Sermons

[అధ్యాయము 3-3] <ప్రకటన 3: 7-13> ఫిలదెల్పియా సంఘమునకు వ్రాయు లేఖ<ప్రకటన 3: 7-13>

“ఫిలదెల్ఫియలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము దావీదు తాళపుచెవి కలిగి,యెవడును వేయ లేకుండ తీయువాడును, ఎవడును తీయలేకుండ వేయువాడునైన సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పుసంగతులేవనగా నీక్రియలను నేనెరుగుదును; నీకున్న శక్తి కొంచెమై యుండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు. ఇదిగో తలుపు నీయెదుట తీసియుంచి యున్నాను; దానిని ఎవడును వేయనేరడు. యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించెదను; వారు వచ్చి నీ పాదముల యెదుట పడి నమస్కారముచేసి, ఇదిగో, నేను నిన్ను ప్రేమించితినని తెలిసికొనునట్లు చేసెదను.నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూ నివాసులను శోధించుటకు లోకమంతటిమీదికి రాబోవు శోధన కాలములో నేనును నిన్ను కాపాడెదను. నేను త్వరగా వచ్చుచున్నాను; ఎవడును నీ కిరీటము నపహరింపకుండునట్లు నీకు కలిగినదానిని గట్టిగా పట్టుకొనుము.జయించు వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసెదను; అందులోనుండి వాడు ఇకమీదట ఎన్నటికిని వెలుపలికిపోడు. మరియు నా దేవుని పేరును, పరలోకములో నా దేవుని యొద్దనుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమను నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద వ్రాసెదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినునుగాక.’’వ్యాఖ్యానం


7 వ వచనం: “ఫిలదెల్ఫియలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము దావీదు తాళపుచెవి కలిగి, యెవడును వేయ లేకుండ తీయువాడును, ఎవడును తీయలేకుండ వేయువాడునైన సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పుసంగతు లేవనగా”’

ప్రభువు అందరికీ రాజుగా పరలోకరాజ్యాన్ని పరిపాలిస్తాడు. ఆయన సంపూర్ణ అధికారం మరియు శక్తి కలిగిన దేవుడు- ఆయన తెరిచినది ఎవరూ మూసివేయలేరు, మరియు అతను మూసివేసేది ఎవరూ తెరవలేరు. ఈ భూమ్మీదకు వచ్చి పాపులను వారి పాపాలన్నిటినీ నీటి సువార్తతో, ఆత్మతో విడిపించిన ప్రభువు పరిపూర్ణ దేవుడు. నీటి సువార్తకీ మరియు ప్రభువు ఇచ్చిన ఆత్మతో మాత్రమే పరలోకం యొక్క ద్వారం తెరవబడుతుంది. మరేదీ తెరవదు, ఎందుకంటే ఈ రాజ్యానికి చెందిన ప్రతిదీ మన ప్రభువైన దేవుడిపై ఆధారపడి ఉంటుంది.

8 వ వచనం: “నీ క్రియలను నేనెరుగుదును; నీకున్న శక్తి కొంచెమై యుండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు. ఇదిగో తలుపు నీయెదుట తీసియుంచి యున్నాను; దానిని ఎవడును వేయనేరడు”.

 ప్రభువు దేవుని సంఘం ద్వారా సువార్త ప్రచారానికి తలుపులు తెరిచాడు. అందుకని, ప్రభువు అనుమతి లేకుండా ఎవరూ తలుపు మూసివేయలేరు. అందువల్ల పరిశుద్ధులు తమ మొదటి విశ్వాసాన్ని చివరి వరకు, ప్రభువు తిరిగి వచ్చేటప్పుడు గట్టిగా పట్టుకోవాలి. దేవుని సేవకులు మరియు ఆయన పరిశుద్ధులు కలిగి ఉండవలసిన విశ్వాసం ఇది. వారి విశ్వాసం ప్రారంభమున పెద్దదిగా ఉండవచ్చును కాని చివరికి అది చనిపోయిన రకం కాకూడదు. ప్రభువు వారికి ఇచ్చిన మొదటి, మార్పులేని విశ్వాసాన్ని వారు పట్టుకోవాలి.

 పరిశుద్ధుల యొక్క విశ్వాసం నీరు మరియు ఆత్మ యొక్క సువార్తపై ఉన్నది, మన ప్రభువు రాజ్యం ఈ భూమ్మీదకు మరియు క్రొత్త ఆకాశం మరియు భూమ్మీదకు రెండును వచ్చును అనే నమ్మకం, మరియు మనమందరం అందులో జీవిస్తాము ఈ రాజ్యంలో ఎప్పటికీ అంతములేనిది. రాబోయే ప్రభువును కలిసే రోజు వరకు పరిశుద్ధులు ఈ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోవాలి.

 ఫిలదెల్పియా సంఘo సేవకుడు మరియు పరిశుద్ధులకు కొంచెం బలం మాత్రమే ఉంది. వారికి చాలా లోపాలు కూడా ఉన్నాయి. అయితే, ముఖ్యంగా, వారు దేవుని వాక్యాన్ని పాటించారు మరియు ప్రభువు పేరును ఖండించలేదు.

9 వ వచనం: “యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించెదను; వారు వచ్చి నీ పాదముల యెదుట పడి నమస్కారముచేసి, ఇదిగో, నేను నిన్ను ప్రేమించితినని తెలిసికొనునట్లు చేసెదను’’.

