Sermons

[అధ్యాయము 9-1] <ప్రకటన 9:1-21> అగాధము నుండి కలుగు తెగుళ్ళు<ప్రకటన 9:1-21>

“అయిదవ దూత బూర ఊదినప్పుడు ఆకాశము నుండి భూమిమీద రాలిన యొక నక్షత్రమును చూచితిని. అగాధము యొక్క తాళపు చెవి అతనికి ఇయ్యబడెను. అతడు అగాధమును తెరవగా పెద్ద కొలిమిలో నుండి లేచు పొగవంటి పొగ ఆ అగాధము నుండి లేచెను. ఆ అగాధములోని పొగ చేత సూర్యునిని, వాయుమండలమును చీకటి కమ్మెను. ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదికి వచ్చెను. భూమిలో ఉండు తేళ్ళకు బలమున్నట్లు వాటికి బలము ఇయ్యబడలేదు. మరియు నొసళ్ళయందు దేవుని ముద్రలేని మనుష్యులకే తప్ప భూమిపైనున్న గడ్డికైనను ఏ మొక్కకైనను మరి ఏ వృక్షమునకైనను హాని కలుగజేయకూడదని వాటికి ఆజ్ఞ ఇయ్యబడెను. మరియు వారిని చంపుటకు అధికారము ఇయ్యబడెను. గాని అయిదు నెల వరకు బాధించుటకు వాటికి అధికారము ఇయ్యబడెను. వాటి వలన కలుగు బాధ తేలు మనుష్యుని కుట్టినప్పుడుండు బాధవలె ఉండును. ఆ దినములలో మనుష్యులు మరణమును వెదకుదురు గాని అది వారికి దొరకనే దొరకదు. చావవలెనని ఆశపడుదురు. గాని మరణము వారి యొద్ద నుండి పారిపోవును. ఆ మిడతల రూపము యుద్ధమునకు సిద్ధపరచబడిన గుఱ్ఱమును పోలియున్నవి బంగారమువలె మెరయు కిరీటముల వంటివి వాటి తల మీద ఉండెను. వాటి ముఖములు మనుష్యుల ముఖమువంటివి, స్త్రీ తలవెండ్రుకలవంటి వెంట్రుకలు వాటి కుండెను. వాటి పండ్లు సింహపు కోరలవలె ఉండును. ఇనుప మైమరవుల వంటి మైమరువులు వాటికుండెను. వాటి రెక్కల ధ్వని యుద్ధమునకు పరుగెత్తునట్టి విస్తారమైన గుఱ్ఱపు రధముల ధ్వనివలె ఉండెను. తేళ్ళ తోక వంటి తోకలు కొండ్లును వాటికుండెను. అయిదు నెలల వరకు వాటి తోకలచేత మనుష్యులకు హానిచేయుటకు వాటికి అధికారముండెను. పాతాళపు దూతవాటిపైన రాజుగా ఉన్నాడు. హెబ్రీ బాషలో వానికి అబద్దోనని పేరు. గ్రీసు దేశపు భాషలో వానిపేరు అపోల్లోయోను. మొదటి శ్రమ గతించెను. ఇదిగో మరి రెండు శ్రమలు ఇటు తరువాత వచ్చును.

