Sermons

[అధ్యాయము 10-2] <ప్రకటన 10:1-11> పరిశుద్ధులు ఎత్తబడుట ఎప్పుడు సంభవించునో నీకు తెలియునా?<ప్రకటన 10:1-11>


మనం ఇప్పుడు ఎత్తబడుట ఎప్పుడు అను విషయాలన్నీ దృష్టించాలి. బైబిలు నందు అనేక వృత్తాంతాలలో ఎత్తబడుటను గూర్చి మాట్లాడబడెను. కొత్తనిబంధన దానిని గూర్చి అనేక వృత్తాంతాలలో చర్చించెను. అలాగే పాత నిబంధన కూడా ఉదాహరణకు ఎలీషా అగ్నిరధములపై పరమునకు ఎత్తబడెను. హనోకు దేవునితో నడచినవాడై ఆయనచే కొనిపోబడెను. ఇలాగు చూస్తే బైబిలు అనేక చోట్ల ఎత్తబడుటను గూర్చిమాట్లాడెను. ఎత్తబడుట అనగా పైకి కొనిపోబడుట అది దేవుని ప్రజలు ఆయన శక్తి వలన దేవునిచే కొనిపోబడుటను సూచిస్తుంది.

ఏమైనా బైబిలులో అత్యంత కఠినమైనది ఈ ఎత్తబడుట అను ప్రశ్న దేవుడు తన ప్రజలను ఎప్పుడు కొనిపోవును. ఈ ప్రశ్నయే ఎత్తబడు సమయంలో అనేకసార్లు క్రైస్తవులలో తరచుగా వచ్చును.

మనము 1థెస్సలోనికయికు 4:14-17 చూచినట్లయిన దేవుడు అపోస్తులుడైన పౌలు ద్వారా చెప్పినది చూస్తాం. “యేసు మృతి పొంది తిరిగి లేచెనని మనము నమ్మినయెడల అదే ప్రకారము యేసునందు నిద్రించువారిని దేవుడాయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పునదేమనగా ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించినవారికంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోను, ప్రధాన దూతశబ్ధముతోను, దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితోకూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు.

ఆకాశమండలమునకు మేఘములమీద కొనిపోబడుదుము కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందము”. యూదా 1:14లో ఆదాము మొదలుకొని ఏడవవాడైన హనోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లనెను. ప్రభువు తన వేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను. అనగా ఆ పరిశుద్ధులు ప్రధాన దూత బూర శబ్ధముతో మన ప్రభువు వారిని పైకి ఎత్తి వాయుమండలంలో కొంతసేపు ఉంచిన తరువాత మన ప్రభువుతో కూడా దిగివచ్చెను. ఇది బైబిలు పరమైన ఎత్తబడుటను గూర్చిన బలమైన వర్ణన.

ముందుగానే ఫై నున్న వృత్తాంతాలను మనము చూచుటకు కారణం ఏదనగా ప్రకటన 10 ఎత్తబడుట ఎప్పుడో చెప్పుచున్నది. ముందుగా నేను చెప్పినట్లు ఈ వృత్తాంత ప్రధాన ప్రత్యేకత 7వ వచనంలో ఉన్నది. ఏడవ దూత పలుకు దినములలో అతడు బూరనూదబోవుచుండగా దేవుడు తన దాసులగు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పెను. ఈ వచనం మనకు కలుగు ప్రశ్నలు మరియు సంశయాలకు సమాధానాన్ని తెలుపును.

ఎందుకనిన ఎత్తబడుట ఎప్పుడో అది మనకు చెప్పుచున్నది. దేవుడు ఒక బలిష్ఠుడైన దూతను దర్శనంలో యోహాను యొద్దకు పంపి ప్రభువు ఈ లోకమునకు వచ్చినప్పుడు జరుగబోవుదానిని దూత ద్వారా నటింపజేసి చూపించెను. దూత తన చేతిని పరలోకం తట్టు ఎత్తి ‘‘పరలోకమును... ఇక ఆలస్యముండదు గానీ”, ఇక ఆలస్యముండదు అనగా ఇకను ఆలస్యం చేయుటకు కారణము ఏదీ లేదని అర్థం అనగా ఇక సమయం లేదు అని అర్థం. అనగా ఏడవ దూత బూర మ్రోగించిన దినమున దేవుడు తన దాసులగు ప్రవక్తలకు తెలిపిన ప్రకారం దేవుని మర్మము సమాప్తమగునని అర్థం.

ఏడు బూరల తెగుళ్ళలో ఆఖరి బూర మ్రోగగా ఈ లోకము ఏడు పాత్రల తెగుళ్ళలో ప్రవేశించును. అప్పుడు మనం గుర్తించవలసినది ఇక కాలము ఈ ప్రపంచము కొరకు ఎంతో లేదని అలాగే 7వ వచనంలో దేవుని వాక్యం ‘‘అతడు బూర ఊదబోవుచుండగా దేవుడు తన దాసులగు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పెను.’’ అనునది ఎత్తబడుటను గూర్చి చెప్పుచున్నది. ఒక చోట పౌలు కూడా ఎత్తబడుట ప్రధాన దూత శబ్ధముతోను దేవుని బూర మ్రోగగా జరుగునని చెప్పెను. ఇదే పౌలు తన మనస్సు నందుంచుకొనెను. అలాగే దీనినే ఆరంభముగా బైబిలు ఉదహరించినది.

