Sermons

[అధ్యాయము 8-2] <ప్రకటను 8:1-13> ఆ ఏడు బూరల యొక్క తెగుళ్ళు వాస్తవమా?<ప్రకటన 8:1-13>


ప్రకటన 5లో ఏడు ముద్రలతో ముద్రింపబడిన చుట్ట కనబడెను. అనగా యేసుదేవుని యొక్క పూర్తి అధికారమును మరియు శక్తియు కలిగియుండెను. మరియు అప్పటి నుండి ఆయన దేవుని యొక్క వ్యూహప్రకారము ప్రపంచమును నడుపును ప్రకటన 8 ‘‘ఆయన ఏడవ ముద్రను విప్పగా విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంటసేపు నిశ్శబ్ధముగా ఉండెను. అంతట నేను దేవుని యెదుట నిలుచు ఏడుగురు దూతలను చూచితిని. వారికి ఏడు బూరలియ్యబడెను.’’ అను పేరాలో మొదలగును. కనుక యేసు ఏడవ ముద్రను విప్పి రాబోవు విషయాలను తెలియచేయును.

అధ్యాయం 8 పరిశుద్ధుల ప్రార్థనలతో ప్రారంభమగును ఏడు బూరల తెగుళ్ళతో మొదలైనది. వచనం 6 నుండి ఈ లోకమునకు తేబడు ఏడుబూరల యొక్క తెగుళ్ళ గూర్చి చెప్పబడెను.మొదటి బూర తెగులు : 


ఆ మొదటి బూర : వచనం 7 మొదటి దూత బూర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లును అగ్నియు పుట్టి భూమిపైన పడవేయబడెను. అందువలన భూమిలో మూడవ భాగము కాలిపోయెను. చెట్లలో మూడవ భాగము కాలిపోయెను. పచ్చగడ్డియంతయు కాలిపోయెను మొదటగా మనం కనుగొనవలసినది. ఆ ఏడు బూరల తెగుళ్ళు భూమి పైకి తేబడినప్పుడు పరిశుద్ధులమైన మనము ఆ తెగుళ్ళ మధ్య ఉంటామా లేదా అనునది. 

ఇక్కడ ఏడు బూరలను ఊదు దూతలు ఉన్నవి. మనము గుర్తించవలసియున్నది. ఈ ఏడు తెగుళ్ళలో మనము భూమిపై నుండి ఏడు తెగుళ్ళ ద్వారా ప్రయాణిస్తాము. ఏడవ బూర ఊదిబడినప్పుడు మనము ఎత్తబడెదము మరియు ఆ వెనుక ఏడు పాత్ర తెగుళ్ళు వచ్చునని కూడా మనం గుర్తించాలి.

వచనం 7లో మొదటి దూత బూర ఊదినప్పుడు మరియు అగ్ని రక్తము భూమిపై వర్షించును. భూమి మూడవ వంతు మరియు మూడవ వంతు వృక్షము నాశనమగును. సృష్టిలో మూడవ వంతు మరొక విధముగా కాల్చబడునని చెప్పబడింది.

ఆ విధముగా సృష్టి కాల్చబడిన పొగలో మనము నివసించగలమా? వడగండ్లు మరియు అగ్ని రక్తముతో కలసి మనపై పడుచుండగా వృక్షము బూడిదగా మారునప్పుడు ఈ విధమైన వాతావరణముచే మనము నేలకు కాల్చబడుచున్న పరిస్థితులతో ఆవరించబడుచూ మనం నివసించగలమా ! నిజముగా మనం వడగండ్లు, అగ్నితో కలసిన రక్తము కురియుచూ మన గృహమును కోల్పోవు నిజము ముంగిట ఉన్నప్పుడు దట్టమైన అడవులు మరియు పర్వతము పాడగుచున్నప్పుడు మనలో ఎవరికి బ్రతకాలన్న కోరిక ఉండదు లేదా ఒకవేళ బ్రతకాలన్న బ్రతకగలమా!

నీవు నేను మొదటి తెగులు అనుభవించవలెనని మరవకూడదు. ఈ అంతులేని తెగుళ్ళు ప్రాప్తమగు కాలము మనకు సమీపించినప్పుడు అంత్యక్రీస్తు అప్పటికే ఈ భూమిపైనున్నాడని కూడా మనం గుర్తించాలి. ఎందుకనగా అంత్యక్రీస్తు పూర్తిగా బయలుపడి తన సంపూర్ణ అధిపత్యం కొరకు ఎదురుచూచుటకు ముందే ఆ తెగుళ్ళు సంభవించును. ప్రపంచ నాయకుడు ఆ తెగుళ్ళను ఎదుర్కొనుటకు ఒక సంకీర్ణ కూటమిని ఏర్పరచి ఒక నాయకుడు గొప్ప అధికారమును ఏర్పరచుటకు మరొక ఏడుగురు నాయకులను ప్రోగుచేయును.

అప్పుడు అంత్యక్రీస్తు ఈ సహజ పద్ధతిలోనే ఖచ్చితమైన నాయకునిగా బయలుపడును. అంత్యక్రీస్తు ప్రకృతి వైపరీత్యములో పానచేయుచు దాని నుండి పునర్మిర్మాణము చేయుచుండగా అనేకులు అతని అధికారమును మెచ్చుకొని అతనిని అనుసరించుదురు. అతనిని పరసంబంధిగా తలంచి నెమ్మదిగా అతని భక్తులుగా మారి నిశ్చయంగా భక్తులగుదురు.