ఆరవ దూత బూర ఊదినప్పుడు దేవుని యెదుట ఉన్న సువర్ణ బలిపీఠము యొక్కకొమ్మల నుండి యొక స్వరము యూఫ్రటీసు అను మహానది యొద్ద బంధింపబడియున్న నలుగురు దూతలను వదిలిపెట్టుమని బూర పట్టుకొని యున్న ఆ యారవ దూతతో చెప్పుట వింటిని మనుష్యులలో మూడవ భాగమును సంహరింపవలెనని అదే సంవత్సరమున అదే నెలలో అదే దినమున అదే గంటకు సిద్ధపరచబడియుండిన ఆ నలుగురు దూతలు వదిలిపెట్టబడిరి. గుఱ్ఱపు రౌతులు సైన్యము లెక్క యిరువది కోట్లు వారి లెక్క యింత అని నేను వింటిని మరియు నాకు కలిగిన దర్శనమందు ఈలాగు చూచితిని. ఆ గుఱ్ఱములకును వాటిమీదకూర్చుండి వున్నవారికిని, నిప్పువలె ఎరుపువర్ణం నీలవర్ణము, గంధవర్ణము మైమరపుండెను. ఆ గుఱ్ఱముల, తలలు సింహపు తలలవంటివి వాటి నోళ్లలో నుండి అగ్ని ధూమగంధకము బయలు వెడులుచుండెను. ఈ మూడు దెబ్బలచేత అనగా వీటి నోళ్లలో నుండి బయలువెడలుచున్న అగ్ని ధూమ గంధకముల చేత మనుష్యులలో మూడవ భాగము చంపబడెను. ఆ గుఱ్ఱముల బలము వాటి నోళ్లయందును వాటి తోకలయందును ఉన్నది. ఎందుకనగా వాటి తోకలు పాములవలె ఉండి తలలు కలిగినవైనందున వాటిచేత అవి హాని చేయును. ఈ దెబ్బలచేత చావక మిగిలిన జనులు దయ్యములను చూడను వినను నడువను శక్తిలేనివై బంగారు వెండి కంచు రాయి కర్రతో చేయబడిన తమ హస్తకృతములైన విగ్రహములను పూజింపకుండ విడిచిపెట్టునట్లు మారుమనస్సు పొందలేదు. మరియు తాము చేయుచున్న నరహత్యలను మాయమంత్రములను జారచోరత్వములను చేయకుండునట్లు వారు మారుమనస్సు పొందదినవారు కారు.’’వివరణ : 


వచనం 1 : అయిదవ దూత బూర ఊదినప్పుడు ఆకాశము నుండి భూమిమీద రాలిన యొక నక్షత్రమును చూచితిని. అగాధము యొక్క తాళపు చెవి అతనికి ఇయ్యబడెను.

దేవుడు అగాధపు తాళపు చెవిని దూతకు ఇచ్చెననగా ఆయన పాతాళంలోనున్నంత భయంకరమైన తెగులును భూమిపైకి తెచ్చుటకు నిర్ణయించెను.

ఆ అగాధమును ఊబి అని కూడా అనవచ్చు అనగా అంతంలేని గొయ్య అని అర్థం. భూమిపై నివశిస్తున్న అంత్యక్రీస్తుకు అతని అనుచరులకు నీతిమంతులను వ్యతిరేకించువారికి బాధ కలుగచేయడానికి దేవుడు అగాధమును తెరచును. ఈ అగాధపు తాళపు చెవి ఐదవ దూత కియ్యబడెను. ఈ తెగులు పాతాళమంత భయంకరమైన తెగులు.

వచనం 2 : అతడు అగాధము తెరవగా పెద్ద కొలిమిలో నుండి లేచు పొగవంటి పొగ ఆ అగాధము నుండి లేచెను. ఆ అగాధములోని పొగచేత సూర్యునిని వాయుమండలమును చీకటి కమ్మెను.

దేవుడు అగాధము తెరచుటకు అనుమతించగా ప్రపంచమంతా అగ్ని పర్వతం నుండి పుట్టు బూడిద వంటి దానితో నిండెను. చీకటి యొక్క తెగులును తెచ్చును. ఈ చీకటి తెగులు చీకటిని ప్రేమించువారి కొరకు నియమించబడెను. దేవుడు ప్రతివారికి నీరు మరియు ఆత్మమూలమైన సువార్త నిచ్చుచూ మనపై ప్రకాశించు వెలుగైయున్నాడు. ఈ సత్యము విశ్వసించువారికి దేవుడు రక్షణ అను కరుణనిచ్చి తన ప్రకాశమైన వెలుగులో నివశించుటకు అనుమతించెను. కానీ సత్యమును స్వీకరించిన వారు దేవుని యొక్క న్యాయతీర్పును ఎదుర్కొందురు. ఎందుకనగా ఆయన చీకటి యొక్క తెగుళ్ళను వారిపైకి రప్పించి తన న్యాయతీర్పు తీర్చును.

