Sermons

[అధ్యాయము 14-1] <ప్రకటన 14:1-20> పునరుత్ధానులైన మరియు ఎత్తబడిన హతసాక్షులకు మెచ్చుకోలు<ప్రకటన 14:1-20>

“మరియు నేను చూడగా, ఇదిగో, ఆ గొఱ్ఱె పిల్ల సీయోను పర్వతము మీద నిలువబడియుండెను. ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసళ్ళయందు లిఖింపబడియున్న నూట నలువది నాలుదు వేలమంది ఆయనతో కూడా ఉండిరి. మరియు విస్తారమైన జలముల ధ్వనితోను గొప్ప ఉరుముల ధ్వని తోను సమానమైన యొక శబ్ధము పరలోకములో నుండి రాగా వింటిని నేను వినిన ఆ శబ్ధము వీణెలు వాయించుచున్న వైణికుల నాదమును పోలినది. వారు సింహాసనము ఎదుటను, ఆ నాలుగు జీవుల యెదుటను, పెద్దల యెదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు. భూలోకములో నుండి కొనబడిన ఆ నూట నలువది నాలుగు వేలమంది తప్ప మరి ఎవరును ఆ కీర్తన నేర్చుకొనజాలరు. వీరు స్త్రీ సాంగత్యమున అ పవిత్రులు కానివారును, స్త్రీ సాంగత్యము ఎరుగని వారునైయుండి, గొఱ్ఱె పిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెళ్ళి ఆయనను వెంబడింతురు. వీరు దేవుని కొరకును గొఱ్ఱె పిల్ల కొరకును ప్రధమఫలముగా ఉండుటకై మనుష్యులలో నుండి కొనబడినవారు వీరినోట ఏ అబద్ధమును కనబడలేదు. వీరు అనింద్యులు అప్పుడు మరియొక దూతను చూచితిని అతడు భూనివాసులకు అనగా ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ఆయా భాషలు మాటలాడువారికిని ప్రతి ప్రజకును ప్రకటించునట్లు నిత్యసువార్తను తీసికొని ఆకాశమధ్యమున ఎగురుచుండెను. అతడు మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చెను. గనుక ఆకాశమును భూమిని సముద్రమును జలధారను కలుగేసినవానికే నమస్కారము చేయుడి అని గొప్ప స్వరముతో చెప్పెను. వేరొక దూత, అనగా రెండవ దూత అతని వెంబడివచ్చి మహోద్రేకముతో కూడిన తన వ్యభిచార మద్యమును సమస్త జనములకు త్రాగించిన ఈ మహాబబులోను కూలిపోయెను అని చెప్పెను. మరియు వేరొక దూత అనగా మూడవ దూత వీరి వెంబడి వచ్చి గొప్ప స్వరముతో ఈలాగు చెప్పెను. ఆ క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని యెవడైనను నమస్కారము చేసి తన నొసటియందేమి చేతిమీదనేమి ఆ ముద్ర వేయించుకొనినయెడల ఏమియు కలపబడకుండ దేవుని ఉగ్రతపాత్రలో పోయబడిన దేవుని కోపమును మద్యమును వాడు త్రాగును. పరిశుద్ధ దూతల యెదుటను గొఱ్ఱెపిల్ల యెదుటను అగ్ని గంధకముల చేత వాడు బాధింపబడును. వారి బాధసంబంధమైన పొగ యుగయుగములు లేచును. ఆ క్రూర మృగమునకు గాని దాని దాని ప్రతిమకు గాని నమస్కారము చేయువారును పేరుగల ముద్ర ఎవడైనను వేయించుకొనినయెడల వాడును రాత్రింబగళ్లు నెమ్మదిలేనివారై యుందురు. 

దేవుని ఆజ్ఞలను యేసును గూర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడును. అంతట ఇప్పటి నుండి ప్రభువు నందు మృతినొందు మృతులు ధన్యులని వ్రాయుమని పరలోకనుండి యొక స్వరము చెప్పగా వింటిని నిజమే వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. మరియు నేను చూడగా ఇదిగో తెల్లని మేఘము కనబడెను. మనుష్యకుమారుని పోలిన యొకడు ఆ మేఘము మీద ఆసీనుడైయుండెను. ఆయన శిరస్సు మీద సువర్ణ కిరీటమును చేతిలో వాడిగల కొడవలియు ఉండెను. అప్పుడు మరియొక దూత దేవాలయములో నుండి వెడలివచ్చి భూమి పైరుపండియున్నది. కొతకాలము వచ్చినది నీ కొడవలిపెట్టి కోయుమని గొప్ప స్వరముతో ఆ మేఘము మీద ఆసీనుడైయున్న వానితో చెప్పెను. మేఘము మీద ఆసీనుడైయున్నవాడు తన కొడవలి భూమిమీద వేయగా భూమిపైరు కోయబడెను. ఇంకొక దూత పరలోకమందున్న ఆలయములో నుండి వెడలివచ్చెను ఇతని యొద్దను వాడిగల కొడవలి యుండెను. మరియొక దూత బలిపీఠము నుండి వెడలివచ్చును ఇతడు అగ్ని మీద అధికారము నొందినవాడు ఇతడు వాడియైన కొడవలిగల వానిని గొప్ప స్వరముతో పిలిచి భూమి మీద ఉన్న ద్రాక్షపండ్లు పరిపక్వమైనవి వాడియైన నీ కొడవలిపెట్టిదాని గెలలు కోయమని చెప్పెను. కాగా ఆ దూతన తన కొడవలి భూమి మీద వేసి భూమి మీద నున్న ద్రాక్షపండ్లును కోసి దేవుని కోపమను ద్రాక్షల పెద్ద తొట్టిలో వేసెను. ఆ ద్రాక్షలతొట్టి పట్టణమునకు వెలుపట త్రొక్కబడెను. నూరు కోసుల దూరము గుఱ్ఱముల కళ్ళెముమట్టుకు ద్రాక్ష తొట్టిలో నుండి రక్తము ప్రవహించెను.’’వివరణ :