“అతడు బూర ఊదబోవుచుండగా దేవుడు తన దాసులగు ప్రవక్తలకు తెలిసిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పెను.’’ ఈ వాక్యం ఏడవ దూత బూర ఊదినప్పుడు పరిశుద్ధులు ఎత్తబడుట సంభవించునని వారు వాయువులోనికి కొనిపోబడతారని మనకు చెప్పుచున్నది. దీని తరువాత దేవుడు ఏడు పాత్రల తెగుళ్ళను పోసి లోకమును నాశనపరచి ఈ భూమిపైకి తన రాజ్యమును తెచ్చును. దానిలో వెయ్యేండ్ల క్రీస్తుతో కూడా మనము పాలించిన తరువాత మనలను నూతన ఆకాశము, నూతన భూమికి మనలను కొనిపోయి సదాకాలము మనతో నుండును.

రాబోవు ఎత్తబడుటను గూర్చి యోహానుతో చెప్పిన తరువాత దేవుడు ఆ చిన్న పుస్తకమును భుజించి మరల ప్రవచింపమని యోహానుకు ఆజ్ఞనిచ్చెను. దేవుని దాసులు అంత్యకాలములో జీవించుచున్న పరిశుద్ధులకు తప్పక బోధించవలసిన ముఖ్య పాఠమేమనగా ఎత్తబడుట అనుదానిని దాని ఖచ్చిత సమయాన్ని వారు ఈ పాఠమును బైబిలు పరమైన బలమైన మాటతో వివరించాలి. వారు నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను కూడా యదార్థంగా బోధించాలి. అంత్యకాలములో నివసించుచున్న వారైన దేవుని దాసులు. ఆయన పరిశుద్ధులు ఈ క్రియలను తప్పక చేయాలి. కనుక దేవుడు తన మర్మమును పరిశుద్ధులకు చూపి ఈ క్రియలను తప్పక చేయాలి. కనుక దేవుడు తన మర్మమును, పరిశుద్ధులకు చూపి ఈ క్రియలను వారికి అప్పగించెను. ఆయన ఆలస్యం చేయడు గాని తన క్రియలలో నుండి తొలగిపోక వాటిని జరిగించును. సమయం ఆసన్నమైనప్పుడు దేవుడు సమస్తమును అనుభవంలోకి తెచ్చును.

అధ్యాయంలో 11లో రెండు ఓలీవ చెట్లు కనబడతాయి. అనగా ఇద్దరు ప్రవక్తలు ఈ దేవుని దాసులగు ఇద్దరూ రెండు ఒలీవ చెట్లకు సాదృశ్యము. అంత్యక్రీస్తుకు వ్యతిరేకముగా పోరాటం చేసినప్పుడు అతడు వారిని హతమార్చును. కానీ మృతి నుండి తిరిగిలేచి మూడున్నర దినములలో కొనిపోబడెదరు. అనగా రెండు భిన్న సమయాలలో ఎత్తబడుట సంభవించునని దేవుడు మనకు చూపిస్తున్నాడు. ఈ అంత్యక్రీస్తు కాలములోనే పరిశుద్ధులు హతసాక్షులగుదురు.

ముందుగానే మనం తెలిసికొనవలసినదేమనగా పరిశుద్ధులు మహాశ్రమలలో జీవించుచూ జరుగవలసిన ఏడు బూరల తెగుళ్ళలో మొదటి ఆరు సంభవించు వరకూ ఈ భూమిపై ఉంటారనేదే. ఈ ఏడు బూరల తెగుళ్ళ నుండి పరిశుద్ధులను దేవుడు కాపాడును. అనగా ఆరవ తెగులు వరకు దేవుడు వారిని చంపుటతో తన ఆఖరి గంటను దేవునికి వ్యతిరేకముగా పోరాడుటకు త్రవ్వును. ఈ సమయములో పరిశుద్ధులు కౌగలించు ఆ మరణమే వారి హతసాక్ష్యము. వారు తమ విశ్వాసమును కాపాడుకొనుటకే నీతియుక్తమైన మరణమును పొందిరి కనుక మనం దానిని ‘‘హతసాక్ష్యము” అంటాము. అందువలన ఎత్తబడుట అనునది హతసాక్ష్యము. ఇతరులకు ఈ విశ్వాసాన్ని బోధించుట జరిగినది. తరువాత సంభవించునని మనం తెలిసికోవాలి.

ప్రజలలో అనేకులు ఎత్తబడుట శ్రమల ముందా లేక వెనుక సంభవించునా అను ఆలోచనలో ఊగిసలాడుతూ ఉంటారు. పాత కాలంలో ప్రజలు శ్రమల తరువాతే క్రీస్తు రాకడ వస్తుందని యేసు రెండవ రాకడలో పరిశుద్ధుల పైకి ఎత్తబడతారని అనేకొనేవారు. ఈ దినాలలో క్రైస్తవులలో అనేకులు మహాశ్రమల ముందే ఎత్తబడతామని నమ్ముతున్నారు. వారు ప్రజలలో అనేకులు ఎత్తబడుట శ్రమల ముందా లేక వెనుక సంభవించునా అను ఆలోచనలో ఊగిసలాడుతూ ఉంటారు. పాత కాలంలో ప్రజలు శ్రమ తరువాతే క్రీస్తు రాకడ వస్తుందని యేసు రెండవ రాకడలో పరిశుద్ధుల పైకి ఎత్తబడతారని అనుకొనేవారు. ఈ దినాలలో క్రైస్తవులలో అనేకులు మహాశ్రమల ముందే ఎత్తబడతామని నమ్ముతున్నారు. వారు ఏడు బూరల తెగుళ్ళతో కానీ ఏడు పాత్రల తెగుళ్ళతో కానీ తమకే విధంగా సంబంధం లేక తాము తమ అనుదిన కార్యక్రమాలలో చక్కగా జీవించుచుండగా ఎత్తబడతామని అనుకొంటున్నారు. కానీ మనం ఇట్టి తప్పుడు బోధతో మోసగింపబడకూడదు. ఈ ప్రజలు తమ జ్ఞానవిషయములోను కొనిపోబడు సమయాన్ని అర్థం చేసికొనుటలోనూ ఎంతో తప్పిపోయి అంత్యకాలము అతిత్వరగా సమీపింపబోవుచుండగా వారి ఆశలు పలుచనై వారి విశ్వాసము మాయమగును.

ఈ భూమిపై జీవించుటకు మాకుఎంతమాత్రము ఇష్టము లేదు. వేయి సంవత్సరముల వరకు సమస్త సంపదలు ఇచ్చినప్పటికి అలా ఉండాలని కూడా లేదు. ఎందుకనగా అన్నిరకాలైన తెగుళ్ళు దేవుని ప్రణాళికలో ఆయనచే అనుమతించబడినవి. ఎవరూ వాటిని ఆపలేరు. దేవుని ప్రణాళికలో అవి ఉన్నందున ఆయన వాటిని అనుమతించెను. నేను చెప్పినట్లు ఎత్తబడుట అనేది మహాశ్రమల మధ్యకాలంలో జరుగుతుంది. అయితే మీరింకా నిష్టాపరులుగా ఉండాలని నేను చెప్పుటలేదు. సంఘము ఎత్తబడుట గురించి మీకు తేటగా అర్థం కావలయునని, మహాశ్రమల కాలానికి ముందు సంఘం ఎత్తబడుతుందనే అబద్ధ బోధల నుండి మిమ్మును దూరపరచాలని కోరుచున్నాను. 7వ వచనములో తేటగా వ్రాయబడినది ఏదనగా ‘‘యేడవ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోవుచుండగా దేవుడు తన దాసులగు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పెను.’’ ఏడు బూరలు ఊదినప్పుడు వచ్చిన తెగుళ్ళు దానిని అనుసరించి వచ్చిన ఏడుపాత్రల తెగుళ్ళ వంటివి కావు. అవి వరుసగా ఒకదాని వెంట ఒకటి కుమ్మరింపబడెను.

ప్రకటన 16:1-2 ఈ విధంగా తెలియజేయుచున్నది ‘‘మరియు మీరు పోయి దేవుని కోపముతో నిండిన ఆ యేడు పాత్రలను భూమి మీద కుమ్మరించుడని ఆలయములో నుండి గొప్ప స్వరము ఆ యేడుగురు దేవదూతలతో చెప్పగా వింటిని. అంతట మొదటి దూత వెలుపలికి వచ్చి తన పాత్రలను భూమి మీద కుమ్మరింపగా ఆ క్రూరమృగము యొక్క ముద్రగల వారికిని దాని ప్రతిమకు నమస్కారము చేయువారికిని బాధాకరమైన చెడ్డ పుండులు పుట్టెను.’’ మొదటి పాత్రలో తెగులు కుమ్మరింపబడగా బూర శబ్ధంగాని, మరేదీ గాని లేకపోయెను. ఏడు పాత్రలోనివి భూమి మీద కుమ్మరించుట అనగా దేవుడు ఈ భూమిని పూర్తిగా నాశనము చేయునని అర్థము. ఎందుకు? 7వ దూత బూర ఊదినప్పుడు అనగా 7 పాత్రలోని తెగుళ్ళు కుమ్మరింపబడినప్పుడు అదే అన్నిటికి ముగింపు అయి ఉన్నది.

7 తెగుళ్ళకు సంబంధించి బూరలు ఊదినప్పుడు ఒక తెగులుకు మరొక తెగులుకు మధ్య కొంత విరామం ఉన్నది. కాని 7 పాత్రలోని తెగుళ్ళకు మాత్రం మధ్య విరామము లేదు. కారణం ఈ 7 పాత్రలోని తెగుళ్ళు అంత్యదినానికై ఏర్పాటు చేయబడినవి. 7 బూరలు ఊదినప్పుడు 7 తెగుళ్ళు ఒకదానివెంట ఒకటి క్రమంలో వస్తాయి. ఆఖరి బూర ఊదినప్పుడు ప్రపంచం అంతా క్రొత్తదనాన్ని సంతరించుకొని పాతదంతా గతించిపోతుంది.

అందును బట్టి ప్రకటన 11:15-18లో ఈ విధంగా ఉన్నది. ‘‘ఏడవ దూత బూర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్ధములు పుట్టెను. ఆ శబ్ధములు ఈలోక రాజ్యము మన ప్రభువు రాజ్యమును అయిన క్రీస్తు రాజ్యము నాయెను. ఆయన యుగయుగముల వరకు ఏలుననెను. అంతట దేవుని ఎదుట సింహాసనాసీనులగు ఆ ఇరువది నలుగురు పెద్దలు సాష్టాంగపడి దేవునికి నమస్కారము చేసి వర్తమాన భూత కాలములలో ఉండు దేవుడవైన ప్రభువా, సర్వాధికారి, నీవు నీ మహాబలమును స్వీకరించి యేలుచున్నావు గనుక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. జనము కోపగించినందున నీకు కోపము వచ్చెను. మృతుల తీర్పు పొందుటకును, నీ దాసులగు ప్రవక్తలకును పరిశుద్ధులకును, నీ నామమునకు భయపడువారికిని తగిన ఫలమునిచ్చుటకును, గొప్పవారేమి కొద్దివారేమి భూమిని నశింపజేయువారిని నశింపజేయుటకును సమయము వచ్చియున్నదని చెప్పిరి.’’

