Sermons

[అధ్యాయము 9-2] <ప్రకటన 9:1-21> అంత్యకాలమందు ధైర్యముగల విశ్వాసము కలిగియుండాలి<ప్రకటన 9:1-21>


ఏడుబూరల తెగుళ్ళలో పై పాసేజ్‌లో మనం కేవలం ఐదు, ఆరు బూరల యొక్క తెగుళ్ళను మాత్రమే చూశాం. ఐదవ బూర మ్రోగి మిడతల తెగులును కలుగజేయును. ఆరవ బూర యూఫ్రటీసు నది యొద్ద యుద్ధ తెగులును ప్రకటించును.

మొదటిగా మనం తెలుసుకొనవలసినదేమనగా ఆ ఏడు బూరల తెగుళ్ళన్నిటిని పరిశుద్ధులు చూస్తారా లేదా అనునది మనం మొదట విని తెలిసికొని విశ్వసించవలసినది ఇదే.

ఏడు బూరల తెగుళ్ళ మధ్యలో పరిశుద్ధులు తమను తాము చూసుకొనగలరా? పరిశుద్ధులు కూడా ఈ తెగుళ్ళ మధ్యకాలంలో తమను తాము కనుగొంటారు. ప్రపంచ అడవిలో మూడవ భాగం కాలిపోవును. మూడవ భాగం సముద్ర, నదులు రక్తవర్ణమగును. సూర్యచంద్ర నక్షత్రములు తమ మూడవ వంతు కాంతివిహీనమగును. ప్రకృతిలోని మూడవ వంతు రక్తవర్ణమై కాంతి హీనమైననూ మిగిలిన ముప్పావువంతు మిగిలి ఉండును.

వాక్యము చెప్పునదేమనగా రక్షింపబడి పరిశుద్ధులమైన మనము ప్రపంచములో మూడవ భాగమును నాశనము చేయబోవు ఆ మొదటి ఆరు తెగుళ్లలో ఉంటాము అయిననూ వీటికి మనము భయపడకూడదు. ఎందుకనగా దేవుడు ముద్రలేని మనుష్యులకే హానికలిగించాలి. తనచే ముద్రింపబడిన పరిశుద్ధులను ఏడు బూర తెగుళ్ల కాలములో రక్షించును.

అనగా పరిశుద్ధులు ఈ తెగుళ్ళన్నిటిని చూస్తారు నీవు నేను నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను విశ్వసించుట ద్వారా విడిపింపబడినవారమై మొదటి తెగులైన దేవునిచే కుమ్మరింపబడు అగ్నిచే ప్రపంచ మూడవ వంతు కాలిపోవు కాలము. రెండవ తెగులు మండుచున్న అగ్నిపర్వతం పడుట వలన సముద్రములోని మూడవ వంతు రక్తముగా మారును. మూడవ తెగులు ఆకాశము నుండి పడు గొప్ప తార వలన నదులు నీటిబుగ్గలు మూడవవంతు చేదుగా మారు కాలములో జీవించి ఉంటాం.

నాల్గవ తెగులైన సూర్యచంద్ర నక్షత్రముల మూడవ వంతు చీకటి కమ్మును ఐదవది తేలు కొండి వలే మనుష్యులను బాధించు మిడతలు యూఫ్రటీసు నది యొద్ద జరగబోవు యుద్ధము ఈ తెగుళ్ళన్నీ ముగియు వరకు మనము ఉంటాం వాటి కొరకు ఎవరూ ఏమీ చేయలేరు. ఎందుకనగా ఇది దేవునిచే నియమించబడి జరుగుటకు సిద్ధముగా ఉన్నది. ఈ భయంకరమైన ఆరు తెగుళ్లలోనూ మనము జీవిస్తామని దేవుని వాక్యం సెలవిస్తుంది.

