Sermons

[అధ్యాయము 19-2] <ప్రకటన 19:1-21> క్రీస్తు ఆగమనము కొరకు నమ్మకముతో పరిశుద్ధులు మాత్రమే ఎదురు చూచెదరు.<ప్రకటన 19:1-21>


ముందు అధ్యాయంలో ఈ లోకముపైకి భయంకరమైన తెగుళ్ళను దేవుడు ఎట్లు రప్పించునో తెలిసికొనియున్నాం. ఈ అధ్యాయంలో క్రీస్తు. అతని మహిమ సైన్యము, అంత్యక్రీస్తుతో పోరాడి, జయించి ఆ మృగమును అతని పరిచారకులను ప్రాణముతోనే అగ్నిగుండములోనికి త్రోయుట మరియు కడమ అంత్యక్రీస్తు పరిచారకులను ప్రభువు నోటి నుండి వెడలు మాటలతో చంపి అంత్యముగా సాతానుకు విరోధముగా తన యుద్ధమును ముగించుటను మనము చూస్తున్నాం. ఈ అధ్యాయమును మూడు ప్రధాన అంశములుగా విడదీయవచ్చును.

1. ఈ లోకము పైకి గొప్ప తెగుళ్ళను పంపినందుకు ఎత్తబడిన పరిశుద్ధుల స్తుతి. 

2. గొఱ్ఱె పిల్ల వివాహ విందుకు ఆహ్వానమును ప్రకటించుట. 

3. యేసుక్రీస్తు సేనతో కూడా ప్రభువు పరలోకము నుండి దిగివచ్చుట.

దేవుడు ఎంతో నిశ్చయముగాను, త్వరగాను ప్రకటన గ్రంధము ద్వారా ఆయన సెలవిచ్చిన ప్రతి దానిని నెరవేర్చునని మనమంతా గుర్తించాలి.దేవుని తీర్పు:


నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను విశ్వసించి తద్వారా విశ్వాసము వలన దేవుని ప్రజలైన వారు తమను లోకపాపములన్నిటి నుండి రక్షించినందుకు ఆయనను స్తుతించెదరు. 3-5 వచనముల వరకు గల భాగమును మరలా చూచెదము. ఆ పట్టణపు పొగ యుగయుగములు పైకిలేచుచున్నది. అప్పుడు ఆ యిరువది నలుగురు పెద్దలును నాలుగు జీవులును ఆమెన్‌, ప్రభువును స్తుతించుడి అని చెప్పుచు సింహాసనాసీనుడు దేవునికి నమస్కారము చేసిరి. మరియు మన దేవుని దాసులారా, ఆయనకు భయపడువారలారా, కొద్దివారేమి, గొప్పవారేమి మీరందరు ఆయనను స్తుతించుడి అని చెప్పుచున్న యొక స్వరము సింహాసనము నొద్ద నుండి వచ్చెను.

హెబ్రి 9:27లో ‘‘మనుష్యులొక్కసారే మృతి పొందవలెనని నియమింపబడెను. ఆ తరువాత తీర్పు జరుగునని చెప్పుచున్నది.’’ దేవుని యెదుట మనుష్యుల ఒక్కసారే తీర్పు పొందవలెను కానీ ఈ తీర్పు వాక్యము అంతిమమైనది అవి మార్చబడవు. అతని / ఆమె పాపము నిమిత్తం ప్రతివారు ఆయన ఒకే తీర్పుతో అనగా పాపులను నిత్యం నరకాగ్నిలోనికి త్రోసి కాల్చివేయునట్లు తన శాశ్వత తీర్పును దేవుడిచ్చును. అందువలననే ‘‘ఆ పట్టణపు పొగ యుగయుగము పైకి లేచుచున్నదని బైబిలు మనకు చెప్పుచున్నది.’’

ఒకసారి నీవు మరణిస్తే అదే అంతమని ఎవరైనా ఆలోచించి చెప్పవచ్చు. ఇది కేవలం మనుష్యుని స్వంత ఆలోచన. కానీ దేవునిది కాదు. ప్రతివారికి శరీరము, ఆత్మ ఉన్నందున ప్రజలు దేవుని విశ్వసించినను, లేకపోయినను వారందరూ దేవుని ఉనికిని తమంతట తామే తెలిసికొని, త్వరగానో ఆలస్యంగానో ఆయన ఎదుట తమ పాపముకై తీర్పు పొందును.

