Sermons

[అధ్యాయము 19-1] <ప్రకటన 19:1-21> సర్వశక్తునిచే ఆ రాజ్యము పాలించబడును.<ప్రకటన 19:1-21>

“అటు తరువాత బహు జనుల శబ్ధము వంటి గొప్ప స్వరము పరలోకమందు ఈలాగు చెప్పగా వింటిని ప్రభువును స్తుతించుడి రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును! ఆయన తీర్పులు సత్యములును న్యాయములునైయున్నవి. తన వ్యభిచారముతో భూలోకమును చెరిపిన గొప్ప వేశ్యకు ఆయన తీర్పుతీర్చి తన దాసుల రక్తమును బట్టి దానికి ప్రతిదండన చేసెను. మరి రెండవ సారి వారు ప్రభువును స్తుతించుడి అనిరి. ఆ పట్టణపు పొగ యుగయుగములు పైకిలేచుచున్నది. అప్పుడు ఆ యిరువది నలుగురు పెద్దలును నాలుగు జీవులను సాగిలపడి ఆమెన్‌. ప్రభువును స్తుతించుడి అని చెప్పుచు సింహాసనాసీనుడగు దేవునికి నమస్కారము చేసిరి. మరియు మన దేవుని దాసులారా ఆయనకు భయపడువారలారా, కొద్దివారేమి గొప్పవారేమి మీరందరు ఆయనను స్తుతించుడి అని చెప్పుచున్న యొక స్వరము సింహాసనము నొద్దనుండి వచ్చెను. అప్పుడు గొప్ప జనసమూహము శబ్ధమును, విస్తారమైన జలముల శబ్ధములను, బలమైన ఉరుముల శబ్ధమును పోలిన యొక స్వరము సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు. ఆయనను స్తుతించుడి. గొఱ్ఱె పిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొనియున్నది. గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచెదమని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశమును నిర్మలమునైన సన్నపు నారబట్టలు ఆమెకియ్యబడను. అవి పరిశుద్ధుల నీతిక్రియలు మరియు అతడు నాతో ఈలాగు చెప్పెను. గొఱ్ఱె పిల్ల పెండ్లివిందుకు పిలువబడినవారు ధన్యులని వ్రాయుము. మరియు ఈ మాటలు దేవుని యధార్థమైన మాటలని నాతో చెప్పెను. అందుకు నేను అతనికి నమస్కారము చేయుటకై అతని పాదముల యెదుట సాగిలపడగా అతడు వద్దు సుమీ. నేను నీతోను యేసునుగూర్చిన సాక్ష్యము చెప్పు నీ సహోదరులతోను సహదాసుడను. దేవునికే నమస్కారము చేయుము. యేసుని గూర్చిన సాక్ష్యము ప్రవచనసారమని నాతో చెప్పెను. మరియు పరలోకము తెరువబడియుండుట చూచితిని. అప్పుడిదిగో తెల్లని గుఱ్ఱమొకటి కనబడెను. దాని మీద కూర్చుండియున్నవాడు నమ్మకమైనవాడును సత్యవంతుడును అను నామము గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయుచూ యుద్ధము జరిగించుచున్నాడు. ఆయన నేత్రములు అగ్ని జ్వాల వంటివి. ఆయన శిరస్సు మీద అనేక కిరీటములుండెను. వ్రాయబడిన యొక నామము ఆయనకు కలదు. అది ఆయనకే గాని మరి ఎవనికిని తెలియదు. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని యుండెను. మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడియున్నది. పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నార బట్టలు ధరించుకొని తెల్లని గుఱ్ఱము లెక్కి ఆయనను వెంబడించుచుండిరి. జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలు వెడలుచున్నది. ఆయన ఇనుపదండముతో వారిని ఏలును. ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రత అను మద్యపు తొట్టి త్రొక్కును, రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రము మీదను తొడమీదను వ్రాయబడియున్నది. మరియు ఒక దూత సూర్యబింబములో నిలిచియుండుట చూచితిని. అతడు గొప్ప శబ్ధముతో ఆర్భటించి రండి రాజుల మాంసమును సహస్రాధిపతుల మాంసమును బలిష్ఠుల మాంసమును గుఱ్ఱము మాంసమును వాటి మీద కూర్చుండు వారిమాంసమును, స్వతంత్రులదేమి దాసులదేమి కొద్దివారిదేమి గొప్పవారిదేమి, అందరి యొక్క మాంసమును తినుటకై గొప్ప విందును కూడిరండని ఆకాశమధ్యమందు ఎగురుచున్న సమస్త పక్షులను పిలిచెను. మరియు ఆ గుఱ్ఱము మీద కూర్చున్నవారితోను ఆయన సేనతోను యుద్ధము చేయుటకై ఆ క్రూరమృగమును భూరాజులను వారి సేనలను కూడియుండగా చూచితిని. అప్పుడా మృగమును, దాని యెదుట సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకొనిన వారిని ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరచిన ఆ అబద్ధ ప్రవక్తయు, పట్టబడి వారిద్దరు గంధకముతో మండు అగ్ని గుండములో ప్రాణముతోనే వేయబడిరి. కడమవారు గుఱ్ఱము మీరు కూర్చున్న వాని నోట నుండి వచ్చిన ఖడ్గము చేత వధింపబడిరి. వారి మాంసమును పక్షులన్నియు కడుపార తినెను.’’వివరణ : 