మన ప్రభువు నీ పాపాలన్నిటి నుండి నిన్ను విమోచించెను. ఆయన తన బాప్తిస్మము సిలువలో రక్తము మరియు మృతి నుండి పునరుత్ధానుడగుట వలన వాటిని తొలగించెను. యేసుక్రీస్తు మనకు చేసిన దానిని విశ్వసించి మనమాయనతో సంబంధమును పొందాం. నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను నమ్మి తన పాపప్రాయశ్చిత్తము పొందినవారు ఈ ఆరు భయంకర తెగుళ్లలో జీవించిననూ దేవుని ప్రత్యేక రక్షణ వారితో నుండును. అలాగున కాక దేవుని ప్రత్యేక కనికరము మనలను ఈ తెగుళ్ళ నుండి ఆయన ఇచ్చు ఈ ప్రత్యేక రక్షణ అను భాగ్యమునకై మనము చెల్లించు కృతజ్ఞతార్పణలకు ఆయన ఎంత అర్హుడో గుర్తించవలెను.

అయిదవ దూత తన బూరనూదగా ఆకాశము నుండి భూమిమీద రాలిన ఒక నక్షత్రమును యోహాను చూచెను. అతనికి అగాధము యొక్క తాళపు చెవి ఇయ్యబడెను. ఈ నక్షత్రము దూతకు సాదృశ్యము. ఆత్మీయ భావమేమనగా ఈ నక్షత్రములన్నీ ఆయన పరిచారకులు, పరిశుద్ధులు అగాధము యొక్క తాళపు చెవిగల ఆ నక్షత్రము రాలి ఆ తాళపు చెవిలో దానిని తెరవగా పెద్ద కొలిమి నుండి లేచు పొగవంటి అగాధము నుండి లేచెను.

ఆ అగాధముగా ఒక స్థలము వాస్తవంగా దానికి అంతము/హద్దు లేదు. లోతైన గొయ్యి అనగా అంతంలేని గొయ్యి ఐదవదూత తన బూరనూదగా అగాధపు తాళపు చెవి గల అతడు దానిని తెరచెను. కొలిమి నూదగా అగాధపు తాళపు చెవిగల అతడు దానిని తెరచెను. పెద్ద కొలిమి నుండి లేచు పొగవంటి పొగలేచెను. అగాధము నుండి వచ్చిన పొగ ఆకాశమును కమ్మగా ప్రపంచమంతయూ చీకటి క్రమ్మెను.

అగాధము తెరువబడగా దాని నుండి కేవలము పొగమాత్రమే కాకమిడతలు కూడా లేచెను. ఈ మిడతలు భూమిపైకి వచ్చి భూమిలో ఉండు తేళ్ళకున్న బలము వంటిది వాటితోకలందు కలవై మనుష్యులను కుట్టు అధికారమియ్యబడెను. బైబిలు వర్ణన ప్రకారం వాటి ముఖములు మనుష్యముఖము వంటివి రూపము యుద్ధమునకు సిద్ధపడిన గుర్రము వంటివి వాటి పండ్లు సింహపు కోర వంటివి స్త్రీ తలవెండ్రుకల వంటి వెండ్రుకలు కలవు.

మిడత అను ఏకైక వచనం కాక మిడతలు అను బహువచనం ఉపయోగించి బైబిల్‌ ఈలాగు చెప్పుచున్నది. ఒకటి లేదా కొన్ని మిడతల గూర్చి కాక ఒక మేఘము వలే నున్న మిడతలు ఎట్లనగా ఆయా సమయాలలో ఉష్ణదేశాలలో మొక్కలాగ తెగుళ్ళు కేవలము వేర్లను మాత్రమే వదులుచూ ఒక ప్రాంతం నుండి మరొకదానికి వ్యాపించు తెగులు వలే ఉండును. అట్టి మిడతలు అగాధము నుండి లేచి అయిదు నెలలు వరకును మనుష్యులను బాధించును.

ఏడు బూర తెగుళ్ళలో అయిదవ తెగులుచే కొట్టబడువారు కేవలము రక్షణ పొందనివారే రక్షణ పొందిన వారిపై నుండి ఈ తెగులు తొలగిపోవును మన ప్రభువు మిడతల తెగులును మనపైకి రానియ్యడు. ఎందుకనగా మిడతలు వారిని కుట్టిన నేను ఎట్లు రక్షింపబడ్డాను అని రక్షణ సువార్తను వారు వదలివేయుదురని ఆయనకు తెలియును వచనం 4లో దీనిని మనం చూడగలం దేవుని ముద్రలేని మనుష్యులకే తప్ప భూమిపై గడ్డికైనను ఏ మొక్కకైనను మరి ఏ వృక్షమునకైననూ హాని కలిగించ కూడదని వాటికి ఆజ్ఞ ఇయ్యబడెను.

