Sermons

[అధ్యాయము 16-1] <ప్రకటన 16:1-21> ఏడు బూరలు, ఆ ఏడు తెగుళ్ళ యొక్క ఆరంభము<ప్రకటన 16:1-21>

“మరియు మీరు పోయి దేవుని కోపముతో నిండిన ఆ యేసు పాత్రలను భూమి మీద కుమ్మరించుడని ఆలయములో నుండి గొప్ప స్వరము ఆ యేడుగురు దేవదూతలతో చెప్పగా వింటిని. అంతట మొదటి దూత వెలుపలికి వచ్చి తన పాత్రలను భూమిమీద కుమ్మరింపగా ఆ క్రూరమృగము యొక్క ముద్రగలవారికిని దాని ప్రతిమకు నమస్కారము చేయువారికిని బాధకరమైన చెడ్డపుండు పుట్టెను. రెండవ దూత తన పాత్రను సముద్రములో కుమ్మరింపగా సముద్రము పీనుగ రక్తము వంటిదాయెను. అందువలన సముద్రములో ఉన్న జీవ జంతులవున్నియు చచ్చెను. మూడవ దూత తన పాత్రను నదులలోను జలధారలలోను కుమ్మరింపగా అవి రక్తమాయెను. అప్పుడు వర్తమాన భూతకాలములో ఉండు పవిత్రుడా, పరిశుద్ధుల రక్తమును ప్రవక్తల రక్తమును వారు కార్చినందుకు తీర్పు తీర్చి వారికి రక్తము త్రాగనిచ్చితిని. దీనికి వారు పాత్రులే. నీవు ఈలాగు తీర్పు తీర్చితివి గనుక నీవు న్యాయవంతుడవని జలముల దేవదూత చెప్పగా వింటిని. అందుకు అవును ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ తీర్పులు, సత్యములును న్యాయములునైయున్నవని బలిపీఠము చెప్పుట వింటిని. నాలుగవ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరింపగా మనుష్యులు అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారము ఇయ్యబడెను. కాగా మనుష్యులను తీవ్రమైన వేడిమితో కాలిపోయి, యీ తెగుళ్ళమీద అధికారముగల దేవుని నామమును దూషించిరిగాని, ఆయనను మహిమ పరచునట్లు వారు మారు మనస్సు పొందినవారు కారు. అయిదవ దూత తన పాత్రను ఆ క్రూరమృగము యొక్క సింహాసనము మీద కుమ్మరింపగా, దాని రాజ్యము చీకటి కమ్మెను. మనుష్యులు తమకు కలిగిన వేదనను బట్టి తమ నాలుకలు కరచుకొనుచుండిరి. తమకు కలిగిన వేదనను బట్టియు పుండ్లను బట్టియు పరలోకమందున్న దేవుని దూషించిరి గాని తమ క్రియలను మాని వారు మారుమనస్సుపొందినవారు కారు. ఆరవ దూత తన పాత్రను యూఫ్రటీసు అను మహానదిమీద కుమ్మరింపగా తూర్పునుండి వచ్చు రాజులకు మార్గము సిద్ధపరచునట్లు దాని నీళ్ళు యెండిపోయెను. మరియు ఆ ఘటసర్పము నోటనుండియు క్రూరమృగము నోట నుండియు అబద్ధప్రవక్తల నోటనుండియు కప్పలవంటి మూడు అపవిత్రాత్మలు బయలువెడలగా చూచితిని. అవి సూచనలు చేయునట్టి దయ్యముల ఆత్మలే అని సర్వాధికారియైన దేవుని మహా దినమున జరుగు యుద్ధమునకు లోకమంతట ఉన్న రాజులను పోగుచేయవలెనని వారి యొద్దకు బయలువెళ్ళి హెబ్రీభాషలో హార్‌ మెగిద్దోనను, చోటుకు వారిని పోగుచేసెను. ఇదిగో నేను దొంగవలె వచ్చుచున్నాను. తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తమ దిసమొలను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడుకొనువాడు ధన్యుడు. ఏడవ దూత తన పాత్రను వాయుమండలము మీద కుమ్మరింపబడగా సమాప్తమైనదని చెప్పుచున్నయొక గొప్ప స్వరము గర్భాలయములో ఉన్న సింహాసనము నుండి వచ్చెను. అప్పుడు మెరుపులును ధ్వనులును ఉరుములును పుట్టెను. పెద్ద భూకంపమును కలిగెను. మనుష్యులు భూమిమీద పుట్టినది మొదలుకొని అట్టి మహాభూకంపము కలుగలేదు అది ఎంత గొప్పది. ప్రసిద్ధమైన మహా పట్టణము మూడు భాగములాయెను. అన్యజనులు పట్టణములు కూలిపోయెను తన తీక్షణమైన ఉగ్రతయను మద్యము గల పాత్ర మహా బబులోనునకు ఇయ్యవలెనని దానిని దేవుని సముఖమునందు జ్ఞపకముచేసిరి. ప్రతి ద్వీపము పారిపోయెను. పర్వతము కనబడక పోయెను. అయిదేసి మణుగుల బరువుగల పెద్దవడగండ్లు ఆకాశము నుండి మనుష్యల మీద పడెను. ఆ వడగండ్ల దెబ్బ మిక్కిలి గొప్పదైనందున మనుష్యులు ఆ దెబ్బలను బట్టి దేవుని దూషించిరి.’’వివరణ :


