Sermons

[అధ్యాయము 17-1] <ప్రకటన 17:1-18> విస్తార జలములపై కూర్చునున్న వేశ్యకు చేయబడు తీర్పు<ప్రకటన 17:1-18>


"ఆ ఏడు పాత్రలు పట్టుకొనియున్న ఏడుగురు దేవదూతలలో ఒకడు వచ్చి నాతో మాటలాడుచు ఈలాగు చెప్పెను. నీవిక్కడికి రమ్ము. విస్తార జలముల మీద కూర్చున్న మహా వేశ్యకు చేయబడు తీర్పు నీకు కనుపరచెదను ; భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి., భూనివాసులు ఆమె వ్యభిచార మధ్యములో మత్తులైరి. అప్పడుతడు ఆత్మవశుడైన నన్ను అరణ్యమునకు కొనిపోగా, దేవదూషణ నామములతో నిండుకొని ఏడు తలలును, పది కొమ్ములను గల యొక స్త్రీని చూచితిని. ఆ స్త్రీ ధూమ్ర రక్త వర్ణము గలవస్త్రము ధరించుకొని, బంగారముతోను, రత్నములుతోను, ముత్యములతోను అలంకరింపంబడినదై, ఏహ్యమైన కార్యములతోను తాను చేయుచున్న వ్యభిచార సంబందమైన అపవిత్ర కార్యములతోను నిండిన యొక సువర్ణ పాత్రను తన చేత పట్టుకొని ఉండెను. దాని నొసట దాని పేరు ఈలాగు వ్రాయబడివుండెను. మర్మము, వేశ్యలకును భూమిలోని ఏహ్యమైన వాటికిని తల్లయిన మహా బబులోను.

మరియు ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తము చేతను, యేసు యొక్క హతసాక్షుల రక్తము చేతను మత్తిల్లియుండుట చూచితిని. నేను దాని చూచి బహుగా ఆశ్చర్యపడగా ఆ దూత నాతో ఇట్లనెను - నీవేల ఆశ్చర్యపడితివి? యీ స్త్రీనిగూర్చిన మర్మమును, ఏడు తలలను పది కొమ్ములును గలిగి దాని మోయుచున్న క్రూరమృగమును గూర్చిన మర్మమును నేను నీకు తెలిపెదను. నీవు చూచిన ఆ మృగము ఉండెను గాని యిప్పుడు లేదు. అయితే అది అగాధ జలములోనుండి పైకి వచ్చుటకును నాశనమునకు పోవుటకును సిద్ధముగా ఉన్నది. భూనివాసులలో జగదుత్పత్తిమొదలుకొని జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు, ఆ మృగముండెను గాని యిప్పుడు లేదు. అయితే ముందుకు వచ్చునన్న సంగతి తెలిసికొని ఆశ్చర్యపడుదురు. ఇందులో జ్ఞానము గల మనస్సు కనబడును. ఆ యేడు తలలు ఆ స్త్రీ కూర్చున్న యేడుకొండలు, మరియు ఏడుగురు రాజులు కలరు. అయిదుగురు కూలిపోయిరి. ఒకడున్నాడు, కడమవాడు ఇంకను రాలేదు. వచ్చినప్పుడు అతడు కొంచెము కాలముండవలెను. ఉండినదియు ఇప్పుడు లేనిదియునైన యీ క్రూరమృగము ఆ యేడుగురితో పాటు ఒకడునైయుండి, తానే యెనిమిదవ రాజగుచు నాశనమునకు పోవును. నీవు చూచిన ఆ పది కొమ్ములు పదిమంది రాజులు. వారిదివరకు రాజ్యమును పొందలేదు గాని యొక గడియ క్రూరమృగముతోకూడా రాజుల వలె అధికారము పొందుదురు. వీరు ఏకాభిప్రాయము గలవారై తమ బలమును అధికారమును ఆ మృగమునకు అప్పగింతురు. వీరు గొఱ్ఱె పిల్లతో యుద్ధము చేతురు గాని, గొఱ్ఱె పిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై యున్నందునను, తనతోకూడా ఉండినవారు పిలువబడినవారై, యేర్పరచబడినవారై, నమ్మకమైనవారై యున్నందునను, ఆయన రాజులను జయించును మరియి ఆ దూత నాతో ఈలాగు చెప్పెను. ఆ వేశ్య కూర్చున్నచోట నీవు చూచిన జలముల ప్రజలను, జనసమహామును, జనములను, ఆయా బాషలు మాటలాడు వారిని సూచించును. నీవు ఆ పది కొమ్ములు గల ఆ మృగమును చూచితివే, వారు ఆ వేశ్యను ద్వేషించి, దానిని దిక్కు లేనిదానిగాను దిగంబరిగాను చేసి, దాని మాంసము భక్షించి అగ్నిచేత దానిని బొత్తిగా కాల్చివేతురు. దేవుని మాటలునెరవేరు వరకు వారు ఏకాభిప్రాయము కలవారై తమ రాజ్యమును అప్పగించుట వలన తన సంకల్పము కొనసాగించునట్లు దేవుడు వారికి బుద్ధి పుట్టించెను. మరియు నీవు చూచిన ఆ స్త్రీ భూరాజులనేలు ఆ మహాపట్టణమే.’’వివరణ :


