షింపబడి విమోచింపబడుదుము.“నా నుండి తొలగిపొండి”


 • అక్రమము చేయుట అనగానేమి?
 • హృదయములో పాపము కలిగి యేసునందు విశ్వాసముంచుట.

పాపులైన క్రైస్తవులు అనబడే వారు ఇంకను సరికాని విశ్వాస మార్గమును అనుసరించుచున్నారు.వారు అక్రమము చేయుచున్నారు.‘‘ఆ దినమందు అనేకులు నన్ను చూచి ‘ప్రభువా, ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్లగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా? అని చెప్పుదురు. అప్పుడు’ నేను మిమ్మును ఎన్నడును ఎరుగను; అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదున’’ (మత్తయి 7:22-23).

ఈ విషయం మన ఊహాలోకంలో వాక్యానుసారం పరిశీలిద్దాము. అసత్యమునందు విశ్వాసముంచు వ్యక్తి చనిపోయాడు. అతను దేవుని సముఖానికి వచ్చి ఇలా చెబుతాడనుకుందాం.‘‘ఎలా ఉన్నారు ప్రభూ? అయ్యా, నేను భూమి మీద జీవించి ఉన్నప్పుడు మీరు ఎంతో అందమైన వారని భావించాను. అయితే తండ్రీ, ఇక్కడ మిమ్ము చూచి, మీ అందాన్ని చూచి నేనింకా ఎంతో అబ్బురపడ్డాను. నీవు నన్ను రక్షించావు. నా హృదయములో పాపము కలిగి జీవించాను, మీరు నన్ను పాపరహితునిగా చూచారని నమ్ముతున్నాను. నన్ను పరలోకానికి తీసుకొని వెళ్తానన్న మీ వాగ్దానం ప్రకారం నేనిక్కడకి తేబడ్డానని విశ్వసిస్తున్నాను. సంపూర్ణంగా వికసించిన అందమైన; పుష్పాలుండే ప్రదేశంలో నేనిప్పుడు సంచరిస్తాను. దేవా ఈ పరలోకం ప్రాభావాన్ని అంతా ఒక్కసారి వీక్షించి తిరిగి మీ సన్నిధికి వస్తాను.’’

అలా చెప్పి ఆ వ్యక్తి పరలోకములో వున్న ఆ అందమైన తోటవైపు అడుగు వేయడం ప్రారంభిస్తాడు. యేసు వెంటనే ఆ వ్యక్తిని ఆపుతాడు.‘‘ఆగు!ఈ వ్యక్తి హృదయంలో పాపం కలిగియున్నాడో, లేడో పరిశీలిద్దాము. నీవు పాపివా?’’ అని ఆ వ్యక్తిని అడుగుతాడు. 

‘‘అవును, నాలో పాపం ఉన్నది.అయిననూ నేను నిన్ను విశ్వసించాను’’

‘‘నా యందు విశ్వాసముంచినను,ఇంకను నీలో పాపం నిలచియున్నదా?’’

అవును నిలచియే యున్నది.’’

“ఏమిటి? ఇంకా నీలో పాపం నిలచియున్నదా? జీవగ్రంధం ఇలా తీసుకుని రండి. వాని క్రియల గ్రంధం కూడా తీసుకురండి. వాని పేరున్నదో లేదో పరిశీలించండి. వాని పేరే గ్రంధములో ఉన్నదో చూడండి.”

దేవా, వాని పేరు వేరొక గ్రంధములో అనగా క్రియల గ్రంధంలో ఉన్నది. 

‘‘ఇప్పుడు నీవు భూమి మీద చేసిన పాపాలను తెలియజేయగలవా’’

ఆ వ్యక్తి అవి గుర్తులేనట్లు నటిస్తాడు. కానీ దేవుడు అతనిని బలవంతం చేసి అతని పాపాల చిట్టాను చెప్పిస్తాడు.

‘‘అవును తండ్రీ, నేనీ పాపాన్ని చేశాను’’

గందరగోళం ఇంకా నోరుమూసుకొని వుండలేడు.

    ‘‘ఇకఆపు,చాలు!నరకప్రవేశానికి కావలసిన పాపాలన్నీ ఇతడు జరిగించాడు. ఇతను నరకపాత్రుడు!ఆ అగ్నిగంధకములు మండే ప్రదేశానికి ఇతనిని పంపివేయండి.’’

వికసించిన, అందమైన పుష్ప గుఛ్చాలుండే ప్రదేశానికి అతడు పంపబడలేదు. అగ్ని, గంధకములుండే చోటికి పంపబడ్డాడు. నరకానికి తీసుకుపోబడుతుంటే అతను పళ్లు పట, పట మని కొరకటం ప్రారంభించాడు.

‘‘నేను నీయందు విశ్వసించాను నీ నామమున ప్రవచించాను, నీ నామమున బోధించాను నాకున్న ఇల్లు అమ్మి ఆ ధనముతో నీ సేవచేశాను.అనాధలకు సహాయం చేశాను.నీ నామమున శ్రమలు సహించాను.ఉదయమున లేచి ప్రార్థించాను. రోగులను పరామర్శించాను. కనుక నేను పరలోక ప్రవేశానికి అర్హుడిని.’’

ఊడిపోయేంతగా తన పళ్లు పట పట లాడిస్తాడా వ్యక్తి. నరకంలో ప్రవేశించగానే అక్కడ సత్య సువార్తను విశ్వసించని అనేకులను చూస్తాడు యేసునందు విమోచన పొందని అనేకమంది క్రైస్తవులను కూడా అక్కడ కనుగొంటాడు. ఈ నిజమైన విమోచనా సువార్తను సరిగా అర్ధము చేసుకొని విశ్వసించని అనేకులు అక్కడ చేరియుంటారు.అబద్ధ విశ్వాసుల పాపములు వేరొక గ్రంధములో అనగా క్రియల గ్రంధములో లిఖించబడి ఉంటాయి.