7వ దూత బూర ఊదినప్పుడు పెద్ద స్వరము వినబడినది. ఆ స్వరం ఈ విధంగా మాట్లాడుచున్నది. ‘‘ఏడవ దూత బూర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్ధములు పుట్టెను. ఆ శబ్ధములు ఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యమునాయెను. ఆయన యుగయుగముల వరకు ఏలుననెను.’’ అయితే తెగుళ్ళ గురించి ఇక్కడ ప్రస్తావించలేదు. ఎందుకు ? 7వ దూత బూర ఊదినప్పుడు 7వ తెగులు ప్రారంభం కాలేదు. అయితే ఎత్తబడుట జరుగుతుంది. ప్రభువు పునరుత్థానుడై పరిశుద్ధులందరిని అనగా జీవించియున్నవారు, మరణించువారందరినీ కొనిపోవును. దానితో ఎత్తబడుట సమాప్తం అగును. ఆ తరువాత 7వ పాత్రలోనిది పూర్తిగా పోయబడి లోకం అంతా నాశనం కాబడుతుంది.

కొనిపోబడుట (ఎత్తబడుట) ఎప్పుడు జరుగును అని ఖచ్చితంగా తెలిసికోవాలంటే దేవుని వాక్యమైన ప్రకటన 10:7లో కనుగొనగలము. అయిన సేవకులైన ప్రవక్తలతో తెలియజేసినట్లు దేవుని మర్మము ఈ సమయంలో పూర్తి కాబడుతుంది. దేవుని మర్మమేదనగా ఎత్తబడుట అనునది కేవలం పరిశుద్ధులకే కాని ఎవరికి కాదు.

స్పష్టమైన అవగాహనకు సరియైన విశ్వాసానికి మీకు ఇక్కడ మరియొక వాక్యభాగాన్ని చూపించుచున్నాను. పరిశుద్ధ గ్రంథము ఈ విధంగా తెలియజేయుచున్నది. ‘‘ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మన మందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున, కడబూర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బూరమ్రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. మనము మార్పు పొందుదుము” (1కొరింథి 15:51,52) పరిశుద్ధుల పునరుత్థానము ఆఖరి బూర ఊదిన తరువాత అని ఇది స్పష్టంగా తెలియజేయుటలేదా? బూర ఊదినప్పుడు క్రీస్తు నందలి మృతులు అక్షయతను ధరించుకొని లేతురు. రెప్పపాటులో మనం మార్పుచెంది ఎత్తబడుదుము.

అధ్యాయం 10లో చూపబడిన దూత శక్తివంతమైన దూత మరియు దేవునిచే పంపబడి మొదట బూరలు ఊదిన ఆరుగురు దూతకంటే ప్రత్యేకమైనది. ఆ దూత ప్రత్యేకత ఏమనగా ఈ దూత ప్రత్యక్షమైనప్పుడు దేవుని వలె కనబడి దేవుడే మనకు ప్రత్యక్షమైనట్లు పొరబడతాము. ‘‘బలిష్ఠుడైన వేరొక దూత పరలోకము నుండి దిగి వచ్చుట చూచితిని. ఆయన మేఘము ధరించుకొని యుండెను. ఆయన శిరస్సు మీద మేఘధనస్సుండెను. ఆయన ముఖము సూర్యబింబమువలెను ఆయన పాదములు అగ్ని స్తంభములవలెను ఉండెను. ఆయన చేతిలో విప్పబడియున్న యొక చిన్న పుస్తకముండెను. ఆయన తన కుడిపాదము సముద్రము మీదను ఎడమపాదము భూమిమీదను మోపి సింహము గర్జించునట్లు గొప్ప శబ్ధముతో అర్భటించెను. ఆయన అర్భటించినప్పుడు ఏడు ఉరుములు వాటివాటి శబ్ధములు పలికెను.’’

ఈ దూతను దేవుడని మనం పొరబడవచ్చు ఎందుకనగా ఈ దూత చేయునదంతయూ క్రీస్తు చేయునట్లుండి ఆయనకు మారుగా నుండెను. దేవుడు ఈ క్రియలన్నియు బలిష్ఠుడైన తన దూత ద్వారా జరిగించునని ఈ వచనం మనకు చెప్తుంది. ఈ రెంటిని లయపరచును. ఉరుము వచ్చినప్పుడు ఈ జగత్తు మరియు మానవాళి యొక్క సృష్టి ఆరంభము నుండి క్రీస్తు యేసు నందు దేవుని ప్రణాళికయైన ప్రతి క్రియను ముగించును.

ఏడు బూర తెగుళ్ళలో మొదటి ఆరు తెగుళ్ళను పరిశుద్ధులమైన మనము అనుభవించు వాటిలో జీవించి అప్పటి వరకు సువార్తను బోధించుట మనం కొనసాగిస్తాం. ఆ చిన్న పుస్తకంను తీసికొని తిని తిరిగి దానిని ప్రవచించుమని దేవుడు యెహానుతో చెప్పెను. కానీ ఈ వాక్యము నీకు నాకు కూడా వర్తిస్తుంది. అనగా ఆఖరి దినము వరకు మనం మన విశ్వాసాన్ని కొనసాగిస్తూ జీవించాలి. ఏడవ బూర మ్రోగునప్పుడు మనం ఎత్తబడతాం కనుక మనం కొనిపోబడతామనే సత్యాన్ని గుర్తించాలి. ఆ విశ్వాసంలో స్థిరంగా పొందుకొనాలి ఈ దినం వచ్చు పర్యంతం వాక్యం వింటూ సువార్తను బోధిస్తూ ఉండాలి.