ఇశ్రాయేలు ప్రజలు 1,44,000మంది దేవుని ముద్రచే ముద్రింపబడతారని మనకు తెలుసు కానీ అన్యులను గూర్చి బైబిలు సూచించలేదు. దీని అర్థము పాపుల వలే మనము కూడా మిడతలుచే బాధింపబడతామా? అలాగు కాదు 1,44,000మంది ఇశ్రాయేలీయులు ముద్రించబడతారనగా వారు అనగా తమ పాపముకు పరిహారము పొందిన వారి హృదయము దేవుని పరిశుద్ధాత్మచే ముద్రింపబడతారు. నీ హృదయంలో పరిశుద్ధాత్మ లేదా? ఎందుకనగా తమ హృదయ మందు పరిశుద్ధాత్మ కలవారు దేవుని పిల్లలుగా ముద్రింపబడి 1,44,000మంది ఇశ్రాయేలీయులతో పాటు తన ప్రజలై మిడతల తెగులు నుండి తప్పించబడతారు.

రక్షింపబడని వారే మిడత తెగులు వలన బాధించబడతారు. కనుక మనలను మరి ఎక్కువగా ద్వేషించి హింసిస్తారు. ఈ తెగులు కాలమైన అయిదు నెలల్లో మిడతలు రక్షింపబడని వారిని మాత్రమే కుట్టి మరణమును కూడా పొందలేనంత అధికంగా బాధింపబడతారు మిడతల ముఖము మనుష్య ముఖము వంటివి. వాటి రూపము యుద్ధమునకు సిద్ధమైన గుర్రము వంటివి తేళ్ళతోకల వంటి తోకలు వాటికుండెను. అవి తిరుగుచూ తమ తలలతో ప్రతి వారిని భయపెట్టుచూ తమ పళ్ళతో ప్రతిచోట కరచుచూ విషపూరిత తోకతో వారిని కుట్టుచూ వాటి వలన బాధింపబడు వారికి వర్ణనాతీతమైన అధికమైన బాధ కలిగించును.

వర్ణించలేని బాధ కలిగించుటకు వాటి ఒక్క కాటు చాలును అది అధిక వోల్టేజిగల విద్యుత్‌ షాక్‌ వలేనుండవచ్చును. ఆ బాధ అయిదు నెలల వరకుండును. మిడతల వలన ఎంత బాధింపబడినను లేక బాధింపబడుచూ బ్రతుకుట కంటే చావును వారు ఎంతగా కోరిననూ ప్రజలకు మరణము దొరకదు. ఎందుకనగా చావు దొరకని తెగులు కూడా మిడతలు తెగుళ్లలోనున్నది. అయిదు నెలల వరకు భూమిపై మరణము ఉండదు.

మనము అట్టి తెగులును చూచియుండక పోయిననూ సందేహము లేకుండా అది దేవునిచే వ్యూహపరచబడెను. ఈ తెగుళ్ళను భూమి మీదకు ప్రపంచ ప్రజలపైకి పంపెదనని దేవుడు సెలవిచ్చాడు. అనగా దేవుని విశ్వసించని వారిపైకి ఆయన ప్రేమ రక్షణ యందు గానీ ఆయన విమోచన సువార్తను గాని విశ్వసించని వారికే ఈ తెగుళ్ళన్నీ దేవునిచే వ్యూహించబడెను. దేవుడే వీటన్నిటిని ఏర్పరచెను. కనుక వాటన్నిటిని జరిగించునని మనమంతా నమ్మాలి.

మనం చేయవలసినదంతా ఆయనను విశ్వసించుటే ఎందుకనగా దేవుని ఆయన క్రియలను వాదించగల మనిషి ఎవరూ లేరు. మిడతల వలన ప్రజలు బాధింపబడుచున్న పరిస్థితులు కూడా అవి మనలను కరవకుండా కుట్టకుండునట్లు చేసి ఈ తెగులు నుండి దేవుడు మనలను కాపాడును ఎందుకనగా ఆయన నొసళ్ళ యందు దేవుని ముద్రకల వారిని బాధించవద్దని వాటికాజ్ఞాపించెను.దేవుడు ఏడు బూరల తెగుళ్ళను ఎందుకు పుట్టించును.