 • పాపుల పాపాలన్నీ ఎక్కడ వ్రాయబడి ఉoటాయి?
 • వారి పాపాలు, వారి హృదయ ఫలకము మీద మరియు క్రియల గ్రంధంలోను లిఖించబడతాయి.

మనము యేసునందు విశ్వాసముంచినను, విశ్వాసముంచక పోయినను, హృదయంలో పాపం కలిగి యున్నవారిని దేవుడు నాశనమునకు పంపిస్తాడు. ఎవరి హృదయంలోనైనా, ఒకింత పాపం ఉన్నప్పటికీ, ఆ తీర్పు దినమున వారు నరకమునకు పంపబడతారు. ఇంకనూ పాప బంధకము నుండి విడుదల పొందని పాపులను, వారి పాపములు ఒప్పుకొని, విమోచనా సువార్త వైపునకు మరలవలసినదిగా దేవుడు పాపులకందరికీ ఆహ్వానం పలుకుతున్నాడు.

పాపి యొక్క పాపాలు వాని హృదయ ఫలక పైన లిఖించబడి ఉంటాయి. నీరు మరియు ఆత్మ ద్వారా తిరిగి జన్మించిన వ్యక్తుల పాపాలు గుర్తున్నప్పటికీ వారి హృదయంలో అవి నిక్షిప్తంకావు. అవి తుడిచివేయబడతాయి. వారు నీతిమంతులుగా పరిగణింపబడతారు. 

తిరిగి జన్మించిన అనుభవం లేని వారి పాపాలు వారి హృదయంలో నిలచి ఉంటాయి. వారు ప్రార్థించడానికి మోకాళ్ళూనినప్పుడు, వారికి దేవునికి మధ్య మరిన్ని పాపాలు అడ్డు నిలుస్తాయి. తద్వారా వారి ప్రార్థనలు దేవుని చెవులకు చేరవు. వారనేక విషయాల నిమిత్తమై ప్రార్థన చేస్తుంటారు. అయిననూ వారి పాపాలు ఇంకనూ హృదయంలో నిలచియుంటాయి. వారి ప్రార్థన అంతా వారు 10 లేక 11 లేక 20 సంవత్సరా క్రితం చేసిన పాపాలను క్షమాపణ కోరుకొనుటతోనే నిండియుంటుంది. 

వారు మరలా మరలా వారి పాపాల నిమిత్తమై పశ్చాత్తాపం చెందుతూ ఉండాలా? వారు అలా చేయాలని కోరుకొనరు. కానీ వారు దేవుని యెదుట ప్రార్థన చేస్తున్నప్పుడు, వారి తప్పిదాలు గుర్తుకు వస్తాయి. కనుక వారి అవసరత నిమిత్తమై చేసే నిజమైన ప్రార్థన మూలముగా వారు చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం జరగాలని కోరుకుంటారు.

దేవుడు వారి హృదయమనే పలక మీద, చెరిగిపోని విధంగా, వారి పాపాలను ఇనుప గంటము చేత వ్రాస్తాడు. దాని ఫలితంగా వారు దేవుని సన్నిధిలో ప్రార్ధించాలనుకున్న ప్రతిసారి వారి పాపాలు గుర్తుకు వస్తాయి. విమోచనాత్మకమైన సత్యసువార్త యందు సంపూర్ణంగా విశ్వాసముంచని ఈ వ్యక్తులు, ఈ అపరాధభావంతో జీవితాంతం జీవించి, మరణానంతరం నరకంలో ప్రవేశిస్తాడు.

యిర్మియా 17:2లో ఈలాగు తెలుపబడినది.‘‘యూదా పాపము ఇనుప గంటముతో వ్రాయబడియున్నది; అది వ్రజపు మొనతో లిఖింపబడియున్నది; అది వారి హృదయమనెడి పలకల మీదను చెక్కబడియున్నది; మీ బలిపీఠము కొమ్ము మీదను చెక్కబడియున్నది.’’

ఇశ్రాయేలీయులలో రాజ గోత్రము యూదా. బైబిలులో యూదా అనుపేరు సమస్త మానవాళికి ప్రాతినిధ్యం వహిస్తుంది. యూదా అనగా సకల ప్రజలు అని చెప్పుకొనవచ్చును.

యూదా పాపము ఇనుపగంటముతో వ్రాయబడియున్నది. ఉక్కును కూడా చేధించగల వజ్రపుమొనతో వ్రాయబడి ఉన్నది. ప్రపంచంలో వజ్రం చాలా పదునుగలది. ఇనుప కలముతో, వజ్రపు మొనతో మన పాపాలు లిఖించబడియున్నవి. 

ఒకసారి చెక్కబడితే, అవి అంతతేలికగా తుడిచివేయబడవు.  నీరు మరియు ఆత్మలోని సత్యమునందు విశ్వాసముంచువరకు వారి పాపములు తుడిచివేయబడవు.

ఏదో వారి ఊహలో తుడిచివేయబడితే చాలదు, క్రైస్తవ సిద్ధాంతాలలో విశ్వసిస్తే చాలదు, వేదాంతం వల్లివేస్తే చాలదు; కేవలం సంఘ కార్యకలాపాలలో నిమగ్నమయితే చాలదు. వారి పాపాలు వారి హృదయాలలో నిలచియుండగూడదు.

వారి పాపములు యేసుక్రీస్తు యొక్క బాప్తిస్మము లేకుండా తుడిచి వేయబడవు. కనుకనే పాపులు వారి పాపములనెప్పుడూ జ్ఞాపకము చేసికొంటూ ఉంటారు.‘‘దేవా నేను పాపిని’’ అని ప్రార్థిస్తుంటారు. దేవునితో ఎంత సహవాసం కలిగి యున్ననూ, వారి హృదయములు ఇంకనూ పాపంతో నిండే ఉంటాయి. వారు సంఘ పరిచర్యలో ముందుంటారు. సిద్ధాంతపరంగా గట్టిగా నిలచియుంటారు. వేదాంత అభ్యాసం చేస్తుంటారు.

