Sermons

[అధ్యాయము 10-1] <ప్రకటన 10:1-11> ఆ ఎత్తబడు కాలము నీకు తెలియునా?<ప్రకటన 10:1-11>

“బలిష్ఠుడైన వేరొక దూత పరలోకము నుండి దిగివచ్చుట చూచితిని. ఆయన మేఘము ధరించుకొనియుండెను. ఆయన శిరస్సు మీద మేఘధనస్సుండెను. ఆయన ముఖము సూర్యబింబమువలెను ఆయన పాదములు అగ్నిస్తంభములవలెను ఉండెను. ఆయన చేతిలో విప్పబడియున్న యొక చిన్న పుస్తకముండెను. అతను తన కుడి పాదము సముద్రము మీదను ఎడమపాదము భూమి మీదను మోపి సింహము గర్జించునట్లు గొప్ప శబ్ధముతో ఆర్భటించెను. ఆయన ఆర్భటించినప్పుడు ఏడు ఉరుములు వాటి వాటి శబ్ధములు పలికెను. ఆ యేడు ఉరములు పలికినప్పుడు నేను వ్రాయబోవుచుండగా ఏడు ఉరములు పలికిన సంగతులకు ముద్రవేయుము. వాటిని వ్రాయవద్దని పరలోకమునుండి ఒక స్వరము పలుకుట వింటిని. మరియు సముద్రము మీదను భూమి మీదను నిలిచియుండగా నేను చూచిన ఆ దూత తన కుడిచెయ్యి ఆకాశముతట్టు ఎత్తి పరలోకమును అందులో ఉన్నవాటిని భూమిని అందులోఉన్నవాటిని, సముద్రమును అందులోఉన్నవాటిని సృష్టించి యుగయుగములు జీవించుచున్న వానితోడు ఒట్టుపెట్టుకొని ఇక ఆలస్యముండదు. గాని యేడవ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోవుచుండగా దేవుడు తన దాసులగు ప్రవక్తలకు తెలిసిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పెను. అంతట పరలోకము నుండి నేను వినిన స్వరము మరల నాతో మాటలాడుచు నీవు వెళ్ళి సముద్రము మీదను భూమిమీదను నిలిచియున్న ఆ దూత చేతిలో విప్పబడియున్న ఆ చిన్న పుస్తకము తీసికొనుమని చెప్పుట వింటిని. నేను ఆ దూత యొద్దకు వెళ్ళి ఈ చిన్న పుస్తకము నాకిమ్మని అడుగగా ఆయన దాని తీసికొని తినివేయుము అది నీ కడుపుకు చేదగును గాని నీ నోటికి తేనెవలే మధురముగా ఉండునని నాతో చెప్పెను. అంతట నేను ఆ చిన్న పుస్తకమును దూత చేతిలో నుండి తీసికొని దానిని తినివేసితిని. అది నా నోటికి తేనెవలే మధురముగా ఉండెను గాని నేను దానిని తినివేసిన తరువాత నా కడుపునకు చేదాయెను. అప్పుడు వారు నీవు ప్రజలను గూర్చియు జనులను గూర్చియు ఆ యా భాషలు మాటలాడువారిని గూర్చియు అనేకమంది రాజులను గూర్చియు మరల ప్రవచింప నగత్యమని నాతో చెప్పిరి.’’వివరణ : 


ఈ అధ్యాయ ప్రత్యేకత 7వ వచనంలో ఉంది ఏడవ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోవుచుండగా దేవుడు తన దాసులగు ప్రవక్తలకు తెలిసిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పెను. ఎత్తబడుట ఆ సమయములో సంభవించును.

వచనం 1 : బలిష్ఠుడైన వేరొక దూత పరలోకము నుండి దిగివచ్చుట చూచితిని. ఆయన మేఘము ధరించుకొనియుండెను. ఆయన శిరస్సు మీద మేఘధనస్సుండెను. ఆయన ముఖము సూర్యబింబమువలెను ఆయన పాదము అగ్నిస్తంభమువలెను ఉండెను.

