Sermons

[అధ్యాయము 18-2] <ప్రకటన 18:1-24> ‘‘నా ప్రజలారా దాని తెగుళ్ళలో ఏదియు మీకు ప్రాప్తించకుండునట్లు దానిని వి<ప్రకటన 18:1-24>


18వ అధ్యాయంలో దేవుడు మహా పట్టణమైన బబులోనును తన గొప్ప తెగుళ్ళతో నాశనం చేస్తానని చెప్పుచున్నాడు. ఎందుకనగా అంత్యకాలంలో దేవుని యెదుట ఈ లోకము బహు పాపములోకి మురికిలోకి తప్పిపోవును. కనుక దేవుడు దానిని నాశనం చేయుట తప్ప మరేమియూ చేయలేడు. ఆయనే దానిని నియమించెను. గనుక ఆయనే గొప్పదైన, నాశనం చేయు తెగుళ్ళతో ఈ భూమిని అంతము చేయును. కాబట్టి ఈ లోకము పూర్తిగా పాడైపోవు వరకూ నాశనం చేయబడుటకు అప్పగింపబడెను.

దేవుడు ఈ లోకమును నాశనం చేయుటకు గల కారణం అసలైనదేదనగా, ఆయన తన ప్రవక్తలు మరియు పరిశుద్ధుల రక్తము చిందింపబడుటను చూచెను. ఈ లోకము దేవుడు తనకిచ్చిన ప్రతివాటితోనూ ఎన్నో ఘోర పాపములను చేసెను గనుక అది దేవుడు ఓర్చుకోలేనంత మురికిగా మారెను. దేవుడు సృజించిన గ్రహములన్నిటిలోనూ భూమి అతి అందమైన గ్రహము. ఎందుకనగా దేవుడు తానే అత్యంతాసక్తితో దానిపై పనిచేసెను. మరియు దేవుని ప్రణాళికలు, యేసుక్రీస్తు నందు పాపులను రక్షించుటను తన క్రియలను ఈ గ్రహముపైనే నెరవేర్చెను.

అంతేకాక, దేవుడు ఈ లోకమును తానెట్లు నాశనం చేయవలెనో, క్రీస్తు రాజ్యము ఏలాగు తేవలెనో అనువాటిని ముందుగానే వ్యూహపరచెను. అన్నిరకముల మురికితోనూ ఈ లోకము నిండినప్పుడు, దేవుడు తన దూతలచే ఏడు పాత్రల తెగుళ్ళను పంపి దానిని నాశనం చేయును. తరువాత ఆయన ప్రతిదానిని నూతన పరచి, తన పరిశుద్ధులను తన నూతన లోకములో పరిపాలించునట్లు చేయును.పడిన ఆ బబులోను పట్టణము


భూలోక రాజులు ఈ లోక సంబంధ వ్యభిచార క్రియలను జరిగించి. దాని సుఖభోగములో జీవించిరి. ప్రతి వ్యాపారీ దేవుడు తమకిచ్చిన వాటన్నిటిని కొనుచూ, అమ్ముచూ వాటిలోనే మునిగియుండగా, తమ ఆశలోనే దేవుని వెదకుటలో తప్పిపోయిరి. దేవుడు ప్రతిదానిని సమస్తమును నాశనం చేయును. భవనము, మతము, మతములో కనబడు వ్యాపారము, మతము ద్వారా ధన సమృద్ధితో నిండిన వారిని ఇవన్నియూ దేవునిచే ధ్వంసం చేయబడును.

దేవుడు ఈ భూమిపైనున్న ప్రతి భవనమును వణికించి ఏ భవనమును వదలక, సమస్తమును ప్రజల నుండి అడవుల వరకు మరియు వృక్షమును తన అగ్నితో నాశనపరచును. ఆ విధంగా ఈ లోకములోని సమస్తము ధ్వంసం చేయబడగా, ప్రజలు ఏడ్చి ప్రలాపించెదరు. ప్రత్యేకంగా దేవుడు మత సంబంధంగా ధన సమృద్ధి చేసుకొన్న వారిని నాశనం చేయును. దేవుడు తానే నిర్మించిన ఈ అందమైన భూమిని నిశ్చయముగా నాశనపరచునని మనం ప్రాముఖ్యంగా తెలిసికోవాలి.

ఆ సమయంలో మొదటి పునరుత్థానములో పాలు పంచుకొనినవారైన తిరిగి జన్మించిన పరిశుద్ధులు వెయ్యేండ్ల పాటు ఈ భూమిపై అనుమతించును. ఈ భూమిపైనున్నప్పుడు తమ విశ్వాసమును కాపాడుకొనుటకై హతసాక్షులైన మరియు నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను ప్రచురపరచినందుకు ప్రతిగా ఆయన వారికి తన రాజ్యము నిచ్చును. వెయ్యేండ్లపాటు పది పట్టణములపై ఐదు పట్టణములపై రెండు పట్టణములపై వారు పరిపాలించుటకు దేవుడు అనుమతిచ్చును తరువాత శాశ్వత కాలము వారు జీవించుటకై ఆయన తన నూతన భూమి ఆకాశముననుగ్రహించును.