వారు కొండలలోనికి వెళ్లి ప్రార్థించినా, వ్యర్థంగా భాషలో మాట్లాడుతూ, మండుచున్న అగ్ని శిఖలను దర్శనాలలో చూస్తూ వున్నా అంతా వ్యర్థం. పాపాలు నీ హృదయంలో నిలిచియున్నంతకాలం నీకు శాంతి లభించదు.

యిర్మియా 17:2లో వ్రాసిన ప్రకారం మన పాపాలు, జీవగ్రంధము మరియు మన క్రియలు లిఖించబడిన మరొక గ్రంధంలో ఉంటాయి. పాపుల పాపాలన్నీ ఈ క్రియల గ్రంధంలో వ్రాసి ఉంటాయి. కనుక వారి అతిక్రమము నుండి మానవులు తప్పించుకొనలేరు. దేవుడు ఈ పాపాలన్నీ మానవుని మనస్సాక్షిలోను, క్రియల గ్రంధంలోను లిఖించి వుంటాయి. వాటిని తన ధర్మశాస్త్రం ద్వారా మనకు చూపుతాడు.

యేసు పొందిన బాప్తిస్మము మరియు మన నిమిత్తమై చిందించిన రక్తం ద్వారా విశ్వాసము వలన రక్షింపబడి, ఆ లేఖనములన్నియు పూర్తిగా తుడిచి వేయగలగాలి.   అప్పుడే మనము నిత్యత్వ జీవితానికి సిద్ధంగా ఉండగలము. మన పేరులు జీవగ్రంధంలో లిఖించబడతాయి.నీ పేరు జీవగ్రంధంలో ఉన్నదా?


 • ఎవరి పేరులు జీవగ్రంధంలో నిలిచి ఉండును?
 • తమ హృదయములలో పాపములు నిలిచియుండని వారి పేరులు జీవగ్రంధంలో లిఖించబడియుండును.


జీవగ్రంధంలో నీ పేరు వ్రాయబడి యుండుట ఎంతో ముఖ్యం. నీ పేరు అందులో వ్రాయబడి యుండని యెడల, నీవు యేసునందు విశ్వసించిననూ ఉపయోగమేమి? నీవు ఈ నీరు మరియు ఆత్మద్వారా తిరిగి జన్మించినప్పుడే నిజముగా విమోచింపబడగలవు.

యేసు ఈ లోకమునకు వచ్చి, 30 సంవత్సరముల వయస్సులో బాప్తిస్మము స్వీకరించి, ఈ లోకపాపమంతయు తొలగించి, మనలను విమోచించుటకు సిలువపై మరణించెను. మత్తయి 3:15లో తెలుపబడిన ప్రకారము ‘‘ఇప్పటికి కానిమ్ము’’ అని చెప్పుట ద్వారా యేసు బాప్తిస్మము పొంది, సిలువ వేయబడెను.

మానవులు మరణించి, దేవుని సముఖములో నిలబడినప్పుడు, ‘‘ఇతని పేరు జీవగ్రంధంలో వున్నదా’’ అని దేవుడు ప్రశ్నిస్తాడు.

‘‘ఉన్నది ప్రభువా’’

‘‘అవును,నీవు నా నిమిత్తమై బాధింపబడ్డావు, నా కొరకై భూమిపై జీవించిన దినాలలో కన్నీరు కార్చావు. ఇప్పుడు నీకు బాధ, వేదన, కన్నీరు లేకుండా నేను చేయగలను.’’

అటువంటి వ్యక్తికి నీతి కిరీటం బహుమతిగా ఇవ్వబడుతుంది.

‘‘దేవా!నీకు కృతజ్ఞతలు... నేనెప్పుడూ నీకు ఋణపడియుంటాను.’’

‘‘దేవదూతలారా, ఈ వ్యక్తిని కిరీటంతో అలంకరించండి’’

‘‘దేవా మీరు నన్ను రక్షించుటే నాకు బహుమానం.ఈ కిరీటమునకు నేను పాత్రుడను కాను.నీకు కృతజ్ఞతలు.నన్ను రక్షించినందుకై నీకు వందనాలు ప్రభూ, నీ సన్నిధిలో నిరంతరం నివసించుటే నాకు చాలు.’’

‘‘దేవదూతలారా,ఈ నా వెయ్యవ కుమారుడిని మీ భుజస్కందాలపై ఊరేగించండి.’’

‘‘అయ్యా మా వీపు మీద అధిరోహించండి’’

‘‘చాలా చక్కగా ఉన్నది,నేను చేస్తున్నది సరియైనదేనా? సరే అలాగే.’’

దేవదూతలు జాగ్రత్తగా తీసుకువెళ్తారు.

సరే అలా,మనం విహారానికి వెళ్దామా?

‘‘నేను కోట్లాది సంవత్సరాలుగా ఇక్కడ సంచరిస్తున్నాను,అయినను దీని ఆది అంతము నాకే తెలియదు.’’

‘’అవునా,నిజమా? బహుశా నేను నీకు బరువుగా ఉండవచ్చు, నన్ను క్రిందకి దింపవా.’’

‘‘ఇక్కడ ఎవరికీ అలుపే ఉండదు’’

‘’ధన్యవాదములు,నేనీ సుందర ప్రదేశంలో, పరలోకరాజ్యంలో నడచి రావాలని ఆశిస్తున్నాను. నాకంటే ముందుగా ఇక్కడకు వచ్చిన నీతిమంతులెక్కడ ఉన్నారు?’’

‘‘అరుగో అక్కడ ఉన్నారు’’

అయితే వారి వద్దకు వెళ్దామా?

