Sermons

[అధ్యాయము 14-2] <ప్రకటన 14:1-20> అంత్యక్రీస్తు యొక్క ప్రత్యక్షతకు పరిశుద్ధులు ఎలా ప్రతిస్పందిస్తారు?<ప్రకటన 14:1-20>


సమీప భవిష్యత్తులో అంత్యక్రీస్తు బయల్పడునప్పుడు అతనిని జయించుటకు ప్రభువు నందు తమకున్న విశ్వాసముతో సాక్ష్యమునకై తమను తాము సిద్ధపరచుకోవాలి. అట్లు చేయవలెనంటే అంత్యక్రీస్తు ఈ భూమిపైకి తెచ్చునట్టి మోసపూరిత విధానాలను గురించి వారు బాగుగా తెలుసుకోవాలి. అప్పుడు మాత్రమే పరిశుద్ధులు అతని ఎదుట నిలిచి తమ విశ్వాసంతో వానిని జయించగలుగుతారు సాతాను తన పేరును గానీ సంఖ్యను గానీ ప్రజలు వేయించుకొనునట్లుగా చేసి క్రైస్తవుల విశ్వాసము చెరప ప్రయత్నిస్తాడు.

క్రైస్తవుల విశ్వాసాన్నే చెరప ప్రయత్నించుటకు కారణమేమనగా దేవునికి విరోధముగా నిలిచి నీతిమంతులు విశ్వాసమును పడగొట్టి అతడు నీరు మరియు ఆత్మమూలమైన సువార్త ద్వారా ప్రజలు పాప పరిహారమును పొందుకుండునట్లుగా చేయుటకై చూచును. అంత్యక్రీస్తు ప్రజలను తనవైపునకు త్రిప్పుకొని వారు దేవునికి వ్యతిరేకముగా అతని అనుచరులు గొప్ప శిక్షను తెగుళ్ళను అనుభవిస్తారు.

దేవుడు తన శ్రమపై కుమ్మరించబోవు ఏడు పాత్రల తెగుళ్ళయొక్క స్పష్టమైన అవగాహనతో కూడిన తమ విశ్వాసంతో పరిశుద్ధులు జీవించాలి. ద్వితీయోపదేశకాండం 32:35లో దేవుడీలాగు సెలవిచ్చెను. ‘‘పగతీర్చుటయు, ప్రతిఫలమిచ్చుటయు నావే” ఆయన తన పిల్లల మరణమునకు వారిపై తీర్చును ఆలాగునే మనం మన కోపము మరియు నిష్ఫల మైన క్రియలకు బదులుగా మన విశ్వాసమును కాపాడుకొనుచూ జయ జీవితంను జీవించాలి. తమ హతసాక్ష్యము తరువాత ఈ భూమిపై నిలిచిన శేషమును దేవుడు నాశనపరచును సత్యమందలి విశ్వాసము కలిగి పరిశుద్ధులు అంత్యక్రీస్తుతో పోరాడవలెను.ఎన్నడూ మరువరాని సత్య వాక్యము :


తమ పాపముల నుండి విముక్తి నొందినవారందరూ తప్పక గుర్తించుకోవలసినదేమనగా కేవలము పాపరహితులగు పరిశుద్ధులు మాత్రమే అంత్యక్రీస్తుచే హతసాక్షులైన తరువాత కొద్దిసమయానికే పునరుత్ధానులై ఎత్తబడతారని అంత్యక్రీస్తు బయల్పడి పరిశుద్ధులు హతసాక్ష్యము వచ్చునప్పుడు దేవుని వాగ్ధానములన్ని నెరవేర్చబడునని మనము ఎల్లప్పుడూ మరువకూడదు.

వచనం 14 ఆపైన నుండి 14వ అధ్యాయంలో దేవుని వాక్యము పరిశుద్ధులు నిశ్చయంగా ఎత్తబడతారని ఈ ఎత్తబడుట హతసాక్ష్యము తరువాత జరుగునని మనకు చెప్పుచున్నది.

