Sermons

[అధ్యాయము 15-2] <ప్రకటన 15:1-8> నిశ్చత్య అంత్యకాల గమ్యమును వేరుపరచు స్థానము<ప్రకటన 15:1-8>


15వ అధ్యాయము దేవునికి విరోధముగా నిలిచి దేవుని శత్రువులైన వారిపై పరిశుద్ధులు ఎత్తబడిన వెంటనే దేవుడు కుమ్మరింపబడబోవు ఏడు పాత్రల తెగుళ్ళు వర్ణించబడినవి. ‘‘ఏడు” అంకె ప్రకటనలో తరచుగా కనబడు సంఖ్య ఏలయనగా ఏడు ముద్రలు ఏడు బూరలు మరియు ఏడు పాత్రలు దేవుని సంపూర్ణతను ఆయన సర్వాధికార బలమును ప్రాముఖ్యపరచును. యేసుక్రీస్తు సర్వజ్ఞాని మరియు సర్వశక్తిగల దేవుడైయున్నాడు. యేసు సర్వశక్తిగలవాడు అనగా ఆయనకు అసాధ్యమైనది ఏదీయులేదు. మన ప్రభువు తానే దేవుడై ప్రతిదానిని వ్యవస్థీకరించెను మరియు వాటిని నెరవేర్చుగల సమర్థుడు ఆయనే.

అలాగే ఆ పరిశుద్ధులు ఈ భూమిపై ఆయన కుమ్మరింపబోవు ఏడు పాత్రల తెగుళ్ళ ద్వారా ఆయన ప్రత్యక్షపరచు ఆయన సర్వజ్ఞానమును సర్వశక్తిని తప్పక స్తుతించాలి. అట్టి తీర్పును సాధ్యపరచిన ఆయన సర్వజ్ఞానమును, సర్వశక్తిని బట్టి మనము ప్రభువుకు కృతజ్ఞులము. ఆ ప్రభువే తన శత్రువుపై ప్రతీకారము తీర్చునది. పరిశుద్ధులకు అది కేవలము కృతజ్ఞతా పూర్వము మరియు అత్యంత ఖచ్చితము కనుక పరిశుద్ధులు ఆయనను స్తుతించుట తప్ప మరేదియూ లేదు హల్లెలూయ!

ఏడు బూరల మహా తెగుళ్ళు కాలమైన ఏడున్నర సంవత్సరముల కాలములోనికి మొదటి మూడున్నర సంవత్సరముల కాలము జరిగిన కొద్ది దినములకు పరిశుద్ధులు కొనిపోబడిన తరువాత ఏడు పాత్రల తెగుళ్ళు ఆరంభమగును. ఏడు బూరల తెగుళ్ళ వలన దేవుని శత్రువు గుండె బ్రద్ధలగును. మరియు వారు మన ప్రభువే దేవుడని కనుగొనెదరు కనుక వారు ఆయనకు భయపడెదరు. వచనం 1లో చెప్పబడిన ఆశ్చర్యకరమైన గొప్ప సూచన అనునది ఈ లోకంపై కుమ్మరింపబడు ఆఖరితెగులును సూచించును అనగా ఏడు పాత్రల తెగుళ్ళు ‘‘గొప్పదైన ఆశ్చర్యకరమైన” అను వాక్యం మరొకవిధంగా మనకు చెప్పునది మూడంతలైయున్నది. మొదటిది ప్రవచన వాక్యం ద్వారా పరిశుద్ధులకు ఈ లోకంనకు రాబోవు ఏడు తెగుళ్ళు తెలిసినవే. రెండవది పరిశుద్ధులు ఏడు పాత్రల తెగుళ్ళ నుండి మినహాయింపబడతారు. మూడవది ప్రభునిచే రప్పింపబడబోవు ఏడు తెగుళ్ళ శక్తి ప్రపంచమంతటా ఉంది. నాశనకరమైనదై యుండును.

మరొక ప్రశ్న విడిపింపబడి మేఘముకు ఎత్తబడిన పరిశుద్ధులందరూ దేవుని దాసుడైన మోషే కీర్తనయు, గొర్రె పిల్ల కీర్తనయు పాడుచుందురు. ఈ కీర్తనకు వెనుక గల గాధ నిర్గమ కాండంలో (15:1-8) ఇశ్రాయేలీయులు పాడినట్లుగా ఉండును. వారు ప్రభుని మోషే నాయకత్వంలో ఎర్రసముద్రమును దాటించిన ఆయన శక్తిని, అధికారమును బట్టి కీర్తించిరి. వారు నిరాశకరమైన పరిస్థితులలో వెనుక ఈజిప్టు సైన్యముచే తరమబడుచున్నప్పుడు స్తుతించుట తప్ప మరేమీ చేయలేరు.

అలాగే నూతన నిబంధన పరిశుద్ధులు కూడా ప్రభుని నిత్య రక్షణను బట్టి అది యేసు యోహాను నుండి పొందిన బాప్తిస్మము వలనను సిలువలో ఆయన కార్చిన రక్తమందు నెరవేర్చబడినది. కనుక ఆయనను స్తుతించుట తప్ప మరేదియూ చేయలేరు. ఆఖరి దినము వచ్చినప్పుడు దేవుని ప్రజలు మరొకసారి ప్రభుని తమ హతసాక్ష్యము పునరుత్థానం ఎత్తబడుట మరియు నిత్యజీవము ఇవన్నియూ ప్రభుని తమ హతసాక్ష్యము శత్రువు నుండి విడిపించిన యేసుక్రీస్తును బట్టి మరొకసారి ప్రభుని స్తుతిస్తారు.

దానితోపాటుగా, ఈ పాట యొక్క ప్రాముఖ్యత ఏమనగా అది దేవుని సర్వశక్తిని అధికారమును మరియు నీతిని కీర్తించుచున్నది. హతసాక్షులు ప్రభుని శక్తిని తమ పాపము నుండి విడిపించిన రక్షణ కృపను నిత్యజీవము దీవెనలను గూర్చి కీర్తించుట తప్ప మరేదియూ చేయలేరు.

5వ వచనంలో చెప్పబడిన సాక్ష్యపు గుడారమైన ఆలయము అనగా ఇశ్రాయేలీయూలు ఈజిప్టులో విడువబడినప్పుడు ప్రభుని సహవాసము అను దీవెన వారికిచ్చుటకై దేవుడు అనుమతించిన గుడారము.

6వ వచనంలో చెప్పబడిన ‘‘నార” అనగా దేవుని నీతి దూతలు దేవుని నీతిని ధరించి, ఏ శత్రువు ఎప్పుడును తృణీకరించలేనట్లు తీర్పును తీర్చుటకు ఆయన అధికారమును అనుగ్రహింపబడతారు.

వచనం 8 చెప్పినట్లు ‘‘అంతట దేవుని మహిమనుండియు ఆయన శక్తి నుండియు వచ్చిన పొగతో ఆలయము నింపబడినందున ఆ యేడుగురు దూతల యొద్ద ఉన్న యేడు తెగుళ్లు సమాప్తియగు వరకు ఆలయమందు ఎవడును ప్రవేశింపజాలక పోయెను.’’ ఇక్కడ మనం మూడు అర్థములను చెప్పవచ్చు. మొదటగా అది దేవుని కోపము ఆయన శత్రువుపై ఎంత పూర్ణమైనదో తెలియును.

రెండవది: యేసుక్రీస్తు బాప్తిస్మమందు ఆయన రక్తమును పాపులకొరకైన దేవుని రక్షణను విశ్వసించకుండా ఎవరూ ఆయన ఆలయంలో ప్రవేశించలేరననది ఎంత పరిపూర్ణమైనదో చెప్పుచున్నది.

మూడవది : దేవుని న్యాయ తీర్పును ఏ మానవ నీతి తప్పించలేదని మరియు యేసుక్రీస్తు బాప్తిస్మము, సిలువ నీతి తప్పించలేదని మరియు యేసుక్రీస్తు బాప్తిస్మము. సిలువలోని ఆయన రక్తమును విశ్వసించుట ద్వారానే తప్ప ఎవరునూ పాపులపై కుమ్మరింపబడబోవు ఆయన కోపము తప్పించు కొనలేరని తెలియచేయును.

కనుక పరిశుద్ధులు సువార్తయందు స్థిరముగా నుండి దానిని ఆఖరి నిమిషము వరకూ బోధించాలి. ఇంకనూ తమ పాప పరిహారము పొందనివారు తాము తప్పక దేవుని న్యాయ మరియు ఆత్మమూలమైన సువార్త వైపు తిరగాలి ఈ పేరా మనకు తెలియజేయునది. ప్రతివారు చూచునట్లు ఆయన శత్రువుపై ఏడు పాత్రల తెగుళ్ళు అను సంపూర్ణ దేవుని తీర్పు రానైయుండగా ఈ పాపమునకైన తీర్పు పూర్తగు వరకూ ఎవరూ దానిని ఆపలేరు.

15వ అధ్యాయం అంత్యక్రీస్తు సాతాను, దయ్యాలు క్రీస్తు ప్రేమచే మనకివ్వబడిన నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను నమ్మకుండా వ్యతిరేకంగా నిలుచువారందరు మన ప్రభుని శత్రువుని చూపించుచున్నది. ఆయన ఇట్టి దేవుని శత్రువుకు తీర్పు తీర్చుటకు రాబోవుచున్న తెగుళ్ళను బట్టి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవుని దాసుడగు మోషే కీర్తనయు, గొర్రె పిల్ల కీర్తనను పాడుచు ప్రభుని స్తుతించుట పరిశుద్ధులకు తగినది.

ప్రభుని నీతి, బలము, అధికారము మరియు సత్యమునకు మనము చెల్లించు స్తుతిని ఎవరూ ఆపలేరు. ఇట్టి దీవెన మనకిచ్చిన ప్రభుని నేను స్తుతిస్తున్నాను. హల్లెలూయా.