వచనం 1 : మరియు మీరు పోయిన దేవుని కోపముతో నిండిన ఆ యేడు పాత్రలను భూమిమీద కుమ్మరించుడని ఆలయములో నుండి గొప్ప స్వరము ఆ యేడుగురు దూతలతో చెప్పగా వింటిని.

ఏడు పాత్రల తెగుళ్ళతో కూడిన కోపాగ్నితో దేవుడు తన కోపాన్ని అంత్యక్రీస్తు దాసులపైకి, మరియు అతని ప్రజలై ఇంకను భూమిపై కోపమును తుఫానులో ఊడ్చబడెదరు. ఆ కోపము అనేక సంవత్సరములు ఆయన ఓరిమి తరువాత కలిగినది. వారు ఆ గొప్ప తెగుళ్ళ వలన బాధింపబడుచు మిగిలిన మహాశ్రమల కాలములోని సంవత్సరములో తిరుగులాడుదురు. ఆ సమయంలో ఈ లోకము యొక్క ముక్కచెక్కలై బూడిదగా మార్చబడి తునాతునకలు చేయబడును మరియు నామ రూపము లేకుండా నాశనపరచబడును.

ప్రకటన 16వ అధ్యాయం నందు ఏడుపాత్రల తెగుళ్ళు కుమ్మరింపబడెను ఈ ఆఖరి సమయం వరకు రక్షణ యొక్క సాక్ష్యము కలిగిన సువార్తను వారిని మేఘములోనికి ప్రభునిచే కొనిపోబడుటకు అర్హత నిచ్చునో అనగా నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను తెలిసికొనక, విశ్వసించక ఉండెదరో వారందరూ ఈ తెగుళ్ళచే నాశనపరచబడెదరు.

వచనం 2 : అంతట మొదటి దూత వెలుపలికి వచ్చి తన పాత్రలను భూమిమీద కుమ్మరింపగా ఆ క్రూరమృగము యొక్క ముద్రగల వారికిని దాని ప్రతిమకు నమస్కారము చేయువారికిని బాధకరమైన చెడ్డ పుండు పుట్టెను.