వచనం 1: ఆ యేడు పాత్రలను పట్టుకొనియున్న యేడుగురు దేవదూతలలో ఒకడు వచ్చి నాతో మాటలాడుచు ఈలాగు చెప్పెను. నీవిక్కడికి రమ్ము. విస్తార జలము మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనపరచెదను.

ఆ వేశ్యా స్త్రీ ఎవరు. ఈ ప్రధాన భాగపు మృగము ఎవరు అని తెలిసికొను 17వ అధ్యాయమును అన్వయించి అర్థం చేసికొనుట అవసరము. వచనం 1లోని వేశ్య ప్రపంచ మతమును పోలినది కాగా ఆ స్త్రీ లోకమునకు పోల్చబడినది. మరొక ప్రక్క ఆ మృగము అంత్యక్రీస్తును సూచించుచున్నది. విస్తార జలము దయ్యపు బోధనలను సూచించును. ‘‘విస్తార జలముపై కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పును నీకు కనుపరచెదను” అనగా సాతాను బోధనలపై ఆనుకొనియున్న అనేక మతములకు దేవుడు తీర్పు తీర్చునని చెప్పుచున్నది.

వచనం 2 : ‘‘భూరాజులు ఆమెతో వ్యభచరించిరి, భూనివాసులు ఆమె వ్యభిచార మద్యములో మత్తులైరి.’’

ఆ ‘‘వ్యభిచారము” దేవుని ప్రేమించుట కంటే ఈ లోకమును దానిలోని వస్తువులను అధికంగా ప్రేమించుటను సూచించును. లోకవస్తువుల ప్రతిమలను చేయుట. వాటిని దేవుని వలే ప్రేమించి, ఆరాధించుట అనునవన్నీ వాస్తవంగా వ్యభిచార క్రియలే.

పై వచనంలో ‘‘భూరాజులు ఎవరితో వ్యభిచరించిరి” అనగా ఈ లోక నాయకులు లోక మతములను మధ్యములో తమ జీవితమును గడిపిరి. ఈ లోక మతము అందించిన అట్టి పొలమునే లోకప్రజలు త్రాగిరి.

వచనం 3 : అప్పుడతడు ఆత్మవశుడనైన నన్ను అరణ్యమునకు కొనిపోగా, దేవదూషణ నామముతో నిండుకొని, యేడు తలలును పది కొమ్ములునుగల ఎఱ్ఱని మృగముమీద కూర్చుండిన యొక స్త్రీని చూచితిని.

