Sermons

[అధ్యాయము 11-1] <ప్రకటన 11:1-19> ఆ రెండు ఒలీవ వృక్షములు మరియు ఇద్దరు ప్రవక్తలు ఎవరు?<ప్రకటన 11:1-19>

“మరియు ఒకడు చేతికఱ్ఱ వంటి కొలకర్ర నాకిచ్చి నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలతవేసి, ఆలయములో పూజించువారిని లెక్కపెట్టుము. ఆలయమునకు వెలుపటి ఆవరణమును కొలతవేయక విడిచి పెట్టుము. అది అన్యులకియ్యబడెను. వారు నలువది రెండు నెలలు పరిశుద్ధ పట్టణమును కాలితో త్రొక్కుదురు నేను నా యిద్దరు సాక్షులకు అధికారము ఇచ్చెదను. వారు గోనెపట్ట ధరించుకొని వెయ్యిన్ని రెండువందల ఆరువది దినములు ప్రవచింతురు. వీరు భూలోకమునకు ప్రభువైన వాని యెదుట నిలుచుచున్న రెండు ఒలీవ చెట్లను దీపస్తంభమునైయున్నారు. ఎవడైనను వారికి హానిచేయనుద్దేశించిన యెడల వారి నోటి నుండి అగ్ని బయలువెడలి వారి శత్రువును దహించివేయును గనుక ఎవడైనను వారికి హానిచేయనుద్దేశించిన యెడల అలాగున చంపబడవలెను. తాము ప్రవచింపు దినములు వర్షము కురువకుండ ఆకాశమును మూయుటకు వారికి అధికారము కలదు. మరియు వారికిష్టమైనప్పుడెల్ల నీళ్లు రక్తముగా చేయుటకును, నానా విధములైన తెగుళ్లతో భూమిని బాధించుటకును వారికి అధికారము కలదు. వారు సాక్ష్యము చెప్పుట ముగింపగానే అగాధములో నుండి వచ్చు క్రూరమృగము వారితో యుద్దము చేసి జయించి వారిని చంపును. వారి శవములు ఆ మహాపట్టణపు సంత వీధిలో పడియుండును. వానికి ఉపమాన రూపముగా సొదొమ అనియు ఐగుప్తు అనియు పేరు. అచ్చట వారి ప్రభువు కూడా సిలువ వేయబడెను. మరియు ప్రజలకును, వంశములకును, ఆ బాషలు మాటలాడువారికిని, జనములకును సంబంధించినవారు మూడు దినములన్నర వారి శవములను చూచుచు వారి శవములను సమాధిలో పెట్టనియ్యరు. ఈ యిద్దరు ప్రవక్తలు భూనివాసులను బాధించినందున భూనివాసులు వారి గతి చూచి సంతోషించుచు, ఉత్సహించుచు, ఒకనికొకడు కట్నములు పంపుకొందురు. అయితే ఆ మూడు దినములన్నరయైన పిమ్మట దేవుని యొద్ద నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించును గనుక వారు పాదములు ఊని నిలిచిరి. వారిని చూచిన వారికి మిగుల భయము కలిగెను. అప్పుడు ఇక్కడికి ఎక్కిరండని పరలోకము నుండి గొప్ప స్వరము తమతో చెప్పుట వారు విని, మేఘారూఢులై పరలోకమునకు ఆరోహణమైరి. వారు పోవుచుండగా వారి శత్రువులు వారిని చూచిరి. ఆ గడియలోనే గొప్ప భూకంపము కలిగినందున ఆ పట్టణములో పదియవ భాగము కూలిపోయెను. ఆ భూకంపము వలన ఏడువేల మంది చచ్చిరి. మిగిలిన వారు భయక్రాంతులై పరలోకపు దేవుని మహిమపరచిరి. రెండవ శ్రమ గతించెను. ఇదిగో మూడవ శ్రమ త్వరగా వచ్చుచున్నది. ఏడవ దూత బూర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్ధములు పుట్టెను. ఆ శబ్ధములు ఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యమును అయిన క్రీస్తు రాజ్యము నాయెను. ఆయన యుగయుగముల వరకు ఏలుననెను. అంతట దేవునియెదుట సింహాసనాసీనులగు ఆ యిరువది నలుగురు పెద్దలు సాష్టాంగపడి దేవునికి నమస్కారము చేసి వర్తమాన, భూతకాలములలో ఉండు దేవుడైనా ప్రభువా, సర్వాధికారీ, నీవు నీ మహాబలమును స్వీకరించి యేలుచున్నావు. గనుక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. జనములు కోపగించినందున నీకు కోపము వచ్చెను. మృతులు తీర్పు పొందుటకును, నీ దాసులగు ప్రవక్తలకును, పరిశుద్ధులకును, నీ నామమునకు భయపడువారికి తగిన ఫలమునిచ్చుటకును, గొప్పవారేమి, కొద్దివారేమి భూమిని నశింపజేయువారిని నశింపజేయుటకును సమయము వచ్చియున్ననదని చెప్పిరి.

మరియు పరలోకమందు దేవుని ఆలయము తెరవబడగా దేవుని నిబంధన మందసము ఆయన ఆలయములో కనబడెను. అప్పుడు మెరుపులును ధ్వనులును ఉరుములును భూకంపమును గొప్ప వడగండ్లును పుట్టెను.’’


మనకు ప్రకటన గ్రంధం 11వ అధ్యాయం ఎంతో ప్రాముఖ్యము ఎట్లనిన అది అంతా దేవుని వాక్యమే. లోకమును నాశనము చేయుటకు ముందు దేవుడు అక్కడ ఒక క్లిష్టమైన క్రియను జరిగించవలసియున్నది. అదే అంత్యకాలము కొరకు ఇశ్రాయేలు ప్రజలను పంట కోత. దేవుడు ఇశ్రాయేలీయులకు మరియు అన్యులకు కూడా మరి యొక క్రియ జరిగించవలసినది. వారు హతసాక్షులగుట ద్వారా మొదటి పునరుత్ధానము మరియు ఎత్తబడుటలో పాల్గొనునట్లు చేయును.

ఈ కార్యము సంపూర్ణ అవగాహనను బైబిల్‌ కలిగి యుండగా క్రొత్త నిబంధనలో దేవుని రక్షణ యొక్క పాపపరిహారము ఎట్లు సంపూర్తి చేయబడెనో మనము కనుగొనవలసియున్నది. లేఖనము ఈ విషయమును మనకు తెలియపరచుచున్నది. ఎందుకనగా మనం వాటిని లోతుగా పరీక్షించనిచో, ప్రకటన గ్రంధములో కనిపించు ఇశ్రాయేలు ప్రజలు, దేవుని దాసులు, పరిశుద్ధులను గురించి తికమకపడతాం.వివరణ : 


వచనం 1 మరియు ఒకడు చేతికఱ్ఱ వంటి కొలకఱ్ఱ నాకిచ్చి నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలతవేసి, ఆలయములో పూజించువారిని లెక్కపెట్టుము.

దేవుని కరుణ చొప్పున ఇశ్రాయేలీయులను పాపము నుండి రక్షించుట అను క్రియ ఆరంభించునని ఈ వచనం చెప్తుంది. ‘‘కొలతవేయుట” అనగా దేవుడు వ్యక్తిగతంగానే అంత్యకాలమందు ఇశ్రాయేలు ప్రజలను పాపము నుండి విడిపింప పూనుకొనును.

అధ్యాయం11లో ప్రాముఖ్య వృత్తాంతం నందు పాపం నుండి ఇశ్రాయేలీయులకు కలుగబోవు రక్షణ మీద మన దృష్టి నిలపాలి. ఈ వాక్యం మనకు చెప్పునదేమనగా అప్పటి నుండి నీరు మరియు ఆత్మమూలమైన సువార్త ఇశ్రాయేలీయులకు విస్తరించబడును ఇశ్రాయేలీయులను యేసుక్రీస్తు అనుగ్రహించిన రక్షణ అను కృప ద్వారా పాపము నుండి విడిపించి దేవుని ప్రజలుగా మార్చు ప్రక్రియ ఆరంభించబడుటను గుర్తింపచేయును. అంత్యకాలములో ఇశ్రాయేలీయులకు కూడా పాప ప్రాయశ్చిత్తమును నిచ్చుటను దేవుడు ప్రకటన 11లో వ్రాయించెను. ఆ కొలత వేయుట అని 1,2వచనాలలో అనగా ప్రతి వాటికి ఒక ప్రమాణమును నిర్ణయించుటని అర్థం. దేవుడు తన ఆలయాన్ని కొలిపించుటలో గల ఉద్దేశ్యం. ఇశ్రాయేలీయులను రక్షించుటకు ప్రణాళిక చేయబడిన ప్రకారం వారి హృదయాలు రక్షణ స్వీకరించుటకు సిద్ధంగా ఉన్నాయో లేదో కనుగొనుటకు ఒక వేళ వారి హృదయాలు సిద్ధపడనట్లయితే అప్పుడు వారిని సిద్ధపరచుటకు దాని వలన వారి హృదయము చక్కగా నిలబడును.

వచనం 2 : ఆలయమునకు వెలుపటి ఆవరణమును కొలతవేయక విడిచిపెట్టుము. అది అన్యులకియ్యబడెను. వారు నలువది రెండు నెలలు పరిశుద్ధ పట్టణమును కాలితో త్రొక్కుదురు.

దేవుడు మూడున్నర సంవత్సరముల వరకు అన్యులను వాడుకొనుటకు సాతానునకు ఇచ్చెను. అన్యులందరూ నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను విమోచన వాక్యాన్ని ఏడున్నర సంవత్సరముల మహాశ్రమల కాలములోని మొదటి మూడున్నర సంవత్సరముల్లోపే సాధ్యమైనంత త్వరగా తప్పక తమ హృదయాలలో చేర్చుకోవాలి. మహాశ్రమల కాలము యొక్క మధ్యలోనే ఈ లోక చరిత్ర అంతమై రెండవ సగకాలములోనికి ప్రవేశించును. వెంటనే సమీప భవిష్యత్తులో అన్యజనులు తమ పాపము నుండి అప్పటికే రక్షింపబడిన వారైన పరిశుద్ధులు కూడా సాతానుచే అణగద్రొక్కబడు ఆ సమయం వచ్చును.

కనుక అన్యులు కూడా తమ పాపపరిహారం తప్పక పొంది, తాము జీవించవలసిన మహాశ్రమల కాలంలోని మొదటి మూడున్నర సంవత్సరాలకే తమ విశ్వాసాన్ని హతసాక్ష్యముకొరకు సిద్ధపరచుకోవాలి. ఇట్టి సమయంలో ఇశ్రాయేలీయులు కూడా మొదటి మూడున్నర సంవత్సరాల భయంకర శ్రమల వలన బాధింపబడతారు. కానీ ఆ సమయంలో వారు యేసే తమను రక్షించునను సత్యాన్ని అంగీకరిస్తారు. అంతయును మహాశ్రమల మొదటి మూడున్నర సంవత్సరాలలో ఇశ్రాయేలీయులు తమ పాపము నుండి రక్షణ పొందుకుంటారు. మహాశ్రమల కాలంలో కూడా దేవుడు ఇశ్రాయేలీయులను పాపము నుండి విమోచింపబడుటకు అనుమతినిచ్చును అని మనం తప్పక గుర్తించాలి.

వచనం 3 : నేను నా యిద్దరు సాక్షులకు అధికారము ఇచ్చెదను. వారు గోనెపట్ట ధరించుకొని వెయ్యిన్ని రెండు వందల ఆరువది దినములు ప్రవచింతురు.

దేవుడు ప్రాముఖ్యంగా తన దాసులను ఇద్దరిని సాక్షులనుగా ఇశ్రాయేలీయుల కొరకు లేపును. ఇశ్రాయేలీయుల కొరకు లేపబడిన వారైన ఇద్దరు ప్రవక్తలు. పాత ప్రవక్త వలే రెండింతల శక్తి కలవారై తమ సాక్ష వాక్యము ద్వారా దేవుడు ఇశ్రాయేలు ప్రజల మధ్య క్రియ జరిగించ ఆరంభించును. కనుక వారు యేసుక్రీస్తును స్వంత రక్షకునిగా అంగీకరించెదరు. ఈ ఇద్దరి ప్రవక్తల క్రియల ద్వారా అనేకమంది ఇశ్రాయేలీయులు నిజముగా తిరిగి జన్మించిన దేవుని ప్రజలుగా మారతారు.

ఇశ్రాయేలీయులను వారి పాపము నుండి రక్షించుటకు అంత్యకాలంలో దేవుడు పంపబోవు వారైన ఇద్దరు ప్రవక్తలు. అద్భుతమును ఆశ్చర్యకార్యాలను జరిగించి, ఈ ప్రవక్తచే నడిపింపబడువారిగా ఆయన ఇశ్రాయేలీయులను చేసి క్రీస్తు నొద్దకు వచ్చి ఆయనే తమ స్వంత రక్షకుడని విశ్వసింప చేయును.

ఈ ఇద్దరు ప్రవక్తలు మహాశ్రమ మొదటి మూడున్నర సంవత్సర దినములలో ఇశ్రాయేలీయులకు దేవుని వాక్యాన్ని 1,260 దినాలు అందిస్తారు. ఇశ్రాయేలీయులకు నీరు మరియు ఆత్మమూలమైన సువార్తనిచ్చి వారు దానిని విశ్వసించునట్లు చేసి, కొత్తనిబంధనకాలంలో విశ్వాసం ద్వారా తమ పాపాలన్నిటి నుండి రక్షింపబడిన అన్యజనులకు కలిగిన రక్షణనే దేవుడు ఇశ్రాయేలీయులకిచ్చును.

వచనం 4 : వీరు భూలోకమునకు ప్రభువైన వాని యెదుట నిలుచుచున్న రెండు ఒలీవచెట్లును దీపస్తంభములునైయున్నారు.

ఆ రెండు ఒలీవ చెట్లు ఒక్కడ దేవుని ఇద్దరు ప్రవక్తలను (ప్రకటన 11:10) సూచిస్తుంది. ఆ రెండు దీవస్తంభములు మరొక ప్రక్క అన్యజనుల నుండి ఆయన కనుగొన్న దేవుని సంఘమును సూచించును. ఆ సంఘమే ఇశ్రాయేలు ప్రజలకై అనుమతివ్వబడిన సంఘము. దేవుడు ఈ సంఘాన్ని మనకు మరియు యూదులకు కూడా ఆ సంఘమును నిర్మించెను. మరియు ఆయన అంత్యదినముల వరకూ పాపము నుండి ఆత్మలను రక్షించు క్రియలను కొనసాగించును.

ఆ రెండు ఒలీవ వృక్షములు మరియు రెండు దీపస్తంభముల ద్వారా పాత నిబంధన కాలంలో ఆయన తన ప్రవక్తను లేపి ఇశ్రాయేలీయులను పాపము నుండి రక్షించుట జరిగించిన, క్రియలవలనే. అంత్యకాలములో కూడా ప్రవక్తల ద్వారా మాటలాడును. తన వాక్యమును బోధించగల ఇద్దరు ప్రవక్తలను ఆయన ఇశ్రాయేలీయుల నుండి తప్పక లేపును. ఈ ప్రవక్తల ద్వారా ఇశ్రాయేలీయులను యేసునొద్దకు నడిపించును. అన్యులనుండి వచ్చిన దేవుని దాసులను ఇశ్రాయేలీయులు సత్యముగా స్వీకరించుటలో తప్పిపోయిరి. మరియు వారు దేవుని దాసులు. తమతో ఏమి చెప్పగోరుచున్నారో కూడా వినలేదు. వారు పాత నిబంధన యొక్క బలి అర్పణము వ్యవస్థ మరియు ప్రవచనమును గూర్చి పూర్తిగా తెలిసికొన్నట్లే. అంత్యకాల దేవుని వ్రపక్తలు కూడా ఇశ్రాయేలు స్వంత ప్రజల నుండే లేపబడవలసి ఉన్నది. ఇశ్రాయేలీయులు లేఖనము పూర్ణ జ్ఞానము కలవారై పరిగెడుచున్నవారి వలే తమ ధర్మశాస్త్రాన్ని నెమరవేస్తారు. ఇందువలన వారు అన్యులైన దేవుని దాసులు చెప్పువాటిని నమ్మరు.

కానీ దేవుని దాసులు నీవు నేను ఇప్పుడు బోధించుచున్న నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను విని తమ స్వంత ప్రజల నుండి లేచెదరు. తమ స్వజనుల నుండే నీరు మరియు ఆత్మమూలమైన సువార్త విని తమ స్వంత ప్రజల నుండి లేచెదరు. తమ స్వజనుల నుండే నీరు మరియు ఆత్మమూలమైన సువార్త విశ్వాసులు లేచినప్పుడు దేవునిచే స్థాపింపబడిన వారైన ఇద్దరు ప్రవక్తలు వారి నుండి లేస్తారు. వారు ఇశ్రాయేలీయులకు దేవుని వాక్యాన్ని భోధించి వివరించగలరు. అప్పుడే ఇశ్రాయేలీయులు విశ్వసించ మొదలు పెడతారు.

అంత్యకాలములో తమను పాపము నుండి రక్షించుటకు దేవుడు తానే ఇద్దరు ప్రవక్తలనే సాక్షులను పంపెనని ఇశ్రాయేలు ప్రజలు తెలుసుకుంటారు. ఈ ప్రవక్తలు తమ గొప్ప శక్తిని ఇశ్రాయేలీయులకు తెలిసిన మరియు నమ్మకమైన పాతనిబంధనలోని ప్రవక్తవలే క్రియావంతం చేస్తారు. కనుక ఇశ్రాయేలీయులు ఆ ఇద్దరు ప్రవక్తలు వాస్తవంగా జరిగించు శక్తివంతమైన అద్భుతాలను చూస్తారు. వాటి నుండి ఇశ్రాయేలీయులు క్రీస్తు నొద్దకు తిరిగి ప్రభువును విశ్వసిస్తారు. 

వారు యేసుక్రీస్తును దేవుని కుమారునిగాను తమ రక్షకునిగాను గుర్తించినప్పుడు మనం కలిగియున్నట్లే. మనకు కలిగిన విశ్వాసాన్ని వారు కలిగి ఉంటారు. అనగా వారు కూడా నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను విశ్వసించుట వలన రక్షింపబడతారు.

ఈ ఇద్దరు సాక్షులు ఏడు సంవత్సరాల కాలంలోనే మహాశ్రమల దినాల్లో ఇశ్రాయేలు ప్రజలకు 1,260 దినాలు దేవుని వాక్యాన్ని వివరించి దానిని వారికి బోధిస్తారు. నీవు నేను నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను విశ్వసించుట ద్వారా రక్షింపబడిన వారైన క్రొత్త నిబంధన సమయము యొక్క అన్యులవలే ఇశ్రాయేలీయులను కూడా నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను అంత్యకాలములో విశ్వసించుట ద్వారా రక్షింపబడుటకు దేవుడు అనుమతినిచ్చును.

4వ వచనం మనతో చెప్పినట్లు ‘‘వీరు భూలోకమునకు ప్రభువైన వాని యెదుట నిలుచున్న రెండు ఒలీవ చెట్లును దీపస్తంభమునైయున్నారు” బైబిల్‌ ఈ ఇద్దరు సాక్షులను ‘‘రెండు ఒలీవ చెట్లని” పిలుచుచున్నది. 10వ వచనంలో ఇలాగు వ్రాయబడింది. ‘‘ఈ ఇద్దరు ప్రవక్తలు భూనివాసులను బాధించినందున భూనివాసులు దాని గతి చూచి సంతోషించుచు, ఉత్సహించుచు, ఒకనినొకడు కట్నము పంపుకొందురు.’’ ఇక్కడ మనం ఆ ఒలీవ చెట్లు ఎవరను విషయాలన్నీ గమనించుట ద్వారా ఈ వాక్యం అర్థం రాబట్టవచ్చును.

పాత నిబంధన కాలంలో ఒలీవ చెట్లను ప్రాంగణము మరియు పరిశుద్ధ స్థలములోని ఉపకరణములను అలంకరించుటకు వాటిని దేవుని దేవాలయములో అభిషేకించుటకై ఒలీవ నూనెను ఉపయోగించేవారు. అలాగే ఒలీవ నూనెను ఇతర అవసరాలకు కూడా వినియోగించేవారు. దేవాలయ దీపమును వెలిగించుటకు, దేవాలయంలో వారు కల్తీలేని ఒలీవ నూనెను ఉప యోగించవలెను. దేవుడు ఏదో ఒక నూనెను తన ఆలయంలో ఉపయోగించుటకు అనుమతించలేదు కానీ కేవలము ఒలీవ నూనెను వాడునట్లు చేసెను. కనుక ఒలీవ చెట్లు, అంజూర చెట్లు ఇశ్రాయేలు ప్రజలను సూచించునని మనం తెలిసికోవాలి.

ఆ రెండు వృక్షములు మరియు దీపస్తంభములను గూర్చి అనేక విధాలైన అస్వయాలు ఉన్నాయి. కొంతమంది అవి ఒలీవచెట్లే అని వాదించువారు కలరు. పాత నిబంధన కాలంలో ప్రజలు ప్రవక్తగానో, రాజుగానో లేదా బోధకునిగానో స్థిరపడునప్పుడు అభిషేకింపబడతారు. అట్లు ఒకరు అభిషేకింపబడినప్పుడు అతను/ఆమె మీద పరిశుద్ధాత్మ దిగి వచ్చేది. అలాగే ఒలీవ చెట్లు పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించబడిన (రోమా 11:24) యేసుక్రీస్తును సూచించును. కానీ ప్రజలకు ఈ విషయంపై ఎన్నో అపార్థములు కలవు.

ఏదేమైనా : ఆ రెండు ఒలీవ చెట్లు ప్రధాన వృత్తాంతంలో క్రోడీకరించబడిన ఇద్దరు సాక్షులు. దేవుని దాసులైన వారు అంత్యకాలంలో ఇశ్రాయేలీయులను రక్షించుటకై ఆయన వారిని లేపును.

ఇదే వచనం 4 మనతో చెప్పుచున్నది. ఇక్కడ రెండు దీపస్తంభములు దేవుడు అనుమతించు అన్యజనుల మధ్య నున్న దేవుని సంఘము మరియు ఇశ్రాయేలీయులకు అనుమతించబడిన సంఘము. పాతనిబంధన కాలంలో ఇశ్రాయేలీయులు వాస్తవంగా దేవుని ఆలయాన్ని కలిగియున్నారు. కానీ క్రొత్త నిబంధన కాలం నుండి వారికి ఈ దేవుని ఆలయము లేదు. ఎందుకని ? వారు ఇంకనూ యేసుక్రీస్తును గుర్తించాలి. మరియు వారి హృదయాలలో పరిశుద్ధాత్మను కలిగి లేరు.

ఎందుకనగా వారు క్రీస్తునైననూ లేదా నీరు మరియు ఆత్మమూలమైన సువార్తనైననూ అంగీకరించిన వారు కారు. ఏమైననూ లోకం అంతమగుటకు ముందు మహాశ్రమలో మొదటి మూడున్నర సంవత్సరాల కాలంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు కూడా తన సంఘము ఉండనధికారము నిచ్చెను.

అందుకనే ఈ రెండు ఒలీవ చెట్లు ఇద్దరు సాక్షులని మనతో చెప్పుచున్నది. ప్రభువు యూదులు మరియు అన్యులమైన మన మధ్యలో కూడా తన సంఘమును స్థాపించి పాపము నుండి ఆత్మను రక్షించుట అను తన క్రియలను తప్పక చేయును. మరియు ఈ సంఘము ద్వారా అంత్యక్రీస్తు బయల్పడు వరకూ ఆత్మకార్యమైన పాపం నుండి ఆత్మను రక్షించుట ఆయన వాటి ద్వారా జరిగించును. అనగా దేవుడు పాత్రలను పరిశుద్ధుల నుండి తన సంఘము నుండి పాపములో తప్పిపోవును. ఆత్మలను రక్షించుట అను సేవను జరిగించును. కనుక మనము విశ్వాసంతో చురుకుగా ఈ పనిని తప్పక చేయాలి.

వచనం 5 : ఎవడైనను వారికి హానిచేయనుద్దేశించిన యెడల వారి నోట నుండి అగ్ని బయలువెడలి వారి శత్రువును దహించివేయును. గనుక ఎవడైనను వారికి హానిచేయనుద్దేశించిన యెడల ఆలాగునవాడు చంపబడవలెను.

ఈ అధికారమును దేవుడు ఇద్దరు ప్రవక్తలకు ఇచ్చినది ఎందుకనగా వారు తమ ప్రత్యేక సేవను చేయుటకు అంత్యకాలములో ఇశ్రాయేలీయులు పశ్చాత్తాపపడి సాతానును జయించునట్లు తయారుచేయుటకు ఆ సాక్షులను చంప ప్రయత్నించువారు తమకే హాని చేసికొనును. ఎందుకనగా 

దేవుని వాక్య అధికారము ఈ సాక్షులతో కూడా ఉండెను. అలాగే ఇశ్రాయేలు ప్రజలు ఈ ఇద్దరి ప్రవక్తల బోధను విశ్వసించి యేసుక్రీస్తు వైపుకు తిరుగుతారు. అందువలనే ఆ ఇద్దరు ఒలీవలను దేవుడు చేయనిచ్చును. అనగా ఆ ఇద్దరు సాక్షులు ఇశ్రాయేలీయులకు ఎందుకనగా వారు కూడా అంత్యకాలములో రక్షింపబడుటకే.

వచనం 6 : తాము ప్రవచింపు దినము వర్షము కురవకుండ ఆకాశమును మూయుటకు వారికి అధికారము కలదు. మరియు వారికిష్టమైనప్పుడెల్ల నీళ్లు రక్తముగా చేయుటకును, నానా విధములైన తెగుళ్లతో భూమిని బాధించుటకును వారికి అధికారము కలదు.

దేవుని దాసులైన వారికి ఆశ్చర్యక్రియలు చేయు శక్తిని ఇవ్వకపోతే ఇశ్రాయేలు జనాంగం పశ్చాత్తాపపడరు. కనుక దేవుడు ఆ ఇద్దరు ప్రవక్తలను ఆయన శక్తితో పనిచేయ అనుమతించును. ఆ ప్రవక్తలు కేవలము ఇశ్రాయేలీయులను యేసువైపుకు నడిపించుటే కాక దేవుని శత్రువును అధికారంతో జయిస్తారు. మరియు వారి పిలుపు తగిన క్రియలను నెరవేరుస్తారు. దేవుడు వారికి ప్రత్యేకమైన అధికారమునిచ్చును. కనుక వారు ఇశ్రాయేలు ప్రజలందరికి దేవుని ప్రవచనాలన్నిటిని బోధించి వారు ఎప్పటి నుండో ఎదురుచూస్తున్న యేసయ్య క్రీస్తేనని సాక్ష్యమిస్తారు. వారు విశ్వసించునట్లు చేస్తారు.

వచనం 7: వారు సాక్ష్యము చెప్పుట ముగింపగానే అగాధములో నుండి వచ్చు క్రూరమృగము వారితో యుద్ధము చేసి జయించి వారిని చంపును. ఏడు సంవత్సరాల మహాశ్రమల కాలము నందలి మొదటి మూడున్నర సంవత్సరముల కాలము గడవగానే ఈ లోకములో అంత్యక్రీస్తు ప్రత్యక్షమగునని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ఆ సమయంలో ఇశ్రాయేలు జనులలో నుండి ఎంతోకాలంగా నిరీక్షిస్తున్న మెస్సయ్య యేసుక్రీస్తుని గుర్తించు వారులేస్తారు. కానీ వారిలో అనేకులు క్రూరమృగమైన అంత్యక్రీస్తు మరియు అతని అనుచరులుచే హతసాక్షులవుతారు. దేవుని పిలుపునకు తగిన క్రియలను పూర్తిచేయగా దేవుని ప్రవక్తలు కూడా హతసాక్షులవుతారు.

అంత్యక్రీస్తుచే ఈ ఇద్దరు సాక్షులు చంపబడబోవుట కూడా దేవుని చిత్తానుసారమే. ఎందుకు? ఎందుకనగా దేవుడు వారికి కూడా తన మతసాక్షులకిచ్చు బహుమానాన్నివ్వాలని కోరుకొనెను. ఆ బహుమానమేమనగా మొదటి పునరుత్ధానంలో పాల్గొనుట. గొర్రె పిల్ల వివాహ విందులో ప్రభువుతో కలిసికొనుట ఎల్లప్పుడూ ఆనందించుచూ, నిత్యజీవమును పొందుట. ఈ దీవెనలను పరిశుద్ధులందరికి ఇవ్వగోరిన దేవుడు వారు తమ విశ్వాసము కొరకు హతసాక్షులగుటకు లేదా భయపడకూడదు. కానీ బదులుగా స్థిర విశ్వాసముతో దానిని కౌగలించి వారి దీవెనకరమైన బహుమానమును పొందుకొనాలి.

వచనం 8 : వారి శవములు ఆ మహాపట్టణపు సంత వీధిలో పడియుండును. వానికి ఉపమానరూపముగా సొదొమ అనియు ఐగుప్తు అనియు పేరు అచ్చట వారి ప్రభువు కూడా సిలువ వేయబడెను.

‘‘ఆ ఇద్దరు సాక్షులు” ఖచ్చితంగా ఇశ్రాయేలీయులై ఉంటారని ఈ వచనం చెప్పుచున్నది. దేవుడు ఇశ్రాయేలీయుల కొరకు లేపబోవు ఆయన దాసులు అన్యజనుల నుండి కాక ఇశ్రాయేలీయుల కొరకు లేపబోవు ఆయన దాసులు అన్యజనుల నుండి కాక ఇశ్రాయేలు స్వంత జనుల నుండి వచ్చును. అలాగే ఈ ఇద్దరు సాక్షులు యేసుక్రీస్తు సిలువ వేయబడిన స్థలములోనే చంపబడతారు. ఈ సత్యము ఆ ఇద్దరు సాక్షులు కేవలం ఇశ్రాయేలీయులని స్పష్టం చేస్తుంది. ఇశ్రాయేలు జనుల కొరకే వారు దేవునిదాసులు.

ఇశ్రాయేలీయులకు ఆత్మీయంగా సొదొమ మరియు ఐగుప్తు ప్రజల వలే దేవుడు తన ఇద్దరు ప్రవక్తలను స్థాపించును. వారికి అధికారమిచ్చి ఇశ్రాయేలీయులు ఎదరుచూస్తున్నా మెస్సయ్య యేసు అని సాక్ష్యమిచ్చునట్లు చేయును. కనుక ఇశ్రాయేలు ప్రజలు, పశ్చాత్తాపపడి క్రీస్తును విశ్వసిస్తారు.

ఆ అంత్యక్రీస్తు దేవుని దాసులనిద్దరిని గొల్గొత అను స్థలములో చంపును. అక్కడే క్రీస్తు కూడా సిలువ వేయబడెను. అంత్యక్రీస్తు అనుచరులు దురాత్మలు కలవారు కనుక యేసును విశ్వసించి ఆయన కొరకు సాక్ష్యమిచ్చిన ఇద్దరు సాక్షులను చంపునంతగా ద్వేషించును. క్రీస్తును సిలువవేసి బల్లెముతో ఆయన ప్రక్కను పొడిచిన రోమా సైనికుల వలే దురాత్మలు కలవారై క్రీస్తును మాత్రమే కాక దేవుని సాక్షులను కూడా ద్వేషించి వారిని చంపుతారు.

వచనం 9: మరియు ప్రజలకును, వంశముకును, ఆ భాషలు మాటలాడువారికిని, జనముకును సంబంధించినవారు మూడు దినములన్నర వారి శవమును చూచుచు వారి శవమును సమాధిలో పెట్టనియ్యరు.

ఇశ్రాయేలు జనులలో కూడా క్రీస్తును వారి రక్షకునిగా అంగీకరించని వారు ఉంటారు. దాసులు ఇద్దరి (రెండు ఒలీవ చెట్లు) శారీరక మృతిని చూచుచు ఈ ప్రజలు సంతోషముతో ఉప్పొంగిన వారై ఈ విజయానందాన్ని పెంపొందించుకొనుటకు ఈ బాధితులను సరిగా సమాధి చెయ్యనియ్యరు. కానీ దేవుడు ఈ సాక్షులిద్దరినీ జీవింపచేయగా వారి విజయము ముక్కలుగా చేయబడును. కనుక దాని వలన వారు దేవునికి భయపడతారు.

దేవుని దాసులు మరణాన్ని బట్టి వారు ఒకరినొకరు అభినందించుకొంటారు. కానీ అది ఎంతోసేపు నిలువదు ఎందుకనిన అంత్యక్రీస్తు. యేసుకు సరిపోడని వారు త్వరలోనే గుర్తిస్తారు. నిరాశ, నిస్పృహలు వారిని ఆవహిస్తాయి.

ఈ ప్రజలు దేవుని దాసులచే బోధింపబడిన దేవుని ప్రవచన వాక్యాన్ని ఇష్టపడరు. దేవునిచే లేపబడిన వారైన దాసులకు వారు వ్యతిరేకంగా నిలుస్తారు. అందువలన వారు ఆఖరి రక్షణ అను పంట నుండి కోయబడక తప్పిపోయి సాతాను అనుచరులుగా అంతమవుతారు.

వచనం 10: ఈ యిద్దరు ప్రవక్తలు భూనివాసులను బాధించినందున భూనివాసులు వారి గతి చూచి సంతోషించుచు, ఉత్సహించుచు ఒకనికొకడు కట్నము పంపుకొందురు.

ఇశ్రాయేలీయుల రక్షణ కొరకై నియమింపబడిన ఇద్దరు సాక్షులు దేవుని ప్రవచనవాక్యాన్ని బోధించుచుండగా సాతాను అనుచరులకు గొంతు నొప్పి కలిగించువారై యుంటారు. అందువలన ఈ ఇద్దరు సాక్షులు మరణించగా సంబరపడి ఒకరినొకరు బహుమానములిచ్చుకొని అభినందించుకొందురు. మనము కూడా మనలను బాధించువారు లేకుండా పోయినప్పుడు సంతోషిస్తాం. దేవునిచే నియమింపబడి ఆయన వాక్యాన్ని, ఈ ఇద్దరు సాక్షులు బోధించునప్పుడు అంత్యక్రీస్తు అతని అనుచరుల చర్యలను అసహ్యించుకొంటారు. దేవుని వాక్యాన్ని విన్న ప్రతిసారి వారి హృదయాలు బాధతో నిండుతాయి. ఎట్లనగా ఈ ఇద్దరు సాక్షులు యేసును గూర్చి వారితో మాట్లాడిన ప్రతిసారి ఎంతో బాధింపబడుతూ ఉన్నారు. కనుక అంత్యక్రీస్తు వారిని చంపమన్నప్పుడు అంతే ఆనందాన్ని పొందుతారు. అందుచేత వారు బహుమానాలను, అభినందనలను ఇచ్చిపుచ్చుకొంటారు.

వచనం 11 : అయితే ఆ మూడుదినములన్నరయైన పిమ్మట దేవుని యొద్ద నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించెను గనుక వారు పాదములు ఊని నిలిచిరి. వారిని చూచిన వారికి మిగుల భయము కలిగెను.

దేవుడు ఈ ఇద్దరు సాక్షులను మొదటి పునరుత్ధానంలో పాల్గొనుటకు అనుమతించును. ప్రభువుచే ఇవ్వబడిన రక్షణ వాక్యమును విశ్వసించుట ద్వారా పాపము నుండి రక్షింపబడిన తరువాత తమ విశ్వాసాన్ని కాపాడుకొనుటకు హతసాక్షులైన పరిశుద్ధులు మొదటి పునరుత్ధానంలో పాల్గొందురని సత్యమునకు ఈ వాక్యము సాక్షి. ‘‘మూడు దినములున్నర తరువాత” జీవవాయువు వారిలో ప్రవేశించెను. అను వాక్యం మనకు ప్రభువు కొంతసేపటికే వారికి జీవమునిచ్చును. అది తన శరీర మరణము నుండి మూడవ దినమున లేచినట్లే ఉండును. దేవుడు విశ్వాసులందరికీ మొదటి పునరుత్ధానం అనుగ్రహించుట. పరిశుద్ధులకు దేవుని యొక్క గొప్పదీవెన కాగా పాపులందరికీ అది గొప్ప హృదయావేదనను భయమును కలిగించును. పరిశుద్ధులు మొదటి పునరుత్ధానము వారి విశ్వాసమునకు దేవుని వాగ్ధానము మరియు ఆయన బహుమానమునై ఉన్నది.

వచనం 12 : అప్పుడు ఇక్కడకి ఎక్కిరండని పరలోకము నుండి గొప్ప స్వరము తమతో చెప్పుట వారు విని, మేఘారూఢులై పరలోకమునకు ఆరోహణమైరి. వారు పోవుచుండగా వారి శత్రువులు వారిని చూచిరి.

ఈ వచనము పరిశుద్ధులందరి పునరుత్ధానాన్ని ఎత్తబడుటను ఎత్తిచూపుచున్నది. ప్రభువు యొక్క ప్రవచన వాక్యాన్ని విశ్వసించి తమ పాపములన్నిటి నుండి రక్షింపబడిన వారు ఏ అవకాశము లేని వారై వారి విశ్వాసమును కాపాడుకొనుటకు హతసాక్షులవుతారు. అట్టి పరిశుద్ధులందరిని పునరుత్ధానపరచి ప్రభువు కొనిపోవునని ఈ వాక్యం మనతో చెప్పుచున్నది. దేవుని దాసులు, పరిశుద్ధులు ఎవరైతే ఆయనకు విశ్వాసులై హతసాక్షులవుతారో, వాయు మండలమునకు కొనిపోబడుట అను దీవెనలను పొందుతారు. ఎందుకనగా వారికి ప్రభు నందు విశ్వాసం ఉంది. ఆయన మనకనుగ్రహించిన పాప పరిహారమునందు విశ్వాసముంచి రక్షింపబడిన తరువాత హతసాక్షులమగుట వలన ప్రభువు బహుమానంగా మనకిచ్చిన పునరుత్ధానము మరియు ఎత్తబడుటను గూర్చి ఏమియూ చేయలేనివారమై ప్రభువుకు కృతజ్ఞతనర్పించుదుము.

యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహింపబడిన ఈ నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను విశ్వసించుట వలన హతసాక్షులై అంత్యక్రీస్తుకు వ్యతిరేకంగా నిలిచిన వారందరినీ తండ్రియైన దేవుడు పునరుత్ధానపరచి కొనిపోవును. మనము ఈ సత్యమును తప్పక నమ్మాలి. దేవునిచే అనుగ్రహింపబడిన నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను విశ్వసించుట వలన పరిశుద్ధులకు పునరుత్ధానము మరియు ఎత్తబడుట అను దీవెనలు ప్రవాహముగా అనుగ్రహింపబడెను. అంత్యకాలములో సాతాను మరియు అతని అనుచరులు తమ ప్రయత్నము అంతా సన్నని మేఘపు పొరలాగా ఆవిరి అగును. ఎప్పుడును వారు హింసించి చంపిన వారు పునరుత్ధానులై ఎత్తబడినప్పుడు.

దేవుడు తప్పక హతసాక్షులైన పరిశుద్ధులను పునరుత్ధానపరచి కొనిపోవును. కానీ అప్పటికీ ఈ భూమిపై నివసించుచున్న వారిని ఏడు పాత్రల తెగుళ్ళు కుమ్మరించుటతో నాశనపరచును. ఈ క్రియలు త్వరగా పూర్తయినప్పుడు పరిశుద్ధులతో కూడా ఆయన భూలోకమునకు దిగివచ్చి క్రీస్తు వివాహ విందుకై నీతిమంతులను ఆహ్వానించును. మన ప్రభువు ఈ విందును వెయ్యి సంవత్సరములు జరిగించును. ఈ వెయ్యేండ్లు గడచినప్పుడు సాతానును అగాధము నుండి లేచుటకు దేవునితోను ఆయన పరిశుద్ధులతోనూ పోరాడనిచ్చును కానీ తద్వారా ఆయన సాతానును అతని అనుచరులను నాశనం చేసి నిత్యనరకాగ్నిలో త్రోయబడునట్లు తీర్పునిచ్చును. ఆ నీతిమంతులు ప్రభువు రాజ్యమైన పరలోకంలో ప్రవేశించి ఆయనతో సదాకాలము జీవిస్తారు.

వచనం 13: ఆ గడియలోనే గొప్ప భూకంపము కలిగినందున ఆ పట్టణములో పదియవభాగము కూలిపోయెను. ఆ భూకంపము వలన ఏడువేల మంది చచ్చిరి. మిగిలిన వారు భయక్రాంతులై పరలోకపు దేవుని మహిమపరచిరి.

ఇశ్రాయేలీయులు రక్షణ కొరకు దేవుడేర్పరచిన ఇద్దరు సాక్షులు హతసాక్ష్యము. పునరుద్ధానము కొనపోబడుట జరిగిన తర్వాత ఆయన ఏడు పాత్రల తెగుళ్ళను కుమ్మరించుటకు తన దూతలను ఆజ్ఞాపించును. పరిశుద్ధులు ఎత్తబడిన తర్వాత భూమిపై శేషించినవారు ఈ ఏడు పాత్రల తెగుళ్ళను తమ బహుమతులుగా స్వీకరిస్తారు. అప్పుడే వారు భయక్రాంతులైన దేవుని ప్రేమనందు గల నిజ విశ్వాస క్రియ కాదు.

ఈ లోకం నాశనం చేయబడినప్పుడు నిత్యనరకాగ్ని వలన కలుగుబాధను పొందుతారు. ఇందువలననే ప్రతివారు నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను విశ్వసించి తమ పాప పరిహారమును పొందాలి. మరియు దేవుడు వాగ్ధానమిచ్చిన నూతనలోకమును విశ్వసించుట వలన తమ పాపము నుండి విడిపింపబడిరి కనుక వారు ప్రతి వారికి నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను బోధించాలి.

వచనం 14 : రెండవ శ్రమ గతించెను. ఇదిగో మూడవ శ్రమ త్వరగా వచ్చుచున్నది. అన్యజనులకు ఇశ్రాయేలీయులకు ఇద్దరిలోనూ తమ హతసాక్ష్యము ద్వారా రక్షింపబడి పునరుత్ధానము మరియు కొనిపోబడుటలో పాల్గొనని ప్రతి వారి కొరకు దేవుని నుండి వచ్చుమూడవ శ్రమ ఎదురు చూచుచుండును.

ఆరవ బూరను దూత మ్రోగించగా వచ్చిన తెగులు నుండి ఏడవ దూత బూరనూదగా మొదలైన ఏడు పాత్రల తెగుళ్ళ వరకూ జరిగినదంతయూ రెండవ శ్రమ. ఏడు బూరల తెగుళ్ళు మూడు కాలములుగా విభజించబడెను. మొదటిది మధ్య మరియు ఆఖరి కాలము. సహజ తెగుళ్ళు అంత్యక్రీస్తుచే జరిగింపబడు హతసాక్ష్యము మొదటి, రెండవ శ్రమలో ఇమిడి యుండెను. మరొక పక్క మూడవ శ్రమ భూమిపై మిగిలియున్న పాపులకై కుమ్మరింపబడబోవు దేవుని ఉగ్రతా పాత్రయైయున్నది.

వచనం 15 : ఏడవ దూత బూర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్ధము పుట్టెను. ఆ శబ్ధము ఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యము నాయెను. ఆయన యుగయుగముల వరకు ఏలుననెను.

‘‘పరలోకములో గొప్ప శబ్ధము” అను వాక్యము. ఈ లోకములో ఏడు పాత్రల తెగుళ్ళు సమయమునకు ముందే పరలోకములోనున్న తమ పాపములన్నిటి నుండి రక్షింపబడిన దేవుని దాసులను పరిశుద్ధులను చూపుచున్నది. ఎట్లనగా ఈ సమయమునకు దేవుని ప్రజలు ఈ లోకములో ఇక కనబడరు. మనం దీనిని తప్పక గుర్తించాలి. ఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యమునాయెను. ఆయన యుగయుగముల వరకు ఏలుననెను.

ఈ సమయంలో పరిశుద్ధులు పరలోకంలో ప్రభువును స్తుతిస్తారు. కానీ ఏడు పాత్రల తెగుళ్ళన్నీ కుమ్మరింపబడిన తర్వాత వారు నూతన పరచబడిన భూమి మీదికి ప్రభువుతోకూడా దిగివచ్చి, ఈ లోకంలో ఆయనతోపాటు రాజ్యపాలన చేస్తారు. అప్పుడు దీనిని అనుసరించి ప్రభువు మరియు పరిశుద్ధుల నూతన ఆకాశ, భూమిలో సదాకాలము పరిపాలన చేస్తారు.

అన్నిటి వరకూ ప్రభువు మనలను రాజుగా పరిపాలించుటకు బదులుగా దాసునివలే మనకు పరిచర్యచేసి పాపము నుండి మనలను విమోచించెను. మనకు తన కృపను కుమ్మరించి, నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను తమ రక్షణగా విశ్వసించిన వారిని దేవుని పిల్లలనుగా చేసెను. మన ప్రభువు మనకు మహిమ రాజైయుండగా ఆయనే తన ప్రజలను సదాకాలము పరిపాలకులుగా చేయును. హల్లెలూయ! ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు.

వచనం 16 : అంతట దేవుని యెదుట సింహసనాసీనుడగు ఆ యిరువది నలుగురు పెద్దలు సాష్టాంగపడి దేవునికి నమస్కారము చేసి సమస్త మహిమ పొందుటకు దేవుడే అర్హుడు. తమ పాపములన్నిటి నుండి రక్షింపబడిన వారందరికీ సాష్టాంగపడి ఆరాధించి ఆయనను స్తుతించుటయే సరియైనది. మన ప్రభువే పాపులందరినీ రక్షించు క్రియ జరిగించినవాడై యుగయుగములు సమస్త సృష్టి మరియు సమస్త పరిశుద్ధుల ఆరాధనను, స్తుతులను అందుకొనుటకు అర్హుడైయున్నాడు.

వచనం 17 : వర్తమాన భూత కాలములో దేవుడవైన ప్రభువా సర్వాధికారీ, నీవు నీ మహాబలమును స్వీకరించి యేలుచున్నావు. గనుక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. అప్పటి నుండి తన ప్రజలతో ఏలుటకై, మన ప్రభువు సాతానును జయించి, తండ్రియైన దేవుని నుండి గొప్ప అధికారము పొందును.

ఆ విధంగా ప్రభువు సదాకాలము ఏలును. ఆయనే ఆలాగు చేయుటకు సమర్థుడు. నేను ఆయనకు మహిమ చెల్లిస్తాను. ఎట్లనగా ప్రభువే లోక పాపములన్నిటిని తొలగించెను. నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను విశ్వసించిన వారిని అందరినీ రక్షించెను. ఆయన శత్రువులకు తీర్పునిచ్చెను. ఆయన న్యాయాధికారమును తీసికొనుటకు అర్హుడయ్యెను. మరియు యుగయుగములు పరిపాలించును. అలాగే దేవుని సర్వాధికారాన్ని గుర్తించిన వారంతా ప్రభుని మహిమా ప్రభావము మరియు ప్రేమతో యుగయుగములు దేవుని స్తుతించుటకు మహిమ వస్త్రము ధరించెను.

వచనం 18 : జనము కోపగించినందున నీకు కోపము వచ్చెను. మృతులు తీర్పు పొందుటకును, నీ దాసులగు ప్రవక్తలకును పరిశుద్ధులకును, నీ నామమునకు భయపడువారికిని తగిన ఫలమునిచ్చుటకును, గొప్ప వారేమీ, కొద్దివారేమీ భూమిని నశింపజేయువారిని నశింపజేయుటకును సమయము వచ్చియున్నదని చెప్పిరి.

ఏడు పాత్రల తెగుళ్ళు కుమ్మరింపబడగా ఆ ప్రయత్నంగానే ఇప్పుడు ఆత్మీయంగా అన్యజనులైన వారి శరీరము యొక్క నాశనము వచ్చును. అప్పుడు సమస్తమునకు న్యాయాధిపతిగా దేవుడు ప్రతివారికి తీర్పు తీర్చు సమయం ఆసన్నమగును. ఆయనను అంగీకరించిన వారిని పరిశుద్ధులను, ప్రవక్తలను, తన దాసులను సన్మానించును. మరియు ఆయన చిత్తమునకు ఆయనకు వ్యతిరేకులై అవిధేయులైన వారిని నాశనపరచునని ఈ వచనం మనకు తెలుపుచున్నది. తన సర్వాధికారమును గుర్తించని వారిపైకి తన శిక్ష యొక్క తీర్పును మన ప్రభువు తీర్పును కానీ తన పరిశుద్ధులను తనతో కూడా మహిమ పరచును. అనగా మన ప్రభువు మంచికి చెడుకు సమస్తమునకు న్యాయాధిపతి అయ్యెను.

మన ప్రభువు తిరిగి జన్మించిన వారి యొక్క రాజువలే సింహాసనాసీనుడై ప్రతివారికి తీర్పు తీర్చునప్పుడు లోకము యొక్క నీతిమంతులు పాపులు సరియైన తీర్పును పొందుతారు. ఆ సమయంలో ఆయన తీర్పునకు ప్రతిగా ప్రభువు పరిశుద్ధులకు పరలోకమును, నిత్యజీవమును అనుగ్రహించును కానీ పాపులకు ఆయన నిత్య నాశనమును, నరకశిక్షను అనుగ్రహించును. యేసుక్రీస్తు యొక్క సర్వాధికారమును ఆయన ప్రజల పరిపాలన అను దీవెనయు యుగయుగములుండును. ఈ సమయానికి మొదటి లోకం అంతమగును. కనుక క్రీస్తు రాజ్యము, రెండవ లోకము ఆరంభమగును.

వచనం 19 : మరియు పరలోకమందు దేవుని ఆలయము తెరవబడగా దేవుని నిబంధన మందసము ఆయన ఆలయములో కనబడెను. అప్పుడు మెరుపును ధ్వనులను ఉరుములను భూకంపమును గొప్ప, వడగండ్లును పుట్టెను.

దేవుడు తన పరిశుద్ధులకు, నీతిమంతులకు తన ఆలయములో నివసించు తన దీవెనను ఇచ్చును. ఇవన్నియూ యేసుక్రీస్తునందు మానవాళికి అనుగ్రహింపబడిన దేవుని వాగ్ధాన వాక్యమును అనుసరించి నెరవేరును. దేవుని రాజ్యము దేవుని ప్రవచన వాక్యముతో ఆరంభమగును. అది ఈ ప్రవచన నెరవేర్పుతో ముగింపబడును.

దేవుని వాగ్ధానాలన్నీ పరిశుద్ధులు పునరుద్ధానము ఎత్తబడుట నుండి మొదలై యేసుక్రీస్తుతో కూడా గొర్రె పిల్ల వివాహ విందులో వారు పాల్గొనుట వరకు మరియు రాజువలే సదాకాలము పరిపాలించుటకు అను దీవెన సమానంగా అన్యులైన మనము ఇశ్రాయేలీయులు ఇద్దరికీ సమానంగా అనుగ్రహించును. ఇశ్రాయేలీయులు రక్షణను అంత్యకాలములో పరిగణించినట్లే మన రక్షణను కూడా పరిగణించి మన ఇద్దరినీ ఈ కాలములో హతసాక్షులను చేయును. తర్వాత ఒకే పునరుత్ధానము. ఒకే ఎత్తబడుటకు అనుమతిచ్చును. మరియు ఒకే మహిమతో కప్పును.

శారీరకముగా అన్యులైన మనము ఇశ్రాయేలీయులు వేరైనప్పటికి ఆత్మీయంగా ఏ బేధము లేక ఒకే విధంగా ఉన్నాము. అనేకులు మహాశ్రమల కాలం మొదలగుటకు ముందే తిరిగి జన్మించినవారు ఎత్తబడుదురని వాదిస్తారు. కానీ అది వాస్తవం కాదు. బైబిలు పరంగా మాట్లాడిన మహాశ్రమల కాలమైన ఏడు సంవత్సరాల కాలంలోని మొదటి మూడున్నర సంవత్సరాలు ప్రజలు నీరు మరియు ఆత్మమూలమైన నిజ సువార్తను వినుచూ రక్షింపబడతారు. అప్పుడు అంత్యక్రీస్తు బయల్పడతాడు. పరిశుద్ధులు హతసాక్షులవుతారు. పునరుత్ధానులై వారు ఎత్తబడిన పిమ్మట క్రీస్తు గొర్రె పిల్ల వివాహోత్సవానికి హాజరై, పరిశుద్ధులకు ఆయనతో కూడా పాలించుటకు వెయ్యేండ్ల వరకు అనుమతియ్యబడును.

పరిశుద్ధులు హతసాక్ష్యము, పునరుత్ధానము మరియు ఎత్తబడుట అను కాలము యొక్క సరియైన జ్ఞానం కలిగియుండాలి. ఈ సమయాన్ని తెలిసికొనకుండా ఉంటే తికమకపడుచూ తిరుగులాడుచూ దాని వలన ఆత్మీయ మరణాన్ని పొందుతారు. దేవుని కాపుదల, అంత్యకాల నిరీక్షణ తమ పునరుత్ధానం మరియు ఎత్తబడుటను గూర్చిన విశ్వాసం యొక్క స్పష్టమైన జ్ఞానము కలవారు. సంతోషంగా సువార్తను ప్రకటిస్తారు. ఈ భూమిపై ఎట్టి నిరీక్షణ లేదనువారు కూడా నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను విశ్వసించుట ద్వారా తిరిగి జన్మించి వారికి గల విశ్వాసానికి సమమగు విశ్వాసం కలిగి ఉండాలి. మరియు పరిశుద్ధులు దేవుని వాక్యము నందు గల నమ్మికతో హతసాక్షులవుతారు.

ఆ సమయాలలో కాపాడగల విశ్వాసాన్ని తోసివేయక ఈ కాలంలో అవసరమైనది. సర్వలోకం మీదికి వచ్చుటకై భయంకరమైన తెగుళ్ళు మరియు శ్రమలు కలుగును. అంత్యక్రీస్తు బయల్పడు సమయము దాదాపు ఆసన్నం అయ్యింది. నీ నిద్ర నుండి మేల్కొనుటకు ఇదే అనుకూల సమయం మన మనస్సులో మహాశ్రమల కాలం యొక్క శ్రమలన్నిటిలో నుండి దాదాపుగా మనం జీవించాలని మనస్సులో నుంచుకోవాలి. మరియు మనం యేసు రాకడను విశ్వసిస్తున్నట్లే మన పునరుత్ధానాన్ని ఎత్తబడుటను మరియు క్రీస్తుతో కూడా గొర్రె పిల్ల వివాహ విందులో పాల్గొనుట అనువాటిని కూడా విశ్వసించాలి. ఈ యుగంలో మనం కలిగియుండాల్సిన ఖచ్చితమైన విశ్వాసం. మనం నీరు మరియు ఆత్మమూలమైన సువార్త అను ఆశ్రయపురంలో ప్రవేశించుట.

ఈ ప్రస్తుత యుగమును తెలిసికొని ఎంతో ఆవశ్యముగా కావలసిన మరియు ఈ యుగమునకు సరియైన విశ్వాసాన్ని నీవు కలిగి ఉండాలని నేను నమ్ముచూ ప్రార్థిస్తున్నాను.