Sermons

[అధ్యాయము 7-1] <ప్రకటన 7: 1-17> మహాశ్రమల కాలములో ఎవరు రక్షణ పొందుదురు?<ప్రకటన 7: 1-17>

“అటుతరువాత భూమియొక్క నాలుగు దిక్కులలో నలుగురు దేవదూతలు నిలిచియుండి, భూమిమీదనైనను సముద్రముమీదనైనను ఏ చెట్టుమీదనైనను గాలి వీచ కుండునట్లు భూమియొక్క నాలుగు దిక్కులు వాయువులను పట్టుకొనియుండుట చూచితిని. మరియు సజీవుడగు దేవుని ముద్రగల వేరొక దూత సూర్యోదయ దిశనుండి పైకి వచ్చుట చూచితిని. భూమికిని సముద్రమునకును హాని కలుగజేయుటకై అధికారముపొందిన ఆ నలుగురు దూతలతో ఈ దూత మేము మా దేవుని దాసులను వారి నొసళ్లయందు ముద్రించువరకు భూమికైనను సముద్రమునకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పెను.మరియు ముద్రింపబడినవారి లెక్క చెప్పగా వింటిని. ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిలో ముద్రింప బడినవారు లక్షనలువదినాలుగు వేలమంది.


యూదా గోత్రములో ముద్రింపబడినవారు పండ్రెండువేలమంది. 

రూబేను గోత్రములో పండ్రెండు వేలమంది, 

గాదు గోత్రములో పండ్రెండు వేలమంది,

ఆషేరు గోత్రములో పండ్రెండు వేలమంది, 

నఫ్తాలి గోత్రములో పండ్రెండు వేలమంది, 

మనష్షే గోత్రములో పండ్రెండు వేలమంది,

 షిమ్యోను గోత్రములో పండ్రెండు వేలమంది, 

లేవి గోత్రములో పండ్రెండు వేలమంది, 

ఇశ్శాఖారు గోత్రములో పండ్రెండు వేలమంది, 

జెబూలూను గోత్రములో పండ్రెండు వేలమంది, 

యోసేపు గోత్రములో పండ్రెండు వేలమంది, 

బెన్యామీను గోత్రములో పండ్రెండు వేలమంది 

ముద్రింపబడిరి.అటు తరువాత నేను చూడగా, ఇదిగో, ప్రతి జనములోనుండియు ప్రతి వంశములోనుండియు ప్రజలలోనుండియు, ఆయా భాషలు మాటలాడువారిలో నుండియు వచ్చి, యెవడును లెక్కింపజాలని యొక గొప్ప సమూహము కనబడెను.వారు తెల్లని వస్త్రములు ధరించుకొన్నవారై ,ఖర్జూరపు మట్టాలు చేత పట్టుకొని సింహాసనము యెదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలువబడిరి. సింహాసనా సీనుడైన మా దేవునికిని గొఱ్ఱపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. దేవదూతలందరును సింహాసనముచుట్టును పెద్దలచుట్టును ఆ నాలుగు జీవులచుట్టును నిలువబడియుండిరి. వారు సింహాసనము ఎదుట సాష్టాంగపడిఆమేన్‌;

యుగయుగములవరకు మా దేవునికి స్తోత్రమును, 

మహిమయు జ్ఞానమును కృతజ్ఞతా స్తుతియు ఘనతయు శక్తియు,

 బలమును కలుగును గాకని చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి; ఆమేన్‌.

పెద్దలలో ఒకడుతెల్లని వస్త్రములు ధరించుకొనియున్న వీరెవరు? ఎక్కడనుండి వచ్చిరని నన్ను అడిగెను.అందుకు నేను అయ్యా, నీకే తెలియుననగా అతడు ఈలాగు నాతో చెప్పెను వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు; గొఱ్ఱపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపుచేసికొనిరి. అందువలన వారు దేవుని సింహాసనము ఎదుట ఉండి రాత్రింబగళ్లు ఆయన ఆలయ ములో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారిమీద కప్పును; వారికి ఇకమీదట ఆకలియైనను దాహమైనను ఉండదు, సూర్యుని యెండయైనను ఏ వడగాలియైనను వారికి తగులదు,ఏలయనగా సింహాసన మధ్యమందుండు గొఱ్ఱపిల్ల వారికి కాపరియై, జీవజలముల బుగ్గలయొద్దకు వారిని నడిపించును, దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్పబిందువును తుడిచి వేయును.’’’’వ్యాఖ్యానం


వచనo1: “అటుతరువాత భూమియొక్క నాలుగు దిక్కులలో నలుగురు దేవదూతలు నిలిచియుండి, భూమిమీదనైనను సముద్రముమీదనైనను ఏ చెట్టుమీదనైనను గాలి వీచ కుండునట్లు భూమియొక్క నాలుగు దిక్కులు వాయువులను పట్టుకొనియుండుట చూచితిని’’.