“ఎర్రని మృగము మీద కూర్చున్న స్త్రీ” అను వచనం ఈ లోక ప్రజలు తమ హృదయాలను అంత్యక్రీస్తుతో కలిపి పరిశుద్ధులను హింసించి, చంపును అది మనకు తెలియచేయుచున్నది. లోక ప్రజలు దేవుని శత్రువునకు పరిచారకులుగా అంత్యక్రీస్తు పక్షమున అతని క్రియలు జరిగించెదరని చెప్పుచున్నది. ఆ మృగము దేవుని వ్యతిరేకియగు అంత్యక్రీస్తే. అంత్యక్రీస్తు అనేక రాజులపై అధికారియగును. మరియు దేవుని ప్రపంచంలోని అనేక దేశాలను ఏలును. కానీ వ్యతిరేకిగా ఆ అంత్యక్రీస్తు గర్వపు మాటలు పలుకుచు, దేవుని దూషించుటకు వెనుకాడడు. అతడు పొగరుతో మాటలాడుతూ దేవుని దూషించును. తానే దేవుడనని, యేసుక్రీస్తునని చెప్పుకొనుచూ తనను తానే దేవునికంటే ఉన్నతంగా హెచ్చించుకొనును. కనుక అతని అధికారము ప్రపంచ రాజులందరిమీద, దేశము మీద ఉండును. ‘‘ఏడు తలలు పది కొమ్ములు” అను వచనంలో ఏడు తలలు ఇక్కడ ప్రపంచపు ఏడుగురు రాజులను తెలుపుచున్నది. మరియు ‘‘పది కొమ్ములు” ప్రపంచంలోని దేశమును సూచించును.

వచనం 4 : ఆ స్త్రీ ధూమ్రరక్తవర్ణము గల వస్త్రము ధరించుకొని, బంగారముతోను, రత్నములతోను, ముత్యములతోను అలంకరింపబడినదై, ఏహ్యమైన కార్యములతోను తాను చేయుచున్న వ్యభిచారసంబంధమైన అపవిత్ర కార్యములతోను నిండిన యొక సువర్ణపాత్రను తన చేత పట్టుకొనియుండెను.

ధూమ్ర రక్తవర్ణముగల వస్త్రము ధరించుకొని, బంగారముతోను, రత్నములతోను, ముత్యములతోను అలంకరింపబడినదై, అను వచనంతో ఈ భాగంలో చెప్పబడినదేమనగా, అంత్యక్రీస్తుతో విధానపరచబడిన ఈ లోకమతము అతనిని రాజుగా తలంచును. అలాగే వారికి వ్యతిరేకులుగా నిలుచువారు చంపబడుట సరియైనదని వారు తలంచెదరు. మరియు తమ తలంపులను పరిశుద్ధులకు వ్యతిరేకంగా క్రియలలో అమలు పరచెదరు.

మరియు ఈ లోకమును నిత్య సంతోషము గల రాజ్యముగా అలంకరించుటకు వారు తమను తాము లోక బంగారు, ప్రశస్త రాళ్ళు మరియు ముత్యములతో అలంకరించుకొందురు. కానీ వారి నమ్మకము పూర్తిగా శారీరకానందము ఎంతగా వారు ఈ లోకంలో పొందగలరు అనుదానిపై ఆసక్తి కనబరుస్తారు. ఎందుకనగా దేవుడు ఈ లోక ప్రజలను చూచినప్పుడు ఈ లోకం తన మలిన పాపముతో నిండియుండుట చూచును. వారందరూ ఆయన ముందు ఏహ్యమైనవారిగా కనబడెదరు.

వచనం 5 : దాని నొసట పేరు ఇలాగు వ్రాయబడియుండెను. మర్మము, వేశ్యకును భూమిలోను ఏహ్యమైన వాటికిని తల్లియైన మహాబబులోను.

ఈ లోక మతాలకు చెందిన ప్రజలు తమను తాముగా రాణులవలే ఆరాధింపబడాలని ప్రయత్నించిననూ వారు నిజానికి వేశ్యలుగా కనబడెదరు. నొసటన ‘‘మహా బబులోను” అను నామము గర్వముతో నిండిన విగ్రహారాధనతో కూడిన, హెచ్చింపబడిన వేశ్య వ్యక్తిత్వము కనబడును. కాగా తల్లి అను మాట మరొకవైపు చరిత్రలోని అంత్యక్రీస్తుని బలవంతము లోకము నుండి కాక మరి దేని నుండి కలుగలేదు. మరియు లోకమే అన్ని వ్యభిచార క్రియలకు, అవినీతికి మూలము.