దేవుడు తన తప్పుడు విశ్వాసులలో కొంతమందిని మోకాళ్ళను వంచునని, తద్వారా దేవుడు తన సంఘo అయిన ఫిలడెల్ఫియా సంఘాన్ని నిజంగా ఎంతగా ప్రేమిస్తున్నాడో వారికి తెలుస్తుంది.

సాతాను సమాజపు వారిని రప్పించెదను; వారు వచ్చి నీ పాదముల యెదుట పడి నమస్కారముచేసి, ఇదిగో, నేను నిన్ను ప్రేమించితినని తెలిసికొనునట్లు చేసెదను."తమ విశ్వాసంతో తమను తాము దేవుని మహిమపరుస్తున్నట్లు భావించిన యూదులను సూచిస్తుంది. కానీ వారిలో చాలామంది, వాస్తవానికి అలా లేరు,దీనికి విరుద్ధంగా, వారు సాతాను సేవకులుగా మారారు మరియు దేవుని సంఘానికి ఆయన పరిశుద్ధులకు ఆటంకం కలిగిస్తున్నారు. ఈ రోజుల్లోనూ, మునుపటిలాగే, యేసు నామాన్ని ప్రార్థిస్తూ, ఆయనను ఆరాధించే వారిలో చాలామంది సాతాను సేవకులుగా మారిపోయారని, దెయ్యం వారిని తన సాధనాలుగా ఉపయోగించుకుంటున్నాడని మనం గ్రహించాలి. ఫిలదెల్పియా సంఘం సేవకుడిపై దేవుడు ప్రత్యేక ప్రేమను చూపించాడు, అతనిని ప్రేమించుటయో కాక గౌరవ పాత్రగా ఉపయోగిచుట చూడగలము.

10 వ వచనం: “నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూ నివాసులను శోధించుటకు లోకమంతటిమీదికి రాబోవు శోధన కాలములో నేనును నిన్ను కాపాడెదను’’.

ముఖ్యంగా, ఫిలదెల్పియా సంఘం యొక్క సేవకుడు పట్టుదల కలిగి ఉండుటను ప్రభువు అభినందించాడు.ఈ రకమైన ప్రత్యేక సహనం లేకపోతే, వాస్తవానికి, దేవుని వాగ్దానాలన్నియు మన యెడల నెరవేర్చబడుటకు మనము వేచి ఉండలేము. పట్టుదలతో ఉండాలని ఆయన ఆజ్ఞను పాటించాలంటే, మనము దేవుని వాక్యంపై సంపూర్ణ విశ్వాసం ఉంచాలి. దాని పట్టుదలకు, ప్రభువు ఫిలదెల్పియా సంఘానికి ప్రత్యేక బహుమతిని ఇచ్చాడు. ఈ ప్రత్యేక బహుమతి ఫిలదెల్పియా సంఘానికి సహించిన శ్రమల రూపంలో నుండి వచ్చింది. ఇక్కడ శ్రమల రూపం అంత్యక్రీస్తు యొక్క అడ్డగింతను సూచిస్తుంది. 

11 వ వచనం: “నేను త్వరగా వచ్చుచున్నాను; ఎవడును నీ కిరీటము నపహరింపకుండునట్లు నీకు కలిగినదానిని గట్టిగా పట్టుకొనుము.

 ప్రభువు తిరిగి రావడం ఆసన్నమైనందున, పరిశుద్ధులు నీటి సువార్త మరియు ఆత్మపై తమ విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ప్రభువు వాగ్దానం చేసిన క్రొత్త ఆకాశము మరియు క్రొత్త భూమి కోసం వారు నిరీక్షణతో వేచి ఉండాలి. దేవుని సేవకులు పరిశుద్ధులతో ఉండాలి మరియు వారి విశ్వాసం కోల్పోకుండా వారిని కాపాడుకోవాలి, అలా చేయుట ద్వారా దేవుని నుండి వచ్చే బహుమానం వారు పోగొట్టకొనరు. 

12 వ వచనం: “జయించు వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసెదను; అందులోనుండి వాడు ఇకమీదట ఎన్నటికిని వెలుపలికిపోడు. మరియు నా దేవుని పేరును, పరలోకములో నా దేవుని యొద్దనుండి దిగివచ్చుచున్న నూతనమైన యెరూషలేమను నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద వ్రాసెదను.

సాతానును జయించిన వారు హతసాక్షులలో చేర్చబడతారు. వారి పేర్లు దేవుని రాజ్యంలో పవిత్ర ఆలయంలో కూడా వ్రాయబడతాయి. ఇప్పుడు కూడా, వారు దేవుని సంఘం యొక్క గొప్ప సేవకులుగా వాడబడుచున్నారు, మరియు వారు ప్రభువు చేత సాధనాలుగా ఉపయోగించబడుతున్నారు.

13 వ వచనం: “సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినునుగాక’’’. 

దేవుని వాక్యాన్ని వినడానికి చెవులున్న వారు, దేవుని సేవకులు మరియు ఆయన పరిశుద్ధులు. దేవుని సంఘంలో ఆత్మా చెప్పు మాటను వారు వింటారు. అందుకని, దేవుని సేవకులు మరియు ఆయన పరిశుద్ధులు దేవుడు అనుమతించిన సంఘములోనే ఉండాలి మరియు వారు ఈ సంఘాన్ని కాపాడుతూ ఉండాలి.