అధ్యాయం 10లో కనబడు బలిష్ఠుడైన ఆ దూత జరగబోవు ఆయన పనులకు సాక్ష్యము గలిగిన దేవుని అధికారిగానున్నాడు. ఆ దూత ఆకారము కేవలము దేవుని సర్వాధికారమును శక్తిని ఎంత గొప్పవో చూపుటకే మరియు దేవుడు ఈ లోక సముద్రాలను నాశనంచేసి పరిశుద్దులను పునరుత్థానులను చేసి పరలోకమునకు కొనిపోవును.

వచనం 2-3 : ఆయన చేతిలో విప్పబడియున్న యొక చిన్నపుస్తకముండెను. అతను తన కుడిపాదము సముద్రము మీదను ఎడమ పాదము భూమి మీదను మోపి సింహము గర్జించునట్లు గొప్ప శబ్ధముతో అర్భటించెను. ఆయన ఆర్భటించినప్పుడు ఏడు ఉరుములు వాటి వాటి శబ్ధములు పలికెను.

దేవుడు సమస్తమును తన ప్రణాళిక చొప్పున జరిగించును ఆఖరి దినము వచ్చినప్పుడు ఆయన సముద్ర భూములను నాశనపరచును. అలాగున మన ప్రభువు మొదటి సముద్రమును మొదటి భూమిని నాశనం చేయును.

ఈ పేరాలో దేవుని అడ్డుకొనజాలనంతగా జరుగబోవు ఆయన సమస్త కార్యము ప్రణాళిక పూర్తిజేయబోవు ఆయన క్రియలు కనబడుచున్నవి బైబిలులో ఏడు అను సంఖ్య సంపూర్ణమగుటను సూచించును. దేవుడు తన పనిని ముగించి విశ్రమించుటకు ఈ సంఖ్యను ఉపయోగించెను. అలాగే అంత్యకాలములో దేవుడు అనేకులను నాశనము నుండి విడిపించి నిశ్చయముగా లోకమును నాశనపరచు ఆయన చిత్తమును ఈ పేరా మనకు బోధించుచున్నది.

వచనం 4 : ఆ యేడు ఉరుములు పలికినప్పుడు నేను వ్రాయబోవుచుండగా ఏడు ఉరుములు పలికిన స్వరము ‘‘సంగతులకు ముద్రవేయుము, వాటిని వ్రాయవద్దని పరలోకము నుండి యొక స్వరము పలుకుట వింటిని.’’

ఆ యేడు ఉరుములు పలికిన దానిని లిఖించవద్దని రక్షింపబడని వారి నుండి పరిశుద్ధులను రక్షించుటకై దేవుడు యోహానుకు ఆజ్ఞాపించెను. ఆ సమయంలో ఆ విశ్వాసులకు తన కార్యమును మరుగుచేయును. ఎందుకనగా వారు దేవుని శత్రువుల వలే ఆయన పరిశుద్ధులను హింసించి, అసహ్యించెదరు.

నోవహు కాలములో కూడా దేవుడు లోకమును జలప్రళయంలో నాశనపరచినప్పుడు ఆయన రాబోవు ప్రళయమును నోవాహునకు మాత్రమే తెలియపరచాడు. ఇప్పటివలే దేవుడు లోకమంతటా నీరు మరియు ఆత్మమూలమైన సువార్త బోధించెను. దానిని విశ్వసించువారికే పరలోక రాజ్యమిచ్చును. కానీ దీనికి వేరై నిజ విశ్వాసాన్ని కలిగియున్నవారు రానున్న ఎత్తబడు కాలంలో ఎవనికి కనబడకయుందురు. నీతిమంతుకు దేవుడు నూతన లోకాన్ని తన రాజ్యంలో ఏర్పాటు చేసి వారితో కూడా దానిలో నివసించాని ఆశించుచున్నాడు.

వచనం 5-6 : మరియు సముద్రము మీదను భూమి మీదను నిలిచియుండగా నేను చూచిన ఆ దూత తన కుడిచెయ్యి ఆకాశము తట్టు ఎత్తి పరలోకమును అందులో ఉన్నవాటిని సృష్టించి యుగయుగములు జీవించుచున్న వాటితోడు ఒట్టుపెట్టుకొని ఇక ఆలస్యముండదు.