  ‘’ హల్లెలూయ! ’’వారు ఒకరినొకరు కౌగలించుకొని,చిరునవ్వుతో నిత్యత్వం వరకు కలిసి జీవిస్తారు.

ఇప్పుడు ఊహించుకోండి. యేసునందు విశ్వసించి, ఇంకనూ పాపిగా జీవిస్తున్న వ్యక్తి కూడా, చనిపోయి దేవుని సముఖాన నిలువబడతాడు.ఆ వ్యక్తి కూడా తాను పాపినేనని, అయినా క్రీస్తు యేసు నందు విశ్వసించానని తెలియపరుస్తాడు.

‘‘ఈ వ్యక్తి పేరు జీవగ్రంధంలో ఉన్నదా’’ అని దేవుడడుగుతాడు

‘‘ఇతని పేరు జీవగ్రంధంలో లేదు ప్రభువా’’

‘‘అయితే క్రియల గ్రంధంలో చూడండి’’

‘‘ఈ వ్యక్తి పేరు ఇతని పాపాలు క్రియల గ్రంధంలో ఉన్నవి ప్రభూ !’’

‘అయితే ఈ వ్యక్తి ఇతర విషయమై ఏమాత్రం విచారము, ఆలోచన లేని ప్రదేశానికి పంపండి,అక్కడే ఎల్లప్పుడూ ఇతడుండగలడు.’’

‘‘దేవా, ఇది చాలా అన్యాయం...’’

ఇది అన్యాయమని అతని వేదన, యేసునందు విశ్వసించినను ఆ వ్యక్తి ఎందుకు నరకమునకు పంపబడ్డాడు? యేసునందు తీవ్రతతో నిలిచియున్నాడు గదా.

ఈ వ్యక్తి అపవాది చేత మోసగింపబడ్డాడు. తాను పాపినని ఈ వ్యక్తి ఎ్లప్పుడూ భావించేవాడు. ఇతను సత్య సువార్త విరోధమైన దానిని విశ్వసించాడు. ఒకవేళ మనమైనను యేసుక్రీస్తు ప్రసాదించిన నిజమైన విమోచనను అంగీకరించని యెడల మనమును నరకమునకు పాత్రులమే. 

ఇతడు యేసునందు విశ్వసించినను అపవాది మోసమునకు తలవంచాడు. తానొక పాపినని భావించాడు. నిజమైన సువార్తకు విధేయుడైతే తన విశ్వాసం అసంపూర్ణమని గ్రహించేవాడు. తాను చేసిన తప్పిదము విషయములో, ఎంతో గర్వముగా వాటినే అంటిపెట్టుకొని ఉన్నాడు గనుకనే సత్యసువార్తను విశ్వసించడంలో విఫలుడైనాడు. 

మీరు పరలోక రాజ్యములోనికి ప్రవేశించాలంటే, నీరు మరియు ఆత్మ ద్వారా తిరిగి విశ్వాసంతో జీవించాలి. అందుకే మత్తయి 3:15లో ‘‘ఇప్పటికి కానిమ్ము’’, అని యేసు ఈ లోక పాపమంతయు తొలగించాడు. నీరు మరియు రక్తము ద్వారా అందింపబడిన మోక్షాన్నిమీరు నమ్మాలి. 

                                 

 • క్రియల గ్రంధములో ఎవరి పేరులు లిఖించబడియుండును?
 • హృదయంలో పాపము నిలచియుండువారి పేరులు క్రియల గ్రంధంలో లిఖించబడి యుండును.

ఒక మంచి మనస్తత్వము కలిగిన వ్యక్తి ఏ విధముగా ఇతరులు ఏమి అడిగినను తల ఊపుతాడో, అలాగే మనకు వినిపించబడినదంతా విశ్వసిస్తే నరకంలోనికి వెళ్ళక తప్పదు. నరకంలో అనేకమంది మంచివారూ ఉంటారు. అయితే తాము నమ్మిన విశ్వాసం నిమిత్తమై పోరాడిన వారెందరో ఉంటారు. 

పరలోకంలో ఉన్న అనేకులకు తాము పాపులమేనని, నరకమునకు పాత్రులమేనని తెలుసు. అయితే వారికి సంపూర్ణ విమోచనను ప్రసాదించిన యేసుక్రీసు పొందిన బాప్తిస్మము మరియు సిలువ మరణమునందు వారు విశ్వాసముంచుదురు.

పరలోకంలో గుట్టలు గుట్టలుగా చెవులు మరియు నోర్లు ఉంటాయన్నది ఒక నానుడి. అనేకులు తమ చెవులతో సంపూర్ణ సువార్తను వింటారు. కొందరు తమ నోటితో తెలియజేస్తారు. కనుక వారి నోరు లేక చెవిని దేవుడు పరలోకంలో ఉంచుతాడని, వారు హృదయములో దానిని విశ్వసించలేదు గనుక, వారి మిగిలిన శరీరమంతా అగ్ని, గంధకము నరకాగ్నిలోనికి త్రోయబడినదని చెప్పుకుంటూ ఉండట కద్దు.

యేసునందు విశ్వాసముంచి, ఇంకనూ హృదయములో పాపం కలిగియున్న వ్యక్తి మరణానంతరం దేవుని యొక్క సముఖాన నిలబడి ఉన్నాడని ఊహించుకుందాము.అతను ఇలాగు అనవచ్చును.‘‘దేవా, నేను యేసునందు విశ్వాసముంచాను గనుక ప్రజలు నన్ను నీతిమంతునిగా పేర్కొంటారు అయినా ఇంకనూ నా హృదయంలో పాపం కలిగియున్నాను. మీరూ, నన్ను పాపరహితునిగా పరిగణించగలరని విశ్వసిస్తున్నాను. ఇదే నేను విన్నది, నేర్చుకున్నది, విశ్వసించినది. అనేకుల వలనే నేనూ మిమ్ము విశ్వసించాను. నేను సంచరించిన ప్రదేశాలలో విశేషముగా బోధింపబడిన విశ్వాసమిదియే!’’