ఏడవ బూర మ్రోగువరకే అంత్యక్రీస్తు ఈ తెగులు మధ్యలోనే క్రియావంతంగా ఉంటాడు. దీనితో పరిశుద్ధులు హతసాక్షులౌతారు. దాని తరువాత కొద్ది కాలంలోనే ఎత్తబడతారు. అలాగే ఈ సమయంలో కూడా విశ్వాసులు అనేకులు యేసునందు తమ విశ్వాసం నుండి కదల్చబడి దాని శక్తిని కోల్పోతున్నారు. నీవు నేను ఇంకా విశ్వాసంతో జీవించాలి. అట్టి విధంగా విశ్వసించాలి. అనగా ఖచ్చితంగా ఏడవ దూత బూర ఊదిన తరువాత మనం ఎత్తబడుట జరుగును. మరియు మనం అట్టి విశ్వాసంతో జీవించాలి త్వరలో మనము ఏడు బూరల తెగుళ్ళను తప్పక మన కళ్ళతో చూడబోతున్నాం. మనం చూచి ఈ తెగుళ్ళను ఆరంభం నుండి ఆరవది వరకు మన కళ్ళతో చూచి లెక్కిస్తాం. ఆ తరువాత పరిశుద్ధులమైన మనం మన హతసాక్ష్యానికి సమయం వచ్చిందని సూచన ప్రాయంగా తెలిసికొని ఆ ప్రకారం ప్రయోగపూర్వకంగా హతసాక్ష్యాన్ని ఎదుర్కొంటాం. ఇది ఏదో కట్టుకథకాని సైన్స్‌ ఊహకు కూడా కాదు. లేదా ఇదేదో నీవు నమ్ములేదా నీ స్వంత కోరిక కాదు. అది వాస్తవంగా నీకు, నాకు జరగబోవుచున్నది.

ప్రకటన 10:7 వచనంలో ఉన్న ఎత్తబడుట అనునది ప్రకటన గ్రంథంలో స్పష్టముగా చూపబడింది. పరిశుద్ధులు ఎత్తబడుట అనునది ఏడవదూత బూరనూదినప్పుడు సంభవించును. ఈ లోకము ఏడు పాత్రల తెగుళ్ళ వలన అంతమగునని మనకు చెప్తుంది. పరిశుద్ధులను కొనిపోయిన తరువాత దేవుడు సర్వలోకాన్ని నాశనపరచును. పరిశుద్ధలంతా ఎత్తబడినప్పుడు వాయు మండలంలో వారు ప్రభువుని స్తుతిస్తారు. కానీ ఈ భూమి మీద ఏడు పాత్రల తెగుళ్ళు కుమ్మరింపబడి లోకమును సర్వనాశనం చేస్తాయి. మరియు ఈ ఏడు పాత్రల తెగుళ్ళు పూర్తికాగా ప్రభువుచే నూతన పరచబడిన భూమిపైకి పరిశుద్ధులు దిగి వస్తారు. అప్పుడు భూమి మీద వెయ్యేండ్ల రాజ్యము. క్రీస్తు రాజ్యము కట్టబడతాయి.

ఈ రోజులలో క్రైస్తవులు ప్రి - మిల్లీనియమ్‌ రాప్చర్‌ను బలపరుస్తున్నారు. వారిలో కొందరు ఎమిల్లీనియమ్‌ను కూడా వాదించు వరకు వచ్చారు. అనగా వెయ్యేండ్ల రాజ్యము వంటి రాజ్యము లేదు. అప్పుడు వెయ్యేండ్ల పాలన వాస్తవం కాదా? చాలామంది అలాగే నమ్ముచున్నారు. వారిలో కొందరు కొరియాలో అతిపెద్ద సంఘంలో సేవ చేస్తున్న వారు ప్రకటనలోని ప్రతి విషయాన్ని 666 ముద్ర నుండి ఎత్తబడుట వరకు నిర్ణయిస్తారు. అది వాస్తవం కాదు కానీ కేవలం సూచన మాత్రమే. ఒకసారి మన ప్రభువు అడిగనట్లు మనుష్య కుమారుడు వచ్చినప్పుడు భూమి మీద నిజముగా విశ్వాసమును కనుగొనునా. ఈ అంత్య దినాల్లో నిజ విశ్వాసులను కనుగొనుట నిశ్చయంగా అతి కష్టమైనదే.

కానీ మనం ఎత్తబడుట నిజానికి వాస్తవంగా జరుగునని ప్రభువు మనతో చెప్తున్నారు. మనం కొనిపోబడినప్పుడు వాయుమండంలో ప్రభువుని ఎదుర్కొని ఆయనను స్తుతిస్తాం. ఆయనచే స్వీకరించబడతాం. మరలా ఆయనతో కూడా భూమిపైకి వస్తాం. వెయ్యేండ్ల రాజ్యంలోనికి వస్తూ పునరుత్ధానమైన రూపాంతరం చెందిన శరీరాలతో క్రొత్త జీవితం జీవిస్తాం. సమస్తమూ నూతన పరచబడుచుండగా మధ్యలో మారిన జీవితం నుండి మారిన దీవెనల వరకూ దేవునిచే నూతన వస్త్రాలు ధరింపబడి అట్టి మహిమలో జీవిస్తాం. నీవు నేను తప్పక ఈ విశ్వాసంతో ఈ నమ్మకంతో జీవించాలి. వెయ్యేండ్ల పాలన పూర్తయిన తర్వాత మనం నూతన భూమి మరియు ఆకాశంలో ప్రవేశించి నిత్యమహిమ మరియు గౌరవంతో క్రీస్తుతో కూడా సదాకాలం పాలిస్తాం.