బైబిలు మనకు చెప్పునదేమనగా మొదటి దూత బూరనుదినప్పుడు ఆ ఏడు తెగుళ్ళు పాడు చేయును. భూమిలోని మూడవ వంతు భూమిని పరిశుద్ధులు మరియు ఈ లోకులు ఇద్దరూ ఆ తెగుళ్ళు సంభవించినప్పుడు భూమిపై నుందురు. ఆ తరువాత ఈ లోకమునకు సంభవించునదేమి? అప్పుడు ప్రపంచానికి ఏమి, సంభవించును. శవము మరియు గాయపడినవారు చెల్లాచెదురుగా పడి ఉంటారు. వాతావరణం, పొగ మరియు విషవాయువులతో కూడి ప్రపంచమును పూర్తిగా కాల్చునట్టి అగ్ని గుండముతో ఆవరింపబడును. అగ్నిచే భూతము ఎడారిగా మార్చబడుట వలన ప్రాణవాయువును ఉత్పత్తి చేయు సామర్థ్యం భూగ్రహమునకు తగ్గిపోవును. గాన గాలిలో ప్రాణవాయువు లేకపోవును. ఆ మొదటి తెగులు ఒక్కటే ప్రపంచమును బూడిద చేయగా మనము బ్రతకాలనే కోరికను తుడిచిపెట్టబడును.

ఆ తెగులు నుండి మనం ఒక తెలివిగల ఎన్నికను చేయగలిగాలి. సాధారణ ప్రపంచంలో ఇప్పుడు నివసించుచూ ఆ రాబోవు శ్రమలు మరియు తెగుళ్ళును గూర్చి భయక్రాంతులము కావచ్చు కానీ మనం ఈ భయం నుండి విడిపింపబడి ధైర్యంగా ఉండగలం. ఎందుకనగా సృష్టిలో మూడవ వంతు అగ్నిచే కాల్చబడి అంతటా ప్రజలు ప్రలాపించుచుండగా మొదటి తెగులు ఆరంభించెనని మరికొన్ని తెగుళ్ళు వస్తాయని మనం తెలిసికొనగలం. ఎందుకనగా మనకు నిరీక్షణ ఉన్నది. మనం దానిచే నింపబడతాం. కానీ మనకు ఈ భూమి భవిష్యత్తు తెలుసు. మన నిరీక్షణ ఈ భూసంబంధమైన కాదు. కానీ దేవుని రాజ్య సంబంధమైనది. అలాంటి విశ్వాసంతో పరిశుద్ధాత్మను పొంది మనం ధైర్యంగాను, నిబ్బరంగాను ఉండగలం.

ప్రపంచ ప్రజల ఆర్తనాదాలు ముందుకంటే గట్టిగా ఉండును. మనం కూడా మన సమీపబంధువు తమ పాపముకు ప్రాయశ్చిత్తం లేనివారై శ్రమలలో ఉంటే వారి కొరకు దుఃఖించవచ్చు. మన కుటుంబ సభ్యులు పాప ప్రాయశ్చిత్తం లేనివారై తమ ఆహార అవసరతకు మనలను అంత్యక్రీస్తునకు అమ్మివేయవచ్చు.

మిగిలినవారు మరొకవైపు మన యొద్దకు వచ్చి తమ పాపనివృత్తి ఎట్లు అని అడగవచ్చు. ఇది ఖచ్చితముగా సంభవించును. ఎందుకంటే వారి పాపనివృత్తికైన అవకాశాలు అప్పటికీ సజీవమే. బైబిల్‌ మనతో చెప్తుంది. ఏడు బూరల తెగుళ్ళు వచ్చునప్పుడు ప్రపంచంలోని మూడవ వంతు చనిపోతారు. అనగా ముప్పావు వంతు మంది బ్రతుకుతారు. ప్రపంచ మూడవ వంతుమంది కాల్చబడినపుపడు మన హతసాక్ష్యము ప్రభువు రాకడ అతి సమీపమని మనం తెలుసుకోవాలి. ఆకాశం నుండి రక్తముతో కూడిన అగ్ని వడగండ్లను కురిపిస్తానని దేవుడు చెప్పుచున్నాడు.

దేవుడు మనపైకి అగ్ని వడగండ్లు కురిపించినప్పుడు వాటిని తప్పించుకొనుటలో మనం నిస్సహాయులము. శాస్త్రీయ పురోగతితో కూడా అగ్ని వడగండ్ల నుండి తప్పించగల రక్షణ కవచము ఏర్పరచుకొనుట అసాద్యము. ఒకవేళ అట్టి పరికరములతో మనం సిద్ధంగా ఉన్నప్పటికి ప్రభువు నుండి రాబోవు ఆ తెగులు ప్రభావంనకు సరిపోదు మనం ఆ తెగుళ్ళు నిజంగా వస్తాయనే సత్యమును మన హృదయాలలో అంగీకరించాలి. మరియు మన ప్రస్తుత జీవితాన్ని దేవుని యొక్క వాగ్ధానాలను హృదయంలో విశ్వసించాలి. 

ఈ మధ్య మనిషి తలకంటే పెద్ద వడగండ్లు 45 సెం.మీ పరిమాణములో ఉన్నవి. చైనాలో పడ్డాయను వార్తనేను విన్నాను. అవి పడే వడిలో మనిషి తలకంటే పెద్దవైన ఐస్‌ ముక్కలు అద్భుతమైన బలముతోపడి ఇంటికప్పు నుండి దూసికొని పోవుచు మార్గంలోనున్న వాటిని నాశనం చేసెను. మొదటి తెగలో పడేవి అంతకంటే ఎక్కువ బలంగా పడతాయి. భూమిపై పడబోవు అగ్ని చైనాలో పడిన వడగండ్ల కంటే ఎక్కువ నాశనం కలుగచేస్తాయని మన హృదయాలలో నమ్మాలి. ఇవి సంభవించునని హృదయంలో విశ్వసించాలి. ఆ విశ్వాసంతోనే ఆ తెగులు వచ్చినప్పుడు ప్రవర్తించాలి. ఈ ప్రపంచం అతి త్వరలో నాశనమగునని విశ్వసించాలి. అట్టి విశ్వాసంతో తెగుళ్ళును ఎదుర్కొనాలని నిర్ణయించాలి. మనం హతసాక్షులమవుతామని తీర్మానించాలి. ఆ ఏడుబూరలు ఊదబడినప్పుడు నిజముగా ఏడు తెగుళ్ళు ప్రపంచమునకు సంభవించును. ఇదే ఆ తెగుళ్ళకు ఆరంభము.దేవునిచే తేబడు తెగులు యొక్క రెండవ బూర


ఆ రెండు బూర వచనం 8-9 రెండవ దూత బూర ఊదినప్పుడు అగ్నిచేత మండుచున్న పెద్దకొండ వంటిది ఒక్కటి సముద్రములో పడవేయబడెను. అందువలన సముద్రములో మూడవ భాగము రక్తమాయెను. సముద్రములోని ప్రాణముగల జంతువులలో మూడవ భాగము చచ్చెను. ఓడలో మూడవ భాగము నాశనమాయెను. పరిశుద్ధులు కూడా సజీవులై రెండవ తెగులు ద్వారా ప్రయాణించుట అనుదానిపై మనం దృష్టి సారించాలి.