అప్పుడు దేవుడంటాడు హృదయములో పాపము కలిగియున్న వారిని నేను క్షమించను. నీరు మరియు ఆత్మ ద్వారా తిరిగి జన్మింపజేయు ఆశీర్వాదము ద్వారా మీ పాపాలన్నీ తుడిచి వేశాను.అయితే నీవు సువార్తను విశ్వసించుటకు నిరాకరించావు.‘‘దేవదూతలారా, ఈ దివాళకోరు వ్యక్తిని నరకాగ్నిలోనికి తోసివేయండి.’’

యేసునందు విశ్వాసముంచిననూ, ఇంకను హృదయములో పాపము కలిగియున్న ప్రతి వారూ నరకమునకు పాత్రులు. విమోచనాత్మకమైన సత్యసువార్తను వినండి, పాపము నుండి విడుదల పొందండి. లేని యెడల మీరు మండుచున్న నరకాగ్నిలో పడవేయబడుదురు.

మీ హృదయంలో పాపం ఉన్నప్పుడు మీరు పాప రహితమని చెప్పడం దేవుణ్ణి మోసం చేయడం. చివరికి పాపులకు, నీతిమంతులకు మధ్య ఎంత తేడా ఉందో మనం చూడవచ్చు. విమోచన పొందమని నేను మిమ్మల్ని ఎందుకు ప్రార్థిస్తున్నానో మీరు గ్రహిస్తారు.

సంపూర్ణ విమోచన యందు (యేసు పొందిన బాప్తిస్మము మరియు సిలువ మరణము) విశ్వాసముంచిన వారికిని, విశ్వాసముంచని వారికిని గల తేడాను, స్వర్గ, నరకము రహదారిలో నుంచొని యున్నప్పుడే నీవు గ్రహించగలవు. అక్కడ చాలా తేడా సంభవిస్తుంది. కొందరేమో పరలోకరాజ్యంలో ప్రవేశిస్తే మిగిలినవారు నరకంలో పడవేయబడుదురు.

మీరు యేసునందు విశ్వాసముంచి ఇంకను హృదయంలో పాపము కలిగియున్నారా? అయితే మీరు నీరు మరియు ఆత్మ ద్వారా తిరిగి జన్మింపవలసి వున్నది. హృదయములో పాపము నిలిచియుండు వారిని దేవుడు నరకమునకు త్రోసివేయును. పాపముకు సంపూర్ణ క్షమాపణ యందు విశ్వాసముంచు వారిని పరలోకమునకు ఆహ్వానించును.

ఇప్పుడే సరియైనది ఎంచుకొనండి. ఈ నిర్ణయం తీసుకోవడంతో జాప్యం జరిగితే ఇక ముందు నీకు సమయం లభించక పోవచ్చును. నరకములోనికి అడుగు పెట్టుటకు ముందుగానే నీరు మరియు ఆత్మ ద్వారా శుద్దీకరింపబడండి. 

మన ప్రభువైన యేసుకు మహిమ కలుగును గాక. పాపులను, నీతిమంతులుగా పరివర్తన చేయు ఆయన కృపకు కృతజ్ఞతలు. హల్లెలూయ!యేసు:నీతిమంతులకు ఉత్తరవాది


 • పశ్చాత్తాప ప్రార్థనల వలన మన పాపములు తొలగింపబడునా?
 • లేదు, తొలగింపబడవు. అది అసంభవము. అపవాది మనను మోసగించు విధానాలలో ఇదియును ఒక విధానము.

1 యోహాను పత్రిక 2:1-2 ధ్యానిద్దాము “నా చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు వ్రాయుచున్నాను. ఎవడైను పాపము చేసిన యెడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రియొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతిరకమై యున్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకును శాంతికరమైయున్నాడు.’’

ఇక్కడ వ్రాయబడినది గ్రహించారా? యేసునందు విశ్వాసముంచి ఇంకనూ తమ హృదయములలో పాపము కలిగినవారెవరైనా ఉన్నారా? మీ హృదయములలో పాపము కలిగియుండి, లేదని చెప్పిన యెడల మీరు దేవుని మభ్యపెట్టుచున్నారు. మిమ్మును మీరు మోసగించుకొనుచున్నారు.

మీరు యేసుని సరిగా అర్థము చేసికొని, మీ పాపపరిహార నిమిత్తము యొర్దానులో ఆయన చేసినది గ్రహించిన యెడల, అంగీకరించిన యెడల మీరు సమస్త పాపము నుండి విమోచింపబడుదురు. మీరప్పుడీ విధముగా చెప్పవచ్చును. ‘‘ ప్రభువా, మీలో నేను నీరు మరియు ఆత్మ ద్వారా తిరిగి జన్మించాను. నాలో పాపమేమియులేదు. ప్రభూ, నేను నీతో మళ్ళీ ఆత్మతో జన్మించాను. నాకు పాపం లేదు. నేను సిగ్గు లేకుండా మీ ముందు నిలబడగలను.”

అప్పుడే ప్రభువిచ్చే సమాధానం, అవును, నీవు సరిగా పలికావు. అబ్రహాము నాలో నివశించెను. నన్ను నమ్మెను, నీతిమంతుడిగా తీర్పుపొందెను. అటులనే, నేను నీ పాపమును శుద్ధీకరించి యుండగా, దానిని విశ్వసించి, నీవును నీతిమంతునిగా పరిగణింపబడితివి.

యేసునందు విశ్వాసముంచి ఇంకనూ హృదయంలో పాపము కలిగియున్న వ్యక్తిని తీసుకుందాము.ఆ వ్యక్తి ఇలా అంటాడు.‘‘నేను యేసునందు విశ్వాసముంచాను గనుక, నా హృదయంలో ఇంకనూ కొంచెము పాపము నిలిచియున్నను నేను పరలోకములో ప్రవేశించగలను.’’