ఈ విషయాన్ని దేవుని పేరిట చూపబడును. ఆఖరి శ్రమలో ప్రతిదీ కూడా ఎవరి నామము వలన కాక ఒక గొప్పవాని వలన మాత్రమే జరుగును. అటువలే దేవుడు ఇప్పటికే పరిశుద్ధులైన వారికి అంత్యకాలము యొక్క పరిశుద్ధులకు కూడా ఆఖరి ఆశ్రయమైయున్నాడు.

ఇక్కడ బలిష్ఠుడైన దూత ఎత్తబడుట నిశ్చయముగా సంభవించునని సర్వాధికారి పేరున ఒట్టుపెట్టుకొనుచున్నాడు. ఈ శ్రమలో దేవుడు నూతన ఆకాశమును భూమిని సృష్టించి తన పరిశుద్ధులతో కూడా ఆ నూతన లోకంలో నివసించునని మనతో చెప్పుచున్నది దేవుడు. నూతనలోకంను సృష్టించుటలో ఆలస్యం చేయక తన పరిశుద్ధులకొరకై దానిని త్వరగా ముగించునని మనకు తెలుపుచున్నది.

వచనం 7 : గాని యేడవ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోవుచుండగా దేవుడు తన దాసులగు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పెను.

ఈ వచనం శ్రమ చివరలో ఏడవ బూర మ్రోగునప్పుడు పరిశుద్ధులంతా ఎత్తబడతారని మనతో చెప్పుచున్నది. పరిశుద్ధులు ఎత్తబడుట సంభవించినప్పుడు లోకంలోని ప్రజలు బహుగా ఆశ్చర్యపోతారు.

ప్రకటన 10:7లో ఏడవ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోవుచుండగా దేవుడు తన దాసులగు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పెను. ఇక్కడ తన దాసులగు ప్రవక్తలకు తెలిసిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగును. అను వాక్యంలో మనకు ఏమి తెలియుచున్నది. అనగా నీరు మరియు ఆత్మమూలమైన సువార్త నిజమైనదై దానిని విశ్వసించువారికి ప్రాయశ్చిత్తమును ఆమె/లేదా అతని హృదయంలో పరిశుద్ధాత్మ నుంచెనో ఆలాగే నిశ్చయంగా పరిశుద్ధులు ఏడవ బూర ఊదబడగానే ఎత్తబడుదురు.

ఏడవ బూరలో ఆరవ బూర యొక్క తెగులు ముగిసిన తరువాత అంత్యక్రీస్తు లోకంలో బయల్పడి దానిపై తన ఆధిపత్యమును స్థాపించుట వలన పరిశుద్ధులు హతసాక్షులగుదురు ప్రతివారిని మృగపు ముద్ర పొందమని డిమాండ్‌ చేయును. కొద్ది కాలములోనే ఏడవ దూత తన బూర ఊదగానే తమవిశ్వాసమును కాపాడుకొని హతసాక్షులైనవారు జీవించి ఉన్న పరిశుద్ధులు పునరుత్ధానులై వెంటనే ఎత్తబడుదురు. అప్పుడు ఏడవ పాత్రయొక్క తెగుళ్ళు మానవాళిపై ఆఖరి తెగులు ఆరంభమగును. ఆ సమయంలో పరిశుద్ధులు ఇక భూమిపై నుండరు గాని ఎత్తబడిన వారై పరలోకంలో ప్రభువుతో ఉంటారు తాము ఎత్తబడుట ఏడవ దూత ఆఖరి బూర ఊదినప్పుడు సంభవించునని పరిశుద్ధులు తప్పక తెలుసుకోవాలి.

అపోస్తులుడైన పౌలు కూడా 1 థెస్సలోనికయులకు 4లో ప్రధాన దూత బూరతో పరలోకం నుండి ప్రభువు దిగివచ్చునని మనకు చెప్పెను. చాలామంది క్రైస్తవులు ఎత్తబడుట సంభవించినప్పుడు ప్రభువు భూమిమీదకు వచ్చునని అనుకొంటారు కానీ ఇది ఆ సందర్భం కాదు. ఎత్తబడుట సంభవించినప్పుడు మన ప్రభువు భూమి మీదకి దిగిరారు కానీ వాయుమండలంకు వచ్చును. ఆయన ఎత్తబడుట ముగించిన తరువాత లేదా వాయుమండలంలోనికి పరిశుద్ధులను కొనిపోయి వారిని ఎదుర్కొనును.