ఈ పుండు యొక్క తెగులు మందులేని చర్మపు వ్యాధి. అది కలిగిన వారి చర్మముపై నుదిరి మీదను ఈ వ్యాధి అంటును. ఆ బాధ ఎంతో అధికంగా ఉండును. వ్యాధిగ్రస్తులు ఈ తెగులు యొక్క బాధాకరమైన చెడ్డపుండుచే బాధింపబడినప్పుడు అది వారి మరణము వరకు వుండునా? కానీ దేవుడు మృగపు ముద్ర పొందిన వారందరిపైకి పుండు తెగులను మాత్రమే కుమ్మరింపక వారి తలపైకి మిగిలిన ఆరు తెగుళ్ళను కుమ్మరించును. అలాగే ప్రతివారు ఈ తెగులు నుండి తప్పించుకొను మార్గమును నీరు మరియు ఆత్మమూలమైన సువార్తలో కనుగొని, ఆ భయంకరమైన తెగుళ్ళ నుండి ఈ సువార్తను ఇప్పుడే ఆ సమయమందే తప్పించుకోవాలి.

మరి ఆరు తెగుళ్ళను మృగమును దాని ప్రతిమను ఆరాధించు వారిపైకి కుమ్మరింపబోవుచున్నానని ప్రభువు చెప్పుచున్నాడు. దేవుడు అధికంగా అస్యహించుకొను పాపము ఏమిటి? ఆ పాపము ఏదో రూపమును చేసికొనుట లేదా దేవుని కాదని వేరొకనిని దేవుని వలే ఆరాధించుచూ వాటికి తమను లోపరచుకొనుట కనుక మనం ఖచ్చితంగా తెలిసికొనవలసినవారు ఎవరనగా మన ప్రభువైనదేవుడు. యేసుక్రీస్తును మరియు యేసుక్రీస్తును విశ్వసించి ఆయనను ఆరాధించవలెను. ఈ విశ్వమంతటిలో మన ప్రభువైన దేవుడే తప్ప ఎవరును ఏదియూ మనకు దేవుడు కాలేరు.

నీవు నిజముగా పుండు, తెగులును దానితో కూడిన మరి ఆరు తెగుళ్ళను తప్పించుకోవాలంటే ప్రభునిచే అనుగ్రహింపబడిన నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను నమ్మాలి. లెక్కక మించినంత మంది వారి ప్రతి దిన జీవితములో దేవునికి వ్యతిరేకులుగా నిలుచువారు మరియు నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను విశ్వసించక త్రోసివేసిన వారు అందరూ వారు ఆఖరుకు నాశనపరచబడు వరకు ఈ తెగుళ్ళ ద్వారా బాధింపబడెదరు.

వచనం 3 : రెండవ దూత తన పాత్రను సముద్రములో కుమ్మరింపగా సముద్రము పీనుగుల రక్తము వంటిదాయెను. అందువలన సముద్రములో ఉన్న జీవజంతువులన్నియు చచ్చెను.

రెండవ తెగులు వలన సముద్రము పీనుగు రక్తము వంటిదగును. దేవుడు తన తెగులుతో సముద్ర జంతువులన్నిటిని చంపును. దేవునిచే కుమ్మరింపబడిన ఈ రెండవ తెగులు నుండి సముద్రము కుళ్ళును కనుక సముద్ర జీవులు దానిలో బతుక లేకపోవును. దేవుడు ఈ రెండవ తెగులు కలుగనిచ్చినప్పుడు ఏ మనుష్యుడు సముద్రపు పంటను తినలేరు. రెండవ తెగులు ద్వారా దేవుడు తాను సజీవుడనని ఆయనే సమస్త జీవమునకు ప్రభువునని ప్రత్యక్షపరచును.

ఈ రెండవ తెగులు ప్రపంచ ప్రజలకు దేవుడు తీర్చిన తీర్పు ఆ ప్రజలు వారికి ప్రభువైన మృగము ఎదుట సాగిలపడి పరిశుద్ధుల రక్తము చిందించినవారు. ఈ రెండవ తెగులు కూడా ఖచ్చితంగా సరియైనదే. కనుక దేవునిచే సృజింపబడిన సృష్టికొరకు ఆయనకు కృతజ్ఞతలు చెల్లించని వారి నుండి ఆయన సృష్టి సంపదను దాని నుండి తొలగించగలనని దేవుడు మనకు చూపించుచున్నాడు.