అతను ఎంతగానో పరలోకంలో ప్రవేశించాలని ఆశిస్తాడు. తీర్పు సమయంలో దేవుని సింహాసనం ఎదుట నిలచికూడా తన్నుతాను కాపాడుకొనుటకు ఎంతో ప్రయత్నిస్తాడు. అయిననూ నరకమే అతని గమ్యము కాగలదు. ఎందువలన? నీరు మరియు ఆత్మ ద్వారా తిరిగి జన్మించు ఈ ఆశీర్వాదకరమైన సువార్తను యెరిగి, విశ్వసించలేదు గనుక.

ఈ భూమి మీద ప్రాణంతో వున్నప్పుడే ప్రతి ఒక్కరు, తాము పాపులమని గ్రహించవలెను. నేను పాపిని, నేను నరకపాత్రుడను. నన్ను రక్షించండి అని ప్రార్థించవలెను. ఒక పాపి కేవలం పాపపరిహార ప్రార్థన వలన, పశ్చాత్తాపం వలన రక్షింపబడడు. అవి అవసరమే కానీ తాను పాపినని అంగీకరించి,ఈ పాప విమోచనాత్మకమైన నీరు మరియు ఆత్మ ద్వారా తిరిగి జన్మించు సత్యసువార్తను విశ్వసించవలెను.

యేసునందు కేవలం మన మూల పాపములు మాత్రమే పరిహరించబడెనని విశ్వసించుట అసత్య సిద్ధాంతమైయున్నది. రక్షణ నిమిత్తమై మనము చేసిన ప్రతి పాపమును అంగీకరించి, పశ్చాత్తాప ప్రార్థన చేయవలెననుటయు అసందిగ్ధ బోధయే. ఈ విశ్వాసము మనలను నరకమునకు తీసుకొని వెళ్లును. అనేక మంది విశ్వాసు లు ఈ అసత్య సువార్తను విశ్వసించి నరకమునకు వెళ్లుచున్నారు. ఈ విధమైన విధానము ఈ రోజులలో విస్తృతంగా ఆచరింపబడుతూ వున్నది. 

నీవు అబద్ధ సువార్తకు లోనైతివన్న విషయము తెలియునా? అప్పు సంపూర్ణముగా తీర్చివేసిన తరువాత కూడా నీవు తీర్చవలసినదింకేమైనా మిగిలి ఉండునా? ఆలోచించడండి. యేసునందు విశ్వాసముంచిన తరువాత కూడా ఇంకను నిన్ను నీవు పాపిగా ఎంచుకుంటే, నీ విశ్వాసము సరి అయినదని చెప్పవచ్చునా?   నీవు విశ్వాసివా మరియు పాపివా లేక నీవు విశ్వాసివా మరియు నీతిమంతుడివా?

ఏది కావాలో నీవే నిర్ణయించుకో. నీ సమస్త పాపము క్షమాపణ పొంది నావని విశ్వసించినా సరే లేక నీ అతిక్రమము నిమిత్తం ప్రతి దినం క్షమాభిక్ష పొందుతూ ఉండవలసినదే అని విశ్వసించినా సరే. నీ నిర్ణయాన్ని బట్టియే, నీవు పరలోకమునకు లేదా నరకమునకు పాత్రుడివన్నది నిశ్చయించబడుతుంది. నిజమైన సువార్తను నీకు తెలియపరిచే దైవజనుని వర్తమానమునకు విధేయుడవైన యెడల ఉపయోగము.

అబద్ధ సువార్తను విశ్వసించే వారు ప్రతి దినము ప్రాతఃకాల ప్రార్థనలో తమ పాపాలకు మన్నింపు కోరుకుంటూ ఉంటారు. ప్రతి బుధవారం ప్రార్థనలోనూ, ప్రతి శుక్రవారం సంపూర్ణరాత్రి ప్రార్థనలోను తమ పాపాలు శుద్దీకరించుకొనటానికి కష్టపడుతూ ఉంటారు.

  ‘‘దేవానేను పాపం చేశాను,ఈ వారం నేను పాపం చేశాను’’అని వాపోతుంటారు. అప్పుడు వారికి ఒక సంవత్సరం క్రితం చేసిన పాపాలు గుర్తుకి వస్తాయి.మరలా వాటి నిమిత్తమై క్షమాభిక్ష కొరకై ప్రార్థిస్తారు. నీరు మరియు ఆత్మ సంబంధమైన తిరిగి జన్మింపజేయు ఆశీర్వాదకరమైన సత్య సువార్తను త్రోసిపుచ్చుదురు.

మన పాపముకు వెల రక్తము ద్వారా చెల్లించాలి. హెబ్రీ పత్రిక 9:22 ప్రకారం ‘‘రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదు.’’ నీలో ఇంకనూ పాపములు నిలచి వున్నవని భావించినయెడల, వాటి క్షమాపణ నిమిత్తమై యేసు ఇంకనూ రక్తము చిందింపవలయునని నీ ఉద్దేశ్యమా? ఈ సంపూర్ణ విమోచన యందు విశ్వాసముంచిన వారు అసలు యేసు చేసిన ఈ విమోచనా బలియాగమును ఒక అబద్ధముగా చేయుచున్నారు. యేసు మనలను ఒక్కసారిగా విమోచించలేదని చెపుతూ, ప్రభువునే అబద్దీకుడిగా చేస్తున్నారు.

