Sermons

[అధ్యాయము 8-1] <ప్రకటను 8:1-13> ఆ ఏడు తెగుళ్ళను ప్రకటించు ఏడు బూరలు<ప్రకటను 8:1-13>

“ఆయన ఏడవ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంటసేపు నిశ్శబ్ధముగా ఉండెను. అంతట నేను దేవుని యెదుట నిలుచు ఏడుగురు దూతలను చూచితిని; వారికి ఏడు బూరలియ్యబడెను. మరియు సువర్ణధూపార్తి చేత పట్టుకొనియున్న వేరొక దూతవచ్చి బలిపీఠము ఎదుట నిలువగా సింహాసనము ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠముపైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ధూపద్రవ్యము ఇయ్యబడెను. అప్పుడా ధూపద్రవ్యము పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను. ఆ దూత ధూపార్తిని తీసుకొని బలిపీఠముపై నున్న నిప్పుతో దానిని నింపి, భూమి మీద పడవేయగా ఉరుములు ధ్వనులు మెరుపులు భూకంపమును కలిగెను. అంతట ఏడు బూరులు పట్టుకొనియున్న ఆ యేడుగురు దూతలు ఊదుటకు సిద్ధపడిరి. మొదటి దూత బూర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లును అగ్నియు పుట్టి భూమిపైన పడవేయబడెను. అందువలన భూమిలో మూడవ భాగము కాలిపోయెను. చెట్లలో మూడవ భాగము కాలిపోయెను. పచ్చగడ్డియంతయు కాలిపోయెను. రెండవ దూత బూర ఊదినప్పుడు అగ్నిచేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒక్కటి సముద్రములో పడవేయబడెను. అందువలన సముద్రములో మూడవ భాగము రక్తమాయెను. సముద్రములోని ప్రాణముగల జంతువులలో మూడవ భాగము చచ్చెను. ఓడలో మూడవ భాగము నాశనమాయెను. మూడవ దూత బూర ఊదినప్పుడు దివిటివలె మండుచున్న యొక పెద్దనక్షత్రము ఆకాశము నుండి రాలి నదుల మూడవ భాగము మీదను నీటి బుగ్గల మీదను పడెను. ఆ నక్షత్రమునకు మాచిపత్రియని పేరు. అందువలన నీళ్లలో మూడవ భాగము మాచిపత్రి అయెను. నీళ్ళు చేదైపోయినందున వాటి వలన మనుష్యులలో అనేకులు చచ్చిరి. నాలుగవ దూత బూర ఊదినప్పుడు సూర్య చంద్ర నక్షత్రములో మూడవ భాగము చీకటి కమ్మునట్లుగా, పగటిలో మూడవ భాగమును సూర్యుడు ప్రకాశింపకుండునట్లును, రాత్రిలో మూడవ భాగమున చంద్ర నక్షత్రము ప్రకాశింపకుండునట్లుగా వాటిలో మూడవ భాగము కొట్టబడెను. మరి నేను చూడగా ఆకాశమధ్యమున ఒక పక్షిరాజు ఎగురుచు బూరు ఊదబోవుచున్న ముగ్గురు దూత బూర శబ్ధమును బట్టి భూమి వాసులకు అయ్యో, అయ్యో, అయ్యో అని గొప్ప స్వరముతో చెప్పుట వింటిని.’’వివరణ :


ప్రకటన 8లో దేవుడు భూమిపైకి తేబోవు తెగుళ్ళ గూర్చి వ్రాయబడింది. ఇక్కడ క్లిష్టమైన ప్రశ్న ఏదనగా ఈ తెగుళ్ళ వలన పరిశుద్ధులు బాధింపబడితిరా? లేదా అనేది. బైబిల్‌ మనకు చెప్పేది. పరిశుద్ధులు కూడా ఆ ఏడుబూరలు తెగుళ్ళుచే బాధింపబడతారా. ఆ ఏడు తెగుళ్ళలో, వారు అఖరి తెగులు తప్ప మిగిలినవన్నిటిని చూస్తారు. ఈ ఏడు బూర తెగుళ్ళ గురించి ఈ అధ్యాయములో చెప్పబడినవి నిజముగా దేవునిచే భూమిపైకి తేబడేవి. ఆ దూతచే ఊదబడు ఏడు బూరల ద్వారా రాబోవు తెగుళ్ళ చేత ప్రపంచాన్ని ఆయన విక్షింపబోవుచున్నానని దేవుడు మనకు చెప్తున్నాడు.

