Sermons

[అధ్యాయము 18-1] <ప్రకటన 18:1-24> ఆ బబులోను రాజ్యము కూలిపోయెను<ప్రకటన 18:1-24>

“అటు తరువాత మహాధికారముగల వేరొక దూత పరలోకము నుండి దిగి వచ్చుట చూచితిని. అతని మహిమ చేత భూమి ప్రకాశించెను. అతడు గొప్ప స్వరముతో ఆర్భటించి యిట్లెనెను - మహాబబులోను కూలిపోయెను కూలిపోయెను. అది దయ్యములకు నివాస స్థలమును, ప్రతి అపవిత్రాత్మలకు ఉనికి పట్టును. అపవిత్రమును అసహ్యమునైన ప్రతి పక్షికి ఉనికిపట్టును ఆయెను. ఏలయనగా సమస్తమైన జనములు మహోద్రేకముతో కూడిన దాని వ్యభిచార మద్యమును త్రాగి పడిపోయిరి. భూరాజులు దానితో వ్యభిచరించిరి, భూలోకమందలి వర్తకులు దాని సుఖభోగముల వలన ధనవంతులైరి. మరియు ఇంకొక స్వరము పరలోకములో నుండి ఈలాగు చెప్పగా వింటిని నా ప్రజలారా, మీరు దాని పాపములో పాలివారుకాకుండునట్లును, దాని తెగుళ్ళలో ఏదియు మీకు ప్రాప్తించకుండునట్లును దానిని విడిచి రండి. దాని పాపములు ఆకాశమునంటుచున్నవి. దాని నేరములను దేవుడు జ్ఞాపకము చేసికొనియున్నాడు. అది యిచ్చిన ప్రకారము దానికి ఇయ్యుడి. దాని క్రియల చొప్పున దానికి రెట్టింపు చేయుడి. అది కలిపిన పాత్రలో దానికొరకు రెండంతలు కలిపిపెట్టుడి. అది నేను రాణినిగా కూర్చుండుదానను, నేను విధవరాలను కాను, దుఃఖము చూడనే చూడనని తన మనస్సులో అనుకొనెను గనుక అది తన్ను తాను ఎంతగా గొప్ప చేసికొని సుఖభోగములను అనుభవించెనో అంతగా వేదనను దుఃఖమును దానికి కలుగజేయుడి. అందుచేత ఒక్క దినముననే దాని తెగుళ్లు, అనగా మరణమును దుఃఖమును కరువును వచ్చును. దానికి తీర్పుతీర్చుచున్న దేవుడైన ప్రభువు బలిష్ఠుడు గనుక అది అగ్నిచేత బొత్తిగా కాల్చివేయబడెను. దానితో వ్యభిచారము చేసి సుఖభోగములను అనుభవించిన భూరాజులు దాని బాధ చూచి భయక్రాంతులై దూరమున నిలువబడి దాని దహన ధూమమును చూచునప్పుడు దాని విషయమై రొమ్ములు కొట్టుకొనుచు ఏడ్చుచు అయ్యో, అయ్యో, బబులోను మహాపట్టణమా, బలమైన పట్టణమా, ఒక్క గడియలోనే నీకు తీర్పువచ్చెను గదా అని చెప్పుకొందరు. లోకములోని వర్తకులను, ఆ పట్టణమును చూచి యేడ్చుచు, తమ సరకులను అనగా బంగారు వెండి రత్నములు ముత్యములు సన్నపు నార బట్టలు ఊదారంగు బట్టలు పట్టు బట్టలు రక్తవర్ణపు బట్టలు మొదలైన సరుకులను, ప్రతివిధమైన దబ్బ మ్రానులను ప్రతి విధమైన దంతపు వస్తువులను, మిక్కిలి విలువగల కఱ్ఱ యిత్తడి యినుము చలువరాళ్లు మొదలైనవాటితో చేయబడిన ప్రతివిధమైన వస్తువులను, దాల్చిన చెక్క