నీరు మరియు ఆత్మ ద్వారా లభించు విమోచనా సత్యము నందు విశ్వాసముంచినచో నీవు యేసుక్రీస్తు చేత విమోచింపబడగలవు. కేవలము నీవు చేసే వంద, వేల,లక్ష ప్రార్థనల వలన విమోచింపబడగలవా? నిజమైన సువార్త మనలను ఒక్కసారిగా, సంపూర్ణముగా విమోచించును. నీతిమంతునిగా మార్చబడి, పరలోకమునకేగి, నిత్యత్వములో నీతిమంతత్వములో నివసించవలెను. 

“♪యేసులో నేనొక నూతన సృష్టిని. గతం గతించింది. నేనొక నూతన సృష్టిని. వృధా అయిన గతం తొలగిపోయింది. ఓహో, యేసు నా జీవం, యేసులో నేనొక నూతన సృష్టిని.”

నీవు యేసులో ఒక నూతన సృష్టివి. ఒకవేళ నీ అంచనా ప్రకారం నీవు అందగాడివి కాకపోవచ్చు. నీవు పొట్టివాడివి కావచ్చు. నీవు చాలా లావుగా ఉండవచ్చు. ఏమైనా సరే ఈ ఆశీర్వదింపబడిన నీరు మరియు ఆత్మతో కూడిన సత్య సువార్తకు విధేయులైన వారు సంతోషభరితమైన జీవితం జీవిస్తారు. నీ ముక్కు వంకరగా ఉంటే ఇబ్బందేమిటి, లేక నీవు పొట్టిగా ఉంటే బాధేమిటి? మనమెవ్వరమూ సంపూర్ణులము కాము. మనం కేవలం యేసునందు నీరు మరియు ఆత్మ సంబంధమైన, తిరిగి జన్మింపచేయు సత్యసువార్త ద్వారా రక్షింపబడిన ప్రజానీకమైయున్నాము. అయితే దీనిని అంగీకరించిన వారి గమ్యము నరకమై యున్నది.

దేవా, నీకు కృతజ్ఞతలు. నేను ఎల్లప్పుడూ దేవునికి వందనస్థుడను. మనము నీరు మరియు ఆత్మ ద్వారా తిరిగి జన్మించామన్న విశ్వాసము కలిగి జీవిస్తున్నాము. మన గమ్యము పరలోకమైయున్నది.అసత్యము నరకమునకు నడుపును


 • ఎవరు పరలోకములో నీతికిరీటమునకు అర్హులైయున్నారు?
 • అసత్యమును అధిగమించువారే.

అసత్యము మనలను ప్రతిదినము పశ్చాత్తాపపడి, క్షమాపణ పొందవలసినదిగా నడుపును. అయితే నీరు మరియు ఆత్మ వలననైన సత్య సువార్తనందు మనమెన్నడో క్షమింపబడి యున్నామని, ఆ విషయం మనము అంగీకరించినచో మేలని తెలియజేస్తుంది.

అసలు ఏది సత్యము? మనము అనుదినము పశ్చాత్తాపము చెందవలసినదేనా? లేక యేసుక్రీస్తు సరియైన విధానములో బాప్తిస్మము పొంది లోక పాపమంతయు తొలగించెననుట సత్యమా? యేసు సరియైన విధానములో మనందరి పాపములు తానే ఒక్కొసారిగా స్వీకరించి మనకు రక్షణ అనుగ్రహించెననునదియే సత్యము.

ఈ ఆత్మ సంబంధమైన యుద్ధములో అబద్ధ బోధలను మనము జయించవలెను. అసత్యమునే అనేకమంది వెంబడించుచున్నారు.‘‘పెర్గమలో వున్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము వాడియైన రెండంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులేవనగా సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేనెరుగుదును. మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో, నాయందు విశ్వాసియై యుండి నన్నుగూర్చి సాక్షియైన అంతిపయనువాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నాయందలి విశ్వాసమును విసర్జింపలేదని నేనెరుగును’’ (ప్రకటన 2:12-13).

‘‘సంఘముతో ఆత్మచెప్పుచున్న మాట చెవిగలవాడు వినును గాక. జయించువానికి మరుగైయున్న మన్నాను భుజింపనిత్తును.మరియు అతనికి తెల్లరాతినిత్తును; ఆ రాతిమీద చెక్కబడిన యొక క్రొత్తపేరుండును; పొందిన వానికే గాని అది మరి యెవనికిని తెలియదు’’ (ప్రకటన 2:17).

అనేకమైన దురాత్మల సముహము సంచరించుచుండగా, అసత్యము, సత్యము వలె కన్పించుచుండగా, సాతాను వెలుగు దూతవేషములో ఉండియున్నాడు. నీరు మరియు ఆత్మ ద్వారా లభించు రక్షణలోని సత్యమును వినియు విశ్వసించువారికి దేవుడేలాగు సాయము చేయును? అటువంటి వ్యక్తుల గమ్యము నరకమైయున్నది.

యేసుక్రీస్తు అనుగ్రహించిన రక్షణ యందు విశ్వాసముంచవలెనో లేదో ఎవరికి వారు నిర్ణయించుకొనవలసిన విషయము.నీయందు మోకాళ్లూని, అయ్యా, ఈ సువార్తను వినండి, నమ్మండి, రక్షింపబడండి అని ఎవ్వరూ వేడుకొననవసరము లేదు. 

నీవు పాపము నుండి విడిపించబడి రక్షణ పొందవలెనంటే, నీరు మరియు ఆత్మ సంబంధమైన రక్షణ నందు విశ్వాసముంచవలయును. దేవుని రక్షణార్థమైన ప్రేమ మరియు కృపకు కృతజ్ఞుడవై ఉండగోరిన యెడల, ఈ సువార్తను విశ్వసించు. నీవు ఒక పాపివై, ముందు విశ్వసించు. యేసుపొందిన బాప్తిస్మము మరియు సిలువ మరణము యందు విశ్వాసముంచు. అప్పుడే నీవు నీతిమంతుడవు కాగలవు.