వచనం 1 : అటు తరువాత బహు జనుల శబ్ధము వంటి గొప్ప స్వరము పరలోకమందు ఈలాగు చెప్పగా వింటిని. ప్రభువును స్తుతించుడి రక్షణ మహిమ ప్రభావము మన దేవునికే చెల్లును. 

పరిశుద్ధులు గొర్రె పిల్లతో తమ వివాహము జరుగు దినము సమీపించు చున్నందున ప్రభువైన దేవుని స్తుతించుటను గూర్చి ఈ భాగములో వివరించబడెను. మన ప్రభువైన యేసు రక్షణను మహిమను తన పరిశుద్ధులకిచ్చెను. కనుక మంచి కారణమును బట్టి వారు ఆయనను స్తుతించగలరు. కాబట్టి ఎత్తబడిన పరిశుద్ధులు మేఘములయందు ప్రభువైన దేవుని స్తుతించుటను కొనసాగించెదరు. ఎందుకనగా తమ పాపములన్నిటి నుండి తప్పక చేయు క్రియల నుండి ఆమోదించిన ఆయన కృప అతి ఉన్నతమైనది.

హల్లెలూయ లేదా హల్లెలూయ అను మాట హలాల్‌ అనగా స్తుతి మరియు యహ్ అనగా యెహోవా అను అర్థమిచ్చు రెండు మాటలను కలుపగా వచ్చినది. కనుక దాని అర్థము యెహోవాను స్తుతించుట. ప్రత్యేకంగా పాతనిబంధనలో కీర్తనలు 113-118, ఈజిప్టు యొక్క హ్లెల్‌ అనియు కీర్తన 146-150ను హల్లెలూయ కీర్తనలనియు పిలువబడుచున్నవి.

ఈ హల్లెల్‌ కీర్తనలు యూదుల సంతోషము మరియు దుఃఖముతో కూడినవి. భాధకరమైన శోధనకరమైన సమయాలలో వారికి శక్తినిచ్చునవి. మరియు రక్షణ మరియు జయ సమయాన ఆనంద కీర్తనలుగా పాడబడినవి. కేవలము దేవునికి హల్లెలూయ స్తుతి కీర్తనలు పాడవలసిన సమయంలో కూడా పాడబడినవి. ప్రభుని తీర్పు యొక్క గొప్ప తెగుళ్ళు ఈ లోకము కొరకు నియమించబడుట సత్యములును న్యాయములునైయున్నందున మరియు రక్షణ, అధికారము మహిమ కేవలము దేవునివే ప్రభువును స్తుతించుడి అనిరి.