అలాగే నిజమైన పరిశుద్ధులు కొనిపోబడునప్పుడు ప్రభువు భూమి మీదికి దిగివచ్చునని తప్పుగా తలంచువారైన క్రైస్తవులు తమ తప్పుడు, భావమును వదులుకోవాలి. పరిశుద్ధులు ఎత్తబడుట ఏడవ దూత తన బూర మ్రోగించగా సంభవించునని గుర్తు తెచ్చుకొనుటతో దానిని సరిగా తెలిసికొని విశ్వసించాలి. తన దాసులగు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగును. దేవుని మర్మము అనగా పరిశుద్ధులు ఎత్తబడుట ఏడవ బూర యొక్క తెగులుతోపాటు సంభవించునని నీవు తప్పక గుర్తించాలి. ఇప్పుడైతే అతి త్వరలో దేవుడు మొదటి లోకమును నాశనపరచి రెండవ లోకమును కనుగొనును. భూమిపై నివసించినప్పుడు నీరు మరియు ఆత్మమూలమైన సువార్త నమ్ముట వలన తిరిగి జన్మించి సర్వోన్నతుని ఆజ్ఞలన్నిటిని నమ్మకముగా నెరవేర్చిన వారైన తన ప్రజలతో కూడా దేవుడు నూతన లోకంలో నివాసముండును. ఇదే సమస్త విశ్వమును సృజించి ఆయన తన పరిశుద్ధుల కొరకు తానే నియమించిన దేవుని ఉద్దేశ్యము.

దూత ఏడవ బూర ఊదునప్పుడు ఏడు బూరల తెగుళ్ళు ముగియును పైనున్న ఏడుపాత్రల తెగుళ్ళు దారిలోనికి వచ్చును. ఏడవదూత పలుకు దినములలో అతడు బూర నూదబోవుచుండగా తన దాసులగు ప్రవక్తకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగును. ఇక్కడ దేవుని మర్మముగా ఏడవ దూత బూర మ్రోగగానే పరిశుద్ధులు కొనిపోబడెదరు.

ఇప్పుడు పరిశుద్ధులు భూమిపై నివశిస్తున్నారు. కానీ వారు మరి శ్రేష్ఠమైన నూతన రాజ్యంలో నివసించుటకు తప్పక హతసాక్షులవ్వాలి. పునరుత్ధానులై ఎత్తబడాలి. అప్పుడే ప్రభువుతో పాటు గొర్రె పిల్ల వివాహవిందుకు ఆహ్వానించబడి ఆయనతో పాటు వెయ్యేళ్ల పాలన చేస్తారు. ఈ వెయ్యేండ్ల తరువాత అంత్యక్రీస్తు సాతాను అతని అనుచరులు దేవుని నిత్య తీర్పును పొందుతారు. ఆ తరువాత పరిశుద్ధులు ప్రభువుతో పాటు నివసించు దీవెనలు పొంది నిత్య దీవెనయైన పరలోకంలో ఉంటారు. ఇదే దేవుని మర్మము నిజవిశ్వాసము గలవారమైన మనకు దేవుడు తన మర్మమును తెలియపరచినందుకు ఆయనకు కృతజ్ఞులము. దేవుడు ఏడవ దూత తన బూరను మ్రోగించినప్పుడు తన వాగ్ధానములన్నీ నెరవేర్చుతానని మనతో చెప్పుచున్నాడు.

వచనం 8 : అంతట పరలోకము నుండి నేను వినిన స్వరము మరల నాతో మాట్లాడుచు నీవు వెళ్ళి సముద్రము మీదను భూమిమీదను నిలిచియున్న ఆ దూత చేతిలో విప్పబడియున్న ఆ చిన్నపుస్తకము తీసికొనుమని చెప్పుట వింటిని.

