Sermons

[అధ్యాయము 12-1] <ప్రకటన 12:1-17> రానున్న కాలములో హింసంపబడబోవుచున్న దేవుని సంఘము<ప్రకటన 12:1-17>

“అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేదనగా సూర్యుని ధరించుకొనిన యొక స్త్రీ. ఆమె పాదముల క్రింద చంద్రుడును, శిరస్సు మీద పండ్రెండు నక్షత్రముల కిరీటమును ఉండెను. ఆమె గర్భిణియై ప్రసవవేదనపడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను. అంతట పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో యెఱ్ఱని మహాఘటసర్పము దానికి ఏడు తలలును పది కొమ్ములును ఉండెను. దాని తలమీద ఏడుకిరీటములుండెను. దాని తోక ఆకాశ నక్షత్రములో మూడవ భాగము నీడ్చి వాటిని భూమి మీద పడవేసెను. కననైయున్న ఆ స్త్రీ కనగానే, ఆమె శిశువును మ్రింగి వేయవలెనని ఆ ఘటసర్పము స్త్రీ యెదుట నిలుచుండెను. సమస్త జనములను ఇనుపదండముతో ఏలనైయున్న యొక మగశిశువును ఆమె కనగా, ఆమె శిశువు దేవుని యెద్దకును ఆయన సింహాసనము నొద్దకును కొనిపోబడెను. ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయెను. అచ్చట వారు వెయ్యిన్ని రెండు వందల ఆరువది దినములు ఆమెను పోషింపవలెనని దేవుడామెకు ఒక స్థలము సిద్ధపరచి యుంచెను. అంతట పరలోకమందు యుద్ధము జరిగెను. మిఖాయేలును అతని దూతలను ఆ ఘటసర్పముతో యుద్ధము చేయవలెనని యుండగా ఆ ఘటసర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేక పోయిరి. గనుక పరలోకమందు వారికిక స్థలము లేకపోయెను. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు, అపవాదియనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘటసర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఈలాగు చెప్పుట వింటిని. రాత్రింబగళ్లు మన దేవుని యెదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడియున్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయెను. ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయెను. వారు గొఱ్ఱె పిల్ల రక్తమును బట్టియు, తామిచ్చిన సాక్ష్యమును బట్టియు వానిని జయించియున్నారు. గాని మరణము వరకు తమ ప్రాణమును ప్రేమించినవారు కారు. అందుచేత పరలోకమా, పరలోకనివాసులారా, ఉత్సహించుడి భూమి, సముద్రమా, మీకు శ్రమ. అపవాది తనకు సమయము కొంచెమే అని తెలిసికొని బహుక్రోధము గలవాడై మీయొద్దకు దిగివచ్చియున్నాడని చెప్పెను. ఆ ఘటసర్పము తాను భూమి మీద పడద్రోయబడియుండుట చూచి, ఆ మగ శిశువును కనిన స్త్రీని హింసించెను. అందువలన ఆమె అరణ్యములో ఉన్న చోటికి ఎగురునట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు రెండు ఆమెకు ఇయ్యబడెను. అచ్చట ఆ సర్పముఖమును చూడకుండా ఆమె ఒక కాలము అర్ధకాలం పోషింపబడును. కావున ఆ స్త్రీ ప్రవాహమునకు కొట్టుకొనిపోవలెనని ఆ సర్పము తన నోటి నుండి నీళ్ళు నదీ ప్రవాహముగా ఆమె వెనుక వేళ్ళ గ్రక్కేను గాని, భూమి ఆ స్త్రీకి సహకారియై తన నోరు తెరచి ఆ ఘటసర్పమును తన ప్రవాహమును మ్రింగివేసెను. అందుచేత ఆ ఘటసర్పము ఆగ్రహము తెచ్చుకొని దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసును గూర్చి సాక్ష్యమిచ్చుచు ఉన్నవారైన ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలువెడలి సముద్ర తీరమున నిలిచెను.’’వివరణ : 


వచనం 1 : అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేదనగా సూర్యుని ధరించుకొనిన యొక స్త్రీ ఆమె పాదముల క్రింద చంద్రుడును శిరస్సు మీద పండ్రెండు నక్షత్రముల కిరీటమును ఉండెను.

దేవుని సంఘము తన హత సాక్ష్యము ద్వారా దేవునికి మహిమ చెల్లించుచున్నదని మనకు తెలియచేయుచున్నది. సూర్యుని ధరించిన దైవ స్త్రీ ఈ భూమిపై ఉన్న దేవుని సంఘానికి సాదృశ్యము. ‘‘ఆమె పాదముల క్రింద చంద్రుడు”అను వాక్యమునకు అర్థం సంఘము ఇంకా ప్రపంచ పాలనలోనే ఉన్నది అనియే. ‘‘ఆమె శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటముండెను” అనగా ఆయన సంఘము సాతాను హింసను జయించి తన హతసాక్ష్యముతో ఇబ్బంది పెట్టును.

ఈ వచనం మహాశ్రమల మధ్యనున్న దేవుని సంఘమును సూచించుచున్నది. అంత్యకాలంలో సంఘము సాతాను వలన గొప్ప హింసపొంది హతసాక్ష్యమవును కానీ అది సునాయాసంగా తన విశ్వాసంతో సాతానును జయించి దేవునిచే ఘనపరచబడును. శ్రమల కాలములోనైనా దేవుని సంఘ పరిశుద్ధులు అంత్యక్రీస్తును జయించెదరు. మరియు నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను విశ్వసించుట వలన కలుగు హతసాక్ష్యముతో జయోత్సాహం చేసెదరు.

నీరు మరియు ఆత్మమూలమైన సువార్త ద్వారా తిరిగి జన్మించిన వారైన దేవుని పిల్లలు. అంత్యకాలములో తప్పకుండా నిశ్చయంగా హతసాక్షులవుతారు. శ్రమలు రాకముందే దేవుని విశ్వసించి, ఆరాధించిన వారందరూ మరియు సువార్తను విశ్వసించి శ్రమల మధ్య పుట్టగొడుగుల వలే లేచిన హతసాక్ష్య విశ్వాసాన్ని కలిగి ఉంటారు. 

హతసాక్ష్యము నుండి వేరై ఆయనను త్రోసివేసిన వారందరూ పరలోకము నుండి త్రోసివేయబడి సాతానుతో కూడా నరకాగ్నిలో పడతారు. మరియు మనము ధైర్యము విశ్వాసంతో మన హతసాక్ష్యమును కౌగలించవలెను. లేనిచో మన కొరకు సిద్ధపరచబడిన నిత్యదీవెనలను పొగొట్టుకుంటాం. తిరిగి జన్మించిన వారందరూ సాతాను బెదిరింపును ఎదుర్కొనవలెనని మనము తప్పక తెలిసికోవాలి. హతసాక్ష్యము క్షణ కాలమే ఉండును. ఈ క్షణకాలం జరిగిపోయినప్పుడు వెయ్యేండ్ల రాజ్యము మరియు పరలోకము మనవగును.

అలాగే ప్రస్తుత యుగములో మనము అంత్యకాలము ఎప్పుడు వచ్చునో తెలిసికొనిన వారమై విశ్వాసము మరియు పరిశుద్ధాత్మ ద్వారా హతసాక్ష్యమవుతాం. ఆ పరిశుద్ధాత్మ ఈ హతసాక్ష్య కాలంలో మాట్లాడవలసిన మాటను మనకిచ్చును తద్వారా మనం హింసను ధైర్యంగా ఎదుర్కొనచేయును. మరియు విశ్వాసమును తోసివేయక ఇష్టపూర్వకముగా మనము హతసాక్షులగుటకు సహాయపడును.

భయంకరమైన శ్రమల మధ్యలో కూడా దేవుని సంఘము సాతానునకు వ్యతిరేకముగా పోరాడి హతసాక్షులగుటతో అతనిని జయించెదరు. సాతాను యొక్క ఆఖరి యుగంలో కూడా ప్రభువు వాక్యమును విశ్వసించి తమ హతసాక్ష్యముతో అంత్యక్రీస్తును జయించిన సంఘం దేవుని యొద్ద నుండి బహుమానం పొందునని స్పష్టమగుచున్నది.

వచనం 2 : ఆమె గర్భిణియై ప్రసవవేదనపడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను.

ఈ వచనం శ్రమలోనున్న దేవుని సంఘమును గూర్చి చెప్పుచున్నది. సాతాను వలన అంత్యకాలములో కలుగు శ్రమలు మరియు హింస నుండి సంఘమంతయూ కాపాడబడుచుండుటను గూర్చి చెప్పుచున్నది. అంత్యక్రీస్తునకు వ్యతిరేకముగా సంఘము అనుభవించవలసిన క్లిష్ట సమయమైన మహాశ్రమలలో సంఘము జీవించును. కనుక పరిశుద్ధులు శ్రమలను భరించినప్పుడే దేవునిచే పిలువవబడతారు. వారు ఇట్లు ప్రార్థిస్తారు. ‘‘దేవా ఈ శ్రమలన్నిటిలో జీవించగల నీ కృపను దయచేయుము. ఈ శ్రమలన్నిటిని సహించుటకు సహాయము చేయుము. మా ఈ శ్రమలను జయించుటకు అనుమతించుము. సాతానును జయించే వారిగా మమ్మును చేయుము!’’

వచనం 3 : అంతట పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో యెఱ్ఱని మహాఘటసర్పము దానికి ఏడు తలలును, పది కొమ్ములును ఉండెను. దాని తల మీద ఏడు కిరీటములుండెను.

భవిష్యత్తులో సాతాను భూమి మీదికి వచ్చినప్పుడు తనే దేవుని వలే నటించును. మరియు ప్రపంచ దేశములన్నిటిని ఏకము చేయును. మరియు ప్రపంచాన్ని దేవుని వలే ఒక రాజువలే పరిపాలించును.

“ఇదిగో ఎర్రని ఘట సర్పము, దానికి ఏడు తలలు, పది కొమ్ములుండెను. దాని తలమీద ఏడు కిరీటములుండెను.’’ అను వాక్యము సాతాను శాంతి నాశన కర్త తన స్వాదీనములోనికి ఏడుగురు రాజులను పది దేశములను తెచ్చుకొనునని చూపుచున్నది. ప్రధానంగా సాతాను తన గొప్పధీమాతో దేవునికి వ్యతిరేకముగా నిలుచునని ఈ వాక్యం చెప్పుచున్నది.

వచనం 4 : దాని తోక ఆకాశ నక్షత్రములో మూడవ భాగము వాటిని భూమి మీద పడవేసెను. కననైయున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మ్రింగి వేయవలెనని ఆ ఘటసర్పము స్త్రీ యెదుట నిలుచుండెను. 

ఈ వచనం సాతాను ఏమి చేయునో చెప్పుచున్నది. ఘటసర్పము పరమందు దేవుని ఎదిరించి దాని నుండి త్రోసివేయబడెను. అతడు పరలోక దూతలో మూడవ వంతును తాను స్వాధీనపరచుకొనెను మరియు తన స్వంత నాశనముతోపాటుగా వారిని కూడా నాశనమునకు నడిపించెను. కనుక అతడు దేవుని సముఖము నుండి తోలివేయబడెను. కానీ ఈ భూమిపైనున్నప్పుడు కూడా దేవుని సువార్త ప్రక్రియను ఆపివేయత్నిస్తూ ఇప్పటికి దానిని విశ్వసించు వారిని హింసించుచుండెను.

వచనం 5 : సమస్త జనములను ఇనుపదండముతో ఏలనైయున్న యొక మగశిశువును ఆమె కనగా, ఆమె శిశువును దేవుని యొద్దకును ఆయన సింహాసనము నొద్దకును కొనిపోబడెను.

దేవుని సంఘము యేసు క్రీస్తును విశ్వసించినందుకు హతసాక్ష్యమాయెను. కనుక క్రీస్తుతో కూడా లేపబడి పరలోక రాజ్యములోనికి ఎత్తబడెనని ఈ వాక్యం చెప్పుచున్నది.

వచనం 6 : ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయెను. అచ్చట వారు వెయ్యిన్ని రెండువందల అరువది దినములు ఆమెను పోషింపవలెనని దేవుడామెకు ఒక స్థలము సిద్ధపరచియుంచెను.

ఈ లోకంలో దేవుడు తన ప్రజలను మూడున్నర సంవత్సరములు పోషించనైయున్నాడని ఈ వచనం చెప్పుచున్నది. దేవుని సంఘము 1,260 దినములు పూర్తి శ్రమలు ఆరంభింపక మునుపు దేవునిచే కాపాడబడి పోషింపబడును. మరియు ఆ సమయం వచ్చినప్పుడు అది అంత్యక్రీస్తునకు వ్యతిరేకంగా పోరాడి హతసాక్ష్యమగుదురు.

వచనం 7`8 : అంతట పరలోకమందు యుద్ధము జరిగెను. మిఖాయేలును అతని దూతలను ఆ ఘటసర్పముతో యుద్ధము చేయవలెనని యుండగా ఆ ఘటసర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేక పోయిరి. 

గనక పరలోకమందు వారికిక స్థలము లేకపోయెను. ఇది పరలోకము నుండి బయటకు పూర్తిగా తోలివేయబడిన సాతానును సూచించును.

ఈ లోకమునకు రాకముందు సాతానుడు పరలోకం నుండి పూర్తిగా త్రోయబడతాడు. దయ్యము ఇక పరలోకములో ఉండలేదు. సాతాను వాయు మండలముపై అధికారము కలదై వాయువు మరియు భూమి ఈ రెంటిపై కూర్చొని అప్పటి నుండి వాటిని ఏలును. అట్లు అతడు పరలోకం నుండి పూర్తిగా త్రోయబడి ఈ భూమిపై పరిశుద్ధులను అంత్యదినము వరకు మరి ఎక్కువగా హింసించును. కానీ అప్పటికి సాతాను పూర్తిగా అగాధమునకు దేవునిచే తయారు చేయబడిన నరకమునకు లోనవుతాడు.

వచనం 9 : కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదియనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘటసర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి.

అంత్యకాలములో సాతాను అతడు పరలోకము నుండి త్రోయబడెను. మరియు ఈ భూమిపైకి త్రోయబడెను. కనుక ఆఖరుసారిగా పరిశుద్ధులను హింసించి చంపును. అప్పుడు అనేకులు అతని హస్తములో హతసాక్ష్యులగుదురు.

వచనం 10 : మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఈలాగు చెప్పుట వింటిని. రాత్రింబగళ్లు మన దేవుని యెదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి యున్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయెను. ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయెను.

ఇక ఎన్నటికి సాతాను పరలోకములో కనబడడు. అంత్యకాలము సమాప్తమవ్వగానే ఇక ఎంతమాత్రము అతడు పరలోకంలో ఉండలేడు. అందువలననే ప్రకటన 21:27 దుష్టులు గానీ, అబద్ధికులు గాని పరలోకంలో కనబడరు.

వచనం 11 : వారు గొఱ్ఱెపిల్ల రక్తమును బట్టియు, తామిచ్చిన సాక్ష్యమును బట్టియు వానిని జయించియున్నారు గాని మరణము వరకు తమ ప్రాణమును ప్రేమించినవారు కారు.

అంత్యకాలము సమీపించగా తమ విశ్వాసమును కాపాడుకొనుటకై పరిశుద్ధులు హతసాక్ష్యులగుదురు. ఎవరైతే పరిశుద్ధులై ఆమె/అతని హతసాక్ష్యము యొక్క విశ్వాసమును అంత్యకాలములో పొంది దాని ద్వారా జయించెదరు. ప్రభువు నందు విశ్వాసముంచుచు హతసాక్షులు మరో విధంగా తమ పోరాటములో, స్వార్ధముపై జయమొందెదరు.

వచనం 12 : అందుచేత పరలోకమా, పరలోకనివాసులారా, ఉత్సహించుడి. భూమీ, సముద్రమా, మీకు శ్రమ. అపవాది తనకు సమయము కొంచెమే అని తెలిసికొని బహుక్రోధము గలవాడై మీ యొద్దకు దిగివచ్చియున్నాడని చెప్పెను.

పరలోకము నుండి బయటకు త్రోయబడిన వాడైన సాతాను తాత్కాలికంగా ఈ లోకంపై అధికారం కలిగిన వాడై అతడు భూమిపైకి వచ్చినప్పుడు పరిశుద్ధులను భయంకరంగా బాధించి హింసించును. కానీ హతసాక్షులై కొనిపోబడబోవు పరిశుద్ధుల కొరకు, కేవలము సంతోషమే ఎత్తబడిన తరువాత దేవుడు ఏడు పాత్రల తెగుళ్లను సముద్రము మరియు భూమిపై కుమ్మరించును.

వచనం 13 : ఆ ఘటసర్పము తాను భూమి మీద పడద్రోయబడి యుండుట చూచి, ఆ మగశిశువును కనిన స్త్రీని హింసించెను.

ఇది మహాశ్రమల కాలంలో పరిశుద్ధులకు కలుగబోవు హింసను సూచించుచున్నది. దేవుని దాసులు, పరిశుద్ధులు హతమార్చబడతారు కనుక చనిపోతారు. కానీ సత్యమునకిది వారి విశ్వాస విజయమే. ఇక ఎప్పటికి ఏ మరణము ఉండదు. వారి కొరకు బాధ మరియు శాపమే ఉన్నది. వారి కొరకు మిగిలినది దేవుని స్తుతించుట మరియు సదాకాలము పరమందు మహిమ పరచబడుటయే.

వచనం 14 : అందువలన ఆమె అరణ్యములో ఉన్న తన చోటికి ఎగురునట్లుగా గొప్ప పక్షిరాజు రెక్కలు రెండు ఆమెకు ఇయ్యబడెను. అచ్చట ఆ సర్పముఖమును చూడకుండా ఆమె ఒక కాలము కాలము అర్థకాలం పోషింపబడును.

బైబిల్‌ మనకు చెప్పునది మొదటి మూడున్నర సంవత్సరమల మహాశ్రమల కాలం పూర్తయిన పిదప ఎత్తబడుట సంభవించును. దేవుడు తన పరిశుద్ధులకు ఆ మహాశ్రమల యొక్క సహజ తెగుళ్ళ మధ్య ప్రత్యేక రక్షణనిచ్చి పోషించునని ఈ వచనం చెప్పుచున్నది. మనలో ఎవరు విశ్వాసమును కాపాడుకొని, సాతానుకు ఎదురునిలచి ఆ విశ్వాసముతో జయిస్తామో వారిని దేవుడు పోషించును.

ఇప్పుడు మన జీవము నీరు మరియు ఆత్మమూలమైన సువార్త వలన పోషింపబడుచున్నది. అలాగే ఈ సువార్తను బోధించుచూ మన జీవితాలను కొనసాగించగలము. ఎందుకు? మన హతసాక్ష్య నిమిషము వరకు మనం సువార్త ప్రకటించకపోతే అనేక ఆత్మలు నరకంలో పడిపోతాయి. ఇక ఇప్పుడు గాక వేరొక సమయం మనకు లేదు.

వచనం 15`17 : కావున ఆ స్త్రీ ప్రవాహమునకు కొట్టుకొని పోవలెనని ఆ సర్పము తన నోటి నుండి నీళ్లు నదీ ప్రవాహము మ్రింగివేసెను. అందుచేత ఆ ఘటసర్పము ఆగ్రహము తెచ్చుకొని, దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసును గూర్చి సాక్ష్యమిచ్చుచు ఉన్నవారైన ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలువెడలి సముద్రతీరమున నిలిచెను.

పూర్వము సాతాను పరిశుద్ధులను హింసించుట ద్వారా చంపెను మరియు సువార్త నుండి దూరపరచెను. కానీ ఈ దినాలలో అనేక విధానాల ద్వారా సువార్త విరివిగా ప్రకటించబడకుండా అతడు పరిశుద్ధులను పాపమునకు లాగి చంపుటకు ప్రయత్నించుచూ దాని ప్రవాహములో వారిని ముంచివేయుచుండెను. కనుక సాతాను పాపనదిని ప్రవహింపచేసి పరిశుద్ధులు దానిలో పడి కొట్టుకొని పోవుట ద్వారా వారిని చంపుటకు ప్రయత్నించెను. కానీ వారికి బదులుగా తిరిగి జన్మించనివారు ఈ పాపనది యొక్క నీటినంతటిని త్రాగివేసిరి. పరిశుద్ధులు బ్రతికి ఈ ప్రయత్నం వలన కూడా చంపబడనందున వారిని పూర్తిగా చంపుటకు సాతాను మరొక విధానముతో తిరిగి వచ్చును. అది 13వ అధ్యాయంలో చూపబడెను.