వచనము 4-7 : మూడవ దూత తన పాత్రను నదులలోను, జలధారలలోను కుమ్మరింపగా అవి రక్తమాయెను. అప్పుడు వర్తమాన భూతకాలములో ఉండు పవిత్రుడా, పరిశుద్ధుల రక్తమును ప్రవక్తల రక్తమును వారు కార్చినందుకు తీర్పు తీర్చి వారికి రక్తము త్రాగనిచ్చితిని. దీనికి వారు పాత్రులే. నీవు ఈలాగు తీర్పు తీర్చితిని గనుక నీవు న్యాయవంతుడవని దేవదూత చెప్పగా వింటిని. అందుకు అవును ప్రభువా, దేవా, సర్వాధికారీ, నీ తీర్పు సత్యమును న్యాయమునైయున్నవని బలిపీఠము చెప్పుట వింటిని.

నదులను, జలధారలను రక్తముగా మార్చునట్టి మూడవ తెగులు వాస్తవమునకు అత్యంత భయంకరమైన తెగులు. ఈ తెగులు దేవుని యందు విశ్వాసముంచని పాపులైన వారినందరిని శిక్షించుటకై వచ్చుచూ, అది జలధారలను రక్తముగా మార్చును దాని వలన ఈ భూమిపై నివసించుటను అసంభవముగా చేయును. దేవుడు ఈ భూమిపైనున్న జలధారలన్నిటిని, నదులన్నిటిని రక్తముగా మార్చును. ఈ తెగులు కూడా జీవమునకు మూలమైన నీటిని వారికి త్రాగనిచ్చిన దేవునికి వ్యతిరేకముగా నిలుచుటకు జీతముగాను, శిక్షగాను ఈ లోక ప్రజలను ఆయన తీర్చిన తీర్పే. ఆయనకు వ్యతిరేకముగా నిలచిన వారి మీదకు ఈ తెగులును రప్పించుటకు గల కారణము వారు ఆయన పరిశుద్ధులను ప్రవక్తలను ఈ భూమిపై నున్నప్పుడు ఖూనీ చేసిరి. వారు దేవుని దేవునిగా గుర్తించుటకు తిరస్కరించిన వారు మాత్రమే కాక అంత్యక్రీస్తుతో కలసి ఆయనకు విరోధముగా నిలిచిరి.

అంత్యక్రీస్తు శక్తితో పూర్ణముగా నిండినవారై ఈ లోకములో దేవుని ప్రేమకు విరోధముగా నిలుచువారు దేవుడు అధికముగా ప్రేమించిన ఆయన పరిశుద్ధులను ఆయన పరిచారకులను హింసించి ఖూనీ చేయుదురు. ప్రభువు ఈ లోక ప్రజలను వారి పాపము నుండి విడిపించుటకై అనుగ్రహించిన నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను ఇప్పుడు విశ్వసించని వారు అంత్యకాల పరిశుద్ధులను, ప్రవక్తలను చంపి వారి రక్తమును చిందించెదరు. కనుక దేవుడు తన మూడవ తెగులును తన శత్రువు నివసించు ప్రాంతమైన ఈ భూమిపై కుమ్మరించి దాని నీటిని సమస్త జీవమునకు రక్తముగా మార్చును. కనుక వారిని నాశనపరచును.

ఇదే దేవుని న్యాయతీర్పు మరియు దానిని బట్టి మేఘములలో పరిశుద్ధులు ఆనందించెదరు. ఎందుకు? పరిశుద్ధులను చంపిన ఆయన శత్రువులకు ఆయన తీర్చిన వారిపై తీర్చును. అలాగే దేవుని పరిశుద్ధులు పరిచారకులు భయపడనవసరం లేదు. కానీ ప్రతిగా ప్రభువైన దేవుని యందు వారికిగల విశ్వాసమును కాపాడుకోవాలి. మరియు వారు తమ హతసాక్ష్యమును ఎదుర్కొనునప్పుడు దేవుని వాగ్ధానమును ఆయన శక్తిని చూడాలి.