వచనం 2: ఆయన తీర్పు సత్యములును న్యాయములునైయున్నవి. తన వ్యభిచారముతో భూలోకమును చెరిపిన గొప్ప వేశ్యకు ఆయన తీర్పు తీర్చి తన దాసుల రక్తమును బట్టి దానికి ప్రతిదండన చేసెను. మరి రెండవ సారి వారు ప్రభువును స్తుతించుడి అనిరి.

దేవుడు తన ఏడు పాత్రల తెగుళ్ళను భూమిపైనున్న అన్ని మతస్తులకును మరియు అవిశ్వాసులకును తీర్పుతీర్చుట ద్వారా పరిశుద్ధుల ప్రతికారమును ప్రభువైన దేవుడు తీర్చుట అనునది దేవుని తీర్పు సత్యములును న్యాయములునైయున్నది. ఎందుకనగా ఈ లోకమతస్థులు పాప రహితులైన నీతిమంతులగు దేవుని పరిచారకులను చంపిన దానికి ప్రతిగా వారికి నిత్యమరణమునకు వారు పాత్రులు.

ఈ లోక మతస్థులచే చంపబడుటకు తిరిగి క్రియలను దేవుని పరిచారకులు ఎప్పుడైన కలిగించియున్నారా? లేదు! అయినప్పటికి లోక మతస్తులందరూ ప్రభువైన దేవుని పిల్లలను హత్య చేయుటకు తమ విధానాలలో ఐక్యత కలిగియుండిరి. అలాగుననే దేవుని ఏడు పాత్రల తెగుళ్ళు హంతకులపై కుమ్మరింపబడుట న్యాయమైనదే దేవుని పరిశుద్ధతను చూపించుచున్నది.

వచనం 3: ఆ పట్టణపు పొగ యుగయుగములు పైకిలేచుచున్నది.

పరిశుద్ధులు ప్రభువైన దేవుని మేఘముతో స్తుతించుచున్నారు. ఎందుకనగా గొర్రెపిల్లయైన యేసుతో తమ వివాహ దినము సమీపించుచున్నది.

“ఆ పట్టణ పొగ యుగయుగములు పైకి లేచుచున్నది.’’ ఈ పొగ దేవుడు కుమ్మరించిన ఏడు తెగుళ్ళ వలన నాశనమై, కాలిన ఈ లోకపు పొగతో పోల్చబడినది. ఈ లోకము దాని శిథిలావస్త నుండి కాలుకానలేదు. ఎందుకనగా నిత్యమైన నాశనము దానికి విధింపబడినది.

వచనం 4 : అప్పుడు ఆ యిరువది నలుగురు పెద్దలును నాలుగు జీవులును సాగిలపడి ఆమెన్‌. ప్రభువును స్తుతించుడి అని చెప్పుచు సింహాసనాసీనుడు దేవునికి నమస్కారము చేసిరి.

ప్రభువైన యేసుతో పరిశుద్ధులు వివాహ దినము సమీపించుట అను సత్యము, 24 పెద్దలు మరియు నాలుగు జీవులు సింహాసనాసీనుడైయున్న కార్యము. ఇందుమూలమున దేవుని పరిశుద్ధులు మేఘములో ప్రభువైన దేవుని స్తుతించుచున్నారు.

వచనం 5 : మరియు మన దేవుని దాసులారా ఆయనకు భయపడువారలారా, కొద్దివారేమి గొప్పవారేమి మీరందరు ఆయనను స్తుతించుడి అని చెప్పుచున్న యొక స్వరము సింహాసనము నొద్ద నుండి వచ్చెను.

గొఱ్ఱెపిల్లతో పరిశుద్ధులు వివాహ దినము ప్రభువైన దేవుని యందు విశ్వాసముంచుట ద్వారా రక్షించబడి ఆయన పరిచారకులకు, పరిశుద్ధులకు చెప్పనశక్యమైన మహా సంతోషము. కనుక సింహాసనము నుండి అందరూ దేవుని స్తుతించుడి అను స్వరము వెడలెను. ఆయన పరిశుద్ధులు ఆయన పరిచారకులు ఆనందించుడి, ప్రభువును స్తుతించుటకు ఇప్పుడు సమయము వచ్చియున్నది.