ఈ లోకము తళతళ మెరయు అందమైన నగలతో అలంకరింపబడిననూ, దేవునికి వ్యతిరేకంగా నిలుచు అంత్యక్రియలు జరిగించు హృదయాలు కల ప్రజలు తమ తల్లివలే క్రియ చేయుదురు. అలాగే మన ప్రభువైన దేవుడు వారిని తన ఏడుపాత్రల గొప్ప తెగుళ్ళుతో నశింపచేయుటకు నిర్ణయించెను.

వచనం 6 : మరియు ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తముచేతను, యేసు యొక్క హతసాక్షుల రక్తము చేతను మత్తిల్లియుండుట చూచితిని. నేను దాని చూచి బహుగా ఆశ్చర్యపడగా పరిశుద్ధులనుగా సంఘ చరిత్ర అంతటిలో నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను విశ్వసించిన ప్రజలు ‘‘యేసు హతసాక్షులు” అనగా యేసే దేవుని కుమారుడని ఆయనే రక్షకుడని సత్యము, సాక్ష్యమిచ్చి తమ విశ్వాసమును కాపాడుకొనుటకు హతసాక్షులైనవారు.

ఈ వచనము పరిశుద్ధులను హింసించి చంపబోవు వారు ఈలోక మత సంబంధ ప్రజలు కాక వేరొకరు కాదని బలముగా విశదీకరించుచున్నది. అంత్యక్రీస్తు యొక్క దుష్టశక్తులవలే వారు ఇట్టి చెడ్డ కార్యము జరిగింతురు.

యోహాను ఆ స్త్రీని చూచినప్పుడు ‘‘గొప్ప ఆశ్చర్యముతో కూడిన ఒక తలంపుగా తలంచెను. ఈ లోకము వాస్తవముగా ఆసక్తిని పుట్టించు లోకమే పరిశుద్ధులు దానికి ఏ హాని చేయలేదు. అయినను ఈ లోకము అంత్యక్రీస్తులో కూడా పన్నాగము పన్నుచూ అనేకమంది పరిశుద్ధులను చంపును. ఈ లోకము ఎందువలన ఎల్లప్పుడు క్రొత్తదిగా యుండును? ఈ విషయములన్ని నిశ్చయముగా లోక ప్రజల వలన పరిశుద్ధులపై మోపబడును. ఎందుకనగా ఈ లోకము అంత్యక్రీస్తు, అతని ప్రజలు, అతని సంచారకుల అజమాయిషిలో యున్నది. కనుక పరిశుద్దులను వెదకి వారిని చంపును. కనుక వారు వాస్తవముగా మనకు క్రొత్తగా కనబడతారా? ప్రజలు దేవుని పోలిక చొప్పున నిర్మించబడినప్పుడు వారు ఏలాగు అంత్యక్రీస్తు పరిచారకులై ప్రజలను హత్య చేస్తారు. ఏ ప్రజలనైనను కాక దేవుని విశ్వసించిన వారైన లెక్కలేనంతమంది ప్రజలను చంపుదురు? అని ఎందుకనగా ఈ లోకము సాతాను పరిచారకులది.

వచనం 7 : ఆ దూత నాతో ఇట్లనెను - నీవే ఆశ్చర్యపడితివి? యీ స్త్రీని గూర్చిన మర్మమును, ఏడు తలలును పది కొమ్ములును గలిగి దాని మోయుచున్న క్రూరమృగమును గూర్చిన మర్మము నేను నీకు తెలిపెదను.

ఇక్కడ స్త్రీ అనగా ఈ లోక ప్రజలను సూచించుచున్నది. అంత్యక్రీస్తుగా పిలువబడుచున్న మృగము ఈ లోక రాజులందరి పైన మరియు దాని దేశముపైన ఏలుబడి చేయును. మరియు వారి ద్వారా దేవునికి వ్యతిరేకముగా నిలుచుట, పరిశుద్ధులను హింసించుట మరియు వారిని హత్య చేయుట అను తన క్రియను కలిగించును. ‘‘ఆ మృగము యొక్క మర్మమా” అంత్యక్రీస్తు యొక్క ఉనికిని సాతాను ఆజ్ఞ వలన అతడు నడిపింపబడుటను సూచించును. మరియు అతడు ఈలోక దేశమును తన సొంత దేశముగా మలచును.