ఓమము ధూపద్రవ్యము అత్తరు సాంబ్రాణి ద్రాక్షా రసము నూనె మెత్తనపిండి గోధుమలు పశువులు గొఱ్ఱొలు మొదలగువాటిని, గుఱ్ఱములను రధములను దాసులను మనుష్యుల ప్రాణములను ఇకమీదట ఎవడును కొనడు. నీ ప్రాణమునకు ఇష్టమైన ఫలములు నిన్ను విడిచిపోయెను. రుచిమైనవన్నియు, దివ్యమైనవన్నియు నీకు దొరకకుండ నశించిపోయినవి. అవి యికమీదట కనబడనే కనబడవని చెప్పుకొనుచు దాని గూర్చి దుఃఖపడుదురు. ఆ పట్టణము చేత ధనవంతులైన యీ సరుకులు వర్తకులు ఏడ్చుచు దుఃఖపడుచు అయ్యో, అయ్యో, సన్నపు నారబట్టలను ధూమ్రరక్తవర్ణపు వస్త్రములను ధరించుకొని, బంగారముతోను రత్నములతోను ముత్యములతోను అలంకరింపబడిన మహాపట్టణమా, యింత ఐశ్వర్యము ఒక్క ఘడియలోనే పాడైపోయెనే అని చెప్పుకొనుచూ దాని బాధను చూచి భయక్రాంతులై దూరముగా నిలుచుచుందురు. ప్రతి నావికుడును, ఎక్కడికైననూ సబురు చేయు ప్రతివాడునూ, ఓడవారునూ, సముద్రం మీద పనిచేసి జీవనం చేయు వారందరరూ దూరముగా నిలిచి దాని దహనధూమమును చూచి ఈ మహాపట్టణముతో సమానమైనదేది అని చెప్పుకొనుచూ కేకలు వేసి తమ తలల మీద దుమ్ముపొసుకొని యేడ్చుచూ దుఃఖించుచూ అయ్యో, అయ్యో ఆ మహాపట్టణము అందులో సముద్రము మీద ఓడలు గలవారందరూ దానియందలి అధిక వ్యయంచేత ధనవంతులైరి. అది ఒక్క గడియలో పాడైపోయెనే అని చెప్పుకొనుచూ కేకలు వేయుచుండిరి. పరలోకమా, పరిశుద్ధులారా, అపోస్తులలారా, ప్రవక్తలారా, దాని గూర్చి ఆనందించుడి, ఏలయనగా దానిచేత మీకు కలిగిన తీర్పుకు ప్రతిగా దేవుడు ఆ పట్టణమునకు తీర్పు తీర్చియున్నాడు. తరువాత బలిష్ఠుడైన యొక దూత గొప్ప తిరుగటి రాతివంటి రాయి ఎత్తి సముద్రములో పడవేసి ఈలాగు మహాపట్టణమైన బబులోను వేగముగా పడద్రోయబడి ఇక ఎన్నటికిని కనబడకపోవును. నీ వర్తకులు భూమి మీద గొప్ప ప్రభువులై యుండిరి. జనములన్నియు నీ మాయమంత్రములచేత మోసపోయిరి. కావున వైనికుల యొక్కయు, గాయకుల యొక్కయు, పిల్లని గ్రోవి ఊదువారి యొక్కయు, బూరలు ఊదు వారి యొక్కయు శబ్ధము ఇక ఎన్నడును నీలో వినబడదు. మరి ఏ శిల్పమైన చేయు శిల్పి ఎవడును నీలో ఎంత మాత్రమును కనబడడు, తిరుగటి ధ్వని యిక ఎన్నడును నీలో వినబడదు. దీపపు వెలుగు నీలో ఇకను ప్రకాశింపనే ప్రకాశింపదు. పెండ్లి కుమారుని స్వరమును పెండ్లి కుమార్తె స్వరమును నీలో ఇక ఎన్నడును వినబడవు అని చెప్పెను. మరియు ప్రవక్తల యొక్కయు, పరిశుద్ధుల యొక్కయు, భూమిమీద వధింపబడిన వారందరి యొక్కయు రక్తము ఆ పట్టణములో కనబడెననెను.’’వివరణ :