కష్టాల గాలి వీస్తుందో లేదో పూర్తిగా దేవుని అనుమతిపై ఆధారపడి ఉంటుందని ఇది మనకు చూపిస్తుంది. ఈ భూమిపై మహాశ్రమలను అనుమతించే ముందు ఇశ్రాయేలు తెగల నుండి 144,000 మందిని రక్షించి, వారిని తన ప్రజలుగా చేస్తానని దేవుడు నిర్ణయించుకున్నాడు.

2-3 వ వచనాలు: “మరియు సజీవుడగు దేవుని ముద్రగల వేరొక దూత సూర్యోదయ దిశనుండి పైకి వచ్చుట చూచితిని. భూమికిని సముద్రమునకును హాని కలుగజేయుటకై అధికారముపొందిన ఆ నలుగురు దూతలతోఈ దూతమేము మా దేవుని దాసులను వారి నొసళ్లయందు ముద్రించువరకు భూమికైనను సముద్రమునకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పెను.’’

ఇక్కడ, 144,000 మంది ఇశ్రాయేలీయులకు ముద్ర వేయబడే వరకు భూమికి, సముద్రాలకు హాని కలిగించమని పంపబడిన నలుగురు దేవదూతలకు దేవుడు ప్రపంచానికి హాని చేయవద్దని ఆజ్ఞాపించాడు.ఇశ్రాయేలీ యొక్క ప్రతి తెగ నుండి 12,000 మంది ఎన్నుకోబడతారు మరియు వారి నుదుటన దేవుని జీవపు ముద్ర ముద్రించు వరకు హాని చేయవద్దని దేవుడు వారికి చెప్పాడు. ఇశ్రాయేలు ప్రజల పట్ల ఆయనకున్న ప్రత్యేక శ్రద్ధను చూపించే దేవుని ప్రత్యేక ఆదేశం ఇది.


4వ వచనం: “మరియు ముద్రింపబడిన వారి లెక్కచెప్పగా వింటిని. ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిలో ముద్రింపబడిన వారు లక్ష నలువది నాలుగు వేలమంది.

దేవుని చేత ముద్రింపబడిన వారికి దేవుని నుండి ప్రత్యేక రక్షణ లభిస్తుంది మరియు అంత్యకాలపు మహాశ్రమల కాలములో కూడా ఆయన మోక్షo యొక్క ఆశీర్వాదం పొందుతారు.

5-9 వచనాలు: “యూదా గోత్రములో ముద్రింపబడినవారు పండ్రెండువేలమంది. రూబేను గోత్రములో పండ్రెండు వేలమంది, గాదు గోత్రములో పండ్రెండు వేలమంది,ఆషేరు గోత్రములో పండ్రెండు వేలమంది, నఫ్తాలి గోత్రములో పండ్రెండు వేలమంది, మనష్షే గోత్రములో పండ్రెండు వేలమంది, షిమ్యోను గోత్రములో పండ్రెండు వేలమంది, లేవి గోత్రములో పండ్రెండు వేలమంది, ఇశ్శాఖారు గోత్రములో పండ్రెండు వేలమంది,జెబూలూను గోత్రములో పండ్రెండు వేలమంది, యోసేపు గోత్రములో పండ్రెండు వేలమంది, బెన్యామీను గోత్రములో పండ్రెండు వేలమంది ముద్రింపబడిరి. అటు తరువాత నేను చూడగా, ఇదిగో, ప్రతి జనములోనుండియు ప్రతి వంశములోనుండియు ప్రజలలోనుండియు, ఆయా భాషలు మాటలాడువారిలో నుండియు వచ్చి, యెవడును లెక్కింపజాలని యొక గొప్ప సమూహము కనబడెను.వారు తెల్లని వస్త్రములు ధరించుకొన్నవారై,ఖర్జూరపు మట్టాలు చేత పట్టుకొని సింహాసనము యెదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలువబడిరి’’

ఈ వచనాలు ఇశ్రాయేలీయుల ప్రజలలో ముద్రించబడిన సంఖ్యను చెబుతుంది ఇశ్రాయేలీయుల యొక్క ప్రతి తెగ నుండి 12,000 మంది దేవుని ప్రత్యేక కృప పొందినవారుగా ముద్రించబడుదురు. దేవుడు ఇశ్రాయేలు ప్రతి తెగ నుండి 12,000 మందికి మోక్షాన్ని ఇచ్చి ,వారిని తన ప్రజలగా చేసుకొనును; ఈ ప్రత్యేక దయ ప్రతి తెగకు సమానంగా ఇవ్వబడుతుంది.

