Sermons

[అధ్యాయము 13-2] <ప్రకటన 13:1-18> ఆ అంత్యక్రీస్తు ప్రత్యక్షత<ప్రకటన 13:1-18>


ప్రధాన అంశంపై ఆధారపడి అంత్యక్రీస్తు ప్రత్యక్షత మరియు హతసాక్ష్యమును గూర్చి నేను ఇప్పుడు చర్చిస్తాను. 13వ అధ్యాయం నుండి సముద్రములో వచ్చుచున్న మృగమును మనం చూస్తున్నాం. ఈ పదికొమ్ములు ఏడు తలలు కల మృగము అంత్యక్రీస్తు కాక మరి ఏదీ కాదు. ఈ మృగపు కొమ్ములపై పది కిరీటములున్నట్లుగా దానినొసట దేవదూషణ నామము ఈ భాగములో చెప్పబడెను. ఆ మృగము చిరుతపులి వలె నుండి దాని పాదములు ఎలుగుబంటి పాదము వంటిది. ఆ ఘటసర్పము అతనికి అతని శక్తిని అతని సింహాసనమును మరియు గొప్ప అధికారమును ఇచ్చెను. ఒకటి చావు దెబ్బతగిలియుండెను. కానీ అది అద్భుతముగా మానిపోయెను.

దీని వలన ఆశ్చర్యపడి ప్రపంచమంతా అతనిని అనుసరించెను. మరియు ఆ ఘటసర్పము తన అధికారమును అతనికి ఇచ్చినందున వారు ‘‘ఈ మృగము వంటి వారెవరు? అతనితో యుద్ధము చేయగల వారెవరు?’’అని చెప్పుచూ ఆ ఘటసర్పమును, మృగమును ఆరాధించెను. ఆ మృగమునకు దూషణకరమైన గొప్ప మాటలాడు నోరు ఇవ్వబడెను. మరియు 42 నెలల వరకు తన క్రియలను కొనసాగించు శక్తియు ఇవ్వబడెను.సముద్రములో నుండి లేచుచున్న ఆ మృగము :


అపోస్తులుడైన యోహాను చూచినదేమనగా అంత్యకాలములో ఈలోక నాయకుల నుండి అంత్యక్రీస్తు వచ్చుట. ఈ అంత్యక్రీస్తే మృగము వలే సముద్రము నుండి వేటాడునట్టి ఏడు తలలు పది కొమ్ములు కలదాయెను.

ఈ మృగము లోకములోనికి వాస్తవముగా వచ్చు మృగమో కాదో మొదట మనం తప్పక కనుగొనాలి. మృగంలో మనకు ఆసక్తి కలిగించు రెండు ప్రధాన విషయాలు ఉన్నాయి. మొదటిది ఈ మృగము వాస్తవంగా ఈ లోకంలో ప్రత్యక్షమై ప్రజలను చంపునా లేదా రెండవది ఈ లోకపాలకులలో నుండి దుష్టుడైన అంత్యక్రీస్తుతో మృగము పోల్చబడినదా, ప్రజల నుండి ఆసక్తిని చూరగొను విషయాలలో ఇది కూడా ఉన్నాయి. వీటి గూర్చి అవగాహన కలవారు ఇవి చాలా సులువుగా అర్థం చేసుకొనవచ్చు అనిచెప్పవచ్చు. కానీ వాటిని ఎరుగని వారికి వాస్తవంగా ఈ మృగము అంత్యకాలంలో ప్రత్యక్షమై లోకమును ప్రజలను పాలించునా అనునది సమస్యగా నుండుట అత్యంత సహజం.

అధ్యాయం 13లో సాతానుచే నడిపింపబడు వాడై ఈ లోకమును ఏలబోవు రాజు ప్రత్యక్షతను గూర్చి దేవుడు మాట్లాడెను. ‘‘సముద్రములో నుండి వచ్చుచున్న” అను వాక్యము ప్రపంచ నాయకులైన ఏడుగురిలో ఒకడు అంత్యక్రీస్తగునని అర్థమిచ్చుచున్నది. అంత్యక్రీస్తు వైపునకు పది దేశాలు తిరిగి అతనితో కలసి క్షుణంగా నాశనమైన లోకమును పాలిస్తారు.

మృగము తలలోని ఒక తలకు తగిలిన చావు దెబ్బ మరోవైపు మనకు బోధించునది. ఆ ఏడుగురు రాజులలో ఒకరు చావు దెబ్బతినినా కానీ ఆ చావుదెబ్బ కూడా మానిపోవును. ఆ రాజు వైద్యభాషలో మృతమై అద్భుతముగా జీవింపబడెను. తరువాత ఆ ఘటసర్పముగా పనిచేయును. ఇక్కడ ఘటసర్పము అనగా సాతాను అని అర్థం. ఆ ఘటసర్పము వలే ప్రజలకు హాని చేయుచూ వారిని నాశనపరచుటకు అవసరమైన అధికారమంతయూ ఆ మృగమునకుండెను. అంత్య దినము వచ్చినప్పుడు ఈ లోకములో అట్టి మృగము వంటి మనిషి బయల్పడి గాడ్జిల్లా ఎంతగా మనుష్యులను చంపునో అంతగా ప్రజలను హతమార్చును.

సాతాను పరిచారకుడు బయల్పడుటతో ఈ లోకము తన నాశనమునకు పయనించును. ఈ అఖరి యుగములో తన క్రియలు జరిగించుటకై సాతాను ఎన్నుకొన్న విధానము ఏదనగా తన పరిచారకుని ద్వారా ప్రజలను ఆకర్షించుటే. ఇదే సూత్రము ఆధారముగానే దేవుడు తన పరిశుద్ధుల ద్వారా పాపులను తమ పాపము నుండి విడిపించుచున్నాడు.

ఈ విభాగములో మనకొరకు ఉన్న అర్థమును ఉన్నది ఉన్నట్లుగా చూచుట మనకు ఎంతో అవసరము. ఈ భాగములో మృగపు తలలో ఒకటి గాయపడినట్లుగా ఈ లోక నాయకుడు తన చావదగిన గాయము నుండి, ఘటసర్పము నుండి అధికారము పొందును. మరియు అతడు దేవుడైనట్లుగానే ప్రజలచే గౌరవపరచబడును. అందువలన ఈ మృగము వంటివారెవరు? అతనితో యుద్ధము చేయగల సమర్థులు ఎవరు అని ప్రజలు చెప్పుకొనునప్పుడు మనం గుర్తు చేసుకొనవలెను.

ప్రస్తుత భాగములో కనబడుచున్న అంత్యక్రీస్తు సాతాను అధికారమునకు లోనైన ప్రజలందరిచే గౌరవించబడి దేవునికి వ్యతిరేకంగా నిలుచును. అనగా ఆఖరి దినములలో శక్తిగల నాయకుడు ఈ లోకంలో అవతరించి దానిని యేలును. ఈ పరిపాలకుడు ప్రపంచంలోని దేశాలలో ఒక దానికి పాలకుడై ఉంటాడు. సాతాను నుండి అంత్యక్రీస్తు ఆత్మను పొందినవాడై అతడు బలవంతుడైన నాయకుని వలే అవతరించును. అప్పుడు ఈ లోకము అతని పాలన క్రిందకు వచ్చును. మరియు అతనిచే భవిష్యత్తులో ప్రపంచమంతయూ ఏకమై ఒక రాష్ట్రము వలెనే ఉండును. ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశాలు వాటితో అవి సహకరించుకొని వారిలో శక్తిగల నాయకుని ముందుపెట్టి తమ పాలనను ప్రపంచమంతటికి అందిస్తారు.

యూరప్‌లో మనం యూరోపియన్‌ యూనియన్‌ని చూస్తున్నాం. ఆసియాలో అమెరికాతో సహా అన్ని రాష్ట్రాలలో ఐక్యపరచుతూ ఒకే రాజకీయ నిర్మాణమును కోరుతున్నాయి. అట్టి సంస్థలు భవిష్యత్తులో అభివృద్ధి పొందినప్పుడు, శక్తివంత ఐక్య రాష్ట్ర ప్రజలు బయల్పడును. మరియు అట్టి సమైఖ్య రాష్ట్రాల నుండి ఒక శక్తివంతమైన నాయకుడు వచ్చును. అతడు దేవునికి వ్యతిరేకిగా నిలచుచూ అంత్యక్రీస్తు పాత్రను పోషించును. అతడు ఆకర్షణీయమైన నాయకుడై ఏలుటకు అధికారము కలిగి యుండును. మరియు అతడు అందరినీ సంతోషపెట్టుట వలన లోకము సద్దుమణుగునట్లు చేయును.

ఎందుకు ? గొప్ప సమర్థతను, అధికారమును ఘటసర్పమును సాతాను నుండి పొందుటతో, అతని జ్ఞానము సాధారణ ప్రజలకుభిన్నంగా ఉండును. మరియు అతని ఆలోచనలు కూడా సామన్యుల ఆలోచనలకు భిన్నంగా ఉండును. అతని జ్ఞానము అధికారము ఆకాశమునంటును. అతడు చెప్పునదంతయూ ఏ సమస్యను ఎదుర్కొనకుండానే నెరవేరు మరియు అతని స్థానమును, ఆక్రమించుటకై ఎవరూ సాహసించలేరు. అతని ఏలుబడిలోనున్న ఈ కాలము ప్రకటన 6లో వ్రాయబడిన పాండువర్ణగుర్రపు యుగమైయున్నది.

ఈ పాండువర్ణ గుర్రపు సమీప భవిష్యత్తులోనే ఎంతో ఖచ్చితంగా వచ్చును. అప్పుడు ఈ లోకము కొంత కాలము అంత్యక్రీస్తు దగును. కానీ ఈ సత్యమును ఎరుగనివారు వాస్తవంగానే అంత్యక్రీస్తు వంటి శక్తిగల నాయకుని కొరకు ఎదురుచూస్తారు. అలాగైతే పరిశుద్ధులు ఈ సత్యమును తెలిసినవారు మరియు ఈ యుగములో జాగ్రత్తగా నుంటారు. అందువలన సమయం వచ్చినప్పుడు వారు అంత్యక్రీస్తును నిరోధించి ఎదిరిస్తారు. తమ విశ్వాసాన్ని కాపాడుకొనుటకు హతసాక్షులవుతారు.

ఈ దినాలలో ఎంతోమంది తమ స్వదేశ నాయకుని పూర్తిగా గౌరవించారు. వారు నివసించుదేశంతో సంబంధం లేకుండా సాధారణంగా ప్రజలు తమ రాజకీయ నాయకులలో అసంతృప్తి కలిగి ఉంటారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఒక శక్తిగల సమర్థుడైన నాయకుని కొరకు ఎదురుచూస్తారు. ఎందుకు? ఈ లోకముపై పర్వతము వలే నున్న సమస్యలు ఆహారకొరత నుండి వాతావరణ, సమస్యలు ఆహారకొరత నుండి వాతావరణ క్షీణత వరకు మత సంబంధ సమస్యలు ఆర్థిక అసమతుల్యత జాతి పర సమస్యలు మరియు అట్టి వాటిని పరిష్కరించగల నాయకుడు అవసరం. కనుక ఈ లోకనాయకుడు గొప్ప శక్తితో, జ్ఞానముతోను సైన్యము కలిగి యున్నప్పుడు అన్ని సమస్యలను పరిష్కరించగలడు. లోకంలో ప్రతివారు అతనిని దేవునిగా గౌరవిస్తారు. మరియు అతనిచే పరిపాలించబడుటకు సంతోషిస్తారు. ఈ నాయకుడైన అంత్యక్రీస్తు లోకమును తన గుప్పిటలో నుంచుకొని ప్రతిదానికి జాగ్రత్తలు తీసుకొనును. అట్టి ఏకాభిప్రాయము అట్టి పరిపాలకుని కొరకై ఎదురుచూస్తున్న ఈ యుగము నల్లని గుర్రపు యుగమైయున్నది.

అన్ని విధాలా మనం గౌరవించదగిన రాజకీయ నాయకుడు మనకు అవసరమే. కానీ అట్టి కోరికను అందుకొనుట అతికష్టము. ఎందుకనగా ఇట్టి నాయకుడు రాడు లేదా వాస్తవంగా ఉనికిలోకి రాడు. కానీ ఈ లోక రాజకీయ ఆర్థిక సమస్యను పరిష్కరించుటకు అంత్యక్రీస్తు రావలసియుండగా ప్రతివారు కోరిన విధముగా అట్టి నాయకుడతడు కాగలడు. ఎట్లనగా అతడు ఈ లోకంలో రాజకీయ, ఆర్థిక స్థిరత్వమును తేగలడు.

నల్లని గుర్రపు యుగము గడవగానే పాండు వర్ణ గుర్రపు యుగము ఆరంభించును. ఏడు బూరల తెగుళ్ళ వలన నాశనమైన లోకము శక్తిగల సమర్థుడైన నాయకుని కోరుకొనును. చిన్న దేశాలకు చెందిన శక్తిలేని నాయకుల లోక సమస్యలను సాధించలేరు. అలాగే ప్రజలు ఖచ్చితమైన నాయకుని కొరకు ఎదురుచూస్తారు. ఈ సమయంలో అంత్యక్రీస్తు ప్రత్యక్షమవుతాడు. దేవుని వలే మాట్లాడుచూ క్రియలు జరిగిస్తాడు. అతడు చావు దెబ్బ నుండి స్వస్థత పొందినందున అతనిచే ప్రజలు ఆశ్చర్యపరచబడతారు. అతడు తిరిగి బ్రతుకుట వలన గొప్ప శక్తి, ధైర్యం కలిగిన నాయకునివలే క్రియ చేయుచుండగా ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు అతనిని దేవుడుగా భావిస్తారు.

అలాగే ఇశ్రాయేలు ప్రజలు కూడా తాము ఎదురుచూస్తున్న మెస్సయ్య ఇతడే అని నమ్ముతారు. కానీ అతి త్వరగానే అతడు అబద్ధికుడని వారు గుర్తిస్తారు. మరియు యేసుక్రీస్తు వారి నిజమెస్సయ్య అని నమ్ముతారు. కనుక వారిలో అనేకులు రక్షింపబడతారు. ‘‘అతనికి వ్యతిరేకంగా ఎల్లప్పుడూ నిలువగలవారు ఎవరని?’’ ప్రజలు చెప్పుకొనుట అంత్యక్రీస్తు వినును. అతనికి లోబడని వారిని ఏ మినహాయింపు లేకుండా అతడు చంపును.

పాండువర్ణ గుర్రపు యుగము వచ్చునప్పుడు సహజ తెగుళ్ళు వలన మాత్రమే ఈ లోకం బాధింపబడక దాని అడవిలో మూడవ వంతును కాల్చు అగ్ని అధికమైన మంచుతో కప్పబడును కానీ లోక ప్రజలు అందరు కలసికట్టుగా ఒకే అధికారి క్రిందకు వచ్చి అతనిని తమ రాజుగా ఆరాధిస్తారు. ఈ సమస్యలన్నిటిని పరిష్కరించువాడు. దేవుని వలే వారిచే ఎత్తునకు ఎత్తబడతాడు.

ఈ విషయములన్నీ దేవుని ప్రణాళికలోనివే, ఇవన్నియూ లోకమునకు సంభవించనైయుండుగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తించదగిన వాతావరణ మార్పు సంభవించును. మరియు కేంద్రీకృతమైన ప్రభుత్వ అధికారి అవసరం కొరకు ప్రతి దేశ నాయకులలో ఏకాభిప్రాయం సాధ్యమగును. అట్టి ఏకాభిప్రాయము అట్టి పరిపాలకుని కొరకై ఎదురుచూస్తున్న ఈ యుగము నల్లని గుర్రపు యుగమైయున్నది. ప్రస్తుతము అత్యంత శక్తిగల నాయకుడు లోకానికి అవసరం. ప్రతి దేశ నాయకుడు తమ స్వంత ప్రజల వ్యక్తిగత నాయకుడు లోకానికి అవసరం. ప్రతి దేశ నాయకుడు తమ స్వంత ప్రజల వ్యక్తిగత అసంతృప్తిని పోగొట్టలేనందున మానవాళి వారు ఎదుర్కొనుచున్న సమస్యలన్నిటిని పరిష్కరించగల నాయకుని కొరకు ఎదురుచూస్తున్నది.

ఈ లోకములో జరుగుచున్న వాటిని లోతుగా పరిశీలించినచో ఇవన్నియూ వాస్తవంగా నెరవేరునని నీవు గుర్తించగలవు. ప్రవచింపబడిన నాయకుడు అత్యంత భయంకరమైనవాడు అంత్య శక్తి గొప్ప సామర్థ్యము గల మనిషి వర్ణించబడిన విధముగా ఎలుగుబంటి పాదము వంటి పాదము సింహం వంటి నోరు, చిరుత పులి ముఖము గలవాడై యుండును.

ఘటసర్పము నుండి ఈ మనిషి అధికారము పొంది దేవుని, అతని పరలోక దూతలను ఆయన పరిశుద్ధులను దూషించును. వారి విశ్వాసమును వదిలిపెట్టరు. కనుక వారందరూ హతసాక్షులగుదురు. అంత్యక్రీస్తు సర్వలోకంపై అధికారం గలవాడు. కనుక అతని ఆజ్ఞను పాటించని వారినందరినీ స్వేచ్ఛగా చంపి నాశనం చేయును. వచనం 8 చెప్పినట్లు ‘‘భూమినివాసులందరును, అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడియున్న గొఱ్ఱె పిల్ల యొక్క జీవగ్రంధమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు, ఆ మృగమునకు నమస్కారము చేయుదురు” ఈ సమయంలో అంత్యక్రీస్తు ఎదురులేని నాయకుని వలే లోకమును పాలించుచున్నందున అతని ఆజ్ఞతోనే అతనికి విధేయులు కాని వారు చంపబడతారు.

ఏమైననూ, పరిశుద్ధులందరి కొరకు అట్టి సమయమే హతసాక్ష్య సమయమగును. పైనుదహరించిన 8వ వచనం నుండి ‘‘ఆరాధన” అనగా ఇక్కడ ఎదురు లేని వాడు గౌరవించబడి పరిచర్య చేయబడుట అని అర్థం. అంత్యకాలంలో ఈ భూమిపై అంత్యక్రీస్తే దేవుడని ఆరాధించబడును. ఇంతకు మునుపు ఏ గొప్పరాజు పొందనంత అత్యన్నతమైన గొప్ప ఘనతను పొందును. అయిననూ ఈ నాయకుని కొంతమంది ప్రజల సమూహం ఆరాధించదు. వారే ‘‘తిరిగి జన్మించిన వారైన క్రైస్తవులు” వారు అంత్యక్రీస్తును దేవునిగా గుర్తించరు. అలాగే అతనిని ఆరాధించక తమ విశ్వాసమును కాపాడుకొనుటకు చంపబడతారు.భూమి నుండి వచ్చుచున్న మరొక మృగము :


అంత్యక్రీస్తుకు కూడా అబద్ధ ప్రవక్తలు ఉంటారు. ఈ అబద్ధ ప్రవక్త అంత్యక్రీస్తును ఉన్నతముగా చూపుతూ ఆ మృగమునకు లోబడనివారిని భయపెట్టుచూ చంపుచూ ఉండును. ప్రకటన 13:11లో మరియు... మాటాలాడుచుండెను. అనగా అంత్యక్రీస్తు వలే అతడు దేవునికి వ్యతిరేకిగా నిలచుచూ లోక ప్రజలను, నీతిమంతులను చంపును.

ఘటసర్పం నుండి అధికారము పొంది అతడు ప్రజలను అంత్యక్రీస్తును దేవునిగా ఆరాధించవలెనని బలవంతం చేయును. ఎందుకనగా అతడు కూడా ఆ ఘటసర్పము నుండే అధికారము పొందెను. అతడు ఘటసర్పము చేయకోరునది చేయును. అతడు తనముందు వచ్చిన అంత్యక్రీస్తును అతడు ఆకాశము నుండి అగ్ని దిగివచ్చునట్లు చేయుచూ, అంత్యక్రీస్తువలే నటించుచుండునట్టి అద్భుతమును చేయును. అతడు శారీరకంగా చావు దెబ్బతినెను. కానీ ఆ దెబ్బ నుండి కొలుకొనిన ఆ మృగమును దేవునిగా చూపుచూ అతని విగ్రహమును చేయించును.

అప్పుడు, ఈ క్రియలన్నీ చేయగల వారెవరు? అదే ఆ అంత్యక్రీస్తుని ప్రవక్త తనకు ముందు వచ్చిన అంత్యక్రీస్తు యొక్క విగ్రహమును చేయుట. మరియు దానినే దేవునికి ఘనపరచునట్లు ప్రజలను ప్రేరేపించుట అను క్రియలను ఆ ప్రవక్త చేయును. అట్లు చేయుటకు అతడు ఆ అంత్యక్రీస్తు విగ్రహములోనికి తన ఊపిరిని ఊది అది మాట్లాడునట్లు చేసి దానిని పూజించని వారినందరినీ వారు ఎంత అధిక సంఖ్యయైనను లెక్కచేయక వారిని చంపును. ఎందుకనగా పరిశుద్ధులు ఆ విగ్రహమును పూజించుటకు తిరస్కరించి హతసాక్షులగుదురు.

ప్రపంచంలోని తిరిగి జన్మించని వారు అందరూ మరొక ప్రక్క తమ చావునకు భయపడి వణకుచూ మరణమునకు దాసులగుదురు. అలాగే వారందరూ అంత్యక్రీస్తును దేవునిగా ఆరాధించెదరు. ఆ నియంతకు వ్యతిరేకంగా సత్తువ గల ఆత్మీయభావం గల వారు తిరుగుబాటు చేస్తారు. కానీ వారు వెంటనే అబద్ధ ప్రవక్త మరియు అంత్యక్రీస్తు నోటి నుండి వెలుగు అగ్నిచే కాల్చబడి కూల్చబడెదరు.

ఈ అబద్ధప్రవక్త విగ్రహమును నిర్మించినవాడై ‘‘అతని సంఖ్యను గానీ, పేరుగానీ ప్రతివారు వేయించుకొనవలెనని” చెప్పెను. తరువాత దానిని తన విధానముగా చేసి ఎవరునూ దాని నుండి తప్పించుకొనలేని విధంగా చేసి ఈ ముద్రలేని వారిని ఏ వ్యాపారము చేయనీయకుండా అతడు చేయును. కనుక ప్రతివారు వాస్తవంగా ఆ మృగము పేరుగల ముద్రను వేయించుకొంటారు. వచనం 18లో ‘‘బుద్ధిగల వాడు మృగముయొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము; అది మనుష్యుని సంఖ్యయే. ఆ సంఖ్య ఆరువందల అరువది యారు (666). ఇందులో జ్ఞానము కలదు.’’

ఒక వేళ మనం 666 సంఖ్యను అసాధారణ విషయంగా ఆలోచించిననూ అది కేవలము అంత్యక్రీస్తుని పేరు గానీ అతని సంఖ్య అని అర్థమిచ్చును. ఈ మృగపు ముద్రను పొందుట అనగా అతని ముద్రగాని, పేరుగానీ, నొసటగాని, కుడిచేతి మీద గాని వేయించుకొనుట అని అర్థము. అది ఈ పరిపాలకుని పేరు ఒకని దేహములో సంఖ్యగాని మార్చబడి బార్‌కోడ్‌గా డిజిటలైజ్‌ చేయును.

ఒకడు ఎక్కడైనా ఏదైనా కొనుటకు ప్రయత్నించినా ఈ ముద్ర అవసరమై యుండును. నీవు బస్సు ఎక్కుటకైననూ ఈ డిజిటల్‌ సంఖ్య నీ దేహంలో ముద్రించబడి ఉండాలి. లేనిచో నీవు నిలిపివేయబడెదవు. ఈ యుగమే డిజిటల్‌ కాలము. ఇది సంఖ్య కాలము. ప్రతి విషయము సంఖ్యలుగా మార్చబడుచుండగా ఒకసారి ఎంతో సంక్లిష్టంగా ఉన్నవి ఇప్పుడు ఎంతో సులువుగా ఉన్నది. ఇట్టి యుగములోనే మృగము యొక్క ముద్ర కనిపించును.

ఆ అంత్యక్రీస్తు తన విగ్రహమును చేసికొని ప్రజలు తననే దేవునిగా ఆరాధించవలెనని ఒత్తిడి చేయును. వాస్తవంగా ఆ సమయం వచ్చును. కనుక ప్రజలు అంత్యక్రీస్తునే తమ ‘‘దేవునిగా” పిలువవలెను. అతనిని ఘనపరచుచూ అతని నామమును పొగడెదరు. అతని పేరును కుడిచేతిమీదగాని, నొసళ్ళమీదగాని వేయించుకోవాలి. అట్టి విషయాలు సంభవించినప్పుడు పరిశుద్ధులు హతసాక్షులవుతారు. ఆ అంత్యక్రీస్తు తన ముద్రనుపొంది తనను దేవునిగా ఆరాధించమని పరిశుద్ధులను ఒత్తిడి చేయును కనుక మీరు యేసును విశ్వసించుచున్నారా? మీరు ఆయనను మీ దేవునిగా నమ్ముచున్నారా? అతనిని విసరివేయుడి అని చెప్పును. ఈ విగ్రహం ముందు మోకరిల్లండి. నన్ను దేవుడని పిలిచి పరిపూర్ణమైన వారిలో ఒకనిగా నన్ను విశ్వసించండి. మీరు ఇట్లు చేయని యెడల నిశ్చయంగా మీరు చస్తారు.

ఆ అంత్యక్రీస్తు లోకమంతటిని ఒకే విశ్వాసంతో ఉండమని డిమాండ్‌ చేయును. అతడు ప్రతివారిని తననే దేవునిగా ఆరాధించవలెనని ఒత్తిడి చేయును. ఈ సమయంలో దేవుడని ఎవరు ఒప్పుకొనరో వారు అందరూ చంపబడతారు. ఆ అంత్యక్రీస్తు బహిరంగంగానే పరిశుద్ధులను చంప నాజ్ఞాపించును.

గొర్రె పిల్ల జీవగ్రంధమందు ఎవరిపేర్లు వ్రాయబడలేవో వారందరూ ఈ ముద్రను పొంది అతనిని ఆరాధించెదరు. మన పాపముకు ప్రాయశ్చిత్తమును మన హృదయంలో పొందినప్పుడు పరిశుద్ధాత్మ మనలో జీవిస్తాడు. మరియు దేవుని రాజ్యములోని జీవగ్రంధ మందు వ్రాయబడెను.

మరియు మన హృదయాలను పరిశుద్ధాత్మ ముద్రించును. ఆయన మనలను పిలిచినప్పుడు మనమంతా దేవుని పిల్లలుగా ఎత్తబడతాము. మనము ఎప్పుడైన మనలను రక్షించిన యేసుక్రీస్తును వదలిపెడతామా మరియు ఆ మృగపు విగ్రహాన్ని మన దేవుని, ఇప్పుడు మన రక్షకుడని ప్రకటిస్తామా? కాదు! మనము అతని ముందు ఎంత బలహీనులమైయున్ననూ మన ప్రభువు మానవ శరీరంతో భూమిపైకి వచ్చెను. మన పాపాలన్నిటిని బాప్తిస్మముతో తనపై మోపుకొని, జయశీలిగా తీర్పు తీర్చబడి సిలువలో వాటిని తుడిచివేసెను.

ముందుగానే మన ప్రభువు ఈ సంగుతులన్నిటి గురించి మనతో చెప్పినందున అంత్యక్రీస్తు కాలములో పరిశుద్ధులమైన మనం విశ్వాసాన్ని వదలిపెట్టకూడదు. శ్రమల కాలము మనకు వచ్చిననూ దాని తర్వాత మరణం వచ్చిననూ మన హతసాక్ష్యం తరువాత కొద్ది సమయంలో మనలను పునరుద్ధానపరచి పరలోక రాజ్యములోనికి కొనిపోయి మన ప్రభువు అక్కడ మనలను నివసింపచేయును.

మనం ఎత్తబడిన తర్వాత దేవుడు తన ఏడు పాత్రల మహాతెగుళ్ళను, కుమ్మరించుటచే ఈ లోకాన్ని నాశనం చేయునని, తర్వాత మనం ఈ భూమికి దిగివచ్చి వెయ్యేండ్ల పాటు దీనిని పరిపాలిస్తామని, గుర్తించిన వారమైన మనం విగ్రహాల ముందు ఎలప్పుడూ మోకరిల్లకూడదు. అందువలననే దేవుని పరిచారకులు పరిశుద్ధులు ఇష్టపూర్వకంగానే తమ జీవితాలను అర్పించెదరు.

పలు విధాలుగా అబద్ధ ప్రవక్త మనకు నచ్చజెప్పజూచును. ‘‘చూడు, ప్రపంచం అంతటా ఇప్పుడు శ్రమలు వేగంగా విస్తరిస్తున్నాయి. ఆధ్యాత్మికులు, జ్ఞానులు అందరూ ప్రతి చోటా ఈ అధినేతను దేవుడుగా విశ్వసించి అనుసరిస్తూ ఉండగా మనకు ఖచ్చితమైన రాజుగా ఉన్న వానిని విశ్వసించుటకు నీవెందుకు త్రోసివేస్తున్నావ్‌?’’ అని చెప్పుచూ మనకు కొనజూచును. కానీ మనం ఎల్లప్పుడూ దేవుని వాక్యమును విశ్వసించిన మన హతసాక్ష్యమును కౌగలించుట ద్వారా అంతమున మనం ఆనందించెదము.

ప్రకటన 14లో పరమందు దేవునికి స్తుతి చేయువారు 1,44,000మంది పరిశుద్ధులున్నట్లు కనబడతారు. పరిశుద్ధుల హతసాక్ష్యము వారి పునరుత్ధానము కొనిపోబడుట, ఉందని ఈ వాక్యం మనకు చెప్పుచున్నది. బైబిలులో ఎక్కడనుండైన క్రీస్తుని రెండవ రాకడను గూర్చి పౌలు చెప్పినట్లు లేదా పాతనిబంధనలో మిగిలిన ప్రవక్తలు ప్రవచించినట్లు దేని చేత పరిశుద్ధులు మేఘాలలోనికి ఎత్తబడి ప్రభునితోపాటు గొర్రె పిల్ల వివాహ విందులో పాల్గొంటారో మనం కూడా కనుగొనాలి. ఈ పెండ్లి విందులో పరిశుద్ధులు పాల్గొంటారు.

అలాగున పరిశుద్ధులు పరలోకంలో గొర్రె పిల్ల పెండ్లి విందులో పాల్గొన్నప్పుడు ఆ ఏడు పాత్ర తెగుళ్ళు భూమిపై కుమ్మరింపబతాయి. దానిని పూర్తిగా వ్యర్ధపరచును. అటు తరువాత ఈ భూమి నూతన పరచబడును. తరువాత ప్రభునితో పాటుగా ఈ భూమిపైకి దిగివచ్చి రాబోవుచున్న ఆ వెయ్యేండ్ల పాలనలో పరిపాలిస్తారు. ఈ సత్యము మనం తెలిసికొన్నప్పుడు అంత్యక్రీస్తును నిజముగా దేవుడని పిలువగలమా? అతడు మనలను తన ప్రతిమ ముందు వంగునట్లు ప్రతివిధమైన బాధలోను, ఆవేదనలోనూ మనలను త్రోసిననూ అతనిని దేవుడని ఆరాధిస్తామా, సత్యదేవునియందున్న విశ్వాసమును వదలిపెడతామా? నిశ్చయంగా చేయుము.

“విశ్వాసమనునది నిరీక్షింపబడువాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువునైయున్నది.’’ (హెబ్రి 11:1) బైబిల్‌లో వ్రాయబడిన విధముగా రాబోవువాటి గురించి దేవుడు తమకు బయలుపరచిన వాటిని ప్రవక్తలు విశ్వసించారు. వాక్యమును విశ్వసించు వారైన దేవుని ప్రజలు అందరూ ప్రవక్తలు. బోధకులు ప్రపంచమంతటా పాప పరిహారమునకైన సువార్తను మనచే బోధింపచేయుట ద్వారా దేవుడు అనేక ఆత్మలు తమ పాపమునకు పరిహారమొందునట్లు చేయును. మనమాయన ముందు ఎంత అయోగ్యులమైనా మనలను ఆ ప్రభువు రక్షించినట్లే దేవుడు మనలను ఆయన ప్రజలుగా చేసెను. మరియు ఆ ఘడియ వరకు ఆయన మనలను ప్రేమించెను. నడిపించెను మరియు మార్పులేకుండా మనలను దీవించెను.

మన ప్రభువు మన ఆత్మలకు శాంతినిచ్చేట్టుగా మనకు పరిశుద్ధాత్మనిచ్చుట ద్వారా పరలోకరాజ్యమందు మనం విశ్వాసముంచునట్లుగా చేసెను. అలాగే దేవుని వలే అంత్యక్రీస్తు తనను ఆరాధించమనుట విన్నప్పుడు మన హృదయాంతరము నుండి వ్యతిరేకించుట తప్ప ఏమియూ చేయలేము.

దేవుడు చెప్పినవి అంతమున జరుగు సమయంలో అవి ఆరంభించిన వెంటనే మనం కంగారుపడిననూ అంత్యకాలము సమీపించినదని గుర్తిస్తాము. కానీ పరిశుద్ధులమైన మనము త్వరగానే మనం ఏర్పరచుకొనిన దానిలో బలపడి అంత్యక్రీస్తును వ్యతిరేకించుట మొదలుపెడతాం. ‘‘కనుక నీవే నిజదేవుడవని తలంచెదవా? నీవు నిజముగా జనుల ఆత్మలకు దేవుడా?’’ ఇట్టి మాటలతో మనం అంత్యక్రీస్తుతో పోరాడతాం.

ఆ సమయంలో అంత్యక్రీస్తు దేవుని పరిచారకులను పరిశుద్ధులను చంపునప్పుడు. మనం కూడా మరణించెదము. మన దేవుని యందు ఏ మార్పు మన పట్ల ఉండదు. విశ్వాసము భయపెట్టుట ద్వారా కలుగదు లేదా బలవంతమైన లాజిక్‌ ద్వారా కలుగునా లేకపోవును. దీనికి దూరంగా వాస్తవంగా సత్యమునకైన విశ్వాసము బలవంతమును జయించుటకు అధిక శక్తికలిగి వుంటుంది. కనుక పరిశుద్ధులు హతసాక్షులవుతారు. మరియు పరిశుద్ధులచే అంత్యక్రీస్తు ఓడింపబడతాడు.

అంత్యక్రీస్తు తన ప్రతిమను చేయించి తనను దేవునిగా ఆరాధించమని అంత్యక్రీస్తు పరిశుద్ధులను బలవంతపెట్టునప్పుడు నీవు దేవుని పరిచారకుడవా లేక పరిశుద్ధుని పరాచకుడవా? నీకు నీరు మరియు ఆత్మమూలమైన సువార్త తెలియునా? నీకు యేసుక్రీస్తు దేవుడని తెలిసికొని, విశ్వసించుచున్నావా? యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చినప్పుడు నీ వంటి ప్రజలను నరకములోని అట్టడుగు మూలకు త్రోయును అని నీకు అర్థమైనదా సాతాను పుత్రుడా అని దేవుని పరిచారకులు పరిశుద్ధులు అతనిని కోపగిస్తారు. అప్పుడు అంత్యక్రీస్తు అతని ప్రవక్త పరిశుద్ధులను చంపును. పరిశుద్ధులు సంతోషముతో దేవుని కొరకు హతసాక్ష్యమును కౌగలించెదరు.

“ఎవడైననూ ఖడ్గము చేత చంపిన యెడల వాడు ఖడ్గము చేత చంపబడవలెను అని” 10వ వచనం మనకు చెప్పుచున్నది. అనగా అంత్యక్రీస్తు పరిశుద్ధులను చంపినచో దేవుడు కూడా అతనిని అతని అనుచరులను అగాధములోనికి త్రోసి వేయును. అలాగే వారిని ఈ భూమిపై చంపును. దేవుని వ్యతిరేకించువారు పరిశుద్ధులను బాధించినప్పుడు వారు కూడా అధికమైన బాధలను దేవుని వలన ఎదుర్కొందురు.

అలాగే మనం తప్పక మన భద్రపరచుకొనిన విశ్వాసముతో అంత్యక్రీస్తునకు వ్యతిరేకులుగా నిలవాలి. పరిశుద్ధుల హింసల కాలము ఈ సమయంలో మూడున్నర సంవత్సరములలోనే ముగియును. దేవుడు, పరిశుద్ధులు శ్రమను, హింసను తగ్గించి, వాటిని కొన్ని నెలలు లేదా రెండు వారములకు మాత్రమే తగ్గించును. పరిశుద్ధులు హతసాక్షులైననూ వారు తిరిగి బ్రతికెదరు. వారు పునరుద్ధాన పరచబడి, ఎత్తబడి వెయ్యేండ్ల పాలనలో యేసుక్రీస్తుతో కూడా పరిపాలించుటకు ఆశీర్వదించబడెదరు.

ఆ వెయ్యేండ్ల పాలన వచ్చునప్పుడు ఈ ప్రకృతి యొక్క అందము ఎంతో రమ్యముగా ఉండును. పరిశుద్ధులు తమ పాత శరీరము నుండి రూపాంతరం చెంది నూతన శరీరముతో ప్రభునితో పాటు పరిపాలించెదరు. ఆ నూతన భూమి మరియు నూతన ఆకాశములో ప్రభునితో ఎల్లకాలము సంతోషించెదరు. ఈ విషయాలన్నింటిని తెలిసికొని విశ్వసించువారు మనకు రాబోవుచున్న కాలములో యేసునందు విశ్వసించుట వలన కొద్దికాల శ్రమల నుండి దాచబడకుండా ఎట్లుండగలము?

ఈ కాలములో శ్రమలు ఎంత కఠినమైననూ సరే, పరిశుద్ధులు అధిక సంఖ్యలో నిశ్చయంగా హతసాక్షులవుతారు. అలాగే మనము కూడా హతసాక్షులము కాకుండుటకు ఎటువంటి కారణము లేదు. ఈ విషయాలన్నీ సత్యమైనందున ఈ లోకములో అతి కొద్దికాలమే ఉండు శ్రమలకు మనము లొంగకూడదు. ముందున్న ఉదాహరణలో నూరు లేదా వెయ్యి సంవత్సరాలకు ఈ లోకము మారిననూ కేవలము మనం అంత్యక్రీస్తుకు లొంగకూడదు. ఈ విషయాలన్నీ మనకు ఎంతోదూరము కావు కానీ అత్యంత సమీప కాలములోనే మనకు సంభవించును. కనుక ఇప్పుడే ఈ లోకం శాంతిగా ఉండగానే మనం తప్పక నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను బోధించాలి. మహాశ్రమల కాలమునకు 

మనం సిద్ధపడాలంటే, ఇప్పుడే మనం చురుకుగా ఆ నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను వ్యాప్తి చేయాలి. ఒక సంవత్సర కాలంలో మనం బోధించు సువార్త ఎంతో అద్భుతమైన క్రియలను చేయును. దేశవ్యాప్తముగాను, విదేశాలలోనూ సువార్త యొక్క అద్భుత కార్యాలు జరుగుతాయి. మొదట ఈ నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను తేలికగా తీసుకొన్ననూ, ప్రకటన వాక్యము తెలియనివారైన అనేకులు దానిని వెదకి వింటారు. నీరు మరియు ఆత్మమూలమైన సువార్త వైపుకు తిరిగిన వారై ప్రకటన వాక్యమందు అత్యంత ఆసక్తి కలిగి దానిని తేలికగా తీసుకొనరు.

ప్రకటన 13వ అధ్యాయం పరిశుద్ధులు హతసాక్ష్య అధ్యాయమైయున్నది. హతసాక్ష్య సమయము వచ్చినప్పుడు పరిశుద్ధులు ఖడ్గము వలన కానీ, పేల్చి వేయబడుట వలన కానీ మరణిస్తారు. కనుక అంత్యక్రీస్తు చేతిలో అనేక పరిశుద్ధులు మరణిస్తారు. కానీ మనము మన మరణమును ఏ భయము లేక ఎదుర్కొంటాం. ఎందుకనగా అది మన శారీరక మరణము కానీ మన విశ్వాస మరణం కాదు. మనం విశ్వాసము మరియు ఆత్మ వలన నింపబడిన వారమై మాటలో వర్ణించలేని ధైర్యంతో అట్టహాసం చేస్తారు.

నీవు వాక్చాతుర్యము లేక లేదా పిరికితనము వలన కానీ నీవు భయపడవలసిన కారణం లేదు. అది సంఘకాలపు పరిశుద్ధులను గూర్చి 

ఆలోచించవలెను. ఆ కాల పరిశుద్ధులు సాతానునకు లొంగకపోవుటకు కారణం వారు ఒంటరిగా కాక అందరూ ఏకముగా చంపబడిరి మరియు వారు పరిశుద్ధాత్మతో కూడా నింపబడిరి. ‘‘వారు మిమ్మును అప్పగించునప్పుడు ఏలాగు మాటలాడుదుము? ఏమి చెప్పుదుము అని చింతింపకుడి మీరేమి చెప్పవలెనో అది ఆ గడియలోనే మీకనుగ్రహింపబడును. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాటలాడుచున్నాడే కానీ మాటలాడువారు మీ కారు”. (మత్తయి 10:19-20) అని ప్రభువు ముందే మనకు చెప్పెనని గుర్తు తెచ్చుకొనవలెను. దేవుని రాజ్యమును పొందుటకు దేవుని ప్రజలమైన మనం మరణమును పొందలేమా? మన మందరమూ భరించెదం.

దేవుని తెగుళ్ళైన ఏడు బూరల తెగుళ్ళచే ఈ లోకము పూర్తిగా నాశనపరచబడును. అంత్యక్రీస్తని హింసకుడు కొంతకాలం పరిపాలించును. అప్పుడు మనం ఈ లోకములోని ఎంత రమ్యమైనదైననూ దాని కొరకు మనం పరలోకమును మార్చుకొనగలమా? ఈ లోకము జీవించలేని స్థలముగా మారును. అక్కడ నదులు మాచిపత్రిగాను సముద్రము రక్తముగాను, ప్రకృతి నాశనపరచబడినప్పుడు, మన విశ్వాసమును మనం వదులునట్లు చేయాలని ప్రయత్నించు మృగము వంటి మనుష్యునకు ఏ మాత్రమైనా లొంగుతామా.

మన హతసాక్ష్యపు ఆరంభ దినము నుండి ఈ లోకములో ఇంకనూ నివసించువారు గుర్తించలేని అంటువ్యాధులు భయంకరంగా వ్యాపించును. పంటలు ఫలితానికి రావు. అవి వాడిపోవును లేదా వడగండ్ల చేత తుడిచిపెట్టబడును లేదా వాడిపోవుదురు కనుక దాని కొరకు లోకం ఎదరుచూచును. అట్టి లోకంలో విశ్వాస విషయమును ప్రక్కన పెట్టిననూ ఎంతో కాలము జీవించాలని ఎవరు కోరుకొనరు.

ప్రకటన వాక్యము భవిష్యత్తులో జరుగబోవు విషయములను చూపుచున్నది. నల్లని గుర్రపు కాలమైన ఈ యుగము ముందుకు కొద్దిగా మాత్రమే జరుగగా, వాస్తవంగా త్వరగా వచ్చును. అతిత్వరగా రాబోవుచున్న ప్రభుని రాకడ వరకూ నీవు నీకు కలిగిన వాటిని కోల్పోకూడదని నేను నీకు చెప్పుచున్నాను. లేదా నేను చెప్పునదేమనగా అంత్యక్రీస్తు ప్రత్యక్షత జరుగు దినము వరకు ఇప్పటివలేనే నమ్మకంగా మార్పు లేకుండా మన ప్రభుని ఆరాధించుటకు కొనసాగించవలెను.

ఏదో ఒక కారణమున ఇప్పుడు నీవు బాధపడిననూ లేదా కృంగియున్ననూ నీవు ఇకను బాధపడనవసరం లేదు. మనం హతసాక్షులమవ్వాలని నీవు నేను గుర్తించినప్పుడు మన హృదయాలు ప్రశాంతమై నెమ్మదిపడతాయి. మనం హతసాక్షుల మవ్వవలసియుండగా మనలో ఏ ఆశను మిగిల్చి ఉంచుకొనగలము? ఏ ఒక్క ఆశ నీలో నిలిచియున్ననూ అది ఈ ప్రపంచమంతటా సువార్తను బోధించుటను మాత్రమే కావలయును. దాని వలన అంత్యకాలములో అనేకులు పరిశుద్ధులు కాగలరు. వారు రక్షింపబడి సువార్తను విశ్వసించుటలో హతసాక్షులవుతారు. మరియు వారు నూతన భూమి మరియు ఆకాశములో ప్రవేశిస్తారు. పరిశుద్దులందరూ క్రీస్తు రాజ్యాన్ని తమ విశ్వాసంతో స్వంతం చేసుకొని, ఈ సత్యము నందు వృద్ధి పొందుచున్న వారై అంత్యక్రీస్తు కాలమందు తన కొరకు ఎదురు చూస్తున్న ఈ విషయాలన్నింటిని ఇష్టపూర్వకంగానే అనుభవిస్తారు.

దేవుడు హతసాక్ష్యము తన దీవెనలను మనకనుగ్రహించాడు. ఏ ఒక్కరు హతసాక్షులు కాకపోతే, ఏ ఒక్క ప్రభునితో నివసించలేరు. అట్టి దీవెనలను మనకనుగ్రహించిన దేవునికి మాత్రమే నేను రుణపడియున్నాను. మరియు విశ్వాసము కొరకు నేను మరణించెదను. సత్యమును బట్టి మాత్రమే నేను సంతోషిస్తున్నాను. ఈ లోకములో పాతుకొనిపోయిన సంబంధాలు కానీ, నిరీక్షణ గాని లేనందు వలన హతసాక్ష్యము మనకొక గొప్ప సంతోషము.

దేవుడు మన కొరకు సిద్ధపరచిన పరలోకము కొరకు వెయ్యేండ్ల రాజ్యము కొరకు మనం నిరీక్షణ గల వారమైయుండవలెను. ప్రభుని రాకడ దినము వరకు ప్రపంచమంతటా సువార్తను ప్రకటించుటకు ప్రయత్నించునట్టి జీవితమును జీవించాలి. ఆయన తిరిగి వచ్చునప్పుడు ఆనందముతో ఎదుర్కొనాలి. ఆయన మన కొరకు ఉంచిన స్థలములో చేరాలి. ఈ విషయాలన్నీ వాస్తవంగా వచ్చును కనుక మనం వాక్యాన్ని విశ్వసించాలి.

మనము పరలోక రాజ్య ప్రజలము కనుక అంత్యక్రీస్తు ముద్రను వేసుకోకూడదు. ఎందుకనగా ముద్ర వేసుకొనుట వ్యక్తిగతము అది భౌతిక ఒత్తిడి వలన కాక హృదయపూర్వకంగా అంగీకరించాలి. మన పిల్లలు కూడా వారి హృదయాలలో సువార్త కలిగిన ఎడల వారు పెద్దవారికంటే అధిక ధైర్యంతో హతసాక్ష్యమును కౌగలించెదరు. వారిలో కూడా పరిశుద్ధాత్మ నివసించును. పెద్దవారు యేసుక్రీస్తును తమ రక్షకునిగా ఒప్పుకొనిన విధంగా పరిశుద్ధాత్మ పిల్లల హృదయాలలో పరిశుద్ధాత్మ కనుగొన్నట్లయితే వారు కూడా ఎంతో నిశ్చయంగా యేసు వారి రక్షకుడని దేవుని ఒప్పుకుంటారు. మనం అంత్యక్రీస్తు ఎదుట ఈడ్చబడినప్పుడు ఏమి మాట్లాడవలెనో అని చింతించవద్దని మనం మాట్లాడవలసిన మాటతో పరిశుద్ధాత్ముడు మనలను నింపునని బైబిల్‌ మనకు బోధిస్తుంది.

పరిశుద్ధాత్మ ప్రభావముతో వారు హతసాక్షులవుతారు. వారు కూడా దేవుని వారైనందున ఆయన వారి ఆత్మను స్వీకరించును. వారి దేహము చంపబడుటకు అనుమతించును. మరియు ఉన్నతమైన లోకములో వారిని పరిపాలించనిచ్చును.

నీరు మరియు ఆత్మమూలంగా తిరిగి జన్మించిన వారి హృదయాలను ఏ మాటలతో మాట్లాడవలెనో అట్టి మాటలతో నింపును. దేవునిచే ఎన్నుకొనబడి, ఎదుర్కొనబడిన ఆత్మలను మాత్రమే ఆయన హతసాక్షుల నిచ్చును. ఎందుకనగా వారి విశ్వాసమును తన నామము కొరకు సిద్ధపరచెను. కేవలం మన హృదయాలలో పరిశుద్ధాత్ముడు నివసించుచున్నది సత్యము ఎందుకనగా మనము నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను విశ్వసించాము. వెయ్యేండ్ల రాజ్యము నూతన భూమి, ఆకాశము యొక్క మహిమను పొందెదము.

అంత్యకాలములో మన హృదయాలలో పరిశుద్ధాత్మ నింపబడుట మనం అందరమూ అనుభవిస్తాం. మనం హతసాక్ష్యమును ఎదుర్కొనవలసిన వారమై యుండగా, అట్టి విధంగా మనం దేవుని అట్టి ప్రణాళిక ప్రకారం హతసాక్షులమై యుండవలసి యుండగా, మనం ఆయన సన్నిధిలో ఆయనను స్తుతించుచూ, ఆరాధించుచూ, మహిపరచుచూ మనం హతసాక్షులమవుతాం. మనం దేవునిని విశ్వసించినందుకు ఆమెన్‌ అని ఆర్భటించగల విశ్వాసంతో ఆయనను అనుసరించెదము.

మనం హతసాక్షులమవ్వాలని మనం ఎరిగినందు వలన లోక ఆశలను సహజంగానే వాడిపోవును. మన ఆత్మలను అతి స్వచ్ఛముగా చేయును. హతసాక్షులమగుట మన కొరకైన దేవుని చిత్తము కనుక అది పొందుకొనుట గొప్ప దీవెన మరియు మహిమకరమైయున్నది.

అలాగే పరిశుద్ధులు ఆ నూతన ఆకాశ భూమిలో శాశ్వతంగా నివసించెదమని నిరీక్షణ కలవారై అంత్యక్రీస్తుకు విరోధముగా పోరాడి అంతము వరకు తమ హృదయాలలో ఉన్న నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను కాపాడుకొంటారు. ఈ మహాశ్రమల కాలంలో యేసుక్రీస్తును తమ దేవునిగా గుర్తించు పరిశుద్ధులందరూ ఆయన ఇచ్చిన తమ సంపూర్ణ రక్షణను విశ్వసించి దేవుని ఎదుట తమ హతసాక్ష్యమును కౌగలించుకొంటారు. 

హతసాక్ష్యమును దీవెనను మనకిచ్చిన ప్రభునికే నేను కృతజ్ఞుడను.