Sermons

[అధ్యాయము 2-3] <ప్రకటన 2: 8-11> స్ముర్నలోఉన్న సంఘమునకు వ్రాయు లేఖ<ప్రకటన 2: 8-11>

స్ముర్నలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము, మొదటివాడును కడపటివాడునైయుండి, మృతుడై మరల బ్రదికినవాడు చెప్పుసంగతులేవనగా నీ శ్రమను దరిద్రతను నేనెరుగుదును, అయినను నీవు ధనవంతుడవే; తాము యూదులమని చెప్పుకొనుచు, యూదులు కాక సాతాను సమాజపు వారివలన నీకు కలుగుదూషణ నేనెరుగుదును, ఇదిగో మీరు శోధింపబడునట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోవుచున్నాడు; పదిదినములు మీకు శ్రమ కలుగును; మరణము వరకు నమ్మకముగా ఉండుము.నేను నీకు జీవకిరీట మిచ్చెదను. సంఘములతో ఆత్మచెప్పుచున్నమాట చెవిగలవాడు వినునుగాక. జయించువాడు రెండవ మరణమువలన ఏ హానియుచెందడు.వ్యాఖ్యానము


8 వవచనం: “స్ముర్నలో ఉన్న సంఘపుదూతకు ఈలాగువ్రాయుము మొదటివాడును కడపటివాడునైయుండి, మృతుడై మరల బ్రదికినవాడు చెప్పు సంగతులేవనగా’’.

పౌలు ఎఫెసీ సంఘానికి పరిచర్య చేస్తున్నప్పుడు స్ముర్న సంఘo స్థాపించబడింది. పై వాక్యం ప్రకారం, ఈ సంఘo సభ్యులు చాలా పేదవారు, వారి విశ్వాసం కారణంగా, సమాజంలోని యూదులచే వారికి విరోధం కలిగింది. ఈ సంఘాన్ని యూదులు ఎంతగా హింసించారో సంఘ ఫాదర్స్ యుగంలో పర్యవేక్షకుడైన పాలికార్ప్ యొక్క హతసాక్షమును చూడవచ్చు. ప్రారంభ సంఘo యొక్క పరిశుద్ధులు క్రీస్తును తమ మెస్సీయగా తిరస్కరించిన యూదుల యొక్క విశ్వాసులచే నిరంతరం హింసను ఎదుర్కొన్నారు.

స్ముర్న యొక్క సంఘo, అపొస్తలుడైన పౌలు చేత స్థాపించబడింది." మొదటివాడును కడపటివాడునైయుండి, మృతుడై మరల బ్రదికినవాడు"ద్వారా, విశ్వాన్ని సృష్టించిన సృష్టికర్తను యోహాను చూచియున్నాడు. కన్యకయైన మరియ నుండి జన్మించిన మన ప్రభువు,యోహాను తన బాప్తిస్మం చేత ప్రపంచంలోని పాపాలను స్వీకరించాడు మరియు సిలువపై రక్తం చిందించడం ద్వారా ఈ పాపాలకు తీర్పు తీర్చబడింది. ఆ తరువాత ఆయన మూడు రోజులలో మృతులలోనుండి లేచి దేవుని కుడి వైపున కూర్చున్నాడు. యేసు దేవుని యొక్క సంఘ దేవదూతతో మన రక్షకుడిగానే కాకుండా సర్వశక్తిమంతుడైన దేవుడిగా కూడా మాట్లాడుతాడు.

9 వ వచనం: “నీ శ్రమను దరిద్రతను నేనెరుగుదును, అయినను నీవు ధనవంతుడవే; తాము యూదులమని చెప్పుకొనుచు, యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేనెరుగుదును’’. 

స్ముర్న యొక్క సంఘo ఎదుర్కొంటున్న అన్ని ఇబ్బందులు మరియు కష్టాలు ప్రభువుకు తెలుసు. భౌతికంగా ఇది పేద సంఘమైనప్పటికీ, స్ముర్న యొక్క సంఘo ఆధ్యాత్మికంగా గొప్పది. స్ముర్న యొక్క సంఘoలో చాలా మంది యూదులు నివసించారు,వీరిని దేవుడు "యూదులు అనియు మరియు వారు యూదులు కాదని సాతాను యొక్క ప్రార్థనా మందిరం" అని వర్ణించారు.

ఈ యూదులు తమ ప్రయోజనాలను నెరవేర్చడానికి సాతాను యొక్క సాధనాలుగా తమును తాము అప్పగించుకొన్నారు. తద్వారా నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను ప్రకటించటానికి అవరోధాలుగా మారారు, మరియు దేవుని సంఘమును హింసించారు. వారు మాత్రమే సనాతన యూదులు అనియు, వారు మాత్రమే అబ్రాహాము పిల్లలు అనియు వారు విశ్వసించారు. వాస్తవానికి వారు అబ్రాహాము విశ్వాసాన్ని అనుసరించడంలో విఫలమవ్వడమే కాక, అధ్వాన్నంగా, వారు తమ పూర్వీకుల దేవుణ్ణి తిరస్కరించారు. ఈ యూదులచే తీవ్రంగా హింసించబడిన, స్ముర్న యొక్క సంఘo పేదరికంగా ఉన్నాను, ఇప్పటికీ అది ఆధ్యాత్మికతలో సంపన్నమైన సంఘo. 