అంత్యక్రీస్తు విధానముతో కలిసిపోయి సాతాను పనిముట్లుగా మారిన ఈలోక ప్రజలు ప్రభుని బిడ్డలు అయిన అనేకులను పైశాచికముగా చంపుతారు. ప్రస్తుతము సాతాను పనిముట్లు అయిన ఈ లోకము మరియు అంత్యక్రీస్తు మనకు అదృశ్యముగా యున్నారు. కాని మహాశ్రమతో మొదటి మూడున్నర సంవత్సరములు గడచిన తరువాత వారు బయల్పడి పరిశుద్దులను చంపుదురు.

ఈ లోకములో అనేకులు భవిష్యత్‌ తెలిసిన వారు, విద్యాధికులు సౌందర్యవంతులైన రాజకీయ నాయకుల నుండి విద్యావేత్తలు, తత్త్వవేత్తలు మరియు పి.హెచ్‌.డిలు కలవారి వరకు ఉండగా ఇవన్నియు ఎట్లు సాధ్యమని ఎవరైన ఆశ్చర్యపడవచ్చు. కాని అంత్యక్రీస్తుతో ప్రభావితమైన ఈ లోకములో పరిశుద్ధులు భయంకరమైన మరణము వరకు గల విషయములన్ని సాధ్యమైనవే అలాగే అంత్యక్రీస్తుకు ఈ లోకము దాసోహమగుట అనునది అంత్యక్రీస్తు యొక్క మర్మమును ఛేదించుటకు తాళపు చెవి వంటిది.

వచనం 8 : ‘‘నీవు చూచిన ఈ మృగము ఉండెను గాని యిప్పుడు లేదు. అయితే అది అగాధ జలములో నుండి పైకి వచ్చుటకును నాశనమునకు పోవుటకును సిద్ధముగా ఉన్నది. భూనివాసులలో జగదుత్పత్తి మొదలుకొని జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగముండెను గాని యిప్పుడు లేదు. అయితే ముందుకు వచ్చునని సంగతి తెలిసికొని ఆశ్చర్యపడుదురు.’’

అంత్యక్రీస్తు పూర్వకాలపు రాజులలో ఉండెనని, ప్రస్తుతము ఈ లోకములో అతడు లేక పోయినప్పటికి భవిష్యత్తులో ఈ లోకములోనికి వచ్చునని ఈ వచనము మనకు చెప్పుచున్నది. అంత్యక్రీస్తు బయల్పడి పరిశుద్ధులను చంపునప్పుడు ఈ లోక ప్రజలందరు ఆశ్చర్యపడతారని కూడా ఈ వచనము మనకు చెప్పుచున్నది.

ఈ లోకములోని క్రొత్త రాజకీయములో పాల్గొనుచు అంత్యక్రీస్తు తన అవసరమును కొనసాగించును. ఈ లోక ప్రజలకు అంతుచిక్కని సమస్యగా కొనసాగుచు అతడు ఒక ఆశ్చర్య కారణముగా వెలుగొందును. ఎందుకనగా అతడు అనేకమైన రాజకీయ, ఆర్థికవిగ్రహాల సంబంధమైన మరియు మతం సాధించుచు ఉన్నందున అనేకులు అతనిని గూర్చి ఆలోచించి అంత్యకాలములో రానైయున్న క్రీస్తు యేసు ఇతడే అనుకొని అతనిని వెంబడింతురు. కాబట్టి ఈ లోక ప్రజల కన్నుల ఎదుట అతడు ఒక ఆశ్చర్యముగా మిగులుతాడు.

వచనం 9 : ‘‘ఇందులో జ్ఞానము గల మనస్సు కనబడును. ఆ యేడు తలలు ఆ స్త్రీ కూర్చున్న యేడుకొండలు.’’