ప్రజలకొరకు ఆత్మల యొక్క రాజ్యపు ఉనికి ఉండగా తమ కన్నులకు మరుగైననూ దేవుడు ఇంకనూ ఉన్నాడని వారు తెలుసుకుంటారు. శరీర నేత్రములకు కనబడుచున్న రాజ్యపు వాస్తవము ఎన్నటికి మారదని. కాని నిత్య రాజ్యము యొక్క సత్యము ఉన్నది. అది మన కన్నులకు కనబడదు. కేవలము డబ్బు గూర్చి యోచించుచూ, వస్తు సంబంధ ఆశలను వెదకుచుండటయే ఈ భూమిపై వస్తుసంబంధ అభివృద్ధి కాదని, దాని నిజమైన ఉద్దేశ్యము దేవుని. ఈ విశ్వమంతటి సృష్టికర్తను తెలిసికొని, ఆయన అనుగ్రహించిన నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను తెలిసికొని, విశ్వసించుట ద్వారా నిత్యరాజ్యపు దీవెనలోనికి ప్రవేశించుట అని తెలిసికొంటారు. దేవుడు చెప్పినది మనము తెలిసికొనుట మాత్రమే కాక దానిని మనం నమ్మాలి. మన స్వంత ఆలోచనలను మాత్రమే నమ్ముచూ మనము నరకములో పడకూడదు. మన పాపముకై నిత్య ఆవేదనను ఎదుర్కొనుటకు ముందు ఇప్పుడే ఈ భూమిపై నుండగానే యేసు అనుగ్రహించిన నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను నమ్ముట ద్వారా మన పాపములకు క్షమాపణ పొంది, నిత్యజీవములోనికి ప్రవేశించాలి.

ప్రతివారికి ఈ భూమిపై జీవితము ఎంతో స్వల్పం. ప్రతి దినము సూర్యుడుదయించి అస్తమించురీతినే మన జీవితయాత్ర అతి త్వరగా ముగియును. కేవలము దారపు యంత్రముపై ఉడుత పరుగిడు రీతిగా ఉన్నట్లయిన మన జీవితం అర్ధరహితముగాను, ఫలరహితంగాను ఉండును. ఒకవేళ నీవు వంద సంవత్సరములు జీవించిననూ, నీవు అంత సుదీర్ఘ జీవితమును అనుభవించానని చెప్పలేవు.

నీ అనుదిన జీవన తిరుగులాడుటను అనగా నిద్రించుటకు తినుటకు శుభ్రపరచుకొనుటకు మిగిలినట్టి ప్రపంచ క్రియలకు వెచ్చించిన సమయమును నీవు జీవిత కాలము నుండి తీసివేసిన నీకు చాలా తక్కువ సమయము మిగిలియుండును. నీవు పుట్టినప్పటి నుండి నీవు చూచుచున్న వాటిని చూడగా, నీవు ఇంతకు మునుపు కలుసుకొన్ని వారినే కలసుకొనుచుండగా నీ వెంట్రుకలు మెరసిపోవును. ఆకస్మాత్తుగా నీ స్వంత అంతమును ఎదుర్కొనుటను నీవు కనుగొనెదవు.

పరిశుద్ధుల వలే కాక మన జీవితాలు అర్థరహితముగా నుండుటకు కారణము మనం. ఈ లోకములో పుట్టి నీరు మరియు ఆత్మమూలముగా వచ్చిన ప్రభువును కలిసికొని ఆయనను నమ్మి అట్లు మన పాపములన్నింటికి ప్రాయశ్చిత్తమును పొందాము. మనము ఎంత అదృష్టవంతులము ఎంత కృతఙ్ఞులము! మనమందరమూ నిత్య నరకమునకు దాని బాధకు నియమింపబడగా నీరు మరియు ఆత్మ ద్వారా మన యొద్దకు వచ్చిన ప్రభువునకు కాదా!

దీని గూర్చి నేను ఆలోచించినప్పుడెల్లా అది నాకు ఇంకను భయమును పుట్టించును. మరియు ప్రభువును మరొకసారి స్తుతిస్తాను. సాతాను వలననే నరకము ఉనికి బట్టి ప్రతివారు మరణమును కోరకుంటారు. అయిననూ వారు అట్లు చేయలేరు. ఆ స్థలములో అగ్ని గంధకము నిత్యము మండుచుండును.

యేసు అనుగ్రహించిన నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను వాస్తవంగా తెలుసుకొనుటకు, దాని వలన పరిశుద్ధాత్మను పొందుటకు పూర్వమే నీరు మరియు ఆత్మమూలమైన సువార్త వలన పట్టబడి తిరిగి జన్మించిన వారైన దేవుని పరిచారకులను మొదటిగా కలిసికొనవలెను. క్రైస్తవునిగా జీవించుచూ నీరు మరియు ఆత్మమూలమైన సువార్త ద్వారా తిరిగి జన్మించుట మరియు పరిశుద్ధాత్మను పొందుట అను ప్రశ్నకు సమాధానమును వెదుకు వారు నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను నమ్ముట ద్వారా సమాధానం పొందెదరు.

నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను విశ్వసించుట ద్వారా తమ పాప ప్రాయశ్చిత్తము నొందిన వారిని పరిశుద్ధాత్మను దేవుడు వరముగా అనుగ్రహించెనని (అ.కా. 2:38) బైబిలు బోధించుచున్నది. నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను నమ్ముట ద్వారా తమ పాపము నుండి క్షమాపణ పొంది తమ హృదయములలో పరిశుద్ధాత్మను పొందిన వారు మాత్రమే యేసు సరియైన విశ్వాసం కలవారని చెప్పబడినది. వారు తమ విశ్వాసంతో మాత్రమే దేవుని నిత్యరాజ్యములో ప్రవేశించెదరు. (యో 3:5) ఒకడు నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను విశ్వసించి తమ పాపములకు ప్రాయశ్చిత్తం పొందాడా లేదా అను దానిని బట్టి అతడు దీవెన పొందాడా లేక శాపం పొందాడా అనునది నిశ్చయించబడును.ప్రకాశములును నిర్మలములైన సన్నపునార వస్త్రము ధరించుట :


తమ భవిష్యత్తును గూర్చి ఆలోచించి తమ పాపప్రాయశ్చిత్త అను ప్రస్తుత సమస్యను సాధించినవారు జ్ఞానవంతులు మరియు దీవెనొందిన వారు. ఒకడు పూర్తిగా తప్పుతో నిండిన సరిచూచుకొను జీవితము జీవించిననూ ఒక వేళ అతడు/ఆమె నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను విశ్వసించి తన హృదయంలో పాపపరిహారం నొంది, పరిశుద్ధాత్మను పొందిన తరువాత ఆ వ్యక్తి ఎంతో విజయవంతమైన జీవితమును జీవించినట్లే.

ప్రకటన 19:4-5 ఈ విధముగా చెప్పుచున్నది. ‘‘అప్పుడు ఆ యిరువది నలుగురు పెద్దలును నాలుగు జీవులును సాగిలపడి ఆమేన్‌, ప్రభువును స్తుతించుడి అని చెప్పుచూ సింహాసనాసీనుడు దేవునికి నమస్కారము చేసిరి. మరియు మన దేవుని దాసులారా, ఆయనకు భయపడువారలారా కొద్దివారేమి, గొప్పవారేమి మీరందరు ఆయనను స్తుతించుడి అని చెప్పుచున్న యొక స్వరము సింహాసనము నొద్దనుండి వచ్చెను.’’

ఇక్కడ ‘‘ఆయనకు భయపడుడి” అనగా యేసుక్రీస్తు వాక్యమును ఒకడు హృదయంలో పొంది అతని నాయకత్వంలో జీవించాలి. తమ పాపము క్షమించబడినవారు మాత్రమే పరలోక రాజ్యంలో ప్రభుని స్తుతించగలరు. కానీ తమ పాపపరిహారమును పొందనివారు మండుచున్న నరకాగ్నిలో బాధపడుచూ దేవుని శపించెదరు.

వచనము 6 నుండి 9 వరకు మనం ధ్యానం చేద్ధాం. ‘‘అప్పుడు గొప్ప జనసమూహాము శబ్ధమును, విస్తారమైన జలముల శబ్ధమును, బలమైన ఉరుముల శబ్ధమును పోలిన యొక స్వరము - సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు ఆయనను స్తుతించుడి. గొఱ్ఱె పిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొనియున్నది. గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచెదమని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశమును నిర్మలమునైన సన్నపు నారబట్టలు ఆమెకియ్యబడెను. అవి పరిశుద్ధుల నీతిక్రియలు, మరియు అతడు నాతో ఈలాగు చెప్పెను. గొఱ్ఱె పిల్ల పెండ్లివిందుకు పిలువబడినవారు ధన్యులని వ్రాయుము. మరియు ఈ మాటలు దేవుని యధార్థమైన మాటలని నాతో చెప్పెను.’’

