Sermons

[అధ్యాయము 16-2] <ప్రకటన 16:1-21> ఆ ఏడు పాత్రలు పోయబడకముందు నీవు చేయవలసినదేమనగా...<ప్రకటన 16:1-21>


ఏడు పాత్రల తెగుళ్ళలో మొదటి తెగులు పుండు కాగా, రెండవది సముద్రమును రక్తముగా మార్చునది. మూడవది మంచి నీటిని రక్తముగా మార్చునది. నాల్గవ తెగులు సూర్యుని వేడిమి వలన ప్రజలు కాలిపోవు తెగులు. 

ప్రధాన భాగము మనకు ఈలాగు చెప్పుచున్నది. ‘‘నాలుగవ దూత తన పాత్రను సూర్యునిపై కుమ్మరించగా మనుష్యులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారమియ్యబడెను. దేవుడు సూర్యుని భూమికి దగ్గరగా జరిపి దాని జీవులను కాల్చి చంపును అని మనకు తెలియపరచుచున్నది. దేవుడు దీనిని జరిగించుటకు అనుమతించినప్పుడు మనకు తెలియపరచుచున్నది. ఎవడునూ తీవ్రమైన సూర్యుని వేడిమి నుండి తప్పించుకొనజాలడు. ఒకవేళ ఎవడైనను భూమిలో కందకము త్రవ్వి దానిలో దాగిననూ తప్పించుకొనజాలడు. లేదా ఈ తెగులు కొరకు అధికమైన శక్తిగల ఎయిర్‌ కండీషనర్‌ను తయారు చేసికొన్ననూ, వారు దేవుని తెగులు ఆపగలరా. ఎవరికినీ మరే ఇతర దారిలేకపోవును కనుక మరణించెదరు.

ఈ తెగులు సమయం సమీపించినప్పుడు వారికి జరుగబోవునది ఊహిద్ధాం. వారి చర్మం ఊడిపోవును. వారిలోపలి కండ వాస్తవముగా ఎర్రగా ఉడికిపోవును. అది తునాతునకలై కుళ్ళిపోవును. ప్రతివారు చర్మపు క్యాన్సర్‌చే మరణించెదరు.

అయినను సూర్యుని తీవ్రమైన వేడిమి వలన వారు కాల్చబడుచున్ననూ, ప్రజలు వారి పాపముకై పశ్చాత్తాపపడరు. దేవుని తెగులు ఆశ్చర్యకరమైనది. కానీ ఈ తెగులును అనుభవించుచున్ననూ వారు పశ్చాత్తాపపడుటకు తృణీకరించుటకు ఆశ్చర్యకరమే. వారు పశ్చాత్తాపపడుటకు తృణీకరించిరి కనుక దేవుని తెగులు కొనసాగించబడును.

ప్రధాన భాగము ఇలాగు చెప్పుచున్నది. ‘‘అయిదవ దూత తన పాత్రను ఆ క్రూరమృగము యొక్క సింహాసనము మీద కుమ్మరింపగా, దాని రాజ్యము చీకటి కమ్మెను. మనుష్యులు తమకు కలిగిన వేదనలనుబట్టి తమ నాలుక కరచుకొనుచుండిరి. తమకు కలిగిన వేదనను బట్టియు పుండ్లను బట్టియు పరలోకమందున్న దేవుని దూషించిరి గాని తమ క్రియలను మాని మారుమనస్సు పొందినవారు కారు.’’ మనము ప్రస్తుత లోకమును చూచినప్పుడు ఇప్పుడే దేవునిచే తీర్పు తీర్చబడిన ప్రజలు అనేకులుగా ఉండుట చూడలేమా? కానీ దేవుడు తన ఉగ్రతను ఓర్చుకొనుచున్నందుకు ఇంకనూ వారు తీర్పు తీర్చబడలేదు. అయిననూ యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించకుండా చనిపోయిన వారు మరలా దేవునిచే మృతము కానీ దేహమందు బ్రతికించబడి నిత్యనరకాగ్నిలో శాశ్వతముగా బాధను అనుభవించెదరు.

ఇవి సంభవించునప్పుడు ప్రజలు చావవలెనని కోరుదురు. ఎందుకనగా వారి బాధ భరించలేనంత అధికమగును. కానీ నరకబాధ శాశ్వతము. దేవునిచే తీర్పు తీర్చబడినవారు మరణమును కోరుకొను సమయం వచ్చును. కానీ మరణము వారి నుండి పారిపోవును. ఎందుకనగా దేవుడు వారికి శాశ్వత తీర్పునిచ్చుట కొరకే వారు మరణమవకుండా చేయును.