దేవుడు ఇశ్రాయేలులోని ప్రతి తెగను సమానంగా ప్రేమించినందున, ఆయన తన ప్రజలయ్యేందుకు వారందరికీ ఒకే ఆశీర్వాదం ఇచ్చాడు. అబ్రాహాముకు మరియు అతని వారసులకు ఇచ్చిన వాగ్దాన వాక్యాన్ని నెరవేర్చడానికి దేవుడు ఈ కృపతో ఇశ్రాయేలీయులను ఆదరించును. ఈ విధంగా చూడగలిగినట్లుగా, దేవుడు మానవాళి కోసం వాగ్దానం చేసిన మరియు ప్రణాళిక చేసిన ప్రతిదాన్ని నెరవేరుస్తాడు.

మహాశ్రమలకాలములో అన్యజనులలో చాలా మంది రక్షింపబడతారని మరియు దేవుని ప్రజలు అవుతారని ఇది మనకు చెబుతుంది. మరో మాటలో చెప్పాలంటే, అన్యజనులలో అనేకమంది ప్రజలు, నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను విశ్వసించడం ద్వారా వారి పాపాల నుండి విముక్తి పొందుతారు మరియు చివరి కాలంలో వారి విశ్వాసంతో హతసాక్షులౌతారు. కాబట్టి అన్యజనులను తన ప్రజలుగా చేసుకొనుటకు అంత్యకాలమువరకు దేవుడు పనిచేస్తున్నాడని మనం గుర్తుంచుకోవాలి.

10-11 వచనాలు: “సింహాసనా సీనుడైన మా దేవునికిని గొఱ్ఱపిల్లకును మా రక్షణకై స్తోత్రమనిమహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి.దేవదూతలందరును సింహాసనముచుట్టును పెద్దలచుట్టును ఆ నాలుగు జీవులచుట్టును నిలువబడియుండిరి. వారు సింహాసనము ఎదుట సాష్టాంగపడిఆమేన్‌;యుగయుగముల వరకు మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞమును కృతజ్ఞతాస్తుతియు ఘనతయు శక్తియు బలమును కలుగని గాకానీ చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి.’’

దేవుడు తన మోక్షo యొక్క కృపను అంత్యకాలంలో కూడా ఇశ్రాయేలీయులకు మరియు మనకు అన్యజనులకు అనుగ్రహించును. అందువల్ల మన ప్రభువు సమస్త ఆరాధన, స్తుతులు మరియు మహిమలను పొందటానికి అర్హుడు. పరిశుద్ధుల ఆరాధనలన్నింటిని దేవుడు తప్ప మరెవరూ పొందలేరు.

12 వ వచనం: ‘’యుగయుగములవరకు మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞతా స్తుతియు ఘనతయు శక్తియు బలమును కలుగును గాకని చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి; ఆమేన్‌.’’

దేవుని సేవకులందరు ప్రభువును స్తుతిస్తారు. దేవుడు ఈ స్తుతులను, గౌరవాన్ని అందుకోవడం సరైనది.

13-14 వ వచనాలు: “పెద్దలలో ఒకడుతెల్లని వస్త్రములు ధరించుకొనియున్న వీరెవరు? ఎక్కడనుండి వచ్చిరని నన్ను అడిగెను. అందుకు నేను అయ్యా,నీకే తెలియుననగా అతడు ఈలాగు నాతో చెప్పెనువీరు మహాశ్రమలనుండి వచ్చిన వారు; గొఱ్ఱపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపుచేసికొనిరి.

పరిశుద్ధులు అద్భుతమైన హతహసాక్షుల యొక్క మరణాన్ని జయించిన వారు,వారి నిజమైన విశ్వాసాన్ని కాపాడుకోవడానికి మహాశ్రమల యొక్క గొప్ప గాలిని పెంచిన తరువాత దేవుడు తన అంత్యకాలపు పంటను సేకరిస్తాడు.