సాతాను ముద్రను ప్రజలు వేయించుకొన్న తరువాతనే పునరుత్ధానము ఎత్తబడుట వచ్చునని మనం మరువకూడదు. అంత్యక్రీస్తుచే హతసాక్షులైన నీతిమంతులు కొరకు మొదటి పునరుత్ధాన దీవెన మరియు ఎత్తబడుట అనునవి ఎదురుచూచుచున్నవి. ఆ సమయంలో నీతిమంతులు తమ విశ్వాసమును కాపాడుకొనుటకై తమ పరిశుద్దుల హతసాక్ష్యమును కౌగలించెదరు. ఎందుకనగా వారు సాతాను ముద్రను వేయించుకొనలేదు. కాబట్టి ఈ భూమిపై వారు పడిన శ్రమకు అనుగుణంగా హతసాక్షులైన నీతిమంతులు తమ బహుమానమును పొందుతారు మరియు వారికి దేవుని మహిమ కలుగును.

నీవు సమీపస్థులైన పరిశుద్ధులు లేక పరిచారకులు తమ విశ్వాసమును కాపాడుకొనుటకు హతసాక్షులగుట నీవు చూచినప్పుడు నీవు దుఃఖపడకూడదు. లేదా కోపపడకూడదు. దానికి భిన్నంగా తమ విశ్వాసమందు కాపాడుకొనుటకు తమను హతసాక్షులగుటకు అనుమతించిన దేవుని పరిశుద్ధులందరూ నిజముగా కృతజ్ఞత చెల్లించి ఆయనకు మహిమ చెల్లించాలి. ఎందుకనగా హతసాక్ష్యము తరువాత వారు మహిమ శరీరముతో ప్రభువుచే పునరుత్ధానపరచబడతారు.దేవునికి వ్యతిరేకముగా నిలుచు వారి కొరకు సిద్ధపరచబడిన ఆ ఏడుబూరల తెగుళ్ళుయైయున్నవి?


వచనం 19 ఈ విధముగా చెప్పుచున్నది. ‘‘కాగా ఆ దూత తన కొడవలి భూమి మీద వేసి భూమి మీదనున్న ద్రాక్షపండ్లను కోసి దేవుని కోపమును ద్రాక్షల పెద్ద తొట్టిలో వేసెను.’’ ఆయన ప్రేమను ఎల్లప్పుడూ వ్యతిరేకించువారు పరిశుద్ధులు హతసాక్ష్యము తరువాత దేవుని భయంకరమైన తెగుళ్ళు అనుభవించుట నియమించబడినవారై వారు భూమిపై నున్నప్పుడు ప్రభువు అనుగ్రహించిన నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను తమ హృదయాలలో అంగీకరించుటకు వ్యతిరేకముగా మరియు దానికి వ్యతిరేకులుగా నిలిచిరి వారిని పాపము నుండి రక్షించుటకు ఆయనిచ్చిన రక్తము మరియు నీటి మూలమైన యేసుక్రీస్తుని రక్షణను విశ్వసించక వారు దేవునికి శత్రువులైరి. వారు దేవుడు కుమ్మరించు ఏడు పాత్రల తెగుళ్ళను పొందుట మాత్రమేగాక భయంకరమైన శిక్ష యొక్క తెగులు అను నిత్యనరకమును కూడా పొందెదరు ప్రభువుచే ఎత్తబడని వారిపైకి రప్పించుటకై దేవుడు సిద్ధపరచిన ఏడు తెగుళ్ళు ఇవే పరిశుద్ధుల హతసాక్ష్యము తరువాత ఎత్తబడుటలో పాల్గొనక సాతానుకు బానిసలై ఇంకనూ ఈ భూమిపై నుండి దేవుని మహిను దూషించుటలోనే కొనసాగుచున్నవారి కొరకు సిద్ధపరచిన ఈ ఏడు పాత్రల తెగుళ్ళను దేవుడు కనికరము లేకుండానే వారిపై కుమ్మరించును.

అయిన దేవుడు నీతిమంతులకు ఎందుకు హతసాక్షులనుగా చేసెను? తిరిగి జన్మించని వారితోపాటు నీతిమంతులు కూడా భూమిపై ఉన్నచో సమయం వచ్చినప్పుడు దేవుడు ఆ ఏడుపాత్రల తెగుళ్ళను కుమ్మరించలేడు మరియు దేవుడు నీతిమంతులను ప్రేమించిన కారణాన వారు ఆయన మహిమలో ప్రవేశించునట్లుగా వారు హతసాక్షులగుటకు అనుమతించును అందువలననే ఏడు పాత్రల తెగుళ్ళను అనుమతించక ముందే నీతిమంతులను హతసాక్షులను చేయును. హతసాక్షులైన నీతిమంతులను పునరుత్ధానపరచి కొనిపోయిన తరువాత ఆయన స్వేచ్ఛగా ఈ తెగుళ్ళను భూమిపై కుమ్మరించును. ఈ భూమిపై నున్న మానవాళిపైకి దేవుడు కుమ్మరించు ఆఖరి తెగులు ఈ ఏడు పాత్రల తెగుళ్ళే.


వెయ్యేండ్ల రాజ్యము మరియు పరిశుద్ధులు అధికారము :


ప్రభువు తన పరిశుద్ధులతో పాటు భూమిపైకి దిగివచ్చినప్పుడు వెయ్యేండ్ల రాజ్యము కాలము వచ్చును. సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతింత్రించుకొందురని మత్తయి 5:5 మనకు చెప్పుచున్నది. ప్రభువు తన పరిశుద్ధులతో ఈ భూమిపైకి వచ్చునప్పుడు కీర్తన 37:29లో చెప్పబడినట్లు నీతిమంతులు భూమిని స్వతంతించుకొందురు అనునది నెరవేర్చబడును.

కనుక ప్రభువు తన పరిశుద్ధులందరిని భూమిపైకి వచ్చునప్పుడు ఈ భూమిని స్వాధీనపరచుకొని అధికారమును వారికిచ్చును. అట్టి సమయంలో ఆయన వారు పరిపాలించునట్లుగా పది పట్టణములను మరియు ఐదు పట్టణములను ఇచ్చును. ఆయన తిరిగి వచ్చునప్పుడు ఈ భూమిని దానిలోని సమస్తమును నూతనపరచి అప్పటి నుండి పరిశుద్ధులను వెయ్యేండ్లు తనతో కూడా దానిని పరిపాలించునట్లు చేయును.

అయినచో ఈ యుగమందు నివసించుచున్న నీతిమంతులు ఎట్టి నిరీక్షణతో వారు నివసింపవలెను. ప్రభుని రాజ్యము మీద వచ్చునప్పుడు శాంతి ఆనందము ఆయన అధికారము నుండి ప్రవహించు దీవెనలు దానిలో నుండును ప్రభుని పాలన క్రింద జీవించుచున్నా మనకు ఏ కొదవ ఉండదు. కానీ పొర్లి ప్రవహించు ఆయన సమృద్ధి మరియు పరిపూర్ణతలో నివసిస్తాము.

ప్రభుని రాజ్యము భూమిపైకి వచ్చునప్పుడు నీతిమంతులకు కలుగు మరియు నిరీక్షణ నెరవేర్చబడును వెయ్యేండ్లు ఈ భూమిపై నివసించిన తరువాత నీతిమంతులు శాశ్వతమైన పరలోక రాజ్యములో ప్రవేశిస్తారు. కానీ దేవునికి విరోధముగా నిలిచినవారు నిత్యనరకాగ్నిలోనికి మరియు గంధకములోనికి త్రోయబడి పగలు రాత్రి విశ్రాంతి లేక నిత్యము బాధపడతారు.

కాబట్టి నీతిమంతులు ప్రభుని దినము కొరకు ఎదురు చూచుచూ నిరీక్షణతో జీవించవలెను. హతసాక్ష్యము పునరుత్ధానము కొనపోబడుట నిత్యజీవము తమవేనని నీతిమంతులందరూ మరచిపోరాదు. ఇప్పటి వరకూ మీరు విన్న సత్యవాక్యమును మీ హృదయముందు భద్రపరచుకొని దానికి స్థిరముగా పట్టుకొనవలెను.

ప్రభుని రాకడ దినము వరకు నీతిమంతులు నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను బోధించుచూ వారి నిరీక్షణను పరలోక రాజ్యముపై నిలిపి జీవించవలెను. దేవుని రాజ్యములో శాశ్వతంగా జీవించుటకు ఈ భూమిపై నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను బోధించుటకు నీతిమంతులకు అధికారమియ్యబడెను. ఈ అధికార యుగములో జీవించు పరిశుద్ధులు ఏమి చేయవలెను.అంధకార యుగములో జీవించు పరిశుద్ధులు ఏమి చేయవలెను?


ఈ యుగము అంధకార యుగమును దీనిలో నివసించుటకు ఎంతో కష్టతరమగుచున్నది అనునది ఎంతో స్పష్టమగుచున్నది. కాబట్టి మనము పాపులకు నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను బోధించుచూ వారిని వృద్ధి చేయవలసియున్నది. ప్రపంచవ్యాప్తంగా నీతిమంతులు దేవుని ప్రేమను వ్యాపింపచేయుచూ యేసుక్రీస్తుద్వారా అనుగ్రహించబడిన నీరు మరియు ఆత్మమూలమైన సువార్త ద్వారా వచ్చు పాపక్షమాపణను బోధించాలి. ఇదే ప్రస్తుతము నీతిమంతులు చేయవలసినది.

ప్రస్తుతము వారు ఈ అవకాశమును పోగొట్టుకున్నట్లయిన అది వారికిక తిరిగి రాదు. ఎందుకనగా ఈ లోక అంతము ఎంతో దూరమున లేదు. కనుక మనము అధికముగా నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను బోధించుచూ దేవుని రాజ్యమును గూర్చిన నిరీక్షణతో తప్పిపోయిన ఆత్మను వృద్ధి చేయాలి. నీతిమంతులు చేయవలసిన నీతి క్రియ ఇదే.

ఈ ప్రస్తుత లోకంలో నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను కలిగియుండకనే యేసుక్రీస్తు విశ్వసించి ఆయన పరిచర్యలో కొనసాగుచున్నామని చెప్పుకొనువారు అనేకులు కలరు. సత్యమును తెలిసికొనక తమ మత జీవితమును కొనసాగించువారందరూ అబద్ధప్రవక్తలే ఈ అబద్ధికులు కేవలము విశ్వాసులు వస్తు సమృద్ధి మాత్రమే యేసునామంలో వ్యాప్తి చేస్తారు.

కాబట్టి ఈ అబద్ధ ప్రవక్త వలన మోసగింపబడుచూ తమ విశ్వాస జీవితమును జీవించు ప్రయత్నించువారి పట్ల జాలి చూపాలి. నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను లేకయే తమ విశ్వాస జీవితం కొనసాగించు ఈ నామమాత్రపు క్రైస్తవులు ఇంకనూ పాపులుగానే ఉంటూ తాము క్రీస్తును విశ్వసించుచున్నామని చెప్పుకొనుచున్నచూ దేవుని ఆజ్ఞ యొక్క శాపము క్రింద కొనసాగుచున్నారు. వారు ఎల్లప్పుడూ పాపములోనే నివసించుచున్నారు. ఎందుకనగా వారు నీరు మరియు ఆత్మమూలమైన సువార్త యొక్క సత్యమును తెలిసికొన్నచో వారి హృదయపాపమంతయూ తొలగిపోయి వారు హిమమువలే తెల్లగా మారుతారు వారికి బహుమానంగా పరిశుద్ధాత్మ అనుగ్రహించబడుతుంది.

దానికి భిన్నంగా నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను విశ్వసించిన దేవుని పరిచారకులు శాంతితో జీవిస్తారు. దేవుని పరిచారకులు ఆయన ప్రజలు నీరు మరియు ఆత్మమూలమైన సువార్తలో ఆనందిస్తారు. లోకపాపమును తమపై మోసికొని యోహాను నుండి పొందిన బాప్తిస్మముతోనే ఒక్కసారిగానే ఈ పాపము కొరకు సిలువపై తీర్పు నొందిన ప్రభువైన యేసు లోక పాపమును పోగొట్టెను నేను ఈ రక్షణ యొక్క తీర్మానమును విశ్వసించినప్పుడు నాపై గొప్ప భారముగా మోపబడిన పాపములన్నియూ మాయమైనవి నేనిప్పుడు నీతిమంతుడన య్యానని సాక్ష్యం చెప్తారు.

అట్టి సాక్ష్యముతో దేవుని సంఘములోని పరిశుద్ధులు దేవునికి మహిమ చెల్లిస్తారు. చివరకు ఇట్టి విశ్వాసము కలవారే పరలోకమునకైన నిరీక్షణ కలిగి ఉంటారు.ఆ మొదటి పునరుత్ధానము పరిశుద్ధుల కొరకు ప్రత్యేకించబడిన ఒక సంఘటనైయున్నది.


ఈ కాలములోనే ప్రభువు భూమిపై తిరిగి వచ్చును. అది ఎంతో దూర భవిష్యత్తులో లేక ఎవరో ఒకరు అంత్యక్రీస్తుగా ప్రత్యక్షమై తన ముద్రతో అనేకమంది ప్రజలు నుదుటి మీదగాని లేక కుడి చేతిమీదగాని ముద్రించును. ఈ సమయం వచ్చినప్పుడు ప్రభుని రెండవ రాకడ అలాగే పరిశుద్ధులను హతసాక్ష్యము పునరుత్ధానము మరియు కొనిపోబడుట ఇవన్నియూ సమీపముగానున్న పని నీవు తప్పక గుర్తించుకొనవలెను అట్టి దినము ఘడియ వచ్చినప్పుడు ఆ దినము పరిశుద్ధులకు ఆనందించు దినము తిరిగి జన్మించనివారైన పాపులకు వారి పాపముకు తీర్పు దినము అని మనం తెలుసుకోవాలి.

తమ హతసాక్ష్యము తరువాత పరిశుద్ధులందరూ పునరుత్ధాన పరచబడి ప్రభువుతోపాటు గొర్రె పిల్ల వివాహ విందులో పాలు పొందుతారు. ఈ సమయంలో నీవు నేను హతసాక్షులమగునప్పుడు మన దేహము త్వరగానే పునరుత్ధానపరచబడి కొనిపోబడును. మనకు ముందుగా పోయిన పరిశుద్ధులు శరీరముకు జరిగిన విషయములేమైననూ వారి శరీరము ఇప్పటికే మంటిగా మార్చబడిన లేక వారి రూపము ఏదియూ వారిలో మిగిలియుండకపోయిననూ ఏమియూ కానేరాదు ఇట్టి సమయం వచ్చినప్పుడు పరిశుద్ధులకు

 ప్రస్తుతమునున్న బలహీన దేశముతో కాక ఖచ్చితమైన దేహముతో వారు పునరుత్ధానపరచబడెదరు. ఆ సమయంలో నీతిమంతులు పరిశుద్ధుల దేహముతో పునరుత్ధానపరచబడి ప్రభువుతో సదాకాలము జీవించెదరు.

మనకు కష్టసమయము వేచియున్నప్పటికి అంత్యక్రీస్తు బయల్పడి మనలను హింసించుచున్నప్పుడు మనమిప్పుడు విన్నట్లుగా దేవుని వాక్యమును విశ్వసించి యేసుక్రీస్తునందు మనకున్న విశ్వాసమును కాపాడుకోవాలి అంతేకాక నీవు నేను నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను విశ్వసించాము. కనుక మన మందరమూ పరిశుద్ధులు హతసాక్ష్యములోనే మొదటి పునరుత్ధానంలో కొనిపోబడుటలోనే పాల్గొంటాము.

ఈ సత్యమందు నీకున్న విశ్వాసం నుండి తొలగిపోకూడదు. అంత్యక్రీస్తుకు విరోధముగా పోరాడి జయించునట్టి జీవితమును కొనసాగించు ఈ దినము వచ్చు వరకు సత్యమును మనకంటే ముందుగా ఈ సత్యమును విశ్వసించుట ద్వారా రక్షింపబడిన వారితో కలిసి దేవుని వాక్యములో నిలిచి ప్రభుని విశ్వాసముతో కొనసాగాలి.ఇప్పటికి ప్రజలను మోసగించు అబద్ధికులు ఉన్నారు :


ఇప్పటికి సాతాను సేవకుల వలె నుండు లెక్కలేనంతమంది ప్రజలు తప్పుడు విశ్వాస బోధనలను బోధించుచున్నారు. ప్రత్యేకంగా చాలామంది అబద్ధికులు తమ సమూహాలకు శ్రమల ముందు ఎత్తబడుట అను బోధను సమర్ధిస్తూ బోధించుచున్నారు. ఆ ఏడేండ్ల మహాశ్రమలను గూర్చిమనం బాధపడవలసినదేమీ లేదని వారికి నచ్చజెప్పజూచుచున్నారు.