అంత్యక్రీస్తు తన ఉద్దేశ్యమును నెరవేర్చు కొనుటకు తన సొంత విధులను ఏర్పరచుకొని లోక ప్రజలను ఏలుచు ఇవే విధులతో తనదైన ఒక పాలక వర్గమును ఏర్పాటు చేయునని ఈ వచనము మనకు చెప్పుచున్నది. ఈలోక ప్రజలందరు ఐక్యమగుటకు కారణమేమనగా అంత్యక్రీస్తు యొక్క ముద్రను వేయించుకొని సాతానుచే పరిపాలించబడుటకు, అంత్యక్రీస్తుతో నియమించబడిన శక్తిని నమ్ముచు దేవునికి అతని పరిశుద్ధులకు వ్యతిరేకులై నిలిచెదరు.

వచనం 10 : ‘‘మరియు ఏడుగురు రాజులు కలరు. అయిదుగురు కూలిపోయిరి, ఒకడున్నాడు, కడమవాడు ఇంకను రాలేదు వచ్చినప్పుడు అతడు కొంచెము కాలముండవలెను.’’

పూర్వకాలములో వలెనో ఈ లోకంలో దేవునికి వ్యతిరేకులుగా నిలచు రాజు వస్తూనే ఉంటారు. ఆఖరి మహాశ్రమ కాలం వచ్చినప్పుడు ఈలోక నాయకులలో ఒకరు అంత్యక్రీస్తువలే మారి, పరిశుద్ధులను క్రూరంగా చంపును. అంత్యక్రీస్తుగా మారిన లోక నాయకుడు చేయు హింస దేవునిచే అనుమతించబడినదై, అతికొద్ది కాలములోనే ముగియును.

వచనం 11 : ‘‘ఉండినదియు ఇప్పుడు లేనిదియునైన యీ క్రూరమృగము ఆ యేడుగురితో పాటు ఒకడునైయుండి తానే యెనిమిదవ రాజగుచు నాశనమునకు పోవును.’’

రాబోవు అంత్యక్రీస్తు ఈ లోక రాజులో ఆఖరివాడగునని ఈ వచనం తెలియజేయుచున్నది. లోక రాజులలో నుండి అంత్యక్రీస్తు బయల్పడినప్పుడు ఈ లోక ప్రజలు అనేకులు అతనిని అనుసరించెదరు. అతను ఘటసర్పము ఆత్మను పొందినవాడై దేవునివలే అధికారము చేయుచూ, సూచన క్రియలను, అద్భుతములను చేయును. దేవుని పరిచారకులు ఆయన పరిశుద్ధులు కూడా అంత్యక్రీస్తుచే చంపబడెదరు. కానీ ఇవన్నియూ కొద్దికాలమే జరుగుటకు దేవుడనుమతించెను. అట్టి విషయము జరిగిన తరువాత అంత్యక్రీస్తు అగాధములో బంధించబడును. మరియు నరకాగ్నిలో పడవేయబడి దాని నుండి ఎన్నడూ విడువబడడు.

వచనం 12 : ‘‘నీవు చూచిన ఆ పది కొమ్ములు పదిమంది రాజులు, వారిది వరకు రాజ్యమును పొందలేదు గాని యొక ఘడియ క్రూరమృగముతోకూడా రాజువలె అధికారము పొందుదురు.’’

ఈ ప్రపంచమంతటిని ఏలుటకు పది దేశాలు ఐక్యమవుతారని ఈ వచనం తెలియజేయుచున్నది. ఈ పదిదేశాలు అట్టి విధంగా ఐక్యమై కొద్ది కాలము అంత్యక్రీస్తుతో కలిసి ఈ లోకములో శ్రమల పాలన కొనసాగిస్తారు. ఈ లోక రాజులు ఇంకనూ అంత్యక్రీస్తుచే పాలింపబడు రాజ్యమును పొందలేదు. సమీప భవిష్యత్తులో కొద్దికాలము చీకటి యొక్క రాజువలే ఆ మృగముతో కూడా ఈ లోకమును పాలిస్తారు. కానీ వారి రాజ్యము కొద్ది కాలమే ఉండును. అలాగే ఈ కొద్ది కాలమే అంధకారము యొక్క అధికారము క్రింద రాజ్యం చేస్తారు.

వచనం 13 : ‘‘వీరు ఏకాభిప్రాయముగలవారై తమ బలమును అధికారమును ఆ మృగమునకు అప్పగింతురు.’’

