Sermons

[అధ్యాయము 13-1] <ప్రకటన 13:1-18> ఆ అంత్యక్రీస్తు బయలుపడుట<ప్రకటన 13:1-18>

“మరియు పది కొమ్ములును ఏడు తలలును గల యొక క్రూరమృగము సముద్రములో నుండి పైకి వచ్చుట చూచితిని. దాని కొమ్ముల మీద పది కిరీటములును దాని తలలమీద దేవదూషణకరమైన పేళ్లును ఉండెను. నేను చూచిన ఆ మృగము చిరుతపులిని పోలియుండెను. దాని పాదములు ఎలుగుబంటి పాదములవంటివి. దానినోరు సింహపు నోరువంటిది. దానికి ఆ ఘటసర్పము తన బలమును తన సింహాసనమును గొప్ప అధికారమును ఇచ్చెను. దాని తలలో ఒక దానికి చావుదెబ్బ తగిలి నట్టుండెను.అయితే ఆ చావు దెబ్బ మానిపోయెను. గనుక భూజనులందరు మృగము వెంట వెళ్లుచు ఆశ్చర్యపడుచుండిరి. ఆ మృగమునకు అధికారమిచ్చినందున వారు ఘటసర్పమునకు నమస్కారము చేసిరి. మరియు వారు ఆ మృగముతో సాటి యెవడు? దానితో యుద్ధము చేయగలవాడెవడు? అని చెప్పుకొనుచు ఆ మృగమునకు నమస్కారం చేసిరి. డంబపు మాటలను దేవదూషణలను పలుకు ఒక నోరు దానికి ఇయ్యబడెను. మరియు నలువది రెండు నెలలు తన కార్యము జరుపనధికారము దానికి ఏర్పాటాయెను. గనుక దేవుని దూషించుటకును. ఆయన నామమును, ఆయన గుడారమును, పరలోక నివాసులను దూషించుటకు అది తన నోరు తెరచెను. మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయను వారిని జయింపను దానికి అధికారమియ్యబడెను. ప్రతి వంశము ప్రతి ప్రజ మీదను ఆయా భాషలు మాటలాడువారి మీదను ప్రతి జనము మీదను అధికారము దానికియ్యబడెను. భూనివాసులందరును, అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడియున్న గొఱ్ఱె పిల్ల యొక్క జీవగ్రంధమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు, ఆ మృగమునకు నమస్కారము చేయుదురు. ఎవడైనను చెవిగలవాడైతే వినును గాక. ఎవడైనను చెరపట్టవలెనని యున్నయెడల వాడు చెరలోనికి పోవును. ఎవడైనను ఖడ్గముచేత చంపిన యెడల వాడు ఖడ్గము చేత చంపబడవలెను. ఈ విషయములో పరిశుద్ధులు ఓర్పును విశ్వాసమును కనబడును. మరియు భూమిలో నుండి మరియొక క్రూరమృగము పైకివచ్చుట చూచితిని. గొఱ్ఱె పిల్ల కొమ్ముల వంటి రెండు కొమ్ములు దానికుండెను. అది ఘటసర్పము వలే మాటలాడుచుండెను. అది ఆ మొదటి క్రూరమృగమునకున్న అధికారక చేష్టలన్నియు దాని యెదుట చేయుచున్నది. మరియు చావు దెబ్బ తగిలి బాగుపడి యున్న ఆ మొదటి మృగమునకు భూమియు దానిలో నివసించువారును నమస్కారము చేయునట్లు అది బలవంతము చేయుచున్నది. అది ఆకాశము నుండి భూమికి మనుష్యుల యెదుట అగ్ని దిగివచ్చునట్లుగా గొప్పసూచనలు చేయుచున్నది. కత్తి దెబ్బతినియు బ్రదికిన ఈ క్రూరమృగమునకు 

ప్రతిమను చేయవలెనని అది భూనివాసులతో చెప్పుచూ, ఆ మృగము ఎదుట చేయుటకు తనకియ్యబడిన సూచన వలన భూనివాసులను మోసపుచ్చుచున్నది. మరియు ఆ మృగము యొక్క ప్రతిమ మాట్లాడునట్లును ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయునట్లును ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారము ఇయ్యబడెను. కాగా కొద్ది వారు గాని గొప్ప వారు గాని, ధనికులు గాని దరిద్రులు గాని, స్వతంత్రులు గాని దాసులు గాని అందురును తమ కుడిచేతి మీదనైనను తమ నొసటియెందైనను ముద్ర వేయించుకొనునట్లును, ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిట సంఖ్యయైనను గలవాడు తప్ప, క్రయ, విక్రయాలు చేయుటకు మరి యెవనికిని అధికారము లేకుండునట్లును అదివారిని బలవంతము చేయుచున్నది. బుద్ధిగల వాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము. అది మనుష్యుని సంఖ్యయే. ఆ సంఖ్య ఆరువందల ఆరువదియారు (666). ఇందులో జ్ఞానము కలదు.’’వివరణ : 


వచనం 1 : మరియు పది కొమ్ములును ఏడు తలలును గల యొక క్రూరమృగము సముద్రములో నుండి పైకి వచ్చుట చూచితిని. దాని కొమ్ముల మీద పది కిరీటములును దాని తలలమీద దేవదూషణకరమైన పేళ్లును ఉండెను.

అపోస్తులుడైన ఒక క్రూరమృగము సముద్రములో నుండి పైకివచ్చుట చూచెను. యోహాను చూచిన ఈ మృగము ద్వారా దేవుడు. అంత్యక్రీస్తు ఈ భూమిపై ప్రత్యక్షమైనప్పుడు ఏమిచేయునో దానిని మనకు చూపించెను. దేవుడు యోహానుకు ఈ మృగము ఏడు తలలు, పది కొమ్ములతోనున్నట్లుగా చూపించినది. అచ్చం అలాగే యున్న ఒక మృగము వచ్చునని లోకంలో చురుకుగా నుండునని చెప్పుటకు కాదు గానీ ఈ మృగము వలే అధికారము శక్తి కలిగినవారు ఎవరో వచ్చునని పరిశుద్ధులను హింసించి వారి నుండి హతసాక్షులను చేయును.

అయినా ప్రకటనలో కనబడుచున్నవన్నీ గుర్తులే అవుతాయా? అలాకానే కాదు! కేవలము అంత్యకాల సమయంలో అంత్యక్రీస్తుని ప్రత్యక్షతను, క్రియలను చూపించుటకు, ఇలాంటివి దర్శనము ద్వారా ఇది దేవుడు మాత్రమే మాట్లాడగల శక్తి మరియు జ్ఞానమైయున్నది. ప్రకటన 13 వాక్యం ద్వారా మనము దాదాపు అంత్యకాలమునకు పోలిన చిత్రమును చూడగలము.

యోహాను మొదట చూచినది సముద్రము నుండి పైకి వచ్చుచున్న క్రూరమృగము ఆకారమే. ఆ మృగపు ఏడు తలలు పదికొమ్ములు ఇక్కడే ఈ లోకం నుండి రాబోవుచున్న అంత్యక్రీస్తు యొక్క అధికారాన్ని శక్తిని ప్రస్తావించుచున్నది. ఈ వాక్యం దాని కొమ్ముల మీద పది కిరీటములను, దాని తలల మీద దేవదూషణకరమైన పేళ్ళు ఉండెను. అనగా అంత్యక్రీస్తు లోకంలోని దేశమును దేవునికి వ్యతిరేకంగా నిలుచుటకు సమకూర్చును. మరియు లోకరాజులందరినీ ఏలునని కూడా చెప్పుచున్నది. ఏడు కిరీటములు దాని విజయమును సూచించును. మరియు మృగము తలపైనున్న దేవదూషణకరమైన పేర్లు వారి గర్వమును సూచించును. 

రాబోవు దినాలలో ప్రపంచము సంయుక్త దేశము కూటమిచే పరిపాలించబడును. ఇది ఒక పాలన వ్యవస్థను ఆధారం చేసికొని, సంయుక్తమైన దేశాల సామాన్య ఇష్టాలను వెదకును. ఈ ఏకీకృతమైన అతీత అధికారము ఒక అతిపెద్ద అతీత దేశా వ్యవస్థ తన సర్వసత్తాక ఆధిపత్యంను చూపుచూ లోకములోని అన్ని దేశములను ఏలును. మరియు అది ప్రతిఫలంగా అంత్యక్రీస్తు సంపూర్ణంగా ఈ భూమిపై బయల్పడినప్పుడు అతని క్రియలను అమలుపరచును. అతనే దేవుని విరోధి. అతను సాతాను పరిచారకుడు మరియు సాతాను అధికారి అను వస్త్రముచే కప్పబడినవాడు.

వచనం 2 : నేను చూచిన ఆ మృగము చిరుతపులిని పోలియుండెను. దాని పాదములు ఎలుగుబంటి పాదముల వంటివి. దాని నోరు సింహపు నోరు వంటిది. దానికి ఘటసర్పము తన బలమును తన సింహాసనమును గొప్ప అధికారమును ఇచ్చెను.


ఈ వచనము అంత్యక్రీస్తు తన ఉనికిలో పరిశుద్ధులను మరియు ఈ లోక ప్రజలను ఏమి చేయబోవునో చెప్పుచున్నది. అంత్యక్రీస్తు బయల్పడుటను అట్టి క్రియలను పరిశుద్ధుల యెడల జరిగించును. ఎందుకనగా అతడు బలమును అధికారము ఇట్టి క్రియలు జరిగించుటకై సాతాను నొద్ద నుండి పొందెను. అంత్యక్రీస్తు బయల్పడినప్పుడు ఎంత క్రూరంగా పరిశుద్ధుల పట్ల ప్రవర్తించునో చూపించుచున్నది. ఈ వచనం పరిశుద్ధులు ఎటువంటి బాధను, అంత్యక్రీస్తు వలన కలుగు హతసాక్ష్యముతో భరించవలెనో సూచించుచున్నది.

ఈ వచనం అంత్యక్రీస్తు భయంకర రూపమును చూపించుచున్నది. ఈ వాక్యం ‘‘అతని పాదములు ఎలుగుబంటి పాదముల వంటివి”అనగా అతని బలము ఎంత విచ్ఛిన్నకరమైనదో సూచించుచున్నది. ఇక్కడున్న ఘటసర్పము నిజానికి దేవునిచే సృజింపబడిన ఒక దేవదూత ఆయన సింహాసనము కొరకు ఆయనతో పోటీపడెను. ఈ అధ్యాయంలో చెప్పబడిన మృగము ఆ ఘటసర్పము నుండి అధికారము పొందినదై దేవునికి ఆయన పరిశుద్ధులను ఎదురించు క్రియలను జరిగించును.

సాతాను పరలోకం నుండి వెలివేయబడిన ఒక దూత, తన బలమును అధికారమును, దేవునికి వ్యతిరేకముగా నిలుచువానికి అనుగ్రహించి వాడు దేవునితోను ఆయన పరిశుద్ధులతోను పోరాడినట్లు నడిపించి అతనిని మరణమునకు నడుపును. ఆ అంత్యక్రీస్తు సాతాను అధికారము ధరించి, ఇష్టపూర్వకంగానే దేవుని ప్రజలను మరియు లోకనివాసులను రాబోవు దినములలో అణగద్రొక్కును.

వచనం 3 : దాని తలలో ఒక దానికి చావుదెబ్బ తగిలినట్టుండెను. అయితే ఆ చావుదెబ్బ మానిపోయెను గనుక భూజనులందరు మృగము వెంట వెళ్లుచు ఆశ్చర్యపడుచుండిరి.

ఆ అంత్యక్రీస్తు ఏడుగురు రాజుల్లో ఒకనిగా అవతరించునని ఈ వచనం తెలియచేయుచున్నది. అంత్యక్రీస్తు మృగముగా పిలువబడెను. ఎందుకనగా మృగపు చేష్టలను పరిశుద్ధుల పట్ల జరిగించును.

అంత్య దినాలలో సంభవించనైయున్న సమస్యలలో చావు సమస్యను కూడా పరిష్కరించగల సామార్థ్యం గల వానిగా దేవునికి ఆయన పరిశుద్ధులకు శత్రువుల వలే అంత్యక్రీస్తు కనబడును. అలాగే అటువంటి అనేక ప్రజలు అతనిని విశ్వసించుదురు ఎందుకనగా అతనే అంత్యదినములలో భూమిపై సంభవింపబోవు తెగుళ్ళన్నిటిని పరిష్కరించు సామర్థ్యం గలవాడని తలంచెదరు. కానీ అతడు దేవుని శత్రువు. అతడు లోక ప్రజలు తనకు విధేయులనగా చేసినప్పటికి అతడు అంత్యకాలములో నాశన పరచబడతాడు. ఎందుకనగా దేవునికి ఆయన పరిశుద్ధులకు శత్రువుగా ఉన్నందుననే.

వచనం 4 : ఆ మృగమునకు అధికారమిచ్చినందున వారు ఘటసర్పమునకు నమస్కారము చేసిరి. మరియు వారు ఆ మృగముతో సాటి యెవడు? దానితో యుద్దము చేయగలవాడెవడు? అని చెప్పుకొనుచు ఆ మృగమునకు నమస్కారము చేసిరి.

ఆ ఘటసర్పము తన బలమును మృగచేష్టలు చేయువానికి ఇచ్చి అతనిని తన పరిచారకునిగా మార్చుకొనునని ఈ వచనం తెలియచేయుచున్నది. ఇందు మూలమున ఈలోక ప్రజలందరూ ఘటసర్పమును దేవుడని తలంచి, భయముతో వణకుచూ ఆరాధింతురు. ఎందుకనగా ఆ మృగమునకున్నా అధికార బలము వంటి బలము ఈ భూరాజులకు లేడు. అతడు తనను తాను దేవునిగానూ, దేవుని రూపముగాను ప్రకటించుట నుండి మృగమును ఎవరూ ఆపలేరు.

ఆ ఘటసర్పము గొప్ప అధికారమును మృగమును ఇచ్చినందున ప్రతివారు ఘటసర్పమును, మృగమును ఘనపరచి ఘటసర్పమును తమ దేవునిగా ఆరాధించవలెను. అట్టి గొప్ప శక్తిని కలిగిన అంత్యక్రీస్తు అవతరించినమీదట వెలుగు కంటే చీకటిని అధికంగా ప్రేమించువారు అతనిని అనుసరించి అతనే దేవుడని పూజించి అతనిని అధికులనుగా చేయుదురు.

వచనం 5 : డంబపు మాటలను దేవదూషణలను పలుకు ఒక నోరు దానికి ఇయ్యబడెను. మరియు నలువది రెండు నెలలు తన కార్యము జరుపనధికారము దానికి ఏర్పాటాయెను.

ఆ మృగము ఘటసర్పము నుండి అతని శక్తిగల హృదయమును పొందినదై మూడు సంవత్సరముల ఆరు నెలలు (45నెలలు) డంబపు మాటలు పలుకుటకై అధికారమును పొందెను. కనుక ఆ మృగము ఈ మూడున్నర సంవత్సరముల కాలంలో లోక ప్రజలను, పరిశుద్ధులను బాధించును.

అంత్యక్రీస్తును ఆ దుష్టమృగము మూడున్నర సంవత్సరముల పాటు దేవునికి వ్యతిరేకంగా నిలిచి మాటలను పలుకుటకు మరియు ఆయన సంఘమును దూషించుటకు అధికారమును స్వీకరించును. పాపులందరూ ఈ మృగమునకు లొంగి తద్వారా మృగముతో కూడా నాశనములో పడుదురు.

వచనం 6 : గనుక దేవుని దూషించుటకును, ఆయన నామమును, ఆయన గుడారమును, పరలోక నివాసులను దూషించుటకు అది తన నోరు తెరచెను.

ఘటసర్పము నుండి అధికారము పొందినదైన మృగము దేవుని ఆయన దూతలను, పరిశుద్ధులను మూడున్నర సంవత్సరములు దూషించి శపించుచూ వారిని బాధించును. ఈ సంగతులన్నియూ ఘటసర్పము చెప్పినట్లుగానే జరిగించబడును. ఇక్కడ ఈ సాతాను చర్యను తెలిసికొన్నవారమై విశ్వసించాలి. అదేదనగా ఆ మృగమునకు మూడున్నర సంవత్సరములు దేవుని శపించుటకు అధికారమిచ్చుట కేవలం దేవుని అనుమతితోనే జరుగును.

ఘటసర్పము నుండి అధకారమును పొంది ఆ అంత్యక్రీస్తు మహాశ్రమల కాలమైన మొదటి మూడున్నర సంవత్సరముల కాలం దేవుని ఆయన ప్రజలను దూషించును.

వచనం 7 : మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయను వారిని జయింపను దానికి అధికారమియ్యబడెను. ప్రతి వంశము మీదను ప్రతి ప్రజ మీదను ఆయా భాషలు మాటలాడు వారి మీదను ప్రతి జనము మీదను అధికారము దానికియ్యబడెను.

ఆ మృగము పరిశుద్ధులను చంపుటకును, పరిశుద్ధులను హతసాక్షులనుగా చేయుటకును ఘటసర్పము నుండి అధికారము పొందును. మరియు అతను ప్రపంచమంతటిని పరిపాలించబోను లోకములోని ప్రతివారిని తన పరిపాలనలోనికి తెచ్చుకొనుటకు అధికారమియ్యబడెను.

ఈ లోకములో పరిపాలించుటకు తనకు గల ఏకైక మార్గమైన పరిశుద్ధులతో పోరాడుట మరియు వారిని జయించుటకు పరిశుద్ధులను అంత్యక్రీస్తు చంపును. పడద్రోయబడిన దూతైన సాతానుడు తానే దేవునిగా పిలువబడాలనే కోరిక కలవాడై అంత్యక్రీస్తును నడిపించును మరియు అతడు పరిశుద్ధులను చంపుట వలన అవిశ్వాసంతో దేవుడని కొలవబడును. ఈ శ్రమల కాలంలో పరిశుద్ధులందరూ అంత్యక్రీస్తుచే హింసింపబడి, హతసాక్షులవుతారు.

వచనం 8 : భూనివాసులందరును అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడియున్న గొఱ్ఱె పిల్ల యొక్క జీవగ్రంధమందు ఎవరిపేరు వ్రాయబడలేదో వారు, ఆ మృగమునకు నమస్కారము చేయుదురు.

అంత్యక్రీస్తు భూమిని జయించునప్పుడు నీరు మరియు ఆత్మమూలమైన సువార్త వలన తిరిగి జన్మించినవారు తప్ప అనగా ఇతర మార్గములో తిరిగి జన్మించని వారు అతనిని తమ దేవునిగా ఆరాధించెదరు. కానీ అంత్యక్రీస్తు కేవలము పాపులై జీవగ్రంధమందు తమ పేర్లు వ్రాయబడని వారిచే పూజింపబడును.

వచనం 9 : ఎవడైనను చెవిగలవాడైతే వినును గాక.

ఈ వచనం చెప్పునదేమనగా దేవునికి చెందిన ప్రజలైన వారు తప్పక అతని/ఆమె విశ్వాసమును హాతసాక్ష్యము కొరకు సిద్ధపరచుకోవాలి. ఎందుకనగా ఈ విషయాలన్నీ ఉన్నవి ఉన్నట్లుగా వేదానుసారముగా నెరవేర్చబడును.

వచంన 10 : ఎవడైనను చెరపట్టవలెనని యున్నయెడల వాడు చెరలోనికి పోవును, ఎవడైనను ఖడ్గముచేత చంపినయెడల వాడు ఖడ్గము చేత చంపబడవలెను. ఈ విషయములో పరిశుద్ధుల ఓర్పును విశ్వాసమును కనబడును.

ఇక్కడ దేవుడు తిరిగి జన్మించి పరిశుద్ధులను హతమార్చునట్టి మరణమునే అంతమందు హతమార్చువారికి కూడా కలిగించెదనని చెప్పుచున్నాడు. అంత్యక్రీస్తు మరియు అతని అనుచరులచే మహాశ్రమల కాలంలోని మొదటి మూడున్నర సంవత్సరముల కాలం గడిచిన తరవాత పరిశుద్ధులు చంపబడుదురు. దేవుడు వారికి అంతకంటే ఎక్కువ బాధను మరియు హింసను కలిగించును. అలాగే పరిశుద్ధులందరూ తమ హృదయాలను కలుపుకొని ఈ కష్టతరమైన హింసను ప్రభుని వాక్యములో తమకుగల విశ్వాసముతో జయించాలి. హతసాక్ష్యమును కౌగలించుట ద్వారా దేవుని మహిమపరచాలి.

వచనం 11 : మరియు భూమిలో నుండి మరియొక క్రూరమృగము పైకివచ్చుట చూచితిని. గొఱ్ఱె పిల్ల కొమ్ములవంటి రెండు కొమ్ములు దానికుండెను. అది ఘటసర్పము వలే మాటలాడుచుండెను. ఇక్కడ మనకు కనబడు మృగము మొదటిది కాదు కానీ రెండవది. ఈ రెండవ మృగము కూడా ఘటసర్పము వలే ఆలోచించును మరియు మాట్లాడును. కేవలము ఘటసర్పము వలే ఆలోచించుటే కాక అతని చర్యలను అతని నమ్మకము ప్రకారము అది పరిశుద్ధులను మరి విశేషముగా బాధించును. ఈ మృగము అంత్యక్రీస్తుకు ప్రవక్త.

వచంన 12 : అది ఆ మొదటి క్రూరమృగమునకున్న అధికార చేష్టలన్నియు దాని యెదుట చేయుచున్నది. మరియు చావు దెబ్బతగిలి బాగుపడి యున్న ఆ మొదటి మృగమునకు భూమియు దానిలో నివసించువారును నమస్కారము చేయునట్లు అది బలవంతము చేయుచున్నది.

ఈ రెండవ మృగము మొదటి మృగపు అధికారము పొంది ఆ మొదటి మృగమును ఆరాధించుచూ భూమిపై మిగిలిన ప్రతివారిని అతని ఆరాధించునట్లు చేయును. అతని క్రియలు మృగపు క్రియలవలే ఉండును మరియు ప్రతివారు అతని దేవుడుగా ఆరాధించునట్లు చేయును. ఇదే అతని సారాంశమును సాతాను యొక్క సత్యరూపమునైయున్నది.

వచనం 13 : అది ఆకాశము నుండి భూమికి మనుష్యుల యెదుట అగ్ని దిగివచ్చునట్టుగా గొప్ప సూచనలు చేయుచున్నది.

మనుష్యుల ఎదుట సాతాను అనేక అద్భుతములను భూమిపై జరిగించునట్లు గానే అతడు అనేకులను మోసగించగలడు. ఆకాశము నుండి భూమికి అగ్ని దిగివచ్చునట్లుగా చేయగల శక్తి దానికుండెను.

వచనం 14 : కత్తి దెబ్బ తినియు బ్రదికిన ఈ క్రూరమృగమునకు ప్రతిమ చేయవలెనని అది భూనివాసులతో చెప్పుచూ ఆ మృగము ఎదుట చేయుటకు తనకియ్యబడిన సూచన వలన భూనివాసులను మోసపుచ్చుచున్నది.

కానీ సాతాను త్వరలోనే సహజ స్వరూపమును చూపించును. అతడు చేయగోరునది ఏమనగా ప్రజల హృదయములో నుండి దేవుని పట్ల వారికి గల విశ్వాసమును దొంగిలించి దానికి ప్రతిగా తనను వారు ఆరాధించునట్లు చేయుట. ఈ అంత్య ఉద్దేశ్యమును నెరవేర్చుకొనుటకు అనగా దేవునివలే ఉండుటకు అతడు మరలా దేవుని స్థలమునకు ఎక్కుటకు ప్రయత్నించును. కనుక అతడు ఆ మొదటి మృగపు ప్రతిమను చేయును. దానిని ప్రజలు దేవుడని ఆరాధించెదరు.

వచనం 15 : మరియు ఆ మృగము యొక్క ప్రతిమ మాటలాడునట్లును ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయునట్లును ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారము ఇయ్యబడెను.

తనను తాను దేవునిగా ప్రకటించుకొనుటకు ప్రధాన ఆటంకము దేవుని ప్రజలు కనుక సాతాను వారిని తొలగించుటకై చేయగల ప్రతి క్రియలను జరిగించును. అతడు మృగపు ప్రతిమను ఆరాధించనని వారినందరినీ వారు ఎంత మందైననూ లెక్కచేయక వారిని చంపును. కానీ పరిశుద్ధులు ఈ మృగమునకు లొంగరు. అలాగే ఆ సమయంలో తమ విశ్వాసం కొరకు అనేకులైన పరిశుద్ధులు ఇష్టపూర్వకంగానే హతసాక్ష్యమును కౌగలించెదరు. వారు తమకు కలుగు బహుమానమును చూచెదరు. అంత్యక్రీస్తు పరిశుద్ధులకు గొప్ప హింసను కలుగచేసినట్లు దేవుడు నిత్యనరకాగ్నిలో కాల్చబడునట్లు శిక్షించును.

వచనం 16-17 : కాగా కొద్ది వారు గాని గొప్పవారు గాని, ధనికులు గాని దరిద్రులు గాని, స్వతంత్రులు గాని దాసులు గాని, అందరును తమ కుడిచేతి మీదనైనను నొసటియందైనను ముద్ర వేయించుకొనునట్లును ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిట సంఖ్యయైనను గలవాడు తప్ప క్రయ, విక్రయాలు చేయుటకు మరియెవనికిని అధికారము లేకుండునట్లును అది వారిని బలవంతము చేయుచున్నది.

శ్రమలు అత్యధిక స్థాయికి చేరినప్పుడు ప్రతివారు తమ నుదిటి మీద, చేతిమీద ఒక ముద్రను వేయించుకోవాలని అంత్యక్రీస్తు కోరతాడు. దాని వలన ప్రతివారు తమ అధికారము క్రిందికి వస్తారని నమ్ముతాడు. ఈ ముద్రే మృగపు ముద్ర ప్రతివారిని తనకు పరిచారకునిగా చేసికొనుటకు అంత్యక్రీస్తే ఈ ముద్ర వేయించుకొనుమని ప్రజలను బలవంతపెట్టును.

ప్రజల ప్రాణమును తన గుప్పెటలో ఉంచుకొని తరువాత అంత్యక్రీస్తు తన రాజకీయ విధానాలతో కొనసాగును. కనుక ఆ మృగము ముద్రలేని వారిని తనతో సంధిచేసికొనుటకు అతడు/ఆమెను సాక్ష్యముగా చేయక ఎవరిని వదలడు, ఏదైనను కొనుటకైనను, అమ్ముటకైనను ఈ ముద్ర మృగపు పేరుగా గానీ సంఖ్యగాని ఉండును. భవిష్యత్తులో మృగము లోకమునకు వచ్చునప్పుడు ప్రతివారు అతని ముద్రను వేయించుకోవాలి. అది దాని పేరుతో గాని సంఖ్యతో గాని చేయబడును. కనుక మనకు మనమే దేవుని హెచ్చరికను జ్ఞాపకం చేసుకోవాలి. అదేమనగా ఆ ముద్రను పొందువాడు నరకాగ్నిలోను, గంధకములోను త్రోయబడును.

వచనం 18 : బుద్ధిగల వాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము. అది మనుష్యుని సంఖ్యయే. ఆ సంఖ్య ఆరువందల ఆరువదియారు (666). ఇందులో జ్ఞానము కలదు.

మృగపు సంఖ్య 666 క్లుప్తముగా మృగము తానే దేవుడు ‘‘ఒక మనుష్యుని దేవునిగా” చూపించగల సంఖ్య కలదా? అట్టి అర్థము కల సంఖ్య అంత్యక్రీస్తు సంఖ్యయే. అలాగే పరిశుద్ధులు ఈ ముద్రను పొందరు. ఎందుకనగా కేవలము నమ్మదగిన దేవుడే మనకు నిజమైన దేవుడు. ప్రభువు నందు తమకు గల విశ్వాసముతోను దేవునికి మహిమకరముగా నుండునట్లు పరిశుద్ధులు సాతానును జయించాలి. పరిశుద్ధులు సమస్త మహిమ దేవునికి చెల్లించగల మంచి విశ్వాసంతో కూడిన ఆరాధన ఇదే.మూల పదములకు వివరణ :


13వ అధ్యాయంలోని విషయము అంత్యక్రీస్తు మరియు సాతాను ప్రత్యక్షతను గూర్చియే. వారి ప్రత్యక్షతతో పరిశుద్ధులు ఆత్మసంబంధమైన యుద్ధములో మునిగి యుందురు. దీనిలో మరి ఏ దారి లేక వారు అంత్యక్రీస్తుచే హతసాక్షులుగా మార్చబడెదరు. ఈ యుగమందు జీవించుట క్రైస్తవుల, క్రైస్తవేతరులైన వారందరూ ఒకే విధముగా తెలిసికొనవలసినదే ప్రకటన వాక్యము.

ప్రకటన 13వ అధ్యాయంలో అంత్యక్రీస్తు దేవునిగా ప్రతిమను చేయించునని ప్రవచనం చెప్పినది. రాజకీయంగా శక్తిగల వారైన ఒకరికి సాతాను గొప్ప అధికారమును అనుగ్రహించి అతనిని దేవునికి ఆయన పరిశుద్ధులకు విరోధముగా నిలుచునట్లు చేయును. ప్రత్యేకంగా అంత్యక్రీస్తు అతనినే దేవునిగా రూపించి విగ్రహముగా చేయించి అతనిని తృప్తిపరచును.

దేవుని ప్రజతో సహా ప్రతివాడు మృగమైన అంత్యక్రీస్తుచే కలుగబోవు శ్రమలు మరియు హింస వలన అధిక శ్రమలు పొందుతారు. ప్రధాన భాగము అంత్యక్రీస్తు ప్రతిమ సాతాను జీవపు ఊపిరిని పొంది అది జీవించియున్నట్లే మాట్లాడగలుగును. అలాగే ప్రజలకు హాని కలిగించు అధికారము పొంది యుండును. తిరిగి జన్మించనివారును అతనికి లొంగిపోయి అతని దాసులగుదురు. సాతాను ప్రతిమను పూజించని వారు మరొకప్రక్క చంపబడతారు ఎంతమందైననూ అదుపులేకపోవును. సాతాను కూడా వాని నొసటిమీదగానీ, కుడి చేతి మీదగాని తన ముద్రలను కానీ సంఖ్యను గానీ అందరూ పొందేటట్లు చేయును.

కనుక మనము ముందుగానే మన విశ్వాసమును సిద్ధపరచుకోవాలి. మరియు రాబోవు కాలములో ప్రకటన 13లో చెప్పబడిన వాక్యము యొక్క భావమును నమ్మి అర్థం చేసుకొని సాతానుతో పోరాడి జయించాలి. ప్రకటన వాక్యము నుండి నేర్చుకొనుచు దానిని విశ్వసించుచూ ప్రభువనకు దేవుని ప్రజలమైన ఈ కాలపు జనులు మహిమపరచాలి మరియు ఆలాగున అంత్యక్రీస్తు వ్యతిరేకముగా స్థిరముగా నిలిచి అతనిని జయించి విజయం పొందాలి.నరకము పుట్టుక : 


నరకము యొక్క ఉనికి మరియు అతి ఎందుకు ఉండాలి. అను దానిని మనం తెలుసుకోవాలి. నరకము సాతాను కొరకు ఏర్పాటు చేయబడిన స్థలము. అతడు మొదటి నుండి సాతాను కాదు కానీ దేవునిచే సృజింపబడిన అనేక దూతలలో ఒకడు అని బైబిలు చెప్పుచున్నది. అతడు తన గర్వముతో దేవుని సవాలు చేసి తన పాపమునకు బహుమానంగా సాతానుగా మారినది. మరియు అతనికి హద్దులు నియమించుటకు దేవుడు నరకము అను స్థలమును నియమించెను. తనకు వ్యతిరేకముగా నిలుచుటకు నియమించబడిన శిక్షను సాతానునకు అతని అనుచరులకిచ్చుటకు దేవుడు నరకమును చేసెను.

యెషయా 14:12-15లో ఈ దూత సాతానుగా ఎలా మారినదో వివరించును. ‘‘తేజోనక్షత్రమా, వేకువచుక్కా, నీవెట్లు ఆకాశము నుండి పడితివి? జనములను పడగొట్టిన నీవు నేలమట్టమువరకు ఎట్లు నరకబడితివి? నేను ఆకాశమునకెక్కిపోయెదను దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. ఉత్తర దిక్కుననున్న సభాపర్వతము మీద కూర్చుందును. మేఘమండలము విూదికెక్కుదును మహోన్నతునితో నన్ను సమానునిగా చేసికొందును అని నీవు మనస్సులో అనుకొంటివిగదా?’’ నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడతివే.’’

ఈ దూత పరమందు దేవునికి వ్యతిరేకముగా నిలిచి ఆయన సింహాసనమును ఆశించినది. తనకంటే దేవుడు మాత్రమే అధికముగా నుండుట చూచి, అతడు ఆయనను తోలివేయుటకును సింహాసనమెక్కుటకును అతడే దేవునిచే తోలివేయబడి సాతానుగా మారెను. ఈ తిరుగుబాటులో సాతానును అనుసరించిన దూతలను దయ్యములని వివరించెను. తనకు వ్యతిరేకముగా తిరిగి వారి మీదికి తన న్యాయ శిక్షను పంపుటకైన ‘‘నరకమును” స్థలమును దేవుడు చేసెను. సాతాను దేవుని సవాలు చేయుచూ ఆయన క్రియలను దూషించుచున్ననూ అందరికీ నీరు మరియు ఆత్మమూలమైన సువార్త ప్రకటించబడినప్పుడు అతడు వెయ్యి సంవత్సరముల వరకు పాతాళములో బంధింపబడెను.

దేవునికి విరోధముగా మారుటను పాపమును బట్టి సాతాను ప్రాథమికముగా పశ్చాత్తాపపడలేదు. కనుక తనను తాను దేవుని కంటే అధికముగా కొనసాగించును. మరియు నిత్యనరకాగ్నిని శిక్షగా పొందుకొనును. అతని అంతము వరకు సాతాను దేవునికి, నీతిమంతులకు వ్యతిరేకిగా నిలిచి దేవుని, అతని పరిచారకులను దూషించు దూతను బైబిల్‌ సాతాను లేదా దయ్యము మరియు ఘటసర్పము లేదా ఆది సర్పము అని పిలిచెను. (ప్రకటన 12:9)ఆ మృగము యొక్క సంఖ్య 666


దేవుడు అంతమున సాతానును తన ఖైదులో బంధించును. అతను నరకములో పరిమితం కాకముందు తన పేరును గానీ సంఖ్య (666)ను గానీ కలిగిన తన ముద్రను ప్రజలు వేయించుకొనునట్లు చేయును. అది వారి కుడిచేతి మీద కానీ, నొసటిమీద కానీ వేయును. ఈ ముద్రను వేయించుకొనని వారిని అది ఏ వస్తువును కొనకుండా లేదా అమ్మకుండా చేయును.

7 పరిపూర్ణ సంఖ్య అది దేవుని సూచించును. మరొక ప్రక్క 6 అను సంఖ్య మనుష్యుని సూచించును. ఎందుకనగా దేవుడు తన రూపములో, తన పోలిక చొప్పున ఆరవ దినమున మనిషిని సృజించెను. ఇక్కడ మృగపు సంఖ్య 666 త్రియేక దేవునిగా మారుటకై మనిషి ప్రయత్నించుట అను గర్వమును కనుపరచును. ఎంతో కాలములో కాక ఈ 666 ముద్రను ఈ భూమిపై మనుష్యులు వేయించుకొను దినము వచ్చుచున్నది.

ప్రకటన 13:1లో పది దేశముల నుండి ఏడుగురు రాజులు వచ్చునని చెప్పబడెను. వారిలో అధికశక్తిగలవాడు. సాతాను నుండి అధికారము పొందినవాడై ఈ లోకమును తన అధికారమునకు లోపరచును. గాయమును స్వస్థపరచుచూ ఆకాశము నుండి అగ్నిని కురిపించుచూ లోకప్రజలను అతనిని అనుసరించునట్లుగా గొప్ప అద్భుతము చేయును.

దానియేలు గ్రంధములో మనము చూచినట్లు మహాశ్రమల కాలము తన మొదటి సగము కాలమును సమీపించిన తరువాత శ్రమలు, విశేషముగా అధికమగును. ఈ మొదటి సగము కాలము సాతాను బలమైన పరిపాలన మరియు భయంకరమైన తెగుళ్ళ కాలములోని మొదటి మూడున్నర సంవత్సరములతో ముగియును. కానీ ఈ మొదటి మూడున్నర సంవత్సరముల కాలము పూర్తైన తరువాత జరుగుచున్నదేమనగా మరి అధిక శ్రమల ప్రవాహము ఈ సమయంలో తన క్రియలను ప్రజల మధ్య జరిగించుటకు తన మాట వినని వారిని చంపుటకు ఆకాశము నుండి అగ్నిని దించుట తన ప్రతిమను చేయుట వంటి అద్భుతము జరిగించుటకు మరియు దేవుని దూషించుట అను క్రియలు వారు జరిగించునట్లు చేయుటకు సాతానుకు అధికారమియ్యబడును.

అదే సమయంలో పూర్తి అధికారమును సాతాను నుండి పొందినవాడైన అంత్యక్రీస్తు తనకు లోబడని పరిశుద్ధులను చంపుచూ, దూషించును. వచనం 7-8లో చెప్పబడినట్లు ‘‘మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయును వారిని జయింపను దానికి అధికారమియ్యబడెను. ప్రతి వంశము మీదను ప్రతి ప్రజల మీదను ఆయా భాషలు మాటలాడువారి మీదను ప్రతి జనము మీదను అధికారము దానికియ్యబడెను. భూనివాసులందరును, అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడియున్న గొఱ్ఱె పిల్ల యొక్క జీవగ్రంధమందును ఎవరిపేరు వ్రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారము చేయుదురు.’’ అయిననూ ఆ సమయంలో కూడా మృగమును ఆరాధించుటకు తిరస్కరించిన వారు ఉంటారు. వీరు తిరిగి జన్మించిన దేవుని ప్రజయే. వారి పేర్లు దేవుని గొర్రె పిల్ల గ్రంధమందు వ్రాయబడెను.హతసాక్ష్యము యొక్కప్రత్యక్షత : 


నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను విశ్వసించి తిరిగి జన్మించిన పరిశుద్ధులు. సాతాను ముద్రను తిరస్కరించి ప్రభునిలో తమ విశ్వాసమును కాపాడుకొనుట అను చర్యతో హతసాక్ష్యము ప్రత్యక్ష పరచబడును. వేరే విధంగా చూస్తే మహాశ్రమల కాలములోని మొదటి మూడున్నర సంవత్సరముల కాలము పూర్తవగా శ్రమలు పూర్తి స్థాయిలోనికి చేరుకొనుట మనం చూస్తాం. ఈ సమయంలో నీతిమంతులు తమ విశ్వాసంతో హతసాక్ష్యమునకు సిద్ధపడతారు.

అయిననూ యేసును తమ స్వంత రక్షకుడని విశ్వసించిననూ నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను నమ్మనివారై తమ పాపపరిహారమును ఇంకనూ తమ హృదయాలలో పొందని వారు సాతానుచే త్రోవ విడిచి వానికి లొంగెదరు. ఎందుకనగా యేసును నమ్మి తిరిగి జన్మించని వారు తమ హృదయంలో ఆత్మను పొందలేదు. కనుక ఒత్తిడి కలిగినప్పుడు వారు సాతానుచే పట్టబడి తమ కుడి చేతిమీద కానీ తమ నొసటి మీద కానీ అతని ముద్రను వేయించుకొని అంత్యకాలంలో అతనిని దేవునిగా ఆరాధిస్తారు.

ఈ సమయంలో సాతానును ఆరాధించని వారు కేవలము తమ పాప పరిహారము పొందిన వారేనని మనం స్పష్టంగా తెలిసికోవాలి. ఆ మృగమునకు లొంగిపోయిన వారందరినీ ఆ సాతానుతో పాటు గంధకము మరియు అగ్నిగుండములోనికి త్రోసివేస్తానని దేవుడు మనకు స్పష్టంగా తెలియచేసెనని మనం గుర్తించాలి.

వచనం 9-11 లో ఈ విధంగా చెప్పుచున్నది ‘‘ఎవడైనను చెవిగలవాడైతే వినును గాక. ఎవడైనను చెరపట్టవలెనని యున్న యెడల వాడు చెరలోనికి పోవును. ఎవడైనను ఖడ్గముచేత చంపిన యెడల వాడు ఖడ్గము చేత చంపబడవలెను. ఈ విషయములో పరిశుద్ధుల ఓర్పును విశ్వాసమును కనబడును. మరియు భూమిలో నుండి మరియొక క్రూరమృగము పైకివచ్చుట చూచితిని. గొఱ్ఱె పిల్ల కొమ్మువంటి రెండు కొమ్ములు దానికుండెను. అది ఘటసర్పము వలే మాటలాడు చుండెను.’’ ఆ సమయంలో వారి ఖడ్గముతో చంపబడునట్లు చేస్తారు. మనము ఇక్కడ తప్పక గుర్తించవలసినదేమనగా ఏది ఏమైననూ నీతిమంతులను హింసించుచూ వారిని చంపుచుండు వారిపై దేవుడు తప్పక మన పక్షంగా పగతీర్చును.

అలాగే పరిశుద్ధులు వాగ్ధానమును విశ్వసించుట ద్వారా హింస మరియు మరణము ద్వారా ప్రయాణించవలెను. మన దేవుడు తన ప్రతికారమును మన శత్రువులపైకి తేకుండునా ఎంతవరకు మనము న్యాయమైన తీర్పు కొరకై అణగార్చబడిన హృదయాలతో మనకన్ను మూసుకొంటాం. కానీ దేవుడు ప్రతికారము తీర్చెదనని మనకు వాగ్ధానము చేసిన విధముగానే మనకు హాని కలిగించిన వారిపై పగతీర్చును. మన మరణము వ్యర్థము కాదు. దేవుడు ఎంతో నిశ్చయముగా నీతిమంతులను బాధించి, హింసించువారిపై పగతీర్చును. మరియు నీతిమంతులను పునరుద్ధానమునకు ఎత్తబడుటకు మరియు గొర్రె పిల్ల వివాహవిందుకు, వెయ్యేండ్లు ఆయనతో కూడా ఏలుటకు ఆయనతో పాటు శాశ్వతంగా జీవించుటకు వారిని నడిపించును. మన మందరము దీనిని విశ్వసించి దానికొరకు నిరీక్షించాలి. కనుక మన ప్రభువు నిరీక్షణను నెరవేర్చు మంచి దేవుడైయున్నాడు.