మనం వెయ్యేండ్ల రాజ్యము మరియు నూతన భూమి ఆకాశములోనికి ప్రవేశించినప్పుడు దూతలన్నీ మన పరిచారకులగును. సర్వలోకమును సృజించిన యేసుక్రీస్తు మరియు ఆత్మనడిపింపు దానిలోని సమస్తము ఎవని వశమగును? అందంతయుమనదగును. అందువలననే పరిశుద్ధులే వీటిని తప్పక బైబిల్‌ చెప్పుచున్నది, ఎట్లనగా నీరు మరియు ఆత్మమూలమైన సువార్త ద్వారా తిరిగి జన్మించిన నీవు నేను పరిశుద్ధులము మనము దేవుని వారసులము. క్రీస్తు సహవారసులము. ఇట్టి వారికే సమస్తము స్వాధీనమగును. అలాగే నీవు నేను ఈ భూమిపైనున్న కష్టమును విశ్వాసంతో జయించాలి. మన వారసత్వ దినము కొరకు ఎదురుచూస్తూ విశ్వాసాన్ని కాపాడుకొనాలి. దేవుని దండువలే ఆత్మీయ పోరాటం చేయాలి.

ఈ సంగతులన్నీ ఆలస్యం చేయక త్వరలో పూర్తియగునని దేవుడు మనతో చెప్పుచున్నాడు. అవి అత్యంత ఖచ్చితంగా త్వరలోనే పూర్తిచేయబడును. అప్పుడు కొందరు దేవుడు దీనిని గూర్చి మరి విశదంగా మనకు ఎందుకు తెలియచేయలేదని ఆశ్చర్యపోతారు. ‘‘సంగతి మరుగు చేయుట దేవునికి ఘనత” (సామెతలు 25:2, లూకా 10:21) అనునది ఈ ప్రశ్నకు జవాబు

దేవుని ప్రణాళికకు విశదముగా వ్రాయబడి ఉంటే అది ఈ లోకంలో మరి ఎక్కువ ఆందోళనకు కారణమయ్యేది. విశ్వాసులచే చంపబడేవారు. ఒక్క పరిశుద్ధుడు కూడా తప్పించుకొనేవాడు కాదు. అంత్యకాలమందు గూర్చిన ప్రతి వివరము బైబిలులో వ్రాయబడినట్లయితే నీరు మరియు ఆత్మ ద్వారా తిరిగి జన్మించన వారు విశ్వాసులైన తిరిగి జన్మించిన వారినందరినీ వధిస్తారు.తన ఉద్దేశ్యమును మరుగుచేసి దేవుడు వాటిని యోగ్యులైన వారికి చూపించును. లేనిచో మిగిలిన వాటి నుండి వాటిని మర్మముగా ఉంచుతాడు ఇదే దేవుని జ్ఞానము. దేవుడు తన ప్రణాళికను మనకు చూపించి మనలను దానిని తెలుసుకొనుటకు అనుమతించాడు. ఎట్లనగా అది ఈ యుగపు పరిశుద్ధులకు అత్యంత ఆవశ్యము.

తిరిగి జన్మించిన దేవుని సంఘము ఇప్పుడు అంత్యకాలము గూర్చి వివరంగా మాట్లాడుతున్నాయంటే అంత్యదినాలు మనలను సమీపిస్తున్నాయని అర్థం. శ్రమ యుగము జరగబోవుచుండగా అంత్యదినమును గూర్చిన సరియైన జ్ఞానము కలవారై పరిశుద్ధులు వాటి నుండి కాపాడబడి సమీపించబోవుచున్న శ్రమలను జయించుటకే ప్రకటన వాక్యం బోధించబడాలి. తిరిగి జన్మించినవారు కూడా శ్రమల గూర్చిన పరిజ్ఞానము లేకుండా వాటిని ఎదుర్కొన్నట్లయిన ఏమి చేయాలో తెలియక గొప్ప తికమకలో పడతారు. తమ స్వంత విశ్వాసంపై ఆనుకొనెడి వారికి ఈ తికమక మరి ఎక్కువగా ఉంటుంది.

అనేకులు సిద్ధపడని ఆత్మగలవారై తమ అజ్ఞానము తికమకలో అంత్యకాలము వచ్చునప్పుడు తప్పుమార్గములోనికి పోవుటను మనం ఊహించవచ్చు. ‘‘దేవుడు నీకేమైనా చెప్పెనా?’’ నీవు ప్రార్థన ‘‘చేయునప్పుడు నీకు దర్శనాన్ని చూపించలేదా?’’ అనేకులు దేవుని నుండి దర్శనం చూడడానికి చెప్పవచ్చు. నీవు ప్రార్థన చేయునప్పుడు నీతో ఏమైనా చెప్పలేదా? పరిశుద్ధులు అజ్ఞానంగా ఉంటే అంత్యకాలములో నున్న పరిశుద్ధుల మధ్య ఈ ప్రశ్న అనేకసార్లు అతి సామాన్యంగా వస్తుంది.

ఈ విధంగా దేవుడు ఎప్పుడూ చేయడు ఎట్లయిన ఆయన ఇప్పటికే మనకు ఆజ్ఞనిచ్చెను. ‘‘చెవిగలవాడు ఆత్మ సంఘముతో చెప్పునది వినును గాక! మరో విధంగా పరిశుద్ధాత్మ సంఘము ద్వారా చెప్పబడిన దానినే తప్పక వినాలి. ‘‘ఎందుకనగా పరిశుద్ధాత్మ దేవుని వాక్యమునకు భరోసా నిచ్చుచున్నది. సత్యమైన నమ్మకమైన దానిని సాక్ష్యమిచ్చుచున్నది. లోక సమాప్తియగుటకు తెగుళ్ళు వర్షింపబడుచుండగా పరిశుద్ధులు రాబోవు శ్రమలను బట్టి ఆశ్చర్యపడకూడదు. కానీ వాక్యమును విని దానిని ప్రకారం జీవించాలి. అప్పటికే మనము ముందుగానే దేవుని వాక్యమును విని దానిని విశ్వాసముతో హృదయములో చెక్కుకొనియున్నాము.