సమయం వచ్చినప్పుడు ఈ లోక నాయకులు తమ శక్తిని అధికారమంతటిని అంత్యక్రీస్తునకు బదిలీ చేస్తారు. ఆ సమయంలో సంఘము దాని పరిశుద్ధులు ఆయన పరిచారకులు అంత్యక్రీస్తుచే ఎంతగానో హింసింపబడతారు. మరియు హతసాక్షులవుతారు. కానీ అంత్యక్రీస్తు, యేసుక్రీస్తు శక్తి అధికారమును బట్టి మరియు ఆయన నోటి నుండి వెలువడు ఖడ్గము వంటి ఆయన వాక్యముతో నశిస్తాడు.

వచనం 14 :‘‘వీరు గొఱ్ఱె పిల్లతో యుద్ధము చేతురు గాని, గొఱ్ఱె పిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై యున్నందునను తనతోకూడా ఉండినవారు పిలువబడినవారై, యేర్పరచబడినవారై నమ్మకమైనవారైయున్నందునను, ఆయన ఆ రాజులను జయించును.’’

యేసుక్రీస్తుకు వ్యతిరేకముగా యుద్ధము చేయుటకు సాతాను ప్రయత్నించినప్పుటికి, అతడు ఆయనకు సాటిరాడు. ప్రభువు తమ విశ్వాసముతో అంత్యక్రీస్తుతో పోరాడి జయించు శక్తిని పరిశుద్ధులకు అనుగ్రహించును. అలాగే పరిశుద్ధులు అంత్యక్రీస్తు వలన కలుగు ఇబ్బందులకు వెరవరు. కానీ అంత్య దినములలో వారి ప్రభువైన దేవునిని విశ్వసించుటతో కలుగు ఆనందముతోను, శాంతితోను నివసిస్తారు.

పరిశుద్ధులు విజయమనగా వారు తమ విశ్వాసమును కాపాడుకొని హతసాక్షులవుతారని అర్థం. ఈ సమయం వచ్చినప్పుడు యేసుక్రీస్తు నందు తమకు గల విశ్వాసంతో హతసాక్ష్యమును కౌగలించుట ద్వారా అంత్యక్రీస్తును సాతానును జయిస్తారు. పరలోక రాజ్యం కొరకైన నిరీక్షణ, పునరుత్థానము మరియు ఎత్తబడుటలో పాల్గొంటారు. క్రీస్తు రాజ్యాన్ని పొందుకుంటారు. అప్పటి నుండి శాశ్వత కాలము మహిమలో జీవిస్తారు.

వచనం 15 : మరియు ఆ దూత నాతో ఈలాగు చెప్పెను ఆ వేశ్య కూర్చున్న చోట నీవు చూచిన జలము ప్రజలను, జన సమూహమును, జనమును, ఆయా భాషలు మాటలాడువారిని సూచించును.

సాతాను బోధన చేత ఈ లోక మతము ప్రజలను మోసపుచ్చి వారిని పాలిస్తారు. ఈలోక మతము మధ్య క్రియ జరిగించుచున్న సాతాను బోధనలు అన్ని బాషలు మాట్లాడు వివిధ దేశాల్లోనికి ప్రవేశించును వారి ప్రభావము ప్రజల ఆత్మలను నాశనము చేయునంతగా హెచ్చును.

వచనం 16 : ‘‘నీవు ఈ పదికొమ్ములు గల ఆ మృగమును చూచితివే. వారు ఆ వేశ్యను ద్వేషించి, దానిని దిక్కు లేనిదానిగాను దిగంబరిగాను చేసి, దాని మాంసము భక్షించి అగ్నిచేత దానిని బొత్తిగా కాల్చివేతురు.’’