ఆరవ తెగులు హర్‌మెగిద్దోను యుద్ధము ఏడవది ఆఖరిది సమాప్తపు తెగులు మహాభూకంపము మరియు గొప్ప వడగండ్లు.

17-21 వచనము మనకు ఈ విధంగా చెప్పునది ‘‘ఏడవ దూత తన పాత్రను వాయుమండలము మీద కుమ్మరింపగా సమాప్తమైనదని చెప్పుచున్నయొక గొప్ప స్వరము గర్భాలయములో ఉన్న సింహాసనము నుండి వచ్చెను. అప్పుడు మెరుపులను ధ్వనులను ఉరుములను పుట్టెను. పెద్ద భూకంపమును కలిగెను. మనుష్యులు భూమి మీద పుట్టినది మొదలుకొని అట్టి మహా భూకంపము కలుగలేదు. అది అంత గొప్పది ప్రసిద్ధమైన మహాపట్టణము మూడు భాగములాయెను. అన్యజనుల పట్టణము చేసిరి. ప్రతి ద్వీపము పారిపోయెను. పర్వతము కనబడక పోయెను. అయిదేసి మణుగుల బరువుగల పెద్దవడగండ్లు ఆకాశము నుండి మనుష్యుల మీద పడెను. ఆ వడగండ్ల దెబ్బ మిక్కిలి గొప్పదైనందున మనుష్యులు ఆ దెబ్బను బట్టి దేవునిపైనున్న భాగము మనతో ఈలాగు చెప్పుచున్నది. ఏడవ పాత్రను దేవుడు క్రుమ్మరింపగా ఒక మహాభూకంపము భూగ్రహమును కొట్టును. ప్రపంచము మూడు భాగములుగా విడిపోవును. మరియు భూమిపై నిలచియున్న భవనము కూలును. నిజానికి వాటిలో ఏ ఒక్కటీ నిలవబడదు. ఈ లోకము దేవుని భయంకరమైన ఉగ్రతకు లోనగునట్లు పర్వతములన్నియు మాయమగును. ఇది జరిగినప్పటికి హిమాలయ పర్వతము నిలచియుండునా? నిలువవు! సజీవుల దృష్టి ఎదుట నుండి ఎత్తైన ప్రతి పర్వతం అదృశ్యమగును. కొద్దిగానైననూ మిగలక ఈ లోక ప్రతి పర్వతము కేవలము ఆవిరగును. ఈ భాగము గొప్పవడగండ్లు ప్రతిది 100 పౌండ్ల బరువు (45కి.గ్రా.) కలిగి భూమిపై పడునని చెప్పుచున్నది. వడగండ్ల నుండి భూకంపము నుండి తప్పించుకొని బ్రతకగలవాడు ఎవడైనా ఉన్నాడా?

ప్రకటన 18లో దేవుని ఉగ్రత ఆయనను విశ్వసించక ఆయన వాక్యమును తెలిసికొనని వారి పైకి వచ్చునని మనకు చెప్పబడినది. ఈ లోకంలో కొంతమంది ఇలాగు చెప్పుదురు. ఒకవేళ పరలోకం ఉండి ఉంటే, ‘‘నేను దేవుని ఉగ్రతను పొందను. లేదా నేను ఆయనచే తీర్పు తీర్చబడతానా? ఏదేమైనా తమ స్వంత గర్వము మరియు అజ్ఞానముతోనున్న వారిపైకి దేవుని ఉగ్రత వచ్చును. దేవునిచే కుమ్మరింపబడబోవు ఏడుపాత్రల తెగుళ్ళ వలన ఈ లోకము నాశనమగునని మనం నమ్మాలి.దేవుని వాక్యములో మనం విశ్వాసం కలిగి ఉండాలి.


ఆయన ఈలోకమును అదృశ్యపరుస్తానని దేవుడు చెప్పుచున్నాడు. కనుక ఈ లోకం ఎంతోకాలం నిలువదు. అలాగే దాని సమీప అంతమును ఎదుర్కొన బోవుచున్నారు. ఈ సత్యమును మరి బలముగా విశ్వసించి తమ ఆత్మీయ విశ్వాసాన్ని వెదకాలి. కనుక ఈ లోక ప్రజలందరూ తమ ఆత్మీయ నిద్ర నుండి మేల్కొనాలి. నీవు ఇప్పటి వరకు నీ జీవితాన్ని ఏ విశ్వాసంతో జీవించావో నాకు తెలియదు కానీ ఇప్పుడు నీ ఆలోచనలను అంత్యకాలములో జరుగబోవు దానిని శ్రద్ధగా తెలిసికొనవలసిన అనుకూల సమయం ఇదే. మరియు మేల్కొని విశ్వసించు కనుక ప్రకటనలో ప్రవచింపబడిన తెగుళ్ళను గూర్చిన ఖచ్చితమైన జ్ఞానమును కలిగియుండాలి మరియు నీవు సిద్ధంగా ఉండాలి.