ఏడు బూరల తెగుళ్ళను పుట్టించుటలో దేవుని ఉద్దేశ్యమేమనగా తిరిగి జన్మించిన వారి కొరకు వారి నుండి మహిమ పొందుటకు ఇంకనూ తిరిగి జన్మించవలసిన వారి కొరకు తిరిగి జన్మించుటకు మరొక అవకాశం వారికిచ్చుటకు మరియు ఈ ప్రపంచంలో దేవుడు నిర్మించిన ప్రతి ఒక్కరి కొరకు వారికి ప్రభువే దేవుడని ఈ లోక సృష్టికర్తయని రక్షకుడని న్యాయాధిపతి అని చూపుటకే.

మొదటి తెగుళ్ళ ద్వారా పాపులను బాధించి వాటి నుండి నీతిమంతులను తప్పించి నీతిమంతులు ప్రభుని ఔన్నత్యాన్ని ఆయన కృపను దీవెనలను మరియు మహిమను కొనియాడునట్లు దేవుడు చేయును.

రెండవదిగా తన ఆఖరి పంటగా దేవుడు తెగుళ్ళను అనుమతించును ఆయన ఆఖరిసారిగా నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను ఎరిగి దానిని విశ్వసించని వారిని రక్షించుటకు తన ఏడవబూర తెగుళ్ళను కలిగించును. అనగా తను నిర్మించిన ఇశ్రాయేలీయులును అన్యులను ఈ ఇద్దరికీ ప్రభువు నొద్దకు వచ్చుటకు రక్షింపబడుటకు శ్రమల ద్వారా తన ఆఖరి అవకాశం ఇచ్చును.

మూడవదిగా ప్రభువు లేకుండా ఈ లోకములో ఏదియూ కలుగనట్లే యేసుప్రభువు మానవ శరీరము ధరించి ఈ లోకమునకు వచ్చినవాడై తన బాప్తిస్మముతో లోక పాపమును తనపై మోసికొని సిలువపై మరణించి పాపములన్నిటిని తుడిచివేసి ఈ భయంకరమైన తెగుళ్ళ ద్వారా ఆయన ప్రేమను తన తండ్రిప్రేమను అంగీకరించక రక్షణ సువార్తను విశ్వసింపని వారికి తన అత్యున్నతాధికారమును చూపును. తిరిగి జన్మించని వారిని ఈ లోకములో శ్రమపరచబడుట ఈ జీవితం తర్వాత నిత్యనరకములోనికి త్రోయుట అను రెండు బాధతో బాధించును.

అట్టి ఉద్దేశ్యము మరియు ప్రణాళికతో దేవుడు తెగుళ్ళను ఈ లోకములో కలిగించును. నిజముగా ఈ తెగుళ్ళు కలుగునని మనం తెలిసికొని విశ్వసించాలి. ప్రత్యేకంగా మనము మిడతల తెగుళ్ల నుండి మినహాయింపబడిననూ ఈ తెగుళ్ళన్నిటిలోనూ నివసించాలని మనం గుర్తించాలి. సృష్టిలో మూడవవంతును ప్రపంచ అడవులను తగులబెట్టు తెగులు సముద్ర మూడవ వంతు నీటిని రక్తముగా మార్చి నదుల నీటి బుగ్గల మూడవవంతు నీటిని చేదుగా మార్చు తెగులు సూర్య చంద్ర నక్షత్రములకు చీకటి కమ్ముతెగులు ప్రపంచంను నాశనం చేయు తెగులు మనమిప్పుడు ఈ తెగుళ్ళ మధ్యలోనున్నాము. కానీ ఈ తెగుళ్ళలో నివసించిననూ ఇంకనూ అధిక ఆనందంతో నింపబడతామని కూడా మనం గుర్తించాలి.

ఏడవ బూర తెగుళ్ళతో లోక జీవితం మీద ఆసక్తిని కోల్పోతాం కొద్దిసేపు ఇలా ఊహిద్ధాం ప్రతిచోట అగ్నిపర్వతాలు బ్రద్ధలగుట భూమిని భూకంపాలు సముల నాశనం చేయుట పొగతో పర్వతాలు కాలిపోవుట మూడవ వంతు సముద్రాలు నదులు నీటిబుగ్గలు రక్తంగా చేదుగా మారుట ప్రపంచాన్ని దుమ్ము, పొగ బూడిద కప్పుట, సూర్యుడు ఉదయం 10 గంటలకు ఉదయించి మధ్యాహ్నం 4 గంటలకు అస్తమించుట చంద్రనక్షత్రములను మనము ఎన్నడూ చూడలేని విధంగా కాంతిహీనమగుట అట్టి ప్రపంచంలో ఇహలోక జీవితమును ఊహించుకొనగలవా? కాకపోవచ్చు!