ఇక్కడ అది చెప్పునది గొప్ప పర్వతం వంటిది. సముద్రములోనికి పడవేయబడను. సముద్రంలో మూడవ భాగం రక్తంగా మార్చబడి, దాని ప్రాణులలో మూడవ భాగము చచ్చెను. అంత్యకాలం సమీపంచగా విశ్వం యొక్క క్రమము మారును. నక్షత్రము కాంతిహీనమై, ఒకదానితో నొకటి ఢీకొని పగులును మరియు అనేక ఉల్కలు భూమిపై పడును. కొన్ని నక్షత్ర శకలములు మండుటవలన కలుగు శక్తి వలన వాతావరణంలో నుండి సముద్రములో పడును. మూడవ వంతు రక్తముగా మారును. దాని ప్రాణులలో మూడవ వంతు చచ్చును. మరియు మూడవ వంతు ఓడను పగలకొట్టును. ఏడు బూరల తెగుళ్ళలోని రెండవ బూర యొక్క తెగులు ఇదే.

అప్పుడు మనం సముద్రపు చేపను తినగలమా, దానిలో ఈదగలమా, అది ఎంతోకాలం జరుగదు. గొప్ప పర్వతము వంటి నక్షత్ర శకలము సముద్రంలో పడినప్పుడు మూడవ భాగము రక్తముగా మారును. దాని ప్రాణులలో మూడవ వంతు చచ్చును. వాటి శరీరములతో సముద్రం కుళ్ళును, అలలు మరియు భూకంపాలు ఓడను పగలగొట్టడమే కాక జనులను చంపును ఒక సినిమాలో ఒక నక్షత్రశకలము సముద్రముపై పడుట వలన సముద్రకెరటాలు భూమిని ముంచుట నాకు జ్ఞాపకం. ఆ సినిమా నిర్మాతలు ఆ సినిమా చిత్రీకరించినప్పుడు అంత్య సమయంలో జరగబోవు దానిని గూర్చి తమ మనస్సులో ఒక స్థిరమైన దృష్టి కలిగియున్నారని నా నమ్మకం. ఆ ఘోర నాశనం భూమికి సంభవించుననునది అన్యులు కూడా విశ్వసించదగిన సత్యము. పడుచున్న ఉల్క వలన కలుగు తెగుళ్ళుకు లెక్కలేనంత మంది మనుష్యులు చనిపోతారు. కానీ ప్రపంచ మూడవ వంతు మాత్రమే నాశనము కావలసియుండగా నీవు నేను ఈ భూమిపై ఏడు బూరల తెగుళ్ళు పోయబడు వరకు జీవితంను కొనసాగించాలి.

పూర్వం ప్రజలు మహాశ్రమలు అయిపోయిన తరువాత ఎత్తబడుట సంభవించునని ప్రజలు నమ్మేవారు. కానీ శ్రమల ముందే ఎత్తబడుటను సిద్ధాంతం ఆవిర్భావంతో తత్వజ్ఞానులు దానికి బదులుగా శ్రమల ముందు ఎత్తబడుటను సిద్ధాంతమును నమ్ముతున్నారు. అంతకంటే ఘోరమైనది. ఎమిల్లీనియలిజమ్‌ కూడా.

వెయ్యేళ్ళ రాజ్యమును నిరాకరించుచూ ప్రత్యక్షమాయెను. తత్వవేత్తలు ప్రస్తుతం ప్రకటన వాక్యములన్నిటిని ఎదుర్కొనుటలో చేతకానివారైదాని నుండి పారిపోవుటకు ప్రయత్నిస్తున్నారు.

ఎందుకనగా రాబోవు తెగుళ్ళ వలన ఈ భూమిపై బ్రతుకునందు నిరీక్షణ లేని వారు దీనికి భిన్నంగా ఆ పరిస్థితులలో నిలిచియుండు తిరిగి జన్మించిన పరిశుద్ధులకు పూర్తి విరుద్ధంగా ఉంటారు.

నీతిగల వారు తమ నిరీక్షణను ప్రభువుచే వాగ్ధానమివ్వబడిన వెయ్యేళ్ళ రాజ్యము మరియు నూతన భూమి ఆకాశముపై నిలిపెదరు. 

అంత్యకాలము మనలను సమీపించుచుండగా మన విశ్వాసమందు సిద్ధపడాలి. కానీ అట్లు చేయనిచో అనేకులు ప్రట్రిబ్యులేషన్‌ రాప్చర్‌ లేదా ఎమిల్లీనియలిజమ్‌ గురించి మాట్లాడి నిజ విశ్వాసమును ఎదుర్కొనుటను అడ్డుకొంటారు. ఎందుకనగా యేసు వారిని దైనందిన కార్యక్రమాలలో ఉండగానే మేఘారూఢుడై వచ్చునని ఏ విధమైన తెగులును అనుభవించక ముందే వారిని తిన్నగా దేవుని రాజ్యమునకు ఎత్తుకొనిపోవునని విశ్వసించి తమను తాము మహాశ్రమల కొరకు సిద్ధపరచుకొనరు.