అపోస్తులుడైన యోహాను స్తుతిని వినెను. ఆ శబ్ధము గొప్ప జనసమూహాపు శబ్దమును విస్తారమైన జలముల శబ్దము బలమైన ఉరుముల శబ్ధమును పోలియున్నది. తమ పాపముకు ప్రాయశ్చిత్తము నొందిన వారు ఒక చోట కూడి దేవుని స్తుతించు శబ్ధము మొదటగా సర్వశక్తుని రాజ్యములోనికి ప్రవేశించుటకు అనుమతించిన దేవుని స్తుతించుటకు, తరువాత ఆయనచే పాలించుటకు మహిమలో ఆయనతోకూడా జీవించుటకు ఆ కీర్తన యొక్క స్తుతి చేయబడియున్నది. ఇవన్నియూ పరిశుద్ధుల సంతోషముతో ఉప్పొంగి ఆనందించి గొప్ప మహిమను దేవుని స్తుతించుటకు, తరువాత ఆయనచే పాలించబడుటకు మహిమలో ఆయనతో కూడా జీవించుటకు ఆ కీర్తన యొక్క స్తుతి చేయబడియున్నది. ఇవన్నియూ పరిశుద్ధులు సంతోషముతో ఉప్పొంగి ఆనందించి గొప్ప మహిమను దేవునికి చెల్లించునట్లు చేసెను. కనుక మనము ఉత్సహించి ‘‘సంతోషించుచూ ఆయనకు మహిమ చెల్లించెదము” అని ఆర్భాటించుచూ ఆయనను స్తుతించుట తప్ప మరేమియూ చేయలేరు.

రెండవదిగా ఆ పరిశుద్ధులు తమ స్తుతులతో ఇలాగున కొనసాగుచుండిరి ‘‘గొఱ్ఱె పిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొనియున్నది. గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచెదమని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశమును నిర్మలమునైన సన్నపు నారబట్టలు ఆమెకియ్యబడెను. అవి పరిశుద్ధుల నీతిక్రియలు.’’ దీని అర్థమేమి? ఆయన మానవాళికి వాగ్ధానమిచ్చిన రీతిని యేసు ఈ భూమిపైకి తిరిగివచ్చి ఆయనను విశ్వసించి తిరిగి జన్మించి పరిశుద్ధాత్మను పొందిన వారిని పెండ్లి చేసుకొని నిత్యము వారితో జీవించుచూ, నివసించును.

వివాహమనగా పెండ్లి కుమారుడు తన పెండ్లి కుమార్తెను కలిసికొనుట, యేసు ఈ భూమికి తిరిగి వచ్చునప్పుడు అనగా నీరు మరియు ఆత్మమూలమున తిరిగి జన్మించిన వారిని ఆయన అంగీకరించును. అనగా శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము వరకు పరిశుద్ధులతో నివసించుటకు ఆయన తన నూతన భూమి ఆకాశమును వెయ్యేండ్ల రాజ్యమును నిర్మించును. ఈ పెండ్లి కుమారునితో జీవించు ఆ పెండ్లి కుమార్తె యొక్క మహిమ వర్ణనకందదు కనుక ఎంతో గొప్పది కేవలము దానిని గూర్చి ఊహ మన హృదయాలను ఉప్పొంగచేయును.

యేసుక్రీస్తు పరిపాలించు లోకము వచ్చునప్పుడు ఆయన పెండ్లి కుమార్తె అత్యంత ఆనంద భరితులవుతారు. దానిని వర్ణించుటకు మాటలు చాలవు. మంచి కాపరిచే పరిపాలించబడుట ఎంత ఆనందముగా నుండును? యేసుక్రీస్తు ఖచ్చితమైన మంచితనముగల పెండ్లి కుమారుడైన కారణముగా ఆయన పరిపాలన కూడా ఖచ్చితంగా మంచిదై, సంపూర్ణముగా నుండును. ఆయన పరలోకరాజ్యముపై పరిపాలన చేయును.నిన్ను పరలోకమునకు అర్హునిగా చేయు ఒకే ఒక సువార్త :


ఎవరైననూ పరిశుద్ధాత్మను పొంది పరలోకములో ప్రవేశించగోరినట్లైన అతడు / ఆమె పూర్తిగా యేసు ఈ బాప్తిస్మమును, రక్తమును విశ్వసించాలి. మన ప్రభువు పాపులందరినీ పాపము నుండి రక్షించుటకు ఈ భూమిపైకి వచ్చి అట్టి మానవాళి పాపములన్నిటిని తనపై మోపుకొన్నవాడైన ఆయన యోహానుచే బాప్తిస్మము పొందవలసి వచ్చెను. ఆ విధముగా ఆయన బాప్తిస్మము పొందినవాడై యేసు తానే మన స్థానములో సిలువపై మరణించి మన పాపములన్నిటి కొరకు తీర్పు పొందెను. మృతి నుండి తిరిగి లేచెను. మరియు నమ్మినవారికి నిత్యరక్షణకు ప్రభువాయెను.