వివరణ 1: అటు తరువాత మహాధికారముగల వేరొక దూత పరలోకము నుండి దిగి వచ్చుట చూచితిని. అతని మహిమ చేత భూమి ప్రకాశించెను.

తన పని చేయుటకు దేవుడు ఈ భూమికి పంపిన తన పరిచారకుల ద్వారా దేవుని ఉపదేశము యొక్క దీవెనలను, శాపమునుగూర్చి ప్రజలు వింటారని ఈ వచనము చెప్పుచున్నది. తమ పాపములన్నింటి నుండి మరియు వేదన నుండి వారు విడిపించుటకై మీరందరు ఆత్మీయ దీవెన యొక్క వాక్యము మరియు దేవుని పరిచారకుల ద్వారా బోధించబడు పరలోక వర్తమానమును విశ్వసించాలి.

వచనం 2: అతడు గొప్ప స్వరముతో ఆర్భటించి యిట్లనెను మహాబబులోను కూలిపోయెను, కూలిపోయెను. అది దయ్యములకు నివాసస్థలమును, ప్రతి అపవిత్రాత్మకు ఉనికి పట్టును, అపవిత్రమును అసహ్యమునైన ప్రతి పక్షికి ఉనికిపట్టును ఆయెను.

మహా బబులోను పడిపోయెనను ఈ వాక్యములో ప్రజాస్వామ్య లోకమును సూచించుటకు మహాబబులోను అను మాట ఉపయోగించబడెను. పాతనిబంధనలో బాబెలు గోపురము యొక్క కథను కనుగొంటాము. దేవుని సవాలు చేయుటకు కోరి తమ సొంత బలమును ఐక్యపరచుటకై మానవులచే నిర్మించబడిన గోపురము ఆ కారణముగా కూల్చబడెను. మహాబబులోనే పడిపోయెనని చెప్పుచున్న ఆ భాగములో ఈలోకము పడిపోవునని మనతో చెప్పుచున్నది. ‘‘ఈ లోకము ఇప్పుడు ఎంతో స్థిరముగా ఉందని” అది ఎట్లు పడిపోవునో అని తలంచు ప్రజలు కొందరు కలరు. కాని ఏడు బూరల తెగుళ్ళు ఒకదాని తరువాత ఒకటి క్రుమ్మరింపబడిన తరువాత బాబేలు గోపురం పడిపోయిన రీతినే ఈ లోకమును నాశనము చేస్తానని దేవుడు చెప్పుచున్నాడు.

అప్పుడు ఈ లోకం ఏడు బూరల తెగుళ్ళచేత ఎందుకు దేవునిచే నాశనపరచబడును? అది ఈ లోక ప్రజలు తమలో తాము నీరు మరియు ఆత్మమూలమైన సువార్త ద్వారా తిరిగి జన్మించినవారైన పరిశుద్ధులను చంపుటకై, అంత్యక్రీస్తుతో ఐక్యమై దాని ద్వారా అన్ని విధముల దేవునికి వ్యతిరేకులుగా నిలచిన కారణముగా నాశనమగును. ‘‘ఈ లోకం దయ్యము నివాస స్థలము” అయినందున.

ఈ పరిస్థితి ఎందుకు కలిగినది? ఎందుకు? ఎందుకనగా ఈ లోకం దయ్యముల నివాస స్థలమగునా? అంత్యకాలము వచ్చునప్పుడు అనేకులు అంత్యక్రీస్తుకు దాసులై, ఈ దుష్టులకు పరిచారకులై సాతాను ముద్రను అతని నుండి పొందిన కారణముగానే. ఈ వచనములో సాతానుకు బదులుగా డ్రాగన్‌ (భూతము) దురాత్మ శక్తులు ఇతనికి ప్రచారకులు. ఇవి ఎప్పుడు చెప్పెనో అప్పుడు ప్రపంచము అంతము దురాత్మ శక్తులకు నివాస స్థలము. దాని అర్థము ఆ ఘటసర్పము యొక్క పరిచారకుడైన అంత్యక్రీస్తు ఈ లోకమును పూర్తిగా ఆక్రమించునని అర్థము. ఏడు పాత్రల యొక్క తెగుళ్ళు దానిపై క్రుమ్మరింపబడినప్పుడు ఈ లోకము అంతా శ్రమల యొక్క కాలమును ఎదుర్కొనును. ఈ లోకము ఘట సర్పము యొక్క లోకమగును. మరియు లోకమంతయు తమకే చెందినట్లు దయ్యము వీర విహారము చేయును. మరియు ఈ లోకము త్వరగా పడిపోవును. దేవునిచే కుమ్మరింపబడిన ఏడు పాత్రల యొక్క తెగుళ్ళు వలన నాశనపరచబడును.

వచనం 3: ‘‘ఏలయనగా సమస్తమైన జనములు మహోద్రేకముతో కూడిన దాని వ్యభిచార మద్యమును త్రాగి పడిపోయిరి. భూరాజులు దానితో వ్యభిచరించిరి, భూలోకమందలి వర్తకులు దాని సుఖభోగముల వలన ధనవంతులైరి.’’

ఈ వచనము చెప్పుచున్నట్లు వాస్తవంగా ‘‘అన్ని దేశములు మహోద్రేకముతో కూడిన దాన్ని వ్యభిచార మద్యమును త్రాగి పడిపోయిరి. మరో విధంగా ఈ లోక జనము ఈ లోకమే దేవునిగా తలంచి దానియందు విశ్వాసముంచి అలాగే దాన్ని అనుసరించిరి. దేవునికంటే అధికముగా లోకమును ప్రేమించిరి. ఈ లోకము పాపమునకు మరియు దాని ప్రజలు పాప మద్యమును త్రాగుచూ జీవించిరి.

కనుక ప్రతిఫలముగా పాపము వలన లోకమునకు నాశనము కలిగెను. ఎందుకనగా జనులు లోకమును దేవునిగా ప్రేమించి అనుసరించిరి కనుక ఆయన ఏడు బూరల తెగుళ్ళ యొక్క తన శిక్షతో వారిని నశింపజేయును. దేవునిచే పంపబడి మహా తెగుళ్ళతో ఈ లోకంలో నివశించి ప్రతివారు నాశనము చేయబడుదురు. మరియు నరకములోనికి త్రోయబడుదురు.

దేవుడు తన యొక్క స్పష్టమైన హెచ్చరిక మనకు ఇచ్చుచున్నాడు. ప్రభువు అనుగ్రహించబడిన నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను ఇప్పుడు విశ్వసించిన ప్రతివారు అంతఃకాలమున ఏడు బూరల తెగుళ్ళను ఎదుర్కొందురు. ఆయన హెచ్చరికలను ఎదిరించు దేవునికి వ్యతిరేకంగా నిలచుచూ ఈ సువార్తయందు నీవు విశ్వాసముంచకపోయిన యెడల నీవు ఆ ఏడు బూరల తెగుళ్ళ ద్వారా శిక్షింపబడుటయే కాక నీవు నిత్యనరకాగ్నిలో పడవేయబడుదువు అని కూడా నీకు తప్పక గుర్తుంచుకొనవలెను.

కాబట్టి ప్రజలు తప్పనిసరిగా గ్రహించవలసినది ఏమనగా వారు నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను ఇప్పుడు విశ్వసించినచో వారు దేవుని గొప్ప మరియు భయంకరమైన తెగుళ్ళ నుండి తప్పించుకొనబడుదురు. సాధ్యమైనంత త్వరలో వారు తప్పక సత్యసువార్త అయిన నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను విశ్వసించుటకు తిరుగవలెను.

లోక వర్తకులు రాజులలో అనేకులు దానియొక్క వస్తు సంపద ద్వారా గొప్ప ధనవంతులైరి దేవునిచేత పంపబడిన గొప్ప తెగుళ్ళ వలన ఈ లోకము వణుకుచూ వారు చూచినప్పుడు వారందరు వారి యేడ్పును, విలపించుటను దుఃఖమును, రోదనతోను అంతమగును.

కనుక ప్రతివారికి నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను బోధించుటకు మరువరాదు. మరియు క్రొత్త వెయ్యేండ్ల రాజ్యమును చూచుచూ మనము జీవించవలెను. మహాశ్రమల నుండి ప్రతివారు తప్పించబడుటకై మనం ప్రతివారి నీరు మరియు ఆత్మమూలమైన సువార్త వైపు నడిపింపవలెను.

వచనం 4: మరియు ఇంకొక స్వరము పరలోకములో నుండి ఈలాగు చెప్పగా వింటిని నా ప్రజలారా, మీరు దాని పాపములో పాలివారుకాకుండునట్లును, దాని పాపములు ఆకాశమంటుచున్నవి. దాని తెగుళ్ళలో ఏదియు మీకు ప్రాప్తించకుండునట్లును దానిని విడిచి రండి.

“మీరు దాని పాపములో పాలివారు కాకుండునట్లు దాని తెగుళ్ళలో ఏదియూ మీకు ప్రాప్తించకుండునట్లు విడిచి రండి తన పరిశుద్ధుల కొరకు దేవుడు మాట్లాడినవి ఈ వాక్యము మరొక విధంగా అంత్యకాలములో పరిశుద్ధులు ఈ లోకమునకు చెందక దాని బానిసలుగా జీవించరాదని తెలియజేయుచున్నది. ఇంతకు మునుపే పరిశుద్ధులై యున్న అంత్యకాలములో లోక పాపములో వారు పడినచో దేవుని తీర్పు అయిన భయంకరమైన తెగుళ్ళ నుండి తప్పించుకొనలేరు. పరిశుద్ధులైన వారి కందరికి చెప్పుచున్నది. ఏమనగా లోకమునకు బానిసలైన ఉగ్రత చేత కప్పబడకుండా ఉండవలెను.

వచనం 5: ‘‘దాని పాపములు ఆకాశమునంటుచున్నవి దాని నేరములను దేవుడు జ్ఞాపకము చేసికొనియున్నాడు.’’