పై చూపులకు మహాశ్రమలకు సిద్ధపడక నిశ్చింతగా ఉన్నవారు ఎంతో ధైర్యంగానున్నట్లు కనబడవచ్చు. మహాశ్రమలకు ముందు తిరిగి జన్మించనివారైన పాపులు ధైర్యంగానుండుటకు కారణమేదనగా వారి ఆత్మలు ఇప్పటికే తప్పుడు ప్రవక్త అబద్ధమును పాపము చేసి చచ్చినవారై మరి ఏ ఇతర ఆత్మీయ కోరికలు మిగలని వారైయున్నారు. అదే కారణముగా తమను తిరిగి జన్మింపచేసి నిత్యరాజ్యములోనికి చేర్చగల అనగా వారి ఆత్మలు చావగా ప్రజలు నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను వినక దానిని త్రోసివేస్తారు. (యోహాను 3:5)

కానీ తిరిగి జన్మించినవారు అంత్యకాల శ్రమల కొరకు తమ విశ్వాసంను సిద్ధపరచుకొనాలి. వారి జీవితము ప్రస్తుతం ఎంత అనుకూలంగా ఉన్నప్పటికి లెక్కలోనికి రాదు. దేవునికి నమ్మకంగా ఉండగలవారికి సువార్తను అందించాలనే కోరికను ముందుగానే తమ మనసులో ఉంచుకొనిన శ్రమల కాలములో సాధ్యమైనంత ఎక్కువ ఆత్మలను రక్షింపగలరు.

త్వరలో రాబోవు మహాశ్రమల కాలమును గుర్తించకపోవుట నిశ్చయముగా అవివేకము. అలాగు చేయువారు తెగుళ్ళ ముందు నిస్సహాయులగుదురు. ఎట్లనగా కొరియా యుద్ధమందు జరిగినట్లుగానే జరుగును. కొరియా యుద్ధము ఆరంభమవ్వక క్రితము ఉత్తర కొరియా సైన్యము అధికముగా చేర్చబడుటను గుర్తించిన అమెరికా హాఠాత్తుగా జరగబోవు దానిని గూర్చి ఉత్తర, కొరియాను హెచ్చరించెను. కాని కొరియా ప్రభుత్వం సైన్యము పూర్తిగా ఆ హెచ్చరికను ఖాతరు చేయలేదు. సైన్యకూటమికి సాధ్యమైనంతగా సెలవులు ఇచ్చి ప్రధాన అధికారులను కూడా వారాంతపు దినములలో ఆనందించునట్లు చేసిరి. అవే నిజమైన యుద్దదినము.

అంత్యకాలము గూర్చి దేవుడు మాట్లాడిన వాక్కునందు మనము విశ్వాసముంచని యెడల అది మన మీద పడబోవు ఒక శాపము వంటిది. కానీ మనం దానిని హృదయపూర్వకంగా నమ్మినయెడల అట్టి శ్రమల నుండి తప్పించుకొనగలము. ప్రకటన ఆ శ్రమలు గూర్చి మాట్లాడును. అయిననూ పరిశుద్ధులకు కలుగు ఆ శ్రమము పోషణను గూర్చిచెప్పుచున్నది. ఈ ఆశ్రయము సంఘము కాక మరొకటి కాదు. ఈ లోకములో ఒకనికి ఆశ్రయం ఎక్కడో దొరుకును. కొద్దిమంది తాము ఇశ్రాయేలు దేశం వెళ్తే అక్కడ బతకగలమని చెప్తారు. కానీ ఇశ్రాయేలులో నిజానికి వారు మరి ఎక్కువ శ్రమలను అనుభవించాలి. నీవు గుర్తించాల్సిందేమనగా అంత్యక్రీస్తు ఇశ్రాయేలు దేశమును రాజధానిగా చేసికొనవలసియుండగా అక్కడ తెగుళ్ళు మరి అధికమగును.

నిజానికి ఈ శ్రమలు వాక్యము ఇప్పుడే అనుభవంలోకి రానప్పటికి మీరు తప్పక వాటిని మీ హృదయములో తెలిసికొని భవిష్యత్తులో ప్రవేశించాలి. నీ హృదయముతో నీవు ఒప్పుకోవాలి. ఆ విశ్వాసముతో మిగిలిన ప్రజలకు ఇప్పుడే మనం శ్రమలలో ఉన్నట్లుగా బోధించాలి. నీవు ప్రజల హృదయాలను తమ ఆశ్రమం కొరకు సిద్ధపరచి నీరు మరియు ఆత్మమూలమైన సువార్త బోధించుచూ నడిపించాలి. దేవుడు మనలను తన సంఘములో చేర్చెను. ఎందుకనగా రాబోవునట్టి విషయాలను ప్రజలకు బోధించి అంత్యదినములో కావలసిన విశ్వాసముతో వారిని సిద్దపరచుటకు.

ఇందువలననే మనము చేయవలసినది మనం చేస్తున్నాం. అనగా మన పూర్ణ శక్తితో నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను బోధించుచున్నాము. మనము ఈ సమయంలో ప్రకటన వాక్యమునే బోధిస్తున్నారు. కానీ మన స్వంత గొప్పలను కాదు. ఎందుకనగా ఈ దినము యుగమునకు ఇదే సరైన వాక్యము విశ్వాసులకు, అవిశ్వాసులకే ఒకే విధముగా ఈ విశ్వాసమును సిద్ధపరచుటద్వారానే శ్రమలు తెగుళ్ళు మనపై పడినప్పుడు దేవుడు తన ప్రత్యేక రక్షణ మనకిచ్చును. ఎందుకనగా మనము భయంకరమైన కఠినమైన మరియు క్లిష్టమైన ప్రపంచంలో నివసిస్తున్నాం. అంత్యకాలములో కలుగబోవునది మనం తెలిసికొని శ్రమలను జయించగల విశ్వాసముతో సిద్ధపడినచో సువార్తను మరి ఎక్కువ విశ్వాసముతో కూడిన నిరీక్షణ దేవుని రాజ్యములో ఉంచగలము. మనము ఎన్నడూ లోకం గాలికి కొట్టుకొనిపోవు లేదా మనిషి విశ్వాసమును అమ్మివేయుము. కానీ బదులుగా విశ్వాసము యొక్క క్రియలను అధికముగా చేయగలము. ఇందువలన మనం ప్రకటన వాక్యమును బోధించి అనేక విశ్వాస క్రియలను చేయుదుము.మూడవ బూర యొక్క తెగులు