వచనం 1 : మరియు నేను చూడగా, ఇదిగో ఆ గొఱ్ఱె పిల్ల సీయోను పర్వతము మీద నిలువబడియుండెను. ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసళ్ళ యుందు లిఖింపబడియున్న నూట నలువది నాలుగు వేలమంది ఆయనతో కూడా ఉండిరి.

ఇదంతయూ అంత్యక్రీస్తుచే హతసాక్షులైన తరువాత పునరుత్ధానపరచబడి ఎత్తబడినవారైన తిరిగి జన్మించిన పరిశుద్ధులు ప్రభుని పరలోకంలో స్తుతించుటను గూర్చియు అంత్యక్రీస్తుచే హతసాక్షులైన పరిశుద్ధులు మరియు నిద్రించుచున్న పరిశుద్ధులు ఒక క్రొత్త కీర్తన పాడుచూ పరమందు ప్రభువుని స్తుతిస్తారు. వచనం 4లో 1,44,000మంది క్రొత్త కీర్తన పాడతారని మనం చూస్తాం. ఎత్తబడిన వారు 1,44,000మంది మాత్రమేనా అని నీవు ఆశ్చర్యపడవచ్చును ఇక్కడ సంఖ్య 14అనగా సమస్తమును మార్చబడెను. (మత్తయి 1:17)

పరిశుద్ధులు హతసాక్ష్యము మరియు ఎత్తబడుట తరువాత ప్రభువు ఈ లోకమంతటిని ఒక నూతన లోకముగా మార్చునని మనం గుర్తించాలి. ఈ లోకమునకు బదులుగా మన ప్రభువు తానే తన ప్రజలతో నివసించునట్టి ఒక క్రొత్త లోకమును నిర్మించును. ఇది సృష్టికర్త చిత్తము.

ఈ భూమి మీద నున్నప్పుడు క్రీస్తుచే అనుగ్రహింపబడిన నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను విశ్వసించి పరిశుద్ధులైన వారే పరమందు ప్రభువును స్తుతిస్తారు. అలాగే వారు ఇప్పుడు క్రీస్తు సంబంధులు కనుక వారి నొసటను గొర్రె పిల్ల యొక్కయు తండ్రియు యొక్కయుపేర్లు వ్రాయబడెను.

వచనం 2 : మరియు విస్తారమైన జలముల ధ్వనితోను గొప్ప ఉరుముల ధ్వనితోను సమానమైన యొక శబ్ధము పరలోకములో నుండి రాగా వింటిని నేను వినిన ఆ శబ్ధము వీణె వాయించుచున్న వైణికుల నాదమును పోలినది. 

ప్రభువు అనుగ్రహించిన రక్షణను మరియు ప్రభువు మాత్రమే తన దేవుడని వారి విశ్వాస సత్యమును కాపాడుకొనుటకై హతసాక్షులై ప్రభునిశక్తిచే తరువాత పునరుత్ధాన పరచబడిన వారే పరలోకమందున్న పరిశుద్ధులు వారి దేహము పునరుత్ధానపరచబడిరి కనుక ఆయనిచ్చిన రక్షణ మరియు అధికారమును ఆయన దీవెనను బట్టి ఆయనను పరలోకములో వారు స్తుతించుచుండిరి. వారు స్తుతి యొక్క శబ్ధము ప్రవాహ జలము శబ్ధముతోనూ ఉరుముల శబ్ధము వలెను ఆనందము కలిగించుచున్నది. వారందరూ ప్రభువు అనుగ్రహించిన నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను ఈ భూమిపై నున్నప్పుడే విశ్వసించి తమపాపముకు విముక్తిని శాశ్వతమును పొందినవారు.

వచనం 3 : వారు సింహాసనము ఎదుటను ఆ నాలుగు జీవుల యెదుటను పెద్దల యెదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు. భూలోకములో నుండి కొనబడిన ఆ నూట నలువది నాలుగువేలమంది తప్ప మరి ఎవరును ఆ కీర్తన నేర్చుకొనజాలరు.

1,44,000మంది అనగా ఎత్తబడు పరిశుద్ధులను ఇక్కడ సూచించుచున్నది బైబిల్‌లో 14 సంఖ్య అనగా ఒక నూతన మార్పు పరలోకమందు క్రొత్త కీర్తనతో ప్రభువును స్తుతించువారెవరనగా నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను విశ్వసించుట ద్వారా తిరిగి జన్మించి ఈ భూమిపై నున్నప్పుడే పాపముకు పరిహారము నొంది మార్పు చెందిన వారే అందువలనే ప్రభువు ఇక్కడ వారి సంఖ్యను 144000అని చెప్పెను.

వారిలో నీరు మరియు ఆత్మమూలమైన సువార్త ద్వారా విడుదల అను ఆయన దీవెనలను పొందినవారు తప్ప ప్రభుని స్తుతించువారు వేరొకరు ఉండరు. కాబట్టి మన ప్రభువు నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను విశ్వసించుట ద్వారా తమ పాపము క్షమింపబడి పరిశుద్ధాత్మను వరముగా పొందిన వారిచే స్తుతించబడును.

వచనం 4 : వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారును, స్త్రీ సాంగత్యము ఎరుగనివారునైయుండి గొఱ్ఱె పిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయనను వెంబడింతురు. వీరు దేవుని కొరకును గొఱ్ఱె పిల్ల కొరకును ప్రథమఫలముగా ఉండుటకై మనుష్యులలో నుండి కొనబడినవారు.

ఈ లోక శక్తి బట్టి గానీ మతమును బట్టి గానీ తమ విశ్వాసమును అపవిత్రపరచుకొనని వారే పరిశుద్ధులు ఈ లోకంలో అనేకులు తమ విశ్వాసమును తేలికగా మార్చుకొంటారు. ప్రభుని బాప్తిస్మము సిలువలో ఆయన రక్తమును విశ్వసించి పరిశుద్ధులైనవారు అట్టి విధముగా తమ పాప ప్రాయశ్చిత్తము పొందినవారు కనుక ఈ లోకములో మరి దేని వలన కూడా మార్చబడరు.

పరలోకమునకు ఆరోహణమై ప్రభువుని స్తుతించువారు ప్రభువు అనుగ్రహించిన నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను విడువక తమ విశ్వాసమును కాపాడుకొనిన వారే అలాగే పరలోకరాజ్యములో ప్రభుని స్తుతించగలవారు నీరు మరియు ఆత్మమూలమైన సువార్తలోక విశ్వాసమును బట్టి ప్రభువు వలన ఎత్తబడినవారే. 

4వ వచనం మధ్యలో ఇట్లు వ్రాయబడెను. వీరు గొర్రె పిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయనను వెంబడింతురు. నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను విశ్వసించుట ద్వారా ఒకేసారి తమ పాపములన్నీ కడుగబడినవారు తిరిగి జన్మించినవారై ప్రభువు వారిని నడిపించిన చోటికెల్లా ఆయనను వెంబడిస్తారు. వారు తమ పాపపరిహారము పొందిరి. కనుక వారి హృదయాలలో ప్రభువు నడిపించిన ప్రతి చోటికి ఆనందంతో అనుసరించుటకు సమ్మతి వారి హృదయాలలో కనబడును. కాబట్టి అంత్యకాలములో వారు తమ విశ్వాసమును బట్టి అంత్యక్రీస్తుచే హతసాక్షులై ప్రభునిచే పునరుత్ధానపరచబడి ఎత్తబడి పరలోకంలో ప్రభుని స్తుతిస్తారు.

వీరు దేవుని కొరకు గొర్రె పిల్ల కొరకును ప్రథమ ఫలముగా నుండుటకై మనుష్యులలో నుండి కొనబడినవారు అని కూడా వ్రాయబడియున్నది లెక్క లేనంతమంది ప్రజలలో నుండి ప్రభువనుగ్రహించిన నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను విశ్వసించుటతో తమ పాపాలన్నిటి నుండి కొద్దిమంది మాత్రమే రక్షింపబడతారు. అందువలననే ఒకానొక పట్టణము నుండి ఒకనిగాని, ఒకానొక కుటుంబము నుండి ఒకనిగాను మిమ్మును తీసికొని సీమోనునకు రప్పించెను అని యిర్మియా 3:14లో మన ప్రభువు చెప్పుచున్నాడు. నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను తెలిసికొని తమ పాపపరిహారము నొందిన వారే ఈ కొద్దిమంది.

వారు గొర్రె పిల్ల సంబంధీకులు గనుక వారే పునరుత్ధానంలో ప్రధమ ఫలము పొందెదరు. వారే ప్రభుని శక్తిని బట్టి ఎత్తబడెదరు. వారే శాశ్వతకాలము క్రీస్తును స్తుతించెదరు. ఇవన్నీ ప్రభునిచే ఇవ్వబడిన వాగ్ధానములే ఈ భూమిపై కూడా వారే ప్రభువు నడిపించు ప్రతి చోటికి ఆయనను అనుసరించెదరు. ఇదంత దేవుని దయ మరియు శక్తి మాత్రమే.

వచనం 5 : వీరినోట ఏ అబద్ధమును కనబడలేదు. వీరు ఆనింద్యులు నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను విశ్వసించి తిరిగి జన్మించిన వారు తమ నోటితో ఈ నిత్యసువార్తను బోధించగలరు తమ స్వంత భావాలతో సువార్తను బోధించువారు అనేకులు కలరు. కానీ సత్యసువార్తయైన నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను బోధించువారు కొద్దిమంది మాత్రమే అనునది సత్యము.

కేవలము క్రీస్తు సిలువలో కార్చిన రక్తమును మాత్రమే బోధించుచూ ప్రభువునిచే అనుగ్రహింపబడిన నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను బోధింపరు. ఎందుకు? నీరు మరియు ఆత్మమూలమైన సువార్త తప్ప మరి ఏ సువార్తయూ బైబిలు యొక్క సత్యసువార్త కాదు సత్యసువార్త వాక్యము వలన నీతిమంతులు హృదయ పాపములన్నీ తీసివేయబడియుండగా వారు పూర్తి ఒప్పుకోలుతో ఈ సువార్తను బోధిస్తారు.

వచనం 6,7 : అప్పుడు మరియొక దూతను చూచితిని అతడు భూనివాసులకు అనగా ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ఆ యా భాషలు మాటలాడు వారికిని ప్రతి ప్రజకును ప్రకటించునట్లు నిత్యసువార్తను తీసికొని ఆకాశ మధ్యమును ఎగురుచుండెను. అతడు మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చెను. గనుక ఆకాశమును భూమిని సముద్రమును జలధారను కలుగజేసినవానికే అని గొప్ప స్వరముతో చెప్పెను.

తిరిగి జన్మించిన పరిశుద్ధులు నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను ఈ భూమిపై ప్రకటించుట కొనసాగించవలెను. కాబట్టి నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను బోధించు క్రియలను పరిశుద్ధులు ఎత్తబడు దినము వరకూ ఈ భూమిపై తప్పక కొనసాగించవలెను.

నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను విశ్వసించినవారు మాత్రమే తమ విశ్వాసమును కాపాడుకొనుటకై అంత్యక్రీస్తుచే హతసాక్షులు కాబడుదురు. వారు మాత్రమే ఆవిధముగానే పరలోకరాజ్యమునకు కొనిపోబడుదురు. ప్రతివారు దేవునికి భయపడవలెను. నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను విశ్వసించాలి. దాని వలన తమ పాపపరిహారము పొందినవారై పరిశుద్ధాత్మను వరముగా పొందుకోవాలి. ఈ కాలపు క్రైస్తవులు కృతజ్ఞతాభావంతో ప్రభువు అనుగ్రహించిన నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను విశ్వసించలేకపోయినట్లయితే వారికి క్రీస్తు నందున్న విశ్వాసము నిష్‌ప్రయోజనమే.

ఈ విశ్వమును దానిలోని సమస్తమును సృజించినవాడు వేరెవరో కాదు యేసుక్రీస్తు అలాగునే తమను సృజించి తమ పాపములకు ఆయన క్షమతో కలుగచేసిన రక్షణను బట్టి మానవాళి యేసుక్రీస్తునే తమ దేవునిగా విశ్వసించి తదనుగుణంగా ఆయననే ఆరాధించలా ఎందుకనగా ఆయన హస్తములే సమస్తమును మొదలుపెట్టి ముగించెను. తమ హృదయాలలో నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను విశ్వసించుటతో ప్రతి ప్రజలు తమ పాపములన్నిటికి క్షమాపణ నొంది తమకు వరముగా పరిశుద్ధాత్మ అనుదీవెనలను పొందెదరు.

దేవునికి వ్యతిరేకముగా నిలుచు వారికి యేసుక్రీస్తు ఇవ్వబోవుచున్న తీర్పును పొందుటకు ఇప్పుడు ఈ లోకము సిద్ధపడవలసియున్నది. అలాగే ప్రభువునిచే త్వరగానే ఎత్తబడబోవు విశ్వాసమును మనము కూడా సిద్ధపరచుకొనవలెను. ఎందుకనగా దేవుని తీర్పు దినము మనకు సమీపముగా ఉన్నది. కొనిపోబడుటకై సిద్ధపడవలసిన మార్గమేదనగా ప్రభువు అనుగ్రహించిన నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను మాత్రమే విశ్వసించిన యెకడు పరిశుద్ధాత్మను పొందగలడు. అంతమ వచ్చినప్పుడు వారు మహిమచే కప్పబడి తాము ఎత్తబడునప్పుడు ప్రభునిచే మేఘాలలోనికి కొనిపోబడతారు.

కాబట్టి సాధ్యమైనంత త్వరలోనే పాపులందరూ యేసుక్రీస్తును సృష్టికర్తగాను రక్షణనిచ్చు దేవునిగానూ విశ్వసించాలి తద్వారా ఆయనను ఆరాధించాలి. నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను వారి హృదయాలలో అంగీకరించాలి. ఈ విధంగా ఆయన విడుదల అను కరుణను పొంది పరిశుద్ధాత్మను తమ వరముగా పొందాలి. దేవుని ఆరాధించువారు ప్రభువు అనుగ్రహించిన నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను తమ హృదయాలలో కలిగి ఉండాలి దానిని త్రోసి వేయకూడదు ఎందుకనగా ఈ విధంగానే వారు దేవుని ఆరాధించగలరు.

వచనం 8 : వేరొక దూత అనగా రెండవ దూత వెంబడివచ్చి - మహోద్రేకముతో కూడిన తన వ్యభిచార మద్యమును సమస్త జనములకు త్రాగించిన ఈ మహాబబులోను కూలిపోయెను కూలిపోయెను అని చెప్పెను.

యేసుక్రీస్తుని భయంకరమైన తీర్పుతో లోకము మాయమగును. ఎందుకనగా దాని మతము పునాదులు తప్పుడు బోధనలతో నున్నవి. కనుక అది దేవునిచే నాశనపరచబడును. ఈ లోకమతము దేవుని కంటే అధికముగా ఈ ప్రజలు లోకమును అనుసరించునట్లు చేసినవి మరియు వారిని దేవునికి వ్యతిరేకముగా నిలుచుటకు సాధనముగా ఉపయోగించుకొనును. కనుక ఈ లోకము నాశనపరచబడును. ఎందుకనగా దాని ప్రజలు దేవుని వదిలిపెట్టి లోక మతము వెంబడి వెళ్ళి వ్యభిచరించాలి.

వారు లోక మతమును వెంబడించిరి అనగా వారు దేవుడను కొని వారిని దయ్యములను అనుసరించిరి కాబట్టి దేవుడు తన కోపముతో ఈ లోకమును నాశనం చేయును లోకములోని సమస్తమును దాని తప్పుడు మతములన్నియూ దేవునిచే పడగొట్టబడును. దేవుని కోపమను మధ్యమును త్రాగించును. అలాగునే దేవునికి వ్యతిరేకముగా నిలుచువాడు లోక మతముకు పరాన్నజీవుల వలే అంటిపెట్టుకొన్న దయ్యము దేవుని తెగుళ్ళ చేత పడగొట్టబడి నిత్యనరకములోనికి త్రోయబడును.

వచనం :9-10 మరియు వేరొక దూత అనగా మూడవ దూత వీరి వెంబడి వచ్చి గొప్పస్వరముతో ఈలాగు చెప్పెను. ఆ క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని యెవడైనను నమస్కారము చేసి తన నొసటియందేమి చేతిమీద నేమి ఆ ముద్ర వేయించుకొనినయెడల ఏమియు కనబడకుండ దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమను మద్యమును వాడు త్రాగును. పరిశుద్ధుల దూతల యెదుటను గొఱ్ఱె పిల్ల యెదుటను అగ్నిగంధకముల చేత వాడు బాధింపబడును.

ఎవరైననూ మృగమును దాని విగ్రహమును ఆరాధించిన యెడల లేదా వాని ముద్రను కుడిచేతి మీద గాని నొసటి మీద గాని వేయించుకొనినయెడల అతడు/ఆమె నరకము అను శిక్షను పొందును అని ఇక్కడ దేవుడు ప్రతివారిని హెచ్చరించెను. అనేకుల ద్వారా క్రియలు చేయుచూ సాతాను మానవాళినంతటిని అంత్యక్రీస్తు రూపంలో చేయబడిన విగ్రహమును పూజించునట్లు భయపెట్టును. కానీ తిరిగి జన్మించిన వారు అంత్యక్రీస్తుకు విరోధముగా పోరాడి తమ విశ్వాసమును కాపాడుకొనుటకు హతసాక్షులవుతారు. తిరిగి జన్మించి పరిశుద్ధులు తప్పక తమ విశ్వాసమును కాపాడుకోవాలి. అంత్యక్రీస్తుకు విరోధముగా నిలువబడి హతసాక్షులవ్వాలి.

ఎవరైననూ అంత్యక్రీస్తుకు లొంగినవారై అతని విగ్రహము ముందు వంగి నమస్కరించి అతని నామము లేదా ముద్రను వేయించుకొనినయెడల అతడు/ఆమె దేవుని కోపమును ప్రోగు చేసుకొనును అది అతనిని/ఆమెని నిత్యనరకాగ్ని లోనికి మరియు అగ్నిగంధకములోనికి త్రోయును. శ్రమ సమయము వచ్చినప్పుడు పరిశుద్ధులు దేవుని ప్రార్థించవలెను. ప్రభువు నందు తమకున్న విశ్వాసమును కాపాడుకోవాలి. మరియు తమ నిరీక్షణను ఆయన రాజ్యమును అంత్యక్రీస్తుకు వ్యతిరేకముగా నిలవాలి మరియు వారి విశ్వాసమును కాపాడుకోవాలి. తమ హతసాక్ష్యములోను, పునరుత్ధానములోను మరియు ఎత్తబడుటలోను పాలివారు కావాలి. ఆ విధంగా ప్రభువుతో పాటు ఆయన రాజ్యములో నివసించుట అను నిత్యదీవెనను పొందాలి.

వచనం 11 : వారి బాధసంబంధమైన పొగ యుగయుగములు లేచును. ఆ క్రూరమృగమునకు గాని దాని ప్రతిమకు గాని నమస్కారము చేయువారును దాని పేరుగల ముద్ర ఎవడైనను వేయించుకొనినయెడల వాడును రాత్రింబగళ్లు నెమ్మదిలేనివారై యుందురు.

సాతానునే దేవుడని ఆరాధించువారు ఆయన యొక్క తెగుళ్ళు మరియు నెమ్మదిలేని శాశ్వత నరకము యొక్క బాధను ఆయన వారికిచ్చును. అంత్యకాలములో అంత్యక్రీస్తుకు లోబడి అతని ప్రతిమను దేవుడని ఆరాధించువారిని దేవుడు అగ్నిగుండములోను మరియు దేవుని మృగమును అతని ప్రతిమను అనుసరించి మృగపు ముద్రను వేయించుకొన్న వారు రాత్రి పగలు నెమ్మది లేని వారైయుందురు.

వచనం 12 : దేవుని ఆజ్ఞను యేసును గూర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడును.

ప్రభువు తమకిచ్చిన వాగ్ధానము ప్రకారము పరిశుద్ధుల సంపద మహిమ మరియు దీవెనలు యందు నమ్మిక ఉంచినట్లే దానిలో వారు ఓర్పును కలిగియుండాలి వారు శ్రమల కాలమును కూడా ఓర్చు కొనవలెను అంత్యకాలపు పరిశుద్ధులు ప్రభువు చేసిన వాగ్ధానమేమనగా వారి హతసాక్ష్యముతో అటు ప్రభుని శక్తి వలన పునరుత్ధానపరచబడి పరలోకమునకు కొనిపోబడుటను దీవెనలను కుమ్మరించెదననుట.

కనుక పరిశుద్ధులు ఓర్పుగా ఈ దీవెనలను నమ్మినచో ప్రభునితో పాటు గొర్రె పిల్ల వివాహవిందులో పాల్గొందుము. ఆయనతో కూడా వెయ్యేండ్ల పరిపాలించెదము. ఆయనతో సదాకాలము పరలోక రాజ్యములో నివసించెదము. కాబట్టి అంత్యకాలమును వచ్చినప్పుడు పరిశుద్ధులు హతసాక్షులై, తమ విశ్వాసమును కాపాడుకొందురు. వారు ఓర్పుతో శ్రమ కాలమంతయూ తాము ఓర్చుకోవాలి.

అంత్యక్రీస్తు తమ విశ్వాసము వదలిపెట్టాలని పరిశుద్ధులను తన బెదిరింపుతోను ఒత్తిడితోను లొంగదీసుకొనునప్పుడు ఈ యుగములో జీవించుచున్న పరిశుద్ధులు తప్పక ప్రభుని వాగ్ధానమును విశ్వసించి హతసాక్ష్యమును కౌగిలించుకోవాలి. ఎందుకు? దాని తరువాత అతి త్వరలోనే ప్రభువు మనకు వాగ్ధానము చేసినవన్నీ నెరవేరును కనుక ప్రభువు నందు దేవుని వాక్యము నందు విశ్వాసముంచిన వారు పరిశుద్ధులు మాత్రమే ఈ బహుమానమును పొందగలరు. కాబట్టి నీ విశ్వాసమును ప్రభుని వాక్యమందుంచుము. ఆయన వాక్యము నందు యేసుక్రీస్తు నందు తమకు గల విశ్వాసమును కాపాడుకొను పరిశుద్ధులను దేవుడు తన సరికొత్త నూతన లోకమునకు ఆహ్వానించును.

ప్రభుని సువార్తను సేవించు వారైన పరిశుద్ధులు శ్రమల కాలమందు ఓర్పుతో తమను కాపాడుకోవాలనుటకు అనేకమైన కారణములున్నాయి. భవిష్యత్తులో మంచిని చూచుటకై ప్రస్తుత బాధను ఓర్పుతో సహించవలసియున్నది.

రోమా 5:3-4 ‘‘అంతేకాదు శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరిగి శ్రమయందును అతిశయపడుదము” అని చెప్పబడినది మహాశ్రమలలో కూడా ప్రభువు నందు విశ్వాసమును బట్టి ఓర్పును కలిగిన పరిశుద్ధులు తమ పునరుత్ధానమును ఆయన వలన కొనిపోబడి ఆయన రాజ్యములో ఏలుబడి చేయుటకు దీవెనకరమైన జీవితమును పొందెదరు అలాగే మనము కూడా మన విశ్వాసంతో శ్రమలో ఓరిమి కలిగియుండాలి తమ విశ్వాసమును ప్రభువునందుంచి అంత్యకాలములో పరిశుద్ధులు నిత్యముగా ఓర్పుకొనెదరు ప్రభువు పరమందును ఈ లోకంలోను వారి కొరకు దేవుడు నెరవేర్చబోవు అన్నిటి యందు పరిశుద్ధులు విశ్వాసము కలిగి ఉంటారు.

వచనం 13 : అంతట ఇప్పటి నుండి ప్రభువు నందు మృతినొందు మృతులు ధన్యులని వ్రాయుమని పరలోకం నుండి యొక స్వరము చెప్పగా వింటిని నిజమే. వారు తమ ప్రయాసము మాని విశ్రాంతి పొందుదురు వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు.

ఇప్పటి నుండి ప్రభువు నందు మృతి నొందు మృతులు ధన్యులని ఈ వచనం చెప్పుచున్నది. ఎందుకు? ఎందుకనగా శ్రమల కాలము వచ్చినప్పుడు అలాగు అంత్యక్రీస్తు లోకమును పాలించునప్పుడు భూమిపై నివసించుచున్న ప్రతి పాపి నాశనపరచబడును. కాబట్టి పరిశుద్ధులు రాబోవుచున్న క్రీస్తు రాజ్యము చూచి వారి విశ్వాసమును కాపాడుకొని తమ విశ్వాస హతసాక్షులైనవారు ధన్యులు. అలాగే తమ విశ్వాసమును కాపాడుకొనుటకై వారు హతసాక్ష్యమును కౌగలించవలెను.

అట్టి పరిశుద్ధులను ప్రభువు జాగ్రత్తగా చూచును వారిని పునరుద్ధానపరచి తన రాజ్యమునకు కొనిపోవుటకు వారిని పైకెత్తును ఈ భూమిపైన పరిశుద్ధుల శ్రమలన్నియూ అంతమగును.