ప్రధానంగా ప్రజలు పాపులుగా జన్మించారు. వారు తమ జీవితంలో చీకటిని కోరుకుంటారు. కనుక ప్రభువిచ్చిన నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను విశ్వసింపక త్రోసివేసినందున దేవుని నుండి కలుగు అగాధ తెగుళ్ళకు వారే తగినవారు.

వచనం 3 : ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదికి వచ్చెను. భూమిలో ఉండు తేళ్ళకు బలమున్నట్లు వాటికి బలము ఇయ్యబడెను.

దేవుడు భూమిపైకి మిడతలను పంపి తమ స్వంత ఆలోచనలలో దేవుని సత్యమును వ్యతిరేకించు పాపులను శిక్షించును. ఈ మిడత తెగులు తేలు కాటువంటి బాధను కలుగజేయును. కనుక ఈ లోక పాపులందరూ దేవుని నిజప్రేమను నమ్మాలి. నమ్మని వారు దేవుని ప్రేమను త్రోసివేసి ఆయనకు వ్యతిరేకముగా నిలుచుట అను పాపము ఎంతగొప్పదో బాధకరమైనదో మొదటిసారిగా రుచిచూస్తారు.

దేవుడు మిడతలను పంపి తమ స్వంత ఆలోచనలతో సత్యదేవునికి వ్యతిరేకముగా నిలుచుట అను పాపమునకు వారు జీతము పొందునట్లు చేసెను. ఈ పాపం వలన మిడతల తెగులు వలన బాధించబడుటే.

వచనం 4 : మరియు నొసళ్ళ యందు దేవుని ముద్రలేని మనుష్యులకే తప్ప భూమిపైనున్న గడ్డికైనను ఏ మొక్కకైనను మరి ఏ వృక్షమునకైనను హాని కలుగజేయకూడదని వాటికి ఆజ్ఞ ఇయ్యబడెను. మరియు వారిని చంపుటకు అధికారము ఇయ్యబడెను.

దేవుడు భయంకరమైన మిడతల తెగుళ్ళు తెచ్చునప్పుడు తనచే ముద్రింపబడిన వారిపై తన దయ చూపక మరచిపోడు ప్రకృతిని పాడుచేయవద్దని మిడతలకు ఆజ్ఞాపించును.

వచనం 5 : మరియు వారిని చంపుటకు అధికారము ఇయ్యబడెను. గాని అయిదు నెలల వరకు బాధించుటకు వాటికి అధికారము ఇయ్యబడెను. వాటి వలన కలుగు బాధ తేలు మనుష్యుని కుట్టినప్పుడు బాధవలె ఉండును.

సొలోమోను పరమగీతము 6లో దేవుడు తన ప్రేమ గూర్చి మాట్లాడుతూ ప్రేమ మరణమంతగొప్పది. ఈర్ష్య పాతాళమంత కఠోరమైనది అని చెప్పెను. అలాగే ఈ తెగులు మనకుచెప్పునదేమనగా నీరు మరియు ఆత్మమూలమైన సువార్త ద్వారా చూపబడిన దేవుని ప్రేమను తృణీకరించువారికి కలుగు శిక్ష ఎంత భయంకరమైనదో ఈ తెగులు ద్వారా తెలియును. ఈ తెగులు ప్రజలను 5నెలల వరకు బాధించును.

వచనం 6 : ఆ దినములలో మనుష్యులు మరణమును వెదకుదురు గాని అది వారికి దొరకనే దొరకదు. చావవలెనని ఆశపడుదురు గాని మరణము వారి యొద్దనుండి పారిపోవును.