దేవుడు వాస్తవముగా ఈ లోక పాపక్రియలను జ్ఞాపకము చేసుకొనుచూ దాని తీర్పు దినము కొరకు ఎదురు చూచుచున్నాడు. అంత్యక్రీస్తు హఠాత్తుగా ప్రత్యక్ష దినము తరువాత దేవుడు నిర్ణయ ప్రకారముగా లోకమును నాశనము కమ్మును. అయినప్పటికిని ఈ లోకము నాశనము కాదని కొందరు ప్రజలు విశ్వసిస్తున్నారు. కాని అంతము నిశ్చయముగా సంభవించును.

ఏది ఏమైన వారు యోచించిన విధముగా ఈ లోకం అంతముకాకపోయినను, కాని దేవునిచే పంపబడిన ఏడు బూరలు మరియు ఏడు పాత్రల తెగుళ్ళచేత హఠాత్తుగా నాశనమగును. అంత్యకాలము సంభవించినందున లోకమంతయు శ్రమలను కలిగించి నశింపచేయును. అంతము వరకు మనము మన విశ్వాస జీవితంలో మెళకువ కలిగి క్రీస్తు రాజ్యము వాస్తవముగా వచ్చునను విశ్వాసమును స్థిరముగా పట్టుకొని జీవించవలెను.

దేవుడు తన దూతలకు ఆ ఏడు బూరలను ఈ భూమిపై కుమ్మరించమని ఆజ్ఞాపించక ముందు లోకములోని పాపులు త్వరితంగా విస్తరించినను ఇది దేవుని తీర్పును పొందుదాని కంటే అధికము. ఇందు మూలమున దేవుడు వారి పాపమును జ్ఞాపకమునకు తెచ్చుకొని వారి గొప్ప నాశనము ఇక ఉండదు. అంత్యక్రీస్తు మరియు లోకజనులు, దేవుని ప్రజలను అధికంగా హింసించెదరు. వారి (పరిశుద్ధులు) విశ్వాసమును విడువమని శపింతురు. ఇవన్నియు జరుగుచున్నప్పుడు ఈ లోకము ఏడు బూరల తెగుళ్ళను ఎదుర్కొనును.

వచనం 6 : ‘‘అది యిచ్చిన ప్రకారము దానికి ఇయ్యుడి. దాని క్రియల చొప్పున దానికి రెట్టింపు చేయుడి. అది కలిపిన పాత్రలో దాని కొరకు రెండంతలు కలిపిపెట్టుడి.’’ 

“అది ఇచ్చిన ప్రకారము దానికియ్యుడి” అని ఇక్కడ వ్రాయబడినది. ఇక్కడ ‘‘అది” అను మాట ఎవరిని గూర్చినది? ‘‘అది” అనగా ఈ లోకమును సూచించును. ఎట్లనగా అంత్యక్రీస్తు సాతాను మరియు పాపులు దానిలో నివసించుచున్నారు. వారు పరిశుద్ధులను హింసించి, బాధించి శ్రమ పరచినట్టుగానే వారికిని దేవుడు చెల్లించునని కూడా చెప్పుచున్నది.

వచనం 6లో ‘‘అది కలిపిన పాత్రలో దానికి రెండింతలు కలిపిపెట్టుడి” అని కూడా చెప్పబడుచున్నది. సాతాను యొక్క అబద్ధమును ప్రచురపరచుచూ ప్రజలను నరకమునకు నడిపిన ఈ లోకము యొక్క తప్పుడు మతములన్నింటిని శిక్షించుమని దేవుడు తన దూతలకు ఇచ్చిన ఆజ్ఞ ఇదే అనగా సాతాను బోధనలతో దేవుని వాక్యమును కలిపి తప్పుడు బోధ చేయుచున్న పాపముకొరకు ఈ దినాలలోని క్రైస్తవ్యము పైకి కోపము, శిక్షను దేవుడు పంపుతాడని దీని అర్థము కాబట్టి నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను విశ్వసించని క్రైస్తవులు కూడా లోకస్థుల వలే పాపమునకు తగిన శిక్షను అనుభవిస్తారు.

వచనం 7: ‘‘అది నేను రాణిగా కూర్చుండుదానను, నేను విధవరాలను కాను, దుఃఖము చూడనే చూడనని తన మనస్సులో అనుకొనెను గనుక, అది తన్ను తాను ఎంతగా గొప్ప చేసికొని సుఖభోగములను అనుభవించెనో అంతగా వేదనను దుఃఖమును దానికి కలుగజేయుడి.’’

ఇట్టి గర్వపు ప్రజల యొక్క పాపమునకు ప్రతిగా వారికి దుఃఖమును, వేదనను కలుగజేయమని దేవుడు సెలవిచ్చుచున్నాడు. తిరిగి జన్మించని వారైన అన్ని మతము ప్రజలను, అవిశ్వాసులను, లోకస్థులను వారి పాపము గూర్చి తెలిసికొని దేవుడు శిక్షించును.