వాటికి బదులు ప్రభువు తమకు బహుమానముగా ఇచ్చిన బహుమానమును అనుభవించెదరు అట్టి సమయంలో పరిశుద్ధులందరూ ప్రభువుతో కూడా పరిపాలించుచూ శాశ్వత సంపద మరియు ఆయన రాజ్యము యొక్క మహిమానందమును సదాకాలము వారిదగును.

ఇందువలననే తమ విశ్వాసమును కాపాడుకొనుటకు అంత్యకాలములో హతసాక్షులగువారు ఎంతో ధన్యులు. ఎందుకనగా వారు ప్రభునితోను ఆయన సమృద్ధియైన మహిమ యొక్క వెయ్యేండ్ల రాజ్యములోనూ నిత్యరాజ్యమైన పరలోకంలో నివసిస్తారు. మృగమునకు లోబడక ప్రభునియందు తమకున్న విశ్వాసమును కాపాడుకొను వారికి సదాకాలము ప్రభువుతోపాటు ఏలుటకు దేవుడు కృప అనుగ్రహించును.

వచనం 14 : మరియు నేను చూడగా ఇదిగో తెల్లని మేఘము కనబడెను మనుష్యకుమారుని పోలిన యెకడు ఆ మేఘము మీద ఆసీనుడై యుండెను. ఆయన శిరస్సు మీద సువర్ణ కిరీటమును చేతిలో వాడిగల కొడవలియు ఉండెను.

పరిశుద్ధులను కొనిపోవుటకు ప్రభువు వచ్చునని ఈ వచనం చెప్పుచున్నది. ఎందుకనగా ప్రభువే పరిశుద్ధులకు గురువు తమ విశ్వాసమును కాపాడుకొనుటకు హతసాక్షులైన పరిశుద్ధులను ఆయన పునరుత్ధానపరచి ఎత్తబడునట్లు వారిని దేవుని రాజ్యమునకు కొనిపోవును. ఆ మహాశ్రమల కాలములో పరిశుద్ధులు ఎత్తబడు దినము నిశ్చయముగా వచ్చును.

వచనం 15 : అప్పుడు మరియొక దూత దేవాలయములో నుండి వెడలివచ్చి భూమి పైరు పండి యున్నది. కోతకాలము వచ్చినది నీ కొడవలిపెట్టి కోయమని గొప్ప స్వరముతో మేఘము మీద ఆసీనుడైయున్న వానితో చెప్పెను.

ప్రభువుచే పరిశుద్ధులు ఎత్తబడుట పూర్తియగుటను ఈ వచనం సూచించుచున్నది. సమయానుకూలముగా పరిశుద్ధులు హతసాక్ష్యము తరువాత ఎత్తబడుట సంభవించును. తరువాత నిద్రించుచున్న పరిశుద్ధులు ఎత్తబడుటను హతసాక్షులైనవారితో కలిపి అంగీకరించును. పరిశుద్ధులు విశ్వాస పరిపూర్ణత వారి రక్షణ హతసాక్ష్యము పునరుత్ధానము ఎత్తబడుట మరియు శాశ్వత జీవములో కనబడును. పరిశుద్ధులు ఎత్తబడు కాలమున అంత్యక్రీస్తుచే హింసింపబడి హతసాక్షులైన పిదపవచ్చును దాని వెంట వారి పునరుత్ధానము సంభవించును.

వచనం 16 : మేఘము మీద ఆసీనుడైయున్న వానితో చెప్పెను. మేఘము మీద ఆసీనుడై యున్నవాడు తన కొడవలి భూమిమీద వేయగా భూమి పైరు కోయబడెను.

ఈ వచనం కూడా పరిశుద్ధులు ఎత్తబడుటను సూచించును. ఎత్తబడుట అనగా మేఘములోనికి ఎత్తబడుట పరిశుద్ధులు మేఘము వరకు ఎత్తబడి తరువాత ప్రభునితోపాటు ఈ భూమిపైకి దిగి వస్తారు అని అర్థమా? పరిశుద్ధులు ఎత్తబడిన తరువాత మన ప్రభువు ఈ భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును ఏడు పాత్రల తెగుళ్ళును కుమ్మరించి నాశనం చేయును లోకము ఆ విధముగా నాశనపరచబడిన పిదప ఎత్తబడిన పరిశుద్ధులతో కలసి ఆయన ఈ భూమిపైకి దిగివచ్చును.

అప్పుడు ప్రభువు ఆయన పరిశుద్దులు వెయ్యేండ్ల పాటు ఈ భూమిపై పరిపాలన చేయుదురు. గొర్రె పిల్ల వివాహ విందు పూర్తయిన తరువాత వారు నిత్యరాజ్యమైన పరలోకమునకు ఎక్కిపోతారు. గొర్రె పిల్ల వివాహవిందుకు పరిశుద్ధులు ప్రభువునితో పాటు హాజరైనప్పుడు ప్రభువు ఈ లోకమును దాని సమస్తమును అప్పటికే నూతనపరచును.