ఈ ప్రభువు ఇప్పుడు భూమిపైకి వచ్చును. విశ్వాసము ద్వారా తన వధువులైన ప్రజలను కౌగలించును. శాశ్వత కాలము వారితో నివశించును. వధువులకు ఇది ఒక మహిమయుక్తమైన మహిమ చెల్లించు దీవెనైయున్నది. కనుక రక్షింపబడిన దేవుని పిల్లలు యేసుక్రీస్తును స్తుతించుచూ ఆయనకు శాశ్వతమైన మహిమను చెల్లించెదరు. ఈ ప్రజలు దేవునిచే పరిపాలింపబడుచు తమ సంతోషముతో ఉత్సహించెదరు. ఈ ఆనందము కోరు వారు సమస్త మహిమను పెండ్లి కుమారునికి చెల్లించెదరు.

సృష్టి ఆరంభము నుండి సమస్త మానవాళి ఈ సంగతి కొరకు ఎదురు చూచుచున్నారు. ఈ సంగతి యేసు దిగివచ్చునప్పుడు నెరవేరును. పరిశుద్ధాత్మను పొందినవారిని మేఘములోనికి కొనిపోవును. వారితో జీవించును. మానవాళి కొరకు దేవుడు ఒక నూతన రాజ్యమును సృజించెను. అది మన కొరకు నిరీక్షించుచున్నది. దీని కొరకు మనం జీవించాలి. దీని కొరకే మనము ఈ లోకంలో జన్మించాము.

ప్రధాన అంశము మనకు చెప్పుచున్నట్లు ‘‘ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొనియున్నది. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశమును నిర్మలమునైన సన్నపునార బట్టలు ఆమెకియ్యబడెను.’’యేసుక్రీస్తు నందు విశ్వసించిన వారిని దేవుడు ప్రకాశమును నిర్మలమునైన సన్నపునార బట్టలు ధరింపచేయును. ఈ వాక్యమును విశ్వసించువారు అనగా తమ పాప ప్రాయశ్చిత్తము పొందినవారికి తమ హృదయమును హిమము వలే తెల్లగా మారును.

ఆలాగునే యేసుక్రీస్తు వధువు ముందే నీరు మరియు ఆత్మమూలమైన సువార్త వలన సిద్ధపడిరి. ఈ భూమిపై నున్నప్పుడే నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను విని విశ్వసించుట ద్వారా ఒకడు క్రీస్తు యేసుని వధువుగా తిరిగి జన్మించగలడు. ఈ విశ్వాసమే నిన్ను క్రీస్తు వధువుగా చేయును. ఈ విశ్వాసమే నిన్ను పరలోక రాజ్యంలో ప్రవేశించుటకు అర్హునిగా చేయును.విశ్వాసంతో నిరీక్షించువారు :


ప్రధానాంశము ‘‘గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని” మనకు చెప్పుచున్నది. తమ పాప ప్రాయశ్చిత్తము నొందిన వారు ఎటువంటి విశ్వాసంతో జీవించాలి? యేసు అను తమ పెండ్లికుమారుని కలుసుకొని మహిమలో జీవించుచున్న వధువు తమ జీవితమును విశ్వాసముతోను, నిరీక్షణతోనూ జీవించాలి. ఈ పెండ్లి కుమారునితో ఏకమగు దినము కొరకు ఎదురుచూడాలి.

లోకము మరింత చీకటియగుచుండగా, రక్షింపబడిన వధువుకు ఇంకనూ నిరీక్షణయున్నది. నూతన భూమి ఆకాశమును తన వధువు కొరకు సిద్ధపరచిన వాడై యేసుక్రీస్తు వారిని కొనిపోవుటకు తిరిగి వచ్చుదినము కొరకు ఎదురుచూచుటే ఈ నిరీక్షణ. పెండ్లి కుమారుడు తన వధువులందరినీ పునరుత్ధానపరచి వారికి శాశ్వత జీవమునిచ్చును. శాశ్వత కాలము నుండి పెండ్లి కుమారుడును పెండ్లికుమార్తెను నివశించు స్థలము దృష్టత్వము లేనిదియు పాపరహితమైనదియు ఏ లోటు లేనిదియునైయున్నది. కేవలము ఈ దినము కొరకే వధువు ఎదురుచూచెదరు. ఇందువలనే పాపపరిహారము నొందిన మనమందరమూ అట్టి నిరీక్షణతోనూ విశ్వాసముతోనూ జీవించాలి.

