Sermons

[అధ్యాయము 4-1] <ప్రకటన 4: 1-11> ఆసీనుడైన యేసువైపు చూడుము<ప్రకటన 4: 1-11>

“ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరువబడియుండెను.మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వనివలె నాతో మాటలాడగా వింటిని.ఆ మాటలాడినవాడు ఇక్కడికి ఎక్కిరమ్ము;ఇకమీదట జరుగవలసిన వాటిని నీకు కనుపరచెదననెను వెంటనే నేను ఆత్మవశుడనైతిని. అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడియుండెను. సింహాసనమునందు ఒకడు ఆసీసుడైయుండెను, ఆసీనుడైనవాడు, దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు; మరకతమువలె ప్రకాశించు ఇంద్రధనుస్సు సింహాసనమును ఆవరించియుండెను. సింహాసనముచుట్టు ఇరువది నాలుగు సింహాసనములుండెను, ఈ సింహాసనములందు ఇరువది నలుగురు పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని, తమ తలలమీద సువర్ణ కిరీటములు పెట్టుకొన్నవారై కూర్చుండిరి. ఆ సింహాసనములో నుండి మెరుపులును ధ్వనులును ఉరుములును బయలుదేరుచున్నవి. మరియు ఆ సింహాసనము ఎదుట ఏడు దీపములు ప్రజ్వలించుచున్నవి; అవి దేవుని యేడు ఆత్మలు. మరియు ఆ సింహాసనము ఎదుట స్ఫటికమును పోలిన గాజువంటి సముద్రమున్నట్టుండెను. ఆ సింహాసనమునకు మధ్యను సింహాసనము చుట్టును, ముందు వెనుక కన్నులతో నిండిన నాలుగు జీవులుండెను. మొదటి జీవి సింహమువంటిది; రెండవ జీవి దూడవంటిది; మూడవ జీవి మనుష్యుని ముఖము వంటి ముఖముగలది; నాలుగవ జీవి యెగురుచున్న పక్షిరాజువంటిది. ఈ నాలుగు జీవులలో ప్రతి జీవికి ఆరేసి రెక్కలుండెను, అవి చుట్టును రెక్కల లోపటను కన్నులతో నిండియున్నవి.అవిభూతవర్తమాన భవిష్యత్కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడునగు ప్రభువు: 

పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, 

అని మానక రాత్రింబగళ్లు చెప్పుచుండును.

 ఆ సింహాసనము నందు ఆసీనుడైయుండి,

యుగయుగములు జీవించుచున్న వానికి, 

మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులును కలుగునుగాకని! 

ఆ జీవులు కీర్తించుచుండగా ఆ యిరువది నలుగురు పెద్దలు సింహాసనమునందు ఆసీనుడై యుండువాని యెదుట సాగిలపడి, యుగయుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు ప్రభువా, 

మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి; 

నీ చిత్తమునుబట్టి అవి యుండెను; దానిని బట్టియే సృష్టింపబడెను, 

గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొంద నర్హుడవని చెప్పుచు, 

తమ కిరీటములను ఆ సింహాసనము యెదుట వేసిరి.’’’’వ్యాఖ్యానం


1 వ వచనం: ”ఈసంగతులు జరిగిన తరువాత నేనుచూడగా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరువబడియుండెను. మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వనివలె నాతో మాటలాడగా వింటిని. ఆ మాటలాడినవాడుఇక్కడికి ఎక్కిరమ్ము; ఇకమీదట జరుగవలసినవాటిని నీకు కనుపరచెదననెను’’. 

ప్రారంభములో పరలోకం యొక్క ద్వారం మూసివేయబడింది. యేసు ఈ భూమ్మీదకు రావడం, యోహాను చేత బాప్తిస్మం తీసుకోవడం, సిలువపై చనిపోవడం మరియు మరల మృతులలోనుండి లేవడం ద్వారా పాపులు దోషాల నుండి విడిపించినప్పుడు, ఈ ద్వారం తెరువబడి ఉంది. అంత్యకాలంలో ప్రపంచం ఎదురుచూస్తున్న వాటిని దేవుడు తన దేవదూతల ద్వారా అపొస్తలుడైన యోహానుకు వెల్లడించాడు.

2 వ వచనం: “వెంటనే నేను ఆత్మవశుడనైతిని. అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడియుండెను.సింహాసనమునందు ఒకడు ఆసీసుడై యుండెను”. 