ఈ లోకము అతి త్వరలో దేవుని ఏడు పాత్రల తెగుళ్ళ క్రిందికి వచ్చునని మన ప్రభువు సెలవిచ్చెను. అలాగే ఈ సువార్తను బోధించుచునే ఒకవేళ దానిని ప్రజలు సరిగ్గా స్వీకరించక పోయిననూ బొధనలు కొనసాగించుచూ ప్రభువు కొరకు వేచియుండాలి.

ఈ లోక భవిష్యత్తు ఇప్పుడు ఇబ్బందులకు సమీపంగా ఉంది. యుద్ధ భయమునుండి నిలకడలేని వాతావరణం వరకు ఆ క్షీణత సమాజ విరుద్దభావాలు అధికమగుట ప్రతివిధమైన రోగము వంటి అనేక రకాల అపాయములను ప్రస్తుత లోకము ఎదుర్కొనుచున్నది. కనుక ప్రస్తుత యుగము నోవాహు యుగము వలె నున్నదని దేవుడు చెప్పుచున్నాడు. ప్రస్తుత కాలము నోవాహు కాలమైన దీని అర్థము ప్రపంచం కేవలము తన ఆఖరి దినమును సమీపించినది. ప్రజలు తినుట త్రాగుట వివాహమునకిచ్చుట పుచ్చుకొనుట వంటి శారీరక విషయముతోనే ఆసక్తి కనపరచుటే ఈలోక అంతమునకు సూచన. కనుక వారు దేవుని తీర్పు పొందుటకు తగినవారు. నోవాహు కాలంలో కూడా ఇట్టి ప్రజలు నోవాహు చెప్పినది వినిపించుకొనలేదు. కనుక వారంతా నాశనమైరి.

నోవాహు అతని ఎనిమిదిమంది కుటుంబమే రక్షింపబడిరి. రాబోవుచున్న లోకము కూడా ఇలాగే ఉండును. బైబిల్‌ నందు లిఖింపబడిన విధముగానే దేవుని వాగ్ధానములన్నియు నెరవేరుచున్నవి. దేవుని వాక్యములో కేవలము నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను విశ్వసించని వారికి నియమించబడిన తీర్పు మాత్రమే మిగిలియున్నది. మరియు తిరిగి జన్మించిన వారైన పరిశుద్దుల కొరకు నీతిమంతులు మాత్రమే నివశించదగిన వెయ్యేండ్ల పాలన నూతన ఆకాశము భూమి ఎదురుచూచుచున్నది. 

దేవుడు దయాళుడు. ఈయన నీతిమంతుల పక్షమున నిలుచును. అయినను ఆయన ఉగ్రతకు పాత్రులైనవారికి, దేవుడు నిశ్చయముగా ఆయన ఉగ్రతను భరించనిచ్చును. అదేవిధంగా అయిన దయకు పాత్రులైనవారికి ఆయన ఎంతో నిశ్చయముగా ఆయన కృప కుమ్మరించును.

ఈ తెగుళ్ళు ఎప్పుడు సంభవించును? పరిశుద్ధుల హతసాక్ష్యము అలాగే 666అను ముద్ర లోకమును బాధించునప్పుడు పరిశుద్ధులు దానిని ఎదిరించుచుండగా ఆ ఏడు పాత్రల తెగుళ్ళు కుమ్మరింపబడుట జరుగును. ఈ తెగుళ్ళ తరువాత మొదటి పునరుత్థానము వెయ్యేండ్ల పాలన ఆ గొప్పదైన తెల్లని సింహాసనము పై కూర్చొని యేసు అంత్యతీర్పు తీర్చుట సంభవించును. ఇది నిత్య రాజ్య ఆరంభమును అనుసరించును.

బైబిల్‌ ద్వారా మనము దేవుని ప్రణాళికను తెలుసుకోవాలి. యేసు మృతి నుండి తిరిగి లేచెనని నీవు నమ్ముచున్నావా? ప్రభువు మానవాళి పాపమంతటిని తన బాప్తిస్మము మరియు రక్తము ద్వారా పోగొట్టెనని నీవు నమ్ముచున్నావా? మన ప్రభువు మానవాళి పాపములన్నింటిని నీరు మరియు రక్తము ద్వారా తొలగించి మూడు దినములలో మృతి నుండి లేచెనని ఇప్పుడు తండ్రి సింహాసనము కుడి పార్శ్వమున కూర్చున్నాడని నీవు నమ్ముచున్నావా? అలాగే యేసుక్రీస్తును విశ్వసించువారి పాపము స్పష్టముగా మాయమాయెను. మరియు క్రీస్తు మృతి నుండి తిరిగి లేచునట్లుగానే వారు కూడా పునరుత్థానులు అగుదురు.