10 వ వచనం: “ఇదిగో మీరు శోధింపబడునట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోవుచున్నాడు; పది దినములు శ్రమకలుగును; మరణమువరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవకిరీట మిచ్చెదను’’.

స్ముర్న యొక్క సంఘమునకు దేవుడు "మీరు బాధపడబోయే వాటికి భయపడవద్దు" అని చెప్పాడు. "మరణం వరకు నమ్మకముగా ఉండుమని"ఆయన వారితో చెప్పాడు మరియు వారికి "జీవకిరీటాన్ని" ఇస్తానని వాగ్దానం చేశాడు. స్ముర్న యొక్క సంఘములో కొంతమంది పరిశుద్దులను సాతాను బెదిరిస్తాడని మరియు వారి విశ్వాసాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తాడని ప్రభువుకు ముందే తెలుసు. అందువల్ల వారు మరణం వరకు, ఆయనకు విశ్వాసపాత్రంగా ఉంటే, వారికి జీవిత కిరీటాన్ని ఇస్తానని ఆయన వాగ్దానం చేశాడు.

ఈ వచనము ద్వారా ప్రభువు మనకు చెబుతున్నది ఏమిటంటే, దేవుని సేవకులు మరియు చివరి కాలంలో నివసించే ఆయన పరిశుద్ధులు కూడా సాతాను మరియు అతని అనుచరులు చేత హింసించబడతారు. మరణం వరకు దేవునికి విశ్వాసపాత్రంగా ఉండటానికి మనకు బలం ఉంటుంది, ఎందుకంటే ఈ బలం నీరు మరియు ఆత్మ యొక్క సువార్తపై మన విశ్వాసం మరియు దేవుడు మనకు వాగ్దానం చేసిన క్రొత్త పరలోకం మరియు భూమిపై మన నిరీక్షణ నుండి పుష్కలంగా వస్తుంది.

11 వ వచనం: “సంఘములతో ఆత్మచెప్పుచున్నమాట చెవిగలవాడు వినును గాక.జయించువాడు రెండవ మరణము అంత్యక్రీస్తుకు వలన ఏ హానియుచెందడు’’.

చివరి కాలపు విశ్వాసులు అంత్యక్రీస్తుకు మరియు దేవునికి వ్యతిరేకంగా నిలబడేవారికి వ్యతిరేకంగా యుద్ధంలో పాల్గొంటారు. నిజమైన సువార్త మరియు పరలోకం కోసం నిరీక్షణ కలిగి ఉన్నవారు తమ విశ్వాసంతో విజయం సాధిస్తారని దేవుడు మనకు చెబుతాడు. తన సత్యం మరియు విశ్వాసం యొక్క వాక్యాన్ని మనకు ఇవ్వడం ద్వారా, దేవుడు ప్రతి విశ్వాసి తన శత్రువులను అధిగమించడానికి వీలు కల్పించాడు. మిగిలి ఉన్న ఏకైక ప్రశ్న ఏమిటంటే, మనం దేవుని మరియు ఆయన సేవకుల పక్షాన ఉంటాం కదా.

రోమా 8:18 మనకు చెబుతుంది,"మనయెడల ప్రత్యక్షము కాబోవు మహిమయెదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని యెంచుచున్నాను." అంత్యక్రీస్తు మరియు అతని అనుచరులు మన పై చేయు హింస కొంతకాలం మాత్రమే ఉంటుంది, బహుశా కేవలం 10 రోజులు. దేవుణ్ణి నమ్ముతూ, మీరు ఈ స్వల్ప కాలపు బాధలను తట్టుకోవచ్చు, అలాగే అంత్యక్రీస్తును జయించవచ్చు మరియు దేవుణ్ణి మహిమపరచవచ్చు, మరియు ఆయన నిత్య రాజ్యాన్ని బహుమతిగా మీరు స్వీకరించవచ్చు. అంత్యక్రీస్తుకు వ్యతిరేకంగా చేసిన యుద్ధంలో విజయం సాధించడానికి దేవుడు పరిశుద్ధులకు బలం అనుగ్రహించును.

నీరు మరియు ఆత్మ యొక్క సువార్త విశ్వాసంతో అంత్యక్రీస్తు పై విజయం సాధిద్దాం, మరియు మనమందరం వెయ్యేండ్ల పాలన మరియు క్రొత్త ఆకాశము మరియు భూమిలో శాశ్వతంగా కలిసి జీవించడానికి మళ్ళీ కలుద్దాం. ఇక్కడ మొదటి మరణం మన శారీరక మరణాన్ని సూచిస్తుంది, రెండవ మరణం నరకం యొక్క శాశ్వతమైన శిక్ష ద్వారా ఆధ్యాత్మిక మరణాన్ని సూచిస్తుంది.పరిశుద్ధులకు హతసాక్షులకు, వారి శారీరక మరణం ఉంది, కానీ ఆధ్యాత్మిక మరణం లేదు.

ప్రారంభ సంఘo యొక్క హతసాక్షులకు ఇచ్చినట్లుగా, ఈ చివరి కాలంలో విశ్వాసులైన మనకు బలిదానం యొక్క కీర్తి మరియు గౌరవం ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు.