Sermons

[అధ్యాయము 15-1] <ప్రకటన 15:1-8> ఆకాశ మండములో ప్రభువు యొక్క ఆశ్చర్య కార్యములను పరిశుద్ధులు స్తుతించుట<ప్రకటన 15:1-8>


“మరియు ఆశ్చర్యమైన మరియొక గొప్ప సూచన పరలోకమందు చూచితిని అదేమనగా ఏడు తెగుళ్ళు చేత పట్టుకొనియున్న యేడుగురు దూతలు ఇవే కడువరి తెగుళ్ళు వీటితో దేవుని కోపము సమాప్తమాయెను. మరియు అగ్నితో కలిసియున్న స్పటికపు సముద్రము వంటిది ఒకటి నేను చూచితిని ఆ క్రూరమృగమునకును దాని ప్రతిమకును దాని పేరుగల సంఖ్యకును లోబడక వాటిని జయించినవారు దేవుని వీణెలుగలవారై ఆ స్పటికపు సముద్రము నొద్ద నిలిచియుండుట చూచితిని వారు ప్రభువా, దేవా, సర్వాధికారి నీ క్రియలు ఘనమైనవి ఆశ్చర్యమైనవి యుగములకు రాజా నీ మార్తము న్యాయమును సత్యములునై యున్నవి ప్రభువా నీవు మాత్రము పవిత్రుడవు నీకు భయపడని వాడెవడు నీ నామమును మహిమపరచని వాడెవడు? నీ న్యాయవిధులు ప్రత్యక్షపరచబడినవి గనుక జనములందరు వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేసెదరని చెప్పుచు దేవుని దాసుడగు మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుచున్నారు. అటు తరువాత నేను చూడగా సాక్ష్యపు గుడార సంబంధమైన ఆలయము పరలోకమందు తెరవబడెను. ఏడు తెగుళ్ళు చేత పట్టుకొనియున్న ఆ యేడుగురు దూతలు నిర్మలమును ప్రకాశమానమునైన రాతిని ధరించుకొని రొమ్ము మీదల బంగారు దట్టీలు కట్టుకొనినవారై ఆ ఆలయములో నుండి వెలుపలికి వచ్చిరి.

అప్పుడు ఆ నాలుగు జీవులలో ఒక జీవి యుగయుగములు జీవించు దేవుని కోపముతో నిండియున్న యేడు బంగారు పాత్రలను ఆ యేడుగురు దూతలకిచ్చెను అంతట దేవుని మహిమనుండియు ఆయన శక్తి నుండియు వచ్చిన పొగతో ఆలయము నింపబడినందున ఆ యేడుగురు దూతల యొద్ద ఉన్న యేడు తెగుళ్లు సమాప్తియగు వరకు ఆలయమందు ఎవడును ప్రవేశింపజాలక పోయెను.’’వివరణ : 


వచనం 1 : మరియు ఆశ్చర్యమైన మరియొక గొప్ప సూచన పరలోకమందు చూచితిని అదేమనగా ఏడు తెగుళ్ళు చేత పట్టుకొనియున్న యేడుగురు దూతలు ఇవే కడువరి తెగుళ్ళు వీటితో దేవుని కోపము సమప్తమాయెను.

అధ్యాయం 15 మనకు చెప్పునది ఏడుగురు దూతలు కుమ్మరించు ఏడు తెగుళ్ళ వలన సమాప్తమవబోవు లోకమును గూర్చి అపోస్తులుడైన యోహాను చూచినట్లుగా సూచన ఆకాశమందు కనబడెను. అనగా నేమి? స్పటిక 

సముద్రమునొద్ద నిలబడిన పరిశుద్ధులు ప్రభుని క్రియలను స్తుతించుట అను ఆశ్చర్యమైన దృశ్యము. 

వచనం 2 : మరియు అగ్నితో కలిసియున్న స్పటికపు సముద్రము వంటిది ఒకటి నేను చూచితిని ఆ క్రూరమృగమునకును దాని ప్రతిమకును దాని పేరుగల సంఖ్యకును లోబడిన వాటిని జయించినవారు దేవుని వీణెలుగలవారై ఆ స్పటికపు సముద్రము నొద్ద నిలిచియుండుట చూచితిని.

“అగ్నితో కలిసియున్న స్పటిక సముద్రము వంటిది అను వాక్యము దేవుడు తన ఏడు పాత్రలను కుమ్మరించుట వలన బాధతో మూల్గుట ఈ భూమి మీద దాని ఉన్నతిని చేరుకొనును మరియు ఆ పరిశుద్ధులు మరొక ప్రక్క మేఘమండలమందు ప్రభువును స్తుతించుచుందురని తెలియ చేయుచున్నది దేవుని ఈ భూమిపై కుమ్మరింపబడే ఏడు పాత్రల తెగుళ్ళు పరిశుద్ధులు తమ శత్రువుపై ప్రతీకారము తీర్చుటకై తేబడినవి.

ఆ సమయంలో ఆ పరిశద్ధులు దేవుని వలన తమ పునరుత్ధానము మరియు ఎత్తబడుటలో పాల్గొన్నవారై అగ్నితో కలసియున్న స్పటికపు సముద్రము వంటి దాని యొద్ద నిలబడి ఆయన క్రియలను కొనియాడెదరు ఈ భూమిపై హతసాక్షులై పునరుత్ధానపరచబడి ఎత్తబడి పరిశుద్ధులు ప్రభుని శక్తి వలన ఎల్లప్పుడూ ఆయన రక్షణ కొరకు మరియు శక్తి ప్రతిమను కొరకు ఆయనను స్తుతిస్తారు. స్తుతించు పరిశుద్ధులెవరనగా అంత్యక్రీస్తును అతని తృణీకరించునటువంటి విశ్వాసముతో అతనిని అధిగమించునట్టి విజయము యొక్క విశ్వాసమును పొందినవారే.

వచనం 3 : వారు ప్రభువా దేవా సర్వాధికారి నీ క్రియలు ఘనమైనవి ఆశ్చర్యమైనవి యుగములకు రాజా నీ మార్గము న్యాయమును సత్యమునై యున్నవి నీ నామమును నీవు మాత్రము పవిత్రుడవు.

దేవుని దాసుడగు మోషే కీర్తనయు గొర్రె పిల్ల కీర్తనయు పాడుచూ నీ క్రియలు ఘనమైనవి. ఆశ్చర్యమైనవి ప్రభువా దేవా సర్వాధికారి నీ మార్గము న్యాయమును నిత్యములునైయున్నవి యుగములకు రాజా, పరిశుద్ధులు స్పటిక సముద్రము మీద నిలబడి మోషే కీర్తనయు గొర్రె పిల్ల కీర్తనయు పాడుచున్నారు. మరియు దాని పాటలు ఇలాగున్నవి ప్రభువా దేవా సర్వాధికారి నీ క్రియలు ఘనమైనవి ఆశ్చర్యమైనవి. అని వ్రాయబడిన విధంగా తన సర్వాధికారముతో చేయలేనివి ఏమియూ లేవని దేవుని స్తుతించుచున్నవి అదే కాక ఇంకా ఇట్లు వ్రాయబడెను ఆయన క్రియలు ఘనమైనవి ఆశ్చర్యమైనవి.

ఇక్కడ ఆశ్చర్యమైన అను మాట అర్థం మాటలలో వర్ణించలేనటువంటి ఏదో ఒక గొప్ప క్రియ అది కేవలము ఆశ్చర్యకరమైనవి మరియు అద్భుతమైనది మరో విధంగా మన ప్రభువైన దేవుడు మనలను నీరు మరియు ఆత్మమూలమైన సువార్త ద్వారా రక్షించెను. పాత నిబంధన, కొత్త నిబంధనలోని పరిశుద్ధులందరి వారి పాపములన్నిటి నుండి పవిత్రపరచుటకు మరియు తమ విశ్వాసము ద్వారా కాపాడబడిన పరిశుద్ధులను వారిని తమ శరీర మరణం నుండి పునరుత్ధాన పరచి వారిని మేఘములోనికి కొనిపోయి ప్రభుని స్తుతించునట్లు చేయును. ఈ పరిశుద్ధులందరూ ప్రభువైన దేవుడు వారి రక్షకుడు ప్రభువు మరియు సర్వాధికారియైనందున స్తుతించుచుండెదరు.

ఈ విశ్వములోని సమస్తమును నిన్ను నన్ను కూడా ప్రభువైన దేవుడు సృజించెనని ఆయనే వాస్తవంగా మన ప్రభువని నీవు నిజముగా విశ్వసించావా? ఈ సత్యమును విశ్వసించువారు మాత్రమే ప్రభునిచే అనుగ్రహింపబడిన నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను విశ్వసించగరు. ఈ విశ్వాసం గలవారే నిజమైన విశ్వాసులవుతారు. క్రైస్తవులు యేసు సృష్టికర్త అని విశ్వమంతటిని దానిలోని ప్రతిదానిని సృజించెనని తెలిసికొని విశ్వసించాలి మరియు వారు ప్రభువైన దేవుని ఆయన క్రియలను తెలిసికొని విశ్వసించి కీర్తించి ఆరాధించవలెను. ప్రభువా సర్వాధికారీ నీ క్రియలు ఘనమైనవి ఆశ్చర్యకరమైనవి ఈ విశ్వాసము యొక్క స్తుతి మోషే స్తుతి మోషే కీర్తనను గొర్రె పిల్ల కీర్తనను పాడుచున్న నిజమైన విశ్వాసము గల పరిశుద్ధుల విశ్వాసమును చూపించుచున్నది.

యేసే దేవుడైన సర్వాధికారి అని నీవు నమ్ముచున్నావా? యేసు తానే దేవుడై విశ్వమంతటిని సృజించెను. విశ్వసించువారు ప్రభువే శరీరమందు మానవునిగా భూమిపైకి వచ్చెనని 30 సంవత్సరముల వయస్సులో మానవ పాపాలన్నిటిని ఒకేసారి తనపై మోపుకొనుటకై యోహానుచే బాప్తిస్మము పొందెనని మరియు ఆయన రక్తము కార్చి సిలువపై మరణించెనని మరియు మృతి నుండి తిరిగి లేచెనని నమ్ముతారు వారి విశ్వాసం ద్వారా తమ పాపపరిహారమును పొంది పరిశుద్ధులవుతారు. ఈ సత్యమును ఎరిగిన వారు దానిలో నిజమైన విశ్వాసమున్నవారు వాస్తవంగా గొప్ప విశ్వాసం గల ప్రజలనుగా వర్ణించబడతారు.

వాక్యములో పునరుత్ధానమైన పరిశుద్ధులు మేఘాలలో దేవుని ఈలాగు స్తుతిస్తారు. నీ క్రియలు ఘనమైనవి ఆశ్చర్యమైనవని వారు ప్రభువైన దేవుని పొగడుచుందురు మరొక రకంగా ఈ విశ్వమును మానవాళిని సృజించినందుకు ఈ భూమిపై నున్న పాపులు పాపమును యోహానుచే పొందిన బాప్తిస్మము ద్వారా తుడిచి వేసినందునకు తాము దేవుని పిల్లలగుటకు హక్కునిచ్చినందుకు దేవుని స్తుతిస్తారు. ఇవన్ని ప్రభువు ఇచ్చిన నీరు మరియు ఆత్మమూలమైన సువార్తనుండే కలిగినవి. ఆ పరిశుద్ధులు క్రీస్తు కొరకు తమ హతసాక్ష్యములో పాలు పొందెదరు వారి పునరుత్ధానము ఎత్తబడుట మరియు నిత్యజీవము ఇవన్నియూ దేవునిచే కుమ్మరించబడిన దేవుని దీవెనలు.

పరిశుద్ధులందరూ తమ స్తుతులను దేవునికి చెల్లించాలి అవి పాపులైన వారి కొరకు ప్రభువు జరిగించిన నీతిక్రియలకైన మహిమను చూపించును అనగా పాపములన్నిటిని తుడిచి వేసినందుకు అలాగే ఈ భూమిపై నున్నప్పుడు ఆయన జరిగించిన ఇతర కార్యముల కొరకు మేఘాలలో పరిశుద్ధులు మోషే కీర్తనను గొర్రె పిల్ల కీర్తనను పాడెదరు. వారు ప్రభువైన దేవుడు పాపులకు తన శత్రువులకు జరిగించిన క్రియలు ఎంత ఘనమైనవో ఎంత అద్భుతమైనవోనని పాడుచు స్తుతిస్తారు.

వాస్తవంగా పరిశుద్ధుల కొరకు ఆయనకు విరోధముగా నిలుచు వారికి మాత్రము ప్రభువు జరిగించిన క్రియలు ఆశ్చర్యమైనవి కావు కానీ అవి అద్భుతమైనవి ఈ లోకమును సృజించుటలో గల దేవుని ఉద్దేశ్యము మానవాళిని తన ప్రజలనుగా చేసికొనుట అలాగే మానవాళి కొరకై ఆయన జరిగించిన ఆయన కార్యములన్నీ మన ముందు ఆశ్చర్యమైనవి గానూ అద్భుతమైనవిగాను కనబడును ఆయన మన కొరకు జరిగించిన వాటన్నిటి కొరకు దేవుని విశ్వసించుట ద్వారా ఆయనను మహిమపరచెదము మరియు ఆయన క్రియలన్నిటిని నమ్ముట ద్వారా ఆయనను స్తుతించెదము.

దేవుడు తన పోలిక చొప్పున మానవాళి సృజించుట కూడా అద్భుతము. ఆయన తన ఆజ్ఞలను ప్రతివానికిచ్చెను. యేసుక్రీస్తును ఈ భూమిపైకి పంపుటకు కన్య మరియ ద్వారా క్రియ జరిగించుట కూడా మన కన్నుల ఎదుట ఆశ్చర్యమే. కానీ మనం నమ్ముతాం. అదే సమయంలో ఈ క్రియలన్నియూ పాపులను వారి పాపము నుండి విడిపించుటకు జరిగెనని నమ్ముతాం మరియు ప్రభువైన దేవుడు మన పాపములన్నిటిని యేసుక్రీస్తుపై మోపుట ఇవన్నియూ ఒకేసారి యోహానుచే బాప్తిస్మం పొందుటతోనే పొందుట. దాని వలన ప్రతివారి పాపము పూర్తిగా స్పష్టముగా కడుగబడుట మనకు ఆశ్చర్యము.

నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను విశ్వసించుట ద్వారా ప్రభువైన దేవుడు అనుగ్రహించిన శాశ్వత క్షమాపణ తన పాపముకై పొందినవారికి ఆయన తన పరిశుద్ధాత్మను అనుగ్రహించుట కూడా ఆశ్చర్యము అద్భుతము. ఆయన తను రక్షించి పరిశుద్ధపరచిన వారు ప్రపంచమంతటా నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను ప్రకటించుట మరొక అద్భుతమైన దీవెన. అది మనకు ఆశ్చర్యమైనది. ప్రభువైన దేవుడు పరిశుద్ధులను హతసాక్షులగునట్లు చేయుట అను సత్యము వారిని పునరుత్ధానపరచుటకు కొనపోబడుటకు మరియు వారిని మహిమలో యుగములవరకు పరలోకరాజ్యములో నివసించుటకై అనుగ్రహించిన అనుమతి ఈ క్రియలన్నియూ అద్భుతమైన దీవెనలే.

ఈ విషయములన్నిటిని ప్రణాళిక పరచినవాడు సమయము వచ్చినప్పుడు అనుకూలముగా దేవుడే వాటిని నెరవేర్చును పరిశుద్ధులు తనను మహిమపరచి స్తుతించునట్లు చేయు ప్రభుని క్రియలు మన హృదయములలో గొప్ప దీవెనగా పరిణమించెను. ఆయనే తన సర్వాధికారముతో తన శత్రువుపై ఏడు పాత్రల తెగుళ్ళ ద్వారా ప్రతికారము తీర్చునను సత్యముతో మనలను దీవించినందుకును ప్రభువుకు కృతజ్ఞతలు.

ప్రభువైన దేవుని క్రియలన్నియూ పరిశుద్ధుల కన్నుల ఎదుట వాటి పరిమితుల కంటే ఎంతో దూరముగా నున్నట్లుగా ఆయనను స్తుతిస్తారు. కాబట్టి వారు ప్రభుని సర్వశక్తిని బట్టి ఆయనను స్తుతించెను. ప్రతి మనిషి నుండి కాక ఈ విశ్వంలోని ప్రతి ప్రాణి చెల్లించు స్తుతులను అందుకొనుటకు మన ప్రభువైన దేవుడే అర్హుడు హల్లెలూయ!

ప్రభువైన దేవుడు తమ కొరకు చేసిన వాటిని తెలిసికొని అనుభవించి తమ స్వంత కన్నులతో చూచిన వారు మరేమియూ చెల్లించలేనివారై ఆయన సర్వాధికారమును బట్టి ఆయన జరిగించిన క్రియలకై ఈ విశ్వంలోని ప్రతీది చెల్లించు స్తుతులకు ఆయన పాత్రుడు ఎందుకనగా ఈ క్రియలన్నియూ ఆయన సర్వాధికారము వలననే సాధ్యమైనవి హల్లెలూయ! ఆయన శక్తిని బట్టి ఆయన శాశ్వతమైన మార్పులేని దీవెనకరమైన ప్రేమను బట్టి నేను ప్రభువును స్తుతించుచున్నాను.

వచనం 4 : నీకు భయపడని వాడెవడు నీ నామమును మహిమ పరచనివాడెవడు నీ న్యాయవిధులు ప్రత్యక్షపరచబడినవి గనుక జనములు మహిమపరచనివాడెవడు నీ న్యాయవిధులు ప్రత్యక్షపరచబడినవి గనుక జనములందురు వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేసెదరు.

మేఘములో పరిశుద్ధులు ప్రభుని క్రియలను తమనోటితో ఘనపరచెదరు. నీకు భయపడని వాడెవడు దేవా నీ నామమును మహిమపరచని వాడెవడు ఈ స్తుతి నిశ్చయత మరియు విశ్వాసముతో నిండినదై ప్రభువు దేవుని మహిమ ఎదుట ఎవరునూ నిలువలేరని నమ్మకమును బాహాటముగా చాటించుచున్నది. ప్రభుని నామమంతటితో నిత్యరాజ్యములన్నిటిలో ఏదియు ఎవరును వ్యతిరేకముగా నిలిచి మన ప్రభువైన దేవుని జయించగలవారు లేరు ఎందుకనగా యేసే రాజులకు రాజును సర్వాధికారియైన దేవుడైయున్నాడు.

ఈ లోకంలోని ప్రతి వస్తువు పరిశుద్ధులు యేసుక్రీస్తు నామము ఎదుట ప్రభువైన దేవుని సర్వాధికారము ఎదుట మరియు ఆయన సత్యము ఏమియూ చేయలేక భయముతో వణుకుతారు. ఎందుకనగా ప్రభువైన దేవుని శక్తి అనంతమైన గొప్పది. ఆయనే సత్యము మరియు సంపూర్ణుడు కనుక ప్రాణులన్నియూ ఆయన నామమునకు కృతజ్ఞతలను మహిమను స్తుతిని చెల్లించును. ఎందుకు? ఆయన పరిశుద్ధుడు మరియు ఆయన మానవాళినంతటిని వారి అవినీతి నుండి విడిపించినందుకు.

ఏడు పాత్రల తెగుళ్ళును ప్రభువు అంత్యక్రీస్తుపై అతని అనుచరులపై మరియు ఈ భూమిపై నివసించుచున్న మతాధికారులపై కుమ్మరించును కనుక వారు ఆయన నీతిని తెలిసికొందురు మనమేమియూ చేయలేము కనుక ఆయనను స్తుతించెదము. ప్రభుని నీతితో కూడిన న్యాయము ఏడు పాత్రల తెగుళ్లు ద్వారా కనుపరచబడును. గనుక మన ప్రభువైన దేవుడు మేఘములో మహిమను, స్తుతిని ఆరాధనను సజీవమైన ప్రతి ప్రాణి నుండి దూత నుండి పరిశుద్ధుల నుండి పొందుటకు అర్హుడు.

యేసుక్రీస్తు నామమునకు భయపడకుండుటకు సాహసించగలవాడెవడు? మన ప్రభువు ఒక ప్రాణి కాదు. కానీ ప్రభువును సర్వాధికారియునైన దేవుడు. ఆయన తనకు వ్యతిరేకముగా నిలుచువారందరిపై ఏడుపాత్రల యొక్క భయంకరమైన తెగుళ్ళును కుమ్మరించుట ద్వారా సులువుగా ప్రభువైన దేవుడు తన సృష్టి అంతయూ ఆయన న్యాయమును, శక్తిని ఆయన ఎదుట స్తుతించుటకు తప్పించుకొనకుండా చేయును.

“నీ న్యాయవిధులు ప్రత్యక్షపరచబడినవి కనుక జనులందరు వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేసెదరు” కనుక ప్రభుని నామమునకు వ్యతిరేకముగా నిలచి, దూషించువారు సంతోషంగా నివసించరని మనం తెలిసికోవాలి.

కేవలము ప్రభుని ఎదుట మోకరించి విశ్వసించి ఆయన అధికారమును బట్టి ఆయన సర్వశక్తిని బట్టి ఆయన దయను బట్టి ఆయన గొప్ప రక్షణనుబట్టి ప్రేమను బట్టి అర్హమైన ఆయన నామమునకు కృతజ్ఞతలను, స్తుతులను చెల్లించవలెను. కనుక సృష్టి ప్రభువు ఈ భూమిపై నున్నప్పుడు జరిగించిన వాటిని విశ్వసించి, ఆయనను స్తుతించి ఆరాధించాలి. మన ప్రభువు జనములన్నిటి నుండి దేశములన్నిటి నుండి స్తుతులందుకొనుటకు అర్హుడు. ఆమెన్‌ హల్లెలూయ!

వచనం 5 : అటు తరువాత నేను చూడగా సాక్ష్యపు గుడార సంబంధమైన ఆలయము పరలోకమందు తెరవబడెను.

ఏడు పాత్రల తెగుళ్ళను మన ప్రభువైన దేవుడు కుమ్మరించి ఈ భూమిని లయపరచునప్పుడు దేవుడు పరిశుద్ధులకు తన పరలోకములో నివాసమునిచ్చునని ఈ వచనం తెలియచేయుచున్నది. ఈ విషయాలన్నీ ప్రభువైన దేవునిచే నెరవేర్చబడును. అయిన ఈ సాక్ష్యపు గుడారము ఏమిటి? అది ఈ భూమిపైనున్న గుడారము వంటి దేవుడు ఇల్లు సాక్ష్యపు గుడార సంబంధమైన ఆలయము పరలోకమందు తెరువబడెను. అను ఈ వాక్య అర్థము. అప్పటి నుండి దేవుని రాజ్యపు యుగము ఆరంభమగును.

సాక్ష్యపుగుడార సంబంధమైన ఆలయము తెరువబడుటతోనే ప్రభువైన దేవుని రాజ్యము యొక్క ఆఖరి తెగులు ఈ భూమిపై కుమ్మరింపబడును. నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను తెలిసికొనకుండా దేవుని యెదుట ఏ విశ్వాసము అంగీకరింపబడదు. అలాగున మనము ఈ సత్యసువార్తను తప్పక నమ్మాలి మరియు తెలుసుకోవాలి. ఇదే మనము వెళ్ళి క్రీస్తు రాజ్యంలో నివసించుటకు అనువైన సమయమని గుర్తెరిగి విశ్వసించాలి.

వచనం 6 : ఏడు తెగుళ్లు చేత పట్టుకొనియున్న ఆ యేడుగురు దూతలు నిర్మలమును ప్రకాశమానమునైన రాతిని ధరించుకొని రొమ్ము మీద బంగారు దట్టీలు కట్టుకొనినవారై ఆ ఆలయములో నుండి వెలుపలికి వచ్చిరి.

దేవుడు ఏడు పాత్రల తెగుళ్ళను ఈ భూమిపై కుమ్మరించునప్పుడు ఈ ఏడు తెగుళ్ళ యొక్క అత్యవసరమైన న్యాయము తిన్ననైన విశ్వాసమును విశ్వసించిన వారైన తన దూతల ద్వారా ఆయన క్రియలు జరిగించునని ఈ వచనం చెప్పుచున్నది. మరోరకంగా దేవుని పరిచారకులు ఆయన నీతిమత్వమును ఎల్లప్పుడూ విశ్వసించి వారి పూర్తి నమ్మకమును ఆయన మంచితనముపై నిలిపినపుడు ఆయన పరిచారకులవలే ఆయన పరిచర్య చేయగలరని మనకు తెలియచేయుచున్నది.

ప్రభుని క్రియలు ఎల్లప్పుడూ సరియైనవేనని వారు నమ్మినప్పుడే దేవుని పరిచారకులు అట్టి క్రియలను జరిగించగలరు. కనుక పరిశుద్ధులైనవారు ఎల్లప్పుడూ దేవుని నీతిని వస్త్రముగా ధరించి, దేవుని రక్షణయను శిరస్త్రాణమును ధరించి తమ విశ్వాసమును కాపాడుకొని ప్రభుని మహిమపరచు జీవితమును జీవించినప్పుడే ప్రశస్తమై దేవుని పరిచారకులుగా వాడబడతారు.

వచనం 7 : అప్పుడా నాలుగు జీవులలో ఒక జీవి యుగయుగములు జీవించు దేవుని కోపముతో నిండియున్న యేడు బంగారు పాత్రలను ఆ యేడుగురు దూతలకిచ్చెను అంతట దేవుని మహిమనుండియు ఆయన శక్తినుండియు వచ్చిన దూతలకిచ్చెను.