వచనం 1: ఆయన ఏడవ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అర గంటసేపు నిశ్శబ్ధముగా ఉండెను.

మనుష్యులపై కుమ్మరింపబడబోవు దేవుని అగ్రహము ముందున్న నిశ్శబ్ధము ఇక్కడ ప్రస్తావింపబడిరది. ఆ భయంకరమైన తెగుళ్ళును భూమిపైకి తెచ్చుటకు ముందు కొంతకాలం దేవుడు నిశ్శబ్ధంగా ఉంటాడు. ఇదే మనకు ఆయన యొక్క ఏడు బూరల తెగుళ్ళు ఎంత భయంకరమైనవో బాధకరమైనవో మనకు సూచిస్తుంది. ఈ తెగుళ్ళు అనుభవించిన తరువాత మనుష్యజాతి దేవుని ముందు నిలబడినప్పుడు రక్షింపబడిన వారు నిత్యజీవమును పొందెదరు కానీ, రక్షింపబడని వారు నిత్యశిక్షను పొందుతారు. కనుక ఈ కాలము ఏ యుగమునకు చెందినదో గుర్తించినవారమై మనము మెళకువ కలిగి సువార్తికుని పని చేయాలి.

వచనం 2 : అంతట నేను దేవుని యెదుట నిలుచు ఏడుగురు దూతలను చూచితిని. వారికి ఏడు బూరలియ్యబడెను.

దేవుడు తన పని చేయుటకు ఆ ఏడు దూతలను ఉపయోగించాడు. కానీ ఈ దినము యుగములో, దేవుడు నీరు మరియు ఆత్మమూలమైన సువార్త యొక్క వాక్యమును విశ్వసించువారైన నీతిమంతుల ద్వారా దేవుడు పని చేయుననునది మనము మరువరాదు.

వచనం 3 : మరియు సువర్ణధూపార్తి చేత పట్టుకొనియున్న వేరొక దూతవచ్చి, బలిపీఠము ఎదుట నిలువగా సింహాసనము ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠముపైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ధూపద్రవ్యము ఇయ్యబడెను.

ఇది మనకు చూపునదేమనగా దేవుడు, సాతాను మరియు అతని అనుచరులు పరిశుద్ధులు చేయు ప్రార్థనలను భూమిపైకి తెచ్చును. ఆ ‘‘సువర్ణ ధూపార్తి” అనునది పరిశుద్ధులందరి ప్రార్థనలను ప్రస్తావించుచున్నది. అనగా వారి ప్రార్థనలు దేవునికి వినబడగా, ఆయన కార్యములన్ని నెరవేర్చబడెను. దేవుడు తన పరిశుద్ధుల ప్రార్థనలు వినుట ద్వారా క్రియ చేయును.

వచనం 4 : అప్పుడా ధూపద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి 5వ దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను. 

ఆ అంత్యక్రీస్తు భూమిపై నున్న పరిశుద్ధులను ఎంతగా బాధించెనో ఈ వచనం మనకు చూపుచున్నది. అంత్యకాలము యొక్క శ్రమల కారణంగా అంత్యక్రీస్తును పారద్రోలి శ్రమలు తమ ద్వారా త్వరితగతిని జరుగుటకు, మరియు వారి హత్యలు, దేవుని ఆగ్రహం ఎంత భయంకరమైనవో చూపుటకు పరిశుద్ధులు దేవుని ప్రార్థన చేస్తారు. ఇక్కడ ఈ వచనం ద్వారా దేవుడు పరిశుద్ధులందరి ప్రార్థనలను ఆలకించునని చూచుచున్నాం. పరిశుద్ధులు ఈ ప్రార్థనలను చేర్చుకొని దేవుడు తన ఏడు బూరలు మరియు ఏడు పాత్రల తెగుళ్ళుచేత అంత్యక్రీస్తుకు మరియు అతని అనుచరులకు తీర్పుతీర్చును. అంత్యక్రీస్తును అతని అనుచరులకు దేవుడు తీర్పు ఈ తీర్పును దేవుడు పరిశుద్ధుల ప్రార్థనలను ఆయనిచ్చు చివరి జవాబు.