దేవుని దాసులు మరియు పరిశుద్ధులు అంత్యదినము వచ్చుపర్యంతము నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను బోధించుటకు తప్పక కొనసాగించాలని దేవుడు మనతో చెప్పుచున్నాడు. ఈ సువార్త పాపనివృత్తి హతసాక్ష్యము పునరుత్ధానము ఎత్తబడుట మరియు గొర్రె పిల్ల వివాహ విందు అను సత్యమును గూర్చినది. దేవుని దాసులు పరిశుద్ధులు అంతము వరకు సువార్త బోధించుటకు వారు మొదట విశ్వాసముతో మహాశ్రమలు రాకమునుపే దేవుని వాక్యమును భుజించాలి. దేవుడు మన నుండి రెండు రకముల విశ్వాసమును డిమాండ్‌ చేయుచున్నాడు. మొదటిగా తిరిగి జన్మించుట అను విశ్వాసము రెండవదిగా మన నిజ విశ్వాసమును కాపాడుకొనుటకు హతసాక్ష్యమును కౌగలించగల విశ్వాసము.

వచనం 9 : నేను ఆ దూత యొద్దకు వెళ్ళి ఈ చిన్న పుస్తకము నాకిమ్మని అడగగా ఆయన దాని తీసికొని తినివేయుము అది నీ కడుపుకు చేదగును. గాని నీ నోటికి తేనెవలె మధురముగా ఉండునని నాతో చెప్పెను.

దేవుని పరిశుద్ధులు దాసులు మొదట ఆ వాక్యమును భుజించి తరువాత ఇతరులకు దానిని వ్యాపింపచేయాలి. ఈ వచనం దేవుని వాక్యమును విశ్వసించు వారి హృదయము తీరునైననూ తప్పిపోయిన ఆత్మకు ఈ విశ్వాస వాక్యమును బోధించుట ఏమీ సులభంగాక త్యాగముతో కూడినది అని మనతో చెప్పుచున్నది. దీనినే దేవుడు ఇక్కడ చూపుచున్నాడు.

వచనం 10 : అంతట నేను ఆ చిన్న పుస్తకమును దూత చేతిలో నుండి తీసికొని దానిని తినివేసితిని. అది నా నోటికి తేనెవలే మధురముగా ఉండెను గాని నేను దానిని తినివేసిన తరువాత నా కడుపుకు చేదాయెను.

యోహాను దేవుని వాక్యమును విశ్వాసముతో భుజించినప్పుడు అతని హృదయ సంతోషంతో నిండినది. కానీ దేవునిచే సాక్ష్యమియ్యబడిన ఈ సత్యమును అవిశ్వాసులకు బోధించుటకు యోహాను ఎన్నో కష్టాలను ఎదుర్కొనెను.

వచనం 11 : అప్పుడు వారు నీవు ప్రజలను గూర్చియు జనమును గూర్చియు ఆ యా భాషలు మాటలాడువారిని గూర్చియు అనేకమంది రాజులను గూర్చియు మరల ప్రవచింప నగత్యమని నాతో చెప్పిరి.

పరిశుద్ధులు దేవుని దీవెనలు నీరు మరియు ఆత్మమూలమైన సువార్త నుండి కలుగునని ప్రతివారికి మరలా ప్రవచనాన్ని చెప్పాలి. అంత్యకాలములో మన ప్రభువు యొక్క అవసరం ఈ లోకంలోని ప్రతివారు నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను విశ్వసించి దేవుని దీవెనలోనికి రావాలని వారు తిరిగి ప్రవచించాలి. దేవుడు యోనాతో ప్రవచించమన్నదేమనగా సత్యవాక్యమును బోధించుమని నూతన లోకం త్వరలో వస్తుంది. దేవునిచే తేబడును. దానిలో ప్రవేశింపగోరువారు నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను విశ్వసించుట వలన న్యాయతీర్పును పొందాలి ఈ పని కొరకు పరిశుద్ధులు దేవుని దాసులు మరలా మొదటి నుండి ఆరంభించి దేవుని వాక్యమును పూర్తిగా బోధించాలి. అట్లయిన ఈ లోకంలో ప్రతివారు మన ప్రభుని రాజ్యములో ప్రవేశించుటకు అర్హులమైన విశ్వాసమును కలిగి ఉంటారు.