పరలోకం యొక్క బహిరంగ ద్వారం ద్వారా, మరొక సింహాసనం పరలోకంలో సిద్ధమైందని, దానిపై కూర్చున్నవాడు యేసుక్రీస్తు అని యోహాను చూశాడు.ఆసింహాసనం చుట్టూ నాలుగు జీవులు, 24 మంది పెద్దలు మరియు ఏడు ఆత్మలు ఉన్నాయి.

ప్రపంచంలోని పాపము నుండి పాపులను రక్షించే పనిని పూర్తి చేసినందుకు ప్రభువు తండ్రి నుండి దేవుని సింహాసనాన్ని పొందాడు.యేసు ఈ భూమిపై ఉన్నప్పుడు, బాప్తీస్మం మిచ్చు యోహాను ద్వారా బాప్తీస్మం పొందడం ద్వారా, ప్రభువు ప్రపంచంలోని అన్ని పాపాలను స్వయంగా స్వీకరించాడు మరియు సిలువపై మరణించడం ద్వారా మరియు మృతులలోనుండి తిరిగి లేవడం ద్వారా పాపులందరినీ వారి దోషాల నుండి విడిపించాడు. అందుకే తండ్రి దేవుడు తన కుమారుడి కోసం పరలోకంలో ఈ సింహాసనాన్ని అనుమతించాడు.

కొందరు యేసును పరిమితి ధోరణిలో చూస్తారు, ఆయనను దేవుని కుమారుడిగా మరియు రక్షకుడిగా గుర్తించారు, కానీ ఇక మీదట. యేసుక్రీస్తు దేవుని సింహాసనం నుండి పరలోకాన్ని పరిపాలించే సార్వభౌమ అధికారం కలిగిన రాజుగా కూర్చున్నాడు.

యేసు తన సింహాసనం కోసం తండ్రికి వ్యతిరేకంగా వాదించాడని దీని అర్థం కాదు. తండియైన దేవుని సింహాసనం ఇప్పటికీ ఉంది. ఇది ఆయన కుమారుని కోసం పరలోకంలో మరొక సింహాసనాన్ని అనుమతించాడు,ఆయనను పరలోకo యొక్క రాజుగా పట్టాభిషేకం చేసి, దేవునికి వ్యతిరేకంగా నిలబడే వారందరికీ న్యాయమూర్తిగా స్థిరపడ్డాడు. తండ్రియైన దేవుడు యేసుక్రీస్తును పరలోకoలోను మరియు భూమిలోని అందరికంటే ఎక్కువగా దేవుడిగా హెచ్చించాడు.యేసుక్రీస్తు ఇప్పుడు తండ్రి దేవునితో సమానం,కాబట్టి మన రక్షకుడైన, దేవునిగా యేసును మనం స్తుతించి ఆరాధించాలి.

3వ వచనం: “ఆసీనుడైనవాడు, దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు; మరకతమువలె ప్రకాశించు ఇంద్రధనుస్సు సింహాసనమును ఆవరించియుండెను”. 

ఈ వాక్యం నూతన సింహాసనం పై కూర్చున్న దేవుని మహిమను వివరిస్తుంది

4 వ వచనం: సింహాసనముచుట్టు ఇరువది నాలుగు సింహాసనములుండెను, ఈ సింహాసనములందు ఇరువదినలుగురు పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని, తమ తలలమీద సువర్ణ కిరీటములు పెట్టుకొన్నవారై కూర్చుండిరి’’.

యేసుక్రీస్తు సింహాసనం చుట్టూ మన దేవుడు తన సేవకులను కూర్చుండబెట్టెను. దేవుని సింహాసనం చుట్టూ మరో 24 సింహాసనాలు ఉన్నాయని, ఈ సింహాసనాలపై 24 మంది పెద్దలు తమ తలపై బంగారు కిరీటాలతో కూర్చున్నారని ఇక్కడ పేర్కొంది. ఈ పెద్దలు 24 సింహాసనాలపై కూర్చోవడం దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదం. ఈ పెద్దలు, ఈ భూమిపై ఉన్నప్పుడు, శ్రమించి, ప్రభువు రాజ్యం కోసం హతసాక్షులైన వారు. ఇప్పుడు పరలోకరాజ్యం మన ప్రభువైన దేవుని రాజ్యంగా మారిందని, ఆయన పాలన శాశ్వతంగా ఉనికిలో ఉందని ఈ వాక్యం చెబుతుంది.