ఇందువలననే యోహాను భవిష్యత్తులో జరుగబోవు దానిని ముందుగానే మనకు చూపించెను. మరియు దేవుని దాసులు ఈ వ్రాయబడిన వాక్యమునకే పరిమితమై బోధించినది. అందువలననే ప్రవచించడమనగా జరుగబోవు దానిని తెలిసికొని వ్రాయబడిన వాక్యము నుండి బోధించుట కాక మరొకటి కాదు. లేదా కలలో లేదా ప్రార్థనలో దర్శనము చూచుట కాదు!

నిజముగా మనం ఎత్తబడుట సంభవించునని మరియు మనమే పరిశుద్ధులమని మరవవద్దు నీకు కొనిపోబడుట సంభవించినప్పుడు వాయు మండలంలో క్రీస్తుతో కూడా ఉంటావని నీవు ఇప్పుడు పరిశుద్ధుడవని వెయ్యేండ్ల నూతన పరచబడిన రాజ్యములో నుండుటకు తిరిగి నవీన భూమిపైకి వస్తానని నూతన ఆకాశము మరియు భూమిలో సదాకాలము జీవిస్తావని మరచిపోకూడదు. ప్రి - ట్రిబులేషన్‌ రాప్చర్‌ లేదా పోస్ట్‌ ట్రిబులేషన్‌ రాప్చర్‌ గూర్చి ప్రజలు మాట్లాడుట నీవు వినిననూ లేదా వెయ్యేండ్ల పాలన నిర్ధారించినను ఇక్కడ మనం చర్చించుచున్న బైబిల్‌ వృత్తాంతాన్ని వారితో చెప్పుము. 1థెస్సలోనికయులకు 4 మరియు 1 కొరింథీయులకు 15 రిఫరెన్స్‌కు కూడా చెప్పుము. ప్రభువు దూత శబ్ధముతోను ఆఖరి బూర మ్రోగినప్పుడు దిగి వచ్చునని ఆయనతో కూడా నుండుటకు పరిశుద్ధులను వాయుమండంలోనికి కొనిపోవునని కూడా వారితో చెప్పుము. నీవు ఈ ఎత్తబడుటను విశ్వసించినప్పుడే నీవు నీ విశ్వాసమును కాపాడుకొనగలవు.

ఎత్తబడుటకు విశ్వాసంతో కూడిన హతసాక్ష్యము మరియు శరీర పునరుత్ధానము తప్పక ఉండాలి. పునరుత్ధానముతో పాటు ఎత్తబడుట కలుగును కనుక మనం పునరుత్ధానమవ్వగానే మనము ఎత్తబడి వాయుమండలమునకు కొనిపోబడెను. కనుక ఎత్తబడుట మరియు పునరుద్ధానము ఒక్కటే. మొదటి పునరుత్ధానంలో పాలు పొందుట అనగా వెయ్యేండ్ల పాలనలో ప్రభువుతో నివసించుట ఎత్తబడుట అనగా కూడా ఈ భూమిపై ప్రభువుతో కూడా వెయ్యేండ్ల నివసించుట.

అట్లయితే మనము ఎందుకు ఎత్తబడాలి? ఎందుకనిన ఏడు పాత్రల తెగుళ్ళను కుమ్మరించి దేవుడు భూమిని నాశనం చేయును. అనగా అంతము యొక్క తెగుళ్ళ నుండి తన పిల్లలను రక్షించుటకే ఆయన ముందుగా పరిశుద్ధులను కొనిపోవును. పాపుల నుండి తన పిల్లలను రక్షించుటకే ఆయన ముందుగా పరిశుద్ధులను కొనిపోవును. పాపుల నుండి పరిశుద్ధులను వేరుపరచుటకు విభిన్నమైన వారి అంతమును చూపుటకు ఆయన పరిశుద్ధులను కొనిపోవును. అలాగే వీటన్నిటిని మనం విశ్వసించాలి. 

కొందరికి నీటి మరియు ఆత్మమూలమైన సువార్త క్షుణ్ణంగా బయలుపరచబడెను మరి కొందరికైతే పూర్తిగా దాచబడిన రహస్యముగా ఇది మిగిలిపోయెను. అదే విధంగా ఆ పరిశుద్ధులు హతసాక్ష్యము పునరుత్ధానము ఎత్తబడుట నూతన భూమి ఆకాశము మరియు వెయ్యేండ్ల పాలన అనునవి దేవుని రహస్యము తిరిగి జన్మించిన వారికి మాత్రమే దేవుడు బయలుపరచి ఈ రహస్యాలను సూచించెను. వారు ఈ రహస్యముందు విశ్వాసముంచునట్లు చేసి వారిని ఆయన ఈ అంత్యకాలములో జీవింపచేసెను. మరియు ఎత్తబడుటలోను పరలోకరాజ్యమును గూర్చిన వారి విశ్వాసముతో కష్టమును జయించునట్లు చేసెను.

నీవు నేను ఇట్టి విశ్వాసమును తప్పక కలిగియుండాలి. ఇట్టి విశ్వాసం లేకుండా అనగా మనము ఎత్తబడి నూతన లోకము మరియు భూమిలో మనం నివసిస్తాం. అంత్యక్రీస్తుచే నరకబడి చనిపోయినప్పుడు ఆయన మనలను మృతి నుండి లేపుతాడు. మనలను కొనిపోతాడు వాయుమండలంలో నివసింపచేస్తాడు మరియు మనలను ఈ భూమిపైకి మరలా తెచ్చి ఆయనతో కూడా వెయ్యేండ్ల పరిపాలించునట్లు అను విశ్వాసం లేకుండా మనము కష్టములో కాపాడబడలేం మరియు ఈ అంత్యయుగపు జీవితాన్ని నీరసపరచుకొంటాం.