వచనము 8-9 : నాలుగవ దూత తన పాత్రను సూర్యునిమీద కుమ్మరింపగా మనుష్యులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారము ఇయ్యబడెను. కాగా మనుష్యులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి యీ తెగుళ్ళమీద అధికారముగల దేవుని నామమును దూషించిరిగాని, ఆయనను మహిమపరచునట్లు వారు మారు మనస్సు పొందినవారు కారు.

నాలుగవ దూత నాలుగవ తెగులు పాత్రను సూర్యునిపై కుమ్మరింపగా దాని తీవ్రమైన వేడిమికి కాలిపోయి చనిపోయిరి. దేవుడు తనకు వ్యతిరేకముగా నిలచిన వారిపైన తీవ్రమైన వేడిమిగల సూర్యుని ఉగ్రతను కుమ్మరించెను. భూమి సూర్యుని చుట్టూ నిర్ణీత కక్ష్యలో జాగ్రత్తగా పరిభ్రమించుచున్నది. ఒకవేళ భూమి ఈ కక్ష్యనుండీ తప్పిన యెడల, చిన్న దూరమైనను తగ్గిన యెడల దాని నివాసులందరూ కాలిపోవుదురు. అలాగే ఈ నాల్గవ తెగులు కుమ్మరింపబడినప్పుడు ఈ భూమిపై నివాసమున్న వారు వేడిమి వలన బాధింపబడతారు.

అయిననూ వారు దేవునికి విరోధముగా నిలచుట అను పాపము నిమిత్తము పశ్చాత్తాప పడిన వారు కారు ఎందుకు? వారు నీరు మరియు ఆత్మమూలమైన సువార్తకు వ్యతిరేకముగా నిలిచినందున నాశనమునకు సమీపించిరి కనుక సాధ్యమైనంత త్వరలోనే ప్రతివారు దేవుని కోపము నుండి తప్పించుకొనుటకు అనుమతినిచ్చి విశ్వాసమును సిద్ధపరచుకోవాలి. ఒకని రక్షణగా నీరు మరియు ఆత్మమూలమైన సువార్తలో జీవించుటే ఈ విశ్వాసము కనుక ప్రతివారు నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను నమ్మాలి.

వచనము 10-11 : అయిదవ దూత తన పాత్రను ఆ క్రూరమృగము యొక్క సింహాసనము మీద కుమ్మరింపగా, దాని రాజ్యము చీకటి కమ్మెను. మనుష్యులు తమకు కలిగిన వేదననుబట్టి తమ నాలుక కరుచుకొనుచుండిరి. తమకు కలిగిన వేదనను బట్టియు పుండ్లను బట్టియు పరలోకమందున్న దేవుని దూషించిరి గాని తమ క్రియలను మాని మారు మనస్సు పొందినవారు కారు.

ఐదవ పాత్ర తెగులు చీకటిని బాధను కలిగించునదైయున్నది. దేవుడు ఈ ఐదవ తెగులును అంత్యక్రీస్తు సింహాసనము పై కుమ్మరించగా ఈ తెగులు చీకటిని బాధను కలిగించును. ఈ తెగులు నుండి కలుగు బాధ వలన ఆవేదన వలన ప్రజలు తమ నాలుకను కరచుకొందురు. వారిని రెండంతలుగా బాధించుట చేత దేవుడు తన పరిశుద్ధులు బాధకు తప్పక ప్రతీకారము తీర్చును.

దేవుడు వారిని బాధపెట్టును. మరోవిధంగా అంతకుముందు వారు పరిశుద్ధులను బాధించినట్లుగానే వారిని బాధించును మరియు వారు అప్పుడు కూడా వారు తమ పుండ్లతో బాధపడుచున్ననూ పశ్చాత్తాపపడక దేవుని దూషించిరి. అలాగే వారు నిత్యశిక్షయైన నరకాగ్నిని గంధకము పొందెదరు.