ప్రస్తుత యుగములో జీవించుచున్న వధువు ప్రత్యేకంగా శరీరపరమైన అవిధేయతలు కలిగియుండవచ్చును. కానీ 1కొరింథి 13:13 చెప్పుచున్నట్లు ‘‘కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడు నిలుచును. వీటిలో శ్రేష్ఠమైనది ప్రేమయే.’’ కనుక పెండ్లి కుమారుడు వధువును ప్రేమించిన కారణాన ఆయన తన బాప్తిస్మముతో వారి పాపమును శుద్ధీకరించును. వారిని తన పరిపూర్ణ వధువులుగా స్వీకరించును.

ఈ లోకము నాశనమునకు నడుచుచున్నది. దీనిలో నిరీక్షణ ఏమాత్రమును లేదు. కానీ సమస్తమును నాశనమునకు అతి సమీపమగుచుండగా వధువు ప్రత్యేకమైన తమ నిరీక్షణతో జీవించాలి. ఈ నిరీక్షణ నెరవేర్చబడు సమయము ఆసన్నమైనది.

లోకమంతయూ భూకంప భయము వలన వణుకుచున్నది. పూర్వ కాలమునకు చెందిన విలుప్త డయనోసార్‌వలే ఈ లోకములోని ప్రతివారు మాయమగు దినము సమీపముననున్నది. ఆకస్మాత్తుగా ఈ లోకము తేలికగా కూలిపోవును. ప్రతి వధువు సమయము వచ్చినప్పుడు ఎలాగైననూ వధువు శరీరము సంపూర్ణ శరీరముగా రూపాంతరము చెందును. మరియు వారు తమ పెండ్లి కుమారుడైన ప్రభువుతో నిత్యమూ జీవిస్తారు. కాబట్టి వధువు ఈ యుగపు సంబంధమైన లోకులకు మరింత విశ్వాసంగా నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను బోధించాలి.మనము దేవుని సత్యవాక్యమును విశ్వసించెదము !


యోహాను 3:5లో ఒకడు నీటిమూలముగాను, ‘‘ఆత్మమూలముగాను జన్మించితేనేగాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేరని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను” అని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. అట్లయిన నీరు మరియు ఆత్మమూలమైన సువార్త అనగా నేమి? మొదటగా నీరు అనగా స్పష్టముగా యేసు బాప్తిస్మమనియు, రక్షణకు సాదృశ్యమై యున్నది. (1 పేతురు 3:21)

యేసు 30 సంవత్సరములవాడైనప్పుడు ఆయన యోహాను నొద్దకు వెళ్ళెను. అతడు ప్రజలకు యొర్ధాను నదిలో బాప్తిస్మమిచ్చుచుండెను. బాప్తిస్మమిచ్చు యోహాను మానవాళి ప్రతినిధియు, పాత నిబంధన యొక్క ఆఖరి ప్రధాన యాజకుడని యేసు చెప్పుచున్నాడు. ఈ యోహానును కలిసికొని అతని నుండి యేసు బాప్తిస్మమును పొందెను. దేవుని నీతి యావత్తును దీని వలన నెరవేరెను. (మత్తయి 3:15, 11:11-14). అలాగున యేసు పొందిన బాప్తిస్మము పరలోక అర్పణమై దాని ద్వారా లోకపాపములన్నియు క్రీస్తుపై మోపబడెను.

పరిశుద్ధాత్మ పూర్ణుడైన యేసు తన బాప్తిస్మము తన రక్తము, మరియు సిలువపై మరణము ఆయన పునరుత్ధానము ఆరోహణము ఇవన్నియూ పరిశుద్ధాత్మ క్రియలే. యేసు భూలోకమునకు వచ్చి అతని/ఆమె పాపములన్నిటిని ఒకేసారిగా నీరు మరియు ఆత్మమూలమైనవి పోగొట్టెనని ఒకడు నమ్మిన యెడల అతడు/ఆమె నీతిగల వ్యక్తిగా మారును. పాపరహితుడై క్రీస్తునకు వధువుగా మారును. ఇది ఏదో మనుష్యుల ఆలోచనానుసారమైనది కాదు కానీ అది దేవుని నుండి వచ్చును.

మానవాళిని పాపము నుండి రక్షించుటకు అవసరమైన నీరు రక్తము మరియు పరిశుద్ధాత్మ అనునది సత్యము. వాటిలో ఏ ఒక్కటియూ కోల్పోకూడదు. 1యోహాను 5లో ఈ విషయమును బైబిలు సవిస్తారముగా విశదీకరించెను. నీరు, రక్తము, పరిశుద్ధాత్మ అను మూడు అంశములు ఒక్కటేనని ఏ ఒక్కటి లేకపోయిననూ పాపము నుండి రక్షింపబడుట అనునది సంపూర్తికాదని అంగీకరింపబడదని ఆ భాగము మనకు బోధించుచున్నది.

మనము ఈ సత్యమును తెలిసికొని విశ్వసించినప్పుడు అనగా సంపూర్ణ రక్షణ అనగా మూడింటిని విశ్వసించుట నీరు, రక్తము, పరిశుద్ధాత్మ అప్పుడు మనము మనలను ప్రేమించి రక్షించిన యేసును గుర్తించి, అంగీకరించగలము. కనుక మన హృదయము వాస్తవముగా పాపరహితులమై సంపూర్ణమగును. అ॥కా. 2:38లో మీరు మారుమనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందెదరు” అని బైబిలు మనకు వాగ్ధానమిచ్చుచున్నది.

అయినా మనలను పరిశుద్ధాత్మ పొందునట్లు చేయగల ఆ వచనమేది? అది యేసు బాప్తిస్మ వాక్యము (ఈ నీరు) ఆయన సిలువ మరణము యొక్క వాక్యము (రక్తము) ఆయన పునరుత్ధానము మరియు ఆరోహణము (పరిశుద్ధాత్మ) గూర్చిన వాక్యమే. వాస్తవముగా ఈ రక్షణ వాక్యము మోషే ధర్మశాస్త్రమందును పాత నిబంధన గ్రంధములోని ప్రవక్తల ద్వారాను ప్రవచింపబడెను. నూతన నిబంధనలోని నాలుగు సువార్తలోనూ అవి నెరవేర్చబడెను. ‘‘నిత్య రక్షణ యొక్క నిబంధన ఒక్కసారే పూర్తికాగా” హెబ్రీ పత్రికలో కూడా అది విశదపరచబడి. దేవుని నీతిమత్వమును సాక్షమిచ్చు దానిని మనము విశ్వాసము ద్వారా పొందితిమి.

పాప పంకిలమైన ఈ లోకములో శరీరమందు జీవించుచున్న ప్రతివారు దేవుని యెదుట అనేకసార్లు పడిపోయినను అతడు/ఆమె దేవుడు అనుగ్రహించిన పాపక్షమాపణను తప్పక పొందవలెను. మరియు ప్రతివాడు అతని/ఆమె నిరీక్షణను పరలోకమందుంచి జీవించవలెను. ఇదే దేవుడు మానవాళికి అనుగ్రహించిన వరము. మనకు ఉచితముగానిచ్చిన ఈ వరమును మనమందరము తప్పకుండా పొందాలి. మన ప్రభువు తిరిగి వచ్చి నూతన రాజ్యమును నిర్మించును. మన సత్య నిరీక్షణైన దానిలో మనలను నివసింప నిచ్చునను వాక్యమును మనము నమ్మాలి. దీనినే నేను స్థిరముగా నమ్ముతాను.

లోకములో పాపము ఎంతగా విస్తరించినదో నీకు తెలియునా? నోవాహు జలప్రళయ సమయముతో పోల్చితే ఈ యుగములో పాపము మరింతగా విస్తరించెను. నోవాహు కాలములో మానవాళి ఆలోచనలు ఎల్లప్పుడూ చెడ్డవని చూచి మొదటిలో లోకమును జలప్రళయముతో నాశనపరచాలని దేవుడు నిర్ణయించెను. ఒక ఓడను తయారు చేయమని నోవాహుతో చెప్పెను. అతని మాటలను నమ్మి ఆ ఓడలో ప్రవేశించిన వారిని రక్షించెను.

నిశ్చయముగా లోకమును ప్రళయముతో తీర్పు తీర్చుతానని దేవుడు చెప్పిననూ కేవలము నోవాహు కుటుంబీకులైన ఎనిమిదిమంది మాత్రమే ఆయన మాటలను నమ్మారు. వంద సంవత్సరములపాటు వారు ఆ ఓడను నిర్మించి ప్రళయమును తప్పించుకొనుటకై దానిలో ప్రవేశించారు. వారాలాగున చేసినప్పుడు దేవుడు మొదటి లోకమునకు తీర్పు తీర్చ మొదలుపెట్టెను. ఆకస్మాత్తుగా ఆకాశము మేఘావృతమైనది. కుండపోత వర్షము ఆరంభమాయెను. కేవలము ఒక్కగంటలోనే మూడవ అంతస్తు చేరునంతగా నీరు నిలచెను. అలాగున 40 దినములు అది వర్షించెను. సమస్త ప్రపంచమును నీటితో ముంచివేసెను.