అయిననూ వారు గర్వంగానే ఉంటారు. తమలో ఇలాగు చెప్పుకుంటారు. ‘‘నేను రాణిగా కూర్చుందును. నేను విధవరాలను కాను, దుఃఖమును చూడనే చూడను.’’ కాబట్టి దేవుడు వారిని నాశనపరచు తెగుళ్ళను వారిపైకి రప్పించును. తనకున్న లోక సంపదంతయూ కోల్పోయి బాధపడతారు. అంత్యకాలములో తాము ప్రేమించిన వారిని కూడా పోగొట్టుకొని దుఃఖిస్తారు.

వచనం 8: ‘‘అందుచేత ఒక్క దినముననే దాని తెగుళ్ళు అనగా మరణమును దుఃఖమును కరువును వచ్చును. దానికి తీర్పు తీర్చుచున్న దేవుడైన ప్రభువు బలిష్ఠుడు గనుక అది అగ్నిచేత బొత్తిగా కాల్చివేయబడును.’’

ఏడు తెగుళ్ళు ఆరంభించగా మరణపు తెగులు దుఃఖపడును కరువులును ఒకే దినమున ఈ లోకమునకు వచ్చును. కనుక అంత్యక్రీస్తు అతని అనుచరులు నిత్య నరకాగ్నిలో కాల్చబడునట్లు శిక్షింపబడెదరు.

వచనం 9 : ‘‘దానితో వ్యభిచారము చేసి సుఖభోగములను అనుభవించిన భూరాజులు దాని బాధ చూచి భయక్రాంతులై దాని దహనధూమమును చూచునప్పుడు తమ లోకము అగ్ని కీలచే కాల్చబడి”.

భూకంపము వలన ఏడు పాత్రల తెగుళ్ళ వలననూ నాశనము చేయబడుటను ఈ లోక ప్రజలు రాజులు కన్నులారా చూచి సాక్ష్యమిస్తారు. కాబట్టి ఈ లోక రాజులు ఏడ్చి తమకు కలిగిన నష్టాన్ని బట్టి రొమ్ము కొట్టుకొనుచూ రోధిస్తారు.

వచనం 10 : ‘‘దూరమున నిలువబడి దాని విషయమై రొమ్ము కొట్టుకొనుచు ఏడ్చుచు అయ్యో, అయ్యో, బబులోను మహాపట్టణమా బలమైన, ఒక్క గడియలోనే నీకు తీర్పువచ్చెను గదా అని చెప్పుకొందురు.’’

ఈ లోకము నాశనమై, భయము చేత పట్టబడునని విశ్వసించనివారు, తమ కన్నుల యెదుట ఈ లోకము ముక్కచెక్కలుగా విడిపోవుటను వాస్తవంగా చూచినప్పుడు భయపడతారు. తన మరణీయతతో శోభిల్లుచున్న లోకము పైకి, ఒక దినమున దేవుని ఉగ్రత దిగివచ్చును. అది ఒక్కసారే కూలిపోవును.

వచనము 11-13 : ‘‘లోకములోని వర్తకులను, ఆ పట్టణమును చూచి యేడ్చుచు, తమ సరుకులను అనగా బంగారు వెండి రత్నములు ముత్యములు సన్నపు నార బట్టలు ఊదారంగు బట్టలు పట్టుబట్టలు రక్తవర్ణపు బట్టలు మొదలైన సరుకులను, ప్రతి విధమైన దబ్బమ్రానును ప్రతివిధమైన దంతపు వస్తువును మిక్కిలి విలువగల కఱ్ఱ యిత్తడి యినుము చలువరాళ్ళు మొదలైనవాటితో చేయబడిన ప్రతివిధమైన వస్తువును, దాల్చిన చెక్క ఓమము ధూపద్రవ్యము అత్తరు సాంబ్రాణి ద్రాక్షారసము నూనె మెత్తనిపిండి గోధుములు పశువులు గొఱ్ఱెలు మొదలగువాటిని, గుఱ్ఱములను రధములను దాసులను మనుష్యుల ప్రాణములను ఇకమీదట ఎన్నడునుకొనడు.’’

లోకము నాశనమగుచుండగా వీటిని ఎవడు కొనగలడు? లేక అమ్మగలడు? ఈ లోకములోని వర్తకులు కూడా ఈ లోకంలో తమకు సంభవించిన నష్టమును గూర్చి ఏడ్చుచూ, దుఃఖపడుదురు ఏడు పాత్రల తెగుళ్లను దేవుడు కుమ్మరించునప్పుడు, లోకములో ఎవరైనా ఏదైనా కొనగలరా! ఈ లోకము మరల నిర్మించబడదు, నాశనమైన ఈ లోకంపై క్రీస్తు రాజ్యము మాత్రమే నిర్మించబడును.

అంత్యదినముల వరకు ప్రజలు తమను తాము సుఖభోగములను ఆరాధించనట్టు అత్యంత ఖరీదైన సరుకుల పట్టిని ఇక్కడ చూస్తాం. కానీ ఇవన్నియూ ఒక్క దినముననే పనికి రాకుండా పోతాయి. అట్టి లోక విషయాలను ఎవరు కోరుకొనరు ఇవన్నియూ ఈలోకమంతయు చేయువ్యాపారములే ఒక్క రూపాయి కొరకు ఆత్మలను అమ్ముకొనుటకు వెనుకాడక తమ ధనకాంక్షచేత ప్రతి వస్తువును ఊహాతీతము అగునట్లు ఈ లోక మతము చేయును.

వచనము 14-18 : ‘‘నీ ప్రాణమునకు ఇష్టమైన ఫలము నిన్ను విడిచిపోయెను, రుచ్యమైనవన్నియు దివ్యమైనవన్నియు నీకు దొరకకుండ నశించిపోయినవి అవి యికమీదట కనబడనే కనబడవని చెప్పుకొనుచు, దాని గూర్చి దుఃఖపడుదురు. ఆ పట్టణము చేత ధనవంతులైన యీ సరకుల వర్తకులు ఏడ్చుచు దుఃఖపడుచు అయ్యో, అయ్యో, సన్నపు నారబట్టను ధూమ్రరక్తవర్ణపు వస్త్రమును ధరించుకొని, బంగారముతోను రత్నములతోను ముత్యములతోను అలంకరింపబడిన మహాపట్టణమా, యింత ఐశ్వర్యము ఒక్క గడియలోనే పాడైపోయెనే అని చెప్పుకొనుచూ దాని బాధను చూచి భయక్రాంతులై దూరముగా నిలచుచుందురు. ప్రతి నావికుడును, ఎక్కడికైననూ సబురు చేయు ప్రతివాడునూ, ఓడవారునూ, సముద్రం మీద పనిచేసి జీవనం చేయు వారందరునూ దూరముగా నిలిచి దాని దహనధూమమును చూచి ఈ మహాపట్టణముతో సమానమైనదేది అని చెప్పుకొనుచూ కేకలు వేసి కాబట్టి ప్రజలు ఇక ఎన్నడూ తమ సంపదను చూచిలేరు.’’

ప్రపంచం ముక్క చెక్కలుగా విడిపోవుట చూచి ఈ లోక వరక్తం ద్వారా ధనవంతులైనవారు ఏడ్చెదరు. లోకము నాశనమైనప్పుడు నిరాశతో దుఃఖపడుచూ, వారు కూడా లోకంతో పాటుగా నశించెదరు. మరియు వారు కూడబెట్టిన సంపద కేవలము ఒక్కరోజునే మాయమగును.

లోక ధనంపై నిర్మించబడిన మతము కూలును. అయ్యో, అయ్యో అనుచూ ఈ లోక ప్రజలు రోదన చేస్తారు. ఈ లోకమునందు అటు ఇటు తిరుగులాడు నావికులు అంతర్జాతీయ వర్తకులు కూడా దుఃఖిస్తారు. ఈ దినములలోనున్న నాగరికతను ఏ మనుష్యజాతి ఇంతకంటే గొప్పగా మంచిగా నిర్మించలేదని ఈ ప్రజలు నిరాశతో కేకలు వేస్తారు.

వచనం 19: తమ తలలమీద దుమ్ముపోసుకొని యేడ్చుచూ దుఃఖించుచూ అయ్యో, అయ్యో ఆ మహాపట్టణము. అందులో సముద్రము మీద ఓడు గలవారందరూ దానియందలి అధిక వ్యయం చేత ధనవంతులైరి. అది ఒక్కగడియలో పాడైపోయేనే అని చెప్పుకొనుచూ కేకలు వేయుచుండిరి.