వచనం 12 : ఆరవ దూత తన పాత్రను యూఫ్రటీసు అను మహానదిమీద కుమ్మరింపగా తూర్పు నుండి వచ్చు రాజులకు మార్గము సిద్ధపరచునట్లు దాని నీళ్లు యెండిపోయెను.

దేవునిచే కుమ్మరింపబడిన ఆరవ తెగులు కరువు తెగులై యూఫ్రటీసు నదిని ఆరిపోజేయును. ఈ తెగులు వలన మానవాళి గొప్ప బాధను ఎదుర్కొందురు. కరువు తెగులు ప్రతివారి జీవమును భయపెట్టు అతి భయంకరమైనది తెగులు. ప్రభువుచే అనుగ్రహింపబడిన నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను త్రోసివేసిన వారి మీద కుమ్మరింపబడి దేవుని ఆయన ప్రేమను తృణీకరించి ఆయనకు వ్యతిరేకముగా నిలుచువారికి శిక్ష ఎంత గొప్పదో చూపించుచున్నది. తరువాత ఈ యుద్ధరంగమందు దేవుని పరలోకసైన్యము మరియు సాతాను సైన్యము ఈ భూమిపై అంతిమ యుద్ధమును చేయును. ఏదేమైనను సాతాను అతని అనుచరులు చెరపట్టబడి దేవునిచే నాశనపరచబడెదరు.

వచనం 13 : మరియు ఆ ఘటసర్పము నోటనుండియు క్రూరమృగము నోట నుండియు అబద్ధ ప్రవక్తల నోటనుండియు కప్పవంటి మూడు అపవిత్రాత్మలు బయలు వెడలగా చూచితిని.

ఈ వచనం అపవిత్రాత్మ మరియు దయ్యముల క్రియలు సాతాను. అతని మృగము మరియు అబద్ధప్రవక్తల నోట నుండి బయలువెడలునని చెప్పుచున్నది. లోక అంతము సమీపించునప్పుడు లోకమంతటా దయ్యపు క్రియలు జరుగును. ఆ దయ్యము, అద్భుతమును సాతాను, అబద్ధ ప్రవక్తలు మరియు అంత్యక్రీస్తు ద్వారా జరిగించుచూ ప్రజలను సాతాను అబద్ధ ప్రవక్తలు మరియు అంత్యక్రీస్తు ద్వారా జరిగించుచూ ప్రజలను మోసగించి నాశనములోనికి వారిని నడిపించును. కనుక అంత్యకాల లోకము దయ్యమూల లోకమగును. యేసుక్రీస్తు ద్వారా మరియు ఆయన రెండవ రాకడ ద్వారా కుమ్మరింపబడబోవు ఏడు పాత్రల తెగుళ్ళతో వాటి లోకములోనివన్నియూ ముగింపబడును.

వచనం 14 : అవి సూచనలు చేయునట్టి దయ్యముల ఆత్మలే అని సర్వాధికారియైన దేవుని మహా దినమున జరుగు యుద్ధముకు లోకమంతట ఉన్న రాజులను పొగుచేయవలెనని వారి యొద్దకు బయలువెళ్ళి ఆ దయ్యపు ఆత్మల ప్రపంచ రాజులందరి హృదయమును అన్యాయముకు తిప్పి వారికి ఏకముగా కూర్చుటకై దేవునికి విరోధముగా యుద్ధము చేయుటకై ఒక స్థలములో సమావేశపరచును. అంత్యకాలము యొక్క లోకములో ప్రతివారి హృదయము దయ్యముచే ఏలబడును. మరియు అతని / ఆమె దయ్యపుక్రియలు చేయుచూ సాతాను పరిచారకులుగా మారతారు.

వచనం 15 : ఇదిగో నేను దొంగవలె వచ్చుచున్నాను. తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తమ దిసమొలను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడుకొనువాడు ధన్యుడు.