ఈ తెగులు వలన బాధింపబడునప్పుడు ప్రజలు ఈ బాధలో నివశించుటకంటే చచ్చుట కోరుదురు. వారు ఎంతగా కోరుకొన్నప్పటికి అది వారికి దొరకదు. ప్రజలు దేవుని నిర్లక్ష్యపరచినందునే ఈ తెగులు వచ్చినది. శరీరములోని జీవితమును చాలించుటే అంతమని తలంచుచూ జీవమరణముపై అధికారముగల దేవుని నిర్లక్ష్యపెట్టిరి కానీ ఈ మిడతల తెగుళ్ళ ద్వారా దేవుని అనుమతితోనే మరణము మనకు సంభవించునని దేవుడు చూపెను.

వచనం 7-12 : ఆ మిడతల రూపము యుద్ధమునకు సిద్ధపరచబడిన గుఱ్ఱములను పోలియున్నవి. బంగారమువలె మెరయు కిరీటము వంటివి వాటి తలమీద ఉండెను. వాటి ముఖములు మనుష్యముఖము వంటివి. స్త్రీ తలవెండ్రుకల వంటి వెండ్రుకులు వాటికుండెను. వాటి పండ్లు సింహాపు కోరవలె ఉండును. ఇనుపమైమరువుల వంటి మైమరువులు వాటికుండెను. వాటి రెక్కల ధ్వని యుద్ధమునకు పరుగెత్తునట్టి విస్తారమైన గుఱ్ఱపు రధముల ధ్వనివలె ఉండెను. తేళ్ళతోకల వంటి తోకలు కొండ్లును వాటికుండెను. అయిదు నెలల వరకు వాటి తోకలచేత మనుష్యులకు హానిచేయుటకు వాటికి అధికారముండెను. పాతాళపు దూతవాటిపైన రాజుగా ఉన్నాడు. హెబ్రీభాషలో వానికి అబద్దోనని పేరు, గ్రీసుదేశపు భాషలో వానిపేరు అపోల్లోయోను. మొదటి శ్రమ గతించెను. ఇదిగో మరి రెండు శ్రమలు అటు తరువాత వచ్చును.

అగాధము యొక్క మిడతలు తోకతో ఐదు నెలలు వరకు మనుష్యులను బాధించును. తమ రూపములో అవి స్త్రీవలే కనబడిననూ, ఈ మిడతలు అత్యంత భయానకము మరియు దుష్టమైనవి. దీని వలన మనుష్యుడు దేవుని కంటే స్త్రీని వెదకుటతో జరిగించు పాపం ఎంత గొప్పదో చూపబడెను సాతాను మనలను లైంగిక అక్రమమునకు లాగి అట్ఠి శరీర ఆశను మన జీవితంలో అధికంగా కలిగించి మనలను దేవుని నుండి దూరం చేయాలని కోరుతుందని మనం తెలుసుకోవాలి.

వచనం 13-15 : ఆరవ దూత బూర ఊదినప్పుడు దేవునియెదుట ఉన్న సువర్ణ బలిపీఠము యొక్క కొమ్మల నుండి యొక స్వరము - యూఫ్రటీసు అను మహానదియొద్ద బంధింపబడియున్న నలుగురు దూతలను వదిలిపెట్టుమని బూర పట్టుకొని యున్న ఆ యారవ దూతతో చెప్పుట వింటిని. మనుష్యులలో మూడవ భాగమును సంహరింపవలెనని అదే సంవత్సరమున అదే నెలలో అదే దినము అదే గంటకు సిద్ధపరచబడియుండిన ఆ నలుగురు దూతలు వదిలిపెట్టబడిరి.