5 వ వచనం: “ఆ సింహాసనములో నుండి మెరుపులును ధ్వనులును ఉరుములును బయలు దేరుచున్నవి. మరియు ఆ సింహాసనము ఎదుట ఏడు దీపములు ప్రజ్వలించుచున్నవి; అవి దేవుని యేడుఆత్మలు’’.సకల ఆత్మలనుసృష్టించి, పరిపాలించేవాడు దేవుడని అర్ధం.

 

6 వ వచనం: “మరియు ఆ సింహాసనము ఎదుట స్ఫటికమును పోలిన గాజువంటి సముద్రమున్నట్టుండెను. ఆ సింహాసనమునకు మధ్యను సింహాసనము చుట్టును, ముందు వెనుక కన్నులతోనిండిన నాలుగు జీవులుండెను.’’

నలుగురు జీవులు, 24 మంది పెద్దలతో పాటు, దేవుని రాజ్యానికి సేవకులు వారు ఎల్లప్పుడూ దేవుని చిత్తాన్ని కోరుకుంటారు మరియు ఆయన పవిత్రతను మరియు కీర్తిని స్తుతిస్తారు.మరియు వారు విధేయతతో దేవుని చిత్తాన్ని అమలు చేయువారు.

7వ వచనం: “మొదటి జీవి సింహమువంటిది; రెండవ జీవి దూడవంటిది; మూడవ జీవి మనుష్యుని ముఖము వంటి ముఖముగలది; నాలుగవ జీవి యెగురుచున్న పక్షిరాజువంటిది.’’ 

నలుగురు జీవులు దేవుని సేవకులు, ప్రతి ఒక్కరికి ఇవ్వబడిన సేవకు సమర్పించుకున్నవారు, వారు ఆయన ప్రయోజనాలన్నింటినీ నమ్మకంగా సేవ చేసిన వారు వీరు.

8 వ వచనం: “ఈ నాలుగు జీవులలో ప్రతి జీవికి ఆరేసి రెక్కలుండెను, అవి చుట్టును రెక్కల లోపటను కన్నులతో నిండియున్నవి. అవిభూతవర్తమాన భవిష్యత్కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడునగు ప్రభువు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, అని మానక రాత్రింబగళ్లు చెప్పుచుండును’’.

దేవుడు నిద్రించని వానివలె, నలుగురు జీవులు కూడా ఆయన వైపు ఎల్లప్పుడూ మేల్కొని ఉంటారు, ఆయన మహిమ మరియు పవిత్రత కోసం నిరంతరం ఆయనను స్తుతిస్తారు. గొర్రెపిల్లను మరియు సర్వశక్తిమంతుడైన దేవుని పవిత్రతను వారు స్తుతిస్తారు. తండ్రి అయిన దేవుడు మరియు ఉన్నవాడును అనువాడనైయున్నా యేసుక్రీస్తు అను దేవుడను ఈ విధంగా వారు స్తుతిస్తారు. 

9 వ వచనం: “ఆ సింహాసనము నందు ఆసీనుడైయుండి యుగయుగములు జీవించుచున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులును కలు గునుగాకని ఆ జీవులు కీర్తించుచుండగా’’.

 దేవుని సేవకులు ఈ విధంగా సింహాసనంపై శాశ్వతంగా కూర్చున్న ఆయనకు కీర్తి, గౌరవం మరియు కృతజ్ఞతలు తెలుపుతారు.

10 వ వచనం: “ఆ యిరువది నలుగురు పెద్దలు సింహాసనమునందు ఆసీనుడై యుండువాని యెదుట సాగిలపడి, యుగయుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు’’.

 ప్రభువా,మహిమ, గౌరవం మరియు శక్తిని పొందటానికి మీరు అర్హులే” అని ఆయనను స్తుతించారు.

11 వ వచనం: “ప్రభువా, మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి; నీ చిత్తమునుబట్టి అవి యుండెను; దానిని బట్టియే సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొంద నర్హుడవని చెప్పుచు, తమ కిరీటములనుఆ సింహాసనము యెదుట వేసిరి’’.

24 మంది పెద్దలు దేవునికి ఇచ్చిన ప్రశంసలు, దేవునికి సమస్త కీర్తి, మహిమా ప్రభావములు పొందటానికి యోగ్యుడను విశ్వాసం నుండి వచ్చింది, ఎందుకంటే ఆయన మస్తమును సృష్టించాడు మరియు సమస్తమును ఆయన చేతిలో ఉన్నవి.