ఆ మూడవ బూర వచనం 10-11 : ‘‘మూడవ దూత బూర ఊదినప్పుడు దివిటివలె మండుచున్న యొక పెద్దనక్షత్రము ఆకాశము నుండి రాలి నదుల మూడవ భాగము మీదను నీటిబుగ్గల మీదను పడెను. ఆ నక్షత్రమునకు మాచిపత్రియని పేరు, అందువలన నీళ్లలో మూడవ భాగము మాచిపత్రియాయెను. నీళ్లు చేదైపోయినందున వాటి వలన మనుష్యులలో అనేకులు చచ్చిరి.’’

ఈ మూడు తెగులలో కూడా పరిశుద్ధులు జీవించి ఉంటారు. రెండవ బూర తెగులు సముద్రముపైకి తేబడెను. కానీ ఈ సారి మూడవ బూర తెగులును నదులు మరియు నీటి బుగ్గల పైకి తెచ్చును. పరలోకము నుండి పడుచున్న ఆ మహా నక్షత్రము (గ్రహమును) పోలియున్నది. ఈ గ్రహముచే కొట్టబడిన నదులు, నీటిబుగ్గలు చేదుగా మారును. ఎందుకనగా అవి మాచిపత్రియగును. పూర్వకాలంలో ప్రజలు మాచిపత్రియని నూరి దాని రసమును ముందుగా తినేవారు అది ఊహాకందనంత చేదు. బైబిల్‌ చెప్పునదేమనగా ఈ మాచిపత్రి ప్రపంచ నీటి సరఫరాలలో వ్యాపించగా దానిని త్రాగుట ద్వారా అనేక ప్రజలు చచ్చెదరు. 

ప్రపంచ మూడవవంతు నీరు మాచిపత్రిగా మారినప్పుడు దాని వలన చాలామంది చనిపోతారు. ఈ తెగులు నుండి తన ప్రజలను ప్రభువు దాచును. ఈ భారీ వినాశనానికి కారణం నీటి మూల వ్యాధులు. బహుశా కామెట్‌ పడుట వలన ఆరంభమైన జీవరసాయన చర్య వలన కావచ్చు ప్రజలు చావరు. మరో రకంగా నీరు చేదుగా మారినందున కాదు కానీ ఏ ఇతర కారణం వలనైనా ఈ సంగతులన్ని సత్యమని మనం ఎరిగి తప్పక ఇవన్నీ సంభవింపబోవుచున్నవని మనం నమ్మాలి.నాల్గవ బూర తెగులు


ఆ నాల్గవ బూర వచనం 12: ‘‘నాలుగవ దూత బూర ఊదినప్పుడు సూర్య చంద్రనక్షత్రములో మూడవ భాగము చీకటి కమ్మునట్లుగా, పగటిలో మూడవ భాగమున సూర్యుడు ప్రకాశింపకుండునట్లును, రాత్రిలో మూడవ భాగమున చంద్ర నక్షత్రములు ప్రకాశింపకుండునట్లుగా వాటిలో మూడవ భాగము కొట్టబడెను.’’ ఈ నాల్గవ తెగులు సమయమందు కూడా పరిశుద్ధులు జీవిస్తారని మరచిపోవద్దు.

పగటిలో మూడవ భాగమున సూర్యుడు ప్రకాశింపదు అనగా సగటున పగటి సమయమైన ఏడు నుండి ఎనిమిది గంటలలో దాదాపు నాలుగు గంటల సమయం తగ్గించబడును. చంద్ర నక్షత్రములు కూడా తమ కాంతిలో మూడవ వంతు కోల్పోగా ప్రపంచం చీకటికమ్మును. రాప్చర్‌ అను సినిమాలోని సిద్ధాంతము శ్రమల ముందు ఎత్తబడుట సిద్ధాంతాన్ని అనుసరించెను. కానీ దానిలో విశాలమైన పగటి కాలములోనే ప్రపంచం చీకటిగా మారడాన్ని నీవు చూడగలవు. దాని వలన ప్రతివారు బాధింపబడి భయకంపితులౌతారు. దాని గూర్చినీవు ఆలోచించు అది ఉదయం గం.11-00 కావలసియుండగా ఆకస్మాత్తుగా సూర్యుడు మాయమై ఇక వెలుగు లేకపోవును. నీవు కూడా భయపడవచ్చు. ఒకవేళ మృత్యుదేవత కనిపించిందేమోనని.

అట్టి నాశనకరమైన సమయంలో జీవించవలెనని మనకు తెలుసు. కానీ నీవు భయపడకూడదు. ఇంతకంటే అధికంగా దేవుడు మనలను భద్రపరచి దీవించును. ఈ సమయంలో నీ విశ్వాసము మరింత బలమైనదిగా మారును. ఎందుకనగా దేవుడు ఆ సమయంలో నీవు చేసిన ప్రతి ప్రార్థన విని జవాబిచ్చి నీ కొరకు క్రియ జరిగించును. కారణమేమనగా ప్రపంచాంతం వరకూ దేవుడు ఎల్లప్పుడూ మనతో ఉంటానని వాగ్ధానమిచ్చాడు. మహాశ్రమలలో దేవుడు మనలను విడువడు. అనుమానం లేకుండా ఆయన ఎల్లప్పుడూ మనతోనే ఉండును. అలాగే ఎల్లప్పుడూ దేవుడు మనతోనుండగా ఆయన మనలను కాపాడి బ్రతికించునని మనం నమ్మాలి. ఈ విశ్వాసాన్ని ఇతరులకు వ్యాపింపచేసి వారి విశ్వాసమును అలాగే సిద్ధపరచాలి.రానున్న మూడు తెగుళ్ళు : 


వచనం 13 : ‘‘మరి నేను చూడగా ఆకాశమధ్యమున ఒక పక్షిరాజు ఎగురుచు బూరు ఊదబోవుచున్న ముగ్గురు దూతల బూర శబ్ధమును బట్టి భూమి వాసులకు అయ్యో, అయ్యో, అయ్యో అని గొప్ప స్వరముతో చెప్పుట వింటిని.’’