వచనం 6 : అప్పుడు గొప్ప జన సమూహము శబ్ధమును విస్తారమైన జలముల శబ్ధమును, బలమైన ఉరుముల శబ్ధమును పోలిన యొక స్వరము సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు. ఆయనను స్తుతించుడి. గొఱ్ఱె పిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది.

ప్రభువైన దేవుని రాజ్యపాలన సమీపించుచున్నది అని ఈ వచనము తెలుపుచున్నది. ఆయన పరిశుద్ధులను, పరిచారులును నిత్యసమాధానము సంతోషము పొందుటకు ఇదియే తరుణము. మరియు దీవెనలు నది వలె ప్రవహించును. ఇందును బట్టియే వారు ప్రభువైన దేవుని స్తుతించుచున్నారు. పరిశుద్ధులు దేవుని గాలి యందును గొప్ప ఉత్సాహముతో స్తుతియించుచున్నారు. ఎందుకనగా ప్రభువైన దేవుని రాజ్యపాలన సమయము సమీపించుచున్నది. అదేమనగా దేవుడు ఆయన పరిశుద్ధులను మహిమ పరచును. ఆ పరిశుద్ధుల శబ్ధము ఆ సమయమందు స్తుతి ధ్వనులు ఉరుముల వలెను, విస్తార జలముల వలె ఉండును ప్రభువు వివాహపు విందు, రాజ్యము సుందరమైన పరిశుద్ధుల స్తుతితో ఆరంభమగును.

వచనం 7 : ‘‘ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొనియున్నది. గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచెమదని చెప్పగా వింటిని.’’

దేవుడు పంపిన ఏడు పాత్రల తెగుళ్ళు పూర్తయినప్పుడు పరిశుద్ధులందరికీ ఆనందించి సంతోషించు సమయము ఆసన్నమైనదని ఈ వచనం చెప్పుచున్నది. ఇక్కడ పరిశుద్ధులు సంతోషించి ఆనందించుటకు కారణం వారు మన ప్రభువును వివాహము చేసికొనుటకు ఆయన రాజ్యములో నివశించు దినము ఆసన్నమైనది. భూమిని, పరిశుద్ధ పట్టణమును దాని తోటను సమస్త మహిమ సమృద్ధిని సిద్ధపరచినవాడై కేవలము వారి కొరకు ఆయన ఎదురుచూచూచున్నాడు. ఈ సమయము నుండి పరిశుద్ధులు శాశ్వత కాలము ప్రభువుతో కూడా పాలించవలసియున్నారు.

వచనం 8 : మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశమును నిర్మలమునైన సన్నపు నారబట్టలు ఆమెకియ్యబడెను. అవి పరిశుద్ధుల నీతిక్రియలు.

సన్నని నారతో తయారుచేయబడిన నూతన వస్త్రమును ప్రభువు పరిశుద్ధులకిచ్చెను. ప్రభువైన దేవుని పరిచర్య చేయుచూ జీవించువారు ఈ వస్త్రముతో అలంకరింపబడుదురు. సన్నని నారతో చేయబడిన పరలోక వస్త్రము చెమటతో తడవవు. మానవ ప్రయత్నము వలన కానీ, పెట్టుబడి వలన కానీ మనము గొర్రె పిల్ల వధువులము కాలేదు. కానీ ప్రభువైన దేవుడు మనకు అనుగ్రహించిన నీరు మరియు ఆత్మమూలమైన సువార్త నందు విశ్వాసముంచుట వలనేనని ఈ భాగము మనకు చెప్పుచున్నది.

అంత్యక్రీస్తు ధరించుకొనిన ఎర్రని మరియు ఊదారంగు వస్త్రముకు ఖచ్చితముగా భిన్నమైన ప్రకాశవంతమైన ఈ సన్నని నార బట్టలు యాజకులు మరియు రాజ వస్త్రము తయారు చేయుటకు ఉపయోగించబడెను. చెమటతో తడవని తెల్లని సన్నపు నార వస్త్రము దేవుని దయను ఆయన నీతిమత్వమును ధరించుకొన్నవారు ఆయన ప్రజలైరి అని తెలుపుచున్నది.