దానికి భిన్నంగా ఆ మొదటి మూడున్నర ఏండ్ల శ్రమల కాలము ముగిసిన కొద్ది సమయానికి పరిశుద్ధులు హతసాక్ష్యము ఎత్తబడుట ఉండునని బైబిలు మనకు సాక్ష్యమిచ్చుచూ స్పష్టపరచుచున్నది. అట్టి అబద్ధికులు వలన మనం మోసగింపబడతారు. దానికి బదులుగా మనము ఏడేండ్ల మహాశ్రమల కాలంలో మొదటి మూడున్నరేండ్ల కాలము జరిగినప్పుడు మనమందరమూ హతసాక్షులమై అక్కడ నుండి కొద్దికాలానికి పునరుత్ధానపరచబడి తదనుగుణంగా ఎత్తబడతామని తెలిసికొని విశ్వసించాలి.

కాబట్టి ఏడు సంవత్సరముల మహాశ్రమల కాలమును గూర్చి చింత అవసరం లేదని చెప్పి అబద్ధ ప్రవక్తలకు మనం దూరంగా ఉండాలి. నిజమైన పరిశుద్ధులు వారి హతసాక్ష్యము పునరుత్ధానము మరియు ఎత్తబడుట గొర్రె పిల్ల వివాహము విందు మొదటి మూడున్నర సంవత్సరముల శ్రమల కాలం కొద్ది గడిచిన తరువాత ఉండునని నమ్ముతారు.అయినచో మనమంతా ఇప్పుడు ఎట్లు జీవించాలి?


ఇప్పటికి ఎవరైనా ప్రభువుని తమ రక్షకునిగా విశ్వసించి అనగా ఈ భూమి మీదకు వచ్చి యోహాను నుండి పొందిన బాప్తిస్మము మన లోకపాపములను మోసి సిలువపై రక్తం కార్చి మృతుల నుండి తిరిగి లేచెనని విశ్వసించిన అతని/ఆమె హృదయంలో పరిశుద్ధాత్మను ఒక బహుమానంగా పొందెదరని మనం తప్పక గుర్తించాలి.

దేవుని సంఘము ద్వారా పరిశుద్ధాత్మ నీకు చెప్పువాటిని నీవు నీ చెవులతో విని హృదయంలో విశ్వసించాలి. మరియు నీ విశ్వాసంతో దేవునిలో జీవించాలి. పరిశుద్ధులంతా దేవుని సంఘము నడిపించు విశ్వాస జీవితమును జీవించాలి ఎవరు తనకు తానే నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను భద్రపరచు పరిచర్య చేయలేడు. ఇందుమూలమున తిరిగి జన్మించిన పరిశుద్ధులైనప్పటికి దేవుని సంఘము ఎంతో ప్రాముఖ్యము. కనుకనే దేవుడు ఈ భూమిపై తన సంఘమును తన పరిచారకులను ఏర్పాటు చేసెను. వారి ద్వారా ఆయన తన గొర్రె పిల్లను మేపుచున్నాడు. ప్రత్యేకంగా మనకు అంత్యకాలము సమీపించిన కొలది దేవుని క్రియలు మరింత ప్రశస్తమవుతాయి. అలాగే నీవు పరిశుద్ధాత్మతో నింపబడిన విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తావని ఆశిస్తూ ప్రార్థిస్తున్నాను. అంత్యకాలము దగ్గరకు వస్తున్న కొద్దీ నీతిమంతులు ఐకమత్యంగా ఉండుటకు ప్రార్థించుటకు ఆదరించుటకు ఒకరికొకరు సహాయపడి పట్టుకొనుటకు మరియు ప్రభువు కొరకు జీవించుటకు ఒకే మనస్సు ఒకే అవసరతలో ఉండుటకు మరింత కష్టతరమగును.

దేవుడు హతసాక్ష్యమును పునరుత్ధానమును ఎత్తబడుటను శాశ్వత జీవమును పరిశుద్ధులకై అనుమతించెను. అంత్యక్రీస్తుతో పోరాడి జయించు విశ్వాసంతో మనం జీవిద్ధాం మరియు దేవుని ఎదుట విశ్వాసముతో నిలుద్ధాం హల్లెలూయ!