అలాగైతే విశ్వమంతటిలో అతి అందమైన ఈ భూమిని దేవుడు ఎందుకు నాశనం చేయబోతున్నాడు? ఈ భూగ్రహము మీద మాత్రమే నదులలో చేపలు ఈదగలవు అడవులలో క్రూరమృగాలు సంచరించగలవు. మానవాళి జీవించగలదు. కానీ పాపము అధికంగా విస్తరించిన ఈ లోకమును దేవుడు ఏ మాత్రము సహించలేనందున తన తెగుళ్ళు చేత ఆయన ఈ లోకమును సమూలంగా పాడుచేయుటకు అనుమతించును.

రక్షించబడిన వారు తప్ప భూమిపై నివసించుచున్నప్రతివారు ఏడు పాత్రల తెగుళ్ళ వలన నాశనము చేయబడుదును. అంత్యకాలమందున్న నీతిమంతులందరు హతసాక్షులై ఈ లోకముచే హింసించబడి అణగద్రొక్కబడుదురు. కాబట్టి ఇట్టి దుష్టక్రియలకు బదులుగా దేవుడు ఈ లోకముపై తన ఉగ్రత కుమ్మరించును. ఈ కాలము వచ్చినప్పుడు ప్రజల ఆత్మతో ఎవరు వ్యాపారము చేయుదురో అట్టి మత నాయకులు, వ్యాపారులందరూ నాశనపరచబడుదురు. తిరిగి జన్మించినవారై మత నాయకులుగా నటించిన వారిని దేవుడు చంపుట మాత్రమే కాక, సాతానుతో పాటుగా వారిని అగ్నిగంధకములోనికి సాతానుతో కూడా ఆయన వారిని త్రోయును.

దేవుడు నిశ్చయంగా ఈ లోకమును నాశనము చేయును. అలాగే ఇసుమంతైన అనుమానము లేకుండా ఈ లోకము నాశనమగునని మనము గుర్తెరిగి విశ్వసించవలెను. అన్నిరకములైన గొప్ప విషయమును గూర్చి తమను హెచ్చరించుకొనుచు తమ మతముతో ప్రజల ఆత్మలను రద్దీగా ఉంచు వారిని దేవుడు తప్పక చంపును. మరియు దేవుని తెగుళ్ళు అతి సమీపంగా ఉన్నప్పటికి ప్రజలు ఇంకను వ్యతిరేక స్వభావము కలిగి తమ హృదయములను కఠినపరచుకొందురు. ఈ లోకములోని మత నాయకులు ఒక్కసారి గమనించినట్లయితే వారు దేవుని యెదుట నీతిగా ప్రవర్తించువారైనట్లు వారందరూ గర్విష్ఠులు కారా? ఆ ప్రజలు చేయు క్రియలను దేవుడు వాస్తవముగా అంగీకరించునా?

ఈ ప్రజల పాపము కొరకు దేవుడు ఈ లోకమును నాశనం చేస్తానని చెప్పిన యెడల ఇలాగున జరుగునని దేవుడు చెప్పినవన్నీ నెరవేరుచున్న ప్రకారమే ఇదియు జరుగునని మనం విశ్వసించాలి. మరియు మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. నేను ఈ విధంగా చెప్పుట లేదు ఇతర నాయకులైన వారి స్వంత సిద్ధాంతమును లేవనెత్తు వేదాంతమును పలుకుచూ వచ్చును కానీ నేను వాటిని గూర్చి మాట్లాడను. ఎందుకనగా దేవుడు వాక్యమునందు చెప్పినట్లు మనము విశ్వాసముంచాలి. అదేదనగా సజీవమైన దేవుడు తప్పక ఈ లోకమును మహాతెగుళ్ళ ద్వారా నాశనము చేయును.అతి త్వరలో నాశనమగు ఈ లోకముతోనే మనలను మనము సంతృప్తి పరచుకొనకూడదు.


అతి త్వరలోనే నాశనమగు ఈ లోకసంబంధ వస్తు సమృద్ధిని సమకూర్చుకొనుటతో కూడిన ఆలోచనతో మనము నిండియుండరాదు. దేవుడు మనకు అనుగ్రహించిన వాటితో మనము తృప్తిచెంది వాటి ద్వారా దేవుడు సంతోషించునట్లు ఉపయుక్తంగా ఇతరులతో పంచుకొనవలెను. సువార్తను బోధించుట కొరకు దేవుడు వారికి ఇచ్చిన దానిని నమ్మకమైనదిగా నడిపించుచు జీవించవలెను. దేవుడు తప్పక ఈ లోకమును నాశనము చేయునని నమ్మి ఈ లోక ఆశలతో తికమక పడరాదు.

ఈ లోక ఆస్తి, అంతస్తులు శాశ్వత కాలముండునని ఆలోచించుచు మనలను బుద్ధిహీనులను చేసుకొనకూడదు. అన్ని మతాల నాయకులను మరియు వారి అనుచరులను దేవుడు భయకంపితులను చేయునని తెలుసుకొనిన మనం ప్రభువు రాకడదినం కొరకు ఎదురుచూచుచూ జీవించవలెను. కాకపోయినట్లయితే ఈ లోకములో అంతమగుదుము? ఈ లోకము త్వరలోనే నాశనమగును. అలాగే తన సొంత నాశనమును ఎదుర్కొనబోవు ఈ లోకములో పడిపోకుండుటకు వాస్తవముగా భూమియను ఈ గ్రహము నాశనమగునని విశ్వసించాలి.

దేవుడు ఆ సమయమందు సజీవుడైన తరుణము ఆసన్నమైన్నప్పుడు ఆయన పలికినవన్నియు నెరవేర్చును. అది సత్యమైన క్షణంలో తిరిగి జన్మించిన వారు కూడా అపరిపూర్ణ విశ్వాసము గలిగియుండగా మనము అపనమ్మకము లేక తప్పక విశ్వసించవలెను. మరియు మనమందరము మరొకసారి మేల్కొలుపు పొందవలెను. అతి త్వరలో మన హృదయములను జారనియ్యకూడదు. కానీ బదులుగా దేవుని వాక్యము యెడల మన విశ్వాసమును లొంగిపోనిదియు కదలించబడనిదియునైన జీవితం జీవించవలెను. మన హృదయము ఒకవేళ బలహీనము అయినా కానీ మనము బలమైన విశ్వాసముతో జీవించవలెను.

దేవుడు ఈ లోకమునకై జరిగించబోవు క్రియలు మనకు ఆశ్చర్యక్రియలు దేవుడు ఈ లోకమును నాశనపరచకుండానే దాని స్థానంలో క్రీస్తురాజ్యమును క్రొత్తదిగా స్థాపించినట్లైన నీతిమంతులు బహుగా నిరుత్సాహపడతారు. ఇందువలననే దేవుని ప్రణాళికలు ఆశ్చర్యకరము. మరియు నీతిమంతులైన పరిశుద్ధులకు నిరీక్షణాధారము.

అవిశ్వాసులు తమ తిరుగుబాటు ధోరణిలోనే కొనసాగుచున్ననూ ఈ భూమిపై సంతోషముతో జీవించి తరువాత మనలో వారు కూడా పరలోకములో ప్రవేశించినట్లైన అది మనకు ఎంతో అసహ్యకరము. అది జరుగుటకు దేవుడు అనుమతించడు. నీతిమంతులను హింసించి తమ అబద్ధముతో వారిని బాధించి, పరిశుద్ధుల రక్తమును చిందించిన వారికి తీర్పుతీర్చివారిని నాశనం చేతునని దేవుడు చేసిన వాగ్ధానము కేవలము న్యాయమైనదియు సరియైనదియునై యున్నది.

ఈ లోకంలో పాపులకు దేవుని తీర్పు లేకుండిన యెడల అన్నిరకముల బాధలు, కష్టమును ఎదుర్కొనుచూ వాటిలో ప్రభుని కొరకు తమను తాము భద్రపరచుకొనుచూ జీవించిన నీతిమంతులకు అది అయిష్టమైనదిగా నుండదా? కాబట్టి దేవుడు ఈ లోకమునకు తీర్పు తీర్చుననునది కేవలము సరియైనదే. ఈ లోకము నోవాహు కాలములోనున్నట్లుగా మారినప్పుడు దేవుడు నిశ్చయముగా ఈ లోకమును బోర్లదోసి నాశనపరచును. ప్రభువునందు మనము విశ్వసించిన కారణమున మనం ఈ లోక ప్రజలను బట్టి మత్సరపడకూడదు. ఆయన ఈ లోకమునకు తీర్పు తీర్చి సాతానును, అంత్యక్రీస్తును అతని అనుచరులను నరకాగ్నిలోనికి త్రోసివేస్తానని ప్రభువు చెప్పెను గనుక మనమందరము భద్రముగా కనిపెట్టవలెను.