“అవి పరిశుద్ధుల నీతి క్రియలు” అను వచన భాగమునకర్థము ప్రభువైన దేవుడు అనుగ్రహించిన రక్షణ యొక్క కృప ద్వారా పరిశుద్ధులైన వారు తమ విశ్వాసమును కాపాడుకొనుటకై అంత్యక్రీస్తు మరియు అతని అనుచరుల ద్వారా హతసాక్షులై దేవుని మహిమ పరచిరి. ‘‘పరిశుద్ధులు నీతిక్రియలు” అనగా ఆజ్ఞ యొక్క నీతి కాదు. కానీ తమ ప్రశస్త విశ్వాసమును కాపాడుకొనుటకైన హతసాక్ష్యమే. అలాగే అంత్యకాలము యొక్క యేసు వధువులందరూ ప్రభువు నందున్న తమ విశ్వాసమును కాపాడుకొనుటకై హతసాక్షులై నిలద్రొక్కు కొన్నవారై ఈ భూమిపై నుండగా అంత్యక్రీస్తు మరియు అతని విరోధులతో పోరాడవలెను.

తమ హతసాక్ష్యము యొక్క విశ్వాసమును సిద్ధపరచుకొనుటకై పరిశుద్ధులందరూ మహాశ్రమల కాలంలోని మొదటి మూడున్నర సంవత్సరముల కాలంలో బలపరచబడాలి. ఎందుకనగా ఈ మూడున్నర సంవత్సరములు ముగియగానే వారు వాస్తవంగా హతసాక్షులవ్వాలి.

వచనం 9 : మరియు అతడు నాతో ఈలాగు చెప్పెను. గొఱ్ఱె పిల్ల పెండ్లివిందుకు పిలువబడినవారు ధన్యులని వ్రాయుము. మరియు ఈ మాటలు దేవుని యధార్థమైన మాటలని నాతో చెప్పెను.

దేవుని తెగుళ్ళు ఈ లోకంలో అంతమైనప్పుడు ప్రభువైన దేవుడు పరిశుద్ధులందరిని గొర్రె పిల్ల వివాహ విందుకై ఆహ్వానించును. (ప్రభునిచే నిర్మించబడినదై, ఏలబడుచున్న రాజ్యము) మరియు ఆయన వారిని క్రీస్తు రాజ్యములో నివసించనిచ్చును. ఇక్కడ గొర్రె పిల్ల వివాహ విందుకు ఆహ్వానించబడినవారు దీవెన పొందిన వారు ఈ వాగ్ధాన వాక్యమును నెరవేర్చకుండా ఉండనని మన దేవుడు వచ్చును. తమ పాపములన్ని నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను విశ్వసించుట ద్వారా కడిగివేయబడిన తన వధువును కొనిపోవుటకై మన ప్రభువు ఈ భూమిపైకి వచ్చును. శాశ్వత కాలము ప్రభువు తన వధువుతో కూడా తన రాజ్యమందు జీవించును.

ఆ పరిశుద్ధులు ప్రభువును కలసికొనుట ఎప్పుడు పూర్తగుననగా క్రీస్తుచే వారు ఎత్తబడి వెయ్యేండ్ల పాలనలో అనంతమైన మహిమను బహుమానమును వారు పొందు సమయము వచ్చినప్పుడే హల్లెలూయ! మనలను చెప్పుచున్నాను.

వచనం 10: అందుకు నేను అతనికి నమస్కారము చేయుటకై అతని పాదము యెదుట సాగిలపడగా అతడు వద్దు సుమీ. నేను నీతోను, యేసును గూర్చిన సాక్ష్యము చెప్పు నీ సహోదరులతోను సహదాసుడను. దేవునికే నమస్కారము చేయుము. యేసుని గూర్చిన సాక్ష్యము ప్రవచనసారమని నాతో చెప్పెను.

సమస్త మహిమను పరిశుద్ధులు ప్రభువునకే చెల్లించవలెను. పరిశుద్ధుల ఆరాధనలను, స్తుతులన్నిటిని పొందుటకు పూర్ణముగా మన త్రియేక దేవుడే అర్హుడు.

‘‘యేసుని గూర్చిన సాక్ష్యము ప్రవచన సారము” అనగా యేసును సాక్ష్యమును, ప్రవచనమునూ పరిశుద్ధాత్మ ద్వారా కలుగునని అర్థము.

వచనం 11: మరియు పరలోకము తెరవబడియుండుట చూచితిని. అప్పుడిదిగో తెల్లని గుఱ్ఱమొకటి కనబడెను. దాని మీద కూర్చుండియున్నవాడు నమ్మకమైనవాడును సత్యవంతుడును అను నామము గలవాడు, ఆయన నీతిని బట్టి విమర్శ చేయుచూ యుద్ధము జరిగించుచున్నాడు.

అంత్యకాలము వచ్చినప్పుడు మన ప్రభువైన దేవుడు తెల్లని గుర్రమెక్కి తన నీతితో సాతానుతో పోరాడి అగాధములోనికి అగ్నిగుండంలోనికి త్రోసి అతనిని బంధించును.

ఇక్కడ: యేసుక్రీస్తు నామము ‘విశ్వాస’ గది మరియు నిజమైనదియునైయున్నది. విశ్వాసమనగా క్రీస్తు విశ్వసించదగిన వాడు, ఆయన నమ్మకత్వాన్ని నీతిని తెలియజేయుచుండగా నిజమైనది అనగా అబద్ధము లేనివాడు అని అర్థం క్రీస్తు. అంత్యక్రీస్తును, దేవుని న్యాయ తీర్పుతో జయించునని తెలుపుచున్నది.

వచనం 12 : ఆయన నేత్రములు అగ్ని జ్వాల వంటివి, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములుండెను వ్రాయబడిన యొక నామము ఆయనకు కలదు. అది ఆయనకే గాని మరి ఎవనికిని తెలియదు.

ప్రభుని నేత్రములు అగ్నిజ్వాలల వలె ఉన్నవనగా ఆయన ప్రతివారిని తీర్పుతీర్చుటకు అధికారము కలవాడని చెప్పుచున్నది. ‘‘ఆయన శిరస్సుపై అనేక కిరీటములుండెను అనగా ఆయన సాతానుతో చేయు పోరాటంలో ఎల్లప్పుడు జయించును. ఎట్లనిన ఆయన సర్వాంతర్యామియు, సర్వమును ఎరిగిన వాడునైయున్నాడు.

వచనం 13: రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని యుండెను.

మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడియున్నది. ప్రభువు తనకు వ్యతిరేకముగా నిలిచిన వానిని తమను భయంకరమైన కోపముతో తన శత్రువునకు తీర్పుతీర్చుట ద్వారా పరిశుద్ధుల కొరకైన ప్రతికారము తీర్చును. ఈ దేవుడు యేసుక్రీస్తే ఆయన తన వాక్కుతో వాగ్ధానము చేసినట్లు మన ప్రభువు వాస్తవముగా మానవ శరీరముతో ఈ భూమిపైకి వచ్చి ఈ లోకపాపములను భరించుటకై యోహానుచే బాప్తిస్మము పొంది వాటిని సిలువలో మోసి మానవాళి పాపమంతటిని తుడిచివేసెను.

“రక్తములో ముంచిన వస్త్రము” అనగా క్రైస్తవుల రక్తమని కాదు. ఆయన తన భయంకరమైన తీర్పు అను ఉగ్రతను వారిపై ఉంచి తన శక్తిగల పాదముల క్రింద వారిని త్రొక్కును గనుక శత్రువు రక్తము ఆయన వస్త్రముపై చిందును.

“దేవుని వాక్యము” అనగా యేసు వ్యక్తిత్వమును సూచించును. మన ప్రభువు సమస్తమును తన శక్తిగల వాక్కుతో చేసెను. కనుక ఆయనకు ‘‘దేవుని వాక్యమని పేరు.’’

వచనం 14-16: పరలోకమందున్న సేన శుభ్రమైన తెల్లని నార బట్టలు ధరించుకుని తెల్లని గుఱ్ఱములెక్కి ఆయనను వెంబడించుచుండిరి. జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలు వెడలుచున్నది. ఆయన ఇనుపదండముతో వారిని ఏలును. ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షణమై ఉగ్రత అను మధ్యపు తొట్టి త్రొక్కును. రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రము మీదను తొడమీదను వ్రాయబడియున్నది.

ఆయన మహిమ వస్త్రము ధరించుకొన్నవారైన ఆయన సైనికులు ఎల్లప్పుడు ప్రభువైన దేవుని క్రియలను చేస్తారు.

దేవుడు తన నోట నుండి వచ్చు వాక్యముతో ఈ లోకమునకు తీర్పుతీర్చును. మన ప్రభువు ఎల్లప్పుడు తన నోటిమాటతో మనకు వాగ్ధానము చేసెను? మరియు ఆయన ఎల్లప్పుడు ఆ వాగ్ధానమును తన శక్తి చొప్పన నెరవేర్చును. ఈ లోకమునకు తీర్పు తీర్చి సాతానును నాశనం చేయునది యేసుక్రీస్తే. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు.

వచనం 17: మరియు ఒక దూత సూర్యబింబములో నిలిచి, అతడు గొప్ప శబ్ధముతో ఆర్భటించి ఆకాశమధ్యమందు ఎగురుచున్న సమస్త పక్షులతోను ‘‘దేవుని గొప్ప విందుకు కూడిరండని పిలిచెను.’’

తద్వారా ఈ లోకము, సాతాను అతని పరిచారకులు యేసుక్రీస్తుచే నాశనము చేయబడెదరు. ఈ లోక నాశనమును దేవుని గొప్ప విందని బైబిలు వర్ణించుచున్నది.

వచనం 18: ‘‘రాజుల మాంసమును సహస్రాధిపతుల మాంసమును బలిష్ఠుల మాంసమును గుఱ్ఱము మాంసమును వాటి మీద కూర్చుండువారి, స్వతంత్రులదేమి దాసులదేమి కొద్దివారిదేమి గొప్పవారిదేమి, అందరి యొక్క మాంసమును తినుటకై దేవుని గొప్ప విందుకు కూడిరండని ఆకాశమధ్యమందు ఎగురుచున్న సమస్త పక్షులను పలిచెను.’’

ఈ లోకమంతయును దానిలోని సమస్తమును ప్రభువైన దేవుని మహాతెగుళ్ళు పూర్తయినప్పుడు మరణమున కప్పగింపబడిరి. వారి శవములను తినుట ద్వారా ఆకాశమున ఎగురుపక్షులు వాటి పొట్టలను నింపుకొనును. అవి అలాగు చేయుటకు కారణము ఈ లోకముపై దేవుడు తన ఏడు పాత్రల తెగుళ్ళను కుమ్మరించును. పీనుగు ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలు పొగవును. (మత్తయి 24:28) అని మన ప్రభువు సెలవిచ్చుచున్నాడు. అంత్యకాలపు లోకములో కేవలము నాశనము మరణము పాపులకు నరకశిక్ష ఉండును. కానీ పరిశుద్ధుల కొరకు, క్రీస్తు రాజ్యములో పాలించే దీవెన ఉండును.

వచనం 19 : మరియు ఆ గుఱ్ఱము మీద కూర్చున్నవారితోను ఆయన సేనతోను యుద్ధము చేయుటకై ఆ క్రూరమృగమును భూరాజులను వారి సేనులను కూడియుండగా చూచితిని.