ఇందువలనే ఈ సమయంలో పరిశుద్ధులు దేవునివైపే చూస్తూ ఆయన రాజ్యమునే నిరీక్షిస్తున్నారు. మన ఆశ అంతా దానిలో 100 శాతం దేవునిలోనే ఉండును. ఈ భూమిపై నివసించుటలో ఆశక్తిగలవారమై ఉండలేము లేదా ఒక వేళ వెయ్యేళ్ళు బ్రతుకుటకు కావలసిన సంపద ఈ లోకంలో ఇచ్చినా మనం నివసించలేము. ఎందుకనగా ఈ తెగుళ్ళన్నీ దేవుని వలన అనుమతింపబడి సిద్ధపరచబడెను. ఎవరూ వాటిని ఆపలేరు ఆయన ప్రణాళిక చొప్పున దేవుడు వాటిని అనుమతించును. దేవుని ప్రణాళికయైన తెగుళ్ళలో బైబిలులో ఎందుకు వ్రాయబడెను. దేవుడు యోహానును పరమునకు ఎత్తుకొనిపోయి ఏడు బూరలు ఊదబడగా విని కలుగబోవు తెగుళ్ళను చూచి వాటిని వ్రాయునట్లు ఎందుకు చేసెను. ఈ లోకమునకు సంభవింపబోవు దానిని చూపించుట పరిశుద్ధులు తమ నిరీక్షణ దేవుని రాజ్యమందే ఉంచునట్లుగా ఈ భూమిపై వారు సువార్తను బోధించునట్లు చేయుటకు మరియు ప్రతివారూ యేసుక్రీస్తును విశ్వసించునట్లు చేయుటకే.

దేవుడు ఈ తెగుళ్ళను సిద్ధపరచి అనుమతించినది, ఈ తెగుళ్ళ ద్వారా ప్రజలు తిరిగి ఆలోచించి నరకములో మండుచున్న అగ్ని గంధకములో బాధింపబడకుండా చేయుటకే మరొకరకంగా దేవుడు ఈ తెగుళ్ళు నుండి తప్పించుకొనగల ఆ శ్రమలను వారికి కల్పించెను. ఎందుకనగా మనలో ఎవరూ నరకంలో పడాలని ఆయన కోరలేదు. ఈ తెగుళ్ళ ద్వారా పాపుల హృదయాలు ఆయనవైపు తిరగాలని ఆశించెను. మనకొరకు వాక్యము వ్రాయబడి మనకు చూపబడినది ప్రతివారు పరలోకానికి నడిపించబడుటకేనని నేను నమ్ముచున్నాను.

మరో విధంగా దేవుడు కలిగించు తెగుళ్ళు కేవలము మనలను బాధించుటకు కాదు. దేవుడు ఈ తెగుళ్ళును లోకంలో కలుగజేయుట ఎందుకనగా మనము ఈ లోక జీవితంపై మన నిరీక్షణనుంచక ఆయన రాజ్యమును నీరిక్షించునట్లు చేయుటకు ఆయన తెగుళ్ళను అనుమతించుట ద్వారా మనము గుర్తించవలసినది. నిత్య నరకాగ్ని కీలల్లో లొంగిన ఆత్మలు గలవారైన అనేకులకు ఆయన ప్రేమ యొక్క రక్షణను. బోధించివారు రక్షణ వాక్యమును నమ్మి రక్షింపబడి శ్రమ నుండి తప్పించబడునట్లు చేయాలి.

కొన్ని క్యాట్‌ఫిష్‌లు తమ ముళ్ళతో కలుగచేయు నొప్పి వలన మిగిలిన వాటికన్నా పేరుగాంచినవి. ఈ చేపతో నీవు జాగ్రత్తగా నుండకపోతే వాటి విషముళ్ళకు నీ చేయి భరించలేని బాధ మొదలగును. అది కరెంట్‌ షాక్‌ వలే ఉండును. ఈ బాధ మిడతల వలన కలుగు బాధతో పోల్చతగినది.