మహాశ్రమల ఏడు సంవత్సరాల కాలంలో మొదటి మూడున్నర సంవత్సరాలు గడిచినప్పుడు, పరిశుద్ధులు అంత్యక్రీస్తు చేత కఠినంగా హింసించబడతారు మరియు వారి విశ్వాసాన్ని కాపాడుకోవడానికి హతసాక్షులవుతారు. ఈ మరణం మహాశ్రమల యొక్క సంఘ చరిత్రలో కొనసాగిన ఇతర శ్రమల నుండి భిన్నమైన కోణాన్ని కలిగి ఉంటుంది; ఈ భూమిపై దేవుణ్ణి విశ్వసించే పరిశుద్ధులు విశ్వాసం కోసం ఇది సంపూర్ణ కోరుకుంటుంది. హతసాక్షులైన పరిశుద్ధులకు గొప్ప గౌరవం. దేవునిపై తమకున్న నిజమైన విశ్వాసాన్ని చాలా స్పష్టంగా వెల్లడించగలరు. మహాశ్రమల యొక్క అంత్యకాలంలో,పరిశుద్ధులందరూ హతసాక్షులుగా తమ విశ్వాసాన్ని కాపాడుకుంటారు, వీరు పునరుత్థానం మరియు ఎత్తబడుటలో పాల్గొంటారు మరియు దేవుని సింహాసనం యెదుట నిలబడతారు.

15-16 వచనాలు: ‘’అందువలన వారు దేవుని సింహాసనము ఎదుట ఉండి రాత్రింబగళ్లు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారిమీద కప్పును; వారికి ఇకమీదట ఆకలియైనను దాహమైనను ఉండదు, సూర్యుని యెండయైనను ఏ వడగాలియైనను వారికి తగులదు,’’

దేవుని యెదుట నిజమైన విశ్వాసం ఉన్నవారు నీరు మరియు ఆత్మ యొక్క సువార్త మోక్షంలో తమ విశ్వాసాన్ని కాపాడుకోవడానికి మహాశ్రమల అంత్యకాలంలో హతసాక్షులవుదురు.అందువల్ల దేవుడు పరిశుద్ధులకు అలాంటి విశ్వాసంతో తన ప్రత్యేక రక్షణ మరియు ఆశీర్వాదం అనుగ్రహించును. మరియు వారిని తన చేతుల్లోకి స్వీకరిస్తాడు.

అంత్యక్రీస్తుతో పోరాడి, హతసాక్షులు పునరుత్థానం చేయబడిన తరువాత, పరిశుద్ధులు దేవుని రాజ్యంలో మరలా చనిపోరు లేదా బాధపడరు. వారు ఎప్పటికీ దేవుని పిల్లలుగా ఆశీర్వాదాలలో జీవిస్తారు. దేవుని చేతితో హత్తుకున్నా వారికి ఇక ఏ అపాయము ఉండబోదు.లేదా వారు మరలా దుష్టత్వం నుండి ఎటువంటి హాని లేదా వేదనను అనుభవించరు. ఇప్పుడు వారు అనుభవించవలసినది,దేవుని ప్రత్యేక ప్రతిఫలం, ప్రేమ మరియు కీర్తి, వారికి శాశ్వితముగా ఇవ్వబడును.

17 వ వచనం: ‘’ఏలయనగా సింహాసన మధ్యమందుండు గొఱ్ఱపిల్ల వారికి కాపరియై, జీవజలముల బుగ్గలయొద్దకు వారిని నడిపించును, దేవుడే వారి కన్నులనుండి ప్రతి బాష్పబిందువును తుడిచి వేయును.’’

దేవుడు పరిశుద్ధులకు శాశ్వతమైన గొర్రెల కాపరిగా శాశ్వతమైన దీవెనలు వారికి అనుగ్రహించును. పరిశుద్ధులు ఈ భూమిపై ఉన్నప్పుడు ప్రభువు కోసమే అనుభవించిన సమస్త శ్రమలకు మరియు మరణానికి ప్రతిఫలమివ్వడానికి, దేవుడు జీవ జలములు ప్రవహించు నది యొద్దకు వారిని నడిపించును, దేవుని సింహాసనం యెదుట ప్రభువుతో రొట్టె విరుచుటకు వారిని అనుమతించును, ఆయన మహిమలో ఆయనతో ప్రవేశించుటకు ఆయన ఆశీర్వాదంతో పాటు పరిశుద్ధులు నిత్యమైన దుస్తులు ధరించెదరు. వీరు ఈ భూమిపై ఉన్నప్పుడు, నీటి సువార్తను విశ్వసించారు, దేవుని మహిమ కొరకు సేవా జీవితాన్ని గడిపారు, మరియు ఆయన నామం కొరకు హతహసాక్షులయ్యారు,ఈ విధంగా తమ విశ్వాసాన్ని సమర్థించి వారిని ఆయన మహిమలోను క్రొత్త ఆకాశము మరియు దేవుని రాజ్యంలో జీవించడానికి దేవుడు అనుమతించును. హల్లెలూయా!మన ప్రభువును స్తుతించుడి!