వారి అంతము సమీపించగా ఆ అంత్యక్రీస్తు సాతాను పరిచారకులు అతని అనుచరులు దేవుని పరిచారకులు మరియు ఆయన పరిశుద్ధులును వ్యతిరేకులై వారిని జయింప ప్రయత్నించెదరు. కానీ మన ప్రభువు రాజుల రాజైయుండగా ఆయన అంత్యక్రీస్తును. తప్పుడు ప్రవక్తను బంధించి వారిని అగ్ని గుండములోనికి త్రోయును. ఆయన వాక్యమును ఖడ్గముతో అతని పరిచారకులను చంపును.

వచనం 20: అప్పుడా మృగమును దాని యెదుట సూచన క్రియలు చేసి దాని ముద్రను వేయించుకొనిన వారిని ఆ మృగపు పత్రిమకు నమస్కరించిన వారిని మోసపరచిన ఆ అబద్ధ ప్రవక్తయు, పట్టబడి వారిద్దరు గంధకముతో మండు అగ్ని గుండములో ప్రాణముతోనే వేయబడిరి.

“మృగము” అనగా అంత్యక్రీస్తు ‘‘అబద్ధ ప్రవక్త”ల అనగా అద్భుతములను సూచన క్రియలను చేయుచూ సత్యవాక్యమందు విశ్వాసమునుండి ప్రజలను త్రిప్పివేయు వారైన అంత్యక్రీస్తు పరిచారకులు మన ప్రభువైన దేవుడు సాతానును, ఆ మృగమును (అంత్యక్రీస్తును) అబద్ధ ప్రవక్తలను అంత్యక్రీస్తు విగ్రహమును ఆరాధించుచూ దేవునికి ఆయన పరిశుద్ధులకు నీరు మరియు ఆత్మమూలమైన సువార్తకు వ్యతిరేకులుగా నిలిచిన సాతాను పరిచారకులను నాశనము చేయును.

అగ్నిగంధకముతో మండుచున్నట్టి అగ్ని గుండమనగా నరకము. పాతాళము వేరు, నరకము వేరు. పాతాళములో సాతాను శక్తులు తాత్కాలికముగా బంధించబడును. ‘‘అగ్ని గుండము” అను స్థలము వారి నిత్యశిక్షకు స్థానము. ప్రత్యేకంగా అగ్ని మరియు గంధకము అనునవి బైబిలు నందు ఎల్లప్పుడూ దేవుని శిక్షకు, తీర్పుకు సాధనముగా ఉపయోగించబడినవి.

ఈ లోకము నాశనమైన తరువాత పరిశుద్ధులతో పాటు మన ప్రభువు ఈ భూమిపైకి తిరిగి వచ్చును. మొదటిగా సాతానును అతని పరిచారకులను నాశనం చేయును. తరువాత క్రీస్తు రాజ్యమును ప్రారంభించును. అప్పుడు పరిశుద్ధులు ప్రభువుతో పాటు రాబోవు వెయ్యి సంవత్సరములు క్రీస్తు రాజ్యములో పరిపాలన చేస్తారు. 

వచనం 21 : కడమవారు గుఱ్ఱములమీద కూర్చున్న వాని నోట నుండి వచ్చిన ఖడ్గము చేత వధింపబడిరి. వారి మాంసమును పక్షులన్నియు కడుపార తినెను. 

మన ప్రభువైన దేవుని నోటి నుండి వచ్చుమాట ద్వారా ఈ లోకము సృజింపబడెను. అలాగే ఆయన నోటి నుండి వచ్చు తీర్పు ద్వారా ఈ లోకమునకు తీర్పు తీర్చి దేవుడు తన శత్రువును నాశనము చేయును. అప్పుడు ఈ భూమిపై క్రీస్తు రాజ్యము స్థాపించబడును. కాబట్టి పరిశుద్ధులు తమ విశ్వాసమును క్రీస్తు రాజ్యమందుంచి సాతాను, అంత్యక్రీస్తు మరియు అతని అనుచరులతో పోరాడి విశ్వాసముతో హతసాక్ష్యమును కౌగలించుటద్వారా ఆయనకు మహిమ చెల్లించవలెను.