ఈ లోకము నాశనపరచబడుటకు కేవలము నిమిష మాత్రపు దూరముననున్నది. అవన్నియూ దేవుని వాక్యము యొక్క ప్రవచనానుసారమే. ఈ భూమి అంతటిలోనూ, మనము ఇప్పటికే అంత్యకాల తెగుళ్ళు త్వరగా సంభవించుచున్నట్లు అనేక సూచనలను చూస్తాం. 

ఎల్‌నినో వంటి అసాధారణ వాతావరణమును మాడ్‌కౌ వ్యాధి వంటి క్రొత్త వ్యాధులు ప్రస్తుత లోకమును పీడించుచున్నది. చికిత్సలేని వ్యాధులు మానవులకు అంతుబట్టనివై లోకమును కబళించుచున్నది. అవేవనగా అతిపెద్దవైన, మునుపెన్నడూ సంభవించని వైపరీత్యాలు గొప్ప తెగుళ్ళు సమూల నాశనం చేయు భూకంపాలు భూమి అంతటిని కొట్టుచున్నది.

ఈ సంగుతులన్నీ సంభవించుచుండగా దేవుడున్నాడని మనం నమ్మి దేవుడు తీర్పు తీర్చి కేవలము తమ శరీరము కొరకే జీవించి ఈ లోకములోనున్నప్పుడు తమ సంపదను ప్రొగుచేసుకొనిన వారిపైకి వాటన్నిటిని రప్పించునని తెలిసికొన్న వారమై జీవించవలెను. ప్రస్తుత లోకంలో పాపము అతివేగవంతముగానున్నది. ఈ లోకము తన భోగములకై అతిగా వ్యయపరచుచున్నది. ప్రజలు పెండ్లి చేసికొనుట తినుట, త్రాగుట తమ కొరకు ఇండ్లు కట్టించుకొనుటలో నిమగ్నమై తమ ఆత్మశుద్ధి కొరకు ఏ మాత్రం ఆసక్తి చూపనివారైయున్నారు. ప్రస్తుత లోకంలో ఒక పురుషుడు మరొక పురుషునితో లైంగిక పాపము జరిగించుచున్నారు. కొద్దిమంది స్త్రీలు కూడా ఒకరికొకరు మోహంలో పడుచున్నారు. (రోమా 1:27)అబద్ధ ప్రవక్తలు చంపబడవలసినవారు


అబద్ధ ప్రవక్తలు ఎల్లప్పుడూ వస్తు సమృద్ధిని కోరతారు. సంపదను అన్యాయముగా కూర్చుకొని తమ మత సంస్థలను దానిని విస్తరించి స్వతంత్ర ప్రతిపత్తి వెనుక దానిని మరుగుచేస్తారు? ‘‘నీవు యేసును నమ్మితే నీవు ధనవంతుడవవుతావు, బాగుగా జీవిస్తావు. నీ వ్యాధులు నయమవుతాయని” చెప్పి ప్రతి అబద్ధం వెనుక ఈ లోక ఆశలు దాగియున్నాయని నీవు తప్పక గుర్తించాలి.

కొరియాలో కూడా క్రైస్తవ్యము మూల విశ్వాసమును కోల్పోయి లంచగొండిగా మారి అన్ని విధముల దయ్యపు శక్తులతో యేసు నామములో వేగముగా విస్తరించుట చాలా కాలం క్రితం నుండే జరుగుచున్నది. ఇదే ఈ దినాల క్రైస్తవ్యపు నిజస్వరూపము. కానీ విశ్వాసమును లోకసంబంధ సంపదలతో కొలుచుచూ దేవుని వాక్యముతో సంపద మార్గమును వెదకు అబద్ధ ప్రవక్తలకు ఆయన భయంకరమైన నరకము మరియు ఏడు పాత్రల తెగుళ్ళును తీర్పు ఎదురుచూచుచున్నది.

ప్రజలను మోసపుచ్చు అబద్ధ ప్రవక్తలు మరియు మోసగించబడిన ప్రజలు ఒకే తీర్పును పొందెదరని దేవుడు చెప్పుచున్నాడు. దానికి బదులుగా మనము దానిని నమ్మాలి ఎందుకంటే దేవుడు సజీవుడు. యేసును నమ్మనివారు ఆయనకు వ్యతిరేకముగా నిలిచి నీతిమంతులను హింసించిన వారు తీర్పు తీర్చబడి శాశ్వత మరణమునకు అప్పగింపబడతారు. ఆ విధంగా లోకమునకు తీర్పు తీర్చిన తరువాత క్రీస్తు నామము కొరకు పుట్టి బాధను, నొప్పిని పొందిన పరిశుద్ధులకు దేవుడు నిశ్చయముగా బహుమానమిచ్చునని మనం నమ్మాలి.