Sermons

[అధ్యాయము 17-2] <ప్రకటన 17:1-18> మన దృష్టిని ఆయన చిత్తముపై కేంద్రీకరించుట<ప్రకటన 17:1-18>


ప్రకటన 17:1-5 వరకు ఇలాగు చెప్పుచున్నది. ‘‘ఆ యేడు పాత్రలను పట్టుకొనియున్న యేడుగురు దేవదూతలలో ఒకడు వచ్చి నాతో మాటలాడుచు ఈలాగు చెప్పెను. నీవిక్కడికి రమ్ము. విస్తార జలములమీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనుపరచెదను. భూరాజులు ఆమెతో వ్యబిచరించిరి. భూనివాసులు ఆమె వ్యభిచార మద్యములో మత్తులైరి. అప్పుడతడు ఆత్మవశుడైన నన్ను అరణ్యమునకు కొనిపోగా, దేవదూషణ నామముతో నిండుకొని, యేడు తలలును పది కొమ్ములును గల ఎఱ్ఱని మృగముమీద కూర్చిండిన యొక స్త్రీని చూచితిని. ఆ స్త్రీ ధూమ్రరక్తవర్ణముగల వస్త్రము ధరించుకొని, బంగారముతోను రత్నములతోను ముత్యములతోను అలంకరింపబడినదై, ఏహ్యమైన కార్యములతోను తాను చేయుచున్న వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యముతోను నిండిన యొక సువర్ణ పాత్రను తనచేత పట్టుకొనియుండెను. దాని నొసట దాని పేరు ఈలాగు వ్రాయబడియుండెను. మర్మము వేశ్యకును భూమిలోని ఏహ్యమైన వాటికిని తల్లియైన మహాబబులోను.’’

పైనున్న భాగమందలి వేశ్య ఈ లోక మతమును సూచించుచున్నది. వారు అత్యున్నత సుఖభోగములతో కూడిన ఈలోక విషయములతోను, ప్రభువు అనుగ్రహించిన వస్తు సమృద్ధితోనూ నింపబడిరని మనకు చెప్పుచున్నది. వారు పరిమళ ద్రవ్యముతోను వివిధమైన బంగారు ఆభరణములతోను తమను తాము అలంకరించుకొని ఈ భాగములో ఆమె చేతిలో బంగారుపాత్ర ఉన్నదని మరియు అది సంపూర్తిగా ఆమె చేయు ఏహ్యకార్యములతోను, అపవిత్ర కార్యములతోను నిండినది. దీనినే దేవుడు యోహానుకు చూపించినాడు.

సాతాను మనుష్యుల ఆత్మలను నడిపించుచూ ప్రజలను ఈ లోక సంబంధమైన అన్ని విషయములలో నింపి తన వశము చేసికొనుటకు కొరుచున్నదని ఈ భాగము తెలియచెప్పుచున్నది. ఈ లోక రాజులు కూడా సాతాను వలన ఈ లోకసంబంధమైన విషయములతో మునిగిపోతారు. అలాగే ఈ భూమిపై ప్రతివారు ఈ లోక వ్యభిచార క్రియలు అను ద్రాక్షరసముతో వర్ధిల్లుతారు. 

ఈ లోక అలలచేత దాని సంతోషము చేత మరియు వస్తు సంబంధురాలు చేత ప్రజలు మత్తులైనప్పుడు సాతాను తన లక్ష్యమును సాధించును. సత్యానికి దాని లక్ష్యము దేవునివైపు చూచుట నుండి ప్రజలను అడ్డుకొనుటయే. అలాగు చేయడానికి సాతాను వారి ఆత్మలను లోక సంబంధమైన వస్తువిషయాలతో వారు మత్తులగునట్లు చేయును. మనం తప్పక ఈ సత్యాన్ని గుర్తించాలి.