వచనం 5,6 : చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను. ఆ దూత ధూపార్తిని తీసికొని బలిపీఠముపై నున్న నిప్పుతో దానిని నింపి, భూమి మీద పడవేయగా ఉరుములు ధ్వనులు మెరుపు భూకంపమును కలిగెను. అంతట ఏడు బూరలు పట్టుకొనియున్న ఆ యేడుగురు దూతలు ఊదుటకు సిద్ధపడిరి. 

దేవుడు ఆ ఏడు బూరల తెగుళ్ళను ఈ భూమిపై సిద్ధం చేస్తున్నాడు. కనుక ఈ ప్రపంచము రణగొణధ్వనులు, ఉరుములు, మెరుపులు, భూకంపాల నుండి తప్పించుకొనలేదు.

వచనం 7 : మొదటి దూత బూర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లును అగ్నియు పుట్టి భూమిపైన పడవేయబడెను. అందువలన భూమిలో మూడవ భాగము కాలిపోయెను. చెట్లలో మూడవ భాగము కాలిపోయెను. 

పచ్చగడ్డియంతయు కాలిపోయెను. ఆ మొదటి తెగులు, భూమిపై నున్న మూడవ వంతు కాలిపోవుట అనగా మూడవ వంతు చెట్లు సమస్త గడ్డి అంతా కాల్చబడును. ఈ తెగులు ప్రపంచ అడవులపై పడును.

దేవుడు ఈ విధమైన తెగులును ఎందుకు తెచ్చును? ఎందుకనగా ప్రజలు తమ కన్నులతో దేవుని సృష్టియొక్క అందమును చూచినప్పటికి దాని సృష్టికర్తను దేవునిగా గుర్తించి ఆయనను ఆరాధించలేదు. కానీ దానికి బదులు ‘‘సృష్టికర్తకు బదులు సృష్టమును పూజించి సేవించిరి’’ రోమా 1:25 కనుక దేవుడు ఆ ఏడు బూరల తెగుళ్ళను తనకు మహిమపరచని వారిపైకి తెచ్చి వారికి విరోధముగా నిలుచును.

వచనం 8`9 : రెండవ దూత బూర ఊదినప్పుడు అగ్నిచేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రములో పడవేయబడెను. అందువలన సముద్రములో మూడవ భాగము రక్తమాయెను. సముద్రములోని ప్రాణముగల జంతువులో మూడవ భాగము చచ్చెను. ఓడలో మూడవ భాగము నాశనమాయెను. 

రెండవ బూర యొక్క తెగులు భూమిపైకి రాలిపడు నక్షత్రమైయున్నది. నక్షత్ర శకలము సముద్రముపై పడి దానికి మూడవ వంతును రక్తముగా మార్చి, సముద్ర మూడవవంతు ప్రాణులను చంపును మరియు మూడవ వంతు ఓడలను నాశనము చేయును. దేవుని సృష్టి ద్వారా మానవాళి అనేక దీవెనలను పొందెను. కాని దేవునికి సృష్టి యొక్క దీవెనలకు కృతజ్ఞత తెలుపుటకు బదులుగా వారు దేవునికి వ్యతిరేకముగా తిరగబడిరి. రెండవ తెగులు ఈ పాపమునకు వారిని శిక్షించును.

వచనం 10 : మూడవ దూత బూర ఊదినప్పుడు దివిటివలె మండుచున్న యొక పెద్ద నక్షత్రము ఆకాశము ఉండి రాలి నదుల మూడవ భాగము మీదను, నీటి బుగ్గల మీదను పడెను.

నదులు మరియు నీటి వాగుల మూడవ వంతుపై నక్షత్ర శకలము పడుటకు దేవుడు ఎందుకు అనుమతించాడు. ఎందుకనగా మానవాళి జీవాధిపతియైన ప్రభువు ద్వారా జీవించుచూ, ఆయనను పూజించి, కృతజ్ఞతలు తెలుపలేదు. కానీ బదులుగా జీవాధిపతిని అసహ్యించుకొనిరి.