దేవుడు పాపమునకు తీర్పునిచ్చుటకు మానవాళి కొరకు ఆయన ఎంతో నిరీక్షించి ఆఖరకు దానిని మొదలుపెట్టెను. ఈ సమయము యూఫ్రటీసు నది యొద్దనున్న మూడవ వంతును చంపుటకు యుద్ధమును తెగులునకు ఇవ్వబడెను.

వచనం 16 : గుఱ్ఱపు రౌతుల సైన్యము లెక్క యిరవదికొట్లు వారి లెక్క యింత అని నేను వింటిని ఇక్కడ గుర్రపురౌతుల యొక్క లెక్క ఇంత అని చెప్పబడెను. ఈ యుద్ధము నవీన ఎలక్ట్రానిక్‌ యుద్ధమును సూచించును. ఈ యుద్ధంలో మూడవ వంతు మానవాళి చంపబడును జీవించియున్న వారు దేవునికి విరోధముగా విగ్రహమును సాతానును పూజించుట కొనసాగించును. తమ పాపముకు పశ్చాత్తాపపడుటకు నిరాకరించుదురు. ఇది అంత్యకాలములో ప్రతివారు అతను/ఆమె హృదయమును ఎంతగా కఠినపరచుకొందురో చూపుచున్నది.

వచనం 17 : మరియు నాకు కలిగిన దర్శనమందు ఈలాగు చూచితిని. ఆ నీలవర్ణము గంధవర్ణము మైమరపుండెను. ఆ గుఱ్ఱము తలలు సింహపు తలల వంటివి వాటి నోళ్ళలో నుండి అగ్ని ధూమగంధకము బయలు వెడలుచుండెను.

అపోస్తలుడు యోహాను చూచినది 21వ శతాబ్ధమునకు చెందిన నాశనకర ఆయుధము యుద్ధట్యాంక్‌లు, యుద్ధవిమానములు, మిగిలిన ఆధునిక సైన్యపరికరాల వంటివి.

వచనం 18-19 : ఈ మూడు దెబ్బలచేత అనగా వీటి నోళ్లలో నుండి బయలువెడలుచున్న అగ్ని ధూమగంధకముల చేత మనుష్యులలో మూడవ భాగము చంపబడెను ఆ గుఱ్ఱము బలము వాటి నోళ్లయందును వాటి తోకలయందును ఉన్నది. ఎందుకనగా వాటి తోకలు పాములవలె ఉండి తలలు కలిగినవైనందున వాటిచేత అవి హానిచేయును.

అంత్యకాలము యందు నవీన యుద్ధాయుధములతో పెద్ద యుద్ధము జరుగును మూడవ వంతు మనుష్యులు అగ్ని ధూమగంధకములతో కూడిన తెగులు ఆ ఆయుధము నుండి పుట్టును.

వచనం 20 : ఈ దెబ్బలచేత చావక మిగిలిన జనులు దయ్యములను చూడను వినను నడువను శక్తిలేనివై బంగారు వెండి కంచు రాయి కర్రతో చేయబడిన తమ హస్తకృతములైన విగ్రహములను పూజింపకుండ విడిచిపెట్టునట్లు మారుమనస్సు పొందలేదు.

ఈ తెగుళ్ళతో పాటు యుద్ధంలో బ్రతికినవారు విగ్రహమును పూజిస్తూ వాటికి నమస్కరిస్తారు వారు కూడా నాశనం చేయబడతారు.

వచనం 21 : మరియు తాము చేయుచున్న నరహత్యలను మాయమంత్రములను జారచోరత్వములను చేయకుండునట్లు వారు మారుమనస్సు పొందినవారు కారు. 

అంత్యకాలమందు దేవుని యెదుట మనుష్యులు తమ పాపముకు పశ్చాత్తాపపడరని సూచిస్తుంది కనుక దేవుడు ఈ పాపులకు తీర్పు తీర్చి నీతిమంతులకు కొత్తదైన ఆశీర్వాద ప్రపంచంలోనికి అనుమతించును.