ఒక పాపినని నీవు భావించనట్లయితే, అప్పుడు యేసునందు విశ్వాసముంచి విమోచన పొందవలసిన అవసరతే లేదు. నీరు మరియు ఆత్మ ద్వారా తిరిగి జన్మించు అనుభవము పొందుకొను పాపులే ఈ సువార్త ద్వారా విమోచింపబడుదురు. యేసు పాపుల రక్షకుడు, కష్టములోనున్న వారికి ఆదరణ దయచేయువాడు. యేసు సృష్టికర్త. యేసే ప్రేమామయుడు.

నీరు మరియు ఆత్మ సంబంధమైన సువార్త యందు విశ్వాసముంచి, తిరిగి జన్మించిన అనుభవము పొందవలసినదిగా నేను హృదయపూర్వకముగా మిమ్ము వేడుకుంటున్నాను. దీనియందు విశ్వాసముంచండి. అప్పుడు యేసు మనకు రక్షకుడు, స్నేహితుడు, కాపరి మరియు దేవుడు కాగలడు. పాపి యేసును విశ్వసించాలి నరకమునకు వెళ్లగోరని యెడల యేసుని విశ్వసించాలి. దేవుడు మనలను ఈ రక్షణాత్మకమైన సువార్తకు విధేయులు కావలసినదిగా ప్రాధేయపడడు.

నీవు పరలోకములో ప్రవేశింపగోరుచున్నావా?అయితే తిరిగి జన్మించు అనుభవమును దయచేయు నీరు మరియు ఆత్మ సంబంధమైన సువార్తను విశ్వసించు.‘‘నేనే మార్గమును, సత్యమును, జీవమును అయి ఉన్నాను’’ అని యేసు పలికాడు. అయితే నీవు నరకంలోనికి పడద్రోయబడాలని కోరుకుంటున్నావా? అయితే ఈ సువార్తను విశ్వసించవలసిన అవసరత లేదు. ఎందుకంటే నీ కొరకై ఇప్పటికే నరకములో స్థలము సిద్ధపరచబడియున్నది. 

దేవుడు నిన్ను ప్రాధేయపడడు. బేరగాడు ఏవిధముగానైన సరే తన సరుకును అమ్ముకోవాలని చూస్తాడు. కానీ దేవుడు విమోచింపబడిన వారినే పరలోక ప్రాప్తులుగా చేస్తాడు. దేవుడు నీతిమంతుడు.

అనేకులు ఇవి చివరి రోజులుగా సెలవిస్తున్నారు. అవును, నాకు అలాగే అనిపిస్తుంది. కనుక ఈ చివరి దినాలలో నైనాసరే నీరు మరియు ఆత్మ ద్వారా తిరిగి జన్మింపజేయు సువార్తను వినకుండుట మూర్ఖత కదా!

ఈ ఆశీర్వాద భరితమైన నీరు మరియు ఆత్మ సంబంధమైన సువార్తను విశ్వసించండి. తిరిగి జన్మించిన అనుభవాన్ని పొందుకొనండి. మనందరము కలసి పరలోక రాజ్యములోనికి ప్రవేశిద్దాము. మన ప్రభువైన యేసు సదాకాలము నివసించే ఆ ప్రదేశానికి నీవును నాతో కలసి రానైయున్నావా?


 • నీవు పాపివా లేక నీతిమంతుడవా?
 • నీతిమంతుడనగా హృదయములో పాపము కలిగియుండని వాడు.


రోమా 8:1-2 ద్యానిద్దాము.‘‘కాబట్టి యిప్పుడు క్రీస్తుయేసునందున్నవారికి ఏ శిక్షావిధియు లేదు. క్రీస్తుయేసునందు జీవమునిచ్చు ఆత్మయొక్క నియమము పాపమరణము నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలక పోయెనో దానిని దేవుడు చేసెను.’’

యేసు తాను పొందిన బాప్తిస్మo ద్వారా మన సకల పాపములను తానే వహియించెను, ఆయన సిలువ మరణము ద్వారా తొలగించెను. మన పాపముల నిమిత్తమై తీర్పు పొందనై యుండగా ఆయనే పాపులమైన మనలను రక్షించెను.

దేవుని రక్షణలో రెండు విషయాలు నిక్షిప్తమయి వున్నాయి. ఒకటి ధర్మశాస్త్రము, మరియొకటి ప్రేమ. మనము పాపులమని ధర్మశాస్త్రము బోధించును. ధర్మశాస్త్రానుసారము పాపము యొక్క జీతము మరణము. ధర్మశాస్త్రము మనలను రక్షించనేరదు. అది మన పాప స్వభావము గురించి, మనకు లభించవలసిన శిక్ష గురించి బోధించును. ధర్మశాస్త్రము మనలను పాపులుగా ముద్రవేయును.

ఈ పాపమునకు జీతము చెల్లించుటకే యేసు ఈ లోకానికి వచ్చాడు. మన పాపములన్నియు ఆయనే వహించాడు, వాటికి జీతము చెల్లించాడు. తన ప్రాణాన్ని ధారపోశాడు. మనలను తీర్పునుండి, శిక్ష నుండి తప్పించాడు. మన పాపము నుండి మనలను రక్షించినది దేవుని అద్వితీయమైన ప్రేమయే.

మనమిప్పుడు అబద్ధ బోధను జయించవలెను. ఈ అసత్యమును జయించిన వానికి దేవుడు నీరు మరియు ఆత్మ ద్వారా తిరిగి జన్మించు ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తాడు.

మనము యేసునందు విశ్వాసముంచి రక్షింపబడ్డాము. ఆయన మాటలను విశ్వసించాము. మనము సత్యమును అర్థం చేసుకొని, నీతిమంతత్వమును సంపాదించుకున్నాము. మీ హృదయములో నీరు మరియు ఆత్మ ద్వారా తిరిగి జన్మింపజేయు సత్యమును విశ్వసించండి, మీరు రక్షింపబడగలరు.