లోకంలోని దేశములన్ని అంత్యక్రీస్తుతో ఐక్యమై దానిలోని మత సంబంధ ప్రజలను చంపి నాశన పరచుదురు. అని ఈ వచనం చెప్పుచున్నది. మరొక రకముగా అది మనతో చెప్పునదేమనగా మత సంబంధ ప్రజలను ఈ లోక ప్రజలు మరియు అంత్యక్రీస్తు అసహ్యించి లోకంలోని మతములన్నిటిని భూతలము నుండి తొలగిస్తారు అని చెప్పుచున్నది. అప్పటి వరకూ అంత్యక్రీస్తుతో కలిసి ఈ లోక మత సంబంధ ప్రజలు పరిశుద్ధులను చంపినప్పటికి, వారు కూడా సాతానుచే విశాల వాదులచే నాశన పరచబడెదరు, అంతమును సాతాను లోక సంబంధ మతమును తనను దేవునిగా పిలిపించు కొనుటకు మాత్రమే ఉపయోగించెను.

వచనం 17 : ‘‘దేవుని మాటలు నెరవేరు వరకు వారు ఏకాభిప్రాయముగవారై తమ రాజ్యమును ఆ మృగమునకు అప్పగించుట వలన తన సంకల్పము కొనసాగించునట్లు దేవుడు వారికి బుద్ధి పుట్టించెను.’’

ఈ లోక ప్రజలు తమ రాజ్యము అధికారమును సాతానునకు ఇస్తారని ఈ వచనం చెప్పుచున్నది. అలాగే ఇష్టపూర్వకముగా అంత్యక్రీస్తు ముద్ర వేయించుకొనుటతో వారు అతని ప్రజలవుతారు అతని పరిచారకులుగా చెప్పుకొనుటకు గర్విస్తారు. ఆ ముద్రను వేయించుకొనుటకు తిరస్కరించిన వారిని చంపుతారు. ఏమైననూ పరిశుద్ధులను హింసించుట అనునది దేవుని అనుమతి ఉన్నంత కాలమే కొనసాగును. ఈ అనుమతించిన కాలములో, అంత్యక్రీస్తు తన హృదయపు చెడును విస్తారంగా జరిగించుచూ ఎంతో స్వతంత్రముగా దేవునికి ఆయన పరిశుద్ధులకు వ్యతిరేకి అవుతాడు.

వచనం 18 : ‘‘మరియు నీవు చూచిన ఆ స్త్రీ భూరాజులనేలు ఆ మహాపట్టణమే.’’

ఈ లోకము దాని రాజులను అదుపులోనుంచుటకు పరిపాలించుటకు ఒక క్రొత్త నిబంధనను ఏర్పరచును. ఈ లోక రాజులు ఇట్టి క్రొత్త నిబంధన మేరకే పరిపాలిస్తారని ఈ వచనం చెప్పుచున్నది. ఈ లోకం యొక్క అత్యున్నత అధికారము రాజులందరినీ నడిపించును. అది దీనిలోని భాగమువలే ఉండును. ఈ లోకము మరో విధంగా రాజులందరినీ గట్టిగా బంధించునట్లుగా నిబంధనలుండును. మరియు వారిని పరిపాలించు దేవునిగా మారును. ఆ గొప్ప పట్టణము అంత్యక్రీస్తు ఏలబోవు రాజకీయ పట్టణమును సూచించుచున్నది. ఈ లోకమును ఏలుచున్న దానిని సేవించుచూ ఇదే దేవుడు తమకిచ్చెననుకొందురు. అదే దేవుడు దానిచే పరిపాలింపబడతారు. ఎందుకనగా మనుష్యులు సాతాను పరిచారకులగుదురు కనుక వారు నాశనము చేయబడతారు.

కీర్తన 49:20లో ఘనత నొంది యుండియు బుద్ధిహీనులైనవారు నశించు జంతువులను పోలియున్నారు అని చెప్పుచున్నది అలాగే సాతాను విధానమేదో ఈ లోక ప్రజలు ముందుగానే తప్పక తెలుసుకోవాలి. ఈ యుగములో పరిశుద్ధులచే ప్రచురపరచబడుచున్న నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను ఇప్పుడే విశ్వసించాలి. దానితో సాతాను పరిచారకులగుట అను శాపము నుండి తప్పించుకొని, దానికి బదులుగా, దేవుని ప్రజలుగా ఆయన రాజ్యము యొక్క దీవెన అను వస్త్రమును ధరించుకోవాలి.