దూత మరి మూడు శ్రమలని గొప్ప స్వరముతో చెప్పుచుండగా మరొక మూడు తెగుళ్ళు భూమిపైకి వచ్చును. ఏడు బూరల తెగుళ్ళలో మరొక విధంగా మూడు తెగుళ్ళు ఇంకా మిగిలి ఉన్నవి. మనం గుర్తించవలసినదేమనగా ఏడవ బూరతో మనం ఎత్తబడుట సంభవించును. మొదటి ఆరు బూరల తెగుళ్ళు ముగియునప్పుడు ఏడవ దూత తన బూర ఊదును. పరిశుద్ధులు వెంటనే పునరుత్థానులై ఎత్తబడుదురు. పరిశుద్ధులంతా ఎత్తబడి మేఘాలలో ప్రభువును కలిసికొనునప్పుడు ఏడు పాత్రల యొక్క తెగుళ్ళు భూమిపై కుమ్మరింపబడును.

వేగము ఈ భూమి ఏడు బూరులు మరియు ఏడు పాత్రలు తెగుళ్ళలోనికి ప్రవేశించునని మనం గుర్తించాలి. ఏడు పాత్రల తెగుళ్ళు దేవుని చిత్తానుసారంగా ఏడుబూరల యొక్క తెగులుతోపాటు కుమ్మరింపబడును. వీటిని మన పూర్ణ హృదయంతో మనం విశ్వసించాలి. మరియు మన విశ్వాసాన్ని పెంపొందించుటకు మన విశ్వాసం ఈ తెగుళ్ళన్నిటి నుండి కాపాడుకొనుటకు బలపడును. అంత కాలము యొక్క జ్ఞానము ముందుగా లేని ప్రజలు ఆ శ్రమలు నిజంగా సంభవించినప్పుడు విభ్రాంతి నొంది తమ జీవితాన్ని అంతం చేసికొనవచ్చు. అలాగే అంతమందు మనం ఆనందించుటకు వీటియందు మనకున్న విశ్వాసము అంత్యకాలము గూర్చిన సరియైన జ్ఞానముతో కూడినది. ఈ రోజు అంతము అతిసమీపముగా రానైయుండగా, మనము సంఘమును నిర్లక్ష్యము చేయకూడదు. లేదా సంఘము నుండి మనకు బోధించబడిన దేవుని వాక్యమును విశ్వసించాలి. మనం ఒకరి నొకరు పట్టుకొని విశ్వాసంలో జీవించాలి.

ఈ తెగుళ్ళు సంభవించినప్పుడు మన స్వంత కుటుంబంలో కూడా రక్షింపబడని కొందరు బంధువులు / స్నేహితులు నీతో కూడా రావచ్చును. సాధారణ సమయంలో మన బంధువులు సహోదరులు తల్లిదండ్రులు ఎవరైనా ప్రభువు చెప్పెను. తండ్రి చిత్తమున చేయువారే మన కుటుంబం తల్లిదండ్రులు మరియు సహోదరుని శ్రమ ప్రపంచం వచ్చినప్పుడు తిరిగి జన్మించినవారు మరింత ఖచ్చితంగా తమ నిజ సహోదరులు సహోదరీలు మరియు కుటుంబం ఎవరో తెలుసుకొంటారు. ఎందుకనగా ఇప్పుడు మనం ఒకరినొకరు ఆయన విశ్వాసంతో సరిగా అర్థం చేసుకొంటాం. దేవుడు నిన్ను నన్ను ఇప్పటికే ఆ తెగుళ్ళ నుండి ఒకే విధముగా రక్షించెను. ఆయనే మనలను కాపాడును తెగుళ్ళ నుండి మనలను కాపాడును. మనలను తన సంఘములో తన పిల్లలవలే పెంచును. ఇట్టి విశ్వాసమే మనలో స్థిరముగా నాటుకొనవలెను.

అంత్యకాలములో మనలను అంత్యక్రీస్తునకు అమ్మువారు మన స్వంత కుటుంబీకులే కావచ్చు అలాగే వారు మన కుటుంబీకులు బంధువులైననూ వారు నీరు మరియు ఆత్మమూలముగా తిరిగి జన్మించినట్లైతే వారిని ఆది నుండే ఇతరుల వలే లెక్కించుకొనుటకు కావలసిన బలమైన విశ్వాసం మనకు ఉండాలి. వారు మరొకరకంగా నిజానికి మనకు క్రొత్తవారు జరిగించినదానికంటే అధికంగా చెడ్డకార్యములను మనపట్ల జరిగించగలరు వారు మన స్వంత సంబంధీకులైన కుటుంబీకులైనను మనపట్ల జరిగించగలరు వారు మన స్వంత సంబంధికులైన కుటుంబీకులైనను లెక్కలేదు. వారి రక్షింపబడని వారైతే కారణం లేకుండానే వారు మన శత్రువువలే మనం గుర్తించాలి దేవుని వాక్యం నుండి తరచుగా వినుచున్న విషయమువైపు మన హృదయాన్ని తెరవాలి దానిని సత్యమువలే విశ్వసించాలి.

సొదొమ, గొమొఱ్ఱాను దేవుడు అగ్నిని గంధకమును కురిపించినట్లుగానే అంత్యకాలమందు పాపులపైకి అట్టి తెగులును కలిగించును. పురాశాస్త్ర గుర్తుతో సొదొమ గొమఱ్ఱాకు దేవుడు కలిగించిన నాశనము ఋజువు చేయబడిరది.