అట్టి నొప్పిని అయిదు నెలలు కలిగియుండుట ఊహించు అది ఎంత చెడ్డ బాధను కలిగించునో ప్రజలు బాధలలో బ్రతుకుట కంటే మరణమగుదురు. కానీ మరణించలేరు వారు తమను తాము చంపుకొనలేరు. వారు చావవలెనని ఆశపడుదురు. కానీ మరణం ‘‘వారి యొద్ద నుండి పారిపోవును అని వాక్యం చెప్తుంది” కానీ మనం నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను విశ్వసించి దేవుని పిల్లలమైనందుకు మనలో పరిశుద్ధాత్మ ఉన్నందుకు దేవుడు మనలను తెగుళ్ళ నుండి కాపాడి మిడతల వలన కలుగు బాధ మనకు కలుగనీయడు. ఆ తెగుళ్ళలో కూడా మనం కాపాడబడతాం. ఎందుకంటే నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను నమ్మి మన పాపాలకు ప్రాయశ్చిత్తం పొందాము.

కేవలము భయములోనే మనము ప్రకటన గ్రంథాన్ని గుర్తించకూడదు. కానీ ప్రకటన వాక్యం ద్వారా దేవుడు తెగుళ్ళ నుండి తన ప్రత్యేక రక్షణను మనకు ఎట్లు కలిగించునో మన ద్వారా ఆయన ఎట్లు మహిమపరచబడునో మనము కూడా దేవునిచే మహిమ వస్త్రము ఎలాగు ధరించుకొందుమో దానిని మనం గుర్తించాలి. 

శ్రమకాలం వచ్చినప్పుడు మనం వీటిని తెలిసికొని మనము ధైర్యం వహించి సువార్త అధికంగా బోధించాలి మరి అధిక మహిమను దేవునికివ్వాలి. అలాగే మన హృదయమందు ఏ భయములేకుండా ఈ జీవము కొరకు బాధలేకుండా ఈ యుగములో జీవించాలి. ముందుగా వీటిని దేవుడు మనకు బోధించుచున్నాడు కనుక మనం ధైర్యం పొందాలి. కనుక మనం ధైర్యమైన విశ్వాసం కలిగియుండాలి.

ఏడు తెగుళ్ళను దేవుడు రెండు విభాగాలుగా చేసెను. మొదటి నాలుగు బాధలు ఆఖరిమూడు శ్రమలు అయిన తరువాత సంభవించునవి వాటి నిడివి మరియు తీవ్రత యందు మరి ఎక్కువ భయంకరమైనవి దేవుడు వివరించెను. కనుక ఆయన అయిదవ తెగులు ముగియగానే దీనిని ప్రత్యేకంగా ప్రకటించెను.

మొదటి శ్రమ గతించెను. ఇదిగో మరి రెండు శ్రమలు అటు తరువాత వచ్చును రెండవ శ్రమ ఆరవబూర తెగులు ఆరవబూర దూతతో యూఫ్రటీసు మహానది యొద్ద బంధింపబడియున్న నలుగురు దూతలను వదలిపెట్టును కనుక ఆ నాలుగు అదే నెలలో అదే దినమున అదే గంటకు సిద్ధపరచబడియుండిన ఆ నలుగురు దూతలు వదిలిపెట్టబడిరి. వచనం 16లో గుర్రపు రౌతు సైన్యము లెక్క ఇరువది కోట్లు గొప్పయుద్ధము జరుగునని సూచన ఈ యుద్ధము వలన మూడవ వంతు మానవాళి చంపబడును. మరొక రకంగా దేవుడు భయకంపితులను చేయు మరియొక తెగులును దేవుడు రప్పించును.