వారు ఎత్తబడిన తరువాత పరిశుద్ధులు ప్రభువుతో పాటు కొంతసేపు మేఘములో ఆగి ఏడుపాత్రల తెగుళ్ళన్నీ ముగిసినప్పుడు నూతన పరచబడిన భూమిపైకి దిగి వచ్చి ప్రభువుతో పాటు వెయ్యేండ్లు రాజ్యపరిపాలన చేస్తారు. తరువాత వారు ప్రభునితో దేవుని రాజ్యములో ప్రవేశిస్తారు. ఆయనతో సదాకాలము జీవించెదరు.

వచనం 17 : ఇంకొక దూత పరలోకమునందున్న ఆలయములో నుండి వెడలి వచ్చెను ఇతని యొద్దను వాడిగల కొడవలియుండెను.

ఇక్కడ కనిపించు దూత తీర్పు దూత ఈ దూత దేవునికి వ్యతిరేకముగా నిలిచిన ఈ లోక ప్రజలపైకి గొప్ప తెగుళ్ళను రప్పించును. వారిని నిత్యనరకాగ్నిలోనికి త్రోయును. ఆయన కర్తవ్యమేమనగా తిరిగి జన్మించని వారైన ఈ లోక పాపులను అంత్యక్రీస్తుతోను అతని సేవకులతోనూ కలిపి బంధించి అగాధములోనికి త్రోయుట.

వచనం 18 : మరియొక దూత బలిపీఠము నుండి వెడలివచ్చెను ఇతడు అగ్ని మీద అధికారము నొందినవాడు ఇతడు వాడియైన కొడవలిగల వానిని గొప్ప స్వరముతో పిలిచి భూమిమీద ఉన్న ద్రాక్షపండ్లు పరిక్వమైనవి వాడియైన నీ కొడవలి పెట్టి దానిని గెలలు కోయమని చెప్పెను.

దేవునికి వ్యతిరేకముగా నిలుచుట అను పాపమునకై ఆయన పాపులకు తీర్పు తీర్చుటను గూర్చి ఈ వచనం చెప్పుచున్నది. దేవుని సమయాలు ఆయన ప్రణాళికను అమలు చేయు ఘడియలైయున్నవి. పాపులకు తన తీర్పు అగ్నినిచ్చుటకు దేవుడు తనకు వ్యతిరేకముగా నిలిచిన పాపులందరినీ ప్రోగుచేసి వారిని శిక్షించును.

వచనం 19 : కాగా ఆ దూత తన కొడవలి భూమి మీద వేసి భూమి మీదనున్న ద్రాక్షపండ్లును దేవుని కోపమును ద్రాక్ష పెద్ద తొట్టిలో వేసెను.

పరిశుద్ధులు ఎత్తబడిన తరువాత ఏడు పాత్రల తెగుళ్ళు వలన అంత్యక్రీస్తు మరియు పాపులు బహుగా బాధింపబడతారని ఈ వాక్యము తెలియపరచుచున్నది. ఈ భూమిపై కూడా దేవుడు తన భయంకరమైన తెగుళ్ళు అను ఆయన కోపమును పాపులపై పడనిచ్చును దీని తరువాత నరకము అను శిక్షనిచ్చును. కనుక పాపులమైన అంత్యక్రీస్తు మరియు అతని అనుచరులపైన దేవుడు కుమ్మరించబోవు తెగుళ్ళు ఆయన న్యాయమైన కోపమే ఇదే తనకు వ్యతిరేకముగా నిలుచువారి కొరకు దేవుడు నియమించునది.

వచనం 20 : ఆ ద్రాక్ష తొట్టి పట్టణమునకు వెలుపట త్రొక్కబడెను. నూరు కోసుల దూరము గుఱ్ఱము కళ్ళెము మట్టుకు ద్రాక్ష తొట్టిలో నుండి రక్తము ప్రవహించెను. 

ఈ భూమిపై ఇంకనూ మిగిలిన వారిపై మనుష్యులు మరియు సకల ప్రాణుల పైకి కుమ్మరింపబడబోవు ఏడుపాత్రల తెగుళ్ళు దేవుని కోపము యొక్క శిక్ష దాని బాధ ఎంత కఠినముగా ఉండునో ఈ వచనం తెలియజేయుచున్నది. ప్రపంచమంతటా ఈ తెగుళ్ళు వ్యాపించునని కూడా ఈ వచనం తెలియచేయుచున్నది. పరిశుద్ధులు హతసాక్షులై పునరుత్ధానపరచబడి ఎత్తబడినప్పుడు ఆ సమయం నుండి ఏడు పాత్రల కోపము అను తెగుళ్ళన్నీ ఒకేసారి కలిగి సమస్తమును సమాప్తిచేయును.

పరమందున్న పరిశుద్ధులు దేవుని పక్షమున నిలుచు దూతలు తప్ప ఎవరునూ ఈ భయంకరమైన తెగుళ్ళ నుండి తప్పించబడతారు. దేవునికి వ్యతిరేకముగా నిలుచువారికి మరొక ప్రక్క కేవలము నరకమే సిద్ధపరచబడెను. వీడికి భిన్నంగా అప్పుడే తిరిగి జన్మించిన పరిశుద్ధులు మేఘములో వివాహవిందులో ప్రభువుతో పాటు పాల్గొందురు. ఆయన రక్షణ కొరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు. అప్పటి నుండి పరిశుద్ధులు ప్రభువుతో పాటు శాశ్వతముగా ఆయన నిత్య కృపలో జీవిస్తారు.