ఈ లోకంలో ఏ వ్యక్తి కూడా బాహ్యసంబంధ ఉచ్చులలో చిక్కుకొనక యుండలేరు. ప్రతివారు లోక ఆశలో పడతారు. ఈ ప్రపంచ ప్యాషన్‌తో కూడిన విధానము సాతానుచే రూపించబడి నడిపించబడుతున్నాయి. ప్రతివారు ఆమె/అతడు తన సొంత అతని లేక ఆమె స్టైల్‌లో ఉన్నామని తలంచెదరు. కానీ దాని వెనుక రూపకర్త ఉన్నాడని ఆ రూపకర్త సాతానే అని తెలుసుకోవాలి. అందువలన మనం ఈ లోక వ్యాపారాలలో మునగక ఆయన వాక్యముననుసరించి జీవించుచూ దేవుని క్రియలు చేయాలి. అపోస్తులుడైన యోహాను ద్వారా దేవుడు ప్రకటనలో వాక్యం మనకు చూపినదంతయూ మనము లోకముతో సంతృప్తి పరచుకొనక దానిని వ్యతిరేకించమని మన ప్రభువు చెప్పుచున్నాడు. ఆయన మనకు చెప్పునది ఆ పరిశుద్ధులు మరొక రకంగా దేవుని గూర్చి హృదయంతో యోచించి విశ్వసించమనే.

1 యోహాను 2:15 ఇలా చెప్తుంది. ‘‘ఈ లోకమునైన లోకములో ఉన్నవాటినైననూ ప్రేమింపకుడి. ఎవడైను లోకమును ప్రేమించినయెడల తండ్రిప్రేమ వానిలో ఉండదు.’’ మన హృదయాలు లోకసంబంధమైన వాటిని ప్రేమించిన యెడల దేవుడు మన హృదయంలో నివసించడు. కానీ మన హృదయంలో నుండి లోక సంబంధమైన వాటిని త్రోసివేసిన యెడల, అప్పుడే దేవుడు మన హృదయంలో నివసించును. లోకసంబంధమైన వాటితో పూర్తిగా నింపబడిన జీవితాన్ని మనం జీవించకూడదు. మన ప్రభువు వాక్యము మీదను ఆయన ఉద్దేశ్యము మీద మాత్రమే మనం అనుకొనినప్పుడు మాత్రమే మనమాయన నడిపింపులో ఉండగలము.

మనం మన మనస్సులను ఎప్పుడైననూ మార్చుకొనవచ్చును. ఈ లోక విషయాలు మన హృదయంలో ప్రవేశించుటకు ప్రయత్నించినప్పుడు, ఎల్లప్పుడూ వాటిని మనం త్రోసివేయాలి. అప్పుడే ఈ నీఛమైన ఈ లోక విషయాలను మన హృదయంలో నుండి పారద్రోలగలము. వెంటనే మన హృదయాలు దేవుని హృదయంలో కలిసిపోవును. మన నుండి మన ప్రభువు కోరునది ఏమిటి? ఆయన మనం ఏమి చేయవలెనని కోరుచున్నాడు? అట్టి దైవ విషయాలు మన హృదయంలో ప్రవహించాలని సంకల్పిస్తే మనం తప్పక మన హృదయం నుండి లోక విషయాలను చెరిపివేయాలి.

దేవుడు మనకు అనేకమైన దీవెనలను ఇచ్చాడు. మరియు మన శేష జీవితంలో నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను ప్రపంచమంతటికి బోధించాలని మనం ఇప్పుడు గుర్తించాము. కనుక మనం మన రక్షణ కవచాలను తీసివేయక ఆయన చిత్తంపై మన దృష్టిని సారిద్ధాం. ఆత్మసంబంధ క్రియలను చింతిస్తూ, మన హృదయంలో కనబడు లోక విషయాలను పారద్రోలవచ్చును. పరిశుద్ధులమైన మనం లోక విషయాలను వదిలివేయాలి. ప్రభువు తిరిగి వచ్చు పర్యంతము మన క్రైస్తవ విశ్వాసంతో జీవించాలి. మన శేష జీవితాలలో మనం ఆయన ముందు నిలుచువరకు ఆయన మనకప్పగించిన దానిని చేయాలి. మరియు మనం ప్రభుని ప్రేమించాలి. విశ్వాసంతో జీవించాలి. ఆయన మనలను అనుమతించిన క్రియలన్నియూ చేయాలి.