ఈ పరిశుద్ధులకు అందమైన ఊహ ఉన్నది. ప్రభువు తప్ప మరెవ్వరూ దానిని అనుభవంలోనికి తేలేరు. ఈ నమ్మకం లేకపోతే మనం కేవలము విచారము బాధతో ఈ నిరాశ పూరిత లోకంలో జీవిస్తాం.

పౌలు తిమోతితో అతనికి అప్పగింపబడిన దానిని జాగ్రత్తగా జరిపించుమని చెప్పెను. ఈ సువార్త రమ్యమైనది అలాగే మన హతసాక్ష్యము పునరుత్ధానము మరియు ఎత్తబడుట అలాగే ఈ వెయ్యేండ్ల రాజ్యంలో నివసించుట మరియు నూతన భూమి ఆకాశము ఇవన్నియూ మంచివి రమ్యమైనది అవి కేవలము పరిశుద్ధులకు చెందినవి. మరియు వారందరూ దీనిని నమ్మి విశ్వసిస్తారు కానీ అవి ఊహలు కానీ పగటి కల కానీ కాదు. ఇది మన ప్రభువు మనకిచ్చిన నమ్మకము మరియు విశ్వాసం వీటన్నిటి యందు విశ్వాసము కలిగిన వారమై మనము ఈ యుగములో నూతన భూమి ఆకాశం మరియు వెయ్యేండ్ల పాలన వచ్చు దినము కొరకు విశ్వాసంతో జీవించాలి.

రానైయున్న వాడు త్వరలో వచ్చునని దేవుడు మనకు చెప్తున్నాడు మహాశ్రమల కాలమైన ఏడేండ్ల కాలములో మొదటి సగము భాగము అని అత్యల్పమైనవి మరియు స్వల్పకాలంలో ముగియునును. ఈ ఏడు సంవత్సరముల మహాశ్రమల కాలం అంతా ఈ తెగుళ్ళు కొనసాగుతాయా? ప్రతివారు ఎలా ఎదుర్కొంటారు? మొదటి తెగుళ్ళు కొద్దివైనవి మరియు సమయము ముగింపునకు సమీపించుచుండగా మరి ఎక్కువ తెగుళ్ళు కలుగును. ఏడువబూర తెగులు వచ్చినప్పుడు అది చూడదగినంతగా ఎక్కువగును.

పరిశుద్ధులు విశ్వాసాన్ని కదిలించుటకు సాతాను ప్రయత్నించుటకు కొద్ది సంఘము నాయకులను హత్యచేసిన ఉదంతాలను ఉదాహరణగా చూపిస్తాడు. సాతాను ఇలాగు చెప్పెను నీవు దేవుని వదలివేస్తే నేను నిన్ను వదిలివేస్తాను. లోకం మంచి స్థితికి తిరిగిననూ ఒకడు తప్పక సాతాను అవకాశాన్ని గూర్చి రెండుసార్లయినా ఆలోచించాలి. అప్పుడు ఎవరు సరిగా యోచిస్తారు. ప్రభువు ఏడుపాత్రల తెగుళ్ళు కుమ్మరించునని మరియు తాను ఈ తెగుళ్ళ ద్వారా కలుగు బాధలో కూడా జీవించాలని బాగుగా అర్థం చేసుకొన్నవారు కూడా దేవుని విడిచిపెడతారా? లోక అంతము ఎరిగిన వారైన పరిశుద్ధులు ప్రభువును త్రోసివేయరు మరియు విశ్వాసమును త్రోసిపుచ్చరు. మరియు మన హృదయాలలో పరిశుద్ధాత్మ కలిగి ఉన్నందున ఆయన మనకు ధైర్యమిచ్చును.

అంత్యకాలములో దేవుని ప్రణాళిక అంతయూ త్వరగా నెరవేర్చబడబోవుచుండగా, దృష్టి మరల్చుటకు స్థానమే లేదు. త్వరగా ముగియు తెగుళ్ళు పూర్తియగునప్పుడు పునరుత్ధానము దాని తరువాత ఎత్తబడుట జరుగును. అది మనలను వాయుమండలమునకు కొనిపోవును. మన శరీరాలు ఆత్మ శరీరంగా రూపాంతరం చెందినట్లు ప్రభువును స్తుతిస్తు రమ్యమైన మరియు అపురూపమైన లోకాన్ని పొంది ఆనందిస్తాం. అది ఇంతకు ముందెన్నడూ మనం ఈ భూమిపై అట్టి అనుభవం పొందియుండము. ఆత్మీయ శరీరం సయమము మరియు స్థలము యొక్క పరిధులు ఉండవు గనుక మనం అద్భుతమైన ఆశ్చర్యకరమైన లోకంలో నివసిస్తాం. అక్కడ ఎక్కడికి కావాలంటే అక్కడికి మనం వెళ్ళవచ్చును.

అట్టి మహాదీవెనలను మనకు ఇచ్చిన దేవునికి నేను నిజంగా కృతజ్ఞతలు తెలుపుచున్నాను. దేవుడు తన వాక్యము ద్వారా మనకు స్పష్టంగా చూపించినందుకు దేవునికి కృతజ్ఞతలు తెలుపుచున్నాను. ఆ మహాశ్రమలు వాటి తెగుళ్ళు మన హతసాక్ష్యము పునరుత్ధానము మరియు ఎత్తబడుట అను వాటిని మన హృదయాలు ఎల్లప్పుడూ ఈ అంత్యయుగాన్ని గూర్చిన జ్ఞానంతోను దానియందలి విశ్వాసంతో ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను.