Sermons

[అధ్యాయము 11-2] <ప్రకటన 11:1-19> ఇశ్రాయేలు ప్రజల యొక్క ఆ రక్షణ<ప్రకటన 11:1-19>


ఇశ్రాయేలు ప్రజల కొరకు దేవుడు ఇద్దరు ప్రవక్తలను ఎందుకు పంపాలి? ప్రత్యేకంగా దేవుడు ఇశ్రాయేలీయులను రక్షించగలుగుటకే అలాగు చేయును. దేవుడు తన ఇద్దరు సాక్షులను 1,260 రోజుల వరకు ప్రవచించునట్లు చేయునని ఈ ప్రధాన పాసేజ్‌ తెలుపుచున్నది. ఇదంతా ఇశ్రాయేలీయులను ఆఖరిసారి రక్షించుటకే. అలాగున దేవుడు ఇశ్రాయేలీయులను కూడా రక్షించును. అనగా లోక అంతమునకు సమయం ఆసన్నమైనదని అర్థం.

వచనం 2 ఇలాగు చెప్తుంది: ‘‘ఆలయమును...త్రొక్కుదురు” అనగా అన్యజనులకు భయంకరమైన తెగుళ్ళు కలుగునప్పుడు ఏడు సంవత్సరాల కాలము యొక్క మహాశ్రమలు ఆరంభమై, నెమ్మదిగా గొప్ప అయోమయమునకు తెగుళ్ళను కలుగజేయునప్పుడు సువార్త విని విశ్వసించిన వారైన అన్యులు హతమార్చబడునప్పుడు దేవుడు ఇశ్రాయేలీయుల కొరకు ఇద్దరు ప్రవక్తలను లేపును. యేసు దేవుడు, రక్షకుడని వారు సాక్ష్యమిచ్చునట్లు చేసి, దాని వలని ఇశ్రాయేలీయులను రక్షించును. దేవుని యొక్క క్రియలు ఇవే జరుగవలసి ఉన్నవని తెలియచెప్పుచున్నది.

సాతానుచే మోసగింపబడి తమ డినామినేషన్‌ నేతలే అంత్యకాల రెండు ఒలీవ వృక్షములని లేదా అంత్యకాలము కొరకు ప్రవచించబడిన ఏలియా తమ తెగ ప్రారంభికుడేనని చెప్పువారికి కూడా ఈ వాక్యమును మనం తప్పక బోధించాలి. లోక సంబంధీకులైన సంఘాలు ప్రకటనను మనం తప్పక బోధించాలి. లోక సంబంధీకులైన సంఘాలు ప్రకటనను గూర్చి మాట్లాడినప్పుడల్లా ఎక్కువగా వారు ఈ రెండు వృక్షాలను ప్రచురం చేస్తారు. పారంపర్య సంస్కృతిచే మోసగింపబడిన వారితో ఇప్పటి వరకూ నేను కలిసిన వారందరిలో ఎవరు కూడా ఆమె/అతని యొక్క నాయకుడు ఇక్కడ ప్రస్తావించబడిన ఒలీవ వృక్షాలలో ఒకరిని చెప్పకుండా ఉండలేదు. నాకు తెలిసిన ప్రతి పారంపార్యాచార అట్టి ప్రకటనను నిజానికి చేసినా వారే.

కానీ ప్రకటనలోని రెండు ఒలీవ చెట్లు రెండు దీప స్తంభములు ఈ పారంపర్యాచారులు ప్రకటించునవి కావు. నిజానికి ఆ రెండు ఒలీవ వృక్షాలు ఇశ్రాయేలీయులను రక్షించుటకై దేవుడు నియమించు ఇద్దరు ప్రవక్తలను సూచించును.

అధ్యాయం 11 దేవుడు ఇశ్రాయేలీయులను ఎట్లు రక్షించునో వివరముగా చెప్పుచున్నది. రోమా పత్రిక వలే ప్రకటనలోని ప్రతి అధ్యాయం ఒక ప్రత్యేక సారాంశమును కలిగియున్నది. ఆ సారాంశమును తెలుసుకొంటేనే తప్ప ఆ అధ్యాయం దేని గురించి అనేది అర్థమగుచున్నది. అన్యజనులు తమ కాళ్ళతో త్రొక్కుటకు నలుబది రెండు నెలలు ఇయ్యబడునని చదివిన కొంతమంది. ఈ సారాంశమును తెలిసికొనకయే, అన్యులు యుగసమాప్తమై దానికి బదులు ఇశ్రాయేలీయల రక్షణ యుగము ఆరంభమగును కనుక ఇప్పటి నుండే ఇశ్రాయేలీయులు రక్షణ పొందెదరని ప్రకటిస్తారు.

ఇది సత్యదూరము అధ్యాయం 7లో అన్యజనులలోకి లెక్కించ వీలులేని అన్యజనులు కూడా శ్రమల నుండి రక్షింపబడుటకు వచ్చిరి అనగా అన్యజనులు ఇశ్రాయేలీయులు ఇద్దరూ శ్రమలన్నిటినుండి కాపాడబడతారు. కానీ ఇశ్రాయేలీయులు మాత్రమే కాదు. అలాగే అధ్యాయం 11 మనకు చెప్పునదేమనగా అంత్యకాలములో ఇశ్రాయేలీయులను రక్షించుటకు దేవుడు ఇద్దరు ప్రవక్తలను లేపును కానీ అన్యజనులు ఇక రక్షింపబడరని ఇది చెప్పుట లేదు.

బదులుగా కొంతమంది ఇట్లా అడుగుతారు. అధ్యాయం 7 మనకు చెప్పుచున్నట్లు 1,44,000 మంది ఇశ్రాయేలీయులు ఇప్పటికే రక్షింపబడి దేవునిచే ముద్రింపబడలేదా? ముద్రించబడుట అనగా రక్షింపబడుట అని కాదు. యేసుక్రీస్తు ద్వారా తప్ప మరి ఎవరి ద్వారా వెళ్ళినా రక్షింపబడువారు ఎవరు లేరు. యేసుక్రీస్తు ఈ భూమిపైకి వచ్చి మన రక్షకుడైనాడని మన పాపములన్ని భరించుటకై బాప్తిస్మం పొంది లోకపాపమును సిలువలోమోసి దానిపై చనిపోయెను. మృతి నుండి తిరిగి లేచెనని విశ్వసించుట ద్వారా తప్ప రక్షణ కలుగదు. 

మనం మన మరణం వరకూ పాపమునకు కట్టుబడి మన ప్రయత్నము లేకయే మన పాపములన్ని యేసుక్రీస్తు పూర్తిగా తుడిచివేసి మన రక్షకుడైనాడని విశ్వసించుట వలన ఆయన మన రక్షకుడాయెను. 1,44,000మంది ఇశ్రాయేలీయులు ముద్రింపబడవలసి యుండగా దేవుడు తన ఇద్దరు ప్రవక్తలను లేపి, వారి ద్వారా తన సువార్తను ఇశ్రాయేలీయులకు బోధించనిచ్చెను. వాక్యం మనకు చెప్పునదేమనగా ఈ ఇద్దరు ప్రవక్తలు సువార్తను ఇశ్రాయేలీయులకు బోధించును. మరియు వారిలో 1,44,000మంది ఇట్లు రక్షింపబడతారు.

బైబిలు ఎల్లప్పుడూ డంబమైనది కానీ, కించపరచునది కానే కాదు. యేసుక్రీస్తు ద్వారానే తప్ప రక్షింపబడువారు ఎవరూలేరు. యేసుక్రీస్తు ద్వారా కాకుండా ‘‘నీవు రక్షింపబడతావు. నీవు రక్షింపబడవని దేవుడు చెప్పడు. ఈ ప్రధాన వృత్తాంతంలో చెప్పబడిన రెండు ఒలీవ చెట్లు ఇద్దరు ప్రవక్తలైయున్నారు. వారు గొల్గొత అను స్థలం వద్ద చంపబడతారు. వారి శవములు సమాధి చేయబడక సంతవీధులలో పడియుండును. మరియు వారి మరణమును బట్టి యేసును విశ్వసింపని లేదా అంగీకరింపని వారు సంతోషించి ఒకరొకొకరు బహుమతులను పంపుకొందురు. కానీ వచనం 11,12 చెప్పునదేమనగా ‘‘అయితే ఆ మూడు దినములున్నరయైన పిమ్మట దేవుని యొద్ద నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించెను గనుక వారు పాదములు ఊని నిలిచిరి. వారిని చూచినవారికి మిగుల భయము కలిగెను. అప్పుడు ఇక్కడికి ఎక్కిరండని పరలోకము నుండి గొప్ప స్వరము తమతో చెప్పుట వారు విని, మేఘారూఢులై పరలోకమునకు ఆరోహణమైరి. వారు పోవుచుండగా వారి శత్రువులు వారిని చూచిరి.’’

ఇది సూటిగా మనతోఇట్లు చెప్పుచున్నది. అనగా అన్యజనులమైన నీవు నేను సమయము వచ్చినప్పుడు విశ్వాసం కొరకు హతసాక్షులమౌతాం. దానికి కొంతకాలం తర్వాత మన పునరుత్ధానము మరియు ఎత్తబడుట వచ్చును. ఈ విషయము ప్రకటన గ్రంథమంతా తిరిగి తిరిగి కనిపించును. ఏడు పాత్రల తెగుళ్ళు భూమి మీద కుమ్మరింపబడగా ఎత్తబడిన పరిశుద్ధులు మేఘములో దేవుని స్తుతించెదరని చెప్పు వృత్తాంతము కూడా అనేకము.

అధ్యాయం 14 కూడా 1,44,000 రక్షింపబడి ఒకరును తప్పిపోక ప్రథమ ఫలముగా లేచినవారు దేవుని కీర్తనలతో స్తుతిస్తారని తెలియజేయుచున్నది. ఇశ్రాయేలు ప్రజలు రక్షింపబడినప్పుడు వారు ప్రతిచోట హతసాక్షులగుచూ వారి హతసాక్ష్యము తర్వాత కొద్ది కాలములోనే వారి పునరుత్ధానము మరియు కొనిపోబడుట జరుగును.

అన్యజనులకు కూడా ఇదే వర్తించును. అంత్యకాలములో నీవు నేను ఏడు బూరల తెగుళ్ళ వలన అనేక కఠిన పరిస్థితులలో ప్రయాణించాలి. కానీ దేవుడు నీవు నేను ఏడు బూరల తెగుళ్ళ నుండి మనలను కాపాడును. మహాశ్రమల కాలము యొక్క ఏడు సంవత్సరాలు వాటిలోని మొదటి మూడున్నర సంవత్సరములు జరిగి పరాకాష్టకు చేరగా పరిశుద్ధులు హింస కూడా అత్యధిక స్థాయి చేరును. కానీ ఈ అత్యధిక హింస కొద్దికాలమే ఉండును. త్వరలోనే దేవుని దాసులకీ పరిశుద్ధులు అనేకులు హతసాక్షులవుతారు. వారి హతసాక్ష్యము తర్వాత త్వరగానే వారు కొనిపోబడెదరు.

ఎందుకు? ఎందుకనగా అంత్యకాలములో భూమిపై ఏడు పాత్రల తెగుళ్ళు కుమ్మరింపబడగా పరిశుద్ధులు అప్పటికే పరలోకంలో దేవుని స్తుతిస్తారని ప్రకటనలో అనేకసార్లు లిఖించబడెను. ఈ వాక్యం దీనిని అద్భుతంగా వివరించును.

ప్రకటన 10:7 గాని యేడవ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోవుచుండగా దేవుడు తన దాసులగు ప్రవక్తలకు తెలిసిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పెను. దేవునిచే గుప్తపరచబడిన మర్మము ఎత్తబడుట కాక మరేదీ లేదని భావము. 1 థెస్సలొనీకయులకు 4:16లో అపోస్తులుడైన పౌలు కూడా ఇలాగు చెప్పుచున్నాడు. ‘‘ఆర్భాటముతోను, ప్రధాన దూత శబ్ధముతోను, దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు.’’

ప్రభువు పరలోకము నుండి దిగివచ్చుననగా వెంటనే ఆయన ఈ భూమిపైకి వచ్చునని కాదు. ఆయన పరలోకం నుండి వాయు మండలంలోకి దిగి రాగా, నిద్రించుచున్న వారిని మరియు తిరిగి జన్మించిన వారి రూపాంతరము జరుగు మొదటి పునరుత్ధానము జరుగగా ఎత్తబడిన వారితో కూడా పరిశుద్ధులు ప్రభువును మేఘాలలో ఎదుర్కొనుట అనుసరించును. వాయు మండలంలో గొర్రె పిల్ల వివాహ విందు తర్వాత, మిగిలిన ఏడు పాత్రల తెగుళ్ళన్నీ కుమ్మరింపబడుట వలన ఈ లోకము సమూలముగా నాశనమగును. ప్రభువు నూతన పరచబడిన భూమిపైకి మనతోకూడా దిగివచ్చి అప్పటికి ఇంకా సజీవులైన వారి ముందు ప్రత్యక్షమగును. 

బైబిలు మరియు ప్రకటన గ్రంధమును అన్వయించుట ఒకని స్వంత అభిప్రాయాలను ఆధారము చేసుకొనిన వారిని నాశనమునకు నడుపు త్రోవలో వారిని నిలుపు, కేవలము తత్వవేత్త ఊహలను నమ్మి వాక్యమును సరిగా అర్థం చేసుకొనకుండ వాదించుట సులభముగా జరిగించు తప్పిదము.

అధికంగా గౌరవింపబడు వారు మరియు రక్షింపబడిన క్రైస్తవ సమాజాలలో ప్రాచుర్యం పొందిన తత్వవేత్తలో నున్న జ్ఞానులలో ఎల్‌.బెర్క్‌హాఫ్‌ మరియు అబ్రహాం కుమ్‌ ఫర్‌ అమిల్లీనియ-లిజమ్‌ను ప్రి-ట్రిబ్యులేషన్‌ రాప్చర్‌ సిద్దాంత, పోస్ట్‌ ట్రిబ్యులేషన్‌ రాప్చర్‌, ఎమిల్లీనియలిజమ్‌ అను సిద్ధాంతాలలో ఈ ఆఖరి బోధనల ఎమిల్లీ నియలిజమ్‌ను నమ్ముట బైబిల్‌ను విశ్వసించకపోవుటతో సమానము. జరిగిపోయిన శ్రమ తర్వాత ఎత్తబడుట అనుసిద్ధాంతమును విశ్వసించినట్లు నిజానికి ఈ దినాలలో అనేకులు శ్రమల ముందు ఎత్తబడుటను నమ్ముతున్నారు. ఎందుకు? ఎందుకనగా ఈ సిద్ధాంతం ప్రకారం ఏడు సంవత్సరములు మహాశ్రమలను గూర్చి ప్రజలు బాధపడనక్కరలేదు.

అలాగే విశ్వాసులు చల్లగానూ లేదా వెచ్చగానూ లేని విశ్వాస జీవితం జీవించుటను స్వీకరిస్తున్నారు. మరియు సంఘాలు కూడా తమ కూడికలోని సంఖ్యను పెంచుకొనుటలోనే ఆసక్తి కలిగి ఉన్నాయి. కనుక ప్రజల విశ్వాసం వికసించుచున్నది. ఎట్లనగా వారు గొప్ప శ్రమలను గూర్చి బాధపడనవసరం లేదు. వారి విశ్వాసం పువ్వువలే వికసించును. నిజానికి అంత్యకాలము సమీపమయ్యే కొద్దీ వారి విశ్వాసం బలపడవలెను.

1830లో రెవ స్కోఫీల్డ్‌ మూడీ బైబిలు సంస్థలో ప్రొఫెసర్‌ గారు రిఫరెన్స్‌ బైబిల్‌ వ్రాయుటకు ఆరంభించారు. స్కోఫీల్డ్‌ గారు డార్బీ అను ప్రపంచ ప్రఖ్యాత తత్త్వవేత్త గారిచే అధికముగా ప్రేరేపింపబడెను.

డార్జీ : స్కోఫీల్డ్‌ కు ఆత్మీయ కుమ్మరి ముందు అతను కెథాలిక్‌ పాస్టర్‌ గారు అధిక తెలివి మరియు అనంతజ్ఞానం కల మనిషి. అతను కెథలిక్‌ చర్చినందు గల లొసుగులను తెలుసుకొన్న పిదప దానిని విడచెను. ఒక చిన్నక్రైస్తవ సమాజములో చేరి దానికి నాయకుడయ్యెను. డార్జీ స్థిరముగా బైబిలును చదివి అధ్యయనం చేసిననూ ఆయన ఎత్తబడుట అనుననది శ్రమస్కోఫీల్డ్‌ కు ముందు జరుగునో లేదా తర్వాత జరుగునో అనుదానిని ప్రకటన గ్రంధం నుండి నిర్ణయించలేకపోయెను. 

కనుక ఆయన ఈ విషయమై మరి స్పష్టమైన ఆధారము కొరకై పయనమయ్యెను. ఈ ప్రయాణ సమయంలో ఆయన ఒక న్యుమటాలజీ నాయకురాలైన ఒక టీనేజీ యువతిని కలుసుకొనెను. మహాశ్రమస్కోఫీల్డ్‌ ముందే ఎత్తబడుటను నేను దర్శనంలో చూచానని చెప్పుకొనెను. ఆమె చెప్పిన దానిని నమ్మి శ్రమస్కోఫీల్డ్‌ ముందే ఎత్తబడుట సంభవించునని అంగీకరించిన వాడైన డార్జీ ఈ శ్రమస్కోఫీల్డ్‌ ముందు ఎత్తబడుట అను సిద్ధాంతముతో తన బైబిలు అధ్యయనమును ముగించెను. 

అయిననూ ఈ సమయంలో ప్రజలు ప్రధానంగా శ్రమల తర్వాత ఎత్తబడుదురను సిద్ధాంతాన్ని నమ్మిన కారణంగా డార్బీ గారు శ్రమల ముందే ఎత్తబడుదురను సిద్ధాంతము అంతగా స్వీకరించబడలేదు.

ప్రకటన గ్రంధములో వ్రాయబడినదంతా ఇశ్రాయేలు ప్రజలను గూర్చేనని అన్యజనుల రక్షణ విషయంలోఏమీ చెప్పబడలేదని డార్బీ ప్రకటించెను. ‘‘నీవు మరల ప్రవచింపుము” (10:11)తో ఆయన ఇది నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను బోధించుట కాదు గానీ రాజ్య సువార్త మరియు దాని జరుగబోవు ప్రత్యక్షత అని అన్వయించెను.

నిజానికి ఇట్టి డార్బీ ఊహను స్వీకరించిన వాడై స్కోఫీల్డు, శ్రమల ముందు ఎత్తబడుట అను సిద్ధాంతమును తన రిఫరెన్స్‌ బైబిల్‌లో గ్రంధపరచెను. మరియు ఏడు యుగములను గూర్చి స్వంత సిద్ధాంతమును ఏర్పరచెను. అట్టి స్కోఫీల్డు ప్రకటన అతని సమయంలోని డిమాండ్‌ను అందుకొనెను. అతని నేపధ్యానికి సరిగ్గా సరిపోయెను. ప్రపంచవ్యాప్తంగా అనేకులైన మతస్థులలో కలకలము రేపెను. మరియు అంతటా అంగీకరింపబడెను.

కానీ బైబిల్‌లో దేవుడు చెప్పినది ఏమిటి? లేఖనములో దేవుని సింహాసనం ఎదుట ఏడు ముద్రలతో ముద్రించబడిన కాగితపు చుట్ట తెరువబడుటను గూర్చి యేసు మాట్లాడుట మనం చూస్తాం. ఆయనే ఈ ఏడు ముద్రలతో కాలాన్ని చరిత్రలో ఏడుయుగాలుగా విభజించెను.

మొదటి యుగము తెల్లగుర్రపు యుగము.ఈ యుగము రక్షణ యుగము. ఈ లోకాన్ని మనిషిని సృష్టించగానే మనలను సృష్టించుటకు దేవుడు నిర్ణయించిన యుగం. దాని ప్రకారం వాస్తవంగా మనలను రక్షించుటకు దేవుడు నిర్ణయించిన యుగం. దాని ప్రకారం వాస్తవంగా మనలను రక్షించెను. ప్రకటన 6:2 మనకు చెప్పినట్లు ‘‘మరియు నేను చూడగా, ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను. దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి యుండెను. అతనికి ఒక కిరీటమియ్యబడెను. అతడు జయించుచూ జయించుటకు బయలువెళ్లెను.’’ ప్రభువు జయించుచూ జయించుటకు బయలువెళ్లెను. సృష్టికి ముందే సువార్త ఉన్నది మరియు రక్షణ ఆరంభమాయెను.

రెండవ యుగము ఎర్రని యుగము. అది సాతాను యుగం. ఇది దయ్యపు యుగమై మానవాళి నుండి శాంతిని తొలగించెను. ఒకరితో ఒకరు యుద్ధము చేయునట్లు ఒకరినొకరు ద్వేషించునట్లు మతపరమైన విభేదాలలో నుండునట్లు చేసెను.

మూడవ యుగము నల్లని గుర్రపు యుగం. ఇది ఆత్మీయ శారీరక కరువునకు సమయం. మరియు నాల్గవ యుగం పాండు వర్ణ గుర్రం యుగము. హతసాక్షులు యుగము. ఐదవ యుగం ఎత్తబడు యుగం. తన యుగాలలో ఒకటిగా పరిశుద్ధులు కొనిపోబడునట్లు దేవుడు నిర్ణయించెను. ఆరవ యుగము ఏడవ పాత్రది. ఈ లోక నాశనమును అంతము చేయును. మరియు దానిననుసరించు యుగం వెయ్యేండ్ల రాజ్యము మరియు నూతన భూమి ఆకాశము యుగం. కనుక దేవుడు ఈ లోక సమయాన్ని ఈ ఏడు యుగములగా నియమించెను. ఇవి ఏడు ముద్రలతో కాగితపు చుట్టలో ముద్రింపబడెను.

స్కోఫీల్డు చేసిన కాలవిభజన పూర్తిగా స్వంత అభిప్రాయమే. దానికి భిన్నంగా ప్రకటన 6లో ప్రవచింపబడిన రీతిగా దేవుని చేతిలోనున్న ఏడు ముద్రలు గల కాగితపు చుట్టలో నున్న ఏడు యుగముల కాలము దేవునిచే నియమింపబడెను. అయినను ప్రజలు మానవ నిర్మితమైన శ్రమల ముందు ఎత్తబడుటను గూర్చి మాట్లాడుచూ దానిని విశ్వసించిన వారిలో అనేకులు ప్రభువును నమ్మకముగా విశ్వసించవలసిన అవసరమేమీలేదని అర్థాన్ని కలిగి ఉన్నారు.

వారు తమ హృదయాలలో ‘‘మహాశ్రమలకు ముందే కొనిపోబడతాము కనుక మహాశ్రమల యొక్క ఏడు సంవత్సరములు వచ్చునప్పటికీ మనం దేవుని సన్నిధానంలో ఉంటామని నిర్ణయించుకొంటారు. కనుక మనకేమీ ఫర్వాలేదని అనుకొంటారు.’’ శ్రమలకు ముందే మనలను కొనిపోతానని వాస్తవంగా మన విశ్వాసాన్ని సిద్ధపరచుకోనవసరం లేదని చర్చిలో సంవత్సరానికి ఒకటి, రెండు సార్లు హాజరైతే చాలని దేవుని వాక్యం మనతో చెప్తున్నా కాదు గానీ దేవుడు మనకిది చెప్పనే లేదు.

“వారు 1,260 దినాలు ప్రవచిస్తారు” నలభై రెండు నెలలు వారు దేవుని ఆలయాన్ని త్రొక్కుతారు ఇట్టి వాక్యాలు అన్యజనులు కూడా మహాశ్రమల కాలంలో రక్షింపబడతారని చెప్తున్నాయి. దేవుడు తన ఇద్దరి ప్రవక్తలను నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను వ్యాపింపచేయుటకై లేపును. దేవునిచే నియమించబడిన మహాశ్రమల యొక్క ఏడు సంవత్సరాల కాలంలో కఠినమైన సమయం వచ్చినప్పుడు మొదటి మూడున్నర సంవత్సరములలో జీవించనివాడై దేవుని ముందు హాజరగువారు ఎవరునూ ఉండరు. ఈ సమయంలో అనేకులు హతసాక్షులు శ్రమల నుండి బయటపడతారని దేవుడు కూడా చెప్పుచున్నాడు.

యేసును సరిగ్గా విశ్వసించుటకు ఒకడు బైబిలును ఉన్నది ఉన్నట్లుగా నేర్చుకోవాలి మరియు ఉన్నది ఉన్నట్లుగానే విశ్వసించాలి. బైబిల్‌లోని ప్రతి పేజీని జాగ్రత్తగా చదవక ప్రజలు తమ స్వంతంగా బోధించి విశ్వసించినట్లయిన వారు బుద్ధిహీనుల వలే మిగిలిపోతారు. ఈ లోకంలో లెక్కలేనన్ని డినామినేషన్లు ఉండుటకు కారణం కూడా ప్రజలు బైబిల్‌ను స్వంత అభిప్రాయాలతో విశ్వసించుటయే

ఇశ్రాయేలు ప్రజలు రక్షింపబడతారు అనునది దేవుని వాగ్ధాన వాక్యము నెరవేర్పు ఆయన చిత్తానుసారమైనదని తెలియచేయుచున్నది. దేవుడు తన వాగ్దాన వాక్యమును ఎన్నడూ విడువడు కానీ దానిని నెరవేర్చునని కూడా మనకు తెలియచేయుచున్నది.

అందువలననే మనకు అట్టి గొప్ప నిరీక్షణ ఉన్నది. ఇశ్రాయేలు ఇద్దరు ప్రవక్తలు వారి మరణము తరువాత మూడున్నర దినములకు పునరుత్ధానులై పరలోకమునకు ఆరోహణమవుతారు. ఇదే ఎత్తబడుట మహాశ్రమల యొక్క హతసాక్షులు ఎట్లు ఎత్తబడతారు అను దానికి ఇది ఒక మాదిరిగా కనబడును. మరియు మన సంఘం ఎత్తబడుటకు నాందిగా కూడా చూపబడినది. ఏడు బూరలు మ్రోగిన తరువాత ఈ భూమి క్రీస్తు రాజ్యమవుతుంది. ఆయన దానిని, సదాకాలము పరిపాలించునని మనతో బైబిల్‌ చెప్పుచున్నది. అలాగే యేసుక్రీస్తును విశ్వసించిన వారు కూడా ఆయనతో పరిపాలిస్తారు.