ఈ రోజులలో అనేక సినిమాలలో భూమి గ్రహాలను ఢీకొనుట ద్వారా మానవాళి నాశనమగుట అను అంశాన్ని చూపిస్తున్నారు. ఈ సినిమాలన్నీ అంత్య దినములో ఈ భూమిపైకి రానున్న తెగుళ్ళను గూర్చి వ్రాయబడిన బైబిలు వాక్యాలను ఆధారంగా తీయబడిన భూమిపైకి ఉల్కలు రాలుట అనునది సంభవించుట అత్యున్నతము దానికంటే ఎక్కువగా ఈ తెగుళ్ళు వచ్చుట అనునది నిజమగుట ఈ లోకం జరుగును.

మంచి ఉదాహరణ పురాజీవ శాస్త్ర నిదర్శనమైన డయానోసార్స్‌ యొక్క అస్థిపంజరము పురాతన కాలములో భూమిపై గొప్ప మార్పు సంభవించెననుట విలుప్తమైన జీవులు మనకు చెప్పునది. వాటి అస్థిపంజరము నుండి వాటి పురాతన ఉనికి కొంత మంది శాస్త్రవేత్తలు డయానోసార్‌తో పాటుగా మిగిలిన జీవులు విలుప్తమగుట ఒక ఆస్టరాయిడ్‌తో భూమి ఢీకొనుట వివరిస్తారు. కనుక ప్రకటన 8లో వ్రాయబడిన నక్షత్రము యొక్క తెగుళ్ళు ఈ లోకంలో సంభవించుట అనునది సాధ్యమే.అతి దూర భవిష్యత్తులో కాదు....


ఈ తెగుళ్ళన్నీ భూమిపై సంభవించుట ఎంతో దూరములో లేదని మనం గుర్తించాలి. ఇప్పటికే కొంతమంది శాస్త్రవేత్తలు మానవ క్లోనింగ్‌కు ప్రయత్నించారు. అది దేవునికి సవాలు కావచ్చు. కనుక ఈ యుగమందే ఈ తెగుళ్ళన్నీ దేవునిచే తేబడుటకు సిద్ధముగా ఉన్నవి.

మానవాళి ఇప్పుడు ప్రపంచ తెగుళ్ళన్నిటిని ఎదుర్కొనుటకు తమ విజ్ఞాన బలముతో సిద్ధపడుచున్నారు. కానీ ఏ సైన్స్‌ పరిజ్ఞానం కూడా దేవుని తెగుళ్ళను ఆపలేవు. ఎందుకనగా అవి ఇంతకు ముందెన్నడూ మానవాళి ఎదుర్కొన్న సమస్య కంటే క్లిష్టమైనది. ఈ రోజులలో మనిషిని మనం చూచినయెడల సైన్స్‌పరంగా ఎంతో పురోగమించెను. మానవాళి దేవుని అధికారమును ఛాలెంజ్‌ చేయుట మనం చూస్తాం. కానీ అది ఎంత సైన్స్‌పరంగా పురోగమించిననూ దేవునిచే కుమ్మరింపబడబోవు తెగుళ్ళను ఎవరూ ఆపలేరు. ఎవరో కాదు ఈ తెగుళ్ళన్నిటిని అడిగినవాడు కేవలము మనిషే.

దేవుడు పంపే తెగుళ్ళ నుండి తప్పించుకొనగల ఏకైక మార్గమేదనగా నీరు మరియు ఆత్మమూలమైన సువార్తద్వారా రక్షణ యొక్క సత్యమును తెలుసుకొని దాని విశ్వసించుట ద్వారా ఆయన హస్తములో దాగియుండుటే భయంకరమైన దేవుని తీర్పును తప్పించుకొను మార్గము నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను విశ్వసించి దానిని గుర్తించి విశ్వసించుట ద్వారానే ఆ తెగుళ్ళ నుండి రక్షింపబడగలము.

దేవుని శాపములన్ని దేవుని చేతిలోనున్నవి దేవుడు భూమిని కాపాడుటకు నిర్ణయించిన భూమి కాపాడబడును. లేనిచో కేవలము అది నాశనమగును. ఇటువంటి యుగములో నివశిస్తూ దేవుని వాక్యమును నిర్మలముగా విశ్వసించి అనుసరించుచూ అధికంగా ఆయనకు భయపడిన రాబోవు భయంకరమైన తెగుళ్ళ నుండి కాపాడగల నీరు మరియు ఆత్మమూలమైన సువార్త యొద్దకు దేవుడు మిమ్మును నడుపును.

ఇప్పటినుండైనా లోక ప్రజలలో అనేకులు భూకంపాలు తుఫాను మరియు వ్యాధులు వలన చనిపోవుచూ గడగడ వణుకుచున్నారు. అంతేకాక ప్రతిచోట దేశమునకు దేశమునకు రాష్ట్రమునకు, రాష్ట్రమునకు మధ్యగల యుద్ధమునకు అంతులేదు. అలాగే సమీప భవిష్యత్తులో అంత్యక్రీస్తు బయల్పడునప్పుడు అశాంతికర సన్నివేశముకు తీర్మానించబడినప్పుడు ప్రజలనేకులు అతనిని వెంబడిస్తారు. దీని తరువాత ఈ భూమిపైకి అతిభయంకరమైన తెగుళ్ళ వానితో కూడా దిగి వచ్చును. అంతమున దేవునిచే నియమింపబడిన తెగుళ్ళ వలన ఈ లోకముపూర్తిగా నాశనమగును.