ప్రభువు ఈ లోకమునకు దొంగవలె వచ్చును. వారి విశ్వాసమును కాపాడుకొని ఏడు పాత్రల తెగుళ్ళు కుమ్మరింపబడు వరకు ఆయన సువార్తను బోధించువారు అధికముగా దీవించబడెదరు. అంత్యకాల ప్రపంచంలో జీవించుచున్న పరిశుద్ధులతో మన ప్రభువు చెప్పునది. తప్పక వారు ఆయనచే అనుగ్రహించబడిన నీరు మరియు ఆత్మమూలమైన సువార్తలో తమ విశ్వాసమును బహుమానమును పొందెదరు. ఆయన తన దీవెనలను కుమ్మరించగల వారిని కనుగొనుటకై తప్పక మన ప్రభువు తిరిగి వస్తారు.

వచనం 16 : హెబ్రీభాషలో హార్‌ మెగిద్దోను చోటుకు వారిని పోగుచేసెను. హర్‌మెగిద్దోను అను స్థలములో అంత్య యుద్ధము సాతానునకు దేవునికి మధ్య జరుగునది బైబిల్‌ ప్రవచించుచున్నది. కానీ దేవుడు సర్వాంతర్యామి కనుక ఆయన సాతానుపై జయోత్సవము చేసి, మృగమును అగ్నిగంధకము లోనికి, నరకములోనికి త్రోయును. సాతాను ఎప్పుడూ మోసగాడని మనం గుర్తించాలి. మరియు మనం దేవుని ఎదుట నిలుచు దినము వరకు స్థిరముగా ప్రభువునందున్న మన విశ్వాసమును కాపాడుకోవాలి.

వచనము : 17-21 ఏడవ దూత తన పాత్రను వాయుమండలము మీద కుమ్మరింపగా సమాప్తమైనదని చెప్పుచున్న యొక గొప్ప స్వరము గర్భాలయములో ఉన్న సింహాసనము నుండి వచ్చెను. అప్పుడు మెరుపులును ధ్వనులును ఉరుములును పుట్టెను. పెద్ద భూకంపమును కలిగెను. మనుష్యులు భూమిమీద పుట్టినది మొదలుకొని అట్టి మహాభూకంపము కలుగలేదు. అది అంత గొప్పది ప్రసిద్ధమైన మహాపట్టణము మూడు భాగములాయెను. అన్యజనులు పట్టణము చేసిరి. ప్రతి ద్వీపము పారిపోయెను. పర్వతము కనబడకపోయెను. అయిదేసి మణుగుల బరువుగల పెద్ద వడగండ్లు ఆకాశము నుండి మనుష్యులమీద పడెను. ఆ వడగండ్ల దెబ్బ మిక్కిలి గొప్పదైనందున మనుష్యులు ఆ దెబ్బను బట్టి దేవుని దూషించిరి.

దేవుడు ఏడవ పాత్ర తెగులును గాలిలో కుమ్మరించగా, ఆకాశమందు ఉరుములు, మెరుపులు కలిగెను. అప్పుడే మహాభూకంపమును పెద్దవడగండ్లును ఇంతకు మునుపు ఎన్నడూ చూడనివి భూమిని తాకును. ఆ కల్లోలమంతా ఒక్క ఆనవాలు కూడా లేకుండా మొదటి లోకము నశించును. తరువాత రాబోవు వెయ్యి సంవత్సరములపాటు నూతన భూమిపై పరిశుద్ధుల మహిమలో యేసుక్రీస్తుతో పాటు నివశించెదరు.

వెయ్యి సంవత్సరములు గతించిన తరువాత పరిశుద్ధుల కొరకు దేవుడు వాగ్ధానమిచ్చిన నూతన ఆకాశము మరియు భూమి వచ్చునప్పుడు దేవుడు ఈ మొదటి లోకమును అదృశ్యపరచును మరియు పరిశుద్ధులకు రెండవ ఆకాశము, భూమి నిచ్చును. పరిశుద్ధులు దేవునితో కూడా ఈ నూతన భూమి ఆకాశములో నివసిస్తామని నమ్మాలి. వారు ఈ నిరీక్షణతో ప్రభుని రాకడ కొరకు ఎదురుచూడాలి.