దేవుడు ఈ లోకాన్ని పరిశుద్ధులను కొనిపోయిన తర్వాత సమూలంగా నాశనం చేయును. ఆ నాశనం 100 శాతం ఉంటుందో లేదో బైబిలులో వ్రాయబడలేదు కనుక మనకు తెలియదుకానీ దేవుడు ప్రకటన 11:18లో చెప్పెను. ‘‘జనము కోపగించినందున నీకు కోపము వచ్చెను. మృతులు తీర్పు పొందుటకును, నీ దాసులగు ప్రవక్తలకును పరిశుద్ధులకును, నీ నామమునకు భయపడువారికిని తగిన ఫలమునిచ్చుటకును, గొప్పవారేమీ కొద్దివారేమి భూమిని నశింపజేయు వారిని నశింపజేయుటకును సమయము వచ్చియున్నదని చెప్పిరి.’’

ఎత్తబడుట నిశ్చయము ఏలయనగా మహాశ్రమలు అధికమగు మూడున్నర సంవత్సరముల కాలము జరిగిన తరువాత ఖచ్చితంగా మొదటి మూడున్నర సంవత్సరముల కాలము తీరిన వెంటనే కాదు. కానీ అవి గడచిన కొద్దికాలానికి, శ్రమల మధ్య కాలము ఆ శ్రమలు తీరిన వెంటనే కాదు. కానీ అవి గడిచిన కొద్దికాలానికి శ్రమల మధ్య కాలము ఆ శ్రమలు అధికమగునప్పుడు సంపూర్తియగును. అది ఇశ్రాయేలీయుల నుండి పరిశుద్ధులు హతసాక్షులైనది మొదలుకొని కొద్ది కాలానికే ఎత్తబడుట అప్పటి నుండి సంభవించును. కొనిపోబడుట సంభవించినప్పుడు మన మందరము వాయుమండలంలో గొర్రె పిల్ల వివాహ విందులో పాల్గొంటాము.

వాయు మండలమందు గొర్రె పిల్ల వివాహ విందులో మనం పాల్గొనుచుండగా మత్తయి 25 మనకు చెప్పుచున్నట్లు మనము పాల్గొంటాం. ఆ ఏడు పాత్రల తెగుళ్ళు ఈ భూమిపైకి వచ్చును. వాయు మండలంలో దేవుని స్తుతించుచూ ఈ భూమిపై జరుగుచున్న వాటిని చూచుచూ ఎప్పటి కంటే అధికంగా మనము దేవుని కృపను బట్టి ఆయనకు కృతజ్ఞతలను చెల్లిస్తాము.

ప్రకటన గ్రంధము ద్వారా అంత్యదినము వచ్చినప్పుడు నీవు వాటిని గుర్తుపట్టాలని, వాక్యమును సరిగా విశ్వసించాలని ఉత్సాహముతో కూడిన విశ్వాసంలో జీవితాన్ని కొనసాగిస్తావని భవిష్యత్తు కొరకు సిద్ధపడతావని నేను నమ్ముచూ నీ కొరకు ప్రార్థిస్తున్నాము. ఆయనతో పాటు గొర్రెపిల్ల వివాహ విందులో ప్రభువుతో కూడా భాగస్వామివై ఆరాధించుటకు ఘనపరచుటకు స్తుతించుటకు నీవు తప్పక నీ విశ్వాసమును స్థిరపరచుకోవాలి.

ప్రకటన వాక్యము రాబోవు దినములో నీకు ఒక గొప్ప త్రోవచూపువాని వలే నిరూపించబడి నీరు మరియు ఆత్మ మూలమైన సువార్తలోని విశ్వాసమును నమ్ముకముగాను ఉత్సాహముగాను ఉండునట్లు మరొకసారి నీ హృదయాన్ని హెచ్చరించునని నేను నమ్ముచున్నాను.