కష్టమును ఎదుర్కొందురు ఇప్పటి కాల శ్రమలు వారి కొరకు ఎదురుచూచుచున్న మహిమ ఎదుట ఎన్నదగినవి కావు. ఎలాగనగా ఈ మహిమ కేవలము తిరిగి జన్మించిన వారైన పరిశుద్ధుల కొరకు ఎదురుచూచుచున్నది. కనుక పరిశుద్ధులు భవిష్యత్తు కొరకు చింతించనవసరము లేదు. నీతిమంతులు చేయవలసినది తమ శేష జీవితమును వాక్యము కొరకు విశ్వాసముతో జీవించాలి. మనలను లోకమును అనుసరించుటకు కాక ఆత్మను రక్షించుటను క్రియల కొరకు సమర్థించెదము.మన శేష జీవితమును దేవుని కొరకు సమర్పించెదము.


మనలో కొందరు సువార్తను విడిచిపెడతారేమోనని నాకు బాధ కలుగుచున్నది. నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను విడుచువారు అంతమున ప్రభువునే విడిచివేస్తారు. మనము బలహీనులమైనను ప్రభునితోపాటు నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను మనము నమ్మి అనుసరించిన మనమందరము విశ్వాసముతో జీవించగలము. పరిశుద్ధులు కేవలము తమ సొంత జ్ఞాన బలము వలన మాత్రము జీవించలేరు. వారు ఆలాగు చేసిన యెడల విశ్వాసమును వదలి స్వంత నాశనమును ఎదుర్కొంటారు. దీనిని తప్పించుకొనుటకు మనము విశ్వాసముతో జీవించాలి.

మన ప్రభువు ఎందుకు ప్రజలను 666 ముద్ర పొందనిచ్చును? ఇది గింజను పొట్టు నుండి వేరు చేయుటకే పరిశుద్దులను కొనిపోవుటకు ముందు, దేవుడు మొదట చేయునది పొట్టు నుండి గింజలను వేరు చేయుట.

పరిశుద్ధులు పోరాడవలసిన ఆత్మీయ యుద్ధాలు ఉన్నవి. అలాగే దేవుని శత్రువుతో పోరాడుటను పరిశుద్ధులు విడువరాదు. సాతానుతో పోరాడుటకు వారు వ్యతిరేకించిన, సాతానుచే చావుదెబ్బలు తినవలసివచ్చును. కనుక పరిశుద్ధలంతా కేవలము తమకొరకైనా ఆత్మీయ పోరాటమును తప్పక చేయాలి. పరిశుద్ధులు చేయు ఆత్మీయ యుద్ధములన్నీ న్యాయమైనవి. దేవుని అనుసరించుటకు ప్రతి పరిశుద్ధుడూ సాతానునూ అతని అనుచరులను తప్పక ఎదుర్కొని జయించాలి.

పరిశుద్ధులు దేవుని రాజ్యము కొరకు పోరాడాలి. వారు దేవుని రాజ్యము కొరకే హింసింపబడాలి మరియు లోక ప్రజలచే అసహ్యించబడాలి. ప్రభుని కొరకు పోరాడు అవకాశము పరిశుద్ధులకివ్వబడుట దానికదే మంచిది. ఈ అవకాశము నీకివ్వబడిన యెడల నీవు దాని కొరకు ఆయనకు కృతజ్ఞతనివ్వాలి. అట్టి పోరాటము మంచిపోరాటము, ఎందుకనగా అది దేవుని నీతి కొరకు చేయు పోరాటము.

దేవుడు నీతిమంతులకు సహాయము చేయును. మన జీవితములో ఎన్నో దినములు లేవు. కనుక మనమందరమూ మన శేష జీవితమును ప్రభువు సముఖంలో నిలుచువరకు ఆత్మీయ పోరాటము, ఆత్మీయ క్రియలు చేస్తూ గడపాలని నేను కోరుకుంటూ దేవుని ప్రార్థిస్తున్నారు. ఈలోక ప్రజలు మనలను ఏమన్ననూ, లెక్కచేయక మనము ఆత్మీయ పోరాటము చేయాలి. ఆత్మీయ ఫలము ఫలించి మన ప్రభువు కన్నీటిని తుడిచివేయును. మరియు రోదనలేని బాధలు లేని స్థలములో మనలను నివసింపచేస్తాడు.

మనమంతా విశ్వాసంతో జీవిద్ధాం. ఈ విశ్వాసముతో దేవుని రాజ్యములో ప్రవేశిద్ధాం.