కొత్త లోకము ఆరంభింపడబోవుచున్నదని విశ్వసించి నోవాహు అతని కుటుంబము ఓడలో ప్రవేశించిన రీతిగానే, నీవు నేను ఈ యుగములో నిరీక్షణతో జీవించాలి. ఆ ఓడను వారి కేవలము వంద సంవత్సరములలోనే నిర్మించిరి ఏలయనగా వారు దేవుని విశ్వసించిరి. మనము కూడా సువార్తను కాపాడుకొని ప్రకటించాలని నేను నమ్ముచున్నాను. దేవుడు నోవాహుతో ‘‘నీ కొరకు ఓడను చేసికొనుము” అని చెప్పెను. (ఆది 6:14) ‘‘నీవు నీ విశ్వాసమును కాపాడుకొనుమని” ఈ వాక్యము చెప్పుచున్నది. మొదట మనలను మనము ప్రభుని కొరకు ప్రతిష్ఠంచుకొని ఆ సువార్తను ప్రకటించాలి.

తిరిగి జన్మించిన వారికి నిరీక్షణ ఉన్ననూ సువార్తను నమ్మని వారికి ఏ నిరీక్షణయు లేదు. సువార్తను నమ్మని వారికి నిరాశమాత్రమే కలుగును. నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను ప్రజలు విశ్వసించిననూ లేకున్ననూ మనము విశ్వాసముతో వారికి బోధించవలెను. ప్రస్తుత కాలము ఈ సత్యసువార్తను ప్రజలు సాధ్యమైనంత త్వరగా విశ్వసించునట్టి సమయము. మనము ప్రకటించు సువార్తను నమ్మువారు సంతోషమును పొందుతారు. కానీ నమ్మని వారు కేవలము శపింపబడతారు. వెనకున్నది అనగా సువార్తను నమ్మనివారు దేవుని నిత్య తీర్పును పొందు తెలివితక్కువవారై నరకములోనికి త్రోయబడెదరు.

నీ నిరీక్షణను కోల్పోకూడదు. ఒకవేళ నీతిమంతులు తమ విశ్వాసమును కోల్పోతే వారి కొరకు కేవలము మరణము ఎదురుచూచును. మనకు నిరీక్షణ లేనట్లయిన మనము కోరిక గాని ఆసక్తి గాని జీవించుటకు ఏ కారణముగానీ ఉండవు. కావున మనము నిరీక్షణతో జీవిద్ధాం.

ప్రస్తుత కాలములో యేసును నమ్మి తిరిగి జన్మించినవారే నిజమైన సంతోషము కలవారు. మానవాళి కొరకు పాపక్షమాపణ పొందుట అను నిరీక్షణ మిగిలియున్నది. అనగా పరిశుద్ధాత్మను పొందుట అను నిరీక్షణ కాక మరేదియూ లేదు. తమ పాపములన్నిటికి క్షమాపణ పొందునప్పుడు వారు నిరీక్షణ కలవారై ఎల్లప్పుడూ సంతోషముతో జీవిస్తారు. కానీ వారు క్షమాపణ పొందనిచో వారి కొరకు నాశనము కాచుకొనియున్నది. ఎందుకనగా వారు పరిశుద్ధాత్మను పొందలేదు.

నేను నా పాపములన్నిటికి క్షమాపణ పొందినందున నేను ఈ లోకములో సంతోషముగా జీవించగలను. నీవు కూడా ఇదే నిరీక్షణతో నివసిస్తావని నేను నిరీక్షించి ప్రార్థించుచున్నాను. నీవు నశించు ఈ లోక ఆలోచనలతో సహవాసము చేయకూడదని నేను ప్రార్థించుచున్నాను. దానికి బదులుగా జ్ఞానవంతమైన వధువుగా నీ జీవితమును జీవించు నీ తోటి సహోదరులను, సహోదరీలను ప్రేమించుచూ క్రీస్తు నందు వారు స్థిరులగునట్లు సహాయపడుచూ నీ విశ్వాసమును కోల్పోక పెండ్లి కుమారుని కొరకు ఎదురుచూచుచూ నిన్ను కొనిపోవుటకు ఆయన వచ్చునప్పుడు ఆయనను కలుసుకోవాలి.

తన మహిమలో మనము జీవించునట్లు చేసిన దేవునికి నేను కృతజ్ఞతలు తెలుపుచున్నాను.