వచనం 11 : ఆ నక్షత్రమునకు మాచిపత్రియని పేరు. అందువలన నీళ్లలో మూడవ భాగము మాచిపత్రి అయెను. నీళ్లు చేదైపోయినందున వాటి వలన మనుష్యులలో అనేకులు చచ్చిరి.

ఈ తెగులు ద్వారా నదులు మరియు నీటి బుగ్గల మూడవ వంతు నీరు మాచిపత్రియగును. వాటి నీరు త్రాగుట వలన అనేకులు మరణిస్తారు. దేవుని ఆయన పరిశుద్ధులను బాధించిన పాపులు ఈ తెగులుచే శిక్షింపబడుదురు. నీతిమంతులకు వ్యతిరేకంగా పాపము చేసిన వారందరినీ వారి చర్యకు ప్రతికారము చేయుటలో దేవుడు తప్పిపోడు. పాపులు నీతిమంతులను బాధించినప్పుడు దేవుడు వారికి తీర్పు తీర్చును. మూడవ తెగులు కూడా సృష్టిమీదే. దేవుడిచ్చిన నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను విశ్వసించకుండుట అను అవిధేయత అను జనుల పాపముకొరకై అది తేబడెను. బైబిల్‌లోని ఆ మాచిపత్రి ఎల్లప్పుడు దేవునికి అవిధేయులై ఆయనకు వ్యతిరేకంగానున్న వారికి దేవుని తీర్పుగా చూపబడెను.

వచనం 12 : నాలుగవ దూత బూర ఊదినప్పుడు సూర్యచంద్ర నక్షత్రములో మూడవ భాగము చీకటి కమ్మునట్లుగా, పగటిలో మూడవ భాగమును సూర్యుడు ప్రకాశింపకుండునట్లును, రాత్రిలో మూడవ భాగమున చంద్ర నక్షత్రములు ప్రకాశింపకుండునట్లుగా వాటిలో మూడవ భాగము కొట్టబడెను. నాలుగవ తెగులు సూర్య, చంద్ర, నక్షత్ర మూడవ భాగము చీకటి క్రమ్మును.

ఆ సమయమందు మానవాళి సాతానును అనుసరించుచూ అంధకారమును ప్రేమించుచుందురు. కనుక వారు యేసుక్రీస్తుచే ఇవ్వబడిన నీరు మరియు ఆత్మమూలమైన సువార్తచే చూపబడిన రక్షణ అను వెలుగును తృణీకరింతురు. అట్లాగే నిజానికి లోకము యొక్క అంధకారమెంత భయంకరమైనదో శిక్షార్హలమో వారికి నేర్పుటకు దేవుడు వారిపైకి ఇట్టి తెగులు రప్పించును. యేసుక్రీస్తును ద్వేషించి, దేవుడు వారిపైకి ఇట్టి తెగులు రప్పించును. యేసుక్రీస్తును ద్వేషించి అంధకారమును ప్రేమించుట అను పాపము కొరకు దేవుని ప్రతికారము ఎంత భయంకరమైనదో కూడా ఈ తెగులు చూపును. ఫలితంగా ప్రపంచ సూర్య, చంద్ర నక్షత్రము మూడవ భాగము కాంతిహీనమై చీకటి కమ్మును.

వచనం 13 : మరి నేను చూడగా ఆకాశమధ్యమున ఒక పక్షిరాజు ఎగురుచు బూరు ఊదబోవుచున్న ముగ్గురు దూతల బూర శబ్ధమును బట్టి భూమి వాసులకు అయ్యో, అయ్యో, అయ్యె అని గొప్ప స్వరముతో చెప్పుట వింటిని.

ఈ భూమిపై నివశించు వారికి ఇంకా రానైయున్న మూడు శ్రమలను గూర్చి ఈ వచనం తెలియచేయును. కనుక పాపులందరూ దేవునికి వ్యతిరేకముగా నిలుచు వారు నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను విశ్వసించుట ద్వారా పాపము నుండి విముక్తి సాధ్యమైనంత త్వరగా పొందాలి.