దేవుడు తన పరిచారకుల ద్వారా క్రియ చేయునప్పుడు ఆయన వారు క్రమముగా పనిచేయునట్లు చేయును మరియు అట్టి క్రియలు మంచి క్రమముతో కూడినవని ఈ వాక్యం మనకు చెప్పుచున్నది. ‘‘నాలుగు జీవులలో ఒక జీవి” అను వాక్యం ప్రభువు తన పనికొరకు తన విలువైన పరిచారకులను నియమించెనని ఆయన ద్వారా క్రియలు చేయునని చెప్పుచున్నది. ఇక్కడ కనిపించుచున్న నాలుగు జీవులు ఆయన యెద్ద ఎల్లప్పుడూ నిలుచు అత్యంత విలువైన నలుగురు ప్రభుని పరిచారకులై ఉన్నారు. వారే మొదటిగా ఆయన చిత్తమును నెరవేర్చును. మరియు దేవుని అధికారమును ఆయన సర్వశక్తిని మనము గ్రహించాలి. మరియు ఆయన తన పరిచారకుల ద్వారా క్రియ చేయునని నమ్మాలి.

వచనం 8 : అంతట దేవుని మహిమ నుండియు ఆయన శక్తినుండియు వచ్చిన పొగతో ఆలయము నింపబడినందున ఆ యేడుగురు దూతల యొద్ద ఉన్న యేడు తెగుళ్లు సమాప్తియగు వరకు ఆలయమందు ఎవడును ప్రవేశింపజాలక పోయెను.

ప్రభువైన దేవుడు ఈ భూమిపై తన తీర్పును ముగించుటకు ముందు ఆయన రాజ్యములో ఎవరూ ప్రవేశింపలేరు. ఇదే దేవుని పరిశుద్ధత ఎంత సంపూర్ణమైనదో చెప్పుచున్నది. ఆయన దుష్టత్వము నందు ఆనందించు దేవుడు కాడని (కీర్తన 5:4) కూడా మనకు బోధించుచున్నది. కనుక ఎవరైననూ దేవుని రాజ్యంలో ప్రవేశింపగోరిన యెడల అతడు/ఆమె మానవాళికి ప్రభువనుగ్రహించిన నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను తప్పక విశ్వసించాలని మనము జ్ఞాపకం చేసుకోవాలి. మన ప్రభువైన దేవుడు నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను విశ్వసించువారిని మాత్రమే తన రాజ్యములో ప్రవేశించుటకు అనుమతించును.

ఏడు పాత్రల తెగుళ్ళు కుమ్మరించుట ద్వారా తన శత్రువును ఆయన లయపరచిన తరువాత దేవుడు పాపపరిహారము పొందిన పరిశుద్ధులను ఆయన రాజ్యములో నిత్యము నివసించు దీవెనలను ఇచ్చెను. ఆయన ఘనతను, అధికారమును కనుగొనుట మరియు దేవుని క్రియలు మానవ ఊహకు అందనివి. తన శత్రువుకు తీర్పు తీర్చుట ద్వారా దేవుడు తన సర్వశక్తిని ప్రత్యక్షపరచును. దేవుడు తనకు విరోధముగా నిలుచుట అను పాపము చేసినవారైన తన శత్రువును శిక్షించుటకు అధికారములేని వాడైన యెడల ఆయన ప్రతివారి స్తుతిని పొందలేడు.

కానీ దేవుడు తనకు విరోధముగా నిలుచువారిని శిక్షించుటకు కావలసిన శక్తి కంటే అధికశక్తి కలవాడు. కనుక ప్రభువు తన శత్రువుపైకి తన తీర్పును రానిచ్చును. మరియు వారిని నిత్యనరకాగ్ని అను శిక్షతో వారిని గద్దించును. మన ప్రభువు ప్రతి రాజ్యములోని ప్రతి ప్రజల నుండి స్తుతి పొందుటకు ఎంతో అర్హుడు. కనుక దేవుడు శత్రువుకు వారి పాపమును బట్టి తీర్పును ముగించి తన రాజ్యమును ఆరంభించును. ఆమెన్‌ మన ప్రభువైన దేవుని ఆయన గొప్ప అధికారమును బట్టి ఆయన మహిమను బట్టి మరియు పరిశుద్ధతను బట్టి మనము కృతజ్ఞతలర్పించెదము. హల్లెలూయ.