దేవుడు దూతను భూమిని ఆకాశమును సృష్టించి దానిని పాపవిముక్తులైన వారికి ఇచ్చును. నూతన భూమి ఆకాశము సృష్టించుటకు గల ప్రధాన ఉద్ద్యేశమేమనగా నీరు మరియు ఆత్మమూలమైన సువార్త ద్వారా తిరిగి జన్మించిన వారికి దానిని స్వాస్థ్యనిచ్చుట. పూర్వము దేవుడుమొదటి లోకమును నాశనం చేసి రెండవ లోకమును ప్రారంభించును. కేవలము పురాతన డయనోసార్‌ు మాయమైనట్లుగానే ఈ నవీన విజ్ఞాన జనావాసాలు మాయమగును. దేవునిచే నియమింపబడబోవు నూతన లోకమునకు మనము ప్రధాన సాక్షులము కానున్నాము.

కనుక మనము నివసించవలసిన విధానము ఆలోచింపవలెను. ప్రస్తుత్త పేరా నందు లిఖించబడిన తెగుళ్ళన్నిటిని మనం నమ్మాలి మన శేష జీవితంను దేవుని నీతికొరకు కొనసాగించాలి. రాబోవు లోకమునకు విశ్వాసంతో సిద్ధపడాలి. ప్రకటన ప్రవచనము యొక్క జ్ఞానవంతులము కావాలి. నేను ఇప్పుడు దీనిని చెప్పడం ఎందుకనగా దినము వచ్చినప్పుడు నీకు కలిగిన జ్ఞానమంతా నీ విశ్వాసమునకు అత్యంత ఉపయోగకరమగును.

భూమిని ఢీకొని శక్తిగల అంతరిక్ష ఉపకరణములన్ని బుధగ్రహం నుండి గరుని వరకు విస్తరించిన ఆస్టరాయిడ్‌లు తెలియని వలయాలలో నున్న అనేక కామెట్స్‌ అన్నిటిని కలిపి నియర్‌ ఎర్త్‌ ఆబ్జెక్ట్‌ అంటారు. నాసా ఒక్క సూర్యకుటుంబంలోనే దాదాపు 893 తెలిసినవి ఉన్నట్లు బట్టబయలు చేసింది. ఒకవేళ ఏ ఒక్కటైనా భూమిని ఢీకొంటే కలుగు నాశనము ఊహకందనిది కలుగబోవు నాశనము దాదాపు కొన్నివేల అణుబాంబులు పేలిన దానికన్నా ఎక్కువ.

ఈ లోకమునకు ఏమి సంభవించునో ఊహించు. ఈ ప్రపంచ అడవు నీరు ఓడు నాశనమగును తెలియబడిరది. కనుక మానవాళి అంతా నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను విశ్వసించి నిత్యజీవము కొరకు తమను సిద్ధపరచుకోవాలి.

సహజ తెగుళ్ళు భూమిపైకి వచ్చినప్పుడు సూర్య, చంద్ర నక్షత్రములలో మూడవ భాగము కాంతి హీనమగునని ప్రభువు చెప్పెను. కాని కొద్ది మందికే ఇది తెలుసు. అతి కొద్దిమంది దీనిని విశ్వసిస్తారు. అలాగే అతికొద్ది మందే నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను విశ్వసించి అసత్యమును బోధిస్తారు.

మన మనస్సు సిద్ధంగా ఉండాలి. నిజంగా ఈ తెగుళ్ళు వస్తాయి. మన శేష జీవితంలో ఎలాంటి విశ్వాసం తీర్మానం మనం కలిగి ఉండాలో మనం కనుగొనాలి. నీవు నేను తప్పక ప్రస్తుత యుగము గొప్ప శ్రమలకు ఆమడ దూరంలోనే ఉన్నదని గుర్తించాలి. మన హృదయంలో ఒక చిన్న అనుమానం కూడా లేనటువంటి విశ్వాసంతో మన మిగిలిన జీవితాన్ని కొనసాగించాలి.

ఒకవేళ మనమిప్పుడు ఈ శ్రమ ప్రవచన వాక్యమును నమ్మి జీవించనట్లయితే మన హృదయాలు ఖాళీ అవుతాయి మన అవసరం పొగొట్టుకొంటాం. మనం జీవిత భాదచే పట్టబడతాం ఇది సంభవించకూడదు ఇప్పుడే మన నిరీక్షణ ఈ లోకంలో అతి కొద్దిగానే ఉండి ఈ లోకమునకు ఎప్పుడూ మన వెనుక వదలమన్నట్లుగా జీవించాలి సైంటిఫిక్‌ పరిజ్ఞానంలో నమ్మకం లేనివారు ఈ లోకమునకు నిరీక్షణ లేదని బాగుగా తెలిసికొంటారు.

దేవుడు నిశ్చయంగా ఈ లోకమును ఒట్టిదిగా చేయుచున్నాడు. దేవుడు యేసు యొక్క నూతన రాజ్యస్థాపన చేసి నీతిమంతులను దానిలో నివసింపచేస్తాడు మరియు ఆయన నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను విశ్వసించు వారితో ఎల్లప్పుడు నివసించును.

మన స్వంత ఉద్దేశ్యాలను ఆలోచనలను ఆయన యెదుట వదిలిపెట్టాలి. ఆయన ప్రవచన వాక్యమును దీనత్వముతో స్వీకరించి విశ్వసించాలి. నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను ప్రకటించి ప్రభువు వచ్చినప్పుడు ఆయనను కలుసుకోవాలి. మనము దేవుని పని కొరకు నివసిద్ధాం. ఆయనవలే మన శరీరాలు రూపాంతరం చెందుతాయి. మనం మరలా ఆయన నూతన లోకంలో ఉంటాం ఇదంతా ఆయన చెప్పినట్లే జరుగును.

ప్రభువు రాకడ ఖచ్చితమైన దినము రోజు మనకు తెలియదు కానీ ప్రపంచ గుర్తును చూచుట ద్వారా దేవుని వాక్యములో లిఖించబడిన తెగుళ్ళన్నీ మనలను త్వరితంగా సమీపిస్తున్నాయని మనకు తెలియును. ఈ విషయాలన్నీ ప్రవచించిన దేవుని ఆయన చూపిన రక్షణను విశ్వసించాలి.