వచనం 17-18 చెప్పెను. ‘‘మరియు నాకు కలిగిన దర్శనమందు ఈలాగు చూచితిని. ఆ నీలవర్ణము గంధవర్ణము మైమరపుండెను. ఆ గుఱ్ఱము తలలు సింహపు తలలవంటివి వాటి నోళ్ళలో నుండి అగ్ని ధూమగంధకము బయలువెడలుచుండెను. నిజానికి లెక్కలేనంతమంది ప్రజలు ఆ గుర్రపురౌతు వలన చనిపోవునట్లు దేవుడు ఆనుమతించును. ఈ తెగులు ఆరవదూత బూర ఊదినప్పుడు కలుగును. ఏడవ దూత బూరనూదినప్పుడు ఏమి సంభవించును? పునరుత్థానము ఎత్తబడుట జరగును.’’ ఆరవ బూర వరకు జరుగు తెగుళ్ళన్నీ ప్రకృతి నాశనముగా గానీ ప్రజలను ప్రత్యక్షంగా చంపు యుద్ధము వలనగానీ తేబడును. ఎందుకనగా ఇవన్నియూ ఈ ఏడు బూరల తెగుళ్ళలో కలుపబడి బైబిల్‌లో వ్రాయబడిన నేను ఈ వాక్యాన్ని నమ్మాను.

నీ సంగతి ఏమిటి? నీవు కూడా ఈ సత్యమును నమ్ముతావా? నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను విశ్వసించుటలో నీవు నీ పాప ప్రాయశ్చిత్తాన్ని పొందావా? ఈ తెగుళ్ళలో ఉన్నను నిత్య తెగుళ్ళ నుండి నీవు తప్పించుకొనుట కొరకు నరకంలో ప్రవేశించకుండుటకు నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను నీవు ఇప్పుడే నమ్మాలి నీ పాపాలను పోగొట్టుటకు గొప్ప శ్రమల నుండి నిన్ను విడిపించుటకు నీకు తన రాజ్యమిచ్చుటకు నూతన భూమి ఆకాశము నిచ్చుటకు దేవుడు నీకు అనుగ్రహించాడు. ఈ సువార్తను నమ్ము విశ్వాసం నీవు కలిగి ఉండాలి నీరు మరియు ఆత్మమూలమైన సువార్తద్వారానే కానీ పరలోకానికి మరి ఏ దారి నీకు లేదు.

యేసు పేతురుతో చెప్పెను నేను నీకు పరలోక రాజ్యపు తాళపు చెవులనిత్తును యేసుక్రీస్తును మన రక్షకునిగా మనం విశ్వసించినప్పుడు మనకు పరలోకపు తాళపు చెవులు ఇవ్వబడతాయి. ఆయన భూలోకమునకు వచ్చెను. యొర్ధాను నది యొద్ద యోహానుచే తాను బాప్తిస్మము పొందుట ద్వారా మానవాళి మరియు లోకపాపమును తనపై తానే మోపుకొనెను. ఆయన ఈ పాపములన్ని మోసికొని సిలువపై మరణించెను. ఆయన మృతి నుండి తిరిగి లేచెను. మనకు ఈ విశ్వాసం ఉంటేనే తుడిచివేయబడెనను విశ్వాసం ఇదే.

ఏడవ బూర మ్రోగునప్పుడు ప్రకటన 13లో వర్ణించబడిన హతసాక్షముతో పాటు ఎత్తబడుట సంభవించును. అంత్యక్రీస్తు ప్రత్యక్షపరచబడగా మనము సువార్త కొరకైన నీతిమరణం హతసాక్ష్యం ఎదుర్కొంటాం నీవు తెలిసికొన్న విశ్వసించిన సువార్త ఎంత ప్రాముఖ్యమో ఎంత ప్రశస్తమో నీవు గుర్తించాలి. నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను నమ్ముము. అప్పుడు నీవు అంత్యకాలమును ధైర్యముతో దాటి ప్రభువు వాగ్ధానమైన వెయ్యేండ్ల రాజ్యము మరియు నూతన భూమి ఆకాశమును నివసించెదవు దేవుడైన యేసుక్రీస్తు చుట్టూ నిలచిన 24మంది పరిశుద్ధుల వలే ప్రభువును సేవించుటకు నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను విశ్వసించుట ద్వారా శ్రమలను ధైర్యముగా జయించుట తప్ప మరొకదారిలేదు.

నీవు కూడా తిరిగి జన్మించిన పరిశుద్ధుల వలే నీవు కూడా నీ హృదయంలో ఈ సువార్తను నమ్మిన వారందరూ అంత్యకాలమును జయించి ఆయన వెయ్యేండ్ల రాజ్యమును మరియు ఆయన నిత్య పరలోకమును స్వతంత్రించుకొందువని నేను నమ్మి ప్రార్థించుచున్నాను.