ఈ లోకముపైకి పంపబడిన ఏడు పాత్రల తెగుళ్ళను చూచుచూ ఈ లోకము ఎన్నటికి నశించదని తలంచినవారు మహా దుఃఖములో ప్రలాపించెదరు. అప్పటికి ఈలోకంలో జీవించియున్నవారు దేవునిచే పంపబడిన ఏడు పాత్రల తెగుళ్ళ వలన ఒక్కసారిగా నాశనమగుటకు సాక్షులై ఏడ్చుచూ ప్రలాపిస్తారు. కానీ వారి ఏడ్పు నిష్ఫలమే. ఎందుకనగా అప్పటికే ఈ లోకములోని సమస్తము నాశనమాయెను. అప్పటికి ఏడ్చుటకు వారికి శక్తి ఉన్నయెడల అది తమ ఖర్మను బట్టి వారు దుఃఖించుటచే ఎందుకనగా తమ పాపమును బట్టి వారు నరకమునకై సిద్ధపరచబడినవారు. తమ నిత్యనాశనమును తప్పించుకొనుటకు నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను వారు విశ్వసించాలి.

వచనం 20 : పరలోకమా, పరిశుద్ధులారా, అపోస్తులలారా, ప్రవక్తలారా, దానిగూర్చి ఆనందించుడి. ఏలయనగా దాని చేత మీకు కలిగిన తీర్పుకు ప్రతిగా దేవుడు ఆ పట్టణమునకు తీర్పు తీర్చియున్నాడు.

ఏడు బూరల తెగుళ్ళు పంపబడినప్పుడు ఎత్తబడిన పరిశుద్ధులు మేఘాలలో ఆనందించెదరు. ఎందుకనగా ఈ తీర్పు తెగుళ్ళతో దేవుడు ప్రతీకారము చేసియున్నాడు. భయంకరమైన మహా తెగుళ్ళను ఆయన తన శత్రువుపై కుమ్మరించుట సరియైనదే.

వచనం 21 : తరువాత బలిష్ఠుడైన యొక దూత గొప్ప తిరుగటి రాతి వంటి రాయి ఎత్తి సముద్రంలో పడవేసి - ఈలాగు మహాపట్టణమైన బబులోను వేగముగా పడద్రోయబడి ఇక ఎన్నటికిని కనబడకపోవును.

గొప్ప తిరుగటిరాయి సముద్రములో పడద్రోయబడగా ఈ లోకము ఇక ఎన్నటికి కనబడదని దేవుడు చెప్పుచున్నాడు. ఈ విశ్వమంతటిని దానిలోని సమస్తమును మన ప్రభువు నూతన పరచును. ఈ భూమిని క్రీస్తు రాజ్యముగా మార్చుట అను తన పనిని ఆయన నెరవేర్చును.

వచనం 22 : ‘‘నీ వర్తకులు భూమి మీద గొప్ప ప్రభువులై యుండిరి. జనములన్నియు నీ మాయమంత్రముచేత మోసపోయిరి. కావున వైనికుల యొక్కయు, గాయకుల యొక్కయు, పిల్లనగ్రోవి ఊదువారి యొక్కయు, బూరలు ఊదు వారి యొక్కయు శబ్ధము ఇక ఎన్నడును నీలో వినబడదు.’’

ఏడు బూరల తెగుళ్ళు సమాప్తమైనప్పుడు ఇంతకు మునుపు ఈ లోక ప్రజలు విన్న సంగీతము ఇకను వినబడదు లేదా శిల్పి యొక్క స్తుతి ధ్వని కూడా వినబడదు.

వచనం 23: ‘‘దీపపు వెలుగు ఇకను నీలో ప్రకాశింపనే ప్రకాశింపదు. పెండ్లి కుమారుని స్వరము మరియు పెండ్లి కుమార్తె స్వరము నీలో వినబడవు. నీ వర్తకులు భూమి మీద గొప్ప ప్రభువులై యుండిరి. జనములన్నియూ నీ మాయమంత్రముల చేత మోసపోయిరి.’’

ఏడు పాత్రల తెగుళ్ళు పూర్తయినప్పుడు ఈ లోకము మరి ఎన్నడూ దీపపు కాంతిని చూడదు లేదా పెండ్లి కుమారుడు స్వరమును గాని పెండ్లి కుమార్తె స్వరముగాని వినదు లోకము అంతమైనందున ఈ లోకంలో మోసక్రియలకు కారకులు కూడా నశించెదరు.

వచనం 24: ‘‘మరియు ప్రవక్తల యొక్కయు, పరిశుద్ధుల యొక్కయు, భూమి మీద వధింపబడిన వారందరి యొక్కయు రక్తము ఆ పట్టణములో కనబడెననెను.’’

ఈ భూమిపైన దేవుడు ఏడు పాత్రల తెగుళ్ళను కుమ్మరించుటకు కారణము సాతాను పరిచారకులు ఆయన ప్రవక్తల మరియు పరిశుద్ధుల రక్తమును ఒలికించిరి.